Saturday, January 18, 2020

శ్రీరామునితో స్నేహాన్ని కొనియాడిన సుగ్రీవుడు ..... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-13 : వనం జ్వాలా నరసింహారావు


శ్రీరామునితో స్నేహాన్ని కొనియాడిన సుగ్రీవుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-13
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (19-01-2020)   

          లక్ష్మణుడి సమక్షంలో ఆయన వింటుండగా వానరరాజైన సుగ్రీవుడు రామచంద్రమూర్తితో ఇలా అన్నాడు. “నీలాంటి గొప్ప మహిమకలవాడు నాకు స్నేహితుడిగా లభించడంవల్ల దేవతలందరి అనుగ్రహానికి నేను యోగ్యుడనయ్యాను. ఇంతవరకూ నన్ను కొండమీది కోతి అని తలచినవారంతా ఇకమీద నన్ను రాముడి స్నేహితుడని ఎంతగానో గౌరవిస్తారు. నువ్వు కొంచెం ఆలోచిస్తే నీ సహాయంతో నాకు కేవలం కపిరాజ్యమే కాదు, స్వర్గలోక ప్రభుత్వం కూడా లభిస్తుంది. రఘువంశంలో పుట్టిన వాళ్లలో శ్రేష్టుడవైన నీతో నాకు స్నేహం లభించడం వల్ల నా చుట్టాలందరికీ, ప్రాణమిత్రులకూ, పూజనీయుడనయ్యాను. నీకారణాన నన్ను ఇక అందరూ గౌరవిస్తారు. నీకు నేను తగిన స్నేహితుడనని కాలక్రమంలో నువ్వే తెలుసుకుంటావు రామచంద్రా! నా గుణాలను గురించి నేను చెప్పుకోకూడదు. ఆత్మ ప్రశంస మరణప్రాయమని పెద్దలంటారు కదా?

“ఇది నా విషయం. నీ విషయంలో నాకేమాత్రం సందేహం లేదు. నీ లాంటి ధన్యులు, కృతకృత్యులు స్థిరచిత్తం కలవారిగా వుంటారు కాని, చపల చిత్తులుగా వుండరు. జ్ఞానులలో ధైర్యంలాగా వారిలో ప్రేమ నిశ్చంచలమై వుంటుంది. ఇద్దరు స్నేహితులు సాదువులైతే, చాలా విలువగల పదార్థాలైన వెండి-బంగారు సొమ్ములను కూడా ఒకరివాటిని ఇంకొకరు తమ సొంత వస్తువుల్లాగే, ఇతరుల ధనమనే భేదం లేకుండా ఉపయోగిస్తారు. తన స్నేహితుడు ధనవంతుడైనా, దరిద్రుడైనా, దుఃఖంలో మునిగివున్నా, సుఖభోగాలు అనుభస్తున్నా, దోషైనా, దోషరహితుడైనా, అతడి గుణదోషాలను నిజమైన స్నేహితుడు ఎంచకూడదు. ధనం పోయినా, సుఖాలన్నీ పోయినా, తన దేహమే పోయినా, తన స్నేహితుడి పని నెరవేరేలా చూడాలికాని, వాడికోసం మనమెందుకు చెడిపోవాలి అనుకోకూడదు”.

ఇలా హితం, ప్రియమైన మాటలను సుగ్రీవుడు చెప్పగా, శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడు వింటుండగా “ఔను, నువ్వు చెప్పింది నిజం” అని సుగ్రీవుడితో అన్నాడు. ఆ తరువాత సుగ్రీవుడు, రామలక్ష్మణులు కూర్చున్న శాఖలు వాడిపోయి వుండడం గమనించి, కొత్తవైన, మనోహరమైన శాఖలకోసం నాలుగు దిక్కులా చూశాడు. సమీపంలో వున్న ఒక కొమ్మను, చిగుళ్లు, పూలు బాగా వుండి ఆకులు తక్కువగా వున్న దాన్ని తెచ్చి రామచంద్రమూర్తికి వేశాడు. ఆయన దానిమీద కూర్చున్నాడు. ఆ తరువాత అలాంటిదాన్నే హనుమంతుడు తెచ్చి ఇస్తే, లక్ష్మణుడు కూర్చున్నాడు. అందరిలా కూర్చున్న తరువాత సుగ్రీవుడు శ్రీరామచంద్రమూర్తితో ఇలా అన్నాడు.

“మా అన్న వాలి నామీద పగపట్టి, నన్ను ఇల్లు వెళ్ళగొట్టి, నా భార్యను అపహరిస్తే, ఇక ఇక్కడ వుంటే చంపుతాడన్న భయంతో ఈ ఋశ్యమూక పర్వతంమీద పడివుంటున్నాను. సమస్త జీవరాసుల భయం పోగొట్టగలిగే వాడివి నువ్వు. రక్షకుడు లేని నన్ను, దుఃఖపడే నన్ను రక్షించు”.

ఇలా సుగ్రీవుడు చెప్పడంతో రామచంద్రమూర్తి తాను ఈ విషయాన్ని ఇంతకుముందే చెప్పానుకదా అనుకుంటాడు. అదొక గొప్ప విషయం కాదనుకుంటాడు. చిరునవ్వుతో సుగ్రీవుడితో ఇలా అన్నాడు.

“పుణ్యాత్మా! సుగ్రీవా! మేలు చేయడం స్నేహధర్మం. కీడు చేయడం శత్రువుల లక్షణం. నువ్వు నాకు స్నేహితుడివి. నీ భార్యను అపహరించిన మూర్ఖుడిని ఇప్పుడే చంపుతాను. దీనికొరకు విచారించవద్దు. సుగ్రీవా! నా బాణాలు ఎలాంటివో తెలుసా? అమితమైన వేగంగా పోతాయి. మిరుమిట్లుగొలిపే కాంతికలవి. చూడడానికి భయంకరాకారాలు కలవి. బంగారు పింజలున్నాయి. కుమారస్వామి వనంలో పుట్టాయి. ఇంద్రుడి వజ్రాయుధంతో సమానమైనవి. భయంకరంగా, కోపంతో వున్న పాముల్లాగా, మిక్కిలి వాడికల ముఖాలున్నాయి. నువ్వు వీటిని చూసి ధైర్యం తెచ్చుకో. వాలిని తప్పక చంపుతాను. భయపడవద్దు. పాపపు మనస్సుకల వాలి నేలబడి చావగా సుగ్రీవా! సంతోషంగా చూస్తావు”.

ఈ విధంగా చెప్పిన రామచంద్రమూర్తి మాటలు విన్న సుగ్రీవుడు సంతోషంతో శ్రీరామచంద్రమూర్తిని మేలు-మేలని ప్రస్తుతించి ఇలా అన్నాడు.

“దేవా! శోకపీడితులకు నువ్వే గతి. నేనో శోకపీడితుడిని. కాబట్టి నువ్వే నాకు గతి. అంతమాత్రమే కాకుండా నువ్వు నాకు స్నేహితుడివి. నన్ను రక్షించాల్సిన భారం నీమీదే ఎక్కువగా వుంది. ఈ కారణాన దీనుడినై ఏడుస్తున్నాను. అగ్నిసాక్షిగా నువ్వు నా చేతిలో నీ చేయి వేసి స్నేహం చేసి, నాకు ప్రాణదానాన్ని నిస్సందేహంగా ఇచ్చిన కారణాన ధైర్యంతో వున్నాను. దేవుడైన నిన్నే నా ప్రాణస్నేహితుడివని నమ్మి నా మనస్సును ఎల్లవేళలా కాల్చే దుఃఖాన్ని నీకు చెప్పడానికి ప్రయత్నించాను. అల్పవిషయమైతే నేనెందుకు చెప్పేవాడిని?”.

ఇంతవరకు చెప్పి, కళ్ళనిండా నీళ్లు కారుతుంటే, గొంతు గద్గదమై, నోట మాటరాక మౌనం దాల్చాడు.

ధీరుడైన సుగ్రీవుడు తన కళ్ళవెంట కారుతున్న నీళ్లను అణచుకుంటూ, రాముడేమనుకుంటాడో అని భయపడ్తూ, మళ్లీ ధైర్యం తెచ్చుకుని రామచంద్రుడితో తన కథ ఇలా చెప్పసాగాడు.

వాలి తనను పరాభవించిన విధానం రాముడికి చెప్పిన సుగ్రీవుడు
         వాలి తనకు చేసిన కీడును గురించి సుగ్రీవుడు రాముడికి చెప్పాడిలా. “రామచంద్రా! వాలి నాకు చేసిన కీడు చెప్తా విను. వాలి రాజుగా వుండగా నేను యువరాజుగా వున్నాను. అప్పుడు నన్ను నానావిధాలుగా దూషించి దయలేకుండా వెళ్ళగొట్టాడు. నా ప్రాణాలకంటే ప్రియమైన నా భార్యను అపహరించాడు. నామీద ప్రేమగల స్నేహితులను, బంధువులను, చెరసాలలో బంధించాడు. ఇంతటితో ఆగకుండా నా ప్రాణాలను తీయడానికి ఆలోచిస్తున్నాడు. నన్ను చంపడానికి అనేకమందిని పంపాడు. ఇంకా నన్ను మోసం చేసి చంపడానికి అనేక ఆలోచనలు చేశాడు. అతడు నాకు చేసిన కీడులు చెప్పడం సాధ్యపడదు. నన్ను చంపడానికి వాలి ఎవరెవరినో పంపడం, నేను వాళ్లను చంపడంతో కాలం గడిచిపోతున్నది. ఆ కారణానే నేను మిమ్మల్ని చూసినప్పుడు, మీరు కూడా వాలితో పంపబడిన వారని భయపడ్డాను. ఈ హనుమంతుడు మొదలైన వానరులు మాత్రమే నాకు తగిన సహాయం చేస్తూ వుంటే, ఎన్ని కష్టాలో పడ్తూ, ప్రాణాలతో వున్నాను. నాకు వీళ్లు అన్నివేళలా అండదండలుగా వుంటూ, నా ప్రాణాలను కాపాడుతున్నారు. రామచంద్రా! ఎక్కువగా మాటలు చెప్పకుండా సారాంశాన్ని సంగ్రహంగా చెప్తా విను. వాలి మహా పరాక్రమశాలి. సూర్యుడిలాంటివాడు. శత్రువులకు భయంకరుడు. అలాంటివాడు చచ్చి నేలబడితేనేకాని నా దుఃఖాలు పోవు....అన్నం సహించదు...కంటికి నిద్ర రాదు. రామచంద్రా! నాకు కలిగిన దుఃఖం ఎట్లా పోతుందో ఆ విషయమే చెప్పాను. కష్టాల్లో కానీ, సుఖాల్లోకానీ మిత్రుడికి మిత్రుడే దిక్కు”.

         సుగ్రీవుడు చెప్పినదంతా విన్న రామచంద్రమూర్తి ఇలా అన్నాడు. “వాలి నీకు అన్న కదా? అతడితో నీకింత విరోధం ఎందుకు కలిగింది? దానికి కారణం ఏమిటి? నువ్వేం తప్పు చేశావు? అంతా వివరంగా చెప్పు. మీ తప్పుల్లోని బలాబలాలు విచారించి, నీ తప్పు చిన్నదే అయితే, అతడి విరోధం ఎక్కువైతే, వాడిని ఇప్పుడే చంపుతాను. నీ తప్పు పెద్దదై, విరోధం చిన్నదైతే, ఇద్దరికీ సమాధానం కుదిరించి కార్యం చక్కదిద్దుతాను. నువ్వు విచారపడవద్దు. ధైర్యంగా మొదటినుండి మీ చరిత్ర చెప్పు. నీకు కలిగిన అవమానం వింటేనే నాకు కోపం వస్తున్నది. మనస్సు చలిస్తున్నది. నీకు విరోధి అయితే నాకూ విరోధే కదా? నేను విల్లు ఎక్కుపెట్టకముందే నీ సమాచారమంతా వివరంగా చెప్పు. నా విల్లు నుండి బాణం బయటికి వస్తే ఇక వాలి చచ్చిపోయినట్లే అని నమ్ము”.

         ఇలా శ్రీరామచంద్రమూర్తి చెప్పగా విన్న సుగ్రీవుడు, తనకు, తన అన్నకు విరోధం వచ్చిన విధం చెప్పడం ప్రారంభించాడు.

Thursday, January 16, 2020

Cath lab, Cardiology services for all : Vanam Jwala Narasimha Rao


Cath lab, Cardiology services for all
Vanam Jwala Narasimha Rao
Telangana Today (17-01-2020)

STEMI (ST-Elevation Myocardial Infarction)-Telangana is an extraordinary medical and health intervention designed, developed and almost kept ready for implementation in the state. Myocardial Infarction is commonly known as Heart Attack. The program is aimed at diagnosing heart attacks promptly, at the periphery hospital designated as ‘Spoke’ and confirming the diagnosis using a tele ECG (Electrocardiogram) machine provided there.

STEMI-Telangana makes the ECG facility available to all the people of the state including 108 ambulances and all the Primary Health Centers (PHCs). It would also ensure immediate validation of the diagnosis and proper management of the heart attack patients. All the Government Health Care facilities would ultimately build the capacity to diagnose cases of heart attacks and do thrombolysis treatment. In this the clot-busting drug will be delivered through a peripheral intravenous line, usually through a visible vein in patient’s arm. This is performed at the patient’s bedside in an intensive care unit monitoring heart and lung functions.

Advanced Care
The program also aims at making available the Angio Plasty facility to all the people by establishing Cath labs (Cath lab is an examination room with diagnostic imaging equipment used to visualize the arteries and the chambers of the heart and treat any abnormality found) and Cardiology services round the clock in all the 9 Teaching Hospitals in the state covering 90 spokes. There will be accessibility to   international standards of care to the poor suffering with a heart attack.

According to experts and senior cardiologists, STEMI is the most serious type of heart attack which is the most common cause of mortality in Telangana accounting for almost 17 per cent deaths. This leads to high morbidity and mortality unless diagnosed and treated promptly in the ‘Golden Hour of Heart Attack’. Once the diagnosis is made the patient is stabilized and treated with a drug called Thrombolytic Agent before shifting the patient to the nearest hospital designated as Hub. This could be a tertiary care hospital with high end Cath lab facilities thus saving the patient life by acting promptly and appropriately in the golden hour.

Tackling Challenge
Dealing with STEMI cases is a real challenge due to requirement of early diagnosis as well as providing the facilities and equipment needed for thrombolysis.  Thrombolytic Therapy followed by and Percutaneous Coronary Intervention (PCI) or Angio Plasty, is commonly used procedures which decrease the mortality significantly. Due to non-availability of facilities, especially in rural areas, Hub and Spoke Model is very useful. Hubs and Spokes are to be equipped with the STEMI Kit for timely transmission of ECGs for early diagnosis and thrombolytic agent as well as equipment for timely thrombolysis of the patient.

Although the National Health Mission (NHM) caters to the medical needs of rural areas, the majority of health care facilities include primary or community health centers with only basic amenities. Hence poor patients from rural areas in India appear to be at greater risk. It is advisable that patients in rural areas with limited access to medical care and too long a time to reach a hospital with all facilities, should undergo the Pharmaco-invasive (PI) strategy of thrombolysis with a goal of First Medical Contact (FMC) to drug of 30 minutes or less. Initial thrombolysis should be followed if possible, by referral to Angio Plasty capable hospital for cardiac catheterization within 3–24 hours of thrombolysis. The proposed Hub and Spoke model of STEMI management will definitely bring a significant change in the present way of management of heart attacks.

Dire Need
            The state of Telangana was formed in 2014. Now it has 33 districts with an estimated population of 40.13 million. Hyderabad is the only metro city in Telangana where the estimated population is 12.24 million. Approximately 2.8 million cases of Ischemic heart disease are in Telangana and the approximate incidence of STEMI is 240 cases per one lakh population per year. Greater Hyderabad is well-developed with number of corporate hospitals providing quality tertiary care facilities to the city population. There are approximately 150 Cath labs in private sector in twin cities for patients with heart attack and stroke as well as performing many structural and peripheral interventions. But there are only two teaching hospitals in the public sector in Telangana having Cath lab facility namely Osmania and Gandhi Hospitals free of cost which are the only destinations for poor patients for entire state. Though NIMS also has a Cath Lab it is a paid service. 


The population of Hyderabad is almost doubled in the last fifty years but the number of Cath labs remains the same and both labs are more than ten years old and facing lot of technical difficulties and frequent breakdowns. Three fourths of the Telangana population are living in rural areas and are inaccessible to the Cath lab as well as primary angio plasty facility as there are hardly less than ten Cath Labs in the rest of the Telangana state which again are in the private sector. So, there is no option to give thrombolysis drug at periphery in patients presenting within the golden hour thus stabilizing them before shifting the patient to the tertiary care center for angiogram and further management. But presently it is not happening in the district hospitals, area hospitals and CHCs even though there are many qualified doctors and diagnosis is made early. Almost all the STEMI cases are simply referred to the higher centers or private hospitals sometimes even without providing primary treatment leading to significant delays, morbidity as well as increased mortality.

Right Path
As Telangana is a newly formed state and 23 new districts are formed during the reorganization, most of the area hospitals or CHCs are designated as district hospitals but the infrastructure is still in the phase of development and is far from the quality care ICU facilities. Thus, the Hub and Spoke model of STEMI management is found to be the most appropriate in the management of heart attacks.

The proposed plan of action seems to be that in the first phase of this programme, Osmania and Gandhi Hospitals will be made as 2 Hubs. 13 district hospitals and CHCs will be attached to Osmania Hub and 10 DH, CHCs to Gandhi Hospital as spokes covering 11 districts. Mahatma Gandhi Memorial Hospital, Warangal is the next proposed hub and will be attached to 10 more spokes covering 8 districts once the Cath Lab is established.

The Hubs are going to be provided with infrastructural facilities and disposables to handle the cases in Cath labs which are going to work 24 hours to receive and treat the patients referred from the spokes. The spokes will be equipped with Tele ECG machines and other necessary equipment, drugs including a thrombolytic agent and other emergency drugs.

When this Hub and Spoke Model is fully functionary the treatment of heart attacks will be made simple and easy.

మరువలేని మంచిమిత్రుడు .... వనం జ్వాలా నరసింహారావు : ఆంధ్రజ్యోతి దినపత్రిక (17-01-2020)


మరువలేని మంచిమిత్రుడు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (17-01-2020)
సంక్రాంతి పండుగకు ఏటా వెళ్ళినట్లే మా వూరికి పోయినప్పుడు (జనవరి 13) నాతోపాటే వచ్చిన భండారు శ్రీనివాసరావు ద్వారా విన్న దుర్వార్త, స్నేహితుడు దివి వెంకట్రామయ్యగారి హటాన్మరణం. వార్త విన్న వెంటనే ఆయనతో గత నాలుగు దశాబ్దాలుగా వున్న పరిచయం గుర్తు చేసుకున్నాను. వెంకట్రామయ్య గారిలాంటి స్నేహితులు అరుదుగా దొరుకుతారు.  

అవి నేను హైదరాబాద్ సమీపంలోని రామచంద్రాపురంలో వున్న భారత్ హెవీ ఎలెక్ట్రికల్స్ లిమిటెడ్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో లైబ్రేరియన్ గా పని చేస్తున్న రోజులు. హైదరాబాద్ ఆకాశవాణి వార్తావిభాగంలో పనిచేస్తున్న తురగా కృష్ణమోహన్ రావు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆయన పనిచేసిన ఉద్యోగంలో విలేఖరిగా చేరిన స్నేహితుడు-బంధువు భండారు శ్రీనివాసరావుతో తరచూ రేడియో స్టేషన్ కు వెళ్తుండేవాడిని. అడపదడప ఆకాశవాణిలో అవకాశం దొరికినప్పుడల్లా చిన్నాచితకా కార్యక్రమాలు చేసేవాడిని. అలా వెళ్తున్న సమయంలో వార్తావిభాగంలో పనిచేస్తున దివి వెంకట్రామయ్య గారితో పరిచయం ఏర్పడ్డం, ఆ పరిచయం అచిరకాలంలోనే స్నేహంగా మారడం, ఆ స్నేహం నాలుగు దశాబ్దాలకు పైగా ఆయన చనిపోయేదాకా కొనసాగడం జరిగింది. అలా ఏర్పడ్ద పరిచయం-స్నేహం వల్ల వెంకట్రామయ్య గారిలో వున్న రచయితను, సాహితీపరుడిని, కథకుడిని అందరిలాగా నేనూ గమనించడం, ఆయన్ను వీలున్నంతవరకు ఎప్పుడూ ఏదైనా రాస్తుండమని అడగడం జరిగేది. కారణాలేవైనా ఆయనెప్పుడూ మా మాటలు పట్టించుకోలేదు. చివరకు ఆయన మరో మిత్రుడు "రచన" శాయి అడిగినప్పుడు కాదనలేకపోయారు. మారు మాట్లాడకుండా రచనకు ఉపక్రమించారు వెంకట్రామయ్య గారు. ఫలితంగా ఎమెస్కో వారి పుణ్యామా అని వెలువడింది "ఆకాశవాణి లో నా అనుభవాలు" అనే పుస్తకం. డీవీ గారి జీవితంలో, ఆయనకు ఎన్నో అపూర్వమైన అనుభవాలు కలిగించిన "ఆకాశవాణి అనే ఒక గొప్ప సంస్థ, వ్యవస్థ" గురించి ఆయన ఆభిప్రాయాల సంకలనమే ఆ పుస్తకం. 

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో మూడున్నర దశాబ్దాల పాటు, వార్తా విభాగంలో న్యూస్ రీడర్ పదవితో సహా, నాటక రచయితగా, నటుడిగా, ప్రయోక్తగా పనిచేసిన సాహిత్యరంగ ప్రముఖుడు, కథకుడు దివి వెంకట్రామయ్య రాసిన ఆకాశవాణిలో నా అనుభవాలు పుస్తకాన్ని చదవడం మొదలు పెట్టిన వారికి అది పూర్తి అయ్యే వరకు పరిపరి విధాల ఆసక్తిని, జిజ్ఞాసను రేకెత్తిస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. శబ్దం కన్నా నిశ్శబ్దం మంచిది... మాటకంటే మౌనం గొప్పది అంటూ "నా మాట" గా పుస్తకాన్ని పరిచయం చేసిన వెంకట్రామయ్య వ్యవస్థాపరంగా అనేక లోటు పాట్లు ఉన్న ఆకాశవాణిలో తన అనుభవాలు గొప్పవి కాకపోయినప్పటికీ వాటిలో కొన్నిటిని పాఠకులతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎనౌన్సర్ గా రేడియో రంగ ప్రవేశం చేసిన వెంకట్రామయ్య కొద్దిరోజులకే తాను రాక ముందు నుంచే పనిచేస్తున్న సీనియర్లతో తాను ఎలా అనుబంధం, సాన్నిహిత్యం పెంచుకుంది అన్న విషయాలు చాలా  ఆసక్తికరంగా వున్నాయి ఈ పుస్తకంలో.

మొదటి సారి ఆకాశవాణి ఇంటర్వూకు హాజరైనపుడు సెలక్షన్ కమిటీ సభ్యుల్లో ఒకరైన మహాకవి దేవులపల్లి కృష్ణ శాస్త్రి వెంకట్రామయ్య ఇంటి పేరు అడిగి తెలుసుకుని అది దేవులపల్లి కాదంటూ, దివి నుంచి భువికి దిగి వచ్చావు అన్న మాటఅని వ్యాఖ్యానించడాన్ని పేర్కొన్నారు డీవీ. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో వెంకట్రామయ్య చేరిన నాటికి అక్కడ పని చేసి పదవీ వరమణ చేసిన, ఇంకా అప్పటికి పని చేస్తున్న పలువురు లబ్ధప్రతిష్టులైన వారి గురించి, వారితో ఆయన సహచర్యం, సాన్నిహిత్యం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పుస్తకంలో పేర్కొన్నారు. వీరిలో దేవులపల్లి కృష్ణ శాస్త్రి, త్రిపురనేని గోపి చంద్, ముని మాణిక్యం నరసింహారావు, బాలాంత్రపు రజనీకాంత రావు, బుచ్చిబాబు, న్యాయపతి రాఘవరావు, చిత్తరంజన్, దండమూడి మహీదర్, రావూరి భరద్వాజ, తురగా కృష్ణమోహన్ రావు, నళినీ మొహన్ లాంటి ఎందరో వారున్నారు. వీరందరితో తాను ఎలా కలిసి మెలిసి పని చేసింది వారి అనుభవాలు, తనకు ఎలా ఉపయోగపడింది సవివరంగా పుస్తకంలో పేర్కొనడం జరిగింది. ప్రముఖ రచయిత, గొప్ప పాఠకులు, నిరంతర అధ్యయన శీలి బుచ్చిబాబు (శివరాజు వెంకట సుబ్బారావు) తో సుమారు నాలుగేళ్ల పాటు ఆయన ప్రత్యక్ష, పర్యవేక్షణలో పని చేసే అవకాశం తనకు లభించిందని వెంకట్రామయ్య అంటారు.


ఆకాశవాణిలో తెలుగు ప్రకటనలకు వాడే భాష చాలారోజులవరకు వాడుక భాష కాకుండా గ్రాంథికంగా వుండేదని, అన్ని రకమైన ప్రకటనలకు ఒకే రకమైన భాష ఉపయోగిస్తూ, వైవిధ్యం లేకుండా పోయేదని, తాను కొంత చొరవ తీసుకుని ఆ పద్ధతిలో బుచ్చిబాబు అనుమతితో కొన్ని మార్పులు తీసుకుని రాగలిగానని డీవీ రాశారు. బుచ్చిబాబు మరణించిన దుర్వార్తను తానే రాసి చదవాల్సి వచ్చిందని, అలాగే జవహర్లాల్ నెహ్రూ హటాన్మరణం వార్త కూడా తానే ప్రకటించానని వెంకట్రామయ్య రాశారు. నెహ్రూ చనిపోయినప్పుడు డ్యూటీలో వున్న వెంకట్రామయ్య "ఒక ముఖ్య ప్రకటన...ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కొద్దిసేపటి క్రితం కొత్త ఢిల్లీలో ఆకస్మికంకంగా మరణించారని తెలియపర్చడానికి చింతిస్తున్నాం" అని చెప్పారు వెంకట్రామయ్య. అలాంటి ముఖ్యమైన వార్త, విషాదకరమైన వార్త శ్రోతలకు వినిపించేటప్పుడు కంఠ స్వరంలో విషాదం, గాంభీర్యం కనపర్చాలికాని, మరీ ఏడుస్తున్నట్లుగా మాట్లాడ కూడదని రాశారాయన. తనకు కూడా ఉద్వేగం వచ్చిందనీ, కాని అదుపులో వుంచుకున్నానని అంటారు.

ప్రభుత్వం చేతుల్లో వున్న అత్యంత శక్తివంతమైన సాధనం ఆకాశవాణి అయినప్పటికీ, అటువంటి సాధనాన్ని వినియోగించుకోవడంలో ఎంతో కొంత విచక్షణ కనపర్చాలని, నిగ్రహం పాటించాలని, అంటారు వెంకట్రామయ్య. ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలు కూడా శ్రోతలను ఆకర్షించుకుని, ఆకట్టుకోవాలే కాని విసుగెత్తించకూడదనేది ఆయన అభిప్రాయం. ఆకాశవాణి ఘోరాలను గురించి కూడా ఆయన రాశారు. మునిమాణిక్యం నరసింహారావు, జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రి ప్రస్తావన తెచ్చారాయన. మునిమాణిక్యం అసిస్టెంట్ ప్రొడ్యూసర్ గా చేరి, పదవీవిరమణ చేసేదాకా అదే ఉద్యోగంలోను, జలసూత్రం జూనియర్ గ్రేడ్ స్క్రిప్టు రచయితగా చేరి అదే గ్రేడ్ లో రిటైర్ అయ్యేదాకా పని చేయాల్సి వచ్చింది. ఇది అన్యాయమంటారు డీవీ. అలనాటి మహానుభావులే కాకుండా, ఆకాశవాణిలో "ఆర్టిస్ట్" వర్గానికి చెందిన వారి గతి ఈ నాటికీ ఇంతేనని, "పేరు గొప్ప...ఊరు దిబ్బ" అనే సామెత ఆకాశవాణి కళాకారులకు అక్షరాలా వర్తిస్తుందని అంటారాయన.

ఆకాశవాణి ఒక మాస్ మీడియం అనీ, ప్రజాబాహుళ్యం కోసం ప్రసారాలు జరిపే శ్రవణ మాధ్యమం అనీ, రంగస్థలం మీద నటించినట్లుగా రేడియోలో నటించకూడదనీ, చతుర్విధాభినయాలలో ఇందులో కావాల్సింది వాచికాభినయం మాత్రమేనని ఆయన తన అభిప్రాయంగా రాశారు. పాత రోజుల్లో, అదీ టెలివిజన్ లేని రోజుల్లో, సినిమా తరువాత అత్యంత ప్రజాదరణ కలిగిన, ప్రచారం కలిగిన, బహుజన మాధ్యమం రేడియో మాత్రమేనని, ఒక్కసారి రేడియోలో మాట్లాడితే చాలు, ఒక్క కార్యక్రమంలో పాల్గొంటే చాలు అని అనుకునేవారు చాలామంది అంటారాయన. "రేడియో రచనలకు పెద్దగా సాహిత్య విలువలుంటాయని ఎవరూ భావించనక్కర లేదు. అటువంటి విలువల కోసం వెదకాల్సిన అవసరమూ లేదు. రేడియో రచనలకుండే పరిమితులు వేరు. ఆ రచనల ప్రయోజనం వేరు. ఆకాశవాణి లాంటి సుప్రతిష్ఠతమైన  సంస్థల్లో కూడా, ఎన్నేళ్లపాటు పనిచేసిన వారిలో కూడా, రేడియో రచనలకుండే నిర్ధిష్ట లక్షణాలు తెలిసినవారు చాలా తక్కువ. ఇది నాకు కలిగిన ఆవేదనాపూరితమైన అనుభవం" అని రాశారు.

సహౌద్యోగి దండమూడి మహీదర్ ద్వారా చందమామ వ్యవస్థాపక సంపాదకుడు, "విజయాధినేత" చక్రపాణితో పరిచయమైంది వెంకట్రామయ్యకు. "సినిమాకథ అనేది సూటిగా, మెలికలూ, మలుపులూ మరీ ఎక్కువ లేకుండా వుండాలి. సామాన్య ప్రేక్షకులకీ, చిన్న పిల్లలకీ కూడా విషయం తేలిగ్గా అర్థం అయ్యేట్లుగా వుండాలి. కథలో ఏడుపులూ, మొత్తుకోళ్లూ, అనవసరమైన సెంటిమెంట్లూ, అతిగా వుండకూడదు. హాల్లో కూర్చున్నంత సేపూ చూడ్డానికీ, బయటకొచ్చిన తరువాత తల్చుకోవడానికీ, చూడనివాళ్లకు చెప్పడానికి కూడా ఆ సినిమా హాయిగా వుండాలి" అన్న చక్రపాణి గారి సినీ సిద్ధాంతాన్ని తన పుస్తకంలో నెమరేసుకున్నారు డీవీ. తొలి పరిచయంలోనే తనతో ఆయన చనువుగా, స్వేఛ్చగా, సూటిగా ఎన్నో విషయాలు మాట్లాడి తనను ఆశ్చర్యపరిచిన విషయం పేర్కొన్నారు. తనకు తాగమని "బీర్" కూడా ఆఫర్ చేసారనీ, తానే సున్నితంగా వద్దన్నాననీ, పగలు-అదీ-డ్యూటీలో వున్నప్పుడు తాగనని అన్నానని రాశారు. తనతో చక్రపాణిగారికి సినీ స్క్రిప్టు రాయించాలని ఆలోచన వున్న విషయాన్ని స్నేహితుడు మహీదర్ ఆయన చనిపోయిన తరువాత చెప్పడం తనకు ఆశ్చర్యం కలిగించిందంటారు డీవీ.

వెంకట్రామయ్య గారికి ఆకాశవాణి అనుభవంతో పరిచయమైన మరో సినీ ప్రముఖుడు దుక్కిపాటి మధుసూధన రావు. అలా కలిగిన పరిచయం వల్ల అన్నపూర్ణావారి "బంగారు కలలు" సినిమాలో కొంత భాగానికి స్క్రిప్టు రాసే అవకాశం కలిగింది వెంకట్రామయ్య గారికి. కాకపోతే మొదటి కలయికలో "మీ గురించి నాకేమీ తెలియదు" అని ఆయన అన్న మాటలకు అప్పటికే రచయితగా, రేడియో ప్రవక్తగా, రేడియో "రాంబాబు" గా సమాజంలో ఎంతో మందికి తెల్సిన  తనను అలా అన్నందుకు కొంచెం బాధ కలిగింది వెంకట్రామయ్యకు. దుక్కిపాటి తాను మొదట రాసిన స్క్రిప్టును "పొయటిక్" భాష అని అనడం, వాక్యాలు ఇంకా చిన్నగా వుండాలనడం, మళ్లీ తిరగ రాయాలనడం, అలా చేసిన తరువాత దాన్ని చదివిన ఆయన పూర్తి సంతృప్తి వ్యక్తపరచడం, ఒక అనుభవంగా పేర్కొన్నారు రచయిత. ఇక ఆయనతో కలిసి తీద్దామనుకున్న మట్టిమనిషి ప్రాజెక్టు గురించి సుదీర్ఘంగా రాశారు పుస్తకంలో.

వెంకట్రామయ్య తన పుస్తకంలో తనతో కలిసి పని చేసిన వారందరి గురించి విపులంగానో, క్లుప్తంగానో రాశారు. కాజువల్ ఆర్టిస్టుల గురించీ రాశారు. ఆయన తమ గురించి రాసిన వాక్యాలను వారందరూ విలువైనవిగా భద్రపరుచుకునే విధంగా రాశారాయన. భండారు శ్రీనినవాస రావు గురించి ప్రత్యేకంగా కేటాయించిన ఒక శీర్షికలో నా గురించిన ప్రస్తావన కూడా తెచ్చారు. నేను చేసింది చిన్నదైనా ప్రత్యేకంగా పేర్కొనడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. మొత్తం మీద అందరూ, ముఖ్యంగా ఆకాశవాణి గురించి తెలుసుకోవాల్సిన అందరూ చదవాల్సిన, చదివించాల్సిన అపురూపమైన పుస్తకం ఇది.

వెంకట్రామయ్యగారి మరణం సాహితీలోకానికి తీరని లోటు. వ్యక్తిగతంగా ఒక గొప్ప స్నేహితుడిని కోల్పోయాను. ఆయనా, నేను, భండారు శ్రీనివాస రావు ఎన్నో మార్లు డ్యూటీ పూర్తైన తరువాత సాయింత్రాలు కలుసుకుని గంటల తరబడీ సాహిత్య చర్చ చేసేవాళ్లం. ఆయనకు ఆంగ్ల సాహిత్యంలో కూడా అపారమైన పట్టు వుంది. భగవంతుడిని నమ్మని వెంకట్రామయ్య గారికి ఆ భగవంతుడు ఆత్మశాంతి కలిగించాలని ప్రార్థిస్తున్నాను.

Saturday, January 11, 2020

Valmiki goes to River Tamasa for a sacred bath : Vanam Jwala Narasimha Rao


Valmiki goes to River Tamasa for a sacred bath
Vanam Jwala Narasimha Rao
Hans India (12-01-2020)

Valmiki on hearing the story of Rama narrated by Sage Narada, worshipped him along with his disciples. After Narada left the hermitage Valmiki with his disciples went around the banks of River Tamasa where he saw couple of crane birds, in the vicinity of that river's foreshore, flying there about in togetherness and chuckling delightfully. Even while Valmiki was looking at them, a tribal hunter killed the male bird with his arrow. Valmiki noticed the male bird slain on ground reeling with blood covered wings. The female bird on seeing the fate of his companion cuckooed with sorrow. On seeing the bird felled that way and the female bird out of state of compassion crying with sorrow the sage Valmiki cursed the tribal hunter. The sentences uttered by sage Valmiki surprisingly became a four-line stanza with each line equally postulated that had many meanings in it.

That was in fact the beginning of authoring Valmiki Ramayana. Valmiki determined to write Ramayana elaborating what sage Narada tutored him in brief. Later Valmiki completed his bathing in the River Tamasa and carrying his sacramental belongings like the water vessel etc. moved towards his hermitage along with his disciples. On the way to hermitage he mentioned about his stanza several times repeatedly to his disciples. All through the way he became thoughtful as to why his utterance in grief and anguish for the bird became a powerful stanza and the curse has become a blessing one? Valmiki, after returning to the hermitage along with disciples, was totally preoccupied on the stanza that he uttered.  
 
Lord Brahma comes to see Valmiki 
While Valmiki was thinking of his utterances and the way it became a purposeful Shloka, the Four-faced creator of universe, the almighty Lord Brahma, arrived there on his own, to see that distinguished saint Valmiki. Not knowing that Brahma arrived to his hermitage to execute a divine deed through him, Valmiki started searching for valid reasons. Brahma started keenly observing Valmiki.  

Brahma entrusts responsibility of
telling Ramayana to Valmiki
            Then Brahma told Valmiki the reason for his utterances in the form of a stanza. He said “Oh! Saint! What has come out of your mouth is really a Shloka-four lined stanza. Goddess Saraswathi made it come out from your mouth. There is no need to think through. That Shloka of yours came out from you at my instance and hence you shall render the legend of Rama, in its entireness. You shall narrate the legend of Rama. The entire story of Rama will be in front of your eyes in its totality to enable you to write it in detail. As long as Rama's legend authored by you flourishes, till then you will flourish in heavenly abode. Your Ramayana shall remain as a great legend for ever and ever”. On saying like this, the Brahma vanished from there. Valmiki decided to write Ramayana.

Sage Valmiki then authored the highly renowned Rama's legend eulogizing Rama's prominence, with evenly worded verses, and words yielding great meanings.

Valmiki through Yogic Insight
views the whole Rama story
Valmiki gets ready to see the Rama Story as it is and as it happened. The sage saw wholly and clearly by the yogic power conferred by Brahma on him. Valmiki through his absolute concentration was able to see Rama, Lakshmana and Seetha, also King Dasharatha, and his wives Kousalya, Sumitra and Kaikeyi as well as the whole of Ayodhya people and what happened to Rama when he was in kingdom Ayodhya. Valmiki wanted to see the whole of Rama Story and then pioneered to author all of the legend of Rama in its entirety.


Valmiki saw Rama’s birth, killing the monsters Subhahu and Tataka in his childhood, the citizen friendly attitude of Rama and his patience, people bestowing confidence on Rama, the truthfulness of Rama, his very great valor, his gracefulness to all, his universal cordiality, perseverance, courteousness, and his truthful conduct, stories narrated by Sage Vishvamitra, Rama's breaking the great bow of Shiva, marriage with Sita, dispute of Rama and Parashurama etc.

Valmiki also saw, the merits of Rama, preparations for Rama’s coronation, Queen Kaikeyi’s malicious intentions, disruption of coronation plan, Rama’s exile to forests, Dasharatha’s death, grief of Ayodhya people, Rama leaving them all and going to forests, meeting Guha, asking Sumantra to return to Ayodhya, crossing River Ganga, visiting hermitage of Sage Bharadwaj, seeing Chitrakoota, construction of a hermitage and dwelling there, Bharata's arrival at that place  to request Rama to come back, Rama's denial of it, Rama's offering water obsequies  to his father, crowning shoe-sandals of Rama by Bharata, Bharata's living in a village Nandigrama etc.

Valmiki further saw Rama's going to Dandaka forests, Killing Monster Viradha, Rama's visit to Sage Sarabhanga and Suteekshna, their visiting Anasuya, her giving a body cream to Seetha, visit to sage Agastya, conversation with Jatayuvu, living in Panchavati, defacing Shoorphanaka, killing of demons like Khara, Dhooshana and Trishirsa and the upsurge of Ravana thereby, killing of demon Mareecha who was in the form of a fake deer, Ravana's abduction of Sita, Raghava's anguish at the loss of Sita, Ravana's killing the mighty eagle Jatayuvu, Rama's seeing Kabandha, Shabari’s hosting, meeting and conversation of Rama and Hanuman etc.

Then Valmiki with his yogic insight saw Rama reaching Rushyamook along with Hanuman, friendship with monkey leaders Sugriva, killing Vali with one single arrow in the duel between Vali and Sugriva, Vali’s wife Tara’s grief for the deceased Vali, coronation of Sugriva to the Monkey Kingdom etc.

Continuing to know the further story of Rama, Valmiki with his yogic insight saw Rama’s annoyance on Sugriva for not taking up the work of searching Sita immediately after completion of monsoon, Sugriva immediately assigning the job to monkey leaders and instructing them to go to all the four corners, Sugriva briefing them about the places that they are likely to see in their pursuit etc.

Later Valmiki saw Rama giving his ring to Hanuman going towards southern part as his representation, Hanuman and his entourage monkey team entering the cave of Swayamprabha, Sampathi the brother of Jatayuvu informing monkeys that Sita is in captive in Lanka, Monkeys climbing Mahendragiri hill, Hanuman crossing the ocean, Mainaka requesting Hanuman to rest on his back for a while on way to Lanka, Surasa challenging Hanuman’s heroism, Hanuman killing Simhika, Hanuman crossing the ocean and entering Lanka, thinking of proper strategy to search Sita, Hanuman noticing the great Pushpak plane etc.

Valmiki also saw monster king Ravana’s residence with full of alcohol and brewery, Ravana’s central palace, Hanuman searching there for Sita, Hanuman watching Ravana talking to Sita in indecent language, Hanuman handing over Rama’s representative ring to Sita, guarding monster women threatening Sita, Trijata’s dream version, Sita giving her bejeweled hair slide to Hanuman to be shown to Rama, Hanuman uprooting of the trees and destroying the Ashoka Garden, Hanuman killing the guards of that garden, monster women complaining to Ravana, the demon heroes dying in the hands of Hanuman, Hanuman temporarily surrendering to Indrajit (Ravana’s son) Brahmastra (a divine and magical missile), Ravana-Hanuman conversation, Hanuman’s burning down Lanka, his return from Lanka etc.

Valmiki further saw Hanuman briefing his colleague monkeys about his trip to Lanka, monkeys consuming honey in the honey garden, Hanuman solacing Rama, presenting the jewel given by Sita, Nala's building the bridge on ocean, reaching Lanka, Rama with his army crossing over the ocean by the boulder bridge built by Nala, seizure of Lanka in night, Vibhishana the younger brother of Ravana coming to meet Rama, Rama killing Ravana, Kumbhakarna and Indrajit in the war, Sita’s entering the sacred fire and returning safely, Rama accepting her, coronation of Vibhishana, Sita-Rama-Lakshmana and others return journey to Ayodhya on the divine Pushpak Aircraft, Rama meeting Bharata in Nandigram, Sriram’s coronation, all those who accompanied Rama returning to their places etc.