Friday, May 30, 2014

Ordinance on Polavaram unconstitutional:Vanam Jwala Narasimha Rao

Ordinance on Polavaram unconstitutional
Vanam Jwala Narasimha Rao
The Hans India Daily (31-05-2014)

The Government of India under the pretext of constructing Polavaram Dam, in the process of paying compensation to the tribals whose lands are under threat of being submerged has gone to the extent of issuing an ordinance transferring seven Mandals in the tribal district of Khammam from Telangana to Andhra Pradesh. This is unconstitutional, undemocratic, anti-tribal and against the spirit of federalism. At a time when Parliament is about to meet in a week’s time resorting to bring an ordinance in such an hurried manner as if there are no important matters of public interest in front of Modi Government is ridiculous. Transferring of a tribal Village or a Mandal that has predominantly tribal land, from one authority to a different one amounts to violation of Supreme Court judgments and violation of 73rd and 74th Constitutional amendments. Without a Gramsabha resolution nothing in Scheduled area is constitutional. Transferring of tribal village is nothing but transferring of tribal land which again is unconstitutional. After all Government of India declared this as National Project and as such the compensation to the displaced tribals could be paid from central funds irrespective of the mandals are in Telangana or Andhra Pradesh.          

The tribal land has always been under the threat of being taken over by non-tribal industrialists not to speak of Governments, taking advantage of loopholes in the A.P. Scheduled Areas Land Transfer (Amendment) Regulation-I of 1970 Act. 

The Land Transfer Regulation I of 1970 had positively attempted to restore the land owned by non-tribal to tribal in Scheduled Areas. It introduced the presumptive clause, that, Land owned by a non-tribal in a Scheduled Area will be deemed as acquired from a tribal until the contrary is proved. The Regulation made it imperative that any non-tribal holding land in the Scheduled Area shall not transfer it to even any non-tribal including government. It stipulates, that, any transfer of immovable property situated in the agency tracts by a ‘person’, whether or not such a ‘person’ is member of a Scheduled Tribe, was absolutely null and void, unless such transfer is made in favor of a ‘person’, who is member of a Scheduled Tribe or a society, registered under the Cooperative Societies Act, 1964 which is composed solely of members of Scheduled Tribes. Another clause of the Regulation provided for the surrender of land in Scheduled Areas to the Government where the non-tribal or the tribal could not sell it to another tribal. The Government is obliged to acquire the land on payment of ‘appropriate compensation’. It also prohibited the transfer of land from a tribal to a non-tribal, and made it obligatory on the part of Government to eject the non-tribal and restore the land to the original tribal owner.

By virtue of legislative powers conferred on the Governor of the State under Article 244(I) read with Fifth Schedule to the Constitution of India, among the various protective measures undertaken by the Andhra Pradesh Government for the tribal welfare, notable to mention, was, Andhra Pradesh Scheduled Areas Land Transfer Regulation Act of 1959. Regulation I of this Act is the primary law for the protection of the rights of the tribal over their lands. The Regulation as it stood originally, prohibited alienation of lands by tribal to non-tribal unless prior written permission on sanction of the competent authority was obtained. That Regulation also empowered the Agent (Collector) to decree an ejectment against any non-tribal in possession of any land the transfer of which was made in contravention of its provisions and to restore such lands to the transferors or their heirs. Regulation II of 1963 later extended the Regulation, which was originally for the Andhra Area, to Scheduled Areas of Telangana also.

In the 1959 Act, the scope of the word ‘transfer’ was clarified to include “any other dealing with immovable property” and the definition of ‘immovable property’ was also enhanced to include “standing crops, timber and trees”. The word “Scheduled Tribe” was introduced in the Act, to include any tribe or tribal community notified as such by the President under Article 342 of the Constitution. Under the provisions of 1959 Regulation, though, transfer of immovable property by a member of Scheduled Tribe to a non-tribal was made null and void; it did have an exception clause, inferring ‘imposing certain restrictions only’. Difficulties were encountered by the implementing agencies of Government in ejectment procedures, in as much it was, not always easy for the authority concerned to ascertain as to how the non-tribal got the lands in their possession. This resulted in amending the Regulation I of 1959, in the year 1970 which is now popularly known as “One of 1970” even to an illiterate tribal and to all those who do not even know English alphabets. Needless to say, that, it touched the hearts of whole tribal community. 

After reviewing the Regulation I of 1970 and with a view to lessen the hardship of the Scheduled Tribes and probably to benefit them, an amendment was issued through Regulation I of 1971, enabling the tribal to mortgage without possession any immovable property to the cooperative society and other financial institutions for free flow of credit to them. Further amendment was made through Regulation I of 1978, which prohibited, registration of documents of land transfers in favor of non-tribal, and provided for a year’s rigorous imprisonment as well as monetary fine for acquiring the land after ejectment decree was passed. In 1979, another Government Order was issued exempting small non-tribal farmers owning five acres of wetland and ten acres of dry land from the provisions of Regulation I of 1970. The courts, however, stood by the Regulation and the Andhra Pradesh High Court struck down the 1979 Government Order in 1983. When the non-tribal agitated before the High Court and Supreme Court questioning the Constitutional validity of Regulation I of 1970, they were dismissed. The Judges of the Supreme Court observed, that, it was necessary to keep in view, the socio-economic context, in judging whether a Regulation was reasonable or not. They further observed, that, considering the fact, that, the tribal was cheated, exploited and outwitted by the unscrupulous non-tribal moneylenders, it was necessary that a ‘Regulation’ should exist to protect the tribal.

Yet another serious attempt was made in the year 1989, when the Government announced the decision to repeal Regulation I of 1970, but in vain. Several organizations and prominent personalities raised objections to the move. They told the Government that the implications of the repeal were far reaching. The attempts, as the news now reveal, would probably continue in some form or other as long as there is tribal land as long as non tribe’s eye is on that.

The passing of 1979 Government Order (with a Congress Government in office) and the move to repeal the Regulation in 1989 (with a Telugu Desam Government in office), was the result of consensus on the part of major if not all the then political parties. Unanimity marked the thinking of political parties with ‘agreed’ differences of ideology as that of Telugu Desam, Congress-I, both the Communists as well as the then Janata to go for repeal in 1989. Yet another significant fact during 1989 was absence of valid protest even from tribal leaders. As a matter of fact, the repeal was passed by the then ‘Tribal Advisory Council’ comprising tribal Legislators with a ‘Gond tribesman’ as its Chairman in his capacity as Minister for Tribal Welfare. The question that was frequently asked in many corners those days was how the vested interests could manage to get the support of the Communists too. The Communist Party of India-CPI, tried to justify its stand, on the ground to safeguard the interest of small landowners, many of whom belong to the weaker sections and have been occupying tribal areas for several generations. It all ended with Telugu Desam, Bharatiya Janata and Communist Party of India (Marxist) hastily convening a meeting and announcing that they had altered their stand and decided against repeal of the Regulation later.

The Regulation had generated considerable amount of land restoration activity in the tribal areas till 1979. According to the ‘Tribal Cultural Research and Training Institute’, the number of non tribal occupations in Scheduled Areas detected as prima-facie violating Land Transfer Regulation run in to several thousand and the extent of land in that was estimated to be several Lakhs of acres. A little over fourth of that extent could only be restored to tribal population. In fact the figures also revealed then, that, in couple of thousands of instances non-tribal could get favorable orders involving an extent of over a Lakh of acres. 

Against this backdrop once again there were moves to circumvent Land Transfer Regulation again and again. Truth apart, it is time now, to look in to the various aspects of Supreme Court Judgment dated July 11, 1997 in the Public Interest Litigation on the Andhra Pradesh Scheduled Area Land Transfer Regulation Act 1959. The Division Bench consisted of Justice K. Ramaswamy, Justice S. Sagir Ahmed and Justice G.B. Patnaik. The Judgment made it very clear; that, the word ‘person’ would include the State government and as such transfer of land in Scheduled Area by way of lease, for mining purpose in favor of non-tribal stands prohibited. The Government also stands prohibited to transfer the mining leases to corporation aggregate etc except to its instrumentality says the Judgment. This can also be interpreted as prohibiting transfer of tribal area from state to state against the interests of tribals as is done now through this ordinance.

At one point of time the then President of India announced, that, a “Committee of Governors” would be formed to look into the serious inadequacies in the implementation of programs for the welfare of Scheduled Castes and Scheduled Tribes. The Supreme Court judgment also came out with several recommendations and what was the follow-up from the state and central governments subsequently is not known.


Against this background how can Government of India attempt to issue an ordinance transferring tribal Mandals consisting of tribal lands from Telangana to Andhra Pradesh? TRS Chief K Chandrasekhar Rao is right in calling for Bandh protesting against ordinance. END

Saturday, May 10, 2014

సంధ్యావందనం:వనం జ్వాలా నరసింహారావు

సంధ్యావందనం
వనం జ్వాలా నరసింహారావు

          "సంధ్యావందనం ద్విజాతులకెంతో ముఖ్యమైంది. సంధ్యావందనం చేయని బ్రాహ్మణుడు ప్రాణం లేని దేహంతో సమానం. ఇలా ఆలోచిస్తే, బహుశా, ఈ రోజుల్లో బ్రాహ్మణ జాతి సంధ్యావందనం చేయని స్థితికి చేరుకుని, ఒక విధంగా పతనమై పోతున్నదనాలి. బ్రాహ్మణులమని అనుకునేవారు తమ స్వరూపాన్నే మరచి, భ్రష్టులై పోవడానికి, వారి భోగలాలసయే కారణమనాలి". ఇలా మనవి చేసుకుంటూ, వాసు దాస స్వామిగా పలువురు ఎరిగిన స్వర్గీయ వావిలికొలను సుబ్బారావు గారు రాసిన "సంధ్యావందనం" అనే టీకా తాత్పర్య సహిత అమూల్య గ్రంధాన్ని అంగలకుదురులోని శ్రీ కోదండ రామ సేవక ధర్మ సమాజానికి చెందిన దాస శేష స్వామివారు, ఏనాడో అరవై ఏళ్ల క్రితమే, పరిచయం చేశారు. అందులో పేర్కొన్న పలు అంశాలు నేటికీ, ఆ మాటకొస్తే, ఏ నాటికైనా బ్రాహ్మణులమని అనుకునే వారందరూ విధిగా తెలుసుకుని తీరాల్సిందే....అనుసరించాల్సిందే. వివరాల్లోకి పోతే.....

          సంధ్యావందనానికి మొదటగా కావాల్సింది యజ్ఞోపవీత ధారణ. ఆచమనం, సంకల్పం చేసి "యజ్ఞోపవీతం పరమం పవిత్రం, ప్రజాపతే ర్యత్సహజం పురస్తాత్, ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుభ్రం, యజ్ఞోపవీతం బలమస్తు తేజః" అని జపిస్తూ మొదటి జంధ్యం వేసుకోవాలి. తరువాత తిరిగి ఆచమించి రెండవ జంధ్యం వేసుకోవాలి. మరల ఆచమించి మూడోది వేసుకోవాలి. అలానే పాతది తేసి వేయడానికీ మంత్రం వుంటుంది. ద్విజులకు తప్ప ఇతరులకు సంధ్యావందనం చేయడానికి అధికారం లేదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులను ద్విజులంటారు. వీరికే వేదోక్త కర్మాధికారం వుంది. ప్రాత స్నానం చేసిన తరువాతే సంధ్య వార్చాలి. సూర్య బింబం ఎర్ర్తబారే సమయంలో సాయం సంధ్య చేయాలి. ఇక మధ్యాహ్న సంధ్య మధ్యాహ్నం చేయాలి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వున్న సమయాన్ని ఐదు భాగాలు చేయాలి. మొదటిది, అంటే, ఆరు గంటల నుంచి సుమారు రెండున్నర గంటల సమయం ప్రాతః కాలం. ఒంటి గంట సమయంలో మధ్యాహ్న కాలం. సాయంత్రం ఆరు గంటలకు సాయంకాలం. సాయం సంధ్యల కాలంలో, ప్రాతః సంధ్యా కాలంలో, మూడేసి అర్ఘ్యాలను విడవాలి. ఉదయం అర్ఘ్యం విడిచేటప్పుడు సూర్యుడికి ఎదురుగా నిలబడి, వంగి విడవాలి. మధ్యాహ్నం చక్కగా నిలబడి, సాయంత్రం కూర్చుండి సంధ్య చేయాలి. జపం కూడా అలానే చేయాలి. ఉదయం ఈశాన్య దిక్కుగా, సాయంకాలం వాయువ్య దిశగా, మధ్యాహ్నం తూర్పు దిక్కుగా తిరిగి సంధ్య వార్చాలి. సరైన కాలంలో సంధ్య వార్చితే 10 మార్లు గాయత్రి జపం చేస్తే చాలు. సమయం తప్పితే 108 మార్లు చేయాలి.

          సంధ్యావందనం బ్రాహ్మణ. క్షత్రియ, వైశ్యులకు ముఖ్యంగా బ్రాహ్మణులకు సంపాదించి ఇచ్చిన వంశ పరంపరాగతమైన నిక్షేపం. అంటే, బ్రాహ్మణుడనేవాడు, గాయత్రీ జపం ద్వారానే, నిస్సంశయంగా ముక్తి పొందుతాడు. ఇతర జపాలేవి చేసినా, చేయక పోయినా, గాయత్రి జపించిన వాడు భూతదయ గలవాడిగాను, బ్రాహ్మణుడి గాను పిలవబడటానికి అర్హుడవుతాడు. అసలు "సంధ్య" అంటే ఏమిటి? సందిలో చేయడానికి యోగ్యమైంది సంధ్య. అలానే, సంధ్యా కాలం అంటే, రాత్రి-పగలు కలిసే కాలం. ఆ కాలంలో చేయబడే కర్మను సంధ్య అంటారు. అంత మాత్రాన సంధికాలంలో చేసే ప్రతి కార్యం సంధ్య అని పిలవాలని లేదు. కాకపోతే, కొన్ని స్మృతులు మధ్యాహ్న సంధ్యను కూడా పేర్కొన్నాయి. ఆ విధంగా సంధ్యలు మూడయ్యాయి. బ్రాహ్మణుడు సంధ్య వార్చకపోతే, గొప్ప కీడు కలుగుతుందని అనేక స్మృతులలో చెప్పబడింది. కీడు కలుగుతుంది అంటే, ధన నష్టం-ధాన్య నష్టం అని మాత్రమే కాదు. అట్టి వాడికి మరు జన్మలో హీన జాతులయందు పుట్టుక కలుగుతుందని అర్థం. ఎన్ని జన్మాల పుణ్య ఫలంగానో సంపాదించిన బ్రాహ్మణ్యం, సోమరితనం వల్ల కోల్పోయి, హీన జాతులయందు పుట్టడానికి దారితీయడం కంటే మించిన కీడు ఏముంటుంది? సంధ్య వార్చని బ్రాహ్మణుడు శూద్రుడితో సమానమై, భ్రష్ట బ్రాహ్మణుడిగా లోకం దూషిస్తుంది. సంధ్యను ఉపాసించని ద్విజుడు సూర్యుడిని హింసించినట్లే!


          ఇంతకీ సంధ్యలో ఉపాసించబడే దేవత ఎవరు? స్త్రీయా? పురుషుడా? "గాయత్రీం చింతయే ద్యస్తు" అని జప కాలంలో "గాయత్రీ" ధ్యానం చెప్పబడింది. సంధ్యా గాయత్రీ, సావిత్రీ, సరస్వతీ శబ్దాలు మహతీ వాచకాలు. కాబట్టి, ఆ దేవతలు స్త్రీలే అని చెప్పుకోవాలి. ఐనప్పటికీ, సంధ్యా ది దేవత స్త్రీ యని ఉపాసించాలా? పురుషుడని ఉపాసించాలా? అని సందేహం వచ్చినప్పుడు, వసిష్ట మహర్షి జవాబుగా, "ఏది సంధ్యయో, అదే ప్రపంచాన్ని ప్రసవించే శక్తి. అది మాయాతీతం. నిష్కల ఈశ్వరుడి ముఖ్య శక్తి. తత్వ త్రయాల వల్ల కలిగేది. అందువల్ల, సంధ్యా ది దేవత భగవచ్చిచ్ఛక్తి అని గ్రహించాలి" అని చెప్పారు.

          దేహం అత్యంత మలినమై తొమ్మిది రంధ్రాలతో కూడి వుంటుంది. రాత్రి-పగలు దాని నుంచి మురికి వెలువడుతూనే వుంటుంది. కాబట్టి ప్రాతః కాల స్నానంతో దేహం పైనున్న మురికి పోగొట్టుకోవాలి. స్నానం చేసి మాత్రమే సంధ్య వార్చాలి. ఇక సాయం సంధ్య విషయానికొస్తే, గురువు ద్వారా ఉపదేశం పొందిన గాయత్రిని నిలుచుండి జపించుకుంటూ, సూర్యుడు అస్తాద్రికి చేరగానే సాయం సంధ్య ప్రారంభించాలి. సూర్యుడు, నక్షత్రాలు లేని రే పగటి సంధికాలం సాయం సంధ్య వార్చాలి. అంటే, సూర్యుడు అస్తమించిన తరువాత, నక్షత్ర దర్శనం కాక ముందు, సాయం కాల సంధ్య; నక్షత్రాలు కనబడకుండా పోయిన తరువాత సూర్యుడు ఉదయించక ముందు ప్రాత సంధ్య, వార్చాలి. ఉత్తమ కాలంలో వార్చబడిన సంధ్య స్వర్గాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ముఖ్య కాలంలో సంధ్య వార్చని వాడు పూర్ణ బ్రాహ్మణుడు కాడు. పన్నెండు రోజులు వరుసగా సకాలంలో సంధ్య వార్చకపోతే, నాలుగు వేదాలు చదివిన బ్రాహ్మణుడైనా, శూద్రుడితో సమానమైన వాడే! కాకపోతే వీటన్నింటికీ శాస్త్రోక్తంగా ప్రాయశ్చిత్తాలు సూచించిబడినాయి.

          సంధ్యావందనంలో అనుష్టించాల్సిన మార్గాలలో ప్రాణాయామం ఒకటి. ఆసనం మీద కూర్చుండి, నడుం, వీపు, కంఠం, శిరస్సు సమంగా వుంచి, వంపు లేకుండా చేసి, మొదట ఎడమ వైపు ముక్కు భాగాన్ని కుడిచేతి బొటన వేలితో మూసి, కుడి వైపున్న ముక్కు భాగంతో తనలో వున్న గాలినంతా విడిచిపెట్టాలి. ఇలా చేసి, కుడి ముక్కు రంధ్రాన్ని బిగించి, ఎడమ ముక్కుపై వున్న వేలిని తొలగించి, మెల్లగా గాలిని లోపలికి పీల్చాలి. పీల్చి, వెంటనే ఆ ముక్కును కూడా కడపటి రెండు వేళ్లతో బిగించాలి. అలా బిగించి, గాలిని లోపల కొంచెం సేపు నిలిపి కుడి వైపు ముక్కు మీద వేలు తొలగించి, మెల్లగా గాలిని విడవాలి. ప్రాణాయామం చేసేటప్పుడు పెదవులు తెరవరాదు. పన్ను-పన్ను తాకకూడదు. దిక్కులు చూడ కూడదు. దృష్టి ముక్కు కొనపైనే వుండాలి. మూలాధారం బిగించాలి. శ్రీమన్నారాయణుడుని హృదయంలో నిలిపి ధ్యానించాలి. ఆ ధ్యానంలో గాయత్రిని జపించాలి. ఒక మంత్రాన్ని అర్థాను సంధానంతో మనస్సులో పలుమార్లు వల్లించుకుంటూ, ఆ మంత్రాధిష్ఠాన దేవతను, హృదయంలో మనస్సు చలించకుండా నిలపడాన్ని "జపం" అంటారు. జపం చేయడానికి ముందు, మూడు మార్లు ప్రాణాయామం చేయాలి. గాయత్రిని 10 మార్లు కాని, 108 మార్లు కాని జపించాలి. ఇది జప సంఖ్య. జపమాలిక సహాయంతో కాని, వ్రేళ్లతో కాని లెక్కించాలి. కుడి చేతి ఉంగరపు వేలు నడిమి గణుపు నుంచి కింది కొచ్చి, కడపటి వేలు కింది గణుపు నుంచి పైకి పోయి, ఉంగరపు వేలి పై గణుపు, నడిమి వేలి పై గణుపు, చూపుడు వేలు పై గణుపు, దాని కింది గణుపు, ఆ దాని కింది గణుపు....ఇలా పది లెక్కించాలి.

          ఆ తరువాత చేయాల్సింది ఆచమనం...అంటే, శాస్త్ర ప్రకారం చేయాల్సిన జలపానాది కార్యం. అజ్ఞానంతో ఆచమనం చేయకుండా కార్యాలు చేసేవాడు నాస్తికుడితో సమానం. వాడు చేసే పనులన్నీ వ్యర్థమే. నిలబడి కాని, వంగి కాని ఆచమనం చేయకూడదు. కూర్చుండి మూడు మార్లు జలాన్ని తాగాలి. "కేశవ", "నారాయణ", "మాధవ"...ఈ మూడు అనుకుంటూ వేరు-వేరుగా జలాన్ని తాగాలి. ఒక్క సారి నీళ్లు తీసుకుని మూడు పేర్లు చెప్పకూడదు. అక్కడి నుంచి వరుసగా "గోవింద", "విష్ణు" అంటూ చేతులు కడుక్కోవడంతో మొదలెట్టి, "మధుసూధన", "త్రివిక్రమ", "వామన", "శ్రీధర", "హృషీకేశ", "పద్మనాభ", "దామోదర", "సంకర్షణ", "వాసుదేవ", "ప్రద్యుమ్న", "అనిరుద్ధ", "పురుషోత్తమ", "అధోక్షజ", "నారసింహ", "అచ్యుత", "జనార్ధన", "ఉపేంద్ర" అను స్తుతిస్తూ, చివరగా "హరయే శ్రీ కృష్ణాయ" అంటూ పూర్తి చేయాలి.

          ఓం కేశవాయ స్వాహా...ఓం నారాయణాయ స్వాహా.......ఓం హరయేనమః...ఓం శ్రీకృష్ణాయనమః అంటూ, వారి వారి సంప్రదాయం ప్రకారం, ఆచమనం చేయాలి. ఆ తరువాత, "ఓం భూః! ఓం భువః! ఓం సువః! ఓం మహః! ఓం జనః! ఓం తపః! ఓం సత్యం! ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ! ఓ మాపో జ్యోతీ రసో మృతం బ్రహ్మ భూర్భువస్సువ రోమ్ !" అని ప్రాణాయామం చేయాలి. చేసి, ఇలా సంకల్పం చెప్పుకోవాలి. "శ్రీ గోవింద గోవింద మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమాన స్సాద్య బ్రహ్మణో ద్వితీయపరార్థే, శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రధమపాదే, జంబూద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్యే ఈశాన్య ప్రదేశే, కృష్ణా గోదావరీ మధ్యప్రదేశే, సమస్త దేవతా బ్రాహ్మణ సన్నిధౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన.....సంవత్సరే....ఆయనే...ఋతౌ.....మాసే.....పక్షౌ....తిధౌ.....వాసరే.....శ్రీవిక్ష్ణునక్షత్రే శ్రీ విష్ణు యోగో, శ్రీ విష్ణు కరణే, ఏవం గుణ విశేషణ విశిష్టాయాం, శుభతిధౌ, శ్రీ పరమేశ్వరముద్దిశ్య మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం....సంధ్యా ముపాసిష్యే". అలానే, "ఓం అచ్యుతాయనమః, ఓం అనంతాయనమః, ఓం గోవిందాయనమః....." అనే ద్వాదశ నామాలు చెప్పాలి. ఆ తరువాత మార్జన మంత్రాలొకటి రెండు ఉచ్ఛరించాలి. మార్జన మంత్రాలన్నీ చెప్పిన తరువాత, పరిశుద్ధుడై, అర్ఘ్యం విడవాలి. ఇలా విడవడానికి ముందు స్మృత్యాచమనం చేయాలి. తరువాత, దోసిట్లో నీళ్లుంచుకుని, సూర్యుడికి ఎదురుగా నిలుచుండి, ""ఓం భూః! ఓం భువః! ఓం సువః! ఓం మహః! ఓం జనః! ఓం తపః! ఓం సత్యం! ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్" అన్న గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ, మూడుసార్లు అర్గ్యం విడవాలి.

          సర్వ వేదాలను అధ్యయనం చేస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందో, సమస్త తీర్థాలలో స్నానం చేస్తే ఏ ఫలం కలుగుతుందో, అటువంటి ఫలమే జనార్ధనుడైన దేవుడిని స్తుతిస్తే పురుషుడికి కలుగుతుంది. అందుకే, చివరగా...ఇలా అనుకోవాలి...."వాసుదేవుడవగు నీవు నివసించిన కారణం వల్ల మూడు లోకాలు నిలుస్తున్నాయి. సర్వాంతర్యామివైన ఓ వాసుదేవా! నువ్వు సర్వ భూతాలకు నివాస స్థానానివి. అలాంటి నీకు నమస్కారం" అని అంటూ, "చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు......ప్రవరాన్విత....గోత్రః....సూత్రః....శాఖాధ్యాయీ, అహంభో అభివాదయే" అంటూ ముగించాలి.


Saturday, May 3, 2014

రామాయణంలో ఏముంది? ఆంధ్ర వాల్మీకి రామాయణం ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు

రామాయణంలో ఏముంది?
ఆంధ్ర వాల్మీకి రామాయణం ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం యథా వాల్మీకంగా పూర్వ కాండలతో ఉత్తర కాండను కూడా కలిపి రచించిన ఏకైక వ్యక్తి కీర్తి శేషులు వావివిలికొలను సుబ్బారావు (వాసు దాసు) గారు. రామాయణం అంటే ఏమిటి, ఆంధ్ర వాల్మీకి రామాయణం ఎందుకు చదవాలి, అనే అంశాలను స్వయంగా వాసు దాసు గారే ఆయన పీఠికలో వివరించారు. రామాయణాన్ని చక్కగా తెలిసినవారు-అర్థం చేసుకోగలిగిన వారు మాత్రమే లోకానికి అందలి విషయాలను వివరించ సమర్థులు. అందరికీ అది సాధ్యమయ్యేది కాదు. "శ్రీ రామాయణం" అంటే, లక్ష్మీరమణుడైన శ్రీమన్నారాయణుడి మాయా మానుషావతారమైన శ్రీరామ చరిత్రనీ, శ్రీ లక్ష్మీదేవి అవతారమైన సీతాదేవి చరిత్రనీ అర్థం. దంపతుల మాదిరిగా, వారి "అభిధానంబులు అనపాయంగా" వుండినట్లే, తత్త్వమెరిగిన మహాత్ముడు వాల్మీకి మహర్షి, తను రచించిన ఆది కావ్యానికి శ్రీ రామాయణం అని పేరు పెట్టాడు. ఇందులో సీతాదేవి మహాత్మ్యాన్ని విశేషించి చెప్పడంవల్ల వాల్మీకి మహర్షే, శ్రీ రామాయణాన్ని "సీతాయాశ్చరితం మహత్తు" అని వెల్లడిచేశాడు. శ్రీరాముడు భగవంతుడన్న అర్థం, హారంలోని సూత్రంలాగా, రామాయణంలోని ఏడు కాండల్లోనూ వ్యాపించి వుంది. రామాయణాన్ని చదివేవారందరు, ఈ అర్థాన్ని మనస్సులో పెట్టుకొని, ఇందులోని ప్రతి అంశాన్ని-ప్రతి వాక్యాన్ని హెచ్చరికతో శోధించాలి. ఇలా ఆసక్తిగా శోధించిన వారికి-పరీక్షించిన వారికి మాత్రమే, వాల్మీకి రామాయణానికి-ఇతర రామాయణాలకు (ఆ మాటకొస్తే, ఏ భాషలో వున్న ఏ గ్రంథాలకు) గల తారతమ్యం, వాల్మీకి రామాయణంలోని గొప్పదనం తెలుస్తుంది.

          శ్రీ రామాయణం మహాకావ్యం. పుట్టుకతోనే కాకుండా గుణంలో కూడ అదే మొదటిది. దానిలోని గుణాలు, రహస్యాలు తెలుసుకోవాలంటే వాల్మీకికి గాని, సర్వజ్ఞుడికి గాని మాత్రమే సాధ్యమవుతుంది. శ్రీమద్రామాయణంలో ఉత్తమోత్తమ మహాకావ్య లక్షణాలెన్నో వున్నాయి. వర్ణనలెన్నో వున్నాయి. రామాయణం గానం చేసినా, పఠించినా మనోహరంగా వుంటుంది. రామాయణంలో శృంగారం లాంటి నవ రసాలున్నాయి. అందులో శృంగార రసం "సంభోగ శృంగారం". వాల్మీకి వాక్యామృత రసాన్ని నిరంతరం ఆస్వాదన చేసిన భవభూతి వర్ణించినట్లు ఇందులో హాస్యం, కరుణ, వీర, రౌద్రం, భయానక, బీభత్సం, అద్భుతం, శాంతం రసాలను కనుగొన వచ్చు. రామాయణంలో శబ్దాలంకారాలు తరచుగా కనబడవు. అంత్యానుప్రాసలు కొన్ని చోట్ల వున్నాయి. శ్రీమద్రామాయణం స్వభావోక్త్యలంకారాలకు పుట్టిల్లు. వర్షాన్ని వర్ణన చేసిన సందర్భంలో మన ఎదుట వర్షం కురుస్తున్నట్లే వుంటుంది. హేమంతాన్ని వర్ణిస్తుంటే, మనకు మంచులో తడుస్తున్నామా అనిపిస్తుంది. తన వర్ణనా చాతుర్యంతో వాల్మీకి, పాఠకులను, తన చేతిలో బొమ్మలా చేసి, ఇష్టమొచ్చినట్లు ఆడుకుంటాడు. వాల్మీకి మరో ప్రత్యేకత "ఉత్ప్రేక్ష". అలానే ఆయన వాడిన శ్లేషాలంకారాలు. శ్లేషాలంకారానికి చక్కటి ఉదాహరణ వాల్మీకి నోట వెలువడిన ప్రథమ శ్లోకం. దాన్ని ఆంధ్ర వాల్మీకి రామాయణంలో అనువదిస్తూ వాసు దాసుగారు ఇలా రాశారు.

"తెలియు మా నిషాదుండ ప్రతిష్ఠ నీక
ప్రాప్తమయ్యెడు శాశ్వతహాయనముల
గ్రౌంచ మిథునంబునందు నొక్కండు నీవు
కామమోహిత ముం జంపు కారణమున"

ఒక బోయవాడు క్రౌంచ మిథునంలో వున్న మగ పక్షిని చంపడం, ఆడ పక్షి అది చూసి దుఃఖించడం, పరమ దయామయుడైన వాల్మీకి అది చూసి, బోయవాడు చేసిన అధర్మ కార్యానికి కోపగించి అతడిని శపించడం జరిగింది. ఆ శాపమే రామాయణ ఉత్పత్తికి కారణమైంది. దీనికి భగవత్ పరంగా ఒక అర్థం వుంది. రామాయణంలోని ఏడు కాండల అర్థం-కథ ఇందులో సూక్ష్మంగా సమర్థించబడింది. అలంకార శాస్త్రంలో ఎన్ని అలంకారాలు చెప్పబడ్డాయో, అవన్నీ వాల్మీకి (ఆంధ్ర వాల్మీకి) రామాయణంలో వున్నాయి. వాల్మీకి అసమాన కవితా చాతురి వర్ణనాతీతం. మరొక్క ఉదాహరణ చిత్రాలంకార ఉపయోగం. అలంకారాల వరకెందుకు? సాధారణ విషయాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా ఏదో ఒక చమత్కారాన్ని కనబరిచేవాడు. వాల్మీకి రామాయణంలోని పాత్రలు-పాత్రధారుల వాక్కులు, ఆయా పాత్రల చిత్త వృత్తి గుణాలను తెలియచేసేవిగా, సందర్భోచితంగా, వారున్న అప్పటి స్థితికి అర్హమైనవిగా వుంటాయి. పాత్ర గుణ మహాత్మ్యానికి అసంగతమైన వాక్యాలు ఆయా పాత్రల నోటినుంచి వెలువడవు. శ్రీరాముడు భగవంతుడన్న అభిప్రాయం వాల్మీకి పదే పదే చెప్పుకుంటూ పోయాడు రామాయణంలో.


వాల్మీకి రామాయణమనే "కలశార్ణవం" లో రత్నాలను వెదికేవారు, మొట్టమొదటగా తెలుసుకోవాల్సింది వాల్మీకి శైలి-విధానం. అది తెలుసుకోలేక వెతకడం మొదలుపెట్టితే, చీకట్లో తారాడినట్లే. ఒక విషయం గురించి చెప్పాల్సిందంతా ఒకచోట చెప్పడు. కొన్ని సందర్భాలలో ఆ విషయానికి సంబంధించిన ప్రస్తావనే వుండదు. అదే విషయం మరెక్కడో సూచన ప్రాయంగా వుండొచ్చు. ఒక్కోసారి విపులంగా విశదీకరించబడి వుండొచ్చు. ఆయన చేసిన వర్ణనలను బట్టి, ప్రయోగించిన పదజాలాన్ని బట్టి, పాఠకులు ఊహించుకోవచ్చు. ఒకే విషయం, ఒకటి కంటె ఎక్కువ సార్లు చెప్పితే, ఒక్కోసారి ఒక్కోరకమైన విశేషంతో చెప్పబడుతుంది. ఇలాంటి చిత్రాలు అనేకం వుంటాయి. వాల్మీకి (ఆంధ్ర వాల్మీకి) రామాయణం "ధ్వని కావ్యం". కావ్యానికి ప్రధానమైంది ధ్వని. కావ్యానికి ప్రాణం ధ్వని. ధ్వని లేని కావ్యం శవంతో సమానం. రామాయణంలో ధ్వని విశేషంగా వుంది. కావ్యమంతా ధ్వన్యర్థం వుండడమే కాకుండా, పలు శ్లోకాలకు విడిగా ధ్వన్యర్థం వుంది. రుతు వర్ణనలలో ధ్వని స్ఫురిస్తుంది. శ్రీ రామాయణంలోని కవితా చమత్కృతిని విశదీకరించాలంటే, ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇంతెందుకు ! కాళిదాసు, భవభూతి అంత గొప్ప వాళ్లు కావడానికి రామాయణమే కారణం. వాళ్లు రామాయణాన్ని ఎన్ని సార్లు చదివారో గాని, వారి కవితా వల్లి "వాల్మీకి వాక్సుధాసేచనం" లో జీవించి, వృద్ధి పొందిందనడం నిర్వివాదం. శ్రీ విశిష్టాద్వైతం మతోద్ధారకుడైన శ్రీ రామానుజాచార్యులు పద్దెనిమిది పర్యాయాలు గురు ముఖంగా రామాయణాన్ని పఠించి వ్యాఖ్య రాశారు.

శ్రీమద్వాల్మీకి రామాయణం మంత్రనిధానం. ఇందులో అనేకానేక మంత్రాలు ఉద్ధరించబడి వున్నాయి. అందువల్లే, వాల్మీకి రామాయణం పారాయణం చేసేవారు, "అంగన్యాస కరన్యాసాదులతో" యథావిధిగా చదివి, వారి వారి కోరికలు నెరవేర్చుకుంటారు. సద్భావంతో సుందర కాండ పారాయణం చేసి కార్య సిద్ధిని పొందనివారు ఇంతవరకు లేరు. ఉత్తర కాండలో చెప్పినట్లు, రామాయణమంతా గాయత్రీ స్వరూపమే. గాయత్రిలోని 24 అక్షరాలను, ప్రతి వేయి శ్లోకాలకు ఒక అక్షరం చొప్పున శ్లోకం ఆరంభంలో చెప్పబడింది. ఏడు కాండలలో ఏడు వ్యాహృతులు వివరించడం జరిగింది. ఈ గాయత్రీ విధానాన్ని నారదుడే స్వయంగా వాల్మీకి మహర్షికి, రామాయణంతో పాటే ఉపదేశించాడు. " తప స్స్వాధ్యాయ నిరతం, తపస్వీ వాగ్విదాంవరమ్, నారదం పరిపప్రఛ్చ, వాల్మీకిర్మునిపుంగవమ్" అని గాయత్రిలోని మొదటి అక్షరంతో శ్లోకాన్ని ప్రారంభించి, "జనశ్చ శూద్రోపి మహత్త్వ మీయాత్" అని గాయత్రి కడపటి అక్షరంతో సర్గను ముగించాడు వాల్మీకి. అంధ్ర వాల్మీకంలో, మూలంలో వున్నట్లు "తపమున స్వాధ్యాయంబున, నిపుణుని...  .....  తమి గావించెన్" అన్న పద్యంతో ప్రారంభించి, "యథావిధి విన్న బఠింప నారయన్" అని ముగించబడింది. కామ్యార్థమైనా, మోక్షార్థమైనా, రామాయణం పారాయణం చేసినవారి కోరికలు నెరవేర్చే శక్తి, రామాయణానికి వుండడానికి కారణం, అది భగవత్ కథ కావడానికి అదనంగా సర్వజ్ఞుడైన వాల్మీకి (ఆంధ్ర వాల్మీకి) కూర్చిన బీజాక్షరాల మహాత్మ్యమే.

శ్రీమద్రామాయణం వేదంతో సమానమైందే కాకుండా వేదమే అనాలి. వేదమే అయినప్పుడు, వేదంతో సమానమైందని ఎలా అనవచ్చునంటే, వేదంలోని వర్ణాలనే, అనులోమ-విలోమాలుగా మార్చి, వేద ప్రసిద్ధమైన రామ కథను చెప్పడంవల్ల ఇది వేదమే అయింది. వేదాల్లోని అర్థాలున్నందువల్ల వేదంతో సమానమైంది. అందువల్లనే, వేద పఠనం అవశ్యంగా చేయాల్సిన కార్యక్రమాల్లో, రామాయణ పఠనం నియమితమైంది. శత కోటి, అంటే 24 గాయత్రీ బీజాక్షరాలతో కూడిన 24,000 గ్రంథాల రామాయణంలోని ప్రతి అక్షరానికి మహా పాతకాలను నాశనం చేయగల శక్తిగలదని కొందరంటారు. కొందరేమో, శత కోటి రామాయణాన్ని వాల్మీకి సంగ్రహంగా చెప్పాడంటారు. ఇలాంటి మహిమ రామాయణంలో వుండడానికి కారణమేంటో ఆలోచించాలి. వాల్మీకి సూత్రాన్ననుసరించి, రామాయణం వేద స్వర సముద్ధృతంగా-సర్వశ్రుతులందున్నట్లుగా తెలుస్తోంది. వాల్మీకి రచించిన 24,000 శ్లోకాలలో, యజుర్వేదంలోని 1 29 290 పదాలే కాకుండా, రుగ్వేదం, సామవేదం, అధర్వ వేదాలలోని పదాలు కూడా అనులోమ-విలోమంగా కూర్చబడిందన్న రహస్యం తెలుసుకోవచ్చు. యజుర్వేదానికి ప్రాముఖ్యం ఇవ్వడానికి కారణం, శ్రీరాముడు యజుర్వేది కావడమే.

శ్రీమద్రామాయణంలోని కాండలలో వేదాక్షరాలు ఎలా వున్నాయో పరిశీలించితే, బాల కాండ ప్రధమ సర్గ నుంచి ఐదో సర్గ వరకు రెండో శ్లోకం దాకా, నారదుడు ఉపదేశించిన విధానం రాసి, తర్వాతనే బ్రహ్మ ప్రత్యక్షం కావడంతో కథా భాగం వుంది. బాల కాండ 5 సర్గ 3 వ శ్లోకం నుంచి, అయోధ్య కాండ 115 వ సర్గ వరకు యజుర్వేదం. అయోధ్య కాండ 116 వ సర్గ మొదలు, అరణ్య కాండ 74 వ సర్గ వరకు ఋగ్వేదం. అరణ్య కాండ 75 వ సర్గ మొదలు సుందరకాండ 48 వ సర్గ వరకు సామవేదం. సుందర కాండ 49 వ సర్గ మొదలు ఉత్తర కాండ 36 వ సర్గ వరకు అథర్వ వేదం. ఉత్తర కాండ 37వ సర్గ మొదలు చివర వరకు ఉపనిషత్తు-అంటే శాంతి. ఈ విధంగా 647 సర్గలలో 23635 శ్లోకాలు, 776794 అక్షరాలున్నాయి. రామాయణం ఒక మహత్తరమైన సాంఖ్య శాస్త్రం. "కాదినవాది సూత్రాల" ప్రకారం అక్షరాల కొచ్చే సంఖ్యలను బట్టి చూస్తే, రామాయణంలో ఎన్నో చిత్రాలు కనిపిస్తాయి.

అవతార సంఖ్య...7, రామాయణ కాండ సంఖ్య....7, యుద్ధం జరిగిన రోజుల సంఖ్య...7, రామాయణ యుద్ధంలో ముఖ్య మైన పురుషుల సంఖ్య (రామ, లక్ష్మణ, హనుమ, విభీషణ, రావణ, కుంభకర్ణ, ఇంద్రజిత్తులు)...7. పారాయణం చేసే వారికి ముఖ్యంగా నియమిత మైన సర్గల సంఖ్య 7. వ్యాహృతులు 7. ఇలా ఈ ఏడవ సంఖ్య మహిమ అద్భుతం. "శ్లోక శతై" అని వాల్మీకి చెప్పినట్లు, బాల కాండం మొదటి సర్గ మొదటి శ్లోకం (తప స్స్వాధ్యాయ...) లోని అక్షరాల కొచ్చే సంఖ్యలను కూడితే 100 వస్తుంది. 100 సంఖ్య ప్రథమ సర్గలోని శ్లోకాల సంఖ్య. రామాయణంలోని సప్త సంఖ్యా నియమాన్ని గ్రహించిన వ్యాస భగవానులు నిజ రచిత గ్రంథానికి "జయ" అని పేరు పెట్టాడు. "జయ" అంటే 18. భారతంలోని పర్వాలు 18. యుద్ధం జరిగింది 18 రోజులు. రణ శూరులు 18 మంది. భగవద్గీతలో 18 అధ్యాయాలున్నాయి. ఇలా ఆలోచిస్తే, మహర్షులందరి మార్గాలు ఒక్కటేననిపిస్తుంది. సీతారాముల వియోగం గురించి, కలిసి వుండడం గురించి అయోధ్యా కాండలో చెప్ప బడింది. మిగిలిన కాండలలో కొంత కాలమన్నా వియోగం గురించి చెప్పబడింది. కాబట్టి "సీత, రామ" నామాల సంఖ్యలు కలిపితే (సీత=67 + రామ=52) 119 వస్తుంది. అయోధ్య కాండలో 119 సర్గలున్నాయి. ఇలాంటి చిత్రాలు ఎన్నెన్నో వాల్మీకి రామాయణంలో నిక్షేపం చేశాడు.