ఒకే
తెలుగు భాష - రెండు రాష్ట్రాలు
వనం జ్వాలా నరసింహారావు
02-06-2014 న, ఒకనాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్ర
ప్రదేశ్
పేర్లతో
రెండు రాష్ట్రాలవుతున్నాయి. మాట్లాడేది మాత్రం ఒకటే భాష. అదీ "దేశ భాషలందు
తెలుగు లెస్స" అని కొనియాడబడిన తెలుగు భాష. భౌగోళికంగా మాత్రమే ఉమ్మడి
రాష్ట్రం రెండు రాష్ట్రాలయ్యాయి కాని, భాష విషయంలోను, పరస్పర
సంబంధ బాంధవ్యాల విషయంలోనూ, ఆప్యాయత-అనురాగాల
విషయంలోనూ....ఇలా మరెన్నో విషయాలలోనూ, ఒకటిగానే వుండి
పోతాయి. సంస్కృతీ పరంగా, ఆచార వ్యవహారాల పరంగా, భాష మాట్లాడే యాస పరంగా, కొంత తేడా వుండే
అవకాశాలుండవచ్చు. ఆ మాటకొస్తే, అలనాటి ఉమ్మడి రాష్ట్రంలోను,
నేటి రెండు రాష్ట్రాలలోను వున్న ఇరవై మూడు జిల్లాలలో కూడా కొన్ని
తేడాలుండడం సహజం. ఒక జిల్లా మాండలికం మరో జిల్లాకు వుండకపోవచ్చు. భాష మాత్రం ఒకటే.
ఆ భాషే మానవతావాదానికి నిలువెత్తు నిదర్శనమైన తెలుగు భాష.
అతి ప్రాచీనకాలంనాటి నుంచి ఇప్పటికీ
వాడుకలో వుండి, వ్యావహారిక భాషగా, సాహిత్యంగా
ఉపయోగంలో వున్న వాటిలో తమిళం, తెలుగు భాషలను పేర్కొనాలి.
సంస్కృతం, లాటిన్ భాషల్లో సంభాషించు కోవడం దాదాపు లేనట్లే.
కొద్ది మార్పులతో గ్రీకు భాష ఇంకా వాడుకలో వుందనాలి. భారత రాజ్యాంగం గుర్తించిన
భాషల్లో తెలుగు ఒకటి. తెలుగు వారుంటున్న ప్రాంతంలోనే ఆది మానవుడు తొలుత
సంచరించాడని, దక్షిణా పథానున్న తూర్పు కోస్తా ప్రాంతంలో
తిరిగి, తర్వాత పంజాబుకు తరలిపోయాడని చరిత్రకారులంటారు.
రాతియుగం నాటి మానవుడు సంచరించిన ప్రీతిపాత్రమైన ప్రదేశంగా కూడా ఆంధ్ర ప్రాంతాన్ని
పేర్కొన్నారంటారు. తెలుగువారిప్పుడు నివసించని ప్రదేశమంటూ లేదు. భారతదేశంలోని
అన్ని రాష్ట్రాలతో పాటు, అమెరికాతో సహా ప్రపంచంలోని పలు
దేశాల్లో స్థిరనివాసం ఏర్పరచుకున్న తెలుగువారు ఎందరో వున్నారు. ముక్కోటి
ఆంధ్రులల్లా ఆరుకోట్లకెదిగి, ఎనిమిదికోట్లు దాటి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది కోట్లకు చేరుకున్నారని అందరికీ
తెలిసిందే. అమెరికా కాలిఫోర్నియా లోని సిలికాన్ వాలీనిప్పుడు ఆంధ్రా
వాలీగా-తెలుగువాడి వాలీగా పిలవాలి. ఇదిలా వుంటే, తెలుగువారుండే
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ పేర్లతో పిలిచే మూడు ప్రాంతాలున్నాయి. ఈ మూడు ప్రాంతాల్లో
భిన్నమైన యాసలో తెలుగు మాట్లాడే వారుకూడా వున్నారు. ఇప్పుడీ మూడు ప్రాంతాలు రెండు
రాష్ట్రాలుగా విడిపోయాయి. సీమాంధ్ర ప్రాంతాన్ని ఆంధ్ర ప్రదేశ్ గా, మిగతా ప్రాంతాన్ని తెలంగాణగా పిలుస్తారు ఇక నుంచి.
నవంబర్ 1, 1956న తెలుగువారుండే
ప్రాంతాలన్నీ కలపాలని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం నివేదిక ఆధారంగా విశాలాంధ్ర
ఏర్పాటయింది. తెలుగు వారందరూ కలిసుందామని అనుకున్నారో-లేదో తెలియదుగాని, కలిసుందామనుకున్న అలనాటి మద్రాస్ తెలుగువారు-తమిళులు మాత్రం విడిపోయారు. భాషాపరంగా
ఒకరిమీద పడ్డ ఇంకొకరి ప్రభావం అలానే చెక్కు చెదరకుండా వుంది. ఆంధ్ర ప్రదేశ్ లో
నివసించే ఏ ప్ర్రాంతం వారైనా మాట్లాడే భాషను "ఆంధ్రము" అని,
"తెనుగు" అని, "తెలుగు"
అని అంటాం. ప్రాచీనకాలంనాటి సంస్కృత రచనల్లో ఆంధ్రులను గురించి ప్రస్తావించాల్సి
వచ్చినప్పుడు "ఆంధ్ర" అనో, "అంధక" అనో
పేర్కొనేవారు. ఆ ప్రాంతంలో నివసించేవారిని ఒక తెగగానో, సమాజంగానో,
దేశీయులుగానో గుర్తించేందుకు బహుశా అలాంటి పదప్రయోగం చేసుండాలి.
భాషాపరమైన పదప్రయోగాలు చాలాకాలం తర్వాతే వాడబడ్డాయి. ఆంధ్ర ప్రాంతం గురించిన
ప్రస్తావన రామాయణంలోను, బౌద్ధాయనంలోను, మనుస్మృతిలోను, మత్స్యపురాణంలోను కనిపిస్తుంది.
దక్షిణ దిక్కును తెలిపే "తెన్" అనే ద్రావిడ పదం ఆధారంగా
"తెనుగు" ఉత్పన్నమైందని కొందరు భాషా కోవిదుల అభిప్రాయం. ద్రావిడులు
తెలుగుదేశానికి ఉత్తర దిక్కుగా నివసించారని తెలియచేసే ప్రయత్నంలోనే, దక్షిణాది వారు మాట్లాడే భాషను "తెనుగు" అని సూచించారు. కాకపోతే
శాస్త్రీయమైన సాక్ష్యాధారాలు ఆ సూచనకంతగా లభ్యంకాలేదు. "త్రి లింగ"
నుండి తెలుగు ఆవిర్భవించిందని అందరూ అనుకుండేదే. త్రి లింగ కూడా
"త్రి-కళింగ" నుండి వచ్చిందే. ఆంధ్రులను "మస్సాలియ" అని,
"మైసోలియ" అను గ్రీకులు సంబోధించేవారు. కృష్ణానదిని కూడా
వారు అలానే పిలిచేవారు "మసూలీపట్నం", "మచిలీపట్నం",
"బందర్" అన్న పేరుతో ఇప్పటికీ కృష్ణా జిల్లా ప్రధాన
కేంద్రాన్ని పిలుస్తాం.
విశ్వామిత్ర మహర్షి కోపానికి గురై, దేశ
బహిష్కృతులైన ఆయన ఏభైమంది కొడుకుల వారసులే ఆంధ్రులయ్యారని అయితరేయ బ్రాహ్మణంలో
చెప్పబడింది. వారందరు ఆర్యావర్తం సరిహద్దుల్లోకి, తూర్పు-దక్షిణ
ప్రాంతాల్లోకి వ్యాపించారు. ఆర్యులనీ, ద్రావిడులనీ వాడుకలో
వున్న పదాలు ఎందుకు ఉపయోగించారో ఇదమిద్ధంగా తెలియదు. ఒక తెగవారినో, భాష మాట్లాడేవారినో, సంస్కృతిని పాటించేవారినో
పరోక్షంగా ప్రస్తావించడానికి అలా వాడి వుండవచ్చు. లేదా గుర్తించడంలోనే పొరబడి
వుండవచ్చు. ఇదిలా వుండగా, ఆంధ్ర వాల్మీకి రామాయణంలో, తురకలపూర్వీకులైన ఇరానీయులు ఆర్య శబ్దంనుండి పుట్టినవారేనని రాయబడింది.
ఆర్యన్ కు వికృతి "అయిరాన్: అనీ, అదే ఇరాన్ గా మారిందనీ
చెప్పబడింది. మధ్య ప్రాంత ద్రావిడ జాతికి చెందిన గోండ్-భిల్లీ భాషలకు, తెలుగుకు అవినాభావ సంబంధముందని కొందరంటారు. ప్రాచీనకాలంలో ఆంధ్ర
రాజ్యానికి శ్రీకాకుళం రాజధానిగా వుండేదట. మతపరంగా అధ్యయనం చేసి, విశ్లేషణ చేసిన మరికొందరు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మౌర్యులకు పూర్వమే ఆంధ్ర ప్రాంతంలో జైనమతం ప్రచారంలో వుంది. అశోక
చక్రవర్తి కాలంలో వైభవంగా వర్ధిల్లిందని అనుకునే బౌద్ధమతం కంటే ముందే జైనమతాన్ని
అనుసరించినవారెందరో వున్నారు. క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దం-క్రీస్తు శకం ఆరవ
శతాబ్దం మధ్య కాలంలో ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధమత ప్రభావం ఎక్కువగా వుండేది. బౌద్ధమతం
బోధించిన సర్వ మానవ సిద్ధాంతం, మానవ విలువలు, ప్రజలమధ్యనున్న అంతరాలను తొలగించి, అన్నిజాతులవారిని-తెగలవారిని
కులమతాలకు అతీతంగా ఐకమత్యం చేసింది. అత్యంత బలీయమైన, శక్తివంతమైన
శాతవాహన రాజుల పాలన స్థాపనకు దారితీసింది.
దక్కన్ పీఠభూమినే దక్షిణాపథం అనేవారు. దానికి
ఆగ్నేయ దిక్కుగా ఆంధ్ర ప్రాంతముంది. వింధ్య పర్వతాలను దాటి దక్షిణ ప్రాంతానికి
తొలుత వలస వచ్చిన ఆర్యుడు అగస్త్య మహాముని అంటారు. శివలింగాన్ని మొదట కనుగొన్నది
ఆయనేననీ, అందువల్లనే ఆంధ్రలోని ఎన్నో శివాలయాలలో వున్న శివలింగాలను అగస్త్యేశ్వరం
అనికూడా పిలుస్తారని అంటారు. ఆపస్తంబ ధర్మ సూత్రాల ప్రకారం, క్రీస్తుపూర్వం
ఐదవ శతాబ్దంలో, ఆంధ్ర ప్రాంతంలో వైదిక మతం
వేళ్లూనుకోసాగింది. భగవత్-భాగవత మతం కూడా ప్రచారంలోకి వచ్చింది. శ్రీకృష్ణుడి
బోధనలను తెలియచేస్తూ, క్రమేపీ వైష్ణవ మతంగా రూపాంతరము
చెందిందే భాగవత సిద్ధాంతం. సాంఖ్య-యోగ ఆధారంగా భాగవతమతం వుందని భావించినప్పటికీ,
దాంట్లో తాత్త్విక చింతనకు సంబంధించిన పలు అంశాలు నిగూఢంగా వున్నాయి
వాస్తవానికి. కులాలకు అతీతంగా, అన్ని కులాలవారు పాటించే
మతంగా భాగవతం మొదట్లో ప్రచారంలో వున్నప్పటికీ, బ్రాహ్మణుల
జోక్యంతో, బ్రాహ్మణ్యం ఆవిర్భవించడంతో, భాగవత మతం, బ్రాహ్మణ్యం కలిసిపోయాయి. కులాల
గుర్తింపు మొదలయింది. ఆంధ్ర ప్రాంతంలో అతిపురాతనమైంది, ఎక్కువమంది
అనుసరించేది శైవమతం. దాని ప్రభావం కూడా ఎక్కువే. అలానే శాక్తేయ మతాన్ని కొందరు
అనుసరించేవారు. వీరశైవం వున్నా దాని ప్రభావం అంతగా లేదనవచ్చునేమో. బ్రాహ్మణుల
మూలాన భాగవతమతం వారి చేతుల్లోకి పోయినప్పటికీ, బ్రాహ్మణుడి
కర్తవ్యం సాధారణంగా వైదిక పూజలు జరిపించడానికే గాని, కులాధిక్యతకు
ప్రతిరూపం కావడం మాత్రం కాదనాలి.
ఆంధ్రుల మతపరమైన నమ్మకాలు-సంప్రదాయాలు
తెలుగు భాషమీద, అదేవిధంగా తెలుగు భాష మతపరమైన చారిత్రాకాంశాలమీద
ప్రభావం చూపించి వుండాలి. రాజుల-చక్రవర్తుల ప్రోత్సాహంతో, స్వయంగా
వాళ్లే ఒక మతాన్ని నమ్మి అనుసరించడంతో, దాని ప్రభావం జన
బాహుళ్యం పైనా, వారి జీవన శైలి పైనా, మానవ
విలువల పైనా స్పష్టంగా పడసాగింది. పర్యవసానంగా వైదిక మతం మనిషి జీవించడానికి
తగినటువంటి ఆదర్శమైన జీవనవిధానంగా, ఎవరికైనా ఆ సిద్ధాంతాలు
పాటించడం తేలికైనటువంటిదిగా, అందరికీ అందుబాటులోకి రావడం
జరిగింది. అదే హిందు మతంగా వాడుకలోకొచ్చింది. బహుశా ఎన్నో మతాలకు మాతృకయింది.
ప్రపంచ భాషలకు సంస్కృతం ఎలానో, ప్రపంచంలోని మతాలన్నిటికీ
హిందు మతం అలానే మాతృకనాలి. అందుకేనేమో మార్క్స్ తన గతి తార్కిక భౌతికవాదంలో ఎన్నో
సందర్భాల్లో పరోక్షంగా వైదిక సిద్ధాంతాలను అన్వయించుకుంటాడు. చార్వాకుల ప్రస్తావనా
తీసుకొస్తాడు.
కృతయుగంలో కూడా "ఆంధ్రము" అనే
విషయానికి సంబంధించిన ప్రస్తావన వుంది. అగ్నిమిత్ర అనే ఒక రాజుండేవాడు. ఒక
వేసవికాలంలో ఎండల తీవ్రతకు ఆయనకు దృష్టి లోపం వచ్చి, కళ్లు కనిపించలేదు.
సూర్య భగవానుడిని ప్రార్థించాడట. అగ్నిమిత్రకు ఆయన ప్రత్యక్షమై, తనను కొలిచేందుకు ఒక కొత్త భాషను నేర్పాడంటారు. సూర్యుడిని అగ్నిమిత్ర అదే
భాషలో ప్రార్థించడంతో, ఆ భాషకున్న పదజాల ప్రభావంతో, అగ్నిమిత్రకు పోయిన దృష్టి తిరిగొచ్చింది. సంస్కృతంలో "అంధ"
అంటే "గుడ్డి" అని-చీకటి అని అర్థమొస్తుంది. చీకటిని తొలగించి, గుడ్డి తనాన్ని పోగొట్టగలిగింది కాబట్టి ఆయన నేర్చుకున్న భాషకు
"ఆంధ్ర భాష" అని పేరొచ్చింది. ఒక్కో యుగంలో ఒక్కోరకంగా తెలుగు భాష
వాడుకలో వుందని కొందరి నమ్మకం. ఈ నమ్మకం ఆధారంగా కలియుగంలో తెలుగును "కళింగ
ఆంధ్ర భాష" అనీ, "రౌద్ర ఆంధ్ర భాష" అనీ
ఏర్పాటుచేసింది శాతకర్ణులకు చెందిన నంది వర్ధనుడు-ఆయన శిష్యుడు దేవల రాయ అని
అంటారు. ఆంధ్ర భాషకు రావణాసురుడు వ్యాకరణం రాశాడంటారు. ఆ రాసిన రావణుడు, రామాయణంలో పేర్కొన్న రావణుడే కావాలని లేదు-కాకూడదనీ లేదు. ఆంధ్ర దేశానికి,
సింహళ దేశానికి మధ్య మతపరమైన అవినాభావ సంబంధాలున్నందున, తెలుగు భాషకు ఆ దేశానికి చెందిన ఒకవ్యక్తి వ్యాకరణం రాశాడంటే నమ్మ దగ్గ
విషయంగానే భావించాలి. ఈ నమ్మకాల్లో, గాథల్లో, మౌఖికంగా ప్రచారంలో వున్న వాటిల్లో, కొంతలో కొంత
వాస్తవం వుందనేది మాత్రం వాస్తవమే. భాషకున్న వ్యాకరణ నిర్మాణం-నిబంధనలు-మౌలికమైన
పదజాల ఒరవడిని పరిగణలోకి తీసుకొని, తెలుగు భాషను అతి
ప్రాచీనమైన ద్రావిడ జాతి భాషలకు చెందినదిగా శాస్త్రవేత్తలు-పరిశోధకులు-భాషా
కోవిదులు-పండితులు నిర్ణయించారు. మధ్య ప్రాంత ద్రావిడ జాతి భాషల్లో బహుశా తెలుగు
ఒక్కటే అతిపెద్ద వాడుక భాషగానూ, భౌగోళికంగా ప్రత్యేకమైన
గుర్తింపు పొందిన భాషగానూ, ఉత్తర-దక్షిణాల మధ్య వారధిగా
వుండే భాషగానూ, ఆర్యుల-ద్రావిడుల మధ్య వారధిగా వుండే భాషగానూ
పేర్కొనడం అతిశయోక్తికాదేమో.
పింగళి లక్ష్మీకాంతం గారు చెప్పినదాని
ప్రకారం, భాషాపరంగా, తెలుగు భాషారంభం-అభివృద్ధి నన్నయకు
పూర్వం-క్రీస్తు శకం మూడవ శతాబ్దంలో మొదలై, ఆధునిక కాలం నాటి
క్రీస్తుపూర్వం 1875 వరకు, ఆ తర్వాత కొనసాగింది-కొనసాగుతూనే
వుంది. ప్రాచీనకాలంలో నాటి తెలుగు నాలుగు దశల్లో అభివృద్ధి చెందిందనవచ్చు. అవి:
తెలుగుకు పూర్వం నెలకొన్న దశ, గ్రాంథిక తెలుగుకు పూర్వం
నెలకొన్న దశ, గ్రాంథిక తెలుగు దశ, సాహిత్య
దశలుగా విభజించవచ్చు. తెలుగుకు పూర్వపు దశ అంటే క్రీస్తుశకం 200 వరకే సాగిందనాలి.
క్రీస్తుశకం 200-600 మధ్యకాలం వరకు గ్రాంథిక తెలుగుకు పూర్వ దశ కొనసాగింది. గ్రాంథిక
దశ-వివిధ రకాల వాడుక శైలి దశ క్రీస్తుశకం 600-900 మధ్య కాలానికి చెందింది. దీని
ఆధారంగా, తెలుగు భాష దక్షిణాది ద్రావిడ భాషల్లోంచి
ఉద్భవించిందేననీ, ఒక ప్రత్యేకమైన భాషగా క్రీస్తుపూర్వం ఎన్నో
శతాబ్దాల క్రితంనుండే వాడుకలో వుందనీ, బల్ల గుద్ది మరీ
చెప్పొచ్చు. "సాలంకాయనులుల" శాసనాల ఆధారంగా, అతి
పురాతనమైన తెలుగు లిపి "వెంగి"-"తెలుగు కన్నడ" లభ్యమయిందని
తెలుస్తోంది. ద్రావిడ భాషకు చెందినదే అయినప్పటికీ, తెలుగుపై
సంస్కృత భాష ప్రభావం అధికంగా వుంది. వాడుకభాషపైనా, గ్రాంథిక
భాషపైనా కూడ ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అచ్చ తెలుగులో రచనలు చేసినవారు
అరుదనాలి. అందుకే మనందరికీ కవిత్రయం నన్నయ-తిక్కన-ఎర్రా ప్రగడ అయితే, శ్రీ శ్రీ గారి కవిత్రయం మాత్రం తిక్కన-వేమన-గురజాడలు. తెలుగు భాషపై
సంస్కృతం ప్రభావం పడకుండా అభిమానం చూపిన మొదటి వాడు తిక్కన అని శ్రీ శ్రీ
అభిప్రాయం. ఇక ఆధునిక కాలంలో తెలుగు భాష వాడకంలో-ఉపయోగంలో హద్దులనేవి గాని,
ఎల్లలనేవి గాని అసలు లేనేలేవు. ఒక వైపు సంస్కృతం ప్రభావం ఇంకా
తెలుగు మీద పడుతున్నప్పటికీ, ఎక్కువ ప్రభావం ఆంగ్ల భాషదే
అనాలి. నాగరికులందరూ ప్రస్తుతం మాట్లాడుతుండే తెలుగును "తెంగ్లీష్"
అనాలి-ఎందుకంటే, అది ప్రధానంగా తెలుగు-ఇంగ్లీషులు కలిపిన భాష
కాబట్టి. తమిళం అంతే. ఇంగ్లీష్ పదజాలం లేకుండా ఈ రోజుల్లో బహుశా ఏ భాషా లేదేమో.
"వేర్ సెంచరీస్ కో ఎగ్జిస్ట్" అనే భారత ఆంగ్ల సినిమాను రూపొందించిన
కృష్ణస్వామి "ఇంగ్లీష్ భారతీయ భాషనీ-దక్షిణ భారతీయ భాషనీ" అంటాడు.
ఇలాంటి మహోన్నతమైన తెలుగు భాష మాట్లాడే
రాష్ట్రాలు ఇప్పుడు రెండయ్యాయి. భాష ఒకటైనా మాట్లాడేది వేర్వేరు రాష్ట్రాలలో!
ఏడుపుగొట్టు వెధవలు విడిపొయినందుకు చాలా, చాలా ఆనందంగా వుంది. ఇన్నాళ్ళు అబద్దాలు, విషం, విద్వెషాలా మధ్య మనం సాధించిందంత అప్పనంగా సాని దాని అండ చూసుకొని దోచుకున్నారు తెలబాన్లు. కాని ఆంద్రులకున్న ఏకైక ఆస్తి వాళ్ళ శ్రమ, కష్ట పడే తత్త్వం, సాహసం, ఇప్పుడు ఎవరూ భయపడడం లేదు. విద్యుత్, నీళ్ళు, ఆంధ్రుల శ్రమతొ నిర్మించిన హైదరబాద్ దోచుకున్నా తెలబాన్లలొ ఇంకా అభద్రతా భావం ఎందుకు? వాళ్ళకు భయం, అందుకే వాళ్ళకు అలవాటైయిన ఏడుపు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. అసూయ, ద్వెషాలతొ రగిలిపోతున్నారు. ఒకటి మాత్రం నిజం, తెలబాన్లు పాకిస్తాన్లా తయరవుతారు, వాళ్ళకి ఆంధ్రుల మీద ద్వెషం లేకపోతే మన లేరు
ReplyDeleteఅద్భుతంగా వుంది చరిత్ర పై మీ పునశ్చరణం. కాని మీ మొదటి పంక్తులతో నేను
ReplyDeleteఎకీభవించలేకపోతున్నాను. తెలుగు మహా మహుల విగ్రహాలను నేల కూల్చారు. తెలుగు తల్లికి సమాంతరంగా మరొక పేరు కల్పించారు. ఇపుడు భాషను వేరు చేయాలని ఉవిళ్ళూరుతున్నారు...ఎల అంటారా..తెలుగు వర్ణమాలలో వారి మండలీకంలో లేని అక్షరాలను తొలగించి క్రొత భాష నిర్మిస్తారట. భాగ్యనగరంలో బ్రతుకుదెరువుకొచ్చినవారిని, ఏండ్ల తరబడి మమేకమైనవారిని ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారో. గమ్మత్తేమిటంటే అక్కడి ప్రజలు దీనిపై ఎటువంటి నిరసనా తెలుపకపోవడం. అన్నివిధాలుగా విడగొట్టటనికి ఇంకా ఎన్ని మార్గాలు ఎంచుకుంటారో.