Saturday, July 11, 2015

నమస్కారం మన సంస్కారం (ధర్మప్రవృత్తి)


నమస్కారం మన సంస్కారం

(ధర్మప్రవృత్తి)

సంధ్యావందనమునకు చివర తన పాదములను భూమికి తాకి, నక్షత్రములకు, సూర్యునకు, బ్రాహ్మణులకు నమస్కారము చేయవలయును. తన గోత్రనామములను చెప్పి తండ్రికి, తల్లికి, జ్ఞానప్రదునకు, శ్రోత్రియునకు నమస్కారము చేయవలయును. తనకంటె మూడు సంవత్సరముల వయస్సు అధికముగలవారందరికి నమస్కారము చేయవలయును. తనకంటె చిన్నవారైనను, మేనమామకు, పినతండ్రికి నమస్కారము చేయవలయును. వృద్ధుడైనను కుటిలునకు నమస్కారము చేయగూడదు. తాను అపరిశుద్ధుడైయుండియు నడుచుచు, కుశలనుగాని, సమిధలనుగాని, పుష్పములనుగాని, జలపాత్రనుగాని ధరించియుండియు, ఇతరులకు నమస్కారము చేయగూడదు. రజస్వలకు, పతితునకు, శఠునకు, కృతఘ్నునకున్నూ, నమస్కరించినయడల యుపవాసము చేయవలయును. కుమారుడు, శిష్యుడు, దౌహిత్రుడు, అల్లుడు, ఈ నలుగురుకాక మిగతవారు తనకంటె చిన్నవారైనను నమస్కరించవలయును. వేదమును పదక్రములతో సహా చదివి అరణ్యకముతో సహా బ్రాహ్మణమును (పరాయతమును) చదివినవాడు చిన్నవాడైనను నమస్కరించతగినవాడు. అనగా తాను వేదము చదువనివాడైనపుడు తనకంటె చిన్నవానికైనను వేదము చదివినవానికి నమస్కారము చేయవలయును. ఉభయులు వేదమును చదివినయడల మూడు సంవత్సరములు పెద్దవానికి చిన్నవాడు నమస్కారము చేయవలయును. ఉభయులు శాస్త్రవేత్తలైనప్పుడు ఐదు సంవత్సరములు పెద్దవానికి చిన్నవాడు నమస్కారము చేయవలయును. ఉభయులు చదువురానివారైనపుడు యేక గ్రామస్తులలో పది సంవత్సరములు యెక్కువయున్నయడల చిన్నవాడు నమస్కారము చేయవలయును. తన బంధువులలో చదువురానివారుభయులలోను యెంతమాత్రమైనను వయస్సు అధికముగలవానికి తక్కువవాడు నమస్కారము చేయవలయును అని గ్రంథాంతరమందున్నది. కక్కువానికి, ఆవలించువారికి, దంతధావనమాచరించువానికి, తలంటుకున్నవానికి, స్నానముచేయువానికి, దూరమందున్నవానికి, జలమధ్యనున్నవానికి, నడుచువానికి, ధనాంధునకు, ఉన్మత్తునకు, చెవిటివానికి, మూగవానికి, గ్రుడ్డివానికి, సమిత్సుష్పకుశాదులను ధరించినవానికి, మృత్తికను, అన్నమును, అక్షతలను ధరించినవానికి, జపమును, హోమమును చేయుచున్నవానికి నమస్కారము చేయగూడదు. తాను జలమందున్నపుడును, శ్రాద్ధమందును, మలమూత్రములను, సూతకమందును, దానసమయమందును, రాజసన్నిధియందును, భోజనసమయమందును, దేవతార్చనసమయమందును, జపహోమసంధ్యాకాలములందును, మధూకరమందును, దిగంబరసమయమందును, ఇతరులకు నమస్కారము చేయగూడదు.


Wednesday, July 8, 2015

Godavari Pushkaralu-The Spiritual Fragrances: Vanam Jwala Narasimha Rao

Godavari Pushkaralu:The Spiritual Fragrances
Vanam Jwala Narasimha Rao

(TS Govt Sets Stage to Spread 

The Spiritual Fragrance of Pushkaralu)

The New Indian Express

13-07-2015

As Jupiter enters the zodiac sign Leo, the much-awaited Godavari Pushkaralu 2015 begins on July 14. With a view to celebrate them on a grand scale, in a way never observed before, Telangana government has made elaborate arrangements in all aspects to make them a grand success. Jupiter will be in one zodiac sign or other every year. But when he enters and joins Pushkarudu, River Godavari gets Pushkaralu. Similarly, Pushkaralu are also performed for different rivers in the country, in different years. These rivers are: Ganges, Reva, Saraswathi, Yamuna, Krishna, Kaveri, Bheemarathi, Brahmaputra, Tungabhadra, Sindh and Praneeta. It is believed that during the Pushkaralu to a particular river, all the 33 crores Hindu gods and goddesses will come and take a holy dip in that river. The Pushkaralu occur once in every 12 years and Godavari Pushkaralu was last celebrated in the year 2003. This year’s, Pushkaralu are referred as Maha kumbhamela as this category occur once in every 144 years.

Godavari is the biggest and largest river in Southern India and is often quoted as Dakshin Ganga. Mythology says that Sage Maharishi Gowthama brought the Ganges down to earth after several years’ rigorous meditation and Godavari was branched out of it. River Godavari originated at Nasik Trayambak and travels for 136 kilometers in Maharashtra. Later it enters Telangana state at Kandakurthi in Nizamabad district. It passes through Nizamabad, Karimnagar, Adilabad, Warangal, and Khammam districts at places Basara, Dharmapuri, Kaleswaram, Eturu Nagaram and Bhadrachalam before entering into East and West Godavari districts in AP and then joins Sea at Antarvedi.


Pushkaralu for any river are basically an elaborate religious and pious program spread over 12 days dating back to the age-old traditions and customs. It is a faith among the people that Pushkarudu will cast a spell on the river during these 12 days Pushkaralu, and hence taking a holy dip during the period is considered virtuous and spiritually beneficial. It is also believed that those who take a dip during Pushkaralu will be benefited with longevity, wealth and prosperity. During the Pushkaralu period, people also perform rituals for those dead who were close to the family including friends. This is precisely the reason why, like in Kumbha Mela for the holy Ganges, for Godavari River also Lakhs of people visit to take a holy dip.  The Telangana State government has taken this as a prestigious program and wanted to organize it in a big way. Government is not considering it as an official program but wants to provide every facility that is required to the pilgrims as its committed responsibility. In addition to providing facilities the Government also is taking care of every aspect of law and order issues. 

During the previous Pushkaralu in the year 2003, the then Government of Andhra Pradesh, with a view to gain political benefit in the forthcoming elections that were due in 2004, created a hype and concentrated on publicity gimmicks. Contrary to that the present TRS Government in a focused manner, evinced keen interest in providing facilities rather on publicity. The government has grabbed this opportunity to start religious and cultural tourism. Chief Minister K Chandrasekhar Rao had instructed the officials concerned to ensure facilities at all the bath Ghats, renovate temples to enable pilgrims to conveniently have an easy and comfortable Darshan. The state government also made all arrangements for Lakhs of devotees that are expected to come from all parts of the country, neighboring states like Maharashtra and Chhattisgarh, and even from abroad. Excellent transport facilities, connecting routes were arranged for the easy mobility of people and to have smooth and hassle free visit. A massive publicity campaign is devised to attract all Telangana people residing in other places like Mumbai, Bhivandi, Sholapoor, Surat and other towns to come to Telangana and take a holy dip in the river Godavari during the Pushkaralu. Enough of awareness has been created on Pushkaralu in northern part of India also. Non Resident Indians in several countries are expected to visit Telangana State for a holy dip. Additional facilities have been provided by the Government in places like Basara, Dharmapuri, Kaleswaram, Kandakurti, Bhadrachalam etc. where people are expected to come in larger numbers than others. Women and children will be ensured special care and protection. Regulation of pilgrims rush will be taken care of. Medical facilities are also provided.

Realising the importance and the need for arrangements on a large scale, the Chief Minister initiated action almost a year ago itself. Review meetings were held on a regular basis in regular intervals. A cabinet sub-committee has been constituted to oversee the arrangements and creation of facilities. Accordingly, all facilities for the devotees coming from various places are taken care by the Telangana government. Basic infrastructure amenities like improvement of flood banks, bund beautification, widening roads, improving bathing Ghats, development of parking areas, sanitation, toilets, drinking water facilities, temporary accommodation, first aid etc are being created.  The state government will organize the Godavari Pushkaralu in 5 districts namely Adilabad, Nizamabad, Karimnagar, Khammam, and Warangal districts. A total of 106 Pushkar Ghats are constructed along the river Godavari in these five districts at all the holy temple towns namely, Basara, Dharmapuri, Kaleswaram, Bhadrachalam, as well as at places where Godavari flows like Kandakurti, Pochampadu, Manchiryal, Goodem, Ramannagudem, and Parnasala.

Chief Minister Chandrasekhar Rao, who himself has a deep knowledge and understanding about the rituals, methods and practices to be observed during Pushkaralu, had instructed officials to be in touch with the Peetaadhipathis, spiritual leaders, Swamis, Hindu preachers and seek their blessings and advice from time to time. Advisor to Government K V Ramanachary, Spiritual Guru to the CM, Mritunjaya Sarma, Yayavaram Chandrasekhara Siddhanti, 90 year old Palakurthi Nrusimha Siddhanthi and others as a team met them and extended invitation for Pushkaralu. The Peethadhipathis include among others Kanchi, Srungeri, Pushpagiri, Mantralayam, Kurtalam and Vijayadurga. In addition they also extended invitation to Swaroopananda Swamy, Gurumadananda Swamy, China Jeer Swamy, Dharmapuri Sachindanda Swamy, and a host of other Seers. Almost all of them agreed in principle to participate in Pushkaralu. China Jeeyar Swamy offered to visit Bhadrachalam on the first day to have a holy dip in the Godavari river there. Later he would spend five days at Manchiryal and would perform Pushkaralu related rituals and yagnas-Yagasbesides addressing pilgrims with a holy discourse.   Guru Madananda Swamy will be at Basara on the first day and later for the rest of twelve days tour different places in Telangana. Rest of the Peethadhipathis will go to other places and temples there. End



Sunday, July 5, 2015

సంస్కారం లేని సామాజిక శాస్త్రవేత్త:వనం జ్వాలా నరసింహారావు

సంస్కారం లేని సామాజిక శాస్త్రవేత్త
వనం జ్వాలా నరసింహారావు
(ఒక సామాజిక వేత్త అర్థ రాహిత్యం-ఆంధ్రజ్యోతి 7-7-2015)
          రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గవర్నర్‌కు, రాష్ట్రపతికి పాదాభివందనం చేయడాన్ని వక్రీకరించి భాష్యం చెప్పిన సామాజిక శాస్త్రవేత్త కంచ ఐలయ్యకు ఇలా రాయడం (ఆంధ్రజ్యోతి-ఎడిట్ పేజి 05-07-2015), మాట్లాడడం కొత్తేమీ కాదు. తన వ్యాసాలలో, పుస్తకాలలో అను నిత్యం బ్రాహ్మణ్యాన్ని, బ్రాహ్మణులను "బాపనోడు" అనే పదాలతో కించపరిచే వ్యాఖ్యలు చేయడం, అది తప్పని చెప్పిన వారితో వాగ్వాదానికి దిగడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. హిందూ మతాన్ని అదే పనిగా అర్థం పర్థం లేని వ్యాఖ్యలతో విమర్శించడం కూడా ఆయనకు నిత్య కృత్యం.

మొన్న రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చినప్పుడు, హకీం పేట విమానాశ్రయంలో ఆయన విమానం దిగిన తరువాత, రాష్ట్రపతికి స్వాగతం పలికే క్రమంలో, ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చిన వెంటనే, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తలవంచి ప్రణబ్ ముఖర్జీకి పాదాభివందనం చేశారు. వెంటనే రాష్ట్రపతి ఆయనను భుజం తట్టి ఆశీర్వదించారు. ఆ తర్వాత చేతులు జోడించి ముఖ్యమంత్రి రాష్ట్రపతికి నమస్కారం చేసారు. ఇదే రీతిలో కొన్నాళ్ల క్రితం మరో  సందర్భంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు యాదగిరిగుట్టలో చినజీయర్ స్వామి సమక్షంలో ముఖ్యమంత్రి పాదాభివందనం చేశారు. వీటిని ఒక విడ్డూరంగా, ఇదేదో బ్రాహ్మణ్యాన్ని మాత్రమే గౌరవించినట్లు చిత్రీకరించడం కొందరు మేధావుల కుసంస్కారానికి నిదర్శనం. నమస్కారం చేసేటప్పుడు కానీ, పాదాభివందనం చేసేటప్పుడు కానీ, ఎవరికైతే అలా చేస్తున్నామో, ఆ వ్యక్తి బ్రాహ్మణుడా, బ్రాహ్మణేతరుడా అని ఎవరూ చూడరు. నమస్కారానికి అర్హుడా? కాదా? అనేదే చూస్తారు. పాదాభివందనం చేసే విషయంలో  ఆర్హత విషయాన్ని మరింత లోతుగా ఆలోచించడం, బేరీజు వేయడం సమంజసం.

          పాదాభివందనం చేయడం అనేది ఎదుటి వ్యక్తుల వయస్సు, జ్ఞానం, పెద్దరికం, దైవత్వాలకు ఇచ్చే గౌరవం. వారి నిస్వార్థపూరిత ప్రేమ, సమాజం కోసం చేసే త్యాగాలకు గుర్తుగా ఈ పాదాభివందనాన్ని చేస్తాం. ఇలా పాదాభివందనాలను నిత్యం కానీ, లేదా ముఖ్యమైన కొన్ని సందర్భాలలో చేయడం కానీ భారతీయ సంస్కృతి-సంప్రదాయం. ఇలా భక్తితో తలవంచి వారి పాదాలకు నమస్కరించినప్పుడు అనుకూల శక్తి రూపంలో వారి నుంచి మంచి కోరికలు, ఆశీర్వాదాలు అందుకుంటున్నట్లు భావించాలి. కుటుంబంలో, సమాజంలో ప్రజల మధ్య సామరస్యాన్ని, పరస్పర ప్రేమ, గౌరవాలతో కూడిన వాతావరణాన్ని ఈ సంప్రదాయం సృష్టించగలదని గుర్తించాలి. జ్ఞాన వృద్ధులైన వారి పాదాలకు చేసే నమస్కారమే పాదాభివందనం. వయస్సుచే కాని, విద్యచేత కాని అధికు లైనవారికి ఎదురుగా వెళ్లి నమస్కరిస్తే, వారికి ఆయువు, విద్య, కీర్తి, బలం, వృద్ధి లభిస్తాయని మను ధర్మశాస్త్రంలో ఉంది. ఇవన్నీ పక్కన పెట్టి మొత్తం వ్యవహారాన్ని బ్రాహ్మణ్యంతో, బ్రాహ్మణ కులంతో ముడిపెట్టి విమర్శలు చేయడం తగని పని.

          సామాజిక శాస్త్రవేత్తగా-విశ్లేషకుడిగా, విద్యాధికుడిగా పేరున్న కంచ ఐలయ్య దృష్టిలో, ఆయన ఆలోచనా ధోరణికి వ్యతిరేకంగా వున్న ప్రతి చిన్నా-పెద్దా విషయం తప్పుగానే కనిపిస్తుంది. ఆయన తన పుస్తకాలలో, వ్యాసాలలో బ్రాహ్మణులను హిందూ మతాన్ని కించపరిచి రాసినట్లే, ఆయన కులాన్ని కాని, ఇతర కులాల వారిని కాని బ్రాహ్మణులు కాని మరెవరైనా కాని విమర్శిస్తే ఆయన వూరుకుంటాడా? తమ పేర్ల పక్కన కులాలను తగిలించుకుని తిరుగుతున్న ఈ రోజుల్లో బ్రాహ్మణుల ఆచార వ్యవహారానికి సంబంధించిన జంధ్యం వేసుకుని పవిత్ర పుణ్య క్షేత్రంలో కనిపించిన గవర్నర్‌ను పరుష పదజాలంతో విమర్శించిన ఆయన్నేమనాలి? ఒక్క బ్రాహ్మణులే కాదు....చాలామంది ఇతర కులస్తులు కూడా దేవుడి గుళ్లోకి వెళ్లేటప్పుడు వంటిపై నున్న అంగీ విప్పి వేయడం అనాదిగా వస్తున్న ఆచారం. జంధ్యం వేసుకునే వారిలో కొందరు బ్రాహ్మణేతరులు కూడా వుంటారనే విషయం ఆ మేధావికి తెలియదా? పబ్లిక్‌గా బట్టలు లేకుండా శరీరం పైభాగాన్ని చూపిస్తూ కులవృత్తులు చేసుకుంటున్న వారెందరు మనకు మన పల్లెల్లో కనిపించరు? వారందరూ ప్రదర్శించని కులాన్ని ఒక్క గవర్నరే ప్రదర్శించారా?

            "1947లో భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చాక మొట్ట మొదటిసారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర గవర్నర్, రాష్ట్రపతి కాళ్లను పబ్లిక్‌గా మొక్కగా మనం చూస్తున్న మహత్తర ఘట్టం" అనడం కూడా వాస్తవం కాదు. బ్రాహ్మణేతరుడైన సత్య సాయిబాబాకు దేశ విదేశ ప్రముఖులెందరో పాదాభివందనం చేశారు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తిగత వ్యవహారం కాదని మరో విమర్శ చేశారు ఐలయ్య. అలాగే ఆయన అన్నట్లు, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్న సమస్య అంతకంటే కాదు. ఆత్మవంచన-విశ్వాసాలను ప్రదర్శించడం కూడా కాదు. సభ్యతకు, సంస్కారానికి, ఆచార వ్యవహారానికి, అనాదిగా వస్తున్న నమ్మకానికి, మీదుమిక్కిలి సాంప్రదాయానికి అసలు సిసలైన నిదర్శనం. పెద్దలకు పాదాభివందనం చేయడం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ఆ పదవిలోకి రావడానికి ముందునుంచే అలవాటుందనే విషయం ఆ సామాజిక శాస్త్రవేత్త వ్యాసంలోనే వుంది. కాకపోతే, ఆయన అప్పట్లో పాదాభివందనం చేసిన జయశంకర్ బీసీ అనే విషయం చంద్రశేఖర్ రావుకు తెలియదని చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. బహుశా ఈ రాష్ట్రంలో బ్రాహ్మణులెవరో, బ్రాహ్మణేతరులెవరో ఒక్క ఆ సామాజిక శాస్త్రవేత్తకు తప్ప మరెవరికీ తెలియదేమో! ఆ సామాజిక శాస్త్రవేత్త కుసంస్కారానికి మరో నిదర్శనం, చిన్నతనం నుంచే ఆయనకు పెద్దలకు నమస్కరించాలన్న కనీస అవగాహన కూడా లేకపోవడం. కర్మకాండలు చేయించడానికి పనికొచ్చిన బ్రాహ్మణుడు, కాళ్లు మొక్కడానికి పనికిరాడా? అప్పటినుంచే బ్రాహ్మణత్వంపై తన తిరుగుబాటు మొదలైంది అనడం కన్నా, ఆ విధంగా తన మూర్ఖత్వం, ఇతరులను కించపరచాలన్న భావన మొదలైంది అనడం సబబేమో! హిందూత్వం అనేది మతం అయినా-కాకపోయినా, మనిషి జీవించడానికి తగినటువంటి ఆదర్శమైన జీవనవిధానం అనే సంగతి కంచ ఐలయ్య గుర్తుచేసుకుంటే మంచిదేమో!

అహర్నిశలూ కంచ ఐలయ్య లాంటి వారి నుంచి విమర్శలనెదుర్కునే బ్రాహ్మణుల విషయానికొస్తే, ఒక నాడు సమాజాన్ని ఐక్యంగా వుంచడానికి తమ శాయశక్తులా కృషిచేసిన బ్రాహ్మణులను ఈ రోజుల్లో ప్రతి దానికీ టార్గెట్ చేస్తున్నారు కొందరు.  హైందవ మతంలో, ఆచారంలో, బ్రాహ్మణులు కూడా ఒక భాగం. ఇతర కులాల వారు, వర్ణాల వారూ చేయలేని అనేక పనులను, వైదిక కర్మ కాండలను చేయగల సామర్థ్యం కేవలం ఒక్క బ్రాహ్మణులకే నేటికీ వుందనడంలో అతిశయోక్తి లేదు. పూజారులుగా, అర్చకులుగా, వేద పండితులుగా, కర్మకాండలు నిర్వహించే వారిగా, సంబంధిత కార్యక్రమాల నిర్వాహకులుగా కొనసాగే విషయంలో వారికి ఇప్పటికీ పెద్ద నష్టం జరగలేదు. వివాహాలలో, అంత్యక్రియలలో, ఇతర పూజా పునస్కారాలలో వారు లేకుండా వ్యవహారం నడవడం కష్టమే ఇప్పటికీ. రాజకీయంగా కాని, సామాజికంగా కాని, ఆర్థికంగా కాని ఎదుగుదలకు నోచుకోలేక, బీదరికంలోకి అడుగు పెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది చాలామందికి. దీనికి తోడు, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా అనుదినం చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా వారిని కడు ఇబ్బందులకు గురి చేయసాగింది. బ్రాహ్మణ వ్యతిరేకత చివరకు కులాల వ్యతిరేకతకు దారితీసింది. ఒక కులం వారు, మరో కులాన్ని దూషించే పరిస్థితులొచ్చాయి. అగ్ర కులాలని, వెనుకబడిన కులాలని, దళితులని బేధాలొచ్చాయి. బ్రాహ్మణ ద్వేషం బాగా ప్రబలిపోయింది. చివరకు జరిగిందేంటి? ఆర్థికంగా బ్రాహ్మణులు బాగా చితికి పోయారు. వ్యవసాయం మీద, భూమి మీద ఆధారపడిన బ్రాహ్మణులు, చట్టాల పుణ్యమా అని ఆ రకమైన ఉపాధిని కోల్పోయారు. ఒక నాటి పౌరోహిత్యం, పూజారి జీవితం, ఆయుర్వేద వైద్యం బ్రాహ్మణుల బ్రతుకు తెరువుగా కొనసాగడం కష్టమై పోయింది. వీటికి ఒకనాడు లభించిన గౌరవ మర్యాదలు కూడా కరవై పోయాయి. గత కొన్ని దశాబ్దాలుగా, భారత ప్రభుత్వ రిజర్వేషన్ చట్టాల మూలంగా, కనీ వినీ ఎరుగని కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎప్పుడో, వేల ఏళ్ల క్రితం, అప్పటి బ్రాహ్మణులు ఏదో చేశారన్న నెపంతో, ఈ తరం బ్రాహ్మణులను ఇలా ఇబ్బందులకు గురి చేయడం భావ్యమా? దోపిడీ చేసిన వారు, దోపిడీకి గురైన వారు అంతరించి పోయారు. ఇప్పుడున్నది సమ సమాజం. అందరూ భారత రాజ్యాంగ కింద సమాన హక్కులు కలవారే అంటున్నాం. అలాంటప్పుడు, సమాజంలోని ఒక వర్గం వారిని బ్రాహ్మణులన్న కారణాన చిన్న చూపు చూడడం సమంజసమా? ప్రత్యేక హక్కులు కావాలని వారనడం లేదు. అడగడమూ లేదు. తమను అందరితో సమానంగా చూడమనే అడుగుతున్నారు. ఆర్థికంగా చితికి పోయిన తాము కూడా వెనుకబడిన వర్గాల వారిమే అంటున్నారు. అందరితో పాటు వారినీ సమానంగా చూడడం సమాజం కర్తవ్యం!


          ఇక "కులం" అంటే ఏమిటో చూద్దాం. జాతులు పెరుగుతూ తరుగుతూ వస్తున్నప్పటికీ, వర్ణాలు మాత్రం నాలుగు గానే వుండిపోయాయి. ఏదేమైనప్పటికీ, చాతుర్వర్ణ వ్యవస్థను ఎవరు-ఎప్పుడు సృష్టించినప్పటికీ, అది ఎలా రూపాంతరం చెందినప్పటికీ, ఒక విషయం మాత్రం వాస్తవం. అది ఒక సామాజిక అవసరాన్ని, బాధ్యతను నిర్వహించింది. అందువల్ల ఎవరు కూడా తాము ఫలానా కులంలో పుట్టామని బాధ పడాల్సిన అవసరం లేదు. గర్వ పడాల్సిన అవసరమూ లేదు. ఒక కులంలో పుట్టినందుకు వేరే కులం వారిని తక్కువగా కాని, ఎక్కువగా కాని చూడాల్సిన అవసరమూ లేదు. బ్రాహ్మణుల విషయానికొస్తే, వారు సమాజంలో దైవ చింతనను పెంచాలని, సమాజ హితం కోరే "పురోహితులు” గా వుండాలనీ, ఒకనాటి వ్యవస్థ నిర్దేశించింది. సమాజం వారికి అప్పగించిన బాధ్యతను చాలా కాలంపాటు, బ్రాహ్మణులు సక్రమంగా నిర్వహించారు కూడా. కాలానుగుణంగా, సమాజంలో వచ్చే మార్పులకు అనుగుణంగా, బ్రాహ్మణులు కూడా మార్పులకు లోనుకాక తప్పలేదు. ఒకటి మాత్రం వాస్తవం. బ్రాహ్మణులు కులవ్యవస్థకు కారకులు కాదు. వారు కుల వ్యవస్థను పెంచి పోషించిందీ లేదు. సమాజం అవసరాల నేపధ్యంలో అదే సమాజం సృష్టించుకున్నవే ఇవన్నీ. తమ పని తాము చేసుకుని పోతున్న బ్రాహ్మణులను, తమ బ్రతుకేదో తాము బ్రతుకుతున్న బ్రాహ్మణులను చీటికి-మాటికీ వేలెత్తి చూపుతూ, వారేదో తప్పు చేశారని చరిత్ర వక్రీకరించి మాట్లాడడం ఎంతవరకు సబబు? ముఖ్యమంత్రి పాదాభివందనం చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ నరసింహన్ బ్రాహ్మణులు కావడం వల్లనే అలా జరిగినట్లుగా, వాళ్లు బ్రాహ్మణులు కావడం తప్పైనట్లుగా ఐలయ్య రాయడం   అన్నింటికన్నా పెద్ద తప్పు. End

Wednesday, July 1, 2015

ఆకుపచ్చని తెలంగాణ దిశగా.. వనం జ్వాలా నరసింహారావు

ఆకుపచ్చని తెలంగాణ దిశగా..
వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ (02-07-2015)

            బంగారు తెలంగాణ స్వప్నం సాకార దిశగా మరో కీలకమైన అడుగు వేయడానికి ప్రభుత్వం సకల సన్నాహాలు చేసింది. కార్యాచరణకు రంగం తయారైంది. "తెలంగాణాకు హరిత హారం" అనే  పేరుతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రూపకల్పన చేసిన మరో ప్రజా యజ్ఞం, ప్రజలే కేంద్రంగా అమలు కానున్న చెట్లు నాటే బృహత్తర కార్యక్రమం, జులై నెల మూడున (3-7-2015 న) లాంఛనంగా ప్రారంభం కానుంది. తెలంగాణను ఓ హరిత హారంగా, ఓ ఆకుపచ్చ తోరణంగా మలిచే దిశగా  ముఖ్యమంత్రి సరిగ్గా ఏడాది క్రితం ఈ పథకానికి ఆలోచన చేశారు. ఈ సంవత్సర కాలంగా తన ఆలోచన కార్యరూపం దాల్చడానికి ఎన్నో రీతులుగా ప్రణాళికలు రూపొందించుకుంటూ వస్తున్నారు. తెలంగాణ అంటే బీడు నేల కారాదని,   పచ్చదనం కరువైన పీఠభూమి అనే అపప్రథ తొలగిపోవాలని ముఖ్యమంత్రి కోరిక. ఒకనాడు దట్టమైన అడవులు వున్న తెలంగాణలో ప్రస్తుతం వాటి విస్తీర్ణం తగ్గిపోతూ వస్తోంది. పచ్చదనంతో కళకళ లాడే రీతిలో అటవీ భూముల  విస్తీర్ణం పెంచడం, పర్యావరణ సమతుల్యం కాపాడడం అనే ద్విముఖ లక్ష్యాలు హరిత హారంలో వున్నాయి. కృష్ణా, గోదావరి వంటి  జీవ నదులు తెలంగాణలో పారుతున్నప్పటికీ, ఈ ప్రాంత రైతులు ఇంకా వర్షాధార పంటలపైనే ఆధారపడుతున్నారు. అందుకే ఇక్కడ వర్షపాతం పెరగాలి. అది పెరగాలంటే చెట్ల పెంపకం ఒక్కటే తరుణోపాయం.  కోతులు అడవుల్లోకి వాపస్ పోవాలన్నా, వానలు వాపస్ రావాలన్నా చెట్ల పెంపకం ఒక్కటే సరైన మార్గం.

అందుకే ఈ విషయంలో దృష్టి సారించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హరిత హారం పధకానికి రూపకల్పన చేశారు. ఆయన స్వయంగా రూపొందించిన పధకాల్లో ఇది చాలా ముఖ్యమైంది. తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో చెట్ల శాతాన్ని24  నుంచి 33 శాతానికి పెంచడం ఈ పధకం ప్రధాన లక్ష్యం.  ఇందులో భాగంగా వచ్చే మూడేళ్లలో  230 కోట్ల మొక్కలు తెలంగాణ భూభాగంలో అదనంగా నాటాలనేది ఈ బృహత్తర కార్యక్రమ లక్ష్యం. ఇందులో హైదరాబాదు నగర అభివృద్ధి సంస్థ పరిధిలో 10 కోట్ల మొక్కలు నాటడంతో సహా, అటవీ యేతర భూముల్లో   130 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం పెట్టుకుంది ప్రభుత్వం. ఇదిగాక అటవీ భూముల్లో మరో వంద కోట్ల మొక్కలు నాటి అడవులను మరింత సుసంపన్నం చేయడం కూడా ఈ ప్రణాళికలో భాగం. తెలంగాణలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 40 లక్షల మొక్కల చొప్పున ప్రతి ఏటా 40 కోట్ల మొక్కలు నాటుతారు. సంకల్ప బలం వున్న ముఖ్యమంత్రి కాబట్టి కేవలం తన మదిలో ఆలోచన చెప్పి వూరుకోలేదు. ఆ ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి రాష్ట్రం మొత్తం పంపిణీకి అవసరం అయ్యే మొక్కల్ని వర్షాకాలాని కంటే ముందుగానే సిద్ధం చేయించి వుంచారు. అడవుల్లో పెంచడానికి అనువైన అటవీ పండ్ల మొక్కల్ని కూడా సిద్ధం చేయించి పెట్టారు. వాటిల్లో వైద్యానికి అవసరం అయ్యే ఔషధ మొక్కలు కూడా వున్నాయి. ఈ మొత్తం పధకాన్ని ప్రజల భాగస్వామ్యంతో అమలు చేయడం ముఖ్యమంత్రి ఉద్దేశ్యం. "హరితం, శివం, సుందరం" అనే సరికొత్త నినాదాన్ని ప్రజా ఉద్యమంగా మలిచారు ముఖ్యమంత్రి. ఈ బృహత్తర హరిత హారం పధకాన్ని రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోణం లోను, హైదరాబాదు నగరాన్ని విశ్వ నగరంగా తయారు చేసే ఉద్దేశ్యంలో భాగంగాను రూపొందించారు. నగర శోభను ద్విగుణీకృతం చేయడం ఈ పథకం ప్రత్యేకత. 


పాత పద్ధతిలో కాకుండా సింగపూర్ తరహాలో ఒక పథకం ప్రకారం మొత్తం రాష్ట్రాన్ని హరిత వనంగా మార్చే వినూత్న రీతిలో రూపకల్పన జరిగింది. మొక్కలు పెరిగింతర్వాత, వాటి పరిసరాల్లో నడిచే పౌరులకు  తామొక దట్టమైన ఆకు పచ్చని అడవిలో సంచరిస్తున్నా మన్న భావన కలిగేలా మొక్కల పెంపకం జరగాలన్నది ముఖ్యమంత్రి అభిప్రాయం. ఒక్క జనవాసాలే కాకుండా, నదులు, వాగులు, వంకలు చెరువు కట్టలు ఇలా ఎక్కడ చూసినా పచ్చటి చెట్లు కనబడేలా చేయడం ఈ హరిత హారం పథకంలోని నూతనత్వం. అలాగే,  విద్యాసంస్థలు,  పారిశ్రామిక వాటికలు,  విశ్వవిద్యాలయాలు  మొదలయిన అన్ని ప్రదేశాల్లో హరిత హారం మొక్కలు పచ్చ-పచ్చగా కనిపించేలా చేయడం మరో ప్రత్యేకత. మొక్కలు పెంచడం అంటే ఏదో మొక్కుబడిగా చేసే ఓ ప్రభుత్వ కార్యక్రమం కాకూడదని, దీర్ఘకాలిక లక్ష్యాలతో అమలు చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ భావజాలానికి అనుగుణంగా ఈ హరిత హారం రూపుదిద్దుకుంది.

అందుకే ముఖ్యమంత్రి, దీన్ని కేవలం ఒక సవాలుగానే మాత్రం కాకుండా ఓ దీర్ఘకాలిక యజ్ఞంలా కొనసాగించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఎప్పటికప్పుడు ఈ పధకం రూపకల్పన, అమలు తీరు గురించి పదే పదే సమీక్షా సమావేశాలు జరపడం ఆయన ఆసక్తికి నిదర్శనం. మంత్రులతోను, మొక్కల పెంపకంతో సంబంధం వున్న అన్ని శాఖల అధికారులతోను, అటవీ శాఖ కింది స్థాయి సిబ్బందితోను, ఈ సమావేశాలు జరిగిన తీరు గమనించిన వారికి హరిత హారం పట్ల ముఖ్యమంత్రికి వున్న పట్టుదల అర్ధం అవుతుంది. ఏ ఒక్క చిన్న సమస్య ఎదురుకాకుండా ఈ పధకం సాఫీగా అమలు జరగడానికి వీలుగా అయన  అతి కింద స్థాయి అధికారులతో కూడా మాట్లాడుతూ వారికి తగు సలహాలు  సూచనలు ఇస్తూ ప్రోత్స హిస్తూ వస్తున్నారు. జిల్లా కలెక్టర్లతోను, పోలీస్ సూపరింటెండెంట్ల తోను, అటవీ శాఖ రేంజర్లతోను, డివిజనల్ ఫారెస్ట్ అధికారులతోను, కన్సర్వేటర్లతోను, సమావేశాలు జరిపిన ముఖ్యమంత్రి, పథకం అమలులో వారికి ఎదురు కానున్న సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కార మార్గాలను సూచించారు. ఇటీవల జరిగిన ఒక సమీక్షా సమావేశంలో ఓ అటవీ అధికారి, కొందరు కలప వర్తకులు, ఇతర భూకబ్జా దారులు, అటవీ ప్రాంతాన్ని ఆక్రమించిన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వెంటనే స్పందించి  అలాంటి వారితో కఠినంగా వ్యవహరించే అధికారులకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని భరోసా ఇచ్చారు. అవసరమైన సందర్భాలలో అటవీ శాఖ సిబ్బంది తమ విధులను నిర్భయంగా నిర్వహించేందుకు వీలుగా సాయుధ పోలీసు రక్షణ సహితం కల్పిస్తామని కూడా హామీ ఇవ్వడం విశేషం. అటవీ భూముల సరిహద్దులను నిర్ధారించేందుకు జిల్లా కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు జరపాలని సూచించారు.  

అలాగే మరో సమావేశంలో  హరిత హారం మరింత విస్తృత పరిచి, మంచి ఫలితాలను సాధించడానికి వీలుగా, నాటే మొక్కల సంఖ్యను 320 కోట్లకు పెంచాలని సూచించారు. వచ్చే ఏడాది నుంచి 60-70 కోట్ల మొక్కలకు పెంచుతూ పోవాలన్నారు. ఏటా జులై నెల మొదటి వారం లేదా రెండో వారాన్ని హరిత హారం వారంగా పరిగణించి మొక్కలు నాటాలని చెప్పారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉద్బోధించారు. తాజాగా మరో సమీక్షా సమావేశం జరిగింది. జిల్లాల కలెక్టర్లు, జిల్లా పోలీసు అధికారులు, అటవీశాఖ అధికారులు హాజరయ్యారు. హరిత హారం కార్యక్రమం పట్ల దేశ వ్యాప్తంగా ఆసక్తి వెళ్ళి విరుస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణలో మాదిరిగా ఇటువంటి కార్యక్రమం ముందెన్నడూ ఎవ్వరూ తలపెట్టిన సందర్భం దేశంలో మరెక్కడా లేదని పలువురు చెబుతున్నారని అన్నారు. దీన్ని ప్రజా ఉద్యమంగా తయారు చేసి మరిన్ని సత్ఫలితాలను సాధించి చూపాలన్నారు. మొక్కల పెంపకం విషయంలో పోలీసు అధికారులు చూపుతున్న శ్రద్ధను ఆయన ప్రత్యేకించి ప్రస్తావించారు. హరిత హారం అనేది కేవలం అటవీ శాఖకు మాత్రమే సంబంధించిన వ్యవహారంగా చూడకూడదనీ ఇది ప్రజలందరి పథకం అనీ కేసీఆర్ అన్నారు. జాతీయ రహదారుల పక్కనా, రాష్ట్రంలోని ప్రధాన రహదారుల పక్కనా కూడా మొక్కలు నాటాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

ఈ నేపధ్యంలో, హరిత హారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 39 కోట్ల 60 లక్షల మొక్కలు ఇప్పటికే సిద్ధం చేసింది. జిల్లాల వారీగా, అసెంబ్లీ నియోజక వర్గాల వారీగానే కాకుండా, గ్రామ స్థాయిలోను పంపిణీ చేయడానికి మొక్కలు సిద్ధంగా వున్నాయి. ఎక్కడెక్కడ మొక్కలు నాటాలో ఆ ప్రదేశాలను గుర్తించడం జరిగింది కూడా. హరిత హారం పధకంలో ఔటర్ రింగు రోడ్డు కూడా పచ్చని చెట్లతో హరితవర్ణం ధరించే రోజులు దగ్గర లోనే వున్నాయి. ఇందుకోసం అవసరం అయ్యే నిధులు శాఖలవారీగా విడుదల చేయడం విశేషం.  NREGA నిధులు, అటవీ శాఖ నిధులు, పారిశ్రామిక, మునిసిపాలిటీ శాఖల నిధులు, ఇతర రకాల నిధులు పథకానికి ఉపయోగించనుంది ప్రభుత్వం. గ్రామ  స్థాయిలో ఈ పధకం అమలు కోసం "గ్రామ పంచాయత్ హరిత రక్షణ కమిటీలు" ఏర్పాటయ్యాయి. గ్రామ సర్పంచ్ అధ్యక్షతన పనిచేసే ఈ కమిటీలో సభ్యులుగా ఎంపీటీసీ, పంచాయత్ కార్యదర్శి, ఎస్‍హెచ్‍జీ నాయకుడు, ఏ‍ఎన్‍ఎం, అంగన్ వాడీ వర్కర్ ఇతరులు వుంటారు. హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుపోవడం తో సహా, నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత, ప్రజలను కార్యక్రమంలో భాగస్వాములను చేయడం ఈ కమిటీ ద్వారా జరుగుతుంది.  ఈ పధకం ప్రచారంకోసం, ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లడం కోసం ఆకర్షణీయమైన లఘు చిత్రాలను  తయారు చేసి టీవీల్లో ప్రదర్శిస్తున్నారు. రేడియో శ్రోతలకోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు రూపొందించారు. ఇక పోస్టర్లు, కరపత్రాలతో హరిత హారం ప్రచారం జోరుగా సాగుతోంది. సాంస్కృతిక సారధి బృందాలు తమ కళాకారులతో చక్కటి ప్రదర్శనలు ఇస్తున్నాయి. ఈ పధకానికి మద్దతు కోరుతూ, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో, మిలిటరీ  అధికారులతో సమావేశాలు జరిగాయి. హరిత హారం డైరెక్టరీలు ముద్రించి సిద్ధంగా పెట్టారు. జిల్లాల వారిగా, నియోజకవర్గాల వారీగా మొక్కల వివరాలను, లభ్యమయ్యే ప్రదేశాలను ఈ   డైరెక్టరీల్లో ముద్రించారు. వీటిని ప్రజాప్రతినిధులకు, గ్రామ పంచాయతీలకు పంపారు. సవివరమైన మార్గదర్శిక సూత్రాలను తయారు చేసి జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ద్వారా అన్ని సంబంధిత  ప్రభుత్వ విభాగాలకు బట్వాడా చేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి అధికారి పాత్రను ఈ మార్గదర్శిక సూత్రాలలో పొందుపరిచారు.

రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వారీగా హరిత హారం పధకం పర్యవేక్షణ కోసం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక ప్రత్యేక అధికారిని నియమించింది ప్రభుత్వం.


తెలంగాణకు హరిత హారం లాంటి భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చూస్తుంటే, అప్పుడెప్పుడో, చైనాలో ఇలాంటి తరహాలోనే చెట్ల పెంపకం జరిగిన విషయం గుర్తుకొస్తుంది. "గ్రీన్ గ్రేట్ వాల్" గా పిలువబడిన ఆ కార్యక్రమం కన్నా కూడా, బహుశా తెలంగాణకు హరిత హారం కార్యక్రమాన్నే, రాబోయే రోజుల్లో యావత్ భారత దేశం, ఆ మాటకొస్తే ప్రపంచం కూడా, ఒక అత్యుత్తమ పర్యావరణ పరిరక్షణ పథకంగా గుర్తిస్తారనడం అతిశయోక్తి కాదేమో! End

Limits to Media:Vanam Jwala Narasimha Rao

Limits to Media
Vanam Jwala Narasimha Rao
A recent write-up in a English weekly Outlook, obviously in an abusive, cheap and slanderous language, on a woman IAS Officer working in Telangana Chief Minister’s Office is a negative shift in the concerns and priorities of media. In the process the larger endeavors of the State are sidelined. Against the background of such attempts, it requires a nationwide debate on “Should not there be limits to Media”? Or, in the alternate, should there be some watchdog role for an independent civil society and professional group to limit media? The basic premise is that such issues should be debated from a larger perspective of constitutional, moral, ethical and legal provisions.
If there is one notable achievement of independent India, which can be described as the greatest, it is the ‘Indian Democracy’. No doubt that, Indian Press has played a glorious part in this process of maintenance of Indian Democracy in the phase of great provocations and temptations. However, in later days, the media scene has undergone not only dramatic change but also traumatic change.  Its reach has gone up. Its coverage techniques have undergone dramatic changes. Its crossing limits too have gone up multifold. Media in a democracy has enormous power and responsibility. But, Power without responsibility can never do well for the democratic system. 

The concept of limits like a Laxmanrekha implies that there is need for certain equilibrium between relationships and responsibilities of various pillars of democracy within the provisions of the Constitution. Laxmanrekha also implies operating not only with certain responsibility and accountability but also with certain concerns for the consequences of what is being done or not done today, on the larger values to do with freedom, objectivity, equity and ethics. It involves both legal and ethical dimensions. Most elected democracies in the world have one or other restraint on the operations of media even when they are relatively free from the Government’s interference. In India a free and independent media is inherent in the freedom of speech and even guaranteed by the Constitution. It assumes that media is fair, free and responsible and operates under certain checks and balances, a hall mark of Indian Constitution.  It is expected that media observes certain standards of objectivity, responsibility and responsiveness inherent in the concept of Fourth Estate.  The media itself is expected to maintain its own code of conduct and philosophy of self-restraint in such a way that dignity and privacy of individuals are in no way adversely affected.
As observed by a Former Chief Justice, freedom without responsibility denigrates into license. The very role the media plays as a disseminator of news, educator of the public and creator of public opinion imposes onerous duties of a high order. High ethical standards the media must adhere to.  Truthfulness in the reporting of news and objectivity in the presentation of facts without any bias are some of the minimum ethical standards expected of the media. New definition, new news values and new priorities dictate media today. It is in this context that the question of limits to media arises. It is against this background that Laxmanrekha becomes relevant. Laxmanrekha is to be drawn by the press, not by the government-not by the Parliament.  It could be through few good and eminent journalists. 
It is high time there is a national debate.  A Laxmanrekha, however, should not mean curbing or curtailing freedom of press or that of any Constitutional guarantees or enhancing power of government or its agencies. But if an independent body could help promote responsibility, standards of behavior and self-discipline, it deserves to be considered. When the society at large and the three pillars of democracy have been, time and again pointing out, that, the media by and large has been crossing the boundaries on many occasions, it is time for everyone in the media to think of this and correct themselves rather than somebody else doing it.
Undeniably, no fora can function unless it is able to establish and achieve a balance between its rights and privileges on the one hand and its duties and obligations on the other. Print media is an extremely important limb in a democracy – rightly termed as the fourth limb of democracy. While the freedom of press can by no means be under-estimated, the journalists and everyone associated with the media must also appreciate that, liberty is not a license. Every right has a corresponding duty and a sacred obligation to the society. The media has no special power or immunities. It enjoys the same privileges and constitutional rights that are available to citizens. However, it must be noted that, these provisions do not envisage unbridled right to free speech and expression.
Finally the question is who should regulate? Who should put this regulation? Who should take the responsibility? Is it the working journalists, the managements, the government or an independent organization or somebody else?  Should the situation be allowed to drift further? Or should we think of some corrective measures. Do we agree for a government regulation?
It is high time that an organization-governmental or non-governmental or semi governmental or working journalists’ organization or a combination of more than one- with high reputation and unbiased track record is identified and entrusted with the responsibility to define, design and implement the limits to media. Together they may identify news by a methodology of periodical review, which crossed the limits and make them public and expose. This may create awareness in both the reader and contributor.
Against this background such writings of extremely disturbing and mischievous nature that the Outlook magazine published on the women IAS officer are to be condemned. End