Friday, October 6, 2017

“సమాచారహక్కు” పై వీడని అనుమానాలు : వనం జ్వాలా నరసింహారావు

“సమాచారహక్కు” పై వీడని అనుమానాలు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (06-10-2017)

        పౌరులకు అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వ శాఖల ద్వారా పొందేందుకు ఉద్దేశించిన 2005 సమాచారహక్కు చట్టం నిబంధనలకు అనుగుణంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాచార హక్కు కమీషన్ ను ఏర్పాటుచేసి, ప్రధాన సమాచార కమీషనర్ తో సహా ఒక సమాచార కమీషనర్ ను కూడా నియమించింది. గవర్నర్ వీరితో పదవీ ప్రమాణ స్వీకారం కూడా చేయించారు. సమాచారం పొందే హక్కు కావాలని కోరుకునే ఎంతోమంది తెలంగాణ ప్రజల అభీష్టంతో పాటు రాజ్యాంగబద్ధమైన ఒక బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వం నేరవేర్చినట్లయింది. న్యాయస్థానాలను ఆశ్రయించిన సమాచారహక్కు ఉద్యమ సామాజిక కార్యకర్తలు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానించారు. ఇక ముందుంది...ప్రజలు, సామాజిక కార్యకర్తలు ఈ చట్టాన్ని ఎంతమేరకు ఉపయోగించుకుంటారానే విషయమే! ఇతర ప్రభుత్వ చట్టాల మాదిరి కాకుండా, సమాచారహక్కు చట్టం విజయవంతం కావాలంటే, అది ప్రజల మీదే ఆధారపడి వుంటుంది. ప్రజలను ఎంత గొప్పగా చైతన్యపరిస్తే, అంత గొప్పగా ఈ చట్టం అమలయ్యే వీలుంది. చట్టాన్ని సద్వినియోగం చేసుకుని సమాచారం పొందడానికి పౌరుల్లో చైతన్యం తీసుకుని రావడమెలా అని సామాజిక కార్యకర్తలు ఆలోచన చేయాలి.

         సమాచారహక్కు చట్టం ఆవిర్భావం, దాని పూర్వాపరాలు, అవసరం, పరిణామక్రమం నెమరేసుకుంటే, దాని మూలాలు, అలనాటి ఎన్డీయే ప్రభుత్వం కాలం రోజుల్లో, ఆ మాటకొస్తే, ఇందర్ కుమార్ గుజ్రాల్ ప్రధానమంత్రిగా వున్నా రోజుల్లో వున్నా విషయం మదిలో మెదలుతాయి. ఎన్డీయే ప్రభుత్వం సమాచార స్వేచ్ఛ చట్టం తెచ్చినప్పటికీ, దాని విధి-విధానాలను రూపొందించడంలో వైఫల్యం చెందడంతో, ఆ తరువాత అధికారంలోకొచ్చిన యూపీఏ ప్రభుత్వ సారధి, ప్రధాని మన్మోహన్ సింగ్ జూన్ 21, 2005 న సమాచారహక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. వాస్తవానికి, అంతకు ఒక వారం కిందే, అలనాటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చట్టానికి రాజముద్ర వేసినప్పటికీ, రాష్ట్రపతికీ, ప్రదానికీ మధ్య చోటుచేసుకునే “సమాచార మార్పిడి” బహిర్గతం చేయడం సరైందికాదని బాహాటంగా ప్రకటించారు. అంతటితో ఆగకుండా, ప్రభుత్వాధికారులు ఫైళ్ళ మీద రాసే వ్యాఖ్యలు కూడా రహస్యంగా వుమ్చాలనీ, అలా చేయకపోతే, నిర్ణయాధికార ప్రక్రియ ఇబ్బందులకు గురైతుందనీ అన్నారు. కాకపొతే, పౌరులకు సమాచారహక్కు చట్టం సాధికారతను సమకూరుస్తుందనీ, తమ విషయంలో ప్రభుత్వం తప్పుచేస్తున్నదన్న భావన ఈ చట్టం తొలగిస్తుందనీ ఆయన వ్యాఖ్యానించారు. ఏదేమైనప్పటికీ ప్రపంచంలో ఎక్కడాలేని రీతిలో మన సమాచారహక్కు చట్టం రూపొందించబడడం గొప్ప విషయమే!

         భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లు నిండుతున్న సందర్భంగా, 1997 సంవత్సరం మే నెలలో, అప్పటి ప్రధాని ఐకే గుజ్రాల్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశంలో వారంతా అంగీకరించిన “నవ సూత్ర ప్రణాళిక”, ఒక విధంగా చెప్పుకోవాలంటే, సమాచారహక్కు చట్టానికి అసలైన నాంది-ప్రస్తావన అనాలి. స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లు గడిచినా, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై ప్రజలకు నమ్మకం కుదరలేదనీ, వారి నమ్మకం పూర్తిగా ఒమ్ము కాకముందే, పారదర్శకతతో, బాధ్యతాయుతంగా, జవాబుదారీగా, పౌరులకు స్నేహ హస్తం అందించే రీతిలో ప్రభుత్వాలు పనిచేయడానికి ఆ నవసూత్ర కార్యాచరణ పథకాన్ని పార్టీలకతీతంగా ముఖ్యమంత్రుల సమావేశం అంగీకరించింది. ఆ తీర్మానానికి అనుగుణంగా సమాచార స్వేచ్ఛ హక్కు చట్టం రూపొందించాలనీ, అది విజయవంతం కావాలంటే, ప్రతి ప్రభుత్వ శాఖలో సిటిజెన్ చార్టర్లు తయారు చేసి అమలు చేయాలనీ, పోరా సేవా-సమాచార కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలనీ నిర్ణయించడం జరిగింది. దురదృష్టవశాత్తూ వీటిలో చాలా వరకు కాగితం మీదే మిగిలి పోయాయి. దరిమిలా వచ్చిందే సమాచారహక్కు చట్టం. ఇది ఆబాలగోపాలం ప్రజల్లో అనేక ఆశలు కలిగించింది. ప్రజాస్వామ్యంలో పౌరుడికి, తాను కావాలనుకునే ప్రభుత్వ సంబంధమైన సమాచారం లభించడం, ఆ సమాచారం పారదర్శకంగా వుండడం సహచట్టం రావడానికి ప్రధాన కారణం.  


         అసలింతకూ ఈ సమాచారం అంటే ఏమిటి? ప్రభుత్వ శాఖలకు (పబ్లిక్ అథారిటీగా చట్టం పేర్కొంది) సంబంధించిన రికార్డులు, డాక్యుమెంట్లు, మెమోలు, ఈమెయిల్లు, వ్యాఖ్యలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్లు, ఉత్తర్వులు, లాగ్ పుస్తకాలు, ఒడంబడికలు, నివేదికలు, పత్రాలు, అన్నిరకాల డాటా మొదలైనవన్నీ సమాచారం కిందికే వస్తాయి. ప్రభుత్వం నుంచి తగుమోతాదులో ఆర్ధిక సహాయం పొందుతున్న ప్రభుత్వ-ప్రభుత్వేతర వ్యవస్థ కాని, సంస్థ కానీ, పబ్లిక్ అథారిటీగా చట్టం నిర్ణయించింది. వీటికి సంబంధించిన సంపూర్ణ సమాచారం పౌరులకు అందుబాటులో, సులభంగా పొందేందుకు వీలుగా, బహిర్గతం చేయాలి. ప్రతి పబ్లిక్ అథారిటీ పౌరులు కోరిన సమాచారాన్ని ఇచ్చేందుకు పౌర సమాచార అధికారులను వారి-వారి శాఖల్లో కిందినుంచి పైదాకా నియమించాలి. వీరి దగ్గరనుంచి అడిగిన సమాచారం నిర్ణీత గడువులోగా లభించకపోతే, సమాచార కమీషన్ ను ఆశ్రయించడానికి పౌరులకు హక్కుంది. సమాచార కమీషనర్ విచారణ జరిపి సంబంధిత అధికారిమీద తగు విధంగా చర్య తీసుకోవచ్చు.

         తెలంగాణ రాష్ట్రంతో సహా చాలా రాష్ట్రాలు, కేంద్రం సమాచార కమీషన్లను ఏర్పాటుచేసినప్పటికీ, చట్టం అమలుకు సంబంధించి వీడని అనుమానాలెన్నో వున్నాయి. చట్టంలో చెప్పిన విధంగా పౌరులకు సమాచారహక్కును కలిగించే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు ఏమేరకుందో ఆచరణలో ఇంకా తేలలేదనే అనాలి. ప్రతి పబ్లిక్ అథారిటీ తన సంస్థకు సంబంధించిన రికార్డులన్నింటినీ కేటలాగ్-ఇండెక్స్ చేసి, కంప్యూటర్లోకి ఎక్కించి, అన్ని రకాలుగా, అన్నిచోట్ల పౌరులకు దేశవ్యాప్తంగా ఎక్కడైనా లభించే విధంగా నెట్వర్క్ కు అనుసంధానం చేయాలి. తన సంస్థకు సంబంధించి అమలుపరుస్తున్న కార్యక్రమాలు, నిర్వహిస్తున్న విధులు, ఉద్యోగుల అధికారాలు, వారి బాధ్యతలు, నిర్ణయాలు తీసుకునే విధానం, పర్యవేక్షణ-జవాబుదారీ వివరాలు, జీత-భత్యాల వివరాలు, బడ్జెట్ కేటాయింపులు, సంస్థ ఇస్తున్న రాయితీలు-పర్మిట్లు తదితర వివరాలన్నీ బహిర్గతం చేయాలి. సంబంధిత పబ్లిక్ అథారిటీ పౌరులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు కల్పించిన సౌకర్యాల గురించి, పనివేళల వివరాలు, సంస్థలో నియమించిన పౌరసమాచార అధికారుల వివరాలు బాహాటంగా ప్రకటించాలని చట్టం చెపుతున్నది. ఎన్ని ప్రభుత్వ శాఖలు వీటిని అమ్నలు చేశాయనేది జవాబు దొరకని ప్రశ్నగానే మిగిలి పోయింది.

         చట్టంలో చెప్పబడిన మరో ప్రధానమైన అంశం “తగు మోతాదులో ప్రభుత్వ నిధులు” పొందుతున్న ఏ సంస్థ అయినా పబ్లిక్ అథారిటీగానే పరిగణించాలని. అయితే ఈ మోతాదు ఎంత అనేది నిర్వచనం సరిగ్గాలేదు. రెండవ పరిపాలనా సంస్కరణల సంఘం చేసిన సూచనల్లో కొంత స్పష్టత వచ్చినా పూర్తిగా అవగతం కాలేదు. సాధారణంగా ప్రభుత్వ శాఖ చేసే ఎలాంటి పనైనా ప్రభుత్వ నిధులతో ఏదేని ప్రభుత్వేతర సంస్థ చేస్తుంటే అది పబ్లిక్ అథారిటీగా పరిగణించాలని ఆ సంఘం సూచించింది. ఈ అస్పష్టత కారణాన చాలా ఎన్జీవోలు సమాచారహక్కు చట్టం కింద రాకుండా జాగ్రత్తపడుతున్నాయి.

         అలాగే బహిర్గతం చేయకూడని సమాచారాన్ని అడిగిన పౌరులకు ఇవ్వడానికి పబ్లిక్ అథారిటీ తిరస్కరించవచ్చని, చట్టపరిధిలో ఇవ్వగలిగే సమాచారాన్ని మాత్రమే పొందే హక్కు పౌరులకు వుందని అనడమంటే లక్ష్మణరేఖ గీసినట్లే అనుకోవాలి. దీన్ని తొలగించే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేసిన దాఖలాలు లేవు. 

         కొన్ని చర్యలు చేపట్టడం ద్వారా చట్టం అమలులో మరింత కొత్తదనం తీసుకునిరావచ్చు. అసలు పౌరుల అవసరాలేంటో అధ్యయనం చేయాలి, విశ్లేషణ చేయాలి. పౌరుల సమాచార అవసరాలకు అనుగుణంగా పబ్లిక్ అథారిటీలు స్పందించాలి.

         వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని, అనుభవజ్ఞులను సమాచార కమీషనర్లుగా ఎంపికచేయడం చాలా క్లిష్టమైన వ్యవహారం. రాజకీయ వాసన లేకుండా ఎలాంటి పనీ జరగని మన దేశంలో, వివిధ రాష్ట్రాలలో, సమాచార కమీషనర్ల పదవికి రాజకీయాలకు అతీతులైన వ్యక్తులు దొరుకుతారా? అయితే తెలంగాణతో సహా కొన్ని రాష్ట్రాల్లో ఇది సాధ్యమైంది కనుక చట్టం చెప్పినట్లు జరిగే అవకాశాలుండవచ్చు. అలాగే ప్రతి పబ్లిక్ అథారిటీకి కావాల్సిన సమర్థులైన, యోగ్యులైన, పౌర సమాచార అధికారులు దొరికే విషయంలో కూడా కొంత ఇబ్బంది కలగవచ్చు.


         ఇవన్నీ ఇలా వుంటే పౌరులు కోరుకునేది ఆసక్తికరంగా వుంది. తమని గౌరవంగా, మర్యాదగా చూడాలనీ; ప్రభుత్వ కార్యకలాపాలు సులభతరం చేయాలనీ, తగిన సమయంలో నమ్మకమైన సహాయం అందించాలనీ; తమ గొంతు వినాలనీ; తమ మాట పరిగణలోకి తీసుకోవాలనీ; నియమ-నిబంధనలకన్నా సహాయం చేయడమే తమకు కావాలనీ వారంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం సమాచారహక్కు చట్టం ద్వారా ఈ దిశగా ముందుకు పోతుందని ఆశిద్దాం.

Wednesday, October 4, 2017

Is doing business a social smuggling? : Vanam Jwala Narasimha Rao

Vanam Jwala Narasimha Rao
The Hans India (05-10-2017)

Recently, a self-styled and so-called social scientist brought out a small booklet depicting Vaishya Community as the social smugglers (Illegal hoarders and transporters). For obvious reasons, the whole Vaishya community in one voice, in both the Telugu States took serious objections over it. Swamijis like Paripoornananda too have openly came out in support of Vaishyas on this issue and have clearly stated that the issues raised in the book are aimed at belittling and insulting the Hindu society at large. For all those who viewed the electronic media debates in which the author participated as well as those who read his articles in the print media have realised that the writer willfully tries to divert the debate. It goes without saying that the author has miserably failed to substantiate his vicious and malicious propaganda which had no basis at all! The writer could not defend his arguments in a scientific and logical manner but tried to raise matters, which are irrelevant and far from truth. This has clearly showed that the writer is fond of getting a cheap and quick publicity by writing fabricated, fantasized and often wilfully twisting the facts to suit to his baseless biases. He had no intention what so ever to present facts as facts before the people. All his other writings and books are only aimed at maligning some communities, sections in the society without any reason or rhyme. He is a hollow person with zero intellectual capacity and no ability at all to write something, which is a fact and based on facts.

By describing Vaishya community as smugglers, the author in other words is also saying that all the businessmen are thieves. Majority of Vaishyas in the past and mostly even today run small time business. Vaishyas were normally involved in running a small provision store in a village or in small towns, on which the entire social fabric of society depended. One or two provision stores in every village used to serve the day-to-day domestic needs of the people especially the poor and the marginalised. The provision stores owners used to supply the daily provisions to the locals throughout the month either mostly on credit or now-and-then on cash. This was a sociological necessity. Had they not extended credit to the locals, it would have been difficult to describe the living conditions in the villages and small towns. Then where is the scope for smuggling in this business! Will the author be able to explain this phenomenon?

Days have changed gradually. For running the daily provision store, not only Vaishyas but also many other communities have stepped in.  If we visit a village or a small town today, there are several categories of businesses exist. They include Provision stores, tea stalls, liquor outlets, small hotels, fertilizers and pesticides shops, fruit and flowers selling outlets, contracts and political business. In fact, every business model is there in the villages now which are handled by people from almost all the communities. Yadavs do the sheep business, Mudiraj and Bestha are into fish business, Weaving community into cloth business, Potteries into pottery, Gouds into Toddy and liquor business etc. Several communities including Vaishyas are into various categories of business. If Vaishyas are social smugglers, do all these business communities are also smugglers? Will this great self-proclaimed intellectual to spare a thought on this?

After the country attained independence, it gave birth to new entrepreneurship. But these entrepreneurs are not exclusively from the Vaishya community; there have been other castes too. After the independence several Acts, laws were passed to establish the socialist society where everyone have a chance. The Constitution had also provided schedules for the setting up Socialist-Secular democratic set up in the country.  With Pandit Jawaharlal Nehru’s Mixed Economy policy, a new business class had emerged above all castes and communities. There were several communities who have left their hereditary professions and embarked business as their profession. The Economic Reforms of the 1991 have heralded a new era for the emergency of new wave of entrepreneurship. In fact, even before the Economic liberalisation, premier institutions like the Indian Institute of Managements produced MBAs who became the first-time entrepreneurs and businessmen. Every marketing professional who had the marketing skills had become an entrepreneur businessman. Gradually, the businessmen from our country have attained the international name and fame. Among those, there were people from all the communities including the Vaishyas. Then should we call all of them as social smugglers as the writer did it with the Vaishyas?



However, we must accept a fact, though it may be unpalatable to us. Like Karl Marx said, the sociological order is dependent on the economic relations. Hence, in the past one community had an upper hand in the business, which was a natural phenomenon. Based on the then sociological situation, Vaishyas were entrusted with the responsibility of the business as part of the Chaturvarna Vyavastha (Four-layered Hindu Social Order).

Noted journalist and writer Harish Damodaran in his book “India’s New Capitalists” for which foreword was written by Nandan Nilekani had clearly wrote about how Vaishyas and others have become millionaires and multi-millionaires through their business ventures. The ignorant writer who described Vaishyas as social smugglers should take some time off and read this book, which will give him some insight into how the business empires were built in this country. How the business sector had undergone dramatic changes, this book will explain. Entrepreneurs took birth in the Chemical, Fertilisers, Jute, Iron and Steel, Plastics, Pharma, Electronics, Information technology and host of their areas, from several castes including Vaishyas. Without taking these facts into consideration and painting Vaishyas as the only community, which is in the business, and branding them as social smugglers is uncalled for. It is agreed that business communities like the Marwaris, Gujaratis, Parsis, Khojas, Sindhis, Chettiars, Boharas, Gujarati Banias, Jains were there.  However, as time passed people from other communities have also entered the business sector like Yadavs, Kammas, Reddys, Rajus, Velamas, Naidus, Ganders, Nadirs, Marathas, Hindu-Sikh Jats and so on. Along with them there were people from Kshatriyas, Brahmins and kayasthas. The Brahmins also made a mark later and Infosys is the best example.

Harish Damodaran had clearly explained how people from each community entered and reached heights in the business in his book. Damodaran writes that thanks to Sir Arthur Cotton who had constructed Doweleswaram Anicut by which Kammas benefitted a lot due to the fertile crops. The profits they made in agriculture they have diverted to other business and earned more profits. More profits came from the commercial crops like the Red Chilli, Cotton, Paddy, Turmeric, and Tobacco. If some people did paddy business others did Tobacco business. But none of these ever indulged in smuggling. Some of them invested in the film industry and some media industry and made money while some other benefitted from setting up the industries. Take for instance, Andhra Sugars, Andhra Scientific Company, KCP, Cooperative Sugar Mill in Vuyyuru, Sarvaraya Cotton Mill. Similarly, Reddys invested in the Mining, film business, contracts and they have constructed projects. Everyone knows about the international level success of the Satyam Computers whose promoter is a B Ramalinga Raju. Some Velamas have also made their mark in the real estate.

There is no community today, which is not into the business. If Vaishyas who do business are smugglers, is everyone in the business sector also a smuggler? I don’t think the writer of the ill-reputed booklet describing Vaishyas as social smugglers has any answer to this! END


Tuesday, October 3, 2017

A Vibrant RTI will win Trust.....Empowering Citizen’s Right to Information: Vanam Jwala Narasimha Rao


A Vibrant RTI will win Trust
Telangana Toda (04-10-2017)
Empowering Citizen’s Right to Information
The Hans India (04-10-2017)
Vanam Jwala Narasimha Rao

In accordance with the provisions of Right to Information Act 2005 to provide right to information for citizens under the control of public authorities to promote transparency and accountability, the Government of Telangana, has constituted the state information commission and appointed Chief Information Commissioner and one Information Commissioner. Thus, one of the constitutional obligations of the Indian Democratic Republic, much to the satisfaction of several Telangana people who are desirous of having right to information, has been fulfilled. The RTI Social Activists too who even preferred to knock at the doors of judiciary have welcomed the move. Now it is for the public at large in general and in particular the activists, to make full use of this commission. Unlike many Acts which derive their strength mainly from Government, this Act’s success, depends upon the people and this requires educating the public on its usefulness and benefits.

To recall the genesis, need, concept and evolution of the RTI Act it may be appropriate to trace the roots since the days of earlier NDA government or to that matter the days when Inder Kumar Gujral was Prime Minister. When the then NDA government though enacted the freedom of information Act it did not frame the rules and regulations and as a result the Manmohan Singh UPA government brought the RTI Act on June 21, 2005. Though the then President APJ Abdul Kalam gave his assent on June 15, 2005 he went on record that confidentiality of communication between the Head of State and Head of Government should be maintained. He further emphasized that notings by bureaucrats on files should also be privileged as otherwise it could adversely affect the decision-making process. He however expressed the view that the legislation is an empowering tool and added that, "the Right to Information can provide immense relief to people who feel they have been wronged”. It is rarely seen an Act of this sort anywhere in the world which was framed with meticulous care.

The strong driving force behind RTI Act was undoubtedly the nine-point Action Plan adopted in the Chief Ministers’ conference chaired by the then PM IK Gujral held in May 1997 on the eve of 50 years of independence. The conference observed that even after (by then) 50 years of independence people have growing doubts on state and central governments and to justify the trust of the people an action plan containing the components of Accountability, Transparency and Citizen friendly government was necessary. In the process the Chief Ministers and the Prime Minister irrespective of party affiliations agreed upon enacting freedom of information act and to make it a success every government department should draft citizen charters and establish public facilitation and information centres. Unfortunately, in majority of states either all these three or one or more remained only on paper and for namesake. The RTI Act provisions generate lots of hopes in citizens and as such in Telangana state too.  The main reason for enacting such a law is that the democracy requires an informed citizenry and transparency of information is vital to its functioning.


The question now is what constitutes an information? The answer is simple…information means any material in any form including records, documents, memos, e-mails, opinions, press releases, circulars, orders, logbooks, contracts, reports, papers, samples, models, data material etc. held by any public authority. Any authority or body or institution of the government including non-government organizations substantially financed by government is a public authority and they are expected to maintain all its records. All this information shall be widely disseminated in public domain and in an easily accessible format. Each public authority shall appoint Public Information Officers (PIO) who are responsible to provide information when a citizen seeks. In case if the citizen does not get a response from the PIO within the prescribed time, he or she has a right to approach the Information Commission for redressal and the concerned Commissioner (s) initiate appropriate action against the PIO who fails to give information.

Couple of doubts still haunt the citizen in the implementation of the Act despite formation of commissions including in Telangana. Is it possible for the government to commit to “provide for setting out the practical regime of right to information for citizens to secure access to information under the control of public authorities” as stated in the Act? Each and every government department unless otherwise committed to the Act this is not possible. Every Public Authority shall, as per the Act, maintain all its records duly Catalogued, Indexed, Computerized and Connected through a network all over the country as well as publish within four months from the enactment of this Act, the particulars of its Organization, functions, powers and duties of its officers and employees besides the procedure followed in the decision-making process. How many have done this? In addition, they should publish within four months from the enactment of this Act the budget allocated, proposed expenditures, reports on disbursements, manner of execution of subsidy programmes, facilities available to citizens for obtaining information, working hours of a library or reading room and names, designations and other Particulars of the Public Information Officers as Single Point of Contact. It is debatable as to how many adhered to this as of now either in the country or in the states.

Act has not defined the phrase “substantially financed” and as a result Non-Government organizations (NGO) ignored their obligations under the Act. The second Administrative Reforms Commission’s recommendation that organizations which perform functions of a public nature that are ordinarily performed by government or its agencies, and those which enjoy natural monopoly may be brought within the purview of the Act is yet to be implemented.

Any Organization (Government or Non-Government) may take shelter under clauses…” There shall be no obligation to give any citizen such information which is classified as “disclosure of which would prejudicially affect”. Does this provision not amount to limitations?


Some Pro-Active Initiatives may perhaps help in better implementation of the Act. They are: Identification and analysis of citizens information needs; Developing Active Public Information Tools and Techniques like briefings, central information contact, information hot line, technical assistance, simulation games, information centers and field offices, expert panels, field trip, open houses, community fairs etc.

Finally, in a country like ours where nothing is practicable without political influence and interference, identification and appointment of persons of eminence in public life with wide knowledge and experience in different fields, as required in the Act, for the positions of Information Commissioners is a Herculean task, though many states including Telangana did it with success.


What Citizens are saying is treat us with courtesy and respect, make things easy for us, provide reliable and timely help, give us choice and voice and shift from rules driven procedures to citizen service driven procedures. END

వ్యాపారం చేయడమే నేరమా? :వనం జ్వాలానరసింహా రావు

వ్యాపారం చేయడమే నేరమా?
వనం జ్వాలానరసింహా రావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (04-10-2017)

         ఇటీవల ఒక సామాజిక శాస్త్రవేత్త కోమట్లను సామాజిక స్మగ్లర్లు (దొంగరవాణాదారులు) అంటూ ఒక అసంబద్ధమైన బుల్లి పుస్తకాన్ని రాశాడు. దానిమీద ఉభయరాష్ట్రాలలోని వైశ్యులు సహజంగానే తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలియచేశారు. వారికి మద్దతుగా పరిపూర్ణానందస్వామి లాంటి వారు సహితం బాహాటంగానే మాట్లాడమే కాకుండా ఆ పుస్తకంలోని అంశాలు మొత్తం హిందూ సమాజాన్ని కించపరిచేవిగా ఉన్నాయన్నారు. ఎలెక్ట్రానిక్, ప్రింట్ మీడియాలలో తాను రాసిన అంశాలను సరైన రీతిలో, శాస్త్రీయంగా సమర్ధించలేని పుస్తక రచయిత మొత్తం చర్చను పక్కదారి పట్టించడం, అర్థంపర్థం లేని వాదన లేవదీయడం గమనించినవారికి ఆ రచయితకు ప్రాచుర్యం పొందాలనే జిజ్ఞాస తప్ప, విషయాన్ని కూలంకషంగా పదిమందికి తెలియచెప్పాలనే భావన వున్నట్లు గోచరించలేదు. అసలాయన రాసిన ఇతర పుస్తకాలు కాని, వ్యాసాలు కానీ, ఎవరిమీదో ఒకరి మీద గుడ్డకాల్చి పడేసే వ్యవహారమే తప్ప మేదావిత్వంతో కూడుకున్నవి కానే కావు.

         వైశ్యులు సామాజిక స్మగ్లర్లు (అంటే తెలుగులో దొంగరవాణాదారులు) అని అనడం వెనుక ఉద్దేశం బహుశా వ్యాపారం చేసేవాళ్ళంతా దొంగరవాణా చేసేవారు అనీ, దొంగలనీ అర్థం కావచ్చు. ఒకనాడు (ఇప్పటికీ చాలా చోట్ల) కేవలం వైశ్యులే సాధారణంగా వ్యాపారం చేసేవారు. అయితే చాలామంది వైశ్యులు చేసే వ్యాపారం ఆ రోజుల్లో, బహుశా ఇప్పటికీ, సమాజానికి నిత్యం దైనందిన జీవనానికి అవసరమైన చిల్లరదుకాణం వ్యాపారమే! ప్రతిగ్రామంలో వుండే ఒకటో-రెండో కోమటి కుటుంబాలు ఆ గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా చిల్లర దుకాణం వ్యాపారం చేసేవారు. నెలంతా గ్రామస్తులకు కావలసిన సరకులు అప్పుగానో, నగదుగానో ఇచ్చేవారు. అదొక సామాజిక ఆవశ్యకత. వాళ్లే అలా చేయకపోతే గ్రామస్తుల పరిస్థితి ఎలా వుండేదో ఉహించడం కూడా కష్టమే. ఇందులో దొంగ రవాణాకు ఆస్కారం ఎక్కడ వుందో ఆ రచయితే విడమర్చి తెలియచెప్పాలి.

క్రమేపీ రోజులు మారాయి.....కాలానుగుణంగా ఒక్క కోమట్లే కాకుండా చిల్లరదుకాణాలను నడపడానికి వీరూ-వారూ అనే తేడా లేకుండా అన్ని కులాల వాళ్లూ ముందుకు రాసాగారు. ఈ రోజుల్లో గ్రామాలకు పోతే మనకు కనిపించని వ్యాపారం వుండదు. ఒక్క కిరాణా దుకాణాలే కాకుండా, టీ-దుకాణాల దగ్గరనుంచి మద్యం అమ్మే దుకాణాలదాకా, హోటళ్లు నడపడం దగ్గరనుంచి ఎరువుల అమ్మకం దాకా, పాలమ్మడం దగ్గరనుంచి పూలు-కూరగాయలు అమ్మడం దాకా, కంట్రాక్టు పనుల దగ్గర నుంచి రాజకీయ వ్యాపారం దాకా ......ఇదీ-అదీ అనే తేడా లేకుండా అన్ని రకాల కులాలు వారి-వారికి తోచిన వ్యాపారం వారి-వారి స్థాయిని పట్టి చేస్తూనే వున్నారు. గొల్లలు గొర్రెల వ్యాపారం, బెస్తలు చేపల వ్యాపారం, చేనేతవారు గుడ్డల వ్యాపారం, దాసరివారి సరకులమ్మే వ్యాపారం, వ్యవసాయదారులు కూరలమ్మే వ్యాపారం, మేదరవాళ్ళు బట్టలు కుట్టే వ్యాపారం, గౌడులు కల్లు-సారా వ్యాపారం....చెప్పుకుంటూ పోతే వైశ్యులతో సహా అందరూ, అన్ని కులాల వాళ్లూ ఎదో ఒక వ్యాపారం చేస్తూనే వున్నారు. వైశ్యులు సామాజిక స్మగ్లర్లయితే ఈ కులాలవారదరూ కూడా అలాగేనా? ఆ రచయిత ఒక్క సారి పునరాలోచన చేస్తే మంచిదేమో!

స్వాతంత్ర్యానంతర భారతదేశంలో ఒక కొత్తరకమైన ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఆవిర్భవించడం జరిగింది. వీరంతా కేవలం కోమట్లే కాదు....అన్ని కులాలవారున్నారు. కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా సమసమాజం ఏర్పాటుకోసం స్వాతంత్ర్యానంతరం అనేక రకాల చట్టాలు వచ్చాయి. రాజ్యాంగం కూడా సెక్యులర్-ప్రజాస్వామిక వ్యవస్థ దిశగా అనేక ప్రకరణలను పొందుపరిచింది. జవహర్లాల్ నెహ్రూ కాలంనుంచి మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ రూపుదిద్దుకోవడం మొదలవడంతో కులాలకు-మతాలకు అతీతంగా ఒక ఆధునిక వ్యాపారరంగ వర్గం ఆవిర్భవించింది. అనాదిగా, వంశపారంపర్యంగా ఆచరిస్తూ వస్తున్న వృత్తులకు స్వస్తి పలికి వ్యాపారాన్నే వృత్తిగా చేపట్టిన వారనేకమంది వున్నారు. 1991 సంవత్సరంలో ఆర్ధిక సరళీకరణ విధానాలు రూపుదిద్దుకోవడంతో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు రకరకాల వ్యాపారాలు ప్రారంభించడానికి తలుపులు తెరుచుకున్నాయి. వాస్తవానికి అంతకు ముందే ప్రముఖ యాజమాన్య శిక్షణా సంస్థలైన ఐఐఎమ్ లాంటివి పెద్దమొత్తంలో ఎంబీయేలను తయారు చేయడంతో వారంతా ఉద్యోగరీత్యా, వ్యక్తిగతంగా వ్యాపారవేత్తలు కాసాగారు. ఆధునిక మార్కెటింగ్ వ్యవస్థ రూపుదిద్దుకోవడంతో నైపుణ్యం వున్న ప్రతివాడూ వ్యాపారం చేయసాగాడు. క్రమేపీ మన దేశ వ్యాపారవేత్తలు అంతర్జాతీయ స్థాయిలో గణనీయమైన పేరు-ప్రఖ్యాతులు తెచ్చుకోవడం మొదలైంది. అలా తెచ్చుకున్నవారిలో కోమట్లే కాకుండా అన్ని కులాల వారున్నారు. కోమట్లను అన్నట్లే వీరందరినీ సామాజిక స్మగర్లని అందామా? ఆ రచయితే చెప్పాలి సమాధానం.

కాకపోతే ఇక్కడ ఒక్క విషయం చెప్పుకోవడంలో, అంగీకరించడంలో తప్పు అని కానీ, సిగ్గుపడాల్సిన అవసరం కానీ లేదు. కార్ల్ మార్క్స్ చెప్పినట్లు సామాజిక వ్యవస్థ తీరుతెన్నులు ఆర్ధిక స్థితిగతులపై ఆధారపడివుంటాయి. అలనాటి ఆర్ధిక వ్యవస్థలో సామాజికంగా ఒక వర్గంవారు-లేదా-ఒక కులంవారు వ్యాపారంగంలో కేంద్రీకరించడం సహజంగా జరిగిన పరిణామం. వ్యక్తిగత సంపద పెరగడానికి, తద్వారా దేశ సంపద పెరగడానికి వారే కారణభూతులు. అలనాటి సామాజిక స్థితిగతులకు అనుగుణంగా రూపుదిద్దుకున్న చాతుర్వర్ణ వ్యవస్థలో వైశ్యులకు వ్యాపారలావాదేవీలు అప్పగించడం జరిగింది. అదేదో అన్నింటికన్నా గౌరవప్రదమైన వ్యాపకమని కాదుకాని, అలా జరగడం ఒక సామాజిక అవసరంగా జరిగింది అప్పట్లో. అలాగే బ్రాహ్మణుల విషయానికొస్తే, వారిని సమాజాన్ని ఐక్యంగా వుంచడానికి ఉపయోగించుకుంది అలనాటి వ్యవస్థ.


ఆధునిక నవ-భారతదేశంలో కులాలు, వ్యాపారాలు, పరిశ్రమలు ఎలా రూపాంతరం చెందాయి అనే విషయం ప్రధానాంశంగా, నందన్ నీలేకని ఉపోద్ఘాతంతో, ప్రఖ్యాత పాత్రికేయుడు హరీష్ దామోదరన్ రాసిన “ఇండియాస్ న్యూ కాపిటలిస్ట్స్” అనే ఆంగ్ల పుస్తకంలో, కోమట్లతో సహా అనేక కులాలు ఎలా వ్యాపార రంగంలోకి దిగి, పెద్దపెద్ద సంస్థలను స్థాపించి, కోట్లకు పడగలెత్తారో వివరణాత్మకంగా చెప్పడం జరిగింది. కోమట్లను సామాజిక స్మగ్లర్లగా అభివర్ణించిన మహాశయులు ఒక్కసారి ఈ పుస్తకాన్ని చదివితే మన దేశ వ్యాపార రంగం అభివృద్ధి గురించి అవగతమౌతుంది. స్వాతంత్ర్యానంతర భారతదేశంలో గణనీయమైన మార్పులు వ్యాపార రంగంలో ఎలా చోటుచేసుకున్నాయో కూడా ఇది చదివితే అర్థం అవుతుంది. జౌళి, చక్కర, ఇనుము, ఉక్కు, రసాయానాలు, ప్లాస్టికులు, ఫార్మా, ఆటోమొబైల్స్, ఎలెక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.....ఇలా వివిధ రంగాలలో ఈ కులం-ఆ కులం అనే తేడా లేకుండా వ్యాపారవేత్తలు పుట్టుకొచ్చారు. ఇవేవీ గమనించకుందా, పరిగణలోకి తీసుకోకుండా ఒక్క వైశ్యులే వ్యాపారం చేశారనీ, వారు సామాజిక స్మగ్లర్లనీ నింద వేయడం భావ్యం కాదు. పార్సీలు, గుజరాతీ బనియాలు, జైనులు, మార్వాడీలు, సింధీలు, చెట్టియార్లు, ఖోజాలు, బోహరాలు లాంటి వైశ్యా కులాలు ఒకప్పుడు వ్యాపారవేత్తలే.... కాదనలేం. కాలక్రమేణా, కొత్త వ్యాపార వర్గాల్లో యాదవులు, కమ్మవారు, రెడ్డివారు, రాజులు, వెలమలు, నాయుడ్లు, గౌండర్లు, నాడార్లు, మరాఠాలు, హిందూ-సిఖ్ జాట్లు.....ఇలా అందరూ చేరారు. వీరితో పాటు బ్రాహ్మణ, క్షత్రియ, కాయస్థ లాంటి మిగతావారు కూడా వ్యాపారులయ్యారు.

ఒక్కో కులానికి చెందినవారు ఎలా వ్యాపార రంగంలో అంచెలంచలుగా ఎదిగారో సోదాహరణంగా వివరిస్తూ హరీష్ దామోదరన్ ఆసక్తికరమైన విషయాలెన్నో రాశారు. 1965 సంవత్సరపు మొనాపలీ విచారణ కమీషన్ రూపొందించిన 75 ప్రముఖ పారిశ్రామిక సంస్థల్లో కేవలం రెండు మాత్రమే ఖత్రీలకు చెందగా, ఐదు మాత్రమె బ్రాహ్మణులకు చెందివున్నాయి. తదనంతర పరిణామాలలో వారు కూడా గణనీయమైన వృద్ధి సాధించారు. ఇన్ఫోసిస్ సంస్థ అలా వచ్చిందే!

కమ్మ కులానికి, రెడ్డి కులానికి, రాజుల కులానికి, వెలమ కులానికి చెందినవారు వ్యాపార రంగంలో ఎవరూ ఉహించని విజయాలు సాధించారు. దీని వెనుక వున్న కారణాలను వివరిస్తూ, దామోదరన్, సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టుల పుణ్యమా అని, కమ్మ కులానికి చెందిన వ్యవసాయదారులు పంటలు సమృద్ధిగా పండించుకుని అలా వచ్చిన డబ్బును వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి లాభాలను ఆర్జించారని రాశాడు. వరి పంట, మిరప పంట, పసుపు పంట, కాటన్ పంట, పొగాకు పంటల్లో లాభాలెక్కువగా వచ్చాయి. కొందరు ధాన్యం వ్యాపారం చేస్తే, మరికొందరు పొగాకు వ్యాపారం చేశారు. వీరెవరూ వ్యాపారంలో స్మగ్లింగ్ చేయలేదే! అలాగే సినిమారంగంలో మరికొందరు పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేసారు. లాభాలు గడించారు. మరికొందరు పరిశ్రమలు స్థాపించారు. ఉదాహరణకు ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ, ఉయ్యూరు సహకార చక్కర కర్మాగారం, కేసీపీ, ఆంధ్రా సుగర్స్, సర్వారాయ నూలు మిల్లు లాంటివి వున్నాయి. అలాగే రెడ్డివారు మైనింగ్ పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టారు. సినిమారంగంలో కూడా దిగారు. కాంట్రాక్టులు కూడా చేశారు. ప్రాజెక్టులు కట్టారు. ఇక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సత్యం కంప్యూటర్స్ గురించి అందరికీ తెలిసిందే. దానిని స్థాపించిన వ్యక్తి రాజుల కులానికి చెందిన వారు. రియల్ ఎస్టేట్ రంగంలో కొందరు వెలమలు దూసుకు పోతున్నారు కదా!


ఇవ్వాళ వ్యాపారం చేయని కులం ఏదీ లేదు. వ్యాపారం చేసిన కోమట్లు స్మగ్లర్లయితే అందరినీ స్మగ్లర్లుగానే ఆ రచయిత భావిస్తున్నాడా? దీనికి ఆయన వద్ద సమాధానం వుందని నేనుకోను. 

Sunday, October 1, 2017

సీతాదేవి కనపడలేదని ప్రాణత్యాగం చేద్దామనుకున్న హనుమంతుడు ...... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలానరసింహారావు

సీతాదేవి కనపడలేదని ప్రాణత్యాగం చేద్దామనుకున్న హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలానరసింహారావు
సూర్యదినపత్రిక (02-10-2017)

సీత కనపడలేదని చెప్తే కీడు తప్పదు...చెప్పకపోతే దోషం కల్గుతుంది....అంటే, చెప్పినా, చెప్పకున్నా కీడే! చెప్పాల్నా? వద్దా? అన్న మీమాంసలో పడ్తాడు హనుమంతుడు. ఏవిధంగా ఆలోచనచేసినా ఆయన మనస్సు కుదుటపడలేదు. ఒక ఆలోచన చేస్తుంటే, దాన్ని బాధించే ఆలోచన మరోకటి వస్తున్నది. ఇలాంటి సందర్భాలలో కాలానుగుణమైన, యోగ్యమైన నీతి ఏమిటా అని మరీ-మరీ ఆలోచించ సాగాడు. తాను కిష్కిందకు పోతే కలిగే లాభమేంటి? సముద్రం దాటడం, లంకలో ప్రవేశించడం, సీతను వెతకడం, రాక్షస ముఖ్యులను చూడడం, ఇవన్నీ వ్యర్ధమైపోయి, సీతను చూడకుండా అక్కడకు పోతే, పుణ్యమా? పురుషార్ధమా? అని తలపోస్తూ, అనుకుంటాడీవిధంగా:

         "నేను పోయి సీత కనబడలేదనగానే, వానరులు, సుగ్రీవుడు, రామలక్ష్మణులు నన్నేమంటారు? లేనివస్తువు కనిపించలేదంటే దండిస్తారా? దండించక పోవచ్చునేమోకాని, ఆమాట విన్నంతనే శ్రీరాముడు ప్రాణం విడవడానికి సిధ్ధపడతాడు. చెవుల్లో కరిగించి పోసిన సీసంలాంటి మాటలువిని ఇంకా ప్రాణాలతో ఎలావుండ కలుగుతాడు?"

         "రామచంద్రమూర్తి మరణించాలని నిశ్చయించుకోగానే, అంతకు ముందే ఆయనపై అత్యంత ప్రేమున్న లక్ష్మణుడు రాముడి మరణవార్త వినడానికి ముందే, ప్రాణాలు తీసుకుంటాడు. అన్న-తమ్ములు మరణించారని తెలియగానే, భరత-శతృఘ్నులు ప్రాణాలు విడుస్తారు. కుమారుల చావు విన్న క్షణాన, కౌసల్య-సుమిత్ర-కైకేయిలు మిగలరు. వారు కొడుకులను పోగొట్టుకుని బ్రతకలేరుకదా? ఇతరుల మేలుమరవని, ఆడితప్పని సుగ్రీవుడు రామచంద్రుడి గతిచూసి తానూ మరణించుతాడు. ఆయన భార్య రుమాదేవి, వాలిచనిపోయాడనే ఏడుస్తున్న తార కూడ వుందరు. వారి మరణవార్త విన్న అంగదుడు చనిపోతాడు. కిష్కిందలోని ముఖ్యులందరు రాజుమరణ వార్తవినగానే, దుఃఖంతో పరితపిస్తూ, పిడికిళ్లతో, అరిచేతి దెబ్బలతో తలలు పగులకొట్టుకుని చచ్చిపోతారు. అరణ్యంలో చిరకాలం నివసిస్తున్న వారెందరో వున్నారు....వారూ మిగలరు. అట్లా అందరూ చావగా మిగిలిన కోతులు, కొండల్లో, అడవుల్లో గుంపులు-గుంపులుగా మునుపటిలాగా తిరుగలేవు. అందులో కొన్ని వురిపోసుకుని చస్తాయి. కొన్నిమంటల్లో దూకి, మరికొన్ని విషంతాగి, ఇంకొన్ని కత్తులపైన పడి చచ్చిపోతాయి" 

         "ఇప్పుడు నేను కిష్కిందకు పోతే ఎక్కడ చూసినా, విన్నా ఏడుపుధ్వనులే. దానివల్ల  ప్రయోజనమేంటి? ఇక్ష్వాకు  వంశం, వానరకులం నాశనమౌతుంది. కాబట్టి ఇక్కడినుండి కిష్కిందకు పోకపోవడమే ఉత్తమం. జానకిజాడ తెలుసుకోలేని నేను సుగ్రీవుడి ముఖం ఎట్లా చూడాలి? అంత సిగ్గు, బిడియం లేదానాకు? నేను పోకపోతే...హనుమంతుడు ఇవ్వాళో, రేపో, ఎల్లుండో వస్తాడన్న ఆశతో కొంత కాలమైనా జీవించి వుంటారు". ఇలా హనుమంతుడి ఆలోచనలు కొనసాగుతాయి. కిష్కిందకు పోయి అనర్ధాలు తెచ్చి పెట్టడంకంటే, ఇక్కడ చేయాల్సిన కార్యం ఆలోచించడం మేలని తీర్మానించుకుని తర్వాత ఏంచేయాలో నిశ్చయించుకుంటాడు హనుమంతుడు.

         (హనుమంతుడు సీతాదేవిని చూడలేకపోతే ఎంత కీడు జరిగేదో ఊహించే ఘట్టమిది. ఇందు కొన్ని సందేహాలు రావచ్చు. జరుగుతుందనుకున్న ఈ కీడు సీత కనిపించలేదన్న విషయం మీద ఆధారపడి వుంటుంది. సీతా వియోగంతో రాముడు మరణిస్తే ఈ అనర్ధం జరుగుతుంది. జీవించి వుంటే జరగదు. భార్య కనపడలేదనగానే శ్రీరాముడు ప్రాణాలు విడుస్తాడా? సీతాదేవి భూమాత వొడిలోకి పోయినతర్వాత రామచంద్రమూర్తి మరణించాడా? లేదే! ఆతర్వాత ఎన్నో వందల ఏండ్లు బ్రతికున్నాడుకదా! అందుకే రాముడు సీతకై ప్రాణం విడుస్తాడన్న ఊహ సరైంది కాదేమో! కాకపోతే రెండవ సారి సీతావియోగం రాముడు స్వబుధ్ధి పూర్వకంగా చేయడం, తదనంతర కధలో ఆమె భూమాత వొడిలోకి చేరడం జరిగింది. భార్య మరణిస్తే ఏడ్చేవాళ్లు వుంటారు కాని సన్యాసిగా మారి భార్యను త్వజిస్తే ఏడవరు కదా! ఇంకా ఆలోచించాల్సివస్తే, హనుమంతుడు సీతను చూడలేక మరలిపోయిన తర్వాత, ఈ వార్త తెలిసిన వానరులు సుగ్రీవుడి భయంతో ప్రాయోపవేశం చేయడమో, లేక, రాజదండనకు గురికావడమో జరిగేది. హనుమంతుడు మటుకు బ్రహ్మవరబలంతో జీవించే వుండి, సీత ఏమైందో అన్న ఆలోచనతో మనస్సు పాడుచేసుకోవాల్సిందేకదా! ) 


         ఇక్కడినున్డి తిరిగిపోక, ఎక్కడో-అక్కడ లంకలోనే వుండి, సీతాదేవిని కనుక్కోలేక పోయినందున, బ్రతుకు మీద ఆశవదిలి, ఓ చెట్టు క్రిందో, పుట్ట క్రిందో, నివసిద్దామనుకుంటాడు హనుమంతుడు. వానప్రస్థుడై వుంటున్న తనకు, కాయో, పండో నోట్లో పడితే తిందామని, లేకపోతే వూరికేవుందామని, అదే క్షేమమార్గమని తలుస్తాడు. ఫలాలు, కందమూలాలు బాగాదొరికే సముద్రతీరానికి పోయి, అక్కడ చితి పేర్చుకుని, దాంట్లో చావడం మేలనికూడా భావిస్తాడు. చెట్టు క్రింద కూర్చొని కాయలు పడ్తాయా, పండ్లు పడ్తాయా అని అభిమానం లేకుండా ఎదురుచూడడం సరైన పనికాదనుకుంటాడు. మరణించాలనే వుద్దేశ్యంతో, ఓచెట్టు క్రింద పడివుండి, ధైర్యంగా పులులు, సింహాలు, కాకులు, గద్దలు తనశరీరాన్ని పీక్కుతింటుంటే, కదలక-మెదలక కూర్చుందామని కూడా అనుకుంటాడు.

         "సీతాదేవిని ఇక్కడ చూడకపోతే, నీళ్లలో దూకి దేహాన్ని వదుల్తాను. రామకార్యార్ధినై ఇలా చేయడం మునీశ్వరులందరికీ సమ్మతమే కావచ్చు. స్వామికార్యానికై, అందునా రామకార్యానికై, ప్రాణం తీసుకోవడం పాపం కాదుకదా! అలా అని జటాయువులా నాది వీర మరణం కాదుకదా! అయ్యో నేనేం చేయాలి?" అనుకుని చింతిస్తాడు. లంకాధిదేవతను జయించడంతో శుభారంభం కలిగించి, మనోజమైన చంద్రుడి వెన్నెలతో నిండి, అందమై, నిద్రలేకుండడంతో దీర్ఘమై, లంకలో హనుమంతుడు ప్రవేశించాడన్న కీర్తిని తెచ్చిన ఆనాటి రాత్రి, సీతాదేవి దర్శన భాగ్యం లేకుండా వృధాగా పోతున్నదే అని దిగులుపడ్తాడు హనుమంతుడు. చేసేదేమీ లేక చెట్లమొదళ్లలో వ్రతదీక్ష పూని వుందామనీ, తిరిగిపోతే అంగదాదులు బ్రతకలేరనీ మళ్లీ అనుకుంటాడు. ఆహారం మాని దేహం విడిస్తే, చచ్చేం సాధిస్తామనీ, ప్రాణాలొదిల్తే పెక్కు దోషాలు కలుగుతాయనీ, బ్రతికుంటే మేలుకలుగుతుందనీ, ప్రాణాలు విడువరాదనీ, బ్రతికుంటేనే శుభం కలుగుతుందనీ నిర్ణయానికొస్తాడు.

         వేరేవిధంగా కూడా ఆలోచిస్తాడు. సీత వుందో-లేదోనన్న సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందు ఇంత అనర్ధానికి కారణమైన రావణుడిని పట్టుకుని చావకొట్తే మంచిదనీ, ఇదే వాడి పాపానికి తగిన ప్రాయశ్చిత్తమనీ భావిస్తాడు హనుమంతుడు. "రావణుడిని చంపితే కలిగే లాభమేంటి? వాడిని రామచంద్రమూర్తి చంపుతానన్నాడే?" ఇదీసరైన ఆలోచన కాదనుకుంటాడు. యజ్ఞంలో అగ్నికి బలిచ్చేందుకు ఈడ్చుకుని పోయే మేకలా, రావణుడిని పట్టుకుని, సముద్రమ్మీదేసి, ఈడ్చుకుని పోయి రామచంద్రమూర్తి ఎదుట నిలబెట్టుదామనుకుంటాడు. ఆతర్వాత వాడినేంచేయాలన్న విషయం రాముడికే వదిల్తే సరిపోదా అని తలుస్తాడు.


         ఇలా పలుమార్లు అధైర్యంతో విచారపడ్తాడు. దిగులుపడ్తాడు. సీతకనిపించే దాకా వెతకాలనుకుంటాడు. సంపాతి మాట నమ్మి ఇక్కడకు వస్తే సీతలేదుకదా అని బాధపడతాడు. ఇంకా నయం...సంపాతి మాటలను నమ్మి, శ్రీరాముడినే ఇక్కడకు తెచ్చినట్లైతే, ఇక్కడ సీత కనిపించక పోతే, భయంకరమైన రాముడి కోపానికి వానరవీరులందరూ బలయ్యే వారేననుకుంటాడు. ఇలా అనుకుంటూ, అహార నియమం, ఇంద్రియ వ్యాపార నియమం కలిగి, ఇక్కడే వుండి, వ్యర్ధుడను కాకుండా, సుసంపన్నులగు రామలక్ష్మణులు చావకుండా చూద్దామని తీర్మానించుకుంటాడు హనుమంతుడప్పటికి.