Thursday, February 14, 2019

సమున్నత లక్ష్యాల శిక్షణ : వనం జ్వాలా నరసింహారావు


సమున్నత లక్ష్యాల శిక్షణ
వనం జ్వాలా నరసింహారావు
మనతెలంగాణ దినపత్రిక (15-02-2019)
కొత్తగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్‌లతో పాటు పంచాయతీ కార్యదర్శులకు ఫిబ్రవరి 15 నుంచి అన్ని జిల్లాల్లో అవగాహనా, శిక్షణా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టం కల్పించిన పలు రకాల విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించేలా ఈ శిక్షణా కార్యక్రమం రూపొందింది. ఈ శిక్షణ ఆవశ్యకతను విశ్లేషించడం మొదలు వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడంవరకు ఒక పద్ధతి ప్రకారం ఈ శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించిన పంచాయతీరాజ్ శాఖ అధికారుల కార్యాచరణ అభినందనీయం.

వయోజన విద్యా బోధన సూత్రాల వెలుగులో ఈ మొత్తం కార్యక్రమం రూపొందింది. ఒక్కో సెషన్‌లో ఒక్కో తరహా భాగస్వామ్య శిక్షణా పద్ధతులు ఈ కార్యక్రమంలో కనిపిస్తాయి. సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, కార్యదర్శులకు వారివారి ప్రాంతాల్లోనే ఈ కార్యక్రమ షెడ్యూలును రూపొందించడంతో విధిగా వారు ఉత్సాహంగా పాల్గొనే తీరులో రూపొందించబడింది. పరస్పర చర్చ, సమిష్టి అధ్యయనం, నిర్దిష్ట కార్యాచరణ, కేస్ స్టడీ, వివరణాత్మక క్విజ్, సామూహిక చర్చ, ప్రసంగాలు, నిర్వహణాపరమైన గేమ్స్, ప్రదర్శనలు.. ఇలా పలు అంశాల్లో వీరిని భాగస్వాములను చేసేలా రూపొందించిన శిక్షణా పద్ధతులు ఈ కార్యక్రమంలో ప్రధానమైనవి. ఒక ప్రత్యేకమైన సహజ పద్ధతిలో శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖ భావించింది. జిల్లా శిక్షణా కేంద్రాల్లో గణనీయమైన సంఖ్యలో శిక్షకులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఏర్పడినందున రాష్ట్ర గ్రామీణాభివృద్ధి ఇన్‌స్టిట్యూట్ సుశిక్షితులైన రిసోర్స్ పర్సన్లతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శులకు శిక్షణ ఇవ్వడంలో రిసోర్స్ పర్సన్ల బాధ్యత కీలకమేకాక చాలా ప్రధానమైనది.

ఇటీవల జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌తో స్వయంగా రిసోర్స్ పర్సన్లు సంభాషించడం, అక్కడ అనేక విషయాలను తెలుసుకోవడం వారికి బాగా ఉపయోగపడింది. శిక్షణ ఇవ్వడం పూర్తయిన తర్వాత కూడా ఈ రిసోర్స్ పర్సన్లు సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, కార్యదర్శులతో కూడిన ఒక చిన్న సమూహానికి మార్గదర్శకులుగా, సహాయకులుగా ఉండడం నిరంతరంగా, ఇకపైన కూడా దీర్ఘకాలం పాటు కొనసాగే ఒక ప్రక్రియగా ఉంటుంది. ప్రభుత్వం నూతన చట్టం ద్వారా ఆశిస్తున్న ఫలితాలను సాధించేంత వరకు ఇది కొనసాగుతుంది.

ప్రభుత్వ యంత్రాంగం ద్వారా మాత్రమే కాకుండా రాజకీయ బ్యూరోక్రాట్ల ద్వారా కూడా ప్రజలకు మెరుగైన సేవలను అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.


ప్రభుత్వం రూపొందించే పథకాలను అమలుచేయడం గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల బాధ్యతగా ఉంటుంది. చట్టంలో పేర్కొన్న ప్రతీ అంశాన్ని తు.చ. తప్పకుండా సంపూర్ణంగా అమలు చేయడం కూడా వీరి బాధ్యత. కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఆమూలాగ్రం అమలు చేసే బాధ్యతను నెరవేరుస్తారనే ప్రభుత్వం ఆశిస్తోంది. గ్రామ పంచాయతీ నిర్వహణ బాధ్యతలను భుజాలపై వేసుకుని మెరుగైన పాలన అందిస్తారని భావిస్తోంది.చాలా మంది సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు తొలిసారి ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. వారు నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యత, వారికి అప్పగించిన అధికారం సమర్ధవంతంగా నిర్వహించడంలో వారు అవగాహన పొందాల్సిన అవసరం ఉంది. అందుకోసం వారికి శిక్షణ అనివార్యమవుతోంది. వారి సహజ నైపుణ్యాన్ని కూడా మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. వారికి చట్టం అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడంలో భాగంగా కొన్ని పద్ధతులను నేర్చుకోవడంతో పాటు వ్యవహారిక శైలిని కూడా అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. చట్టంలోని అంశాలపై, బాధ్యతలపై, విధుల నిర్వహణపై ఎంత అవగాహన పెరిగితే వారిలో ఆత్మవిశ్వాసం, ప్రావీణ్యం అంతగా పెరుగుతుంది. ఆరోగ్యకరమైన పోటీ తత్వం, వ్యవహార శైలిని మార్చుకోవడం ద్వారా వారిలో నిబద్ధత పెరుగుతుంది.

ఒక వ్యక్తి వృత్తి పనితీరుకు ఇది దోహదపడినా పడకపోయినా నేర్చుకోవడం అనేది సహజంగానే జరిగే ఒక ప్రక్రియ. పద్ధతి ప్రకారం శిక్షణ కల్పించడం మౌళికంగా నేర్చుకునే అనుభవానికి వీలు కల్పిస్తుంది. శిక్షణ అనేది శాస్త్రీయ పద్ధతిలో జరిగే ప్రక్రియ. ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం, త్వరితగతిన, సమర్ధవంతంగా నేర్చుకోడానికి ఇలాంటి శిక్షణలు అవసరం. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోడానికి, జ్ఞానాన్ని ఆర్జించడానికి, వ్యవహార శైలిని తీర్చిదిద్దుకోడానికి, నైపుణ్యాన్ని పెంచుకోడానికి వీలుగా ఈ శిక్షణా కార్యక్రమం రూపొందించబడింది. వివిధ రకాల పనులను సమర్ధవంతంగా నిర్వర్తించడానికి అవసరమైన మౌళిక అంశాలు ఈ శిక్షణ ద్వారా అవగాహన చేసుకోవచ్చు.

సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఈ తరహా శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచనే ఉంది. వారు ఈ శిక్షణలో నేర్చుకున్న అనుభవంతో ఎక్కడైనా, ఏ తరహా పనులనైనా చక్కదిద్దడానికి ఉపయోగపడుతుంది. కేవలం ఒక నమ్మకంతోనో, నిర్దిష్టంగా ఒక్క విధానానికి మాత్రమే పరిమితం చేసే తీరులో ఈ శిక్షణ ఉండదు. ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశం, ప్రజలకు వీలైనంత ఎక్కువగా నాణ్యమైన సేవలందించడం, వనరులను సమర్ధవంతమైన తీరులో వినియోగించడం, తప్పులను చేయడానికి అవకాశం లేకుండా చూసుకోవడం, విశ్వాసాన్ని పెంపొందించుకోవడం.. ఇలా అనేక అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. దీనికి తోడు శిక్షణ పొందుతున్న క్రమంలో ఒక మార్పును కోరుకోవడం, దానికి అనుగుణంగా పనితీరును చక్కదిద్దుకోవడం కూడా గమనించాల్సిన మరో అంశం.

సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు నూతన పంచాయతీరాజ్ చట్టం రూపంలో విధులు, బాధ్యతలు అప్పగించబడ్డాయి. అయితే బాధ్యతాయుతమైన స్థానాల్లోకి వచ్చినందున వారిలో మార్పు చోటుచేసుకునే క్రమంలో పనితీరుకు సంబంధించి కొన్ని సమస్యలూ ఉత్పన్నం కావచ్చు. సర్పంచ్‌లుగా వారు పోషించాల్సిన పాత్రకు అనుగుణమైన వ్యవహారిక సామర్థం వారికి ఉండకపోవచ్చు. అయితే ఈ శిక్షణ అనంతరం వారు రోజువారీ విధి నిర్వహణలో భాగంగా ఏ మేరకు సమర్ధవంతమైన పనితీరును ప్రదర్శించగలుగుతారో ఆ మేరకు నూతన పంచాయతీరాజ్ చట్టం అమలు విజయవంతమైనట్లే. ఇప్పుడు వారికి శిక్షణ కల్పిస్తున్న రిసోర్సు పర్సన్లు ఏ మేరకు విజయవంతమయ్యారనేది లేదా ఆ శిక్షణా కార్యక్రమం ఏ మేరకు ఉపయోగపడిందనేది రానున్న కాలంలో సర్పంచ్‌ల పనితీరు, సాధించిన ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.

శాస్త్రీయ పద్ధతిలో డిజైన్ చేసిన ‘సిస్టమాటిక్ ట్రెయినింగ్ అప్రోచ్’ ప్రధానంగా నాలుగు అంశాలపై ఉంటుంది. శిక్షణా అవసరాలను గుర్తించడం, దానికి తగిన ప్రణాళికను రూపొందించడం, అమలుకు అణువైన విధానాలను రూపొందించడం, దాని ఫలితాలను అంచనా వేయడం అనేవి ఈ నాలుగు అంశాలు. పనితీరును ఏ మేరకు మెరుగుపర్చుకున్నారనే అంశాన్ని విశ్లేషించుకోవడం కూడా ఈ మొత్తం శిక్షణా కార్యక్రమంలో ఒక భాగంగా ఉంది. శిక్షణ పొందడం ద్వారా అది పనితీరుపై ఏ మేరకు ప్రభావం చూపుతుంది, శిక్షణ లేనప్పుడు ఏ విధంగా ఉంటుందనే అంశాన్ని గుర్తించడానికి కూడా ఈ విశ్లేషణ దోహపడుతుంది. జాబ్ అనాలిసిస్, టాస్క్ అనాలిసిస్ కూడా చేయాల్సి ఉంటుంది. శిక్షణ సక్రమంగా అందలేదనే కారణంగానే పనితీరు సమస్యలు వచ్చాయనే చర్చకు ఆస్కారం ఉండొద్దు. పనితీరు అనేది మూడు అంశాలతో ముడిపడి ఉంటుంది. సరైన అవగాహన లేదా నైపుణ్యం లేనప్పుడు శిక్షణ అనివార్యం కావడం; సంస్థాగతమైన సహకారం లేనప్పుడు ఎంత శిక్షణ పొందినా వారి పనితీరు సమర్ధవంతంగా లేదని తేలిపోవడం; సరైన పనితీరు కనబర్చకపోయినప్పుడు తగిన ప్రోత్సాహం లభించకపోవడం లేదా తక్కువ పనితీరుతో ఉన్నారనే పేరుతో శిక్షించే పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు. ఈ మూడు అంశాలను చక్కదిద్దాలంటే పటిష్టమైన శిక్షణ అవసరం.

ఎలాంటి శిక్షణ అవసరమో గుర్తించే క్రమంలోనే శిక్షణా కార్యక్రమానికి సంబంధించిన ప్రణాళిక రూపకల్పన జరిగింది. ఏ తరహా శిక్షణ కల్పించాలి, దానికి తగిన రూపాలు ఎలా ఉండాలి, దాన్ని ఏ విధంగా ప్రణాళికగా మర్చాలి, ఎలా అమలుచేయాలి తదితరాలన్నీ నిర్దిష్టంగా ఆ ఆలోచనలోంచి పుట్టినవే. శిక్షణా అవసరాల విశ్లేషణ ఎంత సమగ్రంగా ఉంటే అంత నిర్దిష్టంగా, మెరుగ్గా శిక్షణ అందించడం వీలవుతుంది. ఎంత మందికి శిక్షణ కల్పించాలి, ఎంతమందిని కలిపి ఒక గ్రూపుగా విభజించాలి, వారి ప్రాంతం, వెచ్చించాల్సిన సమయం, నిధుల అవసరాలు, రిసోర్సు పర్సన్ల లభ్యత.. ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని శిక్షణా కార్యక్రమం రూపొందింది. ఇందుకోసం అవసరమైన వనరులను సమకూర్చుకోవడం, పుస్తకాలను ముద్రించడం, వివరాలతో కూడిన బుక్‌లెట్‌లను రూపొందించడం, దృశ్యాల ద్వారా వివరించే ఉపకరణాలను సమకూర్చుకోవడం, కేస్ స్టడీకి అవసరమైన సమాచారాన్ని సేకరించడం, వీడియోల సమీకరణ, కంప్యూటర్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను రూపొందించుకోవడం తదితర అంశాలన్నీ ఈ శిక్షణా కార్యక్రమంలో భాగం. ఒక వ్యక్తిని శిక్షణ ద్వారా సమర్ధవంతంగా తీర్చిదిద్దడం అనేది ఒక విలువైన ఫలితమే. ఒకేసారి గణనీయమైన సంఖ్యలో శిక్షణ కల్పించడం ఒక సమర్ధవంతమైన పనిగా ఉండాలి. రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కల్పించాల్సిన అవసరం ఏర్పడినందున వారిని నిర్దిష్ట సంఖ్యలో గ్రూపులవారీగా విభజించడం అవసరం. పెద్ద మొత్తంలో డబ్బును ఇందుకోసం ఖర్చు చేస్తున్నందువల్ల ఈ శిక్షణ తగిన ప్రయోజనాలను, ఫలితాలను ఇచ్చేదిగా ఉండాలి. శిక్షణ సమయంలోనే దీన్ని లోతుగా ఆలోచించాలి. అయితే ఈ శిక్షణ ఫలితాలు ఇచ్చిందా లేదా అనేదాన్ని నిర్ధారించడానికి, ఒక అంచనాకు రావడానికి అనేక అంశాలపై విశ్లేషణ అవసరం.

ఈ మొత్తం శిక్షణా కార్యక్రమానికి నిర్దిష్టమైన లక్ష్యం, ఎజెండా, ప్రయోజనం ఉంది. ముఖ్యంగా ఒక గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడం; తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడం; ప్రజలకు నాయకత్వానికి మధ్య తలెత్తే వైరుధ్యాన్ని తగ్గించడం; ఒక గ్రామ పంచాయతీ వ్యవస్థ పనిచేయడానికి ఉండాల్సిన నిర్మాణం, విధులు, బాధ్యతలు; స్టాండింగ్ కమిటీ పోషించాల్సిన పాత్రపై అవగాహన; సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శుల విధులు, బాధ్యతలు; ఆర్థిక నిర్వహణ, వనరుల సమీకరణ, అభివృద్ధి పనులకు చేయాల్సిన ఖర్చు; ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమం అమలు; గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు; కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న జీవనోపాధి మిషన్ పర్యవేక్షణ; ఆర్థికాభివృద్ధిలో గ్రామ పంచాయతీల పాత్ర; సేంద్రియ వ్యవసాయ విధానాలపై అవగాహన, స్వయం సహాయక మహిళా బృందాల వ్యవస్థపై అవగాహన.. ఇలా అనేక అంశాలు ఈ మొత్తం శిక్షణా కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మాత్రమే కాక ఎజెండాలోనే పెట్టుకుని లోతుగా అర్థం చేయించేలా రూపొందించుకున్న ప్రణాళిక.

Tuesday, February 12, 2019

A Systematic Approach to Training Sarpanches and Upa-Sarpanches : Vanam Jwala Narasimha Rao


A Systematic Approach to
Training Sarpanches and Upa-Sarpanches
Vanam Jwala Narasimha Rao
The Hans India (13-02-2019)

            A 5-day Foundation Training Program is designed to introduce the newly elected Sarpanches and Upa-Sarpanches as well as Village Panchayat Secretaries to the manifold duties and responsibilities bestowed on them by the new Telangana Panchayati Raj Act 2018. The Program will formally commence from 15th February in the respective districts. Right from analysing the training needs to evaluation system through design development and implementation a Systematic Approach to Training has been adopted for this. The efforts of PR officials is really commendable.

The entire training programme has been designed by following the adult learning principles.  All the sessions use different types of participatory training methods. Being a five-day residential programme, it is mandatory that the Sarpanches coming from Gram Panchayats must participate actively. The various sessions demand a variety of participatory learning methods.  Each session contains an optimum mix of group work and participatory training methods like interactive lecture, guided/group reading, exercises and presentation, case studies, explanatory quizzes, group discussions, buzz group discussion, management games and demonstrations.

Keeping in view of the special nature of the training programme and the necessity of having required number of trainers simultaneously at the district training centres, Telangana State Institute of Rural Development (TSIRD) has come up with a pool of well-trained resource persons. The role of a Resource Person in imparting training is very crucial and important. Their exposure to Chief Minister KCR briefing will be of immense use. Even after completion of training their role as mentors and facilitators to a small group on a continuous basis will go a long way in achieving desired results.

The purpose of Government is to provide services to its people through official and political bureaucrats. They are made responsible to implement the schemes, programs and also provisions of Acts in their letter and spirit. One such responsibility that the Telangana State Government expects to be shouldered by the newly elected Sarpanches and Upa-Sarpanches as well as Village Panchayat Secretaries is implementation of the new Panchayati Raji Act. They will have to shoulder the responsibilities of managing the affairs of the Gram Panchayat efficiently.

Many of the representatives have been elected for the first time.  They would need an exposure to the duties and responsibilities entrusted to them and the powers they exercise. To enable them to reach to optimum level of performance they need to be exposed to Systematic Training to acquire Knowledge and Skills and to change Attitude towards the various roles and responsibilities. Knowledge gives them the Confidence, Skill gives them the Competence and Attitudinal change gives them the required Commitment.


Training is fundamentally a learning experience and learning is a naturally occurring process, which may or may not contribute to a person’s job performance. Training is systematic learning. In comparison to learning, which may also be random, training is being done for a specific purpose as well as quickly and effectively. Training is thus a planned process to modify attitude, knowledge or skill behaviour through learning experience to achieve effective performance in an activity or range of activities.

There is enough of reason for Government to train its Sarpanches, Upa-Sarpanches and Village Panchayati Secretaries expending resources that could be utilized elsewhere. It is not done just as an act of faith or to comply with the procedure. The objective of this training is to provide increased level of service to people with improved quality, better utilization of resources, not to commit mistakes, improved morale etc. In addition the individual trainee would be prepared to cope with the Change and dealing with performance issues resulting from change. The change is in the form of new Panchayati Raj Act entrusting the elected representatives with enormous roles and responsibilities. Performance problems may occur as a consequence of such change, because of existing behavioral deficiencies of Sarpanches. Performance of Sarpanches is ultimately the factor that determines the success of the PR Act. The success of trainers and resource persons and also effectiveness of training will be determined by the future performance of the Sarpanches and other trainees.  

The Systematic Approach to Training (SAT) and development presupposes four stages namely identification of training needs; plan and design; implement and evaluate training. Training Needs Analysis is an overall analysis of where training is needed in relation to improving performance. The purpose of this type of analysis is to identify training and non-training implications affecting performance.   Similarly job analysis and task analysis needs to be done. Performance problems need not be caused due to lack of training.

Performance is influenced by three factors: the first lack of knowledge or skill where training is essential; the second is lack of organizational support where training initiatives are likely to prove ineffective and the third is lack of motivation due to failure to reward good performance, or to punish in some way poor performance. This can be addressed through training effectively.  

A requirement following the identification of training needs is to produce a design brief. This provides a specification of the actual training that needs to be planned, designed, developed and then implemented.  The more detailed the analysis of training needs the more precise will be the specification for the training. The design brief also takes into account such factors as, number of people to be trained, grouping of these people, their location, time scale, budget, availability of resource persons etc. Planning training is based on the Design Brief. Then follows developing training which is an integral part of training design. It is concerned with acquiring or preparing resource materials, such as handouts, visual aids, exercises, case studies, videos and computer-based training software. 

The third stage is implementing training where the actual training takes place. Training one person effectively is a worthwhile achievement, but not necessarily efficient.  Training a large number may be efficient, but it also has to be effective. Here in the case of training sarpanches the number of people who need training is likely to be large.  Appropriate grouping with the size of the group needs to be done. Having spent considerable amount of money, the training should be worthwhile and hence it has to be evaluated. Evaluation can be a highly subjective process, using a wide variety of criteria. 

The content and agenda of the training program among others include, concept of a Model Village; Telangana State Panchayat Raj Act; Leadership and Conflict Reduction; Structure, Roles and Responsibilities of Gram Panchayat and Standing Committees; Roles and Responsibilities of Sarpanches, Upa-Sarpanch, Ward Members and Panchayat Secretaries; Financial Management, Resource Mobilization and Expenditure; Telangana ku Haritha Haram; Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme (MGNREGS); Livelihoods, Role of Gram Panchayat in Economic Development; Agriculture and Organic farming; Self Help Groups etc.

Sunday, February 10, 2019

నడుస్తున్న చరిత్రకు మేలుకొలుపు ..... జ్వాలా "ఇదీ సుపరిపాలన" పుస్తకం : మారంరాజు సత్యనారాయణ

నడుస్తున్న చరిత్రకు మేలుకొలుపు 
జ్వాలా "ఇదీ సుపరిపాలన" పుస్తకం 
మారంరాజు సత్యనారాయణ 
నమస్తే తెలంగాణ దినపత్రిక (11-02-2019) 
నిన్న జరిగిన వాస్తవాలు ఈ రోజు చరిత్ర అవుతుంది. చరిత్ర ఎవరో సృష్టించింది కాదు. మానవ వ్యక్తిత్వ వికాసమే చరిత్ర గమనానికి మూలం. చరిత్రను ఎవ్వరూ సృష్టించరు. మానవ సామాజిక జీవనంలో జరిగిన పరివర్తనలే చరిత్ర.

         తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి గోలకొండ పత్రిక సంపాదకుడుగా ఒక ప్రత్యేక సంచిక వేయ సంకల్పించారు. అందులో ఎవరు రాయాలన్న చర్చ వచ్చినప్పుడు, ఆంధ్ర ప్రాంయానికి చెందిన మేధావి ఒకరు, తెలంగాణలో కవులు శూన్యం అన్నారు. దీనికి ప్రతి సవాలుగా, తెలంగాణలోని  కవులందర్నీ మేల్కోల్పి "గోలకొండ కవుల సంచిక" గా ప్రచురించారు. ఇది చరిత్రలో ఒక భాగం. వర్తమాన, నడుస్తున్న, చరిత్రను పరిశీలిస్తూ, ఎప్పటికప్పుడు వ్యాసాలు రాసి ప్రజలను మేల్కొలిపేవారు మన దేశంలో అంతగా లేరు. స్వాతంత్ర్యం వచ్చాక ఏ నాయకుడు కూడా స్వీయ జీవిత చరిత్ర రాయలేదు. 

జ్వాలా ఒక జ్వాలే. నిరంతరం జ్వలించటం జ్వాలాకు గల ఒక ప్రత్యేక లక్షణం.  ఒకరు రాయమంటే రాసేవాడు కాదు. నడుస్తున్న చరిత్రను పరిశీలించి, పరిశోధించి, విశ్లేషణాత్మకంగా ప్రజల ముందుంచడానికి చేసిన ప్రయత్నమే ఈ పుస్తకం. 

మన ముందు ఉన్న ఈ పుస్తకం ఒక విధంగా నూతన ఒరవడిని సృష్టించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన వారానికి ప్రారంభమైన జ్వాలా వ్యాసాలు నాలుగు సంవత్సరాల మూడు నెలల పాటు వివిధ విషయాలపై కొనసాగాయి. ఆ వ్యాసాల సంపుటమే ఈ పుస్తకం. ఇందులో చాలా వ్యాసాలు వున్నాయి. వీటిలో రెండు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారివి. ఒకటి-రెండు సేకరించినవి. కాగా, మిగిలినవన్నీ జ్వాలా వివిధ సందర్భాలలో, వివిధ దిన పత్రికలలో ప్రచురించిన వ్యాస సంకలనం. ఇవన్నీ ఇదివరకే వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరాయి. ఇందులో కొన్ని ఆధ్యాత్మిక చింతనకు సంబంధించినవి. మిగతావి  రాజకీయ నేపధ్యంలో, పరిపాలనా విషయ నేపధ్యంలో రాసిన విశ్లేషణాత్మక, విమర్శనాత్మక రచనలు. సమకాలీన రాజకీయ సామాజిక  రంగంలో  రాష్ట్రం ఎదుర్కొన్న సవాళ్లకు సమాధానంగా, విమర్శతో పాటూ విశ్లేషణ జోడించి, ఆచరించాల్సిన దృక్పథం గురించి  రాశారు. ఇవన్నీ ఒక విధంగా భవిష్యత్తులో చరిత్ర అవగాహన చేసుకోవటానికి ఉపకరిస్తాయి.  విషయం  ఆధారిత  వ్యాసాలుగా కాక 51 నెలల్లో జ్వాలా స్పందించిన విషయాల దొంతర ఇది. అందువల్ల  పుస్తకం చదవటం మొదలెడ్తే, నడుస్తున్న చరిత్రను మనం ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగా వుంటుంది. ఇది ఒక నూతన  ఒరవడి. చరిత్రను విశ్లేషించే వారున్నారు. చరిత్రను గ్రంథస్థం  చేసే వారున్నారు.  జ్వాలా ఎంచుకున్న మార్గం విమర్శ, విశ్లేషణ, వివరణ, విషయ పరిశీలనకు అతి దగ్గరగా ఉంది.  


         వ్యాసాల రచనలో ఎక్కడా స్కోత్కర్ష ప్రసక్తి లేదు. స్తుతి శూన్యం. మనం చూస్తున్న విషయాలను యధాతథంగా తన శైలిలో  పొందు పరిచారు.  ఇందుకు అభినందనీయుడే. 

ఆ పుస్తకంలో ఏం ఉంది... అని చులకన భావం వ్యక్తీకరించే వారికి, సమాధానంగా సుమారు నాలుగున్నన్నరేళ్ల రాజకీయ, సామాజిక పరిస్తితులను నిష్కర్షగా మన ముందు ఉంచారు జ్వాలా. చాలా మందితో చర్చల్లో పాల్గొనడానికి సిద్ధ పడేవారే గాని, ఆ సారాంశాన్ని గ్రంథస్థం చేయ సాహసించరు. కూత గాళ్లే గాని రాత గాళ్లు చాలా తక్కువగా ఉన్నారు. ఇది కించ పరచడం కాదు. వాస్తవ పరిస్థితి. ఎందుకంటే ప్రతివారు  తన భవిష్యత్తును గురించి ఆలోచిస్తాడే గాని ప్రజల ముందు చరిత్ర కారునిగా నిలుచునే ధైర్యం తక్కువ మందికి వుంది.   

ఈ వ్యాస సంకలనం చదువుతుంటే మనమే రాశామా? అన్న సందేహం రాకపోదు. ఎంచుకున్న శైలి మామూలు మాటల్లో పత్రికలు చదివే అలవాటు ఉన్న ప్రతివాడికి తానే రాశానేమో అన్న భ్రమ కలుగుతుంది.  

విషయాలను వర్గీకరించి రాయలేదు. కేవలం కాలక్రమంలో ప్రాధాన్యత పొందిన విషయాలను మాత్రమే విశ్లేషించారు. ఈ విశ్లేషణ ఏదో ఒక పత్రికలో ప్రచురించినవి కావు. వ్యాసాలు  దాదాపు  రాజధాని నుండి వెలువడుతున్న దినపత్రికలన్నింటిలోనూ ప్రచురితమైనాయి.  పత్రికలు చదివే అలవాటు వున్న వారందరికీ ఈ వ్యాసాలు సుపరిచతమే. 

వివిధ అంశాలపైన జ్వాలా స్పందన నిర్వివాదాంశం. ఎందుకంటే ఏనాటి విషయానికి ఆనాడే స్పందించటం పత్రికల ద్వారా ప్రజలముందుకు వెళ్లటం చాలా సాహోసోపేతమైన విషయం. రెండున్నర సంవత్సరాల రాజకీయ సామాజిక రంగాలను మనకు త్రీడి పిక్చరుగా చూపించారు. విషయ వివరణ ప్రతి వాడిని అలవోకగా  ఆకర్షింప చేసి చూపించింది. కొందరనవచ్చు...గత కాలపు విషయాల పునః ప్రస్తావన ఎందుకని? కాని, ఈ వ్యాస సంకలనం చరిత్రకు ఆధారం. ఇందులో రచయిత స్పృశించని విషయం లేదు. పుష్కరాల ప్రస్తావన, యాగాల వివరణ, ఎంతో విజ్ఞానాన్ని సమకూర్చాయి. చదువరి తను ప్రత్యక్షంగా వీక్షీంచానన్న సంతృప్తి కలుగుతుంది. రోజు రోజుకి రాతగాళ్లు తక్కువైన ఈ  రోజుల్లో  విషయ వివరణను గ్రంథస్థం చేయ సంకల్పించటం సాహసోపేతమైన  కార్యక్రమం. ఇందుకు రెండు దశాబ్దాలకు పైగా అధికార యంత్రాంగ  కేంద్రానికి  దగ్గరగా  ఉండి గమనించటం వల్ల, మనకు, మంచి చారిత్రక,  సామాజిక విషయాలను చెప్పగలిగారు.  ఆయన అనుభవం ఈ వ్యాస పరంపరలో మనకు కన్పిస్తుంది. 

ఒక సందర్భంలో న్యాయస్థానాల తీర్పులను మనకు అర్థమయ్యేలాగా వివరించారు. చరిత్ర తెలుసుకోకుండా వ్యాఖ్యలు రాసిన సామాజిక శాస్త్రవేత్త తప్పును చాలా సున్నితంగా ఎత్తి చూపారు.  యాగాల విషయాన్ని మనకు తెలిసేలా చెప్పటం ఒక కొత్త ప్రయోగంగా నేను భావిస్తున్నాను. పార్టీ ఫిరాయింపుల గురించి  విపులంగా వివరణ ప్రత్యేకత. బ్రిటన్ లోని రాజ్య పత్రాలన్నే బ్రిటిష్ రాణిగారి సంతకాలతో అధికారితను సంతరించుకుంటాయి. ఉరిశిక్షకు సంబంధించిన కాగితం పార్లమెంటు అంగీకరించి, బ్రిటిష్ రాణికి ప్రధానమంత్రి  సమర్పిస్తే, ఆమె సంతకం చేయననే సాంప్రదాయం లేదు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా ఎందుకు తీర్చిదిద్దాలో చాలా సున్నితంగా వివరించారు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే కర్నూలులో డేరాల నగరంలో కాలక్షేపం చేసి హైదరాబాద్ నగరం తరలివెళ్లే   ప్రయత్నం చేశారు.  అప్పుడే ఒక సంవత్సరం తిరగక మందే గుంటూరులో హైకోర్టు పెట్టుకున్నారు. శాసనసభ సమావేశాలను గుంటూరు, విశాఖ పట్టణాల్లో నిర్వహించారు. ఇప్పుడేమో తాము ఏదో పొగొట్టుకున్నట్లు పదేండ్లు  హైదరాబాద్ నగరం వుండాలని పట్టు పట్టారు.  ఇది మన సహోదరుల వాదనకు ఉదాహరణ. 1952 ఎన్నికల్లో ఓడిపోయినా కృష్ణా పెన్నారు ప్రాజెక్టు కడ్తామన్నారు. కాని నందికొండ వారికి ఆనక మీద కరకుగా కన్పించింది.  ఆ నందికొండ మీదే వారు ఆశలు పెంచారని తెలంగాణ వారికి ద్రోహం చేయడం  రచయిత పేర్కొనటం మంచి ఉదాహరణ.

ఈ విధంగా నాలుగున్నరేళ్ల చరిత్ర కథనంలో రచయిత మనకు తెలియని విషయాలను సేకరించి గ్రంథస్థం చేశారు. జిల్లా పాలనా వ్యవస్థ అధికారికమైనదే కాని  రాజ్యాంగబద్దమైన విషయం కాదు. అందకు జిల్లాల పునర్విభజన చేపట్టటాన్ని, దాన్ని విమర్శించిన వారిని తిప్పికొట్టగలిగారు. ఇది  చరిత్ర పుటల డైరీ కాదు. చరిత్రే. ఇందులోని విషయాలు తాత్కాలిక సమాచారం కాదు. ముందు తరాల వారికి తెలియజేసేది. ఇది చేపట్టి పుస్తకంలాగా తేవటం జ్వాలా జర్నలిజంలో ఒక ముఖ్య ఘట్టం. అభినందనీయం.

-ఆచార్య మారంరాజు సత్యనారాయణ రావు
98488 79357

Saturday, February 9, 2019

రాముడి బారినుండి తప్పించుకున్న వైనం రావణుడికి చెప్పిన మారీచుడు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-47 : వనం జ్వాలా నరసింహారావు


రాముడి బారినుండి తప్పించుకున్న వైనం రావణుడికి చెప్పిన మారీచుడు 
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-47
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (10-02-2019)
         “విశ్వామిత్ర యాగ రక్షణ సమయంలో రామచంద్రుడు యుద్ధరంగంలో అందరినీ చంపి నన్ను ప్రాణాలతో ఎందుకు విడిచాడో కారణం తెలియదు. బతికి వుండడం మాత్రం తెలసు. ఇది పాత సంగతి. కొత్తగా ఇటీవల జరిగిన కథ చెప్తా సావధానంగా విను. రాముడితో దెబ్బతిన్న నేను దండకారణ్యంలో గర్వంతో తిరుగుతూ క్రూరంగా ప్రవర్తించేవాడిని. తపస్వుల సమూహాలను తన్ని వాళ్ల నెత్తురు తాగుతూ, వారి మాంసం తింటూ, అధర్మ మార్గంలో వళ్లు తెలియకుండా తిరుగుతుంటే ఒక నాడు, ముని వేషంలో వున్న రామచంద్రుడు, పరమపతివ్రత అయిన సీత, లక్ష్మణుడు ఒకే చోట కనిపించారు. అప్పుడు రామచంద్రుడిని పొడవడానికి పోయాను దగ్గరికి. ఆయన నావైపు చూసి, చాపం ఎక్కుపెట్టి, వజ్రం లాంటి మూడు బాణాలను విడిచాడు. ఆ బాణం వేగం తెలిసన వాడినికనుక ముందే పరుగెత్తాను”.

“రామచంద్రుడి బాణాలు వెనుకవైపు నుండి తగలవు కాబట్టి నేను బతికిపోయాను. నావెంట వచ్చిన వారిద్దరూ ఆ బాణాలు తగిలి చనిపోయారు. రామచంద్రుడిని ఎదిరించి బతకడం ఎవరికీ సాధ్యం? అలా బతికి పోయిన నేను, ఇంకా అలానే తిరుగుతుంటే చంపుతాడనే భయంతో, ఆనాటి నుండి ఈ ప్రదేశంలో గర్వహీనుడనై, యోగాభ్యాసం చేస్తూ, మునిలాగా వున్నాను. ఆ శ్రీరాముడిని మనసులో అనుకున్నా నేను పడే పాట్లు నాకే తెలుసు. రావణా! చెట్టు-చెట్టులో శ్రీరాముడే పెద్ద విల్లు పట్టుకొని, నారచీరెలు, జింక చర్మం ధరించి, పాశం పట్టుకున్న యముడిలా కనిపిస్తున్నాడు. ఎక్కడో చెట్టెక్కి కూర్చుని నాకు కనిపిస్తున్నాడని అనుకుంటున్నావేమో? అలా కాదు. ఒక్క చోటే ఒక్క రాముడు కనిపిస్తే అలా అనుకోవచ్చు. ఎల్ల వేళలా, వేలాది మంది రామచంద్రమూర్తులు, నాకు కనిపిస్తుంటారు. అడవంతా రామమయంగా కనపడుతున్నది. ఇంద్రజాలం అంటావేమో? రాముడు లేని దూర ప్రదేశానికి పోయి వుందామంటే అక్కడా ఆయనే కనపడుతున్నాడు. పగలు, రాత్రి, కళ్ళు మూసుకున్నా, తెరిచినా రాముడే కనపడుతుంటే అరుచుకుంటూ లేస్తాను. ఆ కారణాన నిద్ర అనేది లేకుండా పోయింది. నేనేం చేయాలి?”

“రాముడిని చూసి భయపడడం అలా వుంచితే, ఆయన పేరు వింటేనే భయం కలుగుతున్నది. రాముడి పేరే కాదు...’ర’ కారంతో మొదలైన ఏ శబ్దం, రత్నం, రథం లాంటివి విన్నా రాముడే వస్తున్నాడని భయం కలుగి మనసు కలవరపడుతున్నది. రావణా! రామచంద్రుడి మీద విరోధం మానుకో. యుద్ధంలో నువ్వు ఆయనకు సమానుడివి కాదు. నీ శక్తి నాకు తెలుసు. ఆయన శక్తీ నాకు తెలుసు. ఆయన ఎవరినైనా వధించగల శక్తిమంతుడు. నీకు శక్తి వుంటే, నువ్వే పోయి ఆగ్రహంతో యుద్ధం చేయి. బలం లేకపోతే, అయిందేదో అయింది...ఏం చేయలేమని, బంధువుల మరణం సహించి వూరుకో. మీ ఇద్దరిమధ్య నా ప్రాణం తీయాలని ఎందుకు ఆలోచిస్తావు? ఆ రెండిటిలో ఒకటి చేయి కాని దొంగతనం చేయొద్దు. ఇంకా నేను కొన్ని రోజులు బతికి భూమ్మీద వుండడం నీకు ఇష్టమైతే ఆ సీతాపతి కథ నాతొ చెప్పవద్దు.  నా తలపోయ్యే పనైతుంది. అనేకమంది సాధువులు వాళ్ళు ధర్మాత్ములైనప్పటికీ, ఇతరుల దోషం వల్ల నశిస్తారు. అలాగే, నేను నువ్వు మతిమాలి చేసే పనివల్ల చెడిపోతాను. ఇది నిజం. నీ వెంట రాను. ఈ విషయంలో నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. నన్ను వదిలిపెట్టు”.


“రామచంద్రమూర్తి అసమాన బలాతిశయుడు. దృడమైన తేజస్సు కలవాడు. అధికమైన గర్వం, మనోదార్ధ్యం, శరీర బలం కలవాడు. ఇలాంటి వాడిని రాక్షసజన నాశకుడిగా ఎందుకు చేస్తావు? అడవిలో వారంతట వారు ఒక ఆశ్రమాన్ని ఏర్పాటుచేసుకొని, ఒకరి పేరు ఎత్తకుండా వుంటుంటే, మన శూర్పనఖ పొగరుబోతు తనంతో ఏమని బెదిరించడానికి పోయింది? అంతటితో ఆగకుండా ఖరాడులను యుద్ధానికి పురికొల్పింది. వారంతా గుంపుగా పోయి యుద్ధం చేశారు. రాముడి చేతిలో చనిపోయారు. దీంట్లో రామచంద్రమూర్తి నేరం ఏముందో చెప్పు? బంధువుల మేలు కోరి, నేను చెప్పిన మాటలు నీ చేదైతే, బంధువులతో, స్నేహితులతో, యుద్ధంలో చస్తావు”.

         న్యాయంగా, పనికొచ్చే విధంగా చెప్పిన మారీచుడి హితవాక్యాలు, చావకోరేవాడు వైరాగ్యంతో మందు నిరాకరించినట్లు, రావణుడికి రుచించలేదు. నీతియుక్తమైన, హితమైన మారీచుడి మాటలకు జవాబుగా ఆయన్ను చూసి రావణుడు నిష్టూరంగా మాట్లాడాడు.

Friday, February 8, 2019

Protecting federal autonomy and Safeguard interests of states : Vanam Jwala Narasimha Rao


Protecting Federal Autonomy
and
Safeguard interests of states
Vanam Jwala Narasimha Rao
Millennium Post, New Delhi (08-02-2019)
Telangana Today (11-02-2019)

The Fifteenth Finance Commission of India, whose recommendations will come into effect from April 1, 2020 to March 31, 2025, will be visiting the state from February 18 to February 20, to have discussions with Chief Minister and top officials of state Finance Department ostensibly to decide on state’s requirement of devolution of funds. To what extent state’s requirements are really taken into consideration and met on various aspects is however an unanswered question. In reality it has to play a crucial role in Indian federal system and should usher in a new era of need based fiscal federalism. For five years the state’s financial and economic conditions as well as fiscal plans will be richly influenced by the recommendations of 15th Finance Commission.

It is time that the Finance Commission thinks of leveraging the Indian Economy and changes its role in such a way that its functioning is not a mere routine affair. Despite different Governments at the National and State Level since independence, there has not been a qualitative change in the approach of Finance Commission. It’s high time that the Commission introspects on this. The people are in an agitating mood as they are totally disappointed with the policies of Union Governments lead by either BJP or Congress Party that were in power alternately. The two political systems have miserably failed the nation.

            The broad fiscal policy lies with the Government of India. Whatever they are supposed to devolve, they have instead centralized. As suggested by CM in a meeting of NITI Ayog, the centre should not come in the way of growing states. The growth of the state should be considered as the growth of country. Disincentivising growing states is not a healthy practice. It’s alright if the poor states are helped but the states which provide maximum income to the country are also to be equally encouraged.

            Share in the tax devolution to the states whose percapita income is higher, is reduced, by labelling them as rich states. For instance, for Telangana state which has a surplus budget, the Finance Commission decided to give 2.4375% of share in the tax devolution, whereas for AP the devolution has been put at 4.305%. Accordingly Telangana in 2018-19 financial year got Rs. 18,560 Crores where as AP benefited with Rs. 32,787 Crores. This would continue even in 2019-20 financial year also. Telangana will get Rs. 20,583 Crores and AP will get Rs. 36,360 Crores. The northern state of Uttara Pradesh gets much higher at Rs. 1,15,682 crores. Even if we take the percapita tax devolution in to consideration Telangana’s will be much lower than that of AP. This means, Telangana which is one among the five-six states that contribute maximum income to the country is not getting its due share in the tax devolution.

Even for meager funds lots of conditions are imposed by the center. The fiscal relationship that should exist between union government and state government is conspicuously absent. Its unfortunate that the policies of devolution is in a manner of dishonoring state governments and states’ powers than respecting their views.


The role of the Finance Commission with specific reference to its visits to states with pre-occupied notions needs to be reformed. They come with pre-occupied designs and Terms of Reference (ToR) which in fact should be done after they complete their visit, discuss with state governments and take their views. The ToR, however, are listed in the Presidential Order appointing the Commission. The Commission of course has no role in the framing of the ToR. In fact the core functions of the Finance Commission are listed out in article 280 of the Constitution and they are reproduced verbatim in the ToR. What is a matter of concern is ToR stipulates certain considerations to be taken into account while making its recommendations and a number of other matters are referred to the Commission in the interest of sound finance. The considerations are invariably biased in favour of the Center. Its better if the Finance Commission becomes a policy formulating body than a mere recommendatory institution. Devolution is the right of the states. Lot of diversity is there with reference to states’ requirements.

The Finance Commission to be appointed once in five years, as an autonomous body, was first established by the President of India on 22nd November 1951 under Article 280 of the Constitution. The commission consisting of a Chairman and four other members is constituted to make recommendations to the president about the distribution of the net proceeds of taxes between the Union and States and also the allocation of the same among the States themselves. It is also under the domain of the Finance Commission to define the financial relations between the Union and the States. The President lays the recommendations of the Finance Commission before each House of the Parliament. As of now there have been fifteen finance commissions. The recent one-the 15th Finance Commission was constituted in November 2017 and is chaired by NK Singh, a former member of the planning commission and a retired IAS officer.


The Finance Commission also determines the principles of governing the grants in aids of the revenues of states out of the consolidated fund of India. It also distributes proceeds of Income-tax between the union and the states. But taxes on the payments of the central government are attributable only to the union territories. It makes recommendations to the President of India as to the measures needed to augment the fund of a state to supplement the resources of the Panchayats and Municipalities in the state on the basis of recommendations made by the finance commission of the state.

It is however desirable that the Finance Commissions mainly focuses on the financial relations between the State government and the Central government. These recommendations are expected in such a way that it ensures a progressive increase in the share of the state governments in the proceeds of the income tax. They should also recommend for increase gradually the amount of grants-in-aids to be given to the states. If this is done systematically it would have resulted in considerable degree of financial autonomy of states for the proper functioning of the cooperative federation. In addition to the Constitutional provisions, to bridge the fiscal gap between the Centre and the States as well as ways and means of sharing resources between the Union and States, the Finance Commission is expected to serve as an institutional framework to facilitate Centre-State Transfers.

The mandate of the present Finance Commission as defined in the ToR covers to recommend a fiscal consolidation roadmap for sound fiscal management; assess the impact of Goods and Service Tax (GST) on finances of the Centre and States; review the need for revenue deficit grants to states; review the need to increase in tax devolution of the 14th Finance Commission; review conditions on state borrowings; providing performance based incentives to states etc. among others. What is of concern is that the 15th Commission has been asked to look into the impact of higher tax devolution recommended by the 14th Finance Commission.

Incidentally, right from the first Chairman of the first Finance Commission, till today, more than half of them were the politicians belonging to the ruling party that was in power at the centre. Even the Chairman of the 15th Finance Commission, NK Singh too became a Rajya Sabha Member after retirement and has been a senior member of BJP.

What else can we except from them except safeguarding interests of the party in power. The Finance Commission should not give scope to such doubts. Let us hope that the 15th Finance Commission thinks in this direction and will not do any injustice to states. And hence, it’s time that the style of Finance Commission transforms and reforms.