Thursday, March 7, 2019

కీలక పదవుల్లో అతివలు: వనం జ్వాలా నరసింహారావు


కీలక పదవుల్లో అతివలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా
ప్రపంచ వ్యాప్త మహిళా సాధికారత
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (08-03-2019)
నెల్లూరు జిల్లా నుండి పదేళ్ళ క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి స్థిరపడి, వ్యాపార రంగంలో అద్భుత విజయాలను సాధిస్తున్న ఒక మహిళా పారిశ్రామిక వేత్తను, ఇటీవల కలవడం జరిగింది. ఆమె ఎంచుకున్న వ్యాపారం కూడా ఆసక్తికరమైనదే. అందంగా, చక్కగా, ఆహ్లాదకరంగా కనిపించాలనుకునే స్త్రీ-పురుషులందరికీ ఆమె నెలకొల్పిన ఆ అందాల, అద్దాల హరివిల్లు సాదర స్వాగతం పలుకుతుంది. ఎందుకీ వ్యాపారంలోకి దిగావనీ, ఎలా విజయవంతం అయ్యావనీ ఆమెను ప్రశ్నిస్తే, వచ్చిన జవాబు ఆశ్చర్యకరంగా వుంది. ఒకప్పుడు, తనకు అవసరమైనప్పుడు ఒక వంద రూపాయలకు కూడా ఇతరులపై ఆధార పడాల్సి వచ్చిందనీ, పట్టుదలగా పనిచేసి, తన కాళ్ళ మీద తాను నిలబడాలనుకున్న ఆలోచనే తనను ఇంత దాన్ని చేసిందనీ, ఆ విద్యాధికురాలు అత్యంత నమ్రతతో చెప్పినప్పుడు నాకనిపించింది ఒకటే..... ఏ కార్యం సిద్ధించాలన్నా, నెరవేరాలన్నా సాధన అవసరమని. సాధనకు మరోపేరు కృషి అంటారు. “కృషితో నాస్తి దుర్భిక్షం” అని అంటారు. “సాధనమున పనులు సమకూరు ధరలోన” అని కూడా అన్నారు. వయసులో చిన్నదైనా పట్టుదలలో పెద్దదైన ఆ మహిళామణికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు.

ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆ నేపధ్యంలో, సామాజికంగా, ఆర్థికంగా,రాజకీయంగా, ప్రపంచ వ్యాప్తంగా మహిళలు రాణించడం, చాలా రంగాల్లో పురుషులను అధిగమించడం గత శతాబ్దంలోను, ముఖ్యంగా ఈ శతాబ్దంలోను గమనిస్తున్నాం. ఇతర రంగాలకంటే కూడా,మహిళలు, రాజకీయంగా అంచలంచలుగా ఎదగడమే కాకుండా, అధికారంలోకి వచ్చిన పలు దేశాల్లో, అనేక సంస్కరణలకు శ్రీకారం కూడా చుట్టారు. మహిళలకు ఓటు హక్కు ఇవ్వండి అని పురుషులను ఒకానొక నాడు అడిగిన ఆ మహిళలే, అనేక హక్కులను తమకు, పురుషులకు కూడా కలిగించే స్థాయికి ఎదిగారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం, సమానత్వం, దినదినాభివృద్ధి చెందుతున్నదనడానికి ఇంతకంటే నిదర్శనం మరోటి లేదు. ఈ నేపధ్యంలో, ప్రపంచ వ్యాప్తంగా, గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయ రంగంలో మహిళలు గణనీయంగా ఎదిగి, పలు దేశాలకు అధ్యక్షులుగానో, ప్రధాన మంత్రులుగానో కావడం, అలా అయిన వారిలో కొందరు ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందడం తెలిసిన విషయమే.

ప్రపంచంలోనే మొట్టమొదటి సారి ఒక మహిళ, 1960 లో, సిరిమావో బండార నాయకే, శ్రీలంక ప్రధాన మంత్రిగా, అధికారంలో రావడంతో అంతర్జాతీయంగా ఒక సంచలనం కలిగింది. ఎలా ఒక మహిళ ఆ ఉన్నత పదవిలోకి రాగలిగిందని, ఎలా పాలన చేయబోతున్నదని, ప్రపంచ వ్యాప్త చర్చ జరిగింది. ఆ తరువాత ఎందరో మహిళలు, సుమారు వంద మందికి పైగా,  ప్రధానులుగా, అధ్యక్షులుగా, ఎన్నో దేశాల్లో అధికారం చేపట్టారు. ఇంకా అది కొనసాగుతూనే వుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ గెలిచినట్లయితే, ఆ దేశ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలయ్యేది ఆమె. ఇక భవిష్యత్ లో పురుషాధిక్యత రాజకీయాలకు చాలా దేశాల్లో స్వస్తి చెప్పాల్సిందే. ప్రస్తుతం, వర్తమాన ప్రపంచ దేశాల్లో సుమారు 20 మందికి పైగా దేశాధినేతలుగా వున్నారు. ఈ సంఖ్య పోను-పోను పెరుగుతుంది. ఇరవై-ఇరవై ఒకటో శతాబ్దాలలో గణనీయమైన సంఖ్యలో వివిధ దేశాల్లో ప్రధానులుగా, అధ్యక్షులుగా వున్న మహిళల్లో చాలా మంది ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వారైనప్పటికీ, కొందరికి మాత్రమె తెలిసుండే అవకాశం కూడా వుంది. వారిలో కొందరు అతి తక్కువ కాలం అధికారంలో వుండగా, మరి కొందరు దీర్ఘకాలం పదవుల్లో వున్నారు. కొందరికి వారసత్వంగా లాభం చేకూరగా, మరికొందరు ఎన్నికల సమరంలో కొత్తగా దిగి గెలిచారు.

శ్రీలంక ప్రధాన మంత్రిగా సిరిమావో బండార నాయికే మూడు సార్లు ఆ పదవిలో వుంది. ఆ తరువాత ఆమె కూతురు చంద్రికా కుమార తుంగ కొంతకాలం అధ్యక్షురాలిగా, ప్రధానిగా వుంది. సెప్టెంబర్ 1959 లో భర్త హత్యానంతర పరిణామాలలో బండార నాయికే  రాజకీయాల్లోకి రావడం, తన భర్త అడుగుజాడల్లో ఆయన సామ్యవాద విధానాలనే కొనసాగిస్తానంటూ ఎన్నికల్లో ప్రచారం చేయడం, సానుభూతి కొరకు తరచూ కళ్ల నీళ్ల పర్యంతం కావడం, అప్పట్లో చర్చనీయాంశాలయ్యేవి. 1965 ఎన్నికల్లో ఓటమిపాలైన ఆమె, తిరిగి 1970 లో గెలిచి రెండోసారి ప్రధాని అయింది. శ్రీలంక అధ్యక్షురాలిగా 1994 లో ఎన్నికైన కూతురు చంద్రిక, సిరిమావోను మూడోసారి ప్రధానిని చేసింది.


ఒక తరం పైగా భారతదేశంలో నెహ్రూ కుటుంబీకులు, పాకిస్తాన్ లో భుట్టో కుటుంబీకులు, బంగ్లాదేశ్ లో ముజిబుర్ రెహ్మాన్ కుటుంబీకులు అధికారంలో వున్నారు. 20 వ శతాబ్దపు విశ్వవిఖ్యాత మహిళ ఇందిరా గాంధీ భారత ప్రధానిగా రెండు విడతలుగా బాధ్యతలు నిర్వహించింది. మొదట తండ్రి మరణానంతరం లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో సమాచార ప్రసార శాఖల మంత్రిగా పదవిని చేపట్టిన ఇందిర, శాస్త్రి హఠాన్మరణం తరువాత ప్రధాని పదవి దక్కించుకుని, మొదటి విడతలో సుమారు 11 సంవత్సరాలు ప్రధానిగా పనిచేసింది. ఎమర్జెన్సీ విధించి, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి 1977 ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఆమె ఓటమికి కారణమైన జనతా కూటమి రెండున్నర ఏళ్ల కన్నా ఎక్కువ అధికారంలో కొనసాగ లేకపోయింది. 1980 లో జరిగిన ఎన్నికల్లో గెలిచి మరో మారు ప్రధాని కాగలిగింది. 1984 లో దారుణ హత్యకు గురైంది. గొప్ప రాజనీతిజ్ఞురాలిగా ప్రపంచ వ్యాప్త మన్ననలను పొందింది. బంగ్లాదేశ్ విమోచన కారణ భూతురాలైంది. అపర దుర్గగా, కాళికామాతగా ప్రతిపక్షాల మెప్పును కూడా పొందింది. ఆమె కోడలు ప్రధాని కాలేకపోయినా అనధికారిక ప్రధానిగా పదేళ్లు యుపిఎ ఛైర్ పర్సన్ గా వుంది. ఆమె మరో కోడలు ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర మంత్రి. అలానే ప్రతిభా పాటిల్ భారత రాష్ట్రపతిగా అరుదైన గౌరవం పొందారు. స్పీకర్ పదవిని అలంకరించిన మీరా కుమార్, సుమిత్రా మహాజన్ ప్రపంచంలోనే అలాంటి పదవులు పొందిన అతి కొద్దిమందిలో ఒకరు.

ఇజ్రాయిల్ దేశం వ్యవస్థాపకుల్లో ఒకరైన గోల్డా మీర్, మొదట్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ, భర్తతో పాటు ఉద్యమంలో పాల్గొనేది. రాజకీయాలలో కూడా చురుగ్గా వుండేది. 1948 లో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వంలో మంత్రి అయింది. దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత సోవియట్ యూనియన్ లో ఇజ్రాయిల్ రాయబారిగా గోల్డా మీర్ ను నియమించింది ప్రభుత్వం. దరిమిలా దేశానికి తిరిగొచ్చిన ఆమె లేబర్ పార్టీ జనరల్ సెక్రటరీ గా వుండగా, అప్పటి ప్రధాని హఠాన్మరణంతో, తన 70 వ ఏట, 1969 లో ఇజ్రాయిల్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి, ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగింది. 1978 లో చనిపోయింది.

బ్రిటన్ మొట్టమొదటి మహిళా ప్రధాని మార్గరెట్ థాచర్ రసాయన శాస్త్ర పరిశోధకురాలిగా, బారిస్టర్ గా పని చేసి, 1953 లో ఆ దేశ చట్ట సభ హౌజ్ ఆఫ్ కామన్స్ కు ఎన్నికైంది. వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహించింది. 1975 లో ప్రతిపక్ష నాయకురాలిగా ఎన్నికైంది. 1979 లో ప్రధాని పదవి వరించిందామెను. పటిష్ఠ నాయకురాలిగా పేరు తెచ్చుకున్న థాచర్, అసంతృప్తిని అణచడంలో ఆరితేరిన మహిళగా ప్రసిద్ధికెక్కింది. 1990 లో ఆమె నాయకత్వాన్ని సవాలు చేసినప్పుడు, ప్రధానిగా రాజీనామా చేసి, హౌజ్ ఆఫ్ కామన్స్ నుంచి కూడా తప్పుకుంది. 1982 లో అర్జెంటినా నుంచి ఫాక్ లాండ్స్ ను వెనక్కు తీసుకోవడానికి ఆమె సైన్యాన్ని పంపింది. ఆమె ప్రవేశ పెట్టిన ప్రభుత్వ రంగ సంస్కరణలు నేటికీ పలు దేశాల్లో అమల్లో వున్నాయి. ఆమెను విమర్శించిన వారు సహితం వాటిని కొనసాగించారు. ప్రస్తుత బ్రిటీష్ ప్రధాని థెరెసా మేరీ మే బ్రిటీష్ రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి. 

సూంగ్ సోదరీమణులుగా ప్రసిద్ధికెక్కిన చైనా దేశానికి చెందిన ముగ్గురు అక్కచెల్లెళ్లు, ఆ దేశంలోని అత్యంత శక్తిమంతులైన ముగ్గురు ప్రముఖులను వివాహం చేసుకున్నారు. వాళ్లు జీవించిన కాలంలో ఆ ముగ్గురూ ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కినవారే. అందరిలోకి పెద్దదైన సూంగ్ ఐ లింగ్, అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన చైనా దేశపు ఆర్థిక మంత్రి హెచెచ్ కంగ్ ను పెళ్లాడింది. ఆమె తరువాత రెండో సోదరి సూం చింగ్ లింగ్ చైనా జాతి పితగా పేరుగాంచిన, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా మొదటి అధ్యక్షుడిగా పనిచేసిన సన్ యట్ సేన్ ను పెళ్లి చేసుకుంది. 1968 - 1972 మధ్య కాలంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా సంయుక్త అధ్యక్షురాలిగా, 1981 లో గౌరవాధ్యక్షురాలిగా పనిచేసిందామె. చివరి సోదరి సూంగ్ మే లింగ్ కూడా ఒక ప్రముఖ రాజకీయ వేత్త. ఆమె ఒకప్పటి చైనా అధ్యక్షుడైన చియాంగ్ కై షేక్ ను పెళ్లి చేసుకుంది. నవ చైనా రాజకీయ, ఆర్థిక, వర్తమాన చరిత్రలో ఆ ముగ్గురు సోదరీమణులు ప్రముఖ పాత్ర వహించారు.

జుల్ఫికర్ అలీ భుట్టో కూతురు బేనజీర్ భుట్టో, తండ్రి వారసురాలిగా, 1988–90, 1993–96 మధ్య కాలంలో రెండు పర్యాయాలు పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా పనిచేసింది. ప్రపంచంలోని ముస్లిం దేశాలలో ఆమె కంటే పూర్వం ఏ మహిళ కూడా ప్రధాని కాలేదు. బేనజీర్ కూ ఆ ఖ్యాతి దక్కింది. తండ్రిని ఉరితీసిన మూడేళ్లకు కేవలం 29 సంవత్సరాల వయసులోనే, తండ్రి స్థాపించిన రాజకీయ పార్టీ చైర్ పర్సన్ గా ఎన్నికై, దరిమిలా 1988 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని గెలిపించి, ఆ దేశ ప్రధాని అయిందామె. 2008 ఎన్నికలకు రెండు వారాల ముందు, ఒక బాంబ్ పేలుడు సంఘటనలో మరణించింది బేనజీర్. 1991 - 1996, 2001 - 2006 మధ్య కాలంలో బంగ్లాదేశ్ ప్రధానిగా ఎన్నికైన బేగం ఖలీదా, బేనజీర్ తరువాత ఇస్లాం దేశాలలో ఆ పదవిని చేపట్టిన రెండవ మహిళ. ఏడేళ్ల కింద అధికారంలోకి వచ్చి, ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రధాన మంత్రిగా వున్న షేక్ హసీనా వాజేద్, ఆ దేశపు రెండవ మహిళా అధ్యక్షురాలు. బంగ బంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ పెద్ద కూతురామె. తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో కొంతకాలం ఆమె ప్రతిపక్ష నాయకురాలిగా కూడా పనిచేసింది హసీనా.

న్యూజీలాండ్ 37 వ ప్రధానిగా 1999 లో పదవిలో కొచ్చిన హెలెన్ ఎలిజబెత్ క్లార్క్ వరుసగా మూడు సార్లు 2008 వరకు ఆ పదవిలో కొనసాగింది. ఎన్నికల్లో గెలిచిన తొలి మహిళా ప్రధాని హెలెన్. 2004 నుంచి 2010 వరకు మొజాంబిక్ అధ్యక్షురాలిగా వున్న లుఇసా డయాస్ డిఓగో ఆ దేశానికి మొదటి మహిళా అధ్యక్షురాలు. జర్మనీ రాజకీయ నాయకురాలు ఎంజెలా డొరోథియా మెర్కెల్ 2005 నుంచి ఆ దేశ ఛాన్స్ లర్ గా వుంది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన తూర్పు జర్మనీ ప్రభుత్వంలో ఆమె అంతకు ముందు అధికార ప్రతినిధిగా కూడా పనిచేసింది. కమలా పర్సాద్ బిస్సెస్సార్ 2010 నుంచి 2015 వరకు ట్రినిడాడ్-టొబాగోల ఏడవ ప్రధానిగా వుంది. ఆమె ఆదేశపు మొదటి మహిళా ప్రధాని. ప్రస్తుతం ఆమె ప్రతిపక్ష నాయకురాలు. 2010 నుండి 2013 వరకు ఆస్ట్రేలియా 27 వ ప్రధానిగా వున్న జూలియా ఐలీన్ గిల్లార్డ్ మొదట్లో ఉప ప్రధానిగా కూడా పదవిలో వుంది.

ఇలా ఎందరో మహిళలు దేశ దేశాల్లో కీలకమైన పదవుల్లో వుండడం గత ఐదారు దశాబ్దాల మహిళా సాధికారతకు నిదర్శనం. భవిష్యత్ లో మరి కొన్ని దేశాల అధ్యక్ష-ప్రధాన మంత్రులుగా మహిళలే ఎన్నిక కావాలని కోరుకుందాం.

Justice K Ramaswamy and Samata Judgement : Vanam Jwala Narasimha Rao


Justice K Ramaswamy and Samata Judgement
Vanam Jwala Narasimha Rao
The Hans India (08-03-2019)
Justice K Ramaswamy former Supreme Court Judge who passed away on 6th March, was popularly known for one of his landmark Judgements known as Samata Judgement that upheld the rights of Tribals on their lands in tribal areas. The state government, in a befitting manner, conducted his funeral with all respects to the departed soul.
Samata was a non-governmental organisation that worked for the rights of the tribal people as it found them being alienated from their lands and exploited by non-tribal people and the state, in contravention of the Fifth Schedule of the Constitution and various Central and State government laws.
After a prolonged struggle, it approached Courts. The case it filed in the then Andhra Pradesh High Court in 1993 against the then State government was dismissed. Then, Samata filed a Special Leave Petition in the Supreme Court. After a four-year legal battle, it won. Supreme Court declared null and void the transfer of land in the Scheduled Areas for private mining and upheld the Forest Protection Act of 1980, which prohibits mining in reserved areas. The Supreme Court held that the state should adhere to the laws and principles governing the tribal areas, as any other person.
Mr. Justice K. Ramaswamy and Mr. Justice Sagir Ahmed said in their judgement that: “The Governor, in his personal responsibility, is empowered to maintain peace and good governance in a Scheduled Area. The Fifth Schedule empowers him to regulate allotment of land, between natural persons, Tribals and non-Tribals, and it imposes total prohibition of the transfer of the land in the Scheduled Area. Wider interpretation of `regulation' would include `prohibition' which should be read into that clause. If so read, and a purposive construction is placed, the word `person' would include natural persons as well as juristic persons and constitutional Governments.''
The Supreme Court's judgment annulled all assignment of forest land to private entrepreneurs. The two Judges, however, allowed transfer of forest land to State instrumentalities, such as the Mineral Development Corporation, or to a Cooperative of Tribals on the condition that, they should set apart at least 20 per cent of the net profit as a permanent fund for setting up schools, hospitals, transport and sanitation facilities for the Tribals, the Judges said.
One of the assets of the tribal is the availability of minerals in their areas. Very large number of mineral deposits exist in the tribal tracts of which much is known but remain under exploited or unexploited and thereby left un-utilized. If these areas are properly investigated and exploited, there will be tremendous development of mining and mineral based industries resulting in industrial employment for the tribal. The entire tribal belt is potentially rich in both high grade and low grade metallic and non-metallic deposits.

Vast mineral potential in tribal areas can be commercially exploited, perhaps involving tribal community, and number of downstream mineral industries can also be developed for value addition and exports. When this is achieved it would not be difficult to create any permanent arrangement to create a permanent “Royalty Developmental Dividend Fund” for tribal development.
Tribal can also be uplifted by suitably granting certain percentage of shares in mining business. This will naturally make them aware of the importance of mineral in their land holds and steadily make them know the intricacies in the business and trade and thus encourage and promote them to join the stream of business management
Ultimately this will enhance their standard of living.
The Land Transfer Regulation I of 1970 had positively attempted to restore the land owned by non-tribal to tribal in Scheduled Areas. It introduced the presumptive clause, that, Land owned by a non-tribal in a Scheduled Area will be deemed as acquired from a tribal until the contrary is proved. The Regulation made it imperative that any non-tribal holding land in the Scheduled Area shall not transfer it to even any non-tribal. It stipulates, that, any transfer of immovable property situated in the agency tracts by a ‘person’, whether or not such a ‘person’ is member of a Scheduled Tribe, was absolutely null and void, unless such transfer is made in favour of a ‘person’, who is member of a Scheduled Tribe or a society, registered under the Cooperative Societies Act, 1964 which is composed solely of members of Scheduled Tribes.
Regulation I of this Act is the primary law for the protection of the rights of the tribal over their lands. The Regulation as it stood originally, prohibited alienation of lands by tribal to non-tribal unless prior written permission on sanction of the competent authority was obtained. That Regulation also empowered the Agent (Collector) to decree an ejectment against any non-tribal in possession of any land the transfer of which was made in contravention of its provisions and to restore such lands to the transferors or their heirs. Regulation II of 1963 later extended the Regulation, which was originally for the Andhra Area, to Scheduled Areas of Telangana also.
The Regulation had generated considerable amount of land restoration activity in the tribal areas till 1979. According to the ‘Tribal Cultural Research and Training Institute’, the number of non-tribal occupations in Scheduled Areas detected as prima-facie violating Land Transfer Regulation run in to several thousand and the extent of land in that was estimated to be several Lakhs of acres. A little over fourth of that extent could only be restored to tribal population. In fact, the figures also revealed then, that, in couple of thousands of instances non-tribal could get favourable orders involving an extent of over a Lakh of acres.
Against this, it is time now, to look in to the various aspects of Supreme Court Judgment dated July 11, 1997 (Nearly 20 years ago) in the Public Interest Litigation. The Division Bench consisted of Justice K. Ramaswamy, Justice S. Sagir Ahmed and Justice G.B. Patnaik. The Judgment made it very clear; that, the word ‘person’ would include the State government and as such transfer of land in Scheduled Area by way of lease, for mining purpose in favour of non-tribal stands prohibited. The Government also stands prohibited to transfer the mining leases to corporation aggregate etc except to its instrumentality says the Judgment. At one point of time the then President of India announced, that, a “Committee of Governors” would be formed to look into the serious inadequacies in the implementation of programs for the welfare of Scheduled Castes and Scheduled Tribes. The Supreme Court judgment also came out with several recommendations and what was the follow-up from the state and central governments subsequently is not known.

Tuesday, March 5, 2019

అభివృద్ధి కోసమే పార్టీ మార్పు : వనం జ్వాలా నరసింహారావు


అభివృద్ధి కోసమే పార్టీ మార్పు
వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (06-03-2019)
తెలంగాణ రాష్ట్ర సమితిలో, వారూ-వీరూ అనే తేడాలేకుండా,ఆ పార్టీ-ఈ పార్టీ అనే భేదం లేకుండా, అను నిత్యం, ఎన్నికైన వివిధ స్థాయి ప్రజాప్రతినిధులతో సహా, వేలాది మంది రాజకీయ కార్యకర్తలు చేరడం రాజకీయ పునరేకీకరణ ఆవశ్యకత, వారి-వారి ప్రాంతాల, మొత్తం రాష్ట్రం  అభివృద్ధి పరచడమే అనుకోవాలి. ఒక మహోన్నత ఉద్యమ నేపధ్యంలో, ఒక కొత్త రాష్ట్రం ఏర్పడిన నేపధ్యంలో, ఆ రాష్ట్రం బంగారు రాష్ట్రంగా అవతరించాల్సిన ఆవశ్యకత నేపధ్యంలో,ఒక పార్టీ టికెట్ మీద గెలిచి, మరో పార్టీలో చేరడం సమంజసమే. ఇది అనైతికమనే వారికి రాజకీయ పునరేకీకరణ ఆవశ్యకత, రాష్ట్రాభివృద్ధి ఆవశ్యకత అంతగా అర్థం కాదు. పార్టీ మారుతున్నవారి దృష్టిలో తాము మరో పార్టీలో చేరుతున్నామనే భావన కన్న మిన్నగా, ఆ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్రాభివృద్ధికి అమలు చేస్తున్న అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులు కావడమే. గతంలో వారు ప్రాతినిధ్యం వహించిన పార్టీలు ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతిపక్ష పాత్ర పోషించలేని దుర్గతిలో వుండడమే వారంతా ఆయా పార్టీలను వదిలి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడానికి కారణమనేది నిర్వివాదాంశం. ఇటీవల ఇతర పార్టీల టికెట్ల మీద గెలిచి తెరాసలో చేరుతున్న కొందరు ఎమ్మెల్యేలు చెప్తున్న మాట కూడా అదేకదా?

తెలంగాణను అడ్డుకోవడానికి అడుగడుగునా కుట్రలు జరిగినట్లే, సాధించుకున్న తెలంగాణను అస్థిర పరచడానికి కూడా వరుస కుట్రలు జరిగాయని, వాటన్నింటినీ ఎదుర్కోవడానికి రాజకీయ పునరేకీకరణ అవసరమౌందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పదే-పదే చెప్తుంటారు. చెన్నారెడ్డి ఆధ్వర్యలో 1969లో జరిగిన మహోన్నత ఉద్యమం నుంచి 2014 వరకు తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా కుట్రలు జరిగాయి. ఏర్పడిన తరువాత కొత్త రాష్ట్రాన్ని అస్థిరపరచడానికి కూడా కుట్రలు జరిగాయి. ఈ ఉద్యమాల నేపధ్యంలో లోతుగా ఆలోచిస్తే, రాజకీయ అవసరాల కోసం ఆషామాషీగా చేరికలు జరగడం లేదని, తెలంగాణ గెలిచి నిలిచేందుకు అనుసరిస్తున్న వ్యూహంలో భాగంగానే పునరేకీకరణ జరుగుతున్నదని స్పష్ఠంగా అర్థమవుతుంది.

         తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక్కడే ఉద్యమ దిశగా బయలు దేరాడు. తర్వాత కొద్ది మంది మిత్రులు ఆయనతో జమయ్యారు. తెలంగాణ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలనే విషయంపై ప్రతీ ఒక్కరితో చర్చలు జరిపారు కేసీఆర్. 1969లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారితో కూడా మాట్లాడారాయన. వారు వారి అనుభవాలను కేసీఆర్ తో పంచుకున్నారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్య బద్ధంగా, రాజకీయ చర్యల ద్వారా తెలంగాణ సాధించాలన్న తన వ్యూహాన్ని, తన మనసులో వున్న ఆలోచనలను వారికి వివరించారు. కానీ వారు ఈయన వ్యూహాన్ని అంగీకరించలేదు. దాని వల్ల తెలంగాణ రాదని చెప్పారు. 1969 లాగానే ఉద్యమం నడవాలని వారు కోరుకున్నారు. కానీ కేసీఆర్ వినలేదు.

“మీకు స్టేట్ ఫైట్ కావాలా? స్ట్రీట్ ఫైట్ కావాలా?” అని వాళ్లను ప్రశ్నించారు కేసీఆర్. తాను “స్టేట్ ఫైట్” చేస్తాను కాని “స్ట్రీట్ ఫైట్” చేయలేను అని అంటూ, స్ట్రీట్ ఫైట్ కోసం తన అవసరం లేదని కూడా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. కేవలం జై తెలంగాణ నినాదాలతోనే తెలంగాణ రాదని అన్నారు. చాలా వ్యూహాత్మకంగా,డిప్లమాటిక్ గా ముందుకుపోవాలని స్పష్టం చేసారు. తెలంగాణ ఉద్యమం ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదని కూడా ఆనాడే స్పష్టం చేశారు. తాను నడిపే ఉద్యమంలో “ఆంధ్ర గో బ్యాక్” నినాదాలు ఉండవన్నారు. “మన నీళ్లు, మన నిధులు, మన ఉద్యోగాలు మనకు దక్కడం కోసం తెలంగాణ కావాలి కానీ, ఎవరికో వ్యతిరేకంగా కాదని” చెప్పారు. తన రాజనీతిజ్ఞతను ఆనాడే ఆయన ప్రదర్శించారు. అలా తన అభిప్రాయాలను, వ్యూహాలను ఒక్కొక్కరికీ విడమరిచి చెప్పారు. చర్చోపచర్చలు సాగాయి. మూడు నాలుగు వేల గంటల చర్చలు సాగాయి. ఎంతో మేధో మథనం జరిగింది. తెలంగాణ ఎట్ల వస్తదని అడిగినవారికి తెలంగాణ సాధన అనేది మన కన్విక్షన్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఉద్యమం నడిపే తీరుపైనే తెలంగాణ సాధన ఆధారపడి ఉంటుందని కూడా వివరించారు. తెలంగాణ సమాజాన్నంత ఒకవైపుకు తిప్పగలిగితే తెలంగాణ వస్తుందని అన్నారు. చివరకు తెలంగాణ ఉద్యమంపై తనకున్న వ్యూహాన్ని వారు అర్థం చేసుకున్నారు. అప్పటి నుంచి కేసీఆర్ వెంటే అందరూ నడిచారు.


         తెలంగాణ ఉద్యమం ఓ రాజకీయ పార్టీగా ముందుకుపోతుండడంతో మొదట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, ఆంధ్ర శక్తులు ఉద్యమాన్ని నీరు కార్చేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. ఆ తరువాత వచ్చిన అకంగ్రేస్ ప్రభుత్వాలు అదే పని చేశాయి. రకరకాల పద్ధతుల ద్వారా ప్రయత్నాలు చేశారు. కుట్రలు చేశారు. వారు ప్రధానంగా నాలుగు పద్ధతులు అవలంభించారు. మొదటిది: విభజించి పాలించు అనే పద్దతిని పాటించి, తెలంగాణ సమాజాన్ని విడదీయడానికీ, ఐక్యత లేకుండా చేయడానికి ప్రయత్నాలు; రెండవది: తెలంగాణ ఉద్యమ నాయకత్వ వ్యక్తిత్వ హననం, అంటే, క్యారెక్టర్ అసాసినేట్ చేయడం ద్వారా ప్రజల్లో ఉద్యమ నాయకత్వం పట్ల విశ్వసనీయత లేకుండా చూడడం; మూడవది: మీడియా ద్వారా అబద్ధాలు ప్రచారం చేయడం; చివరగా: ప్రభుత్వ అండతో ఉద్యమాన్ని అణచివేసే చర్యలు చేపట్టడం. ఈ నాలుగు పద్దతుల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చి,స్వరాష్ట్ర ఆకాంక్షను రూపుమాపాలని నిరంతర ప్రయత్నం జరిగింది. కేసీఆర్ కు కూడా అనేక బెదిరింపులు వచ్చాయి. వెనుకంజ వేయాలని కలలు కన్నారు. అయినా సరే వెనుకడుగు వేయవద్దని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఎన్ని ఇబ్బందులు కలిగినా, నిర్భంధం ఎదురైనా ఉద్యమాన్ని కొనసాగించారు.

         2004 ఎన్నికల తర్వాత కేసీఆర్ కేంద్ర మంత్రి అయ్యారు. ఢిల్లీలో ఎక్కువ సమయం గడిపారు. కేంద్ర మంత్రిగా ఉన్నంత కాలం ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీల చుట్టూ తిరిగారు. తెలంగాణ ఏర్పడడానికి అనుకూలంగా 36 రాజకీయ పార్టీలను ఒప్పించారు. సిపిఐ బర్థన్ తో 30 సార్లు సమావేశమయ్యారు. మాయావతితో 19 సార్లు సమావేశమయ్యారు. అప్పుడు తెలంగాణ పడుతున్న గోస గురించి, ప్రత్యేక రాష్ట్రం కావాల్సిన అవసరం గురించి సిడి తయారు చేయించి, ఢిల్లీలో నాయకులందరికీ చూపించారు. ప్రతీ ఎంపికి, ప్రతీ పార్టీకి కొరియర్ చేశారు. అందరికీ తెలంగాణ గోస అర్థమయింది కానీ, తెలంగాణ వస్తుందనే నమ్మకం చాలా మందికి లేకుండె. ఎంత చేసినా సరే తెలంగాణ రాదు అనే అపనమ్మకం ఏర్పడడానికి గత అనుభవం కూడా ఓ కారణమే.

         1969 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సారధ్యం వహించిన స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గొప్ప తెలంగాణ బిడ్ద. ఆయన ఉద్యమాన్ని ఆకాశం ఎత్తుకు లేపారు. ఆనాటి ఆయన ఉద్యమమే మలివిడతగా చేపట్టిన కేసీఆర్ సారధ్యంలోని ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందనాలి. 1970-1971 లో ఇందిరకు మాస్ లీడర్ గా మంచి పేరొచ్చింది. పాకిస్తాన్ తో యుద్ధానికి ముందు ఇందిర 30-40 దేశాలకు వెళ్లి అక్కడి నాయకులతో మాట్లాడింది. తాను చేయబోయే బంగ్లాదేశ్ విమోచన గురించి చెప్పింది. చివరకు బంగ్లాదేశ్ ఏర్పాటైంది. దరిమిలా ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. దేశమంతా ఇందిర పార్టీ గెలిచినా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో చెన్నారెడ్డి నాయకత్వంలోని ప్రజాసమితి, ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా పోటీ చేసి 11 లోక సభ స్థానాలను గెలుచుకుంది. వీళ్లందరినీ తీసుకుని చెన్నారెడ్డి ఇందిరా గాంధీ దగ్గరకు వెళ్లారు. ఆమె ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అని, ప్రజల కోరిక మన్నించి,తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

ఇందిరాగాంధీ కొందరి సలహా తీసుకుంది. ఒక్క కొత్త రాష్ట్రం ఏర్పాటు చేస్తే ఇలాంటి డిమాండ్లు ఎన్నో వస్తాయని, తెలంగాణ ప్రజలు అడిగిందేదైనా ఇవ్వొచ్చు కాని ప్రత్యేక రాష్ట్రం మాత్రం ఇవ్వొద్దని సలహా ఇచ్చారు వారు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం రావడం లేదని తెలిసిపోయిందో అప్పుడే నాయకత్వాన్ని తిట్టడం మొదలైంది. కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నం చేశారు. అందరం కలిసి చేరుదామని చెప్పిన చెన్నారెడ్డి, ఇందిర నుంచి కొన్ని సేఫ్ గార్డ్స్ కు అంగీకరించేలా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణలోని కొందరు చెన్నారెడ్డిని ద్రోహిగా చిత్రీకరించడం వెనుక కూడా ఆంధ్రా వాళ్ల కుట్ర వుంది. ఆంధ్ర పత్రికల పాత్ర కూడా వుంది. 

         చెన్నారెడ్డి రోజులనుంచి నేటి దాకా ఆంధ్రా వాళ్ల కుట్రలు కొనసాగుతూనే వున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కూడా దీన్ని అస్థిరపరిచే కుట్ర జరిగింది. తెలంగాణ బతికి బట్ట కట్టదని ప్రచారం జరిగింది. మనుగడ సాగదని అన్నారు. రాష్ట్రపతి పాలన విధించే ప్రయత్నాలు కూడా జరిగాయి. టీఆరెస్ కు స్నేహంగా వుండే మజ్లీస్ పార్టీ ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా వుంటామని ప్రకటించిన తరువాత తోలి శాసన సభలో పార్టీ బలం 63 నుంచి 70 కి చేరింది. అలా..అలా.. ప్రభుత్వానికి అండగా వుండాలని భావించి చాలా మంది టీఅరెస్ తో కలిసారు అప్పట్లో. శాసన సభలో సంఖ్య 90కు చేరుకుంది. రాజకీయ స్థిరత్వం పూర్తిగా వచ్చింది.

         2018 లో జరిగిన ఎన్నికల్లో ఆశించనట్లే తెలంగాణ రాష్ట్ర సమితి అఖండ విజయాన్ని సాధించింది. 88 అసెంబ్లీ స్థానాలను గెల్చుకుంది. మజ్లీస్ పార్టీ తన ఎదు స్థానాలతో తెరాసకు మద్దతు ప్రకటించింది. ఎన్నికలైన వెంటనే ఇండిపెండెంట్లుగా గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు. నిన్న-మొన్న జరిగిన రాజకీయ పరిణామాల్లో మరో ముగ్గురు వేరే పార్టీవాళ్లు కూడా తెరాసలో చేరారు. ఈ సమాఖ్య ఇంకా దాటినా దాటవచ్చని పత్రికలు రాస్తున్నాయి. చేరినవారందరూ, చేరబోతున్న వారూ, తమ నియోజకవర్గ, రాష్ట్ర అభివృద్ధికి తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అమలుపరుస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులమైనామని ప్రకటించారు. వారు ఆకారనాన పార్టీ మారితే తప్పేంటి?

ఇతర పార్టీలనుండి వచ్చిన వారి చేరికతో పార్టీ-ప్రభుత్వం మరింత బలపడుతున్నది. తెలంగాణ అన్ని రకాల బాగుపడాలి. ఇతర పార్టీలనుండి వచ్చిన వారిని చిల్లర రాజకీయాల కోసం టీఆరెస్ లో చేర్చుకోవడం లేదు. తెలంగాణ నిలిచి గెలవాలి. ఈ రోజు తెలంగాణ వున్న పరిస్థితుల్లో తెలంగాణ అభివృద్ధిని కాంక్షించే శక్తులన్నీ ఏకమై, తెలంగాణాను అభివృద్ధి చేయాలి. తెలంగాణలో రాజకీయ సుస్థిరత, ఆర్థిక సుస్థిరత సాధించడం జరిగింది. ఇదే పంథా కొనసాగాలి. అందుకోసమే పునరేకీకరణ అవసరమైంది. ఆద్యతన భవిష్యత్ లో మరికొందరు పార్టీ మారినా ఆశ్చర్యం లేదేమో!!!

Sunday, March 3, 2019

Changing role of Collector : Vanam Jwala Narasimha Rao


Changing role of Collector
Telangana Today (06-03-2019)
Vanam Jwala Narasimha Rao
The Dynamic Collector
Millennium Post, New Delhi (05-03-2019)
Collector’s Institution and its relevance
The Pioneer, Hyderabad (04-03-2019)

            Posting of non-cadre officers as Collectors to three districts in Telangana faced criticism from IAS cadre and media reported that discontent is growing among them. Whether it is an IAS direct recruit or conferred IAS or non-cadre Collector, it need not make much of a difference in the ever changing scenario of district administration. In fact a conferred or a non-cadre senior officer is certainly much more experienced, matured and more informed than the direct recruit, since, they served in almost all subordinate positions before climbing the ladder.  

The formation of new districts paved way for the young IAS officers to become District Collectors earlier than expected. There is a haunting doubt here and there that all is not well with few of them. There are also apprehensions that some of these young IAS officers are unaware of the social and political equations prevailing in the districts to shrewdly deal with matters. There may or may not be truth in it. There might be avoidable lapses due to ever changing social scenario, inexperienced approach to matters and inadequate maturity as well as lack of well laid conventions.


Apart from this, with indications that the land management responsibilities would be shifted from the purview of District Collector, relevance to the Institution of Collector is lost. Investment support (the Rythu Bandhu) scheme which is already in implementation has literally put an end to land revenue tax collection. Abolition of revenue courts has already been mooted and a proposal likely to be under consideration to make agriculture officer in charge of land registrations in place of MROs. When peeped into the historic origin, need, concept, evolution, growth and importance of the Institution of Collector over a period, then, the diminishing role of the institution is significantly apparent.


            Even for various other development and welfare activities there is a direct span of control and hierarchy down to the field level from top to bottom for delivery which were with the Collector. Aasara pensions are directly monitored by state level welfare departments, drinking water is directly monitored by the rural water supply or Mission Bhagiratha organization, irrigation projects or power supply or agriculture related or to that matter any of the activity that hitherto normally controlled by district Collector is no more in that style. He or she merely supervises rather controls. Any experienced administrator cadre or non-cadre would be able to handle these instead of a full-fledged Indian Administrative Officer as Collector.

The institution of Collector and District Magistrate was created more than 200 years ago suiting to the needs of those days. It was one of the most significant institutions transmitted by the colonial rulers to independent India's public administration system. It was the highest functionary of the District Administration in the country. The British built on the oriental system and established the present system of field administration. The creation of a district as unit of administration and the appointment of the District Collector as Head of District Administration laid the foundation for stable administration in India.


SS Khera a member of the Indian Civil Service and a former Cabinet Secretary documented the need, concept, evolution and genesis of district administration in in India. The Institution has a long incessant history. It was in existence during the Mauryan period, during the Gupta period, during the Mughal period and during the British rule though was known with different nomenclatures. Going back to the code of Manu, where village was projected as a self-contained republic, every thousand villages were grouped together making it as a district. If we divide the present number of villages (642, 000) in the country by the number of districts (723) it is (around 890) more or less the same ratio even now.

When East India Company became the governing agency of the British Government in London, their principal representative in the district originally known as supervisor became the collector of land revenue and agent of the government in the district later. Warren Hastings created the institution of Collector in 1772 and hitherto supervisors were appointed as Collectors. From then onwards collection of revenue became the most important duty of the company's civil servants. The office of the District Collector became an important institution of the British local administration. Collector's role has gone through several changes since then. By the time India gained independence the District Collector had become an important functionary. Constitution of India is however silent on the district as a unit of administration or about collector and district magistrate except a passing mention about district judges.

Until the later part of the nineteenth century, no Indian was eligible to become a district collector. With the introduction of open competitive examinations for the Indian Civil Services, the office was opened to Indians. Anandaram Baruah, the sixth Indian and the first Assamese ICS officer, became the first Indian to be appointed a District Magistrate. The district continued to be the unit of administration after India gained independence in 1947. The role of the District Collector remained largely unchanged.

As far as Telangana is concerned, until Salarjang reforms in 1864 there was no such institution. Originally there were four Subhas in Hyderabad State, namely, Aurangabad, Gulbarga, Medak and Warangal. Subedars were heading them. Later Subhas were converted as Districts and each district was headed by a Talukdar. At district level he was called as Avval Talukdar, followed by Duvvam Talukdar at revenue division and so on. Their role was to collect tax and credit it to Nizam’s treasury. 

Broadly, the Collector is expected to perform Revenue Administration, Police Administration, District Administration and serve as an Agent of the Government. However, after independence, the importance of revenue administration has become secondary. The emphasis shifted to Development Administration. Revenue Divisional Officers, Tahsildars (MROs), Revenue Inspectors and Village Officers assist the Collector. District Collector also functions as District Magistrate and is supposed to be responsible for the maintenance of law and order in the district. With the introduction of Panchayati raj and local self-government institutions a new situation was created in the governance at the district level. Collector’s institution gradually became a coordinating agency.

During the British period the collector used to belong to the Indian Civil Services and now belongs to the (IAS) Indian Administrative Services generally. Collectors are expected to be the agents of change, of good governance and of development and welfare administration at the very base of our democratic structure. The hopes and aspirations, the lives and livelihood of the people are to be shaped by the Collectors. Over the years, the role of collectors has been dramatically and constantly changing adding on day-by-day, several development and welfare related facilitator and supervisory responsibilities rather regulatory functions. 

If only the Collector who represents the government at the district which is the important administrative unit adheres to the principles of changing value system all over the world and also in India, then all would be well. It matters little whether the Collector is a direct recruit IAS or conferred IAs or a non-cadre senior Administrative Officer posted as per seniority.

Saturday, March 2, 2019

మాయ జింకను చంపాల్సిందేనని లక్ష్మణుడికి చెప్పిన రాముడు ..... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-50 : వనం జ్వాలా నరసింహారావు


మాయ జింకను చంపాల్సిందేనని లక్ష్మణుడికి చెప్పిన రాముడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-50
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (03-03-2019)
         సీతాదేవి కోరిన విధంగా మృగాన్ని పట్టుకోవాలని భావించిన శ్రీరామచంద్రమూర్తి సంతోషంగా లక్ష్మణుడితో అన్నాడిలా: “ లక్ష్మణా! చూశావా! ఈ జింక మీద సీతకు ఎంత ఆశ కలిగిందో? ఆడవారి మాటలకు, కోరికలకు ఏముంది అంటావా? అది వేరే సంగతి. మనం కూడా ఇలాంటి సౌందర్యంకల జింకను చూశామా? మున్ముందు చూడగలమా? ప్రపంచమంతా మనం చూశామా? ఎక్కడేముందో ఎవరికి తెలసు అంటావేమో? చూడకపోతే పోనివ్వు. ఈ లోకంలో కాకపొతే పోనీ. ఇంద్రుడి నందనవనంలో కుబేరుడి చైత్ర రథం వుందని ఎవరైనా చెప్పగా విన్నామా? లేదుకదా? దీని (జింక) కాంతి ఆకాశాన్ని తాకుతున్నది కదా? బంగారు వన్నెతో ప్రకాశించే చుక్కల సమూహంతో అందంగా వుందికదా? వెంట్రుకలు కొన్ని అనులోమంగా, కొన్ని ప్రతిలోమంగా వున్నాయి కదా? అది ఆవలిస్తే మేఘం నుండి వెలువడ్డ మెరుపు లాగా అగ్నిజ్వాల లాంటి నాలుక నోటి నుండి బయటకు వస్తున్నది”.

         “ఈ జింక ముఖం ఇంద్రనీల కాంతి లాగా, కడుపు శంఖం లాగా ముత్యంలా తెల్లగా, ఠీవి సౌందర్యంలో అతి గొప్పగా వుంది. ఇలాంటిది ఎవరి మనసు హరించదు? అనేకమైన రత్నకాంతులతో నిండి, బంగారు వన్నెతో కూడి, రూపం చూడగానే సీత మాట ఎలావున్నా, ఏ మనుష్యుడి మనస్సు కరగకుండా వుంటుంది? రాజులు మాంసంకొరకు వేటలో మృగాలను చంపుతారు. ధాతువులనే మణులను, బంగారాన్ని, ధనసమూహాన్ని, వేటలోనే సంపాదిస్తారు. రాజుకు సర్వం అడవిలోనే దొరుకుతుంది. ఈ మృగాన్ని చంపడం వల్ల ఏవిధంగా విశేషార్థ లాభం కలుగుతుంది అంటావా? బంగారుమయమైన ఈ శ్రేష్టమైన జింక చర్మం మీద సీతాదేవి నాతొ కలిసి కూర్చోవాలని ఆశపడుతున్నది. మృగజాతుల్లో భూమ్మీద ఈ జింక, ఆకాశంలో చంద్రుడిలోని జింక, రెండే మనోహరమైనవి కాని మిగతవన్నీ కావని నా అభిప్రాయం. ఇది మాయామృగం. జీవితంలో పట్టుబడదు. అందుకే దీన్ని చంపాలి”.

         శ్రీరాముడు లక్ష్మణుడితో ఇంకా ఇలా అన్నాడు. ”ఈ కారణాన పరాక్రమంతో దీన్ని చంపడమే తగిన పని. ఈ ప్రదేశంలోనే పూర్వం వాతాపి అనే రాక్షసుడు మునుల కడుపుల్లో ప్రవేశించి తేలులాగా వాళ్ల పొట్టలు పగుల చీల్చి హింసామార్గంలొ నడుస్తుండే వాడు. ఒకనాడు అగస్త్య ముని వాడిని తిన్నాడు. అతడి కడుపులోంచి లేవడానికి ప్రయత్నించే సమయంలో అగస్త్యుడు వాడు భయపడేట్లు, రాక్షసుడు బ్రాహ్మణులంటే లక్ష్యం లేకుండా దయాహీనుడై పాపం పనులు చేస్తున్నాడనీ, శాశ్వతంగా తన కడుపులో జీర్ణమై పోమ్మనీ అన్నాడు. ఆ విధంగా అగస్త్యుడు వాడిని చంపాడు.  వీడూ ఆ వాతాపి అంతటి వాడే! అగస్త్యుడి వల్ల వాడు ఎలా చచ్చాడో, వీడు కూడా మనల్ని మోసగించడానికి వచ్చాడు కాబట్టి, వీడూ చావాల్సిన వాడే. నేను వేటకోసం పోతాను. నువ్వు ధృడ ప్రయత్నంతో సీతకు అపాయం కలగకుండా కాపాడాలి. మన ప్రయత్నాలన్నీ ఈమె మీదే ఆధారపడి వున్నాయి. కాబట్టి శ్రద్ధగా రక్షించు. ఈ మృగం నువ్వు చెప్పినట్లు రాక్షసమాయ అయితే చంపుతాను. లేక సహజ మృగమే అయితే జాగ్రత్తగా పట్టి తెస్తాను. వీట్లో ఏదో ఒకటి చేస్తాను. లక్ష్మణా! సీతాదేవిని చూస్తుండు జాగ్రత్తగా. ఆ మృగం చర్మం మీద ఎంత మొహం పెట్టుకుని చూస్తున్నదో కదా!”


         “కాబట్టి ఒక్క బాణంతో ఈ జింకను చంపి చర్మం తీసుకుని శీఘ్రంగా వస్తాను. ఒక బాణ ప్రయోగానికి ఎంతసేపు పట్తుందో, అంత సేపట్లోనే వస్తాను. నేను బాణం ప్రయోగించడమే ఆలశ్యం. నేను వచ్చేదాకా ఈ సీతను నువ్వు హెచ్చరిక తప్పకుండా ఏకాగ్రమనస్సుతో సర్వదా కాపాడు తమ్ముడా. పక్షిరాజైన జటాయువు కార్యసాధన సమర్థుడు. మంచి బలవంతుడు. కార్యాలోచన, కార్యదక్షత, ధైర్యం కలవాడు. ఆయన నీకు సహాయకుడుగా ఈ సీతాదేవిని ప్రతిక్షణం, ఏ మూల ఏం జరుగుతుందో అన్న ఏమరుపాటుతో, ఏమాత్రం పొరపాటు చేయకుండా ఒక వ్రతంగా భావించి రక్షిస్తాడు”.

         (శ్రీరాముడి చర్య వలన గ్రహించాల్సిన నీటి వుంది. ఆయన భ్రమ పడడమే కాకుండా, లక్ష్మణుడు చెప్పినా వినలేదు. మారీచుడి మాయ అని నమ్మితే, ఉన్నచోటే వుండి బాణ ప్రయోగం చేయవచ్చుకదా? జింక వెంట పోవాల్సిన పని లేదు. కాకాసురుడి వెంట పడి పోలేదుకడా? కాబట్టి అది నిజమైన జింకే అన్న భ్రాంతి వదలలేదు. సీతాదేవి లోకమాన్య స్త్రీ అవుతుందా? ఆమెకు తెలియని విషయాలు లేవు కదా? బంగారు జింక లోకంలో వుండదని తెలియదా? పరమ భక్తికల సీత ఎందుకు ఒక క్షుద్ర మృగానికై భర్తను వదిలి వుండాలని అనుకుంది? కాబట్టి కర్మానుసారం బుద్ధి అనే నీటి బలపడుతున్నది.

         పరమార్థం విచారిస్తే....మనుష్యులకు కోరికలు కోరే స్వాతంత్ర్యం వుంది. దాన్ని నెరవేర్చే భారం భగవంతుడి మీద వుంది. ఎవరే కోరికలు గట్టిగా కోరినా భగవంతుడు దాన్ని నెరవేరుస్తాడు. కాని దాని ఫలం అనుభవించమని అంటాడు. కాబట్టి మంచి కోరికలు కోరేవారికి మంచి ఫలమే కలుగుతుంది. చెడు కోరికలు కోరేవారికి కలిగేది చెడు ఫలమే! ప్రకృతి విషయమైన కోరికలు కోరేవారందరికీ సీతాదేవికి పట్టిన గేటు పట్తుంది. మారీచుడి మాయే ప్రకృతి. ప్రపంచంలో మనం చూసేవి, వినేవి అన్నీ ప్రకృతి చిత్రాలే! సీతాదేవి మాయ జింకను చూసి భ్రమించి ఆశపడినట్లు మనం కూడా చిత్ర-విచిత్రమైన ప్రకృతి పదార్థాలను చూసి సత్యమని భ్రమ పడుతున్నాం. ఇవి సత్యం కావు. క్షణభంగురాలు. ఆ జింక వల్ల సీతాదేవి ఎలా సుఖపడాలని కోరుకుందో అలాగే మనం ప్రకృతి పదార్థాలవల్ల ఆనందపడాలని కోరతాం. రామచంద్రమూర్తి సీతాదేవి కోరిక నేరవేర్చినట్లే మనకోరికనూ నెరవేరుస్తాడు. సీతాదేవి అనుభవించిన ఫలం మనం కూడా అనుభవించబోతున్నాం. సీతకు ఏం ఫలం కలిగింది? అది మున్ముందు తెలుసుకుంటాం).