Saturday, February 8, 2020

వాలి బలపరాక్రమాలను శ్రీరాముడికి తెలిపిన సుగ్రీవుడు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-16 : వనం జ్వాలా నరసింహారావు

వాలి బలపరాక్రమాలను శ్రీరాముడికి తెలిపిన సుగ్రీవుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-16
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (09-02-2020)   
         తన దుఃఖం ఉపశమించేట్లు చేస్తానని శ్రీరాముడు చెప్పిన మాటలకు సంతోషించిన సుగ్రీవుడు రామచంద్రమూర్తితో ఇలా అన్నాడు. “అసమాన కీర్తీ! నువ్వు కోపంతో బాణాలను వదిలితే, అవి లయకాలంలోని సూర్యకిరణాల లాగా, లోకాలన్నిటినీ అల్పకాలంలో కాల్చి బూడిద చేస్తాయి. అయినప్పటికీ, వాలి ధైర్యం, ఆయన అద్భుత పరాక్రమం గురించి చెప్తాను. ఏకాగ్రచిత్తంతో విను. విన్నతరువాత ఎలాంటి ఉపాయం చేయాల్నో ఆలోచించి అలాగే చేయి. వాడు పెద్ద-పెద్ద కొండలను పైకి ఎత్తి చిన్నపిల్లలు గోలీలు ఆడినట్లు ఆడుతాడు. ప్రతిరోజూ సూర్యోదయం కాకముందే సంధ్యవార్చడానికి తూర్పు సముద్రంలో స్నానం చేసి, దక్షిణ సముద్రంలో ఆచమనం చేసి, పడమటి సముద్రంలో అర్ఘ్యం ఇచ్చి, మరో సముద్రంలో జపం చేసి, సూర్యోపస్థానం చేస్తాడు. ఇలా వాలి ప్రతిరోజూ నాలుగు సముద్రాలలో సంధ్యవారుస్తాడు. ఇంత తిరిగి వచ్చినా కొంచెమైనా అలసట వుండదు వాలికి. తన బలాన్ని ప్రదర్శించడానికి అడవిలోని పెద్ద-పెద్ద చెట్లను చేతిదెబ్బతో విరగ్గొట్టుతాడు. నిర్మలచిత్తా! అతడి బలం వర్ణించడం కష్టం”.

దుందుభి వృత్తాంతాన్ని శ్రీరాముడికి చెప్పిన సుగ్రీవుడు
         “వెండికొండ శిఖరంలాంటి తేజస్సుకల దుందుభి అనే మహిష స్వరూపంకల ఒక రాక్షసుడు, వరబలంతో వేయి ఏనుగుల బలం కలవాడై, సముద్రుడిని చూసి, తనతో యుద్ధానికి రమ్మని పిలిచాడు. వీడికి చేటుకాలం సమీపించినదని తలచిన సముద్రుడు, అతడితో యుద్ధం చేయడానికి తాను సరిజోడీకాదని, ఈశ్వరుడి మామ, కొండలరాజు, తపస్సు చేసేవారికి ఆశ్రయం ఇచ్చేవాడు, అనేకమైన గుహలతో ప్రకాశించేవాడైన హిమవంతుడు దానికి సరిపోతాడని చెప్పాడు. సముద్రుడిని భయపడ్డాడని తలచాడు దుందుభి. యుద్దాసక్తుడైన దుందుభి హిమవంతుడి మీదకు పోయాడు. ఇలా పోయి, తన కొమ్ముల బలంతో పెద్ద-పెద్ద బండలను నేలమీద పడవేయసాగాడు. అప్పుడు హిమవంతుడు తెల్లటి రూపంతో శిఖరం మీదనుండి వాడితో ఇలా అన్నాడు”.

         “రాక్షస శ్రేష్టుడా! నన్నెందుకు బాధపెట్టుతున్నావు? నువ్వేమో ధర్మాత్ముడివే? నేను మునులకు ఆశ్రయమిచ్చేవాడిని. నువ్విలా చేస్తే వాళ్లకు హాని చేసినట్లేకదా?”. హిమవంతుడి మాటలకు జవాబుగా దుందుభి, “నువ్వు భయపడితే, నాతో యుద్ధం చేయగలవాడి పేరు చెప్పు” అని అంటాడు. హిమవంతుడు “మహాధైర్యవంతుడు, బలవంతుడు, ఇంద్రుడితో సమానమైనవాడు, చాలా బుద్ధిమంతుడు, వాలి అనే వానరుడు కిష్కింధలో వున్నాడు. అతడు నీతో సంతోషంగా ద్వంద్వ యుద్ధం చేస్తాడు. యుద్ధం చేయాలని నీకు కోరిక వుంటే అతడిమీదకు యుద్ధానికి పో. అతడు వెంటనే నిన్ను చక్కగా చేస్తాడు. నముచికి యుద్ధ బిక్ష ఇంద్రుడు ఇచ్చినట్లు, నీకు వాలి ఇస్తాడు” అని వాలి దగ్గరకు పొమ్మంటాడు దుందుభిని.

వాలిమీదకు యుద్ధానికి పోయిన దుందుభి
         “పాపాత్ముడైన దుందుభి రాక్షసుడు రోషంగా, గర్వంగా, కళ్ళు మూసుకుపోగా, కాళ్ళ తొక్కిడితో భూమి వణకుతుంటే, కిష్కింధకు పోయి, మహిష స్వరూపం ధరించి, వాడి కొమ్ములతో ఏనుగులాగా చెట్లను, నగరం బైటున్న తలుపులను చీల్చాడు. విచ్చలవిడిగా ఆ రాక్షసుడు చెవులు దద్దరిల్లేట్లు నగారాలాగా మధ్య-మధ్యన పెద్ద ధ్వని చేశాడు. అంతఃపురంలో వున్న వాలి ఈ చప్పుడు విని స్త్రీలతో సహా బయటకు వచ్చి ఆ రాక్షసుడితో, ఆతడు దుందుభి అని తనకు తెలుసనీ, దనుజ శ్రేష్టుడైన ఆతడు ఎందుకు ఈ విధంగా బుద్ధిలేకుండా తన పట్టణం వాకిట్లో ధ్వని చేస్తున్నాడనీ, అతడికి ఉపిరితో జీవించి వుండాలన్న ఆశ లేదా అనీ, వుంటే మరెక్కడికైనా పొమ్మనీ అంటాడు”.

జవాబుగా దుందుభి, “వాలీ, ఆడవారి ఎదురుగా పౌరుషపు బింకాలు పలకగానే వచ్చిన లాభం ఏంటి? నువ్వు పరాక్రమంకలవాడివైతే, యుద్ధానికి రా. నీ భుజబలం ఎలాంటిదో అప్పుడు తెలుస్తుంది. అలా కాకపోతే ఉదయం దాకా వేచి వుంటాను. నీ ఇష్ట భార్యలతో అప్పటిదాకా సుఖపడు. నువ్వు ఇంటికి పో. పరలోకంలో నీకు సుఖం కలగడానికి చేయాల్సిన దానాలు చేయి. నీకు ప్రియమైన వారినందరినీ కౌగలించుకో. నీ స్త్రీలతో భోగించు. పట్నమంతా ఒక్కసారి కడసారిగా కలియచూడు. నీతో సమానమైన వాడిని రాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేయి. ఆ తరువాత రా యుద్ధానికి. నీ పొగరు అణచి వేస్తాను. మత్తు పదార్థాలు తినడం వల్ల, తాగడం వల్ల, శరీరం తెలియని వాడిని, ప్రమాదంలో వున్నవాడిని, నిద్రించేవాడిని, ఆయుధాలు లేనివాడిని, నీలాగా కామంతో వొళ్ళు తెలియనివాడిని చంపితే భ్రూణహత్యాదోషం వస్తుంది” అంటాడు.

“దుందుభి చెప్పిన మాటలు విన్న వాలి, చిరునవ్వు నవ్వి, తన భార్య తారను, ఇతర స్త్రీలను ఇళ్లకు పొమ్మని, రాక్షసుడిని చూసి, “అసుర శ్రేష్టుడా! నువ్వు పిరికివాడివి కాకపోతే నన్ను మట్టుడిగా అనుకోవద్దు. నేను తాగింది వీరపాణం అనుకో. చూడు..కాచుకో” అని చెప్పి, తనతండ్రి ఇచ్చిన బంగారు దండను మెడలో ధరించి త్వరగా పోయి రాక్షసుడైన దుందుభిని తాకాడు. ఇలా తాకి, వాడిమీద పడి గట్టిగా అదిమి, పౌరుషంగా వాడి కొమ్ములు పట్టుకుని రివ్వు-రివ్వున వాడిని తిప్పి-తిప్పి, వాడు బలహీనుడై పోగా, నేలమీద కొట్టాడు. నేలమీద పడ్డ వాడు చెవులనుండి నెత్తురు కారుతుంటే, ధీరుడై లేచాడు. మోకాళ్ళతో, మోచేతులతో, చెట్లతో, పెద్ద రాళ్లతో వాలి మహిషాసురుడిని వలంగా కొట్టినా దుందుభి భయపడకుండా వాలిని ఎదుర్కున్నాడు. ఒకరినొకరు గెలవాలని యుద్ధం చేశారు. క్రమక్రమంగా, అంతకంతకు వాలి బలం పెరిగింది. రామచంద్రా! దుందుభి బలం తగ్గింది. దీనికి కారణం వాలి ధరించిన బంగారు దండ. అది శత్రువు దేహాన్ని తాకినప్పుడల్లా వాడి బలం లాగి వాలి దేహంలో ప్రవేశపెట్టుతుంది. అదే దండలోని మంత్రబలం”.

Tuesday, February 4, 2020

ప్రైవేట్ భాగస్వామ్యం దిశగా... : వనం జ్వాలా నరసింహారావు

ప్రైవేట్ భాగస్వామ్యం దిశగా...
వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (05-02-2020)
స్వాతంత్య్రం పొందిన కొత్తల్లో భారతదేశం కేవలం వ్యవసాయ ఆధారిత దేశం మాత్రమే. పారిశ్రామికంగా బాగా వెనుకబడ్డ దేశం. త్వరితగతిన పారిశ్రామికీకరణ జరగాలనీ, ఆర్థికంగా దేశం పరిపుష్టం కావాలనీ, ఆర్థికాభివృద్ధి వేగంగా జరగాలనీ, ఆర్ధిక స్వావలంభన చేకూరాలనీ, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవ్వాలనీ జాతియావత్తూ కోరుకుంటున్న రోజులవి. తదనుగుణంగానే 1948 లో ప్రకటించిన ప్రప్రథమ పారిశ్రామిక విధానంలో పారిశ్రామికాభివృద్ధికి విస్తృత వ్యూహం రూపొందించడం జరిగింది. దరిమిలా మంత్రిమండలి తీర్మానం ద్వారా 1950 లో ప్రణాలికా సంఘం ఏర్పాటు కావడం, 1951 లో పారిశ్రామిక చట్టం రూపుదిద్దుకోవడం చకాచకా జరిగిపోయాయి.

ఈ రెంటి ద్వారా పారిశ్రామికాభివృద్ధిని వేగవంతంగా, నియంత్రణ విధానంలో చేపట్టడానికి ప్రభుత్వానికి సాధికారత చేకూరింది. ప్రప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మదిలో మెదిలిన ఆర్ధిక విధానం అటు అమెరికా తరహా పెట్టుబడిదారీ విధానం కాకుండా, ఇటు సోవియట్ తరహా సామ్యవాద విధానం కాకుండా, మిశ్రమ ఆర్ధిక విధానంగా వుండేది. నెహ్రు జాతీయ పారిశ్రామిక విధానానికి అనుగుణంగా రూపుదిద్దుకున్న 1956–60 నాటి రెండో పంచవర్ష ప్రణాళిక, 1956 నాటి పారిశ్రామిక విధాన తీర్మానం, ప్రభుత్వరంగ సంస్థల ఏర్పాటుకు, అభివృద్ధికి బీజం నాటాయి.

దరిమిలా ప్రభుత్వశాఖల్లో చోటుచేసుకున్న అలసత్వాన్ని, రెడ్ టేపిజాన్ని, కార్యనిర్వహణ పట్ల నెలకొన్న నిరాసక్తతను అధిగమించడానికి, పౌరులకు ప్రభుత్వపరంగా కన్నా మెరుగైన సేవలు అందించడమనే మహత్తర ఆశయంతో దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొన్నాయి. అందులో రవాణా రంగంలో ఏర్పాటైన దేశవ్యాప్త ఆర్టీసీ సంస్థలు కూడా వున్నాయి. అలాగే భారత్ పెట్రోలియం, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆయిల్ అండ్ నాచురల్ గాస్, ఇండియన్ ఆయిల్, బీహెచ్ఇఎల్, బీఇఎల్, నేషనల్ బిల్డింగ్స్ కనస్ట్రక్షన్, ఎన్ఎండీసీ, ఆయిల్ ఇండియా, షిప్పింగ్ కార్పోరేషన్, హెచ్ఎంటీ, ఐటీడీసీ, హెచ్సీఎల్, ప్రగాటూల్స్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు వున్నాయి. అయితే వీటిలో కొన్ని అనుకున్న లక్ష్యాలను, ఆశయాలను సాధించడంలో ఘోరంగా విఫలమైనందున ప్రభుత్వ రంగ సంస్కరణలను చేపట్టి, కొన్ని పిఎస్‌యులను మూసివేయడమో, పునర్వ్యవస్థీకరించడమో జరిగింది.

ప్రభుత్వరంగ సంస్థల నిర్వచనం, ఆవిర్భావం, ఆవశ్యకత, కాలానుగుణంగా రావాల్సిన మార్పులు రాకపోవడానికి కారణం, భవితవ్యం ఆధ్యయనపరంగా చాలా ఆసక్తికరంగా వుంటాయి. 50% పైగా ప్రభుత్వ భాగస్వామ్య వాటాతో, ప్రభుత్వమే యజమానిగా, హక్కుదారుడుగా వున్న కంపెనీలను ప్రభుత్వరంగ సంస్థ అంటారు. తమతమ ఆదాయాలనుండి పన్నులు చెల్లించే పౌరుల డబ్బునే ప్రభుత్వరంగ సంస్థలు విరివిగా వినియోగిస్తాయి.

దివంగత బ్రిటీష్ ప్రధానమంత్రి, ఆ దేశ రాజకీయాలలో “ఐరన్ లేడీ” గా ప్రసిద్ధికెక్కిన మార్గరెట్ థాచర్ ప్రభుత్వరంగ సంస్కరణలకు యావత్ ప్రపంచంలోనే ఆద్యురాలు. ఇటీవలి కాలంలో ప్రధాని మోడీని భారత థాచర్ గా పిలుస్తున్నారు. థాచర్ అధికారంలో వున్న రోజుల్లో ప్రభుత్వరంగ సంస్థల పనితీరుపై ఆగ్రహించి సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సరైన సేవలను ప్రజలకు అందించడంలో ప్రభుత్వరంగ సంస్థలు ఘోరంగా విఫలమయ్యాయని థాచర్ తీవ్రంగా విమర్శించారు. వాస్తవానికి ఈ విమర్శ ఒక్క బ్రిటన్ కే పరిమితంకాదు. భారతదేశంతో సహా యావత్ ప్రపంచంలో చోటుచేసుకున్న వాస్తవం ఇది. తమ సంస్థలో పని చేస్తున్న సిబ్బంది జీతభత్యాలతో సహా యావత్ సంస్థ మనుగడకు అవసరమైన వనరులను పౌరుల పన్నుల రూపేణా సమకూరుతుందన్న విషయం వాళ్లకు పట్టకపోగా ఆ పౌరులకు సరైన సేవలను అందించడంలో సహితం పూర్తిగా విఫలమయ్యారు. అయితే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఒకే కోవకు చెందినవి కావు.   

ప్రభుత్వరంగ సంస్థల నుండి ప్రజలకు పేలవమైన సేవలు అందడానికి కారణం అక్కడ పనిచేసే సిబ్బంది తమ సంస్థ సేవలపై ఆధారపడ్డ ప్రజల ప్రయోజనాలకన్నా మిన్నగా వారి స్వంత ప్రయోజనాల సాధనకు ప్రాధాన్యత ఇవ్వడమే. ప్రభుత్వరంగ సిబ్బంది వైఖరి ఎలా వుంటుందంటే, తమ సేవలపై ఆధారపడిన పౌరులు వారికి ఇవ్వబడిన వాటిని, అవి ఎలాగున్నా సరే, అంగీకరించి తీరాలి, కృతజ్ఞతతో వుండాలి అని. తాము అందిస్తున్న సేవలపై తమకే గుత్తాధిపత్యం వున్నట్లు కూడా వారు ప్రవర్తించడం శోచనీయం. తమకు పోటీ ఎవరూ లేరని వారి భావన. అందుకే ఆరోగ్యకరమైన పోటీ వుండే విధానం రావాలని థాచర్ అభిప్రాయపడ్డది. ట్రేడ్ యూనియన్ల ఆధిపత్యం కూడా ప్రభుత్వరంగ సంస్థల వైఫల్యానికి ప్రధాన కారణం అని థాచర్ వాదన. యూనియన్ నాయకుల బ్లాక్మెయిల్ పద్ధతులు తరచూ ప్రభుత్వరంగ సంస్థల పనికి అవరోధంగా మారాయని థాచర్ అభిప్రాయం. సమ్మెలకు దిగమని వారు సిబ్బందిని ప్రోద్బలం చేస్తుంటే లక్షలాది మందికి వారి సేవలు ఆగిపోయి ఇబ్బందులు కలగడం తరచూ జరగడం వల్ల ప్రభుత్వరంగ సంస్థలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయని కూడా థాచర్ విమర్శించారు. 

ఈ నేపధ్యంలోనే థాచర్ ప్రభుత్వరంగ సంస్కరణల ఆవశ్యకతను నొక్కివక్కాణి౦చారు. ఆమె సూచనలు, సలహాలు ఇప్పటికీ, ఎప్పటికీ అనుసరణీయమే. ఆమె సూచనల్లో ప్రధానమైనది ప్రయివేట్ రంగంలో అనుసరిస్తున్న విధానాలను, పద్ధతులను, సాంప్రదాయాలను, అభ్యాసాలను ప్రభుత్వరంగ సంస్థల్లో కూడా ప్రవేశపెట్టాలనేది. కొంతకాలం పన్నుల ద్వారా, ప్రభుత్వ ఖజానా ద్వారా ప్రభుత్వరంగానికి నిధులు సమకూర్చినప్పటికీ, సాధ్యమైనంతవరకు ప్రభుత్వరంగ సేవలను ప్రయివేట్ పద్ధతిలో నిర్వహించాలి. అప్పుడే వాటికి మనుగడ వుంటుంది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేట్ వాటికి దీటుగా పోటీలోకి దించాలి. ప్రయివేట్ కన్నా మెరుగైన సేవలు అందించేలా చూడాలి.     

ఈ నేపధ్యంలో, భారతదేశానికి సంబంధించినంత వరకు, దాదాపు మూడున్నర-నాలుగు దశాబ్దాల క్రితం విదేశీ పెట్టుబడులకు భారత ఆర్థిక వ్యవస్థ ద్వారాలు తెరుచుకుంటున్న సమయంలో భారతీయ, విదేశీ కంపెనీల మధ్య కేవలం ఒక ఏడాదిలోనే పలు జాయింట్ వెంచర్లు ఏర్పాటయ్యాయి. కాకపోతే, ఆ తర్వాత అవి ఆశించిన ఫలితాలు అందించడంలో విఫలం కావడంతో ఐదేళ్లలోపే అవి విడిపోవడం మొదలయింది. జాయింట్ వెంచర్ల నిర్వహణ అత్యంత క్లిష్ట సాధ్యమని రుజువైంది. ప్రభుత్వరంగ సంస్థల, జాయింట్ వెంచర్ల అనుభవం నేపథ్యంలో ఇతర దేశాల మాదిరిగానే భారత దేశంలోకూడా “ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం” ఆలోచన రూపుదిద్దుకొని క్రమంగా బలపడుతూ వస్తోంది. ఈ విధానాన్ని సమర్థించే వారు పిపిపి విధానం వల్ల వనరులు, టెక్నాలజీ, నైపుణ్యం మెనేజ్‌మెంట్ విధానాలు, వ్యయ సామర్థ్యం తదితర రూపాల్లో ఒక దాని నుంచి మరొకటి లాభపడతాయని అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అనేది అభివృద్ధి చెందుతున్న చాలా దేశాలలో అమలవుతున్న విధానమే. ఈ విధానంలో ప్రభుత్వ సేవలకు అవసరమైన నిధులను ప్రభుత్వం పూర్తిగాకాని, పాక్షికంగాని సమకూర్చి ప్రభుత్వం, ప్రైయివేట్ తోడ్పాటుతో, ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో అవి అమలవుతాయి. సామాజిక బాధ్యతలో భాగంగా ప్రైవేటు సంస్థలతో పాటుగా చాలా కార్పొరేట్ సంస్థలు భారత్‌తో సహా చాలా ప్రజాస్వామిక, అభివృద్ధి చెందుతున్న దేశాలలో పౌర సేవలను అందిస్తున్నాయి. వాటిలో కొన్ని సంస్థలు నిబద్ధతతో, సామర్థ్యంతో ఈ సేవలు అందించడాన్ని చూసిన ప్రభుత్వం సంప్రదాయంగా తామందిస్తున్న, ప్రభుత్వ కార్యకలాపాలుగా భావిస్తున్న సేవలను అందించడంలో వాటికి మరింత భాగస్వామ్యం కల్పించడానికి సిద్ధమయ్యేలా చేసింది. దీనితో పౌర సేవలను అందించాల్సిన ప్రభుత్వం, ప్రైవేటు సంస్థతో ఒక అర్థవంతమైన పద్ధతిలో చేతులు కలపడం ద్వారా ఆ సేవలను అందించడానికి వీలవుతుంది. ప్రయివేట్ నైపుణ్యం కూడా పనికొస్తుంది.

అలాంటి ఏర్పాట్లనే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలుగా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ సేవలను అందించే బాధ్యత మాత్రం ప్రభుత్వం పైనే వుంటుంది. ప్రయివేట్ సంస్థ మౌలిక సదుపాయాలు, నాయకత్వం, సిబ్బందికి తగు శిక్షణ, టెక్నాలజీ అభివృద్ధి, తదితర సంబంధిత విషయాలలో పెట్టుబడి పెట్టి ప్రభుత్వ యంత్రాంగాన్ని సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా అవసరమైన సేవలను అందించడం జరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వంపై అదనంగా ఎలాంటి ఆర్థిక భారం పడడం జరుగదు. ప్రభుత్వం దరిమిలా ప్రధాన సేవలను అందించే బాధ్యతను తన వద్ద ఉంచుకొంటూనే సంబంధిత సేవకు బడ్జెట్‌లో కేటాయించిన పెట్టుబడి, నిర్వహణ వ్యయం పరిమితిలోనే పిపిపి సాయమందించడం ద్వారా దాన్ని మరింత బలోపేతం చేస్తుంది.  

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత ఏడాది లోక్‌సభలో బడ్జెట్‌ను సమర్పిస్తూ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యానికి సంబంధించి రెండు ప్రస్తావనలు చేశారు. భారతీయ రైల్వేలకు సంబంధించి ముంబై మరి కొన్ని చిన్న నగరాల్లో చేపట్టాల్సిన భారీ పనులను ఉదాహరణలుగా పేర్కొంటూ ఢిల్లీ మీరట్ మార్గంలో ప్రతిపాదించిన ర్యాపిడ్ రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (ఆర్‌ఆర్‌టిఎస్) లాంటి స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్‌పివి) ద్వారా సబర్బన్ రైల్వేలలో మరింతగా పెట్టుబడులు పెట్టడానికి రైల్వేలను ప్రోత్సహించడం జరుగుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆ మేరకు మరిన్ని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలను (పిపిపి)లు ప్రోత్సహించడం ద్వారా మెట్రో రైల్వే పథకాలలో పెట్టుబడులను పెంచడానికి ప్రతిపాదనలు చేయడంతోపాటు మంజూరైన పనులు పూర్తి అయ్యేలా చూస్తామని ఆమె అన్నారు.

అలాగే ప్రధాన మంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరత అభియాన్ కింద రెండు కోట్ల మందికి పైగా గ్రామీణ భారతీయులకు ఇప్పటి వరకు డిజిటల్ పరిజ్ఞానాన్ని కల్పించడం జరిగిందని మరో ప్రస్తావనలో ఆర్థిక మంత్రి చెప్పారు. దేశంలోని ప్రతి పంచాయితీల్లోని స్థానిక సంస్థల్లో ఇంటర్‌నెట్ కనెక్టివిటీని యూనివర్శల్ సర్వీస్ ఆబ్లిగేషన్ 2019)ఫండ్ నుంచి సహాయంతో పబ్లిక్‌ప్రైవేటు భాగస్వామ్యం విధానం కింద వేగవంతం చేయడం జరుగుతుందని కూడా ఆమె చెప్పారు. దీనివల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ అంతరం తగ్గుతుందని మంత్రి చెప్పారు.

2018-2030ల మధ్య రైల్వేలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 50 లక్షల కోట్లు అవసరమని ఆమె చెప్తూ, ఏడాదికి రూ. 1.5 నుంచి 1.6 లక్షల కోట్లు మాత్రమే రైల్వేలు ఖర్చు చేస్తున్న నేపథ్యంలో మంజూరయిన ప్రాజెక్టులు సైతం పూర్తి చేయడానికి దశాబ్దాల కాలం పడుతుందని అంటూ పిపిపి విధానాన్ని సూచించారు. రైల్వేలో అభివృద్ధిని వేగవంతం చేయడానికి, రైలు మార్గాల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి రోలింగ్ స్టాక్ (బోగీలు, ర్యాక్‌లు) తయారీకి, ప్రయాణికులు, సరుకు రవాణా సేవలు అందించడానికి పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుందని నిర్మలా సీతారామన్ తెలియజేశారు.

ఇక ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పీపీపీ కి సంబంధించి అనేక ప్రతిపాదనలు చేసారు. ప్రతి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రికి అనుబంధంగా పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించారు. పీపీపీ పద్ధతిలో ఎఫ్‌సీఐ, కేంద్ర గిడ్డంగుల సంస్థ సంయుక్తంగా గోదాముల నిర్మాణం చేయడానికి, పీపీపీ భాగస్వామ్యంతో కిసాన్ రైలు ఆపరేట్ చేయడానికి ఆర్ధిక మంత్రి పచ్చ జెండా ఊపారు. అదనంగా ప్రయివేటీకరణకు కూడా కేంద్ర ప్రభుత్వ సంసిద్ధతను వ్యక్తం చేసారు నిర్మలా సీతారామన్. అందులో భాగంగా ప్రైవేటీకరణ దిశగా ఎల్‌ఐసీ ని ప్రతిపాదించి, ఎల్‌ఐసీ వాటా విక్రమాయానికి నిర్ణయం తీసుకుంది కేంద్రం. అంటే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాన్ని చేపట్టడానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారనేగా! రైల్వేల ప్రయివేటీకరణ కూడా జరుగుతుందని అంటున్నారు. కాకపొతే ఎల్ఐసీ లాంటి విజయవంతంగా నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరణ చేయడం ఆశింఛదగ్గ విషయం కాదేమో!    

ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యం అంటే ప్రైవేటీకరణ కానే కాదు. ప్రభుత్వ బాధ్యతను తగ్గించడమనేది కూడా ఎంతమాత్రం కాదు. ప్రభుత్వ సేవలకు అనుబంధంగా, అదనంగా ప్రయివేట్ సేవలను ఉపయోగించుకోవడం. ప్రభుత్వరంగ సంస్థల వైఫల్యానికి ప్రత్యామ్నాయం ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యం కావచ్చు! అది ఏఏ రంగాలలో అనేది ప్రభుత్వ ఇష్టాఇష్టాలపై ఆధారపడి వుంటుంది.  

Saturday, February 1, 2020

Ramayana an epical depiction-5 .... Homecoming : Vanam Jwala Narasimha Rao

Ramayana an epical depiction-5
Homecoming
Vanam Jwala Narasimha Rao
Millennium Post (02-02-2020)

            On taking such a decision Lord Vishnu having agreed to the suggestion of Devatas vanished from there. From the other side the Putra Kameshti Yagam was going on uninterrupted. Then from the fire of Altar there emerged a heavenly being called Prajapatya Purusha. He was dressed in black and red garments with red face and drumbeating voice besides decorating himself with divine ornaments. He brought with him a big golden vessel which is full with divine dessert. King Dasharatha greeted him and offered prayers. Then the divinity told Dasharatha that, “I am sent by Prajapati. I brought this dessert in golden vessel for you. Take this which develops pregnancy in your wives. Let this be consumed by your wives. Your desire to beget sons will be fulfilled through this”. 

            The King Dasharatha thanking him whole heartedly took the vessel full with dessert and keeping it on his head once again greeted Prajapatya Purusha who disappeared later.

Dasharatha giving in parts the
dessert to his three wives
            Dasharatha with the vessel on entering the palace chambers of him told his elder wife Kausalya about the dessert and said, “This is equivalent to divine drink Amruta. Worship this and if you consume you will beget son”. The king then gave half of the dessert to queen Kausalya, and he gave half of the half, one fourth to queen Sumitra. And to Kaikeyi he gave half of the remaining half, means, one eighth of the dessert, with a desire to beget sons. Then thinking for a while gave the remaining, one-eighth portion again to queen Sumitra. Thus, the king distributed the dessert to his wives in a different way. The three wives of King felt very happy to have the dessert and they deemed it as a reward. They became pregnant after some time. Then on seeing his queens with confirmed pregnancies Dasharatha regained his lost heart for sons. 

Lord Brahma nominates Devatas to procreate monkey race
            When Lord Vishnu consented to be the son of Dasharatha and take the form of human being on the earth, Lord Brahma dictated the Devatas and all gods to become creators of monkey heroes to help Vishnu incarnation in annihilating Ravana. When Brahma ordered like that the Devatas agreed to do so and accordingly started parenting sons in the form of monkeys. The Siddhas, the Sadhyas, the Kinnaras, the Kim purushas, the sages, the Charanas etc. crated valiant sons who started wandering in the forests. Among them were, Vali, Sugriva, Dara, Hanuman, Gandhamadana, Nala, Neela, Mainda, Dvivida and so on. Thus, the Gods and Devatas reproduced many thousands and lakhs of heroic monkeys and chiefs of warriors who were supposed to be of help to Lord Vishnu incarnation in eliminating Ravana, the monster king.                   

Birth of Rama, Lakshmana, Bharata and Shatrughna
            After the completion of Vedic horse ritual, the Ashvamedha Yaga and Putra Kameshti Yaga, all the kings and Sage Rushyasrung took leave of Dasharatha, who was immensely happy, and went away to their respective places. King Dasharatha entered Ayodhya with his three wives. Dasharatha with gratified heart dwelled upon the birth of his sons. Six seasons later in the twelfth month after the Putra Kameshti Ritual, in the first month of Lunar new year, on the ninth day, in the constellation of Punarvasu, and when the Sun, Mars, Jupitar, Venus as well as Saturn were in ascension in their respective houses and when Aries, Capricornus, Cancer, Pisces, Libra, Jupitar and the Moon were in conjunction Queen Kousalya gave birth to the incarnation the Administrator of Universe, The Lord Maha Vishnu, the Sri Rama. Queen Kaikeyi gave birth to Bharata who was born under Pisces where Pushyami was the star. Queen Sumitra then gave birth to two sons Lakshmana and Shatrughna who were born under Cancer where Aslesha was the star. Rama was born on the ninth day of Lunar Chaitra Month, Bharata was born the next day earlier part the tenth of Chaitra, Lakshmana and Shatrughna were born the later part of the tenth day. When Dasharatha announced their birth everyone in Ayodhya celebrated with melodic singing, dancing, drum beating, decorating the streets and so on. On the thirteenth day naming ceremony was performed. Vasishta the Chief Priest named elder son born to Kousalya as Sri Rama, Kaikeyi’s son as Bharata, Sumitra’s sons as Lakshmana and Shatrughna. King Dasharatha honored Brahmins with munificent of gifts. Later all the rituals of birth and ceremonies consequent to it like naming ceremony, first-food-feeding ceremony, first-hair-removal ceremony, and sacred thread ceremony were performed in respect of the princes.

            Among the four children, the elder son Sri Rama was the delight of his father Dasharatha besides being acceptable to all. He was a champion of all the valor activities like archery. Lakshmana always dedicated himself to Rama and behaved like his shadow. Rama never slept without Lakshmana on his bedside and would also not take food without Lakshmana. Similarly, Lakshman’s younger twin brother Shatrughna was dearer to Bharata. For Bharata also Shatrughna was dearer equally. Thus, all the four were grown-up under the able guidance and fellowship of efficient professors of all education and study including theology and bravery. All four princes were enthralled in the study of Vedas and became experts in archery. Against this background king Dasharatha contemplated along with his ministers and priests as well as relatives about the matrimonial alliances of his four sons.   

Vanam Vasudasa Valmiki Ramayana-5 .... The spirited heavenly being :Vanam Jwala Narasimha Rao

Vanam Vasudasa Valmiki Ramayana-5
The spirited heavenly being
Prajapatya Purusha offers divine desert to Dasharatha
Vanam Jwala Narasimha Rao
Hans India (02-02-2020)

వాలి తనను దూషించిన వృత్తాంతాన్ని శ్రీరాముడికి చెప్పిన సుగ్రీవుడు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-15 : వనం జ్వాలా నరసింహారావు

వాలి తనను దూషించిన వృత్తాంతాన్ని శ్రీరాముడికి చెప్పిన సుగ్రీవుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-15
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (02-02-2020)   
          వాలికి, తనకు విరోధం వచ్చిన కారణాన్ని చెప్పడం కొనసాగిస్తూ శ్రీరాముడితో సుగ్రీవుడు ఇంకా ఇలా అన్నాడు. “దురాగ్రహంతో మండిపడుతున్న ఆ కపిరాజు వాలి మీద వున్న గౌరవంతో వున్న విషయాన్ని విన్నవించుకున్నాను. కట్టెలాగా ఆయన పాదాలమీద పడి ఇలా వేడుకున్నాను”.

“అన్నా! మహా శౌర్యశాలీ! మా భాగ్యంవల్ల శత్రువైన మాయావిని  నువ్వు చంపి వచ్చావు. దిక్కులేనివారికి దిక్కైన నువ్వే ఈ దిక్కులేనివాడికి దిక్కు. చంద్రుడిలాగా ప్రకాశించే తెల్లగొడుగును నీకు నేను పట్తాను. నిర్మలమైన మనస్సుతో అంగీకరించు. ఒక్క సంవత్సరం నేను బిలం ముఖం వద్ద కాచుకుని కూర్చున్నాను. అప్పుడు నెత్తురు ప్రవాహాలు అంతకంతకూ ఎక్కువై పారడం జరిగింది. రాక్షసుల సింహనాదాలు వినపడ్డాయికాని నీ గొంతు వినపడలేదని బాధపడ్డాను. అప్పుడు, నిన్ను చంపిన రాక్షసులు నామీదకు యుద్ధానికి వస్తారేమోనని భయపడి ఒక కొండను బిలద్వారంలో పెట్టి ఏడ్చుకుంటూ, కలవరపడుతూ నగరానికి చేరుకున్నాను. అన్నా! ఇది యదార్ధంగా జరిగిన సంగతి. దుఃఖంతో పరితపిస్తున్న నన్ను నేను వద్దంటున్నా బలవంతంగా మంత్రులు రాజ్యాభిషిక్తుడిని చేశారు. దేవా! నన్ను దయచూడు. అన్నా, నువ్వే రాజుగా వుండు. నేను ఎప్పటిలాగా యువరాజుగా వుంటాను. రాజు లేకుంటే రాజ్యం ఆరాచకం అవుతుందని మంత్రులీవిధంగా చేశారు. రాజ్యం, రాజుతనం నేను కోరలేదు. ఇది నిజం. నీరాజ్యాన్ని నువ్వే తీసుకో. అన్నా! నేను నీకు తమ్ముడిని. శత్రువును కాదు. నీ విషయంలో నేను ఎలాంటి ద్రోహం చేయలేదు. నన్ను క్షమించు. నీ పాదాలమీద పడతాను. చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను”.

“అని ఎంతగా వినయంగా నేను వేడుకున్నా ఆయన కోపం వదలలేదు. ధిక్కార స్వరం మారలేదు. ఎన్నో విధాలుగా తిట్టాడు. పురజనులను, మంత్రులందరినీ సభలో చేర్చి నన్ను చూసి వాలి ఇలా అన్నాడు”.

“ఒక అర్థరాత్రి, ఒక రాక్షసుడు, యుద్ధానికి నన్ను పిలిస్తే నేను వెంటనే ఇల్లు వదిలి పోయాను. ఈ మోసగాడు కూడా నా వెనకే వచ్చాడు. ఇది మీకు తెలిసిన విషయమే. మమ్మల్ని ఇద్దరినీ చూసి మాయావి భయపడి పరుగెత్తాడు. నేను వాడివెంట పరుగెత్తాను. ఈ పాపచారి నా వెంట వచ్చాడు. ఇలా పరుగెత్తి వాడు అడవిలో భూమిలో వుండే ఒక బిలంలోకి దూరాడు. నేను విరోధం మానకుండా వాడివెంట పోవాలని, ఈ నీచుడితో, నేను రాక్షసుడిని చంపి వచ్చేవరకు ఈ బిలం దగ్గరే వుండమని చెప్పాను. విరోధిని చంపినా తరువాతే ఊళ్లోకి వస్తానని కూడా చెప్పాను. అలా సుగ్రీవుడిని బిలం వాకిట్లో వుంచి నేను ఆలశ్యం చేయకుండా లోపలికి పోయాను. పోయి అక్కడ రాక్షసుడిని వెతికాను. ఒక సంవత్సరం గడిచింది. అప్పుడు వాడు కనబడ్డాడు. వాడిని యుద్ధంలో వాడి బంధువులతో సహా చంపి మళ్లీ మనవూరికి రావాలని ప్రయత్నం చేస్తే, బిలద్వారానికి కొండ అడ్డంగా వుండడం వల్ల దారి కనపడలేదు. నేను గట్టిగా ఎన్నో సార్లు సుగ్రీవా! సుగ్రీవా! అని అరిచాను. వాడి దగ్గర నుండి సమాధానం లేదు. బయటికి రావడానికి దారి తెలియలేదు. నేను వుండమని చెప్పి వచ్చిన సుగ్రీవుడి గొంతు వినపడలేదు. అప్పుడు నేను పడ్డ బాధ ఏమని చెప్పాలి? కడుపులో చేయిపెట్టి కెలికినట్లయింది. ఇలా ఇబ్బందిపడుతూ బిలద్వారంలో వున్న కొండను గాలితో తన్ని-తన్ని పడగొట్టి ఎంతో కష్టం మీద బయటపడ్డాను. రాజ్యలక్ష్మి కొరకు వీడెంత పాపం చేశాడో చూశారా? వాడికి అన్నని కదా? ఇలా ప్రవర్తించవచ్చా? అని ఆలోచించలేదు. ఈ నీచుడు ఎంత చెడ్డ పని చేశాడో చూశారా? వీడిని మన్నించవచ్చా?

“ఇలా అంటూ నన్ను వూరు వెడలగొట్టాడు. నా భార్యను గ్రహించాడు. అంతటితో ఆగకుండా నన్ను చంపడానికి రావడంతో ప్రాణ భయంతో అనేక దేశాల్లో తిరిగి చివరకు ఈ గుట్టకు అతడు రాలేకపోవడానికి కారణం వుండడం వల్ల ఇక్కడ స్థానం ఏర్పాటు చేసుకున్నాను. బుద్ధిపూర్వకంగా నేను ఏ అపకారం చేయలేదు. అలా అయినప్పటికీ పడరాని కష్టాలను పడుతున్నాను. నా మీద దయచూపించి సర్వభూతరక్షకుడవైన నువ్వు ఈ దీనుడిని, దరిద్రుడిని రక్షించు. దీనరక్షకుడని కీర్తిని సంపాదించు”.

(సుగ్రీవుడు జరిగినదంతా సత్యంగానే చెప్పాడు కాని, తాను రాజుగా వున్న సమయంలో అన్న భార్య తారను గ్రహించిన సంగతి చెప్పలేదు. ఈ కలహంలో మొదలు సుగ్రీవుడు మీద అనుమానం రావడం సహజమే. కాని సుగ్రీవుడు బుద్ధిపూర్వకంగా చేయాలని పొరపాటు చేయలేదు. వాస్తవంగా రాజ్యకాంక్ష వల్ల వాలికి ద్రోహం చేసినట్లయితే అతడు కిష్కింధకు వచ్చినప్పుడు తన బలంతో వాలిని నిగ్రహించగలిగేవాడే! వాలిసుగ్రీవులు ఇద్దరూ ఇంచుమించు సమానమైన బలవంతులే. వాలిదగ్గర ఇంద్రదత్తహారం వుండడం వల్ల ఎక్కువ బలశాలి అయ్యాడు. హనుమంతుడు, నీలుడు లాంటివారు సుగ్రీవుడి సహాయకులు. సుగ్రీవుడు వాలితో యుద్ధానికి పూనుకుంటే ఒక్క హనుమంతుడే వాలిని మట్టుబెట్టగలడు. కాబట్టి సుగ్రీవుడిలో ద్రోహబుద్ది లేదు. సుగ్రీవుడి విషయంలో వాలి అనుమానపడ్డాడు. బిలద్వారం మూయడం, రాజ్యాభిషిక్తుడు కావడం ద్రోహబుద్ధితో చేశాడని నమ్మాడు. తాను జీవించి వుండగా తన భార్య తారను గ్రహించాడని కోపం వచ్చి వుండవచ్చు. అందుకే ఆ తరువాత సుగ్రీవుడి భార్యను వాలి గ్రహించాడు. అయితే సోదరుడు మరణిస్తేనే ఆయన భార్యను స్వీకరించవచ్చని ఒక మర్యాద ఆ జాతుల్లో వుంది. వాస్తవానికి వాలి మరణించాడని నమ్మి ఆయన భార్యను సుగ్రీవుడు గ్రహించాడు. కాని, సుగ్రీవుడు జీవించి ఉన్నాడని తెల్సికూడా వాలి అతడి భార్యను గ్రహించాడు. ఈ కులమర్యాదను రామచంద్రుడు కూడా ఆదరించాడు. ఎందుకంటేవాలి మరణం తరువాత సుగ్రీవుడు తారను గ్రహించాడని తెలిసీ ఆయన ఏం అనలేదు. వాలి కుల మర్యాదను, శాస్త్ర మర్యాదను ఉల్లంఘించడం వల్లే శిక్షార్హుడయ్యాడు).

సుగ్రీవుడు ఇలా చెప్పడంతో రామచంద్రమూర్తి అతడితో, “మిత్రమా! బాధపడవద్దు. నా బాణాలతో నీ పగ తీరుస్తాను. ఆ పాపాత్ముడెంతవరకు నాకంట పడడో అప్పటివరకే సుఖంగా వుంటాడు. కపీశ్వరా నా దుఃఖంలాంటిదే నీ దుఃఖం. దాన్ని ఉపశమించేట్లు చేస్తా. సంతోషించు”.