Sunday, August 11, 2024

ధర్మభూమి, కర్మభూమి మన అఖండ భారతావని ....... భారతీయ, హైందవ, వైదిక సంస్కృతి – ‘సజీవ వాహిని సనాతన ధర్మం’ -1 : వనం జ్వాలా నరసింహారావు

 ధర్మభూమి, కర్మభూమి మన అఖండ భారతావని

భారతీయ, హైందవ, వైదిక సంస్కృతి – ‘సజీవ వాహిని సనాతన ధర్మం’ -1

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (12-08-2024)

సమస్త ప్రపంచంలో ప్రత్యేకత సంతరించుకున్న ఒక జీవన విధానమైన భారతీయ, హైందవ, వైదిక సంస్కృతిని మించిన ఉత్తమోత్తమమైన సనాతన ధర్మబద్ధమైన సంస్కృతి మరొకటి లేనే లేదు. ప్రపంచ సామాజిక వ్యవస్థలలో హిందూ వైదిక వ్యవస్థ ఒక ఉదాత్తమైన వ్యవస్థ. సార్వకాలికమై, శాశ్వతమై, స్థిరమై, యుగ, యుగాలుగా వర్ధిల్లుతూ, ఎన్ని సాంఘిక విప్లవాలొచ్చినా చెక్కు చెదరకుండా, నిశ్చలంగా, సజీవంగా వుంది. వేదకాలంనాటి నాస్తికుల నుండి, ఆధునిక కాలంనాటి అజ్ఞానుల వరకూ ఎందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని విధాలుగా సనాతన ధర్మాన్ని కించపరిచినా ఫలితం శూన్యమే, తాత్కాలికమే! మన వేదాలు, భారత, భాగవత, భారత, శ్రీరామాయణం సనాతన భారత సంస్కృతీ రూపాలు. 

క్లుప్త సుందర వివరంగా ఈ విషయాలను తెలుసుకునే ముందు, ఇటీవల నేను రాసిన సజీవ వాహిని సనాతన ధర్మంఅనే పుస్తకానికి నలుగురు మహనీయులు, సనాతన ధర్మ పరిరక్షకులు, సనాతన ధర్మ వ్యాప్తికి అవిశ్రాంత కృషి సల్పుతున్న ఋషితుల్యులు కంచి కామకోటి పీఠాదిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, ధార్మిక తపస్వి బ్రహ్మశ్రీ డాక్టర్ సామవేదం షణ్ముఖ శర్మ, భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం ఆస్థాన పురోహితులు గుదిమెళ్ళ మురళీకృష్ణమాచార్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మప్రచార పరిషత్తు  పూర్వ కార్యదర్శి డాక్టర్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు, పేరుకు ‘పుస్తకానికి ముందుమాట’ అని అన్నప్పటికీ, సనాతన ధర్మాన్ని గురించి సూటిగా, అద్భుతంగా మూడు-నాలుగు వాక్యాలలో రాశారు. వాటిని యధాతథంగా ప్రస్తుతించుకోవడం సమంజసం.

ముందుగా, కంచి స్వామి తమ దివ్య సందేశంలో సజీవ వాహిని సనాతన ధర్మంఒక మహోన్నత వ్యాసాల సంకలనమని, తెలుగు భాష తెలిసిన ఆస్తికులు వీటిని చదవడం వల్ల విశేష ఉపయోగాన్ని పొందగలరని పేర్కొన్నారు. ఇది సనాతన ధర్మసర్వస్వాన్ని ‘అరచేతిలో అద్భుతంలా హస్తగతం చేసిందని వ్యాఖ్యానిస్తూ సామవేదం వారు, వేదాలనుండి ప్రబంధాలవరకు విస్తరించిన సంప్రదాయ సాహితీవీచికల వైభవాలు ఒక క్రమ పద్ధతిలో ఇందులో సాక్షాత్కరించాయని, అన్నీకలిపి ఒకే సూత్రంతో అల్లబడి, ఒకే హారంగా ఏర్పడి, పుస్తకంగా రూపొందిందని ప్రశంసించారు. ‘మొత్తంగా సనాతన ధర్మం సృష్ట్యాదినుండి ఇప్పటివరకు, ఎప్పటివరకైనా ‘శాశ్వత సజీవవాహిని’ అని ప్రతి వ్యాసం ఋజువు చేస్తోంది. ఈ పుస్తకం ధర్మావగాహనని కలిగించడమేకాక, ధర్మాచరణకు ప్రేరేపిస్తూ, సంశయరహితమైన ధృఢత్వంలోతరువాతి తరాలకు అందేలా నిలబెట్టగలది.’ అని ముగించారు.

గుదిమెళ్ళ వారు తమ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేస్తూ, ‘అపౌరుషేయమైన వేదమే అఖిల ధర్మాలకు మూలం. సనాతన ధర్మానికి అదే ఆలవాలం. ఆ వేదోక్త ధార్మిక కర్మ విశేషాల జీవన విధానమే సనాతన ధర్మం. కాలం చెల్లిన ధర్మం కాకుండా సదాతనమై, సదాయతనమై, ఆచరించబడే కర్మవిశేషమే సనాతన ధర్మం. సర్వకాలాలలో అనుష్ఠానయోగ్యమైన శ్రుత్యుక్త ధర్మమే సనాతన ధర్మం. అందుకే ఇది సజీవవాహిని. సదాచార జీవన ప్రవాహిణి. సత్య, ధర్మాలు రెండూ ఈ వైదిక సంస్కృతికి జీవనాడులు. సత్యం వచనీయం, ధర్మం ఆచరణీయం. వర్ణధర్మాలు, ఆశ్రమధర్మాలు, వ్యక్తిధర్మాలు, విశేషధర్మాల నానారూపాత్మకం ఈ ధర్మం. ఈ ధర్మాలన్నీ సదాయతనాలు. సదాత్మకమై, తదుపాసనాత్మకమైన పావన జీవన సంవిధానమే ఈ సనాతన ధర్మం. అందుకే ఇది సనాతనము, సదాయతనమూ. దేవస్థానం, వేదస్థానం, యజ్ఞస్థానం అనే మూడింటి వైభవాన్ని, ప్రాభవాన్ని సులభతరమైన శైలిలో అందిస్తున్న చక్కని ఈ కోశాన్ని సనాతన సంస్కృతికి చెందిన ప్రతి హిందువు తప్పకుండా చదవాలి’ అని రాష్రారు.

చిలకపాటి వారు ‘సార్వజనికం, సార్వకాలికం, సార్వమూలికం సనాతన ధర్మం’ అని అంటూ, ‘భారతీయ తాత్త్విక ధారకు ఆధారం వేదవాజ్మయం లేదా సనాతన ధార్మికసాహిత్యం. ఇందులో సిద్దాంతమున్నదీ, వ్యాఖ్యానమున్నదీ, ఆచరణాత్మకమైన క్రియాపాదమూ ఉన్నది. దాని వివరణ వ్యాఖ్యాన రూపంలో లేదా భాష్య రూపంలో బహు విస్తారమై ఉంటుంది. అవి జ్ఞానసాగరం కాబట్టి భాష్యకారులు తమతమ వివరణలతో సుసంపన్నం చేశారు. ఈ నేపధ్యంలో రాసిన సజీవ వాహిని సనాతన ధర్మం మహాగంభీరమైన తాత్త్వికధార, సంక్షిప్త సుందరమైన వ్యాఖ్య. సనాతన ధర్మం అంటేనే భారతీయ జీవన విధాన సంవిధానం. భారతదేశానికివిశ్వగురుపీఠాధిపత్యాన్ని అనుగ్రహించిన మహాద్భుత శ్రీకోశసంహిత, ధర్మసింధువు, నిర్ణయసింధువు, మనుధర్మం, శ్రీరామాయణ, భారత, భాగవత, భగవద్గీతాది అసంఖ్యాక గ్రంథాలలో అక్షరబద్ధం చేయబడిన ధర్మాలను, అష్టాదశపురాణ ప్రబోధాలను సంక్షిప్తీకరించి సంకలించినసజీవ వాహిని సనాతన ధర్మంసామాన్యులనేగాక మాన్యులనూ, ధీమాన్యులనూ, ఆమోదప్రమోదాలతో అలరిస్తుంది.’

ఇంతకూ వివరంగా ఏమిటీ సనాతన ధర్మం? వేదాలలో, ఉపనిషత్తులలో, అష్టాదశ పురాణాలలో, రామాయణ, భారత, భాగవత గ్రంథాలలో, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునిడికి, భీష్మాచార్యులు ధర్మరాజుకి, విశ్వామిత్రుడు శ్రీరాముడికి ప్రవచించిన ధర్మబోధనల్లో, మనుస్మృతిలో, ఇంకా అనేకానేక పౌరాణిక, ఇతిహాస గ్రంథాలలో, పలు సందర్భాలలో ప్రస్తావించిన సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవడం, సముద్రాల్లో అగాధాలు తెలుసుకోవడం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ కష్టం. ధర్మం సనాతమైనా, అదునాతనమైనా, అర్థమైతే అది ధర్మమే! సనాతన ధర్మానికి, వేల, లక్షల సంవత్సరాలనాటి హైందవ ధర్మానికి, మనుధర్మానికి వ్యతిరేకం అని మాట్లాడుతున్న అవివివేకులకు, ఇది అనాదిగా పరిమళిస్తున్న ఆధ్యాత్మిక సౌరభం అనే విషయం తెలియదు.

సదాచారం అంటే ఏమిటి? సమాజ శ్రేయస్సంటే ఏమిటి? ఉత్తమోత్తమైన ధర్మమంటే ఏమిటి? ఎవరెవరు ఏవిధంగా తమ విద్యుక్త ధర్మాలను త్రికరణ శుద్ధిగా ఆచరించాలి? క్షమాగుణం అంటే ఏమిటి? మనో నిగ్రహం ఎలాంటిది? శాస్త్ర విజ్ఞానం అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం ఎలాంటిది? కాలానుగుణంగా స్త్రీ పురుష ధర్మాలు ఎలా మారుతాయి? వైవాహిక ధర్మం అంటే ఏమిటి? దాంపత్య ధర్మం ఎలా వుండాలి? తల్లితండ్రులను, పెద్దవారిని, గురువులను ఎలా గౌరవించాలి? ఇలాంటివన్నీ సనాతన ధర్మంలో భాగాలే. ఇందులో విమర్శకులకు ఏ విధంగా తప్పు కనిపిస్తుందో తెలియదు.

వేదకాలం నాటి నుండీ ప్రత్యేకత సంతరించుకున్న జీవన విధానమైన భారతీయ, హైందవ, వైదిక సంస్కృతిని మించిన ఉత్తమోత్తమమైన సనాతన ధర్మబద్ధమైన సంస్కృతి మరొకటి లేనే లేదు. ప్రపంచ సామాజిక వ్యవస్థలలో హిందూ వైదిక వ్యవస్థ ఒక ఉదాత్తమైన వ్యవస్థ. ఏది ఆర్య ధర్మమో, ఏది ఆర్ష ధర్మమో, ఏది సనాతన ధర్మమో, ఏదికాదో నిర్ణయించే అర్హత ఎంతవరకుందో వీటిని గుడ్డిగా వ్యతిరేకించేవారు విజ్ఞతతో ఆలోచించు కోవడం మంచిదేమో! అనాదిగా సంస్కృతీ సాంప్రదాయాలకు నిలయమైన భారతావనిలో ఎవరెవరు ఎటువంటి ధర్మాలను ఆచరించారనేదే ప్రధానం. వాటిని భావితరాలవారు ఎలా అర్థం చేసుకోవాలనేది ముఖ్యం. మన ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు, వేదకాలంనాటి ధర్మశాస్త్రాలు చెప్పిందంతా బూటకం అని వాదించే కన్న అందులోని ధర్మాలను, అధర్మాలను అవగాహన చేసుకోవడం కూడా ముఖ్యం.

అయోధ్య వివాదంపై సెప్టెంబర్ 30, 2010 న వెలువడిన అలహాబాద్ హైకోర్ట్ సెక్యులర్ తీర్పులో న్యాయమూర్తులు ఋగ్వేదం, కార్ల మార్క్స్, ఖురాన్, ఇక్బాల్, ప్రొఫెట్ మహమ్మద్, డార్విన్ లాంటి అనేక సనాతన, అధునాతన పుస్తకాల్లోని మహనీయుల మాటలను ఉటంకించారు. జస్టిస్ సుధీర్ అగర్వాల్ తీర్పు పాఠాన్ని ఋగ్వేదంలోని సంస్కృత శ్లోకాలతో ఆరంభించారు ఇలా: ‘ప్రళయావస్థలో శూన్యం తప్ప ఏమీ లేదు. కేవలం పంచ భూతాలు మాత్రమే వుండేవి. ఏ లోకమూ లేదు. భూమ్యాకాశాలూ లేవు. అలాంటప్పుడు ఎవరు ఎవరిని కదిలించారు? ఎలా కదిలించారు? అంతా అనిశ్చిత స్థితే!’ అని మొదలవుతుందా శ్లోకం.

చావు పుట్టుకలు అప్పుడు తెలియదని, సూర్యచంద్రులు వున్నారో, లేరో తెలియనందున రాత్రి, పగలు తేడా లేదని అంటూ, అప్పుడు ఎవరికీ అంతుచిక్కని ఒక పర బ్రహ్మ స్వరూపం, తన శక్తితో సృష్టి ప్రక్రియను ప్రారంభించాడని, శక్తికి అతీతమైంది మరేదీ లేదని పేర్కొన్నారు. ‘సృష్టికి పూర్వం అంతా శూన్యమే. అంతా చీకటిమయం. అంతటా జలమయం. సృష్టి ఎలా, ఎప్పుడు ప్రారంభమైందో ఎవరికీ తెలియదు. పండితులకు, మేధావులకు కూడా తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే వారంతా సృష్టి తర్వాతే పుట్టారు కనుక. సృష్టికి కారకుడైన ఆ శక్తే సృష్టిని కొనసాగిస్తున్నదా, లేక, మరెవరన్నా చేస్తున్నారా? అనేదీ అంతుచిక్కని విషయమే. అసలా శక్తికి కూడా తెలుసో, లేదో?’ అని ఆరంభించి, వివాదం విషయం ప్రస్తావిస్తారు న్యాయమూర్తి అగర్వాల్.

అద్వితీయ గీర్వాణ భాషా గ్రంథాలుగా, సనాతన ధార్మిక ‘ధర్మ త్రివేణి' స్థావరాలుగా, భారతీయ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని నినదించే ఋషి ప్రసాదాలుగా ప్రసిద్ధికెక్కిన శ్రీరామాయణ, భారత, భాగవతాలకు ఆలవాలమైన ధర్మభూమి, కర్మభూమి మన అఖండ భారతావని. అర్థం, అవగాహన చేసుకోగలిగితే, ఈ మూడింటిలో దర్శనమిచ్చే అనేక ధర్మాల సమాహారమే ‘సనాతన ధర్మం.మానవ విలువలను కాపాడేందుకు నిరంతరాన్వేషణ జరుగుతుందనడానికి వాల్మీకి రామాయణ గాధే చక్కటి ఉదాహరణ. రామాయణమే ఆదికావ్యం. వేదంలాగా స్వతఃప్రమాణం. వేదార్థం ఇందులో విస్తరించి చెప్పడం జరిగింది. సనాతన ధర్మం తెలుసుకోవాలంటే శ్రీరామాయణం చదవాల్సిందే!!! అర్థం చేసుకున్నప్పుడే సనాతన ధర్మాన్ని హేతుబద్ధంగా విమర్శించడానికి అర్హులు.

(వేదం, భారతం, భాగవతం, శ్రీరామాయణం భారతీయ సంస్కృతీ రూపాలు:

సజీవ వాహిని సనాతన ధర్మంపుస్తకం నుండి సంక్షిప్త సేకరణ)

 

 

Saturday, August 10, 2024

A Tribute to Extraordinary Tales of Ordinary Women : Vanam Jwala Narasimha Rao

 A Tribute to Extraordinary Tales of Ordinary Women

Vanam Jwala Narasimha Rao

The Hans India (11-08-2024)

{UN-Ford Foundation Book ‘HUM-When Women Lead’ celebrates the achievements of women and promotes gender equality. The book is used as a resource to highlight importance of women’s leadership and to inspire action towards empowering women in various sectors. A few women leaders from Telugu states are featured, narrating their challenges, competence, potential, and significant achievements, which make a compelling case for gender equality and a more equitable society} - Editor Hans India Observation

Inspired by the initiative from a group of farmers’ children from dryland agriculture background, to revive ‘Millet Food Culture based Nutritional Diversity’ Passionate, Enthusiastic, and Energetic ‘Twin Friends’ Priyanka Bharadwaj and Vishalakshi Reddy founded the ‘Millet Bank’ to take forward the much-needed, age old, and almost forgotten, ‘Millet Farming Legacy.’

In recognition of the initiative of Vishalakshi Reddy, one of the twin friends, an exceptional 478-Page Coffee Table Book, ‘HUM (in Hindi script)-When Women Lead’ produced by United Nations Women India and Ford Foundation, marking 75 years of Independence, a six-page chapter with photographs, is exclusively allotted to her. Book covered inspirational stories of ‘75 Remarkable Women Leaders,’ who demonstrated diverse talents.  

These real stories are about their challenges, competence, potential, and significant achievements, that make a compelling case for gender equality and a more equitable society. These women leaders from various parts of India, are drawn from different fields, like Agriculture, Culture, Entrepreneurship, Education, Environment, Healthcare, Innovations, Mentorship, Overcoming Adversity, Politics, Social Justice, and Technology with specific reference to each one’s contribution in ‘Creating Resilient, Equitable, and Thriving Communities, Collectives, and Organizations’ according to Reshma Anand, Regional Director, South Asia Ford Foundation.

Describing Vishalakshi Reddy from Telangana, under the category ‘Innovations in Domestic and Urban Issues’ in addition to contribution of six more women, it is mentioned that, her professional journey began with ‘Millet Farming’ on her family’s fields in order to revive the culture. She worked with local farmers and communities for a joint learning. Her concerted efforts already yielded results, by creating an impact on the livelihoods of many individuals, through partnerships with farmers, artisans, and micro units. Creation of ‘Gift Baskets’ is the best example. Her work is widely appreciated and recognized including by Prime Minister Modi and by ‘First Ladies of G 20 Nations.’

Success stories of women who figured in this book are simply fascinating. For instance, Amila Lakra from Jharkhand connected with a local self-help group, believes that true leadership is planting seeds of growth and nurturing them together, where every hand that joins in the effort, strengthens the roots of collective success. Similarly, from a stage of begging neighbors for Rs 150 to treat her sick son, Archana Mane from Maharashtra with her work within her community rose to the level of inspiring and motivating others, that led to community strength. They both, in addition to one more woman, figured in the category of ‘Agriculture and Rural Development.’

Drishana Kalita from Assam is an inspiring example of how creative expression like her puppet shows, can be a powerful tool for advocacy and leadership in driving social transformation as well as women empowerment. Story of Mousumi Choudhury from West Bengal, an acrobatic mask dance, and inspired by Goddess Durga’s ten hands, is an illustration of how passion together with leadership can bring about significant social and cultural change. These two in addition to achievements of five more women are from the fields of ‘Cultural Preservation and Arts.’

Anuradha Das Mathur from Delhi, who was selected for the prestigious ‘Global Women’s Mentoring Partnership Program’ and pioneered a platform (Vedica Scholars Program) to build a cadre of competent young women, sent a strong message to Government, that, ‘Rather than seeing women merely as beneficiaries, enable them to contribute to the Nation.’ Jasmin Gupta from Gujarat, CEO and Founder of ‘Lxme’ a Neo Bank for Women, which has no physical location as such, is well poised to achieve her dream of making women financially independent and empowered. These two women, in addition to five more, are in the category of ‘Economic Empowerment and Entrepreneurship.’

Direction of Anoushka Sinha from Uttar Pradesh, a UN Youth Leader, is about creating change and advocating for those who are less privileged. Her active efforts to change legal and social systems for the betterment of youth is exemplary. Madhumita Nath from West Tripura, who evinces keen interest in performing arts, and worked with National School of Drama, is a staunch believer in the importance of education. She became a guiding light for girls, championing their rights and safety. Journey of Vishali Kola from Andhra Pradesh, from a restricted housewife to a successful entrepreneur and child rights advocate is an inspiring tale of courage, and determination. These three in addition to two more women are in the category of ‘Empowering through Education.’

Gayatri Swahar from Haryana, an industrial sociologist works with thousands of women farmers. Her story is a powerful example of how leadership can drive social and cultural transformation. Ezhil Subbian from Karnataka, who was awarded three PhDs by top universities in Molecular Bio Physics, Bio Physics, and Bio Chemistry, is an entrepreneur not afraid of taking risks, and believes in innovative solutions. Kalpana Ramesh from Telangana, based on fundamental law of nature, created a self-sufficient water management system to harvest rain water. These three in addition to two more are in the category of ‘Environmental Stewardship.’

In ‘Healthcare and Wellness Advocacy’ area, two doctors in addition to two more, who did yeomen service find place in the book. Dr Prabha Yadav from Maharashtra, renowned plastic surgeon educates and trains more people. Dr Sangeeta Saksena a Gynecologist from Bangalore, through her Trust treats abused children, adolescents and took lead in Child safety. In the areas of ‘Mentorship and Leadership Development,’ Syed Sehrish Asgar from Jammu and Kashmir, an IAS Officer, a catalyst for social change and an inspiration for countless young women is covered. Story of Larishisha Pdahsiej from Meghalaya, is a powerful illustration of the impact of women in leadership roles, particularly in areas where traditionally men dominated. Aishwarya Bodapati from Telangana, who is known for undertaking ‘Navika Sagar Parikrama’ in a group, circumventing the globe in 254 days on the seas figured in the same category. Two more women are also covered.

In the category of ‘Social Justice and Equity,’ Auda Viegas from South Goa who had grown from a solitary figure on a beach to a leader creating supportive and empowering community is covered. Others covered are: Gaytri Suman from Chhattisgarh, a lawyer, who championed cases related to land rights, gender equality, and social justice; Grace Banu from Tamil Nadu, who set up ‘Trans Rights to create Role Models for Trans Persons’ battling for their representation and for reservation; Jameela Nishat from Telangana, who is popularly known as the voice of ‘Communal Harmony’ through founding the ‘Shaheen’ organization, as well as Seven more women.

In the category of ‘Overcoming Adversity’ contribution of five women is highlighted. In the category of ‘Political Leadership and Community MobilizationChanda Bai Meena from Rajasthan, Laki Jani from Odisha, Malika Virdi from Uttarakhand and nine more women figured. In the category of ‘Technology and Innovation’ figured Neelima Jerath from Punjab who made history as India’s first female Director General of a Science City. Three more women also figured in this.

Amitab Kanth, India's G20 Sherpa (Representative of Head of Government) and former CEO of NITI Ayog in his Message, said that, ‘Women Empowerment is not just a matter of equity, it is a strategic imperative for sustainable development and inclusive growth.’ Susan J Ferguson, Representative of ‘UN Women in India,’ in the Foreword, wrote that this book is a tribute to the extraordinary journeys of ordinary women, rewriting their destinies and in turn shaping others’ lives.

HUM - When Women Lead’ is associated with International Women's Day, which celebrates the achievements of women and promotes gender equality. The book is used as a resource to highlight importance of women’s leadership and to inspire action towards empowering women in various sectors. By aligning with International Women's Day, the book leveraged the global attention on women's issues to amplify its message and reach a broader audience.

(Telangana and Indian ‘Women Leaders’ in Nation Building)

(Source: UN-Ford Foundation Book ‘HUM-When Women Lead’)

 

Sunday, August 4, 2024

శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద కథా సంగ్రహం : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద కథా సంగ్రహం

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (05-08-2024)

శ్రీవిలుబుత్తూరు నగరం పాండ్యుల రాజ్యంలోని నగరాలన్నిటి కంటే గొప్పది. ఎత్తైన మేడలతోను, ఉద్యానవనాలతోను, తీర్చిదిద్దిన వీధులతోను, శిల్పకళతో ముచ్చటగా వుండే ఇళ్లద్వారాలతోను, పద్మినీ జాతి స్త్రీలతోను, స్వచ్చమైన కొలనులతోను, ఋతువులకు తగ్గ ఫలాలను ఇచ్చే వృక్షాలతోను, నానారకాల పక్షులతోను, సాయంకాలాలు గంపల్లో పూలు తెచ్చి అమ్మే పల్లెటూరి పడుచులతోను, ఇంకా అనేక వింతలతోను అలరారుతుంది శ్రీవిలుబుత్తూరు నగరం.

విలుబుత్తూరు నగర గృహస్థులు అతిథి, అభ్యాగతులకు మర్యాదలు చేయడంలో సాటిలేనివారు. ఆతిథ్యం స్వీకరించిన అతిథులు వెళ్లిపోతామంటే బంధువులు దూరమవుతున్నట్లు విచారించేవారు. అలాంటివారిలో అద్వైత సిద్ధాంతాన్ని త్రికరణ శుద్ధిగా అనుసరించే పరమ భాగవతోత్తముడు విష్ణుచిత్తుడు ఒకడు. అద్వైత వాదంతో ఉత్తమ జీవితం గడుపుతూ భగవద్భక్తులకు సకల పరిచర్యలు, మర్యాదలు జరుపుతూ, దేవుడి చేతులకు, చరణాలకు తులసీదళాల మాలలు అలంకరిస్తూ విష్ణుచిత్తుడు గృహస్థుడిగా సుఖ సంతోషాలు అనుభవిస్తున్నాడు. అతడి ఇంటిలో అర్థరాత్రి దాటేదాకా పురాణ పారాయణం, దైవ సంకీర్తనం వినిపించేది.

ఇదిలా వుండగా, దక్షిణ భారతదేశంలో మధురాపురం అనే ప్రసిద్ధమైన మహానగరం సకల సౌభాగ్యాలతో నిండి వుండేది. ఆ నగరంలో పూలు, పూలమాలలు అమ్మే కన్యల చమత్కారాలు వర్ణించలేని ఆనందాన్ని ఇస్తాయి. ప్రణయభావాలు రేకెత్తించే చమత్కార సంభాషణలతో యువకులను వివశులను చేసి తమ పూల దండలను విరివిగా అమ్ముకుంటారు. శీలం చెడకుండా ప్రవర్తించే గడుసువారు ఆ యువతులు. కాకపోతే చూసేవారిలో కోరికలు ఊరిస్తూ వుంటారు. మధురానగరంలో వేశ్యలు మరీ అప్సరసలు. రతీమన్మథ శాస్త్రాలలో పారంగతులు వారు. ఆ నగరంలోని బ్రాహ్మణులు నిత్యాగ్నిహోత్రులు. యజ్ఞాయాగాలు చేసేవారు. ఆ నగర బ్రాహ్మణులు చేయి చాచి దానం పట్టరు. ఆ నగరంలోని రాకుమారులకు మంత్రకవచం తప్ప యుద్ధకవచం అక్కరలేదు. భుజబలాన్ని చూసి కాకుండా బుద్ధిబలాన్ని చూసి గౌరవిస్తారు. ఆ పట్టణంలోని వెనుకబడిన వర్గాల వారు పొలాలు దున్ని ధాన్యరాశులు పండించుకుంటారు.

ఆ నగరాన్ని మత్స్యధ్వజుడు అనే చంద్రవంశపు రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజు రాజనీతి విశారదుడు. పాండ్యవంశ వారసుడు. సామ, దాన, భేద, దండోపాయాలతో పాటు షడ్గుణాలలో చక్రవర్తి. ఆయన కీర్తి దేవలోకందాకా వ్యాపించింది. గ్రీష్మఋతువు ప్రవేశించగానే ప్రకృతి పరవశంతో పాటు, ఆ నగరంలో కొండమీద వున్న దేవుడికి తెప్ప తిరునాళ్ల ఉత్సవం వచ్చింది. తిరునాళ్లను చూడడానికి వచ్చిన పరదేశ బ్రాహ్మణుడు ఒకడు మధురానగరి వైభవాలను చూస్తూ ఆనందించ సాగాడు. రాజపురోహితుల ఇంటి ఆతిథ్యం స్వీకరించాడు. ఆ తరువాత భక్తుల కోరిక మీద సూక్తులు పాడడం మొదలెట్టాడు. అందులోని ఒక సూక్తి, అదే సమయంలో రాజు మత్స్యధ్వజుడు వేశ్య భోగిని ఇంటికి పోతుండగా, ఆయన హృదయానికి సూటిగా తగిలింది. తన ప్రవర్తనకు విచారించాడు.

తాను ఇంతకాలం ఇంద్రియ సుఖాలే ముఖ్యమనుకున్నాని, ఇక ముందు పరలోక సుఖాలకోరకు కృషి చెయ్యాలని నిశ్చయించుకున్నాడు రాజు మత్స్యధ్వజుడు. ఒక తలారి ద్వారా తన వేలికున్న ముద్రికను ఆ పరదేశి బ్రాహ్మణుడికి పంపాడు. తాను అంతఃపురంలోకి పోయాడు. మర్నాటి సభలో హాజరైన వేదవేదాంత తత్త్వవేత్తలను, పండితులను, గురువులను శాశ్వతంగా, సులభంగా మోక్షాన్నిచ్చే దేవుడు ఎవరని ప్రశ్నించాడు. సభలోని వారు ఒకరు శివుడని, మరొకరు శ్రీహరి అని, ఒకరు పార్వతి అని, ఇంకొకరు అగ్ని అని రకరకాలుగా వాదించారు. రాజును ఎవరూ నమ్మించలేకపోయారు.

మదురానగరంలో ఇలా చర్చ జరుగుతున్నప్పుడు శ్రీవిలుబుత్తూరులోని విష్ణుచిత్తుడు తన నిత్యాచారం ప్రకారం తులసి మాలలు కట్టి దేవాలయంలోని మన్ననారు స్వామికి సమర్పించడానికి పోయాడు. అతడిని వెంటనే మధురానగరం పొమ్మని స్వామి అంటూ, అక్కడి పాండ్యరాజు కొలువులో జరుగుతున్న శుష్కవాదాలను ఓడించి, తన మహిమను చాటి, అందరినీ గెలిచి బహుమతి తీసుకొమ్మని చెప్పాడు. దేవుడు మాట్లాడగానే ఆశ్చర్య పోయాడు విష్ణుచిత్తుడు. పాండ్యరాజు సభలో అతడు గెలిచేట్లు చేసే బాధ్యత తనదని, ఆయన నిమిత్తమాత్రుడే అని చెప్పాడు. విష్ణుచిత్తుడు వెళ్లిపోయాడు.

మధురానగరం పోయిన విష్ణుచిత్తుడు రాజసభలో ప్రవేశించగానే ఆయనకు అంతా గౌరవాభినందనలు చేశారు. రాజుగారు ఆయన్ను ఒక బంగారు పీఠం మీద కూచోబెట్టాడు. సభలోని వారందరి వాదనల్లోని తప్పులను ఎత్తి చూపాడు విష్ణుచిత్తుడు. అందరి వాదాలనూ ఓడించాడు. చివరకు, విశిష్టాద్వైతవాదం పరకారం యాత్ర దేవుళ్లు అంతా విష్ణుదేవుడి అంశలేనని నిరూపించసాగాడు. అందువల్ల అంశమాత్రులైన ఇతరులను పూజించడం కన్నా మోక్షకాముకులు పరిపూర్ణుడైన నారాయణుడిని కొలవడం ఉత్తమం అని తేల్చాడు. ఈ సందర్భంగా ఖాండికధ్వజుడు, కేశిధ్వజుడు అనే అన్నదమ్ముల కథ చెప్పాడు.

నిమివంశంలో ధర్మద్వజుడు, కృతధ్వజుడు అనే ఇద్దరు అన్నదమ్ములకు ఖాండికధ్వజుడు, కేశిధ్వజుడు అనే ఇద్దరు కుమారులు పుట్టారు. వీరిలో ఖాండికధ్వజుడు కార్యశూరుడు కాగా, కేశిధ్వజుడు విజ్ఞాని. పెరిగి పెద్దైన తరువాత వారిలో ఒకరంటే ఇంకొకరికి అసూయ పెరిగింది. రాజ్యకాంక్ష పెరిగి యుద్ధానికి తలపడ్డారు. చివరకు ఖాండికధ్వజుడి సైన్యాన్ని ఓడించి కేశిధ్వజుడు విజయం సాధించాడు. ఖాండిక్యుడు తన పరివారంతో సహా అరణ్యాలకు పోయి అక్కడ వుండసాగాడు. కేశిధ్వజుడు గెలిచినప్పటికీ సోదరుడి రాజ్యాన్ని ఆక్రమించుకోకుండా తాను మృత్యువును, పునర్జన్మను జయించాలని యోగ నిష్టతో యజ్ఞాయాగాలు చేస్తూ వ్రతదీక్షలో మునిగిపోయాడు.

యజ్ఞంలో బలిపశువుగా రాజు పెంచుకున్న ఆవు ప్రమాదవశాన పులినోట చిక్కి కొనవూపిరితో వుండడంతో తన యజ్ఞం ఆగిపోతుందేమోనాన్న భయం పట్టుకుంది రాజుకు. ఏంచేయాలని యజ్ఞం చేయిస్తున్న మునులను అడిగాడు. ఆ ధర్మసూక్ష్మం అరణ్యాలలో వున్న ఖాండిక్యుడికి మాత్రమే తెలుసునని అనగానే అతడి దగ్గరికి సపరివారంగా బయల్దేరాడు కేశిధ్వజుడు. అలా వస్తున్న అతడిని, సైన్యాన్ని చూసి, మొదట్లో ఖాండిక్యుడికి, తనమీద యుద్ధానికి వస్తున్నాడేమోనని సోదరుడి మీద అనుమానం వేసింది.  కాని అతడొచ్చిన పని చెప్పిన తరువాత మంత్రులను సంప్రదించి, తన నిర్ణయంగా సోదరుడికి సహాయం చేయడానికే నిశ్చయించుకున్నాడు. యాగానికి ఉద్దేశించిన ఆవు చనిపోతే చేయాల్సిన ప్రాయశ్చిత్తాన్ని ఖాండిక్యుడు తన సోదరుడికి చెప్పాడు. ఆ తరువాత కేశిధ్వజుడు తన వ్రతం పూర్తి చేసుకున్నాడు.

ఆ తరువాత గురుదక్షిణ ఇవ్వాలని అనుకున్నాడు కేశిధ్వజుడు. మళ్లీ అడవికి వెళ్ళాడు. ఖాండిక్యుడిని కలిసి గురవైన అతడికి ఏమి ఇవ్వమంటారో సెలవివ్వమని అడిగాడు. ఆధ్యాత్మిక చింతన కలవాడైన కేశిధ్వజుడిని తనకు మోక్షాన్ని ఇచ్చే విద్యను గురుదక్షిణగా బోధించమని చెప్పాడు. తన రాజ్యం కోరకుండా విద్యను కోరినందుకు సోదరుడిని అభినందిస్తూ, కేశిధ్వజుడు ఆ విద్యను నేర్పాడు. తత్త్వబోధ చేశాడు. ఆ తరువాత సోదరుడి కోరిక మేరకు కేశిధ్వజుడు యోగవిద్యను గురించి కూడా వివరించాడు. చెప్పాల్సినదంతా చెప్పిన తరువాత తన రాజ్యాన్ని కూడా తీసుకోమ్మన్నాడు. ఖాండిక్యుడు రాజ్యాన్ని స్వీకరించి, తన కొడుక్కు పట్టాభిషేకం చేసి, ప్రజలందరినీ సక్రమంగా పాలించమని చెప్పి, అడవులకు పోయి, అక్కడే భక్తి యోగాభ్యాసం చేసి, విష్ణుమూర్తిని మనసులో దర్శించి, విష్ణువులో కలిసిపోయాడు.

ఈ కథను పాండ్యరాజైన మత్స్యధ్వజుడికి చెప్పిన విష్ణుచిత్తుడు, ఆయన్ను కూడా విష్ణుమూర్తిని జపించి తరించమని అన్నాడు. రాజుగారి చెవిలో అద్వైతమాట మంత్రాన్ని రెండు అక్షరాలలో చెప్పి విష్ణుభక్తుడిగా మార్చి వేశాడు. మత్స్యధ్వజుడు ఆయనకు అనేక బహుమతులు అందచేశాడు. ఓటమిపాలైన పండితులు కూడా ఆయన్ను పొగిడారు, ప్రశంసించారు. రాజాజ్ఞాప్రకారం విష్ణుచిత్తుడిని ఉరేగింపుగా సాగనంపమని చెప్పగా వారు అలాగే చేయడంతో స్వదేశానికి పోసాగాడు.

విష్ణుచిత్తుడి భక్తియుక్తులకు మెచ్చిన విష్ణువు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. విష్ణుచిత్తుడు తనకు సాక్షాత్కారమైన శ్రీహరిని పరిపరి విధాలుగా స్తుతించాడు. శ్రీహరి అతడిని ఆశీర్వదించి స్వర్గానికి పోయాడు. విశ్వకర్మను పిలిచి విష్ణుచిత్తుడి ఇంటిని సుందర సౌధంగా చేయమని ఆదేశించగా అతడు అలాగే చేశాడు. పురప్రవేశం చేసిన విష్ణుచిత్తుడికి పురప్రముఖులు బ్రహ్మరథం పట్టారు. ఊరేగింపు జరపసాగారు. విష్ణుచిత్తుడు ముందుగా మన్ననారు దేవాలయానికి వెళ్లి భక్తిశ్రద్ధలతో పూజించి, తన ఇంటికి పోయాడు. ఆ మహాసౌదాన్ని చూసి శ్రీమన్నారాయణుడి కృపవల్ల తనకు సిరిసంపదలు లభించాయని భావించాడు.

ఈ నేపధ్యంలో ఒకనాడు మన్ననారు దేవాలయంలోని విష్ణుమూర్తి విష్ణుచిత్తుడిని ప్రశంసిస్తూ, ఆయనలాంటి మరో వ్యక్తైన యామునాచార్యుడి ప్రసక్తి తెచ్చాడు లక్ష్మీదేవి దగ్గర. అతడి వివరాలు చెప్పమని కోరింది లక్ష్మీదేవి. సమాధానంగా శ్రీహరి ఇలా చెప్పాడు. మధురానగరంలో నాదముని అనే భక్తుడికి మనుమడుగా పుట్టిన యామునాచార్యుడు పరమ భక్తుడు. అప్పట్లో పాండ్యరాజ్యాన్ని పాలిస్తున్న రాజు శైవమత పక్షపాతి. శ్రీహరి విగ్రహాలను పూజించరాదని కట్టడి చేశాడు. దేవాలయాలను పాడు చేశాడు. పాండ్యరాజు భార్య మాత్రం విష్ణు భక్తురాలు. విష్ణు వ్రతాలు చేసేది. విష్ణు భక్తులను కాపాడాలనే ఆలోచన, రాజు వారిని గౌరవించేలా చేయాలన్న భావన శ్రీహరికి కలిగింది. హరిభక్తిని చాటడానికి యామునాచార్యుడిని నియమించాలనుకున్నాడు. రాజు కొలువులో విష్ణు తత్త్వమే పరమ తత్త్వమని వాదించడానికి యామునాచార్యుడు రాణి సహాయం కోరాడు. ఆమె రాజును ఒప్పించింది.

మర్నాడు యామునాచార్యుడు సభలో ప్రవేశిస్తూ అక్కడే మొలచిన రావిచెట్టుకు నమస్కారం చేసి తాను చేయబోయే వాదనకు ఆ చెట్టే సాక్షి అని అన్నాడు. యామునాచార్యుడు ఆ సభలో వున్న అందరి వాదాలను ఒక్కొక్కటిగా సహేతుకంగా ఖండించి విష్ణుమూర్తే పరమాత్మ అని, విశిష్టాద్వైతమే గొప్ప మతం అని నిరూపించాడు. అదే సమయంలో సింహద్వార సమీపంలో ఉన్న రావిచెట్టు అదే విధంగా పలికింది. రాజుగారు యామునాచార్యుడిని మెచ్చుకున్నారు. ఆయనకు సాష్టాంగనమస్కారం చేసి, పూజించి, హరిభక్తి మంత్రోపదేశం పొందాడు. యామునాచార్యుడికి తన చెల్లెలినిచ్చి వివాహం కూడా చేశాడు. అర్థరాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేశాడు. భక్తితో శ్రీహరిని సేవించసాగాడు. రాజ్యాధికారం చేపట్టిన యామునాచార్యుడు దండయాత్రలు చేసి దిగ్విజయుడై రాజధానికి తిరిగి వచ్చాడు. ఆ తరువాత జరిగిన రక్తపాతానికి ప్రాయశ్చిత్తంగా యజ్ఞయాగాదులు చేశాడు.

యామునాచార్యుడు ఆధ్యాత్మిక విశేషాలు మరచిపోయి రాజ్యభోగలాలసుడై మోక్షానికి దూరం అవుతున్నాడని శ్రీరామమిశ్రుడు అనే అతడు భావించాడు. అతడిని సంస్కరించాలనుకున్నాడు. ఒకనాడు రాజును కలిసి, ఆయన పూర్వులు సంపాదించిన నిధి నిక్షేపాలు, హిందూ మహాసముద్ర జలాల మధ్య దాచబడి వున్నాయని వాటిని చూపించదానికి వచ్చానని చెప్పి రాజును సపరివారంగా, సకుటుంబ సమేతంగా తనతో తీసుకు పోయాడు. అంతా శ్రీరంగం చేరి, కావేరీ చంద్ర పుష్కరణి స్నానం చేసి, శ్రీరంగనాథుడి దర్శనం చేసుకుని పూజించారు. అదే నిక్షేపం అని చెప్పాడు శ్రీరామమిశ్రుడు. రంగనాథుడి పాదపద్మాలు చూపించాడు. వెంటనే యామునాచార్యుడికి పూర్వాశ్రమ జ్ఞానం కలిగింది. వెంటనే కొడుక్కు రాజ్యం అప్పగించి, రాజనీతి బోధించి, సన్న్యాసాశ్రమం స్వీకరించాడు. విష్ణుభక్తితో జీవితాన్ని గడిపాడు.

ఇదే తన భక్తుల ప్రభావం అని చెప్పాడు శ్రీహరి లక్ష్మీదేవికి.

ఇదిలా వుండగా, విష్ణుచిత్తుడి జీవితంలో కొత్త ప్రకరణం ప్రారంభం అయింది. ఒకనాడు అలవాటు ప్రకారం తులసీదళాలు కోస్తుంటే, తులసి చెట్ల గుబురు మధ్య ఒక ఆడ శిశువు మెరిసిపోతూ కనిపించింది. బిడ్డలు లేని తనకు విష్ణుమూర్తే బిడ్డను ఇచ్చాడని అనుకుంటూ ఆ శిశువును ఎత్తుకుని ముద్దాడుతూ ఇంటికి వెళ్లి భార్యకు ఇచ్చాడు. అల్లారుముద్దుగా పెరిగిన ఆమె యౌవనవతి అయింది. ఆమె విష్ణుచిత్తుడికి దొరికిననాడే మురాళిక, ఏకావళి, హరిణి, మనోజ్ఞ, స్రగ్విణి అనే నాగకన్యలు కూడా పుట్టి ఆమెతో పాటే పెరిగారు. స్నేహితులయ్యారు. విష్ణుచిత్తుడి కూతురు విష్ణువు మీద, ఆయన అవతారమైన శ్రీకృష్ణుడి మీద ప్రేమభావాన్ని పెంచుకోసాగింది. ఆయన్నే పెళ్లి చేసుకోవాలని మనసులో నిశ్చయించుకున్నది.

ఆముక్తమాల్యద అనే పేరుకల ఆ కన్య అనునిత్యం ఒక వింతపని చేస్తూ వుండేది. తండ్రి దేవుడి కొరకు కట్టిన పూలమాలలను తాను అలంకరించుకొని  విష్ణువును తలచుకునేది. నీళ్లలో తన అందాన్ని చూసుకునేది. విరహం పొందేది. తండ్రికి తెలియకుండా ఆ మాలలను బుట్టలో వేసేది. తన తండ్రి తన విషయం తెలియక మరెవరికన్నా ఇచ్చి పెళ్లి చేస్తే, మరో జన్మలోనైనా శ్రీకృష్ణుడినే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటూ ఆత్మహత్య చేసుకుంటానని అనేది స్నేహితురాళ్లతో. ఆమె భర్త ఎక్కడో లేడని, శ్రీరంగంలో ఉన్నాడని, తొందరపడి ఆత్మహత్య చేసుకోవద్దని, రంగనాథుడిని పూజించమని సలహా ఇచ్చారు చెలికత్తెలు. ఆనాటి నుండి ఆ కన్య విష్ణువునే ప్రియుడిగా తలచుకుంటూ ప్రేమగీతాలు పాడసాగింది. సూర్యోదయానికి ముందే లేచి పూలమాలలు పట్టుకుని దేవాలయానికి వెళ్లేది. ఇంటికి వచ్చి ఎప్పుడూ ప్రియుడి గురించి ద్రావిడ భాషలో పాటలు రాసి పాడుకుంటూ వుండేది. అలా, అలా ఆముక్తమాల్యదలో విరహతాపం ఎక్కువైంది.    

కూతురు ముఖం రోజురోజుకూ వాడిపోవడం చూసిన విష్ణుచిత్తుడి మనస్సు తరుక్కుపోయింది. వెంటనే దేవాలయానికి వెళ్లి దేవుడి విగ్రహానికి తన బాధను చెప్పుకున్నాడు. మన్ననారు ఆ భక్తుడి అమాయకతకు చిరునవ్వు లొలికిస్తూ మాలదాసరి కథ చెప్పాడు. అతడెలా తన కులవృత్తి చేసుకుంటూనే తనను కీర్తించినదీ, తన విగ్రహాన్ని అలంకరించేదీ, తన సేవకు పాటలు పాడేదీ,                                తన కైంకర్య ప్రసాదాన్ని దూరం నుండే ఎలా కళ్లకద్దుకుని తీసుకునేదీ వివరించాడు శ్రీహరి. ఒకనాడు చీకటిలో దేవాలయానికి వస్తుండగా ఎలా కుంభజానుడు అనే రాక్షసుడు చేతికి చిక్కినదీ, అతడితో ఎలా పోరాడినదీ, ఓటమి పాలైనదీ, తనను ఆహారంగా తీసుకుంటానని బెదిరించగా రాక్షసుడిని ఒప్పించి  వైకుంఠదేవాలయానికి వెళ్లి వచ్చినదీ, అక్కడ వ్రతం పూర్తి చేసుకున్నదీ చెప్పాడు శ్రీహరి విష్ణుచిత్తుడికి.

దాసరి చీకట్లో అడవి దాటడానికి రాక్షసుడు సహాయం చేశాడు. దాసరి గుడికి వెళ్లి భక్తిశ్రద్ధలతో సంకీర్తనచేసి తిరిగివచ్చి తనను ఆహారంగా తీసుకొమ్మని రాక్షసుడి ఎదుట నిలిచాడు. ఆ బ్రహ్మరాక్షసుడు దాసరి సత్యసంధతకు ఆశ్చర్యపోయాడు. వెంటనే దాసరి చుట్టూ ప్రదక్షిణ చేసి సాష్టాంగనమస్కారం చేశాడు. తనకు శాప విముక్తిని కలిగించమని వేడుకున్నాడు. తాను పూర్వ జన్మలో సోమశర్మ అనే బ్రాహ్మణుడినని శాపవశాన ఇలా అయ్యానని చెప్పాడు. దాసరి ఆయన చేసుకున్న పుణ్యాన్ని ధారపోస్తే తనకు శాప విముక్తి కలుగుతుందన్నాడు. మొదట్లో ఒప్పుకోకపోయినా చివరకు అంగీకరించాడు మాలదాసరి. పుణ్యం, ఫలం అనేవి తనకు తెలియవని, అవి భగవంతుడికే తెలుసని, కాబట్టి భగవంతుడే అతడిని రక్షిస్తాడని రాక్షసుడికి చెప్పాడు. అంతటితో రాక్షసుడు సోమశర్మగా మారిపోయాడు.  అతడు ముక్తిపొంది చివరకు తనలో చేరిపోయాడని శ్రీహరి చెప్పాడు విష్ణుచిత్తుడికి.

తాను చెప్పిన కథ తెలిసిన భూదేవి తనలో చేరాలనే కోరికతో, లక్ష్మితో సమానమవ్వాలనే కోరికతో విష్ణుచిత్తుడికి కూతురై తననే ప్రేమించి విరహతాపం పొందుతున్నదని చెప్పిన మన్ననారు స్వామి, అతడి కూతురును శ్రీరంగం తీసుకెళ్లి స్వామికి అర్పించమని సూచించాడు. విష్ణుచిత్తుడు శ్రీరంగానికి కూతురుతో సహా పోయాడు. శ్రీరంగనాథుడికి సాష్టాంగదండ ప్రణామాలు ఆచరించాడు. దేవుడిని కీర్తించాడు. శ్రీరంగనాథుడు ఆముక్తమాల్యద మీద తన మనసు ఆపుకోలేక, ఒక మాయా కన్యను సృష్టించి, విష్ణుచిత్తుడి ఇంట్లో వదిలేసి, అక్క వున్న ఆముక్తమాల్యదను తన ఆత్మలోకి తీసుకున్నాడు.

ఇంటికి వెళ్లిన విష్ణుచిత్తుడికి తన కూతురు కనిపించింది. మరికాసేపటికి శ్రీరంగనాథుడి పక్షాన పిల్లను ఇవ్వమని అడగడానికి బ్రహ్మ, శివుడు, పార్వతి, ఇంద్రుడు పెళ్లిపెద్దలుగా వచ్చారు. తన జీవితం ధన్యమైందని అన్నాడు విష్ణుచిత్తుడు. తమ ఇంటి ఆచారం ప్రకారం శ్రీరంగనాథుడు పెళ్లికొడుకై సకుటుంబ సపరివార బంధుమిత్ర సమేతంగా తన ఇంటికే వచ్చి పెళ్లి చేసుకుని, భార్యను తీసుకెళ్లాలని షరతు పెట్టాడు. దేవతలు దానికి సమ్మతించారు. లగ్నం నిశ్చయించారు.

శ్రీవిలుబుత్తూరులో విష్ణుచిత్తుడు కూతురు పెళ్లికి వైభవోపేతంగా ఏర్పాట్లు చేశాడు. శ్రీమహావిష్ణువు పెళ్లికొడుకై గరుత్మంతుడి మీద ఊరేగుతూ వచ్చాడు. దేవతలంతా వచ్చారు. శాస్త్రోక్తంగా కన్యాదానం జరిగింది. విష్ణుమూర్తి ఆముక్తమాల్యద మెడలో మంగళసూత్రం కట్టాడు. అంతకు ముందు జీలకర్ర-బెల్లం పెట్టించారు. సప్తపది జరిపించారు. అరుంధతీ దర్శనం చేయించారు.  విష్ణుమూర్తి గోదాదేవిని భార్యగా తీసుకుని వైకుంఠానికి తరలి వెళ్లాడు. 

(పోలవరపు శ్రీహరిరావు వచన రచన ఆధారంగా)

 

Saturday, August 3, 2024

Optimal Level and Balanced Approach to Reservations : Vanam Jwala Narasimha Rao

 Optimal Level and Balanced Approach to Reservations

Vanam Jwala Narasimha Rao

The Hans India (04-08-2024)  

{Reservations did play a significant role in ‘Promoting Social Justice and Equity.’ Nevertheless, either continuing reservations in the same fashion, or adopting ‘Creamy Layer’ concept, to exclude more affluent and better-educated from availing reservations, is a complex issue and debatable intellectually, objectively, and dispassionately. It is essential to periodically review and assess the effectiveness and rationale of reservation policy, in its entirety, including data-driven socio-economic progress of beneficiaries. ‘Balancing Merit and Reservation’ is crucial for maintaining standards and competency. ‘Economic Criteria’ may perhaps better help many disadvantaged individuals to receive support irrespective of caste. ‘Optimal Level and Balanced Approach to Reservations’ is appropriate with changing times} – Editor’s Synoptic Note

Former Governor Kumud Ben Joshi of erstwhile Andhra Pradesh, whenever she differed with Chief Minister NT Ramarao, always defended herself saying, ‘I am Citizen First and Governor Next.’ In 2001, National Human Rights Commission Chairman Justice JS Verma and Union External Affairs Minister Jaswant Singh differed on inclusion of ‘Treatment of Dalits in India’ in the UN ‘Conference Agenda’ on Racism.  

During Emergency in a Habeas Corpus Case, while four senior most Judges of Supreme Court, ruled in favor of ‘State's Right to Unrestricted Powers’ of detention, Justice HR Khanna in his dissenting opinion said that, ‘A dissent is an appeal to the brooding spirit of the law, to the intelligence of a future day, when a later decision may be possible to correct the error.’ His decision did ‘Cost him Badly’ in denial of the coveted Chief Justice Elevation. 24 years later, Apex Court admitted that its ‘Emergency Time’ decision was ‘Erroneous and Violated Fundamental Rights.’ Justice Khanna’s dissent is remembered for ever for upholding fundamental Rights. That is ‘The Value and beauty of Dissent’!

A ‘Tweet’ by IAS Officer Smita Sabharwal, unpleasantly led to ‘Bulldozing Protests’ from few individuals and organizations, including unviable challenges like demanding her to sit for UPSC examination again and beat her score. Equally, many supported Smita’s logic. In her view, IAS is a ‘Leadership Role’ requiring prompt response to ‘Law-and-Order’ situations, be agile, be able to tour extensively, do field work, listen first hand to issues, and to be the ‘First Responder for Disaster Management.’ With due regard to all who fight against odds, Smita honestly feels that any form of visual, hearing, ‘Locomotive Disability’ may hamper these functions, like in jobs with specialized needs.  It maybe inconsequential, whether Smita is ‘Absolutely or Partially Right or Wrong’ but should her ‘Freedom of Expression, Difference of Opinion, and Dissent’ which is the philosophy behind Article 19 of Constitution and its Preamble - where a solemn resolve is made to secure to all its citizens, liberty of thought and expression - be denied ‘Lock Stock and Barrel’?  

            In India, ‘Reservations’ were necessitated to correct the oppression, inequality and discrimination inflicted on few communities, when the earlier times Hindu Society was divided into four Varnas, or Classes, that resulted in ‘Social, Economic, and Political Disadvantage’ to some, and leavingUntouchables’ (Dalits) as they were called then, outside this system. During Independence Movement Leaders like Nehru, Ambedkar, Gandhi etc. made efforts to help Dalits under British Colonial Rule.

 

When in 1882 (William) Hunter Commission was appointed by Viceroy Lord Ripon, Jyoti Rao Phule and Hunter conceived the idea of ‘Caste-Based Reservation System.’ Later, British Raj introduced ‘Elements of Reservation’ in the Government of India Act 1909. ‘Reservation System’ that exists today, was introduced in 1933 through 'Communal Award' by British Prime Minister Ramsay Macdonald, providing separate representation for Muslims, Sikhs, Indian Christians, Anglo-Indians, and Europeans. The 'Poona Pact' signed between Gandhi and Ambedkar, led to single Hindu electorate with reservations, wherein ‘Dalits’ having seats reserved within it. Representation of ‘Depressed Classes’ was intended then to be ‘Temporary.’

Reservation of Seats for Depressed Classes was incorporated into the Government of India Act 1935, and introducing the term ‘Scheduled Castes.’ With independence in sight, Ambedkar successfully expanded the scope of reservations from Legislative Seats to ‘Government Jobs and Education.’ Cabinet Mission Statement of May 1946, laid out a plan for the Constituent Assembly’s Composition, such that the body be a broad-based one. In addition to divisions for Muslims and Sikhs, it suggested ‘General Category’ which would include Hindus, Anglo-Indians, Parsis, Indian Christians, the Scheduled Castes (ST), Scheduled Tribes (ST), and women.

First Prime Minister Jawaharlal Nehru, who sought to build a ‘Secular India’ designated Ambedkar as Law Minister, who became chairman of the ‘Drafting Committee’ for India’s Constitution. The draft included Muslims and Indian Christians among the beneficiaries of reservations in legislatures. In 1950, Constitution provided reservations in education and government jobs for SCs and STs, Initially at 12.5% and 5% respectively, which now stand at 15% and 7.5% respectively, reflecting increase in population. Following Mandal Commission Report, in 1990 VP Singh Government, provided 27% reservation for the Other Backward Classes (OBC).

10% reservation for ‘Economically Weaker Sections (EWS)’ in general category was introduced in 2019 through Constitutional Amendment. ‘Persons with Disabilities (PWD) Act’ provided 3% reservations to ‘Differently Abled Persons’ in 1995 and increased to 4% in 2016.  Percentage of all these adds up to 59.5% Vertical (SC, ST, OBC and EWS) and 4% Horizontal (PWD) which can overlap with SC, ST, OBC, and EWS categories. The grand total is 63.5%!!!   

The Supreme Court which capped total reservations at 50% in 1992, to ensure that ‘Merit is not Compromised in Public Employment and Education’ upheld in 2022 the decision of 10% reservation for EWS as an exception, taking total reservations beyond ceiling. Several states favored additional reservations, beyond ceiling, but Supreme Court emphasized that any breach of ceiling must be based on extraordinary circumstances.

Recently Apex Court refused to pause Patna High Court's order scrapping 65% quota in Bihar. Reservations did play a significant role in ‘Promoting Social Justice and Equity.’ Nevertheless, either continuing reservations in the same fashion, or adopting ‘Creamy Layer’ concept, to exclude more affluent and better-educated from availing reservations, is a complex issue and debatable intellectually, objectively, and dispassionately. It is essential to periodically review and assess the effectiveness and rationale of reservation policy, in its entirety, including data-driven socio-economic progress of beneficiaries. ‘Balancing Merit and Reservation’ is crucial for maintaining standards and competency. ‘Economic Criteria’ may perhaps better help many disadvantaged individuals to receive support irrespective of caste. ‘Optimal Level and Balanced Approach to Reservations’ is appropriate with changing times.

Meanwhile, the Seven-Judge Supreme Court Constitution Bench, headed by CJI DY Chandrachud, on First August held that, the states have the Right to sub-classify within the socially heterogeneous class, the SCs, based on their backwardness for benefits of reservation. Four of the Seven Judges viewed that the ‘Creamy Layer Principle’ be extended to SC/ST category as in the case of OBC to exclude affluent availing benefits of reservation. ‘Reservation should be meant for only the first generation among a category and if the second generation has come up then benefits of reservation shall not be given and State should see if after reservation the second generation has come shoulder to shoulder with the general category’ expressed one Judge.

Smita’s view that reservations for differently-abled persons in All India Services (IAS, IPS, IFoS) are not correct, hints at that, ‘Merit and Efficiency in Civil Services’ require high levels of competence and decision-making abilities. Ensuring that all candidates meet these criteria through ‘Merit-Based Selection Process’ might enhance the overall effectiveness of the Civil Service. Certain roles within Civil Services, especially in fieldwork or enforcement, may require physical abilities that some differently-abled individuals might find challenging, potentially impacting performance. Notwithstanding this, eligible differently-abled individuals capable of bringing unique perspectives and innovative solutions maybe considered for ‘Role-Specific Assignments’ by providing ‘Targeted Training and Development’ ensuring that, they are perfectly equipped for Civil Services. A ‘Nuanced Approach’ to reservations, thoughtfully based on nature of the job, might be more ideal.

Puja Khedkar’s ingenious misuse of PWD quota, which led to her debarment from future examinations, sparked a ‘Nationwide Debate’ exposing loopholes in PWD certification. It is time to seriously evaluate, how ‘Well-Meaning Laws may be Manipulated and Backwardness Turned to Profit.’ Whether UPSC and Department of Personnel will further pursue and uncover all similar cases within the serving officers is a ‘Million Dollar Question.’

Nonetheless, questioning Smita’s ‘Inalienable Right and Freedom of Expression,’ as a citizen, is infringement of Article 19 of the Constitution. Smita also inadvertently initiated ‘National Debate’ on the ‘Whole Gamut of Reservations.’ The SC Judgment may be the beginning?

(Writer is a Senior Independent Journalist and Analyst)