Saturday, February 8, 2025

సమకాలీన సినిమా విజ్ఞాన సర్వస్వం, రెంటాల ‘ఫస్ట్ రీల్’ : వనం జ్వాలా నరసింహారావు

 సమకాలీన సినిమా విజ్ఞాన సర్వస్వం, రెంటాల ‘ఫస్ట్ రీల్’

వనం జ్వాలా నరసింహారావు

సినిమాలంటే అంతంతమాత్రమే ఇష్టపడే నాలాంటివాడిని, సినిమా సంబంధమైన సమకాలీన విజ్ఞాన స్వర్వస్వం, ‘మన సినిమా, ఫస్ట్ రీల్’' పుస్తకం, మా అమ్మాయి ప్రేమ మాలిని ద్వారా నా చేతికి అందిన తక్షణమే నన్ను ఆకట్టుకోవడమే కాకుండా, అందులోని విషయాలను దాదాపు ఆమూలాగ్రంగా చదివేస్థితి కలిగించిందంటే, దానికి ‘సంస్కృతం నుంచి సైన్స్ దాకా’ చదివి, ముచ్చటగా మూడు పీజీలు  మూడు ప్రధాన నగరాలలో పూర్తిచేసిన పుస్తక రచయిత ‘రెంటాల జయదేవ’ను మనస్ఫూర్తిగా అభినందించాలి. మానవ విలువల పరిరక్షణకు సాహిత్యం ఎంత మోతాదులో అవసరమో, సమకాలీన నవ-సమ సమాజంలో సినిమా మాధ్యమం ద్వారా విలువల పరిరక్షణకు విమర్శనాత్మక దృక్ఫధంతో సాహిత్యపరంగా, సినిమా చరిత్రను గ్రంధస్తం చేయడం అంతే అవసరం. 

‘మన సినిమా, ఫస్ట్ రీల్’' పుస్తకానికి ముందు మాటలు రాసిన ప్రముఖులలో ఒకరు, ‘తెలుగు సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లిన భారతీయ దర్శక ధీరుడు, పద్మశ్రీ ఆవార్డు గ్రహీత’ ఎస్ఎస్ రాజమౌళి, పుస్తకాంశం ‘సినిమా ప్రేమికులకు గొప్ప ఫీల్’ అంటూ చెప్పిన విషయాల సంగ్రహం కూడా ఇదే. ‘సినిమా పుట్టుక ఒక అద్భుతం. అసలు సినిమా అనేదే ఓ మహాద్భుతం! అన్ని కళలను తనలో ఇముడ్చుకున్నది సినిమా’ అంటారాయన. అందుకే, భావితరాలవారికి సినిమా సంబంధిత విజ్ఞానాన్ని అందించాలి. పండిత రచయితల రెంటాల వంశంలో జన్మించి, ‘తెలుగు సినిమా రాజధాని విజయవాడ’లో పెరిగి, తెలుగు సాహిత్యంలో పీహెచ్డి సాధించిన ‘నా స్నేహితుడు’ డాక్టర్ రెంటాల జయదేవ, ఈ పనిని సమర్థవంతంగా చేసినందుకుకు, సినీరంగ ప్రముఖులతో సహా ఆబాల గోపాలం సినీ ప్రేక్షకులు ఆయనను మనసారా అభినందించాలి. బహుశా జయదేవ, తన ‘పంచ ప్రాణాలను’ సాహిత్యం, సినిమా, సంస్కృతీ, సమాజం, స్నేహంలో నిలిపినందువల్లే ఇది సాధ్యపడవచ్చు. ‘పుస్తకం డాక్టరేట్ కు అర్హమైన గొప్ప పరిశోధనా గ్రంథం’ అన్న రాజమౌళి మాటలు పూర్తిగా నిజం. నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.  

నాదైన పద్ధతిలో, నా అలవాటు ప్రకారం పుస్తకం ఆసాంతం తిరగేస్తున్నప్పుడు, అన్నిటికన్నా నన్ను ఆకట్టుకున్నది జయదేవ ‘సంభాషణాత్మక రచనాశైలి.’ రచయితకు, పాఠకుడికి మధ్య వుండాల్సిన సంబంధం సంభాషణ లాంటిదని నా అభిప్రాయం. అలా వున్నప్పుడే పాఠకుడు పుస్తకాన్ని మనసుపెట్టి చదవగలడు. ఇరువురు మాట్లాడుకుంటున్నప్పుడు ఒకరు చెప్పేది ఇంకొకరికి అర్థంకాకపోతే ఆ సంభాషణకు అర్థంలేదు. అలాగే రచయిత రాసింది పాఠకుడికి అర్థంకాకపోతే అసలు అది భాషే కాదు. రచన అంతకంటే కాదు. ఇదే విషయాన్ని జీన్ పాల్ సాత్రే ‘సాహిత్యం అంటే ఏంటి’ అన్న తన పుస్తకంలో చతురోక్తులతో ధృవ పరుస్తాడు. రచయిత తన మేథస్సునుండి పెల్లుబుకిన ఆలోచనను, పాఠకులు అర్థంచేసుకుని, ఆకళింపు చేసుకునే రీతిలో వాక్యంగా మలిచినప్పుడే, ఆ రచనకు గుర్తింపు వస్తుందంటాడు జీన్ పాల్ సాత్రే. నలుగురితో చదివించలేని రచన చిత్తుకాగితంతో సమాన మంటాడు. రచనంటే కేవలం సాహితీ ప్రక్రియ మాత్రమే కాదు. రచయితకు, పాఠకుడికి మధ్య తలెత్తనున్న ఘర్షణ. అలాగే విశ్వనాథుడు ‘వాక్యం రసాత్మకం కావ్యం’ అన్న విషయం అందరికీ తెలిసిందే. రెంటాల జయదేవ రాసిన ‘మన సినిమా ఫస్ట్ రీల్’ చదువుతుంటే, ఈ విషయాలు గుర్తుకు వచ్చాయి. 

మరో ముఖ్యమైన విషయం, సమకాలీన అంశంపై రచన చేయడం అనేది సవాలుతో కూడుకున్న పని అనేది. శతాధిక వసంతాల భారతీయ సినిమా పుట్టుపూర్వోత్తరాలైనా, తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ తెరవెనుక కథైనా, ‘కాళిదాస్’ చరిత్రైనా, సంపూర్ణ దక్షిణ భారతీయ సినిమా కథాకమామీషైనా, పరిశోధనాత్మక ఆధారిత మరే అంశమైనా, రచనా పరంగా కానీ, అంశం పరంగా కానీ విజయవంతం కావాలంటే సందర్భానుసారంగా (Contextualize) విషయవివరణ (Content) ఒకదానికొకటి అనుసంధానం చేసుకుంటూ వుండాలి. సమకాలీన అంశం రచనలో ప్రాథమిక స్థంభం. ఇది అంశానికి సంబంధించిన కాలం, స్థలం, సామాజిక, రాజకీయ, ఆర్థిక నేపథ్యాలను అందిస్తుంది. ఇక విషయం అనేది రచన యొక్క అసలు మూలం. ఇది వివరాలను, వాస్తవాలను, విశ్లేషణలను అందిస్తుంది. పరిపూర్ణమైన విషయవివరణ, నిర్ధిష్టమైన సమాచారాన్ని చేర్చడం ద్వారా పాఠకులకు స్పష్టతనూ, సంపూర్ణతనూ అందిస్తుంది. ఈ విధంగా విశ్లేషించి చూస్తే అద్భుతంగా సాగింది పుస్తక రచన.  

 సందర్భం లేకుండా విషయవివరణ ఆకర్షణీయంగా ఉండదు. అదే విధంగా, విషయవివరణ లేకుండా సందర్భం నిష్ఫలంగా మిగిలిపోతుంది. ఎవరైనా రచయిత ఈ రెండింటి సమన్వయాన్ని సమర్థవంతంగా రూపొందిస్తే, వారి రచన విశ్వసనీయతను పొందటమే కాక, సమగ్రమైన సమాచారం అందించగలదు. ప్రత్యేకించి, ఒక అంశాన్ని ‘విజ్ఞాన సర్వస్వం’ మాదిరిగా వివరించడానికి ఈ పరస్పర ఆధారిత సంబంధం కీలకం. సూక్ష్మతతో కూడిన పలు సినీరంగ విషయాలను, సమయస్పూర్తిని జోడించి, రచయిత జయదేవ సమర్థవంతంగా తన పుస్తకంలో ఆవిష్కరించడం విశేషం. ఈ రెండింటి పరస్పర సంబంధాన్ని కూలంకషంగా చక్కగా అవగాహన చేసుకుని, అద్భుతంగా రాసిన పుస్తకం ‘మన సినిమా, ఫస్ట్ రీల్.’ భారత, ముఖ్యంగా దక్షిణ భారత సినిమా సంగ్రహ చరిత్ర సమగ్రంగా రాయాలంటే సందర్భం, విషయవివరణ మధ్య ఉన్న సవాళ్లను, సమన్వయాన్ని అర్థం చేసుకుంటూ ఆసాంతం రచన సాగాలి. అదే విజయవంతంగా జరిగింది ‘మన సినిమా, ఫస్ట్ రీల్’ పుస్తకంలో. 

‘ఎందుకంటే’ అన్న శీర్షికన ఎమెస్కో సంపాదకులు దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి రాసినట్లు, ‘చరిత్రను ఎప్పటికప్పుడు రాసిపెట్టక పోతే, మనకు గతం తెలియకుండా పోతుంది. వర్తమానంలోనూ, భవిష్యత్తు కోసమూ, నేర్చుకోవాల్సిన పాఠాలెన్నో దొరక్కుండా పోతాయి.’ ఆ లోటు లేకుండా, ‘సినీ సాహిత్యాన్ని’ జయదేవ మన ముందు వుంచారు. ‘తెలుగు వారి సినిమా చరిత్ర పరిజ్ఞానాన్ని ఈ పుస్తకం కచ్చితంగా మెరుగుపెడితుంది’ అని ఆయన రాసిన వాక్యాలు అక్షర సత్యాలు. సినిమా దర్శకులలో అత్యంత ప్రతిభాశాలి, మూడు భాషలలో సందేశాత్మక, ప్రయోగాత్మక, కథాభరిత వైవిధ్యంగల తన సినిమాలతో ప్రేక్షకులనూ, విమర్శకులనూ మెప్పించిన ‘సినీరంగ భీష్మాచార్యుడు’ సింగీతం శ్రీనివాసరావు మెప్పు పరిపూర్ణంగా పొందిన పుస్తకం ఇది. అంతటి గొప్పవాడినే ‘కళ్ల ముందు రీళ్లు తిరిగిన గతం’ అనిపించగలిగిందంటే పుస్తకం విలువ అర్థం చేసుకోవచ్చు. ‘సినిమాను నిత్యం ప్రేమించి, శ్వాసిస్తున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన వివరాలున్నాయి’ అని రాస్తూ, తన జీవితంలోని ఎన్నో సందర్భాలు, సంఘటనలు, హెచ్ఎం రెడ్డి, ఎల్వీ ప్రసాద్, సి పుల్లయ్య, పీ పుల్లయ్య, కెవి రెడ్డి లాంటి ఎందరో మహానుభావులతో ఎదురైన తన అనుభవాలు జ్ఞప్తికి తెచ్చుకున్నారు సింగీతం శ్రీనివాసరావు. ‘తెరవెనుక కష్టానికి అక్షర రూపం!’ అన్న ‘ఊర్వశి శారద, పుస్తకం చదివి తన నట ప్రయాణాన్ని నెమరు వేసుకున్నారు.

‘భాషల ఎల్లలు చెరిపిన అఖిలభారత పుస్తకం ఇది అనీ, పుస్తకంలో ప్రస్తావించిన అన్ని భాషల సినిమాలలో నటించిన సమకాలీన నటుడిని అనీ’ రాస్తూ, దక్షిణ భారతదేశానికి చెందిన రంగస్థల నటుడు, విలక్షణ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత  ప్రకాశ్ రాజ్ ఈ పుస్తకం విషయంలో మరెవ్వరూ చెప్పని ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణ సినిమా వచ్చేవరకు ఆంధ్ర ప్రాంతపు సంస్కృతి, సంప్రదాయం, మాండలికమే కనిపించేవనీ, ఆ తరువాత తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, యాస, గోస, మట్టి కథలు, మనిషి వ్యధలు, ఆచారాలు, వ్యవహారాలు తెరమీదకు వచ్చాయనీ, మరో కొత్త సాంస్కృతిక చరిత్ర తెరపై దృశ్యబద్ధం అయిందనీ, ఆ దృష్టితో సినిమాలను అవలోకించడం, అధ్యయనం చేయడం, అవసరమనీ అన్నారు. అలా తెలియచేసే అవసరాన్ని ఫస్ట్ రీల్’ రచనల లాంటివి తీరుస్తాయని, ఒకరకంగా ఇది ‘స్టడీ ఆఫ్ అవర్ కల్చరల్ గ్రోత్’ అని అన్నారు. ‘మన సినీ సౌధపు గతాన్ని తెలియచేస్తూ, వర్తమానాన్ని విశ్లేషిస్తూ, భవిష్యత్తువైపు ఆశాభావంతో అడుగులు వేయించారు రెంటాల జయదేవ. మన సినిమా చరిత్రకు అరుదైన అక్షర రూపంగా ఇది చాలా ఇంపార్టెంట్ బుక్’ అన్నారు.

‘మన సినిమా, ఫస్ట్ రీల్’ పుస్తక రచయిత డాక్టర్ రెంటాల జయదేవ ‘పాతికేళ్ల పంచరంగుల కల’ అనే శీర్షికన తాను ఈ పుస్తకం ఎందుకు రాసిందీ, రాయాల్సి వచ్చిందీ వివరిస్తూ తత్సంబంధిత సమగ్ర నేపధ్యాన్ని కఠోర నిజాలతో సహా ఆవిష్కరించారు. ‘నువ్వు జీడీ పైసల’ పొదుపుతో సినిమా చూసిన సందర్భాలు, సినిమా డిస్ట్రిబ్యూటర్ల ఒకప్పటి ఆదరణ, పెద్దల పరిచయాల ‘లర్నింగ్ ఎక్స్పీరిఎన్స్,’ విజయవాడ ఫిల్మ్ సొసైటీ, ఇస్కాస్ ఫిల్మ్ సొసైటీ జ్ఞాపకాలు, కల్చరల్ రిపోర్టింగ్ అనుభవాలు, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలను చూసిన అనుభవం, ‘సినీ విజ్ఞాన సర్సస్వాల’ లాంటి వ్యక్తుల పరిచయాలు, సినిమా జర్నలిజం అంటే తూష్ణీభావం లాంటి అంశాలను పేర్కొంటూ, గతంలో సమగ్ర తెలుగు సాహిత్య చరిత్ర రాసిన వారెవరూ సినీ సాహిత్యాన్ని అందులో ఒక చిరు శాఖగానైనా ప్రస్తావించలేడనీ, ఆమాటకొస్తే, అసలు సాహిత్యంగానే పరిగణించలేదనీ ఆవేదన వ్యక్తపరిచారు.

566 పేజీలలో, అవతారికకు అదనంగా 8 అధ్యాయాల కింద, 45 అంశాలుగా ‘మన సినిమా, ఫస్ట్ రీల్’ పుస్తకాన్ని రూపొందించారు రచయిత జయదేవ. శతాధిక వసంతాల భారతీయ సినిమా, తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా,’ తెరవెనుక కథ, తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్,’ టాకీ పులి హెచ్ఎం రెడ్డి, తొలినాళ్ల తమిళ టాకీ కథ, తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ రిలీజ్ వివాదం, కన్నడిగుల విజయగీతిక, మౌనం వీడిన మలబారు సీమ అనే శీర్షికన ఉన్నాయి ఎనిమిది అధ్యాయాలు. అధ్యాయాలు, అంశాలకు సంబంధించిన విషయాలను క్లుప్తీకరిస్తూ రచయిత కొన్ని ఆసక్తికరమైన వివరాలను తన ముందుమాటల్లో ప్రస్తావించారు. దానికి సంబంధించిన ముందు-వెనుకల పేరాల సారాంశం ఈ సమీక్షలో రాస్తే పాఠకులు ముందుకు సాగడం సౌలభ్యం. 

చరిత్ర అంటే నాలుగు గట్ల మధ్య బంధించిన చెరువు నీళ్లు కాదనీ, అది నిరంతరం ప్రవహించే జీవనదనీ, సినిమా చరిత్ర అయినా అంతేననీ అంటూ వివరంగా మున్ముందు చెప్పబోయే కొన్ని అంశాలను ప్రస్తావించారు రచయిత. ‘తమిళ సినిమాగా ప్రచారమవుతూ తెలుగువారు వదిలేసిన కాళిదాస్ నిజానికి తెలుగు డైలాగుల సినిమా. మొట్టమొదటి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద రిలీజ్ తేదీ సెప్టెంబర్ 15, 1931 కాదు. అసలు రిలీజ్ తేదీ ఫిబ్రవరి 6, 1932. మొదటి పూర్తి తమిళ టాకీ హరిశ్చంద్ర భక్త ప్రహ్లాద తరువాత వచ్చినదే. మొదటి కన్నడ టాకీ కథానాయిక త్రిపురాంబ అంటూ ప్రచురిస్తున్న ఫోటోలో ఉన్నది వేరెవరో తమిళ కథానాయిక’ లాంటివి వీటిలో ప్రధానం. సందర్భానుసారంగా సుమారు రెండువేల అరుదైన అలనాటి పత్రికా ప్రకటనలను, చాయా చిత్రాలను పుస్తకంలో పొందుపర్చిన విషయాన్ని కూడా ప్రస్తావించారు రచయిత.

‘మన సినిమా, ఫస్ట్ రీల్’ పుస్తకంలోని ప్రధాన అంశాలన్నీ సమీక్షలో పేర్కొనాలంటే అది ఒక ‘మోనోగ్రాఫ్’ లాగా తయారవడం తధ్యం. అందుకే అతి కొన్ని మాత్రమే తెలుసుకుందాం. ‘ప్రపంచంలో సినీ మాధ్యమానికి ఉన్నంత వయస్సు, ఉద్విగ్నభరిత చరిత్ర భారతదేశంలోని సినీ పరిశ్రమకు కూడా సొంతం. ప్రపంచంలో రెండో అతిపెద్ద సినీ పరిశ్రమగా వెలుగొందుతున్న భారతీయ సినిమా ఇప్పుడు కీలకమైన మైలురాయికి చేరింది. చలన చిత్రాల రూపకల్పనకు దిగిన మొట్టమొదటి భారతీయుడు, ‘సావే దాదాగా’ పిలువబడే హరిశ్చంద్ర సఖారామ్ భట్వాడేకర్. తెలుగు సినిమా ఆదిపురుషుడు రఘుపతి వెంకయ్య నాయుడు 1909-12 మధ్యకాలంలోనే ప్రముఖ సినీ దర్శకుడిగా ఎదిగారు. తెరపైకి వచ్చిన తొలి భారతీయ నటీమణులు, దుర్గాబాయ్ కామత్, ఆమె కూతురు కమలాబాయ్ గోఖలే. దక్షిణాది మూకీ పితామహుడు నటరాజ ముదలియార్. దక్షిణాదిలో తయారైన తొలి కథాచిత్రం కీచక వధమ్.’

‘తెరమీద నటీనటుల మాటలు వినిపించిన తొలి మోషన్ పిక్చర్ జాజ్ సింగర్ చూసేందుకు అమెరికా న్యూయార్క్ సినిమాహాలు ముందు జనం గుంపులు గుంపులుగా నిలబడడం విశేషం. జీజీభాయ్ జమ్షెడ్జీ మదన్ ఆధ్వర్యంలోని మదన్ థియేటర్స్ భారతదేశంలో తొలిసారిగా కలకత్తాలోని వారి స్వంత ఎల్ఫిన్స్టన్ పిక్చర్ ప్యాలెస్ లో “మెలోడీ ఆఫ్ లవ్” అనే విదేశీ టాకీ చిత్రాన్ని ప్రదర్శించింది. తొలి భారతీయ సినీ గీతం ఆలమ్ ఆరా చిత్రంలోని “దేదే ఖుదా కే నామ్ పర్ ప్యారే..”. వెండి తెర మాట నేర్వడంతో దూసుకొచ్చిన సింగింగ్ స్టార్ పేరు కజ్జన్. తొలి భారతీయ మహిళా డైరెక్టర్ ఫాతిమా బేగ్ ముగ్గురు కథానాయికల తల్లి! ఫస్ట్ దక్షిణాది స్టార్ హీరోయిన్ టిపి రాజ్యలక్ష్మి’. ఇలా రాసుకుంటూ పోతే ఎన్నెన్నో వున్నాయి. ఆ వివరాలు పూర్తిగా పుస్తకం చదివితేనే అవగాహనకొస్తాయి. సమీక్షకు అందనంత ఎత్తున అద్భుతంగా మలిచారు రచయిత. 

‘మన సినిమా, ఫస్ట్ రీల్’ పుస్తకంలో విశేషంగా చెప్పుకోవాల్సింది, చివరలో ‘బంగారు పళ్లానికి గోడచేర్పు’ అనే ‘ఎపిలోగ్’ లాంటి ఆకర్షణీయమైన శీర్షిక. అందులో పుస్తకాన్ని గురించి, రచయిత గురించి, పలువురు ప్రముఖుల ప్రశంసలున్నాయి. ఆ ప్రముఖులు: విఎకె రంగారావు, వకుళాభరణం రామకృష్ణ, పన్నాల సుబ్రహ్మణ్య భట్టు, స్వర్గీయ కాట్రగడ్డ నరసయ్య, గంటి రమాదేవి (గంటి సుబ్రహ్మణ్య శర్మ), డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి. అసూయపడాల్సినంత ఎత్తుకు ఎదుగుతాడు జయదేవ అనీ, పరిశోధనాత్మక రచన అనీ, ఎవరూ చేయని కృషి ఇది అనీ, దక్షిణాదికే గర్వకారణం అనీ, ఈ తరం విజ్ఞానఖని జయదేవ అనీ ప్రశంసలు కురిపించారు వీరంతా.

రెంటాల రచించిన ‘మన సినిమా, ఫస్ట్ రీల్’ పుస్తకం తెలుగు చలనచిత్ర పరిశ్రమ పుట్టుక, పురోగతిపై ఆవిష్కరించిన ఒక విలక్షణ దృక్కోణం. పుస్తకాన్ని ఆసాంతం చదివితేనే కాని దానికి సంబంధించిన ప్రత్యేకమైన విశేషాలు అర్థం కావు. తెలుగు సినిమాల ఆరంభ దశలు, మౌన చలనచిత్రాల నుంచి ప్రాసంగిక చలనచిత్రాల దాకా ఉన్న పరిణామాలను సమగ్రంగా ఆవిష్కరిస్తుంది. సినిమా సామాజిక జీవనంపై, సంస్కృతిపై చూపించిన ప్రభావాన్ని నిగ్రహంగా విశ్లేషించింది. ‘మన సినిమా, ఫస్ట్ రీల్’ ఒక చారిత్రక ప్రాముఖ్యమైన పరిశోధనాత్మక పుస్తకం అనడంలో అతిశయోక్తి లేదు. మున్ముందు మరిన్ని రెంటాల ‘రీళ్లు’ రావాలి. (కూతురు ప్రేమ సలహా, సౌజన్యంతో).

‘Letter and Spirit’ of Union Budget Must be Sacrosanct : Vanam Jwala Narasimha Rao

 ‘Letter and Spirit’ of Union Budget 

Must be Sacrosanct 

Vanam Jwala Narasimha Rao

(Posted in Facebook on February 1, 2025)

Union Budget for the year 2025-26, presented by Finance Minister Nirmala Sitharaman on February 1, 2025 to Lok Sabha, to put in her own words, aims at continuing Government’s efforts to accelerate growth, secure inclusive development, invigorate private sector investments, uplift household sentiments, and to enhance spending power of ‘India’s Rising Middleclass.’ The introduction is an ‘Extraordinary Expression of Intention’ with no two opinions. Whether, in ‘Letter and Spirit’ either the entire or few parts of Budget, at least with reference to Middleclass, will be taken seriously is a ‘Million Dollar Question.’

Only when the ‘Letter and Spirit is Sacrosanct’ emphasizing the importance of adhering to both the explicit provisions and the underlying intentions of the budget, then there is a sense in what was articulated in the budget speech. And hence, this phrase, ‘Letter and Spirit is Sacrosanct’ effectively underscores the critical importance of faithfully implementing the budget's directives and honouring its foundational objectives emphasized mainly in the introduction. The essentiality of commitment to the budget's full scope, both in its explicit directives and intended purposes is the crux. 

The Budget, introduces several key proposals aimed at benefiting India's Middle Class, such as raising the income tax exemption limit to Rs 12 Lakhs and enhancing the spending power of Middleclass Households. Tax slabs are restructured simplifying the tax system, making it more transparent and easier for taxpayers to navigate. To what extent ‘Fiscal Discipline’ which is a repeated phrase by every Finance Minister, will benefit Middleclass is to be seen.  

Revealing the ‘The Budget Theme’ the ‘Viksit Bharat’ (Developed India) Nirmala Sitharaman recited a stanza of the great Telugu Poet and Playwright Gurajada Appa Rao, the meaning of which in English is, ‘A country is not just its soil, a country is its people.’ Accordingly, the budget theme encompasses zero-poverty, 100% quality school education, access to high-quality affordable comprehensive healthcare, 100% skilled labour with meaningful employment, 70% women in economic activities, and farmers making India the ‘Food Basket of the World.’ Fair Enough. Lofty Ideals and no dispute.

The proposed development measures as spelt out by Nirmala Sitharaman span ten broad areas focusing on Garib (Poor), Yuva (Youth), Anna Data (Farmers) and Nari (Women). Agriculture, MSME, Investment, and Exports are the powerful engines, the fuel is Reforms, guiding spirit Inclusivity, and destination is ‘Viksit Bharat.’ while presenting 2024 Budget also she emphasized the same. Transformative reforms across six domains, Taxation, Power Sector, Urban Development, Mining, Financial Sector, and Regulatory Reforms will augment growth potential and global competitiveness.

The Growth Engine domains and Programs are: Agri Districts; Rural Prosperity and Resilience; Aatmanirbharta in Pulses; Vegetables and Fruits; High Yielding Seeds; Cotton Productivity; Kisan Credit Cards; India Post; Support to NCDC; More benefits for MSMEs like enhanced credit availability; Credit Cards for Micro Enterprises; Fund of Funds for Startups; Labour-Intensive Sectors; Furthering Make in India; Expansion of medical education; PPP; Support to States for Infrastructure; Urban Challenge Fund; Mining Sector Reforms; Medical Tourism;  Deep Tech Fund of Funds;  Export Promotion Mission; Grameen Credit Score; KYC Simplification etc. 

Nirmala further mentioned about: Rationalisation of Customs Tariff Structure for Industrial Goods; Relief on import of Drugs and Medicines; Support to Export Promotion in various sectors; Trade facilitation etc. Touching the Direct Taxes aspect, she told the House that the new income-tax bill will carry forward the spirit of Bharatiya Nyaya Sanhita. Referring to The Thirukkural Verse 542, which reads in English as: ‘Just as living beings live expecting rains, Citizens live expecting Good Governance’ she said that, ‘Reforms are not a Destination, but a Means to achieve Good Governance which primarily involves being Responsive.’

Minister announced her tax proposals, as ‘guided by the spirit of needs voiced by citizens.’ The objectives of her proposals are: Rationalization of TDS and TCS; Encouraging Voluntary Compliance; Reducing Compliance Burden; Ease of Doing Business; and Employment and Investment. The limit for tax deduction on interest for senior citizens is being doubled (from Rs 50000 to Rs 100000). Annual limit of for TDS on rent is being increased (From Rs 2.40 lakh to Rs 6 lakh). TCS on remittances is proposed to be increased (From Rs 7 lakh to 10 lakh). Time-limit to file updated returns for any assessment year is also increased (From two to four years). 

Most important is, ‘Personal Income Tax Reforms with Special Focus on Middleclass.’ Using Rhythmic Words ‘Democracy, Demography and Demand’ as the key support pillars of India’s journey towards Viksit Bharat, and underscoring the importance of Middleclass that provides strength for India’s Growth, Finance Minister announced that there will be no income tax payable up to income of Rs 12 Lakhs which will be Rs 12.75 lakhs for salaried tax payers. 

Announcing the Slabs and rates that are being changed across the board to benefit all tax-payers, Nirmala Sitharaman said that, the new structure will substantially reduce the taxes of the Middleclass and leave more money in their hands, boosting household consumption, savings, and investment. The ‘Beauty of her Speech’ is that, taking pains to illustrate with examples, and suggesting to read the Annexure for more details on taxation. Before Finance Minister Nirmala Sitharaman ‘Commended the Budget to the House’ she revealed that as a result of these proposals, ‘Revenue of about Rs 1 lakh crore in Direct Taxes and Rs 2600 crore in Indirect Taxes will be Forgone.’ 

  Union Budget must be treated as sacred, ensuring that its provisions are not just announced but also implemented with integrity and purpose. Fortunately, the Budget, carries lot of expectations of economic growth, social equity, and fiscal prudence. While numbers and allocations define its structure, which this article is not touching, the true impact lies in how effectively policies translate into action. Any deviation from its core objectives can dilute its essence, affecting millions. This article broadly delves into the key highlights that were in the form of assurances, and implications. 

‘Balancing Intent and Impact’ if not in ‘Letter and Spirit’ like for instance with reference to Middleclass Perspective, one of major contours of this article, the foremost to be thought of is that, the budget’s success lie in its ability to translate policy intent into meaningful action. The Union Budget, holds significant implications for India’s Middleclass, a segment that forms the backbone of the economy, but often finds itself in a paradox between aspirations and affordability. While fiscal measures aim to provide relief and stimulate growth, the real challenge lies in ensuring effective implementation without diluting the core intent by drafting implementation modalities in an incomprehensive manner. Then, intentions remain on paper and implementation ‘Goes with the Wind’ the phrase which became famous as the title of Margaret Mitchell's only one novel ‘Gone With the Wind.’  

At a macro level if we glance in to Budget Speech and Budget Details, the question that requires a precise answer is, how the budget would be able to addresses income tax relief, inflation control, job creation, access to essential services, tangible benefits versus the hidden burdens on the Middleclass etc. among many others. Looking at the Imperatives and Implications part broadly, the economic and social impact of key budgetary provisions needs little more explanation. The feasibility of policy execution within the given fiscal framework, is a certain Implementation Challenge. 

Budget’s success is not in its lofty ideals and huge announcements, but in how well it aligns policy objectives with on-ground realities. It is essential to ponder, whether the 2025-26 Budget truly delivers on its promise to the Middleclass or merely reiterates commitments without transformative execution. Hence Madam Nirmala Ji, analyse the basic minimum needs of the powerful Middleclass in the everchanging socio-economic scenario, and how to make these needs available and accessible in a manner acceptable to majority, dovetailing your concessions. 

(Writer Former Chief Public Relations Officer to First Telangana Chief Minister)  

Monday, February 3, 2025

 ఏమో … గుర్రం ఎగరావచ్చు!

(కాంగ్రెస్ పార్టీ మార్క్ క్రమశిక్షణ)  

వనం జ్వాలా నరసింహారావు

నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిట్ పేజీ 

(04-02-2025) 

ఐదారు నెలల క్రితం, యాధృచ్చికంగానో, మనసులో మాటో, ‘అధిష్టానం కోయిల ముందే కూసిందో’ కాని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సహచరమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తనతో సమానంగా సిఎం అయ్యే అర్హతలున్నాయని, ఆయన నిజమైన ‘పోరాట యోధుడుని ప్రశంసించారు. ఆ మర్నాడే మరో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సహితం ఇలాంటి అర్థం వచ్చే వ్యాఖ్యలే చేశారు. 

ముఖ్యమంత్రి, మంత్రి వ్యాఖ్యల అర్థం ఏదైనా కావొచ్చు. ‘కాంగ్రెస్ పార్టీ మార్క్ (ఒక) వారసుడి పరోక్ష నిర్ణయం’ జరిగి వుండాలని, వీరి వ్యాఖ్యల నిగూఢార్థం, అంతరార్థం కావచ్చు. కాకపోనూ వచ్చు. ఈ వ్యాఖ్యానాల్ని ‘రీడ్ బిట్వీన్ ద లైన్స్’ విధానంలో విశ్లేషిస్తే, ‘పార్టీ-ప్రభుత్వ స్టీరింగ్’ మీద ‘చేతులు మారే’’ అవకాశాలున్నాయేమో అన్న అభిప్రాయం కలగడం సహజం. అది ఐదారునెలల క్రితం జరిగిన ఈ సంగతి, ఆ తర్వాత పూవు పూసి, కాయ కాసి, ఇప్పుడు దోరపండు స్థాయికి చేరుకున్నది. ఎప్పుడైనా పూర్తిగా పక్వానికి రావచ్చు!!

ఇటీవలి కొన్ని పరిణామాలు, వాటి పర్యవసానాలను నిశితంగా విశ్లేషిస్తే, తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ రథ సారథ్యం సంక్షోభంలో కూరుకుపోతున్నదా? అన్న అనుమానం సర్వత్రా వ్యక్తమవుతున్నది. పరిస్థితి నాయకుడి అదుపులోంచి శీఘ్రంగా జారిపోతున్నదనే భావన విశ్లేషకుల్లో వినిపిస్తున్నది. ఊపిరాడనివ్వకుండా అస్మదీయ, తస్మదీయ ఎమ్మెల్యేల వేరుకుంపటి సెగలు-పొగలు, పార్టీమారివచ్చిన ఎమ్మెల్యేలలో అపోహలు, అసహనం, ఏ మంత్రి పదవికి ఎప్పుడు ఎసరు వస్తుందోనన్న ఆందోళన, కొందరు మంత్రుల మీద ఆ పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తిని బాహాటంగా ప్రకటిస్తున్న సందర్భాలు, ఆ క్రమంలో తొలి అడుగుగా కలకలం రేపిన పదిమంది శాసనసభ్యుల రహస్య భేటీ వార్త, వీటన్నిటినీ తలదన్నే, కాంగ్రెస్‌ పార్టీ అధికారిక ట్విటర్‌ (ఎక్స్‌) హ్యాండిల్‌ నిర్వహించిన సర్వేలో దాదాపు 70-80 శాతం మంది కాంగ్రెస్‌ పాలనను వ్యతిరేకించడం....ఇంకా...మరెన్నో... దేనికి దారితీయనున్నదో?

కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే, అధినాయకత్వంమీద భయంతో కూడుకున్న అపార విశ్వాసం, గౌరవం, ‘విచిత్రమైన క్రమశిక్షణ’ జగద్వితం. కాంగ్రెస్ పాలిత ఏ రాష్ట్రంలోనైనా, ‘తుమ్మితే వూడే ముక్కులాగా’ నాయకత్వ మార్పు అలవోకగా ఏ క్షణంలోనైనా జరగవచ్చు. నాటి నుండి నేటి వరకు, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నాయకుని ఎంపికైనా, నామినేషనైనా అధిష్టానం కనుసన్నల్లో, ఇష్టానుసారం జరిగేదననేది అక్షరసత్యం! అధిష్టానాన్నే ‘పార్లమెంటరీ బోర్డ్’ అనీ, ‘హైకమాండ్’ అని సమయ-సందర్భాన్ని బట్టి ‘పాజిటివ్’ లేదా ‘నెగెటివ్’ అర్థం వచ్చేట్లు ముద్దు-ముద్దుగా పిలుచుకుంటారు కాంగ్రెస్ పార్టీ చోటా-బడా నాయకులు. 

ఉమ్మడి రాష్ట్రం రోజుల నుండి, ఉభయ తెలుగు రాష్ట్రాలలో నిరాడంబరంగా, సాదాసీదాగా, ఉన్నతమైన విలువలతో, ముఖ్యమంత్రి, లోక్ సభ స్పీకర్, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్రమంత్రుల స్థాయికి ఎదిగి, హంగూ-ఆర్భాటం లేని సాధారణ జీవితం గడిపిన అగ్రశ్రేణి ప్రముఖుల స్ఫూర్తి, విలువలు, క్షీణించిపోతున్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి, ముఖ్యమంత్రులుగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి, హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్న బూర్గుల రామకృష్ణారావు ఆకోవకు చెందిన వారే. ప్రతిపక్ష నాయకుడుగా వున్న పుచ్చలపల్లి సుందరయ్య ఒక మహామనీషని ప్రత్యర్థులు సహితం అంగీకరిస్తారు. అలాగే వావిలాల, తెన్నేటి. 

కాంగ్రెస్ పార్టీకి చెంది, ముఖ్యమంత్రులుగా పనిచేసిన తెలుగువారెందరో రాజకీయ ఉద్దండులుగా, దేశరాజకీయాలను శాసించే స్థాయికి, ప్రధాని అభ్యర్థినే నిర్ణయించే స్థాయికి చేరుకున్న సందర్భాలున్నాయి. నీలం సంజీవ రెడ్డి అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి, కేంద్రమంత్రి, లోక్ సభ స్పీకర్, రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. దామోదరం సంజీవయ్య అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యాడు. కాసు బ్రహ్మానంద రెడ్డి కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించి, అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. పీవీ నరసింహారావు కేంద్రమంత్రిగా, ప్రధాన మంత్రిగా వున్నారు. జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, విజయభాస్కరరెడ్డి, టంగుటూరి అంజయ్యలు కేంద్ర మంత్రులయ్యారు. తెలుగుదేశానికి చెందిన ఎన్టీరామారావు కేంద్ర రాజకీయాల నిర్దేషకుడయ్యాడు. చంద్రబాబునాయుడు కేంద్రంలో చక్రం తిప్పాడు.  రాష్ట్ర విభజన అనంతరం, తెలంగాణ మొదటి సిఎంగా తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అంతకు ముందే కేంద్రమంత్రిగా పనిచేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రిగా అధిష్టానం ఎంపిక చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి భవిష్యత్తులో వీరి స్థాయికే చేరుకోవాలి.

ఎన్టీరామారావు ముఖ్యమంత్రి కావడానికి పూర్వం, రాష్ట్ర రాజకీయాలంటే, కాంగ్రెస్ పార్టీ అంతర్గత, బహిర్గత, సమ్మతి, అసమ్మతి, రాజకీయాలే. స్వపక్షంలోని అసమ్మతి నాయకులకు, విమర్శలు చేసే విపక్ష నాయకులకు, అధికారంలో వున్న పెద్దలు సముచితమైన గౌరవం ఇచ్చేవారు. నిస్వార్ధంగా, గౌరవప్రదంగా, విద్వేషరహితంగా రాజకీయాలలో రాణించిన మహనీయులెందరో నడయాడిన తెలుగురాష్ట్రాలలో, వర్తమాన రాజకీయాలు జుగుప్స, అసహనం, అసహ్యం, నిస్సహాయాత, తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదిలా వుండగా, వేగంగా మారుతున్న రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల నేపధ్యంలో నాయకత్వ మార్పు వుండవచ్చా? లేకపోవచ్చా? గత ఏడు దశాబ్దాల అనుభవాలను చర్విత చరణం చేసుకుంటే ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సామెత గుర్తుకు వస్తుంది. 

ముఖ్యమంత్రి కావడానికి ముందు సీఎల్పీ నాయకుడి ఎంపిక ఆసక్తికరంగా వుండేది. 1956 లో సంజీవరెడ్డి ఎన్నికైనప్పుడు రాజకీయం చేయకుండా ఐక్యతకు, క్రమశిక్షణకు ‘అధిష్టానం’ ప్రాధాన్యత ఇచ్చింది. బూర్గుల అభ్యర్థిత్వానికి వ్యతిరేకత వ్యక్తం కావడంతో, పోటీ సంజీవరెడ్డి, బెజవాడల మధ్యనే జరిగింది. బూర్గుల, జేవీ నరసింగరావుల మద్దతు నీలంకు లభించగా, చెన్నారెడ్డి వర్గం బెజవాడను బలపర్చారు. రహస్య ఓటింగ్ ద్వారా సంజీవరెడ్డిని ఎన్నుకున్నారు. 1957 సార్వత్రిక ఎన్నికల తరువాత కూడా, చెన్నారెడ్డి అభ్యంతరాన్ని కాదని, నీలం సంజీవరెడ్డినే సీఎల్పీ నాయకుడిగా ఎన్నుకున్నారు. సంజీవరెడ్డి అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావడంతో, సంజీవరెడ్డి రాజీపడి దామోదరం సంజీవయ్యకు మద్దతు పలికారు. 1962 ఎన్నికల అనంతరం, నీలం, దామోదరం పోటీలో నిలిచినప్పటికీ, సంజీవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి అధిష్టానం ఆదేశించింది. నీలం సిఎం అయ్యారు. 1964 లో సిఎం పదవికి రాజీనామా చేసిన సంజీవరెడ్డి, సీఎల్పీ నాయకుడిగా కొనసాగుతూనే, బ్రహ్మానందరెడ్డిని ముఖ్యమంత్రిగా ‘నామినేట్’ చేయించగలిగాడు. లాల్ బహదూర్ మంత్రివర్గంలో సభ్యుడైన తరువాత సంజీవరెడ్డి సీఎల్పీ నాయకత్వానికి రాజీనామా చేస్తే, బ్రహ్మానందరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతా అధిష్టానం చలవే!

1967 సార్వత్రిక ఎన్నికల నంతరం, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడం వల్ల, అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచి, సీఎల్పీ నాయకుడిగా, బ్రహ్మానందరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 1971 లోక్ సభ మధ్యంతర ఎన్నికల తరువాత, ‘అధిష్టానం’ ఆదేశం మేరకు, బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేశారు. ‘బలపడుతున్న సిఎంలను తొలగించాలన్న’ ఇందిరాగాంధీ వ్యూహంలో భాగంగానే కాసు రాజీనామా చేయాల్సి వచ్చిందనేవారు. ఇందిరాగాంధీ (ఏకవ్యక్తి అధిష్టానం) నిర్ణయం మేరకు నీలం, కాసులకు ‘విదేయుడిగా పేరుతెచ్చుకుని’ అనుచరవర్గం లేదని భావించిన, పీవీ నరసింహావును ఏకగ్రీవంగా శాసనసభా పక్షం నాయకుడిగా ఎన్నిక చేయించి  ముఖ్యమంత్రిని చేసింది అధిష్టానం.     

1972 ఎన్నికలు జరిగిన తరువాత, పీవీ ఏకగ్రీవంగా సీఎల్పీ నాయకుడిగా ఎన్నికై, ముఖ్యమంత్రి అయ్యారు. ఏకవాక్య తీర్మానం ద్వారా, నాయకత్వం ఎంపిక ప్రధాని ‘ఇందిరాగాంధీ’కి (పార్టీ అధ్యక్షురాలికి, అధిష్టానానికి) వదిలిపెట్టే సాంప్రదాయం, ‘సీల్డ్ కవర్ రాజకీయాలు’ ఊపందుకున్నాయి. రాష్ట్ర విభజన ఆందోళన నేపధ్యంలో సిఎం పదవికి రాజీనామా చేయాల్సివచ్చిన పీవీ, సీఎల్పీ నాయకుడిగా కొనసాగారు. రాష్ట్రపతి పాలనలో శాసనసభ రద్దుకాలేదు. దరిమిలా, పీవీని సీఎల్పీ నాయకుడిగా రాజీనామా చేయమని ఆదేశించిన అధిష్టానం, ఆయన స్థానంలో వ్యక్తిని ఎంపిక చేసే అధికారం, 1973 అక్టోబర్ చివరలో సమావేశమైన కాంగ్రెస్ శాసనసభా పక్షం, ‘ఇందిరాగాంధీ’కి అప్పచెప్పింది. ‘ఇందిరాగాంధీ ఆశీస్సులు’ వుంటే చాలనే సాంప్రదాయం బలపడ సాగింది. 

ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు పేరును ఢిల్లీలో ప్రకటించారు ఇందిరాగాంధీ. మరో సాంప్రదాయానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. అదే ఇప్పటికీ కొనసాగుతున్నది. భవిష్యత్తులోనూ కొనసాగి తీరుతుంది. అంటే, ఏ క్షణంలో ఎవరి పేరైనా అప్పటివరకున్న సిఎం కు తెలియకుండానే ఢిల్లీలో ప్రకటన రావచ్చు. వెంగళరావు సిఎంగా వున్నప్పుడే అత్యవసర పరిస్థితి విధించడం, ఎత్తివేయడం, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి, కేంద్రంలో కాంగ్రెసేతర జనతా ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగాయి. కాంగ్రెస్ పార్టీ చీలిపోయి, ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ (ఐ) ఆవిర్భావం జరిగింది. 1978 జనవరిలో  రాష్ట్ర శాసనసభకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న చెన్నారెడ్డి రాజీనామా చేసి ఇందిరా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. ఫిబ్రవరి 24న జరిగిన ఎన్నికలలో ఇందిరా కాంగ్రెస్ 175 స్థానాల్లో ఘన విజయం సాధించింది. వెంగళరావు నాయకత్వంలోని బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ వర్గం ఓడిపోయింది.  

చెన్నారెడ్డి, రాజారాంలు సీఎల్పీ నాయకత్వ పోటీకి సిద్ధమయ్యారు. ఆధిపత్యానికి తిరుగులేని ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు, రాజారాం పోటీనుండి తప్పుకోవడంతో సీఎల్పీ నాయకుడిగా చెన్నారెడ్డి ఎన్నిక ఏకగ్రీవమయింది. కాంగ్రెస్ పార్టీ ‘సమ్మతి-అసమ్మతి’ వర్గపోరు తీవ్రమై, 19 నెలల తరువాత ఇందిరాగాంధీ ఆదేశం మేరకు చెన్నారెడ్డి రాజీనామా చేయడం, ఆయన వారసుడిగా ఆమే ‘స్వయంగా’ ఎంపికచేసిన కేంద్ర కార్మికశాఖ మంత్రి, తెలంగాణ ప్రాంత వ్యక్తి, టంగుటూరి అంజయ్య నియామకం జరగడం కేవలం లాంఛనమే. అనుకోని పరిణామాల నేపధ్యంలో రాజీనామా చేసిన అంజయ్య స్థానం ఇందిరాగాంధీ అనుగ్రహంతో భవనం వెంకట్రాంరెడ్డికి దక్కింది. 

ఇంతలో ఎన్టీ రామారావు రాజకీయ రంగప్రవేశం, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, పదవిలో ఏడు నెలలు కూడా నిండని భవనం రాజీనామా, ఐదేళ్లలో నాలుగో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కోట్ల విజయభాస్కరరెడ్డి నామినేట్ కావడం, 1983 లో ఎన్నికలు జరగడం, కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవడం, ఎన్టీ రామారావు అఖండ విజయం సాధించి సిఎంగా మొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు కావడం, సమకాలీన రాజకీయ చరిత్ర. ఆ సమకాలీన చరిత్రలోనే విఫలమైన నాదెండ్ల భాస్కర రావు తిరుగుబాటు ఒక దురదృష్ట అధ్యాయం. 

1989 శాసనసభ ఎన్నికలలో చెన్నారెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఢిల్లీ పెద్దల అండతో, సీఎల్పీ నాయకుడిగా ఎన్నికై రెండో పర్యాయం ముఖ్యమంత్రి అయ్యారు (నేను ముఖ్యమంత్రి పీఆర్వోగా ఆయన దగ్గర పనిచేశాను). సంవత్సరం గడవక ముందే, కాంగ్రెస్ పార్టీ సంస్కృతీ, సాంప్రదాయాలైన, ‘ఢిల్లీ పెద్దల వ్యవహారశైలి’ వల్ల చెన్నారెడ్డి రాజీనామా చేయక తప్పలేదు. ఆ తరువాత ముఖ్యమంత్రైన నేదురుమల్లి జనార్ధనరెడ్డికి అసమ్మతి సెగ తగలడంతో రాజీనామా చేయక తప్పలేదు. తరువాత కోట్ల విజయభాస్కరరెడ్డిని రెండోమారు ముఖ్యమంత్రిని చేసింది అధిష్టానం. ఆ నిర్ణయమే 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి దారితీసింది. ఎన్టీఆర్ రెండో పర్యాయం ముఖ్యమంత్రి అయినప్పటికీ, ఆయన మీద తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన చంద్రబాబునాయుడు, 1999 ఎన్నికలలోనూ గెలిచి ముఖ్యమంత్రి కాగలిగారు. 

2004 ఎన్నికలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, డి శ్రీనివాస్ ల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ, అధిష్టానం (సోనియాగాంధీ) ఆశీస్సులు రాజశేఖరరెడ్డికి లభించి సీఎల్పీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవ్వడానికి వీలైంది. 2009 లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి, ‘ఆటోమేటిక్ చాయిస్’ గా మరోమారు సీఎల్పీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై, రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్ఆర్ అకాల మరణంతో రోశయ్య, తరువాత కిరణ్ కుమార్ రెడ్డిలను నామినేట్ చేసింది అధిష్టానం. తెలంగాణ ఆవిర్భావం తరువాత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు బీఆర్ఎస్) రెండు పర్యాయాలు (2014, 2018 ఎన్నికలలో) అధికారంలోకి రావడం, కె చంద్రశేఖర్ రావు సిఎం కావడం జరిగింది. ఎన్టీ రామారావుకు, చంద్రబాబునాయుడుకు, చంద్రశేఖర్ రావుకు వారికి వారే అధిష్టానం. వారిదే నిర్ణయం. 

పీసీ అధ్యక్షుడిగా వున్న ఎనుముల రేవంత్ రెడ్డి సారధ్యంలో, 2023 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది.  ఆయనే కాంగ్రస్ పార్టీ శాసనసభా పక్షం నాయకుడిగా ఎన్నికవుతారని అందరూ భావించినా, అలవాటు, ఆచారం, సాంప్రదాయం ప్రకారం, అధిష్టానం నుంచి ‘క్లియరెన్స్’ వచ్చేవరకు ప్రకటన రాలేదు. తెలుగురాష్ట్రాలలో ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యంత్రులుగా అయినవారందరూ నీలం నుండి కిరణ్, రేవంత్ వరకూ అధిష్టానం కనుసన్నలలో మెలిగినవారే, మెలగాల్సినవారే.

సిఎంలు అయిన వారినెవరినీ కాంగ్రెస్ అధిష్టానం ‘సాధారణంగా’ పూర్తికాలం పదవిలో’ వుండనీయలేదు. చెస్ బోర్డులో, పచ్చీసు పట్టాలో పావులను కదిలించినట్లు సిఎంలను మార్చడం కాంగ్రెస్ పార్టీ సంప్రదాయం. దీనికి భిన్నంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పూర్తికాలం పదవిలో కొనసాగగలరా? కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి, అసహనం, అసమ్మతి సహజం. దీనికి అతీతులెవరూ లేరు. ‘శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు’ అంటారు. ‘శివుడి ఆజ్ఞ’ అంటే ‘అధిష్టానం ఆజ్ఞ.’ ఎమ్మెల్యేల వేరుకుంపట్లు, రహస్య భేటీలు కాంగ్రెస్ పార్టీకి చెందినంతవరకు ‘అధిష్టానం ఆశీస్సులు’ లేకుండా జరగవు!!! ఇంతకీ అధిష్టానం పనుపున చక్రం తిప్పుతున్న ఆ వ్యక్తి ఎవరనేది ప్రశ్న?  

Sunday, February 2, 2025

WEF PLEDGES: REALITY IS BITTER: By Vanam Jwala Narasimha Rao

 WEF PLEDGES: REALITY IS BITTER

MoUs on Investments at Schwab’s 

World Economic Forum Echo ‘Malthusian Theory’

By Vanam Jwala Narasimha Rao

The Hans India (03-02-2025)

{Billions of investment announcements pledged at WEF and consequently hurried MoUs with companies by a few Chief Ministers create a perception of rapid economic expansion and development as well as false expectations of huge employment creation. In actual implementation, fund disbursement, ground-level projects, and tangible benefits like employment creation or economic uplift typically follow a slower and linear pace due to innumerable bureaucratic hurdles, regulatory challenges, and economic uncertainties, not to speak of politically motivated hyped announcements}-Synoptic Note by Editor

Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu expressed the view that, a visit to the ‘World Economic Forum (WEF)’ is not just about signing MoUs, but engagement and networking with ‘Globally Influential Individuals’ under one roof, to gain insights into the direction the world is headed. This is absolutely true, especially in the context of series of ridiculous statements ‘day in day out’ by few Chief Ministers about their signing MoUs in Davos, including with Indian companies!!!

The 54th WEF Meeting was held in Davos, from January 15-19, 2025, attracting International Organizations and Global Companies. Approximately 3000 significant global leaders, policymakers, experts, leaders from government, business, civil society, and academic institutions participated. They included Prime Ministers, Ministers, and Top Officials. USA delegation comprising 674, UK’s 270, Chinese delegation with 140 members, and India’s largest-ever delegation of 133 (with the theme of ‘One Team and One Indian Pavilion’) from Telangana, Andhra Pradesh, Maharashtra, Uttar Pradesh, Tamil Nadu, Kerala, Karnataka, and West Bengal participated. Five Union Ministers, three state Chief Ministers, nearly 100 CEOs and leaders from various sectors from India participated. 

‘European Management Forum (EMF)’ established in 1971 by a 33 years old Swiss Engineer and Economist, Professor Klaus Schwab, was renamed as ‘World Economic Forum (WEF)’ to broaden its Vision. Schwab’s idea was to create an efficient and effective platform for European Executives and Entrepreneurs to learn and adopt USA Management Techniques. Gradually it evolved to focus on broader economic and social issues. Schwab strategically leveraged his contacts to mobilize resources, basically from the initial gathering of approximately 400 European Business Leaders. Conceived as a non-profit foundation under the supervision of the Swiss Federal Government, WEF traditionally has been holding ‘Annual Meetings’ in Davos, chosen for its serene mountain setting to foster open and cooperative discussions, embodying the ‘spirit of Davos’ as termed by Schwab.

WEF does not own permanent venue in Davos. Some ‘Annual Meetings of the New Champions (AMNC)’ focusing on innovation, entrepreneurship, technology, by bringing together leaders from business, government, academia, and civil society were held in China’s Dalian. Telangana’s First Chief Minister Kalvakuntla Chandrashekhar Rao attended one such meeting in Dalian in 2015. Reverberating his ‘Intellectual Presence and with a Statesman Like Approach’ in his five-minute talk in the meeting, in seriatim, KCR defended with Nationalism Spirit the Indian Economy, endorsed host country China’s Development with International Comprehension, and precisely projected the State as an investment destination as a dedicated leader of Telangana. Exactly decade after what he envisioned there, the Economic Survey 2024-25 presented to Parliament by Union Finance Minister, has reaffirmed ‘Telangana’s Exceptional Economic Growth’ under KCR Regime and leadership. Great!!

Participation in the WEF Annual Meetings by those who are significant contributors to the economic or political landscape or who are likely to add value to the forum's goals of fostering global collaboration and solving complex global challenges, is ‘Strictly by Invitation’ often ‘Stage-Managed.’ WEF provides an opportunity for lobbying economic opportunities, investments, and global collaborations. Chief Ministers and Union Ministers from India participate to showcase their economic potential, and to attract global investors. They apparently build international partnerships, including strategic discussions and behind-the-scenes interactions. 

WEF projecting as a ‘Socializing Institution’ in ‘Shaping Global Economic Policies’ serves as a platform to ‘Promote Neoliberal Agendas’ inadvertently facilitating the spread of policies that prioritized deregulation and market liberalization, which may not align with the interests of the broader population. Nevertheless, it became a key platform for developing countries to showcase investment opportunities. 

When Narendra Modi attended WEF Annual Meeting 2018, he became the First Indian Prime Minister to do so in two decades after Deve Gowda who attended in 1997. Modi in his keynote address highlighted India's economic reforms, ease of doing business, and investment opportunities. Modi consciously promoted initiatives like Make in India, Digital India, and Skill India to attract global investors. He addressed global concerns like climate change and terrorism, positioning India as a responsible global power. In tune with this, perhaps, while addressing an event hosted by Confederation of Indian Industry (CII) at the 54th meeting, Schwab hailed India’s successful growth story and spoke about the country's success in achieving 7% growth annually. Undoubtedly this was Great Recognition on international Dais. However, the Economic Survey’s Prediction hooks India’s ‘Real GDP Growth’ in 2025-26 between 6.3% and 6.8% only ‘keeping in mind the upsides and downsides.’ 

N Chandrababu Naidu was one of the first and most notable Chief Ministers from India to attend the WEF Annual Meetings in the late 1990s and early 2000s. He actively utilized the WEF platform and promoted the erstwhile AP state as a destination for foreign investment. He also promoted the state's IT industry and state's role in India's IT growth, especially Hyderabad’s emergence as an IT Hub. This time also he attended in similar fashion. He interacted with the Microsoft founder Bill Gates. Telangana Chief Minister Anumula Revanth Reddy attended in 2023 also now. Most Successfully he secured significant investments for Telangana from Amazon, Sun Petrochemicals, Tillman Global Holdings etc. worth Rs 1.78 lakh crore, which is expected to generate employment opportunities for 49,550 people. Great!

WEF is celebrated for its potential to forge international partnerships to secure investments. However, the tangible benefits, particularly in terms of economic growth and employment generation, often come under scrutiny. In recent years, many political leaders, especially Telangana and Andhra Pradesh have used this high-profile platform to announce ‘Large-Scale Investments, Often in Billions.’ The question is whether these investments are ‘Merely Publicity Stunts’ deliberately designed to ‘Showcase Political Agenda’ or do they ‘Truly Contribute to Long-Term Prosperity’?

It may be of interest to draw a parallel between the ‘Malthusian Theory’ which discusses ‘Arithmetic and Geometric Progressions’ and the ‘Largescale Investment Announcements’ made at the World Economic Forum, versus their ‘Actual Implementation or Real Benefits.’ The ‘Malthusian Theory of Population Growth’ is in ‘Geometric Progression’ or growing exponentially (1, 2, 4, 8, 16...). ‘Food Supply Growth’ will be in ‘Arithmetic Progression’ or increases linearly (1, 2, 3, 4, 5...). Eventually population outpaces food supply, leading to shortages, crises, and corrective measures.

In the similar way, ‘Billions of Investment Announcements Pledged in WEF’ and ‘Consequent Hurried MoUs’ with companies by few Chief Ministers are in ‘Geometric Progression’ which grow exponentially year on year creating a ‘Perception of Rapid Economic Expansion and Development’ as well as ‘False Expectations of Huge Employment Creation.’ When it comes to ‘Actual Implementation’ it is not even in ‘Arithmetic Progression.’ The real execution, such as fund disbursement, ground-level projects, and tangible benefits like employment creation or economic upliftment, typically follows slower and linear pace due to innumerable bureaucratic hurdles, regulatory challenges, and economic uncertainties, not to speak of ‘Politically Motivated Hyped Announcements.’ 

The result is that, this disparity leads to a ‘Development Gap’ where the promised economic transformation falls short of expectations, resulting in delays, skepticism, and policy adjustments. Just as Malthus emphasized the need for checks and balances to align population with resources, ‘Policymakers and Stakeholders’ must ensure realistic projections, continuous monitoring, and ground-level execution to align World Economic Forum investments with actual economic growth. While ‘Large-Scale Investments are Certainly a Positive Step’ towards economic development, these hyped announcements cannot be sheer ‘Game-Changing Propositions.’ The goal should be to ensure that these investments translate into tangible development, especially in Telugu states. 

Professor Klaus Schwab of World Economic Forum who fairly demonstrated remarkable skills as a ‘Public Relations Strategist, Specialist Economist, and Maneuverer’ in the global political and economic landscape, may well have steered the WEF toward even more meaningful change. Moving forward, ‘Greater Humility, Accountability, and an Ethics-First Approach’ would help solidify its credibility and long-term relevance, ensuring that, it delivers a positive legacy for future generations.

(The Writer is former Chief Public Relations Officer to First Telangana Chief Minister K Chandrashekhar Rao)

జగత్ సృష్టి అంతా భగవత్ సృష్టే అని నారదుడికి చెప్పిన బ్రహ్మ ..... శ్రీ మహాభాగవత కథ-21 : వనం జ్వాలా నరసింహారావు

 జగత్ సృష్టి అంతా భగవత్ సృష్టే అని నారదుడికి చెప్పిన బ్రహ్మ

శ్రీ మహాభాగవత కథ-21

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (03-02-2025) 

కంII చదివెడిది భాగవతమిది, 

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

చదివినను ముక్తి కలుగును, 

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై 

మహాకవి బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమహాభాగవతం ద్వితీయ-తృతీయ, పంచమ స్కందాలలో ప్రపంచోత్పత్తి గురించి, అంతుచిక్కని సృష్టి రహస్యం గురించి చాలా విపులంగా రాయడం జరిగింది. 

శ్రీమన్నారాయణుడు ఒకప్పుడు చతుర్ముఖ  బ్రహ్మకు లోక సృష్టి మీద బుద్ధి కలిగించాలని సంకల్పించాడు. దానికొరకు భగవానుడు సరస్వతిని నియోగించాడు. ఆ వాగ్దేవి తనకు తానుగా బ్రహ్మను హృదయనాధుడిగా వరించింది. వేదరూపిణిగా ఆయన ముఖమండలం నుండి బయటకు వచ్చి, ఆ బ్రహ్మను తిరుగులేని సృజనాక్రియా పారంగతుడిని చేసింది. భగవంతుడు తాను స్వయంగా అంతటా వ్యాపించి ఉన్నవాడే అయినప్పటికీ, పంచభూతాల పరస్పర సంయోగంతో శరీరాలు అనే పురాలను పుట్టించాడు. పంచభూతాలలో పదకొండు ఇంద్రియాల తేజాన్ని ప్రసరింపచేసి వాటి మహాత్మ్యంతో పదహారు కళారూపాలతో వెలుగొందుతాడు. 

నారదుడు తన తండ్రి బ్రహ్మను జగత్ సృష్టి గురించి అడిగాడు ఒకసారి. ‘ఈ జగాన్ని ఇలా సృష్టించాలనే తెలివి మొదట నీకు ఎవరు కలిగించారు? ఏ ఆధారంతో లోక సృష్టిని మొదలు పెట్టావు? అలా ఆరంభించడానికి కారణం ఏమిటి? దాని అవసరం ఏమిటి? దాని అసలు స్వరూపం ఎలా ఉంటుంది? ఎడతెరిపి లేని సాలెగూటి లాంటి సృష్టి క్రమాన్ని ఎలా అల్లుకుంటూ వస్తున్నావు? ఈ సృష్టి అంతటికీ నువ్వే అధిపతివి అని అనుకుంటున్నాను. అది నిజమేనా? నువ్వే సర్వాదికారివా? నీకంటే ఘనుడు, నిన్ను మించిన మహానుభావుడు మరెవరైనా ఉన్నారా? నువ్వు ఏ దేవదేవుడిని గురించి తపస్సు చేశావు? నీకు పరమ విభుడు ఎవరైనా ఉన్నారా? ఉంటే, అతడే ఈ బ్రహ్మాండం పుట్టడానికి కారణమా? ఆయన విలాసం వల్లే ఈ విశ్వం వర్ధిల్లుతూ, లయిస్తూ ఉంటుందా? ఈ సృష్టి విధానం ఆసాంతం నాకు వివరించు’ అని ప్రశ్నించాడు నారదుడు బ్రహ్మను.

జవాబుగా బ్రహ్మ దేవుడు ఇలా అన్నాడు: ‘ఈ చరాచర జగత్తు మొత్తాన్నీ నాకు నేనుగా సృష్టించే తెలివి నాకు ఏమాత్రం లేదు. అందుకే మొదట చాలా తడబడ్డాను. ఈ సమస్తాన్ని సమన్వయ పరచుకుని, సృష్టికి నేను యథేచ్చగా శ్రీకారం చుట్టగల అవగాహనను నాకు ఆ పరమాత్మ ప్రసాదించాడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, నక్షత్రాలు, గ్రహాలూ, చిన్న చుక్కల్లాగా ఈ లోకం అంతా పరమాత్మ కాంతిని అనుసరించి వెలుగుతుంది. ఈ సృష్టి అంతా భగవత్ సృష్టే. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాల పుట్టుకకు కారణం ఆ వాసుదేవుడే! పద్నాలుగు లోకాలు ఆ శ్రీహరి నియమించినవే! సురలంతా ఆ దివ్య స్వరూపుడి శరీరం నుండి పుట్టినవారే! వేదాలు, యుగాలు, తపస్సులు, యోగాలు, విజ్ఞానం ఇవన్నీ నారాయణుడికి చెందినవే! సర్వాంతర్యామి, సర్వాత్ముడు, అన్నిటికీ సాక్షీభూతుడు ఆ పరమేశ్వరుడే! అతడి అనుగ్రహంతో మాత్రమే నేను సృష్టిస్తూ ఉంటాను’.

ఇంకా ఇలా చెప్పాడు బ్రహ్మ: ‘ఆ పరమ దైవం మాయకు పాలకుడు. తన మాయ వల్ల, దైవ స్థానం వల్ల లభించిన కాలం, జీవుడు-అదృష్టం (కర్మ)-స్వభావం అనే మూడు అంశాలతో, వివిధ రకాలుగా సృష్టి చేయాలని సంకల్పించి ఆ పనికి పూనుకున్నాడు. ఆయన ఆశ్రయించిన తత్త్వం “మహత్తు”. దానితో కాలాన్ని, గుణాలనూ మేళవించాడు. స్వభావానికి రూపం ఇచ్చి, దానిని సృష్టిగా మలచాడు. జీవుడి పుణ్య-పాప రూపమైన కర్మ (అదృష్టం) నుండి “జన్మ” ను కలిగించాడు. ఆ మహత్తత్త్వం రజోగుణం, సత్వగుణాలతో విస్తరించి, ఒక రూపం పొందింది. దానివల్ల తమోగుణం ప్రధానంగా కల “అహంకారం” ఏర్పడింది. ఇది పంచ మహాభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలతో కూడుకున్నది. అహంకారం, ద్రవ్యశక్తి కల “తామసం”, క్రియాశక్తి కల “రాజసం”, జ్ఞానశక్తి కల “సాత్త్వికం” అనే మూడు రూపాలుగా మార్పుచెందింది. ఈ మూడిట్లో పంచభూతాల సృష్టికి మూలం “తామస అహం”. దీని వికృతి “ఆకాశం” గా ఏర్పడింది. దీని గుణం “శబ్దం”. ఈ శబ్దం చాలా సూక్ష్మరూపం కలిగి ఉంది’.

బ్రహ్మ కొనసాగిస్తూ ఇలా అన్నాడు: ‘ఆకాశం నుండి “వాయువు” ఏర్పడుతుంది. ఆకాశంతో పొందిక వల్ల “శబ్దం”, “స్పర్శ” అనే రెండు గుణాలు కలిగి ఉంటుంది. ఇది శరీరంలో ప్రాణ రూపంలో ఉంటుంది. ఈ వాయువులో ఇంద్రియాల ఆరోగ్యం, మానసిక శక్తి, దేహపుష్టి ఉంటాయి. ఇవి ఓజస్సు, జీవశక్తి, బలం అనేవాటికి హేతువులై ప్రవర్తిల్లుతాయి. వాయువు నుండి “తేజస్సు” ఏర్పడుతుంది. రూపం, స్పర్శం, శబ్దం అనేవి దాని గుణాలు. తేజస్సు నుండి జలం ఏర్పడుతుంది. రసం, రూపం, స్పర్శం, శబ్దం అనేవి దీని గుణాలు. జాలం నుండి భూమ ఏర్పడుతుంది. గంధం, రసం, రూపం, స్పర్శం, శబ్దం అనే అయుదు దీని గుణాలు. వీటన్నిటికీ తామసాహంకారం మూలం. సాత్త్వికాహంకారం వికారానికి లోనైనప్పుడు “మనస్సు” పుట్టింది. దీని దైవం చంద్రుడు. అహం నుండే దిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినీ దేవతలు, అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, ప్రజాపతి అనే పదిమంది దేవతలు పుట్టారు’.

   బ్రహ్మ ఇంకా కొనసాగించాడు. కొనసాగిస్తూ ఇలా అన్నాడు: ‘రాజసాహంకారం తేజస్సుకు సంబంధించినది. దీన్నుండే పది ఇంద్రియాలు ఏర్పడ్డాయి. వీటికి మూలం పదిమంది సాత్త్వికాహంకార దేవతలు. త్వక్కుకు దిక్కు, నాలుకకు సూర్యుడు, ముక్కుకు అశ్వినీ దేవతలు, చేయికి అగ్ని, పాదానికి ఉపేంద్రుడు, గుడానికి మిత్రుడు, మర్మాంగానికి ప్రజాపతి దేవతలు. ప్రజ్ఞను పుట్టించే ఇంద్రియాలలో ఒకటి బుద్ధి. క్రియను పుట్టించే ఇంద్రియం ప్రాణం. ఇలాంటి పది జ్ఞానేంద్రియాలతో కూడిన పంచభూతాల, పంచేంద్రియాల, మనస్సుల గుణాలు అనే వస్తు సంచయం ఉన్న ఇవి విడి-విడిగా వేటికవే ఉండడం వల్ల బ్రహ్మాండపు శరీరాన్ని రూపొందించగల సామర్థ్యం లేకుండా పోయాయి. పంచభూతాల, పంచేంద్రియాల, మనస్సుల గుణాలతో, ప్రాకృతిక శక్తి ప్రేరేపణలతో, అన్నీ ఏకీకృతమైనాయి. ఇవి అన్నీ కలిసి చేతన-అచేతన రూప బ్రహ్మాండాన్ని సృజించేవి అయ్యాయి. అలా ఏర్పడ్డ బ్రహ్మాండం కోట్లాది సంవత్సరాలు నీళ్లలోనే ఉండిపోయింది. ఆ పరమాత్మ జీవం లేనిదాన్ని జీవవంతం చేశాడు. ఆ దివ్యాత్ముడు జీవరూపంలో చక్కగా చుట్టూ చుట్టుకుని ఉన్న నీళ్లలో పడివున్న బ్రహ్మాండంలో జొరబడి వాటిని బాగా విస్తరింప చేశాడు. ఆ తరువాత అందాన్ని బద్దలు చేసి బయటపడ్డాడు’.

నారదుడి ప్రశ్నకు జవాబు కొనసాగిస్తూ బ్రహ్మ ఇంకా ఇలా అన్నాడు. ‘ఆ పరమేశ్వరుడు, ఈశుడు జగదాకారుడు. అనంతమైన బ్రహ్మాండాన్ని విపులమైన పద్నాలుగు లోకాలు (భువనాలు) గా చేశాడు. బహురూపాలు దాల్చిన ఆ పరమయోగి ఎన్నో పాదాలు, తొడలు, భుజాలు, ముఖాలు, నేత్రాలు, శిరస్సులు, నోసళ్ళు, చెవులతో కూడి ఉంటాడు. ఆయన సృష్టించిన భువనాలలో మీద ఉన్న ఏడు లోకాలు నడుము నుండి పైన ఉన్న శరీర భాగం. దిగువనుండి ఏడు భువనాలు విష్ణువుకు దిగువనున్న శరీర భాగం. ప్రపంచమే పరమాత్ముడి దేహం. ఆ పురుషుడి నోటి నుండి బ్రహ్మణకులం, చేతులనుండి క్షత్రియ కులం, తొడల నుండి వైశ్యకులం, పాదాల నుండి శూద్రకులం పుట్టాయని చెప్తుంటారు. ఆయన మొలచుట్టూ ప్రదేశం “భూలోకం”. హృదయం “సువర్లోకం”. ఎదురు రొమ్ము భాగం “మహర్లోకం”. మెడ మూలం “జనలోకం”, రెండు స్తనాలు “తపోలోకం”, శిరో భాగం బ్రహ్మ నివసించే “సత్యలోకం”, కటి భాగం “అతలం”, తొడలు “వితలం”, మోకాళ్లు “సుతలం”, పిక్కలు “తలాతలం”, చీల మండలం “మహాతలం”, కాలి ముని వేళ్లు “రసాతలం”, అరికాళ్లు “పాతాళం”. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు ఉర్ధ్వలోకాలలో వ్యాపించి ఉన్నాడు. అమరులు, అసురులు, మునులతో సహా నీళ్లలో, ఆకాశంలో, తిరిగే ప్రాణులు అంతా విష్ణుమయమే. బ్రహ్మాండం అంతా అతడి శరీరంలో 12 అంగుళాల ప్రమాణంలో పొందుపడి ఉంటుంది. అంతా ఆయనే’.

బ్రహ్మ ఇంకా ఇలా చెప్పాడు: ‘అచ్యుతుడు, బ్రహ్మాండం లోపల ఉంటూనే లోపలా, బయటా వెలుగులు నింపుతాడు. అలాంటి లోకాత్ముడి బొద్దు నుండి ఒక తామర పూవు పుట్టింది. దాని నుండి నేను (బ్రహ్మ) పుట్టాను. ఆ పరమాత్మ ఈ లోకాన్ని నిర్మించడం కొరకు ఒక మాయను సృష్టించాడు. ఆ మాయ వల్లే అతడు భగవంతుడయ్యాడు. ఆ విష్ణువు జగత్తే ఆత్మ కలవాడు. ప్రపంచానికి ఈశుడు. అతడు నియమించడాన్ని బట్టి నేను స్థావర జంగమాత్మకమైన ప్రాణులతో ఈ సృష్టి క్రమాన్ని విస్తరిస్తాను. విష్ణువు సుస్థితిని కలిగించి రక్షిస్తుంటాడు. శివుడు గిట్టింప చేస్తాడు. విష్ణువు సృష్టి, స్థితి, లయలనే మూడు శక్తులు కలిగి ఈ సమస్తానికీ తానె మూల భూతమై ఉన్నాడు. శ్రీమహావిష్ణువు అంతరంగాన్ని అనుసరించి ఈ ప్రపంచాన్ని, జీవులను సృష్టించడమే నా విధి. ఈ సమస్త ప్రపంచానికి ఆధారభూతమైనది కేవలం పరమమైన బ్రహ్మమే!’.

బ్రహ్మ ముగింపుగా మరికొన్ని విషయాలను చెప్పాడు నారదుడికి ఇలా: ‘ఆదిపురుషుడి తోలి అవతారం నుండి కాలం, కర్మం, స్వభావం అనే మూడు శక్తులు పుట్టాయి. వీటిల్లో నుండి ప్రక్రుతి ఏర్పాటైంది. దాన్నుండి మహత్తు అనే తత్త్వం కలిగింది. దాన్నుండి పుట్టిన రాజసాహంకారం నుండి ఇంద్రియాలు, సాత్త్వికాహంకారం నుండి అధిష్టాన దేవతలు, తామసాహంకారం నుండి పంచభూతాలకు కారణమైన శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం జనించాయి. వీటి నుండి ఆకాశం, గాలి, నిప్పు, నీరు, నేల అనే పంచభూతాలు ఉత్పన్నమయ్యాయి. వీటి నుండి జ్ఞానేంద్రియాలైన చర్మం, నేత్రం, చెవి, నాలుక, ముక్కు; కర్మేంద్రియాలైన మాట, చెయ్యి, కాలు, మలావయవం, మూత్రావయం, మనస్సు ఉదయించాయి. వీటన్నిటి నుండి ఆ విరాట్పురుషుడు జన్మించాడు తనకు తానే. అతడి నుండి ఈ లోకం పుట్టింది. దాంట్లో నుండి సత్త్వరజస్తమోగుణాత్మక రూపాలలో విష్ణువు, నేను, శివుడు పుట్టాం. అందులో నుండి సమస్త లోకం, అందులో జీవించే వారు పుట్టారు. ఇలాంటి విశ్వం మొదటి పుట్టుకను “మహాత్తత్త్వ సృష్టి” అంటారు. రెండోది అండంతో కలిగిన సృష్టి. మూడోది సమస్త ప్రాణులకు చెందిన సృష్టి. అలా, ఆ పద్మాక్షుడి లీలావతారాలు అనంతం’.        

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)