Sunday, April 5, 2026

కుచేలోపాఖ్యానం >>>>> శ్రీ మహాభాగవత కథ-80 : వనం జ్వాలా నరసింహారావు

 కుచేలోపాఖ్యానం

శ్రీ మహాభాగవత కథ-80

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (ఏప్రిల్ 6, 2026)

కంII              చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                               చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై

శ్రీకృష్ణుడికి ఒక ప్రియమిత్రుడుండేవాడు. అతడి పేరు కుచేలుడు. అతడు వేదవేదాంగాలను చదివిన బ్రాహ్మణోత్తముడు. మహా విజ్ఞాని. ఆధ్యాత్మిక తత్త్వవేత్త. భక్తాగ్రగణ్యుడు. అతడిని దారిద్ర్యం పట్టి పీడించసాగింది. భార్యాబిడ్డలను ఏదో రకంగా పోషిస్తూ జీవనయాత్ర సాగిస్తున్నాడు. కుచేలుడి భార్య సద్గుణ సంపన్నురాలు. మహా పతివ్రత. ప్రతిరోజూ, పట్టెడన్నం పెట్టమని దీనంగా అడిగే తన పిల్లలను చూసి, ఆమె హృదయం ద్రవించి పోయేది. తమ దరిద్రం పోవడానికి ఏదైనా ఉపాయం ఆలోచించమని భర్తను వేడుకుంది.

చిన్ననాటి మిత్రుడైన శ్రీకృష్ణుడి దగ్గరికి పోయి, తాము పడుతున్న అవస్థల గురించి చెప్పి, ఆయన కృపా కటాక్షంతో తమ దారిద్ర్యాన్ని పోగొట్టమని సలహా కూడా ఇచ్చింది. కుచేలుడిని చూసీచూడగానే శ్రీకృష్ణుడు సాటిలేని సంపదలు ఇస్తాడని చెప్పింది. ధర్మపత్ని ఇచ్చిన సలహా మేరకు శ్రీకృష్ణ పరమాత్మను దర్శించడం ఇహపర సాధనమౌతుందని నిశ్చయించుకున్నాడు కుచేలుడు. ఆ భగవంతుడి దగ్గరికి వెళ్లేటప్పుడు ఏం కానుక తీసుకెళ్లాలని భార్యను అడిగాడు. భర్త చినిగిన కొంగులో కొన్ని అటుకులు మూటలాగా కట్టి, వాటిని కృష్ణుడికి కానుకగా ఇవ్వమని చెప్పి భర్తను అనునయంగా ద్వారకానగారానికి పంపించింది ఆయన ధర్మపత్ని. కృష్ణుడిని ఎప్పుడు చూస్తానా అన్న ఉత్సాహంతో కుచేలుడు త్వరత్వరగా నడక సాగించాడు.

కుచేలుడు ప్రయాణం చేస్తూ, తాను ద్వారకానగారాన్ని చూడడం ఎలా అనీ, ఆ నగరంలోకి ప్రవేశించడం ఎలా అనీ, శ్రీకృష్ణుడిని ఏవిధంగా దర్శించగలననీ, అంతఃపురం వాళ్లు అడ్డుతగిలితే ఏమని సమాధానం ఇవ్వాలనీ, వాళ్లకు కానుకలిద్దామంటే తనదగ్గర ఏమీ లేవుకదా అనీ, తన అదృష్టం ఎలా వుందోననీ, శ్రీకృష్ణుడు తనను చూసిన తరువాత వదులుతాడా అనీ, ఏమీ పాలుపోవడం లేదనీ అనుకుంటూ ద్వారకలోకి ప్రవేశించాడు. తరువాత రాజమార్గంలో నడవసాగాడు. మొదలు పదహారువేలమంది సుందరాంగుల బంగారు మేడలను చూసి మురిసిపోయాడు. ఒక మందిరంలో తన మిత్రుడు శ్రీకృష్ణుడు కనిపించాడు కుచేలుడికి. ఆయన రూప సౌందర్యాన్ని తనివితీరా చూశాడు కుచేలుడు.

శ్రీకృష్ణ పరమాత్మను తన్మయత్వంతో చూస్తూ ఆయన్ను సమీపిస్తుండగా, దారిద్ర్యంతో పీడించబడిన ఆ పేద బ్రాహ్మణుడిని చూసిన శ్రీకృష్ణుడు వెంటనే ఆశ్చర్యంతో తాను కూర్చున్న హంసతూలికా తల్పం దిగాడు. బాల్యమిత్రుడిని చూడగానే ప్రేమగా ఎదురుగా వెళ్లాడు. కుచేలుడిని గట్టిగా కౌగలించుకున్నాడు. అభిమానంగా తీసుకువచ్చి తన తల్పం మీద కూచోబెట్టాడు. బంగారు కలశంలోని నీళ్లతో స్నేహితుడి కాళ్లు కడిగాడు. ఆ జలాలను తన శిరస్సుమీద చల్లుకున్నాడు. చందనాన్ని కుచేలుడి శరీరం మీద చల్లాడు. విసనకర్రతో విసిరాడు. హారతులిచ్చాడు. పూలమాలలు వేశాడు. తాంబూలం ఇచ్చాడు. గోవును దానంగా ఇచ్చాడు. శ్రీకృష్ణుడి ఆదరాభిమానాలకు బ్రాహ్మణుడు పులకించిపోయాడు.

ఇంతలో రుక్మిణీదేవి వచ్చి వింజామరతో విసరసాగింది. కుచేలుడి అదృష్టానికి అంతఃపురకాంతలు అబ్బురపడిపోయారు. శ్రీకృష్ణుడు స్నేహితుడి చేయి తన చేతిలో తీసుకుని గురుకులం రోజులనాటి ముచ్చట్లు, విద్యను అభ్యసించినప్పుడు చేసిన పనులను గురించి చెప్పాడు. కుచేలుడి కుటుంబ విషయాలు అడిగాడు. ఆయన భార్యా పిల్లల గురించి వివరాలు అడిగాడు. గురువుగారి దగ్గర నేర్చుకున్న విషయాలు గుర్తున్నాయా అని ప్రశ్నించాడు. వారి గురువైన సాందీప మహర్షి గొప్పదనాన్ని, వైదుష్యాన్ని, వాత్సల్యాన్ని గురించి మరీమరీ గుర్తు తెచ్చుకున్నాడు శ్రీకృష్ణుడు. గురుకులంలో వున్నప్పుడు ఒకరోజున గురుపత్ని తమను అడవిలో కట్టెలు తెమ్మన్న విషయం, తాము వెళ్లగానే ఉరుములతో పెద్ద వర్షం కురియడం, చీకటి వ్యాపించడం, ఇద్దరూ తడిసిపోవడం, చలికి తమ శరీరాలు వణికిపోవడం, తెల్లవార్లూ అడవిలో గడపడం, తమ గురువు సాందీపముని తమను వెతుక్కుంటూ రావడం, తమ గురుభక్తికి ఆయన మెచ్చుకుని దీవించడం, ఇంటికి తీసుకువెళ్లడం గుర్తుకు తెచ్చాడు శ్రీకృష్ణుడు.

తమ స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ కృష్ణుడు పలికిన పలుకులకు కుచేలుడు ఆనందించాడు. తన దగ్గరకు వచ్చేటప్పుడు తనకు కానుకగా ఏమి తెచ్చావని అడిగాడు కుచేలుడిని కృష్ణుడు. తాను తెచ్చిన అటుకుల కానుకను శ్రీకృష్ణుడికి ఇవ్వడానికి సంకోచించాడు కుచేలుడు. ఏమీ మాట్లాడకుండా మౌనంగా వుండిపోయాడు. శ్రీకృష్ణుడు దివ్యదృష్టితో స్నేహితుడి అభిప్రాయాన్ని గ్రహించాడు. కుచేలుడికి అఖండ సంపదలు ప్రసాదించాలని నిశ్చయించాడు. అటుకుల మూటను చూసి, తనకు దాన్ని చూపలేదేమిటని అంటూ విప్పాడు కృష్ణుడు. వాటిలోంచి కొన్ని అటుకులు తీసుకుని తనకవే చాలునన్నాడు. ఆ కాసిని అటుకులే సమస్త లోకాలనూ సంతృప్తి పరుస్తాయన్నాడు. ఒక పిరికెడు తిని, మరో పిరికెడు తీసుకుంటుంటే రుక్మిణి వారించి, ఒక పిరికెడు చాలన్నది.

కుచేలుడు ఆ రాత్రి శ్రీకృష్ణ మందిరంలోనే గడిపాడు. మర్నాడు పొద్దున్నే తన ఊరికి బయల్దేరాడు. కృష్ణుడు కొంతదూరం స్నేహితుడితో కలిసి నడిచి ఆయన్ను సాగనంపాడు. శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకున్నందుకు సంతోషిస్తూ ప్రయాణం సాగించాడు కుచేలుడు. తన పురం చేరుకున్నాడు. తన ఇల్లు వుండాల్సిన చోట బంగారు భవనాలను చూశాడు. సుందర ఉద్యానవనాలను చూశాడక్కడ. సరోవరాలను చూశాడు. దాసదాసీ జనాలతో అలరారుతున్న తన సౌధాన్ని చూశాడు. శోభాయమానంగా కనిపిస్తున్న ఆ సౌధాన్ని చూసి ఆలోచించసాగాడు.

ఇంతలో కుచేలుడికి స్వాగతం చెప్తూ, దేవకాంతల్లాగా వున్న కొందరు స్త్రీలు ఆయన్ను లోపలికి తీసుకుపోయారు. అక్కడ ఆయన తన ధర్మపత్నిని చూశాడు. ఆమె ఆయన పాదాలకు నమస్కరించింది. పరిచారికలు సేవిస్తుంటే భాగ్యసౌభాగ్యాలతో అలరారుతున్నది భార్య. అలా శ్రీకృష్ణుడు ప్రసాదించిన సిరిసంపదలతో ఆ దంపతులిద్దరూ ఆనందంలో మునిగిపోయారు. మహా వైభవంగా వున్న ఆ భవనంలో కుచేలుడు భార్యతో, పుత్రులతో సుఖంగా కాలం గడిపాడు. నిర్మలమైన ప్రవర్తనతో సజ్జనుడిగా మెలగసాగాడు. ఇన్ని వున్నా, కుచేలుడు భోగ భాగ్యాలపట్ల ఏవిధమైన ఆసక్తి చూపకుండా భగవంతుడినే ధ్యానం చేస్తూ, మోక్ష సామ్రాజ్యాన్ని చేరుకున్నాడు.                       

       (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

Saturday, April 4, 2026

Vedism through Hinduism: A Comprehensive Way of Life (Vibrant, Complex, and Evolving Continuum) >>>>> Vanam Jwala Narasimha Rao

 Vedism through Hinduism

A Comprehensive Way of Life

(Vibrant, Complex, and Evolving Continuum)

Vanam Jwala Narasimha Rao

The Hans India (April 5, 2026)

{{Despite facing significant historical, political, and social challenges over centuries, Hinduism, or Sanatana Dharma, has demonstrated remarkable resilience and continuity. Its endurance can be attributed to its inherent flexibility, the absence of a single central authority, and the strength of its cultural practices embedded in everyday life rather than confined solely to temples or scriptures}}-Editor’s synoptic note.

A bedrock of ‘Hinduism and Dharmic Traditions’ and a major foundation, along with Indus Valley culture, regional traditions, and later day developments, Vedism originated as a ritualistic culture, and evolved into the philosophical, meditative, and non-dualistic traditions defining modern Indian spirituality. Vedism deeply shaped the entire landscape of Indian religious thought. Vedas are considered the root of many Indian traditions, influencing concepts like dharma and karma. Eventually, Vedism evolved into Brahmanism, and Vedanta, rather than just being a predecessor to Hinduism.  

Modern Hindu practices, Yajna (fire sacrifice) and Gayatri Mantra, remain direct legacies of Vedic Rites. Core philosophical concepts, the Ultimate Reality (Brahman), Individual Soul (Atman), Action (Karma), Reincarnation (Samsara), and Liberation (Moksha or Nirvana), were articulated in the Vedic Upanishads. Thus, Vedism focused on development of deeper spiritual ideas, during the later Vedic period. The Vedic collective group of principal deities, includes Indra (the warrior), Agni (the fire deity), and Varuna (the upholder of cosmic order), among others.

The Sanskrit language, the medium of the Vedas, is one of the earliest recorded Indo-European languages, sharing common linguistic ancestry with other Indo-European languages. The Vedas are traditionally regarded as Apauruseya (not of human origin), believed to have been ‘heard’ by ancient sages. The transition from the ritual-centric Karma Kanda (Samhitas and Brahmanas) to the knowledge-centric Jnana Kanda (Upanishads) marked a significant shift toward deeper philosophical inquiry into ultimate reality, including non-dualistic interpretations. Vedism provided an enduring ethical, cosmological, and metaphysical framework known as Dharma.

There was no single historical starting point and no central founder to Hinduism. It is an organic and evolving tradition developed over millennia through contributions of numerous thinkers, and sages from all communities. Its roots extend to Vedas and Indus Valley practices. It represents synthesis of local cults, Vedic rituals, philosophical inquiry, and deep devotional expression. Thus, Hinduism evolved like a vast branching tree of traditions and schools, rather than a constructed system of single founded religion.  It emerged as complete and inclusive way of life.

Hinduism is identified with Sanatana Dharma. The Rigveda, Samaveda, Yajurveda, and Atharvaveda are regarded as its core texts. The Upanishads, teachings of sages, rishis, and later traditions including avatars, contributed to its early development. It accommodates diverse approaches to understanding ultimate reality (Brahman), reflected in the six orthodox schools (Darshanas). ‘Brahmanism’ occasionally conflated with ‘Brahman Caste’ is used as the ‘Modern Scholarly Label’ for its early ideological framework. Historically various communities together with Brahmans, had their share of contribution to preserve and sustain Hinduism and Sanatana Dharma.   

Unfortunately, ‘Brahman’ community alone, silently slipped into obscurity. Eminent Acharyas, provided commentaries on Vedas, Upanishads, and Bhagavad Gita, interpreting them suiting the times. Adi Shankaracharya played pivotal role in revitalizing Vedantic Thought by organizing existing Vedic Traditions into the coherent philosophical system known as ‘Advaita Vedanta’ (non-dualism). Ramanuja professed Visistadvaita and Madhvacharya advanced Dvaita, thereby contributing to a rich and pluralistic intellectual tradition within Hinduism.

The Bhakti movement (devotion) made spirituality accessible to all sections of society. Originating in South India through the Tamil Alvars (Vaishnava) and Nayanars (Shaiva), it gradually spread across the subcontinent as ‘Silent Revolution’ that challenged caste hierarchies and ritualistic rigidity, while emphasizing personal love and devotion to the divine. Kabir, Meerabai, Tulsidas etc. expressed their spiritual insights in regional languages, thereby reaching wider audience.

Veda Vyasa Mahabharata and Valmiki Sri Ramayana brought new narratives and deities into prominence, as more personal and relatable forms of the divine. Rudra evolved into Shiva, the Vedic deity Vishnu rose in prominence, and the progenitor Prajapati came to be identified with Brahma. This period also deepened philosophical inquiry. Despite these transformations, Vedic Legacy persists within Hinduism. The authority of the Vedas has endured, and they continue to be revered as Shruti (that which is heard).

Many life-cycle rituals, such as marriage (Vivaha) remain rooted in Vedic Traditions. Similarly, the basic framework of the Varna System, which originated in the later Vedic period, has undergone modification over time but continues to influence social organization, but unfortunately more on caste considerations.

Therefore, genesis of Hinduism may be understood as a synthesis in which Vedism provided the foundational ‘Kernel’ including scriptures, fire sacrifice, and varna framework. Later Brahmanical Traditions and popular movements contributed the ‘Applications,’ such as temple worship, bhakti, and Puranic narratives.  

Hinduism is not a monolithic religion but a diverse tapestry of beliefs and practices that has historically embraced multiple interpretations and adaptations. It places strong emphasis on dharma, or duty, as the guiding principle for moral and ethical conduct. Over time, Hinduism has come to be regarded as a vibrant and complex tradition, reflecting the rich cultural heritage as an ‘Evolving Continuum.’

Critiques, often designated as ‘Reform or Anti-Caste Movements’ have historically addressed issues such as social hierarchy, priestly dominance, ritualism, and the marginalization of certain communities. Prominent among these were Jyotirao Phule’s Satya Shodhak Samaj (Truth-Seekers’ Society), Dr BR Ambedkar’s Dalit Movement and his opposition to the Manusmrithi, and Periyar EV Ramasamy’s Self-Respect Movement, among others.

The Arya Samaj, founded by Swami Dayananda Saraswati, protested against what it viewed as later accretions or distortions in Hindu practice, including idol worship, pilgrimage, priestly dominance, and advocated the concept: ‘Back to the Vedas.’ The Brahmo Samaj, founded by Raja Ram Mohan Roy, sought to reform Hinduism by challenging idol worship, superstition, and excessive ritualism. Both movements directly questioned the ‘Brahmanical Monopoly’ over ‘Scriptural Interpretation.’

Their critiques were often met with resistance and counter-arguments from traditional sections of society. Despite facing significant historical, political, and social challenges over centuries, Hinduism, or Sanatana Dharma, has demonstrated remarkable resilience and continuity. Its endurance can be attributed to its inherent flexibility, the absence of a single central authority, and the strength of its cultural practices embedded in everyday life rather than confined solely to temples or scriptures.

Hinduism does not depend on a single prophet, one canonical text, or a centralized institution. Instead, Hinduism evolves with time, place, and context, adapting to new ideas and social transformations while preserving its core philosophical foundations. In this sense, Hinduism is best understood as a ‘Comprehensive Way of Life.’ Hinduism has a distinctive global presence of its own.

The spread of yoga, philosophical thought, and several international organizations has generated worldwide interest, carrying Hindu ideas beyond geographical boundaries. Having endured and adapted through thousands of years of challenges, Hinduism has demonstrated remarkable resilience and continuity. Multiple factors thus combine to sustain it as an enduring and relevant force in the modern world, influencing not only spirituality but also culture, ethics, and lifestyle across societies.

Hinduism remains geographically concentrated and is the world’s third-largest religion, with a significant majority of its followers residing in India and South Asia, alongside a steadily expanding global diaspora. As of 2026, it is practiced by approximately 1.5 billion people, accounting for nearly 15 percent of the global population. While most adherents live in the Asia-Pacific Region, Hindu communities are also well established in countries such as Nepal, Bangladesh, Indonesia, the United States, Mauritius, Malaysia, United Kingdom, Canada, and South Africa, reflecting both historical migration and contemporary globalization.

Over recent decades, the global Hindu population has grown in proportion with overall population trends, maintaining its relative share while extending its cultural and philosophical influence. The global influence of Hinduism is evident in the widespread adoption of yoga, meditation, and philosophical concepts such as ‘Karma, Dharma, and Reincarnation.’

Traditional systems of holistic well-being continue to gain recognition worldwide. Festivals such as Diwali are celebrated globally, reflecting cultural integration across societies. Hindu literature preserves spiritual and philosophical wisdom through texts like the Vedas and Upanishads, while epics such as the Ramayana and Mahabharata continue to shape ethical values, education, and artistic expression across generations.

సనాతన ధర్మబద్ధ రాజనీతి నేటి మేటి పాలనకూ మార్గదర్శకమే! >>>>> (కణిక, నారద, ధౌమ్య, శ్రీరామ రాజనీతిజ్ఞత) : వనం జ్వాలా నరసింహారావు

 సనాతన ధర్మబద్ధ రాజనీతి 

నేటి మేటి పాలనకూ మార్గదర్శకమే!

(కణిక, నారద,  ధౌమ్య, శ్రీరామ రాజనీతిజ్ఞత)

వనం జ్వాలా నరసింహారావు

ప్రజాతంత్ర దినపత్రిక (ఏప్రియల్ 4, 2026)

         ప్రాచీన భారత ఇతిహాసాలలో కనిపించే రాజనీతి సూత్రాలు కేవలం ఆ కాలానికే పరిమితం కాలేదు. అవి నేటి సమాజానికి, ప్రభుత్వాలకు, సంస్థల నిర్వహణకు కూడా మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి. కణికుడు సూచించిన దండనీతి, నారదుడు వివరించిన ధర్మపాలన, ధౌమ్యుడు ఉపదేశించిన సేవాధర్మం, శ్రీరాముడు చెప్పిన రాజవ్యవస్థ, ఇవన్నీ కలిసి ఒక సమగ్ర పాలనా తత్వాన్ని ప్రతిపాదిస్తాయి. ఈ నాలుగు దృక్కోణాలు నాయకత్వంలో నిష్పక్షపాతం, జాగ్రత్త, నైతికత, బాధ్యత అనే మౌలిక సూత్రాలను ప్రతిపాదిస్తూ, నేటి కాలానికీ సహితం వందశాతం అన్వయిస్తాయి.

కురు సార్వభౌముడు దుర్యోధనుడి కోరికమేరకు, కణికుడు ఆయనకు ఉపదేశించిన రాజధర్మం మహాభారతంలో అత్యద్భుతమైన ఘట్టాలలో ఒకటి.  ప్రభువు అనేవాడు ప్రబలమైన అధికారం కలవాడై, తగిన దండనీతిని అవలంబించి, ప్రజలను ధర్మ మార్గాన నడిపించి, మంచి ప్రవర్తన కలవాడుగా వుండాలని, దండనీతిలో స్వపరభేదభావం లేకుండా సమబుద్ధితో వుండాలని చెప్పాడు. అలా చేస్తే, రాజు ఆజ్ఞానుసారం అన్ని జాతులవారు తమతమ జాతి ధర్మాలను ఉల్లంఘించక ప్రవర్తిస్తారని, ఉత్తమపాలనకు అధికార బలం ఒక్కటే చాలదనీ, నిష్పక్షపాతం, సత్ప్రవర్తనం, ప్రభుతకు పెద్ద బలాన్ని చేకూర్చే గుణాలని, ఇవికూడా ప్రభువుకు వుండాలని అన్నాడు.

ఫలానా పని చేయవచ్చా, చేయకూడదా అని ఆలోచించకుండా చెడునడవడి కలవాడైతే, తండ్రైనా, గురువైనా విడిచిపెట్టక ప్రభువు శిక్షించాలని అంటాడు. ఏ పనైనా బుద్ధిమంతులతో ముందుగా విచారించి చేస్తేనే ఆ పని చెడిపోకుండా వుంటుందని చెప్పాడు. ‘రాజైన వాడు మొదలు నేర్పుగాకాని, మెత్తగా కాని, భయంకరంగా కానీ, తనను తాను రక్షించుకోవాలి. తనకు ప్రమాదం లేకుండా చూసుకుని రాజధర్మాలు నడపాలి. తన లోపాలు ఇతరులు తెలుసుకోకుండా, ఇతరుల లోపాలను తాను తెలుసుకుంటూ, దేశకాల పరిస్థితులను ఎరిగి, మిత్రబలం కలవాడై, రాజు తన ధర్మాలను నిర్వర్తించాలి. శత్రువులను బలహీనులైనప్పుడే చంపడం రాజనీతి. శత్రువు బలం చేకూర్చుకున్న తరువాత జయించడం సాధ్యం కాదు’ అని చెప్పాడు.

రాజు తన పనులను గురించి, శత్రువుల పనులను గురించి, విసుగు లేకుండా దూతల ద్వారా తెలుసుకోవాలని, శత్రుదేశాల విషయాలను తెలుసుకోవడానికి పలువురు తెలివైన వేగులవారిని నియమించాలని, పలువిధాలైన ప్రదేశాలకు వెళ్లేటప్పుడు ప్రభువుకు ప్రమాదాలు కలగకుండా పరిశీలించి, ప్రమాదం కలిగించే వ్యక్తులు, ఆయుధాలు వుంటే తొలగించి, పరిశుద్ధంగా వుంచాలని అంటాడు. రాజైనవాడు తనకు ఫలానా వారు నమ్మదగినవారని, లేదా, నమ్మదగిన వారుకాదని అనకూడదు. ‘నిశ్చయ బుద్ధితో ఎవ్వరినీ నమ్మకుండా తన రక్షణ తానే ప్రధానంగా చూసుకోవాలి. ప్రభువు తనను తాను జాగ్రత్తగా రక్షించుకున్నట్లే, తన రహస్యాలోచనాన్ని కూడా రక్షించుకోవాలి. రహస్యాలోచన వెల్లడి కాకుండా రక్షించుకునే బలం వల్లే అన్ని పనులు ఫలవంతమౌతాయి. రహస్యాలోచన వెల్లడైతే పనులను ఫలవంతం కావించడం ఎవరి తరం కాదు’. అన్నాడు.

‘చెడు నడవడికల నీచులు చేతులు జోడిస్తారు. నమస్కారాలు చేస్తారు. ఇంపైన మాటలు మాట్లాడుతారు. కపటపు వినయాలు ప్రదర్శిస్తారు. దుర్మార్గుడు తనకు అనుకూలమయ్యేంతవరకు స్నేహితుడిలాగా నటించి, ఆ తరువాత, పాములాగా తన క్రూరకృత్యాలనే కోరలతో కరుస్తాడు. ఎక్కువ కోపం కానీ, స్నేహంకానీ, వాటి అనుభవ కాలానికే ఇతరులకు తెలియచేయాలి. అవసరమైనప్పుడు శత్రువును భుజం మీద ఎక్కించుకుని, సమయం రాగానే మట్టికుండను రాతిమీద కొట్టినట్లు నాశనం చేయాలి. లోగడ తనకు అపకారం చేసిన వారు తగ్గినా, ఆదరించకూడదు. ముళ్ళు చిన్నదే అయినా అది పాదంలో ఉంచకూడదు. అపకారాలు చేసేవాళ్ళను సామదానభేదోపాయాలతో నమ్మకం కలిగించి, ఆలస్యంకాకుండా మట్టుబెట్టాలి. ఏవిధంగానైనా రాజనీతితో శత్రువును హతమార్చాలి. అపకారాలు చేసేవారిని శత్రువులైనా, బంధువులైనా అశ్రద్ధ చేయకూడదు. ఆత్మరక్షణ అన్నింటికన్నా ప్రాధాన్యం.’

నేటి ప్రభుత్వ వ్యవస్థల్లోనూ, న్యాయ వ్యవస్థలోనూ ఇదే నిష్పక్షపాతం అత్యంత కీలకం. నేటి కార్పొరేట్ ప్రపంచంలోనూ, రాజకీయ రంగంలోనూ వ్యూహాత్మక ఆలోచన, సమాచార సేకరణ, సమయస్ఫూర్తి విజయానికి కీలకం. నేటి డిజిటల్ యుగంలో డేటా సెక్యూరిటీ, గోప్యత పరిరక్షణ కూడా ఇదే సూత్రానికి ఆధునిక రూపం.

మహాభారతంలోనే మరోఘట్టం నారదుడు ధర్మరాజుకు చెప్పిన రాజనీతి. ‘పూర్వీకులు ఏర్పరిచిన ధర్మపద్దతిని రాజు ఆచరించాలి. ధర్మాన్ని తెలుసుకుని, ధర్మార్థకామాలు ఒకదానికొకటి బాధించకుండ, కాలోచితాలుగా వాటిని విభజించి సేవించాలి. ధర్మం మీదనే మనస్సు నిలిపి, చేయాల్సిన రాజకార్యాలను స్వబుద్ధితో ఆలోచించాలి. ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరంగా యోగ్యులైన వారిని వారి-వారి శక్తి సామర్థ్యాలను గుర్తించి, గౌరవ భావంగా స్థిరంగా నియమించాలి. పుణ్యాత్ములను, శాస్త్ర నియమాలు బాగా తెలిసినవారిని, రాజుమీద ప్రేమ కలవారిని, తాతతండ్రుల నుండి వంశపారంపర్యంగా కొలువు చేస్తున్న వారిని, ఉత్తములను మంత్రులుగా ఏర్పరుచుకోవాలి. రాజుకు రహస్యాలోచనను ఇతరుల చెవిన పడకుండా జాగ్రత్త పడాలి. రాజు సలహాదారులు ధర్మాధర్మాలు తెలిసి, వివిధ శాస్త్రాలను అధ్యయనం చేసి, పక్షపాత బుద్ధి లేకుండా వుండాలి’ అన్నాడు నారదుడు.

‘యుద్ధాలలో విజయాన్ని సాధించడంలో నిపుణులైన వారిని, ఎదిరించనలవికాని పరాక్రమవంతులను,  విశ్వాసపాత్రులను, గౌరవానికి అర్హులైన వారిని, రాజు మేలు కోరే వారిని సైన్యాధ్యక్షులుగా నియమించాలి. పలుకుబడి కలిగి, క్రియాశీలియై, తన పరిమితిమీరి, ఇతరులతో చేతులు కలిపి, రాజుకు వ్యతిరేకంగా మంత్రి కార్యాలోచన చేయకుండా జాగ్రత్త పడాలి. అధికార పక్షంలో వుంటూ, ప్రయోజనాలు పొంది, బలపడి, దురాశా దురహంకారాలు పెంచుకుని, అన్యులతో చేతులు కలిపి, అధికార పక్షాన్ని బలహీనపరిచే వ్యతిరేక వర్గాన్ని సృష్టించే వెన్నుపోటుదారులంతా ఈ కోవకు చెందిన మంత్రులే. అలాంటి వారిని ఒక కంట కనిపెట్టి వుండడం మంచిదని’ నారదుడు ఆ కాలంలోనే హెచ్చరించాడు.

‘శాస్త్ర పాండిత్యం, స్వీయ ప్రతిభ కలిగిన, ఆస్థానజ్యోతిష్కులు భూకంపాలు, వానలు, వరదలు లాంటి ఉత్పాతాలను కనిపెట్టి విరుగుడు సూచించాలి. వైద్యులు సమర్థులై ప్రజలమీద ప్రేమతో సేవలు చేయాలి. మనోవ్యాధులకు, శారీరక వ్యాధులకు చికిత్స చేయగలగాలి. పన్నులు వసూలు చేయడం లాంటి ధనార్జన రూపక రాచకార్యాలలో పరిశుద్ధులైన వారిని, పాపరహితమైన చిత్తవృత్తి కలవారిని, నీతిమార్గంలో నడుచుకునేవారిని, రాగద్వేషరహితమైన సమబుద్ధితో వ్యవహరించేవారిని, నైపుణ్యం కలవారిని నియమించాలి. వ్యక్తుల యోగ్యతలకు అనుగుణంగా ఉన్నత, మాధ్యమిక, కింది స్థాయి ఉద్యోగాల్లో నియామకం జరగాలి. సేవకులందరికీ కొరతలేకుండా తగుజీతాలు సకాలంలో ఇవ్వాలి. రాజు కొరకు యుద్ధంలో మరణించిన వీర సైనికుల కుటుంబాలకు సరైన ఆర్ధిక సహాయం చేయాలి’ అన్నాడు నారదుడు.

‘లోభులను, దొంగలను, స్నేహానికి అయోగ్యులను, శత్రువుల పట్ల పక్షపాతం కలవారిని, ధైర్యంలేని వారిని, దుర్మార్గులను, రాజకార్యాలు నిర్వహించడానికి పంపకూడదు. ప్రభుత్వ ఉద్యోగులలో ముఖ్యులు ధనాశాపరులై, అవినీతిపరులు కాకుండా జాగ్రత్త పడాలి. (లంచగొండులైన ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రభువు ఎలా అప్రమత్తుడై ఉండాలో నారద మహర్షి అప్పుడే సూచించాడు). అనావృష్టి లేకుండా, ఎల్లప్పుడూ చెరువులు నిండి కళకళలాడాలి. ఉదారబుద్ధితో పేదరైతులకు ధాన్యపు విత్తనాలు, వర్తకులకు నూటికి రూపాయి మాత్రమే వడ్డీ చొప్పున ప్రభుత్వపరంగా అప్పులు లభించాలి. (నారద మహర్షి మాటలను బట్టి మహాభారత కాలంలోనే అధికాహారోత్పత్తికి విత్తనాలు, ఆర్థికాభివృద్ధికి తక్కువ వడ్డీతో రుణాలు ప్రభువులు ఇచ్చేవారని అర్థం చేసుకోవాలి). వికలాంగులను, అనాధలను దయతో పోషించాలి. మేలుచేసిన వ్యక్తులను ఉచితరీతిన సత్కరించాలి.’

‘ఆదాయంలో నాల్గవ భాగాన్ని లేదా మూడవ భాగాన్ని లేదా సగభాగాన్ని మాత్రమేఖర్చు చేయాలి కాని అంతకు మించి చేయకూడదు. ఆయుధ శాలలు, ధనాగారాలు, అశ్వశాలలు, గజశాలలు, కోశాగారాల లాంటి వాటి పాలనలో ఎంతో నమ్మదగిన వారిని, రాజుపట్ల భక్తి కలవారిని, సమర్థులైన వారిని, నియమించాలి. ప్రజలంతా రాజును ప్రశంసించే విధంగా గురువులను, వృద్ధులను, గొప్ప వ్యాపారులను, ఆశ్రితులను, సజ్జనులను, పేదరికం రాకుండా కాపాడాలి. మంత్రులు, సైన్యాధిపతులు, హితులు, రాకుమారులు, పండితులు, ఆసీనులై వుండగా ప్రతిదినం కొలువు తీరాలి. సమర్థులైన గూఢచారులను నియమించుకోవాలి. ఎదుటివారి ఎత్తుగడలను తెలుసుకోవాలి. ఆత్మరక్షణకు, శత్రు శిక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.’

నారద మహర్షి ధర్మరాజుకు చెప్పిన రాజనీతిలో ధర్మాన్ని ఆధారంగా చేసుకుని, కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించాడు. సరైన వ్యక్తులను సరైన స్థానాల్లో నియమించడం, నిష్పక్షపాత సలహాదారులను ఎన్నుకోవడం, మంచి పాలనకు ఆధారం. నేటి ప్రభుత్వాల్లోనూ, సంస్థల్లోనూ మెరిట్ ఆధారంగా నియామకాలు, పారదర్శకత ఎంతో అవసరం. యుద్ధంలో మరణించిన సైనికుల కుటుంబాలను ఆదుకోవాలని నారదుడు సూచించడం, నేటి పెన్షన్ విధానాలకు పూర్వగామిగా కనిపిస్తుంది. రైతులకు విత్తనాలు, వ్యాపారులకు తక్కువ వడ్డీ రుణాలు ఇవ్వాలని చెప్పడం, ఆధునిక సంక్షేమ పథకాలతో పోల్చదగినది. వార్తా నిర్వహణపై నారదుడు చెప్పిన మాటలు నేటి మీడియా, కమ్యూనికేషన్ వ్యవస్థలకు కూడా వర్తిస్తాయి. సరైన సమాచారం సమయానికి ప్రజలకు చేరకపోతే, ప్రభుత్వం-ప్రజల మధ్య దూరం పెరుగుతుంది. ఫేక్ న్యూస్, అపోహలు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే సమాచార వ్యవస్థ బలంగా ఉండాలి.

మహాభారతం మరో సందర్భంలో, ధౌమ్యుడు చెప్పిన సామాన్య సేవానియమావళి సహితం ఇదే పద్ధతిలో కొనసాగింది. ధౌమ్యుడు పాండవులకు చెప్పిన సేవాధర్మాలు, బహుశా నాటి నుండి నేటి వరకు ఒకరి దగ్గర కొలువు (ఉద్యోగం) చేసే ఎవరికైనా ఆచరణ యోగ్యాలే. వాటిని అందరూ విధిగా తెలుసుకోవాల్సిందే, ఆచరణలో పెట్టాల్సిందే!!! అలా చేస్తే, కొలువు చేస్తున్న ప్రతివారికీ సర్వదా శ్రేయస్కరం. ధౌమ్యుడి మాటల్లోనే ఆ వివరాలు:

         “రాజులను (ఆధునిక యజమాని, లేదా బాస్) సేవించి జీవించేవాడు చాలా జాగ్రత్తగా వుండాలి. తగిన పద్ధతిలో సభలో (పని చేసే చోటులో) అడుగు పెట్టాలి. తన స్థానానికి తగిన ఆసనంలో కూర్చోవాలి. తన వేషధారణ, ఆకారం వికృతంగా వుండకూడదు. సమయం, సందర్భం తెలుసుకుని మసలుకుంటే, రాజుకు (యజమాని లేదా బాస్) గౌరవపాత్రుడు అవుతాడు. ‘నేను రాజు కొలువులో వున్నాను, రాజుతో చనువుగా వున్నాను, నాకేమిటి’ అని మర్యాదను అతిక్రమించ కూడదు. రాజు ఇంటికన్నా అందంగా ఇల్లు కట్టుకోకూడదు. సేవకులు రాజు కంటే ఏ విషయంలోనూ అధికులుగా వుండకూడదు. రాజు (బాస్) తో సన్నిహితంగా ఉండడంలో తప్పులేదు కాని, రాజుగారి దగ్గర వుండే చాలామందికి కష్టం కలిగించే పనుల్లో మాత్రం జోక్యం చేసుకోకూడదు. అలా చేస్తే సేవకుడి (ఉద్యోగి) శక్తి బహిర్గతం కావచ్చును కాని, ఆ తరువాత హాని కలగడం మాత్రం తధ్యం”.

“రాజు దగ్గర మౌనంగా వుండకూడదు. అలా అని చెప్పి, పదిమందితో ఆర్భాటంగా మాట్లాడడం మంచిది కాదు. తనకు దగ్గరి వారైన ఇతరులతో కలిసి తాను రాజుతో మాట్లాడడం ఉత్తమం. రాజుగారి కొలువులో (ఆధునిక పరిభాషలో, యజమాని కార్యాలయంలో) రాజుకు మరీ ఎట్ట ఎదురుగా వుండకూడదు. అలాగని, మరీ వెనుకగా కూర్చోకూడదు. ఏదో ఒక పక్కన నిలబడి (వీలున్నంత సేపు) సేవించాలి. రాజు ముఖం మీదనే దృష్టి సారించి సభలో మెలగాలి. కార్యాలయంలో మాటలు ఎప్పటికీ, ఎక్కడా బయట పెట్టకూడదు. బయట ఎక్కడైనా రాజుకు సంబంధించిన మాటలు వింటే, అవి వినదగినవైతేనే రాజుకు చెప్పాలి. చెప్పేటప్పుడు సేవకుడు కొంత విచక్షణ చూపాలి. విన్న మాటల్లో నిజానిజాలు తెల్సుకోవాలి. రాజుకు అనవసరమైన విషయం అసలే చెప్పరాదు. రాజుకు అప్రియమైన విషయం ఎప్పుడూ చెప్పకూడదు”.

“రాజు అనుగ్రహిస్తేనే ఆసనాలు ఎక్కాలి (కుర్చీమీద కూర్చోవాలి). అలాగే వాహనాలు కూడా. రాజు అనుగ్రహించకుండా, రాజానుగ్రహం లేకుండా, శ్రేష్టమైన ఆసనాలు, పెద్ద పెద్ద వాహనాలు తమంతట తాము అధిరోహించడం తప్పు. రాజు (బాస్) తనను గౌరవించాడని ఉబ్బిపోకూడదు. అవమానించాడని కుంగిపోకూడదు. ఆ రెంటినీ లెక్కించకుండా ఎప్పటిలాగే రాజు దగ్గర పనిచేస్తే సేవకులకు మంచి జరుగుతుంది. ఆపదలు తొలగిపోతాయి. రాజు ఎవరినైనా రక్షించాలని కాని, శిక్షించాలని కాని నిర్ణయిస్తే, అ అవిషయాలు సేవకుడికి తెల్సినా, అవి అమలు కాకముందే బయట పెట్టకూడదు. రాజుకు (బాస్) దగ్గరగా మెలిగే ఏనుగుతో కాని, దోమతో కాని, వైరం కలిగే విధంగా ప్రవర్తించ కూడదు”.

రామాయణంలో, భరతుడికి శ్రీరాముడు బోధించిన రాజధర్మంలో ప్రదామైనది: మంత్రి, పురోహితుడు, యువరాజు, సేనాపతి, దౌవారికుడు లేదా ద్వారపాలకుడు, అంతర్వంశికుడు లేదా అంతఃపుర కార్యనిర్వాహకుడు, కారాగారాధిపతి, అర్థసంచయికుడు (ధనం సంపాదించేవాడు), కార్యనియోజకుడు, ప్రాడ్వివాకుడు (న్యాయమూర్తి), సేనానాయకుడు, నగరాధ్యక్షుడు, కర్మాంతికుడు (ప్రభుత్వ పద్దుల అధిపతి), ప్రతిరోజూ సభను అలంకరించే సభ్యుడు, ధర్మాధ్యక్షుడు, దండపాణి లేదా దండపాలుడు, దుర్గపాలుడు, రాష్ట్రంతపాలుడు, అనే 18 మంది  తీర్థుల నియామకం.

ధౌమ్యుడు చెప్పిన సామాన్య సేవానియమావాలి, ధర్మరాజుకు నారద మహర్షి చెప్పిన రాజనీతి విషయాలు, ఇన్ని వందల, వేల సంవత్సరాల తరువాత కూడా ఆచరణీయం. అలాగే శ్రీరాముడు తమ్ముడికి తెలియచేసిన రాజధర్మాలు, సత్త్వశుద్ధి, ఎల్లప్పుడూ, ధర్మపాలనకు, ప్రభు క్షేమానికి, ప్రజా క్షేమానికి విశేషంగా దోహదపడుతుంది. కణికుడు, నారదుడు, ధౌమ్యుడు, శ్రీరాముడు ప్రతిపాదించిన రాజనీతి సూత్రాలు సమగ్రంగా పరిశీలిస్తే, అవి కేవలం రాజులకు మాత్రమే కాకుండా నేటి రాజకీయ నాయకులకు, పరిపాలకులకు, ఉద్యోగులకు, ప్రతి వ్యక్తికీ మార్గదర్శకాలు.

నైతికత, జాగ్రత్త, బాధ్యత, సమన్వయం అనే నాలుగు మూల సూత్రాలు ఈ ఉపదేశాల సారం. మొత్తంగా చూస్తే, ప్రాచీన రాజనీతి కేవలం చరిత్ర కాదు. అది నేటి సమాజానికి కూడా దిశానిర్దేశం చేసే జీవంతమైన తత్వం. ఆధునిక సాంకేతికత, వేగవంతమైన జీవనశైలిలోనూ ఈ సూత్రాలను అనుసరించగలిగితే, సమాజంలో న్యాయం, శాంతి, అభివృద్ధి మరింత బలపడతాయి. పాత జ్ఞానం, కొత్త కాలానికి అన్వయించినప్పుడు మాత్రమే నిజమైన ప్రగతి సాధ్యమవుతుంది.

Friday, April 3, 2026

Cabling the Nation: Untold Story of Indian Cable TV (When Idea Preceded Its Time) >>>>> Seventh Friday Get-Together at Press Club: April 3, 2026 >>>>> Vanam Jwala Narasimha Rao

 Cabling the Nation: Untold Story of Indian Cable TV

(When Idea Preceded Its Time)

Seventh Friday Get-Together at Press Club: April 3, 2026

Vanam Jwala Narasimha Rao

Sunday Pioneer (April 5, 2026)

The seventh uninterrupted Friday evening get-together of a few willing, like-minded members at the Press Club Hyderabad on April 3, 2026, turned into an absorbing recollection of the untold beginnings of ‘Cable Television in India’ narrated not as history written in hindsight, but as lived experience marked by persistence, setbacks, and an almost improbable chain of human connections. What stood out that evening was not merely continuity, but the emergence of this unexpected narrative, one that had remained for decades in the backdrop of India’s Technological Transformation.

In tune with the steady practice the members have adopted since initiating this weekly journey, the meet did not announce itself with formality, nor did it attempt to outgrow the quiet rhythm that has become its identity. It simply continued, regardless of numbers, yet ensuring excellence, adding another layer to an evolving tradition where memory, experience, and reflection meet without pretence.

Present at the table were: Bhandaru Srinivasa Rao, GK Murthy, and myself, joined briefly by BS Ramakrishna and Press Club Secretary Ramesh. Into this circle entered KD Prasad, a Chartered Accountant by profession, as a guest for the evening. As the conversation unfolded, it became evident that his journey extended far beyond the boundaries of his discipline.

Incidentally, though our contribution to his efforts was negligible, it gave both me and Bhandaru Srinivasa Rao an opportunity to reminisce a few aspects, having, in a small way, travelled alongside parts of his (plus late Kuppuswamy) journey. Prasad’s narrative did not begin with success, nor did it end in triumph. Yet, true to the spirit of Rudyard Kipling’s IF, treating ‘Triumph and Disaster’ as two impostors, he lived through his journey with remarkable balance.

From the way he narrated, it was evident that Prasad maintained emotional equilibrium, viewing success and failure alike as temporary states, capable of misleading one into either arrogance or despair. His journey began with a keen observation, an accidental encounter in Coimbatore, where his friend GKD, using simple antenna on the terrace, managed to receive overseas television signals. What might have remained mere curiosity for many became, for Prasad, a possibility.

From that possibility grew a relentless pursuit: to make Cable Television accessible and affordable to a wider population in India, long before the system found formal recognition. What followed was not a linear journey, but a prolonged engagement with systems not yet ready to comprehend, let alone approve, what he envisioned. From the early 1980s to the mid-1990s, his efforts took him across corridors of power, meeting bureaucrats, technocrats, political leaders, and policymakers at every level, from legislators to Union Ministers, and even reaching the Prime Minister’s Office more than once.

The idea itself appeared simple. The process, however, was anything but. At the time, cable television fell into an administrative vacuum, requiring the concurrence of multiple government departments, none fully prepared to take ownership. Files moved back and forth, paused, returned, and often stagnated. At one stage, the proposal for a licensing system was not merely delayed but resisted, dismissed as impractical or premature, and even termed ‘Illegal.’

Yet, what gave the narrative its depth was not bureaucratic resistance alone, but the human encounters that punctuated the journey. One such moment, recounted with quiet emphasis, captured the unpredictability that often shapes outcomes. During one of his many trips to Delhi, after a week of unsuccessful attempts to secure an appointment with the concerned Union Minister, Prasad prepared to return, resigned, but not defeated. It was then, in the early hours of an ordinary night, as he was preparing to sleep, that an unintended knock on his door brought into his life a stranger who would remain a friend.

The man, as described by Prasad, was hefty, tall, and striking in appearance, with a friendly demeanour. Having mistakenly knocked on the door, assuming the room was his, he did not leave immediately after realizing the error. Instead, he paused, engaged in conversation, and, upon learning of Prasad’s efforts, offered help without being asked. Introducing himself as Tony, a Member of the Legislative Assembly from Bihar, he urged Prasad to postpone his departure. What followed was an intervention as unexpected as it was effective.

Through this chance meeting, doors that had remained closed opened with surprising ease. The Minister not only granted time but initiated movement on the long-pending proposal, even hosting them for breakfast. The story, however, did not transform into immediate success. Committees were formed, discussions initiated, yet decisions remained deferred. Governments changed, priorities shifted, and the same bureaucratic hurdles resurfaced in different forms. Still, the effort did not cease.

At another juncture, during the tenure of Prime Minister PV Narasimha Rao, the matter resurfaced at the highest level, facilitated by Prasad’s acquaintance with a close relative of the Prime Minister during morning walks. When informed that cable systems were being treated as ‘Illegal’ in the absence of licensing, the Prime Minister, according to Prasad, responded with characteristic directness, questioning the inconsistency between policy and practice.

Astonishingly, what followed was not the introduction of a structured licensing regime, as Prasad had long pursued, but a decision aligned with the broader economic reforms of the time: de-licensing. The outcome was paradoxical. The system was allowed to proliferate, but without the very framework Prasad had worked to establish. In his own understated summation, it was an instance of ‘Operation Successful, Patient Died.’ The vision materialized, but not in the manner he had intended.

For a brief period, like many others, Prasad participated in the emerging cable network ecosystem, laying cables and experimenting with distribution, before stepping away, recognizing the divergence between expectation and reality. Yet, the narrative did not carry disappointment as its dominant tone. Instead, it revealed something more enduring: the value of effort, the unpredictability of outcomes, and the role of individuals, often unknown, often incidental, in shaping larger developments.

As the evening progressed, it became evident that this was not merely a story about Cable Television. It was about initiative that precedes recognition, about ideas that exist before systems are ready for them, and about persistence that does not depend on immediate validation. In a quiet, almost personal aside, one more thread emerged, one that belonged not to public history, but to private memory.

Nearly forty years ago, on a rainy day, Prasad and I first met, not through formal introduction, but through circumstance. Waiting separately for an auto-rickshaw, we found ourselves stepping into the same vehicle when one finally arrived. It moved before either of us could clarify our destinations, only for us to discover, in that small shared space, that we were headed along the same route. What began as coincidence turned into acquaintance, and over time into a familiarity that would, decades later, find itself revisited in this very setting.

Such moments, seemingly incidental, acquire meaning only in retrospect. They remind us that not all beginnings announce themselves, and not all connections reveal their significance immediately. If earlier Friday meetings established a pattern of recollection, reflection, and documentation, the seventh gathering added a distinct dimension, the recovery of narratives that history records only partially, if at all. Not every contribution to public life finds its place in formal archives. Many remain embedded in personal journeys, waiting for the right moment, and the right audience, to be told.

These Friday evenings are evolving into a quiet forum where stories are remembered, not performed, and effort is valued despite uneven outcomes. Through conversation, individuals reclaim their place in larger narratives. The rhythm continues: Meet, Reflect, Document, and now enriched by a deeper call: Unearth, Revisit, Recognize, for what lingers in the backdrop is often unrecorded presence awaiting light.

Wednesday, April 1, 2026

శ్రీరాముడి ప్రయాణ పథం, ప్రాణ భయంలేని పరిణామవాదం >>>>> ఆత్మపరిశీలనలో ధర్మం, కార్యరూపంలో ధర్మం : వనం జ్వాలా నరసింహారావు

 ‘ఒంటిమిట్టలో ఈ రోజున శ్రీ సీతారాముల కల్యాణం సందర్భంగా’

శ్రీరాముడి ప్రయాణ పథం, ప్రాణ భయంలేని పరిణామవాదం

ఆత్మపరిశీలనలో ధర్మం, కార్యరూపంలో ధర్మం

వనం జ్వాలా నరసింహారావు

(ఏప్రియల్ 1, 2026) 

{{ఈ రోజున కడప జిల్లా (ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం) ‘ఒంటిమిట్ట మిధిలానగరం’ కళ్యాణ మండపంలో నేత్రపర్వంగా జరిగిన శ్రీసీతారాముల కల్యాణాన్ని టీవీలో వీక్షించిన సందర్భంలో, ఎదురుకోలు దగ్గరనుండి, అక్షింతల కార్యక్రమం పూర్తయ్యేదాకా, ఆ తరువాత ఆరంభం నుండి చివరదాకా అక్కడే సతీసమేతంగా (మనుమడితో సహా) వున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని బ్రాహ్మణులు ఆశీర్వచనం పలికేదాకా, చివరగా సందర్భోచితంగా ముఖ్యమంత్రి మాట్లాడిన విధానం చూసిన తరువాత, ఇటీవల భద్రాచలంలో జరిగిన శ్రీసీతారాముల (రామనారాయణ, లక్ష్మీదేవి) కల్యాణ తంతు ఆద్యంతం పోల్చుకోకుండా వుండలేకపోయాను.

అశేష జనవాహిని తదేకంగా వీక్షిస్తుండగా, ఆద్యంతం కొట్టవచ్చినట్లు కనిపించిన ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ, విశిష్ట వశిష్టుల సమయోచిత వాక్చాతుర్యం, వీలున్నప్పుడల్లా స్థల పురాణం క్లుప్తంగా విశదీకరిస్తూ, ఆంధ్రవాల్మీకి (వావిలికొలను సుబ్బారావు) వాసుదాసుగారిని గుర్తుచేసుకున్న విధానం, ఆయన పక్షాన శ్రీసీతారాములకు పట్టు వస్త్రాల సమర్పణ....ఇలా ఎన్నో, ఎన్నెన్నో ఆకట్టుకునే విధంగా వున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా శ్రీరాముడి వశిష్ట గోత్రం, తదనుగుణంగా చెప్పిన ప్రవర, అదే విధంగా సీతమ్మవారి గౌతమి గోత్రం, తదనుగుణంగా ప్రవర చెప్పడం గొప్ప విశేషంగా భావించాలి.

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుండి, ఏపీ దేవదాయ మంత్రి రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి, అదనపు కార్యనిర్వహణాధికారి, అర్చక మహాశయులు అందరికీ అభినందనలు. ఆసాంతం శ్రీసీతారాముల కల్యాణం వీక్షించిన తరువాత వావిలికొలను సుబ్బారావు రావు గారు, ఆంధ్రవాల్మీకి రామాయణం, అయోధ్య కాండ మందరం చివర్లో అద్భుతంగా వర్ణించిన శ్రీరాముడి దినచర్య శ్రీరామభక్తులతో పంచుకోవాలనిపించింది. అందుకే ఇది పోస్టు చేస్తున్నాను)  

‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్; ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’ అని భగవద్గీత శ్లోకాన్ని ఆంధ్రవాల్మీకి, కవిసార్వభౌమ వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు) శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం మందరం, అయోధ్య కాండ చివర్లో పేర్కొంటూ, శ్రీరాముడి దినచర్య గురించి ఎందరికో తెలియని ఎన్నో విషయాలను సోదాహరణంగా, సందర్భోచితంగా వివరించారు. 

సాధువులను రక్షించడానికి, పాపాత్ములను నాశనం చేయడానికి, ధర్మ స్థాపనకు, ప్రతియుగంలో శ్రీమన్నారాయణుడు భూమ్మీద అవతరిస్తుంటాడు. ప్రతి కల్పంలో వచ్చిన అవతారాలే మళ్లీ వస్తుంటాయి. కాబట్టి ప్రతి కల్పంలో (బ్రహ్మకు ఒక రాత్రి, పగలు కలిపి) పది ప్రధాన అవతారాలే కాకుండా కొన్ని గౌణావతారాలు కూడా సంభవిస్తుంటాయి. ఈ అవతారాలే పునరావృతమవడం వల్ల, ఇప్పటికి ఎన్ని మత్స్యావతారాలు, నృసింహావతారాలు, శ్రీరామావతారాలు, కృష్ణావతారాలు అయ్యాయో చెప్పడం కష్టం. అవతారాలు వచ్చినప్పుడల్లా వారితో పాటే హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, బలిచక్రవర్తి, రావణ, కుంభకర్ణులు,  కంస, శిశుపాలులు లాంటి వారు కూడా రావాలికదా? వారు వచ్చినప్పుడు వారి సహాయకులు, సహచరులు, తల్లిదండ్రులు, అవతార పురుషుడికి కావాల్సినవారు రావాలి కదా? అలాంటప్పుడు పరిణామవాదం తప్పవుతుంది కదా? అలాగే ముక్తి, జన్మరాహిత్యం అనే పదాలు వ్యర్తమైనవే కదా?

         దీనికి పరిహారం అవసరం. అవతారాలు రావడం నిజమే. వారికి కావాల్సినవారు, విరోధులు రావడం కూడా నిజమే. బ్రహ్మేంద్రాదులు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, సప్తర్షులు, ఇలా అందరూ పుట్టడం కూడా యదార్థమే. అయినా పరిణామ వాదం తప్పుకాదు. ముక్తి అనేది వ్యర్థపదం కానేకాదు. బ్రహ్మ, రుద్ర, అగ్ని, వరుణుడు లాంటి పదాలన్నీ ఆయా పదవుల పేర్లే కాని ఆ ఉపాధిలో వుండే జీవాత్మల పేర్లు కావు. ఆడిన ఆటే ఆడాలి. పాడిన పాటే పాడాలి. అంతమాత్రాన పరిణామవాదం తప్పడానికి వీలులేదు. ముక్తి అనేది వ్యర్థ పదార్ధం కానేకాదు. కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ అనే పదవుల్లో వుండేవారు మారుతూ వున్నారంటే, కొత్తవారికి అవకాశం ఉన్నట్లే కదా.

అలాగే బ్రహ్మ, రుద్ర, అగ్ని, వరుణుడు, ఇతర దేవతల పదవుల్లో వున్నవారు పోగానే, ఆ స్థానం ఖాళీ కాగానే, మరో అర్హుడు ఆ స్థానంలో నియమించబడుతాడు. వాడి ఉద్యోగం వీడు చేస్తాడు. ఇలా వచ్చేవాడు భిన్న జీవుడే కాని ఇంతకు ముందు వున్నవాడు కాదు. కాబట్టి పరిణామ వాదానికి ప్రాణ భయం లేదు. ముక్తుడికి పునర్జన్మ భయం లేదు. పరిణామక్రమంలో నడిమధ్యలో తెంపులు లేవు. ఒక స్థానంలో రెండు జీవులుండవు. పరిణామం అంకెల లాంటిది. ఒకటి అనే అంకెను తెలిపేది ఒకటే అవుతుంది కాని రెండు అంకె కాదు కదా! అందువల్ల, జీవయాత్రా విషయంలో పరిణామమే సరైన మార్గం. లోకంలో వున్న వ్యత్స్యాలన్నిటికీ సరైన సమాధానం చెప్పేది కూడా పరిణామమే.

         బ్రహ్మాండకోటులు అనంతం. జీవకోటులూ అనంతమే. ప్రపంచం నిత్యం. సంసారం నిత్యం. కాలం నిత్యం. నది ఒడ్డున నిలుచుని చూస్తుంటే నీళ్లు, నీటి బిందువులు దాటిపోతూనే వుంటాయి. వాటి స్థానంలో మరికొన్ని వస్తాయి. ఒక నీటి బిందువు సముద్రంలో ప్రవేశించగానే ఆద్యంతాలలో శూన్య స్థానం లేనట్లే, జీవుడు ముక్తుడు కాగానే ఆ స్థానంలో కాని, ఆదిలో కాని, శూన్యం వుండదు. కాబట్టి, ఆస్తంబ బ్రహ్మ పర్యంతం, అంటే గడ్డిపోచ లేదా స్తంభం నుండి బ్రహ్మ దేవుని వరకు, బ్రహ్మ జన్మ దివసం మొదలు లయ దినం దాకా, ఎంతైతే చర్య జరుగుతుందో, ఆ తరువాత వచ్చే బ్రహ్మల కాలంలో అంతే చర్య, అట్లాగే, కాకపోతే, ఇసుమంత భేదంతో జరుగుతుంది. ఇది సృష్టిలోని అత్యల్ప జీవి నుండి అత్యున్నత జీవి వరకు ఉన్న సమస్త చరాచర సృష్టిని సూచిస్తుంది. సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మ స్వరూపాన్ని తెలియ చేస్తుంది.

         శ్రీరామవతారం వైవస్వత మన్వంతరంలో ఐదవ మహాయుగమైన త్రేతాయుగంలో సంభవించింది. కృతయుగానికి 1728000 సంవత్సరాలు, త్రేతాయుగానికి 1296000 సంవత్సరాలు, ద్వాపరయుగానికి 864000 సంవత్సరాలు, కలియుగానికి 387000 సంవత్సరాలు కలిపి మొత్తం ఒక మహాయుగానికి 4275000 సంవత్సరాలు వుంటాయి. ఇలాంటి వేయి మహాయుగాలు బ్రహ్మకు ఒక పగలు, మరో వేయి మహాయుగాలు ఒక రాత్రి అవుతుంది. ఇవి రెండూ కలిస్తే ఒక రోజవుతుంది. దాన్నే కల్పం అంటారు. 360 కల్పాలు బ్రహ్మకు ఒక సంవత్సరం. 36000 కల్పాలు బ్రహ్మాయువు.

         త్రిమూర్తులలో అవతారాలు విష్ణువుకే కాని మిగతా ఇద్దరికీ లేవు. విష్ణువు రాజసుడైన బ్రహ్మను సృష్టికార్యానికి, తామసుడైన శివుడిని సంహారకార్యానికి నియమించి, రక్షాభారాన్ని తనమీద వేసుకుని, దానికి అవసరమైన విధంగా ప్రవర్తిస్తాడు. దీనికి శాస్త్రీయ, సామాజిక హేతుబద్ధత లేకపోలేదు. శ్రమ పడితే బిడ్డలు పుట్టుతారు. వారిని చంపడం కష్టమేమే కాదు. రక్షణ కలిగించడం మాత్రం సులభం కాదు. దానికొరకు ఎన్ని వేషాలో వేయాలి. సర్వకాల సర్వావస్థలయందు బిడ్డలను కనిపెట్టుకుని, వారి యోగ క్షేమాలను విచారిస్తూ, వారిని సన్మార్గంలో నడపడం తేలిక విషయం కాదు. కాబట్టే విష్ణువు ఆ బాధ్యత తీసుకున్నాడు. ఆ క్రమంలోనే మనిషి రూపంలో త్రేతాయుగంలో, రామావతారంగా జన్మించాడు.

         శ్రీరాముడి జనన కాలంలో గురువు, చంద్రుడు, కర్కాటక లగ్నంలో వున్నారు. అంటే జన్మ లగ్నం కర్కాటకం. మేషంలో రవి, బుధులు, తులలో శని, మకరంలో కుజుడు, మీనంలో శుక్రుడు వున్నారు. చక్రాకార సంవత్సరాలు, కాల పరిమాణాలకు అనుగుణంగా, సంవత్సరాలను గ్రహాల గమనాలతో అనుసంధానించేందుకు ఉపయుక్తంగా, గ్రహాల స్థానాలను నిర్ణయించే సాంప్రదాయ జ్యోతిష గ్రంథం, కాల ప్రకాశిక ఆధారంగా, ప్రమాధి సంవత్సరంలో ధనస్సులో గురువు, కుంభంలో శని ఉంటారు. ఖరనామ సంవత్సరంలో ధనస్సులో గురువు, కర్కాటంలో శని వుంటారు. శోభకృతునామ సంవత్సరంలో ధనస్సులో గురువు, శని ఇద్దరు వుంటారు. రాక్షసనామ సంవత్సరంలో ధనస్సులో గురువు, మేషంలో శని వుంటారు. ప్రభవనామ సంవత్సరంలో ధనస్సులో గురువు, కన్యలో శని వుంటారు. ఖరనామ సంవత్సరంలో ధనస్సులో గురువు వుంటే, ఆయన కర్కాటకానికి రావడానికి ఎనిమిది సంవత్సరాలు పడుతుంది.

ఖరకు ఎనిమిదవది విలంబినామ సంవత్సరం. శ్రీరాముడి జననకాలంలో గురువు కర్కాటకంలో, శని తులలో, ఉన్నందున ఆయన పుట్టిన సంవత్సరం విలంబి. నక్షత్రం పునర్వసువు. ఇది నిర్ధారించడానికి శ్రీమద్రామాయణంలో ఇదామిద్ధమైన ఆధారాలు లేవు. శ్రీరంగమహాత్మ్యం అనే గ్రంథంలో భగవంతుడు బ్రహ్మకు చెప్పిన మాటల ఆధారంగా కొంత తెలుస్తున్నది. తాను రఘువంశం వారు పాలించే అయోధ్యకు పోవాలని అనుకుంటున్నాననీ, అక్కడ నాలుగు మహాయుగాలుంటాననీ, ఆ తరువాత కావేరీ తీరానికి పోయి చంద్ర పుష్కరిణీ తీరంలో శయనిస్తాననీ చెప్పాడు బ్రహ్మతో. విష్ణువు ఆజ్ఞానుసారం బ్రహ్మ తాను అర్చిస్తున్న శ్రీరంగధామాన్ని ఇక్ష్వాకు మహారాజుకు ఇచ్చాడు. ఆయన ఫాల్గుణమాసం, శుక్లపక్షం, పౌర్ణమినాడు, ఫల్గుణీ నక్షత్రాన, కుమారులు, మనుమలతో, సంబరాలు జరుపుకున్నాడు. నాలుగు మహాయుగాలు గడిచాయలా.

         తదనంతరం జరిగిన పరిణామంలో, ఐదవ త్రేతాయుగంలో కొడుకులకై దశరథుడు అశ్వమేధ యాగాన్ని చేశాడు. ఆ యుగంలోనే శ్రీరామ జననం అయింది. జన్మించింది విలంబినామ సంవత్సరం కాబట్టి హేవిలంబిలో అశ్వమేధయాగం, పుత్రకామేష్టి చేశాడు. దుర్ముఖి చైత్రమాసంలో అశ్వం విడిచారు. బిడ్డలు లేరని దశరథుడు విచారపడ్డది మన్మథనామ సంవత్సరంలో. పునర్వసువు నక్షత్రంలో బుధవారం నాడు శ్రీరామజననం. భరతుడు గురువారం పుష్యా నక్షత్రంలోను, లక్ష్మణ, శత్రుఘ్నులు శుక్రవారం ఆశ్లేషా నక్షత్రంలోనూ జన్మించారు. చైత్ర బహుళ పంచమి సోమవారంనాడు నామకరణం జరిగింది. పరాభవ సంవత్సరంలో తొమ్మిదో ఏట ఉపనయనం జరిగింది.

         ఇక్కడ మరొక్క విషయం చెప్పుకోవాలి. దశరథుడు కైకేయి పక్షపాతి అంటారు. కైకేయికి కౌసల్యమీద విరోధ భావం. ఆమెకు వివాహ కాలంలో దశరథుడు చేసిన వాగ్దానం గుర్తుకొచ్చినప్పుడల్లా, తన భర్త రాముడికి ఉపనయనం చేయడేమోనన్న కించిత్ అనుమానం కౌసల్యకు వుండేది. రాముడికి ఉపనయనం అయిన తరువాత ఆమెకు ధైర్యం కలిగింది. అరణ్యవాసానికి పోయేటప్పుడు శ్రీరాముడికి 25 సంవత్సరాలు కాగా, సీతాదేవికి 18 సంవత్సరాలు. శ్రీరాముడికి 12 ఏళ్ల వయసున్నప్పుడు, సౌమ్యనామ సంవత్సరంలో యాగరక్షణ కొరకు విశ్వామిత్రుడి వెంట అరణ్యాలకు పోయాడు. ఈ విషయం మారీచుడు రావణాసురుడితో సీతాపహరణం ముందర చెప్పినట్లు రామాయణంలో వుంది. దశరథుడు విశ్వామిత్రుడికి చెప్పిన మాటలనే మారీచుడు రావణుడికి చెప్పాడు.

శ్రీరాముడికి 12 సంవత్సరాల వయసున్నప్పుడు, సీతకు ఆరేళ్ళ వయసులో వారి వివాహం జరిగింది. దీనికి దృష్టాంతరంగా విశ్వామిత్రుడి యాగం కాపాడడానికి రామలక్ష్మణులు వెళ్లిన రోజు నుంచి మిథిలా నగరం వెళ్లడం వరకు తీసుకోవచ్చు. సౌమ్యనామ సంవత్సరం మాఖ బహుళంలో శ్రీరామలక్ష్మణులు విశ్వామిత్రుడి వెంట పోయారు. మొదటి రోజున సరయూనది తీరంలో, మర్నాడు గంగా సరయూ సంగమ దర్శనం, మూడవ రోజున తాటక వధ, నాలగవ రోజున అస్త్రాలు గ్రహించడం, సిద్ధాశ్రమం చేరుకోవడం జరిగింది. ఐదవ రోజున విశ్వామిత్రుడి మౌన దీక్ష, యాగారంభం. ఆ తరువాత ఆరు రోజులు యాగరక్షణ, పడవ రోజున సుబాహు వధ జరిగింది. ఆ రాత్రి సిద్దాశ్రమంలోనే వుండి, మర్నాడు విశ్వామిత్రుడితో కలిసి రామలక్ష్మణులు ప్రయాణం సాగించారు. 

11వ రోజున తన కథనాన్ని వినిపించాడు విశ్వామిత్రుడు. మర్నాడు గంగావతరణం వివరణ. 13వ రోజున విశాల నగర ప్రవేశం, మర్నాడు అహల్యా శాప విమోచనం జరిగాయి. 15 వ నాటి ఉదయం మిథిలా ప్రవేశం చేసి, శివ ధనుర్భంగం చేశాడు. 26వ రోజున గోదానం జరిపించారు రాముడితో. 27 వ రోజున శుక్ల త్రయోదశి శుభ దినం కాబట్టి, ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో సీతారాముల కల్యాణం జరిగింది. ఉత్తర ఫల్గుణీ నక్షత్రం శ్రీరాముడి జన్మ నక్షత్రానికి ఆరవది. వివాహ తంతు మొత్తం ఐదు రోజులు జరిగింది.

27 వ రోజు ఫాల్గున శుద్ధ త్రయోదశి అయితే, అయోధ్య నుండి బయల్దేరిన రోజు మాఘబహుళ విదియ కావాలి. విదియ, హస్తా రోజు ప్రయాణానికి మంచి రోజే. అది శ్రీరాముడికి ధృవతార కూడా అవుతుంది. కాబట్టి ఆ రోజున హస్త పోయిన తరువాత అభిజిల్లగ్నంలో ప్రయాణమై వుండాలి. సీతారాముల కళ్యాణమైన తరువాత, అంటే, బహుళ విదియతో ముగిసి, తదియనాడు జనకుడు బిడ్డలకు అరణాలిచ్సిన తరువాత, చవితినాడు అప్పగింతలై, ఫాల్గుణ బహుళ పంచమి నాడు అయోధ్యకు ప్రయాణమయ్యారు. షష్టి, సప్తముల్లో పరశురాముడి గర్వభంగం అయింది. దశమినాడు అయోధ్య ప్రవేశం జరిగింది. ఆ తరువాత 12 సంవత్సరాలు సుఖసంతోషాలతో గడిచింది. ఆ విధంగా బాల కాండ మొత్తం 24 సంవత్సరాల వృత్తాంతం.

దుందుభి నామ సంవత్సర చైత్ర శుద్ధ చవితినాడు దశరథుడు, శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలని పౌరులతో-మంత్రులతో ఆలోచన చేసి, పంచమి నాటి ఉదయం పుష్యా నక్షత్రంలో యౌవరాజ్య పట్టాభిషేకం జరిపించాలని నిర్ణయించాడు. మరో రకంగా చెప్పాలంటే, చైత్ర శుద్ధ పంచమే వనవాసారంభమైన రోజు. మర్నాడు గంగాతీర వాసం, ఆ మర్నాడు గుహుడి దర్శనం. అయోధ్య విడిచిన మూడో రోజు సప్తమినాడు జడలుజడలు ధరించడం, నాలుగోనాడు అష్టమి రోజున భరద్వాజాశ్రమం వెళ్లడం జరిగింది. ఐదవనాడు నవమిన యమున దాటారు. ఆరవనాడు దశమీ రోజున చిత్రకూటమి వెళ్లి వాల్మీకి దర్శనం చేసుకుని, పర్ణశాల నిర్మించుకున్నారు. అదే రోజున అక్కడ అయోధ్యలో దశరథుడు మరణించాడు.

శ్రీరాముడు అయోధ్య విడిచిన 17 వ రోజున భరతుడు అక్కడికి చేరుకున్నాడు. మర్నాడు తండ్రికి కర్మలు ప్రారంభించాడు. 29 వ రోజున కర్మకాండలన్నీ పూర్తయ్యాయి. మర్నాడు 30 వ రోజున వైశాఖ శుద్ధ చవితినాడు రాజకర్తలు భరతుడిని రాజ్యభారం వహించమని కోరారు. 31 వ రోజున పంచమీ నాడు సభకు వచ్చిన భరతుడిని వసిష్ఠుడు పట్టాభిషేకం చేసుకొమ్మని అడిగాడు. భరతుడు తిరస్కరించాడు. మర్నాడు వైశాఖ శుద్ధ షష్టి రోజున భరతుడు చిత్రకూటానికి బయల్దేరాడు.

అదే రోజున గుహుడిని కలిశాడు. మర్నాడు సప్తమినాడు జడలు ధరించాడు. భరద్వాజుడి విందు స్వీకరించాడు. 34 వ రోజున, వైశాఖ శుద్ధ అష్టమి నాడు, చిత్రకూటానికి బయల్దేరి శ్రీరామదర్శనం చేసుకున్నాడు. అదే రోజున రాముడు తండ్రికి నీళ్లు విడిచాడు. 35 వ రోజున రామ-భరత సంభాషణ అనంతరం మర్నాడు భరతుడికి తన పాదుకలను ఇచ్చాడు శ్రీరాముడు. అదే రోజు, అంటే, వైశాఖ శుద్ధ దశమిన భరతుడు అయోధ్యకు చేరాడు. 37 వ రోజున వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు భరతుడు నందిగ్రామం చేరాడు. భరతుడు వెళ్ళిపోయిన తరువాత పౌర్ణమి వరకు చిత్రకూటం లోనే వుండి సీతారామలక్ష్మణులు, వైశాఖ బహుళ పాడ్యమినాడు అత్రి ఆశ్రమానికి చేరారు. సీత అనసూయతో సంభాషణ చేసింది కూడా ఆ రోజో లేదా మరునాడో అయ్యుండాలి. ఎందుకంటే అనసూయ చంద్రవర్ణన చేసింది కాబట్టి. ఏదేమైనా ప్రాణ భయం లేనిదే పరిణామవాదం!

(ఒంటిమిట్ట కోడందరామాలయాన్ని పునరుద్ధరించిన

వాసుదాస స్వామివారి ఆంధ్రవాల్మీకి రామాయణం 

అయోధ్యకాండ మందరం ఆధారంగా)