Saturday, December 24, 2011

"అత్యవసర" పరిస్థితి: వనం జ్వాలా నరసింహారావు


తీపి గుర్తులు - చేదు అనుభవాలు: అధ్యాయం – 16
"అత్యవసర" పరిస్థితి
వనం జ్వాలా నరసింహారావు
(మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చేసే అవకాశం కలిగింది నాకు. 39 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో పదహారవ అధ్యాయం ఇది).
                36 సంవత్సరాల క్రితం ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక చీకటి అద్యాయానికి తెర లేచింది. ఇందిరాగాంధీ తన స్వప్రయోజనాల కోసం చేసిన సిఫార్సులతో, అప్పటి రాష్త్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటింఛారు.
''తీవ్ర నిర్బంధ కాండకు, నియంతృత్వానికి పాలకవర్గ పార్టీ పాల్పడుతున్నది. ఇది ఏక పార్టీ నియంతృత్వాన్ని తీవ్రతరం చేస్తుంది. నేడు దేశం ముందున్న పెద్ద ప్రమాదం ఇదే'' అంటూ 1973లో సిపిఎం కేంద్ర కమిటీ సమావేశం ఒక హెచ్చరిక చేసింది. అంతకు ముందు, 1972లో జరిగిన పార్టీ 9వ మహాసభ కూడా ఇదే విధంగా హెచ్చరించింది. మహాసభ రాజకీయ తీర్మానంలో: ''గణనీయమైన రాయితీలు చూపి జనసామాన్యంలోని పెద్ద భాగాన్ని సంతృప్తిపరిచే శక్తి కాంగ్రెస్‌కు లేకపోవడం, మరిన్ని భారాలను మోపడం, నిర్బంధకాండను ప్రయోగించడం, వామపక్షాలు, ప్రతిపక్షం బలహీనంగా ఉండడం, పాలక పార్టీ మొత్తంగా ప్రతిపక్షాన్ని సహించలేని స్థితిలో ఉండటం ఇవన్నీ ఏక పార్టీ నియంతృత్వానికి దారి తీసే ప్రమాదముంది...అన్ని ప్రజాతంత్ర పార్టీల ఉనికికి ప్రమాదం ఏర్పడింది. రాజ్యాంగం కల్పించిన హక్కులు ఓటింగ్‌ హక్కుతో సహా కాంగ్రెస్‌ పాలనలో ఇంక ఎంతమాత్రం సురక్షితంగా ఉండవు. ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు అన్ని ప్రజాతంత్ర పార్టీలు, గ్రూపులు, వ్యక్తులతో కూడిన సాధ్యమైనంత విస్తృతమైన ఐక్య సంఘటన అవశ్యం''.
ఇలా సిపిఎం హెచ్చరికలు చేసిన అనతికాలంలోనే, 1975 జూన్‌ 26న (25వ తేదీ అర్ధరాత్రి) ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఎమర్జన్సీ ప్రకటించింది. 1977లో తిరిగి ఎన్నికలు జరిగే వరకూ అంటే దాదాపు 21 నెలలపాటు ఈ చీకటి రాజ్యం సాగింది. దీనికి కారణంలేకపోలేదు. రాయబరేలిలో గెలుపుకోసం ఇందిర అనేక అక్రమాలకు పాల్పడ్డారని, కాబట్టి ఈ ఎన్నికను రద్దు చేయాలంటూ ఆమె చేతిలో ఓడిపోయిన అభ్యర్థి రాజ్‌ నారాయణ్‌ అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ప్రధాని ఇందిరా గాంధీపై వేసిన ఎన్నికల పిటీషన్‍లో, ఆమెకు వ్యతిరేకంగా, లోక్ సభకు ఆమె ఎన్నిక చెల్లదని, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్ మోహన్ లాల్ సిన్హా జూన్ 12, 1975 న చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇందిర అనర్హురాలిగా న్యాయస్థానం ప్రకటించింది. ఆమె తక్షణమే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండు చేశాయి. రాజీనామా ప్రసక్తే లేదని తేల్చి చెప్పడమే కాకుండా, నియంతృత్వ దిశగా అడుగులు వేసింది. యోధాన యోధులైన రాజకీయ నాయకులను నిర్బంధించే ప్రక్రియకు నాంది పలికింది. అలనాటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, ఆమె అనుంగు సహచరుడు, సిద్ధార్థ శంకర రే, ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తి సలహా మేరకు దేశ సమగ్రత-సమైక్యతలు ముప్పు వాటిల్లనున్నదన్న కారణం చూపుతూ, జూన్ 25, 1975 న అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ఇందిరా గాంధీ. వాస్తవానికి 1971లో పాకిస్తాన్‍తో యుద్ధాన్ని బూచిగా చూపి, విధించిన ఎమర్జెన్సీని రద్దుచేయకుండానే, దేశానికి ఆంతరంగికంగా ముప్పు ఏర్పడిందంటూ 352 ఆర్టికల్‌ కింద తిరిగి ఎమర్జన్సీని ప్రకటించింది. దీనిపై కోర్టుకు వెళ్లటానికి వీలులేకుండా రాజ్యాంగానికి 39వ సవరణ తెచ్చింది. అసాధారణ అధికారాలను చేజిక్కించుకుని, పౌర హక్కులను కాల రాసింది. అంతర్గత భధ్రత చట్టం కింద వందల, వేల సంఖ్యలో అరెస్టులు చేయించింది. స్వతంత్ర భారత దేశంలో చీకటి రోజులకు తెరలేపింది ఇందిరా గాంధీ. అలహాబాద్‌ హైకోర్టు తీర్పుతో నియంతగా మారిన ఇందిరా గాంధీ ప్రజాస్వామ్య వ్యవస్థనే ఖూనీ చేస్తూ సిపిఎం ముందే హెచ్చరించినట్లుగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

అలహాబాద్‌ హైకోర్టు తీర్పు, జూన్‌ 24న సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పును దృష్టిలో పెట్టుకుని ఇందిరాగాంధీ కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీలోను, ముఖ్యమంత్రి వెంగళరావు పాలనలోని ఆంధ్రప్రదేశ్‍లోను ఎమర్జెన్సీ దురాగతాలు పెద్దఎత్తున చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇష్టానుసారంగా దుర్వినియోగం చేశారు. పోలీసు నిఘా విభాగాన్ని తమ గుత్త సంస్థగా మార్చేశారు. దేశ వ్యాపితంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరితో సహా, జయప్రకాష్‌ నారాయణ, మొరార్జీ దేశాయ్ వంటి ప్రతిపక్ష పార్టీల నాయకుల నుండి సాధారణ కార్యకర్తల వరకు వేలాది మంది పేర్లతో జాబితాలు తయారు చేసి విచ్చలవిడిగా అరెస్టులు చేయసాగారు. సిపిఎంతో సహా పలువురు ముఖ్య నాయకులు అజ్ఞాతంలో ఉండి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జూన్‌ 25న అర్థరాత్రి విధించిన ఎమర్జెన్సీ వార్త ప్రముఖ పత్రికలలో రాకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వం విద్యుత్ సరఫరా ఆపుచేసే చర్యలకు పూనుకుందని ఆరోపణలొచ్చాయి. సంబంధిత అధికారులకు అలాంటి ఆదేశాలు అందాయని 'షా' కమీషన్‌ ముందు తరువాత సాక్ష్యాలిచ్చిన వారున్నారు.  క్రమంగా అన్ని పత్రికా వార్తలపైనా సెన్సారు వచ్చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ రాయటానికి వీలులేదు. మీసా వంటి చట్టాలను కాంగ్రెస్‌ అధిష్టానం యథేచ్ఛగా తమ కనుకూలంగా వాడుకుంది.
భారత రాజ్యాంగం హమీ ఇచ్చిన వ్యక్తి స్వాతంత్య్రాన్ని ఇందిరా కాంగ్రెస్‌ నిలువునా కాలరాచింది. ప్రముఖ నాయకుల ఫోన్‌లను ట్యాప్‌ చేయించింది. ప్రభుత్వంలో ఏ హోదాలేని ఇందిరాగాంధీ ముద్దుల కొడుకు సంజయ్ గాంధీ రాజ్యాంగేతర శక్తిగా అవతరించాడు. ఢిల్లీ నగరంలోని తుర్కమన్‌గేటు, ఇతర ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో ఉన్న మురికివాడలను బుల్డోజర్లు పెట్టి కూల్చివేశారు. అలాగే పేదవాళ్లు ఎక్కువగా పిల్లలను కనడం వల్లనే దేశానికి సమస్యలొస్తున్నాయని చెప్పి మురికివాడలలో నిర్బంధంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాడు.
దేశవ్యాప్తంగా అరెస్టయిన వారిలో, కాంగ్రెస్ పార్టీలో ఆమెను బలంగా వ్యతిరేకించిన ఒకరిద్దరితో సహా, సీపీఎం, జనసంఘ్, సంస్థాగత కాంగ్రెస్, ఇతర కాంగ్రేసేతర రాజకీయ నాయకులను చాలామందిని అరెస్ట్ చేయించింది. విమర్శలను లెక్క చేయని ఇందిర రాజ్యాంగాన్ని తిరగ రాసి, తనకు వ్యతిరేకంగా వచ్చిన అలహాబాద్ హైకోర్టు తీర్పునుంచి ఊరట పొందింది. విమర్శకుల నోళ్లు మూయించే ప్రయత్నం చేసింది. దేశ సమైక్యతకు-సమగ్రతకు ముప్పు వాటిల్లిందని, రోగికి చేదు మందిచ్చి బ్రతికించిన విధంగానే, అత్యవసర పరిస్థితి విధింపు తాత్కాలికమే అని నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. ఆర్థిక, రాజకీయ సుస్థిరత కొరకు, జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలను ఒక ఏడాది వాయిదా వేసింది. విదేశీ బూచిని చూపించడం పదే పదే చేయసాగింది. మీడియాపై మరిన్ని ఆంక్షలు విధించింది.
ఈ నేపధ్యంలో, దేశవ్యాప్తంగా అరెస్టయిన వారి సరసన డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిని చేర్చారు. అలనాటి కేంద్ర హోం మంత్రి స్వర్గీయ కాసు బ్రహ్మానంద రెడ్డి దృష్టిలో-లిస్టులో లేకపోయినా, నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రోద్బలంతో డాక్టర్‍గారిని నిర్బంధంలోకి తీసుకుంది ప్రభుత్వం. ఎమర్జెన్సీ విధించిన నాటి అర్థరాత్రి సమయంలో, డాక్టర్‍గారి ఆసుపత్రి కాలింగ్ బెల్ మోగింది. ఎమర్జెన్సీ విధించిన సంగతి ఇంకా తెలియని డాక్టర్‍గారు, తలుపు తీసి, ఎదురుగా కనిపించిన మఫ్టీలోని పోలీసు అధికారిని, ఏమీ జరగనప్పుడు-ఏమవసరమున్నదని అంత అర్థరాత్రి వచ్చారని ప్రశ్నించారు. తనకు తెలియదని, ఎస్పీ గారు పిలుచుకుని రమ్మంటే వచ్చానని జవాబిచ్చాడా అధికారి. విషయం కొంతవరకు అవగాహన చేసుకున్న రాధాకృష్ణమూర్తి, అదేదో అరెస్ట్ వ్యవహారమేనని నిర్ధారించుకుని వచ్చిన పోలీసు అధికారిని గౌరవంగా సంబోధిస్తూ, కూచోమని కోరి, ఆయనకు కాఫీ ఏర్పాటు చేసి, దుస్తులు సర్దుకునేందుకు లోనికెళ్ళారు. తన జీవితంలో, అరెస్ట్ చేసేందుకొచ్చిన పోలీసు అధికారికి అంత మర్యాద ఇచ్చిన వారిని ఎవరినీ చూడ లేదన్నాడతడు. అలనాటి రాత్రి సంగతులను గుర్తు చేసుకున్న డాక్టర్‍గారు, పోలీసు అధికారి తన విధి నిర్వహణలో వచ్చినప్పుడు, గౌరవించడం కనీస బాధ్యతని, తానదే చేసానని చెప్పారు. తాను, తన తోటి కామ్రేడ్స్ అలా ఇతరుల పట్ల మర్యాదగా ప్రవర్తించడం వల్లే, వారు కూడా తమ పట్ల గౌరవంగా వుండేవారని, ఒకటి రెండు జైలు సంఘటనలను గుర్తుచేసుకున్నారు. జైలులో వాళ్ల కొచ్చిన ఉత్తరాలను ముందుగానే పరిశీలించి-సెన్సార్ చేసినప్పటికీ, పూర్తి పాఠాన్ని చదువుకునే వీలు కలిగించి తిరిగి తీసుకునేవారు జైలు అధికారులు. అలా సహకరించని ఒక జైలు అధికారితో, లోగడ మాకినేని బసవ పున్నయ్యగారు తాను కోరిన పుస్తకాలు ఇవ్వడానికి నిరాకరించిన ఒక సందర్భంలో, "I can smuggle Elephants in to your Bloody Jail" అన్నారట.
ఇంటర్వ్యూలో పరిమితంగా కుటుంబ సభ్యులకు మాత్రమే -అదీ ఒకరిద్దరిని, ఒక గంట సేపు మాట్లాడనిచ్చేవారట. భార్యా పిల్లలు వచ్చినా, మాట్లాడేటప్పుడు ఇంటెలిజెన్స్ అధికారి పక్కనే కూర్చుని తనకు వినబడేట్లు మాత్రమే మాట్లాడాలని నియమం పెట్టేవారట.
డాక్టర్ వై.ఆర్.కె ను అరెస్ట్ చేసి, వరంగల్ సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారు. ఆయనతో పాటు చిర్రావూరి లక్ష్మీనరసయ్య, బోడేపూడి వెంకటేశ్వరరావు, మంచికంటి రాంకిషన్‍రావు గార్లను అరెస్ట్ చేసింది ప్రభుత్వం. జైల్లో వీరే కాకుండా నక్సలైట్లు, ఆరెస్సెస్‍కు చెందినవారు, జనసంఘీయులు, ఇతర రాజకీయ పక్షాలకు చెందిన మరికొందరు కూడా వున్నారు. వారం రోజుల పాటు అందరూ ఉమ్మడి కాపురం చేసి, కలిసిమెలిసి భోజనాలు చేసేవారు. ఖమ్మం నుండి అతివాద గ్రూపులకు చెందిన చీకటి రోశయ్య, జీవన్, వడ్డెల్లి కృష్ణమూర్తి, వాసిరెడ్డి కోటేశ్వరరావు గార్లు వీరితో కలిశారు. వీరంతా డాక్టర్‍గారికి వ్యక్తిగతంగా స్నేహితులే. జైలులో ఆ స్నేహం స్థిరపడింది. తరువాత కూడా కొనసాగింది. అలాగే, కరీంనగర్ నుండి జనసంఘం పార్టీకి చెందిన చెన్నుపాటి విద్యాసాగరరావుగారు (వీరు 1998 ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర హోం శాఖ మంత్రిగా పనిచేశారు)  వంటినిండా దెబ్బలతో జైలుకు వచ్చారు. , ఆ తర్వాత ఎవరి బారక్స్ వాళ్లకే కేటాయించారు. సిపిఎంకి చెందిన డాక్టర్ వై.ఆర్.కె, చిర్రావూరి, మంచికంటి, భగవాన్ దాస్, బోడేపూడి, నర్రా రాఘవరెడ్డి, ఓంకార్ లకు ఒక రెండు గదుల ఇల్లు లాంటి దాన్ని కేటాయించారు. వరండా అందరికీ కామన్‍గా వుండేది. వేరే గదిలో వంటా-వార్పు చేసుకునేవారు. తమ పార్టీ వారికి రాజకీయ పాఠాలు చెప్పినట్లే, అక్కడ ఇతరులకు తమ పార్టీ విధానాలు చెప్పడం, ఇతర పార్టీ వారి నుంచి వినడం ఒక నిత్యకృత్యమై పోయింది. డిటెన్యూలలో వరంగల్ అడ్వకేట్ ఆర్.ఎస్.ఎస్ నాయకులు భండారు సదాశివరావు గారు బాగా చదువుకున్న వ్యక్తి. భగవద్గీత, షడ్ దర్శనాలకు సంబంధించిన పలు విషయాలు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ప్రతివాది భయంకర షఠగోపాచారి మరో డిటెన్యూ. ఆయన ఆయుర్వేద వైద్య ప్రముఖులు. వరవర రావును కూడా వీరితో పాటు అదే జైల్లో డిటెన్యూగా వుంచింది ప్రభుత్వం. అలానే పలు ముస్లిం నాయకులనూ నిర్బంధించి అక్కడే పెట్టింది. పద్దెనిమిది నెలల ఆ జైలు జీవితంలో సహచర డిటెన్యూల దగ్గర భగవద్గీత, షడ్ దర్శనాలు, ఆయుర్వేద వైద్యం, ఇస్లాం మతానికి చెందిన విషయాలను నేర్చుకున్నారు డాక్టర్ వై.ఆర్.కె. ఈ జైల్లో కూడా జైలు డాక్టర్ డ్యూటీని ఆయన డిటెన్యూగా వచ్చిన తర్వాత ఆయనకే అప్ప చెప్పారు. తృప్తిగా వృత్తి ధర్మాన్ని అక్కడ కూడా నిర్వహించారు. అత్యవసర పరిస్థితి ఎత్తివేయడానికి నెల రోజుల ముందర అందరు డిటెన్యూలతో పాటు డాక్టర్ వై.ఆర్.కె ని కూడా విడుదల చేసింది ప్రభుత్వం. అయితే ఆలా బయటకు పోయి, ఇలా లోనికి వస్తానని అనుకోలేదాయన అప్పటికి. అలా గడిచింది డాక్టర్ రాధాకృష్ణమూర్తిగారి నాలుగో పర్యాయం జైలు జీవితం.
జైలు నుంచి విడుదలై, ఖమ్మం సమీపంలోని నేలకొండపల్లిలో జరుగుతున్న వ్యవసాయ కార్మిక రాష్ట్ర మహాసభలకు హాజరయ్యేందుకు వెళ్లారు. వారం రోజులపాటు, ఎమర్జెన్సీ ఇంకా అమలులో వుండగానే జరుగుతున్న సభలు, విజయవంతంగా జరగడాన్ని దగ్గరగా గమనించిన పోలీసులు, వాటిని భగ్నం చేసి, నాయకులని భావించిన డాక్టర్ వై.ఆర్.కె, రావెళ్ల సత్యం, కె.ఎల్. నరసింహారావు గార్లను అరెస్ట్ చేసి, మళ్ళీ జైలుకు తరలించారు. అలా ఐదవ సారి అరెస్ట్ చేయడం జరిగింది. జైలుకు వెళ్లిన కొన్ని రోజులకే, 1977 మార్చ్ నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ప్రకటన వెలువడింది. ఖమ్మం నుంచి లోక్ సభ స్థానానికి సిపిఎం అభ్యర్థిగా డాక్టర్ వై.ఆర్.కె ను పోటీ చేయించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. జైల్లో వున్న ఆయనకు కబురు చేసి విషయం చెప్పారు. ఆయన నామినేషన్ పత్రాలపై జైలులోనే సంతకాలు పెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకు పోటీలో వున్న అభ్యర్థిగా విడుదల చేశారు. అలా డాక్టర్ గారి అయిదో పర్యాయం జైలు జీవితం ముగిసింది.
హఠాత్తుగా, జనవరి 1977 లో ఎన్నికల నిర్ణయం ప్రకటించింది ఇందిరా గాంధీ. ప్రజలపై-ప్రజా శక్తిపై తనకు అపారమైన విశ్వాసం వుందని, మార్చ్ నెలలో ప్రజల నిర్ణయం కొరకు ఎన్నికలు జరుగుతాయని అన్నది. జైళ్లలో నిర్బంధించిన వారందరినీ విడుదల చేయించింది. ఎమర్జెన్సీ దురాగతాలను ఎదుర్కోవాలని జైలు నుంచే జయప్రకాష్‌నారాయణ 'సంపూర్ణ విప్లవం' అంటూ ఇచ్చిన పిలుపు... దేశ రాజకీయాల దిశను మార్చివేసింది. అప్పటి వరకు చిన్న చిన్న పార్టీలుగా ఉన్న అనేక పార్టీలన్నీ ఒకే గొడుగుక్రిందకు వచ్చి జనతాపార్టీగా ఏర్పడ్డాయి. ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఆమె అనుంగు సహచరుడు జగ్జీవన్ రామ్ కూడా బాంబు పేల్చాడు. ప్రతి పక్షాల సరసన చేరాడు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలో జనతా పార్టీ ఆవిర్భవించింది. వామపక్షాల మద్దతు కూడా లభించింది. కాంగ్రెస్‍లోని యంగ్ టర్క్స్ కూడా వారితో జత కట్టారు. నియంతృత్వ పాలనకు స్వస్తి చెప్పాలని, మకుటంలేని మహారాణిని ఓడించాలని జనతా పార్టీ ఎన్నికల్లో పిలుపిచ్చింది. నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య పోరాటంగా, జనతా పార్టీ ఓటర్ల ముందుకు పోయింది. మార్చ్ 20, 1977 న జరిగిన లోక సభ ఎన్నికలలో ఇందిరా గాంధీని ఆమె నియోజక వర్గంలోను, ఆమె సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీని దేశంలోను దారుణంగా ఓడించారు. ప్రప్రధమ కాంగ్రేసేతర ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు ఓటర్లు. కలగాపులగం లాంటి కాంగ్రేసేతర పార్టీల కలయికతో ఏర్పడిన జనతా ప్రభుత్వానికి, ఇందిరా గాంధీ మంత్రి వర్గంలో ఉప ప్రధాన మంత్రిగా చేసి, ఆ తర్వాత రెండేళ్లు ఆమెచే జైల్లో నిర్బంధించబడిన మొరార్జీ దేశాయ్ ప్రధాన మంత్రిగా సారధ్యం వహించారు. ప్రజల తీర్పును శిరసావహిస్తానని, ప్రజల సేవలోనే గడుపుతానని అంటూ పదవికి రాజీనామా చేసింది ఇందిరా గాంధీ.

Thursday, December 22, 2011

రైల్వే సమ్మె: వనం జ్వాలా నరసింహారావు


తీపి గుర్తులు - చేదు అనుభవాలు: అధ్యాయం – 15
రైల్వే సమ్మె
వనం జ్వాలా నరసింహారావు
(మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చేసే అవకాశం కలిగింది నాకు. 39 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో పదిహేనవ అధ్యాయం ఇది).
డాక్టర్ వై.ఆర్.కె ని మరో మారు కూడా జైలుకు పంపింది ప్రభుత్వం. అఖిల భారత స్థాయిలో జార్జ్ ఫెర్నాండెజ్ నాయకత్వంలో పెద్ద ఎత్తున రైల్వే కార్మికుల సమ్మె జరిగింది 1974లో. కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీకి ఆ సమ్మెతో పెద్దగా సంబంధం లేకపోయినప్పటికీ, ఆ పార్టీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసింది ప్రభుత్వం. కాకపోతే సిపిఎంకు, ఖమ్మం జిల్లాలోని డోర్నకల్ రైల్వే యూనియన్‍తో సంబంధాలుండేవి. ఆ సాకు చూపించి, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, సహజంగా ఎప్పటినుంచో ఆయనకు డాక్టర్ వై.ఆర్.కె పై వున్న ద్వేషంతో, ఆయనను అరెస్ట్ చేయించాడు. వాస్తవానికి వెంగళరావుకు ఆయనపై వ్యక్తిగతంగా ద్వేషం పెంచుకోవడానికి కారణంలేకపోగా, కృతజ్ఞతతో వుండాల్సిన అవసరం కూడా వుంది. ఆయన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా వున్నప్పుడు ఒక పర్యాయం, ఆ తర్వాత ఒకటి-రెండు పర్యాయాలు డాక్టర్ వై.ఆర్.కె ఆయన కుటుంబ సభ్యులకు చికిత్స కూడా చేశారు. కాంగ్రెస్ కార్యాలయం ఇప్పటి వినోద్ మహల్ సినిమా హాలు సమీపంలో, "రాంనారాయణ కాంపౌండ్" లో వున్నప్పుడు, జలగం వెంగళరావు తీవ్రమైన జ్వరంతో బాధ పడుతూ, ఆఫీసులోనే పడుకుంటే, ఎదురింటిలో వున్న కొల్లి పిచ్చయ్యగారు అనే బంధువొకరు చూసి, డాక్టర్ వై.ఆర్.కెకు కబురు చేస్తే ఆయనొచ్చి చూసి మందులిస్తే నయమైంది. చినిగిన చాప మీద, తల కింద చేతి సంచి పెట్టుకుని పడుకున్న వెంగళరావుకు వైద్యం చేసారు. ఆనాటి వెంగళరావు ఆర్థిక స్థితి అలాంటిది. మర్నాడు పిచ్చయ్య గారింట్లో, ఆ మర్నాడు తూము హైమావతమ్మ గారింట్లో వుండగా కూడా వెంగళరావుకు చికిత్స చేశారు డాక్టర్ వై.ఆర్.కె . ఆయన ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్‌గా వున్నప్పుడు కూడా, అత్తగారు డాక్టర్ వై.ఆర్.కె దవాఖానాకు పిల్లలను తీసుకొచ్చే ది.

జలగం వెంగళరావుకు సిపిఎం అంటే కోపం-భయం. ఆ పార్టీని ఖమ్మంలో ప్రధాన శత్రువుగా భావించేవాడు. డాక్టర్ వై.ఆర్.కె ను ఆ పార్టీ వెన్నెముకగా అనుమానించేవాడు. ఆయనగారి ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనీ, నిర్బంధాలతో పిరికిపర్చాలనీ, ఆత్మస్థయిర్యాన్నిసడలగొట్టాలనీ అప్రయత్నంగా ఆయన నోటివెంటే వచ్చిన మాటలు ఉమ్మడి మిత్రుల ద్వారా తెలిసింది! డాక్టర్ వై.ఆర్.కె గారిని, ఆయన కుటుంబ సభ్యులను సాధ్యమైనంత వేధించే ప్రయత్నం చేశాడు. ఖమ్మం జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న ఆయన సోదరుడు రంగారావుని, 2 సంవత్సరాలలో 10 చోట్లకు బదిలీ చేసినప్పుడు, ఆ బదిలీ ఆపమని కోరడానికి డాక్టర్ రావాలని భావించాడు వెంగళరావు. అది చేయక, సోదరుడిని రాజీనామా చేయించడంతో, ఆ కుటుంబం మీద మరింత కోపం పెంచుకున్నారు వెంగళరావు. ఆ నేపధ్యంలో, ఇంకా రైల్వే సమ్మె ప్రారంభం కాక ముందే, డాక్టర్ వై.ఆర్.కె గారిని, బోడేపూడి రాధాకృష్ణను, బోడేపూడి వెంకటేశ్వరరావును అరెస్ట్ చేశారు. మరో మారు హైదరాబాద్ ముషీరాబాద్ జైలుకు తరలించి, నెల రోజులపాటు నిర్బంధంలో వుంచారు. అక్కడున్న రైల్వే యూనియన్‍కు చెందిన సుమారు ఎనభై మంది డిటెన్యూలకు రాజకీయ పాఠాలు తీసుకునేవారు డాక్టర్ వై.ఆర్.కె. వారందరితో ఆత్మీయ పరిచయాలు ఏర్పడ్డాయి. తర్వాత  కూడా కొందరు స్నేహపూర్వకంగా ఉత్తరాలు రాసేవారు. అందరికంటే ముందు డాక్టర్ వై.ఆర్.కె ను అరెస్ట్ చేసిన ప్రభుత్వం, అందరికంటే చివరకు ఆయనను విడుదల చేసింది. రాజకీయ ద్వేషానికి, వ్యక్తిగత ప్రతీకారానికి పరాకాష్టకు, చక్కటి ఉదాహరణగా దీనిని పేర్కొన వచ్చు. ఏదేమైనా, రైల్వే యూనియన్ కు, సిపిఎం కు సంబంధం లేకపోయినా అరెస్ట్ కు గురికాబడిన డాక్టర్ వై.ఆర్.కె కి, ఆయన ద్వారా పార్టీకి, ఆ తర్వాత రైల్వే యూనియన్ తో సంబంధం ఏర్పడింది. అలా ఆయన మూడో పర్యాయం జైలు జీవితం గడిచింది.

Tuesday, December 20, 2011

రజబ్ అలీ రగడ: వనం జ్వాలా నరసింహారావు



తీపి గుర్తులు - చేదు అనుభవాలు: అధ్యాయం – 14
రజబ్ అలీ రగడ
వనం జ్వాలా నరసింహారావు
(మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చేసే అవకాశం కలిగింది నాకు. 39 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో పద్నాలుగో అధ్యాయం ఇది).
రజబ్ అలీకి మాస్ లీడర్‍గా పేరుంది. జిల్లా నాయకత్వంతో ఆయనకు విభేదాలు మొదలయ్యాయి. జిల్లా కేంద్ర సహకార బాంక్ ఎన్నికలలో పార్టీ ఆదేశాలను ఉల్లంఘించి, రావెళ్ల సత్యంగారికి వ్యతిరేకంగా పనిచేసి, ఆయన ఓటమికి కారణమయ్యారు రజబ్ అలీ. 1965లో చంచల గూడా జైలులో వుండగా, సత్యంగారితో వాగ్వివాదం వచ్చి, ఆయనను చెప్పుతో కొట్టేశాడు. మోటూరు హనుమంత రావు, దేవులపల్లి వెంకటేశ్వర రావు, మానికొండ సుబ్బా రావు, గుంటూరు బాపనయ్య, దాట్ల సూర్యనారాయణ గార్ల లాంటి నాయకులంతా అక్కడే వుండడంతో, రజబ్ అలీ చర్యను చాలా సీరియస్‍గా తీసుకున్నారు. ముషీరాబాద్ జైలులో వున్న సుందరయ్య, బసవ పున్నయ్య, నాగిరెడ్డి, పుల్లారెడ్డి గార్లకు ఆ సంఘటనపై పూర్తి నివేదిక పంపారు. (డాక్టర్ వై.ఆర్.కె కూడా అప్పుడు అదే జైలులో వున్నారు). జైలు నుండి బయటకు వచ్చిన తరువాత కూడా రజబ్ అలీ, తన వారిని కూడ తీయటం ప్రారంభించాడు. అయినా ఆయనను సున్నితంగా మందలించి 1967 అసెంబ్లీ ఎన్నికలకు ఖమ్మం నియోజకవర్గం నుంచి నిలబెట్టి గెలిపించింది.
పార్టీకి, ఆయనకు ఖమ్మం పార్టీ నిర్మాణ సంబంధమైన విభేదాలు వచ్చాయి. పార్టీ లైన్‍తో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు చెబుతూనే, పార్టీ నాయకత్వం పోకడ తనకు నచ్చ నందువల్ల విడిపోతున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. (ఖమ్మం జిల్లా పార్టీలో బ్రాహ్మణ పెత్తనం సాగుతున్నదని అంతర్గతంగా ప్రచారం చేశాడు). “ఖమ్మం డివిజన్ సిపిఎం” పేరుతో ఆఫీసు బోర్డు పెట్టి, సెప్టెంబర్ 1971 నుండి 6 మాసాల పాటు సాగించారలా. తరువాత సిపిఐలో చేరారు.
1972, 1983, 1985, 1989, 1994 ఎన్నికలలో సిపిఐ పక్షాన పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గారు. రజబ్ అలీ తో సిపిఐ కి వెళ్లిన వారిలో కొందరి పేర్లు గుర్తు చేసుకున్నారు డాక్టర్ గారు. వారు: తుళ్లూరు సత్యం (తనికెళ్ల), దొండపాటి వెంకయ్య (కొణిజర్ల), బొమ్మిశెట్టి నారాయణ (కొత్తగూడెం), వంకాయలపాటి వెంకయ్య, కర్నాటి కృష్ణయ్య, మహ్మద్ మౌలానా, వెంపటి రామకోటయ్య, వెంపటి సూర్యనారాయణ, ఆఫీసు రాఘవయ్య, చావా వెంకటేశ్వర రావు (కొక్కిరేణి), పారుపల్లి పుల్లయ్య, ఎర్రంనేని వెంకట నరసయ్య (గోకినేపల్లి) వున్నారు. వీరందరూ స్థానికంగా పలుకుబడి వున్నవారు, ఎక్కువగా కమ్మ కులానికి చెందినవారు కావడంతో జిల్లా మార్క్సిస్టు పార్టీకి బాగానే నష్టం కలిగిందని అన్నారాయన. ఆయన వెంట వెళ్ళిన వారంతా డాక్టర్‍గారికి వ్యక్తిగతంగా స్నేహితులే. కాని, రాజకీయంగా మార్క్సిస్టు పార్టీకి అండగా వున్నందుకు ఆగ్రహంతో వుండేవారు! వారి-వారి సంభాషణలలో డాక్టర్ గారిని "కొండపై కూర్చున్న గురువు" అని వ్యంగంగా చెప్పుకునే వారట. (డాక్టర్ గారి ఇల్లు, ఆసుపత్రి, గుట్టల బజారులో ఎత్తైన గుట్టపై వుంటుంది).
ఆ నాటి పార్టీ నాయకత్వాన్ని"బ్రాహ్మణాధిక్య గ్రూప్" గా చెప్పడం అత్యంత దారుణం అంటారు. వారంతా జంధ్యాలు తీసివేసి, కార్మికోద్యమానికి అంకితమైన త్యాగమూర్తులంటారాయన. ఉద్యమ క్షేమం తప్ప, మతం, కులం, ప్రాంతం లాంటి సంకుచిత భావాలు ఏ కోశానా లేనివారు.
కమ్మ కులానికి చెందిన కొందరు ముఖ్య నాయకులు కూడా ఆయనతో వెళ్లలేదు. రావెళ్ల సత్యంగారు, బోజెడ్ల వెంకటనారాయణగారు, రాయల వీరయ్యగారు, బోడేపూడి వెంకటేశ్వరరావు, ఏలూరి లక్ష్మీనారాయణ, పయ్యావుల లక్ష్మయ్య, కట్టా వెంకటనర్సయ్య మరికొన్ని పేర్లు చెప్పవచ్చు. కొత్తగా సిపిఐ లో చేరిన వారితోనే, తరువాత ఘర్షణలు ఎక్కువగా వచ్చాయి. బోజెడ్ల వెంకటనారాయణగారి కుటుంబం రెండుగా చీలింది. ఆయన గ్రామం నుండి ఇల్లు-వాకిలి, భూమీ అన్ని వదిలి కొంతకాలం ఖమ్మంలో తలదాచుకున్నారు. రాయల వీరయ్యగారిని దారి కాచి దాడి చేస్తే ఎముకలన్నీ విరిగి చావుతప్పి బయటపడడానికి ఐదారు మాసాలు పట్టింది.

1969 జై తెలంగాణ - 1973 జై ఆంధ్ర: వనం జ్వాలా నరసింహారావు

తీపి గుర్తులు - చేదు అనుభవాలు: అధ్యాయం – 13
1969 జై తెలంగాణ - 1973 జై ఆంధ్ర
వనం జ్వాలా నరసింహారావు


(మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చేసే అవకాశం కలిగింది నాకు. 39 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో పదమూడవ అధ్యాయం ఇది).


1930వ దశకంలోనే దేశాన్ని భాషా ప్రాతిపదికన పునర్విభజించి, భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని, జాతీయోద్యమం తీర్మానించింది. దక్షినాదిన, విశాలాంధ్ర, ఐక్య కేరళ, మహా కర్నాటక, బృహన్మహారాష్ట్రలు ఏర్పాటు చేయాలనీ, అవిభక్త కమ్యూనిస్ట్ ఉద్యమం భావించింది. ఆ ఆలోచనతోనే, 1946 లో పుచ్చలపల్లి సుందరయ్య గారు, "విశాలాంధ్రలో ప్రజారాజ్యం" అన్న పేరుతో పుస్తకం రాశారు. రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి పరిచేందుకు ఆ పుస్తకంలో పలు సూచనలు చేశారు. 1946లో హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం ఫ్యూడల్ పాలనకు వ్యతిరేకంగా, సాయుధ రైతాంగ పోరాటం ప్రారంభమైంది. ఆ పోరాటంలో తెలంగాణా జిల్లాల నుండి రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లా రెడ్డి, మల్లు స్వరాజ్యం, మల్లు నరసింహా రెడ్డి, భీమిరెడ్డి నరసింహా రెడ్డి, ఆరుట్ల దంపతులతో పాటు, ఆంధ్ర జిల్లాల నుండి సుందరయ్య, బసవ పున్నయ్య, చండ్ర రాజేశ్వరరావు, లావు బాలగంగాధరరావు, తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి తదితర నాయకులతో సహా వేలాదిమంది ఇరు ప్రాంతాల కార్యకర్తలు భుజం-భుజం కలిపి 1951 వరకు వీరోచిత పోరాటం చేశారు. నాలుగువేల మందికి పైగా ప్రాణాలను అర్పించారు. సెప్టెంబర్ 17, 1948 న నిజాం హైదరాబాద్ రాష్ట్రం - సంస్థానం భారత యూనియన్లో్ విలీనం కావడం, 1953లో భాషా ప్రాతిపదికన విభజన జరగడం, 1956 నవంబర్ 1 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కావడం అందరికీ తెలిసిన వర్తమాన చరిత్ర.


1953 లో తెలంగాణ కోసం కొందరు గొంతు విప్పినా, "సమైక్యాంధ్ర సదస్సు" ఉమ్మడి పార్టీ ఏర్పాటు చేసింది. అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేసింది. దానికి శ్రీశ్రీ ప్రధాన ఆకర్షణ. ఖమ్మం నుండి సదస్సుకు హాజరైన చాలా మందితో పాటు డాక్టర్గా్రు కూడా పాల్గొన్న నాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.


1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉదృతంగా మొదలైంది. ఖమ్మం పట్టణం గాంధీచౌక్లోక అన్నాబత్తుల రవీంద్రనాథ్ అనే విద్యార్థి నిరాహారదీక్షకు పూనుకోవడం ఉద్యమానికి నాందిగా చెపుతారు. అతని కుటుంబం వెంగళరావుకు అనుచర వర్గమన్నది వాస్తవం.

ఉద్యమానికి ఆ నాటి ప్రముఖ తెలంగాణ నాయకుడు, కె.వి. రంగారెడ్డి అల్లుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నాయకత్వం వహించారు. హైదరాబాద్లో విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. ఉద్యమం గ్రామ సీమల్లోకి పాకక పోయినా, నగర - పట్టణ ప్రాంతాలలో విద్యావంతులను ఆకట్టుకుంది. సహజంగానే, అనేక సంఘ వ్యతిరేక శక్తులు ఉద్యమంలో వచ్చి చేరాయి. నగరంలోని సీమాంధ్ర వ్యాపారులపై దాడులు, విధ్వంసం చోటు చేసుకున్నాయి. ఆంధ్ర జిల్లాల నుండి రోడ్లపై వచ్చే వాహనాలను ఆపి, వారిని హింసించడం, మహిళలను అవమాన పర్చడం జరుగుతూ వచ్చాయి. నగర గోడలపై ఆ నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిపై అశ్లీల రాతలు వెలిశాయి.

ఖమ్మంలో జులై నెల 6, 1969న సిపిఎం ఆధ్వర్యాన వర్తక సంఘం భవనం ఆవరణలో సమైక్యతా సభ జరిగింది. మునిసిపల్ చైర్మన్ చిర్రావూరి లక్ష్మీనరసయ్యగారి అధ్యక్షతన నిర్వహించిన ఆ సభలో, శ్రీ శ్రీ, వావిలాల గోపాలకృష్ణయ్య, గోరా, మాదిరాజు రాంకిషన్రా వు, కొలిపాక కిషన్రాహవు, పెరవల్లి వెంకట రమణయ్య, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మోటూరి హనుమంతరావు, సిపిఎం శాసనసభా పక్ష నాయకుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి, సమైక్యతను సమర్థిస్తూ ఉపన్యసించారు. సదస్సు తరువాత, సాయంత్రం నాలుగు గంటలకు మూడువేల మందితో ఊరేగింపు మొదలైంది. ఊరేగింపును అడ్డుకున్న వారికి బి.ఎన్. గారి నాయకత్వాన తగిన సమాధానం చెప్పారు. బి.ఎన్. స్వయంగా ఎర్ర జెండా కర్రతో దుండగులను తరిమి కొట్టిన సంగతి గుర్తు చేసుకున్నారు డాక్టర్గానరు. ప్రత్యేక తెలంగాణలోని మొత్తం జిల్లాలలో సమైక్యత కోసం సిపిఎం చేసిన మొదటి ప్రయత్నం ఇది. జిల్లాలోని ఇతర ప్రాంతాలలో కూడా సమైక్యతా వాద సదస్సులు జరిగాయి.

ఖమ్మంలోని సిపిఎం జిల్లా నాయకత్వం డాక్టర్ వై.ఆర్.కె ఆసుపత్రి, ఇల్లు రక్షణకై చర్య తీసుకుంది. చిర్రావూరి లక్ష్మీనరసయ్య గారి సూచనతో 10-15 మంది పార్టీ కార్యకర్తలు రేయింబవళ్లు కాపలా కాసిన వైనం డాక్టర్గాిరు మరిచి పోలేమన్నారు. అదే సంవత్సరం నిర్వహించాల్సిన పియుసి పబ్లిక్ పరీక్షలు జరగరాదని వేర్పాటువాదుల ప్రయత్నం. 50 మంది మార్క్సిస్టు పార్టీ కార్యకర్తలు ఉదయం నుండి, పరీక్షా కేంద్రమైన సెయింట్ జోసెఫ్స్ హైస్కూల్ ముందర కాపలాగా నిలబడి ఆ మూడు రోజులు, పరీక్షలకు ఆటంకం కలగకుండా చేశారు. పరీక్ష రాసిన విద్యార్థులలో డాక్టర్గా,రి పెద్ద కుమారుడు కూడా వుండి, తరువాత ఉత్తీర్ణుడైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు డాక్టర్గాలరు.

సమైక్యాంధ్ర అవసరాన్ని నొక్కి చెపుతూ, ప్రజలలో అవగాహన కలిగించడానికి సిపిఎం అనేక కరపత్రాలను వేసిందన్నారు. మోటూరి హనుమంతరావుగారి పుస్తకం "విశాలాంధ్రలో విషాదచ్ఛాయలు" ప్రస్తావన తెచ్చారు. అనేక వివరాలతో రాసిన ఆ పుస్తకం వేల కాపీలు రాష్ట్రం మొత్తం పంచబడింది. తెలంగాణలోని ఇతర జిల్లాలలో కూడా పార్టీ ఆధ్వర్యాన సదస్సులు, సభలు జరిగాయని చెప్పారు.

1973 లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రతిగా ఆంధ్ర జిల్లాలలో "జై ఆంధ్ర ఉద్యమం" ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పెద్ద ఎత్తున సాగింది. ఆ సమయంలోను, మార్క్సిస్టు పార్టీ దానికి వ్యతిరేకంగా తిరిగి పెద్ద ఎత్తున ప్రచార సాహిత్యం వెలువరించింది. సభలు నిర్వహించింది. వాటిలో భాగంగానే, బోనకల్లు - చిల్లకల్లు రోడ్డులో వున్న మక్కపేట గ్రామంలో, సభ ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా మార్క్సిస్టు పార్టీ కార్యదర్శి మానికొండ సుబ్బారావు, ఖమ్మం జిల్లా పార్టీ పక్షాన డాక్టర్ వై.ఆర్.కె ఉపన్యాసకులుగా వెళ్లారు. కృష్ణా జిల్లా జై ఆంధ్ర ఉద్యమ నాయకుడు వసంత నాగేశ్వర రావు (1983-1984 లో ఎన్టీఆర్ ప్రభుత్వంలో హోం మంత్రి), వారి శిష్య గణం సభా ప్రాంగణం చుట్టూ రాళ్లు పేర్చుకుని తెలంగాణ ప్రతినిధి డాక్టర్ వై.ఆర్.కె ప్రసంగిస్తుండగా రాళ్లవర్షం కురిపించడం మొదలుపెట్టారు. బందోబస్తులో వున్న పోలీసు బృందం సమయస్ఫూర్తితో తగు రక్షణలు కలిగించారు.

ప్రత్యేక వాద ఉద్యమాలపట్ల, ఆ నాడు మార్క్సిస్టు పార్టీ తీసుకున్న క్రియాశీల వైఖరికి ఈ ఉదాహరణలు నిదర్శనాలుగా డాక్టర్గా రు పేర్కొన్నారు.

2001-2010 మధ్య సాగిన - తరువాత సాగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎడల పార్టీ వైఖరికి, 1969-73 మధ్య తీసుకున్న వైఖరికి చాలా తేడా కనిపిస్తుందంటారు డాక్టర్గాంరు. ఈ వైఖరికి బహుశా కారణం, ఈ సారి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం "లో కీ" తో ప్రారంభం కావడం వల్ల కావచ్చు, అది పెద్దగా మాటల యుద్ధంగా వుండడం వల్ల కావచ్చు, లేక వివిధ రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా పార్టీ 2004 లో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ కూటమిలో భాగస్వామి కావడం వల్ల కావచ్చు, తిరిగి 2009 ఎన్నికలలో కాంగ్రెస్కుట వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సమితితో కూడిన గ్రాండ్ అలయెన్స్ లో భాగస్వామి కావడం కావచ్చు. ఏదేమైనా వెనుకటి క్రియాశీల పాత్ర సిపిఎంలో లోపించిందంటున్నారు డాక్టర్గా రు. దాంతో పాటు, 2004 లో ఏర్పాటైన ప్రణబ్ ముఖర్జీ కమిటీలో ప్రాతినిధ్యం నిరాకరించడం; తాము సమైక్యాంధ్రకు సైద్ధాంతికంగా కట్టుబడి వున్నామని చెప్పడం వరకే పరిమితం కావడం; కొంత మంది నాయకులు "తమ పార్టీ చిన్నదనీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆపే శక్తి లేదనీ" అనడం; బాధ్యత కాంగ్రెస్ది్, కాగా, తాము అడ్డుపడుతున్నామని ప్రచారం చేయడం "తమ పార్టీ భుజాన తుపాకి పెట్టి కాల్చే ప్రయత్నం తప్పు" అనడం; చివరకు "కాంగ్రెస్ తెలంగాణ ఇస్తామంటే మేం వద్దన్నామా?" అని, "మేం వ్యతిరేకించమనీ" ఇచ్చే ప్రకటనలు, మార్క్సిస్టు పార్టీయే తరులు - అటు తెలంగాణ ప్రాంతం వారైనా, ఇటు ఆంధ్ర ప్రాంతం వారైనా - అపహాస్యం చేసే పరిస్థితికి చేరుకోవడం డాక్టర్గా రిని బాధకు గురిచేసింది. ఇది విచారించ దగ్గ ఐరనీ అనిపిస్తోందన్నారు. 

ఇటీవల భోనగిరి, నల్గొండ జిల్లా పార్టీ ఆఫీసులపైన, వారి ఏకైక శాసన సభ్యుడి (మిర్యాలగూడ) ఇంటిపైన టిఆర్ఎస్ కార్యకర్తలు దాడిచేసే సాహసం మామూలు పరిస్థితులలో ఊహించ రానిదంటారాయన. పైగా ఆ ఘటనల పట్ల ఖండన - మండనలు నిరోధించడంలో ఆ పార్టీకి సహజమైన "మిలిటెన్సీ" లోపించిందన్నారు డాక్టర్గాతరు.

ఏదేమైనా, 2011 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఒక బలమైన సమర్థన అస్తిత్వవాద రాజకీయాలలో (Identity Politics) వుందంటారు డాక్టర్‌గారు. ప్రాంతీయ అస్తిత్వ వాదం అనీ, ఈ సిద్ధాంతానికి మూలాలు పోస్టు మోడర్నిజంలో వున్నాయనీ, విజ్ఞులందరికీ తెలుసు. పోస్టు మోడర్నిజం అనేది సైద్ధాంతికంగా "యాంటీ మార్క్సియన్" అని చాలామందికి తెలుసు. ఇది ప్రాంతీయ కుల-జెండర్ వాదాలకు దారితీస్తుంది. ఈ నేపధ్యంలో ఆంగ్ల భాషలో వచ్చే మార్క్సిస్టు త్రైమాసిక పత్రికలో (ఇటీవల) డాక్టర్‌గారు చదివిన రెండు చక్కటి వ్యాసాలను ప్రస్తావించారు. ఒకటి ప్రసిద్ధ మార్క్సిస్టు మేధావి ఇంతియాజ్ అహ్మద్ రాసిన ఇరవై పేజీల విపులమైన వ్యాసం. అదే సంచికలో సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ వ్యాసం కూడా ఆ అంశంపైనే వుందన్నారు. ఆ రెండు వ్యాసాలు, ప్రస్తుత వేర్పాటు ఉద్యమ వాతావరణంలో, వామపక్ష ఆలోచనలు వున్నవారికి చాలా ఉపయోగకరంగా వుంటాయని చెప్పారు. వాటిని తెలుగులోకి అనువదించి, ప్రచారంలోకి తీసుకురావడానికి ఇదే సరైన సమయం అనీ, ఎందుకో వెనుకబడ్డాం లేదా సంశయించాం అనీ అభిప్రాయపడ్డారు.

"ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సిపిఐదీ, సిపిఐ(న్యూ డెమాక్రసీ)దీ అత్యుత్సాహంగా వుంటే, మాది నిరుత్సాహంగా, నిర్లిప్తంగా వున్నట్లు తోస్తుంది” అని ముగించారు డాక్టర్‌గారు ఈ అంశంపై.

Friday, December 16, 2011

నక్సల్ ఉద్యమం: వనం జ్వాలా నరసింహారావు


తీపి గుర్తులు - చేదు అనుభవాలు: అధ్యాయం – 11
నక్సల్ ఉద్యమం
వనం జ్వాలా నరసింహారావు
(మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చేసే అవకాశం కలిగింది నాకు. 39 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో పన్నెండవ అధ్యాయం ఇది).
నక్సల్బీరీ ఉద్యమ నేపధ్యంలో, 1967లో, సీపీఎం నుంచి కొంతమంది బయటకు పోయి ఆ సిద్ధాంతానికి ఆకర్షితులయ్యారు. ఖమ్మం జిల్లాలో కూడా, కొందరు ఉత్సాహవంతులైన యువకులు అటువైపు వెళ్లారు. అలా వెళ్లిన వారిలో ముఖ్యుల పేర్లను గుర్తు చేసుకున్నారు డాక్టర్గా రు. వారు: బత్తుల వెంకటేశ్వరరావు(సత్తుపల్లి), విజయ కుమార్(ఎం. వెంకటాయపాలెం), రాయల సుభాస్ చంద్రబోస్(పిండిప్రోలు), చీకటి రోశయ్య(లెక్చరర్, ఖమ్మం), జీవన్(రచయిత, ఖమ్మం), వడ్డెల్లి కృష్ణమూర్తి(అడ్వకేట్, ఖమ్మం), వాసిరెడ్డి కోటేశ్వరరావు(మధిర), డాక్టర్ వాసిరెడ్డి రామనాధం(మధిర) ప్రభృతులు.
రాష్ట్రస్థాయిలో నక్సల్ ఉద్యమంవైపు వెళ్లిన ప్రముఖుల పేర్లనూ చెప్పారు డాక్టర్గా్రు. వారిలో, తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, కొల్లా వెంకయ్య, మాదాల నారాయణస్వామి, వజ్రవేలుశెట్టి, ఎ.బి.కె. ప్రసాద్, సనకా బుచ్చికోటయ్యలు సీపీఎం పాలకొల్లు రాష్ట్ర ప్లీనరీ జరిగిన తరువాత, పార్టీని వీడి నక్సల్ ఉద్యమం వెళ్ళిన ముఖ్యులు.
రాష్ట్రంలో ఎక్కువగానే నక్సల్ ఉద్యమ ప్రభావం పడింది ఆ రోజుల్లో. పలువురు విద్యార్థి నాయకులు, గ్రామ-పట్టణ నాయకులు, ఆ ఉద్యమంలోకి వెళ్లకుండా వుండడానికి కారణం డాక్టర్గారరి పైనున్న గౌరవం. బత్తుల వెంకటేశ్వరరావు లాంటి చురుకైన సీపీఎం కార్యకర్తలు వెళ్లినప్పటికీ, వెళ్దామనుకున్న గండ్లూరి కిషన్రావవు, వనం నరసింగరావు లాంటి వారిని ఆయన ఆపు చేశారు. ఆ తర్వాత వారిలో ఒకరు ఖమ్మం సమితి ఉపాధ్యక్ష స్థాయికి, మరొకరు పాలేరు సహకార చక్కెర కర్మాగారం చైర్మన్ స్థాయికి ఎదిగారు. పార్టీలో పలు బాధ్యతలు నిర్వహించారు. కిషన్రాహవు హత్యకు గురికాగా, నరసింగరావును పార్టీ సస్పెండ్ చేసింది. డాక్టర్ వై.ఆర్.కె కృషి వల్ల, అప్పట్లో, ఖమ్మంలో పార్టీకి ప్రమాదం తప్పిందనాలి. 1964 చీలిక-సీపీఎం నాయకుల అరెస్ట్ దరిమిలా రూపు దిద్దుకున్న పౌరహక్కుల ఉద్యమ ఆద్యులలో, మేధావిత్రయంలో ఒకరైన అడ్వకేట్ కె. వి సుబ్బారావు తీవ్రవాదం వైపు తొలుత ఆకర్షితులైనప్పటికి, మైదానంలో ఉద్యమానికి పోలేదు.