Friday, June 23, 2017

"అత్యవసర" పరిస్థితి...ఒక డాక్టర్ అనుభం : వనం జ్వాలా నరసింహారావు

ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించి
42 సంవత్సరాలు నిండిన సందర్భంగా
"అత్యవసర" పరిస్థితి...ఒక డాక్టర్ అనుభం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (24-06-2017)

                42 సంవత్సరాల క్రితం ఇదే రోజున ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక చీకటి అద్యాయానికి తెర లేచింది. ఇందిరాగాంధీ తన స్వప్రయోజనాల కోసం చేసిన సిఫార్సులతో, అప్పటి రాష్త్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటింఛారు.

అప్పట్లో అందరూ భయపడుతున్నట్లుగానే 1975 జూన్‌ 26న (25వ తేదీ అర్ధరాత్రి) ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఎమర్జన్సీ ప్రకటించింది. 1977లో తిరిగి ఎన్నికలు జరిగే వరకూ అంటే దాదాపు 21 నెలలపాటు ఈ చీకటి రాజ్యం సాగింది. దీనికి కారణంలేకపోలేదు. రాయబరేలిలో గెలుపుకోసం ఇందిర అనేక అక్రమాలకు పాల్పడ్డారని, కాబట్టి ఈ ఎన్నికను రద్దు చేయాలంటూ ఆమె చేతిలో ఓడిపోయిన అభ్యర్థి రాజ్‌ నారాయణ్‌ అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ప్రధాని ఇందిరా గాంధీపై వేసిన ఎన్నికల పిటీషన్‍లో, ఆమెకు వ్యతిరేకంగా, లోక్ సభకు ఆమె ఎన్నిక చెల్లదని, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్ మోహన్ లాల్ సిన్హా జూన్ 12, 1975 న చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇందిర అనర్హురాలిగా న్యాయస్థానం ప్రకటించింది. ఆమె తక్షణమే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండు చేశాయి. రాజీనామా ప్రసక్తే లేదని తేల్చి చెప్పడమే కాకుండా, నియంతృత్వ దిశగా అడుగులు వేసింది. యోధాన యోధులైన రాజకీయ నాయకులను నిర్బంధించే ప్రక్రియకు నాంది పలికింది. అలనాటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, ఆమె అనుంగు సహచరుడు, సిద్ధార్థ శంకర రే, ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తి సలహా మేరకు దేశ సమగ్రత-సమైక్యతలు ముప్పు వాటిల్లనున్నదన్న కారణం చూపుతూ, జూన్ 25, 1975 అర్థరాత్రి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ఇందిరా గాంధీ.

వాస్తవానికి 1971లో పాకిస్తాన్‍తో యుద్ధాన్ని బూచిగా చూపి, విధించిన ఎమర్జెన్సీని రద్దుచేయకుండానే, దేశానికి ఆంతరంగికంగా ముప్పు ఏర్పడిందంటూ 352 ఆర్టికల్‌ కింద తిరిగి ఎమర్జన్సీని ప్రకటించింది. దీనిపై కోర్టుకు వెళ్లటానికి వీలులేకుండా రాజ్యాంగానికి 39వ సవరణ తెచ్చింది. అసాధారణ అధికారాలను చేజిక్కించుకుని, పౌర హక్కులను కాల రాసింది. అంతర్గత భధ్రత చట్టం కింద వందల, వేల సంఖ్యలో అరెస్టులు చేయించింది. స్వతంత్ర భారత దేశంలో చీకటి రోజులకు తెరలేపింది ఇందిరా గాంధీ. అలహాబాద్‌ హైకోర్టు తీర్పుతో నియంతగా మారిన ఇందిరా గాంధీ ప్రజాస్వామ్య వ్యవస్థనే ఖూనీ చేస్తూ పలువురు ప్రజాస్వామ్య వాదులు ముందే హెచ్చరించినట్లుగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

అలహాబాద్‌ హైకోర్టు తీర్పు, జూన్‌ 24న సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పును దృష్టిలో పెట్టుకుని ఇందిరాగాంధీ కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీలోను, ముఖ్యమంత్రి వెంగళరావు పాలనలోని అలనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‍లోను ఎమర్జెన్సీ దురాగతాలు పెద్దఎత్తున చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇష్టానుసారంగా దుర్వినియోగం చేశారు. పోలీసు నిఘా విభాగాన్ని తమ గుత్త సంస్థగా మార్చేశారు. దేశ వ్యాపితంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరితో సహా, జయప్రకాష్‌ నారాయణ, మొరార్జీ దేశాయ్ వంటి ప్రతిపక్ష పార్టీల నాయకుల నుండి సాధారణ కార్యకర్తల వరకు వేలాది మంది పేర్లతో జాబితాలు తయారు చేసి విచ్చలవిడిగా అరెస్టులు చేయసాగారు.

పలువురు ముఖ్య నాయకులు అజ్ఞాతంలో ఉండి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జూన్‌ 25న అర్థరాత్రి విధించిన ఎమర్జెన్సీ వార్త ప్రముఖ పత్రికలలో రాకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వం విద్యుత్ సరఫరా ఆపుచేసే చర్యలకు పూనుకుందని ఆరోపణలొచ్చాయి. సంబంధిత అధికారులకు అలాంటి ఆదేశాలు అందాయని 'షా' కమీషన్‌ ముందు తరువాత సాక్ష్యాలిచ్చిన వారున్నారు.  క్రమంగా అన్ని పత్రికా వార్తలపైనా సెన్సారు వచ్చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ రాయటానికి వీలులేదు. మీసా వంటి చట్టాలను కాంగ్రెస్‌ అధిష్టానం యథేచ్ఛగా తమ కనుకూలంగా వాడుకుంది.

భారత రాజ్యాంగం హమీ ఇచ్చిన వ్యక్తి స్వాతంత్య్రాన్ని ఇందిరా కాంగ్రెస్‌ నిలువునా కాలరాచింది. ప్రముఖ నాయకుల ఫోన్‌లను ట్యాప్‌ చేయించింది. ప్రభుత్వంలో ఏ హోదాలేని ఇందిరాగాంధీ ముద్దుల కొడుకు సంజయ్ గాంధీ రాజ్యాంగేతర శక్తిగా అవతరించాడు. ఢిల్లీ నగరంలోని తుర్కమన్‌గేటు, ఇతర ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో ఉన్న మురికివాడలను బుల్డోజర్లు పెట్టి కూల్చివేశారు. అలాగే పేదవాళ్లు ఎక్కువగా పిల్లలను కనడం వల్లనే దేశానికి సమస్యలొస్తున్నాయని చెప్పి మురికివాడలలో నిర్బంధంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాడు.


దేశవ్యాప్తంగా అరెస్టయిన వారిలో, కాంగ్రెస్ పార్టీలో ఆమెను బలంగా వ్యతిరేకించిన ఒకరిద్దరితో సహా, సీపీఎం, జనసంఘ్, సంస్థాగత కాంగ్రెస్, ఇతర కాంగ్రేసేతర రాజకీయ నాయకులను చాలామందిని అరెస్ట్ చేయించింది. విమర్శలను లెక్క చేయని ఇందిర రాజ్యాంగాన్ని తిరగ రాసి, తనకు వ్యతిరేకంగా వచ్చిన అలహాబాద్ హైకోర్టు తీర్పునుంచి ఊరట పొందింది. విమర్శకుల నోళ్లు మూయించే ప్రయత్నం చేసింది. దేశ సమైక్యతకు-సమగ్రతకు ముప్పు వాటిల్లిందని, రోగికి చేదు మందిచ్చి బ్రతికించిన విధంగానే, అత్యవసర పరిస్థితి విధింపు తాత్కాలికమే అని నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. ఆర్థిక, రాజకీయ సుస్థిరత కొరకు, జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలను ఒక ఏడాది వాయిదా వేసింది. విదేశీ బూచిని చూపించడం పదే పదే చేయసాగింది. మీడియాపై మరిన్ని ఆంక్షలు విధించింది.

ఈ నేపధ్యంలో, దేశవ్యాప్తంగా అరెస్టయిన వారి సరసన ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ వైద్యుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, సీపీఎం పార్టీ నాయకుడు స్వర్గీయ డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిని చేర్చారు. అలనాటి కేంద్ర హోం మంత్రి స్వర్గీయ కాసు బ్రహ్మానంద రెడ్డి దృష్టిలో, లిస్టులో లేకపోయినా, నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రోద్బలంతో డాక్టర్‍గారిని నిర్బంధంలోకి తీసుకుంది ప్రభుత్వం. ఎమర్జెన్సీ విధించిన నాటి అర్థరాత్రి సమయంలో, డాక్టర్‍గారి ఆసుపత్రి కాలింగ్ బెల్ మోగింది. ఎమర్జెన్సీ విధించిన సంగతి ఇంకా తెలియని డాక్టర్‍గారు, తలుపు తీసి, ఎదురుగా కనిపించిన మఫ్టీలోని పోలీసు అధికారిని, ఏమీ జరగనప్పుడు-ఏమవసరమున్నదని అంత అర్థరాత్రి వచ్చారని ప్రశ్నించారు. తనకు తెలియదని, ఎస్పీ గారు పిలుచుకుని రమ్మంటే వచ్చానని జవాబిచ్చాడా అధికారి. విషయం కొంతవరకు అవగాహన చేసుకున్న రాధాకృష్ణమూర్తి, అదేదో అరెస్ట్ వ్యవహారమేనని నిర్ధారించుకుని వచ్చిన పోలీసు అధికారిని గౌరవంగా సంబోధిస్తూ, కూచోమని కోరి, ఆయనకు కాఫీ ఏర్పాటు చేసి, దుస్తులు సర్దుకునేందుకు లోనికెళ్ళారు. తన జీవితంలో, అరెస్ట్ చేసేందుకొచ్చిన పోలీసు అధికారికి అంత మర్యాద ఇచ్చిన వారిని ఎవరినీ చూడ లేదన్నాడతడు.

నేనాయన జీవిత చరిత్రను గ్రంధస్తం చేస్తున్నప్పుడు, అలనాటి రాత్రి సంగతులను గుర్తు చేసుకున్న డాక్టర్‍గారు, పోలీసు అధికారి తన విధి నిర్వహణలో వచ్చినప్పుడు, గౌరవించడం కనీస బాధ్యతని, తానదే చేసానని చెప్పారు. ఆ సందర్భంగా ఒకటి రెండు జైలు సంఘటనలను గుర్తుచేసుకున్నారు. జైలులో వాళ్ల కొచ్చిన ఉత్తరాలను ముందుగానే పరిశీలించి-సెన్సార్ చేసినప్పటికీ, పూర్తి పాఠాన్ని చదువుకునే వీలు కలిగించి తిరిగి తీసుకునేవారు జైలు అధికారులు. ఇంటర్వ్యూలో పరిమితంగా కుటుంబ సభ్యులకు మాత్రమే - అదీ ఒకరిద్దరిని, ఒక గంట సేపు మాట్లాడనిచ్చేవారట. భార్యా పిల్లలు వచ్చినా, మాట్లాడేటప్పుడు ఇంటెలిజెన్స్ అధికారి పక్కనే కూర్చుని తనకు వినబడేట్లు మాత్రమే మాట్లాడాలని నియమం పెట్టేవారట.

డాక్టర్ రాధాకృష్ణమూర్తిని అరెస్ట్ చేసి, వరంగల్ సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారు. ఆయనతో పాటు చిర్రావూరి లక్ష్మీనరసయ్య, బోడేపూడి వెంకటేశ్వరరావు, మంచికంటి రాంకిషన్‍రావు లను అరెస్ట్ చేసింది ప్రభుత్వం. జైల్లో వీరే కాకుండా నక్సలైట్లు, ఆరెస్సెస్‍కు చెందినవారు, జనసంఘీయులు, ఇతర రాజకీయ పక్షాలకు చెందిన మరికొందరు కూడా వున్నారు. వారం రోజుల పాటు అందరూ ఉమ్మడి కాపురం చేసి, కలిసిమెలిసి భోజనాలు చేసేవారు. ఒకనాడు కరీంనగర్ నుండి జనసంఘం పార్టీకి చెందిన చెన్నుపాటి విద్యాసాగరరావుగారు (వీరు 1998 ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర హోం శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర, తమిళ నాడు గవర్నర్) వంటినిండా దెబ్బలతో జైలుకు వచ్చారు. , ఆ తర్వాత ఎవరి బారక్స్ వాళ్లకే కేటాయించారు.

డాక్టర్ రాధాకృష్ణమూర్తికి తమ పార్టీ వారికి రాజకీయ పాఠాలు చెప్పినట్లే, అక్కడ ఇతరులకు తమ పార్టీ విధానాలు చెప్పడం, ఇతర పార్టీ వారి నుంచి వినడం ఒక నిత్యకృత్యమై పోయింది. డిటెన్యూలలో వరంగల్ అడ్వకేట్ ఆర్.ఎస్.ఎస్ నాయకులు భండారు సదాశివరావు గారు బాగా చదువుకున్న వ్యక్తి. భగవద్గీత, షడ్ దర్శనాలకు సంబంధించిన పలు విషయాలు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ప్రతివాది భయంకర షఠగోపాచారి మరో డిటెన్యూ. ఆయన ఆయుర్వేద వైద్య ప్రముఖులు. వరవర రావును కూడా వీరితో పాటు అదే జైల్లో డిటెన్యూగా వుంచింది ప్రభుత్వం. అలానే పలు ముస్లిం నాయకులనూ నిర్బంధించి అక్కడే పెట్టింది. పద్దెనిమిది నెలల ఆ జైలు జీవితంలో సహచర డిటెన్యూల దగ్గర భగవద్గీత, షడ్ దర్శనాలు, ఆయుర్వేద వైద్యం, ఇస్లాం మతానికి చెందిన విషయాలను నేర్చుకున్నారు డాక్టర్ రాధాకృష్ణమూర్తి. ఈ జైల్లో కూడా జైలు డాక్టర్ డ్యూటీని ఆయన డిటెన్యూగా వచ్చిన తర్వాత ఆయనకే అప్ప చెప్పారు. తృప్తిగా వృత్తి ధర్మాన్ని అక్కడ కూడా నిర్వహించారు. అత్యవసర పరిస్థితి ఎత్తివేయడానికి నెల రోజుల ముందర అందరు డిటెన్యూలతో పాటు డాక్టర్ రాధాకృష్ణమూర్తిని కూడా విడుదల చేసింది ప్రభుత్వం. అయితే ఆలా బయటకు పోయి, ఇలా లోనికి వస్తానని అనుకోలేదాయన అప్పటికి.

జైలు నుంచి విడుదలై, ఖమ్మం సమీపంలోని నేలకొండపల్లిలో జరుగుతున్న వ్యవసాయ కార్మిక రాష్ట్ర మహాసభలకు హాజరయ్యేందుకు వెళ్లారు. వారం రోజులపాటు, ఎమర్జెన్సీ ఇంకా అమలులో వుండగానే జరుగుతున్న సభలు, విజయవంతంగా జరగడాన్ని దగ్గరగా గమనించిన పోలీసులు, వాటిని భగ్నం చేసి, నాయకులని భావించిన రాధాకృష్ణమూర్తిని మళ్ళీ జైలుకు తరలించారు. జైలుకు వెళ్లిన కొన్ని రోజులకే, 1977 మార్చ్ నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ప్రకటన వెలువడింది. ఖమ్మం నుంచి లోక్ సభ స్థానానికి సిపిఎం అభ్యర్థిగా డాక్టర్ రాధాకృష్ణమూర్తిని పోటీ చేయించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. జైల్లో వున్న ఆయనకు కబురు చేసి విషయం చెప్పారు. ఆయన నామినేషన్ పత్రాలపై జైలులోనే సంతకాలు పెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకు పోటీలో వున్న అభ్యర్థిగా విడుదల చేశారు.

హఠాత్తుగా, జనవరి 1977 లో ఎన్నికల నిర్ణయం ప్రకటించింది ఇందిరా గాంధీ. ప్రజలపై, ప్రజా శక్తిపై తనకు అపారమైన విశ్వాసం వుందని, మార్చ్ నెలలో ప్రజల నిర్ణయం కొరకు ఎన్నికలు జరుగుతాయని అన్నది. జైళ్లలో నిర్బంధించిన వారందరినీ విడుదల చేయించింది. ఎమర్జెన్సీ దురాగతాలను ఎదుర్కోవాలని జైలు నుంచే జయప్రకాష్‌నారాయణ 'సంపూర్ణ విప్లవం' అంటూ ఇచ్చిన పిలుపు... దేశ రాజకీయాల దిశను మార్చివేసింది. అప్పటి వరకు చిన్న చిన్న పార్టీలుగా ఉన్న అనేక పార్టీలన్నీ ఒకే గొడుగుక్రిందకు వచ్చి జనతాపార్టీగా ఏర్పడ్డాయి. ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఆమె అనుంగు సహచరుడు జగ్జీవన్ రామ్ కూడా బాంబు పేల్చాడు. ప్రతి పక్షాల సరసన చేరాడు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలో జనతా పార్టీ ఆవిర్భవించింది. వామపక్షాల మద్దతు కూడా లభించింది. కాంగ్రెస్‍లోని యంగ్ టర్క్స్ కూడా వారితో జత కట్టారు. నియంతృత్వ పాలనకు స్వస్తి చెప్పాలని, మకుటంలేని మహారాణిని ఓడించాలని జనతా పార్టీ ఎన్నికల్లో పిలుపిచ్చింది. నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య పోరాటంగా, జనతా పార్టీ ఓటర్ల ముందుకు పోయింది. మార్చ్ 20, 1977 న జరిగిన లోక సభ ఎన్నికలలో ఇందిరా గాంధీని ఆమె నియోజక వర్గంలోను, ఆమె సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీని దేశంలోను దారుణంగా ఓడించారు. ప్రప్రధమ కాంగ్రేసేతర ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు ఓటర్లు. కలగాపులగం లాంటి కాంగ్రేసేతర పార్టీల కలయికతో ఏర్పడిన జనతా ప్రభుత్వానికి, ఇందిరా గాంధీ మంత్రి వర్గంలో ఉప ప్రధాన మంత్రిగా చేసి, ఆ తర్వాత రెండేళ్లు ఆమెచే జైల్లో నిర్బంధించబడిన మొరార్జీ దేశాయ్ ప్రధాన మంత్రిగా సారధ్యం వహించారు. ప్రజల తీర్పును శిరసావహిస్తానని, ప్రజల సేవలోనే గడుపుతానని అంటూ పదవికి రాజీనామా చేసింది ఇందిరా గాంధీ.


అలా ఒక అధ్యాయం ముగిసింది భారత దేశ చరిత్రలో! 

Tuesday, June 20, 2017

KCR-The Good Shepherd : Vanam Jwala Narasimha Rao

KCR-The Good Shepherd
Vanam Jwala Narasimha Rao
On Tuesday, June 20, 2017, wearing a Gongadi (Blanket generally worn by Yadavas the shepherds), a crimson-red turban and playing the oggodolu, like a traditional shepherd, Chief Minister K Chandrashekhar Rao has formally launched the first ever, innovative sheep distribution scheme on a massive scale aiming to make Yadavs and Kurumas in the state richer by Rs 25,000 Crore in the next three years. The scheme is expected to transform livestock economy and allied traditional occupations in the state, thereby making the Yadavs in the state, the richest in the country.

"It is shameful that despite the presence of a population of 30 lakh Golla and Kuruma people, Telangana sources about 650 lorries of sheep from different parts of the country including Rajasthan," declared KCR. "We are now confident about creating an economy of Rs 25,000 crore in the state within three years. But, we want them to follow the government's guidelines and take care of their sheep distributed today."

The plan is to give 20 sheep and a ram to every Yadav and Golla Kuruma family in the state. It would mean distributing 15 million sheep in two years for Rs 10,000 crore to bring every Golla - Kuruma community under the scheme. Not only is the stock being sourced from other states, but also grass is being planted on 46 lakh acres of land to ensure enough fodder and 100 mobile veterinary clinics are set up. A toll-free number -1962 for the shepherds was also inaugurated on the occasion by KCR while distributing the sheep to 825 beneficiaries in his Gajwel Assembly constituency.

Speaking on the occasion, the CM declared that the sheep distribution programme is being held in 100 Legislative Constituencies on a single day. “It is decided to distribute Sheep to 4 Lakh families, but the government has received 7.61 Lakh application out of which 7.18 Lakh are sanctioned. 1.5 lakh Sheep are distributed. There is an estimate that the State has 1 Crore sheep and 1.5 Crore Sheep would be distributed in the next two years. It makes the Sheep population at 2.5 Crore. In two years each sheep will give 3 Lambs and this will raise their population to 7.5 Crore. If the rearers keep 2.5 Crore Sheep for breeding and sell the rest 5 Crore at the rate of Rs 5,000 per Sheep, it will be Rs 25,000 Crore wealth. This is a new and innovative way of understanding the human resource,” the CM said.

Ever since he took over the reigns of the new State, KCR, a true visionary, has aimed at strengthening the rural economy. As part of that exercise, he hit upon a strategy to strengthen the hereditary professions in the rural areas economically and to sustain them. The CM has realised the potential in Sheep rearing and the ever-growing demand for the meat. Yadavas, Kurumas have an expertise in Sheep breeding and rearing from generations together. By giving them a helping hand, the government is planning to develop the Sheep rearing in a big way. With this initiative, the state can have adequate meat required for its own consumption and can export to other States and countries.


Transparent and simple guidelines for the Sheep rearing have been put in place and adhered to.

·       Every person who is above 18 years of age from Yadava and Kuruma families are made members of the Society. More than one person per family can also become the members. If need be more new societies are also formed. Sheep units are given to every member of the Society. Those who have already in the possession of Sheep will also get Sheep units. Even if somebody is having a job in the family, his father and brother can become members and get the Sheep unit.

·       Every Unit will have 20 Sheep and one Ram. Each unit's expenditure will be Rs 1.25 Lakh. Of this, the beneficiary bears 25 per cent (Rs 31, 250); the government gives rest of 75 per cent (Rs 93,750) as Subsidy. This scheme is being implemented without involvement of the banks. There is no dearth of funds for the Sheep Rearing. The government has decided to raise Rs 4,000 Crore from NCDS.

·       Units will be sanctioned for half of them in the first year; the rest will be in the next year. For the sanction of Units in the first year, to eliminate any political and other influences, Units will be sanctioned by draw of lots. If in a village there are 60 society members, lottery will be held before 30 members in the first phase.

·       At the State level, Meat and Poultry Development Corporation will coordinate the scheme. In the districts, Animal Husbandry officials under the supervision of the Collector will coordinate the scheme. MRO, MDO and Government Veterinary Doctor’s Committee will implement the scheme. A weeklong program was conducted to enroll members into the Societies. Officials personally went to the villages and enrolled the members and recorded the number of Sheep available there.

·       Sheep are purchased from the neighbouring States only and not from the Telangana State. The government is very keen on this. Officials visited the neighboring states and purchased the Sheep and Ram. The state government bears the Insurance and transportation charges. Every Sheep will be insured. Insurance cover will be given not only to the new Sheep but also to the old ones, which are in the possession of the Yadav and Kuruma communities in the State.

·       There is no ban for the Sheep to graze in the forests. The state government has already given instruction to forest officers to allow Sheep and Ram to graze in the forestlands. There is 67.50 Lakh acres of forestland in the State. About 25-lakh acre of lands is full of hillocks, rocky area which is not suitable for agriculture. Yadavas have about 15 lakh acres of land under their possession. In all about one Crore acres of land is available for the Sheep to graze. Stylo Grass variety will be grown on these lands for the Sheep to have a healthy food. In the Mango and other Orchids if the Sheep can graze, it will be beneficial for the Sheep rearers as well as the farmers. The Orchid land will become fertile with the organic fertilizer of the Sheep.

·       The Sheep will be tested at the time of their purchase. Sheep will be given vaccines on a regular basis. Medical health will come to the doorstep of the units. One Mobile Vet Clinic will be provided in all the Rural Assembly Constituencies. Veterinary health system will be strengthened at the Mandal level. Already 309 Veterinary doctors are appointed in addition to the existing 881.  Supportive staff will also be appointed. Veterinary health will be improved in the State in the next two years as there will be crores of Sheep in the State

·       Measures will be taken for marketing of the Sheep. A Shandy will be held for two or three Mandals.


            In the Biblical terms, Lord Jesus has always been compared (He Himself has compared) to that of a Good Shepherd who protects and keeps his flock. In modern day times in the Telangana state, KCR is compared as a Good Shepherd by the Yadavas and Kurumas for coming to their rescue which no other government ever did and making them prosper like no one ever did. END

Golden days in offing for farmers in TS : Vanam Jwala Narasimha Rao

Golden days in offing for farmers in TS
Vanam Jwala Narasimha Rao
The Hans India (21-06-2017)

The latest announcement of Chief Minister K Chandrashekhar Rao to give Rs. 8000 per acre at the rate of Rs. 4000 for kharif and Rabi seasons to the farmer will go a long way in developing agriculture sector into a challenging profit-making sector. It is for the first time anywhere in the world a government is giving investment to the farmer and organizing farmer federations to monitor the sector.

The time has now loomed wherein the decades old exploitation of farmer by middle men is put to an end and confidence infused in them.  If a situation comes where the farmer is placed in such a difficult position of not able to sell his agricultural product, the farmers’ federation steps in and buy it by offering the support price. Government gives a guarantee to farmers’ federation and seed money of Rs. 500 crores. According to Chief Minister the farmers’ federation at all levels-village, Mandal, district and state-will be made so powerful that they will have adequate money to buy produce from farmer. To workout modalities CM plans to have an elaborate meeting with farmers’ representatives. The department of agriculture is gearing up to depute officers to every district to study in one village the methodology of implementing the plan of action by way of discussions with farmers. 

Against this background, Government of Telangana has come out with an Agriculture Action Plan articulating all the activities and schemes that are being undertaken in the state in the interest of farming community.

The average size of landholding per farmer in the state, according to census is 1.12 hectares. The total number of operational holdings are 55.54 lakhs covering an area of 61.97 lakh hectares. Based on climatic parameters like rainfall, soils and cropping pattern the state is divided in to four agro-climatic zones which have been further sub divided into 98 different farming situations like black, red, shallow, lateritic etc soils. It is estimated that about 57 lakh hectares is under cultivation. Cereals like rice, wheat, jowar; pulses like red gram, green gram, black gram; groundnut, soya been, castor, cotton, chillies, sugarcane, onion etc are the crops that are grown in the state.

Seed is the most important agriculture input and hence seed production and distribution is a continuous process in the state. To produce quality seed and develop state as a seed bowl of India, long term seed production plan is drawn in the state involving university and department of agriculture as well as research institutions. Quality seed of about ten lakh quintals produced in the state is distributed to the farmers through state and central schemes like national food security mission and normal state plan. The subsidy seed is supplied through various seed supplying government nodal agencies. There are 10 state seed production farms in the state.

Seed village program and certified seed production through seed villages is an important activity that is being taken up to ensure supply of quality seed to farmer. The supply of seed to the farmers would be in time at their places at affordable prices besides ensuring quick multiplication of new seed varieties in a shorter time in that Mandal or district based on the crop situation. As part of seed regulation activity, the state has analytical services, seed testing labs, quality assurance program, licensing of seed marketers, special squads for surprise checks etc.


Fertilizer is an essential commodity and is a critical input in crop production. Department of agriculture takes necessary steps to supply quality fertilizers to the farmers. Plant protection which needs greater attention to prevent yield loss due to incidence of pests and diseases is addressed carefully. This is being done through release of new pest and disease resistant varieties, development of new pesticide molecules, adopting integrated pesticide management practices and timely communication of plant protection measures to the farmers.

Farm mechanization which will help in increasing productivity and reduce cost of cultivation is given importance. It will also enable the farmer to complete farming operations in time. Agriculture department has contemplated to distribute various farm machinery and implements on subsidy basis.

Three crop insurance schemes are being implemented in the state since 2016 kharif season namely, Pradhan Mantri Fasal Bhima Yojana, Weather based Crop Insurance Scheme and Unified Package Insurance Scheme. All farmers irrespective of category, who are borrowing crop loans from any bank are compulsorily covered under crop insurance. It is optional for others.

To meet the growing needs of the population for food grains, it is imperative to enhance productivity and this area is addressed through training to farmers for improving their knowledge and skills to increase production with low cost technology. The basic objective of this type of agriculture extension is to transfer latest agricultural technologies to farmers. Women too play critical role in all farm related activities from land preparation to marketing and contribute a higher proportion of labour. To strengthen women participation Farm Women Empowerment program is being implemented.

Rainfed Area Development (RAD) program with an objective of increasing agricultural productivity of rainfed areas in a sustainable manner is being implemented. It aims at promoting integrated farming system with emphasis on multi-cropping, rotational cropping, inter-cropping, mixed cropping practices with allied activities like horticulture, livestock, fishery etc. for sustaining livelihood.

Soil Health Management, a major technological challenge, is yet another activity that is being take up in the state to increase soil nutrients and thus enhance crop productivity for ensuring food security and sustaining rural development. The objective of this program is to facilitate and promote integrated nutrient management through judicious use of chemical fertilizers, in conjunction with organic manures and bio-fertilizers for improving soil health and its productivity. The department of agriculture takes-up soil testing in all the farmers’ fields with a view to facilitate in balanced fertilizer application which includes generation of soil health cards.

The government intends to divide the state into various crop colonies and an assessment is being made to estimate the requirement of various agricultural produce, vegetables, oil products, fruits etc both for domestic and for export purposes. The assessment covers not only the requirement of human beings but also that of livestock. Government is also toying with the idea, to restrict some lands for growing only vegetables to meet the growing demand for them and the inability to meet. A village could be made self-sufficient in vegetables if only at least two farmers for every village exclusively grow vegetables and supply to the entire village. In other words, every village could have an exclusive vegetable growing crop colony, so goes the thinking in the government.


Should the government succeed in realizing plans, it will rid the farmers of exploitation for decades together. The farmer would become a happy and wealthy person in the state of Telangana. END

Sunday, June 18, 2017

మేలు చేసేవారికి మేలు చేయాలన్నదే సనాతన ధర్మం .....ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలానరసింహారావు

మేలు చేసేవారికి మేలు చేయాలన్నదే సనాతన ధర్మం
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలానరసింహారావు
సూర్య దినపత్రిక (19-06-2017)

            ఇక్ష్వాకు వంశ గౌరవం కోరే సముద్రుడు, రామకార్యార్ధమై వెళ్తున్న హనుమంతుడికి ఏవిధంగా సాయపడగలనా అని ఆలోచిస్తాడు. తాను రామకార్యం చేయలేక పోయినా, చేసే మహానుభావులకైనా తోడ్పడాలిగదా! అని భావిస్తాడు. ఏంచేయాలన్న ఆలోచనలో పడ్డాడు. ఇక్ష్వాకు వంశీయుడైన సగర చక్రవర్తి ద్వారా తాను వృధ్ధి చెందిన విషయాన్ని గుర్తుచేసుకున్టాడు. పరాక్రమించి పోతున్న ఆంజనేయుడికి కష్టం కలుగకుండా చూడడమే మేలనుకుంటాడు. ఫుండరీకాక్షుడైన రామచంద్రుడి దూతకు సహాయం చేయకపోతే, సముద్రుడికి దయ-బుధ్ధి, లేదనుకుంటారనీ, లోక నిందకు గురవుతాననీ భయపడ్తాడు. భగవత్ కార్యానికి తోడ్పడే శక్తి వుండికూడా అలా చేయకపోతే అపకీర్తి పాలవుతానని ఆందోళన చెందుతాడు. హనుమంతుడికి ఒకింత బడలిక తీర్చే ఉద్దేశ్యంతో, ఆతర్వాత తక్కిన ప్రయాణం సులభంగా చేయకలుగుతాడన్న ఆశయంతో, తనలో దాగివున్న మైనాక పర్వతాన్ని ఆపని కొరకు పురమాయిస్తాడు సముద్రుడు. మైనాకుడు మేనకకు కొడుకు...హిమవంతుడికి జన్మించాడు....పార్వతికి తోబుట్టువు.

            "నీకొక వార్త చెప్తా విను" అని బంగారు శిఖరాల మైనాకుడితో అంటాడు సముద్రుడు. పాతాళం నుండి భూలోకానికి రాకుండా రాక్షసులను అడ్డుకునేందుకు, మైనాక పర్వతాన్ని ఉక్కు గుండులాగ వుంచాడింద్రుడనీ, ఏప్రక్కకైనా పక్షిలాగా ఎగిరిపోయే సామర్ధ్యం మైనాకుడికుందనీ గుర్తు చేసాడు సముద్రుడు.

            "శ్రీరామచంద్రమూర్తి కార్యార్ధిగా అనితరసాధ్యమైన పని చేయడానికై ఆకాశమార్గాన పోతున్నాడు హనుమంతుడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినవారు నాకు పూజ్యులు. స్నేహం వల్ల, సౌమ్య భావంవల్ల, నీవు నాకొక సహాయం చెయ్యాలి. చేయాల్సిన పని సకాలంలో చేయకపోతే దుష్టుడని సత్పురుషులు కోప్పడుతారు. కాబట్టే సహాయం చేయాలి. హనుమంతుడు మనకు అతిథి, పూజ్యుడు. నీవు నీటిలోనుండి లేచి, ఆయనకు ఎదురేగి, బడలిక తీరేటట్లు నీనెత్తిన ధరించు. నీవిట్లా చేస్తే, ఆయనకు కొంత బడలిక తీరుతుంది. తక్కిన సముద్రాన్ని సులభంగా దాటిపోగలడు. రామచంద్రుడి మంచి నడవడి, భార్యా వియోగం, లంకకు వెళ్లే ఆంజనేయుడి శ్రమ ఆలోచించి సంతోషంగా నీటినుండి బయటకురా" అంటాడు మైనాకుడితో. (ఈసంభాషణ సారాంశం: భగవత్ కార్యం చేసే ఆసక్తి వుండికూడా చేయలేనివాడు, చేస్తున్న వారిని ప్రేరేపించి, వారితో ఆ కార్యాన్ని విజయవంతంగా చేయించాలనీ, అతిథిని వేరే విధంగా సత్కరించ లేనివారు మంచి మాటలతోనూ, కూర్చోడానికి ఆసనం ఇవ్వడం ద్వారానూ, దాహానికి మంచి నీళ్లు ఇవ్వడం ద్వారానూ ఆదరించాలని అర్థం).

            సముద్రుడి మాటలకు స్పందించాడు మైనాకుడు. మేఘాలను చీల్చుకుంటూ వస్తున్న సూర్యుడిలాగా, నీటిని రెండు భాగాలు చేసి పైకొచ్చాడు. శతసూర్యకాంతితో  తనదారికి అడ్డంగా నిల్చిన మైనాకుడిని గమనించి, హుంకరించి, ఆకాశమార్గంలోనే ఢీకొన్నాడు హనుమంతుడు. హనుమ దెబ్బకు, విలపిస్తూ, శోషిల్లి పడిపోయాడు మైనాకుడు. పిడుగుపాటులాగా తగిలిన హనుమంతుడి దెబ్బకు కొంత దూరం వరకూ కొట్టుకు పోయిన మైనాకుడు, లోలోన మటుకు సంతోషించాడు. ఆయన బలాన్ని తెలుసుకున్నందుకు పొంగిపొయాడు. ప్రీతిగా హనుమంతుడితో ఇలా అన్నాడు:

            "వాయునందనా! ఎలాంటి అసాధ్యమైన పనికి పూనుకున్నావయ్యా! నీశక్తిని పొగడ ఎవరితరం? నీబలం, వేగం చూసి మెచ్చుకున్నాను. నాబంగారు శిఖరం మీద నీశ్రమ తగ్గేంత వరకు నిలిచి, ఆతర్వాత నీ ఇష్టమొచ్చినట్లు పో. నీమీద నాకు ప్రేమ కలగటానికి కారణం, మేలు చేసేవారికి, మేలు చేయాలన్న సనాతన ధర్మమే సుమా. సముద్రుడు నీమేలు కోరి నన్నెంచుకున్నాడు. దానికి కారణముంది. రఘువంశంలో పుట్టిన సగరుడనే రాజు వల్ల వృధ్ధి చెంది సాగరుడన్న పేరుతెచ్చుకున్నాడు సముద్రుడు. ఆవంశంలో జన్మించిన శ్రీరామచంద్రమూర్తి కార్యార్ధివై పోతున్న నీకు సహాయపడాలని భావించాడు. నీకు సాయపడితే వారికి చేసినట్లేకదా! సాగరుడు కృతజ్ఞుడన్న గౌరవం పొందగోరి నన్ను పిల్చి నీగురించి చెప్పి, నాకు నిన్ను చూపాడు. రామకార్య ధురంధరుడవగుటచే పుణ్యాత్ముడైన నీవు నూరు యోజనాల సముద్రాన్ని దాటే ప్రయత్నంలో వున్నావనీ, నిన్ను నాశిఖరంపై కొంత సేపుంచుకొని, నీసేద తీర్చితే, మిగిలిన ప్రయాణం కష్టం లేకుండా చేస్తావనీ, సముద్రాన్ని దాటగలవనీ నాతో సముద్రుడన్నాడు." 


            "వాయునందనా, ఆయన ప్రేమతో చెప్పినందువల్ల నీకొరకై నేనొచ్చాను. నీవిక్కడ కాసేపాగి, ఫలాలు, కందమూలాలు తిని, అలసట తీరేవరకు విశ్రాంతి తీసుకో. తర్వాత మిగిలిన దూరాన్ని వేగంగా, సులభంగా, పోవచ్చు. కొత్తవారైనా సత్పురుషులకు ప్రేమతో పూజించి కైంకర్యాలు చేస్తే మంచిదని పెద్దలంటారు. అతిథి గుణవంతుడైతే కొత్త, పాత అన్న మీమాంస చేయకూడదు. అదలావుండగా నేను నిన్ను పూజించడానికి మరో కారణముంది. మహాత్ముడూ, బలమ్లో భయంకరుడూ అయిన వాయుదేవుడికి నీవు కొడుకువి. నీయోగ్యత నాకు తెలిసినా, తెలియక పోయినా, నీ తండ్రి యోగ్యతవల్ల, నేనునిన్ను పూజించ దల్చాను. అట్టి మహానుభావుడి కొడుకైన నీవు మాకు అతిథివి కాబట్టి నేనిచ్చే అతిథి సత్కారాలు స్వీకరించు. ఎట్టివాడైనా అతిథి పూజ్యుడే కద! వారిలో సజ్జనుడు మరీ పూజ్యుడు. సద్వంశ ప్రసూతుడు మరీ-మరీ పూజ్యుడు. ఈమూడు నీలో వున్నందువల్ల నాకునీవు పూజ్యుడవు. ధర్మం ఇట్టిదని తెలియక పోయినా, తెల్సుకోదల్చిన వారికీ, ధర్మం చక్కగా తెలిసిన వారికీ అతిథి పూజ్యుడే. అలాంటప్పుడు నీవంటి సాధుపురుషుడు పూజ్యుడని చెప్పాల్సిన పనేలేదు. మన ఇరువురి సంబంధం ఇదేకాదు. నేనూ నీకు కావాల్సినవాడినే. కొత్తవాడిని కాను. నీవు వాయువేగ, మనోవేగాలతో పోగలవు. నిన్ను నేను పూజిస్తే వాయుదేవుడిని పూజించినంత" అని మైనాకుడు హనుమంతుడితో విన్నవిస్తాడు.

"నేను నిన్ను పూజించటానికి ఇంకో కారణం కూడా వుంది. ఫూర్వకాలంలో కొండలకు రెక్కలుండేవి. వాటి సహాయంతో వేగంగా ఆకాశంలో సంచరించేవి. అప్పుడవి తమ తలల మీద పడతవేమోనని మునులు, దేవతలు భయపడేవారు. ఇది విన్న ఇంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాల రెక్కలు నరుకుతూ, నారెక్కలు కూడా నరికేందుకు వచ్చాడు. నీ తండ్రి వాయుదేవుడప్పుడు నన్ను చిమ్ముకుంటూ వచ్చి సముద్రంలో పడేసాడు. అందుచేత నేను రెక్కల అందం చెడిపోకుండా వున్నాను. దీనికి మీతండ్రి వాత్సల్యమే కారణం సుమా! అందుకే నీతండ్రీ నాకు పూజ్యుడే. నిన్నూ అందుకే గౌరవిస్తాను. నాస్నేహాన్ని వృధా కానీయకుండా నీవూ నన్ను అలరించాలి. నేనుచేసే సత్కారాన్ని స్వీకరించి అలసట తీర్చుకుని, నన్నూ, సముద్రుడిని సంతోషపర్చు" అని అన్న మైనాకుడికి తనదైన శైలిలో జవాబిచ్చాడు హనుమంతుడు.

          "పర్వతోత్తమా, నీవు చేసే సత్కారాలు అంగీకరించినట్లే. అన్న రసంకన్న ఆదరణ రసం మేలు. నీ మంచి మాటలచేతనే సపర్యలు అంగీకరించినట్లయింది. ఆఫలం నీకు దక్కింది కూడా. నేను సంతోషించాను. నేనిక్కడ ఆగకూడదు. కార్యం, కాలం నన్ను తొందరపెట్తున్నాయి. చేయాల్సిన పని చాలా వుంది. చీకటి పడిపోతున్నది. ఇంకా ఆలస్యమైతే చేయవలసిన పనికి తగినంత పొద్దులేదు. నేను ఎక్కడా ఆగననీ, రామబాణంలా వెళ్లి వస్తాననీ, పని చక్కబెట్టుకొస్తాననీ వానరులతో ప్రతిజ్ఞ కూడా చేసాను. నన్నాపవద్దు...కోప్పడవద్దు మిత్రమా!"అన్నాడు. 

Thursday, June 15, 2017

కాలానుగుణంగా బడ్జెట్ : వనం జ్వాలా నరసింహారావు

కాలానుగుణంగా బడ్జెట్
వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (16-06-2017)

ఆర్థిక సంవత్సరాన్ని జనవరి నెలతో మొదలుపెట్టి  డిసెంబర్ నెలతో ముగించాలన్న ప్రతి పాదనను ప్రధాని నరేంద్ర మోడీ తెరముందుకు తెచ్చారు. ఆర్థిక రాజకీయ అస్తవ్యస్త పద్దతులతో దేశం ఎంతో నష్టపోయిందనీ, సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకునే పద్దతి లేక ప్రభుత్వం తీసుకున్న ఎన్నో మంచి  నిర్ణయాలు, పథకాలు, ఆశించిన ఫలితాలు అందుబాటులో ఉంచడానికే  ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్లు మోడీ అన్నారు. దేశంలో వ్యవసాయాదాయం చాలా ముఖ్యమైనదనీ ఆ ఆదాయం చేతికందే కాలం ముగిసిన వెంటనే బడ్జెట్ ను రూపొందించటం అవసరమని కూడా మోడీ చెప్పారు. ఏప్రిల్ నెలలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే సాధారణ బడ్జెట్ ను ముందుకు జరిపామనీ, బడ్జెట్ సమర్పణ తేదీల్లో మార్పులు చేయడం చరిత్రాత్మకమనీ అంటూ, ఆ కోణంలోనే ఆలోచించి ఆర్థిక సంవత్సరాన్ని కాలెండర్ ఇయర్ గా మార్చే ఆలోచన వున్నట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ ఆలోచనా విధానానికి అనుగుణంగా, అదే పంథాలో, ఒక (ఆంగ్ల) కాలెండర్ సంవత్స్రరం నుండి మరుసటి కాలెండర్ సంవత్సరం వరకు (అంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు), ఆర్థిక సంవత్సరంగా పరిగణించి, తెలంగాణా రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశ పెట్టే విధానానికి శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు భావిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ, తదితర ఉన్నతాధికారులతో సీఎం సమావేశం నిర్వహించి తదనుగుణంగా ఆలోచనలు పంచుకోవటం కూడా జరిగింది. ఈ పాటికే ఈ విధానాన్ని సూత్రప్రాయంగా అంగీకరించి, అమలు చేయాలనుకుంటున్న మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఇలా నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన కారణాలను, అమలు కాబోతున్న పద్ధతులను, పాటించాల్సిన మెళకువలను, అధ్యయనం చేయడానికి సీఎం ఆదేశాల మేరకు ఆర్థిక మంత్రి-అధికారుల బృందం కసరత్తు చేస్తోంది. బహుశా రాబోయే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ఈ పద్ధతిలోనే ప్రవేశ పెట్టడానికి అవకాశాలు మెండుగా కనిపిస్త్రున్నాయి.

కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ జూలై 2016 లో, మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారుడు డాక్టర్ శంకర్ ఆచార్య అధ్యక్షతనొక ఉన్నత స్థాయి కమిటీని నియమించి, ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ నెల మొదటి నుండి మార్చి నెల చివరి వరకు కాకుండా జనవరి మొదటి నుండి డిసెంబర్ నెల చివరి వరకు మార్చడానికి అనుగుణంగా, సాధ్యాసాద్యాలను పరిశీలించాలని కోరింది. కమిటీ తన సిఫార్సుల నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రికి అందచేసింది. మార్పు ద్వారా ఎదురయ్యే సమస్యలను, లభించనున్న వెసలుబాట్లను కూలంకషంగా ఈ నివేధికలో కమిటీ పేర్కొన్నది. ఐతే, ఈ నివేదికను ఇంకా బహిర్గతం మాత్రం చేయలేదు. కాకపోతే అనధికారికంగా అందుబాటులోకి వచ్చిన సమాచారం మేరకు, కమిటీ తన నివేదికలో, మార్పుకు అనుకూలంగా నిర్ణయం వెలిబుచ్చడంతో పాటు, వ్యవసాయరంగంలో పంటల కాలానికి అనుగుణంగా తీసుకునే చర్యలు, వ్యాపార రంగంపై ఉండే ప్రభావం, పన్నుల అవలంబన పద్దతులు, గణాంకాలలో అనుసరించాల్సిన పద్దతులు, పరిగణించదగ్గ లెక్కల సమీకరణ తదితర అంశాలను, విశదీకరించింది. శంకర్ ఆచార్య తో పాటు ఈ కమిటీలో, మాజీ క్యాబినెట్ కార్యదర్శి కె.ఎమ్. చంద్రశేఖర్, సెంటర్ ఫర్ పాలసీ రీసర్చ్ సీనియర్ ఫెలో రాజీవ్ కుమార్, తమిళనాడు మాజీ ఆర్థిక కార్యదర్శి పి.వి. రాజారామన్ కూడా సభ్యలుగా ఉన్నారు. వాస్తవానికి లోగడ, 33 ఏళ్ల క్రితం కూడా, కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ఉన్నత స్థాయి కమిటీని 1984లో ఎల్. కె. ఝా అధ్యక్షతన ఎర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ కూడా ఆర్థిక సంత్సరాన్ని కాలెండర్ ఇయర్ గా మార్చడానకి సూచించినప్పటికీ కమిటీ సూచనలను సీరియస్ గా పరిగణలోకి తీసుకోలేదు. రుతుపవనాల ప్రభావం ప్రభుత్వ బడ్జెట్ మీద ఉంటుందనీ ఝా అభిప్రాయ పడ్డారు. పలురకాల ఇతర కమిటీలు, విద్యావేత్తలు కూడా ఆర్థిక సంవత్సరాన్ని మార్చి సంస్కరణ దిశగా పయనించాలని సూచించారు. నీతి ఆయోగ్ సభ్యుడు బిబేక్ దెబ్రాయ్, నీతి ఆయోగ్ ప్రత్యేక అధికారి కిశోర్ దేశాయ్, దీనికి సంబంధించి రూపొందించిన ఒక అధ్యయన పత్రంలో, ప్రపంచ వ్యాప్తంగా, ఏదేశంలో కూడా, ఫలానా కాలపరిమితిని మాత్రమే ఆర్థిక సంవత్సరంగా పరిగణించాలని నిర్దుష్టంగా చెప్పడం జరగలేదని పేర్కొన్నారు. ఒక్కో దేశం ఒక్కో విధానాన్ని అనుసరిస్తూ వస్తున్నది. "ఇదీ" అంటూ ఒక ప్రమాణం ఏదీ లేదు. ఆర్థిక సంవత్సరంగా  ఏప్రిల్ ఒకటి నుండి మార్చి 31 వరకు పాటించే విధానాన్ని భారతదేశం 1867 నుంచి పాటిస్తూ వచ్చినప్పటికీ, గత 150 సంవత్సరాలలో, అనేక సందర్భాల్లో ఈ విధానాన్ని ప్రశ్నించటం, దీనిపై వాడిగా-వేడిగా చర్చించటం జరుగుతూ వస్తున్నదని వీరు అభిప్రాయపడ్డారు. 1867కు పూర్వం, ఆర్థిక సంవత్సరాన్ని మే 1 వ తేది నుంచి మరుసటి సంవత్సరం ఏప్రిల్ 30 వరకు పాటించేవారు. అప్పటి బ్రిటీష్ ప్రభుత్వ పాలకులు భారతదేశంలో పాటించాల్సిన ఆర్థిక సంవత్సర తేదీలలో మార్పులు తీసుకు రావటం జరిగింది. దానికి ప్రధాన కారణం వారి దేశంలో అమలవుతున్న విధానమే...ఆ పద్ధతినే భారతదేశంలో కూడా అమలు చేయాలన్న వారి కోరికే.

భారతదేశం అనుసరిస్తున్న బడ్జెట్ పద్దతికి 150 సంత్సరాల పైగా చరిత్ర ఉంది. దీనిని తొలిసారిగా ఏప్రిల్ 7, 1860లో ప్రవేశ పెట్టడం జరిగింది. అంటే భారత పరిపాలన ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి, బ్రిటీష్ ఆధిపత్యానికి మారిన రెండేళ్ళకి జరిగింది. 2010లో అప్పటి ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బడ్జెట్ మాన్యువల్ లో, అప్పటి తొలి ఆర్థిక మండలి సభ్యలు జేమ్స్ విల్సన్ బడ్జెట్ ఉపన్యాసాన్ని ఇస్తూ, మొట్టమొదటి సారి, దేశ ఆర్థిక విధానాలను సమగ్రంగా వివరించటం జరిగింది.

ఆర్థిక సంవత్సరాన్ని ఒక ఏడాదిగా పరిగణించాలనే విధానం, ఏ ఏడాదికి ఆ ఏడాది ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా, ప్రభుత్వ వ్యయానికి కావల్సిన మొత్తాన్ని చట్టసభల ఆమోదం పొందడానికి వీలుగా, రూపొందించడం జరిగింది. 1865 కన్నా ముందే, భారతదేశంలో ప్రస్థుతం అమల్లో వున్న ఆర్థిక సంవత్సరం విధానాన్ని ఆచరణలో తేవడానికంటే పూర్వమే, అప్పటి మాజీ పేమాస్టర్ జనరల్ నేతృత్వంలో నియమించిన కమిషన్ ఆఫ్ ఇంక్వైరీ, కాలెండర్ ఇయర్ ను ఆర్థిక సంవత్సరంగా వుండాలని సూచించింది. కారణాలేవైనా ఆ సూచన ఆచరణలోకి రావడం కుదరలేదు. స్వాతంత్ర్యానికి పూర్వం, వెల్ బీ కమీషన్ , ఛాంబర్లెన్ కమీషన్ గా అందరికీ తెల్సిన ది రాయల్ కమీషన్ ఆఫ్ ఇండియన్ ఫైనాన్స్,  కాలెండర్ ఇయర్ నే ఆర్థిక సంవత్సరంగా వుండాలని సూచించినా, ఏ రకమైన మార్పులు జరగలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత రాజ్యంగంలో నిర్దుష్ఠంగా ఆర్థిక సంవత్సరం ఇలా వుండాలని నిర్వచించడం కాని, స్పష్ఠంగా చెప్పడం కాని జరగలేదు. 1956 లోనూ, ఆ తరువాత అడపదడప, ఆర్థిక సంవత్సరం మార్పు గురించి ఏకాభిప్రాయంతో జాతీయ అభివృద్ది మండలిలో ప్రతిపాదనలు వచ్చాయి. 1958లో పార్లమెంటు ఎస్టిమేట్స్ కమిటీ, ఆక్టోబర్ 1వ తేదీతో ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావాలని సిఫార్సు చేసింది కాని, ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది. మొట్టమొదటి పరిపాలనా సంస్కరణల కమీషన్ నివేదికలో,  నిర్ధేశిత ఖర్చులు బడ్జెట్ లో ప్రతిపాదించడానికి, జనవరి 1వ తేదీతో ఆరంభమయ్యే ఆర్థిక సంవత్సరం సరైనదిగా సూచించింది. 1983లో అప్పటికి ఆర్థిక మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలు సేకరించినప్పుడు, ముఖ్యమంత్రులందరూ ఒకవైపు మార్పుకు అంగీకారం తెలుపుతూనే, మరో వైపు, ఆర్థిక సంవత్సరం ఎప్పటి నుంచి ప్రారంభం కావాలన్న విషయంలో భిన్నాభిప్రాయాలకు రావటం జరిగింది. మెజారిటీ ముఖ్యమంత్రులు మాత్రం, రుతుపవనాలను బట్టి, ఖరీష్ కాలంలో దిగుబడిని బట్టి, ఆ తదుపరి రోజుల్లో ఆరంభమయ్యే విధంగా, అంటే దాదాపు క్యాలెండర్ సంవత్సరాన్ని,  ఆర్థిక సంవత్సరంగా సూచించారు.


ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ మొదటి తేదీ నుండి మార్చి 31 వరకు కొనసాగించే విషయం పలు మార్లు వ్యతిరేకతను ఎదుర్కొంది. ఇలానే ఎందుకుండాలని పలువురు నిపుణులు ప్రశ్నించడం జరిగింది. మార్పులు తేవాలనే ప్రతిపాదనలు ఎన్నిసార్లు, ఎన్నో విధాలుగా, ఎంతో మంది చర్చకు తీసుకు వచ్చినా ఆ ప్రతిపాదనలు ఒక కొలిక్కి వచ్చే ప్రక్రియ చోటుచేసుకోక పోవడం గమనార్హం. బ్రిటీష్ ఇండియాలో, బ్రిటీష్ ప్రభుత్వం పాటించే పద్దతినే అనుసరించాలనే క్రమంలో, ఈ విధానం మొదలై, కొనసాగించటం జరిగింది. భారతదేశం స్థితిగతులు, స్థానిక వాతావరణ తదితర పరిస్థితులు, ఇతర స్థానిక అంశాలు ఏ మాత్రం పరిగణలోనికి తీసుకోకపోవటం దురదృష్ఠం. ఆర్ధిక సంవత్సరంలో మార్పులు తీసుకుని రావాలనే ఆలోచన కలగడానికి ప్రధాన కారణం, ప్రస్తుతం అమల్లో వున్న ఆర్థిక సంవత్సరం ఆధారంగా, రూపొందించబడుతున్న బడ్జెట్ ప్రతిపాదనలు, నైరుతి, ఆగ్నేయ రుతుపవనాల ప్రభావం, తద్వారా సామాజిక ఆర్థిక పరిస్థితుల మీద పడే ప్రభావం పరిగణలోకి తీసుకోక పోవడమే!  ప్రభుత్వానికి వర్షాకాల పరిస్థితులపై సరైన సమాచారం లేకుండానే నిధులు కేటాయించేయడం వల్ల, వ్యవసాయ రంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుంటుపడిపోవటం, తద్వారా, పూర్తిగా ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమయ్యే పరిస్థితికి చేరుకోవడం జరగవచ్చు.  ఇతర అంశాలనూ పరిశీలించినట్లయితే, పనిచేసే కాలాన్ని పరిపూర్ణంగా సద్వినియోగపరుచుకునే అంశాన్ని,  జాతీయ సంప్రదాయాల్ని, సంస్కృతిని, సౌలభ్యాన్ని, పరిపాలనని, శాసన సభ్యుల సౌలబ్యాన్ని, పరిగణలోనికి తీసుకోవలసి ఉంటుందని నీతీ ఆయోగ్ కు చెందిన దెబ్రాయ్, దేశాయ్ అంటున్నారు.


ఈ నేపధ్యంలో, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక సంవత్స్రరం పద్ధతిని మార్చాల్సిన అవసరం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ప్రధానితో సహా, చాలా మంది ముఖ్యమంత్రులు కూడా మార్పుకు అనుకూలంగా వుండడంతో, బహుశా, మార్పుకు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే శ్రీకారం చుట్టినా ఆశ్చర్య పోనక్కరలేదు.