Saturday, May 25, 2019

రావణుడిని నిందించిన సీతాదేవి...శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-62 : వనం జ్వాలా నరసింహారావు


రావణుడిని నిందించిన సీతాదేవి
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-62
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (26-05-2019)
         రావణుడిని నిందిస్తూ ఇలా అంటుంది సీత. “ఓరీ! రాక్షస వంశానికి వెదురుపొదకు కార్చిచ్చు లాంటి వాడా! ఆడదాన్ని, నన్ను, వంటరిగా వుండడం చూసి నువ్వీవిధంగా దొంగిలించి పరుగెత్తి పారిపోతున్నావే? నీకు కొంచెమైనా సిగ్గులేదా? నీ మాయ వల్లే కదా, అడవిలో మాయామృగం రూపంలో నా మనోవల్లభుడిని దూరంగా తీసుకుపోయింది? రాక్షస వంశం అనే అడవికి నువ్వే చిచ్చు పెట్టావు కదరా? నా మామ గారి స్నేహితుడైనందున నన్ను కాపాడడానికి వచ్చిన ముసలి గద్దతో యుద్ధం చేసి చంపావు. నీచ చరిత్రుడా! ఆహా! నువ్వెలాంటి శూరుడివిరా? ముసలి గద్దతోనే ఇంత పెద్ద యుద్ధం చేయాల్సి వస్తే, రామలక్ష్మణుల బారినపడితే నీగతి ఏమవుతుంది? యుద్ధంలో నిలబడి, ఇదిగో...రావణుడిని...యుద్ధానికి వచ్చాను...అని పేరు చెప్పుకునే పౌరుషం లేక, యుద్ధంలో నా భర్తను గెలవలేక, నన్ను దొంగిలించి పారిపోతున్నావే? పాపాత్ముడా! ఏమిరా నీ పౌరుషం? ఏమిరా నీ బలం?”

         “స్త్రీ చౌర్యం అనే నింద్యమైన నీచపు పని చేసి, ఇతరుల భార్యయైన ఆడదాన్ని దొంగిలించి, భయపడి, పరుగెత్తుతున్నావే .... మూర్ఖుడా! నీకు కొంచెమైనా సిగ్గులేదురా! ఛీ! శూరుడు కాకపోయినా శూరుడనే పేరుచెప్పుకునే ద్రోహచింతగల నిన్ను మగవారు చూసి నవ్వుతారు సుమా! నువ్వు శూరుడననీ, పెద్ద బలవంతుడననీ, వ్యర్థమైన మాటలు చెప్పావుకదా! పాపాత్ముడా! కాలమనేది వున్నంతదాకా నీకు అపకీర్తి కలిగించి, నీ వంశాన్ని నాశనం చేసే పని చేయడానికి పూనుకున్నావు. చీ! శూరుడిలాగా కొంచెం సేపు నిలుస్తే నీ శరీరంతో ఇలా పోగలవా? యాతనా శరీరంతో యమలోకానికే పోతావు. మృత్యుదేవత తరుముతున్నట్లు చావు-బతుకు తెలియకుండా పరుగెత్తుతున్నావే....నిన్నా రామరాజేమి చేయగలడు? ఏదీ, మగవాడివైతే క్షణం సేపు నిలువు....నీ పాపకార్యం అనుభవిస్తావు. ఆ రాజకుమారుల కళ్లకు నువ్వు కనిపిస్తే, నువ్వు, నీ సైన్యాలు ఒక్క ముహూర్త కాలమైనా బతకడం సాధ్యపడుతుందా? దుష్ట రాక్షసుడా!”

         “అడవిలో కార్చిచ్చు వ్యాపిస్తే పక్షులు దాన్ని సమీపించలేనట్లు, నువ్వు రామలక్ష్మణులు ప్రయోగించే బాణాలను కన్నెత్తి కూడా చూడలేవు. ఇక నువ్వు వాటిని ఖండించడం ఏమిటి? యుద్ధం చేయడం ఏమిటి? ఎందుకురా చెడిపోతావు? నేను చెప్తున్న మంచిమాటలు వినరా! నన్ను తిరిగి తీసుకునిపోయి రాముడికి అప్పగించు. అలా నామాట ప్రకారం చేయకపోతే, నన్ను నువ్వు అవమానించడం వల్ల కలిగిన కోపంతో, ఆవేశంగా యుద్ధం చేసి నీ దేహాన్ని రాబందులకు, నక్కలకు, గద్దలకు తృప్తితీరా తినడానికి విందుగా వేస్తాడు. ఏదో చెడు ఆలోచనతో నన్ను నువ్వు తీసుకుని పరుగెత్తి పారిపోతున్నావు. నామాట విను. ఎప్పటికైనా నీకోరిక నెరవేరేది కాదు. ఓరీ! మాయలమారీ! నా మగడిని, జయించడం సాధ్యపడని వాడిని, జగన్నాథ సమానుడిని, రాముడిని విడిచి శత్రువు స్వాధీనంలో దీర్ఘకాలం బతకలేను. నువ్వు ఇంద్రియ చపలత్వంతో నీకు మంచేదో, చెడేదో, తెలుసుకోలేక బుద్ధిహీనుడివై వున్నావు. ఎందుకంటావా? నువ్వు పాపాత్ముడివి. కాబట్టి నీకు మంచి మార్గం కనిపించదు”.


         “చావు సమీపిస్తుంటే మనిషికి మంచి వస్తువులు తినబుద్ధికాదు. పథ్యం చేయాలనిపిస్తుంది. చెడు పథ్యంలాగా అనిపిస్తుంది. ఇది సత్యం. నామాట అసత్యం కాదు. నిన్ను యముడు విందుకోసం తీసుకుపోతున్నాడు. ఇంత ఘోర పాపకార్యం కొంచెమైనా జంకు-గొంకు లేకుండా నిర్విచారంగా చేయడం వల్ల త్వరలోనే బంగారు చెట్లను చూస్తావు. యమలోకంలో నెత్తుటి ఏరులో, నిప్పుల ఏరులో ఈదుతావు. అసివ్రత వనంలో ఆటలాడుతావు. నమ్ము. యమపురంలోని బూరుగు చెట్లను చూస్తావు. పరస్త్రీలను కామించిన నీకు ఈ నరకబాధ తప్పదు. నీచపు నడవడికలవాడా! శ్రీరాముడిని మోసగించి నువ్వు విషం తాగినవాడిలాగా ప్రాణాలను నిలబెట్టుకుంటావా? అది నీకు సాధ్యమా? దయాహీనుడా! నీ జీవితకాలం ఈ రోజుతో ముగిసింది. లంకలోకి చేరితే శ్రీరాముడు నిన్నేమి చేస్తాడని అనుకుంటున్నావా? యమకింకరులు నీమెడకు పాశాలు తగిలించారు. కాబట్టి నీకు లంకలోనే కాదు, స్వర్గ పాతాళ లోకాల్లో ఎక్కడ ప్రవేశించినప్పటికీ నిన్ను రామచంద్రమూర్తి తప్పక చంపుతాడు”.

         “తమ్ముడు కూడా తోడు లేకుండా, ఒంటరిగా రాముడొక్కడే పద్నాలుగువేల మంది దుష్ట రాక్షసులను అల్పకాలంలో సంహరించాడు. అలాంటి గొప్ప అస్త్రాలను తెలిసినవాడు ఎంతటి పనైనా చేయగలదు. తన పెళ్లాన్ని దొంగిలించిన నీచజాతివాడివైన నిన్ని యుద్ధంలో ముక్కలు-ముక్కలుగా నరక్కుండా వుంటాడా?”

         ఇలా రకరకాలుగా మాట్లాడుతూ, ఏడుస్తున్న సీత స్మృతితప్పి పడుతూ ఉన్నప్పటికీ, రావణుడు ఆమెను తీసుకు పోవడం ఆపలేదు.

Friday, May 24, 2019

లౌకికవాద గుబాళింపు : వనం జ్వాలా నరసింహారావు


లౌకికవాద గుబాళింపు
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (24-05-2019)
హైదరాబాదు, రాజస్థాన్ లోని ఆల్వార్ ప్రాంత మూలాలతో భారత స్వాతంత్ర్యానికి ముందు తరువాత శాస్త్రవేత్తలుగా కీర్తిగాంచిన, చురుకైన ఒక హిందూ – ముస్లిం జంట వంశ వృక్షం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. వారెవరో కాదు డాక్టర్ ఎంఎస్ అయ్యంగార్. దేశంలో వారి తొలి ఉద్యోగం శాస్త్రీయ మరియు పరిశ్రమల పరిశోధనా మండలి, హైదరాబాదు ప్రాంతీయ పరిశోధనా ప్రయోగ శాలలో ప్రారంభమైంది. తరువాత బీహార్ లోని ధనబాద్ సమీపంలోని ఘరియాలో ఉన్న సిఎస్ఐఆర్ సెంట్రల్ ఫ్యూయల్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్ లో వారికి పోస్టింగ్ ఇచ్చారు. దివంగత కృష్ణమీనన్ రక్షణ మంత్రిగా వున్న సమయంలో రక్షణ మంత్రిత్వశాఖలో డైరెక్టర్ మరియు స్పెషల్ డ్యూటీ అధికారిగా డిప్యుటేషన్ మీద ఎంఎస్ అయ్యంగారిని నియమించారు.

         2019 మే 15వ తేదీన సత్యం కంప్యూటర్స్ మాజీ నేత డాక్టర్ ఊట్ల బాలాజీ దంపతులు, స్వచ్చంద సంస్థకు చెందిన శశి దంపతులు ఆయన సోదరుడు రవి మరియు రవి కుమార్తె, అమెరికాలోని మసాచుసెట్స్ నుంచి ఆంగ్ల సాహిత్యంలో రెండు పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలు కలిగిని కుమారి అనూష, హైదరాబాదు శ్రీనగర్ కాలనీలోని శశి గృహంలో ఒక చిన్న ఆత్మీయ సమావేశంలో కలుసుకున్నాము. అక్కడ న్యూఢిల్లీకి చెందిన పాతస్నేహితుడు వినోద్ అసాద్ అయ్యంగార్ ఆయన సతీమణి అభాను కలుసుకున్నాము. 108 మరియు 104 సేవలు అందించే వ్యవస్థల ముఖ్య రూపకర్తలైన దివంగత ఏపి రంగారావు మరియు డాక్టర్ బాలాజీ వారిని దాదాపు పది సంవత్సరాల క్రితం నాకు పరిచయం చేశారు. ఆరోగ్య యాజమాన్య మరియు పరిశోధనా సంస్థలో నేను కన్సల్టెంగా పని చేసిన సమయంలో సంస్థ అసోసియేట్ గా తప్ప ఎంతో ఆసక్తి కలిగించే వారి వ్యక్తిగత కుటుంబ నేపథ్యం, ఆయన కుటుంబ మూలాలు హైదరాబాదులో వున్నాయని, జవహర్ లాల్ నెహ్రూ ఇంట్లో దివంగత సంజయ్ గాంధీతో చిన్నప్పుడు ఆడుకున్న అనుభవాల మీదకు మళ్లింది.

         వినోద్ తల్లి దివంగత డాక్టర్ సుల్తానా జుల్ఫికర్ ఆలీ డాక్టర్ శ్రీమతి ఎస్ అయ్యంగార్ గా అందరికీ తెలుసు. అనేక తరాలకు ముందు వారి కుటుంబం పర్షియా నుంచి హైదరాబాదుకు వలస వచ్చింది. ఆమె ఇక్కడే పుట్టి పెరిగారు. ఆమె తండ్రి సయ్యద్ జుల్ఫికర్ అలీ రాజస్థాన్ లోని ఆల్వార్ రాజు సైనిక ప్రధాన అధికారి. కల్నల్ సయ్యద్ జుల్ఫికర్ అలీని అధికారికంగా ఆల్వార్ మహారాజ్ బిరుదుతో పాటు రాజు గౌరవ కల్నల్ సర్ జై సింగ్ ప్రభాకర్ బహదూర్ కాంప్ కమాండర్ గా నియమించారు. సుల్తానా జుల్ఫికర్ అలీ వైపు నుంచి చూస్తే ఎన్ని తరాల క్రితం ఆ కుటుంబం భారత్ కు వలస వచ్చిందో ఎంతో ఆసక్తి కలుగుతుంది. వినోద్ కుటుంబ స్నేహితుల సమాచారం ప్రకారం మొఘల్స్ కాలంలోనే ఆ కుటుంబం భారత్ కు వచ్చింది. బహుశా హుమాయున్ లేదా అక్బర్ కాలంలో అయి ఉండవచ్చు. కొన్ని తీవ్రమైన యుద్ధాల తరువాత వారి సైన్యంలో ఉన్న వినోద్ ముత్తాతలకు ఆల్వార్ సమీపంలో పెద్ద విస్థీర్ణంలో భూమిని బహుమతిగా ఇచ్చారు. దాన్ని పహారీగా పిలుస్తారు. ప్రస్తుతం ఆల్వార్ జిల్లాలో ఉంది. సుల్తానా జుల్ఫికర్ అలీ కుటుంబం ఆల్వార్ కు చెందినట్లుగా దీన్ని బట్టి తెలుస్తోంది.

         ఢిల్లీకి దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో జైపూర్ కు ఉత్తరంగా 150 కిలోమీటర్ల దూరంలో ఆల్వార్ వుంది. దేశ రాజధాని ప్రాంతంలో ఉండటమే గాక రాజస్థాన్ లో అల్వార్ జిల్లా కేంద్రంగా కూడా ఉందీ పట్టణం. అనేక కోటలు, సరస్సులు, పురాతన హవేలీలు, సహజ జలాశయాలతో ఒక విహార కేంద్రంగా వుంది. పహారీ గ్రామం జైపూర్ డివిజన్ లోని ఆల్వార్ జిల్లాకు చెందినది. ఆల్వార్ రాజు కాంగ్రెస్ పార్టీకి నిదులు అందజేస్తున్నారని బ్రిటీష్ పాలకులు గమనించి సైన్యాన్ని రద్దు చేయాలని వత్తిడి చేసిన తరువాత సయ్యద్ జుల్ఫికర్ అలీ కుటుంబం ఆల్వార్ నుంచి హైదరాబాదుకు వచ్చింది.


       అక్ర‌మ పాల‌న సాగిస్తున్నార‌ని బ్రిటీష్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌టంతో 1930 ద‌శ‌కం ప్రారంభంలో జైసింగ్ మ‌హారాజు ప్ర‌వాసంలోకి వెళ్లారు.(1937లో ప్రాన్స్‌లో 54 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో మ‌ర‌ణించారు.) వ‌ల‌స‌వాద వ్య‌తిరేక‌త‌కు తాము మారుపేరు అని వినోద్ చెప్పారు.(స్వాతంత్య్ర ఉద్య‌మానికి మ‌హ‌రాజు నిధులు అందచేయట‌మే అస‌లు కార‌ణం అని చెప్పారు) త‌రువాత దూర‌పు బంధువైన స‌ర్‌తేజ్ సింగ్ ప్ర‌భాక‌ర్‌ను బ్రిటీష్ వారు రాజుగా నియ‌మించారు. అత‌ను ఒక హిందూ జాతీయ‌వాది మ‌రియు 1947 వ‌ర‌కు అఖిల హిందూ మ‌హాస‌భ‌కు అధ్యక్షుడిగా వున్నారు. అయితే దేశ స్వాతంత్య్రానికి కొద్దిగా ముందుగా త‌ప్ప అత‌నికి బ్రిటీష్ వారు నిజ‌మైన అధికారాన్ని ఇవ్వ‌లేదు.

         వినోద్ తండ్రి దివంగ‌త డాక్ట‌ర్ ఎంఎస్ అయ్యం గార్‌. వినోద్ త‌ల్లి దండ్రులు లీడ్స్ విశ్వ‌విద్యాల‌యంలో విద్య‌స‌భ్య‌సించారు. రెండ‌వ ప్ర‌పంచ యుద్దం ముగిసిన త‌రువాత ఎన్‌జిఓ శ‌శి త‌ల్లి, మేన‌త్త స‌రోజా అచార్య ద్వారా వారు ఇంగ్లండ్‌లో క‌లు సుకున్నారు. ఒకే కాబిన్‌లో వున్నారు. ఎంఎస్ అయ్యం గార్, సుల్తానా జుల్ఫిక‌ర్ అలీ ఇంగ్లండ్‌లో ప్రేమ‌లో ప‌డి వారు భార‌త్‌కు తిరిగి వ‌చ్చిన త‌రువాత 1951లో ముంబైలోని హాగింగ్ గార్డెన్స్‌లో వివాహం చేసుకున్నారు.

      1960లో ఎంఎస్ అయ్యంగార్ ర‌క్ష‌ణ శాఖ‌లో డెప్యుటేష‌న్ మీద డైరెక‌ర్ట‌ర్ మ‌రియు ప్ర‌త్యేక విధి నిర్వ‌హ‌ణ అధికారిగా నియ‌మితుల‌య్యారు, త‌రువాత నాటి ర‌క్ష‌ణ మంత్రి వికే కృష్ణ మీన‌న్ అధ్వ‌ర్యంలో న్యూఢిల్లీలో ప‌ని చేశారు. ప్ర‌స్తుతం డిఆర్‌డిఓగా పిలుస్తున్న ర‌క్ష‌ణ‌శాఖ ప్ర‌యోగ‌శాల‌లో ప‌ని చేసేంద‌కు సుల్తానా జుల్ఫిక‌ర్ అలీని కూడా డెవ్యుటేష‌న్ మీద న్యూఢిల్లిలో నియ‌మించారు. చైనాతో యుద్దం త‌రువా కృష్ణ మీన‌న్ రాజీనామా చేసిన త‌రువాత వినోద్ త‌లిదండ్రులు సిఎస్ఐఆర్‌కు తిరిగి వ‌చ్చారు. 1966లో తండ్రి ఎంఎస్ అయ్యంగార్ అస్సాంలోని జోర్హాట్‌లో వున్న ప్రాంతీయ ప‌రిశోద‌నా కేంద్రం డైరెక్ట‌ర్‌గా నియ‌మితుల‌య్యారు. త‌ల్లి సుల్తానాను న్యూఢిల్లీలోని నేష‌న‌ల్ ఫిజిక‌ల్ లాబ‌రేట‌రీలో నియ‌మించారు. అమే అక్క‌డే 1982లో డిప్యూటీ డైరెక్ట‌ర్‌గా ఉద్యోగ విర‌మ‌ణ చేశారు. ఎంఎస్ అయ్యంగార్ 2008లో, సుల్తానా జుల్ఫిక‌ర్ అలీ 2012లో దివంగ‌తుల‌య్యారు.

          వినోద్ త‌ల్లి బంధువుల వ‌ద్ద గ‌డిపేందుకు లాహోర్ వెళ్లినపుడు అయ‌న అక్క‌డే జ‌న్మించారు. వినోద్ అస‌ద్ అయ్యంగార్ అని పేరు పెట్టారు. అయ‌న‌కు ఏడు సంవ‌త్స‌రాల వ‌య‌స‌ప్పుడు నెహ్రూ, కృష్ణ‌మీన‌న్ భేటీ సంద‌ర్భంగా క‌లవాల‌ని పిల‌వ‌టంతో అయ్యంగార్‌తో పాటు వినోద్ కూడా వెళ్లారు. పొద్దుపోయిన త‌రువాత లేదా తెల్ల‌వారు ఝామున త‌లి దండ్రులు బ‌య‌ట‌కు  వెళుతుండేవారు. ఆరోజుల్లో కృష్ణ మీన‌న్ దాదాపు ప్ర‌తిరోజు నెహ్రూ ఇంటికి వెళ్లేవారు, ఆయ‌న నెహ్రూతో అంత స‌న్నిహితంగా ఉండేవారు. వినోద్‌ను చూసేందుకు ఒక ప్యూన్ లేదా సంర‌క్ష‌కుడిని నియ‌మించే వారు, అడుకొనేందుకు బొమ్మ‌లు ఇచ్చేవారు. సంజ‌య గాంధీ బొమ్మ‌ల‌తో త‌రచూ అడుకున్న రోజుల‌ను వినోద్ ఇప్ప‌టికీ గుర్తుపెట్టుకున్నారు. త‌న బొమ్మ‌ల‌తో అడుకున్నందుకు సంజ‌య్‌కు త‌ర‌కూ కోపం వ‌చ్చేద‌ట‌. ఒక రోజు సంజ‌య్ గాంధీ బొమ్మ‌కారుతో అడుకుంటున్న స‌మ‌యంలో వారి మ‌ధ్య వివాదం వ‌చ్చింది.

          వినోద్ అయ్యంగార్‌కు ఇద్ద‌రు పిల్లలు రాధిక మ‌రియు అదిల్‌. అయ‌న భార్య అభా.( అంత‌ర్జాతీయ ప్ర‌చుర‌ణ‌లు పొందిన ర‌చ‌యిత్రి మురియు క‌వ‌యిత్రి) కుమారుడు అర్కిటెక్ట్‌గా ప‌ని చేస్తున్నారు. కుమార్తె రాధిక న్యూయ‌ర్క్‌లోని కొలంబియా విశ్వ‌విద్యాలయంలో జ‌ర్న‌లిజంలో మాస్ట‌ర్ డిగ్రీ పొంది ప్ర‌స్తుతం హిందూస్ధాన్ టైమ్స్ గ్రూప్‌కు చెందిన మింట్ ప‌త్రిలో ఆర్ట్స  సంపాద‌కురాలిగా పని చేస్తున్నారు. ఇద్ద‌రూ న్యూఢిల్లీలోనే వుంటారు. వినోద్ సోద‌రి అజ్ర అమెరికా వెళ్లి చాలాకాలం క్రితం అక్క‌డే మ‌ర‌ణించారు. వినోద్ థ‌ణ కుటుంబంతో ఢిల్లీలోనే ఉంటూ త‌న స్సేహితుల‌ను క‌లుసుకొనేందుకు త‌ర‌చూ హైద‌రాబాద్ వ‌స్తుంటారు. త‌న త‌లిదండ్రుల మూలాల గురించి మ‌రిన్ని వివ‌రాలు, తొలి రోజుల్లో హైద‌రాబాదులో గ‌డిపిన వివ‌రాల‌ను సేక‌రించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. అంతా శుభం క‌ల‌గాల‌ని కోరుకుందాం.

Saturday, May 18, 2019

సీతను ఎత్తుకుని పరుగెత్తిన రావణుడు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-61 : వనం జ్వాలా నరసింహారావు


సీతను ఎత్తుకుని పరుగెత్తిన రావణుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-61
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (19-05-2019)
          ప్రాణాలు వెడలిపోవడానికి సిద్ధంగా వున్న ఆ పక్షిరాజు జటాయువును చూసి సీతాదేవి ఎంతో పరితాపంతో కన్నీళ్లు కాల్వలుగా పారేట్లు ఏడ్చింది. ఏడుస్తూ రామచంద్రుడిని తలచుకుని ఇలా అంటుంది బిగ్గరగా. “కాబట్టి రామచంద్రా! నాకు కలిగిన కష్టం తెల్సుకోవడానికి నీకు ఎడమకన్ను, ఎడమభుజం అదిరి వుండాలి కదా! పాలగరుడ భరద్వాజాలు తప్ప ఇతర రకాల పక్షులన్నీ కుడివైపు నుండి ఎడమగా పరుగెత్తి వుండాలికదా? ఈ అపశకునాల వల్ల నాకేదో కీడు కలిగిందని నువ్వు ఉహించి త్వరగా రావచ్చుకదా? రామచంద్రా! నీ శరీరంలో, నువ్వున్నచోట, మృగపక్ష్యాదుల వల్ల కనపడే అపశకునాలే కాకుండా, ఇక్కడ వుండే మృగాలు, పక్షులు కూడా నీ దగ్గరికి గుంపులు-గుంపులుగా వస్తున్నాయి. వీటిని చూసైనా నాకు కలిగిన కష్టాన్ని తెలుసుకుని వుండవచ్చు కదా? ఇంతదాకా నీ భార్యకు కలిగిన అవమానం నీకు తెలవకపోవడం అంటే, నేను మహాపాపం ఏదో చేశానని అనుకోవాలి. అల్ప పాపం అయితే ఇంతవరకు నేను అనుభవించిన దాంతో సమసిపోయి వుండాల్సింది”.

         “నా పాపం పెద్దదే అనడానికి నావార్త నీకు తెలియకపోవడం అనే ఒక్క కారణమే కాదు. నన్ను రక్షించడానికి ప్రయత్నించిన ఆ పుణ్యధనుడు జటాయువు, ఈ నీచుడి చేతిలో హతమయ్యాడు. నా పాపపం పెద్దది కాకపోతే జటాయువు జయించే వుండేవాడు. కాని, నా పాలిటి పెద్దమ్మ, నాలాంటి పాపాత్మురాలికి సహాయం చేయాలనుకున్న ఆయన్ను ఎందుకు బతకనిస్తుంది? మహాపాపాత్ములకు సహాయం చేయడానికి ప్రయత్నించినవారికీ పాపాత్ముల పాపం వారిని ఆ సహాయం చేయకుండా బాధిస్తుంది. రామా! నేను సీతను. భూమి పుత్రిని. నన్నీ రాక్షసుడు పట్టుకుని పోతున్నాడు. రక్షించడానికి రా. తండ్రీ! లక్ష్మణా! త్వరగా రా!”.

         ఈ ప్రకారం, సీతాదేవి, రామలక్ష్మణులు సమీపంలో వుంటే తన అరుపులు విని వస్తారేమోనని ఏడ్చింది. “రామా! రామా! రఘురామా!” అని పెద్దగా ఏడుస్తుంటే రావణుడు, సీత తల వెంట్రుకలను పట్టి ఈడ్చాడు. ఆ సమయంలో, జంగమ స్థావరాలతో లోకాలు గాఢమైన చీకటితో వ్యాపించబడి, స్వస్థావస్థ తప్పి, బాధతో సోలిపోయింది. గాలి ఆగి పోయింది. సూర్యుడు వెల-వెలపోయాడు. బ్రహ్మదేవుడు రావణుడు సీతను బాదిస్తుమ్తే చూసి, “దేవకార్యం చక్కబడ్డది. రావణుడు చావడం ఖాయం” అనుకుంటాడు. దేవతలు, ఋషులు సీత పడ్తున్న బాధలు, కష్టాలు చూసి దుఃఖపడ్తారు. కాబోయే రావణుడి చేటుకు సంతోషించారు.

         “రామా! రామా! లక్ష్మణా!” అని ఏడుస్తున్న సీతాదేవి ఆకాశమార్గాన తీసుకుని అతి వేగంగా పరుగెత్తాడు రావణుడు. నల్లటి మేఘంలాంటి కాంతికల రావణుడి పక్కన, బంగారువన్నెకల సీతాదేవి తొలకరి మెరుపులాగా ప్రకాశించింది. బంగారుమయమైన ఆమె పైట కొంగు గాలికి ఎగిరి, రావణుడిని కప్పడం చూస్తుంటే, కాలుతున్న కొండలాగా అతడు కనబడ్డాడు. మంగళకారిణి అయిన సీత కట్టిన పట్టువస్త్రం, ఆకాశంలోని సూర్య కిరణాలు తగలడంతో ఎర్రటి మేఘంలాగా కనిపించింది. రావణాసురుడి తొడమీద వున్న ఆ సీతాదేవి చక్కని ముక్కు కల ముఖం రాముడు దగ్గర లేనందున కళతప్పింది. మంచి నొసలు కల, ముంగురుల దాకా వ్యాపించిన, అందమైన, దోషరహితమైన, వికసించిన కమలాలతో సమానమైన, సీతాదేవి ముఖం మేఘాన్ని పగలతీసుకుని వచ్చి కనబడే చంద్రుడిలాగా కనిపించింది.


         అందమైన తెల్లటి దంతాలు, సంపెంగ మొక్క లాంటి ముక్కు, బంగారు సొమ్ముల విలాసం, పడుతూ-ఎగురుతూ వుండే వెంట్రుకలు, దొండపండు లాంటి పెదవి కలిగి రావణాసురుడి అంకాన వున్న సీతాదేవి ముఖం పగలు ఉదయించిన చంద్రబింబం లాగా వుంది. సీతాదేవి సహజ సౌందర్యం బొగ్గులో పొదిగిన మణిలాగా రావణుడి దగ్గర వుండడం వల్ల కాంతిహీనంగా కనపడింది. నల్లటి శరీరం కల రావణుడి దగ్గర వున్న బంగారు వన్నెకల సీత, బంగారపు ఒడ్డాణం నీలమణితో కలిసి ప్రకాశించినట్లుంది. చక్కటి అందమైన బంగారు ఆభరణాలతో ఇంపుగా, కమలంలాగా కాంతికల సీత, రావణుడి దగ్గర, మేఘం దగ్గరి మెరుపులాగా వుంది. పగడపు తీగలాంటి సీత నల్లటి రావణుడి ఒడిలో బంగారపు గొలుసుతో కట్టబడిన ఏనుగులాగా ప్రకాశించింది. సీతాదేవి ధరించిన బంగారపు సొమ్ముల ఘల్లు-ఘల్లను ధ్వని రావణుడిని మెరుపులతో, ఉరుములతో కూడిన మేఘంలాగా కనబడేట్లు చేసింది.

సీతాదేవి తల నుండి రాలిన అందమైన పూలు నేలమీద పడుతూ, రాక్షసుడి పరుగెత్తే వేగానికి కలిగిన సుడిగాలికి, అవి కూడా సుళ్లు పెట్టుకుంటూ, వాడి చుట్టూ తిరిగి నేలమీద పడడం చూస్తుంటే, నక్షత్రాలు మేరు పర్వతాన్ని చుట్టి తిరుగుతున్నట్లుగా వుంది. రత్నాలు చెక్కబడిన సీతాదేవి ధరించిన కాలి కడియం జారి భూమ్మీద మధుర ధ్వనితో చక్రాకారం లాగా మెరుగుతీగలా పడింది. రావణుడు సీతను బలవంతంగా తీసుకుని పోవడం, ఆయన ఇంట్లో కాల్చడానికి కొరివిని తీసుకుపోయినట్లు వుంది. ఆమె ధరించిన అగ్నికాంతి కల బంగారపు సొమ్ములు ఆకాశాన్నుండి చుక్కలు రాలినట్లు నేలమీద పడ్డాయి. ఆమె మెడలో ధరించిన ముత్యాలసరం ఆకాశగంగలాగా కనిపించింది. పక్షులతో సహా గాలికి కదులుతున్న కొమ్మలున్న చెట్లు ఎగురుతున్న కొమ్మలకు భయపడవద్దని సైగలు చేసినట్లుంది.

సింహాలు, పులులు, పక్షులు, మృగాలు అన్నిచోట్లా తిరుగుతూ, సీతాదేవి నీడను చూసి, గుర్తించి, ఆకాశంవైపు చూస్తూ అరిచాయి. రావణుడు భూమ్మీద దిగినట్లయితే వాడిని ఇవన్నీ పీక్కుని తినేవేమో! పర్వతాలన్నీ, మోసంతో సీతాదేవికి కలిగిన విపత్తుకై ఏడ్చాయి. సూర్యమండలం కాంతిహీనమై బాధతో మెల్లగా పోయినట్లు కనిపించింది. “ఈ వంచకుడు సీతాదేవిని దిక్కులేనిదానిలాగా మోసగించి కఠినంగా హరించి తీసుకుపోతుంటే, లోకంలో ఇందరు వుండికూడా ఒక్కరైనా అయ్యో! పాపం! నీకి తగదని, విడవమని అనరేంటి? లోకంలో ఇంకా ధర్మం, సత్యం, రుజుత్వం, దయ అనేవి మిగిలాయా? ఈ గుణాలు కలవారు లేరులేరు” అని భూతాలన్నీ ఏడ్చాయి.

పెద్ద మృగాలు సీత నీడ వెంట పరుగెత్తుతుంటే పిల్ల మృగాలు ముఖాలు వేళ్లాడతీసుకుని భయంతో వణకుతూ, కన్నీళ్లు పొరలి-పొరలిరాగా సీతాదేవి పోయే మార్గాన్ని కనురెప్ప కూడా వాల్చకుండా చూసి-చూసి బాగా దుఃఖపడ్డాయి. భూమ్మీదకు చూస్తూ, మనోహర ధ్వనితో “రామా! లక్ష్మణా!” అని ఏడుస్తూ, పుణ్యాత్ములు, మంచి మనసున్నవారు ఎవరైనా అడ్డం రాకపోతారా? విడిపించరా? అని దిక్కులు చూస్తున్న సీతను చూసి వనదేవతలు పెద్దపెట్టున ఏడ్చారు. ముత్తెపుసరులు తెగిపోగా; పెదవి ఆరిపోగా;, పగుళ్లువారగా; తిలకం, కాటుక, కరగగా; వెంట్రుకలు చెదరగా వున్న సీతాదేవిని తన చావుకొరకే రావణుడు పట్టుకుని పోతుంటే, తెల్లబారిన ముఖంతో భయంతో సీతాదేవి బాధపడింది. ఏడవడం వల్ల, కోపం వల్ల, కళ్ళు రెండూ ఎర్రగా కాగా రావణుడి మర్మాలు ఛేదించే భయంకర వాక్యాలతో సీత ఆయన్ను సంబోధించింది.

A whiff of secularism..... An illustrious Hindu-Muslim Couple with Hyderabadi roots : Vanam Jwala Narasimha Rao


A whiff of secularism
Vanam Jwala Narasimha Rao
Millennium Post, New Delhi (20-05-2019)

An illustrious and dynamic Hindu-Muslim Couple and a family tree since undivided India
An illustrious Hindu-Muslim Couple
with Hyderabadi roots
Vanam Jwala Narasimha Rao
Hans India (19-05-2019)

Very few people knew that a little-known Hindu-Muslim couple with roots in Hyderabad and Rajasthan state’s Alwar occupied pivotal positions as scientists in Government of India organizations before and after independence. They were none other than Dr Sultana Zulfiquar Ali and Dr MS Iyengar. Their first jobs in India were in the Council of Scientific and Industrial Research’s Regional Research Laboratory, Hyderabad. Both were then posted to CSIR’s Central Fuel Research Institute, Jharia (near Dhanbad) then in Bihar. MS Iyengar was also the Director and Officer Special Duty to the Ministry of Defence during late Krishna Menon’s time as Defence Minister on deputation.

On 15th May, 2019 evening we had a small get-together with erstwhile Satyam Computers leader Dr Balaji Utla Couple, NGO Shashi Couple, his brother Ravi and Ravi’s daughter Ms Anshula a double Post Graduate in English Literature with a PG from Massachusetts USA, in Shashi’s house in Hyderabad’s Srinagar Colony. There I met an old New Delhi based friend Mr Vinod Asad Iyengar and his wife Mrs Abha. Though I have known Vinod who was introduced to me by late Dr AP Ranga Rao and Dr Balaji, Prime Architects of 108 and 104 Medical Services, quite for a long time and for nearly 10 years, I did not know much about his highly interesting personal background except as an associate of Health Management and Research Institute where I worked as a consultant. The discussion however, rotated round his illustrious family background and his family roots in Hyderabad as well as his childhood experiences in Jawaharlal Nehru’s house playing with Late Sanjay Gandhi.    

Vinod mother late Smt Dr Sultana Zulfiquar Ali popularly known as Dr (Mrs) S Iyengar, belonging to the family of a Persian migrant to Hyderabad, couple of generations ago, was born and brought up in Hyderabad. Her father Syed Zulfiquar Ali was the Chief of Army of the King of Alwar, Rajasthan. Colonel Syed Zulfiquar Ali, was officially titled as the Maharajah of Alwar, Honorary Colonel Sir Jai Singh Prabhakar Bahadur’s “Camp Commander”.

It’s very interesting to know as to how many generations from Sultana Zulfiquar Ali’s side have been in India! According to sources close to Vinod’s family friends, her ancestors came to India during the Mughals’ days. Maybe during Humayun or Akbar period. After some fierce battle, one of Vinod’s forefathers, who was in their army, was rewarded with a rather large tract of land near Alwar in a place called ‘Pahari’ (in today’s Alwar District). This leads to the assumption that Sultana Zulfiquar Ali’s family belonged to Alwar.  


Alwar located 150 kilo meters south of Delhi and 150 kilo meters north of Jaipur, is a city in India's National Capital Region and the administrative headquarters of Alwar District in the state of Rajasthan. Alwar is a hub of tourism with several forts, lakes, heritage havelis and nature reserves. Pahari is a Village in Alwar District and belongs to Jaipur Division. Syed Zulfiquar Ali family returned to Hyderabad after the British found out the King of Alwar was helping fund Congress party, and forced him to abandon his army.


Maharajah Jai Singh was forced in to exile by the British - allegedly for ‘misrule’ in the early 1930s (in France, where he eventually died at the age of 54 in 1937). According to Vinod, it was their euphuism for anti-colonial activities (it is said that the real reason was that the Maharajah was funding the Congress’s Freedom Struggle). Incidentally, the British replaced him with a remotely related cousin, Sir Tej Singh Prabhakar, who was a Hindu Nationalist and the President of the Akhil Bharatiya Hindu Mahasabha until 1947. However, he was never given any real power until just before India’s independence.

Vinod’s father was Late Dr MS Iyengar. His parents met in England just after World War II (they studied at Leeds University) courtesy NGO Shashi’s mother, and his father’s sister, Mrs Saroja Acharya. The ladies met on the ship to England and shared a cabin. MS Iyengar and Sultana Zulfiquar Ali fell in love in England and got married in The Hanging Gardens, Mumbai, in 1951 after they returned to India.

Around 1960, Vinod’s father MS Iyengar was deputed as Director, Special Duty to the Ministry of Defence, to work under Late V. K. Krishna Menon, the then Defence Minister of India, in New Delhi. Vinod’s mother Sultana Zulfiquar Ali was also deputed to New Delhi to the Ministry’s Defence Science Laboratories (now known as DRDO). After Krishna Menon’s resignation following war with China, Vinod’s parents returned to CSIR. In 1966., his father MS Iyengar was posted as Director, Regional Research Laboratory, Jorhat (Assam) and his mother Sultana Zulfiquar Ali was posted to the National Physical Laboratory, New Delhi (she retired in 1982 as NPL’s Deputy Director). Vinod father Dr MS Iyengar passed away in 2008 and his mother Smt Sultana Zulfiquar Ali passed away in 2012. 

Vinod was born in Lahore in Pakistan while his mother went there to spend time with her relatives. His parents named him Vinod Asad suffixing Iyengar, the family name. While Vinod Asad Iyengar was a child of seven-eight-year-old, he used to accompany his father when he was suddenly called to a meeting with Jawahar Lal Nehru and Krishna Menon, in late evening or early morning, and his mother happened to be out of station. Those days Menon was almost a regular visitor to Nehru’s place, he being the closest person to Nehru. A guard or peon was given the task of keeping him safe on the lawns and sometimes, they found toys to keep the boy Vinod occupied. Vinod still remembers those days playing with the toys of Late Sanjay Gandhi often to the anger of Sanjay. On one occasion there was an altercation as the toy car Vinod was playing with turned out to be Sanjay Gandhi’s.

Vinod Iyengar has two children and named them as Radhika and Adil. His wife is Abha (who is an internationally published author and poet). His son, Adil is a practicing architect. His daughter, Radhika, who is younger, has a Master’s degree in Journalism from New York’s Columbia University and is the Arts Editor with Mint Lounge - a publication of the Hindustan Times group. Both are based in New Delhi.

Vinod’s sister Azra Iyengar migrated to USA and passed away long back. He continues to stay in Delhi with his family but visits frequently Hyderabad to meet his friends and incidentally he is now attempting to find out more details about his parents’- Dr MS Iyengar and Smt Dr Sultana Zulfiquar Ali - roots and early days in Hyderabad in detail. Let us wish him all the best.

Thursday, May 16, 2019

అయోధ్య వివాదానికి శాశ్వత పరిష్కారం దిశగా : వనం జ్వాలా నరసింహారావు


అయోధ్య వివాదానికి శాశ్వత పరిష్కారం దిశగా
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (17-05-2019)
అయోధ్యలోని రామ జన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీం కోర్టు ఆదేశం మేరకు మధ్యవర్తిత్వం జరుపుతున్న త్రిసభ్య సంఘానికి గతంలో ఇచ్చిన గడువును ఆగస్టు 15,2019 వరకు పెంచాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకొంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కలీఫుల్లా ఆధ్వర్యంలోని త్రిసభ్య బృందం మధ్యవర్తిత్వం నెరుపుతోంది. ఇంతవరకు జరిగిన ప్రగతిపై ఆ సంఘం మే ఏడో తేదీన మధ్యంతర నివేదిక ఇచ్చింది. తుది పరిష్కారాన్ని సాధించి మొత్తం ప్రక్రియను పూర్తి చేయడానికి మరింత గడువు కావాలని కోరింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి ఆధ్వర్యంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం సంఘం అభ్యర్థనకు శుక్రవారం మే నెల 10 వ తేదీన సానుకూలంగా స్పందించింది.

ఫలితాలపై మధ్యవర్తులు ఆశాభావంతో ఉండి, గడువు పెంచాలని కోరితే, పొడిగించడం సమంజసమనీ, అందులో తప్పులేదనీ ధర్మాసనం పేర్కొంది. ఏళ్ల తరబడి ఈ సమస్య అపరిష్కృతంగా వుందనీ, ఎందుకు సమయం ఇవ్వకూడదనీ కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ ధర్మాసనంలో జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ సభ్యులుగా ఉన్నారు. మధ్యవర్తిత్వం జరుగుతున్న తీరుపై హిందు, ముస్లిం పక్షాల తరఫున హాజరైన న్యాయవాదులు సంతృప్తి వ్యక్తం చేశారు. తాము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. మరో న్యాయవాది మాట్లాడుతూ త్రిసభ్య సంఘానికి ఎనిమిది వారాల గడువు ఇచ్చారని, ఇప్పటికే తొమ్మిది వారాలు గడిచాయని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ నివేదిక వచ్చిందని, దీంట్లోని వివరాలు వెల్లడించబోమని అన్నది. మధ్యవర్తిత్వానికి అడ్డంకులు కలిగించకూడదని కూడా పేర్కొంది. అయోధ్యకు ఏడు కిలోమీటర్ల దూంలోని ఫైజాబాద్‌లో మధ్యవర్తిత్వ బృందం సంప్రదింపులు జరుపుతోంది. నిబంధల మేరకు కార్యకలాపాలన్నీ రహస్యంగానే జరుగుతున్నాయి.

ఈ నేపధ్యంలో సెప్టెంబర్ 30, 2010 న సుప్రీం కోర్ట్ ఇచ్చిన చారిత్రాత్మక అయోధ్య తీర్పు ఒక్కసారి మననం చేసుకుంటే ఆసక్తికర విషయాలు అవగతమౌతాయి. అయోధ్య వివాదాస్పద స్థలం విషయంలో చరిత్రాత్మక "సెక్యులర్" తీర్పిచ్చిన ముగ్గురు న్యాయమూర్తుల తీర్పు పాఠంలో ఆసక్తికరమైన, పరిశోధనలకు కావాల్సిన అనేకానేక విషయాలున్నాయి. ఒక విధంగా ఎనిమిదివేల పేజీల పైనున్న ఆ తీర్పు పాఠం ఒక మోస్తరు ఆధ్యాత్మిక "విజ్ఞాన సర్వస్వం" అనవచ్చేమో !

త్రిసభ్య ధర్మాసనంలోని జస్టిస్ అగర్వాల్, తీర్పు ముందుమాట ముగించి, స్థాన వర్ణన, వివాదాస్పద నిర్మాణం, కోర్టు దావాల వివరాలలోకి పోతారు. ఆ క్రమంలో తాము కేసుకు సంబంధించి సంస్కృతం, హిందీ, ఉర్దూ, పర్షియన్, ఫ్రెంచ్, టర్కీ భాషలలోని చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, పురా తత్వ శాస్త్రం, ప్రాచీన శిల్ప శాస్త్రం, మతపరమైన విషయాలకు సంబంధించిన వేయికి పైగా గ్రంధాలను, అసంఖ్యాకమైన ప్రాచీన హస్త కళా కృతులను తమ తీర్పుకు ఆధారంగా పరిశీలించా మన్నారు. సుమారు 550 ఏళ్ల క్రితం నాటి నుంచి ఇప్పటివరకూ సంబంధమున్న కోట్లాది సంఘటనలను, మత విశ్వాసాలను, నమ్మకాలను, భావానుబంధాలను, లక్షలాది మంది మనోభావాలను, భావోద్రేకాలను, దేశ-విదేశీయుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని, వివాదానికి సంబంధించిన పూర్వాపరాలను విభిన్న కోణాల నుంచి సమగ్రంగా-సమూలంగా అధ్యయనం చేసిన మీదే, తమ ముందుకొచ్చిన నాలుగు వ్యాజ్యాలపై తీర్పు వెలువరిస్తున్నామని పేర్కొంటారు.

అయోధ్య లోని ఒక ప్రాచీన కట్టడం, దేశంలోని రెండు ప్రధాన సామాజిక వర్గాలైన హిందు-ముస్లింల మధ్య వివాదానికి కేంద్ర బిందువైంది. వివాదాస్పద స్థలంలోనే శ్రీరాముడు జన్మించాడని, అదే ఆయన జన్మభూమని, అక్కడొక రామాలయం వుండేదని, దాన్ని 1528 లో బాబర్ సేనా నాయకుడు మీర్ బాక్వి కూలగొట్టించి బాబ్రీ మసీదు నిర్మించాడని వాంగ్మూలం ఇచ్చిన హిందువులు, శ్రీరాముడికి అయోధ్యలోని ఆ స్థలంలో తప్ప మరెక్కడా జన్మస్థలం వుండడానికి అవకాశం లేదని, అందువల్ల ఆ స్థలంపై హక్కు తమదేనని కోరారు. రామ నంది వైరాగీలు మరికొంత ముందుకు పోయి, అక్కడున్న నిర్మాణం మసీదు కానే కాదని, అక్కడ ఎల్లప్పుడూ రామాలయమే వుండేదని, అది కూడ తమ అధీనంలోనే వుండేదని వాదించారు. వివాదాస్పదమైన మసీదుగా కనబడే అ నిర్మాణాన్ని డిసెంబర్ 6, 1992 న ధ్వంసం చేశారని, కాకపోతే, అంతకు పూర్వం అదెలా వుండేదో సాక్ష్యాధారాలున్నాయని న్యాయమూర్తి పేర్కొన్నారు.

ఇక, ముస్లింల వాదనను వినిపించిన వారి వాంగ్మూలం ప్రకారం, 433 సంవత్సరాల క్రితం బాబర్ కాలంలో నిర్మించిన చరిత్రాత్మక మసీదు అక్కడుందని, ముస్లింల ప్రార్థనా స్థలం గాను, మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు గాను దాన్ని ఉపయోగించుకోవడం జరిగేదని పేర్కొన్నారు.

ప్రతివాదిగా వ్రాత పూర్వక వాంగ్మూలం ఇచ్చిన ధరం దాస్ పేర్కొన్న అంశాలు ఆసక్తికరంగా వున్నాయి. బాబర్ మూఢాభిమానం కల ముస్లిం కాదని, ఇస్లాం మతంపై విశ్వాసమున్న వ్యక్తి అని, హిందూ దేవాలయాలను కూలగొట్టించే మనస్తత్వం కలవాడు కాదని, అయితే అతడి సేనానాయకుడు మీర్ బాక్వి అలా కాదని అంటాడు. మహరాజా విక్రమాదిత్య కాలంలో, రామ జన్మ భూమిలో నిర్మించిన ఆలయాన్ని కూల్చి వేసి, మీర్ బాక్వి ఆ శిథిలాలతో మసీదు లాంటి నిర్మాణాన్ని చేశాడని అంటాడు. బాబర్ "చక్రవర్తి" కాడని, "కొల్లగొట్టే స్వభావం" కల మనిషని, ఆ నిర్మాణం మసీదు కాదని, బ్రిటీష్ వారి హయాంలో దాన్ని "మసీద్ జనమ్ స్థాన్" అని పిలిచేవారని అంటూ, దాని నిర్మాణంలో పద్నాలుగు కసౌటీ స్థంబాలను, గంధపు చెక్కల దూలాలను వాడారని వాదించారు.

వ్రాత పూర్వకంగా వాది-ప్రతివాదులు పేర్కొన్న అంశాల్లో చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. 1960 సంవత్సరపు ఫైజాబాద్ గెజిటీర్స్ లో, 50 వ పేజీలో, రికార్డయిన ఇంగ్లీష్ వ్యాపారి విలియం ఫెంచ్ వెలిబుచ్చిన అభిప్రాయం వుంది. ఆయన 1608-1611 లలో మొగలాయి సామ్రాజ్యంలో పర్యటించారు. తన పర్యటనలో ఆయన దృష్టి కొచ్చిన అంశాలను పేర్కొంటూ, "అవథ్" ఒక ప్రాచీన ప్రదేశమని, పోతన్ రాజుండే స్థలమని, రామాయణ గాథ నాయకుడు-భారతీయులు ఇలవేల్పుగా తలచే రామచంద్ర మూర్తి నివసించిన భవన శిథిలాలు అక్కడున్నాయని అంటారు. సృష్టికి పూర్వం లక్షలాది సంవత్సరాల క్రితమే, మహనీయులెందరో సమీపంలోని నదిలో స్నానం చేసేవారని, అక్కడ తాను కలిసిన వారు చెప్పినట్లు కూడా విలియం ఫెంచ్ పేర్కొన్నారట.


మదన్ మోహన్ గుప్తా వాంగ్మూలంలో, వేలాది సంవత్సరాల క్రితం, భగవదవతారమైన శ్రీరాముడు జన్మించిన రామ జన్మభూమిలో ఆలయం ఎల్లప్పుడూ వుండేదని, అది హిందూ మతస్థుల ఆధ్యాత్మిక స్థావరం అని, ఆయన త్రేతాయుగాంతంలో-ద్వాపర యుగారంభంలో అవతరించారని పేర్కొన్నారు. శిష్ట రక్షణ కొరకు మానవాకారంలో అవతరించిన భగవంతుడాయన. ఆయనను-ఆయన గుణగణాలను, ఆయన సమకాలీనుడైన వాల్మీకి మహర్షి రామాయణంలోను, తర్వాత వ్యాస మహాభారతంలోను-అందులోని రామోపాఖ్యాన పర్వంలోను, పురాణాల లోను, ఇతిహాసాల లోను, కౌటిల్యుడి అర్థశాస్త్రం లోను, కాళిదాసు రఘువంశం లోను, ఇతర భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాల్లోను ప్రస్తావించారు ఆయా కవులు. నలుగురు మొఘల్ చక్రవర్తులకు (బాబర్, హుమయూన్, అక్బర్, జహంగీర్) సమకాలీనుడైన గోస్వామి తులసీదాస్ రచించిన "రామ చరిత్ర మానస్" లో, అయోధ్యలో శ్రీరాముడి జన్మదిన వేడుకల విశేషాలున్నాయి కాని, బాబ్రీ మసీదు ప్రస్తావన ఎక్కడా లేదు. అలానే బాబర్ నామాను, గెజెటీర్స్ ను ఉటంకిస్తూ, తన వాదనను సమర్థించుకున్నారాయన.

జస్టిస్ సుధీర్ అగర్వాల్ తన తీర్పు చివర్లో, యావద్భారత దేశ ప్రజలకు ప్రమేయమున్న, "అత్యంత సున్నితమైన, క్లిష్ట తరమైన, వివాదాస్పదమైన" ఈ కేసును నిర్ణయించి తీర్పివ్వడానికి తాము పరిశీలించిన రికార్డులు ఎంతగానో దోహదపడ్డాయని, ఇదో "జైగాంటిక్, హెర్క్యూలియన్ టాస్క్" అని వర్ణించారు. తీర్పు అనుబంధంలో, న్యాయమూర్తులు పరిశీలించిన అనేక పుస్తకాల వివరాలను ఇచ్చారు. వాటిలో, ఇంపీరియల్ గెజెటీర్స్ తో సహా రకరకాల ఇతర గెజెటీర్స్, మహమ్మదీయుల చట్టాలకు సంబంధించిన పుస్తకాలు, మొగలాయిల డాక్యుమెంట్లు, హోలీ ఖురాన్, బాబర్ నామా, శ్రీ గురు గ్రంధ సాహిబ్, హెగెల్ చరిత్ర తత్వ శాస్త్రం (ఫిలాసఫీ ఆఫ్ హిస్టరీ), రోమిలా థాపర్ రాసిన భారత దేశ చరిత్ర, కుష్వంత్ సింగ్ సిక్కుల చరిత్ర, ఆర్ సి మజుందార్ భారత దేశ చరిత్ర, వివిధ భాషలలోని నిఘంటువులు, హిందూ మత నిఘంటువు, హ్యూయన్ సాంగ్ జీవిత చరిత్ర, ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా తో సహా అనేక విజ్ఞాన సర్వస్వాలు, ఆర్కియాలాజికల్ సర్వే నివేదికలు, స్వామి వివేకానంద రచనలు, ఆనంద రామాయణం, వాల్మీకి రామాయణం, రామ చరిత్ర మానస, భగవద్గీత, కాళిదాసు రఘువంశం, అధర్వ వేద సంహిత, రుగ్వేదం, రుగ్వేద సంహిత, సామవేదం, శుక్ల యజుర్వేదం, బృహదారణ్యక ఉపనిషత్తు, బృహస్పతి స్మృతి, మను స్మృతి, ధర్మశాస్త్రాలు, మత్స్య పురాణం, మేఘ దూత, నారదీయ ధర్మ శాస్త్రం, నారద స్మృతి, పురుష సూక్తం, శాకుంతలం, శుక్రనీతి, స్కంద పురాణం, యాజ్ఞవల్క్య స్మృతి లాంటివి వున్నాయి.

జస్టిస్ ఎస్ యు ఖాన్ తన తీర్పు పాఠాన్ని అవతారిక, ముందుమాటలతో ఆరంభించి చివర్లో ఉపసంహారంతో ముగించారు. చరిత్ర, పురావస్తు, ప్రాచీన శిల్ప శాస్త్రాలకు సంబంధించిన విషయాల్లో తానంత లోతుగా వెళ్ళ లేకపోయానని, దానికి నాలుగు కారణాలున్నాయని అంటారు జస్టిస్ ఖాన్. మొదటిది వ్యాజ్యాలను నిర్ణయించడానికి వాటి అవసరం అంతగా లేదని తాను భావించడం. ఒకవేళ తానలా వాటి మూలాల్లోకి పోయినట్లయితే, ఆ మార్గంలో, తనకు "నిజం అనే నిధి" లభ్యమవుతుందా, లేక, "అస్పష్టమైన కఠోర భ్రమ" మిగులుతుందా తెలియదంటారాయన. చారిత్రక విషయాల గురించి అంతగా పరిజ్ఞానం లేని తాను, చరిత్రకారుల సంకట జ్వాలల్లో ఇరుక్కోవాలని లేదంటారు. సివిల్ వ్యాజ్యాల్లో చరిత్ర సాక్ష్యాధారాలకు అంతగా స్థానం లేదని సుప్రీం కోర్టు గతంలో ఒక తీర్పులో చెప్పడం మరో కారణమంటారు. ఏదేమైనా తాము చెప్తున్న తీర్పు తుది నిర్ణయం కాదని, అసలైన నిర్ణయాత్మక దశ మున్ముందు రానున్నదని, ఆ దిశగా ఇరు పక్షాల వారికి తానొక సూచన చేయదల్చుకున్నానని ఉపసంహారంలో పేర్కొన్నారు జస్టిస్ ఖాన్.

రాము డంటే త్యాగానికి మారు పేరని, ఆయన గుణగణాల్లో త్యాగానికే ప్రాధాన్యత అధికమని అంటారు జస్టిస్ ఖాన్. అలాగే ప్రాఫెట్ మొహమ్మద్ ప్రస్తావనా తెచ్చారు. హుదయ్ లియా వద్ద, ప్రాఫెట్ మొహమ్మద్ విపక్ష బృందంతో ఒప్పందం కుదుర్చుకోవడాన్ని, ఆయన బలీయమైన మద్దతు దార్లతో సహా పలువురు, మొహమ్మద్ లొంగుబాటుగా భావించారని, ఖురాన్ మాత్రం ఆ సంఘటనను మొహమ్మద్ విజయంగా వర్ణించిందని పేర్కొన్నారు. అదే నిజమైందని, అనతికాలంలోనే ముస్లింలు ఒక్క నెత్తురు బొట్టు కూడా చిందకుండా మక్కాలోకి ప్రవేశించే వీలు కలిగిందని అంటారు న్యాయమూర్తి ఖాన్. డిసెంబర్ 6, 1992 నాటి మసీదు కూల్చివేత సంఘటనను ప్రస్తావించి, అలనాటి భారతీయుల సర్దుబాటు ధోరణిని అభినందనీయమంటారు. అయితే, అలాంటి సంఘటనలు మరల తలెత్తవని, అలా మళ్లీ జరుగు తే, కోలుకోవడం కష్టతరమవుతుందని అభిప్రాయ పడ్డారు. వర్తమాన కాలంలో ప్రపంచ గమనం వేగవంతమైందని, 1992 లో లాగా కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో చితికిపోవచ్చని అంటారు. "వతన్ కీ ఫికర్ కర్ నాదా ముసీబత్ ఆనే వాలీ హై..." అన్న ఇక్బాల్ కవి వాక్యాలను, డార్విన్ చెప్పిన మాటలను ఉదహరించారాయన. "సహ యోగం చేసిన, మెరుగు పడిన జాతులు మాత్రమే మనుగడ సాధించగలిగాయి" అని చెప్పిన డార్విన్ మాటలను గుర్తుచేశారు.

ఇతర మతాలవారితో ముస్లింల సంబంధ బాంధవ్యాలకు సంబంధించి ఇస్లాం బోధనలేంటో తెలుసుకునేందుకు యావత్ ప్రపంచం ఆసక్తి కనబరుస్తున్న విషయం ముస్లింలు లోతుగా ఆలోచించాలంటారు జస్టిస్ ఖాన్. విరోధం, శాంతి, స్నేహం, ఓర్పు లాంటి సందేశంతో ఇతరులను మెప్పించే సమయం కొరకా, లేక, ఎక్కడ-ఎప్పుడు వీలుంటే అప్పుడు దెబ్బతీసే సమయం కొరకా ఎదురు చూస్తోంది? అని ప్రశ్నించారాయన. ముస్లింలు భారత దేశంలో అద్వితీయమైన స్థానంలో వున్నారని, వాళ్లు ఒకప్పుడు పాలకులు గాను, మరొకప్పుడు పాలించబడిన వారి గాను వున్నప్పటికీ, ప్రస్తుతం, జూనియర్లగానైనా అధికారంలో భాగస్వాములయ్యారని అంటారు. వారిక్కడ మెజారిటీలో లేకపోయినా, ఉపేక్షించదగిన మైనారిటీలో లేరని, ఇండొనేషియా తర్వాత అధిక సంఖ్యాక ముస్లింలుండేది భారతదేశంలోనేనని పేర్కొన్నారు. చాలా దేశాల్లో వారు మెజారిటీలో వున్నప్పటికీ అక్కడి సమస్యల పట్ల నిర్లిప్తతతో-ఉదాసీనతతో వుంటారని, మైనారిటీలో వున్న దేశాల్లో వారి ఉనికిని గుర్తించకపోవడం జరుగుతున్నదని అంటారు. భారత దేశంలోని ముస్లింలు మత పరమైన విద్యాభ్యాసాన్ని, పరిజ్ఞానాన్ని తర తరాల అపారమైన వారసత్వ సంపదగా పొందారని, అందువల్ల, యావత్ ప్రపంచానికి అసలు విషయాన్ని తెలియ పరిచే దిశగా పయనించడానికి సరైన స్థానంలో వున్నారని, ఆ దిశగా ఈ వివాద పరిష్కారాన్ని ఎరుక పరిచే విధంగా తమ పాత్ర పోషించాలని సూచించారు జస్టిస్ ఖాన్.

ఈ నేపధ్యంలో ఏర్పాటైన మధ్యవర్తిత్వం జరుపుతున్న త్రిసభ్య సంఘం అయోధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే సూచన ఇస్తుందని ఆశిద్దాం.