Sunday, October 15, 2023

శ్రీకృష్ణుడికి, బలరాముడికి పితృయజ్ఞాన్ని నిర్వర్తించిన అర్జునుడు ఆస్వాదన-142 : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీకృష్ణుడికి, బలరాముడికి పితృయజ్ఞాన్ని నిర్వర్తించిన అర్జునుడు

ఆస్వాదన-142

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (16-10-2023)

శ్రీకృష్ణుడు పంపిన దారుకుడు హస్తినాపురానికి వెళ్లి, పాండవులను చూసి, యాదవులు ఒకరినొకరు కొట్టుకొని చావడాన్ని, బలరామకృష్ణులు అడవిలో వున్న విషయాన్ని, కృష్ణుడు తనను హస్తినలు పంపిన విషయాన్ని సవివరంగా చెప్పాడు. ఇది విని పాండవులు దుఃఖంతో కుంగిపోయారు. యాదవుల మరణం విన్న ద్రౌపది, సుభద్ర మొదలైన అంతఃపుర స్త్రీలు హాహాకారాలు చేస్తూ ఏడ్చారు. శ్రీకృష్ణుడు తీసుకొని రమ్మన్నాడని అర్జునుడికి చెప్పాడు దారుకుడు. ధర్మరాజు అనుమతి తీసుకొని (బలరామకృష్ణులు ఇంకా బతికే వున్నారని భావిస్తున్న) అర్జునుడు తక్షణమే బయల్దేరి ద్వారకకు చేరాడు. దైన్యావస్తలో వున్న ద్వారకను చూశాడు. అర్జునుడి మనస్సు పరితాపం పొందింది. అర్జునుడు రాజసౌధానికి వెళ్లాడు. అక్కడ శ్రీకృష్ణుడి పదహారువేలమంది ప్రియభార్యలు సంక్షోభిస్తూ అర్జునుడి దగ్గరికి వచ్చారు. వారి అవస్త చూసిన అర్జునుడు నేలమీద పడిపోయాడు. రుక్మిణీసత్యభామలిద్దరూ పెద్దగా ఏడ్చారు. మిగిలిన శ్రీకృష్ణుడి రాణులు ఇక తమకు దిక్కెవ్వరని దైన్యంతో ఏడ్చారు.

అర్జునుడు అందరినీ ఓదార్చాడు. ఆ తరువాత దారుకుడు తనతో ఆర్జునుడిని తీసుకొని వసుదేవుడి దగ్గరకు వెళ్లాడు. శ్రీకృష్ణుడు ఎక్కడ, ఎలా వున్నాడోననీ, ఆ విషయం చెప్పేవారెవరనీ, పెద్ద దుఃఖం వచ్చింది అర్జునుడికి. వసుదేవుడిని అడుగుదామనుకుంటే అయన కూడా దుఃఖిస్తూ కన్పించాడు. దైవం కోపించడంతో యాదవులంతా నిష్కారణంగా ఒకరినొకరు చంపుకొన్నారని ఆ విషయాలను చెప్పాడు వసుదేవుడు అర్జునుడికి. ఇదంతా చూస్తూ శ్రీకృష్ణుడు ఉపేక్ష చేశాడనీ, యుద్ధాన్ని మాన్పించలేదనీ, బహుశా ఆ విధంగా యాదవులంతా చావడం తప్పనిసరైన విషయంగా ఆయన భావించాడేమో అని అన్నాడు వసుదేవుడు. కృష్ణుడు తన దగ్గరికి వచ్చిన సంగతి, తనను ఓదార్చిన సంగతి, అర్జునుడు రాబోతున్న సంగతి, అతడి ద్వారా బందువులను రక్షించుకోమని చెప్పిన సంగతి, కొద్ది రోజుల్లోనే సముద్రం ద్వారకానగరాన్ని ముంచివేయబోతున్న సంగతి, తనకు తపస్సు చేసుకోవడానికి అనుమతి ఇవ్వమని అడిగిన సంగతి అర్జునుడికి వివరించాడు వసుదేవుడు. యాదవులందరికీ అర్జునుడే అగ్నిసంస్కారం చేస్తాడని కూడా శ్రీకృష్ణుడు చెప్పాడని అన్నాడు. కృష్ణుడు చెప్పినట్లు చేయమని అన్నాడు.

ధర్మరాజు తనకు సూచించిన విధంగా ద్వారకలోని పిల్లలను, ఆడవారిని కావాల్సినంత ధనంతో ఇంద్రప్రస్థపురానికి చేరుస్తానని అన్నాడు అర్జునుడు. ఆ తరువాత ద్వారకావాసులందరినీ ఒక్కచోట చేర్చి వారికి నాటికి ఏడోరోజున సముద్రం ద్వారకను ముంచబోతున్న  సంగతి చెప్పి, అంతా నగరం విడిచి పోవాల్సిన అవసరాన్ని తెలియపర్చాడు. ఇంద్రప్రస్థనగరానికి కృష్ణుడి మనుమడైన వజ్రుడిని రాజుగా చేస్తానని, అతడి రక్షణలో అంతా అక్కడే వుండమని అన్నాడు వారితో అర్జునుడు. ప్రయాణానికి సిద్ధం కమ్మని చెప్పాడు. మంత్రులను ప్రయాణానికి కావాల్సిన అన్ని హంగులనూ సిద్ధం చేయమని పురమాయించాడు.

ఆ మర్నాడు ఉదయం కాబోతుండగా వసుదేవ మహారాజు దేహాన్ని వదిలేసి పుణ్యలోకాలకు పోయాడు. నలుగురు భార్యలు సహగమనానికి సిద్ధమయ్యారు. శ్రీకృష్ణుడు (వసుదేవుడికి) చెప్పినట్లే అర్జునుడు వసుదేవుడి పితృకార్యాన్ని, దహనకాండను జరిపించాడు. బంధువులను ఓదార్చిన అర్జునుడు మర్నాడు దారుకుడితో కలిసి యాదవవీరులు యుద్ధం చేసి చనిపోయిన ప్రదేశానికి పోయి వారికి అగ్నిసంస్కారం చేశాడు. యాదవ స్త్రీలను ద్వారకకు పొమ్మని చెప్పి తాను బలరామకృష్ణులను వెతకడానికి అడవిలోకి వెళ్లాడు. ఎలా వెతకాలో, ఎక్కడ వెతకాలో తెలియక దిక్కు తప్పిపోయి అడవిలో కొన్ని రోజులు అలా-అలా తిరుగుతుంటే ఒక బోయవాడు శ్రీకృష్ణుడు తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడికి పోయిన అర్జునుడు, పడివున్న శ్రీకృష్ణుడి కళేబరాన్ని చూసి మూర్ఛపోయి నేలమీద పడ్డాడు. కాసేపటికి తెప్పరిల్లి అమితంగా దుఃఖించాడు. కృష్ణుడి పాదంలో వున్న గాయాన్ని గుర్తించాడు. కృష్ణుడి శరీరావయాలలో ఎలాంటి మార్పు కాని, వికారం కాని లేదు.

కృష్ణుడి మరణవార్త నగరంలో పొక్కకుండా దాచిపెట్టాలని తన వెంట ఉన్నవారితో అన్నాడు. మరణవార్త చెప్తే ప్రయాణసన్నాహాలు ఆగిపోయే ప్రమాదం వున్నదని భావించాడు అర్జునుడు. ఎందుకంటే మర్నాడు సూర్యోదయం కాగానే సముద్రం ద్వారకను ఆక్రమించుకోనున్నది కాబట్టి. అర్జునుడు గాఢంగా శ్రీకృష్ణుడిని తలచుకొంటూ పితృయజ్ఞాన్ని నిర్వర్తించాడు. ఆ తరువాత ఆ ప్రాంతంలోనే వెతకగా బలరాముడి దేహం కూడా కనిపించింది. ఆ కళేబరాన్ని కూడా చితాగ్నిలో ఆహుతి చేశాడు అర్జునుడు.

ద్వారకకు చేరిన అర్జునుడు అన్ని పనులను ఆ రాత్రికి రాత్రే పూర్తిచేసి సూర్యోదయం కాకపూర్వమే ప్రజలను, జీవరాసులను, ధనాన్ని, సామాన్లను ద్వారకానగరం దాటించాడు. వారిలో శ్రీకృష్ణుడి పదహారువేలమంది భార్యలు, అష్టమహిషులు, బలరాముడి భార్యలు మొదలైనవారున్నారు. వారలా బయల్దేరిన కాసేపటికే ఒక్కుమ్మడిగా సముద్రం ద్వారకానగరాన్ని ముంచి వేసింది. మార్గమధ్యంలో వారు పంచవటం అనే ప్రదేశంలో విడిది చేసినప్పుడు గజదొంగలు ప్రయాణిస్తున్నవారి ఆభరణాలు అపహరించడం విశేషం. అర్జునుడి గాండీవ ప్రయోగం ఆ కిరాతకులను ఏమీ చేయలేక పోయింది. అర్జునుడికి ఆ సమయంలో ఒక్క మంత్రం కూడా స్ఫురణకు రాలేదు. ఇదంతా దైవం ప్రతికూలంగా వుండడమే అని భావించాడు అర్జునుడు. అమ్ములపొదులు ఖాళీ అయిపోయాయి కాసేపటికి. దైవం తన సహాయం మానగానే అర్జునుడి పరాక్రమం ఇట్లా అయిందని అర్థం చేసుకోవాలి!

అర్జునుడు ఏదోవిధంగా ఆ కిరాతకుల విజృంభణాన్ని కొంతసేపు అరికట్టి రుక్మిణి మొదలైన అష్టభార్యలను, బలదేవుడి భార్యలను, కొంతమంది యాదవ స్త్రీలను కాపాడగలిగాడు. సాధ్యమైనంత దోపిడీ చేసి, ధనాన్ని కొల్లగొట్టిన ఆ కిరాతకులు వెళ్లిపోయారు. ఆ తరువాత అందరినీ వెంటబెట్టుకొని కురుక్షేత్రానికి వెళ్లాడు అర్జునుడు. కృతవర్మ కొడుకును మృత్తికావతపురాన్ని ఏలుకోవడానికి అభిషేకం చేసి, అతడిని తల్లితో, సోదరులతో అక్కడ వుండమన్నాడు. సాత్యకి కుమారుడిని సరస్వతి అనే నగరానికి అభిషేకం చేశాడు. మిగతావారిని ఇంద్రప్రస్థపురానికి తీసుకెళ్లి వజ్రుడిని ఆ నగరానికి ప్రభువుగా పట్టం కట్టాడు. అక్రూరుడి భార్యా పిల్లలను వజ్రుడికి అప్పచెప్పాడు.  

ఈ నేపధ్యంలో ఒకనాడు అర్జునుడు బలరామకృష్ణుల మరణ వార్తను వారి పత్నులకు చెప్పాడు. ద్వారక సముద్రంలో మునిగే సమయం ఆసన్నమైనందున అప్పుడు అ ఆవిషయం చెప్పలేకపోయానని అన్నాడు వారితో. తన తప్పును మన్నించమని అడిగాడు. రుక్మిణి, జాంబవతి మొదలైన స్త్రీలు సహగమనం చేస్తామన్నారు. వారు కోరిన విధంగానే అర్జునుడు వారి అగ్నికార్యం నిర్వహించాడు. సత్యభామ మొదలైన స్త్రీలు అడవుల్లో తపస్సు చేయడానికి వెళ్లిపోయారు.

ఇదంతా జరిగిన తరువాత అర్జునుడు వేదవ్యాసుడి దగ్గరికి వెళ్లాడు. శ్రీకృష్ణ బలరాములు తనువులు వదిలిపెట్టిన సంగతి విచారంతో చెప్పాడు ఆయనకు. యాదవులు తుంగపరకలతో కొట్టుకొని చనిపోయిన విషయం కూడా చెప్పాడు. తాను యాదవ స్త్రీలను, బాలవృద్ధులను వెంట తీసుకొస్తుండగా బోయలు ఎదిరించిన సంగతి, తన అస్త్రశస్త్రాలు పని చేయని సంగతి, వారు దోచుకున్న సంగతి కూడా చెప్పాడు. అది విని వేదవ్యాసుడు అర్జునుడికి హితోపదేశం చేశాడు. శ్రీకృష్ణుడికి యాదవ నాశనం ముందే తెలుసని, అయినప్పటికీ, కాలవిధికి అడ్డు ఎందుకు తగలాలని ఉపేక్షించి ఉన్నాడని, అదే శ్రీకృష్ణుడు కాలం అడ్డు తిరగడం వల్ల అర్జునుడికి బోయలతో జరిగిన పోరులో కాపాడలేకపోయాడని అన్నాడు. భూభారాన్ని తొలగించడానికి అవతారమెత్తిన నారాయణుడు దాన్ని అపూర్వంగా నిర్వహించి, ముసలితనం, మృత్యువు లేనిది, కళాతీతమైనది, వికృతిలేనిదై ప్రకాశిస్తుండే తన ‘సత్’ స్టానాన్ని ఉపశమం పొందినవాడై చేరాడని చెప్పాడు. భూభారం తొలగింది కాబట్టే అస్త్ర సంపద ఆర్జునుడిని వదలి వెళ్లిపోయిందని అన్నాడు.

ఇంక ఇలా అన్నాడు వేదవ్యాసుడు: ‘అయిన కాలంలో బుద్ధి, శక్తి ప్రకాశిస్తాయి. కాలం అడ్డు తిరిగితే నశిస్తాయి. అందువల్ల జ్ఞానులకు గర్వం కాని, శోకం కాని వుండవు. సృష్టిలో అంతా కాలాధీనంగా వుంటుంది. అందువల్ల తక్కిన ఆలోచనలు మాని పాండవులు నిశ్చింతగా దేహాలు విడిచిపెట్టి ఉత్తమగతికి వెళ్లాలి’. వేదవ్యాసుడి మాటలు విన్న అర్జునుడు శోకం, మొహం పోయిన ముఖంతో ఆనందం పొంది, ఆయన్ను వీడ్కొని, హస్తినాపురానికి పోయి , ధర్మరాజును కలిసి జరిగిన విషయమంతా వివరించాడు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, మౌసలపర్వం, ఏకాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

Saturday, October 14, 2023

KCR Leadership makes a Huge Difference in Governance : Vanam Jwala Narasimha Rao

 KCR Leadership makes a Huge Difference in Governance

Vanam Jwala Narasimha Rao

The Hans India (15-10-2023)

{The all-round marvelous growth in Telangana is worth a case study by varsities like Harvard. Telangana, lowest in rank in Per Capita Income, Per Capita Power, GSDP etc. at the time of formation, reached to ‘Number One’ position in the country. Per Capita Income touched Rs 3,12,398. GSDP is increased from Rs 5 lakhs to over Rs 13 lakhs. Per Capita Power Consumption is 2126 units exceeding the national average of 1,255 units by 70 percent-10-2023). Installed power capacity is 18756 Megawatts and peak demand is 15497 Megawatts. Shortly the state will reach the target of 27,000 Megawatts of Installed power capacity. An unparalleled achievement!!! Growth by any standards in Telangana is Inclusive-Synopsis by Editor Hans India}

‘Good Governance’ makes a ‘Difference’ and its Leader makes ‘Huge Difference’ and that is Telangana Chief Minister K Chandrashekhar Rao. The transformation triggered due to unprecedented, inclusive, all-round progress and development in Telangana, since formation of state just nine and half years ago, on June 2, 2014 should be a research study for Harvard University. Every poll promise, made either in First or in Second Assembly Elections held in 2014 or in 2018 were implemented in letter and spirit, and even went beyond. Telangana thus, becomes Role Model of Welfare and Development as well as Economic Growth. CM KCR himself detailed these many a time.

When Telangana State was formed, utter darkness surrounded everywhere with every sector being completely destroyed and devastated virtually beyond restoration. Power Crisis, Agriculture Crisis, Monetary Crisis etc. had thrown Telangana in to a Vortex or Maelstrom. At that critical juncture, TRS (BRS) assumed responsibility of Governance, as ‘Devout Yajna’ led by K Chandrashekhar Rao as Chief Minister. From day one, in order to retrieve from the damage done and set right things, KCR on priority focused on state finances. On his request, distinguished Financial Expert, and former Advisor to Financial Commission of India GR Reddy, working then with Bihar Government, joined as Finance Advisor to Telangana. Things started moving briskly.  

KCR held frequent deliberations with Financial, Irrigation and other Experts and ‘kick-started’ journey of triumph leading to Marvelous Growth. Telangana, lowest in rank in Per Capita Income, Per Capita Power, GSDP etc. at the time of formation, reached to ‘Number One’ position in the country. Per Capita Income touched Rs 3,12,398. GSDP is increased from Rs 5 lakhs to over Rs 13 lakhs. Per Capita Power Consumption is 2126 units exceeding the national average of 1,255 units by 70 percent-10-2023). Installed power capacity is 18756 Megawatts and peak demand is 15497 Megawatts. Shortly the state will reach the target of 27,000 Megawatts of Installed power capacity. An unparalleled achievement!!! Growth by any standards in Telangana is Inclusive.

In the framework of all this, there took place, enormous and committed hard work, brainstorming, expertise, scientific planning with precision, mobilizing funds from various Financial Institutions and other sources, and above all constant persuasion at every milestone and turning point. ‘Task Accomplishment and Target Fulfillment’ was the hallmark or distinctive characteristic in this journey, but not a casual game play. Detractors are ignorant and unaware of this. For instance, except Telangana, no other State gives 24 power supply to all sectors. Of course, the heart in heart view of opposition leaders is, three hours power supply is more than enough!!!

  Goebbels’ style of propaganda, repeating a lie hundred times in an effort to make it a truth, is the insalubrious strategy conceived by opposition in Telangana which is by all means a rhetoric. For instance, the allegation of these hecklers that, Telangana incurred huge debts and took loans beyond its limit is travesty of truth. In taking advances or incurring debts Telangana is placed at 23rd position, whereas, 22 states are ahead of Telangana. Proof of brilliant fiscal discipline in Telangana, is the announcement made by Union Finance Minister in Lok Sabha in August, acknowledging that, Telangana is well within its limits of taking loans. Reserve Bank of India Reports too confirm this fact clearly indicating stable economic growth. And this is reality!!!

Yet another unhealthy criticism is about failures which are diminutive, sporadic, and or occurring at random here and there. These small things are ‘But Natural’ and ‘Genuine.’ For instance, in a massive, huge, and gigantic Mission Bhagiratha Safe Drinking Water Supply Scheme of supplying crores of liters of water free of cost, if somewhere in some village, and in some obscure corner, one or two pipes get damaged as part of wear and tear and could be easily rectified, which is not a big issue, it would be better if one understands before criticizing. In a pipeline of an enormous length of two and half lakhs kilometers, if a small error takes place at times, why ‘Hue and Cry’? 

Besides supplying water free of cost in rural areas, for all poor in urban areas, tap connection is made available for a nominal one rupee, which is not the case anywhere in India. Nowhere in India 20 thousands liters of water is supplied free of cost except in Telangana. Union Government placed on record in Parliament a dozen times, that, Telangana is the one and only state in the entire country, which has hundred percent tap connections and no house is left without a tap. Representatives of Telangana Government, once in three months, are invited to Delhi to receive some award or other from Union Government, whether it likes or not.

Mission Bhagiratha has not become a reality ‘Just Like That.’ With intellect, engineering skill, and dedicated hard work, Chief Minister KCR, accompanied by experts, toured ‘Nook and Corner’ of every district, climbing up and down hillocks, and measuring contours. Google maps were used extensively. Highest places to locate tanks from where water can flow down with gravity easily were identified. A Foolproof, Infallible, and Well-Made design for the Scheme was formulated, so that nothing might go wrong. Design included least power consumption and to be operated through gravity. Public Representatives from as many as 13 states visited Telangana to study the scheme who lauded it.

History recorded that, Kakatiya Kings with their unimaginable knowledge and scientific brilliance, in 11th century itself, built as many as 76,000 chain of tanks, which was the source for major irrigation in Telangana cultivating 15-20 lakhs of acres. Unfortunately, in united Andhra Pradesh, nearly 30,000 tanks vanished and turned into illegal occupation. Mission Kakatiya rejuvenated, revived, and revitalized the remaining 46,000 Tanks all over the state in a phased manner. Every Tank now is like a full-fledged Reservoir, supplying water for irrigation, for the related ayacut in villages. ‘Mission Kakatiya’ was not an afterthought Scheme or name that was designed consequent to formation of TRS (BRS) Government. It was a conscious and decisive conclusion arrived at, in the process of series of brainstorming reviews that KCR, Professor Jayashankar, R Vidyasagar Rao and others, in anticipation of formation of Telangana State.

As part of Telangana Progress and Development Irrigation Projects like Kaleshwaram Lift Irrigation Project on fast Track and Sitarama, Devadula, Sammakka Sagar, PRLIS were built. Projects like Mid Manner, Yellampally, Kalvakurthy, Nettempadu, Bhima, Devadula etc. have been completed along with others. The result is while the total paddy production in Telangana in erstwhile AP state was a mere 68 lakhs tones, today it crossed 3 crores figure, which is more than that of Punjab. The quantity is so huge that to stock it, the existing 30 lakh ton capacity godowns have become inadequate.

Nevertheless, and despite difficulties, Government decided to buy entire paddy, and from out of it to undertake milling of 2 crore tons through Civil Supplies Corporation. In due course the production will be enhanced to 4 crore tons. No state government in India purchases entire paddy production as is done in Telangana.

Rytu Bandhu, Rytu Bhima, Dalit Bandhu, Dharani Portal for ease of Registrations, Green Fund for Telangana ku Harita Haram, Reforms in Health, and Education Sectors like Kanti Velugu, KCR Kits, Basthi Davakhanas, Medical College in each district, Residential Institutions, Oversees Scholarships, Aasara Pensions, Kalyana Laxmi, Shadi Mubarak, Double Bed Room Houses, SC, ST, BC, Women, Minorities, Brahmins, Employees welfare, Administrative Reforms including new PR and Municipal Acts, Sheep distribution, IT and Industrial Growth, Farmers’ Platforms, Strategic Road Development Plan in Hyderabad etc. are indicators of Telangana Role Model signaling ‘Telangana implements and Country follows’. And hence, Leadership Makes ‘Huge Difference’ and ‘That is KCR’ Leadership.

(Writer is Chief Public Relations Officer to the Chief Minister, Telangana)

Friday, October 13, 2023

తెలంగాణకు ముందు ..... వెనక! (ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర సాధన ప్రస్తానం పునశ్చరణ) : వనం జ్వాలా నరసింహారావు

 తెలంగాణకు ముందు ..... వెనక!

(ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర సాధన ప్రస్తానం పునశ్చరణ)

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ దినపత్రిక (14-10-2023)

          వేదిక ఏదైనా, అంశం ఎలాంటిదైనా, శ్రోతలు ఎవరైనా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసే ప్రసంగాలన్నీ సాక్ష్యం ఆధారిత, అద్భుతమైన, విలువైన సమాచారంతో వుండేవే కావడం వల్ల, శ్రద్ధపెట్టి వినేవారికి సంబంధిత అంశానికి చెందిన సమస్త విషయం స్పష్టంగా అవగతమౌతుంది. కేసీఆర్ మాట్లాడే సందర్భంలో తన ప్రసంగ భావాన్ని వ్యక్తీకరించే విధానం, అమోఘమైన జ్ఞాపకశక్తి, ఏకకాలంలో బహువిధాల వివరణ ఇచ్చే సామర్థ్యం, తప్పులు దొర్లకుండా ఆశువుగా గణాంకాల వెల్లడి, సృజనాత్మకత, ప్రజ్ఞాపాటవాలతో రంగరించిన సూక్ష్మ హాస్యం, తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషా గ్రంథాల నుండి విషయాలను విస్తృతంగా ప్రస్తావించడమనేది అసాధారణమైన ఆయన వ్యక్తిత్వానికి, భగవంతుడు ఆయనకిచ్చిన వరానికి, ఏళ్లతరబడి ఆయన చేసిన కృషికి ప్రత్యక్ష నిదర్శనం. ఆయన హితులు, సన్నిహితులే కాకుండా విరోధులు సహితం అంగీకరించే వాస్తవం ఇది.

         ఇలా కేసీఆర్ చేసిన అనేకానేక ప్రసంగాలలో, ఇటీవల ఆగస్ట్ 6, 2023 న, రాష్ట్ర శాసనసభలో ‘తెలంగాణ రాష్ట్ర సాధన, తదనంతర ప్రగతి పథం’ అనే అంశం మీద జరిగిన లఘు చర్చకు సమాధానం ఇచ్చిన సందర్భంగా, సుమారు మూడు గంటలపాటు ఆయన వివరించిన తెలంగాణ రాష్ట్ర సాధన ప్రస్తావన నేపధ్యంలో, బహుశా వర్తమాన, భావితరాలవారికి అవగతమయ్యే చాలా విషయాలున్నాయి. ఆయన చేసిన యావత్ ప్రసంగాన్ని దీక్షగా, శ్రద్ధగా వినగలగాలి. అలాగే ఆయన ప్రసంగ భావాన్ని, పదాల మధ్యన, పంక్తుల మధ్యన అంతర్లీనంగా ఇమిడి వున్న అర్థాన్ని, అవగాహన చేసుకుంటూ, అధ్యయనం చేసుకుంటూ, క్లుప్తంగా క్రోడీకరిస్తేనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపధ్యంలో ఎవరి పాత్ర ఏమిటో బోధపడుతుంది. ఆ వర్తమాన సంక్షిప్త చరిత్ర సమాహారమే ఈ వ్యాసం.   

         తెలంగాణ రాష్ట్ర సాధన ఒకరోజుతో వచ్చింది కాని, రాత్రికిరాత్రే జరిగింది కాని, లేదా, ఎవరో దయతో ఇచ్చిన బహుమతి కాని కానేకాదు. 58 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అనేకమంది తెలంగాణ వాదులు పాల్గొనడం వల్ల మాత్రమే అది సాధ్యమయింది. ఈ సుదీర్ఘ పోరాటానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించుకుంటే నిర్ద్వందంగా వచ్చే సమాదానం, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహించిన ప్రధమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. ఇది తెలియని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదేపదే తమ పార్టీ చలువ వల్ల రాష్ట్రం వచ్చిందని అంటుంటారు. ఉన్న (నాటి) తెలంగాణను ఊడగొట్టింది, ఆంధ్రలో కలిపింది నెహ్రూనే. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని ఆనాడు కొండా వెంకట రంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు లాంటివారు వ్యతిరేకించారు. తెలంగాణను ముంచిందే కాంగ్రెస్ పార్టీ.

         67 సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కాకపోవడంతో ఎన్నో రకాలుగా ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడి పోయింది ఈ ప్రాంతం. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ తీసుకున్న నిర్ణయాన్ని మేథావులు, తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, ఇతరులు తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన బూర్గుల రామకృష్ణారావు ధిల్లీ విమానంలో పోయేముందర, తెలంగాణ తప్ప మరేదీ అంగీకారం కాదన్నారు. తిరిగి వచ్చిన తరువాత విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ, ‘నెహ్రూ సాబ్’ చెప్పిన తరువాత తానేమీ మాట్లాడలేకపోయాననీ, ‘మజ్బూర్లో’ ఒప్పుకున్నానని అన్నాడు. ఇదంతా చరిత్ర. తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీనే అని చెప్పే చరిత్ర.

         ఇక ఆ తరువాత ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’ లాంటి అనేక ఒప్పందాలు. అన్నీ కాలరాసినవే. ఒక్కొక్క హామీ నెరవేర్చకుండా ఉల్లంఘించుకుంటూ పోతుంటే కిమ్మనకుండా ‘ప్రేక్షక పాత్ర’ వహించింది కూడా తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులే. 1956 లో విలీనాన్ని వ్యతిరేకించిన అనేకమందిని జైళ్లలో పెట్టారు. హైదరాబాద్ సిటీకాలేజీ దగ్గర పోలీసు కాల్పుల్లో ఏడుగురు విద్యార్థులు పట్టపగలే మరణించారు. ఇవేవీ ఖాతర్ చేయకుండా విలీనం జరిగిపోయింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో, విద్యార్థుల నాయకత్వంలో, ఉద్యోగుల నాయకత్వంలో, ఉవ్వెత్తున ఎగిసిపడిన 1969 నాటి మహోద్యమం కర్కశంగా అణచివేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. నాడు, తెలంగాణలోని కళాశాలలు, హాస్టళ్లు, అన్నీ జైళ్లుగా మారిపోయాయి. ఆ ఉద్యమం సందర్భంగా ఎంతమంది అమాయకులను కాల్చి చంపారో, ఎంతమందిని రాచిరంపాన పెట్టారో, ఎన్ని బాధలు పెట్టారో, తెలంగాణ ఎంత యాతన అనుభవించిందో, ఎన్ని వేలమంది విద్యార్థులను, యువకులను కోల్పోయిందో? ఆ ‘ఘన చరిత్ర’ ఆసాంతం కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకే పోతుంది.

         1971 లోక్ సభ ఎన్నికలలో ‘ప్రజాస్వామ్య తెలంగాణ ప్రాంత ఓటర్లు’ 14 మందికి 11 మందిని గెలిపించి, తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. యావత్తు తెలంగాణ గుండెను చీల్చి, ‘మా తెలంగాణ మాకు కావాలని’ నినదిస్తే, నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధి, నిర్ద్వందంగా నిరాకరించి, ‘తెలంగాణ లేదు’ అన్నారు. ముల్కి నిబంధనలు కొల్లగొట్టబడ్డాయి, ఉద్యోగాలు మొత్తం మాయం అయ్యాయి, నీటిపారుదల ప్రాజెక్టులను దశాబ్దాల తరబడి పెండింగ్ లో పెట్టారు. తెలంగాణ నిధులను దారి మళ్లించారు. అప్పుడు కూడా మూగ, మౌన ప్రేక్షక పాత్ర వహించింది భారత జాతీయ కాంగెస్ పార్టీ తెలంగాణ నాయకులే తప్ప మరెవరో కాదు. 41 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల మనసులను తీవ్రంగా గాయపరచిన వ్యవహారాన్ని పునశ్చరణ చేసుకుని, యావత్ తెలంగాణ సమాజానికి జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఎంతైనా వున్నది.

         తెలుగుదేశం పార్టీ వారు 17 సంవత్సరాలు చేసిన నిర్వాకంలో పరిస్థితులు ఘోరంగా దిగజారిపోయాయి. ఒకానొక సందర్భంలో, ‘తెలంగాణ’ అనే పదం కూడా సభలో అనడానికి వీలు లేదని నాటి సభాపతి రూలింగ్ ఇచ్చే  స్థాయికి దిగజారితే, ప్రతిపక్షంలో వుండి కూడా నోర్లు పెగలకుండా మౌనంగా, ప్రేక్షక పాత్ర వహించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇది జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిన జగమెరిగిన సత్యం. ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబునాయుడు సంస్కరణల ముసుగులో విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచి, ఆ విధమైన పెరుగుదల 15% చొప్పున మూడేళ్లు వుంటుందని చెప్పితే, ఉపసభాపతిగా వున్న కేసీఆర్ రాసిన నిరసన లేఖ బహిరంగంగా అన్ని పత్రికలలో ప్రచురించారు. చివరకు కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో ఆగస్ట్ 2000 లో హైదరాబాద్ బషీర్ బాగ్ లో నిరసన చేస్తున్న రైతుల మీద పోలీసు కాల్పులు జరిపి ముగ్గురిని దారుణంగా చంపారు. ఆ సంఘటన తరువాత, ప్రజలకు నిరసన తెలియచేసే హక్కు కూడా లేకుండా పోయిందని, కేసీఆర్ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు.

         ఇక సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు న్యాయం జరగదని భావించిన కేసీఆర్, ఐదారు నెలలు కొందరు సన్నిహిత మిత్రులను కలిసి, వారి అభిప్రాయం తెలుసుకుని, సుదీర్ఘంగా చర్చలు జరిపి, మేధోమధనం చేసి, తెలంగాణ ప్రజల్లో ఉద్యమం పట్ల విశ్వాసం కలిగించే విధాన రూపకల్పన చేసి, ఉద్యమ పంథా పూర్తి స్థాయిలో నిర్ణయించుకుని, చివరకు ఏప్రిల్ 27, 2001 న, కొండా లక్ష్మణ్ బాపూజీ ‘ఆశ్రయం’ కలిగించిన ఇంటి ప్రాంగణంలో జండా ఎగురవేసి, అక్కడినుండి ‘జై తెలంగాణ’ ప్రస్తానం ప్రారంభించడం జరిగిన చరిత్ర. తెలంగాణ సాధన కోసం రాజీలేని పోరాటం చేస్తుంటే, అనేక రకాల ప్రలోభాలు పెట్టడం, తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు బీఆర్ఎస్) పార్టీని చీల్చే ప్రయత్నాలు చేయడం, అనేక రకాల హింసకు గురి చేయడం, ఉద్యమాన్ని అవహేళన చేయడం జరిగినప్పటికీ, వెనుదీయకుండా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే అని ఉద్యమం కొనసాగిస్తే, ఆ ఒత్తిడికి తట్టుకోలేక రాష్ట్రం ఏర్పాటు చేయడం కూడా చరిత్రే. అయితే ఆ క్రమంలో చోటు చేసుకున్న కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

         నాటి టీఆర్ఎస్ (ఇప్పటి బీఆర్ఎస్) 2004 సంవత్సరానికల్లా అద్భుతంగా పురోగమిస్తున్న సమయానికల్లా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా వుండి పదేళ్లు అవుతున్నది. వారిలో నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి. ఉద్యమాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకుపోవాలని నిర్ణయించి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు సమ్మతిస్తుందని తప్పుగా భావించి, టీఆర్ఎస్ 2004 ఎన్నికలలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంది. అలాగే ‘కనీస ఉమ్మడి కార్యక్రమం’ లో, తదనంతరం రాష్ట్రపతి ప్రసంగంలో కూడా రాష్ట్ర ఏర్పాటు అంశం చేర్చడం జరిగింది. జరిగింది శూన్యం. మళ్లీ పాత కథే మొదలైంది.

కాంగ్రెస్ పార్టీ నాయకుల అవహేళనలు చరిత్ర వున్నన్ని రోజులు వుండిపోతాయి. ‘రెండో రాష్ట్రాల పునర్విభజన కమిటీ’ వేయాలని ఆంధ్రా కాంగ్రెస్ పెద్దలు మాట్లాడుతుంటే తెలంగాణ కాంగ్రెస్ వారు దానికి తబలా కొట్టారు. తెలంగాణకు పోవాలంటే ‘వీసా’ తీసుకోవాలి అని ‘నర్మగర్భంగా’ నంద్యాలలో మాట్లాడిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ‘తెలంగాణ ఏర్పాటు ప్రశ్నే లేదు’ అని చెప్పినప్పుడు ఘనత వహించిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మౌనం దాల్చడం వాస్తవం. కేంద్రమంత్రి రేణుకా చౌదరి, తెలంగాణ ఇవ్వడమంటే ‘ఇన్స్టంట్ కాఫీ’ లేదా ‘దోశ’ చేసినంత సులభం కాదని అవమానంగా మాట్లాడినప్పుడు, తాను తెలంగాణ ఏర్పాటుకు ‘అడ్డం కాదు, నిలువు కాదు’ అని వైఎస్ఆర్ ముసిముసి నవ్వులు నవ్వినప్పుడు కూడా తెలంగాణ కాంగ్రెస్ నాయకులది మౌన ప్రేక్షక పాత్రే!!

ఇక ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ విషయంలో చేసిన అవమానాలు అన్నీ, ఇన్నీ కావు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైతే అంధకారమవుతుందని జోస్యం చెప్పినప్పుడు, తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని, ఎవరేం చేసుకుంటారో చేసుకోమని శాసనసభలో మాట్లాడినప్పుడు, సభలో వున్న ఒక్క తెలంగాణ ఎమ్మెల్యే కాని, మంత్రి కాని, అలా ఎందుకు అంటారని ప్రశ్నించే సాహసం చేయలేదు. బెల్లం కొట్టిన రాళ్లలాగా కూర్చున్నారు. అంతకు ముందు ‘ఒక్క వోటు రెండు రాష్ట్రాలు’ అని తీర్మానం చేసిన బీజేపీ, దాని సారధ్యంలోని ఎన్డీయే, వాజపేయి ప్రధానమంత్రి అయిన తరువాత, హైదరాబాద్ వచ్చిన నాటి హోం మినిస్టర్ అద్వానీ ‘హైదరాబాద్ తెలంగాణలో వుండగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎందుకు’ అని ఉపన్యాసం ఇచ్చి వెళ్లారు. ఆ మాటలు తెలంగాణను కించపరిచాయి. అలా, అలా తెలంగాణ సర్వస్వం కోల్పోతూనే వచ్చింది.

తెలంగాణలో ఆకలిచావులు, ఆత్మహత్యలు, విద్యుత్ కోతలు, నగరాలకు వలసలు, ఇలా ఎన్నో రకాల దయనీయ పరిస్థితి కొనసాగుతుంటే, వీటన్నిటికీ వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతుంటే, రోశయ్య ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, పుండు మీద కారం చల్లినట్లు 14 (F) తీసుకొచ్చారు. తక్షణమే కేసీఆర్ సిద్దిపేటలో 3-4 లక్షల మందితో ఉద్యోగ గర్జన సభ నిర్వహించి, అక్కడినుండే కార్యాచరణ ప్రకటించారాయన. మామూలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేటట్లు కనిపించడం లేదని, మంచో, చెడో తేల్చుకోవాలని, కేసీఆర్ శవయాత్రో, లేదా, తెలంగాణ జైత్రయాత్రనో ఏదో ఒకటి జరగాలని నిర్ణయించి, కేసీఆర్ నిరాహార దీక్షకు దిగారు. దీక్షకు ఉపక్రమించిన కేసీఆర్ ను అరెస్ట్ చేసి, ఖమ్మం జైల్లో నిర్బంధించి, తరువాత హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు.

కేసీఆర్ దీక్షలో వుండి చనిపోతే అప్రతిష్ట పాలవుతామని, అట్టుడికిన లోక్ సభ, 38 పార్టీలు గోల చేస్తే, ఆ దాడికి తట్టుకోలేక, చిదంబరంతో ప్రకటన చేయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలు పెట్తున్నామని ప్రకటన చేయడం, ఆంధ్రా లాబీలు ఒత్తిడి తేగానే వెనక్కు తగ్గడం జరిగింది. దరిమిలా, వందల మంది విద్యార్థులు ఆవేశపడి చనిపోయారు. ఆ బాధలో ఉద్యమం ముందుకు సాగింది. విమాన ప్రమాదంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించడం, ఆయన కుమారుడు జగనమోహన్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం పక్కన పెట్టడం, ఆయన సొంత పార్టీ పెట్టుకుని ఉపఎన్నికలలో విజయాలు సాధించడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. ఆంధ్రా ప్రాంతంలో 2014 ఎన్నికలలో ఒక్క స్థానం కూడా గెలిచే అవకాశాలు లేవని భావించి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరిస్తే, ఇక్కడన్నా కనీసం 10 లోక్ సభ స్థానాలు రాకపోతాయా అనే నిర్ణయానికి కాంగ్రెస్ అధిష్టానం వచ్చింది. అలా ఆ ఒత్తిడి వల్ల రాష్ట్రం ఇచ్చారు తప్ప, తెలంగాణ మీద ప్రేమతో ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అలాగే ఎవరి దయా దాక్షిణ్యాల వల్ల రాలేదు. పోరాట, ఉద్యమ ఫలితంగా వచ్చిందే తెలంగాణ రాష్ట్రం. ఇది చరిత్ర. ఇది వాస్తవం.

ఆ విధంగా జూన్ 2, 2014 న ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం కనీవినీ ఎరుగని అభివృద్ధిని అచిరకాలంలోనే సాధించింది. ‘తెలంగాణ నమూనా’ దేశానికే ఆదర్శమైపోయింది. ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్రాల, దేశాల అభివృద్ధిని అంచనావేసే గీటురాళ్లు వుంటాయి. వాటి ప్రకారం, తెలంగాణ తలసరి ఆదాయం రు 3,12,000 వుంటే, ఒకేసారి మనతో పాటే ఏర్పాటైన పొరుగు రాష్ట్రానిది రు 2,19,000 మాత్రమే. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్నాటక లాంటి తెలంగాణకన్నా పెద్ద రాష్ట్రాలను తలదన్ని వాటి తలసరి ఆదాయంకంటే ఎక్కువ మొత్తంలో వున్న రాష్ట్రం తెలంగాణ. అలాగే రాష్ట్ర స్థూల ఉత్పత్తి రాష్ట్ర ఆవిర్భావం నాడున్న రు 5 లక్షల నుండి రు 13 లక్షలకు పెరిగింది. తలసరి విద్యుత్ వినియోగం 2126 యూనిట్లు, స్థాపిత విద్యుత్ సామర్ధ్యం 18453 మేగావాట్స్, పీక్ డిమాండ్ 15497 మేగావాట్స్ వున్నాయి. అలాగే వైద్య, విద్యా రంగాల అభివృద్ధిలో, రక్షిత నీటి సరఫరా విషయంలో, మాతా శిశు మరణాల రేటు తగ్గడంలో అనేక ఆవిష్కరణలు, అన్ని రంగాల సామూహిక, సమ్మిళిత అభివృద్ధి జరిగింది. ఉద్యమ నాయకుడే రాష్ట్ర రధ సారధి కావడం కూడా దీనికి కారణం.  

కేవలం తొమ్మిదిన్నర సంవత్సరాలలోనే ఇంత అభివృద్ధి జరిగినప్పుడు 67 ఏళ్ల క్రితమే తెలంగాణ ఏర్పాటు జరిగి వుంటే ఇంకెంత అభివృద్ధి జరిగి ఉండేదో? అలా జరగకుండా అడ్డుపడ్డది కాంగ్రెస్ పార్టీనే. విమర్శలు చేసేవారు ఇది గమనిస్తే మంచిదేమో! అలాగే జరిగిన అభివృద్ధిని గుర్తిస్తే మంచిదేమో!!

Sunday, October 8, 2023

యాదవకుల నాశనం, బలరామ శ్రీకృష్ణుల నిర్యాణం అవతార పరిసమాప్తి ..... ఆస్వాదన-141 : వనం జ్వాలా నరసింహారావు

 యాదవకుల నాశనం, బలరామ శ్రీకృష్ణుల నిర్యాణం

అవతార పరిసమాప్తి

ఆస్వాదన-141

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (09-10-2023)

ధర్మరాజుకు పట్టాభిషేకం జరిగిన 35 సంవత్సరాల తరువాత 36 వ సంవత్సరంలో భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. అన్ని దిక్కులలోను ఉల్కలు రాలాయి. మండు వేసవిలో దట్టమైన పొగమంచు ఆకాశమంతా విస్తరించింది. ప్రతిరోజూ ఏదో ఒక వైపరీత్యం జరుగుతుంటే, కొంతకాలం గడిచాక ఒకనాడు ధర్మరాజు, శ్రీకృష్ణ బలరాములు తప్ప మిగతా యాదవులంతా ఒకరితో ఒకరు పోట్లాడి చనిపోయారన్న విషాద వార్త విన్నాడు. తన తమ్ములను పిలిచి ఈ వార్త తెలియచేశాడు. హస్తినాపురమంతా ఆ వార్త విని శోక సముద్రంలో మునిగిపోయింది.

దీనికో నేపధ్యం వున్నది. చాలా కాలం క్రితం కణ్వుడు, నారదుడు, విశ్వామిత్రుడు తమ శిష్యులతో కలిసి శ్రీకృష్ణుడిని చూడాలన్న కోరికతో ద్వారకకు వచ్చారు. యాదవుల మరణానికి కారణమైన ఈ ఋషుల రాక కూడా శ్రీకృష్ణుడి సంకల్పమే. ద్వారక వీధుల్లో ఆ ఋషులు వెళ్తున్న సమయంలో వృష్టి వంశానికి చెందిన కొందరు యాదవులు సాంబుడనే వాడికి ఆడదాని వేషం వేసి, ఋషుల దగ్గరికి పోయి ఆమెకు సంతానం కలుగుతుందా, లేదా, అని అడిగారు. ఋషులకు అది కపట వేషమని తెలిసి కోపం వచ్చింది. ‘శ్రీకృష్ణుడి కుమారుడైన ఈ సాంబుడు యాదవకుల నాశన కారణమైన ఒక రోకలిని కంటాడని’ అన్నారు. బలరామకృష్ణులు తప్ప తక్కిన యాదవులంతా ఆ రోకలికున్న విచిత్ర శక్తి వల్ల నశిస్తారని, బలరాముడు యోగనిష్ఠతో తన శరీరం వదిలి సముద్రంలోకి ప్రవేశిస్తాడని, కృష్ణుడు నీలమీద పడుకొని వుండగా ‘జర’ అనే రాక్షసి ఆయన్ను చంపుతుందని యాదవులకు చెప్పి ఆ ఋషులు కృష్ణుడిని కలవకుండానే వెల్లిపోయారు. వెంటనే ఈ వార్త కృష్ణుడికి తెలిసింది. భూతభవిష్యద్వర్తమానాలు  తెలిసిన కృష్ణుడికి కాలవిధిని మరల్చడం సాధ్యపడదని మనసులో అనుకున్నాడు.

ఆ మర్నాడే సాంబుడి కడుపులో నుండి భయంకరమైన, కఠినమైన ఒక రోకలి వెలువడింది. బంధువులు ఆ విషయాన్ని వసుదేవుడికి చెప్పగా, ఆయన ఆ రోకలిని పొడిగా చేసి సముద్రంలో కలపమని ఆజ్ఞాపించాడు. వారలాగే చేశారు. కొందరు యాదవులకు ఆ సమయంలో గాంధారి శ్రీకృష్ణుడిని శపించిన విషయం, దాని మూలాన యాదవ సంతానం కూడా కౌరవుల లాగానే నశించబోవడం గుర్తుకొచ్చింది. ఆ విధంగా యాదవుల వినాశనకాలం ఎప్పుడైతే సమీపించిందో అప్పుడే ద్వారకానగరంలో చెప్పరాని ఉపద్రవాలు సంభవించడం మొదలైంది. మహోత్పాతాలు అనేకం ఆ నగరంలో పుట్టాయి. యముడు దండాన్ని ధరించి సంచరించ సాగాడు.

ప్రతిరోజూ ద్వారకలో ఏదో ఒక అశుభసూచకమైన సంఘటన జరుగుతుంటే, దానిని గమనించిన కృష్ణుడు గాంధారి ఇచ్చిన శాపాన్ని స్మరించాడు. ఆమె అన్న 36వ సంవత్సరం రానే వచ్చింది అనుకున్నాడు. ఇక యాదవ నాశనం తప్పదని, అలా జరగడానికి ఒక పుణ్యక్షేత్ర సమీప భూమైతే మంచిదన్న నిశ్చయానికి వచ్చాడు. శ్రీకృష్ణుడు తన దివ్యదృష్టితో యాదవుల క్షయాన్ని గుర్తించాడు. ద్వారకావాసులంతా జాతర చేయాల్సి వున్నదని రాజసభలో ప్రకటించాడు. నగరంలో కూడా చాటింపు చేయించాడు. ఆ మర్నాడు శ్రీకృష్ణుడి చక్రం, గరుడధ్వజం ఉన్నట్లుండి ఆకాశంలోకి ఎగిరిపోయాయి. వాటి వెంటనే బలరాముడి తాటి జెండా కూడా స్వర్గాన్ని చేరుకున్నది. ఆ సమయంలో నాలుగు గుర్రాల శ్రీకృష్ణుడి రథం ఆకాశమార్గంలో స్వర్గానికి చేరిపోయింది. అప్పుడు ఆకాశంలో నిలబడి దేవతలు సముద్ర యాత్రకు బయల్దేరమని యాదవులను ప్రబోధించారు. ఎన్ని ఉత్పాతాలు సంభవించినా యాదవులలో ఏ కదలికా లేదు. ఏ తొందరపాటూ లేదు. ప్రతి ఇంట్లోను మద్యం, మాసం లాంటివి సమకూర్చుకునే ప్రయత్నంలో పడ్డారు.

యాదవులతో కూడి శ్రీకృష్ణుడు వేరే రథంలో సముద్ర తీరానికి బయల్దేరాడు. బలరాముడు కూడా అలాగే పాదచారిగానే బయల్దేరాడు. యాదవ స్త్రీలు పల్లకీలలో బయల్దేరారు. అంతా సముద్ర తీరం చేరారు. శ్రీకృష్ణుడి మంత్రి, పురోహితుడు ఉద్దవుడు తపస్సు చేసికోవడానికి అడవికి వెళ్లాడు. బలరాముడు కూడా వెళ్తానంటే సరేనన్నాడు శ్రీకృష్ణుడు. తపస్సుకి బయల్దేరిన ఉద్దవుడిని దిగబెట్టి వచ్చిన బలరాముడు ఒంటరిగా ఒక చెట్టు కింద కూచున్నాడు. ఆయనలోని మోహం నశించి జ్ఞానజ్యోతి ప్రకాశించింది. వండిన భోజనాలను యాదవులు కోతులకు పంచిపెట్టారు. నృత్యాలు చేశారు ఆ తరువాత. సముద్రానికి పూజలు చేశారు. మత్తుపానీయాలను శ్రీకృష్ణుడు చూస్తుండగానే బాగా తాగారు. యాదవులు ఒకరినొకరు తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, చంపుకున్నారు. బాగా తాగినవారిలో సాత్యకి, కృతవర్మ, చారుధేష్ణుడు, గదుడు, ప్రద్యుమ్నుడు మొదలైన వారున్నారు.

సాత్యకి మద్యం మత్తులో కృతవర్మను అవమానంగా మాట్లాడాడు. కృతవర్మ కూడా ఎదురు మాట్లాడి సాత్యకిని అవమానించాడు. ఇద్దరి మధ్యా మాటల యుద్ధం పెరిగింది. ఋషుల శాప ప్రభావం వల్ల సాత్యకి కోపం అతిశయించి, కృతవర్మ గొంతును నరికేశాడు. అప్పుడు భోజాంధకులు ఒక్కటిగా కలిసి సాత్యకిని చుట్టుముట్టారు. అప్పుడు వృష్టి వంశీయులైన వీరులు భోజాంధకులతో యుద్ధానికి దిగారు. ఒకరినొకరు ముట్టడించి యుద్ధం చేశారు. ఇరువర్గాలవారికి ఆ సమయంలో అక్కడికక్కడే మూడు అంచులున్న తుంగ పరకలు యుద్ధానికి ఆయుధాలలాగా లభించాయి. ఋషుల శాప ప్రభావం వల్ల తుంగలన్నీ రోకళ్లుగా స్ఫురించాయి. యదువీరుల మధ్య యుద్ధం చాలా అతిశయమైన రీతిలో జరిగింది. ఉన్నవారు వున్నచోటునే విజృంభించి యుద్ధం చేశారు. ఆ సమయంలో వృష్టి వంశమంతా నశించింది. యుద్ధభూమిలో చచ్చిపడివున్న అనిరుద్ధుడిని, ప్రద్యుమ్నుడిని, సాంబుడిని, సాత్యకిని, గదుడిని చూసిన శ్రీకృష్ణుడికి కోపం కలిగింది. యుద్ధంలో చావకుండా మిగిలిన శత్రువీరుల మీద పడి తుంగపరకలతో చంపాడు. ఈ విధంగా యాదవులంతా రోకటి విజృంభణ వల్ల చనిపోయారు.

చావకుండా మిగిలి వున్న దారుకుడు, బభ్రుడు, కృష్ణుడి దగ్గరికి వెళ్లి, యాదవ సమూహమంతా చచ్చిందని చెప్పారు. వారు ఇచ్చిన సూచన ప్రకారం శ్రీకృష్ణుడు బలరాముడు వెళ్లిన దారిలోనే పోయి ఒక చెట్టుకింద ఆయన్ను చూశాడు. ఆ క్షణంలోనే, దారుకుడిని పిలిచి, అతడిని తక్షణం పాండుకుమారుల దగ్గరికి వెళ్లమని, యాదవ వర్గమంతా నశించిన సంగతి చెప్పమని, అర్జునుడిని తన మాటగా ద్వారకానగర సమీపానికి తీసుకురమ్మని అన్నాడు కృష్ణుడు. దారుకుడు వెంటనే వేగంగా వెళ్లిపోయాడు అదేపని మీద. స్త్రీలను, ఏనుగులను, గుర్రాలను ద్వారకలో చేర్చి రమ్మని బభ్రుడికి చెప్పగా అతడు బయల్దేరిన వెంటనే ఒక బోయవాడు ఒక తుంగపరకను వాడిమీద వేయగా అతడు నేలకొరిగాడు. బభ్రుడికి చెప్పిన పని తానే చేయడానికి బయల్దేరుతూ కృష్ణుడు, తాను పోయి వచ్చేంత దాకా బలరాముడిని ఆ చెట్టు కిందనే వుండమని అన్నాడు. ద్వారకకు వెళ్లిన శ్రీకృష్ణుడు అన్ని సంగతులూ వసుదేవుడికి వివరించి, తనకు ఇక జీవితం గడపడానికి మనస్సు రావడం లేదని, బలరాముడితో కలిసి తపస్సు చేస్తానని, ఇక అన్ని విషయాలు ఆయనే చూసుకోవాలని చెప్పాడు.

వసుదేవుడు ఆ మాటలు విని నిశ్చేష్టుడయ్యాడు. యాదవ స్త్రీలు హాహాకారాలు చేశారు. కృష్ణుడు అందర్నీ ఓదార్చి, త్వరలో అర్జునుడు వచ్చి వారి దుఃఖాలను పోగొట్టుతాడని చెప్పాడు. ఆ తరువాత తండ్రికి వీడ్కోలు చెప్పి అన్న బలరాముడి దగ్గరికి పోయి తండ్రిగారి అనుమతితో వచ్చానని అన్నాడు. ఆ తరువాత బలరాముడి ముఖం నుండి ఒక వేయినోళ్ల మహాసర్పం ఎర్రటి కాంతితో బయటపడడాన్ని కృష్ణుడు గమనించాడు. ఆ విధంగా బలరాముడు తన యోగబలం వల్ల తన దేహాన్ని వదలిపెట్టి, ఆకాశమార్గంలో సముద్రంలోకి ప్రవేశించాడు. ఆదిశేషస్వరూపుడైన ఆ బలరాముడికి వరుణుడు స్వాగతం పలికాడు. నాగులు పూజలు చేశారు. గంగానదిలాంటి పెద్దనదులన్నీ వచ్చి పూజించాయి బలరాముడిని. కృష్ణుడు తన మూర్తి భేదాన్నైన బలరాముడిని తన మహారూపంలో కలుపుకొన్నాడు.

బలరాముడు అవతారం చాలించి వెళ్లిపోయిన తరువాత శ్రీకృష్ణుడు ఆ ప్రదేశం వదిలి అక్కడక్కడా తిరిగాడు. మనసులో ఏం చేయాలా అని ఆలోచించాడు. తాను దేహాన్ని వదిలిపెట్టడానికి ఒక హేతువును ఆలోచించుకొన్నాడు. మునులు ఇచ్చిన శాపవాక్యం గుర్తుకొచ్చింది. తన అరికాలిలోనే తనకు ప్రాణాపాయం జరుగుతుందన్న దుర్వాసుడి మాటలు కూడా జ్ఞప్తికి వచ్చాయి. ప్రాణత్యాగం ఎలా చేయవచ్చో స్ఫురించింది. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలను అణచిపెట్టి, గాఢమైన సమాధిని పొంది, విష్ణువు అంశ అయిన కృష్ణుడు నేలమీద పడుకొన్నాడు. ఆ సమయంలో ‘జర’ అనే రాక్షసి నేలను కాలితో రాస్తూ నెమ్మదిగా ఆ అడవిలో ప్రవేశించింది. అక్కడ తిరుగుతున్న ఒక వేటగాడికి, కృష్ణుడు జింక అన్న భ్రాంతిని ఆవహింపచేసింది.

భ్రాంతికి లోనైన వేటగాడు బాణాన్ని వదిలాడు. ఆ బాణం కృష్ణుడి పాదం అడుగు భాగంలో దూరి పాదం పైభాగంలో బయటికి పొడుచుకొని వచ్చింది. వెంటనే వేటగాడు జింకను (అని భ్రమించిన) తీసుకెళ్లడానికి సమీపంలోకి వచ్చాడు. కృష్ణుడిని చూసి, ఎవరో మహానుభావుడని గుర్తించి, అతడి పాదాల వద్ద శిరస్సు వుంచి కిందపడ్డాడు. వాడిని ఓదార్చిన కృష్ణుడు, ఆ తరువాత, మానవీయమైన దేహాన్ని విడిచి, తన స్థానాన్ని పొందడానికి వెళ్లిపోయాడు. స్వర్గలోకానికి వెళ్ళిన శ్రీకృష్ణుడికి మునులు, సిద్ధులు, రుద్రులు, వసువులు, మరుత్తులు, దేవతలు, దేవేంద్రుడు మొదలైన వారు ఎదురొచ్చి కాళ్లకు మొక్కారు. శ్రీకృష్ణుడిని దేవేంద్రుడు పరిపరి విధాల స్తోత్రం చేశాడు. కృష్ణుడి మీద ఇంద్రుడు సాటిలేని భక్తితో పూలవాన కురిపించాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు వచ్చి వేదమంత్రాలతో శ్రీమహావిష్ణువును ప్రస్తుతించాడు. నారాయణుడు దేవతలందరితో ఆదరపూర్వకంగా సంభాషించాడు. ఆనంద రూపమైన జ్ఞానంతో పరిశుద్ధమైనదీ, కొలవడానికి వీలు లేనట్టిదీ, అయిన తన స్థానప్రాప్తిని తానే కల్గించుకొన్నానని అన్నాడు. ఇలా అంటూ తన స్థానంలో కూచున్నాడు శ్రీమన్నారాయణుడు.             

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, మౌసలపర్వం, ఏకాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

Congress was compelled to concede Telangana Statehood demand : Vanam Jwala Narasimha Rao

 Congress was compelled to concede

Telangana Statehood demand

Vanam Jwala Narasimha Rao

The Hans India (08-10-2023)

(KCR during the fast was arrested and was put in Khammam Jail before he was brought to NIMS Hospital. Fearing that KCR might die and if and when it happens, it would be a ‘Death Knell’ to INC, its leadership and also whole of Lok Sabha turned perturbed and chaotic. Yielding to the pressure from 38 parties favoring Telangana, Chidambaram made a statement that, the ‘Process of Formation of Telangana had begun.’ But INC had gone back on its statement under pressure. YSR passed away in air crash and his son was wrongly handled by INC High Command. Frightened of diminishing electoral prospects in Andhra Region, INC decided to concede Telangana, left with no alternative, and desperately predicting to win at least 10 seats in Telangana. And therefore, decision of formation of Telangana was born out of severe compulsion on INC. Nothing like a policy, principle, commitment, love, and affection on Telangana. This is History!!!-Synopsis of Editor)

Telangana Chief Minister K Chandrashekhar Rao’s precious, informative, and evidence-based speeches, as and when he delivers, be it any platform, there is volumes and volumes to absorb and assimilate. The way KCR articulates his delivery with Precision, Intensive Memory Power, Multitasking, Switch Tasking, Impromptu Data Retrieval, Faultless Reasoning, Creativity, Multiple Approaches of Intelligence with Subtle Humor, and extensively quoting from Telugu, Urdu and English Literature is an Exceptional Phenomenon, God Given Gift, and years of Hard Work!!!

One such ‘Treatise like Address’ was KCR’s exhaustive and authentic recounting of ‘Saga of Telangana State Formation’ on August 6, 2023, while replying to a short discussion in Assembly, for 2 hours and 45 minutes. Abundant information on the subject is interpolated ‘between the lines,’ if one studies keenly without prejudice. It was contemporary history as briefly detailed here.

Formation of Telangana State did not happen overnight or gifted by someone. It was result of 58 years of incessant struggle participated by many. Indifference of ‘Indian National Congress Party (INC)’ which Telangana Congress Leaders (Wrongly) quote time and again, as the one that awarded Telangana, and first Prime Minister Jawaharlal Nehru, was the reason for abandoning Telangana and merging with Andhra. Beyond doubt, INC was solely and singly responsible for ditching Telangana, necessitating years of struggle for separate state.  

It is contextual to recall and place on record, individuals, and political parties responsible for stalling prospectus of Telangana to become a state 68 years ago itself and the resultant regression in united Andhra Pradesh (AP). When Jawaharlal Nehru of INC took the decision of formation of AP by merging Telangana, General Public, intellectuals, students among others, vehemently opposed it. Burgula Ramakrishna Rao of INC who said that he would not agree for merger of Telangana ‘come what may,’ later, after meeting Nehru, confessed that, he had no option except to yield to ‘Nehru Saab.’ This again is part of Telangana History.

Namesake agreements, like ‘Gentlemen Agreement’ to appease Telangana People with false assurances were brought. Role of Telangana INC Leaders was that of a ‘Glorified Spectator,’ when they were breached. People’s protests against decision of Nehru in 1956 resulted in sending them to jails. In the firing incident at Hyderabad City College, seven students were killed. 1969 agitation lead by Dr Marri Channa Reddy, was ruthlessly crushed after several innocent students and others lost their lives. All this was History and to the discredit of INC!!!

In the 1971 Lok Sabha Elections 11 out of 14 MP seats, were in favor of formation of Telangana, but Indira Gandhi of INC said ‘No.’  Mulki Rules were grossly violated. Irrigation Projects were left to their fate and were kept in pending for ever and ever. Funds were diverted. Despite all this, INC Telangana Leadership was silent. INC that was in power for 41 years, brutally and indiscriminately wounded sentiments of Telangana people.

Telugu Desam Party Government was in power for 17 years, but the state of affairs worsened and touched rock bottom. When the then Speaker gave a Ruling that, the word Telangana cannot be used in House, INC Telangana Members as usual were silent spectators. When CM Chandrababu Naidu enhanced ‘Power Tariff,’ farmers agitated. Finally in August 2000 farmers gave ‘March to Assembly’ call lead by Communist Parties. Government resorted to police firing at Bashir Bagh killing three innocent farmers. KCR, then Deputy Speaker of State Legislative Assembly addressed a letter to CM expressing his dissent. Later KCR resigned from TDP and Government.  

KCR at that stage decided that, until and unless Telangana state was formed, there would be no end to the miseries of farmers.  He made up his mind to launch movement by himself, being in the forefront. After continuous brainstorming with few likeminded for about five-six months, on April 27, 2001, The ‘Jai Telangana’ Long March was commenced from the ‘asylum’ like house of Konda Lakshman Bapuji. The movement continued until Telangana State was achieved.

When TRS (Now BRS) was strengthening in leaps and bounds, INC was out of power in AP for ten years. TRS erroneously believing that INC will support its demand for separate Telangana, had an electoral alliance with it in 2004 elections. Despite the demand included in the ‘Common Minimum Program’ and in President’s Address, nothing happened. When YS Rajashekhar Reddy made a ‘Cryptic Remark’ of VISA requirement to go to Telangana and indirectly ruled out formation of Telangana, INC Leaders of Telangana were silent. When Union Minister Renuka Choudary said formation of Telangana was not an Instant Coffee or Dosa and Rajashekhar Reddy made fun of Telangana saying that, he was neither ‘Vertical’ nor ‘Horizontal’ to its formation, Telangana Congress Leaders were silent spectators.  

Kiran Kumar Reddy, demonstrated his utter disregard and hatred to Telangana, including professing perennial darkness in the state if separated. When he displayed his unpleasant courage to declare that he shall not give even a single rupee to Telangana, ironically, none of the MLAs or Ministers from INC present in the House dared to protest. When CM Rosaiah brought 14 (F) adding salt to the wound, KCR instantaneously organized a huge gathering with lakhs of gathering in Siddipet to declare that, he would undertake fast unto death to achieve Telangana State.

KCR during the fast was arrested and was put in Khammam Jail before he was brought to NIMS Hospital. Fearing that KCR might die and if and when it happens, it would be a ‘Death Knell’ to INC, its leadership and also whole of Lok Sabha turned perturbed and chaotic. Yielding to the pressure from 38 parties favoring Telangana, Chidambaram made a statement that, the ‘Process of Formation of Telangana had begun.’ But INC had gone back on its statement under pressure.

YSR passed away in air crash and his son was wrongly handled by INC High Command. Frightened of diminishing electoral prospects in Andhra Region, INC decided to concede Telangana, left with no alternative, and desperately predicting to win at least 10 seats in Telangana. And therefore, decision of formation of Telangana was born out of severe compulsion on INC. Nothing like a policy, principle, commitment, love, and affection on Telangana. This is History!!!

Thus, Telangana as the newest state came into reality on June 2, 2014. Rest is Concurrent History of enormous progress and unprecedented development making Telangana Model as Role Model to the entire Nation. Like the ‘Poof of Pudding is in the Eating,’ globally acceptable parameters measure performance of a Nation or State. Growth in Per Capita Income, Per Capita Power, Per Capita Doctors, Per Capita Education, Adequate Medical and Health Facilities, Adequate Educational Facilities, Safe Drinking Water, Reduced Infant and Maternity Mortality Rates, Welfare Schemes, Irrigation Projects etc. demonstrated this.

Telangana, lowest in rank in these at the time of formation, is ‘Number One’ in Nine and Half Years. Per Capita Income is Rs 3,12,000, almost one lakh rupees more than neighboring residuary state, whose leaders heckled that Telangana was incapable of ruling by itself. Maharashtra, Gujarat, Tamil Nadu, Karnataka etc. which are larger in size than Telangana are all behind Telangana’s Per Capita Income. GSDP is increased from Rs 5 lakhs to over Rs 13 lakhs. Per Capita Power Consumption is 2126 units, installed power capacity is 18453 Megawatts and peak demand is15497 Megawatts.

Telangana’s Welfare and Development is Inclusive. When the state progressed and developed incredibly in such short span of time, then, had the state been formed five-six decades ago, and of course, if only Nehru and INC agreed, growth would have been multifold. INC and BJP leaders should refrain from making unpalatable remarks, wounding feelings and sentiments of people, struggled for, and achieved Telangana State.   

(The writer is Chief Public Relations Officer to the Chief Minister, Telangana)