Tuesday, August 28, 2012

"ఆన్గ్ కార్ వాట్"- ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయాల సముదాయం: వనం జ్వాలా నరసింహారావు




   "ఆన్గ్ కార్ వాట్"
ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయాల సముదాయం
వనం జ్వాలా నరసింహారావు

ఆసియా-పసిఫిక్ దేశాల గూగుల్ సంస్థల మానవ వనరుల విభాగం డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ, సింగపూర్‌లో వుంటున్న మా కుమారుడు ఆదిత్య, కోడలు పారుల్, రెండేళ్ల మనుమరాలు కనక్‍తో గడిపేందుకు శ్రీమతి విజయలక్ష్మితో సహా ఇక్కడికొచ్చాను. అక్కడినుంచి ఆగస్ట్ 24 న బయలుదేరి మూడురోజుల పాటు కాంబోడియా దేశంలోని సయాం రీప్‍కు వెళ్లొచ్చాం. కాంబోడియా దేశానికి వెళ్లే భారతీయులకు విమానాశ్రయంలో దిగిన తరువాత వీసా పొందే వీలుంటుంది. ఆ తతంగం కేవలం ఐదు నిమిషాల్లోనే ముగిసింది. కాకపోతే అక్కడ పనిచేస్తున్న ఒకరిద్దరు ఇమ్మిగ్రేషన్ అధికారులు మమ్మల్ని లంచం అడిగారు. అది వేరే విషయం. మేమివ్వకపోయినా బలవంతం చేయలేదు. ఆ తర్వాత మాకు తెలిసిన విషయం: ప్రపంచం మొత్తంలో అవినీతిలో కనీసం 170 దేశాలకంటే కాంబోడియా ముందుందని! అక్కడి పౌరులు మాత్రం అత్యంత మర్యాదస్తులు. "నమస్తే" అంటూ స్వాగతం పలకడం, వీడ్కోలు చెప్పడం తప్పనిసరిగా చేస్తారు. మేం ముందుగానే రిజర్వ్ చేయించుకున్న "బోరీ ఆన్గ్ కార్ రిసార్ట్" నుంచి మా కోసం వచ్చిన కారులో సాయంత్రం నాలుగు గంటలకు హోటెల్ కు చేరుకున్నాం. 


బోరీ ఆన్గ్ కార్ రిసార్ట్ ఒక ఫైవ్ స్టార్ హోటెల్. ఐదు లక్షల జనాభా కలిగిన సయాం రీప్ నగరం నడి బొడ్డులో వుంది. విమానాశ్రయానికి, "ఆన్గ్ కార్ వాట్" కు ఏడు కిలోమీటర్ల దూరంలో, నగరంలోని షాపులకు-నైట్ మార్కెట్‌కు ఐదు నిమిషాల లోపు చేరుకునే వెసలుబాటున్న ఈ హోటెల్, సయాం రీప్‍లోని మంచి హోటెళ్లలో ప్రధానమైంది. ఆ సాయంత్రం రెండు "టుక్-టుక్" లను తీసుకుని దగ్గరలో వున్న నైట్ మార్కెట్‌కు వెళ్లొచ్చాం. "టుక్-టుక్" చాలా గమ్మత్తుగా వుంటుంది. ఒక మోటార్ సైకిల్ కో, లేక, మోపెడ్ కో, ఆటో వెనుక భాగాన్ని తగిలించి ప్రయాణీకులను తిప్పుతారు. లోపల కూర్చనున్నవారికి వాన-ఎండ తగలకపోయినా నడిపే వారికి మాత్రం ఏ ఆసరా వుండదు. మేం నైట్ మార్కెట్‌కు వెళ్లడానికి 8000 కాంబోడియా రియల్స్ ఇచ్చాం! రాత్రి భోజనం చేసిన చోట 90, 000 ఇచ్చాం! ఆ తరువాత అర్థం ఐంది మాకు. కాంబోడియా కరెన్సీ విలువ చాలా తక్కువ అని. ఒక అమెరికన్ డాలర్‌కు 4000 రియల్స్ మారకం రేట్. ప్రస్తుతం చలామణిలో వున్న రియల్ ఏప్రిల్ 1, 1980 నుంచి అమల్లోకొచ్చింది. ఐతే ఇంతవరకూ రియల్‌కు ప్రజామోదం పూర్తిగా లభించలేదు. ఇప్పటికీ కాంబోడియన్లకు విదేశీ మారక ద్రవ్యం అంటేనే మోజు. దానికి కారణం లేకపోలేదు. 1993 లో ఐక్య రాజ్య సమితి శాంతి సేనలు కాంబోడియాలో వుంటున్నప్పుడు పెద్ద మొత్తంలో అమెరికన్ డాలర్‌లను వాడకంలోకి తెచ్చింది. దాని ఫలితంగా ఎక్కువమంది డాలర్లే ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ లావాదేవీలలో కూడా డాలర్‌లను వాడుతుంటారు. క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసినప్పుడు కూడా అమెరికన్ డాలర్‌లలోనే లెక్క కడతారు.


ఆ తరువాత రెండు రోజులు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన, అతి పెద్ద హిందూ దేవాలయాల సముదాయమైన, "ఆన్గ్ కార్ వాట్" ను చూద్దామనుకున్నాం. హోటెల్ హాస్పిటాలిటీ విభాగం దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసింది. 45 డాలర్లకు అక్కడికి వెళ్లి రావడానికి కారు, 35 డాలర్లకు గైడ్, నలుగురికి కలిపి 80 డాలర్ల ఎంట్రీ ఫీజు-మొత్తం ఒక్క రోజుకు 160 డాలర్ల ఖర్చుతో అన్నీ సమకూరాయి. మొదటి రోజు దినమంతా, రెండో రోజు ఉదయం పూట అక్కడ గడిపాం. అదో చెప్పరాని అనుభూతి. తెలియకుండానే నాలుగైదు కిలోమీటర్లు అలసట లేకుండా తిరిగాం.


కాంబోడియన్ల ఖ్మేర్ రాచరిక వ్యవస్థలో, దేశ అధికారిక దేవాలయంగా, అలనాటి రాజధాని నగరమైన యశోధరపురంలో, పన్నెండవ శతాబ్ది ఆరంభంలో, రెండవ సూర్యవర్మన్ రాజు "ఆన్గ్ కార్ వాట్" దేవాలయాన్ని నిర్మించాడు. పూర్వీకుల ఆచారమైన శైవిజాన్ని దూరం పెట్టి, ఆన్గ్ కార్ వాట్ దేవాలయాన్ని విష్ణు దేవుడికి అంకితమిచ్చాడు సూర్యవర్మన్. నాటినుంచి నేటిదాకా అత్యంత జాగ్రత్త కట్టడంగా కాపాడబడుతూ వస్తున్న కాంబోడియాలోని ఈ ఆన్గ్ కార్ వాట్ దేవాలయ సముదాయం, మొదలు హిందువుల ఆలయంగా, ఆ తరువాత బౌద్దుల ఆరామంగా వుంటూ వచ్చింది. సాంప్రదాయిక ఖ్మేర్ ఆర్కిటెక్చర్‍‍కు ముమ్మూర్తులా ప్రాతినిధ్యం వహించే విధంగా మలిచిన ఈ దేవాలయం సుమారు నాలుగు వందల సంవత్సరాల పాటు అడవిలో ఎవరికీ కానరాని విధంగా చెట్ల మధ్య-పుట్టల మధ్య దాగి వుందంటారు. దేశ విదేశాల పర్యాటకులను ఆకర్షించేది మాత్రమే కాకుండా, ఆన్గ్ కార్ వాట్, కాంబోడియా సంస్కృతీ-సాంప్రదాయాలకు ప్రతీకగా, ఆ దేశ జాతీయ జండాపై దర్శనమిస్తుంది. హిందువుల పురాణాలలోని దేవతల నిలయమైన మేరు పర్వతం తరహాలో దీనిని డిజైన్ చేశారు. దేవాలయ సముదాయం చుట్టూతా ఎల్లప్పుడూ నీటితో నిండి వుండే వెడల్పాటి కందకం తవ్వబడింది. సుమారు మూడున్నర కిలోమీటర్ల పొడవైన ప్రహారీ గోడ కూడా చుట్టూతా వుంది. వీటికి అదనంగా దీర్ఘ చతురస్రాకారంలో వున్న మూడు గాలరీలు-ఒకదానికంటే మరొకటి ఎత్తుగా వుండే విధంగా-ఆన్గ్ కార్ వాట్ చుట్టూ వున్నాయి. 


ఆంగ్లంలో ఆన్గ్ కార్ వాట్ అంటే "టెంపుల్ సిటీ" అని, ఖ్మేర్ భాషలో "దేవాలయాల నగరం" అనీ కాంభోడియన్లు సంబోధిస్తారు. లోగడ ఈ దేవాలయాన్ని ఖ్మేర్ లో "ప్రేహ్ పిష్ణులోక్" అని, సంస్కృతంలో "వర విష్ణులోక" అని అనే వారు. ఈ నాటి ఆధునిక పట్టణమైన సయాం రీప్ కు సుమారు ఐదున్నర కిలోమీటర్ల దూరంలో వున్న ఆన్గ్ కార్ వాట్, పురాతన రాజధానికి సమీపంలో తూర్పు భాగాన వుంది. అతి సమీపంలోనే పదకొండవ శతాబ్దిలో హిందువుల దేవుడు శివుడికి అంకితం చేసిన "బాఫువాన్" దేవాలయం కూడా వుంది. అదీ చూడతగ్గ స్థలమే. ఆన్గ్ కార్ వాట్‍ను సందర్శించాలనుకునే వారు, ముందుగా, దానికి సుదూరంలో వున్న "అప్సర అథారిటీ" కార్యాలయం నుంచి, ఒక్కో వ్యక్తికి రోజుకు 20 డాలర్ల చొప్పున చెల్లించి, ఫొటో ఐడెంటిటీతో సహా ఎంట్రీ పాస్ కొనుక్కోవాలి. ఒకే సారి కన్సెషన్ ధరలో మూడు రోజులకు, వారం రోజులకు కూడా కొనవచ్చు. దేవాలయాల సముదాయం మొత్తం చూడాలంటే, సుమారు ఐదారు కిలోమీటర్ల పాటు ఎత్తు-పల్లాల బాటలో నడవాలి. కూలిన రాళ్ల మీద, కూల బోయే ప్రమాదమున్న గోడల మధ్య నుంచి నడవాలి. చీకటి పడితే చేతిలో బాటరీ లైట్ తప్పని సరిగా వుండాలి. అక్కడ విద్యుత్ సరఫరా లేదు. మేం వెళ్లిన మొదటి రోజున చెదరు-ముదురుగా వర్షం కురిసింది. గొడుగుల సహాయంతో నడవ గలిగాం. రెండో రోజున ఉదయం నాలుగున్నర కే చేరుకున్నాం. ఆన్గ్ కార్ వాట్ దేవాలయం గోపురాల మధ్య నుంచి, ఎదురుగా వున్న నీటిలో నీడ పడుతూ కనిపించే సూర్యోదయాన్ని వీక్షించడానికి మాతో పాటు వేలాదిమంది దేశ విదేశీ పర్యాటకులున్నారక్కడ. తెల్లవారే వరకు పూర్తి చీకటే. అడుగులో అడుగు వేసుకుంటూ, బాటరీ కాంతిలో నెమ్మదిగా సూర్యోదయం కనిపించే స్థలానికి చేరుకున్నాం. అదో అద్భుతమైన దృశ్యం!


ఆన్గ్ కార్ వాట్ దేవాలయ నిర్మాణం ఇంకా కొంచెం మిగిలి వుండగానే, రాజా సూర్యవర్మన్ చనిపోవడంతో, అక్కడ పని నిలిచి పోయింది. కొన్నేళ్లు అలానే గడిచాక, ఏడవ జయవర్మన్ రాజయ్యాడు. "ఆన్గ్ కార్ థాం" పేరుతో సమీపంలో అన్గ్ కార్ వాట్‍కు ఉత్తర దిక్కుగా నూతన రాజధానిని, అధికారిక దేవాలయంగా "బాయాన్" ను నిర్మించారాయన. పదమూడవ శతాబ్దంలో ఆన్గ్ కార్ వాట్ క్రమేపీ హిందువుల ఆధీనంలోంచి థెరవాడ బౌద్ధుల చేతుల్లోకి పోయింది. నేటికీ ఒక విధంగా అలానే వుందనాలి. ఆ మాటకొస్తే ఏ దేవుడికీ పూజా-పునస్కారాలు లేనే లేవక్కడ. ఒకనాడు జరిగిన దాఖలాలు కూడా లేవు. ఆన్గ్ కార్ వాట్‍ను పూర్తిగా ఉపయోగించుకోవడం కానీ, నిరుపయోగంగా చేయడం కానీ ఏనాడూ జరగలేదు. దాని చుట్టూతా వున్న వెడల్పాటి కందకం అటవీ ప్రాంత అక్రమ ఆధీనంలోకి పోకుండా కాపాడిందనాలి. ఇరవయ్యో శతాబ్దంలో దీని ఆచూకీ తెలుసుకున్న వారికి దానిని ఎలాగోలో పునరుద్ధరించాలని అనిపించింది. దేవాలయ సముదాయాన్ని కప్పి వేసిన ఆకులు-చెట్లు-పుట్టలు-మట్టి తొలగించాల్సి వచ్చింది. 1970-1980 లలో చోటు చేసుకున్న అంతర్యుద్ధం వల్ల పనిలో అంతరాయం కలిగింది. ఒక బలీయమైన సాంస్కృతిక శక్తిగా కాంబోడియన్ ప్రభుత్వం, విదేశాలతో-ముఖ్యంగా ఫ్రాన్స్, అమెరికా, థాయ్‍లాండ్ లతో, దౌత్య సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి ఆన్గ్ కార్ వాట్ ఉపయోగపడింది.


ఆన్గ్ కార్ వాట్‍తో సహా ఇతర కట్టడాల సౌందర్యానికి అబ్బురపడిన ఫ్రాన్స్ దేశం ఆగస్ట్ 11, 1863 న కాంబోడియాను ఆక్రమించుకుని, తన ప్రొటెక్టరేట్‌గా ఏర్పాటు చేసుకుంది. సయాం రీప్ ను అధీనంలోకి తెచ్చుకుంది. చివరకు కాంబోడియా నవంబర్ 9, 1953 న స్వాతంత్ర్యం పొందింది. అప్పటి నుంచీ ఆన్గ్ కార్ వాట్ ను తన స్వాధీనంలో నే వుంచుకుంది. వియత్నాం యుద్ధం జోరుగా కొనసాగుతున్న రోజుల్లో, అలనాటి కాంబోడియా అధినేత ప్రిన్స్ నోరోడం సిహనౌక్, అమెరికా అధ్యక్షుడు కెన్నెడీ సతీమణి జాక్విలిన్ కెన్నెడీ జీవితాభిలాషైన ఆన్గ్ కార్ వాట్‍ను చూడడం కొరకు, ఆమెకు ప్రత్యేకంగా కాంబోడియాలో విందు ఏర్పాటు చేశాడు!

భారత దేశానికి చెందిన ఒరిస్సా, చోళుల కాలానికి చెందిన తమిళనాడు దేవాలయాల సాంప్రదాయాలను అక్కడక్కడా పుణికి పుచ్చుకుంది. దేవుళ్ల నివాస స్థలమైన మేరు పర్వతాన్ని పోలిన విధంగా దీని డిజైన్ వుంటుంది. మేరు పర్వతానికి వున్న విధంగానే, వాటి శిఖరాల స్థానంలో, నాలుగు దిక్కులా చతురస్రాకారంలో నాలుగు గోపురాలు, మధ్యలో మరో గోపురం వుంటాయి. మేరు పర్వతం చుట్టూతా వున్నట్లు, నీరు ప్రవహించడానికి వెడల్పాటి కందకం తవ్వడం జరిగింది. ఖ్మేర్ శైలి ఆర్కిటెక్చర్ తో డిజైన్ చేయబడిన ఆన్గ్ కార్ వాట్ కట్టడానికి ఇసుక రాళ్లు, లాటరైట్ ఖనిజం ఉపయోగించారు. ప్రహారీ గోడ పొడవు 1024 మీటర్లు. వెడల్పు 802 మీటర్లు. ఎత్తు 4.5 మీటర్లు. 30 మీటర్ల పొడవు-వెడల్పు వున్న పచ్చిక బయలు నేల చుట్టూతా వుంటుంది. అదనంగా 190 మీటర్ల వెడల్పున్న కందకం కూడా వుంది. దేవాలయానికి వెళ్లడానికి తూర్పు-పశ్చిమ దిక్కులలో మట్టి వంతెన లాంటిది వుంటుంది. మధ్య మధ్యలో కట్టెలతో తయారు చేసిన వంతెనలుంటాయి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కుల్లో వరుసగా నాలుగు ఎత్తైన గోపురాలున్నాయి. పడమట భాగాన వున్నది అన్నిటికన్నా ఎత్తైనదే కాకుండా పడిపోవడానికి సిద్ధంగా వున్న మూడు స్థంబాలున్నాయి.


దక్షిణ భాగాన వున్న టవర్ కింది భాగంలో విష్ణుమూర్తి భారీ విగ్రహం ఒకటి వుంది. సుమారు పదిహేను అడుగుల ఎత్తున్న ఈ విగ్రహానికి ఎనిమిది చేతులున్నాయి. ఖ్మేర్ భాషలో ఆ మూర్తిని "టా రీచ్" అంటారు. బహుశా ఆన్గ్ కార్ వాట్ దేవాలయం ప్రధాన పూజా విగ్రహం ఇదే అయ్యుండాలి. ఈ విగ్రహానికి పూజా-పునస్కారాలు లేవు. కొద్ది దూరంలో తల-చేతులు నరికేసిన లక్ష్మీదేవి భారీ విగ్రహం కనిపిస్తుంది. బహుశా ఏదో దండయాత్రలో అలా జరిగుండాలి. టవర్ల మధ్య గాలరీలున్నాయి. గోపురానికి రెండు వైపులా "ఏనుగు ద్వారాలు" గా పిలువబడే రెండు మార్గాలున్నాయి. వాటిలో ఏనుగులు పట్టేంత సందుంటుంది. ఈ గాలరీలకు (వెలుపలి) పశ్చిమభాగాన చతురస్రాకార స్థంబాలు, (లోపలి) తూర్పు భాగాన పెద్ద గోడ వున్నాయి. స్థంబాల మధ్యన వున్న పైకప్పు తామర పూల ఆకారంలో అలంకరించబడి వున్నాయి. గోడ పశ్చిమ భాగంపై నాట్యం చేస్తున్న ఆకృతిలో బొమ్మలున్నాయి. శిథిలావస్థలో వున్న కిటికీలు, నాట్యం చేస్తున్న మగవారి బొమ్మలు, దేవతల బొమ్మలు, తూర్పు భాగం గోడపై దర్శనమిస్తాయి. ద్వారం దక్షిణ భాగంలో కూడా దేవతల బొమ్మలు కనిపిస్తాయి. ఇలా గాలరీలు, గోపురాలు అడుగడుగునా కనిస్పిస్తుంటాయి. నగరం కన్నా ఎత్తైన ప్రదేశంలో దేవాలయాన్ని నిర్మించారు. దేవాలయంలోని మూడు దీర్ఘ చతురస్రాకార గాలరీలు, ఒకటికంటే మరొకటి ఎత్తుగా వుండడం విశేషం. ఈ గాలరీలను రాజుకు, బ్రహ్మ దేవుడికి, చంద్రుడికి, విష్ణుమూర్తికి అంకితమివ్వడం మరో విశేషం. దేవాలయం పశ్చిమ ముఖంగా వుండడంతో, మిగిలిన అన్ని తూర్పు దిక్కుగా ఏర్పాటు చేయడం జరిగింది.


వెలుపల వున్న గాలరీ 215 మీటర్ల పొడవు, 187 మీటర్ల వెడల్పు వుండడంతో పాటు, మూలలలో స్థంబాలకు మారుగా విశాలమైన మైదానం మాదిరి కనిపిస్తుంది. ఒక విధంగా ప్రధాన కట్టడానికి నిర్మాణ పరంగా సపోర్టుగా వుండడమే కాకుండా, ఈ గాలరీలు, దేవాలయం బయట వైపున ప్రాముఖ్యంగా కనిపిస్తాయి. వెలుపలి గాలరీ నుంచి లోపలి మరో భాగానికి కలిపే ప్రదేశాన్ని "వేయి దేవుళ్ల హాల్" అని పిలుస్తారు. శతాబ్దాల తరబడి అక్కడికి వచ్చే యాత్రీకులు బుద్ధుడి విగ్రహాలను అక్కడికి తెచ్చి వేసి పోయేవారట. దురదృష్టవశాత్తు వాటిలో చాలావరకు దుండగుల దాడుల్లో దొంగిలించబడడమో, లేక తల భాగం తీసేసి మొండేలుగా చేయడమో జరిగింది. అక్కడి దృశ్యం అతి జుగుప్సాకరంగా కనిపిస్తుందిప్పుడు. ఈ ప్రదేశంలోని గోడల మీద అక్కడకు వచ్చిపోయిన యాత్రీకులకు సంబంధించిన విషయాలు రాయడం జరిగింది. ఇవన్నీ ఖ్మేర్ భాషలో ఎక్కువగా వున్నాయి. కొన్ని చోట్ల బర్మా భాషలో, మరి కొన్ని చోట్ల జపనీస్ భాషలో కనిపిస్తాయి. ఇక వెలుపలి గాలరీలోని లోపలి గోడలపైన హిందువుల పురాణాలైన రామాయణం, మహాభారతం నుంచి ఎన్నో గాధలను చెక్కడం జరిగింది. వాయువ్య మూల నుంచి మొదలెట్టి, అ ప్రదక్షిణంగా, పశ్చిమ భాగాన వున్న గాలరీ గోడలపైన రామ రావణ యుద్ధం, అందులో రావణుడిని రాముడు వధించడం, కురుక్షేత్రం సంగ్రామం-అందులో కౌరవ, పాండవులు ఒకరినొకరు చంపుకోవడం లాంటివి చెక్కబడ్డాయి. గాలరీ దక్షిణ భాగంలో, రాజా సూర్యవర్మన్ కాలం నాటి ఒక ఊరేగింపును చిత్రంగా గీయడం జరిగింది. హిందువుల పురాణ గాథలలోని 32 నరకాలను, 37  స్వర్గాలను చిత్రాలుగా గీశారు. తూర్పు వైపున వున్న గాలరీ గోడపై చక్కటి దృశ్యం కనిపిస్తుంది. సముద్ర మధనానికి సంబంధించిన ఆ దృశ్యంలో, 92  మంది అసురులు, 88 మంది దేవతలు, వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసుకుని, కవ్వంగా మందర పర్వతాన్ని విష్ణుమూర్తి సలహాపై సముద్రంలో చిలకడం కనిపిస్తుంది. విష్ణువు అసురులను ఓడించడం కూడా చెక్కబడింది. ఉత్తర వైపున గాలరీ గోడలపై, శ్రీకృష్ణుడు పూతనను వధించడం, హిందు దేవతలు అసురులను సంహరించడం దృశ్యాలుగా మలిచారు. అలానే వాయువ్య, నైరుతి దిక్కుల గోడలపై కూడా చెక్కబడి వుంది. అవన్నీ హిందూ గాధలే!


ఈజిప్ట్ "ఖాఫ్రే" పిరమిడ్‍ కట్టడానికి ఎంత కంకర రాయి అవసరమైందో-అంటే సుమారు ఏబై లక్షల టన్నుల మోతాదు-అంతే రాయిని అన్గ్ కార్ వాట్ నిర్మాణానికి ఉపయోగించారని అర్థమౌతోంది. యశోధర పురానికి ఈశాన్యంగా సుమారు నలబై కిలోమీటర్ల దూరంలో వున్న కుల్లెన్ పర్వతాలనుంచి రాయిని కొట్టి ఇక్కడకు రవాణా చేశారట. బహుశా సయాం రీప్ నదిలో భారీ బల్ల కట్టుల ద్వారా రాయిని రవాణా చేసి వుండవచ్చు. ఎంతో శ్రద్ధ వహించి ఆ పని చేసి వుండకపోతే ఆ కట్టడం పూర్తయ్యేదే కాదు. ఆన్గ్ కార్ వాట్ ను ఇప్పుడు-ఈ అధునిక యుగంలో నిర్మించాలంటే, సుమారు 300 సంవత్సరాలు పట్టవచ్చని ఒక ఇంజనీరింగ్ నిపుణుడు అంచనా వేశారు. భారత దేశానికి చెందిన పౌరాణిక గాధల నుంచి, కిలోమీటర్ల పొడవైన గోడలపై, కమనీయమైన చెక్కడాలను, చిత్రాలను చేయడం చాలా గొప్ప విషయం. గోడలలో ఇప్పుడు కనిపిస్తున్న ఖాళీ జాగాలలో ఒకప్పుడు విలువైన ఇత్తడితో బొమ్మలను చేసి పెట్టారట. అవన్నీ దొంగిలించబడ్డాయి. 


భారత పురా తత్వ శాఖ వారు ఓ పాతికేళ్ల క్రితం ఈ దేవాలయాన్ని బాగు చేయడానికి కొంత కృషి చేసినప్పటికీ, పెద్దగా పరిస్థితిలో మార్పు లేదనే అనాలి. ఆన్గ్ కార్ వాట్ ప్రాంగణాన్ని, పోయే దారిని, అక్కడున్న పరిసరాలను చూస్తే చాలా బాధ కలుగుతుంది. దేశ-విదేశ యాత్రీకుల-పర్యాటకుల ఆసక్తి మేరకు వారి దగ్గర నుంచి డబ్బు వసూలు చేసి, ఒక పర్యాటక స్థలంగా మార్చడమై తే చేసింది ప్రభుత్వం కాని, అంతకు మించి శ్రద్ధ కనిపరుస్తున్న దాఖలాలు లేవు. వాస్తవానికి ఈ దేవాలయాన్నే కనుక బాగు చేయించ గలిగితే, తిరుపతి కంటే ఎక్కువ సంఖ్యలో యాత్రీకులు వస్తారనడంలో సందేహం లేదు. భారత ప్రభుత్వం-తిరుమల తిరుపతి దేవస్థానాలు కలిసి, ప్రపంచ ప్రఖ్యాతమైన ఈ హిందూ దేవాలయాన్ని పరిరక్షించుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో! హిందూ మతోద్ధరణకు కంకణం కట్టుకున్నామని చెప్తున్న భారత దేశ మత పెద్దలు ఎంతమంది ఇక్కడకు వచ్చారో తెలియదు కాని, వారు ప్రపంచ వ్యాప్తంగా వున్న హిందూమతాభిమానులలో ఉత్తేజాన్ని కలిగించి, వారి దగ్గరనుంచి వచ్చే విరాళాలతోనైనా, ఆన్గ్ కార్ వాట్‍లోని విష్ణుమూర్తి విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలి. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి నారాయణ చినజీయర్ స్వామి లాంటి వారు ముందుకొచ్చి, భారత-కాంబోడియాల మధ్య ఒక అవగాహన కుదిర్చే ప్రయత్నం చేసి, ప్రపంచ ప్రఖ్యాతి గాంచి నేడు శిథిలావస్థలో వున్న ఈ అతి పెద్ద హిందూ దేవాలయాల సముదాయాన్ని పునరుద్ధరించేందుకు నడుం బిగిస్తే మంచిదేమో అలోచించాలి.End


 

Sunday, August 26, 2012

Angkor Wat in Cambodia-World’s largest Hindu Temple Complex: Vanam Jwala Narasimha Rao


Angkor Wat in Cambodia
World’s largest Hindu Temple Complex
Vanam Jwala Narasimha Rao

I have come to Singapore, where my son Aditya is working for Google as its Human Resources Director for Asia-Pacific Countries, with my wife on August 15th 2012. After few days spending in Singapore, four of us (I, my son Aditya, daughter-in-law Parul and wife Vijayalaxmi along with two year old granddaughter Kanak) planned a visit to Cambodia for three days. We reached Siem Reap-a town with half a million population-on 24th August. For an Indian the Visa requirement for Cambodia is Visa on arrival. It took us just couple of minutes in the Air Port to complete the formality. But to our surprise we were asked a Tip as bribe by the immigration authorities which we refused. They did not insist too. Later we came to know that Cambodia is one of the corrupt countries and ahead of at least 170 world nations in corruption. But the people are courteous. The Hotel “Borei Angkor Resort and Spa” where we have a reservation sent a Vehicle to pick-up us from Air Port.

Four of us in front of a Lion Statue in the Resort
Aptly named after a “territory of Angkor” in Cambodian, Borei Angkor Resort and Spa, a truly Cambodian five-star hotel-is set right in the center of Siem Reap, where privacy and connectivity blend together to form a perfect base for exploring the "Kingdom of Wonder". Borei Angkor Resort is ideally situated within 7 km from airport, 7 km from Angkor Wat, and within 5 minutes drive of the main shops center, Night Market and restaurants in Siem Reap. The evening we hired two “Tuk-Tuk”s-similar to an Indian auto but slightly different. Tuk-Tuk is a motor cycle or a moped welded or tagged to a four seated compartment with the Top covered. The driver is not protected from sun and rain like that of an auto. We spent that evening till late in the night in the night market which is a great attraction in Cambodia. Like in India’s crowded market streets where we can buy any item after considerable bargain here in Siem Reap it is done the same way.


Most of the transactions in Cambodia are made in US Dolores. Each Dolor is equivalent to 4000 Riel. The riel is the currency of Cambodia. The first riel was issued between 1953 and May 1975. Between 1975 and 1980, the country had no monetary system. A second currency, also named "riel", has been issued since April 1, 1980. However, this currency has never gained much public acceptance, with most Cambodians preferring foreign currency. The UN peacekeeping operation of 1993 injected a large quantity of U.S. dollars into the local economy. As a result, the dollar has become the country's common currency. Riel notes are used for fractional dollar amounts as U.S. coins are not in circulation.  Our dinner bill in the night market amounted to 90, 000 riel!

For the next two days we planned a visit to the world famous Angkor Wat-the largest Hindu temple complex in the world and accordingly requested the Resort’s Hospitality unit to make arrangements. 160 Dolores-45 Dolores for the Vehicle, 35 Dolores for the guide, 80 Dolores for four of us towards entry fee-is all that we needed to spend per day to visit the site. We spent the whole of the first day and the second day morning there.


Long Shot taken in front of the Angkor Wat

Angkor Wat temple was built by King Suryavarman-II in the early 12th century in Yasodharapura, the capital of the Khmer Empire, as his state temple and eventual burial chamber. Breaking from the Shaivism tradition of previous kings, Angkor Wat was dedicated to Vishnu. As the best-preserved temple at the site, it is the only one to have remained a significant religious centre since its foundation–first Hindu, dedicated to the god Vishnu, then Buddhist. The temple is at the top of the high classical style of Khmer architecture. It has become a symbol of Cambodia, appearing on its national flag, and it is the country's prime attraction for visitors. It is designed to represent Mount Meru, home of the Devatas in Hindu mythology. It is surrounded by a moat and an outer wall 3.6 kilometers long are three rectangular galleries, each raised above the next. The modern name, Angkor Wat, means "Temple City" or "City of Temples" in Khmer. Prior to this the temple was known as Preah Pisnulok (Vara Vishnuloka in Sanskrit). Angkor Wat lies 5.5 kilometers north of the modern town of Siem Reap, and a short distance south and slightly east of the previous capital, which was centered at Baphuon. The Baphuon is a temple built in the mid-11th century at Angkor and dedicated to the Hindu God Shiva. 



Before reaching the site the visitor requires buying at least a one day entry pass paying 20 Dolores each (for more than a day there are concessional rates) with a photo identity and has to be shown at the entrance. The passes are issued by “Apsara Authority”. One need to walk four to five kilometers distance, often climbing up and getting down wooden stories as well as occasionally passing through narrow doors. The day we visited there was intermittent rain and we had to protect from it. The second day early morning when we visited it was still dark and as there was no power supply we used to battery. We had to wait till 6-20 hours for the sun rise between two gopuras, the shade of which could be seen in the waters below-fantastic scene to watch!
            
Angkor Wat Work seems to have ended shortly after the king Suryavarman's death, leaving some of the work unfinished. Thereafter the empire was restored by a new king, Jayavarman VII, who established a new capital and state temple (Angkor Thom and the Bayon respectively) a few kilometers to the north. In the late 13th century, Angkor Wat gradually moved from Hindu to Theravada Buddhist use, which continues to the present day. Angkor Wat was never completely abandoned. Its moat also provided some protection from encroachment by the jungle. Angkor Wat required considerable restoration in the 20th century, mainly the removal of accumulated earth and vegetation. Work was interrupted by the civil war during the 1970s and 1980s. The temple is a powerful symbol of Cambodia, and is a source of great national pride that has factored into Cambodia's diplomatic relations with France, the United States and its neighbor Thailand.


            
The splendid artistic legacy of Angkor Wat and other Khmer monuments in the Angkor region led directly to France adopting Cambodia as a protectorate on 11 August 1863 and invading Siam to take control of the ruins. Cambodia, which was a protectorate of France since 1863, gained independence on 9 November 1953 and has controlled Angkor Wat since that time. During the midst of the Vietnam War, Chief of State Norodom Sihanouk hosted Jacqueline Kennedy in Cambodia to fulfill her "lifelong dream of seeing Angkor Wat".

Angkor Wat is a unique combination of the influences from temples of Orissa and the Chola of Tamil Nadu, India. The temple is a representation of Mount Meru, the home of the gods. The central quincunx-an arrangement of five objects in a square with four at the corners and one in the center-of towers symbolizes the five peaks of the mountain, and the walls and moat the surrounding mountain ranges and ocean. Angkor Wat is the prime example of the classical style of Khmer architecture. Most of the visible areas are of sandstone blocks, while laterite was used for the outer wall and for hidden structural parts.


            
The outer wall, 1024 by 802 meters and 4.5 meters high, is surrounded by a 30 meter apron of open ground and a moat 190 meter wide. Access to the temple is by an earth bank to the east and a sandstone causeway to the west; the latter, the main entrance, is a later addition, possibly replacing a wooden bridge. There are gopuras at each of the cardinal points-the directions of north, east, south, and west. The western is by far the largest and has three ruined towers.

Under the southern tower is a statue of Vishnu, known as Ta Reach, which may originally have occupied the temple's central shrine. Galleries run between the towers and as far as two further entrances on either side of the gopura often referred to as "elephant gates", as they are large enough to admit those animals. These galleries have square pillars on the outer (west) side and a closed wall on the inner (east) side. The ceiling between the pillars is decorated with lotus decorations; the west face of the wall with dancing figures; and the east face of the wall with threatened windows, dancing male figures on prancing animals, and Devatas, including (south of the entrance) the only one in the temple to be showing her teeth.


            Jwala and Mrs Jwala in front of Vishnu Deity

A gallery is a passageway running along the wall of an enclosure or along the axis of a temple, often open to one or both sides. Historically, the form of the gallery evolved during the 10th century from the increasingly long hallways which had earlier been used to surround the central sanctuary of a temple. A gopura is an entrance building. At Angkor, passage through the enclosure walls surrounding a temple compound is frequently accomplished by means of an impressive gopura, rather than just an opening in the wall or a doorway. Enclosures surrounding a temple are often constructed with a gopura at each of the four cardinal points. The temple locates on a terrace raised higher than the city. It is made of three rectangular galleries rising to a central tower, each level higher than the last. These galleries are dedicated to the king, Brahma, the moon, and Vishnu. Because the temple faces west, the features are all set back towards the east, leaving more space to be filled in each enclosure and gallery on the west side; for the same reason the west-facing steps are shallower than those on the other sides.
            
The outer gallery measures 187 by 215 meters, with pavilions rather than towers at the corners. The gallery is open to the outside of the temple, with columned half-galleries extending and supporting the structure. Connecting the outer gallery to the second enclosure on the west side is the "Hall of a Thousand Gods". Buddha images were left there by pilgrims over the centuries, although most have now been removed or heads chopped off. This area has many inscriptions relating the good deeds of pilgrims, most written in Khmer but others in Burmese and Japanese.


Gallery View
            
The inner walls of the outer gallery bear a series of large-scale scenes mainly depicting episodes from the Hindu epics the Ramayana and the Mahabharata. From the north-west corner anti-clockwise, the western gallery shows the Battle of Lanka (from the Ramayana, in which Rama defeats Ravana) and the Battle of Kurukshetra (from the Mahabharata, showing the mutual annihilation of the Kaurava and Pandava clans). On the southern gallery follow the only historical scene, a procession of Suryavarman II, then the 32 hells and 37 heavens of Hindu mythology. On the eastern gallery is one of the most celebrated scenes, the Churning of the Sea of Milk, showing 92 Asuras and 88 Devatas using the serpent Vasuki to churn the sea under Vishnu's direction It is followed by Vishnu defeating Asuras. The northern gallery shows Krishna's victory over Bana and a battle between the Hindu gods and Asuras. The north-west and south-west corner pavilions both feature much smaller-scale scenes, some unidentified but most from the Ramayana or the life of Krishna.
            
The monument was made out of enormous amounts of sandstone, as much as Khafre's pyramid in Egypt (over 5 million tons). This sandstone had to be transported from Mount Cullen, a quarry approximately 40 kilometers to the northeast. The stone was presumably transported by raft along the Siem Reap River. This would have to have been done with care to avoid overturning the rafts with such a large amount of weight. One modern engineer estimated it would take 300 years to complete Angkor Wat today. Virtually all of its surfaces, columns, lintels even roofs are carved.


Temple with shade seen in waters 

There are miles of reliefs illustrating scenes from Indian literature including unicorns, griffins, winged dragons pulling chariots as well as warriors following an elephant-mounted leader and celestial dancing girls with elaborate hair styles. The gallery wall alone is decorated with almost 1,000 square meters of bas reliefs. Holes on some of the Angkor walls indicate that they may have been decorated with bronze sheets. These were highly prized in ancient times and were a prime target for robbers.
            
The Archaeological Survey of India carried out restoration work on the temple between 1986 and 1992. Since the 1990s, Angkor Wat has seen continued conservation efforts and a massive increase in tourism. The temple is part of the Angkor World Heritage Site, established in 1992, which has provided some funding and has encouraged the Cambodian government to protect the site. The German Apsara Conservation Project (GACP) is working to protect the Devatas and other bas reliefs-sculpture in which the design projects slightly from a flat background, but without any part being totally detached from the background-which decorates the temple from damage. The organization’s survey found that around 20% of the Devatas were in very poor condition, mainly because of natural erosion and deterioration of the stone but in part also due to earlier restoration efforts. Other work involves the repair of collapsed sections of the structure, and prevention of further collapse.


Crowd waiting to see sun rise in the morning

Angkor Wat has become a major tourist destination and every day thousands of visitors come there from several countries.


Jwala and Mrs Jwala praying in front of rising sun

Saturday, August 11, 2012

స్ఫూర్తి లేని రాందేవ్ బాబా లీలలు: వనం జ్వాలా నరసింహారావు


స్ఫూర్తి లేని రాందేవ్ బాబా లీలలు
సూర్య దినపత్రిక (12-08-2012)
వనం జ్వాలా నరసింహారావు

బాబా రాందేవ్ మరో మారు అన్నంత పనీ చేశాడు. విదేశాలలో నిల్వ వుంచిన మన దేశానికి చెందిన నల్ల ధనాన్ని స్వదేశానికి తెప్పించాలని, డబ్బు దాచుకున్న వారి పేర్లను బహిర్గతం చేయాలని డిమాండు చేస్తూ ఢిల్లీ రాంలీలా మైదానంలో మూడు రోజుల నిరాహార దీక్షకు దిగాడు. ఈ దేశానికి నిజాయితీ వున్న ప్రధాన మంత్రి కావాలని, రాజకీయ నిజాయితీని, సంకల్పాన్ని ప్రధాని ప్రదర్శించాలని ఆయన అక్కడ చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. గతంలో కూడా రాందేవ్ ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. అప్పట్లో సామ-దాన-భేద-దండోపాయాలను ప్రయోగించింది ప్రభుత్వం వ్యూహాత్మకంగా. ఐనా... అవినీతి అలానే వుంది..పది కాలాల పాటు వుంటుంది....దాని పునాదులు, గోడలు అంత పటిష్టమైనవి. అవినీతి నిర్మూలన అంటూ గొంతు చించుకునే వారికి కూడా ఆ పాపంలో కాస్తో-కూస్తో భాగం లేదనలేం. రాందేవ్ లాంటి వారు, ఒక లక్ష్యం-ధ్యేయం లేకుండా, ఆచరణ సాధ్యం కాని కోరికలు కోరుతుంటే, అమలు పరచటం వీలు కాని కాల వ్యవధిలో నెరవేరాలంటుంటే, దానర్థం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడమా? లేక ప్రభుత్వం చేస్తున్న అవినీతి కార్యకలాపాలకు పరోక్షంగా సహకారం అందించడమా? కోట్లాది రూపాయల విలువ కలిగిన ఒక ద్వీపాన్నే (ఒక దేశంతో సమానం) భారత దేశం వెలుపల, తన కంటూ సొంతం చేసుకోగల సమర్థుడికి, (విదేశ బాంకుల్లో దాచుకున్న) సహచర భారతీయుల నల్ల ధనాన్ని జాతీయం చేయమని, బహిర్గతం చేయమని అడిగే నైతిక హక్కు ఎవరిచ్చారు? అలానే, ఆయన చేసిన డిమాండును అంగీకరించే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారు? జవాబు దొరకని ప్రశ్నలు.

అవినీతికి, నల్లధనానికీ వ్యతిరేకంగా ప్రస్తుతం మూడురోజుల నిరాహార దీక్ష చేస్తున్న రాందేవ్ బాబా, గతంలో నిరవధిక నిరాహారదీక్ష మొదలుపెట్టే ముందర లక్ష కిలోమీటర్ల "భారత స్వాభిమాన యాత్ర" ను ఉజ్జయినిలో ముగించుకుని, ఆ తర్వాత ఢిల్లీకి బయలుదేరి అక్కడి విమానాశ్రయం చేరుకోవడానికి ముందే, ఆయన అనుగ్రహం కోసమా అన్న చందాన, ఆయనతో చర్చించే నెపంతో, నాటి కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్‌ సిబాల్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పవన్‌ కుమార్ బన్సాల్, పర్యాటక శాఖ మంత్రి సుబోధ్‌ కాంత్ సహాయ్ క్యాబినెట్ సెక్రటరీ కే ఎం చంద్రశేఖర్ వంటి అతిరథ-మహారథులు అక్కడకు వెళ్లడం కంటె విడ్డూరం ఇంకోటి లేదే మో! అంత కంటే మరీ హాస్యాస్పదం, ఆయనతో చర్చలు జరిపిన అనంతరం కపిల్ సిబాల్ ఆయనగారికి అలనాడు ఇచ్చిన "టెస్టిమోనియల్". "రాందేవ్ దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే కొన్ని ముఖ్యమైన అంశాలను లేవనెత్తారు. అవి చాలా ముఖ్యమైన జాతీయ అంశాలు. వాటి పరిధి చాలా విస్తృతం. వాటికి మేం ప్రాథమికంగా స్పందించాం" అన్నది దాని సారాంశం. తనను తాను సాక్షాత్తు దైవాంశ సంభూతుడుగా, ఒక దేవ దూతగా భావిస్తున్న బాబా రాందేవ్ మరో టెస్టిమోనియల్ ను మీడియాకు చూపించారు. అప్పట్లో నిరాహార దీక్ష విరమించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారని, ఐనా, దేశాన్ని రక్షించడం కోసం నిరశన ప్రారంభించాలనే నిర్ణయానికొచ్చానని, విదేశాల్లో ఉన్న మొత్తం నల్లధనాన్ని స్వదేశానికి తిరిగి తీసుకు రాగలననే పూర్తి ఆత్మ విశ్వాసం తనకున్న దని దాని సారాంశం.



నాడూ-నేడూ బాబా చేసిన-చేస్తున్న డిమాండ్లు మాములు వి కావు... విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న కోట్లాది రూపాయల నల్ల ధనాన్ని వెనక్కి తెప్పించాలని, దేశంలో అవినీతిని నిర్మూలించడానికి బలమైన లోక్‌ పాల్ బిల్లును రూపొందించాలని, ప్రజా పంపిణీ చట్టం పటిష్టంగా అమలు కావాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా అవినీతి కేసుల విచారణ పూర్తిచేసి శిక్షార్హులకు ఏకంగా ఉరిశిక్ష విధించాలని, స్వతంత్ర భారత దేశంలో ఇంకా అమలవుతున్న బ్రిటిష్ కాలం నాటి చట్టాలను రద్దు చేయాలని...ఇలాంటివే మరి కొన్ని కావాలని, నాడు ఆమరణ నిరాహార దీక్షకు-నేడు మూడు రోజుల దీక్షకు పూనుకున్నారాయన. అప్పట్లో సర్కారీ రాందేవ్ బాబా సత్యాగ్రహం కోసం రాంలీలా మైదానంలో ఏర్పాట్లు కూడా ప్రభుత్వమే చేసింది. తాగునీరు, విద్యుత్, పారిశుధ్య వసతులు కల్పించే ఏర్పాట్లు కూడా చేసింది. మైదానం ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టడం కూడా జరిగింది. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? కాకపోతే ఇప్పుడెందుకో శీత కన్నేసింది!

అలనాడు కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశమై పరిస్థితి చక్కదిద్దే చర్యల గురించి చర్చించింది. చర్చలు జరుపుతూనే... దీక్షను విరమింప చేసేందుకు మధ్యవర్తులను పురమాయించింది. అవకాశం దొరికినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వెనుకాడని భారతీయ జనతా పార్టీ అప్పట్లో బాబా రాందేవ్‌కు తన పూర్తి మద్దతు ప్రకటించింది. జన లోక్‌పాల్ బిల్లు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి, ప్రభుత్వం నుంచి హామీ తీసుకుని దీక్ష విరమించిన అన్నాహజారే సహచరులైన శాంతిభూషన్ ప్రభృతులు కూడా రాందేవ్‌ బాబాకు మద్దతు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సహితం తన సంఘీభావం తెలిపారు. ద్వంద్వ నీతికి పర్యాయపదమైన కాంగ్రెస్ పార్టీ, తమ పార్టీకి చెందిన కొందరు నాయకుల ద్వారా రాందేవ్ దీక్షకు ప్రాముఖ్యత ఇస్తున్నట్లు ఒక వైపు కన్పించుతూనే, మరో వైపు బాబా దీక్షపై తొలినుంచీ నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్ తో ఆయన పై విమర్శలను గుప్పించింది. బాబా సన్యాసి కాదనీ, వ్యాపార వేత్తనీ ఆయనతో అనిపించింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) హస్తం గురించి కూడా దిగ్విజయ్‌ సింగ్ ప్రస్తావించారు. ఇప్పట్లో ఇవేవీ కనిపించడం లేదు. రాందేవ్ బాబా ఒంటరి పోరే చేస్తున్నారు. బాబా రామ్‌ దేవ్ నాడు చేపట్టిన ఆమరణ దీక్ష ఒక రోజన్నా గడవక ముందే భగ్నమైంది. ఆయనను అరెస్టు చేశారా? కిడ్నాప్ చేశారా? చేయించింది ప్రభుత్వమా? కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటి? అన్నవి ప్రశ్నార్థకంగా వుండి పోయాయి. వ్రతం చెడింది...ఫలితం దక్కలేదు. సర్కారు అనుకున్న ది సాధించింది...రాందేవ్ బాబా కూడా అన్న పని చేశాడు. అవినీతి మాత్రం తనను ఎవరూ, ఏమీ చేయలేరని అపహాస్యం చేస్తూ, మందహాసం చేసింది.

ఈ నేపధ్యంలో, మన రాష్ట్రంలో, ఖమ్మం జిల్లా-ముదిగొండ మండలం లోని వల్లభి గ్రామంలో, సుమారు నాలుగున్నర దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనను జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అప్పట్లో టైమ్, న్యూస్ వీక్ లాంటి అంతర్జాతీయ పత్రికలు, బ్రిడ్జ్, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ లాంటి జాతీయ ప్రముఖ పత్రికలు ఆ గ్రామంలో జరిగిన సంఘటనలను పూస గుచ్చినట్లు ప్రచురించాయి. ఇక స్థానిక రాష్ట్ర స్థాయి పత్రికలు సరే సరి. సంఘసంస్కర్త-స్వాతంత్ర్య సమరయోధుడు-జాతిపిత మహాత్మాగాంధీ ఆధ్యాత్మిక వారసుడు-శాంతి, గ్రామ స్వరాజ్యం, హరిజనోద్ధరణే ధ్యేయంగా పెట్టుకున్న పవనార్‌ ఆశ్రమవాసి ఆచార్య వినోబా బావే, అనుంగు శిష్యుడు, ఆయనంతటి ప్రముఖుడుగా పేరొందిన ఆచార్య భన్సాలి, ఆ గ్రామానికొచ్చి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అది కూడా రాందేవ్ బాబా లాగా, అట్టహాసంగా, సర్కారు చేసిన భారీ ఏర్పాట్ల మధ్య, తెచ్చి పెట్టుకున్న లక్షలాది మంది మద్దతు దార్ల మధ్య కాదు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక దళితుడు పూజారిగా పనిచేస్తున్న స్థానిక రామాలయంలో దీక్షకు దిగారు. ఆయనకు అంతకు ముందు ఆ గ్రామం గురించి ఏ మాత్రం తెలియదు. ఆయనకు తెలియ చేయబడిందల్లా, ఆ గ్రామంలో, అగ్రవర్ణాల భూస్వాములకు-దళిత వర్గాల బీద వారికి మధ్య జరిగిన ఘర్షణలో, దళితులు గ్రామ బహిష్కరణకు గురయ్యారని, వారు గ్రామంలోకి రావడానికి తాను పూనుకోవాలని మాత్రమే. అంతే, వెనుకా-ముందు చూడ కుండా, హుటాహుటిన బయల్దేరి, ఏ ఆర్భాటం చేయకుండా, గ్రామానికొచ్చి దేవాలయంలో నిరాహార దీక్షకు దిగారు. ఆయన డిమాండు నెరవేరింది. ఆ దీక్షకు, ఒక నిర్దుష్టమైన-సహేతుకమైన కారణం వుంది.

అప్పట్లో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ ముఠా రాజకీయాలకు వల్లభి గ్రామం దళితులు బలయ్యారు. నీలం సంజీవ రెడ్డి గ్రూపుకు చెందిన జలగం వెంగళ్ రావు పక్షాన వున్న గ్రామ అగ్ర వర్ణాల వారికి, కాసు బ్రహ్మానంద రెడ్డి గ్రూపుకు చెందిన శీలం సిద్దారెడ్డి పక్షాన వున్న దళితులకు "వల్లభి" గ్రామం ఒక “భూ పోరాటానికి" వేదికైంది. దళితుల భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేసిన అగ్ర వర్ణాల వారికి, దళితులకు మధ్య వివాదం ఘర్షణలకు దారితీసింది. దళితులను భయబ్రాంతులను చేసే ప్రయత్నంలో, అగ్రవర్ణాలకు చెందిన కొందరు, పరిసర గ్రామాలలోని తమ మద్దతు దార్లను కూడగట్టుకుని, దళిత వాడపై దాడి చేయడంతో, పిల్లా పాపలతో-కుటుంబాలన్నీ గ్రామం విడిచి పోవాల్సిన పరిస్థితి కలిగింది. అలా వెళ్ళిన వారి ఇళ్లను కూడా సర్వ నాశనం చేశారు. వారి పశువులను తరిమి వేశారు. గృహోపకరణాలను పాడు చేశారు. మొత్తం మీద దళితులను గ్రామం నుంచి బహిష్కరించారు. దళితులకు అండగా నలిచిన గ్రామ పెద్ద, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తామ్ర పత్ర గ్రహీత అయితరాజు రాం రావు కూడా గ్రామం విడిచి కొంత కాలం ఖమ్మంలో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దళితులకు ఇబ్బందులు తొలగ లేదు. దేశ వ్యాప్తంగా పత్రికలు జరిగిన అన్యాయాన్ని ప్రచురించాయి. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం వరకూ తెలిసింది. బ్రహ్మానంద రెడ్డి తన మంత్రివర్గ సహచరులైన వల్లూరు బసవ రాజు ప్రభృతులను వల్లభి గ్రామానికి పంపినా ఫలితం కనిపించలేదు. గ్రామంలో రిజర్వుడు పోలీసులు, ఉన్నతాధికారులు కూడా మకాం వేశారు. అయినా మార్పు కానరాలేదు.

సమస్యకు పరిష్కారం “గాంధేయ మార్గం” తప్ప మరోటి కాదని గ్రామ పెద్ద అయితరాజు రాం రావు భావించారు. స్నేహితుల సహాయంతో గాంధి-వినోబా బావేల శిష్యుడైన ఆచార్య భన్సాలిని ఆశ్రయించాడు. పోరాటం కన్నా శాంతే మేలని, భన్సాలి తన వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా, సరిగ్గా నడవలేని స్థితిలో వుండి కూడా, వల్లభి గ్రామానికి వచ్చారు. భన్సాలీ వచ్చిన మరుక్షణమే, దళిత వాడ చేరుకుని, దళితులు నిర్మించుకున్న దేవాలయంలో మకాం వేశారు. శాంతి యత్నాలు ప్రారంభించారు. దళితులను గ్రామానికి రప్పించాలని, వారిని వెళ్లగొట్టిన అగ్రవర్ణాల వారిని కోరాడు. అంతే కాకుండా శాంతియుత వాతావరణంలో సహజీవనం సాగించాలన్న నిబంధననూ విధించాడు. ఆయన మాట వినని పరిస్థితులున్నాయని గ్రహించి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. చిట్ట చివరి దళితుడు గ్రామంలోకి వచ్చి ఇతరులతో సహజీవనం సాగించేంతవరకు తన దీక్ష విరమించేది లేదని శపధం చేశారు. ఒకటి రెండు రోజుల్లో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల్లో కదిలిక వచ్చింది. నాటి గవర్నర్‌ ఖండూభాయ్ దేశాయి, ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి, ఆఘమేఘాల మీద సంధి ప్రయత్నాలు మొదలెట్టారు. సంధికి అంగీకరించాల్సిందెవరో కాదు- కాంగ్రెస్‌లోని రెండు వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు చెందిన ఇద్దరు ప్రముఖ నాయకులు-జలగం వెంగళరావు, శీలం సిద్దారెడ్డి. జిల్లా మంత్రుల సమక్షంలో గవర్నర్‌, ముఖ్యమంత్రి భన్సాలి దీక్షను విరమింప చేసారు. నాటి నుంచి ఆ గ్రామంలో కొట్లాటలు జరిగిన దాఖలాలు లేవు.

వినోబా శిష్యుడు ఆచార్య భన్సాలీ అల నాడు చేపట్టిన ఆ మరణ దీక్షకు-దానికి లభించిన సమస్య పరిష్కారానికి, ఆర్భాటం హంగులతో రాందేవ్ బాబా నాడు అరంభించి విరమించిన (విరమింప చేసిన) ఆ మరణ దీక్షకు, నేటి మూడు రోజుల దీక్షకు పోలికే లేదు. ఒక సమస్యకు భన్సాలీ కనుక్కున్న పరిష్కార మార్గాన్ని, ఆయన అనుసరించిన మార్గంలో అవలంబిస్తే, బహుశా అవినీతి అంతం కాకుండా వుండే ప్రశ్నే లేదు. వచ్చిన చిక్కల్లా భన్సాలీ లాంటి వారు లభించక పోవడమే! ఆ నాడు ఆచార్య భన్సాలీ వల్లభి చేరుకోవడానికి, సాదా-సీదాగా, ప్రయాణం చేసారు తప్ప ప్రత్యేక విమానం కాని, కనీసం ప్రత్యేక కారుకాని ఉపయోగించుకోలేదు.

చేస్తే, భన్సాలీ లాంటి వారిలాగా దీక్ష చేయాలి. లేదా, తన ఎజెండాతో రాజకీయాల్లోకి దిగాలి. భారత దేశానికి-ఆ మాటకొస్తే ఏ ప్రజాస్వామ్య దేశానికైనా రాజ్యాంగమే ప్రామాణికం. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు మన పార్లమెంటు సభ్యులు. వారందరూ వున్న పార్లమెంటుకు తప్ప మరే ఇతర వ్యవస్థకూ చట్టాలు చేసే అధికారం లేదు. ఫలానా చట్టం ఫలానా విధంగా చేయాలని నిర్ణయించేది యావత్తు పార్లమెంటు సభ్యులలోని మెజారిటీ మాత్రమే. వారిని కాదని, రాందేవ్ బాబా లాగానో, అన్నా హజారే లాగానో నిరాహార దీక్షలకు దిగితే ఫలితం శూన్యం.

Friday, August 10, 2012

అంగారకుడిపై రోవర్: వనం జ్వాలా నరసింహారావు


అంగారకుడిపై రోవర్
సూర్య దినపత్రిక (11-08-2012)
వనం జ్వాలా నరసింహారావు

మానవజాతి కొనసాగిస్తున్న మహాన్వేషణలో అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం "నాసా" మరో అడుగు ముందుకు వేసింది. ఆ సంస్థ అంతరిక్షంలోకి పంపిన రోవర్ "క్యూరియాసిటీ" అంగారకుడిపై విజయవంతంగా కాలు మోపడంతో, నాసా మరో కీలక మైలురాయిని అధిగమించినట్లయింది. అమెరికా కాలిఫోర్నియా సమీపంలోని నాసా కేంద్రంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలలో మందహాసం తొణికిసలాడింది. కరతాళ ధ్వనులు మారుమోగాయట. క్యూరియాసిటీ లాండింగును న్యూయార్క్ లోని టైం స్క్వేర్‌లో నాసా ఏర్పాటు చేసిన ప్రత్యేక తెరపై లైవ్‍లో వీక్షించిన అమెరికన్ల ఆనందోత్సవాలకు అవధులే లేవంటున్నారు. అంగారకుడిపై కాలుమోపిన క్యూరియాసిటీ అక్కడ జీవ పదార్ధం ఉనికిని కనుగొనే వేటలో మునిగిపోయింది. అంగారకుడి చిత్రాలను భూమికి పంపింది. సుమారు తొమ్మిది వందల కిలోగ్రాముల బరువున్న క్యూరియాసిటీ రోవర్ ముప్పై ఐదు కోట్ల మైళ్ల సుదూర ప్రయాణం చేసి అంగారకుడిని చేరుకుంది. మొత్తం మీద గ్రహాంతర జీవం కోసం మానవుడు జరుపుతున్న శతాబ్దాల అన్వేషణ కీలక దశకు చేరుకుంటుంది. ఈ నేపధ్యంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన, హ్యూస్టన్ "నాసా" కేంద్రం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు  ఎన్నో వున్నాయి.

1957 లో, అలనాటి సోవియట్ యూనియన్, కృత్రిమ అంతరిక్ష నౌకను మొదటిసారిగా ప్రయోగించడంతో, స్పందించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు డ్వైట్ ఐసెన్హోవర్, ఏడాది తిరక్కుండానే, 1958 లో "నేషనల్ ఎయిరో నాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్"-"నాసా" ను, స్థాపించాడు. వాస్తవానికి మార్చ్ 3, 1915 న ఆ దేశంలో నెలకొల్పిన "నేషనల్ అడ్వైజరీ కమిటీ ఫర్ ఎయిరోనాటిక్స్"-"నాకా" సంస్థ నుంచి "నాసా" ఆవిర్భావం జరిగిందనాలి. అంతరిక్ష యానానికి సంబంధించిన సాంకేతిక నైపుణ్యం, తమ దేశంలో అభివృద్ధి చేయడానికి, "నాసా" స్థాపనకు నలభై సంవత్సరాల ముందు నుంచే "నాకా" పరిశోధనలను విజయవంతంగా నిర్వహిస్తున్నది. తోటి అగ్రరాజ్యం సోవియట్ యూనియన్ సాధించిన ఫలితాలను అధిగమించేందుకు, అంతరిక్ష రంగంలో మరింత పట్టు సాధించేందుకు, ఐసెన్హోవర్ "నాసా" ను స్థాపించాడు. జాన్ కెన్నెడీ అధ్యక్షుడిగా వున్నప్పుడు, "నాసా" పైనా, అంతరిక్షంలోకి పంపాల్సిన వ్యోమగాముల శిక్షణ-అభివృద్ధి పైనా, ముఖ్యంగా "చంద్ర మండలం" మీద పాదం మోపడం కొరకూ, భారీగా నిధులను కేటాయించింది నాటి అమెరికన్ ప్రభుత్వం. అవి సత్ఫలితాలనిచ్చి, జులై 20, 1969 , అమెరికా అంతరిక్ష నౌక "అపోలో" లో ప్రయాణించిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఆల్విన్ అడ్రిన్ లు కెన్నెడీ విసిరిన సవాలుకు ప్రతిగా, చంద్రుడి మీద పాదం మోపిన తొలి మానవులయ్యారు. ఆయన వాంఛను నెరవేర్చారు.


"నాసా" ఒక వైపు అంతరిక్ష యానం దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తూనే, ఇంకో వైపు, గతంలో "నాకా" చేపట్టిన "అంతరిక్ష పరిశోధన" కు సంబంధించిన ఫలితాలలోను గణనీయమైన పురోగతిని సాధిస్తూ వచ్చింది. "స్పేస్ టెక్నాలజీ" కి సంబంధించిన వాతావరణ-సమాచార రంగాల్లో అభివృద్ధికి అంతరిక్ష నౌకలను అనుసంధానం చేయడంలో కూడా విజయం సాధించింది. వాషింగ్టన్ లోని "నాసా" ప్రధాన కేంద్ర కార్యాలయం, అంతరిక్ష యానానికి సంబంధించిన పరిశోధన-అభివృద్ధి-శిక్షణలకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించడం-అమలుకు చర్యలు తీసుకోవడం తీసుకుంటుంది.

"నాసా" కార్య కలాపాల ప్రధాన అధిపతిని "అడ్మినిస్ట్రేటర్" అంటారు. అమెరికా అధ్యక్షుడు ఎంపిక చేసి, నామినేట్ చేసిన వ్యక్తిని, సెనేట్ ఆమోదించాల్సి వుంటుంది. ప్రస్తుతం జులై 17, 2009 నుంచి ఆ పదవిలో వున్న పన్నెండవ అడ్మినిస్ట్రేటర్, మేజర్ జనరల్ ఛార్లెస్ ఫ్రాంక్ బోల్డెన్ జూనియర్ ను, ప్రెసిడెంట్ ఒబామా నామినేట్ చేశాడు. 34 సంవత్సరాల తన సుదీర్ఘ అనుభవంలో 14 సంవత్సరాలు "నాసా" అంతరిక్ష పరిశోధన కేంద్రంలో సభ్యుడుగా వుంటూ, 1986-1994 మధ్య కాలంలో నాలుగు పర్యాయాలు అంతరిక్ష నౌకలో స్పేస్ వాక్ చేశాడు.  "నాసా" లో వివిధ కీలక పదవులను గతంలో నిర్వహించిన బోల్డెన్ 1946 సంవత్సరంలో ఆగస్ట్ నెల 19 వ తేదీన జన్మించాడు. బోల్డెన్ హ్యూస్టన్ నగర వాసి.

హ్యూస్టన్ నగరంలో, 1961 లో "ప్రయాణీకుల అంతరిక్ష నౌకా కేంద్రం" గా అప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ రూపకల్పన చేసి నెలకొల్పిన ఇక్కడి "నాసా" కార్యాలయం పేరును, జాన్సన్ మరణానంతరం, ఆయన స్మృతి చిహ్నంగా, "లిండన్ బి జాన్సన్ స్పేస్ సెంటర్" గా మార్చారు. గత నాలుగైదు దశాబ్దాలుగా మానవ అంతరిక్ష యానానికి సంబంధించిన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి-విజయవంతంగా అమలుకు రంగం సిద్ధం చేసిన సంస్థల్లో, ప్రపంచంలో అగ్రగామిగా పేరు తెచ్చుకుంది

హ్యూస్టన్లోని ఈ కేంద్రం. అమెరికా అంతరిక్ష పరిశోధన మొదటి కార్యక్రమమైన జెమిని కార్యకలాపాలు పూర్తయి పోయి, అపోలో కార్యక్రమం ఆరంభమవడంతో, యావత్ ప్రపంచం దృష్టి దానిమీద పడింది. కెన్నెడీ విసిరిన సవాలుకు ప్రతిస్పందనగా చేపట్టిన చంద్రుడిపై కాలుమోపే కార్యక్రమం విజయవంతంగా ముగిసి, వ్యోమగాములు సురక్షితంగా భూమి పైకి తిరిగొస్తుంటే, ప్రపంచం కళ్లన్నీ హ్యూస్టన్ మీదనే కేంద్రీకృతమయ్యాయి. జులై 20, 1969 రోజున చంద్రమండలం మీద కాలిడిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, అక్కడ నుంచే, "హ్యూస్టన్, ఈగిల్ లాండయింది" అనడం, కొన్ని గంటల్లోనే, అపోలో నౌక "లూనార్ మాడ్యూల్‌" నుంచి ఆయన సహచర వ్యోమగాములు, నిచ్చెన ద్వారా దిగి అంతరిక్షంలో పాదం పెట్టి, "మానవుడికి ఇదొక చిన్న అడుగే కాని, మానవజాతి మనుగడ దిశగా వేసిన పెద్ద అడుగు" అని ప్రకటించడం, ఇక్కడి వారికి మరుపు రాని సంఘటన.

భూత-భవిష్యత్-వర్తమానాలకు చెందిన అమెరికా అంతరిక్ష పరిశోధనలు, సాధించిన విషయాలు, మానవజాతి మనుగడకు సాధించనున్న సత్ఫలితాలు కళ్లకు కట్టినట్లు చూడొచ్చిక్కడ. సాక్షాత్తు అంతరిక్ష యానం చేస్తున్న అనుభూతినీ పొందవచ్చు. ఈ భూమండలంలో-యావత్ ప్రపంచంలో, మరెక్కడా లేని విధంగా, మరో ప్రపంచంలోకి సాహసోపేతమైన ప్రయాణం చేయించగల సౌకర్యమున్న ప్రదేశం కూడా బహుశా హ్యూస్టన్లోని అంతరిక్ష కేంద్రం ఒక్కటేనోమో. ఇక్కడ ప్రదర్శనలో వుంచిన వివిధ అంశాలు, ఆకర్షణలు, ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు, ఇంతవరకు జరిపిన అంతరిక్ష ప్రయాణాలకు సంబంధించిన అలనాటి "ప్రత్యక్ష ప్రసారాలు", వ్యోమగాముల శిక్షణా వివరాలు, మిషన్ కంట్రోల్ కేంద్రం, చంద్ర మండలం నుంచి తెచ్చిన శిలలు, "నాసా" వాహనంలో పర్యటన, అంతరిక్షంలో నౌకను పంపే సమయంలో అడుగడుగునా చోటు చేసుకునే సంఘటనలు, చిన్న పిల్లల వినోద కార్య క్రమాలు.. ... ఇలా ఎన్నో ఆసక్తికరమైన వినోద-విజ్ఞాన ప్రదేశం హ్యూస్టన్లోని "నాసా" కేంద్రం.

Sunday, August 5, 2012

సిద్ధాంతాలతో సంబంధం లేని కాంగ్రెస్ పార్టీ ముఠా రాజకీయం: వనం జ్వాలా నరసింహారావు


సిద్ధాంతాలతో సంబంధం లేని కాంగ్రెస్ పార్టీ ముఠా రాజకీయం
వనం జ్వాలా నరసింహారావు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ సోనియా గాంధీతో సమావేశమైనట్లు, రాజీ మార్గం గురించి చర్చించినట్లు మీడియాలో కధనాలొచ్చాయి. ఆ వార్తల్లో వాస్తవం లేదని వైఎస్సార్సీపి నేతలు ఖండించడం కూడా జరిగింది. కలవడం, కలవకపోవడం అటుంచి, రాజీ మార్గం ఎంచుకోవడంలో మాత్రం తప్పేంటి? జగన్మోహన్ రెడ్డికి ముందర ఎంతమంది కాంగ్రెస్ పార్టీని వీడి పోలేదు? ఎంతమంది వారిలో స్వగృహ ప్రవేశం చేయలేదు? ఇతర పార్టీలలో వుంటూ ఎంతమంది కాంగ్రెస్‌ను అనరాని మాటలని, ఆ తరువాత కాంగ్రెస్‌లో చేరి ప్రధాన భూమిక పోషించడం లేదు? అదే విధంగా భవిష్యత్‍లో జగన్మోహన్ రెడ్డి చేసే అవకాశాలు లేవని ఎందుకు భావించాలి? ఎందుకు ఆ పార్టీ వారు భుజం తడుముకోవాలి? ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి, అందులోకి రావాలని అనుకునేవారికి మామూలే!

స్వాతంత్రోద్యమం నాటి భారత జాతీయ కాంగ్రెస్ కు ఇప్పటి కాంగ్రెస్ () కు పోలికే లేదనాలి. అలనాటి కాంగ్రెస్‌లో అభిప్రాయ భేదాలకు, మైనారిటీ వ్యక్తుల సూచనలకు గౌరవం లభించేది. ఇక ఇప్పుడో, అధిక సంఖ్యాకుల మద్దతున్న వారిని, ప్రజా బలం వున్న వారిని, అధిక సంఖ్యాకుల ప్రజా ప్రతినిధుల ఆదరణ వున్న వారిని, ఏదో ఒక నెపంతో, పార్టీ దూరం చేసుకుంటున్నది. ఒక నాడు పార్టీ అనుసరించిన మద్యే మార్గం, అతివాద-మితవాద శక్తులను కలుపుకుని పార్టీని పటిష్టం చేయడమైతే, ఈ నాటి మద్యే మార్గం, భిన్నాభిప్రాయాలను వెల్లడించమని పరోక్షంగా అధిష్టానం ప్రోత్సహించడమే. అధిష్టానంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు, అధినేత్రి దగ్గర పలుకుబడిని సంపాదించుకునేందుకు, ప్రత్యక్షంగానో-పరోక్షంగానో ప్రతి రాష్ట్రంలోని, సమ్మతి-అసమ్మతి వాదులను పురికొల్పడం ఈ నాటి మద్యే మార్గం. కింది స్థాయినుంచి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనని వారిని, స్థానికంగా ప్రజల మద్దతు లేని వారిని, పోటీ చేసి గెలవలేని వారిని, అధిష్టానం దగ్గర చెవులు కొరుకుతూ తిరిగే వారిని చేర దీయడం పార్టీకి అలవాటుగా మారింది. కాంగ్రేసేతర పార్టీలలో ప్రముఖ పాత్ర పోషించి, అన్నీ అనుభవించి, అక్కడ తమ అవసరాలన్నీ తీర్చుకుని, అక్కడ వున్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇష్టమొచ్చినట్లు తూలనాడిన వారంతా పార్టీలో ప్రముఖులవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ అంటూ గొంతు చించుకుంటున్న వారంతా, ఎప్పుడో ఒకప్పుడు పార్టీని దుయ్యబట్టిన వారో, ఇతర పార్టీలనుంచి వలస వచ్చిన వారో కావడం విశేషం.

ఉదాహరణకు, ఈ నాడు కేంద్ర మంత్రివర్గంలో కీలకమైన పదవిలో వున్న జైపాల్ రెడ్డి, రాజీవ్ గాంధిని, ఎన్ని రకాల దూషించడానికి వీలుందో అన్ని రకాలుగా, బోఫోర్స్-ఫెయిర్‌ ఫాక్స్ విషయాల్లో, దూషించారు. జనతా పార్టీనుంచి గెలిచి కేంద్రంలో మంత్రి పదవిని అనుభవించారు. మరిప్పుడాయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తి. సాక్షాత్తు ఇందిరా గాంధి మీద ఉప ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన వీరేంద్ర పాటిల్, కాంగ్రెస్ () లో చేరి తన స్థానాన్ని బల పర్చుకోలేదా ? స్వర్గీయ పర్వత నేని ఉపేంద్ర మాటేంటి? ఈ నాడు సోనియాకు అతి సన్నిహితురాలిగా చెప్పుకుంటున్న రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సంగతేంటి? తెలంగాణ ప్రజా సమితి పేరుతో కాంగ్రెస్ ను ధిక్కరించి, ఎన్నికల్లో పోటీ చేసి, పది మందికి పైగా అభ్యర్థులను పార్లమెంటుకు గెలిపించుకున్న స్వర్గీయ మర్రి చెన్నా రెడ్డిని అధిష్టానం ఏం చేయ గలిగింది. ఒక్క సారి కాదు ... కనీసం మూడు సార్లు ఆయన అధిష్టానాన్ని ధిక్కరించారు. ఇంతెందుకు.. ఎన్నికలు జరిగిన ప్రతి సారి, టికెట్ దొరకని పలువురు నేతలు, ఇండిపెండెంటుగా పోటీ చేయడం, ఆరేళ్లు బహిష్కరించ బడడం, స్వగృహ ప్రవేశం చేయడం, లోగడ కంటే, మంచి పదవులు పొందడం తెలిసిన విషయమే. జగ్జీవన్ రాం, ఎన్డీ తివారి, అర్జున్ సింగ్‌లను కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయగలిగింది ? ఇవ్వాళ శరద్ పవార్ లేకపోతే భారత జాతీయ కాంగ్రెస్ మనుగడే లేదు. మమత బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్‌ను కాదనే ధైర్యం సోనియా గాంధీకి వుందా? తమిళ నాడులో పీవీ నరసింహా రావు పొత్తుల నిర్ణయానికి వ్యతిరేకంగా "తమిళ మానిల కాంగ్రెస్" ను స్థాపించి, పార్లమెంటుకు ఎన్నికై, కాంగ్రేసేతర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిత్వ శాఖను నిర్వహించిన చిదంబరం కాంగ్రెస్ క్రమ శిక్షణకు లోబడినట్లా ? కాదా?




కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు, ముఠా పోకడలు, అధిష్ఠానాన్ని ధిక్కరించడం, పార్టీని వీడిపోవడం, స్వగృహ ప్రవేశం చేయడం, గతంలో కంటే ప్రాధాన్యత సంపాదించుకోవడం లాంటివి ఆది నుంచీ జరుగుతున్నదే. బాల గంగాధర్ తిలక్, గోపాల కృష్ణ గోఖలే, విభేదించినప్పటికీ దూషించుకోలేదు. గాంధీజీ నాయకత్వంలో యువకులైన నెహ్రూ, బోసులకు కాంగ్రెస్ పార్టీలో అవకాశం వచ్చినప్పటికీ, బోసు ధిక్కార ధోరణి గాంధీకి నచ్చలేదు. తనకిష్టమైన జవహర్లాల్ నెహ్రూను, స్వతంత్రం రాకమునుపు ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వానికి సారధిని చేసేందుకు, అబుల్ కలాం ఆజాద్‌తో రాజీనామా చేయించి, ఆయన స్థానంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా నెహ్రూ వ్యవహరించేందుకు తోడ్పడ్డారు గాంధీజీ. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు సంబంధించినంతవరకు, రాగ ద్వేషాలకు, మహాత్ముడంతటి వాడే అతీతం కాదని అనుకోవడానికి నిదర్శనంగా భవిష్యత్‍లో వల్లభాయ్ పటేల్ ప్రధాని అయ్యే అవకాశాలను కూడా పరోక్షంగా దెబ్బ తీశారు గాంధీజీ. మధ్యంతర ప్రభుత్వంలో తనకిష్టమైన విదేశాంగ శాఖను నెహ్రూ వుంచుకుని, హోం శాఖను పటేల్‌కు కేటాయించడంతో తనకు తెలియకుండానే, భవిష్యత్‍లో తన ప్రాబల్యం పెరిగేందుకు అవకాశం కలిపించుకున్నారు నెహ్రూ.

1948-1950 మధ్య కాలంలో హోమ్ మినిస్టర్ గా వున్న వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేశారు. దాదాపు అన్ని ప్రొవిన్షియల్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పటేల్ మనుషులు ఎన్నికయ్యారు. ఈ లోపున రాజ్యాంగ శాసనసభకు సంబంధించి, సంస్థానాల విలీనం గురించి చర్చలు-చర్యలు మొదలయ్యాయి. జాతీయ గీతంగా జనగణమణ..” వుండాలా, “వందేమాతరం...” వుండాలా? అన్న విషయంలోనూ కాంగ్రెస్ నాయకత్వంలో విభేదాలు చోటుచేసుకున్నాయి. 1948 లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా గెలిచిన పట్టాభి సీతారామయ్య, ఆ తర్వాత పురుషోత్తం దాస్ టాండన్ చేతిలో ఓటమి పాలయ్యారు. వారిలో మొదటి వారు నెహ్రూ బలపర్చిన వ్యక్తికాగా, టాండన్ పటేల్ పక్షం మనిషి. గాంధీజీ మరణానంతరం, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థిగా గవర్నర్ జనరల్ గా పనిచేసిన రాజగోపాలా చారికి నెహ్రూ మద్దతు లభించగా, పటేల్ మద్దతు వున్న రాజేంద్ర ప్రసాద్‌కు ఆ పీఠం దక్కింది. అవన్నీ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత పోరాటాలే. అప్పట్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులలో నెహ్రూ అనుచరులని, పటేల్ అనుచరులని వేర్వేరుగా సంబోధించేవారు. నీలం సంజీవరెడ్డి నెహ్రూ అనుకూలుడుగా, టంగుటూరు ప్రకాశం పంతులు ఆయనకు వ్యతిరేకిగా చెప్పుకునేవారు.

మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్న ప్రకాశం పంతులును దింపడానికి నీలం సంజీవరెడ్డి, కళా వెంకట్రావులు ఒకటయ్యారు. నీలం-కళా వెంకట్రావుల వ్యూహంలో ముఖ్యమంత్రి పదవి కోల్పోయి, కాంగ్రెస్ వదిలి వెళ్లిపోయిన ప్రకాశం, స్వగృహ ప్రవేశం చేసి, అదే సంజీవరెడ్డి ప్రోద్బలంతో తిరిగి ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి అయ్యారు. ఉప ముఖ్య మంత్రి పదవి దక్కించుకున్న నీలం సంజీవ రెడ్డి చక్రం తిప్పారు. కాంగ్రెస్‌ను వీడిన ఆయన ప్రత్యర్థి ఎన్జీ రంగా ఆ తరువాత స్వగృహ ప్రవేశం చేసి గుంటూరు లోక్ సభ సభ్యుడుగా ఎన్నికయ్యారు. శాసన సభ సమావేశాలలో, మద్య నిషేధం సాకుగా ఓడిన ప్రకాశం రాజీనామా చేయడంతో గవర్నర్ పాలన విధించడం, శాసన సభను రద్దుచేయడం జరిగింది. అవన్నీ ముఠా రాజకీయాలే. దరిమిలా, నీలం సంజీవరెడ్డి స్థానంలో బెజవాడ గోపాల రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యారు. 1955 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నాయకుడిగా నీలం-బెజవాడల మధ్య పోటీ వుండడంతో, అధిష్ఠానం బెజవాడ గోపాల రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరచడంతో ఆయన ముఖ్య మంత్రి అయ్యారు. నీలం సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రి పదవికి ఒప్పుకుని, పి డబ్ల్యు శాఖతో తృప్తి పడాల్సి వచ్చింది. మళ్ళీ ముఠా రాజకీయాలు మొదలయ్యాయి. గోపాలరెడ్డికి వ్యతిరేకంగా, కళా వెంకట్రావును, కల్లూరు చంద్రమౌళిని కలుపుకుని నీలం సంజీవరెడ్డి పనిచేయ సాగారు. అధిష్ఠానం దూతగా వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి వారి మధ్య తాత్కాలికంగా రాజీ కుదిరించారు.

బెజవాడ గోపాలరెడ్డికి పోటీగా, కాసు బ్రహ్మానందరెడ్డిని ప్రోత్సహించిన నీలం సంజీవరెడ్డి, తమతో అల్లూరి సత్యనారాయణ రాజును కలుపుకున్నారు. 1956 లో విశాలాంధ్రగా ఆంధ్ర ప్రదేశ్రాష్ట్రం అవతరించింది. ముఖ్య మంత్రి పదవికోసం మరో మారు పోటీ మొదలైంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొండా వెంకట రంగారెడ్డి-మర్రి చెన్నారెడ్డి మద్దతు బెజవాడకు, బూర్గుల-విబి రాజుల మద్దతు నీలంకు లభించింది. ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు నీలంకే మద్దతు పలికారు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. తన మంత్రివర్గంలోనే ఉప ముఖ్య మంత్రిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి కింద బెజవాడ గోపాలరెడ్డి ఆర్థిక శాఖను నిర్వహించాల్సి వచ్చింది. 1957 లో తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు జరిగాయి. నీలం వర్గానికి అధిక స్థానాలు వచ్చాయి. తన స్థానాన్ని పదిలపర్చుకోసాగాడు. కొండా వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, పాగా పుల్లారెడ్డి, బొమ్మ కంటి సత్యనారాయణ రావు ప్రభృతులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పార్టీని వదిలి, “డెమోక్రాటిక్ పార్టీని స్థాపించారు. విజయవాడలో నిర్వహించిన ఆ పార్టీ మహాసభలో ప్రసంగించిన మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చేరడం కంటె, కృష్ణా నదిలో పడడం మంచిదనిఅన్నారు. పార్టీ వదిలిన మర్రి చెన్నారెడ్డి అప్పుడే కాకుండా అలా మరి రెండు పర్యాయాలు వదలడం-స్వగృహ ప్రవేశం చేయడం, పదవులను అనుభవించడం అందరికీ తెలిసిందే.

నీలం సంజీవరెడ్డిని జాతీయ రాజకీయాల్లోకి లాగడమే మంచిదని భావించిన జవహర్లాల్ నెహ్రూ, పథకం ప్రకారం 1960 లో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించారు. సంజీవరెడ్డి స్థానంలో రాజీ అభ్యర్థిగా దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించారు. తనను వ్యతిరేకించిన ఏసీ సుబ్బారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు సంజీవయ్య. ఏ కొద్దిమందో తప్ప, దాదాపు కాంగ్రెస్ పార్టీలోని హేమా-హేమీలందరు సంజీవయ్యను ధిక్కరించిన వారే ! ఐనా పార్టీలో కొనసాగారు. 1962 లో ఎన్నిక లొచ్చే సమయానికల్లా సంజీవరెడ్డిని తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకుని రావడం జరిగింది. ఆయన స్థానంలో సంజీవయ్యను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా చేశారు. ఎన్నికలనంతరం 1964 లో కర్నూల్ బస్సుల జాతీయం కేసులో రాజీనామా చేసేంతవరకు బలీయమైన నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి కొనసాగారు.

1964 లో కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి అయింతర్వాత, మళ్లీ ముఠా రాజకీయాలకు తెర లేచింది. కాసుకు వ్యతిరేకంగా ఏసీ సుబ్బారెడ్డి అసంతృప్తి కాంగ్రెస్ వర్గానికి బాహాటంగానే నాయకత్వం వహించారు. కాసు వర్గాన్ని మినిస్టీరియలిస్టులుఅని, ఏసీ వర్గాన్ని డిసిడెంట్లుఅని పిలిచేవారు. మర్రి చెన్నారెడ్డి మద్దతు కాసు వర్గానికుండేది. 1967 లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి గెలిచిన మర్రి చెన్నారెడ్డి ఎన్నికల కేసులో సభ్యత్వాన్ని కోల్పోవడమే కాకుండా, ఆరేళ్లు ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హుడవడంతో, 1969 తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం చేపట్టారు. కేంద్ర మంత్రివర్గంలో చేరిన నీలం సంజీవరెడ్డి, రాష్ట్ర రాజకీయాలలో తల దూర్చలేదు. చెన్నారెడ్డి ధిక్కార ధోరణి పుణ్యమా అని, కాసు ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేయడం, ఆయన స్థానంలో పీవీ నరసింహా రావు రావడం జరిగింది. 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ధిక్కరించి, తెలంగాణ ప్రజా సమితి పేరుమీద ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు చెన్నారెడ్డి బలపర్చిన అభ్యర్థులు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో సస్పెన్షన్లకు లెక్కేలేదు. ముల్కీ కేసులో తీర్పుపై పీవీ వ్యాఖ్యలకు నిరసనగా తలెత్తిన ఉద్యమం ఫలితంగా ఆయన పదవి కోల్పోవడం, ఆయన స్థానంలో కొన్నాళ్లకు జలగం ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఎమర్జెన్సీ కాలంలో ఇందిర విధేయుడుగా, అత్యంత సమర్థుడైన ముఖ్య మంత్రిగా పేరు తెచ్చుకున్న జలగం, ఆ తర్వాత కాలంలో, ఇందిర మంత్రివర్గంలో ఎమర్జెన్సీ హోం మినిస్టర్గా పనిచేసిన బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ లో చేరాడు. 1978 శాసనసభ ఎన్నికల్లో, ఇందిరా కాంగ్రెస్ (నేటి అఖిల భారత జాతీయ కాంగ్రెస్-) ను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి విజయ పథంలో నడిపించగా, వెంగళ్ రావు నేతృత్వంలోని కాంగ్రెస్ పరాజయం పాలైంది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు మొదటిసారి. వెంగళరావు మళ్ళీ ఇందిర పంచన చేరి కేంద్రంలో మంత్రి పదవి అనుభవించారు. పీసీసీ అధ్యక్షుడుగా కూడా పని చేశారు. ఆయన బాటలోనే బ్రహ్మానందరెడ్డి నడిచారనాలి.

ఇందిర తిరిగి అధికారంలోకి రావడంతో, సమ్మతి-అసమ్మతి రాగాల మధ్య, ముఖ్యమంత్రుల మార్పిడికి శ్రీకారం చుట్టడం జరిగింది. బహిరంగంగానే, అసమ్మతికి అధిష్ఠానం ప్రోత్సాహం లభించేది. ఒకరి వెంట మరొకరు అంజయ్య, భవనం, విజయ భాస్కర రెడ్డి ముఖ్య మంత్రులయ్యారు అసమ్మతి పుణ్యమా అని. 1983 లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ను, 1989 లో మరో పర్యాయం, పీసీసీ అధ్యక్షుడుగా గెలిపించిన చెన్నారెడ్డి, ముఖ్య మంత్రి కావడానికి అధిష్ఠానం ఆశీస్సులు తప్పనిసరైందని అనక తప్పదు. మళ్ళీ అసమ్మతి... మళ్ళీ ధిక్కార స్వరాలు.. ఏడాదికే ఆయన స్థానంలో.. నేదురుమల్లి జనార్థన్ రెడ్డి ముఖ్య మంత్రయ్యారు. ఆయన్నూ వుండనివ్వలేదు అధిష్ఠానం. మరో మారు విజయ భాస్కర రెడ్డిని ముఖ్య మంత్రిని చేసి, తెలుగు దేశం ఇంకో మారు అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసింది. అప్పట్లో అసమ్మతిని, ధిక్కార స్వరాన్ని వినిపించిన డాక్టర్ రాజశేఖర రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేసినా, కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడానికి మరో పది సంవత్సరాలు పట్టింది. ఆయన రెండో పర్యాయం ముఖ్య మంత్రి అయింతర్వాత, ఆకస్మికంగా మరణించడంతో, ఆరేళ్లు వినిపించని ధిక్కార స్వరాలు మళ్లీ మొదలయ్యాయి. ఆయన వున్నప్పుడు ధిక్కారానికి అవసరం లేనందునో-వీలు కలగనందునో తాత్కాలికంగా ఆగినా, కాంగ్రెస్ లో అంతర్భాగమైన ధిక్కార పర్వాలు, అసంతృప్తి కాండలు మళ్ళీ మొదలయ్యాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫొటో విషయంలో ఈ రోజు ఆయనను బాహాటంగా విమర్శించే వారు, ఆయనున్నప్పుడు నోరు విప్పడానికే జంకేవారు.
          
నూట పాతికేళ్ల భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రలో ఏదో విధంగా అధిష్ఠానాన్ని ధిక్కరించని నాయకులు అరుదు. పార్టీలో ఎవరికి ఎప్పుడు ప్రాధాన్యత వుంటుందో-ఎప్పుడు ఎవరికి వుండకుండా పోతుందో చెప్ప గల వారు లేరిప్పుడు. సుమారు పాతిక పర్యాయాలు పార్టీ పగ్గాలను చేజిక్కించుకుని, నలభై సంవత్సరాల పాటు అధ్యక్ష పీఠం అధిష్ఠించింది నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారే. అదే వారసత్వానికి చెందిన సోనియా గాంధీ నాయకత్వంలోని అధిష్ఠానం ప్రస్తుతం అవలంభిస్తున్నది మాత్రం విభజించి పెత్తనం సాగించడంఅనే బ్రిటీష్ పోకడలు. భవిష్యత్ లో పార్టీకి ఆ పోకడలు లాభం చేకూరుస్తాయనుకోవడం పొరపాటే. దీని ప్రభావం అన్ని రాష్ట్రాల మాదిరిగానే, ఆంధ్ర ప్రదేశ్‌పైనా పడక మానదు. యుపిఎ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ పరంగా అత్యధిక స్థానాలను సంపాదించి పెట్టిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి వారితో సంధి ప్రయత్నాలను చేయక తప్పని పరిస్థితి



కాకపోతే, ఆ పని ఇప్పుడు చేస్తే మంచిదా? 2014 ఎన్నికల తరువాత చేస్తే మంచిదా? అని ఆలోచించుకోవాలి. ఏదేమైనా, చేరేది లేదు-చేతులు కలిపేది లేదని తెగేసి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి! ఎవరి వ్యూహం ఎలా వుంటుందో వేచి చూడాల్సిందే.