Monday, October 27, 2014

Decency not at the cost of State:Vanam Jwala Narasimha Rao

Decency not at the cost of State
Vanam Jwala Narasimha Rao

This is with reference to Communications Adviser to AP Government Parakala Prabhakar’s unwarranted and baseless statement in which he blamed Telangana State Chief Minister K Chandrasekhar Rao. Prabhakar alleged that that KCR had crossed all the limits of decency in criticising the Government of AP for its commitment to honour the GO 69 and GO 107 related to water utilization of Srisailam and Nagarjunasagar reservoirs. He also, without any basis blamed that the state of Telangana is “violating the GOs”.

But the Communications Adviser to AP Government had forgotten that the Srisailam Project was conceived and built exclusively for the purpose of power generation and the very name of the project is Srisailam Hydel Power Project suggested this. The subsequent GOs namely, GO 233 in addition to GO 69 and GO 107 were issued to protect the vested interests of the AP Region of the erstwhile Andhra Pradesh and to cause immense damage to Telangana. He should also know, as a communications expert, that decency cannot be maintained at the cost of the Telangana State’s interests in general and its people in particular.

Controversy over Srisailam whether it is to be called as a Hydel Project or a project meant exclusively for drinking water and irrigation had become topic of the day. Way back in 1960, to meet the power requirements in different parts of the country, the planning commission contemplated Hydel projects all over the country including the Srisailam. The project when conceived, envisaged 900 MW of power generation through left canal and 770 MW through the right canal. Thus the project was exclusively meant for Hydel power production. Accordingly, not even a drop of water was meant for other purposes when the project was originally conceived.

In 1981, the project started generating electricity. The water used from the reservoir for the generation of electricity flows ultimately into the Nagarjunasagar dam and as a result the water was not wasted. In other words, the Srisailam project was used as a balancing reservoir for the Krishna waters. The Telangana State had come into existence on June 2, 2014 and the state continued to face adverse effects of the United Andhra Pradesh’s policies even today.  It requires a serious and thorough analysis of several issues on Srisailam waters and the corresponding power production. What had surfaced now about the Srisailam Hydel Power Project is nothing but a tip of the ice berg of the injustices being meted out to the people in the Telangana region for ages.



Even a primary school going kid understands that the acute power shortage being faced in Telangana State now was due to the lopsided policies of the Congress and the TDP in the then united Andhra Pradesh State. Both the Congress and TDP are directly responsible for the state of affairs as far as power sector is concerned in Telangana state now. Not even a single MW of additional power was generated in the Telangana region during the 20 year-old misrule of both the Congress and TDP governments. Against this backdrop, the state of Telangana came into existence.

Despite all out efforts by the Telangana Government there is still, a power shortage in the state. If the power is not supplied in time to the farmers continuously and particularly when the crop is about to be harvested, then it will have an adverse effect on them.  This will ultimately lead to shortage of food grains production.  On an average, the demand per day in the Telangana state is to the tune of 6,800 MW. Taking into consideration the actual production capacity as well as the central share of power, on an average, the availability of power is only to the tune of about 4,500 MW.  To overcome the shortage, the Telangana Government is purchasing power on a daily basis, through power exchange averaging about 760 MW.  Despite this, there is still shortage of power.  The available Hydel power in Telangana is about 1000 MW. Out of this, 700 to 800 MWs is from Srisailam alone. For the Telangana state this is of paramount importance.

The Andhra Pradesh Government is putting forward an argument that water levels in Srisailam reservoir are falling down. It is also arguing that priority should be given to drinking and irrigated water.  This is a baseless argument.  It may be true that from out of the available water priority should be given to drinking and irrigation water.  However, it is a fact that in our country some projects are built exclusively for power production.  Srisailam is one among them. Srisailam has been designed exclusively for the power production.   When the project was conceived and built not even a single TMC of water was allocated for irrigation.  Later, an argument was put forward that river Krishna frequently gets floods, excess water is available there and flood water is in abundance. In support of this argument and for utilising all this water, the then State Government planned to construct projects.  Accordingly the concept of right to utilise excess water from Srisailam has come.  Subsequently keeping aside the concept of excess water, flood waters and wrongly interpreting an argument has slowly evolved that Srisailam is an irrigation project. Finally with that as a basis the water allotment has been taking place.

It was decided to allocate water from Srisailam reservoir to different projects.  As per the decision, 19 TMCs for KC Canal and 15 TMCs for Telugu Ganga are to be given from Srisailam reservoir which means in all 34 TMCs of water had to go to Andhra region. Similarly 25 TMCs to Kalwakurthy, 20 TMCs to Bheema, 22 TMCs to Nettampadu and 30 TMCs to SLBC, totally 97 TMCs to the entire Telangana had been allotted.  However during the Seemandhra rule Telangana projects did not take shape.  Telangana could never utilise 97 TMCs of water. Though it is only 34 TMCs of water allocated to Andhra, they built projects like Pulichintala, Pothireddypadu and Hundriniva and illegally diverted Srisailam waters to these projects.  This exploitation is still going on. Telangana could not use even the water on which it had a right.  The Andhras though have no right, are using Srisailam reservoir water.  This year also Andhra Pradesh Government has illegally diverted 60 TMCs of Srisailam water.  In Telangana not even 10 TMCs of water was utilised for irrigation projects. Projects that are required for utilising the water have not been completed.

Following bifurcation of the state, Srisailam had become a common project for both AP and Telangana states, both having their right. In other words each state should respect the right of the other state. Telangana by virtue of its right can produce 900 MW of electricity through left canal. Even while using the right the state has never exceeded the limit of its allocation as stipulated in GOs that previous governments issued namely GO 69, GO 107 and GO 233. In fact in Krishna waters Telangana share as decided by Tribunal is 261.9 TMCs and out of this 184.9 is assured waters and 77 is surplus waters. So far from all sources Telangana utilized hardly 75.67 TMCs only. At this rate may be another 26 TMC of water might be required up to Kharif Crop.

As per GO No. 107 it is stipulated that there has to be 854 feet of water in Srisailam reservoir.  In-fact the Chandrababu Government had issued GO No. 69 stipulating that it is enough if there is 834 ft of water in the reservoir.  The Telangana Government has not violated either of these GOs.  In Srisailam reservoir even now the water level is 857 TMCs. Daily for the purpose of power production some amount of water is being utilised.  There is nothing wrong in it.  In the view of Government of AP and that of Krishna water management board, preference has to be given for irrigation purposes.  Let us agree for a while this view also. Then why Telangana is utilising Srisailam reservoir water? It is only for power production. Then, why the power production? It is again for providing water for irrigation to the farmers.  There are no projects in Telangana for utilising the water allocated to it.  What all that the Telangana has is irrigation by bore wells only.  Only when there is power, there is water. Through motors about 500 TMCs of water comes under irrigation. Through the pump sets only about 40 lakh acres of land is being cultivated.  Through the small quantity of water that Telangana is drawing from Srisailam reservoir, several times to that quantity of water could be provided for irrigation to the lands. 

Telangana is producing power by using the same water.  Hence it has to be construed that the water drawn from Srisailam is for the purpose of irrigation only.  As such the condition of 854 ft should also be withdrawn. Both AP Government and Krishna water management board say that the river water should be utilised for irrigation purpose, which Telangana also endorses.  Up to the level 834ft of water, the Telangana should have the right to utilise. Both AP Government and Krishna Board should think objectively.  One more issue here is, that, the existing projects, the water allocation as well as their managements are all decided in United Andhra Pradesh Government.  Those governments did not think of the needs of the Telangana farmers and acted partially.  Everything was viewed through Seemandhra angle.  Even for providing drinking water for Hyderabad and Telangana, there was partiality.  Hence, Telangana Government has requested the board to re-review the entire issue of Krishna water allocation and utilisation. They also agreed to the request. There are going to be changes in allocations.  Till such time to save the crops of Telangana farmers, it should have the right to utilise the Srisailam water up to the level of 834 ft.  The water utilised by Telangana for the purpose of power production could be accounted for in Telangana quota.  Andhra Pradesh Government should not have hatred towards Telangana farmer and make them suffer.

AP Chief Minister Chandrababu Naidu’s proposal that he would supply 300 MWs of power, if Telangana stops production at the Srisailam is ridiculous. This is misleading.  The reason is, only when 800 MWs of power is produced it becomes possible to provide the farmer with 5 to 6 Hrs of supply every day. Foregoing this and accepting 300 MWs of power means supplying power not even for 4 hrs.  Telangana does not want the mercy of AP. It wants its right to be upheld.  As per that right the state demands 54 percent of power.  The state also wants its share in all the power production centres where ever it is eligible including Krishnapatnam.


Friday, October 24, 2014

Telangana Chief Minister and the Panchendriyas:Vanam Jwala Narasimha Rao

Telangana Chief Minister 
and the Panchendriyas
Vanam Jwala Narasimha Rao

Honorable Chief Minister Telangana State Sri K. Chandrasekhar Rao has embarked upon giving a new definition to the word, “Development.” For him, development would not merely mean just laying roads, constructing bridges, buildings and other such infrastructural activity. Development for the Telangana State CM is an overall change in the living standards of the people in general and those oppressed and depressed classes in particular.

The Telangana state government, ever since it came to power in the new State, has formulated several programs, projects and schemes for the betterment of the people from poor Dalits to others.  Apart from other development and welfare measures, the CM has fixed a five point agenda also as the most important objective of his government for the rest of its tenure. CM firmly believes that this five point agenda will drastically change the living standards of people in Telangana state for better. The five issues have become the Panchendriyas (five important senses) of the Telangana Government.

Distribution of land to the landless Dalits is aimed at empowering the Dalit families who eke out their living on agriculture by giving them three acres of agriculture land. CM KCR has formally launched the scheme on the Independence Day on August 15 at the state level celebrations held at the historic Golconda Fort. The same day, in the districts, ministers have launched the scheme and distributed pattas to the Dalits.

In the first phase of the program, 423 people have received about 1141.60 acres of land. Under the program, the state government is providing all the necessary help to the beneficiary, from providing inputs and infrastructure facilities, extending extension services to helping in getting the required funds.

The Telangana Drinking Water Grid is another, first of its kind project in the country, under which drinking water will be provided to each and every household in the next five years.  It is calculated that about 50 TMC of water is needed for Hyderabad and 80 TMC for rest of the state. The proposed cost of the project is Rs 25,000 crores.

Reviving and restoring lakes and other natural water bodies is yet another important program of the Telangana Government. Unless the lakes and water tanks are revived, the Telangana state is not in a position to utilize about 265 TMC of water from Krishna, Godavari Rivers under minor irrigation. There are about 45,000 tanks in the Telangana state. Efforts are on to remove all the encroachments of the tanks. The state government is planning to invite people’s participation in a big way to restore the water bodies.

To increase the forest cover in the state which is at about 25 per cent, the state government is planning to plant 250 crores saplings in the next three years.  Named as Haritha Haram, the program will be monitored by the forest department which is the nodal agency. People are also encouraged to participate in the program.

The fifth on the top most agenda of CM is providing a two bed Room House to the weaker sections. The state government has already ordered a CBCID investigation into large scale irregularities that took place in the weaker sections housing under the united AP Government.  CM has announced that a two bed room house will be built with a cost of Rs three lakh each for the weaker sections and the government would bear all the expenses.


Friday, October 10, 2014

ఐదు దశాబ్దాల క్రితం హైదరాబాద్ న్యూ సైన్స్ కళాశాలతో అనుబంధం:వనం జ్వాలా నరసింహారావు

ఐదు దశాబ్దాల క్రితం హైదరాబాద్ 
న్యూ సైన్స్ కళాశాలతో అనుబంధం
వనం జ్వాలా నరసింహారావు

1964 జూన్ నెలలో న్యూ సైన్స్ కాలేజీలో బిఎస్సీ డిగ్రీ రెండో సంవత్సరంలో చేరాను. అప్పటికే ఫస్ట్ ఇయర్ లో చేరిన వారి సంఖ్య 150 దాటింది. నా రోల్ నంబర్ "150 X" గా కేటాయించారు. ఎప్పుడూ, సందడిగా, సరదాగా, గలగలా పారే సెలయేరులా వుండేది మా క్లాస్. బయటేమో ఎప్పుడూ..ఏదో ఒక నిర్మాణం జరుగుతుండేది మా కాలేజీలో. కాలేజీకి వున్న మంచి పేరు వల్ల, విద్యార్థుల తాకిడి బాగా వుండేది. అంత మందిని చేర్చుకోవాలంటే, అధిక సంఖ్యలో క్లాస్ రూమ్‌లు కావాలి. అందుకే, ఎప్పుడూ, ఏదో ఒక భవన విస్తరణ నిర్మాణం జరుగుతుండేది. ఒక విద్యార్థి...పేరు గుర్తుకు రావడం లేదిప్పుడు...(బహుశా మునీర్ కావచ్చు) తన దగ్గర ఎప్పుడూ, ఒక "టిక్-టిక్" ధ్వని చేసే టాయ్ వుంచుకునే వాడు. బహుశా...ఆ రోజుల్లోనే అనుకుంటా "దేవాంతకుడు" అనే సినిమా వచ్చి వుండాలి. అందులో హీరో దాన్ని ఉపయోగించేవాడు. ఎవరూ చూడకుండా దాంతో ధ్వని చేయడం అతడికో హాబీ. "సీటింగ్ అరేంజ్ మెంట్" అని రాసి వుంటే, అందులోంచి "ఎస్" అక్షరం తొలగించి, దాన్ని "ఈటింగ్" అని చేసేవాడు. అతడి అల్లరి అంతా-ఇంతా కాదు.

మరి కొందరి క్లాస్ మేట్స్ పేర్లు కూడా గుర్తుకొస్తున్నాయి. ఖమ్మంలో నాతో పాటు పియుసి చదువుకున్న బాల మౌళి (ఇప్పుడో పెద్ద ఛార్టెడ్ అకౌంటెంట్) ఇక్కడ కూడా క్లాస్ మేట్ అయ్యాడు. రాం ప్రసాద్ (ఆయన భార్య గీత..ఆ తరువాతి కాలంలో నాకు స్నేహితురాలైంది. రాం ప్రసాద్ ఇటీవలే మరణించాడు) మరొక క్లాస్ మేట్. అతడు ఒక ప్రయివేట్ కంపెనీలో పని చేసి రిటైరై బెంగుళూరులో వుండేవాడు. అలానే...రంగ రామానుజం, కుల్ కర్ణి (అతివాద-తీవ్ర వాద భావాల విద్యార్థి), జ్యోతి ప్రసాద్, ఎర్రం రాజు, మల్లికార్జున్, బాబ్జి, సుబ్బా రావు (సీనియర్ సైంటిఫిక్ అధికారిగా పదవీ విరమణ చేశాడు), వి.ఎస్.పి. శాస్త్రి, మల్లాడి వెంకట సుబ్బయ్య, కపాడియా, త్యాగరాజన్, టి. ఆర్. శ్రీనివాసన్ (ప్రస్తుతం షికాగోలో స్థిరపడ్డాడు), ప్రేంచంద్ (అమెరికాలో స్థిరపడ్డాడు)...తదితరులు కూడా నాకు క్లాస్ మేట్సే. నిజాం కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం పూర్తి చేసిన వల్లూరి శ్రీ రాం అనే అతడిని, ప్రిన్సిపాల్ సుదర్శన్ నచ్చ చెప్పి ఫైనల్ ఇయర్ లో మా కాలేజీలో, మా క్లాస్ లో చేర్పించాడు. అతడికి లాంగ్వేజెస్ లో యూనివర్సిటీ ఫస్ట్ రావడంతో, ఫైనల్ డిగ్రీలో కూడ అతడికే రాంక్ వచ్చే అవకాశాలున్నాయని భావించిన సుదర్శన్ గారు అలా చేశారు. ఆయన గెస్ నిజమైంది. డిగ్రీలో అతడికే యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. క్రెడిట్ న్యూ సైన్స్ కాలేజీకి దక్కింది. ఆయన పక్క నంబరైన నేను కనీసం పాసు కూడా కాలేదు! అసలు పరీక్షలే రాయలేదు! ఇంటర్ నెట్‌లో చూస్తే, శ్రీ రాం అమెరికాలో పని చేస్తున్నట్లు అర్థమైంది. ఓ ఏడాది క్రితం హైదరాబాద్ వచ్చి కూతురు పెళ్లి చేసి వెళ్లాడు. ఇంటర్‌నెట్ పుణ్యమా అని మా స్నేహం కొనసాగడంతో, నన్ను కూడా పెళ్లికి ఆహ్వానించడం, నేను హాజరవడం జరిగింది.

లెక్చరర్ల విషయానికొస్తే, బహుశా, అంత నైపుణ్యం కల అధ్యాపకులు, మరే కాలేజీలోను వుండరంటే అతిశయోక్తి కాదేమో! తెలుగు బోధించడానికి ఇద్దరుండేవారు. ఒకరి పేరు "మంజు శ్రీ"...మరొకరి పేరు "అరిపిరాల విశ్వం". మంజుశ్రీ అసలు పేరు డాక్టర్ అక్కిరాజు రమాపతి రావు. మాకు తెలుగు పాఠ్య పుస్తకంగా "ఆంధ్ర మహాభారతోపన్యాసాలు", నాన్-డిటేల్‍గా "పురుషోత్తముడు", నాటకంగా "హాలికుడు" వుండేవి. ఆంధ్ర మహాభారతోపన్యాసాలు లో, ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్న సందర్భంలో ఆయనను ఆక్షేపిస్తూ శిశుపాలుడు పద్య రూపంలో అన్న మాటలు "అవనీ నాధు లనేకు లుండఁగ విశిష్టారాధ్యు లార్యుల్ మహీ దివిజుల్ పూజ్యులు పల్వు రుండఁగ ధరిత్రీనాథ! గాంగేయుదుర్వ్యవసాయంబునఁ గృష్ణు గష్టచరితున్ వార్ష్ణేయు బూజించి నీ యవివేకం బెఱిఁగించి తిందఱకు దాశార్హుండు పూజార్హుఁడే" ఇంకా గుర్తున్నాయి. పద్య భాగం పుస్తకం పేరు గుర్తుకు రావడం లేదు కాని ఒక పాఠం..."గంగావతరణం" ఇంకా గుర్తుంది. అందులోని ఒక పద్యం...."ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సుశ్లోకంబైన హిమాద్రినుండి భువి, భూలోకమునందుండి యస్తోకాంభోధి, పయోధినుండి పవనాంధోలోకమున్ చేరె గంగా కూలంకష, పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్".....కొంచెం..కొంచెం గుర్తుకొస్తోంది. అరిపిరాల విశ్వం గారి తమ్ముడు రామ్మోహన రావు కూడా నా క్లాస్ మేట్.

ఇంగ్లీష్ లెక్చరర్లుగా "షమీం" మేడం, "వి. వి. చారి" గారుండేవారు. మరో ఇద్దరి పేర్లు...వై. ఆర్. అయ్యంగార్, కుమారి శ్యామల. పాఠ్య పుస్తకం-వాచకంగా ఇ.ఎఫ్. డాడ్ సంపాదకీయంలోని వ్యాసాల సంకలనం వుండేది. . జి. గార్డినర్ రాసిన వ్యాసం ఒకటుంది. . ఎం. ఫార్ స్టర్ రాసిన "పాసేజ్ టు ఇండియా" నాన్-డిటేల్ గా వుండేది. ఫార్ స్టర్ ఆ పుస్తకాన్ని 1924 లో భారత దేశంలో ఆంగ్లేయుల పాలన-1920 నాటి స్వాతంత్ర్య పోరాటం నేపధ్యంలో రాశారు. ప్రపంచంలోని వంద అత్యుత్తమైన ఇంగ్లీష్ లిటరేచర్ పుస్తకాలలో ఒకటిగా పాసేజ్ టు ఇండియాను "మాడరన్ లైబ్రరీ" ఎంపిక చేసింది. 1923-2005 మధ్య కాలంలో వచ్చిన అత్యుత్తమైన వంద ఇంగ్లీష్ నవలలో ఒకటిగా ఈ పుస్తకాన్ని "టైం మాగజైన్" ఎంపిక చేసింది. నవల మొత్తం కేవలం నాలుగు పాత్రల చుట్టూ తిరుగుతుంది. డాక్టర్ అజీజ్, ఆయన బ్రిటీష్ స్నేహితుడు సిరిల్ ఫీల్డింగ్, శ్రీమతి మూర్, కుమారి అడెలా క్వెస్టెడ్. ఇంగ్లీష్ పోయెట్రీలో కొన్ని పాఠాలు గుర్తున్నాయి. జార్జ్ హెర్బర్ట్ రాసిన "Virtue" (సద్గుణం, సత్ ప్రవర్తన) లో చక్కటి నీతి వుంది. ప్రపంచం మొత్తం కాల గర్భంలో కలిసి పోయినా మనిషి సత్ ప్రవర్తన, సద్గుణం అజరామరంగా వుంటుందని దాని భావన ("Only a sweet and virtuous soul, Like seasoned timber, never gives; But though the whole world turn to coal. Then chiefly lives"). మరో పోయెం 1608-1674 మధ్య కాలంలో జీవించిన "జాన్ మిల్టన్" రాసిన "పారడైజ్ లాస్ట్". ఆయనే రాసిన మరో పోయెం "ఆన్ హిజ్ బ్లయిండ్ నెస్". ఇంకో పోయెం కూడా గుర్తుంది. అది "విలియం వర్డ్ స్‌ వర్త్" రాసిన "సాలిటరీ రీపర్" (...."Alone she cuts and binds the grain, And sings a melancholy strain..."). జనరల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ను నాందేడ్కర్, సుబ్రహ్మణ్యం సార్లు చెప్పేవారు. చాలా ఇంటరెస్టింగ్ గా వుండేదా క్లాస్.


ఆప్షనల్ సబ్జెక్టులైన లెక్కలు, భౌతిక, రసాయన శాస్త్రాలు చెప్పే లెక్చరర్లు ఆయా విషయాలను అత్యంత ఆసక్తికరంగా బోధించే వారు. లెక్కల సబ్జెక్టులో మేం ఫైనల్ ఇయర్ పరీక్షల్లో మూడు పేపర్లు రాయాలి. ఒకటి "బీజ గణితం", రెండోది "రేఖా గణితం", మూడోది "త్రికోణమితి". రేఖా గణితం పుస్తకం "మాణిక్య వాచికం పిళ్లే" రాసిన దాన్ని ఉపయోగించే వాళ్లం. బీజ గణితాన్ని "షఫీ ఉల్ హక్", రేఖా గణితాన్ని "భాస్కర రావు", త్రికోణమితిని డాక్టర్ కుప్పుస్వామి బోధించేవారు. నాకు మొదటి నుంచి లెక్కల సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టంగా వుండేది. పరీక్ష రాసిన ప్రతి సారీ ఆ ఒక్క సబ్జెక్ట్ పాసయ్యేవాడిని మంచి మార్కులతో. మిగతావి (భౌతిక, రసాయన శాస్త్రాలు) రాయడానికే భయం వేసేది. భౌతిక శాస్త్రాన్ని "హరి లక్ష్మీపతి", "ప్రభాకర్" బోధించేవారు. భౌతిక శాస్త్రంలో "మాడరన్ ఫిజిక్స్" అనే నాలుగో పేపర్ కూడా వుండేది. డిమాన్ స్ట్రేటర్‌గా పి. వి. వి. ఎస్. మూర్తి మాతో ప్రయోగశాలలో ప్రాక్టికల్స్ చేయించేవారు. వాటిల్లో "వెలాసిటీ ఆఫ్ సౌండ్", "వర్నియర్ కాలి పర్స్", "స్క్రూ గేజ్"", ఫిజికల్ బాలెన్స్" లతో చేసిన ప్రయోగాలింకా గుర్తున్నాయి. అదే విధంగా రసాయన శాస్త్రం ప్రయోగాలను "రఘురాం" గారు చేయించేవారు. "వాల్యూ మెట్రిక్ అనాలసిస్", "పిప్పెట్, బ్యూరెట్ట్" ఉపయోగించడం తో పాటు "కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు" తయారు చేయించడం చేసే వాళ్లం. రసాయన శాస్త్రం థియరీలో మూడు భాగాలుండేవి. "ఆర్గానిక్", "ఇన్-ఆర్గానిక్", "ఫిజికల్" అనే ఆ మూడింటిని ముగ్గురు లెక్చరర్లు బోధించేవారు. "వై. సూర్యనారాయణ మూర్తి" ఆర్గానిక్ సబ్జెక్టు చెప్పేవారు. ఇప్పటికీ ఆయన బోర్డు మీద వేసిన "బెంజిన్ రింగ్" కళ్లలో మెదులుతుంది. ఇన్-ఆర్గానిక్ అంశాన్ని ప్రిన్సిపాల్ సుదర్శన్ గారు చెప్పేవారు. ఫిజికల్ కెమిస్ట్రీని కూడా వై.ఎస్.ఎన్ గారు చెప్పినట్లు గుర్తు. సర్కార్ అండ్ రక్షిత్ రాసిన ఆర్గానిక్ కెమిస్ట్రీ పుస్తకాన్ని, బాల్ అండ్ తులి రాసిన ఇన్-ఆర్గానిక్ కెమిస్ట్రీ పుస్తకాన్ని చదివే వాళ్లం. లైబ్రరీకి అడపదడప పోయే వాళ్లం. లైబ్రేరియన్‍గా పుల్లయ్య పని చేసేవాడు. తరువాత రోజుల్లో (1973-1974) ఉస్మానియా యూనివర్సిటీలో నేను లైబ్రరీ సైన్స్ లో డిగ్రీ చేసేటప్పుడు, అతడు కూడా నాతోపాటు చదివాడు.

కాలేజీ చదువుతో పాటు క్రికెట్ ఆటకు క్రమం తప్పకుండా పోవడం కూడా అలవాటు చేసుకున్నాను. బర్కత్ పూరా సమీపంలోని ఆంధ్ర యువతీ మండలి మైదానంలో క్రికెట్ ప్రాక్టీసుకు వెళ్లేవాడిని. "జాలీ రోవర్స్ క్రికెట్ క్లబ్" ఆ రోజుల్లో హైదరాబాద్ "బి-లీగ్" మాచ్‍లు ఆడుతుండేది. నేను ఆ క్లబ్ పక్షాన ఆడేవాడిని. అంతగా ఆటలో రాణించక పోయినా ప్రాక్టీసు మానక పోయేవాడిని. నేను ప్రాక్టీసు చేస్తున్న రోజుల్లో ఆడిన పెద్ద క్రికెట్ క్రీడాకారుల్లో "అబ్దుల్ హాయ్", "సాయినాథ్", "ప్లహ్లాద్" వున్నారు. దరిమిలా వాళ్లంతా రంజీ ట్రోఫీ స్థాయి వరకు ఎదిగారు. నేను హైదరాబాద్‌లో ఆడడంతో, శెలవులకు ఖమ్మం వెళ్లినప్పుడు నాకు అదో రకమైన గౌరవం లభించేది. ఖమ్మం మామిళ్లగూడెం క్రికెట్ క్లబ్ పక్షాన టోర్నమెంటులకు వెల్లే జట్టులో నేనుండే వాడిని. ఖమ్మంలో వనం రంగారావు, నర్సింగరావు, శేషగిరి, మూర్తి, దిలీప్, శంకర్, దివాకర్, ప్లహ్లాద్, కళాధర్, రాధాకృష్ణ...లాంటి వారితో కలిసి ఆడాను.

నేను హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతున్నప్పుడే (చనిపోయిన) వనం రంగారావు (నర్సింగరావు తమ్ముడు) ఉస్మానియా బి-హాస్టల్ లో వుంటూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టుతో ఎం. ఏ చదువుతుండేవాడు. ఆయనను కలవడానికి తరచుగా యూనివర్సిటీ కాంపస్‌కు వెల్లే వాళ్లం. అక్కడ ఆయన ద్వారా పరిచయమైన ఆయన స్నేహితులలో ప్రొఫెసర్ హరగోపాల్ ఒకరు. సోషాలజీ డిపార్టుమెంటులో పని చేస్తున్న ప్రొఫెసర్ రాఘవేంద్ర రావు కూడా అలానే పరిచయమయ్యారు. రంగారావు మరో క్లాస్ మేట్ వాసిరెడ్డి శివలింగ ప్రసాద్ (ఇందిరా గాంధి సార్వత్రిక విశ్వ విద్యాలయం ప్రొ-ఛాన్సలర్ గా పదవీ విరమణ చేశారు) కూడా అప్పుడే పరిచయం. రంగారావు కంటే ఒక ఏడాది జూనియర్ ఐన డాక్టర్ శ్రీధర్ రెడ్డి (ప్రముఖ కాంగ్రెస్ నాయకుడిప్పుడు-తెలంగాణ ప్రజా సమితి ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించాడు) కూడా అప్పుడే పరిచయం అయ్యాడు. శ్రీధర్ రెడ్డి విద్యార్థి నాయకుడు కూడా. యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీకి, యూనివర్సిటీకి విద్యార్థి సంఘ అధ్యక్షుడుగా కూడా ఆ రోజుల్లో ఎన్నికయ్యాడు. నాకంటే ఒక సంవత్సరం సీనియర్. వీరే కాకుండా రంగారావు కంటే ఒక ఏడాది సీనియర్ ఐన బొమ్మకంటి శంకర్ రావు (పాత తరం ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు బొమ్మకంటి సత్యనారాయణ రావు గారి కుమారుడు) కూడా కామన్ స్నేహితుల ద్వారా పరిచయం అయ్యారు. శంకర్ రావు ఐ. పి.ఎస్. అధికారిగా సీనియర్ పొజీషన్ లో రిటైర్ అయ్యారు. బొమ్మకంటి గారి తోడల్లుడు, ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు కె. ఎల్. నరసింహా రావు గారు బావ మరిది నేదునూరి దుర్గా ప్రసాద్ (వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పని చేసేవారు) కూడా అలానే వూటుకూరు వరప్రసాద్ ద్వారా ఆ రోజుల్లో పరిచయం అయ్యారు. మేం (నేను, రూమ్మేట్ రమణ, వనం రంగారావు) బాగా స్నేహం చేసిన వారిలో సిటీ కాలేజీలో పని చేస్తున్న సోమేశ్వర రావు గారు కూడా వున్నారు. ఆయన ఖమ్మం కాలేజీలో కెమిస్ట్రీ డిమాన్ స్ట్రేటర్ గా పని చేసి బదిలీపైన హైదరాబాద్ సిటీ కాలేజీకి వచ్చారు. అక్కడ పని చేస్తూ ఆ తరువాత కాలంలో ఎం. (పొలిటికల్ సైన్స్) పట్టా పుచ్చుకున్నారు. సిటీ కాలేజీలోనే కెమిస్ట్రీ లెక్చరర్‌గా పని చేసే పరిమళ గారితో సోమేశ్వర రావు గారి పరిచయం ప్రేమ వరకూ-పెళ్లి చేసుకునే వరకూ పోయింది. ఐతే, పెద్దల నుంచి అంతగా సానుకూలత రాకపోవడంతో, మేమే పెళ్లి పెద్దలమై, యాదగిరిగుట్టలో వారి పెళ్లి జరిపించాం. పరిమళా సోమేశ్వర్ గారు ప్రముఖ తెలుగు నవలా రచయిత్రి. వారందరితో నా దూరపు స్నేహం ఇంకా కొనసాగుతూనే వుంది.

ఇక్కడ వనం రంగారావు గురించి కొంత చెప్పుకోవాలి. మా పక్క గ్రామం కమలాపురం ఆయనది. నాకు వరసకు బాబాయి అవుతాడు. వయసులో రెండు-మూడేళ్లు పెద్ద. నేను ఖమ్మంలో పియుసిలో చేరిన సంవత్సరం రంగారావు బి. . రెండో సంవత్సరం చదువుతుండేవాడు. బి.. ఫైనల్ ఇయర్‌లో వున్నప్పుడు ఎస్. ఆర్. అండ్. బి. జి. ఎన్. ఆర్ కాలేజీ మాగజైన్‍కు ఎడిటర్‌గా కూడా ఎంపికయ్యాడు. నేను హైదరాబాద్ న్యూ సైన్స్ కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చేరినప్పుడు, ఆయన ఎం. ఏ లో చేరాడు. రెండేళ్ల తరువాత ఎం. ఏ ఫస్ట్ క్లాస్‍లో పాసై, సివిల్స్ పరీక్షలకు తయారవుండేవాడు. నా రూమ్మేట్ రమణకు చాలా దగ్గర బంధువు. శెలవుల్లో (1967) ఒకసారి రమణ వూరు కల్మలచెర్వుకు వెళ్లాడు. అక్కడ ఒకనాడు పొలంలో నడుస్తున్నప్పుడు చిన్న దుంప గుచ్చుకుంది. కొద్ది రోజులకు అది చిన్న పుండుగా మారింది. దానికి వైద్యం చేయించుకునేందుకు డాక్టర్ దగ్గరకు వెళ్తే పెన్సిలిన్ ఇంజక్షన్ ఇచ్చాడు. ఇంజక్షన్ ఇచ్చిన చోట పెద్ద పుండై, రణంగా మారి, హఠాత్తుగా "టెటనస్" వ్యాధికి దారితీసింది. ఖమ్మం యలమంచిలి రాధా కృష్ణమూర్తి ఆసుపత్రిలో చేర్పించడం, చనిపోవడం ఒకే రోజు జరిగిపోయాయి. అప్పటికే రంగారావుకు వివాహం ఐంది కాని కాపురం మొదలెట్టలేదు. మా సమీప గ్రామం బాణాపురం వాస్తవ్యుడు, ఖమ్మంలో మా ఇంటి పక్కనే వుండే గండ్లూరి నారాయణ రావు గారి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఉజ్వలమైన భవిష్యత్ వున్న ఒక వ్యక్తి అలా అకాల మరణం చెందాడు.   

నేను డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో వున్నప్పుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుల మధ్య, ఉపకులపతి (వైస్ ఛాన్స్ లర్) డి. ఎస్. రెడ్డి వ్యవహారంలో బాగా గొడవలు జరిగాయి. ఒక గ్రూపుకు నేటి కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి, కె. కేశవరావు (ఒక నాటి ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు...ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి, రాజ్య సభ సభ్యుడు)  మార్గదర్శకత్వం వహించగా, మరొక గ్రూపుకు నాటి విద్యార్థి నాయకులు ఎం. శ్రీధర్ రెడ్డి, పుల్లారెడ్డి, (జన సంఘ్) నారాయణ దాస్, కమ్యూనిస్టు పార్టీ అనుబంధ విద్యార్థి సంఘ నాయకులు నాయకత్వం వహించారు. 1966 లో, నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, 1957 నుంచి ఉపకులపతిగా పని చేస్తున్న  డి. ఎస్. రెడ్డిని పదవి నుంచి తప్పించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో గుంటూరు కాలేజీ ప్రిన్సిపాల్ (పేరు గుర్తుకు రావడం లేదు) ను నియమించడం కూడా జరిగింది. ఆయన ఛార్జ్ తీసుకోవడానికి రావడం, విద్యార్థుల ఆందోళన మధ్య వెనక్కు తిరిగిపోవడం నా కింకా గుర్తుంది. బ్రహ్మానందరెడ్డి తీసుకున్న చర్యకు మద్దతుగా జైపాల్ రెడ్డి, కేశవరావులు ఉద్యమించగా, వ్యతిరేకంగా విద్యార్థి నాయకులు ఉద్యమించారు. ఇంతకు, డి. ఎస్. రెడ్డి చేసిన తప్పేంటి అంటే...ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి కావాలని ప్రతిపాదించడమే! అది నచ్చని బ్రహ్మానందరెడ్డి ఉపకులపతిని తొలగించడానికి చట్టాన్ని సవరించే ప్రయత్నం కూడా చేశాడు. డి.ఎస్. రెడ్డి హైకోర్టుకు, సుప్రీం కోర్టుకు న్యాయం కోసం వెళ్లాడు. చివరికి కోర్టులో ఆయన పక్షానే తీర్పు వచ్చింది. 1969 వరకు ఆయనే వైస్ ఛాన్స్ లర్‍గా కొనసాగారు. 1968 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి అంకురార్పణ  జరుగుతున్నప్పుడు ఆయనే వైస్ ఛాన్స్ లర్‍. ఉద్యమం వూపందుకునే సరికి రావాడ సత్యనారాయణ ఆయన స్థానంలో వచ్చారు. వైస్ ఛాన్స్ లర్‍గా డి.ఎస్. రెడ్డి కొనసాగించాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చిన నేపధ్యంలో, డిగ్రీ విద్యార్థులకు పరీక్షల్లో "గ్రేస్ మార్కులు" ప్రకటించింది యూనివర్సిటీ. నేను పరీక్ష రాయకపోయినా, కేవలం హాజరైనందుకు నాకు అన్ని సబ్జెక్టుల్లో 15 మార్కులొచ్చాయి!     

నా డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు మార్చ్-ఏప్రిల్ 1966 లో జరిగాయి. నేను లెక్కల పేపర్ రాసిన తరువాత మంచి మార్కులు రావని భావించి, మిగతా పేపర్‌లకు కేవలం హాజరవడం (పరీక్ష పేపర్లు తెచ్చుకోవడానికి) తప్ప రాయలేదు. ఫలితాలు ఊహించినట్లే ఫెయిలయ్యాను. కాకపోతే రాసిన ఒక్క లెక్కల సబ్జెక్టులో పాసయ్యాను. ఆ తరువాత సప్లిమెంటరీ పరీక్షలు రాయలేదు. మళ్లీ హైదరాబాద్‌లో చిక్కడపల్లిలో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని రమణ, నేను మరో స్నేహితుడు వుండేవాళ్లం. ఐతే, నేను ఎక్కువగా మా వూళ్లోనే వుంటూ, మధ్య-మధ్య వచ్చి పోతుండేవాడిని. గ్రామ రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించేవాడిని. చిక్కడపల్లిలో వుండే రోజుల్లోనే, సమీపంలో, ఒక మేడపైన, వూటుకూరు అనంత రామారావు, సూర్య ప్రకాశరావు వుంటుండేవారు. వాళ్లిద్దరూ ఉద్యోగాలు చేస్తుండేవారు. వారితో పాటు రావులపాటి సీతారాం రావు కూడా వుండేవారు. మేమంతా తరచుగా కలుస్తుండేవాళ్లం. అనంత రామారావు పేరుకు ఇంజనీరైనా, జనరల్ విషయాలను-వర్తమాన రాజకీయాలను, చాలా చక్కగా విడమర్చి మాట్లాడుతుండేవాడు. ప్రస్తుతం అనంత రామారావు అమెరికాలోని షికాగోలో స్థిరపడ్డారు. మధ్య మధ్య హైదరాబాద్ వచ్చి స్నేహితులతో బంధువులతో కాలక్షేపం చేసి పోతుంటారు. సీతారాం రావు సీనియర్ పోలీసు (. పి.ఎస్) అధికారిగా పదవీ విరమణ చేశారు. నేను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పని చేస్తున్నప్పుడు, సీతారాం రావు అక్కడ తన చివరి పోస్టింగ్ చేశారు. అదనపు డైరెక్టర్ జనరల్‌గా పదవీ విరమణ అక్కడే చేశారు.

మొత్తం మీద రెండు-మూడు ప్రయత్నాల తరువాత, మార్చ్ 1968 లో లెక్కలు, భౌతిక శాస్త్రం, సెప్టెంబర్ 1968 లో రసాయన శాస్త్రం కంపార్ట్ మెంటల్ గా డిగ్రీ పాసయ్యాను. అలా నా హైదరాబాద్ చదువు-నివాసం ప్రధమ ఘట్టం పూర్తయింది. End


Tuesday, October 7, 2014

"ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు" పుస్తకానికి రాళ్లబండ కవితా ప్రసాద్ పీఠిక : ఈ గ్రంథం - ఛందః ప్రయోగ మందిరం

ఈ గ్రంథం - ఛందః ప్రయోగ మందిరం
రాళ్లబండి కవితా ప్రసాద్

          "శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము, కల్పము, నిరుక్తము"...ఈ ఆరు షట్ శాస్త్రాలు. ఇవి అధ్యయనం చేసిన వాడే పండితుడు.
          ఈ రోజుల్లో "సి, సి-ప్లస్, ఒరాకిల్, జావా, శాఫ్, డాట్ నెట్, హ డూప్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్...." ఇవి శాస్త్రాలు. ఇవి నేర్చిన వాడే మేధావి! పండితుడు! ప్రయోజకుడు!
          ఇవి మాత్రమే నేర్చుకునే జాతికి షట్ శాస్త్రాలు ఉపయోగం లేనివి అని భావన. ఎంత దురదృష్టం! వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, కావ్యాలు, ప్రబంధాలు, శాస్త్రాలు....అన్నీ సృష్టించుకుని, నేర్పి, నేర్చుకుని, ఒక సజీవ  మహా నాగరికతను నిర్మించుకున్న భారత జాతి ఇప్పుడు ప్రాణ రహితమైన నిర్జీవ విద్యలు నేర్చుకుని యంత్రాలుగా మారిపోవడం ఎంత విచిత్రం!
          ఇక యాంత్రిక సంస్కృతి - సజీవ సంస్కృతిని ఎంత చావు దెబ్బ తీస్తుంది!
          గతం నిర్మించిన మహా సాంస్కృతిక సౌధం కుప్ప కూలిపోతుంటే, కనీసం ఆ దృశ్యాలు చూడడం గానీ, శబ్దాలు వినడం గానీ, కూడా చేయలేని ఒక జాతిలో సభ్యులమై ఉన్నాం.
          అదలా ఉంచితే, షట్ శాస్త్రాలలో "ఛందస్సు" వేదాలను నడిపించేది. "ఛందౌపాదౌతు వేదశ్చ" అని శాస్త్రం. శరీరానికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలాంటివో వాజ్మయ శరీరానికి గురు-లఘువులు అలాంటివి. చాలా సందర్భాలలో ఛందో రహితమైన కావ్య శరీరం శ్వాసించదు. పాఠకులను శాసించదు.
          ఛందస్సు ప్రాచీన మానవ పరిణిత మేధా సృష్టి!
          ఛందశ్శాస్త్రానికి ఒక గురు పరంపర ఉంది. "లయ" కారకుడైన మహాశివుడు ఆది శాస్త్రజ్ఞుడు. ఆయన బృహస్పతికి - గుహునికి చెప్పాడు. బృహస్పతి - ఇంద్రునికి, ఇంద్రుడు - శుక్రునికి, శుక్రుడు - మాండవ్యునికి, మాండవ్యుడు - సైతవునికి, సైతవుడు - యాస్కునికి, యాస్కుడు - పింగళునికి, పింగళుడు - గరుత్మంతునికి, ఛందస్సు బోధించినట్లు ఒక గురు పరంపర!
          ఇక గుహుని ద్వారా సనత్కుమారుడు, సనత్కుమారుని ద్వారా మళ్లీ బృహస్పతి, ఇంద్రుడు, వారి నుండి మళ్లీ పతంజలి, పతంజలి నుండి పింగళుడు, తద్వారా గరుత్మంతుడు...ఇదొక పరంపర!
          ఇలాంటి 30 రకాల ఛందో గురుపరంపరలున్నాయి!
          ఈ విషయమంతా "యుధిష్టిరమీమాంస" లో ఉన్నాయి. ఎంతో మేథా మథనం జరిగింతర్వాత పింగళుని దగ్గర సర్వ ఛందశ్శాస్త్రం నిక్షిప్తమైందని తెలుస్తోంది.
          మన దురదృష్టమేమంటే, పైన చెప్పిన గురుపరంపరలోని ఏ ఛందశ్శాస్త్రమూ మనకు మిగల్లేదు! ఒక్క పింగళుని ఛందశ్శాస్త్రం తప్ప! అదీ పాక్షికంగానే!
          పింగళుని కాల నిర్ణయం చాలా సందిగ్ధం. ఖచ్చితంగా క్రీస్తుకు పూర్వం వాడని కాదు. క్రీ. శ. 7 లేక 8 శతాబ్దాలవాడని చర్చ. ఎంత ముందుకు లాగినా క్రీ. శ. 800 నాటి వాడనే అందరూ ఒప్పుకున్నారు.
          పింగళుని ఛందశ్శాస్త్రాన్ని క్రీ. శ. 1150 లో ప్రఖ్యాత భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు భాస్కరాచార్య తన గ్రంధంలో ఐదవ విభాగం నాల్గవ అధ్యాయంలో ఉపయోగించుకుని ద్విపద సిద్ధాంతం (Binomial Theory) చేశాడు. ఆ తర్వాత క్రీ. శ. 1303 లో చైనా వాళ్లకు చేరింది. క్రీ. శ. 1650 కి గాని పాస్కల్ కు చేరలేదు. ఆ తర్వాత ఆయన్నే తలకెత్తుకుని మోస్తున్నాం!
          వేల యేండ్ల చరిత్ర గల ఛందశ్శాస్త్రం ఈనాడు సుప్త చేతనావస్త (Hibernation) లో ఉంది. దీన్ని వెలికి తీసి ప్రచారం చెయ్యక పోవడం దేశ ద్రోహం కన్నా పెద్ద నేరం!


          ***           ***         ***       ****       ****      ****    ***   ***  
          కావ్య భవనానికి ఛందశ్శాస్త్రం "ఆర్కిటెక్చర్" లాంటిది. ఆ శాస్త్రం తెలిసి రచించిన కావ్యానికి, తెలియక రచించిన కావ్యానికి హస్తిమశకాంతరం ఉంటుంది.
          ఋషి కాని వాడు కవి కాలేడు. "నా నృషిః కురుతే కావ్యం" అని అందరికి తెలిసిందే.
          "ఋషి" అంటే గడ్డాలు పెంచుకుని తపస్సు చేసుకునే వృద్ధుడు కాడు. ఋషి ఒక "ఆధ్యాత్మిక సాప్ట్ వేర్ శాస్త్రవేత్త" లాంటి వాడు! అతనికి మహాదర్శన శక్తి ఉంటుంది. వాల్మీకి ఒక మహర్షి! మహా కవి! కవిత్వము, ఛందస్సు ఏక కాలంలో స్పురించింతర్వాత కవిత్వం అందులోకి ప్రవేశిస్తుందా? అనేది ఒక చర్చ.
          మహా కవులకు కవిత్వం ముందుగా దర్శనమిస్తుంది. అదే ఛందస్సులో ప్రవేశిస్తుంది.
          మామూలు కవులు ముందుగా ఛందస్సును వేసుకుని దాని కింద అక్షరాలు, పదాలు పేరుస్తూ, వారివారి అదృష్టం మేరకు కవిత్వం అందులోకి ప్రవేశిస్తుంది.
          అందుకే, కవి ఛందశ్శాస్త్రవేత్తగా మారితే మహా కావ్యాలు సృష్టిస్తాడు. ఛందశ్శాస్త్రవేత్త కవిగా మారితే పద్య కవిగా మిగుల్తాడు.
          వాల్మీకి మహర్షి! మహా కవి!
          ఈ నేపధ్యంలో తెలుగు సాహిత్యాన్ని పవిత్రం చేసిన మరో మహర్షి, మహా కవి, ఆంధ్ర వాల్మీకి శ్రీ వావిలికొలను సుబ్బారావు (వాసు దాసు) గారు.
          ఆయన రచించిన శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం మహాకావ్యం "మందరం".
          వాల్మీకి 24000 శ్లోకాలలో రామాయణం రచిస్తే, ఆంధ్ర వాల్మీకి  24000 పైచిలుకు తెలుగు పద్యాలలో రచించారు ఆంధ్ర వాల్మీకాన్ని.
          నాటి వాల్మీకికి అనుష్టుప్ ఛందం అలవోకగా పలికితే, నేటి ఆంధ్ర వాల్మీకికి అనంతమైన ఛందస్సులు అద్భుతంగా దర్శనమిచ్చాయి.
          ఛందశ్శాస్త్రంలో విశేష ఛందస్సులు కూడా సువర్ణ సజీవ పద్య విగ్రహ మూర్తులుగా రూపుదిద్దుకున్నాయి. "మందరం" లో వైదిక ఛందస్సులు ఏడింటిని కలుపుకుని లౌకిక ఛందస్సులు 26 ప్రచలితంగా ఉన్నాయి. ఛందశ్శాస్త్రంలో 13 కోట్ల 42 లక్షల 17 వేల 726 వృత్తాలున్నాయి. ఇవికాక అర్ధ, సమ, విషమ బేధాల ప్రకారం లెక్క తీస్తే అనంతం! ఇన్ని కోట్లలో ఇప్పటివరకు కవులు వాడిన వృత్తాల సంఖ్య 700 కు మించవు. వీటిల్లో సంస్కృత కవులు వాడినవి వందకు మించవు. తెలుగు కవులు వాడినవే ఎక్కువ.
          అందరికీ తెలిసిన ఉత్పల, చంపక, మత్తేభ, శార్దూలం, మత్తకోకిల, పంచ చామరం....మొదలైనవి. ఇవి కాక కందం, తేటగీతి, ఆటవెలది, సీసం, మధ్యాక్కర వంటి జాతి, ఉపజాతి వృత్తాలు 26 ఛందస్సులు దాటినవి. (అంటే పాదానికి ఇరవై ఆరు అక్షరాలు దాటిన) ఉద్దురు మాలా వృత్తాలు, లయగ్రాహి, లయవిభాతి మొదలగునవి ఎన్నో ఉన్నాయి.
          ఇన్ని కోట్ల వృత్తాలలో ఏ వృత్తం, ఏ కవిని, ఏ రీతిగా అనుగ్రహిస్తుందనేది ఒక మహా రహస్యం.
          26 ఛందస్సుల పేర్లే చిత్రం. ఉక్త, అత్యుక్త, మధ్య, ప్రతిష్ట, సుప్రతిష్ట, గాయత్రి, ఉష్ణిక్కు, అనుష్టుప్పు, బృహతి, పంక్తి, త్రిష్టుప్పు, జగతి, అతిర్ గతి, శక్వం, అతి శక్వం, అష్టి, అత్యష్టి, ధృతి, అతి ధృతి, కృతి, ప్రకృతి, ఆకృతి, ఎకృతి, సంకృతి, అధికృతి, ఉత్కృతి.....వీటికి పేర్లు ఎవరు పెట్టారు? వీటితో ఉత్పన్నమైన 13 కోట్ల పైచిలుకు వృత్తాలకు ఎవరు పేరు పెడతారు? ఎలా పెట్టాలి? అనేది ఒక మహా చర్చ!
          ఉదాహరణకు "ఉష్ణిక్కు" అంటే, తలపాగా అని అర్థం. ఆ పేరు ఎందుకు వచ్చింది? ఇది ఏడవ ఛందస్సు. " ఉష్ణిక్ ఉత్ స్నాతా భవతి - ఉత్ స్నాతా - గాయత్రితః, చతుర్బిరక్షరైః ఉద్యేష్టితా ఇవ - ఉష్ణీషిణీవా ఇత్యాపమకమ్, అధవా ఉష్ణీషిణీ ఉష్ణిషవతీ - ఇవ ఇల్యాపమకం. ఉపమా నిబంధనం నామ".
          అంటే, గాయత్రి యొక్క మూడు పాదాల మీద నాలుగు అక్షరాలు తలపాగా లాగా ఉంటుంది కనుక గాయత్రి తర్వాత వచ్చే ఈ ఛందస్సుకు ఉష్ణిక్కు అని పేరు వచ్చిందట. చక్కని ఊహ!
          ఈ విషయం నిరుక్తంలో ప్రతిపాదించారు. అంటే ఛందస్సులకు పేర్లెలా వస్తాయి అన్నది అతి ప్రాచీనతమమైన చర్చ.
          కుమార సంభవం కావ్యంలో కాళిదాస మహాకవి రతీ విలాపంలో "వియోగిని" వృత్తంతో రచించారు.
          కల్పవృక్షంలో సాగరులు భూమిని త్రవ్వే సందర్భంలో విశ్వనాథవారు "మేదిని" వృత్తంతో రచించారు. అదొక నామౌచిత్యం. పద్యాల పేర్లు కూడా ఒకే ఛందస్సుతో వేర్వేరు పేర్లు ఛందశ్శాస్త్రవేత్తలు సూచించారు.
          పింగళుడు సూచించిన "కుసుమతలతావేల్లిత" వృత్తాన్ని భరతుడు చిత్రలేఖ అన్నాడు.
అలాగే "తరలము" వృత్తానికి ధృవ కోకిల అనే పేరు కూడా ఉంది. నిజానికి మత్త కోకిల, ధృవ కోకిల అక్కా చెల్లెళ్లు....ఉత్పల-చంపకాల్లా, మత్తేభ-శార్ధూలాల్లా, మానిని-కవిరాజవిరాజితాల్లా!
ఇంత ఉపోద్ఘాతమెందుకంటే, "మందరం" లోని ఛందః ప్రయోగాలపై ఒక మహోన్నత పరిశోధనా గ్రంథాన్ని మీరు చదవబోతున్నారు. దీని కర్త ప్రఖ్యాత పాత్రికేయులు, జగమెరిగిన అధికారి, సాహితీవేత్త శ్రీ వనం జ్వాలా నరసింహారావు గారు.
          ఈ గ్రంథ రచన ఒక తపస్సులా చేశారు శ్రీ వనం జ్వాలా నరసింహారావు. ఎన్నెన్నో గ్రంథాలు చూశారు. సునిశితంగా ఛందస్సుని గణించారు. ప్రతి వృత్తాన్ని పరిశీలించి లక్ష్య లక్షణ సమన్వయం చేశారు.
          ఆంధ్ర వాల్మీకి ఛందోహృదయాన్ని అందంగాను, సలక్షణం గాను, ఆవిష్కరించారు శ్రీ జ్వాలా వారు.
          కేవలం ఛందస్సుతో సరిపుచ్చకుండా, "మందరం" లో ఇంతవరకు ఎవ్వరూ శోధించని అక్షర, పద్య, సంఖ్యా రహస్యాలను కనుక్కున్నారు. ఏ విశ్వవిద్యాలయమైనా ఈ గ్రంథానికి పి హెచ్ డి ఇవ్వవచ్చు. అత్యుత్తమ పరిశోధన అంతటా సప్రామాణిక తపస్సులా రచన సాగింది.
          గాయత్రీ మంత్రాన్ని రామాయణంలో వాల్మీకి ప్రతిష్టించారు. అలాగే మందరంలో "రామాయనమః" రామ పంచాక్షరి మంత్రాన్ని సంఖ్యా శాస్త్ర రహస్యాలు శోధించి పట్టుకున్నారు శ్రీ జ్వాలా నరసింహారావు గారు. ఇది అపూర్వం. ఆశ్చర్య జనకం!

        "శ్రీమహిజాధవుండు జడ చేతనజీవనధాత సద్గరీ
        యో మరభూరుహంబు సమ దారివిదారణశీలి భక్తవా
        రామృతదాత సంభృతశ రాసకరాంబుజు డొంటిమిట్టశ్రీ
        రాము డమాయవర్తనుడు రక్తి గ్రహించుత మన్నమస్కృతుల్"

          నాల్గవ పాదంలో 1, 4, 5, 17, 18 అక్షరాలు కలిపితే "రామాయనమః" వస్తుంది. మూడవ పాదంలో చివరి అక్షరం "శ్రీ" కలిపితే "శ్రీ రామాయనమః" వస్తుంది. అది షడక్షరి అవుతుంది. ఇలాంటి ఎన్నో విశేషాలు చక్కటి శైలితో రచించారు రచయిత.
          ధర్మార్థకామమోక్షాలను సత్వరం లభింపచేసేది రామాయణం. పఠనం, శ్రవణం, ప్రవచనం, రచనం, దృశ్యీకరణం, శబ్దీకరణం, చర్చ....ఇలా ఏ రూపంలోనైనా రామాయణాన్ని అనుష్టిస్తే ధర్మార్థ కామమోక్షాలు కరతలామాలకాలౌతాయి.
ఈ శ్రేణిలోనే శ్రీ జ్వాలా నరసింహారావు గారు కొత్తగా రహస్య పరిశోధనాన్ని చేర్చారు.
"ఆంధ్ర వాల్మీకి" వాసు దాసు గారి "మందరాన్ని" శోధించి రచించిన రహస్య సంపుటి ఈ గ్రంథం.
          వాసు దాసు గారి సుమారు 40 రకాల ఛందస్సులు ఈ కావ్యంలో వాడారు. సమయోచితంగా, సందర్భోచితంగా, ఛందః ప్రయోగం జరిగింది.
          వాల్మీకి కోకిల తమసా నదిలో స్నానానికి వెళుతున్న సందర్భంలో వాసు దాసు గారు "మత్తకోకిల" రచించారు.
          వాల్మీకికి బ్రహ్మ ప్రత్యక్షమైన సందర్భంలో సృష్టికర్తకు "పంచ చామరం" తో సేవించారు.
          దశరథ మహారాజు ఋష్య శృంగుని వద్దకు వెళ్లే సందర్భంలో ఆరాజగమనానికి సరిపోయే "ప్రహరణ కలిత" వృత్తాన్ని తీసుకున్నారు.
          ఇలా కథ గమనానికి అనుగుణంగా వాసు దాస మహాకవి ప్రయోగించిన ఛందస్సులన్నింటినీ ఒక చోట చదవడం ఒక గొప్ప అనుభూతి.
          బహుశా తెలుగు-సంస్కృత సాహిత్యాలలో ఇలాంటి ప్రయత్నం, గ్రంథ రూపంలో రావడం ఇదే ప్రథమమని నా భావన. పెద్ద పెద్ద వ్యాసాలతో, శోధనలతో క్వాచిత్కంగా సృశించి వదిలి వేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి. కానీ గ్రంథ రూపంలో ఒక మహాకావ్యంపై, దానిలోని ఛందస్సు విశ్వరూపాన్ని ప్రదర్శించడం ఇదే తొలిసారి. ఆ ప్రయత్నాన్ని శ్రీ జ్వాలా నరసింహారావు గారు చేసి పరిపూర్ణంగా సఫలీ కృతులయ్యారు.
          వాసు దాసు గారు కావ్యాంతంలో "సుగంధి" వృత్తంలో కాండలో ఎన్ని పద్యాలున్నాయో రహస్యంగా చెప్పారు. శ్రీ జ్వాలా నరసింహారావు గారు ఆ రహస్యాన్ని కూడా పాఠకులకు తెలియచేశారు.

          సుగంధి:      రామ చంద్ర గోత్ర చంద్ర రమ్యపద్య గేయమా
                        నామలోత్తర ప్రచార యాదిదేవ శ్రీహరీ
                        రామ యొంటిమిట్టధామ రాజకన్య కాలస
                        ద్వామభాగ దివ్యభోగ వాసు దాససేవథీ

          ఇందు తొలి రెండు పాదాలలో ఈ కాండలో (ఉత్తర) 1713 పద్యాలున్నాయన్న రహస్యముంది. రామ అంటే 3, చంద్ర అంటే 1, గోత్ర అంటే 7, చంద్ర అంటే 1.
          "అంకానాం వమతో గతిః" సూత్రం ప్రకారం వెనుకనుండి వేస్తే 1713 పద్యం సంఖ్య వస్తుంది. ఇలాగే ఎన్నో మంత్ర శాస్త్ర రహస్యాలు, కావ్య శాస్త్ర రహస్యాలు, ఛందశ్శాస్త్ర రహస్యాలు సునిశితంగా శోధించి రచించినదీ పరిశోధనాత్మక గ్రంథం.
          అలాగని ఇది సాధారణ పాఠకులకు ఏదో శాస్త్రం చదువుతున్నామన్న భావన కలగదు. ఇది జనరంజకమైన శైలి సాగే గ్రంథం. ఎన్నెన్నో వినూత్న విషయాలను ప్రాథమిక స్థాయి నుండి పరాకాష్ట స్థాయి వరకు నేర్చుకుంటున్నామన్నఅనుభూతి కలుగుతుంది.
          గణ స్వరూపం దగ్గర నుంచి రామాయణం యొక్క సద్గుణ స్వరూపం దాకా ఈ గ్రంథం మనకు పరిచయం చేస్తుంది.
          ఒక కావ్యం చదువుతున్నట్లు, ఒక వ్యాసం చదువుతున్నట్లు, ఒక శాస్త్రం చదువుతున్నట్లు, మూడు అనుభూతులు ఒకే సారి కలిగించేలా ఈ రచన సాక్షాత్కరిస్తుంది.
          ఛందశ్శాస్త్రం కనుమరుగై పోతుందన్న భయావహమైన ప్రస్తుత స్థితిలో సంప్రదాయ ప్రియులను ఇది అభయ హస్తాన్ని ప్రసాదిస్తుంది.
          తెలుగు సాహిత్యంలో విశేష ఛందస్సులు రచించిన ఇటీవలి కవులందరిపైనా ఇలాంటి పరిశోధన జరగాలి. అలాంటి ప్రయత్నం శ్రీ జ్వాలా నరసింహారావు గారే చేయగలరు. విశ్వవిద్యాలయంలో ఒక శాఖ చేయాల్సిన పనిని శ్రీ రావు గారు ఒంటి చేతి మీద చేయడం, అదీ తాను అమెరికాలో వుండగా చేయడం గొప్ప విషయం.
          ఆంజనేయుడు హిందూ మహా సముద్రాన్ని దాటి సీతాదేవిని అన్వేషించారు. శ్రీ జ్వాలా నరసింహారావు గారు పసిఫిక్ మహా సముద్రాన్ని లంఘించి వెళ్లి ఛందో రహస్య సీతమ్మను అన్వేషించారు.
          శ్రీ వనం జ్వాలా నరసింహారావు గారికి అస్మదుపాస్య దేవత సకల శుభాలను కలిగించాలని ప్రార్థిస్తూ.....
         
          డాక్టర్. రాళ్లబండి కవితా ప్రసాద్
        సంచాలకులు, భాషా సాంస్కృతిక శాఖ
        తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం