Friday, August 11, 2017

చీకట్ల నుంచి వెలుగులోకి..... : వనం జ్వాలా నరసింహారావు

చీకట్ల నుంచి వెలుగులోకి.....
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (12-08-2017)

పదిహేనవ శతాబ్దపు చివరలో భారతావనిలో పాదం మోపిన పోర్చుగీసుల వాణిజ్య-సామ్రాజ్య వాద వ్యూహాత్మక ఆధిపత్యాన్ని, డచ్-ఆంగ్లేయుల సైనిక-రాజకీయ పెత్తనం పదహారవ శతాబ్దం ఆరంభమవుతుండగానే అడ్డుకునే ప్రయత్నం మొదలెట్టి, అచిర కాలంలోనే వారి సారధ్యంలోని ఈస్ట్ ఇండియా కంపెనీ, పోర్చుగీస్ కంపెనీలపై విజయం సాధించింది. గోవా హద్దులను దాటి విస్తరించ లేకపోయిన పోర్చుగీసులు తమ వాణిజ్య అవసరాల కొరకు మరింత లాభదాయకమైన దేశాల వేటలో పడాల్సి వచ్చింది. ఇండొనేషియా మీదుగా మనదేశంలో అడుగుపెట్టిన డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రధానోద్దేశం మసాలా దినుసుల వ్యాపారమే తప్ప రాజకీయ-సైనిక ఆధిపత్యం కాదు. డచ్ కంపెనీ కార్యకలాపాలు ఆరంభించిన రోజుల్లోనే, బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా లాభదాయకమైన మసాలా దినుసుల వ్యాపారానికి దిగిందిక్కడ. 1600 సంవత్సరంలో, రాయల్ చార్టర్ ద్వారా, బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన జరిగింది. ఆంగ్లేయుల పాలనకు అంకురార్పణ మొదలైందలా మనదేశంలో. డచ్, బ్రిటీష్ కంపెనీలతో పాటు అడుగుపెట్టిన ఫ్రెంచ్ కంపెనీ అంతగా పురోగతి సాధించ లేకపోయింది.

మొఘల్ రాజులైన జహంగీర్ చక్రవర్తి లాంటి వారితో బ్రిటీష్ ప్రభుత్వ ప్రతినిధులు సత్సంబంధాలు పెంపొందించుకోసాగారు. దరిమిలా సూరత్ లోనూ ఈస్ట్ ఇండియా కంపెనీ వెలసింది. పదహారవ శతాబ్దపు తొలి నాళ్లలో మొదలైన బ్రిటీష్ వారి వాణిజ్యం అచిర కాలంలోనే అంచలంచలుగా ఎదగసాగింది . బాంబే ఈస్ట్ ఇండియా కంపెనీకి దక్కడంతో, పదిహేడవ శతాబ్ది ఆరంభానికల్లా, కనీసం వాణిజ్యపరంగానైనా పటిష్టమైన స్థితికి చేరుకున్నారు ఆంగ్లేయులు. మొఘలాయి సామ్రాజ్యం-దాని చక్రవర్తి ఔరంగజేబు పతనంతో భారతావనిలో చోటుచేసుకున్న అనిశ్చిత స్థితి బ్రిటీష్ వారికి కలిసొచ్చిందనాలి. నాదిర్ షా లాంటి వారి దండయాత్రలు మొదలయ్యాయి. ఢిల్లీలో రక్తపాతం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీ వదిలి వెళ్లిన నాదిర్ షా, తన వెంట, మొఘల్ సామ్రాజ్య గుర్తుగా మిగిలిన "పీకాక్ థ్రోన్" తీసుకెళ్లాడు. ఒకటి వెంట మరొకటి ఏడు దండయాత్రలు జరిగాయప్పట్లో. కష్టాల కడలిలో మునుగున్న భారతదేశంలో బ్రిటీష్ ఆధిపత్యానికి మార్గం సుగమం అయింది. అప్పటికే, బ్రిటీష్ ప్రభుత్వ ఆదాయంలో పది శాతానికి పైగా ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచే రాసాగింది. ఆంగ్లేయులకు, ఫ్రెంచ్ వారికి మధ్య సుదీర్ఘంగా జరిగిన పోరాటంలో విజయం సాధించిన బ్రిటన్ భారత దేశంలో అధికారానికి చేరువై, సిపాయిల తిరుగుబాటు నాటికి పట్టు సాధించింది.

1857 నాటి సిపాయిల తిరుగుబాటులో మొఘలాయుల చివరి చక్రవర్తి బహదూర్ షా జఫర్, తాంతియా తోపే, రాణి ఝాన్సీ లక్ష్మి బాయి లాంటి వారు పాల్గొన్నారు. బ్రిటన్ లోని పార్లమెంటరీ ప్రభుత్వం, అప్పటివరకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన స్థానంలో, నేరుగా పాలన సాగించాలని నిర్ణయం జరిగింది. వాస్తవానికి, సిపాయిల తిరుగుబాటు పూర్వ రంగంలోనే, ఒక మోస్తారు సాంస్కృతిక విప్లవం, భారతావనిలో వేళ్లూనుకోవడమే కాకుండా, రాజకీయ చైతన్యానికి కూడా బీజాలు పడ్డాయి. 1885 లో లార్డ్ డఫరిన్ ఆశీస్సులతో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం జరిగింది. ఆదిలోని కాంగ్రెస్ మితవాద భావాల అధినాయకత్వం ఒక వైపు బ్రిటీష్ ప్రభుత్వానికి మద్దతు పలుకుతూనే, మరొక వైపు, పరోక్షంగా ప్రభుత్వ వ్యతిరేకతకు పునాదులు వేయ సాగింది. బెంగాల్ విభజన నిర్ణయం, దేశ వ్యాప్త ఆందోళనకు దారితీసింది. నోబెల్ బహుమతి గ్రహీత రబీంద్రనాథ్ ఠాగూర్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ మాట్లాడారప్పట్లో. స్వదేశీ ఉద్యమం, విదేశీ వస్తువుల బహిష్కరణ నినాదం ఊపందుకుంది. ఉద్యమకారులపై ప్రభుత్వ దమన కాండ తీవ్రతరమైంది. పంజాబ్ నుంచి లాలా లజపతి రాయ్, సర్దార్ అజిత్ సింగ్ ల బహిష్కరణ, బాల గంగాధర తిలక్, అరబిందో ఘోష్ ల నిర్బంధం, బెంగాల్ విభజన వ్యతిరేక ఆందోళన, భారత జాతీయోద్యమానికి పునాదులు బలంగా నాటాయి. ఆద్యతన భవిష్యత్ లో, స్వాతంత్ర్యోద్యమం ఊపందుకునేందుకు సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపించసాగాయి.

ప్రధమ ప్రపంచ సంగ్రామంలో బ్రిటన్ కూరుకుపోయిన సమయంలోనే, స్వదేశీ ఉద్యమం బలపడ సాగింది. పూనా కేంద్ర కార్యాలయంగా, హోం రూల్ లీగ్ స్థాపించిన తిలక్ దేశ వ్యాప్తంగా పర్యటించి, దేశ ప్రజలందరూ ఐకమత్యంగా ఉద్యమించాలని చేసిన విజ్ఞప్తికి అన్నీ బీసెంటు సహకారం లభించింది. హోం రూల్ ఉద్యమ లక్ష్యం పూర్ణ స్వరాజ్యమనేది స్పష్టమైపోయింది ఆంగ్లేయ పాలకులకు. ఇంతలో, మహాత్మా గాంధి నాయకత్వంలో స్వాతంత్ర్యోద్యమం బలపడ సాగింది. ఆయన "అహింస" నినాదంతో దూసుకుని పోయారు. దక్షిణాఫ్రికాలో ఆపాటికే బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమించిన మోహన్ దాస్ కరంచంద్ గాంధి, బాంబేలో కాలుపెట్టిన వెనువెంటనే, జాతీయోద్యమానికి నాయకత్వం వహించమన్న నినాదం మొదలైంది. గాంధీ నిర్ణయం తీసుకునే లోపుగానే, రౌలట్ చట్టం తీసుకొని వచ్చిన బ్రిటీష్ ప్రభుత్వం, విచారణ జరపకుండా, రాజకీయ ఖైదీలను శిక్షించి, జైలుకు పంపించే అధికారాన్ని ప్రొవిన్షియల్ ప్రభుత్వాలకిచ్చింది. విశ్వసనీయతను కోల్పోయిన ఆంగ్లేయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, "ఆత్మ గౌరవం" నినాదంతో. సత్యాగ్రహ ఉద్యమానికి పిలుపిచ్చారు మహాత్మా గాంధి.


పంజాబ్ లోని జలియన్ వాలా బాగ్ లో, ఏకైక ఇరుకైన ద్వారమున్న ఒక ప్రదేశంలో, బైసాఖి పండుగను జరుపుకునేందుకు శాంతియుతంగా సమావేశమైన అమాయక ప్రజలపై దారుణ-మారణ కాండ జరిపించాడు జనరల్ డయ్యర్. వేలాదిమంది మరణించారా సంఘటనలో. దేశ వ్యాప్తంగా విషాదం చోటు చేసుకున్న ఆ సంఘటన దరిమిలా, సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించారు మహాత్మా గాంధి. ఆబాల గోపాలం మద్దతు లభించిందా ఉద్యమానికి. లక్షలాది మంది ప్రజలు, తారతమ్యాలు మరిచి, ఒక్క మాట మీద నిలబడి ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. దురదృష్ట వశాత్తు చౌరీచౌరా సంఘటనలో పాతిక మంది పోలీసులు ప్రజాగ్రహానికి గురై చంప బడడంతో, గాంధి ఉద్యమాన్ని నిలుపుదల చేశారు. ఆ నిర్ణయం వల్ల గాంధీని కొందరు విమర్శించినప్పటికీ, ఆయన తిరుగులేని నాయకత్వం కొనసాగింది. ప్రజల హృదయాల్లో ఆయనపైనున్న అభిమానం చెరిగిపోలేదు. జవహర్లాల్ నెహ్రూ పూర్ణ స్వరాజ్ నినాదంతో త్రివర్ణ పతాకాన్ని రావి నది ఒడ్డున ఎగురవేయడం, శాసనోల్లంఘన ఉద్యమాన్ని గాంధి మొదలెట్టేందుకు సంపూర్ణ మద్దతును భారత జాతీయ కాంగ్రెస్ ప్రకటించడం, స్వతంత్రం పొందే దిశగా కదిలేందుకు దోహద పడింది.

గాంధీజీ పిలుపు మేరకు ఆరంభం కానున్న శాసనోల్లంఘన ఉద్యమం రూపురేఖలెలా వుండబోతున్నాయో తెలుసుకోవాలన్న ఆసక్తి కేవలం భారతీయులలోనే కాకుండా, బ్రిటీష్ ప్రభుత్వంలోనూ కలిగింది. అనుకున్న రోజునే, సబర్మతీ ఆశ్రమం నుంచి, ఉప్పు సత్యాగ్రహం కొరకు "దండి" యాత్ర గాంధీ సారధ్యంలో మొదలైంది. దాన్నంత పెద్దగా పట్టించుకోవద్దునుకున్న బ్రిటీష్ ప్రభుత్వానికి ఉద్యమం ఉధృతం అవగాహనైంది. అరెస్టుల పర్వం మొదలైంది. గాంధి, త్యాబ్జీ, సరోజినీ నాయుడులను అరెస్ట్ చేసింది ప్రభుత్వం. "బ్రిటీష్ ప్రభుత్వం ఉద్యమాన్ని అదుపుచేసేందుకు ఆయుధాలను ఉపయోగించినప్పటికీ, అదరకుండా-బెదరకుండా, ఎదురుతిరగకుండా, వెనుకంజ వేయకుండా, భారతీయులు ముందుకు సాగడంతో, ఆంగ్లేయులు శక్తిలేని వారై పోవడం-భారతీయులు అజేయులు కావడం జరిగింది" అని శాసనోల్లంఘనం గురించి లూయి ఫిషర్ వర్ణించారు.

లండన్ లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ ప్రతినిధులెవరు హాజరు కాకపోవడంతో, నాటి గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ గాంధీజీని విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇరువురి మధ్య సమావేశం జరిగింది. గాంధి-ఇర్విన్ ఒప్పందం దరిమిలా రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు గాంధి. నిరాశతో స్వదేశానికి రావడం మినహా ఒరిగిందేమీ లేదు. ద్వితీయ ప్రపంచ సంగ్రామంలో ఆంగ్లేయులకు మద్దతిచ్చి, ప్రతిఫలంగా, సంపూర్ణ స్వరాజ్యం పొందాలని భారత జాతీయ కాంగ్రెస్ భావించింది. ఇంతలో, జిన్నా ముస్లిం లీగుతో, కాంగ్రెస్ నాయకత్వానికి అభిప్రాయ బేధాలొచ్చాయి. పాకిస్తాన్ ఏర్పాటు తన లక్ష్యంగా ప్రకటించాడు జిన్నా. యుద్ధానంతరం డొమైన్ హోదా కల్పిస్తామని బ్రిటీష్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను గాంధి తిరస్కరించడంతో 1947 వరకు పరిష్కారం దొరకని స్థితికి పరిస్థితులు చేరుకున్నాయి.

గాంధీజీ నాయకత్వంపై భారత జాతీయ కాంగ్రెస్, ప్రజలు, యావత్ భారతావని, అపారమైన నమ్మకం పెట్టుకున్నారు. ఆయన పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమానికి, విజయమో-వీర స్వర్గమో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. నాటినుంచి కౌంట్ డౌన్ మొదలైంది. స్వాతంత్ర్యం సిద్ధించే సూచనలు కనపడ సాగాయి. 1946 లో లార్డ్ మౌంట్ బేటన్ ఢిల్లీకి రావడంతో రాజకీయ ప్రాధాన్యత పెరిగింది. ద్వితీయ ప్రపంచ సంగ్రామంలో నేర్చుకున్న పాఠాలతో భారత దేశాన్ని వదిలిపెట్టి పోవాలన్న నిర్ణయానికొచ్చింది బ్రిటీష్ ప్రభుత్వం. హఠాత్తుగా వదిలిపెట్టకుండా, అధికార మార్పిడికి కావాల్సిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతను మౌంట్ బేటన్ కు అప్ప చెప్పిన బ్రిటీష్ ప్రభుత్వం, భవిష్యత్ లో భారత దేశంతో సత్సంబంధాలు కొనసాగేట్లు చూడమని సూచించింది. విభజన తప్పని పరిస్థితులు అప్పటికే చోటు చేసుకున్నాయి.


అశేష ప్రజానీకం ఎదురు చూసిన రోజు ఆనంద-విషాదాల మధ్య రానే వచ్చింది. ఆగస్టు పదిహేను 1947 అర్థ రాత్రి ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి కలిగింది భారత దేశానికి. మరో రెండు రోజులకు పాకిస్తాన్ మరో స్వతంత్ర దేశంగా ఏర్పాటవడంతో భారతావని రెండుగా చీలిపోయింది. చీలిక కోరుకున్న వారిలోను, కోరుకోని వారిలోను, ఎందరో తమకిష్టం వున్నా-లేకపోయినా, తర-తరాలుగా తాముంటున్న ప్రదేశాలను వదిలి, సుదూరంగా వెళ్లాల్సిన పరిస్థితులొచ్చాయి. జాతి పిత మహాత్మా గాంధికి మాత్రం, తాను కోరుకున్న స్వతంత్రం సిద్ధించినా, కోరుకున్న రీతిలో సిద్ధించనందుకు సంబరాలకు దూరంగా, శాంతిని కాంక్షిస్తూ గడిపారు. ఢిల్లీలో వుండమని ఆయనకు చేసిన విజ్ఞప్తికి స్పందించలేదాయన. సంబరాలు జరుపుకునేందుకు ఏం మిగిలింది? దేశ విభజన తప్ప అన్నారాయన.  ఆగస్టు పదిహేను అర్థ రాత్రి జవహర్లాల్ నెహ్రూ "ట్రిస్ట్ విత్ డెస్టినీ" ఉపన్యాసం వినకుండా నిద్రించిన మహాత్మా గాంధి తెల్లవారు ఝామున నిద్రలేచి, ఆయన వుంటున్న "హైదరీ హౌజ్" నుంచి మార్నింగ్ వాక్ కు బయలు దేరగానే ఆయన్ను ఒక్క సారన్నా చూద్దామని అశేష జన వాహిని ఆయనను అనుసరించారట. నడక ముగించుకుని తిరిగి రాగానే, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వపు నూతన మంత్రివర్గం ఆయన ఆశీస్సులకొరకు వచ్చారట. "ముళ్ల కిరీటాన్ని" ధరించమని వారితో అన్నారట గాంధి. అహింసకు కట్టుబడమని, అసత్యం పలకొద్దని, వినయ విధేయతలతో మెలగమని, సహన శీలంతో మసలుకోవాలని, అధికారం అంటే అప్రమత్తంగా వుండాలని, భారతదేశంలోని గ్రామాల్లో నివసిస్తున్న పేద గ్రామీణులకు సేవచేసేందుకే అధికారమని వారికి బోధించారట మహాత్ముడు. ఆయన బోధనలను కొన్నైనా గుర్తుంచుకున్నప్పుడే, స్వతంత్ర భారతదేశంలో వుండే అర్హత మనకుందనుకోవాలి. ఆగస్టు పదిహేనున ఇదే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి. End

Thursday, August 10, 2017

శాస్త్రీయ పద్ధతిలో రహదారులు : వనం జ్వాలానరసింహారావు

శాస్త్రీయ పద్ధతిలో రహదారులు
వనం జ్వాలానరసింహారావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (11-08-2017)

అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని రెడ్ వుడ్ సిటీ (శాన్ ఫ్రాన్ సిస్కో పక్కన) లో వుంటున్న కొడుకును చూడడానికి వచ్చి చుట్టుపక్కలున్న కొన్ని ప్రదేశాలకు వెళ్లాను. యు.ఎస్.ఏలో కాలిఫోర్నియా రాష్ట్రానికి ఒక ప్రత్యేకతుంది. శాన్ ఫ్రాన్ సిస్కో లోని డౌన్ టౌన్ రోడ్ మీద ప్రయాణం, అక్కడకు పోవడానికి సముద్రం పక్కనుంచి, దాదాపు సాగర జలాల అంచునుంచి చేరుకోవడం బలే సరదాగా వుంటుంది. అలానే క్రుకెడ్ రోడ్. రోడ్డంతా, నేరుగా, ఒంపులు-వంకర టింకరలు లేకుండా, సుదూరంలో ఆకాశం నేలను తాకుతున్నట్లు, అద్భుతమైన సుందర దృశ్యం లా కనిపిస్తుంటుంది. ఆ రహదారి మీద కారులో పోతుంటే భయం కూడా వేస్తుంది. కొంత ఎత్తుకు వెళ్లిన తర్వాత వెనుక-ముందు ఎటు చూసినా, వళ్లు గగుర్పొడుస్తుంది. ప్రమాదాలకు నిలయమైనట్లున్నా, ఒక్క ప్రమాదం కూడా జరగదు.

అమెరికా దేశంలోని నలు మూలల నుంచి వందల మైళ్ల దూరం అనాయాసంగా-సునాయాసంగా సొంత కార్లలో, స్వయంగా నడుపుకుంటూ ప్రయాణం చేసి ఇక్కడి ప్రదేశాలు చూసి పోగలగడానికి ప్రధాన కారణం దేశమంతా శాస్త్రీయ పద్ధతిలో నిర్మించిన రహదారులు, అమల్లో వున్న డ్రైవింగ్ నిబంధనలు, చిత్త శుద్ధిగా వాటిని ఆచరణలో పెట్తున్న వాహనదారులు. అహర్నిశలూ అలసటొచ్చే దాకా పనిచేసే అమెరికన్లు, వారాంతపు శెలవులు గడపడానికి, ఇతర ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు, వందల మైళ్ల వేగంతో వాహనాలు నడిపినా, వారి అంతిమ లక్ష్యమైన సుఖప్రదమైన జీవితం గడిపేందుకు, గిరిగీసుకున్నట్లుగా, కొన్ని నియమ నిబంధనలను స్వచ్చందంగా, ఖచ్చితంగా పాటిస్తారు. ప్రభుత్వం అజమాయిషీ చేస్తుందా-లేదా అని గమనించకుండా, పౌరులందరూ వాటిని పాటిస్తుంటారు. అందులో రహదారి నియమ నిబంధనలు ఒకటి. ఉదాహరణకు నగరాలలోని "కార్ పూల్ మార్గం". వేగంగా వెళ్లడానికి అనువుగా వుండే ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటే, కారులో, ఇద్దరికంటే ఎక్కువ మంది వుండాలి. అలా లేని కారు నడిపే వ్యక్తి, ఎవరు గమనించినా, గమనించకున్నా, "కార్ పూల్ మార్గం" లోకి వచ్చే ధైర్యం చెయ్యడు.

మన దేశం (ఇండియా) లో ఎక్కడ చూసినా డ్రైవింగ్ కు అనుకూలించని నైపుణ్యం కొరవడిన రోడ్లు, ఎదురుగా, పక్కగా వచ్చే వాహనాలను తప్పించుకోవడానికి సరిపోయేంత వెడల్పులేని రోడ్లు, సరైన కంకర, డాంబర్, సిమెంట్ కు నోచుకోని రోడ్లు, అవసరమైన ప్రదేశాల్లో ఇంకా మాంధాతల కాలం నాటి కూలడానికి సిద్ధంగా వున్న వంతెనలు, అసందిగ్ధమైన హైవే హద్దులు, ఏ రోడ్డు ఎటు పోతుందో తెలియ చేసే ఏర్పాట్లు లేకపోవడం, రహదారిపై ఒక పక్క ఆపుకోడానికి ఏ మాత్రం సౌకర్యాలు లేకపోవడం లాంటి ఎన్నో లోటు పాట్లను గుర్తించడమైతే జరిగింది గాని, సరిద్దిద్దేందుకు పటిష్ఠమైన చర్యలంతగా తీసుకోలేదనే అనాలి. ఆరు లేన్ల, నాలుగు లేన్ల జాతీయ-రాష్ట్రీయ రహదార్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినా, అమలు వరకు వచ్చేసరికి ఎక్కడి గొంగళి అక్కడే.

ఈ నేపధ్యంలో అమెరికా జాతీయ, పట్టణ, నగర రహదారుల్లో ప్రయాణం చేయడం గొప్ప అనుభూతనాలి. ఆ రోడ్లను చూసి మనం నేర్చుకోవాల్సిందెంతో ఉందనాలి.


అమెరికా రహదారుల మీద వాహనం నడపడమైనా, ఎవరన్నా నడుపుతుంటే కూర్చొని ప్రయాణం చేయడమైనా ఆసక్తికరంగా, ఆహ్లాదంగా, శరీరం గగుర్పొడిచేదిగా,మజాగా వుండడంతో పాటు, ఏ మాత్రం ఏమరు పాటుగా కారు నడిపినా, నడిపేవారి పక్కన కూర్చున్నా, ప్రమాదపుటంచుల్లోకి నేరుగా పోతున్నట్లుంటుంది. అన్ని రకాల వాహనాలు, భారీ, మధ్య రకం, చిన్నవి, వివిధ లేన్లలో, ఏక కాలంలో కనీసం నాలుగు కంటే తక్కువ లేకుండా, ఇరు వైపుల నుంచీ, తక్కువలో తక్కువగా గంటకు 50-60 మైళ్ల వేగంతో పోతుంటాయి. అంతకంటే ఎక్కువ వేగంతో పోకూడదని హెచ్చరికతో "కంప్యూటరైజ్డ్ డిజిటల్ బోర్డులు" రహదారి పొడుగూ ఏర్పాటు చేసినప్పటికీ కొందరు వంద మైళ్ల వేగంతో కూడా నడుపుతుంటారు. కాకపోతే, వెనకాలే రహదారి పోలీస్ పెట్రోలింగ్ వాహనం వస్తున్న వాసన తగలగానే వేగం తగ్గిస్తుంటారు.

వివిధ రాష్ట్రాలను కలుపుతూ వేసిన రహదారులను "జాతీయ హై వేలు" అని మనదేశంలో పిలుస్తున్నట్లు, అమెరికాలో వాటిని "అంతర్ రాష్ట్ర రహదారులు" అని అంటారు. ఇండియాలో వాటికి ఎన్. హెచ్ 1, ఎన్.హెచ్ 2 .. ... అని నంబర్లిస్తారు. అమెరికాలోను అదే మాదిరి నంబర్లుంటాయిగాని, ఒక రాష్ట్ర సరిహద్దు నుంచి మరో రాష్ట్ర సరిహద్దులో ప్రవేశించగానే అవి మారుతుంటాయి. ఉదాహరణకు "ఏ" రాష్ట్రంలోని ఒక స్థలం నుంచి "సి" రాష్ట్రం లోని మరో స్థలానికి "బి" రాష్ట్రం నుంచి పోవాలనుకుందాం. అలా పోతుంటే, "ఏ" నుంచి "బి" కి ఒక నంబర్, "బి" నుంచి "సి" కి మరో నంబర్ కేటాయిస్తారు. ఉత్తరం నుంచి దక్షిణ దిశగా-దక్షిణం నుంచి ఉత్తర దిశగా వున్న అంతర్ రాష్ట్ర రహదారులకు బేసి సంఖ్యలు (1, 3, 5..), తూర్పు-పడమరగా, పడమర-తూర్పు గా వున్న రహదారులకు సరి సంఖ్యలు (2, 4, 6...) కేటాయించబడతాయి.

ఏ పరిస్థితుల్లోను, ఎదురుగా వాహనాలు రాకుండా, వాహనాలు ఒకదానికొకటి ఎదురు పడకుండా వుండే విధంగా, వెడల్పాటి రహదారి డివైడర్లను, ఇరువైపుల వేసిన అంతర్ రాష్ట్ర రోడ్ల మధ్య ఏర్పాటు చేస్తారు. ఒకవిధంగా "వన్ వే ట్రాఫిక్" అని చెప్పాలి. ఎంత వేగంతో ఎవరు వాహనం నడిపినా, "హెడ్ ఆన్ కొలిజన్" ప్రమాదాలకు ఆస్కారం లేదు. ఇతర రకాల ప్రమాదాలకు కూడా అవకాశాలు తక్కువే...దాదాపు వుండవనే అనొచ్చు. ఒకవేళ హైవేలలో ప్రమాదమంటూ జరుగుతే, అది వెనుకనుంచి వస్తున్న వాహనం ముందున్న దానిని, వేగాన్ని అదుపు చేయలేక, ఢీ కొనడం వల్ల మాత్రమే జరిగే అవకాశం వుంది. అలా ఎప్పుడు జరిగినా, సాధారణంగా, ఒక మోస్తరుగా కాకుండా, భారీ స్థాయిలోనే ప్రమాదం సంభవిస్తుంది. ఎంతో సేపు, ఎన్నో వాహనాలు ఒక పక్కగా ఆగిపోయే అవకాశం వుంది. అయితే వీలైనంత త్వరగా, అధికారులకు సమాచారం చేరి, అంతే వేగంగా, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించి, ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్తారు.

ఇరువైపుల నుంచి, అంతర్ రాష్ట్ర రహదారుల్లో కనీసం రెండో-మూడో "చానల్స్" లేదా "పాస్ వేస్" (లేన్లు) ఏర్పాటుంటుంది. వాహనం నడిపేవారు, వారి-వారి వేగానికనుకూలంగా, సరిపడే విధంగా, ఒక లేన్లో ప్రయాణిస్తుంటారు. "ఎల్లప్పుడూ కుడి వైపునే నడపండి, లేన్ మారటానికి మాత్రమే ఎడమ వైపుకు తీసుకోండి" అన్న బోర్డులుంటాయి ప్రతి చోటా. ముందున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయాలంటే, అందుబాటులో ఎడమ వైపున వున్న లేన్ లోకి మారి, వాహనం నడపాలి. వెనుకా-ముందు పోతున్న ఏ వాహనానికి, అది నడుపుతున్న వారికి, ఏ మాత్రం ఇబ్బంది కలిగించకుండా, హారన్ మోగించ కుండా, లేన్లు మారాలి. మన దేశంలో మాదిరి, డోర్ అద్దాలు లేపి, పక్క వాహనం నడిపేవాడిని, దూషించుకుంటూ, అదే పనిగా హారన్ మోగించుకుంటూ, ఇతరులకు వీలైనంత అసౌకర్యం కలిగించుకుంటూ, వాహనాలు నడిపే వారెవరూ వుండరు.

బధ్రతా కారణాల దృష్ట్యా, వాహనం నడిపే వ్యక్తి, ముందు సీట్లో నడిపే వారి పక్కన కూర్చొన్న వ్యక్తి, విధిగా "సీట్ బెల్ట్" కట్టుకోవాలి. కొన్ని రాష్ట్రాల నిబంధనల ప్రకారం వెనుక సీట్లో కూచున్న వారు కూడా సీటు బెల్ట్ ధరించాలి. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా పట్టుబడితే, ఆ బాధ్యత, కారు నడుపుతున్న వాడిపైన వేస్తారు పోలీసులు. ఆ తప్పుకు అనుగుణమైన "టికెట్" ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాహనం నడిపే వ్యక్తి నడపడంలో ఎలాంటి తప్పుచేసినా, దానికి తగిన శిక్ష కింద, పోలీసులు "టికెట్లు" ఇవ్వడం జరుగుతుంది. వాటి వివరాలన్నీ డ్రైవింగ్ లైసెన్స్ లో పొందుపరిచి, ఆ తప్పుల కొచ్చిన పాయింట్ల ఆధారంగా, లైసెన్స్ కొంతకాలం రద్దుచేయడమో, శాశ్వతంగా తీసేయడమో జరిగే అవకాశం కూడా వుంది. టికెట్ ఇచ్చిన ప్రతిసారీ భారీగా ఫైన్ కూడా వసూలు చేస్తారు. అలానే మత్తు పదార్థాలు సేవించి వాహనం నడిపినా శిక్షార్హుడే. ఒక సారి లైసెన్స్ పోతే మళ్లీ రావడం చాలా కష్టం. అసలు మొదటిసారి రావడమే కష్టం.

హైవే మీద వాహనం నడిపే వ్యక్తి ఏదన్నా ట్రాఫిక్ నిబంధనను అతిక్రమించినట్లు, రహదారి పెట్రోలింగ్ పోలీసు అధికారి గమనిస్తే, వాహనం వెనుకనే వస్తున్న పెట్రోలింగ్ కారుకు అమర్చబడిన లైట్ల ద్వారా సిగ్నల్స్ ఇవ్వడం జరుగుతుంది. క్షణం కూడా ఆలోచించకుండా, కుయ్, కయ్ అనకుండా వాహనం నడుపుతున్న వ్యక్తి, తన వాహనాన్ని, రోడ్డుకు ఇరు పక్కలా వుండే "షోల్డర్స్" అని పిలువబడే వైపుగా తీసి ఆపు చేస్తాడు. వాహనం పట్టేంత జాగా మాత్రమే వుండే "షోల్డర్", వివిధ కారణాల వల్ల వాహనాన్ని హైవే మీద ఆపుకోవాల్సిన పరిస్థితుల్లో, పార్క్ చేసేందుకు, ఏర్పాటు చేసిన ఒక సౌకర్యం. దానిమీద వాహనం నడుపుతే, అంతులేని శబ్దం వచ్చే విధంగా, రోడ్డు కింది భూ పొరను తయారు చేస్తారు. కేవలం పార్క్ చేయడానికి మాత్రమే ఆ స్థలం అనుకూలం. పోలీసు సిగ్నల్ చూసి వాహనాన్ని ఆపు చేసిన వ్యక్తి కిందకు దిగాల్సిన అవసరం లేదు. పెట్రోలింగ్ వాహనంలో వచ్చిన పోలీసు అధికారే డ్రైవర్ దగ్గరకొస్తాడు. వచ్చిన వెంటనే, అతడు అతిక్రమించిన నిబంధన, దానికి చెల్లించాల్సిన ఫైన్, టికెట్ వివరాలు తెలియచేస్తాడు. వాద-ప్రతివాదాలకు అవకాశం వుండదు. తనకు పలుకుబడి వుందనో, పాత్రికేయుడిననో, ఉన్నతాధికారులు తెలుసుననో, వాహనం నడుపుతున్న వ్యక్తి వాదనకు దిగడు. అతడు తప్ప ఇతరులెవరు వకాల్తా పుచ్చుకొని మాట్లాడరు. తప్పుచేయలేదని నిరూపించుకోవడానికి చట్టపరమైన మార్గాలను తర్వాత అన్వేషించవచ్చు. అక్కడ మాత్రం కాదు. అతడు చేసిన నిబంధనలకు విరుద్ధమైన చర్య ఆపాటికే రోడ్డు పైన అమర్చిన రాడార్ లో రికార్డయి వుంటుంది.అసలు వాహనం నడిపేవారికే తను చేసిన తప్పేంటో తెలిసిపోతుంది ఆపాటికే.

హైవే పొడుగునా రక-రకాల "ఎగ్జిట్లు" వుంటాయి. ప్రధాన హైవే నుంచి తప్పుకొని, మనం వెళ్లాల్సిన మరో దారికి పోవడానికి ఉపయోగించాల్సిన మార్గాన్నే "ఎగ్జిట్" అంటారు. వెళ్లాల్సిన కారణం ఏదైనా కావచ్చు. వాటిని "గాస్ ఎగ్జిట్" అని, "ఫుడ్ ఎగ్జిట్" అని, "లాడ్జింగ్ ఎగ్జిట్" అని, "కంఫొర్ట్ ఎగ్జిట్" అని, "హాలిడే ఎగ్జిట్" అని, "కాంప్ ఎగ్జిట్" అని, "హాస్పిటల్ ఎగ్జిట్" అని పిలుస్తారు. వాహనాలకు గాస్ నింపు కొనేందుకు, తిను పదార్థాలకొరకు, కొద్ది సేపు విశ్రాంతి తీసుకునేందుకు, శెలవు దినంగా గడిపేందుకు, అత్యవసర వైద్య సదుపాయం కొరకు, లేదా మరేదైనా సౌకర్యం కొరకు ఉద్దేశించబడినవి ఇవి. అలానే, ప్రధాన రహదారి నుంచి, మనం వెళ్లాల్సిన ప్రదేశానికి చేరుకునేందుకు మళ్లాల్సిన మార్గాన్ని కూడా "ఎగ్జిట్" అంటారు. వీటికి నంబర్లుంటాయి. మనం తీసుకోవాల్సిన "ఎగ్జిట్" తెలిసైనా వుండాలి, లేదా, జీ. పి. ఎస్ సహాయంతోనైనా తెలుసుకోవాలి. హైవే ఎగ్జిట్ లలో అనేక సదుపాయాలుంటాయి. హైవేకు ఎడమ వైపున వున్న ప్రదేశానికి చేరుకోవాలంటే, కుడివైపునున్న సంబంధిత ఎగ్జిట్ లోకి ప్రవేశించి, ప్రధాన రహదారి పైన ఏర్పాటు చేసిన "ఫ్లై ఓవర్" మీద నుంచో, కింద ఏర్పాటు చేసిన రోడ్డు నుంచో, అటు వైపుగా పోవాలి. ఎక్కడ పడితే అక్కడ వాహనం మరల్చకూడదు-మరల్చే అవకాశం కూడా వుండదు. ప్రతి పాతిక-ముప్పై మైళ్లకు ఏదో ఒక రహదారి సౌకర్యం వుంటుంది. ఇందులో కొన్ని ప్రభుత్వ పరంగా, కొన్ని ప్రయివేట్ పరంగా నిర్వహించబడతాయి. పర్యాటక రంగానికి చెందిన సమాచారం అడుగడుగునా లభిస్తుంటుంది. తిండికి ఏ కొరతా వుండదు. శాంతా క్లారా-లాస్ ఏంజల్స్ మార్గంలో భారతీయ సంప్రదాయ ఆహారం కూడా దొరుకుతుంది. ఇక మెక్ డొనాల్డ్ లు సరే సరి.

అమెరికాలో "ఫ్రీ వేలు" చాలా చోట్ల వుంటాయి. అందులో వెళుతుంటే ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపిస్తాయి. అయినా నిబంధనలను అతిక్రమించి ఎవరూ నడపరు. పల్లెటూరి మార్గంలో పోతున్నప్పుడు కూడా ఇరువైపుల ఒక్కోసారి ఒకే లేన్ వుండి, ఎదురెదురు వస్తున్న వాహనాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి సౌకర్యాలున్న శాంతా క్లారా-లాస్ ఏంజల్స్ రహదారిలో, వెళ్లేటప్పుడు, తిరిగొచ్చేటప్పుడు, మధ్యలో డిస్నీ లాండ్ కు-యూనివర్సల్ స్టూడియోలకు పోయినప్పుడు, ఎంత వేగంగా కారు నడిపినా ఎలాంటి భయం వేయలేదు. సుమారు హైదరాబాద్-విజయవాడ మధ్య నున్న దూరం కంటే ఎక్కువే వున్న శాంతా క్లారా-లాస్ ఏంజల్స్ మధ్య నున్న 350 మైళ్లకు పైనున్న దూరాన్ని వెళ్లేటప్పుడు-తిరిగొచ్చేటప్పుడు నాలుగైదు గంటల లోపునే చేరుకున్నాం.


అందుకే అమెరికా రహదారుల ఏర్పాట్ల గురించి తెలుసుకోవాల్సింది ఎంతో వుంది. END

Wednesday, August 9, 2017

CM KCR favors fresh survey and settlement of Lands : Vanam Jwala Narasimha Rao

CM KCR favors fresh survey and settlement of Lands
Vanam Jwala Narasimha Rao
Chief Minister K Chandrashekhar Rao has instructed the officials concerned to screen all the land records in the State and make public the details on, who owns what extent of land. For this, the CM expects the officials to conduct a special drive all over the State for survey and settlement. Henceforth, he said, all the land transactions both sale and purchase should be done in a transparent way. He wanted Pattaadar pass books and pahani documents should be re-done in a simple way and to put an end to confusion. The land transactions and records should be maintained in a transparent way like the bank transactions. He has instructed the officials to plan a strategy to filter the land records and make future transactions simple and transparent. He also asked them to prepare an action plan to implement survey settlement with village as a unit and launch the survey as early as possible.
The CM held a high-level review meeting on filtering the land records at Pragati Bhavan on 7th August 2017 in which top level officers including Chief Secretary and Chief Advisor to Government participated.
In the seven-hour marathon discussion, several important and major decisions were taken. The meeting in a consensus opinion has concluded that except during the Nizam’s rule in 1936, land records have never been scrutinized nor filtered. This is causing several land related disputes, issues and difficulties. The land disputes are also becoming law and order problems. To put an end to the land disputes, it is decided to survey the entire land in the state taking help from institutions like Survey of India and other similar agencies in the country. It is decided to survey the entire land in the state with the help of the latest technology and IT enabled methods.
The CM said that, “From next year, the government has decided to give Rs 4000 per acre to the farmer for two crops in a year as an input assistance. For this purpose, the agriculture department has conducted a survey in the villages. But the data collected by the agriculture department is not matching with the revenue records. In one instance, if agriculture department has shown in their data, that, there are 300 farmers in a village, the revenue records showed it as 1100 in the same village. In such a case to whom will the government give money?  If the assistance is given to people without any accountability and denying the eligible farmers, it will become a scam and the government will get a bad name. Eligible farmers will not get the money. Not only this, there are other problems if the land records are not correct and proper. There is a room for corruption and law and order issues are also cropping up. Land disputes are also leading to murders. To put an end to all this, there is a need to survey the entire land in the state and get clarity on who owns what land? The revenue department should conduct a special drive for this. The survey should be done with village as unit. Get clarity on how much land is there? Which land is registered and on whose name? Prepare details on the entire 2.75 crore acres of land that is estimated to be available in the State and under what categories the land is shown. By doing such a filtration once, schemes like Rs 4000 per acre for two crops will be successful and will reach the actual beneficiaries. This will also put an end to the disputes in future.”

“Land neither increases or decreases and the extent will remain the same. It is enough if we get clarity on whose name the land is. It is enough if the records at the village level are rectified. Survey should be conducted in all the 10,850 villages in the state. Depute 3,500 revenue offices and make them in charge of three villages. Conduct the survey for fifteen days in each village under the guidance of villagers and the farmers’ Associations. There are several technical and IT tools available now for the conduct of the survey. Take help from the Survey of India and other agencies in the country. Since this is a good programme, people will also cooperate.  Collectors and other revenue officers will be exclusively entrusted with this work till the survey is over. There is a lot of confusion in the Pattaadar passbooks and pahani papers which are in use now. There is no need for so many columns, make it simple. Once the filtration is over, put the details online. Give new passbooks after the survey. Give a unique identity number for each land. If need be, put border stones to the lands. The details available at the village level should be the same with the CCLA. In case of any change, it should be reflected at all levels online.  Like the instant messages one gets while withdrawing cash from an ATM and the same is modified in the bank records, similarly, land records should also have such facility. Use the technology being used by the banks”.
Later, speaking in a public meeting held the next day in a village the CM said that about 25 agencies across the country will be roped in for the proposed integrated land survey. On completion of the survey and settlement drive, the government will issue fresh tamperproof passbooks to farmers to enable them to avail the benefit of Rs 8, 000 per acre for agriculture.
In this context CM also said that the government is developing a new land registration and mutation system wherein farmers need not visit government offices for land registration or mutation. MROs will be authorized to conduct land mutation and sub-registrars will coordinate with them during land registrations and courier the documents to farmers. CM further said that once the agriculture capital subsidy of Rs 8, 000 and streamlining of land records come in to effect, the farmers will be enrolled for the scheme. The amounts will be deposited into their bank accounts directly by the government notwithstanding their landholding or financial status.

Monday, August 7, 2017

రావణాసురుడి అంతఃపురాన్ని చూసిన హనుమంతుడు ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలానరసింహారావు

రావణాసురుడి అంతఃపురాన్ని చూసిన హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలానరసింహారావు
సూర్య దినపత్రిక (08-08-2017)

ఇంటింటికి పోతూ, పలురూపాలతో, అసమాన సౌందర్యంతో అలరారుతున్న ఇళ్లను కన్నులపండుగగా తిలకించాడు వాయుపుత్రుడు. అలా తిరుగుతున్న హనుమంతుడికి ఆపట్టణంలో వర్ణనాతీతమైన పలురకాల ధ్వనులు వినిపిస్తాయి. ఆ ధ్వనులేమిటంటే.....స్వర్గంలోని దేవతా స్త్రీలలాగా లంకలో, "రొమ్ము, కంఠం, శిరం" లో పుట్టిన మనోహర, మంద్ర, మద్యమ తారలనే స్వరాల రాక్షస స్త్రీలు పూర్ణ మదంతో ఆసక్తిగా చేస్తున్న గానధ్వనులు.....మనోహర రత్నాలు చెక్కబడ్డ రాక్షస స్త్రీల వడ్డాణాలలోని చిరుగజ్జెల ధ్వనులు.....అందెల ఝళం-ఝ్హళ ధ్వనులు.....అందెలు, మెట్టెలు, పాముజీలున్న కాలి ఆభరణాలు మెట్లకు తగులుతున్నప్పుడు కలిగే ధ్వనులు.....వీరులు భయంకరంగా సింహనాదం చేస్తున్న ధ్వనులు.....శూరులు భుజాలు తట్టుకున్నప్పుడు పుట్టిన ధ్వనులు.....జపాలు చేస్తున్నవారి ధ్వనులు.....మాంత్రికుల ధ్వనులు.....ఇలా పలు రకాల, రకరకాల ధ్వనులు.

          ఈ ధ్వనులకు తోడు, వేదాధ్యయనం చేసేవారిని, రాక్షస వందిమాగధులను, రాచబాటల నడుమ నిల్చున్న గుంపులను, వేగులను, గర్జించే రాక్షసులను, దీక్షక్శలో వున్నవారిని, జడలు పెంచుకుని తిరుగుతున్నవారిని, బోడితలల రాక్షసులను, ఎద్దుచర్మాలు ధరించిన వారిని, దర్భ పిడికిళ్లు, అగ్నికుండాలు ఆయుధాలుగా కలవారిని, సమ్మెటలు, ఇనుప గుళ్లు ధరించిన వారిని, ఒంటికన్ను, ఒంటిచెవి, వేళ్లాడే పొట్టలు, రొమ్ములు కలవారిని కూడా చూసాడు హనుమంతుడు. మిట్టపళ్లున్నవారిని, పెద్ద విల్లంబులు ధరించిన వారిని, పొట్టివారిని, వంకర నోటివారిని, బాకులు, రోకళ్లు, గుదియలు, ఇనుపముళ్ల గదలు ఆయుధాలుగ వున్నవారిని, కవచాలు తొడుక్కున్నవారిని, స్థూలకాయులు కానివారిని, కృశించని దేహాలున్నవారిని, మరీ పొడగరి కానివారిని, మరీ పొట్టి కాని వారిని, మరీ పచ్చని శరీరం లేనివారిని, కారునలుపు లేనివారిని, అంతగా గూనిలేనివారిని, వికార రూపాలున్నవారిని, సుందరులను, సుకాంతున్తులను, అనేక రకాలవారినికూడా హనుమంతుడు చూసాడు. వలలు, పాశాలు చేతుల్లో వున్నవారిని, గంధం అతిగా పూసుకున్నవారిని, పూలదండలు వేసుకున్నవారిని, విలువ కట్టలేని ఆభరణాలతో అలంకరించుకున్నవారిని, ఇష్టమొచ్చిన రీతిగా తిరిగే వారిని, రకరకాలుగా అలంకరించుకున్న వారిని, భయంకర బలవంతులను, ములికైన ఆయుధాలు ధరించిన వారిని, వజ్రాయుధం లాంటి ఆయుధాలు పట్టుకుని తిరిగేవారినీ చూసాడు హనుమంతుడు. వీరికి తోడుగా రావణాసురుడి ఇంటి ముందు, ఆయన ఆజ్ఞానుసారం కాపలాకాస్తున్న ఆయన మూలబలగాన్నీ చూసాడు హనుమంతుడు.

అక్కడే  చూసాడు రావణాసురుడి అంతఃపురాన్ని కూడ హనుమంతుడు. వర్ణనాతీతంగా వుందది. స్వర్గంతో సరిసమానమైన మనోహరధ్వనులు వినిపిస్తున్నాయక్కడ. గుర్రాల సకిలింపులూ, మనోహర భూషణ ధ్వనులూ వినిపించాయి. విమానం, పల్లకి, మదించిన ఏనుగులు, పక్షుల గుంపులు, జింకల్లాంటి వాటితో అందంగా కనిపిస్తూ, బలవంతులైన యుధ్ధభటుల రక్షణలో వుందా అంతఃపురం. బంగారం, ఇతర రత్నాలతో ప్రకాశిస్తున్న ప్రాకారంతో, విలువైన ముత్యాలు, రత్నాలతో అలంకరించబడిన లోగిలితో, అగరు చెక్కల కమ్మని వాసనలతో కూడి వున్న రావణాసురుడి అంతఃపురాన్నిచూసాడు హనుమంతుడు.


ఇంతవరకు పట్టణంలో సంచరించిన హనుమంతుడు, రావణుడి అంతఃపురాన్ని బయటనుండే చూసి, ఆ తర్వాత లోనికి ప్రవేశిస్తాడు. ఆరోజు శుధ్ధ త్రయోదశీ తిధి. సుమారు తొమ్మిదిన్నర గంటల ఆసమయంలో చంద్రుడు ఆకాశం మధ్యలో వెన్నెల కురిపిస్తున్నాడు ప్రకాశవంతంగా. హనుమంతుడు చూసిన ఆనాటి చంద్రుడు.....వినోదకరమైన వెన్నెల కాంతులను విరజిమ్ముతూ, అందమైన ఎడ్ల గుంపులో ఆబోతులా తిరుగుతూ, ప్రపంచమంతా తన చల్లటి కాంతిని వ్యాపింప చేస్తూ, జనాల మనస్సుల్లో సుఖపడ్తున్నామన్న ఆలోచన కలుగ చేస్తూ, ఉప్పొంగిన సముద్రుడి నృత్యాన్ని తలపిస్తూ, ఆబాలగోపాలానికి దుఃఖ నాశనం చేస్తున్నట్లున్నాడు.

భూమ్మీదున్న మందర పర్వతపు కాంతి, సాయం సమయంలో సముద్రంలో వున్న కాంతి, సరస్సులందలి తామరపూల కాంతిని పోలిన కాంతే చంద్రుడిలో వుందప్పుడు. వెండి పంజరంలోని హంసలా, మందర పర్వత గుహలోని సింహంలా, ఏనుగెక్కిన వీరుడిలా ఆకాశంలో వున్న చంద్రుడు, మనోహరంగా, అందమైన స్త్రీ ముఖంలా కనిపించాడు. వాడికొమ్ముల బలిష్టమైన ఎద్దులా, బంగారు కొమ్ముల ఏనుగులా, ఎత్తైన శిఖరమున్న తెల్లటి కొండలా వున్న చంద్రుడు ఆసమయంలో పరిపూర్ణ శృంగుడై(నిండిన కొమ్ములు) లోకాలకు ఇంపైన కాంతినిస్తూ ప్రకాశించాడు. (పాడ్యమి-విదియ-తదియలలో కనిపిన్చినట్లు చంద్రుడి కొనలు, త్రయోదశినాడు కనిపించవు. పూర్ణబింబానికి కొంచెం తక్కువగా కనిపిస్తుంది. ఊత్తర శృంగమని, దక్షిణ శృంగమని చంద్రుడి కొనలకు పేర్లు. ఆరాత్రి ఆశృంగాలు లేవు)

నశించిన మంచు తుంపరల్లా మాలిన్యరహితుడిగా, బృహస్పతి కాంతినే తన కాంతితో కప్పేసినవాడిగా, ఆశ్చర్యకరమైన కాంతికి ఆశ్రయమై నిర్మలాంకమున్నవాడిగా, అమిత కాంతితో వున్నాడప్పుడు చంద్రుడు. (ఈవర్ణనతో మన్చుకాలం వెళ్లిపోయి ఫాల్గుణ మధ్యంలో వున్నట్లు విశదమవుతున్నది. సూర్యకిరణాల సంబంధమున్నందువల్ల తానువెలుగుతూ చీకటిని తొలగిస్తున్నాడని కూడా తెలుసుకోవాలి. సూర్యకాంతి అద్దంపై పడితే ఎలా ప్రతిబింబిస్తుందో, అలానే జలమైన చంద్రుడిపై పడ్డ సూర్యకాంతి కూడా ప్రకాశిస్తున్నదన్న అర్ధం స్ఫురిస్తుంది)

          విశాలమైన బండరాతిపై కూర్చున్న సింహమా? భీకర సంగ్రామంలో  విజృంభించిన మత్తగజమా? రాజ్యం లభించిన రాజా? అనుకునేటట్లు, హంసలాగా ప్రకాశిస్తున్నాడు చంద్రుడు. అంత నిర్మలంగా వున్ది చంద్ర బింబమప్పుడు. త్రయోదశి నాటి ప్రదోష కాలంలో ప్రకాశిస్తున్న చంద్రుడి వల్ల చీకటి పటాపంచలయింది. రాక్షసులు, మాంసం తినే మృగాల సంచారం మొదలయింది. స్త్రీ-పురుషుల మదనతాపం, ప్రణయకోపం పెరిగింది. అలా తన తేజస్సుతో స్వర్గలోక సంతోషంతో సమానమైన ఆనందాన్ని కలిగించింది చంద్రబింబమప్పుడు.


సరిగ్గా ఆసమయంలో వినవచ్చాయి కమ్మని వీణానాదాలు. కనిపించారు....శృంగార చేష్టల స్త్రీలు....నిద్రాతిశయంతో భర్తల వెనుకబడడం....హింసకలవాటుపడ్డ మాంసభక్షకులు క్రూరమైన పనులు చేయసాగారు. భర్తలను విడిచి వున్న స్త్రీలు విరహతాపంతో బాధపడ్డారు. మద్యపానంతో శరీరాన్ని మరిచి ఏంచేస్తున్నారో తెలియని రాక్షసులుండే ఇళ్ల సముదాయాన్ని కనుగొంటాడు మారుతి. End

Thursday, August 3, 2017

Congress Party Number one villain of Telangana State-CM KCR : Vanam Jwala Narasimha Rao

Congress Party Number one villain of
Telangana State-CM KCR
Vanam Jwala Narasimha Rao
Chief Minister K Chandrashekhar Rao said that, the Congress party which filed as many as 196 cases in various forums, since the formation of the state, with the malicious intention of obstructing Telangana development is the “Number one villain of Telangana State”.
KCR addressed a media conference at Pragathi Bhavan on Wednesday, the 2nd August 2017, where he compared the Congress to a devil that had engulfed Telangana. He said that Pandit Nehru, during his tenure as PM, had merged Telangana with Andhra, against the wishes of the people of Telangana and the recommendations of the Fasal Ali Commission. 
KCR said that former Prime Minister Indira Gandhi had scrapped the Mulki Rules which would protect the jobs of the people of Telangana, and was instrumental for firing hundreds of students who were fighting for Telangana and for formation of a separate state.
The CM also accused the UPA government of delaying the formation of Telangana, thus causing hundreds of people to commit suicide. “The UPA did not create Telangana state out of love and affection for people of Telangana. It did so out of compulsion, and to gain political mileage ahead of the 2014 elections. KCR reiterated that the Congress approved the formation of Telangana only at the eleventh hour left with no other alternative. Out of anger and frustration, it is now attempting to obstruct development of Telangana by creating hurdles to every scheme and program undertaken by the government,” he said.
The CM said that members of the Congress party waited for the government to issue orders, and within hours of the release of a GO, they would file a PIL or a case in the High Court or the Supreme Court or in some forum or other. “They are not leaving even tribunals like NGT to stop development of projects in Hyderabad or construction of Bhadradri, Yadadri thermal power stations. They don't want us to give people drinking water, water for irrigation, electricity, flyovers, and roads. Is this a national party? They are obstructing all development programmes to serve their selfish political interests. They fear that they will vanish from Telangana if these programmes are successfully implemented,” he said. The CM has asked the Congress to “stop this nuisance and nonsense”.
KCR said that he had accused them of obstructing the development of Telangana in 2001 when the TRS was formed and he still stands by his statement. He said no Congress leader had played an active role in statehood movement and after Telangana became a reality they just dreamt of coming to power. But they were shocked after watching the results of 2014 elections. Instead of participating in the development process, they are now creating obstacles by filing cases, he alleged.


Expressing his ire over the Congress, the Chief Minister called them as “third rated parties” and said that he would take up a statewide tour soon and expose the Congress misdeeds. He said disgruntled ‘Telangana Congress leaders filed 164 cases against irrigation projects and another 32 cases on other schemes, including Mission Bhagiratha, Yadadri and Bhadradri power projects, dependent jobs in Singareni Collieries Company limited, regularisation of contract employees in different departments, including Energy sector and Telangana State Public Service Commission.
During his two-hour long press conference, he appealed to the opposition saying, “Let us not become a curse for our own state.” KCR said the Congress leaders stooped to all-time low for narrow political gains. He wondered why the opposition leaders approached courts against the developmental programmes, which are aimed to transform the state into Golden Telangana.
The Congress has been facing leadership crisis and is looking for a ‘Bahubali’ to come to its rescue. Since it was a national party, the Congress and its leaders should have maintained dignity. People gave befitting lesson to Congress in all bye-elections, including Warangal Lok Sabha seat, GHMC and Palair assembly. The opposition party’s nervousness to stall the development would invite people’s wrath in the next elections also, he said.
Taking a broadside at Congress for the increased drug and pub culture during its regime in the united Andhra Pradesh, KCR said the government was committed to nip the menace of drug abuse at the initial stage. The government already succeeded in curbing ID liquor (gudumba) and online gambling, he said.
Taking pot shots at Congress for creating a hue and cry over the Nerella incident, the Chief Minister said the opposition tried to project the issue as an attack on Dalits. Police have acted against some persons who were involved in the incident and few of them happen to be from Dalit families. It was not intentional.
Thanking the High Court for dismissing the PIL against the regularisation of contract workers in Energy department, the Chief Minister said that the government was only absorbing the employees in the government and their services are not regularized. He said the government would pay Rs 1,000 more than what the court had recommended to be paid to them. This would put Rs 25 crore burden on the state exchequer.

KCR said that all the departments were already instructed to prepare the list of contract employees and study the possibility of regularisation of their services. The government is planning to increase their salaries on par with regular employees if the regularisation of their service is not possible.