Sunday, July 8, 2018

మునులకు అభయం ఇచ్చి సుతీక్ష్ణాశ్రమానికి చేరిన శ్రీరాముడు....శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-16: వనం జ్వాలా నరసింహారావు


శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-16
మునులకు అభయం ఇచ్చి సుతీక్ష్ణాశ్రమానికి చేరిన శ్రీరాముడు
వనం జ్వాలా నరసింహారావు
అంధ్రభూమి దినపత్రిక (08-07-2018) 
ఋషులందరూ చెప్పిన మాటలు విన్న శ్రీరామచంద్రమూర్తి ఇలా వారితో ఇలా అన్నాడు: "మహానుభావులారా! మీరు నన్ను ఇలా గొప్పవాడిని చేసి మాట్లాడవచ్చా? నేను మీ ఆజ్ఞానుసారం నడుచుకునేవాడినే! మీరు ఆజ్ఞాపించాల్సిన వారే కాని విజ్ఞాపించాల్సిన వారు కాదు. నేను ఈ అడవుల్లోకి నా స్వకార్యం కొరకే వచ్చా. ఈ అడవుల్లోని రాక్షసులందరినీ వధించి మీకు మేలు చేయదమే నా స్వకార్యం. నా తండ్రిని సత్యవాదిని చేయడానికి అడవులకు రావడం నెపం మాత్రమే కాని యదార్థం కాదు. ఆశ్రితులను రక్షించడం రక్షకుని విధి. నేను చేయాల్సిన కార్యాన్ని ఇంతవరకూ చేయకపోవడం నా లోపమే. నన్ను క్షమించండి. ఈ కారణం వల్ల మాకు అరణ్యవాసం గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. యుద్ధంలో తమ్ముడితో కలిసి విరోధులను చంపుతా. అప్పుడు నా భుజ శక్తి చూడండి".

ఇలా ఆ ఋషులకు అభయమిచ్చిన శ్రీరామచంద్రమూర్తి తన మాట నెరవేర్చడానికి అభిలాషతోతన వెంట మునీశ్వరులందరూ వస్తుంటేసుతీక్ష్ణాశ్రమానికి పోయే దారిలో పయనించాడుతన వెంట వచ్చిన వానప్రస్థులతో ముచ్చటించుకుంటూ నడిచిన శ్రీరాముడు అందమైన ఆశ్రమాన్ని చూశాడుపూలతో నిండికొండలాగా నల్లగా వ్యాపించిన పర్వతంతోసౌందర్య సంపత్తితో అలరారుతున్న ఆ శుభాశ్రమాన్ని సమీపించిఅక్కడ కూచున్న సుతీష్ణుడిని శ్రీరామచంద్రమూర్తి చూసిప్రీతితో ఇలా అన్నాడు: "ఋషీశ్వరాపాపరహితుడానేను రాముడినినిన్ను దర్శించుకోవాలని మిక్కిలి సంతోషంగా వచ్చానుమనసారా ప్రేమగల చూపులతో నన్ను చూడు". వెంటనే ఆ మినిశ్రేష్ఠుడు రాముడిని కౌగలిచుకుని, "సీతేశ్వరానీకు క్షేమమే కదా?" అని కుశల ప్రశ్న వేస్తూ ఇలా అన్నాడు: "ఇతరులు చూసి సహించలేని తేజస్సుకలవాడానువ్వు రావడం వల్ల ఇక్కడి ఈ ఆశ్రమం మరింత పవిత్రమైదిక్కుకలదిగా ప్రకాశిస్తున్నదిఓ వీరుడానువ్వు ఇక్కడికి వస్తున్నావని తెలిసి శరీరాన్ని వదిలి దేవలోకానికి పోవడానికి ఇష్ఠం లేక ఇక్కడే నీకొరకు కాచుకుని వున్నానునా పుణ్యం వల్ల నువ్వొచ్చావు నాయనా!. కకుత్థ్స వంశంలో పుట్టినవారిలో శ్రేష్ఠుడవుమంచి పరాక్రమవంతుడవు అయిన శ్రీరామచంద్రమూర్తీరాజ్యాన్ని వదిలి మునివేషంతో చిత్రకూటంలో నువ్వు నీ భార్యతోతమ్ముడు లక్ష్మణుడితో కలిసి వున్నావని విన్నానురామచంద్రా! నేను సంపాదించిన పుణ్యంతో స్వర్గాన్ని పొందాను. అక్కడికి రమ్మని ఇంద్రుడు నన్ను పిలవదానికి వచ్చాడు. కానినువ్వు ఇక్కడకు వస్తున్నావని తెలిసిఅక్కడికి పోకుండానీ దర్శనంకొరకు ఇక్కడే కాచుకుని వున్నాను. నన్ను అనుగ్రహించి ఇక్కడ విహరించు" అని అన్నాడు.

జవాబుగా శ్రీరామచంద్రమూర్తి ఇలా అన్నాడు: "మునీంద్రానీ తపఃఫలం నువ్వు నాకివ్వాల్సిన అవసరం లేదుఫలకాంక్షలేకుండా రామార్పణం అని నువ్వు సంకల్పిస్తే చాలుఅవే వచ్చి నాలో కలుస్తాయిఅప్పుడు నేను గ్రహిస్తామేముండడానికి అనువైన స్థలం చూపించునీ గురించి అంతా శరభంగుడు చెప్పాడు". ఈ మాటలు వినగానే మునీంద్రుడు శ్రీరాముడితో "శ్రీరామచంద్రా ఈ ఆశ్రమ భూమియే రమ్యమైనదిగుణం కలది. ఋషులెందరో ఇక్కద తపస్సు చేస్తున్నారు. ఫలమూలాలు దండిగా దొరకుతాయిక్కడ. ఇక్కడ భయమంటే ఏమిటో తెలియదు. కాకపోతే ఇష్ఠం వచ్చినట్లు తిరిగే మృగాలు వచ్చి దేహాలను తాకటం వల్ల తపస్సుకు విఘ్నం కలుగుతుంది. అది తప్ప మరే భయం లేదు. కాబట్టి ఇక్కడే వుండండి" అన్నాడు. తాను ఆమృగాలను చంపితే మునీంద్రుడికి మనోవ్యధ కలుగుతుంది కాబట్టి తానక్కడ ఎక్కువ రోజులుండకూడదని అంటూ శ్రీరాముడుసరస్సుకు పోయి సాయం సంధ్య పూర్తి చేశాడు. ఆ ముని ఇచ్చిన ఆహారాన్ని తిన్నాడు. ఆ రాత్రి సీతాలక్ష్మణులతో అక్కడే గడిపాడు.



తెల్లవారుఘాము కాగానే లక్ష్మణుడు ముందుగా లేచిస్నానం చేసిన తరువాత సీతాదేవి కూడా నిద్రలేచి అలాగే చేసిందిశ్రీరామచంద్రమూర్తి కూడా తటాకజలాలలో స్నానం చేసిహోమం చేసిఇష్ఠదైవ ప్రార్థన చేసిసూర్యోదయం కాగానే సూర్యుడికి నమస్కారం చేసి సుతీక్ష్ణ మునిని సమీపించి అంజలి ఘటించి ఇలా అన్నాడు: "తపస్సు వల్ల పవిత్రమైన హృదయం కల మునీంద్రానువ్వు మమ్మల్ని గారవించి గౌరవించడం వల్ల రాత్రి మాకు హాయిగా గడిచిందిఇక బయల్దేరి పోవడానికి అనుమతి ఇస్తారా?ఎక్కడికి పోతారంటారేమోతమ-తమ ఆశ్రమాలకు రమ్మని దందకారణ్యంలో నివసించే మునులు మమ్మల్ని అడుగుతున్నారువారివెంట మేం పోవాలనుకుంటున్నాం.కాబట్టి మామీద దయతో ఆనుమతి ఇవ్వండిఎండ సోకకముందే వెళ్లడానికి శలవివ్వండి". ఇలా చెప్తూ శ్రీరాముడు ముని పాదాలను తాకి నమస్కరించాడుశ్రీరాముడిని ముని దగ్గరకు తీసుకుని గట్టిగా కౌగలించుకుని, "రామచంద్రానీ నీడ నిన్ను విడిపోకుండా నీవెంట వచ్చేవిధంగాసీత నిన్ను కొలుస్తుండగా పోయిరా!. నువ్వు ఎవరివెంట పోవాలనుకుంటున్నావో ఆ ఋషులు మిక్కిలి పుణ్యాత్ములువారు నిన్ను పాపపు పనులు చేయమని ప్రోత్సహించరుకాబట్టి వారి ఇష్ఠప్రకారం పోదానివల్ల నీకు కీడులేదుమేలు కలుగుతుందిలక్ష్మణా! ఇక్కడి కొండలువృక్షాలుసరస్సులు అందలి నెమళ్లు మీకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తాయి. కాబట్తి సుఖంగా పోయిరండి. పాపరహితుడవైన శ్రీరామచంద్రా! నా ఆశ్రమానికి మళ్లీ రండి.అని అంటాడు.

అప్పుడు లోకసుందరి అయిన సీత విల్లంబులనుఇతర ఆయుధాలను అంబులపొదులను రామలక్ష్మణులను తీసుకొమ్మని చెప్పి ఇచ్చిందివాళ్లు వాటిని తీసుకుని తమదగ్గర వుంచుకుని ఎక్కుపెట్టారురామలక్ష్మణులు విండ్లు ధరించిన విధం చూసి ఆయుధాల పట్టువిడుపులు తెలిసిన సీతాదేవి వారు యుద్ధ సన్నద్ధులైనారని తెలుసుకుంది. 

Friday, July 6, 2018

All Postings are equally significant : Vanam Jwala Narasimha Rao


All Postings are equally significant
Vanam Jwala Narasimha Rao
Telangana Today (07-07-2018)

There were reports recently that a few IAS officers in Telangana met the Chief Secretary with a complaint that they had been posted in ‘unimportant and insignificant’ departments whereas their juniors were given significant and pivotal posts. Is it possible to run the government efficiently if those who do not get a posting of their choice choose to express dissatisfaction over transfers made for administrative reasons and better governance?

These officers are supposed to discharge their responsibilities without giving room to any prejudice and bias, irrespective of the department they are working for.

A posting to Dr MCR HRD Institute, Hyderabad, was considered as a punishment posting during 1995. PVRK Prasad, who was media adviser to former Prime Minister PV Narasimha Rao was posted as its Director General. Urmila Subbarao, another IAS officer, was posted as Additional Director General. In a way, as many thought, it was a punishment posting for both of them. But later it proved otherwise.

When asked why they preferred these postings, the reply from both of them was, “for relaxing”. But what happened later was history. There was an incredible transformation of the institute, slowly and steadily. An institute, which was unfamiliar to many in 1995, was converted into a globally renowned institution and was placed on the world map of training as a great centre of excellence. It continues to enjoy this status till date. The reason was simple. An institute, which was thought insignificant where posting was a punishment, was transformed into the most significant department and a pride of place for an officer.

Setting Example
When former Prime Minister Indira Gandhi asked Narasimha Rao to select his portfolio in her Cabinet, the latter preferred Human Resource instead of Defence or External Affairs. When she asked him why he chose a relatively insignificant department, his answer was in government no department is insignificant!


PV transformed the department and the ‘Challenges of Education’ document was one of the consequences of his efforts. When Indira Gandhi was asked to choose her portfolio at the time of joining Lal Bahadur Shastri Cabinet, she selected, to everybody’s surprise, Information and Broadcasting, then considered insignificant. History proved otherwise later. Dr M Channa Reddy was initially given the Steel and Mines portfolio when he joined the Union Cabinet but he brought name and fame to it.

M Channa Reddy, during his second stint as Chief Minister of then Andhra Pradesh, responding to a complaint of corrupt practices in municipal administration — in addition to seeking the resignation of Minister Koneru Ranga Rao — posted IAS officer C Arjun Rao to the disaster management department, thought to be relatively insignificant. The State was hit by a ghastly cyclone on May 13, 1990. Arjun Rao took preventive measures that saved the lives of thousands of people. The relief and rehabilitation measures he took became a role model.

Channa Reddy was all praise for Arjun Rao and it was during that time that the famous ‘Cyclone Reconstruction Project’ was envisaged. Readers Digest published a special story on Arjun Rao later.

Commitment Matters
During Chandrababu Naidu’s tenure, as part of his Vision-2020 document, agriculture was relegated to an unimportant place and the post of Agriculture Production Commissioner became insignificant. But now, greater importance is being given to agriculture with schemes like Rythu Bandhu and Rythu Bhima.

From these, it can only be concluded that there is no insignificant department in government. It’s only the people who head them and their commitment and capacity to make any department significant that matter.

IAS officers start with the post of Sub-Collector and go up to the level of Chief Secretary or Cabinet Secretary depending upon their efficiency, initiative and obviously opportunity. Any efficient officer, whatever posting s/he is given will rise to the occasion and do her best to convert it into the best.

Think Positive
Hence, it is not correct on the part of these few IAS officers to complain to the Chief Secretary that they have been discriminated against. It is only the attitude and thinking of these IAS officers that make them feel that their postings are insignificant.

If we have a look at the postings that they were given, it is crystal clear that none of them is insignificant or unimportant. One of them having worked as Collector, Commissioner – Excise, Vice-Chairman – Housing Board, Principal and Special Chief Secretary – Revenue is now posted as Secretary SC/ST Commission.

At a time when the government is going all out to extend maximum welfare benefits to SC/ST, there cannot be a better posting than this for any officer. Similarly, the post of Joint Secretary Municipal Administration or Joint Secretary Home or Joint Secretary Public Enterprises or for that matter, even DG Archives, is not insignificant. For a fair thinker, every government department is equally significant!
(The author is Chief Public Relations Officer to the Chief Minister of Telangana)

ఐఏఎస్ అధికారికి ఏ శాఖా అప్రధానం కాదు : వనం జ్వాలా నరసింహారావు


ఐఏఎస్ అధికారికి ఏ శాఖా అప్రధానం కాదు
వనం జ్వాలా నరసింహారావు
సాక్షి దినపత్రిక (07-07-2018)
తెలంగాణ రాష్ట్రంలో కొందరు ఐఏఎస్‌ అధికారులు తమను “అప్రధానమైన” పోస్టుల్లో నియమిస్తున్నారనీ, సీనియారిటీ లేకపోయినా ఇతరులకు కీలక పోస్టులు కట్టబెడుతున్నారనీ, తమ పట్ల వివక్ష చూపుతున్నారనీ, ఆరోపిస్తూ, తమకు న్యాయం చేయమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరినట్లు వార్తలొచ్చాయి. ఇలా చేయడం సరైంది కాదేమో! రాష్ర్ట ప్రభుత్వం పాలనాపరమైన సౌలభ్యం కోసం అవసరమైనప్పుడు బదిలీ చేసిన ఐఏఎస్‌ అధికారులలో కొందరు తమకు ప్రాధాన్యత పోస్టులు లభించలేదన్న అసంతృప్తితో వున్నారని వార్తలొస్తున్నాయివారిలో కొందరు తమ సీనియారిటీని పరిగణలోకి తీసుకోలేదనిమరి కొందరు తమను అంతగా ప్రజలతో సంబంధం లేని పదవులకు పంపారని-తామెంత బాగా పనిచేస్తున్నప్పటికీ తమ సమర్థతకు తగిన గుర్తింపు రాలేదనిఎవరికి తోచిన రీతిలో వారు తమ అసంతృప్తులను బహిరంగంగానే వెల్లడి చేయడం గమనించాల్సిన విషయం. తమపై రాష్ట్ర ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తున్నదని కూడా ఆరోపణలు చేస్తున్నారు వీరంతా. వాస్తవానికి, వీరంతా తమకప్పగించిన ఏ బాధ్యతనైనా, అది ఏ శాఖకు సంబంధించినదైనా అరమరికలు లేకుండా, ప్రధానమా? అప్రధానమా? అని ఆలోచించకుండా విధులు, బాధ్యతలు నిర్వర్తించాలి. అలా కాకుండా ఆరోపణలు చేయడం సమంజసమా?

1995 సెప్టెంబర్ నెలలో నాకు మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో డెప్యుటేషన్ మీద ఉద్యోగం వచ్చినప్పుడు, అక్కడకు చేరుకోవడానికి ఎంతో ప్రయాసపడాల్సి వచ్చింది. కారణం, ఆ సంస్థ చిరునామా కనుక్కోవడం కూడా చాలా కష్టమైంది. అప్పట్లో ఆ సంస్థలో పోస్టింగ్ అంటే ఒక పనిష్మెంట్ లాగా భావించేవారు. అదొక “అప్రధానమైన” శాఖ అని అక్కడికి పనిచేయడానికొచ్చే వారి అభిప్రాయం. ఒక ఏడాదిన్నర తరువాత నేనక్కడ పనిచేస్తున్నప్పుడే, స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దగ్గర మీడియా సలహాదారుడిగా పనిచేసిన పీవీఆర్కే ప్రసాద్ అనే ఐఏఎస్ అధికారిని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ గా, శ్రీమతి ఊర్మిళా సుబ్బారావు అనే మరో ఐఏఎస్ అధికారిణిని అదనపు డైరెక్టర్ జనరల్ గా నియమించింది అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అందరూ అనుకునే విధంగా ఆలోచిస్తే వారికి ఒక విధంగా అది పనిష్మెంట్ పోస్టింగే!

వీళ్ళిద్దరినీ అక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నించినవారికి, వాళ్లిచ్చిన జవాబు, విశ్రాంతిగా పనిచేసుకోవడానికని. కాని, ఆ తరువాత జరిగిందేమిటి? 1995 లో ఎవరికీ అంతగా తెలియని ఆ శిక్షణా సంస్థ అచిరకాలంలోనే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సంస్థగా, ప్రపంచ శిక్షణా సంస్థల చిత్రపటంలో అతిప్రదానమైన సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ నాటికీ ఆ సంస్థ పేరు అలాగే వుంది. దానికి కారణం, ఏ పోస్టింగ్ అయితే పనిష్మెంట్ పోస్టింగ్, అప్రధానమైన పోస్టింగ్ అని ఇతరులు అనుకున్నారో, అక్కడే, పీవీఆర్కే ప్రసాద్, ఊర్మిళా సుబ్బారావులు తమ అవిరళ కృషితో, అపారమైన నిబద్ధతతో ఆ సంస్థను అంచెలంచలుగా అభివృద్ధి చేశారు. అక్కడ ఇప్పుడు పనిచేయడం అంటే ఒక పెద్ద క్రెడిట్ గా భావిస్తారు ఎవరైనా. యావద్భారతదేశం తిరగడానికి , ఇంగ్లాండు దేశాన్నీ సందర్శించడానికి నాకు అవకాశం కలిగింది ఆ సంస్థ చలవవల్లనే!

స్వర్గీయ పీవీ నరసింహారావును మంత్రిమండలి లోకి తీసుకునే ముందర ఆయనకేం పోర్ట్ ఫోలియో కావాలని అడిగిన ఇందిరాగాంధీ, రక్షణ శాఖ కాని, విదేశాంగ శాఖ కానీ, మరేదైనా మంచిశాఖ కానీ ఆయన అడుగుతాడని భావించింది. దానికి భిన్నంగా విద్యాశాఖ కోరుకున్నాడట! అదేంటి అలాంటి అప్రధాన శాఖ అడిగావంటే, ప్రభుత్వంలో ఏదీ అప్రధామనమైన శాఖ కాదని జవాబిచ్చాడు పీవీ. ఆకాశానికంత ఎత్తుకు తీసుకెళ్ళాడు ఆ శాఖను పీవీ. అంతెందుకు...స్వర్గీయ ఇందిరాగాంధీని లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వంలో మొదటిసారి మంత్రిగా చేరినప్పుడు, అందరూ ఆశ్చర్యపడేలా ఆమె కోరుకున్న శాఖ అప్పట్లో అందరూ అప్రధానమైనదని భావిచే సమాచార-ప్రచార శాఖ. స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి కేంద్రంలో మొట్టమొదట నిర్వహించిన శాఖ అప్పట్లో అందరూ అప్రధానమైనదని భావించిన ఉక్కు శాఖ. దానికి ఆయన ఎవరూ ఉహించని విధంగా వన్నె తెచ్చాడు.


స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి రెండవ సారి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, నేను ఆయన దగ్గర పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తున్నప్పుడు, మునిసిపల్ శాఖ మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై స్పందించి, అప్పటి ఆ శాఖా మంత్రితో (స్వర్గీయ కోనేరు రంగారావు) రాజీనామా చేయించి, సంబంధిత ఐఏఎస్ అధికారి సీ అర్జున్ రావును, సాధారణంగా అందరూ భావించే అప్రధానమైన “విపత్తుల నిర్వహణ” శాఖకు కార్యదర్శిగా బదిలీ చేయించారు సీఎం. అది జరిగిన కొన్నాళ్లకే మే నెల 13, 1990 న తీవ్రమైన భయంకర పెను తుఫాను రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసింది. విపత్తుల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న అర్జున్ రావు, తన అసమాన ప్రతిభతో వేలాది మంది ప్రాణాలు కాపాడడానికి ముందస్తు చర్యలు చేపట్టడమే కాకుండా, సహాయ-పునరావాస చర్యలు అద్భుతంగా చేపట్టి “విపత్తుల నిర్వహణ” ప్రాధాన్యతను లోకానికి తెలియచెప్పాడు. ఆయనెప్పుడూ తనకు అప్రధానమైన శాఖ ఇచ్చాడని పిర్యాదు చేయలేదు. ఏ ముఖ్యమంత్రైతే ఆయన్ను “విపత్తుల నిర్వహణ” శాఖకు బదిలీ చేశాడో ఆయనే స్వయంగా పలుమార్లు అర్జున్ రావు సేవలను అభినందించారు. రీడర్స్ డైజెస్ట్ లాంటి ప్రముఖ మాహజైన్ ఆయన మీద ప్రత్యేక కథనం రాసింది.

ఇంతెందుకు...చంద్రబాబునాయుడు హయాంలో వ్యవసాయం దండుగ అని విజన్ 2020 డాక్యుమెంటులో చెప్పడమంటే, ఆ శాఖ అప్రధానమైనదనే అనుకోవాలి కదా? ఒకప్పుడు అగ్రికల్చరల్ ప్రొడక్షన్ కమీషనర్ పోస్టు అంటే ఏ పనీ లేదనే భావన వుండేది. ఇక ఇప్పుడు...వ్యవసాయ శాఖకున్న ప్రాధాన్యత అంతా-ఇంతా కాదు. దీనర్థం...ప్రభుత్వ శాఖల్లో ఏదీ అప్రధానమైనది కాదు...అన్నీ ప్రధానమైనవే...కాకపొతే వాటిని నిర్వహించేవారి సత్తాను బట్టి, వారి-వారి కృషిని బట్టి, సమయ-సందర్భాలను బట్టి, ఒక్కో శాఖకు ప్రధానమైనదిగానో, అప్రధానమైనదిగానో తాత్కాలికంగా గుర్తింపు వస్తుంది. ఫలానా శాఖ అప్రధానమైనది కాదు అని నిరూపించాల్సిన బాధ్యత ఆ శాఖను నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారిదే!

ఐఏఎస్‌కు ఎంపికైన వారికి సబ్ కలెక్టర్ స్థాయి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వరకుకేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీ స్థాయి వరకుపనిచేసే అవకాశం వుంది. ఇవన్నీ వారి-వారి సమర్ధతను బట్టి లభిస్తాయి. గతంలో, ఉమ్మడి రాష్ట్రంలోపలు సందర్భాలలో అర్హతలు కాకుండాపలుకుబడి కలిగిన రాజకీయ నాయకుల అండతోవారితో వీరికున్న చనువు ఆధారంగా పదవులు పొందారన్న ఆరోపణలు అనేకం వచ్చాయి. "సమర్ధత" కన్నా, "చొరవ", "పలుకుబడి" ప్రాతిపదికలుగాప్రాధాన్యతల పోస్టులు దక్కించుకున్నారని అనేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత అలాంటి అవకాశం కోల్పోయిన కొందరు బహుశా తమను అప్రధానమైన శాఖలకు బదిలీ చేసారని ఆరోపిస్తున్నట్లు అర్థమవుతున్నది.

వీరి లాంటి కొందరు గతంలో పదవిలో వున్న ముఖ్య మంత్రుల దగ్గర వ్యక్తిగతంగా పలుకుబడి ఉపయోగించు కోగలిగిన వారైతేఇంకొందరు తెలుగు దేశం హయాంలో, కాంగ్రెస్ హయాంలోచాలా కాలం ఒకే పోస్టులో వుంటూ అధికారం, పెత్తనం పరోక్షంగా చెలాయించిన వారు కావడంతో ప్రస్తుతం బదిలీ చేసిన పోస్టులోకి వెళ్లాలన్న ఆలోచనను జీర్ణించుకొన లేక పోతున్నారేమో! ఏదేమైనాప్రభుత్వ యంత్రాంగంలో, అందునా ఐఏఎస్‌ స్థాయిలోఫలానా పోస్టు ప్రాధాన్యతకలదనిమరోటి మామూలుదనిఎవరైనా ఐఏఎస్‌ అధికారి భావించడమంటేఆ సర్వీసులో ఇంతకాలం పనిచేస్తున్న వారి అవగాహనా లోపమే అనాలిసమర్ధుడైన అధికారికి ఏ బాధ్యతలను ఇచ్చినాగతంలో పని చేసిన శాఖను అభివృద్ధి చేసినట్లేఅక్కడ కూడా రాణించగలరుఅసమర్థులకు ఏమిచ్చినా ఒకటే.

"భారత ఉక్కు వ్యవస్థగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అభివర్ణించిన, "ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)"భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాతఅప్పటి వరకుబ్రిటీష్ వారి పాలనలో అధికార స్వామ్యానికి ప్రతీకైన "ఇండియన్ సివిల్ సర్వీస్ (ఐసీఎస్)" స్థానంలో ఆవిర్భవించింది. ఐఏఎస్ కు ఎంపికైన వారందరూసాహిత్యం నుండి వైద్య శాస్త్రం వరకుఒకటికి మించిన విభిన్న విద్యల్లోతమదంటూఒక ప్రత్యేకత వుందని నిరూపించుకున్న అసాధారణ తెలివితేటలు గల వ్యక్తులై వుంటారు. వీరిని ఆ సర్వీసులకు ఎంపిక చేసే విధానం కూడాపలు రకాల వడపోత పద్ధతులను అవలంబించివిస్తృతమైన, కఠినమైన రాత, మౌఖిక పరీక్షా విధానం ద్వారారాగద్వేషాలకు అతీతమైన కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుల నిర్ణయం ఆధారంగా జరుగుతుంది. వీరి ఉద్యోగాలకు రాజ్యాంగ పరమైన రక్షణ వుంటుంది. కర్తవ్య నిర్వహణలోనిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాల్సిన ఆగత్యం లేదు. ఎవరికీ భయపడాల్సిన అవసరం కానిఒత్తిడులకు లోను కావడం కానిఏ మాత్రం లేదు.

 ఏడాదికి పైగా శిక్షణానంతరం ఏదో ఒక సబ్ డివిజన్ లోసబ్ కలెక్టర్ గా మొట్టమొదటి పోస్టింగు దొరుకుతుంది. అసలు-సిసలైన అధికార రుచి చవి చూసే అవకాశం అలా లభిస్తుంది వారికి. దాంతో పాటేప్రజాసేవ చేసే అవకాశం కూడా ప్రప్రధమంగా కలుగుతుంది. సబ్ కలెక్టర్ గా పనిచేసిన కొందరినిఅక్కడి ప్రజలు ఎన్నటికి మరవ లేని స్థాయికి ఎదిగిన ఐఏఎస్ అధికారులు చాలా మంది వున్నారు. సబ్ కలెక్టర్ తర్వాత సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి గా, జాయింటు కలెక్టరు గా పదోన్నతి పొంది మరో మెట్టుకు ఎదుగుతారు. ఇక ఆ తర్వాత, సుమారు ఏడెనిమిది ఏళ్లకుజిల్లా కలెక్టర్ గా నియామకం దొరుకుతుంది. ఈ అన్ని పదవుల కుండే మెజిస్టీరియల్ అధికారాలుఇక ఆ తర్వాతఎన్ని పదోన్నతులొచ్చినా వుండవు. కొందరికి రక-రకాల కారణాలవల్ల ఈ పదవులు దక్కకుండావాటికి సమానమైన పదవులు (ఉదాహరణకుడిప్యూటీ కార్యదర్శిగాసంయుక్త కార్యదర్శిగాకార్పొరేషన్లలో ఉన్నతాధికారిగామునిసిపల్ కమీషనర్లుగా) దొరుకుతాయి. ఇలా లూప్ లైనులలోకి మళ్లించబడే అలాంటి ఐఏఎస్ అధికారుల ఎదుగుదల సాదా-సీదాగా సాగుతుంది. వారికి ఏ పోస్టు ఇచ్చినా సర్దుకుని పోతుంటారు. అఖిలభారత సర్వీసులలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుకున్న ప్రత్యేకతదానికి ఎంపికైనవారికి ఒక "జిల్లా కలెక్టర్గా పని చేయడమే.

కలెక్టర్ పదవిని సుమారు పది సంవత్సరాల పాటువివిధ జిల్లాలలో చేపట్టి (అందరూ కాకపోయినా కొందరైనా) శాఖాధిపతులుగానోకార్పొరేషన్ల మేనేజింగ్ డైరెక్టర్లుగా నోసచివాలయంలో వివిధ స్థాయిలలో సచివులుగానో పని చేసేందుకు రాజధానికి చేరుకుంటారు. వారి-వారి సామర్థ్యాన్ని బట్టిప్రత్యేక తరహా నైపుణ్యాలను బట్టి వారికి పదవులు లభిస్తాయి. ఒక ఐఏఎస్ అధికారి జిల్లా కలెక్టర్ పదవి నుంచిరాష్ట్ర రాజధానికి చేరుకున్న తర్వాత, అటు పిమ్మట సొంత రాష్ట్రానికోకేంద్ర సర్వీసులకోవిదేశాలలో పదవులకో వెళ్లిన తర్వాతఒక వైపు అట్టడుగు స్థాయి సేవలకు దూరమవడంమరో వైపు అసలు-సిసలైన అధికారానికి దూరం కావడం జరుగుతుందనాలి. కలెక్టర్ పదవి తర్వాత అంత ప్రాధాన్యత కలిగిన ఏకైక పదవి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగానోకేంద్ర కాబినెట్ కార్యదర్శిగా నో నియామకం కావడం. ఆ అవకాశం అతి కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. మిగిలిన పోస్టులన్నీ ఒకేరకమైన ప్రాదాన్యను సంతరించుకున్నవనే అనాలి.

అందుకేఇటీవల బదిలీ అయిన ఐఏఎస్ అధికారులలో కొందరు తమకు అప్రాధాన్యత పోస్టింగులు ఇచ్చారనడం సరైంది కాదు. అలా భావించే ఐఏఎస్ అధికారులున్నారంటేఅది వారి అవగాహనా రాహిత్యమే అనాలి. ఉదాహరణకు తమకు అప్రధానమైన పోస్టింగులు ఇచ్చారని ఆరోపణ చేస్తున్న వారి నూతన శాఖలను పరిశీలిస్తే వాటిలో ఏదీ అప్రధానమైనది కాదని స్పష్టంగా తెలుస్తుంది. వీరిలో ఒకరు గతంలో కలెక్టర్ గా, ఆబ్కారీ కమీషనర్ గా, రెవెన్యూ శాఖ ముఖ్య (ప్రత్యేక ప్రధాన) కార్యదర్శిగా పని చేసి ఇప్పుడు ఎస్సీ-ఎస్టీ కమీషన్ కు కార్యదర్శి అయ్యారు. మారుతున్న సమాజంలో, సమాజంలోని బలహీన వర్గాలవారికి చేయూతను అందించాల్సిన ఈ సమయంలో బహుశా దీనికంటే మంచి ప్రాధాన్యత కల పోస్టు లేదేమో! అలాగే మరొకరిని పోస్టింగ్ చేసిన మునిసిపల్ శాఖ అయినా, ఇంకొకళ్ళను పోస్టు చేసిన హోం శాఖ అయినా, పబ్లిక్ ఎంటర్ ప్రైజస్ శాఖ అయినా, ఆర్ఖైవ్ శాఖ అయినా. అన్నీ ప్రధానమైనవే ఆలోచించి చూస్తే. కాదేదీ అప్రధానమైంది.

Wednesday, July 4, 2018

Every Government department is vital : Vanam Jwala Narasimha Rao


Every Government department is vital
Vanam Jwala Narasimha Rao
The Hans India (05-07-2018)

Few IAS officers in Telangana recently complained to the Chief Secretary that they are posted in “unimportant and insignificant” departments whereas others though not senior to them are given significant and pivotal posts. In the process, they pleaded justice to them. This sort of a complaint probably may not be justified!

Transfers of IAS officers are made for administrative reasons and better convenience of governance. If those who could not get postings of their choice express dissatisfaction openly or clandestinely, then is it possible to run the government? Pointing out their seniority and better competency, they also, unfortunately, complain that the government is biased against them. In reality, all of them ought to discharge their responsibilities without prejudice and bias, irrespective of which department they are working in and irrespective of whether it is important or insignificant. Instead of this resorting to trivial protest is unsustainable.

In 1995 September when I was posted on deputation to the DR MCR HRD Institute located in Jubilee Hills, Hyderabad, I had to face lot of difficulty to reach there, the reason being, its insignificant status and as a result its address not known to many. Those were the days when every government officer thought that to go there it was a punishment posting. Everyone felt then it was an unimportant place to work. While I was working there, Late PVRK Prasad, an IAS officer who had the reputation of working with former Prime Minister Late PV Narasimha Rao as media advisor, was posted as its Director General.  Mrs Urmila Subbarao another IAS officer was posted as Additional Director general by the then Chandrababu Naidu TDP government. In a way, as many thought, it was a punishment posting for both of them. But later it was proved otherwise.

When asked why they preferred these postings, the reply from both Prasad and Urmila was, “for relaxing”. But what had happened later was history. There was an incredible transformation of the institute slowly and steadily. An institute which was unfamiliar to many in 1995, was converted into a globally renowned one, and was placed in the world map of training as a great centre of excellence. The institute remains same even till this day. The reason was simple. An institute which was thought insignificant where posting was a punishment, was transformed into a most significant department and a priced place of posting for any officer, due to sheer hard work and indefinable commitment of Prasad and Urmila, and in the process, it has grown phase by phase. Today, anyone posted there feel proud of themselves. As far as I am concerned, I had the opportunity to tour the entire country more than once and also visit United Kingdom thanks to this institute.

Late Prime Minister Mrs Indira Gandhi before taking Late PV Narasimha Rao into her cabinet when asked him to select his portfolio, to her surprise, he had preferred Human Resources to Defence or External Affairs as thought by her. When Mrs Gandhi questioned him why he chose relatively an insignificant department, his answer was, that, in government no department is insignificant! PV transformed Human Resources into sky-high and “Challenges of Education” document was one of the consequences of his efforts. So also, when Mrs Gandhi was asked to choose her portfolio at the time of joining Lal Bahadur Shastri Cabinet, she selected to every body’s surprise, Information and Broadcasting department, which was those days a relatively insignificant one. Everyone knows that later history proved that it is an important portfolio. Late Dr Marri Channa Reddy when being inducted into the union cabinet was given steel and mines portfolio considered to be insignificant then, but, he brought name and fame to that beyond anybody’s expectations. 


When I was working with Dr M Channa Reddy as his PRO, during his second stint as CM of AP, Dr Reddy responding to a complaint of corrupt practices on municipal administration, in addition to seeking resignation of Late Koneru Ranga Rao, the then Minister, posted the secretary an IAS officer C Arjun Rao to disaster management department, thought to be relatively insignificant always. Within few months after that the state was hit by a ghastly cyclone on May 13, 1990 threatening the life and properties badly. C Arjun Rao with all his commitment and devoted work took preventive measures saving the lives of thousands of people. Later, the relief and rehabilitation measures he had taken up were unprecedented and remain as role model till today. He thus exhibited the significance and importance of disaster management department which hitherto was thought to be insignificant. The Chief Minister Dr Reddy who transferred Arjun Rao to disaster management had all the praise and it was during that time the famous “Cyclone Reconstruction Project” was envisaged. The all-time great English magazine Readers Digest published a special story on Arjun Rao later. 

During Chandrababu Naidu tenure, as part of his Vision-2020 document Agriculture was relegated to an unimportant place. Once the post of Agriculture Production Commissioner thought to be insignificant. But now, greater importance is given to Agriculture with schemes like Rythu Bandhu and Rythu Bhima.

All this leads to the conclusion that there is no insignificant department in government and all are important. It’s only the people who head them matter and depending their commitment and capacity either they become important or unimportant and that too temporarily. It is the responsibility of the IAS officer who heads the department to prove or disprove this.

Those who are selected for IAS beginning with the post of Sub-Collector raise to the level of Chief Secretary or Cabinet Secretary depending upon their efficiency, initiative and obviously opportunity. It might be true that in the erstwhile governments “influence” could have played its own role in postings but certainly not after the formation of Telangana. May be few officers who fall in that category and unable to “influence” now are preferring complaint.    

At the highest level of IAS if anyone categorises that a particular post is significant and the other is not, it is nothing but, the mindset of those officers. Any efficient and to that matter effective officer, whatever posting he or she is given, irrespective of its importance or not, will rise to the occasion and do their best to convert it as the best one.

Hence, it is not correct on the part of these few IAS officers to complain to Chief Secretary that they have been discriminated against. It is only the attitude and thinking of these IAS officers that make them feel that their postings are insignificant. If we have a look at the postings that they have been given it is crystal clear that none of them is insignificant or unimportant. One of them having worked as Collector, Commissioner Excise, Vice-Chairman Housing Board, Principal and Special Chief Secretary Revenue is now posted as Secretary SC/ST Commission. At a time when Government is going all out to extend maximum welfare benefits to SC/ST, there cannot be a better posting than this for any officer. Similarly the post of Joint Secretary Municipal Administration or Joint Secretary Home or Joint Secretary Public Enterprises or to that matter even DG Archives is not insignificant. For a fair thinker every government department is equally significant!

Sunday, July 1, 2018

సీతాదేవి సందేహాన్ని తీర్చిన హనుమంతుడు ...... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


సీతాదేవి సందేహాన్ని తీర్చిన హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (02-07-2018)
వానర, భల్లూకరాజైన సుగ్రీవుడు సీత నిమిత్తమై, గొప్ప సైన్యంతో రాముడికి సహాయపడేందుకు నిర్ణయించుకున్నాడనీ, ఆయనతో వచ్చేవారంతా అసమాన పరాక్రమవంతులనీ, దేవతలతో సమానులనీ, మనోవేగం కలవారనీ, దిక్కులలో, ఆకాశంలో సంచరించేవారనీ, వారంతా శీఘ్రంగా రాబోతున్నారనీ, ధైర్యం చెప్పాడు సీతకు హనుమంతుడు. వారెటువంటివారో చెప్తూ హనుమంతుడు ఇలా అంటాడు:

"ఎంతటి కష్టకార్యమైనా ఏ మాత్రం అలసట పడకుండా చేయగలుగుతారు. పరాక్రమవంతులు. సముద్రంతో, పర్వతాలతో వ్యాపించివున్న భూమండలాన్ని ఆకాశమార్గాన చుట్టిరాగల సమర్ధులు. వారికీ సముద్రం దాటడం చాలా చిన్నపని. వానరులలో సముద్రాన్ని దాటగల నాలాంటివారు చాలామంది వున్నారు. సుగ్రీవుడి దగ్గరున్నవారందరూ నాకంటే గొప్పవారో, సమానులో కాని తక్కువైన వాడొక్కడు కూడలేడు.

(విద్యాదరాతి వినయం అని ఆర్యోక్తి. సర్వ వేద వేదాంగ పారంగతుడు హనుమంతుడు. వినయమంటే ఎలా వుండాలో హనుమంతుడిని చూసి నేర్చుకోవాలి. నిజానికి అనంత వానర వీరవాహినిలో ఆయన్ను మించిన వారెవరున్నారని? కానీ, వాగ్విదామ్ వీరత్వం కూడా ఆయన శుభలక్షణమే. ఇలా సీతమ్మకు విన్నవించడంలో ఉదాత్త గుణసంపత్తి ఏ స్థాయిలో హనుమంతుడిని వరించిందో స్పష్టమౌతోంది).

వారిటుపక్కకు రానందున నువ్వు వారిని చూడలేదు. నా పుణ్యంకొద్దీ నేను రాగలిగాను, నిన్ను చూడగలిగాను. అంతమాత్రాన వానరులందరిలో నేనేమొనగాడినని నీవెట్లా నిశ్చయించావు? వానరులందరిలో చిన్నవాడినీ, ఒక కోతినీ అయిన నేనే నిన్ను చూడగాలేంది, అసమాన బలవంతులైన ఇతరుల సంగతి చెప్పాల్నా? రాజు శత్రువుల దగ్గరకు పంపేటప్పుడు, అల్పులను మొదట పంపుతాడుకాని, మహాబలవంతులను పంపడు కద!. ఇది రాజనీతి. ఎందుకంటే బలవంతుడు శత్రువు దగ్గర చిక్కుపడితే తన బలం తగ్గుతుంది కాబట్టి".

(ఇది తెలివిగా చెప్పొచ్చు కాని, సత్యం కాదు. అయినా ఇట్టి అసత్యం నిజంగా అసత్యం కాదు. ఇది సీతాదేవికి ధైర్యం చెప్పడానికి, చెప్పి ఆమెను ప్రాణాలతో వుంచడానికి చేసినపని. ఇందులో సదుద్దేశమేకాని, దురుద్దేశం లేదు. అసత్యదోషమూలేదు. ఆమె సందేహనివృత్తి చేయడంకూడా ఆయన ఉద్దేశ్యం).


"రామలక్ష్మణులు ఎట్లా వస్తారా అనే సందేహం కానీ, రారని శోకించడం కానీ వదులుకో. నీవు దుఃఖించే కాలంపోయింది. నేనుపోయి చెప్పగానే ఒక్కగంతేసి, వానరులొస్తారిక్కడకు. రామలక్ష్మణులు, సూర్య, చంద్రుల్లాగా నావీపుపైకెక్కి, నీ ఎదుట నిలుస్తారు. వారి బాణాగ్నికి లంకంతా పాడైపోతుంది. రావణుడిని సేనలతో సహా చంపి రాముడు నిన్ను అయోధ్యకు తీసుకుపోతాడు. మేమెప్పుడొస్తామా అని మా రాకకొరకు ఎదురుచూస్తుండు. ఏ సాహసం చేయొద్దీలోపల. మండుతున్న అగ్నిహోత్రం లాగా రామచంద్రమూర్తిని ఇక్కడ చూస్తావు. రాక్షసుడికేగతి పడ్తుందో చూడు. కొడుకులతో, చుట్టాలతో, మంత్రులతో చచ్చిపోయి రావణుడు నేలకూలగా చూసిన నీవు దుఃఖ సముద్రపు ఒడ్డుకు చేరుకుంటావు. రోహిణి చంద్రుడిని కలుసుకున్నట్లు, నీవూ నీ మగడిని కలుస్తావు".

ఇట్లా పలురకాలుగా సమాధానపరిచి ప్రయాణానికి సిధ్ధపడిన హనుమంతుడు, సీతకు మరింత ధైర్యం కలిగేటట్లు మరికొన్ని మాటలు చెప్పాడిలా: "అమ్మా! విల్లు, బాణాలు ధరించిన రామలక్ష్మణులు, త్వరలోనే లంకవాకిట్లో నిలుస్తారు. వారివెంట గోళ్లు, కోరలు ఆయుధాలుగా వుండే, సమర్ధులైన, పర్వత సమానులైన వానరులుంటారు. రావణుడి భయం వదులు. ఏ విషయంలోనూ రామచంద్రమూర్తికంటే గొప్పవాడెవరు? లక్ష్మణుడికి సమానమైన వాడెవ్వడు? వారిరువురు అగ్ని, వాయువుల్లాంటివారు. ఈ రెండూ ఏకమైతే శత్రు నిశ్శేషం చేస్తాయి. వీళ్లిద్దరూ నీకు సహాయంగా వస్తుంటే, నీకొచ్చిన భయం లేదు. నేనుపోయి రామచంద్రమూర్తిని చూడటమే ఆలస్యం. ఆ వెంటనే భయంకర వానర సమూహంతో బయల్దేరి వచ్చి శత్రువులను సంహరిస్తాడు. రాక్షసులు కాపాడుకుంటున్న ఈ లంక శాశ్వతంగా దుఃఖాల పాలుకానున్నది. ఇంద్రుడిని శచీదేవి కలుసుకున్నట్లు, నీవూ రామచంద్రమూర్తిని కలుసుకోబోతున్నావు. ధైర్యంగా వుండు".

వాడిపోతున్న మడిలోని పైరుపై వానచినుకులు పడడంతో, పచ్చబడ్డట్లు, హనుమంతుడి ప్రియమైన మాటలు సీతకు మళ్లీ ప్రాణం పోసినట్లనిపించింది. బ్రతికాననుకుంటుంది. తన భర్తను ఎలా కలిసే వీలుందో అలానే చేయమని మళ్లీ కోరుతుంది హనుమంతుడిని. ఇదివరలో హనుమంతుడికిచ్చిన గుర్తుకాక, ఇంకో రహస్యమైన గుర్తు చెప్తావినమంటుంది. అరణ్యంలో తిరుగుతున్న రోజుల్లో, గండశైలం పక్కనున్నప్పుడు, చెమటవల్ల తనముఖం మీదున్న చుక్కబొట్టు కరిగిపోతే, కాంతిహీనంగా కనిపిస్తున్న తనకు, మణిశిలను అరగదీసి తన బుగ్గమీద బొట్టుగా వినోదంకోసం తిలకం దిద్దాడని చెప్తుంది. అలా చెప్పి, ఆ సంగతి కూడా జ్ఞాపకం తెచ్చుకోమంటుంది రాముడిని. ఇంకా శ్రీరాముడిని ఉద్దేశించి ఇలా పలుకుతుంది:

"పరాక్రమంలో ఇంద్రుడూ, వరుణుడూ కలిసికట్టుగా వచ్చినా నీకు సమానం కారు. అంత పరాక్రమవంతుడవైన నీవు, నీ భార్యను, నీకు తెలియకుండా, దొంగతనంగా రాక్షసులెత్తుకునిపోయి, బాధపెట్టుతుంటే, శత్రువులాగా ఎలా వూరుకుంటున్నావు? ఇదేమన్న ప్రశస్తమైన కార్యమా? దశరథ రాజకుమారా! నీమనస్సును ఆకర్షించే శక్తి ఉన్నందునే, సముద్రజలాలలో కౌస్తుభంలాగా పుట్టిన చూడామణిని నేను దాచుకున్నాను. నీవియోగమనే అగ్ని నన్ను దహిస్తుంటే, నీళ్లలో పుట్టి, చలువ గుణం వున్న చూడామణిని నాదగ్గర వుంచుకున్నందున, నీళ్లు అగ్నిని చల్లార్చినట్లే, అది నా విరహాగ్నిని చల్లారుస్తుండేది. దీనిని చూడగానే నీవిరహాగ్నికూడా చల్లారాలి! ఇప్పుడు దీన్ని కూడా ఎడబాస్తున్నాను. ఇక ఈ దుఃఖసాగరంలో నేను ప్రాణాలు నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. అలాగైతే ఎందుకు పంపించానంటావా? ఇదివరదాకా దీని దర్శనం నీ రూపాన్ని స్మృతికి తెస్తుండేది.

(పాదాభివందనం చేసినప్పుడల్లా చూడామణిపై రామచంద్రుడి చూపులు పడతాయి కద! కాబట్టి ఆయన చూపులలో తాను చూపులు కలిపినప్పుడు ఆయనను చూసినట్లే!)

ఇప్పుడదిపోయి నిన్ను పిల్చుకొస్తుందన్న నమ్మకంతో పంపాను. ఇది సముద్రంలో పుట్టిందికనుక, సముద్రంవల్ల బాధలేకుండా నన్ను రక్షిస్తూ వచ్చింది. ఇక నన్ను రక్షించేవారెవ్వరు?"

(దీనర్థం భగవంతుడు ఎల్లవేళలా జ్ఞాపకం వుండడానికి సీతాదేవి "చూడామణి" వుంచుకున్నట్లే, ఓ పతకం కానీ, మరేదైనా చిహ్నం కానీ శరీరం పైన ధరించాలెప్పుడూ. అదిపోతే ప్రాణం పోయినట్లే. అంగలకుదురులోని శ్రీకోదండరామసేవక సమాజ సభ్యులు, సీతారామలక్ష్మణ పతకాన్ని ఎల్లవేళలా ధరిస్తారు. శరీరం వుంది భగవంతుడి స్మరణకే! దేహం లేక పోతే భగవత్ స్మరణే లేదు. భగవంతుడిని స్మరిస్తేనే గాని భగవత్ ప్రాప్తి లేదు. భగవత్ ప్రాప్తికై దేహ ధారణ చేయాలేకాని, మనమే విడిచిపెట్ట కూడదు. దానిని "అన్యప్రాకృత" విషయాల్లో వినియోగించ కూడదు. దేహంపోయే లోపల భగవత్ ప్రాప్తి కలిగే ఉపాయాన్ని వెతుక్కోవాలి. అట్టి దేహం మీద సీతాదేవి, సర్వాభరణాలు వదిలి "చూడామణి" ని మాత్రమే ప్రాణపదంగా దాచుకుంది. దాన్నీ రామార్పణం చేసి, హనుమంతుడికి తన గుర్తుగా యిచ్చి, "సర్వస్వనిక్షేపం" చేసిందయింది). 

"ప్రాణి పడటానికి వీలుకాని బాధలు పడుతూ, నోటితో చెప్పలేని మాటలు వింటూ గుండెలదురుతుంటే, రాక్షసుల మధ్య చిక్కుకున్నా, నీవున్నావన్న ధైర్యంతో, నిన్నే స్మరించి సహిస్తున్నాను. ఎంత కష్టపడైనా మరొకనెల బ్రతికుంటాను. ఈలోపల నువ్వురాకపోతే, ప్రాణాలు వాటంతటవే పోతాయి. నేను నిలుపుకోలేను. రావణుడిని చూస్తేనే నా ప్రాణాలు పోతాయి. వాడు మహా క్రూరుడు. ఇంత చెప్పినా నీ మనస్సు కరగకపోతే, ఇది నా పాప ఫలమేకాని నీ దోషంకాదు"అని దుఃఖంతో మగడిని సంభోధిస్తూ హనుమంతుడితో పలుకుతుంది సీతాదేవి.