Thursday, June 4, 2020

Irrigation projects neither in the past nor in future : Vanam Jwala Narasimha Rao


Irrigation projects neither in the past nor in future
Vanam Jwala Narasimha Rao
The Pioneer (05-06-2020)

            Telangana Chief Minister K Chandrashekhar Rao, soon after assuming charge in June 2014, on top priority, initiated action plan, aiming at providing assured irrigation facility to about 125 lakhs of acres of land in the state. 

The strategy included revival and reengineering of pending projects to suit to the needs of Telangana State and completing them on fast-track. As part of this, completion of 23 major projects and 13 medium projects were prioritised.

            Pending projects like Kalvakurti, Bhima, Nettempadu, Koyilsagar, Midmaner, Singur, Yellampally, Kinnersani, Palem Vagu, Komaram Bhim, Mattadi Vagu, Nelvai, Jagannathpur etc which were neglected by the erstwhile governments, have been kept on fast-track completion.

By 2020 irrigation facility will be made available for about 80 lakhs of acres, that is, when all the projects are completed the projection would be an additional ayacut of 53.02 lakhs acres and stabilization of 25. 93 lakhs of acres. 

              To ensure optimum utilization of the Telangana share of water in the rivers, CM KCR transformed himself as an engineer and designer and spent hundreds of hours on reengineering and redesigning of irrigation projects. Prior to state bifurcation Telangana could not make full utilization of river water as per its share.

The share of Telangana in River Godavari and River Krishna accounts for 1266 TMC besides another 150 TMC of surplus waters. But to make optimum utilization of this share there were no projects.

Through reengineering and redesigning, CM KCR ensured adequate water to South Telangana through Palamoor-Rangareddy LIS and Dindi Lift irrigation schemes and to North Telangana through Kaleshwaram. Adilabad district will get water through B R Ambedkar Pranahitha and Chanaka-Korata projects. Khammam will get through Sitarama and Bhakta Ramadasu projects.         For continuous availability of water, the Government is constructing Tupakulagudem Barrage (Sammakka Barrage) on River Godavari near Kantanapalli. This will ensure water availability at Devadula through the year.  

            Thanks to the initiative of CM KCR, full cooperation of Maharashtra Government for projects on Godavari, Pranahitha and Penganga Rivers was ensured through a historic agreement between these two sates. This paved way for Laxmi Barrage (Medigadda) on River Godavari, Tummuidihatti, Rajapeta on Penganga, Chanaka-Korata and Pimparad barrages on Penganga River. The agreement between the two states will go a long way in utilization of 967 TMC of Godavari water which is Telangana’s rightful share.  

            The Kaleshwaram project has been described as a manmade engineering wonder by several visitors to the project, that included Members of the Central Water Commission, Irrigation experts, representatives from other States etc. This is the largest multistage lift irrigation project in the country and world which is being constructed on a fast track as per the schedule.

Water from River Godavari at Medigadda, which is at 94 Meters height from the sea level, is lifted in ten stages and supplied to Kondapochamma Sagar, which is at 618 meters height. In other words, the water from Godavari River is being lifted at about half a KM height.

            After its completion, 360 TMC of water will be available from this. Initially 2 TMC of water per day is to be drawn from this project for 120 days and thus 240 TMC will be made available. It has also been decided to draw additional 1 TMC of water (Total 3 TMC) later since there is abundant water availability at Medigadda. 45 lakhs of acres will come under irrigation under this project. In Kaleshwaram Project, water will be lifted from Laxmi Barrage, Saraswathi barrage and Parvati Barrage to Yellampally Barrage through the Godavari River course in link 1.  The Pump Houses for lifting the water in link 1 are: Laxmi, Saraswathi and Parvati. Water will be lifted from Yellampally Barrage to Mid Manair Reservoir in two stages from Nandi and Gayatri pump houses in link 2. Water will be lifted from Mid Manair reservoir to Kondapochamma Sagar in five stages filling Annapurna, Ranganayaka Sagar, Mallanna Sagar reservoirs enroute in link 4.     



            As part of Kaleshwaram Project, River Godavari water has already reached Kondapochamma Sagar. By this irrigation facilities, water is made available to lands in Siddipet, Siricilla, Husnabad, Manakondur, Jangaon, Gajwel, Dubbaka, Medchal, Sangareddy, Aler, Bhuvanagiri, Pathancheru constituencies.

Water was drawn from Mid Manair reservoir through an approach channel and lifted from Annapurna Pump House and poured into Annapurna Reservoir, thus accumulating 1.7 TMC of water out of its capacity of 3.5 TMC. From there through gravity canal and tunnel reached surge pool (Chandlapur Pump House) of Ranganayaka Sagar. Through motors installed in Chandlapur Pump House, Godavari water is being lifted and poured into Ranganayaka Sagar Reservoir which is at a height of 490 meters.  Godavari water is being released to right and left canals of Ranganayaka Sagar to fill hundreds of tanks and check dams in Siddipet district.

            The historical Kondapochamma Sagar Reservoir forming part of Kaleshwaram Project, was formally inaugurated on May 29, by CM KCR in the presence of Tridandi China Jeeyar Swamy. Motors in the Markook Pump House were switched on by KCR heralding release of River Godavari waters in to Kondapochamma Sagar Reservoir through lift. From Laxmi Barrage (Medigadda) on Godavari in 10 stages of lift, water will reach Kondapochamma Sagar Reservoir of 15 TMC capacity, which is at a height of 618 meters.

            Sitarama Project works were formally grounded by CM KCR on February 16, 2016 by way of laying foundation stone at Rollapadu Village of Tekulapalli mandal, in Ellendu constituency of Khammam district. Bhakta Ramadasu Lift irrigation Project for which foundation stone was laid on February 16, 2016 by CM KCR was completed in a record time of 11 months. Pipelines, pumphouse, approach channel, sub stations construction for this project was taken up parallelly. Project was formally inaugurated by CM KCR on January 31, 2017. Through this project 58,000 acres of lands in Tirumalayapalem, Kusumanchi, Nela Kondapalli, Mudigonda, Khammam Rural, Mahaboobabad Mandals are brought under irrigation.

            Seetamma Sagar Multipurpose Project is coming up at Ammagaripally village in Ashwapuram Mandal of Bhadradri Kothagudem District on Godavari River 200 metres downstream of existing Dummugudem Anicut. Works are on fast-track on Palamoor-Rangareddy lift irrigation scheme which is a boon to erstwhile Mahbubnagar, Rangareddy and Nalgonda districts.

Government also decided to take-up Dindi project, now named after late R Vidyasagar Rao, benefiting the Nalgonda People who have been suffering from fluoride quite for decades. Foundation was laid down for this project on June 12, 2015 and works are brisk progress. Kalvakurti lift irrigation scheme which has been pending for more than three decades in erstwhile government is now about to complete and supplying irrigation water to 3.5 lakh acres in Nagarkurnool and Wanaparthy districts. 

Revival of SRSP by way of making available water in to that through reverse pumping from Kaleshwaram was also a great success.

            The Telangana State Government under the stewardship of CM KCR has left no stone unturned to see that more than one crore acres of land are brought under irrigation in the state.

When the ground reality is this, where is the necessity to protest in the name of Deeksha by the State Congress unit against the state government on the pretext of not taking up irrigation projects? END

Wednesday, June 3, 2020

వాసుదాసు ఆంధ్రవాల్మీకాన్ని మందర మకరందంగా ఎందుకు రాశాను: వనం జ్వాలా నరసింహారావు


వాసుదాసు ఆంధ్రవాల్మీకాన్ని
మందర మకరందంగా ఎందుకు రాశాను
వనం జ్వాలా నరసింహారావు
ఆప్తమిత్రుడు, హిందీ మిలాప్ వార్తా పత్రికలో పనిచేస్తున్న అనుభవజ్ఞుడైన పాత్రికేయ సన్నిహితుడు, విద్యారణ్య నేను ఆంధ్రవాల్మీకి రామాయణం సుందరకాండ రాసినప్పటి నుండి ఆ పుస్తకం కావాలని అడుగుతున్నాడు. మేమిద్దరం ఎంతో తరచుగా కలుస్తుంటాం. కాని భగవదేచ్చ మనకర్థం కాదు కదా! ఎన్నిసార్లు నేను ఇవ్వాలనుకున్నా, ఆయన నాదగ్గర నుండి తీసుకోవాలనుకున్నా అది సాధ్యపడలేదు. చివరకది నేను రామాయణం అన్ని కాండలను పూర్తిచేసిన తరువాత కాని వీలుకలగలేదు. రెండు-మూడు రోజుల కింద నా పుస్తకాల పూర్తి సెట్టు ఆయనకు చేరాయి. వెంటనే చదవడం మొదలుపెట్టిన విద్యారణ్య నాకు వాసుదాసుగారి ఆంధ్ర వాల్మీకి రామాయణం రాయాలన్న ఆలోచన ఎలా కలిగిందనీ, ఎందుకు కలిగిందనీ, ఆ వివరాలన్నీ రాయాలనీ అడిగాడు. గతంలో అవన్నీ కొంతవరకు రాసినప్పటికీ, మళ్లీ స్నేహితుడి సలహా ప్రకారం రాస్తున్నాను దీన్ని.   

2003 లో మా రెండో అమ్మాయి కిన్నెర సిన్సినాటి (అమెరికా) లో వున్నప్పుడు దాని కూతురు ప్రసవ సమయంలో సహాయంగా వుండడానికి  దంపతీ సమేతంగా వెళ్లిన నేను హైదరాబాద్ లో మొదలుపెట్టిన సుందరకాండ మందర మకరందం పుస్తకాన్ని పూర్తిచేసాను. కొంతకాలానికి, మిత్రుల, సన్నిహితుల ప్రోత్సాహంతో బాలకాండ మొదలుపెట్టాను. అయితే, కారణాలు ఏమైనప్పటికీ, ఆ తరువాత చాలాకాలానికి గాని, అంటే, 2009 లో మా అబ్బాయి ఆదిత్య అమెరికా సాన్ ఫ్రాన్సిస్కో నగరంలో వున్నప్పుడు, మా మనవరాలు కనక్ పుట్టే సమయంలో అక్కడికి పోయినప్పుడు, బాలకాండ మందర మకరందం పూర్తి చేయగలిగాను. అది తీసుకుని ఒక పబ్లిషర్ దగ్గరికి వెళ్తే మొత్తం రామాయణాన్ని రాసిన తరువాత అన్నీ కలిపి ముద్రిస్తానన్నాడు. అదోక ఛాలెంజ్ లాగా తీసుకున్నాను. అన్ని కాండలు రాయాలని నిశ్చయించుకున్నాను. బాలకాండ మొదటి ముద్రణ చిన జీయర్ స్వామి దయతో జరిగింది.

తరువాత అయోధ్య కాండ మందర మకరందం మొదలుపెట్టాను. అది సాగనివ్వదని పలువురు చెప్పిన మాట నిజమేమో అన్నట్లుగా అది పూర్తి చేయడానికి చాలా కాలం పట్టింది. దాన్ని హైదరాబాద్ లో, సింగపూర్ లో కూడా రాశాను. కాని చివరకు 2017 లో మరోమారు అమెరికా పర్యటనకు సాన్ ఫ్రాన్సిస్కో, హ్యూస్టన్ నగరాలకు అబ్బాయి, అమ్మాయిల దగ్గరికి వెళ్లినప్పుడు పూర్తి చేయగలిగాను. తరువాత రెండేళ్ళు అమెరికా రావడం కుదరలేదు. అరణ్యకాండ మందర మకరందం, కిష్కింధ కాండ మందర మకరందం హైదరాబాద్ లోనే పూర్తి చేశాను. యుద్ధకాండ మొదలు పెట్టాను. కాని అది కూడా అమెరికాలోనే పూర్తి కావాలని వుందేమో! అమెరికా రావడం (2019 నవంబర్) పూర్తి చేయడం జరిగింది. ఆ విధంగా మొత్తం రామాయణం ఆరు కాండలు రాయడానికి పదహారేళ్ల సుదీర్ఘ కాలం పట్టింది. ఆ విధంగా పదహారు సంవత్సరాల యజ్ఞం పూర్తయింది.

నేను రామాయణం రాయడానికి పూర్వ రంగం వుంది.         
తొమ్బైవ దశకం చివర్లో నేను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పనిచేస్తున్న రోజుల్లో సంస్థ కేటాయించిన క్వార్టర్ లో నా నివాసం. అప్పట్లో, మా పొరుగునున్న శ్రీమాన్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు లేచింది మొదలు నిద్ర పోయేదాక రామనామం తప్ప దేని మీద మనస్సు పోనీయడు. ప్రతినిత్యం రామాయణ పారాయణం చేస్తూ వుంటాడు. నా కంటే వయస్సులో చిన్న వాడైనా, జ్ఞానవృధ్ధుడు. నా నిత్య కృత్యాలు చాలవరకు ఆయనకు నచ్చవు. నేనంటే మాత్రం ఇష్టం. ఆయన ఉదయం అనుష్టానం చేసుకుంటుంటే, చనిపోయిన మా నాన్న స్వర్గీయ వనం శ్రీనివాసరావు గారు గుర్తొచ్చేవారు.

నాన్నగారు వాసుదాసు గారు రచించిన ఆంధ్ర వాల్మీకి రామాయణం, మందరం అన్ని కాండల్నీ, కనీసం పాతిక సార్లకు పైగా పారాయణం చేసినవారు. వాసుదాసుగారూ ఆయన శిశ్యులు సుబ్బదాసుగారూ (దాసశేషుడు) ఖమ్మం జిల్లాలోని వనంవారి కృష్ణాపురం గ్రామంలో వున్న మా ఇంట్లో వారి పాదాలు మోపి మా ఇంటిని పావనం చేసారు నా బాల్యంలో చాలా సంవత్సరాల కింద. నేనూ మా నాన్నగారితో నా చిన్నతనంలో తెనాలి దగ్గర అంగలకుదురులోని వారి ఆశ్రమానికి వెళ్లాను ఒకటి-రెండు సార్లు.

         వాసుదాసుగారి ఆంధ్ర వాల్మీకంలోని ప్రతి కాండకొక ప్రత్యేకతుంది. ప్రతికాండ ఒక్కోరకమైన విజ్ఞానసర్వస్వం. ప్రతి కాండలోని, ప్రతి పద్యానికి, ప్రతి పదార్థం ఇస్తూ, చివరకు తాత్పర్యం రాస్తూ, అవసరమైన చోట నిగూఢార్థాలను-అంతరార్థాలను-ఉపమానాలను ఉటంకిస్తూ, సాధ్యమైనంత వరకు ఇతర గ్రంథాల్లోని తత్సంబంధమైన అంశాలను పేర్కొంటారు కవి. ప్రత్యుత్తరం కోరి చదవాల్సిన విషయాలన్నింటికీ సోదాహరణంగా జవాబిస్తారు. శ్రద్ధగా చదువుకుంటూ పోతే-అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ చదువగలిగితే, ప్రతి కాండలో ఆ కాండ కథా వృత్తాంతమే కాకుండా, సకల శాస్త్రాల సంగమం దర్శనమిస్తుంది. ఒక సారి ధర్మశాస్త్రం లాగా, ఇంకో సారి రాజనీతి శాస్త్రం లాగా, మరో చోట ఇంకో శాస్త్రం లాగా బోధపడుతుంది. ప్రతికాండ ఒక భూగోళ శాస్త్రం-ఖగోళ శాస్త్రం-సాంఘిక, సామాజిక, ఆర్థిక, సామాన్య, నీతి, సంఖ్యా, సాముద్రిక, కామ, రతి, స్వప్న, పురా తత్వ శాస్త్రం లాగా దర్శనమిస్తుంది. బహుశా, క్షుణ్ణంగా చదివితే, ఇంకెన్నో రకమైన శాస్త్ర విషయాలు గోచరిస్తాయి. అసలు-సిసలైన పరిశోధకులంటూ వుంటే, మందరం ఏ ఒక్క కాండ  మీద పరిశోధన చేసినా, ఒకటి కాదు-వంద పీహెచ్‌డీలకు సరిపోయే విషయ సంపద లభ్యమవుతుంది. డాక్టరేట్ తో పాటు, అద్భుతమైన రహస్యాలు అవగతమౌతాయి.


మా శ్రీమతికి మా నాన్న గారి పూజ-పునస్కారాల వారసత్వం వచ్చింది. నాకంతగా అబ్బ లేదు. ప్రక్కనున్న విజయరాఘవ గారినీ,  ఆయన భక్తి సంబంధమైన మాటలను ఎప్పుడూ వింటుంటే ఆమె: " మీరు అన్న గారి మార్గంలోనన్నా పోతారు, లేదా, ఆయన మీ దారికన్నా వస్తారు" అనేది, మేమిద్దరం చర్చించుకుంటుంటే. అదే నిజమైంది కొద్ది రోజుల్లో. నేను రామాయణం చదువుతాను, మీదగ్గరుంటే ఇవ్వండి, అయితే వాసుదాసు గారు వ్రాసిన ఆంధ్రవాల్మీకి రామాయణం మాత్రమే కావాలన్నాను. అలా అడగటానికీ, అదే కావాలంటానికీ, ప్రత్యేక కారణం ఏమీ లేదు. కాకపోతే నా చిన్న తనంలో, మా నాన్న గారు "మందరం" పారాయణం చేస్తుంటే చూశాను కనుక అది మాత్రమే రామాయణమేమో అనుకున్నాను. ఆయితే నేను రామాయణం చదువుతానంటే ఆయన కొన్నాళ్ళు నమ్మలేదు. నేనూ గట్టిగా అడగనూలేదు. ఆయన ఇవ్వనూ లేదు. నేను ఆలోచన వచ్చిన వెంటనే చదవటమూ జరగలేదు.

         మళ్ళీ నిత్య జీవితం. దైనందిన చర్యలు. మధ్యలో మా జిల్లాలోనే వున్న భద్రాచల రాముడినీ, పొరుగు రాష్ట్రంలో ఉన్న శ్రీరంగనాధ స్వామినీ, దర్శించుకొనే భాగ్యం కలిగింది, డిసెంబర్ 2002-జనవరి 2003 లో. "శ్రీ రామావతార సమయంలో శ్రీ సీతా రాముల దర్శనం ఏదోవిధంగా కలగందే ఈ జన్మలో శ్రీరంగనాధుని (శ్రీరంగం) దర్శనం కలగనే కలగదు" అన్నారు విజయరాఘవ గారు. జనవరి 15, 2003 న తన ఇంట్లోకి పిల్చి, స్నానం చేసి రమ్మని, వాసుదాసుగారి శ్రీమదాంధ్రవాల్మీకి రామాయణం సుందరకాండ మందరం నా చేతిలో పెట్టారు. రామాయణం మొత్తం చదవడం తర్వాత, ముందిది చదవమన్నారు. ఎందుకంటే, రామాయణం పఠనమో, పారాయణమో సుందరకాండ తోనే మొదలెట్టాలన్నారు. అవునేమోననుకుని చదవడం ప్రారంభించాను.

         సరీగ్గా పది రోజుల్లో ఆసాంతం చదివాను. ఏరోజుకారోజు, వీలున్నప్పుడల్లా చదివేవాడిని. చదివిన విషయ సారాంశం ఎప్పటికప్పుడు బడి పిల్లాడిలా, విజయరాఘవ గారికి అప్ప చెప్పే వాడిని. వశిష్ఠుడి నోట బ్రహ్మర్షి అంటేనే విశ్వామిత్రుడు ఒప్పుకున్నాడట! నేను చదువుతున్నానన్న నమ్మకం ఆయనకు కలిగితేనే నాకెందుకో తృప్తనిపిన్చేది. పదిరోజుల్లో చదవడం గొప్ప కాదు. నన్ను ప్రేరేపించి, ప్రోత్సహించి చదివించిన ఆయన గొప్పతనం అది. వాల్మీకి సంస్కృతంలో వ్రాసిన ఇరవైనాలుగు వేల శ్లోకాలను ఎప్పుడంటే అప్పుడు ప్రతిపదార్థంతో సహా అప్పచెప్పగల సమర్ధుడాయన!

ఆరువందల డెబ్భై పేజీల పద్య-గద్య-ప్రతిపదార్ధ తాత్పర్య సహిత సుందరకాండ మందరాన్ని చదవడానికైనా, పారాయణం చేయడానికైనా, నాలాంటి చాలామందికి తీరికా, ఓపికా వుండదేమో అనిపించింది. తెలుగు భాషలో కనీస ప్రావీణ్యత వున్నవారికి అర్ధమయ్యే రీతిలో వాసుదాసుగారి సుందరకాండ మందరాన్ని, ఆయనే "వక్తగా", నేను కేవలం "వాచవిగా"-"అనువక్తగా" శిష్ట వ్యావహారిక భాషలో సంక్షిప్తీకరించి నలుగురికీ అందించగలుగుతే బాగుంటుందేమో అనుకున్నాను.

ఇంతలో అనుకోకుండా సిన్సినాటి (అమెరికా) లో వుంటున్న మా అమ్మాయి కిన్నెర దగ్గరకు మా ఆవిడతో సహా వెళ్లాల్సి వచ్చింది, మనుమరాలు పుట్టబోయేముందర మా అమ్మాయికి తోడుగా వుండేటందుకు. అక్కడ మళ్ళీ మొదలెట్టి ఓ నెల రోజుల వ్యవధిలో శ్రీరామానుగ్రహం వల్ల పూర్తి చేసాను.

ఎందరో సహృదయులు, అందరికీ కృతజ్ఞతలు. సుందరకాండ మందర మకరందం వ్రాయడానికి వాడిన కలం కానీ, కాగితం కానీ, టైపు చెసిన కంప్యూటర్లు కానీ నావి కావు. ఆలాంటప్పుడు రాసింది నేను మాత్రమేనని, రాసిన విషయమంతా నా కృషివల్లనే జరిగిందని ఎలా అనగలను? నేనేంటి? ఆంధ్రవాల్మీకి రామాయణం సుందరకాండ మందరం చదవడమేంటి? చదివిన తర్వాత మందర మకరందంగా మలచడమేంటి? తెలుగు సాహిత్యంలో, రచనా వ్యాసంగంలో అంతో, ఇంతో ప్రవేశం వున్న మాట కొంత వాస్తవమే అయినప్పటికీ, ఆంధ్రవాల్మీకి సుందరకాండను మందర మకరందంగా మలిచే శక్తి నాకు కలగడమేంటి?

ఇదంతా బహుశా ఏదో అద్భుత, అజ్ఞాత, అప్రమేయ శక్తి నాతో కావాలనే చేయించి వుంటుంది! ఆ శక్తే నన్ను మూడు నెలలు ఈ పనికొరకై అమెరికా పంపించి వుంటుంది! నేను అమెరికా ఒహాహియో రాష్ట్రంలోని సిన్సినాటి లో వున్న మా అమ్మాయి ఇంట్లో వున్నప్పుడు, ఆ శక్తే మా అమ్మాయి కిన్నెర, అల్లుడు గారు కిషన్ లో జొరబడి, వాళ్ల ద్వారా, ఆ ఇంట్లో నాకు అనువైన వాతావరణం కలిగించి వుంటుంది! వ్రాయడానికి అవసరమైన కాగితాలు, అన్ని రకాల పెన్నులూ వాళ్లతో ఇప్పించి వుంటుంది ఆ శక్తే! వ్రాసిన దానిని నేనే స్వయంగా కంప్యూటర్ ద్వారా తెలుగులో టైపు చేసుకునేందుకు అవసరమైన సాఫ్ట్ వేర్ ను అల్లుడిగారి ద్వారా తెప్పించిందీ ఆ శక్తేనేమో! ఇంగ్లీష్ లోనే సరీగ్గా కంప్యూటర్ వాడకం అప్పటికి ఇంకా రాని నాతో 300 పేజీలకు పైగా టైపు చేయించింది ఆ శక్తేనేమో! ఎప్పటికప్పుడు కంప్యూటర్ ప్రింట్లు మా అల్లుడు గారి ద్వారా తీయించి ఇచ్చింది ఆ శక్తేనేమో!

నా వ్రాత ప్రతి అయిన మరునాడే, దాన్ని పిట్స్ బర్గ్ లోని వెంకటేశ్వరస్వామి పాదాల దగ్గర పెట్టే అవకాశం దొరికింది. ఆ తరువాత స్వర్గీయ పీవీఆర్కే ప్రసాద్ గారు దాన్ని ఆవిష్కరించారు. ఇదిప్పటికి మూడు సార్లు ప్రచురించాను. బాలకాండ చినజీయర్ స్వామి దయతో ప్రచురించాను మొదటిసారి. అది కూడా ఇప్పుడు రెండో సారి ముద్రించడం జరిగింది. అయోధ్య, అరణ్య, కిష్కింధ, యుద్ధ కాండలు కోరమండల్ సీతారామయ్య గారి ఆర్ధిక సహాయంతో వెలుగులోకి వచ్చాయి. డాక్టర్ వుయ్యూరి లోకేష్ కూడా సహాయం చేశారు.

మా నాన్న గారు ఇప్పుడు జీవించి వుంటే బహుశా ఆయన కంటే ఈ విషయంలో సంతోషించే వారెవరూ వుండరు! ఆయన బ్రతికున్నప్పుడు నేనెట్లా వుండాలని కోరుకున్నాడో అలా కొంతవరకూ వున్నానంటానికి ఈ పుస్తకమే నిదర్శనం.

వసిష్ఠ శక్తి సులభమైంది కాదా? ..... వనం జ్వాలా నరసింహారావు


వసిష్ఠ శక్తి సులభమైంది కాదా?
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక, చింతన (04-06-2020)  
మిథిలాలానగరం వచ్చిన విశ్వామిత్రుడు ద్వారా శ్రీరామచంద్రమూర్తి దర్శనం తనకు కలిగినందుకు, అహల్యా-గౌతముడి కుమారుడైన శతానందుడు విశ్వామిత్రుడు సామాన్యుడు కాదని, ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మర్షితనాన్ని సంపాదించాడని, శ్రీరామచంద్రుడికి చెప్పాడు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే....

ధర్మస్వభావుడైన విశ్వామిత్రుడు రాజ్యపాలన చేస్తూ, ఒక పర్యాయం, సేనలతోగూడి భూమంతాతిరుగుతూ వశిష్ఠాశ్రమాన్ని చూశాడు. ఆశ్రమం లోపలికి పోయి, వినయ విధేయతలతో వశిష్ఠుడికి నమస్కరించాడు. అప్పుడు వశిష్టుడు, సేనలతో సహా అతడికి ఆతిథ్యమిచ్చి గౌరవించదల్చుకున్నాననీ, అంగీకరించమనీ కోరాడు. విశ్వామిత్రుడు ఆతిథ్యం తీసుకునేందుకు అంగీకరించాడు. వెంటనే వశిష్ఠుడు తన కామధేనువైన శబలను పిలిచి, అన్ని రకాల భోజ్యాల్ని ఏర్పాటుచేయమని ఆదేశించాడు. వశిష్ఠుడు చెప్పిన విధంగానే, కామధేనువు, రకరకాల భక్ష్యభోజ్యాలను, ఎవరేదికోరితే దాన్నిసృష్టించింది. మంత్రులతోను, బ్రాహ్మణాదులతోను, సైన్యంతోను కలిసి రాజు సంతృప్తిగా, కడుపునిండా భోజనంచేసాడు.

భోజనానంతరం, విశ్వామిత్రుడు, తనకు కామధేనువు శబలనివ్వమని అంటాడు. శబలను ఎడబాయనంటాడు వశిష్ఠుడు. తనను విడిచి శబల కూడా వుండలేదన్నాడు. తాను సర్వం కామధేనువుతోనే నెరవేర్చుకుంటున్నాననీ, దానికి ఎన్నో విద్యలు కూడా వచ్చనీ, తనకది అవ్యానందానికి కారణమైందని, అలాంటి దాన్ని తను విడిచి ఎలా వుండాలనీ విశ్వామిత్రుడిని ప్రశ్నించాడు వశిష్థుడు. కామధేనువును తానివ్వకపోవడానికి మరెన్నో కారణాలను కూడా చెప్పాడు.

వశిష్ఠుడలా కామధేనువును ఇవ్వనని చెప్పగానే, విశ్వామిత్రుడు బలవంతంగా దానిని తీసుకొని పోసాగాడు. తనను ఈడ్చుకొనిపోతున్న భటుల కట్లు తెంచుకొని, మునీశ్వరుడి వద్దకు పోతుంది. క్షత్రియ బలమొక బలమేకాదని, బ్రాహ్మణబలం లెక్కలేని మహిమగలదని, రాజెంత బలవంతుడైనా వశిష్ఠుడికంటే గొప్పవాడుకాదనీ, తనకాజ్ఞ ఇస్తే రాజు సేనంతా నాశనంచేస్తాననీ కామధేనువైన శబల అంటుంది. ఆలా ప్రార్థించిన శబలను, శత్రువులు నివ్వెరపోయేట్లు. వారి రూపం చెడిపోయేట్లు చేయగల, అనేకమంది శూరులను సృష్టించమని ఆదేశించాడు వశిష్ఠుడు.

వశిష్ఠుడి ఆజ్ఞ లభించగానే, శత్రు సమూహాలకు భయంకలిగించే పప్లవులనే శూరులను తన హుంభారవంతో శబల సృష్టించింది. కామధేను కల్పిత శూరులు విశ్వామిత్రుడి సైన్యాన్నంతా రూపుమాపి విజృంభించారు. అది చూసిన పరాక్రమవంతుడైన విశ్వామిత్రుడు, కోపంతో కళ్లెర్రచేసి, భయంకర బాణాలతో పప్లవ శూరులను చంపి నిస్సారంగా భూమ్మీద పడేటట్లు చేశాడు. విశ్వామిత్రుడిపై పగబట్టిన ఆవు, బట్టిసాలు ధరించి యుద్ధం చేయగల యవనశక సేనల గుంపులను అపారంగా సృష్టించింది. ఆ యవనులు, శకులు, కార్చిచ్చు అడవిలో పడ్డట్లు, రాజు సైన్యం మీదపడి దహిస్తుంటే, వాళ్లందరినీ విశ్వామిత్రుడు తన అస్త్రాలతో పీనుగుపెంటల్లా చేసాడు.

         విశ్వామిత్రుడి భయంకరమైన శస్త్రాస్త్రాలతో కాలిపోయిన తన సైన్యాన్ని చూసిన వశిష్ఠుడు, యోగ బలాన్ని ఆశ్రయించి శీఘ్రంగా శత్రు సేనలను సంహరించమని శబలను ఆజ్ఞాపించాడు. వెంటనే హుంకరించిన కామధేనువు మహావీరులను సృజించింది. వారందరు శత్రు సేనలపై పడి, వారి రథాలను, ఏనుగులను, గుర్రాలను, సైన్యాన్ని నాశనం చేసారు. సిగ్గుతో కుమిలిపోయిన విశ్వామిత్రుడు, వశిష్ఠుడిని గెలిచేదెలానని మధన పడి, ఎలాగైనా వశిష్ఠుడిని జయించాలన్న పట్టుదలతో, రాజ్యభారాన్ని కొడుకుకప్పగించి, హిమవత్పర్వతానికి పోయి, శివుడికొరకు తపస్సు చేశాడు.

శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాల్నో కోరుకొమ్మన్నాడు. విలువిద్యనంతా అంగాలతో, ఉపాంగాలతో, మంత్రాలతో, వాటి రహస్యాలన్నిటితో తనకు ఉపదేశించమని ప్రార్థించాడు విశ్వామిత్రుడు. రాక్షసుల వద్ద, మునుల వద్ద, గంధర్వుల వద్ద, యక్షుల వద్ద, దేవతల వద్ద వున్న అస్త్రవిద్యలన్నీ తనకుపదేశించమని కోరాడు. ఆయన కోరినట్లే శివుడు ఉపదేశించి పోయాడు. అస్త్రాలన్నీ తన స్వాధీనంలోకి వచ్చాయన్న ధైర్యంతో, గర్వంతో విశ్వామిత్రుడు వశిష్ఠుడున్న ఆశ్రమానికి వచ్చాడు.

         విశ్వామిత్రుడు, వశిష్ఠుడి తపోవనమంతా, కాల్చి బూడిద చేశాడు. కోపగించిన వశిష్ఠుడు, విశ్వామిత్రుడిని మందలించాడు. తపోవనాన్నంతా కాల్చివేసిన చెడుబుద్ధిగల విశ్వామిత్రుడిని ఇక సహించలేనని అంటూ, సాధ్యంకాని తేజస్సుతో అతన్ని తేరిపార చూశాడు వశిష్ఠుడు. ఇంత చెప్పినా విశ్వామిత్రుడు వినిపించుకోకుండా, అస్త్రం వెంట అస్త్రాన్ని ప్రయోగిస్తుండడంతో, వశిష్ఠుడు తనదగ్గరున్న రెండవ యమదండంలాంటి, కాలాగ్ని జ్వాలలను చిమ్మే ప్రకాశవంతమైన బ్రహ్మ దండాన్ని చేతిలో పట్టుకొని మాట్లాడకుండా నిలబడ్డాడు.

 అయినా ఆగని విశ్వామిత్రుడు తనదగ్గరున్న ఆగ్నేయాస్త్రాన్ని మునిపై ప్రయోగించాడు. తనపైకొస్తున్న అస్త్రాన్ని చూసిన వశిష్ఠుడు, విశ్వామిత్రుడిని నీచ క్షత్రియుడా అని సంబోధిస్తూ: తనక్కడే నిలుచున్నాననీ, ఆతడి బలమెంతో, చలమెంతో, శస్త్రాస్త్రాల పాండిత్యమెంతో చూపమని, ముందు వాటన్నిటినీ భస్మం చేసి, ఆతర్వాత ఆతడిని భూమి మీద లేకుండా చేస్తానని, క్షత్రియ బలానికి, బ్రాహ్మణ బలానికి తేడా అతడికి తెలియదని, దివ్యమైన బ్రాహ్మణ బలాన్ని ఇక చూపబోతున్నానని, అంటూనే, విశ్వామిత్రుడి ఆగ్నేయాస్త్రాన్ని తన బ్రహ్మ దండంతో చల్లార్చాడు.


అంతటితోనూ ఆగకుండా విశ్వామిత్రుడు, రకరకాల శస్త్రాస్త్రాలను వశిష్ఠుడి మీద ప్రయోగించాడు. వీటన్నిటినీ వశిష్ఠుడు తన బ్రహ్మ దండంతో హరించివేశాడు. తన అస్త్రాలన్ని వ్యర్థమై పోవడంతో, దీర్ఘమైన కోపంతో, భయంకరాకారుడై, దేవతా గణం, ముల్లోకాలు భయపడుతుండగా, బ్రహ్మాస్త్రాన్ని సంధించి విడిచాడు విశ్వామిత్రుడు.

తనమీదకొస్తున్న బ్రహ్మాస్త్రాన్ని చూసిన వశిష్ఠుడు, చేతిలో బ్రహ్మదండాన్ని పట్టుకొని, దేవతలంతా విభ్రాంతితో గమనిస్తుంటే, దాన్ని మింగాడు. బ్రహ్మాస్త్రాన్ని మింగిన వశిష్ఠుడు మిక్కిలిభయంకరంగా కనిపిస్తుంటే, ఆయన రోమకూపాలనుండి, అగ్నిజ్వాలలు ప్రవహించసాగాయి. ఆ మహా ఋషి శ్రేష్టుడిని, ఋషీశ్వరలందరు ప్రార్థించారు. వశిష్ఠుడి తపో బలమింతని చెప్పలేమని, సత్కీర్తిగల ఆయన తన తేజస్సును శమించజేయాలని, బ్రాహ్మణోత్తముడైన ఆయన చేతిలో విశ్వామిత్రుడు ఓటమి చెందాడని అంటారు వారంతా. ఇలా తనను ఋషీశ్వరులందరు కోరడంతో, వశిష్ఠుడు శాంతించాడు. ఇదంతా చూసిన విశ్వామిత్రుడికి ఏంచేయాల్నో తెలియక నిట్టూర్పులు విడిచి దుఃఖంతో తనలో తానే ఆలోచించసాగాడు. తన క్షాత్రం వ్యర్థమయిందని, అస్త్రాలన్నీ వ్యర్థమయ్యాయని, వాటితో తనకింక అవసరం లేదని, బ్రాహ్మణుడై, శాంత చిత్తుడై, ఇంద్రియాలను జయించినందువలనే కదా వశిష్ఠుడికింత మహాత్మ్యం కలిగిందని అనుకుంటాడు. తనుకూడా శాంత చిత్తుడై, ఇంద్రియాలను జయించి, బ్రాహ్మణుడు కావడానికి ప్రయత్నించాలని అనుకొని, తపస్సు చేసేందుకు సిద్ధమవుతాడు.

వశిష్ఠుడి మహాత్మ్యానికి కారణం ఆయన నిరంతరం చేస్తున్న జపమే. ఆయన జపించే మంత్రం "గాయత్రి" మంత్రం. గాయత్రీ మంత్రమే బ్రహ్మాస్త్రం. అది జపించడం వల్లే, వశిష్ఠుడింతటి మహాత్మ్యంగలవాడయ్యాడు. ఇంకో క్షత్రియుడయితే, బ్రహ్మాస్త్రం తగిలితే చనిపోవాల్సిందే. ఒకవేళ అతడికి కూడా బ్రహ్మాస్త్ర ప్రయోగం వస్తే శత్రువు అస్త్రాన్ని అణచి వేయొచ్చు. ఇవేవీలేకుండా, వశిష్ఠుడు దాన్నిమింగి జీర్ణించుకున్నాడు. తపోబలంతో, జపబలంతో, బ్రాహ్మణ్యంతో వశిష్థుడి దేహమే బ్రహ్మమై వుండగా, ఆయన్నెవరేం చేయగలరు? కార్చిచ్చుమీద చిచ్చుబుడ్లు ప్రయోగిస్తే ఏం జరుగుతుందో అదేజరిగింది వశిష్ఠ, విశ్వామిత్రుల మధ్య జరిగిన "ఆత్మ-అనాత్మల" యుద్ధంలో. వశిష్ఠ విజయం నిజానికి గాయత్రీ విజయమే. అంతటి గొప్పదైన గాయత్రిని అధికరించి చెప్పబడిందే, శ్రీమద్రామాయణం లేదా శ్రీమధాంద్ర వాల్మీకిరామాయణం. అందుకే ఇవి సర్వోత్కృష్ట  గ్రంథాలని వేరే చెప్పాల్సిన పనిలేదు.

గాయత్రీ బీజసంయుతమైన వాల్మీకిరామాయణంలో, ప్రతి అక్షరానికి, గాయత్రీ మంత్రంలోని ఒక్కొక్క అక్షరానికి ఎంత మహిముందో, అంతే మహిముంది. వశిష్ఠ విశ్వామిత్ర యుద్ధం, బ్రాహ్మణ క్షత్రియ యుద్ధం మాత్రమేకాదు. ఆత్మవిద్యకు, అనాత్మవిద్యకు మధ్యజరిగిన యుద్ధం. సంపూర్ణంగా అనాత్మవిద్య నేర్చుకున్నప్పటికీ, వాడు, ఆత్మవంతుడిని గెలవలేడు. విద్యావంతుడి దౌష్ట్యం, ఆత్మవంతుడి సాధుస్వభావం కూడా ఈ యుద్ధంలో స్పష్టంగా కనిపిస్తుంది. వశిష్ఠుడు, ఆద్యంతం తనను తాను రక్షించుకునే ప్రయత్నమే చేశాడుకాని, తన ఉప్పుతిని, కృతఘ్నుడై, దివిటీ దొంగలా తన సొమ్ము అపహరించేందుకు పూనుకున్నవాడినీ, తన ఆశ్రమాన్నంతా పాడుచేసి తనను చంపే ప్రయత్నం చేసినవాడినీ, దెబ్బకు-దెబ్బ అనిగూడా కీడుతలపెట్టలేదు. ఇదే ఆత్మవంతుడైన బ్రాహ్మణుడి లక్షణం. బ్రాహ్మణుడు ఇతరులవల్ల నష్టపడినాగాని, పరులకు హానితలపెట్టడు. వశిష్ఠుడు ఇంతజరిగినా విశ్వామిత్రుడిని శపించలేదు.

         వశిష్ఠుడితో ఓటమికి కుమిలిపోతూ, విశ్వామిత్రుడు దక్షిణ దిక్కుగా పోయి, తీవ్రమైన తపస్సు చేసాడు. వేయి సంవత్సరాలు తపస్సుచేసింతర్వాత, బ్రహ్మ ప్రత్యక్షమై, ఆయన రాజర్షిగా  అయ్యాడని వరమిచ్చాడు. తనింతకాలం తపస్సు చేసింది రాజర్షికావడానికానని పరితపించి, మునుపటికంటే గొప్పగా తపస్సు చేయసాగాడు.

         వెయ్యేళ్లు విశ్వామిత్రుడిలా ఘోరమైన తపస్సు చేయడంతో, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆయన ఋషి అయినాడని చెప్పి అంతర్థానమయ్యాడు. ఆ మాటలకు తృప్తి చెందని విశ్వామిత్రుడు, అంతకంటే ఘోరమైన, కఠోరమైన తపస్సు చేయసాగాడు. మేనక ఆయన తపస్సు విఘ్నం చేస్తుంది. అందులోంచి బయటపడి  వెయ్యి సంవత్సరాలు నిశ్చలుడై-నిర్విఘ్నంగా తపస్సు చేశాడు విశ్వామిత్రుడు. బ్రహ్మదేవుడు మళ్లీ ప్రత్యక్షమై విశ్వామిత్రుడి దగ్గర కొచ్చి, ఆయన మహర్షి అయ్యాడని అంటాడు. ఆయన మాటలకు విశ్వామిత్రుడు పొంగిపోలేదు. తను జితేంద్రియుడనయ్యానా అని బ్రహ్మను ప్రశ్నించాడు. ఆయనింకా జితేంద్రియుడు కాలేదని, దానికొరకు ఇంకా ప్రయత్నంచేయాలని, ఆయన మనస్సు వికారం పొందేందుకు అవకాశమున్నప్పటికీ అలా కానీయకుండా చేయగలిగినప్పుడే జితేంద్రియుడవుతాడని జవాబిచ్చాడు బ్రహ్మ.

విశ్వామిత్రుడు తిరిగి కామాన్ని జయించడంకొరకు, వెయ్యేళ్లు విశేష నియమంతో తపస్సు చేశాడు. ఎన్ని విఘ్నాలొచ్చినా, ఎవరు కలిపించ తలపెట్టినా కోపం తెచ్చుకోలేదు. విశ్వామిత్రుడి దగ్గర కొచ్చిన బ్రహ్మ, అతడి తపస్సు ఫలించిందని చెప్పి, అతడికి బ్రాహ్మణత్వం లభించిందంటాడు. తపస్సు చాలించి లెమ్మంటాడు. బ్రాహ్మణుల వేదాలు, క్షత్రియుల వేదాలు అందరికంటే మొదలు తెలిసిన వశిష్ఠుడు వచ్చి, తనకు బ్రాహ్మణ్యం లభించిందని అంగీకరించాలని, అంతవరకు తాను బ్రాహ్మణుడనేనన్న నమ్మకం తనకు కలగదని అంటాడు. ఆయన కోరిక మేరకు దేవతలు వశిష్ఠుడి వద్దకు పోయి, అది నెరవేర్చమని ఆయన్ను ప్రార్థించారు. ఆ మహా తపస్వి వచ్చి, విశ్వామిత్రుడితో స్నేహం చేసి, అతడు బ్రహ్మర్షి అయ్యాడని చెప్పాడు. విశ్వామిత్రుడు నిజమైన బ్రహ్మర్షి అయ్యాడని, బ్రాహ్మణులకు అధికారమున్న కార్యాలన్నీ ఆయనా చేయవచ్చని, ఆ అధికారం ఆయనకు లభించిందని దేవతలు చెప్పి వెళ్లిపోయారు. విశ్వామిత్రుడు కూడా వశిషిష్ఠుడితో స్నేహం చేశాడు.

విశ్వామిత్రుడు తొలుత రాజు. గృహస్థుడు. భార్యతో సహా పోయి వానప్రస్థుడై తపస్సు చేసి రాజర్షి అయ్యాడు. అడవిలో దొరికే పళ్లుమాత్రమే తిని తపస్సు చేసి, తర్వాత, ఋషి అయ్యాడు. అప్పటిదాకా భార్యా పిల్లలు ఆయన వెంటే వున్నారు. తర్వాత ఒంటరిగా వుండి తపస్సు చేసి మహర్షి అయ్యాడు. మహర్షులంతా జితేంద్రియులు కారు. కాబట్టి, జితేంద్రియుడు కావడానికి, పంచాగ్నుల మధ్య నిలిచి, ఆహారం మాని, వాయువే ఆహారంగా తపస్సు చేశాడు. ఇంతచేసినా కామాన్ని జయించగలిగాడుగాని, కోపాన్ని జయించలేకపోయాడు. అదికూడా జయించేందుకు, మౌనంగా, కుంభకంలో ఏళ్ల తరబడి తపస్సు చేశాడు. అప్పుడు అన్నీ జయించి బ్రహ్మర్షి అయ్యాడు. జన్మతో వచ్చే బ్రాహ్మణ్యం కర్మతో రాదు. విశ్వామిత్రుడికి వచ్చిందంటే దానికొక ప్రత్యేకమైన కారణముందనే అనాలి. ఎవరికైనా, ఎంత చేసినా కామ క్రోధాలు అనివార్యం. వాటిని తనకు వశపడేటట్లు చేసుకున్నవాడే బ్రాహ్మణోత్తముడు. అందుకే బ్రాహ్మణ్యం సులభమైంది కాదు.
(వాసుదాసుగారి శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

Monday, June 1, 2020

Creating a brighter future : Vanam Jwala Narasimha Rao


Creating a brighter future
Vanam Jwala Narasimha Rao
Millennium Post, New Delhi (02-06-2020)

(Through the use of regulatory farming, Telangana is working to empower and enrich its farmers as it works towards becoming the ‘Rice Bowl’ of India-Editor).

A survey conducted by the government seems to have arrived at a decision that a majority of farmers are in favour of regulatory farming in Telangana. This is a good augury. The government which has already announced its policy in favour of this, will obviously stand in support of farmers. Agriculture will be abundantly benefited through regulatory farming leading to creation of over a lakh crore rupee of wealth and also a wealthy farmer.

The life and existence of Telangana and its sixty-five lakhs of farmers is mingled with agriculture besides many others depending on it. This unorganised sector was totally neglected in the united AP government as a result of which farmers suffered enormously in the past. Agriculture went into a crisis. After the Telangana state was formed thanks to umpteen welfare measures taken by the government, the situation bettered and improved marvelously.

The farmer is always at crossroads with regards to his product. If the farmer wants to sell there are no buyers, but, if he or anybody in need wants to buy the agriculture produce, the prices are sky high. The state government has made several attempts to bring in a much desirable change in the farm sector, and it is still doing work in this direction. The government is solving each and every problem of agriculture sector in the state one by one. Major irrigation projects are getting completed. By next year Monsoon season, water will be visible everywhere. There is round the clock quality power supply.

CM KCR reinforces in various platforms that much more needs to be done to improve their lot and make agriculture not only mere remunerative but highly profitable. This would ensure the state of Telangana shaping into the Rice Bowl of India. Towards this direction CM envisaged a new Agriculture policy.

            This presupposes, in the words of CM KCR, that the practice of every farmer preferring the same crop should be done away with. The main reason why farmers are not getting competitive price for their produce is cultivating the same crops. Henceforth department of agriculture will suggest the kind of crop to be grown in a particular field in a regulatory manner. They will also identify the suitability of soil for a particular crop for a better yield in a given season. The food needs and habits of the population, market demand, export opportunities etc. will be taken into consideration. The future of agriculture should be promising. The Telangana farmers should earn profits by selling quality produce in the world market says CM KCR always.

The then governments did not bother about the agriculture sector. Farmers used to cultivate crops according to their whims and fancies. Since everyone cultivated the same crop, there was every likelihood of fall in the price. Now the situation has drastically changed in the State. Water for irrigation is reaching every nook and corner of the State. Due to 24-hour power supply, cultivation is taking place under the borewells too. If farmers are provided with right guidance, they can have profitable agriculture. Changes will come in the cultivation methods, selection of the crops, use of fertilisers, marketing of the produce. The New Agriculture Policy is towards this direction.

            Even those who prefer always Paddy, the scenario is that the farmers are going in for the coarse variety, as the cultivation period is less whereas majority of people eat only fine variety rice. This variety has in great demand in other States and countries too. Now that we have water facility for irrigation, famers should cultivate more fine rice variety.

Telangana Sona rice brand is developed by the Telangana Agriculture scientists. This variety of rice is good for the diabetes patients.  The agriculture experts have identified this as sugar-free rice. The Glycaemic Index percentage is low on Telangana Sona variety. The American Journals stated that this rice is healthy. Telangana Sona variety has a brand image. Hence it is desirable to go for it.

            Ground Nut, Red Gram, Oil Palm have demand in the market. In addition, we should identify other such crops. Then it has to be decided to what extent of land can be used to grow these crops. There is a scarcity of fruits and vegetables in the State. It requires a deep study on what percentage these can be cultivated. However, there should be an attitudinal change among the farmers to cultivate the crops which are in demand in the market and which are in tune with eating habits of the people.


The Government has now firmly decided that paddy should be cultivated in a regulatory manner beginning with this Monsoon season. CM KCR reiterated that the endeavour was to get the farmers Rythu Bandhu support cent per cent and to make them get a competitive price for their crops through regulatory farming methods and cultivation. He declared that only by cultivating the crops that have demand in the market, the farmers would get a good price. He said that Agriculture department, Agriculture University will guide farmers which crop to cultivate and if farmers follow the suggestions, they will not face any problem,

            Last year in the State during Monsoon paddy was cultivated in about 40 lakh acres. This time also it is proposed that paddy should be cultivated in the same extent of land. Last year, Cotton was cultivated in 53 Lakh acres. This year it would be increased to 70 Lakh acres. Red gram was cultivated in 7 lakh acres last year. This year it would be in 15 Lakh acres. Soya bean, Turmeric, Chilli, vegetables and other such crops like in the last year, would be cultivated in the same extent of land. Farmers producing variety of seeds should continue their efforts.

It is felt that maize cultivation is not beneficial during the monsoon and hence should not cultivate during the season.  Maize can be cultivated during Rabi. Those cultivating maize during the monsoon will be switching over to Cotton and Grams. It is desirable if the farmer is cautious about the Paddy varieties. It is advisable to cultivate those varieties, which have demand in the market like the Telangana Sona variety. Cluster wise farmers’ conferences to create awareness among farmer about the regulatory farming methods are being organised to explain the vision of government.

The government has further decided to set up Seed Regulatory Authority in the State. Since it was decided that crops as identified by the government would be cultivated, seeds of the crops identified by the government henceforth would be sold.  The Seed regulatory Authority will ensure that only seeds of the crops identified by the government are sold.

Against this backdrop, there should be a change in the use of fertilisers and pesticides. Since farmers have no proper knowledge on the matter, they are trusting the traders and using fertilisers and pesticides. Farmers are to be educated and informed about the correct usage of fertilisers and pesticides in moderate quantities and their benefits. They should also be informed that crops which used more fertilisers will not have any demand in the international market.

ఆరోజుల్లో నియంత్రిత సాగే! ..... వనం జ్వాలానరసింహారావు


ఆరోజుల్లో నియంత్రిత సాగే!
వనం జ్వాలానరసింహారావు
మన తెలంగాణ దినపత్రిక (02-06-2020)
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నియంత్రిత నియమావళి ఆధారిత వ్యవసాయం గురించి పదే-పదే చెప్తుంటే, గ్రామాలతో, వ్యవసాయంతో అంతో-ఇంతో అనుబంధం వున్న నా లాంటి వారికి, వారిప్పుడు ఏ వ్యాపకంలో వున్నా సరే, పాత రోజులు, పాత సంగతులు గుర్తు రాక మానవు. ఒకానొక రోజుల్లో గ్రామ వాతావరణం, అందులో అగ్రగామిగా వుండే వ్యవసాయం, ఆ వ్యవసాయానికి అనుబంధంగా వుండే పనిముట్లు, నైపుణ్యంతో వ్యవసాయానికి అవసరమైన పనులను చక్కదిద్దే వ్యక్తులు, విద్య లేకపోయినా అనుభవంతో ఏ పంట ఎప్పుడు వేస్తే లాభదాయకమో తెలియచెప్పే కొందరు గ్రామస్తులు, ఇలా అనేక విధాలుగా అలరారుతుండేది.

భారత దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో, వ్యవసాయానికి వేల సంవత్సరాల చరిత్ర వుంది. అనునిత్యం అభివృద్ధి చెందుతున్న సాంకేతిక ప్రగతికి, విస్తరిస్తున్న ప్రపంచ మార్కెట్లకు, ప్రతిస్పందనగా, గత శతాబ్ది కాలంగా వ్యవసాయం గణనీయమైన మార్పులకు, చేర్పులకు గురవుతోంది. మానవ, సహజ వనరుల స్థానంలో యంత్రాలు, సింథటిక్ ఎరువులు, క్రిమిసంహారక మందులు చోటుచేసుకుంటున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం కారణాన పంట దిగుబడులు పెరిగినప్పటికీ, వాతావరణ సమతుల్యం దెబ్బ తినడం, ఆరోగ్యానికి హానికరమైన పరిస్థితులు నెలకొనడం కూడా జరిగింది.

గ్రామీణ, వ్యవసాయ వాతావరణ నేపధ్యంలో పెరిగిన ప్రతివారికీ వరి పొలాలు, మల్లె తోట, మామిడి తోట, మిరప, మొక్క జొన్న తోటలు, తోటలలోని మోటబావులు, జొన్న చేలు, చేలలోని దోసకాయలు, మంచె, అరకలు, ఎద్దులు, పాడి పశువులు, మేకలు, వరి గడ్డి వాములు, ఇంట్లో గిలక బావి, బావి పక్కనున్న నిమ్మ-అరటి చెట్లు, ఇంటి వెనుక ఉదయాన్నే చల్ల చిలికే ప్రక్రియ, అందులో వచ్చిన వెన్న పూస ఆస్వాదించడం, ఉదయాన్నే తిన్న చద్ది అన్నం మామిడి వూరగాయ కారంతో తినడం, సాయంత్రం ఇంటి ముందు నీళ్లు చల్లి నవారు-నులక మంచాలు వేసుకోవడం, పడుకోని ఆకాశంవైపు చూసి ఆనందించడం, ఇలా ఎన్నో విషయాలు గుర్తుకు రావడం సహజం. చేస్తున్న వ్యవసాయానికి ప్రతిఫలంగా పండిన పుట్ల కొద్దీ వడ్లు (పుట్టికి 75 కిలోల బరువుండే ఎనిమిది బస్తాలు), జొన్నలు, వేరు శనగ, కందులు, పెసలు, మిరప కాయలు, గుర్తుకు రానివారు వుండరు. ప్రతి రైతు పాడి పశువుల మేత కొరకు అతడికున్న భూమిలో కొంత బీడు భూమిగా వదిలే వాళ్ళు.

సాధారణంగా వ్యవసాయపు పనులు వేసవి కాలంలోనే మొదలయ్యేవి. పొలాలకు పెంట (పశువుల ఎరువు) తోలే ప్రక్రియతో వ్యవసాయపు పనులు మొదలయ్యేవి. మొదలు యజమాని తన సొంత పాడి పశువుల వల్ల పోగైన పెంటను తోలే వాళ్లు. ఆ పెంటను నిలవ చేయడానికి ఒక ప్రత్యేక స్థలాన్ని ఉపయోగించుకునే వాళ్లు. దీనికి అదనంగా కొందరు రైతులు పొలాలు లేని వారి దగ్గర నుంచి పెంట ఖరీదు చేసి కొని పొలాలకు తోలే వాళ్లు. చెల్లింపులన్నీ ధాన్యం రూపేణగానే జరిగేది. ఇలా తోలే పెంట కాకుండా, వందల సంఖ్యలో వుండే జీవాలను పొలాలలో రాత్రింపగళ్లూ వుంచేవాళ్లు. అదీ ఖరీదుకే. అలా వుంచడం వల్ల పొలాలలో జీవాల పెంట పోగయ్యేది. అది పొలాలకు ఎరువులాగా ఉపయోగపడుతుంది. అప్పట్లో రసాయనిక ఎరువుల వాడకం అలవాటు ఇంకా సరిగ్గా కాలేదు. ఇళ్లలో పోగైన పెంటను, జీవాల పెంటను మాత్రమే ఎరువులాగా వాడే వాళ్లు.

అదనంగా, చెరువు పూడిక తీసి మట్టిని పొలాలకు తోలే వాళ్లు. తెల్లవారు జామునుంచే పెంట బండ్లను కట్టే ప్రక్రియ మొదలయ్యేది. మధ్యాహ్నం పన్నెండు (రెండు జాములు అనే వాళ్ళు) గంటల సమయం వరకు తోలి ఇళ్లకు తిరిగి వచ్చే వారు. పొద్దున్నే చద్ది అన్నం తినే వాళ్ళు. మధ్యాహ్నం సుమారు రెండు గంటల పాటు భోజనం వగైరాలు కానిచ్చి, ఎడ్లకు దానా వేయడం, నీళ్లు పెట్టడం లాంటివి చూసుకునేవారు. ఆ సంవత్సరానికి కావాల్సిన వ్యవసాయ పనులకు సంబంధించిన వాటిని ఒక గంట-రెండు గంటల పాటు చూసుకునేవారు. ఉదాహరణకు తాళ్లు పేనడం. మళ్లీ నాలుగు గంటల ప్రాంతంలో పెంట బండ్ల కార్యక్రమం మొదలయ్యేది. వెన్నెల రోజుల్లో రాత్రుళ్లు కూడా బండ్లు తోలేవారు. ఇలా తొలకరి జల్లులు కురిసే వరకు కొనసాగేది.

తొలకరి వానలు మొదలవ్వగానే పొలం పనులలో కొంత మార్పు వచ్చేది. వరి పొలాలకు కావాల్సిన నారు చల్లడం, పునాస పంటలకు పొలాలను నాగళ్లతో దున్నడం, దంతెలతో దున్నడం జరిగేది. వర్షాలు కురిసే తీరుతెన్నుల ఆధారంగా పొలం పనులలో మార్పులు చేర్పులు జరుగుతుండేవి. వర్షాలు ఆగుతే మిగిలిన పెంటను తోలడం కొనసాగించేవారు. వేరు శనగ, అందులో కంది పంటలు వేసే వాళ్లు. చెరువులకు నీళ్లు రావడం జరుగుతే వరి నాట్లు వేసే వాళ్లు. ఆ తరువాత జొన్న పంట వేసే వాళ్లు.

వరి నాట్లు వేయడానికి ముందర పొలాన్ని మొదలు నాగళ్లతో, తరువాత బురద నాగళ్లతో దున్నడం జరిగేది. సాధారణంగా వరి నాట్లు మహిళలే వేసేవారు. పాటలు పాడుకుంటూ, హుషారుగా నాట్లు వేసేవారు. నాట్లు పడ్డ తరువాత దశలవారీగా పొలాలకు నీరు పెట్టడం జరిగేది. ఒక్కో సారి రాత్రుళ్లు పోయి వంతుల వారీగా నీళ్లు పెట్టే వాళ్లు. నీళ్లు సరిపోకపోతే పొలాలలో ఒక పక్కన కొంత లోతు వరకు తవ్వి, నీటిని తీసి చేది పోయడం జరిగేది. వరి కొంత పెరిగిన తరువాత కలుపు తీయడం జరిగేది. మూడు-నాలుగు నెలల తరువాత కోతల సీజన్ ఆరంభమయ్యేది. కోయడం, గూళ్లు వేయడం, సమయం చూసుకుని, వాతావరణం అనుకూలించినప్పుడు నూర్పిడి చేయడం, తూర్పార పట్టడం, చివరకు వరి ధాన్యాన్ని ఇంటికి తోలడం జరిగేది. ఈ ప్రక్రియ జరిగినన్నాళ్లు వరి పొలంలోనే రాత్రుళ్లు నిద్రించే వాళ్లు. నాటు కూలి, కోత కూలి, ఇతర కూలి అంతా ధాన్యం రూపేణగానే. ఎకరానికి ఐదారు కుండల ధాన్యం కూలీగా వుండేది.


ఇక వేరు శనగ పంట వ్యవహారం మరో విధంగా వుండేది. విత్తనాలు తయారు చేయించే ప్రక్రియతో మొదలయ్యేది. రైతులు ఇంటికి కూలి వాళ్లను పిలిచి, క్రితం సంవత్సరం పండిన వేరు శనగ కాయలను కొలిచి, వాటినుంచి విత్తులను తీయమని వాళ్లకు చెప్పే వాళ్లు. వాళ్లలో కొందరు తమ ఇంటికి తీసుకెళ్లి చేసేవారు, కొందరు రైతు ఇంట్లోనే చేసేవారు. సాయంత్రం కల్లా వాళ్ల-వాళ్ల సామర్ధ్యాన్ని పట్టి కుండెడో-రెండు కుండలో కాయ కొట్టి విత్తులను తీసే వాళ్లు. వాళ్ళకు కూలీ ధాన్యం రూపేణగానే ముట్టేది. విత్తులు తీసేటప్పుడు కొంత భాగం పప్పు అయ్యేది. ఆ పప్పుతో శనగ నూనె చేయించి ఇంట్లో ఉపయోగించే వాళ్లు. గ్రామాలలో వేరు శనగ ముఖ్యమైన పంట. వేరు శనగ కాపుకొచ్చాక కూలీలతో  పీకించి కొట్టిస్తారు. తయారైన కాయను "డబ్బాల" తో కొలిచి కూలీ నిర్ణయించేవారు. "డబ్బా" కు 16 "మానికలు". మానికంటే రెండు శేర్లు. డబ్బా కాయ కొట్టినవారికి మూడు "సోల" ల నుండి ఒక "మానిక" వరకు జొన్నలు కొలిచి కూలీగా ఇచ్చేవారు.

వర్షాలు పడగానే, భూమిని దున్ని అదను కుదిరినప్పుడు "ఎద" (విత్తనం) పెట్టే వాళ్లు. ఒకడు ఎద గొర్రు తోలుతుంటే, పక్కన నడుచుకుంటూ మరొకరు, శనగ విత్తులను, భూమిలోకి గొర్రు పైభాగంలోంచి భూమిలో పడేలా పోసేవారు. అతి క్లిష్టమైన ఈ ప్రక్రియ అందరికీ చేత కాదు. పైగా శనగ విత్తులతో పాటు కంది విత్తనాలు కూడా ఒక పద్దతి ప్రకారం ఎద పెట్టాలి. శనగ పంట ముందు చేతికొస్తుంది. ఆ తరువాత రెండు నెలలకు కంది పంట వస్తుంది. శనగ విత్తనాలు మొలకెత్తిన నెల రోజుల తరువాత పై పాటు చేయాలి. ఇది కూడా కష్టమైన పనే. పై పాటు చేసే అరకలను అందరూ తోలలేరు. ఎద్దుల కాళ్ల కింద మొక్కలు నలిగి పోకుండా, అరక కింద చెట్లు పడ కుండా తోలాలి. అదెంతో ముచ్చటేసేది. మూడు నెలల తరువాత కూలి వాళ్లతో శనగ మొక్కలను భూమి నుంచి పీకించి కాయలను వేరు చేయించే వాళ్లు. మరో రెండు నెలలకు కంది కళ్ళం వేసి ఆ పంటను కూడా తెచ్చుకునే వాళ్లు.

ఇక మరో పంట జొన్న. వీటినే పచ్చ జొన్నలనే వాళ్లు. దీనికి కూడా ఎద పెట్టడం వుంటుంది. జొన్న పంట తయారైన తరువాత కోసి, కట్టలు కట్టించే వాళ్లు. కూలీ కింద కట్టలనే ఇచ్చే వాళ్లు. ప్రతి ఐదు కట్టలకు ఒక కట్ట కూలీ కింద పోయేది. ఇక ఆ తరువాత జొన్న గూడు వేయించడం, కంకి కోయించి తొక్కించడం, తూర్పార బట్టడం, ధాన్యాన్ని ఇంటికి-మార్కెట్‌కు చేర్చడం జరిగేది. కల్లాలు పూర్తై, ఎడ్ల బండ్లలో, "బోరాల" లో నింపుకుని పుట్లకు-పుట్ల ధాన్యం ఇంటికి వస్తుంటే బలే ఆనందంగా వుండేది. అప్పట్లో వేసే పంటలన్నీ నియంత్రిత విధానంలోనే, పంటల మార్పిడి పద్ధతిలోనే వుండేవి.

ధాన్యం కొలవడానికి ఉపయోగించే "కుండ"లు, "మానికలు", "తవ్వలు" "సోలలు", "గిద్దెలు" వూరి రైతుల్లో అతి కొద్ది మంది దగ్గర మాత్రమే వుండేవి. కుండకు పదిన్నర మానికలు, మానికకు రెండు తవ్వలు, నాలుగు సోలలు, పదహారు గిద్దెలు, తవ్వకు రెండు సోలలు, ఎనిమిది గిద్దెలు, సోలకు నాలుగు గిద్దెలు, ఇదీ కొలత. అలానే, ఐదు కుండలైతే ఒక "బస్తా" ధాన్యం అవుతుంది. అలాంటి ఎనిమిది బస్తాలు కలిస్తే ఒక "పుట్టి" అవుతుంది. కొలత కొలిచేటప్పుడు కుండకు కాని, మానికకు కాని, తవ్వకు కాని, సోలకు కాని, గిద్దెకు కాని, ధాన్యం పూర్తిగా నిండి పై వరకు వచ్చే విధంగా పోయాలి. ఎడ్ల బండిపైన "బోరెం" వేసి, ఎనిమిది నుంచి పది బస్తాల ధాన్యాన్ని నింపి ఇంటికి తోలేవారు. ధాన్యం ఇంటికి చేర్చిన తరువాత, "పాతర" లో కాని, "గుమ్ములు" లో కాని, "ధాన్యం కొట్టుల" లో కాని భద్రపరిచేవారు. మార్కెట్ అనుకూలంగా వున్నప్పుడు అమ్మేవారు. ఆ ధాన్యంలోనే కొన్ని బస్తాలు మరుసటి సంవత్సరానికి విత్తనాలుగా ఉపయోగించేందుకు వేరే భద్రపరిచేవారు. ఆశ్చర్యకరమైన విషయం, పంట కోసినప్పటి నుంచి, ధాన్యం ఇంటికొచ్చే వరకు, లక్షలాది, కోట్లాది రూపాయల విలువ చేసే ఆ పంట మొత్తం బహిరంగంగా పొలాలలో పడి వుండేది. ఏ రైతుకు కూడా అభధ్రతా భావం వుండకపోయేది.

ఈ పంటలకు తోడు మిరప తోట వేసే వాళ్లు కొందరు. మధ్యలో బంతి పూల చెట్లు వేసే వాళ్లు. తోటలలో మోట బావి వుండేది. మోట తోలడం కూడా కష్టమైన పనే. మోట తోలడానికి కట్టిన ఎద్దులను వెనుకకు నడిపించుకుంటూ, భావి ముందరకు తీసుకెళ్లాలి. భావిలో మోట బక్కెట్ (చాలా పెద్దగా వుంటుంది) పూర్తిగా మునిగి నీరు నిండే లాగా ఎద్దులను వెనక్కి తేవాలి. అప్పుడు మునిగి-నిండిన బకెట్ పైకి రావడానికి ఎద్దులను ముందుకు తోలాలి. బకెట్ కట్టిన తొండం లోంచి నీరు భావిదగ్గరున్న కాలువలో పడి ప్రవహించుకుంటూ మిరప చెట్లను తడుపుకుంటూ పోతుంది. మోట తోలడం సరదాగా కూడా వుంటుంది.

అలానే చాలా మంది పొగాకు పంట కూడా వేసే వాళ్లు. మరో తోటలో మొక్క జొన్న వేసే వాళ్లు. కొందరు దినుసు గడ్డలు, వుల్లి గడ్డలు కూడా సాగు చేసేవారు. క్యాబేజీ, కాలీ ఫ్లవర్ లాంటి కూరగాయలతో సహా ఎన్నో రకాల కూరగాయలను కూడా పండించేవారు మరికొందరు. ఇక మామిడి తోట సరేసరి. జొన్న చేలల్లో పప్పు దోసకాయలుండేవి. అవి అక్కడనే కొడవలితో కోసుకుని, మంచెపైకెక్కి కూచుని తినే వాళ్లు. జొన్న వూస బియ్యం కూడా కొట్టించుకుని, పలుకు రాళ్ల నిప్పులో వేడి చేసుకుని తినే వాళ్లు. చేనులో దొరికే పెసలు తినే వాళ్లు.

పండిన ప్రతిపంటలో కొంత భాగం, అవసరం మేరకు, విత్తనాల కింద ప్రత్యేకంగా తీసేవారు. ఇప్పటిలాగా విత్తనాలు కొనుక్కోవడం అప్పుడు లేదు. రసాయినిక ఎరువుల వాడకం, క్రిమి సంహారక మందుల వాడకం చాల తక్కువగా, దాదాపు, లేనట్లే వుండేది. ఎప్పుడైతే వాటి ఉపయోగం పెరిగిందో, సమాంతరంగా విత్తనాలు ప్రత్యేకంగా దాచిపెట్టడం వెనకడుగు వేయడం మొదలైంది. అధిక దిగుబడి వంగడాల ఉపయోగం పెరగడంతో విత్తనాలు కొనుక్కోవడం అలవాటుగా మారిపోయింది. ఇప్పుడిక వేరే గత్యంతరం లేకుండా పోయింది.

ఇటీవల ముఖ్యమంత్రి చెప్పినట్లు మళ్లీ వెనకటి రోజులు రావాలి. ఎరువులు కానీ, క్రిమిసంహారక మందులు కానీ అతిగా వాడడం ఆగిపోవాలి. ఏ గ్రామానికి కావాల్సిన విత్తనాలు ఆ గ్రామంలోనే పండాలి. సీఎం సూచించినట్లు, వ్యవసాయ విస్తరణ అధికారుల సలహా మేరకు, ఏ భూమికి ఏ పంట అనువుగా వుంటుందో ఆ పంటనే వేయాలి. వ్యవసాయం లాభసాటి కావాలంటే నియంత్రిత విధానంలో పంటలు వేయడం తప్పనిసరి. (స్వానుభవం ఆధారంగా)