Sunday, April 14, 2024

మాళవ గుప్త, రాజపుత్రస్థాన ఘూర్జర, నందిపురి ఘూర్జర వంశాలు (బ్రాహ్మణ రాజులు-13, 14, 15) : వనం జ్వాలా నరసింహారావు

 మాళవ గుప్త, రాజపుత్రస్థాన ఘూర్జర, నందిపురి ఘూర్జర వంశాలు

(బ్రాహ్మణ రాజులు-13, 14, 15)

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (15-04-2024)  

మాళవ గుప్త వంశం

గుప్త చక్రవర్తుల సామంతులుగా మాళవ గుప్తులు వ్యవహరించబడ్డారు. గుప్తరాజ్య పతనానంతరం ఈ వంశీయులు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారు. అప్షద్ శాసనం వల్ల వీరు నృపశబ్ద వాచ్యులని అర్థమవుతున్నది. ఈ వంశీయుల వారైన కృష్ణగుప్త, హర్షగుప్త, జీవితగుప్తులు గుప్త చక్రవర్తుల సామంతులుగా వుండి, అనేక యుద్ధాలను చేశారు. ఈ వంశీయులలో నాల్గవ వాడైన కుమారగుప్తుడు అతి బలసంపన్నుడు. గొప్ప విజేత. అతడు మౌఖరి ఈశానవర్మను యుద్ధంలో ఓడించి విజయుడై, ఈ వంశ విజయానికి, అభ్యుదయానికి తోడ్పడ్డాడు.

         కుమారగుప్తుడి అనంతరం అతడి కుమారుడు దామోదర గుప్తుడు మౌఖరులను ఓడించాడు. ఆ తరువాత మౌఖరి ప్రభువులు ఇతడిని ఓడించారు. దామోదర గుప్తుడి కుమారుడు మహాసేన గుప్తుడు. ఇతడు పాలనా బాధ్యతలు వహించేనాటికి మాళవ గుప్త రాజ్యం తూర్పు మాళవం దాకా అనగా లోహితీ నది పర్యంతం వ్యాపించినది. ఈ వంశీయులు సుస్థిరవర్మను ఓడించి కామరూప రాజ్యాన్ని ఆక్రమించారు. మహాసేన గుప్తుడు దండయాత్రలు నిర్వహించి విజయాలు సాధించినప్పటికీ, చాలాకాలం జయించిన భూ భాగాలను నిల్పుకోలేకపోయాడు. వల్లభిరాజు మొదటి శిలాదిత్యుడు దండయాత్ర నిర్వహించి పశ్చిమ మాళవ రాజ్యాన్ని జయించాడు. కాలచురి శంకర గణరాజు ఉజ్జయినీ నగరాన్ని క్రీస్తుశకం 595 లో జయించాడు. ఇదే సమయంలో మహాసేన గుప్తుడు మాళవ రాజ్యం మీద తన అధీనాన్ని కోల్పోయాడు. అతడి సామంతుడైన శశాంకుడు వంగ దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాడు.

         మహాసేన గుప్తుడి ఇద్దరు కుమారులు కుమార గుప్తుడు, మాధవ గుప్తుడు రాజ్యంలేక స్థానేశ్వర ప్రభువైన ప్రభాకరవర్మ శరణుజొచ్చారు. మహాసేన గుప్తుడి సోదరి మహాసేన గుప్త ప్రభాకర వర్ధనుడి మాతృమూర్తి. కుమార గుప్తుడికి, మాధవ గుప్తుడికి ఆమె మేనత్త. మాధవ గుప్తుడు స్తానేశ్వరంలో పెరిగి పెద్దవాడయ్యాడు. అతడి కుమారుడు ఆదిత్య గుప్తుడు. ఆదిత్య సేనుడి పినతండ్రి కుమారుడు దేవగుప్తుడు. ప్రభాకర వర్ధనుడి సహాయంతో తన పూర్వుల రాజ్యాన్ని సాధించాడు.

         ఇదిలా వుండగా దేవగుప్తుడు మాళవ రాజ్యాన్ని ఆక్రమించి పాలించాడు. కాకపోతే సంపూర్ణంగా జయించలేదు. దేవగుప్తుడు శశాంకుడి స్వాతంత్ర్యాన్ని అంగీకరించి అతడితో స్నేహంగా వుండేవాడు. మహాసేన గుప్తుడి మనుమడు, మాధవ గుప్తుడి కుమారుడు ఆదిత్యగుప్తుడు , దేవగుప్తుడి తరువాత మాళవ రాజ్యాన్ని ఆక్రమించి మగథను సాధించి, గుప్త వంశపు కీర్తిని పునరుద్ధరించాడు.

         మహాసేన గుప్తుడి వరకు ఈ రాజ వంశీయులు మాళవ రాజ్య పాలకులుగా వుండేవారు. తరువాత మగథ రాజ్యాన్ని ఏలారు. మహాసేన గుప్తుడు మగథ, గౌడ రాజ్యాలను జయించి పాలించాడు. అతడు తన రాజ్యంలోని ప్రాగ్భాగాలను కోల్పోయినప్పటికీ, వున్న మగథ రాజ్యాన్ని పాలించాడు. ఆదిత్యగుప్తుడి అనంతరం అతడి కుమారుడు, ఆ తరువాత అతడి కుమారుడు రెండవ జీవిత గుప్తుడు మాళవ గుప్త రాజ్యాన్ని పాలించారు.         

రాజపుత్రస్థాన ఘూర్జర వంశం

         క్రీస్తుశకం ఆరవ శతాబ్ది ఉత్తరార్థంనుండి ఘూర్జరులు ప్రసిద్ధికెక్కారు. వీరు గుప్త రాజ్య పతనానంతరం విజృంభించి రాజ్యస్తాపన చేశారు. పూర్వకాలంలో గుజరాత్ ఘూర్జర దేశంగా పరిగణించబడింది. గుజరాత్ ప్రాంతాన్ని ఏలడం వల్ల వీరు ఘూర్జరులు అని పిలువబడ్డారు. రాజాస్థాన్ లోని జోద్పూర్ ప్రాంతంలో ఘూర్జరుల రాజ్యం వర్దిల్లినది. గుజరన్వాల, గుజరాత్, పంజాబ్ రాష్ట్రంలోని గుజర్ ఖాన్, గుజరాత్ గా వ్యవహరించబడ్డ సహరాన్పూర్ జిల్లా ఘూర్జరుల ఆవాస స్థలాలుగా పరిగణించబడ్డాయి.

         ఘూర్జరులు అనేక ప్రదేశాలలో రాజ్యాలను నెలకొల్పి పాలించారు. వీరు మొదట్లో హిమాలయా పర్వత పశ్చిమ భాగాలలోనూ, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, సింధు రాష్ట్రంలో వున్న కొండ ప్రదేశాలలో నివసించారు. భారతావని మీద దండయాత్రలు చేసిన హూణుల వెంట ఘూర్జరులు వచ్చి, పంజాబ్, రాజపుత్ర స్థానం, గుజరాత్ ప్రాంతాలలో నివసించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. గుజరాత్ ప్రదేశంలో వున్న అనేక ప్రదేశాల పేర్లు ఘూర్జర నామ సామ్యాన్ని కలిగి వున్నాయి. ఘూర్జరులు భారతీయులే అని, వారు గుజరాత్ రాష్ట్ర వాసులని, విదేశీయులు కానేకారని పలు ఆధారాలున్నాయి.

         ఘూర్జర వంశ స్థాపకుడు హరిశ్చంద్రుడు. ఇతడు గుప్త సామ్రాజ్య పతనానంతరం రాజపుత్ర స్థానమందలి జోధ్పూర్ నగరాన్ని రాజధానిగా ఘూర్జర రాజ్యాన్ని స్థాపించాడు. హరిశ్చంద్రుడు సమరశూరుడు. బ్రాహ్మణుడు. వేదాధ్యయనం చేసినవాడు. అతడు వాకాటక, విష్ణుకుండిన, కదంబాది బ్రాహ్మణ వంశీయుల లాగానే క్షత్రియ ధర్మం అవలంభించి సైన్యాన్ని సమకూర్చుకుని, క్రీస్తుశకం 550 లో జోధ్పూర్ నగరాన్ని ఆక్రమించి, ఘూర్జర రాజ్య స్థాపన చేసి, పరిసర భూభాగాలను జయించాడు. హరిశ్చంద్రుడు వేదవిదుడై అనేక శాస్త్రాలను అభ్యసించాడు.

         హరిశ్చంద్రుడికి ఇద్దరు భార్యలు. ఒకరు కులస్త్రీ కాగా, వేరొకరు క్షత్రియ వంశ సంజాత. బ్రాహ్మణ స్త్రీ వల్ల కలిగిన సంతతి ప్రతీహార బ్రాహ్మణులు అని పిలవబడ్డారు. క్షత్రియ వనిత వల్ల కలిగిన సంతానం ప్రతీహార రాజవంశం వారైనారు.

         గుప్తరాజ్యం పతనావస్థలో వున్న సమయంలో హరిశ్చంద్రుడు మిహిరకులుడిని, యశోధరుడిని ఎదిరించి రాజ్యస్థాపన చేశాడు. హరిశ్చంద్రుడు తాను స్థాపించిన ఘూర్జర రాజ్యాన్ని క్రీస్తుశకం 550 నుండి క్రీస్తుశకం 565 వరకు 15 సంవత్సరాలు పాలించాడు.

         హరిశ్చంద్రుడికి క్షత్రియ రాణి భద్రాదేవి వల్ల నలుగురు కుమారులు పుట్టారు. ఈ నలుగురు వేర్వేరు రాజ్యాల పాలకులుగా వుండేవారు. ఒక కుమారుడు రజ్జల రాజు మాండవ్యపుర రాజ్యాన్ని 25 సంవత్సరాలు పాలించిన తరువాత అతడి కుమారుడు నరభట రాజ్యాదిపత్యాన్ని వహించాడు. ఇతడి పాలనాకాలం క్రీస్తుశకం 590 నుండి క్రీస్తుశకం 620 వరకు, సుమారు 30 సంవత్సరాలు.

         నరభట అనంతరం అతడి కుమారుడు నాగభట మాండవ్యపుర రాజ్య సింహాసనం అధిష్టించాడు. ఇతడి రాజధాని జోధ్పూర్ పట్టణానికి దగ్గరలో వున్న మెడంతకం. నాగభట ఘూర్జర రాజ్యాన్ని క్రీస్తుశకం 620 నుండి క్రీస్తుశకం 640 వరకు సుమారు 20 సంవత్సరాలు పాలించాడు. నాగభట తరువాత ఇతడి వంశానికి చెందిన 8 తరాల వారు, 10 మంది రాజులు సుమారు 200 సంవత్సరాలు ఘూర్జర రాజ్యాన్ని ఏలారు. 

నందిపురి ఘూర్జర వంశం

           నందిపురి ఘూర్జర వంశపు రాజులు, రాజస్థాన ఘూర్జర స్థాపకుడైన హరిశ్చంద్రుడి సంతతివారు. హరిశ్చంద్రుడికి నలుగురు కుమారులు. భోగభట, కక్క, రజ్జిల, దడ్డ  అనే ఆ నలుగురిలో మొదటి ఇద్దరికీ పాలనా విషయాలు అంతగా తెలియదు. కాని రజ్జల మాండ్యపుర రాజ్యాన్ని పాలించగా, దడ్డ నందిపురి రాజ్యపాలనా బాధ్యత వహించాడు.

         ఘూర్జర వంశీయుడైన మొదటి దడ్డరాజు క్రీస్తుశకం 575 లో రాజ్యాదిపత్యాన్ని వహించాడు. ఇతడి వంశీయులు భరుకచ్చం రాజ్యానికి తోడుగా అవంతీనగరం రాజధానిగా కల రాజ్యాన్ని సైతం పాలించారు. వీరు ప్రతీహారులుగా పరిగణింపబడినారు. శాసనాల ఆధారంగా నందిపురి ఘూర్జర రాజ వంశీయులు క్రీస్తుశకం 575 నుండి క్రీస్తుశకం 641 వరకు పాలించారు.

         మొదటి దడ్డరాజు బలపరాక్రమ సంపన్నుడు. ప్రజ్ఞాశాలి. ఇతడు భరుకచ్చం రాజ్య సరిహద్దులలో వున్న నాగ రాజులను ఓడించి, వారి రాజ్యాలను స్వాధీనపర్చుకున్నాడు. మొదట్లో దడ్డరాజు వంశేయులు రాజస్థాన ఘూర్జర రాజుల సామంతులుగా వుంది, తరువాత బాదామీ చాళుక్యుల విధేయ సామంతులుగా మారారు. దడ్డరాజు స్వతంత్ర పాలకుడిగా క్రీస్తుశకం 575 నుండి క్రీస్తుశకం 600 వరకు సుమారు 25 సంవత్సరాలు ఘూర్జర రాజ్యాన్ని పాలించాడు.

         మొదటి దడ్డరాజు కుమారుడు జయభటరాజు. ఇతడు తండ్రితో కలిసి అనేక యుద్ధాలు చేశాడు. ఇతడి పాలనాకాలం 15 సంవత్సరాలు (క్రీస్తుశకం 600-క్రీస్తుశకం 615). జయభటరాజు కుమారుడు రెండవ దడ్డరాజుతండ్రి అనంతరం బ్రోచ్ రాజ్య సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడి రాజ్యానికి ఉత్తరాన మహీనది, దక్షిణాన కిమ్, పడమర సముద్రం, తూర్పున మాళవ, ఖాందేశ్ రాజ్యాలున్నాయి. నందిపురం ఈ వంశీయుల రాజధాని. నందిపుర నగరమే బ్రోచ్ లేక భరుకచ్చం. రెండవ దడ్డరాజు నందిపుర రాజ్యాన్ని క్రీస్తుశకం 615 నుండి క్రీస్తుశకం 635 వరకు 20 సంవత్సరాలు ప్రశాంతంగా పాలించాడు.

         రెండవ దడ్డరాజు కాలం నుండి ఈ వంశీయులు కాలచురి రాజ వంశీయులతో వైరం కలిగి వున్నారు. రెండవ దడ్డరాజు బాదామీ చాళుక్యుల సామంతుడు. ఇతడు, ఇతడి వంశీయులు రెండవ పులకేశికి, కాలచురి రాజులతో జరిగిన సంగ్రామాలలో సహాయపడ్డారు. కాలచురి రాజ్యాన్ని జయించిన చాళుక్యులు ఆ రాజ్యాన్ని తమ రాజ్యంతర్భాగంగా గ్రహించారు. రెండవ దడ్డరాజు తరువాత అతడి కుమారుడు రెండవ జయభట, అతడి వంశీయులైన మూడవ దడ్డరాజు, మూడవ జయభట, ఆహిరోల, నాలగవ జయభట నందిపురి రాజ్యాన్ని పాలించారు.  

(స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)

     

      

 

Saturday, April 13, 2024

Indeed, Kanyadaan is Core Ritual of Hindu Marriage : Vanam Jwala Narasimha Rao

Indeed, Kanyadaan is Core Ritual of Hindu Marriage

Vanam Jwala Narasimha Rao

The Hans India (14-04-2024)

{Notwithstanding the Hindu Marriage Act, which says it is not necessary for solemnization of the marriage, the ritual ‘Kanyadaan’ practice of Hindu marriage denotes an essential feature, denoting ‘Giving Away’ of the daughter (bride) by her parents to the bridegroom, treating him as ‘Vishnu,’ and bride as ‘Lakshmi.’ Bride’s father, ‘Kanya Data’ places her right hand into groom’s, known as ‘Pani Grahana,’ a ritual in presence of sacred fire, symbolizing the bride ‘Conceding Her Heart’ to the groom}-Editor Synoptic Note.

Interestingly, a Single Bench Allahabad High Court on March 22, 2024, has held that ‘Kanyadaan’ was not necessary for solemnization of Marriage under the Hindu Marriage Act, and only 'Saptapadi' is an Essential Ceremony. Yes, it is mentioned so, in the Hindu Marriage Act, under Ceremonies that, a Hindu Marriage may be solemnized where the ceremonies include the ‘Saptapadi’ or taking of ‘Seven Steps’ by the Bridegroom and Bride jointly before the sacred fire. Marriage becomes complete and binding when the ‘Seventh Step’ is taken.

Notwithstanding the Act, the Ritual ‘Kanyadaan’ of Hindu Marriage Practice, alone denotes ‘Giving Away’ the daughter (Bride) by her parents to the Bridegroom, treating him as ‘Vishnu,’ and Bride as ‘Lakshmi.’ Bride’s father, ‘Kanya Data’ places her Right Hand into Groom’s, known as ‘Pani Grahana,’ a ritual in presence of sacred fire, symbolizing the bride ‘Conceding Her Heart’ to the Groom. The Groom pledges to treat Bride as an ‘Equal Partner’ and also ‘Take her Responsibility.’ Marriage signifies spiritual and emotional union of two individuals and two families depicting a ‘Way of Life,’

Even Celestial Weddings are performed consistent with similar customs and traditions. For instance, in Sri Sita Rama Kalyanam, Janaka, while giving away his daughter Sita, as ‘Kanyadaan’ said to Rama that, ‘Take her in marriage and take her from her father by holding her palm with your palm.’ Later Rama and Sita holding their palms, performed circumambulations around the Ritual Fire, and around Altar of Fire, what is known as ‘Saptapadi.’

The Hindu Marriage symbolizes ‘Conjugal Dharma’ an unwritten staunch relationship that knows no boundaries, between Husband and Wife. At every stage of marriage, the mantras explicitly reveal this. ‘Kama’ (Lust) one of the four ‘Purusharthas’ namely, ‘Dharma, Artha, Kama and Moksha’ can be dedicated to Dharma as ‘Love’ only through Marriage. Common Well Wishers of prospective Bride and Groom families, as a self-imposed responsibility, normally initiate the ‘Arranged Marriage’ process which is still prevalent in many families. Through them the two families come to know of each other better, that paves way to ‘In Principle Acceptance.’

‘Nischitartham’ or ‘Nischaya Tambulam’ which now is called as ‘Engagement’ on an agreed day is the next step. Exchange of rings, fixing (Muhurta) auspicious date and time of marriage, followed by formal writing of ‘Wedding Invitation Card’ on a white paper duly applying turmeric on four sides etc. are done on that day. Muhurta is fixed based on Bride and Groom’s Birth Stars and Horoscope. Printing and distribution of wedding cards follows. Hindu Marriages are the ‘Social Gatherings’ where among others, prospective brides and grooms meet.

Ritual ‘Snatakam,’ performed either in Bridegroom’s house or in a guest house arranged by Bride’s side, prepares him to leave ‘Brahmacharya’ (Bachelor Life) for ‘Grihastha Ashram’ (Marital Life). The ‘Guru’ (Teacher), here the Purohit guides the Bridegroom, that he shall not ‘Err in the Matter of Truth, Righteousness, and Cleverness.’ Bride and Groom will be Getting Ready with traditional head baths (Mangala Snana) in their respective places. Ritual ‘Ankurarpan’ where nine varieties of seeds (Nava Dhanya) are poured in a mud plate, filled with water, for germination as sprouts takes place.

On the day of marriage, Bride considered as combined form of ‘Laxmi, Parvati, Saraswati’ performs ‘Gouri Pooja’ and Groom considered as ‘Divine form of the Trinity’ performs ‘Vara Pooja’ at their respective places. Meanwhile, Bride’s Father (Kanya Data) accompanied by relatives proceed to Groom’s place and as part of Vara Pooja, wedding Invitations are ceremonially exchanged. Bride’s father formally makes a request to Groom’s relatives to come to marriage. As Groom’s side proceed to marriage venue, Bride continues to perform her Gouri Pooja.

‘Kanya Data’ welcomes Bridegroom, at the entrance of venue, and leads him on to the ‘Kalyan Mandap’ (Marriage Platform). Preceding Marriage Event, Kanya Data performs ‘Pada Prakshalana’ (Washing Groom’s Feet) to the Bridegroom (Treating as Lord Narayana). Bride’s maternal uncle ‘Hosts’ Bridegroom with Honey (Madhu Parkam). Groom wears the new cloths presented to him during ‘Madhu Parka’ and waits for Bride’s arrival.

In the interim, Kanya Data with Groom’s father arrive at ‘Gowri Pooja’ being performed by Bride. ‘Gotra and Pravara’ of both sides are pronounced here, and depending upon the capability of Purohit, it evinces interest. Gotra is the Clan and Pravara denotes genesis and three generations family tree. Then Groom’s father makes a request to Kanya Data to give his daughter for marriage with his son. After Kanya Data consents, the next step commences. An interesting rather amusing phase of marriage is maternal uncles of the Bride carrying her holding a ‘Coconut Bonda’ in her hands, ceremonially in a ‘Bamboo Basket’ up to the wedding platform, amidst cheers and claps.

Then, despite being elder to Groom, Kanya Data washes Groom’s feet, when Purohit chants Hymns. This is, ‘The Essential Part’ of Kanyadaan. Bride and Groom are literally considered to be alike to ‘Laxmi and Narayana’ respectively and the Marriage is performed as ‘Laxmi Narayana Kalyanam.’ Bride still in the Basket, Purohit delivers ‘Maha Sankalpa’ and proceeds to the next step. Maha Sankalpa comprises Genesis of Creation, Infinite Capabilities of Creator, Cosmic Form, Celestial Position, Seven Islands, Nine Varshas, Nine Continents, Ten Forests, Island of Jambu, Bharata Varsha, Bharata Khanda, and finally venue of Kanyadaan with geographical boundaries.

After this ‘Kanyadaan’ at the auspicious Muhurta as fixed already, Purohit recites as ‘Kanyam Kanaka Sampannam Kanakabharanairyutam! Daswami Vishnave Tubhyam Brahma Loka Jagishiya.’ Kanya Data thus offers his daughter to Groom, to attain ‘Brahma Loka.’ Kanya Data pours water in the hands of Groom and says that, despite her marriage with him, ‘She shall be my Daughter.’ Kanya Data administers Oath with Groom as, ‘Dharmecha, Arthecha, Kamecha, Esha Nathi Charitavya.’ Bride responds as ‘Nathi Cha Rami’ thrice. Exactly on dot at the auspicious Muhurta, Purohit makes both Bride and Groom, to apply paste made of ‘Cumin stick-jaggery’ on each other’s head. 

 ‘Mangalya Dharana’ follows next. Indian and Hindu Tradition is, from the time of marriage, women wear round the neck, the ‘Mangal Sutra’ often referred as ‘Shata Manas’ and made of Gold, one of the two by Bride’s side and the other by Groom’s side, and which is knotted by the Groom. When musical instruments are played and when Pujari recites ‘Mangalyam Tantunanena Mamajivana Hetuna! Kanthe Midnami Subhage Tvam Jiva Sharadam Shatam’ the Bride Groom ties the Sutra around the neck of Bride with three knots, representing Three Worlds, Trinity, and Sattva-Raja-Tamo qualities. Veda Pundits bless the couple as, ‘Shatamanam Bhavathi, Shatayu: Purusha.’

After the Mangalya Dharana, the most uproarious, hilarious, and funny event of Marriage, pouring of ‘Talambralu’ prepared with Rice mixed in Cumin Powder Liquid, Ghee, Cow Milk etc. giving a yellow look, by bride and groom on each other head, in competition follows. Friends and Relatives enjoy a lot and encourage both taking sides. This is followed with tying one end of bride’s saree with bride groom’s one attire (Uttariyam) end, suggesting that henceforth they are together in every activity and she as the ‘Owner of the House’ shall hold all responsibilities.

Next event is ‘Sthalipakam’ near a Sacred Ritual Fire known as ‘Homam.’ Here the Most Important part of Hindu Marriage ‘Saptapadi’ or solemnization of Marriage under the Hindu Marriage Act, takes place, where, Fire God (Agnihotra) as a witness, the Bride and Bridegroom take seven steps, starting with the right foot of the bride, and circumambulations around the Ritual Fire and around Altar of Fire. This signals the ultimate step into ‘Grihastha Ashram’ and with this the bride’s Gotra, Pravara, Surname changes to that of Bride Groom.  The other rituals are: ‘Nagavalli, Sadashyam, and finally Appagintalu (Physically passing on the Bride to Groom’s family elders).’

Every step of Hindu Marriage is an ‘Essential Implicit Feature’ of ‘Kanyadaan.’

  

Sunday, April 7, 2024

పృధ్వీ మూలరాజు వంశం, గుప్త వంశం (బ్రాహ్మణ రాజులు-11, 12) : వనం జ్వాలా నరసింహారావు

 పృధ్వీ మూలరాజు వంశం, గుప్త వంశం

(బ్రాహ్మణ రాజులు-11, 12)

వనం జ్వాలా నరసింహారావు  

సూర్యదినపత్రిక (08-04-2024)

పృధ్వీ మూలరాజు వంశం

వేంగీ నగరం రాజధానిగా ఆంధ్రదేశాన్ని పాలించిన శాలంకాయన రాజుల సామంతులుగా, గుణపాశపురం రాజధానిగా, తీరాంధ్రాన్ని ఏలిన మూలరాజు వంశీయులు పరాక్రమవంతులు. సాహసోపేతులు. అరివీర భయంకరులు. శాలంకాయన రాజులలో చివరివారు భీరువులై, అసమర్థులై, భోగలాలసులై, వున్న తరుణంలో మూలరాజు వంశీయుడైన ప్రభాకర మహారాజు స్వతంత్రుడై, తన పరిధి రాజ్యాన్నే కాకుండా, పరిసర సామంతులను ఓడించి, విశాల రాజ్యాన్ని నెలకొల్పి పాలించాడు. ఈ వంశీయులు బ్రాహ్మణులు. ఈ వంశానికి ఆద్యుడు ప్రభాకర మహారాజు.

         ప్రభాకర మహారాజు శక్తిసంపన్నుడు. యుద్ధ విద్యా విశారదుడు. సాహసి. ఇతడు శాలంకాయన ప్రభువుల సామంతుడిగా వుండి, విష్ణుకుండినుల విజృంభణాన్ని గమనించి, స్వాతంత్ర్యం ప్రకటించి, విష్ణుకుండినుల వంశీయులతో వైవాహిక సంబంధాలను ఏర్పరుచుకుని, తన సామంత రాజ్యాన్ని సుస్థిరపర్చుకున్నాడు. ఇతడు సుమారు 38 సంవత్సరాలు (క్రీస్తుశకం 360-398) పాలించాడు.

         ప్రభాకర మహారాజు మరణానంతరం అతడి కుమారుడు పృధ్వీమూలరాజు సింహాసనాన్ని అధిష్టించాడు. పృధ్వీమూలరాజు శక్తిసంపన్నుడు. అనేక యుద్ధాలలో విజయాన్ని సాధించాడు. ప్రభు భక్తి పరాయణుడు. యుద్ధ విద్యా విశారదుడు. పృధ్వీమూలరాజు రాజకీయ పరిజ్ఞాని. భవిష్యత్కాలాన్ని గమనించి, తండ్రి ప్రభాకర మహారాజు ఆజ్ఞానుసారం, తన ఏకైక కుమార్తె పరమ భట్టారికా మహాదేవిని విష్ణుకుండిన రాజ్యాన్ని ఏలుతున్న మొదటి గోవిందవర్మకు ఇచ్చి వివాహం చేశాడు. పృధ్వీమూలరాజు వివేకనయ విద్యా సంపన్నుడు. యుద్ధ విద్యలలో ఆరితేరినవాడు. అనేక యుద్ధాలలో పాల్గొన్నాడు. విష్ణుకుండినుల సామంత రాజుగా వారికి తోడ్పడి వారి రాజ్య విస్తరణకు సహాయం చేశాడు. ఇతడి పాలనా కాలం క్రీస్తుశకం 398-460, సుమారు 62 సంవత్సరాలు.

         పృధ్వీమూలరాజు మరణానంతరం అతడి కుమారుడు హరివర్మ మూలరాజ వంశ సింహాసనాన్ని అధిష్టించాడు. ఈ వంశీయుల రాజధాని గుణపాశపురం, నేటి తూర్పు గోదావరి జిల్లాలోని తాడూరు. హరివర్మ తన మేనల్లుడు విష్ణుకుండిన రెండవ మాధవ వర్మకు తన ఏకైక కుమార్తెను ఇచ్చి వివాహం చేయడమే కాకుండా, శాలంకాయన రాజ్యాన్ని విష్ణుకుండిన మహాసామ్రాజ్యంలో విలీనం కావడానికి తోడ్పడ్డాడు. హరివర్మ క్రీస్తుశకం 460-528 మధ్య కాలంలో సుమారు 68 సంవత్సరాలు పాలించాడు.

         హరివర్మ కుమారుడు మూలరాజు. ఇతడు పల్లవ  సింహవర్మను ఓడించి తన ప్రభువైన విక్రమేంద్ర భట్టారకునికి విజయం చేకూర్చాడు. ఇతడి పాలనా కాలం క్రీస్తుశకం 528-580, సుమారు 52 సంవత్సరాలు. మూలరాజుతో ఈ వంశం అంతరించినది.        

గుప్త వంశం

           కుషాణు, శాతవాహన వంశాలు పతనమైన అనంతరం భారతదేశ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించిన రాజవంశం గుప్త వంశం.ఈ వంశీయుల పాలన క్రీస్తుశకం 275 నుండి ప్రారంభమైంది.కాకపోతే ఈ వంశపు రాజుల అభ్యున్నతి మాత్రం క్రీస్తుశకం 320 నుండి ఆరంభమైంది. శక రాజులు, క్షహరాట వంశీయులు భారతావని పశ్చిమ భాగంలోను, ఉత్తర భాగంలోనూ, చిన్న-చిన్న రాజ్యాలను స్థాపించుకుని పాలిస్తూ ప్రబల శక్తి సమన్వితులై వున్న సమయంలో గుప్త వంశీయుల పాలన మొదలైంది. గుప్త రాజుల పరిపాలనను స్వర్ణయుగ పాలనగా పరిగణింపబడుతున్నది. భారతీయ సంస్కృతీ వికాసానికి ఈ వంశీయులు దోహద పడ్డారు. భారత జాతి ప్రపంచంలో ఉన్నత సంస్కారంగల జాతిగా గుప్తుల కాలంలో ప్రసిద్ధికెక్కింది. పదమూడుమంది గుప్త వంశపు రాజులు క్రీస్తుశకం 275 నుండి క్రీస్తుశకం 600 వరకు భారత భూభాగాన్ని ఏలారు. ఈ వంశీయులలో ప్రథముడు శ్రీగుప్తుడు.

         గుప్త వంశ చక్రవర్తులు బ్రాహ్మణులు. గుప్త వంశానికి చెందిన రెండవ చంద్రగుప్త సార్వభౌముడి కూతురు ప్రభావతీ గుప్త వాకాటక ప్రభువైన రెండవ రుద్రసేనుడిని వివాహం చేసుకున్నది. వాకాటకులు బ్రాహ్మణులు. గుప్త, వాకాటక రాజ వంశాలకు చెందిన ధారణ, విష్ణువృద్ధ గోత్రాలు బ్రాహ్మణులలో సుప్రసిద్ధమైన అగస్త్య, భారద్వాజ గోత్రాంతర్గతాలు. గుప్త యుగానికి చెందిన రాజన్యులు బ్రాహ్మణులైనప్పటికీ, వారు తమ పేరు చివర పితృ వంశ నామాలనే నిలుపుకున్నారు.

         గుప్త వంశ స్థాపకుడు శ్రీగుప్తుడు. ఇతడి పూర్వీకులు శాతవాహన నరేంద్రులకు, కుషాణు వంశపు రాజులకు విదేయ సామంతులుగా వుండి పాటలీపుత్ర ఉత్తర పరిసర ప్రాంతాలను పాలించారు. విదేశీయులైన శక, యవన, పహ్లవ, కుషాణు రాజ వంశీయులు ప్రజా కంటకులుగా మారిన సమయంలో హైందవ మతాన్ని, హిందువుల ఆచార వ్యవహారాలను, సంస్కృతీ సభ్యతలను ఒక శక్తియుతమైన రాజ్యాన్ని స్థాపించడం ద్వారా పూర్తిచేసిన ఘనత గుప్త వంశానికి దక్కింది. శ్రీగుప్తుడు చిన్న రాజ్యాన్ని స్థాపించుకుని, చుట్టుపక్కల వున్న చిన్న సామంత రాజ్యాలను జయించి, తన ఆధిపత్యాన్ని నెలకొల్పాడు. మౌర్య, శాతవాహన సామ్రాజ్యాల నాటి ప్రాభవాన్ని పునరుద్ధరించడానికి ఆవిర్భవించిన రాజ వంశం గుప్త వంశం. శ్రీగుప్తుడు యుద్ధ విద్యలలో ఆరితేరినవాడు. అసహాయశూరుడు. గుప్త రాజ్యాన్ని అతి వైభవంగా పాలించాడు. పరమత సహనం కల ఈ రాజు అనేక దేవాలయాలను నిర్మించాడు. పాటలీపుత్ర నగరాన్ని జయించి, దానిని తన రాజధానిగా చేసుకుని, చుట్టుపక్కల వున్న రాజ్యాలను జయించాడు. ఇతడు సుమారు 25 సంవత్సరాలు (క్రీస్తుశకం 275-3000) పాలించాడు.

         శ్రీగుప్తుడు మరణించిన తరువాత అతడి కుమారుడు ఘటోత్కచుడు మగథ సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడు గుప్త సామ్రాజ్యాన్ని విస్తృత పర్చాడు. ఇతడు అనేక సంస్కరణలను ప్రవేశ పెట్టి ప్రజాభిమానాన్ని చూరగొన్నాడు. పాటలీపుత్ర మహానగరాన్ని తీర్చిదిద్దిన ఘనుడు. ఇతడు 20 సంవత్సరాలు (క్రీస్తుశకం 300-320) పాలించాడు.

ఘటోత్కచుడి మరణానంతరం అతడి కుమారుడు మొదటి చంద్రగుప్తుడు మగథ రాజ్య సింహాసనం అధిష్టించాడు. ఇతడు గొప్ప విజేతగా, అరివీరభయంకరుడిగా కీర్తి గాంచాడు. లిచ్చవీ రాజవంశీయులతో సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకున్నాడు. తనమీద దండెత్తిన లిచ్చవీ వంశీయులు ఇతడి పరాక్రమాన్ని చూసి సంధి చేసుకున్నారు. వారి రాజ్యాలన్నీ మగథ సామంత రాజ్యాలుగా వుండడానికి అంగీకరించారు. చంద్రగుప్తుడు రాజ్యానికి వచ్చిన క్రీస్తుశకం 320 నుండి గుప్త శకం ప్రారంభమైంది. ఇతడు క్రీస్తుశకం 326 వరకు 6 సంవత్సరాలు పాలించాడు. గుప్తరాజ్యాన్ని ఉన్నత స్థితికి తీసుకు రావడానికి కృషి చేసిన మహారాజుగా కీర్తి గాంచాడు.

మొదటి చంద్రగుప్తుడి అనంతరం అతడి కుమారుడు సముద్రగుప్తుడు మగథ సామ్రాజ్యాధిపతి అయ్యాడి. సముద్రగుప్తుడు గుప్త రాజులలో గొప్ప విజేతగా కీర్తిని పొందినవాడు. అసాదారణ ప్రజ్ఞాపాటవాలు వున్నవాడు. రాజకీయ పరిజ్ఞాని. శక్తిమంతుడు. యుద్ధవిద్యా విశారదుడు. సంగీత సాహిత్యాలను క్షుణ్ణంగా అభ్యసించాడు. అనితర సాధ్యమైన దండయాత్రలు నిర్వహించి, అనేకమంది రాజులను ఓడించిన మహావీరుడు. ప్రపంచ విజేతలలో ఒకడు. పాటలీపుత్రనగరాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి పరచాడు. మగథ సామ్రాజ్యాన్ని క్రీస్తుశకం 326 నుండి క్రీస్తుశకం 375 వరకు సుమారు 50 సంవత్సరాలు అతి వైభవంగా పాలించాడు. అనేక దండయాత్రలు (ఉత్తర, దక్షిణ భారత) చేశాడు. విశాల సామ్రాజ్యంగా మగథ రాజ్యాన్ని స్థాపించాడు. సముద్రగుప్తుడు చక్రవర్తి. భారతదేశం విచ్చిన్నమై అదఃపతనమవుతున్న సమయంలో భారతజాతిని ఉద్ధరించడానికి, దేశ సమగ్రతను కాపాడడానికి, భారత జాతి సంస్కృతీ సభ్యతలను, ఆచార వ్యవహారాలను పరిరక్షించడానికి దండయాత్రలు చేసి మహాస్మారాజ్య నిర్మాణం చేసిన ఘనుడు.

సముద్రగుప్తుడి మరణం తరువాత అతడి జ్యేష్ట కుమారుడు రామగుప్తుడు మగథరాజ్య పీఠాన్ని క్రీస్తుశకం 375 లో అలంకరించాడు. అతడు పిరికివాడు. రాజ్యపాలనా విషయ పరిజ్ఞాని కాదు. శకరాజుల ప్రాబల్యానికి లోబడినవాడు. అతడెక్కువ రోజులు పాలించలేదు. క్రీస్తుశకం 375 లోనే సముద్రగుప్తుడి రెండవ కుమారుడు రెండవ చంద్రగుప్తుడు (చంద్రగుప్త విక్రమాదిత్యుడు) మగథరాజ్య సింహాసనం అధిష్టించాడు. భారతదేశ చరిత్రలో అసలు సిసలు స్వర్ణయుగం చంద్రగుప్తుడి కాలంలోనే అని చరిత్రకారులు అంటారు. చంద్రగుప్తుడు విద్యావైదుష్యాలు కలవాడు. ధర్మశాస్త్రజ్ఞుడు. వీరాధివీరుడు. చంద్రగుప్తుడు కాశ్మీర దేశాన్ని జయించాడు. ఇతడు బలవంతులైన రాజులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకుని తన రాజనీతిజ్ఞతను ప్రకటించుకున్నాడు. ఇతడు మగథ రాజ్యాన్ని 38 సంవత్సరాలు (క్రీస్తుశకం 375-413) పాలించాడు.

చంద్రగుప్త విక్రమాదిత్యుడి రెండవ రాణి ద్రువాదేవికి జన్మించిన మొదటి కుమార గుప్తుడు యువరాజుగా వుండి తండ్రి మరణానంతరం గుప్త సామ్రాజ్యాధినేత అయ్యాడు. తాత, తండ్రులు ఆర్జించి ఇచ్చిన సామ్రాజ్యాన్ని అన్యాక్రాంతం కాకుండా మొదటి కుమారగుప్తుడు జీవిత చరమ దశ దాకా పాలించాడు. సముద్రగుప్తుడి లాగానే ఇతడు అశ్వమేధ యాగం చేశాడు. కుమారగుప్తుడి అవసాన దశలో పుష్యమిత్ర జాతులవారు మగథ రాజ్యం మీద దండెత్తారు. మగథ సైన్యం ఓటమి చవి చూసింది. ఓడిపోయే సమయంలో ఆ ఆటవిక సైన్యాన్ని కుమారగుప్తుడి కుమారుడు, యువరాజైన స్కందగుప్తుడు ఎదిరించి పోరాడి వారిమీద విజయం సాధించాడు. ఆ విధంగా గుప్త వంశీయుల గౌరవాన్ని కాపాడాడు. కుమారగుప్తుడు విశాల మగథ సామ్రాజ్యాన్ని 42 సంవత్సరాలు (క్రీస్తుశకం 413-455) పాలించాడు.

మొదటి కుమారగుప్తుడి మరణానంతరం అతని కుమారుడు స్కందగుప్తుడు రాజయ్యాడు. స్కందగుప్తుడు సమర వ్యూహ రచనా నిపుణుడు. స్కందగుప్తుడి పాలనారంభ కాలంలో అతడు హూణుల మీద సాధించిన విజయం దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పడానికి తోడ్పడింది. కాని, క్రీస్తుశకం 465 లో హూణుల దండయాత్రలు తిరిగి మొదలయ్యాయి. గుప్తసామ్రాజ్యంలో అనేక భూభాగాలను జయించారు వారు. మగథ సైన్యం హూణులను ఎదిరించి ఓడిపోయింది. రాజ్య భాగాలను హూణుల పరం చేయాల్సి వచ్చింది. ఈ యుద్ధం వల్ల గుప్త సామ్రాజ్యం ఆర్థికంగా క్షీణించింది. స్కందగుప్తుడి సవతి సోదరుడు పూరుగుప్తుడు  తిరుగుబాటు చేశాడు. ఇంతలో హూణులతో జరిగిన యుద్ధంలో స్కందగుప్తుడు మరణించాడు. ఇతడి పాలనాకాలం 18 సంవత్సరాలు (క్రీస్తుశకం 455-473).

స్కందగుప్తుడి తరువాత పూరుగుప్తుడు గుప్త సామ్రాజ్యాధిపతి అయ్యాడు. ఇతడు మూడు సంవత్సరాలు మాత్రమే (క్రీస్తుశకం 473-476) పాలించగలిగాడు. వాస్తవానికి స్కందగుప్తుడి తరువాత గుప్తరాజుల చరిత్ర సమగ్రంగా లేదు. పూరుగుప్తుడి కాలం నుండి గుప్తవంశం రెండు శాఖలుగా చీలిందని కొందరు చారిత్రకారులు అంటారు కాని అది వాస్తవం కాదు. పూరుగుప్తుడి కుమారుడు బుధగుప్తుడు తండ్రి తరువాత రాజయ్యాడు. ఇతడు సుమారు 19 సంవత్సరాలు (క్రీస్తుశకం 476-495) రాజ్యం ఏలాడు. బుధగుప్తుడు నామ మాత్రపు రాజు మాత్రమే. బుధగుప్తుడి తరువాత వైశ్యగుప్తుడు, భానుగుప్తుడు నరసింహగుప్త బాలాదిత్యుడు పాలించారు.

ఆ తరువాత మిహిరకులుడు, మూడవ కుమారగుప్తుడు, యశోధర్మ విక్రమాదిత్యుడు, మాతృగుప్తుడు, ప్రవరసేనుడు రాజులయ్యారు. మూడవ కుమారగుప్తుడి తనయుడు దామోదరగుప్తుడు రాజ్యానికి వచ్చిన కొద్ది కాలానికే మౌఖరి ఈశానవర్మ సంతతివారితో సంభవించిన యుద్ధంలో మరణించాడు. ఇంతటితో గుప్తవంశం సమూలంగా నిర్మూలించబడింది.

(స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)

 

Saturday, April 6, 2024

State, National Politics Akin to Village Affairs : Vanam Jwala Narasimha Rao

 State, National Politics Akin to Village Affairs

Insinuations, threats, caste politics

used to mark local politics in past

Vanam Jwala Narasimha Rao

The Hans India (07-04-2024)

The current political scenario at National and State Levels, resembles politicking gimmicks played, right from Village Sarpanch Election to Block President and ZP Chairman, often unethical, decades ago. Emergences of Eknath Shindes, unscrupulously encouraging defections of elected representatives, political threats, politically motivated raids by Investigation Agencies, indiscriminately abusing policies of previous Governments, scant respect even to elders in opposition etc. are disturbing features of developing Indian Democracy.          

Six decades ago, I experienced typical politicking in Village Politics, when I moved to my village Vanamvari Krishnapuram, in the then politically volatile Khammam Block, after degree studies in Hyderabad. As many of my relatives then, were Sarpanches of neighboring villages, I too inadvertently was attracted to Village Politics. Then, Khammam District Congress Party Politics were vertically and horizontally divided between Jalagam Vengal Rao Faction and Seelam Siddareddy Faction. Jalagam was one time Chief Minister of AP and Union Minister, and Seelam was Minister in State Cabinet. Communist Party of India (CPI) supported Jalagam Faction and Communist Party of India Marxist (CPIM) supported Seelam Faction in district politics.

Goal of both Jalagam and Seelam, was to win majority Blocks, capture Zilla Parishad, and demonstrate Supremacy in district politics. In such a scenario, in my Village, a highly respected person, with Communist background, but was unable to exhibit it for obvious reasons, was unanimously elected as Sarpanch, every time elections were held, with the support and blessings of Jalagam Faction Congress Party, for which the local leader was the ‘Village Police Patel.’ Communist Sympathizers, though in considerable numbers, were too scared of ‘Patelism’ to come out openly to contest elections.

Indiscriminate Domination of ‘Police Patel,’ and his loyal henchmen was prevalent in the Village. Whenever Panchayat Elections were announced, Village Elders led by Patel, basically ‘Good Person’ by nature, a family friend of us, and stayed opposite our house, used to assemble in my house. They decided on the Sarpanch Candidate followed by announcing the same name to villagers in the center of village, eliciting their acceptance by ‘Voice Vote.’ Despite strong hidden reservations among many, the choice was unanimous! This is what has been happening in electing Legislature or Parliamentary Party Leader, not to speak of Political Parties’ Presidents these days!!!  

The ‘Choiceless and Voiceless Large Number Communist Cadre’ in the Village was by and large spellbound silent spectators, except a lone Communist. Even his silent followers were frightened to support him. Though he contested in a ward it was insignificant. On realizing my passive interest in politics and Communist Ideology, this lone communist desired that I should take lead in challenging the domination of Patel and his Men. I agreed initially in principle.

Meanwhile, some crucial political developments occurred in the village. An individual hooligan or Roudy Sheeter in the village, addicted to cheap liquor, was threatening and harassing villagers indiscriminately. He had the open support of his surname relatives and tacit support of ‘Patel’ for his selfish interest. Keeping this hooligan under his control Patel encouraged him to added addiction of liquor, in Cine Style and became more powerful by using him. The bonhomie ended shortly. The hooligan turned violently against Patel. In the tug of war, a new enemy of the hooligan, in connivance with Patel beaten him black and blue on a festival evening. Hostility between Patel and Hooligan stiffened. Patel openly announced that he would see his end in village. 

Gaining confidence with this, in the days that followed, one after another in the village who had hidden enmity on Patel ganged up openly against him. A ‘Land Lord’ of Patel’s cast, and a close aide of him, turned his foe on personal grounds. I too became little more active. We were encouraged by our neighboring villages CPIM leaders who included my uncles. District Communist (CPIM) Leadership extended support to our efforts. A former addict, who gave up liquor consumption on my advice, and several enthusiastic youngsters joined hands with us. At this juncture, this zigzag group formed with majority of communist supporters, plus the ‘Land Lord’ swore with sacred ‘Yellow Rice’ in hands, displaying the village style unity, to oppose Patel openly. This notion of swearing, be it with ‘Yellow Rice’ or wet clothes in temples or own family members as witness etc. but not before challenges and counter challenges by rival political party leaders, shamelessly abusing each other, is routine now. Absence of any sanctity, but spread of an unethical message, is the specialty of this.

Meanwhile, yet another phase of Panchayat Elections were announced. ‘Village style of Politicking’ which now stooped down to state and national levels, emerged in a typical fashion in my village.

A three-tier Panchayat Raj System, where, Village Panchayat voters first elect ‘Ward Members,’ and in the same evening elect the ‘Sarpanch’ on simple majority basis, and after a few days, Sarpanches electing Block President in secret ballot, was the procedure. Block President Election was preceded by electing six coopted members, who had equal rights on par with Sarpanches. Block President Election was preceded by ‘Camps’ spending huge amounts, where the Sarpanches were confined, so that they do not defect. This is the ‘Unholy Fashion’ now adopted in state politics in various elections. Well, how expensive they are is anybody’s guess!!!     

A similar procedure was followed to elect Zilla Parishad (ZP) Chairman, where the voters were Block Presidents and coopted members elected first by them. Here again ‘Camp Culture’ was predominant. Both ZP Chairman and Block Presidents were ‘Highly Powerful,’ politically and influence wise. There were instances when Cabinet Ministers resigned in preference to ZP Chairman Position and MLAs resigned in preference to Block Presidents. It may not be an exaggeration, to recall that, ZP Chairmen were ‘King makers’ in making Chief Ministers, on the lines of Chief Ministers, who were able to exert influence in making and unmaking Prime Minister, at one point of time in India. Vote of one sarpanch changed the fate in the election of ZP Chairman.

Back again to my village politics in the Panchayat Elections, surprisingly the ‘Land Lord sworn with Yellow Rice’ slipped into the hands of Patel on ‘Caste Card Basis’ and contested against our candidate, the ‘Erstwhile Hooligan’ and lost miserably. 8 out of 9 wards were won by Communist Supported Candidates. Despite winning majority wards, until last moment, election of Sarpanch was hanging and swinging either way, since the Patel Group used all dirty tricks to woo our members to their side, but in vain. This unhealthy practice of managing elected representatives to defect to their side ‘by hook or by crook’ is the order of the day. Ultimately the person whom Patel never wanted to win was elected as Sarpanch.

When Sarpanch was in the Camp before Block President Election, he was contacted by Patel (Cast Card) and was propelled into liquor addiction again.

Jalagam-CPI and Seelam-CPIM combinations captured equal number of villages in the Block. On election day, both groups counted my village sarpanch’s vote on their side. In the coopted members’ election, he wisely voted in favor of Seelam-CPIM side first and to the other side next. Serious warning to him ensured Seelam-CPIM combination victory for rest of the seats. However, Seelam-CPIM side preferential choice of Presidential (CPIM) Candidate, a Committed Communist, Ravella Satyam was defeated at the coopted stage. By winning this Block, with Rayala Virayya as President and Gandluri Kishan Rao as Vice-President, Seelam Group Congress Candidate R Bhuvan Sundar Reddy won as ZP Chairman and CPIM candidate, another Staunch Communist, TVR Chandram was elected as ZP Vice-Chairman. It was a Great Defeat to Jalagam Group then.

Alas!  State and National Level Politics now Stooped Down to Village Level Politicking!!!

Tuesday, April 2, 2024

విలక్షణం ... ఖమ్మం (విలక్షణ, విశిష్ట, విచిత్రమైన ఖమ్మం రాజకీయ నేపధ్యం) : వనం జ్వాలా నరసింహారావు

 విలక్షణం ... ఖమ్మం

(విలక్షణ, విశిష్ట, విచిత్రమైన ఖమ్మం రాజకీయ నేపధ్యం)

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ దినపత్రిక (03-04-2024)

{ రాష్ట్రంలో ఎప్పుడు, సాధారణ ఎన్నికలు ప్రకటించినా, అభ్యర్థుల ఎంపిక విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యే స్థానాలలో, ఖమ్మం లోక్ సభ, శాసనసభ స్థానాలు వుంటాయి. అలాగే, ఇందిరాగాంధీ ‘గాలి’ అయినా, ఎన్టీఆర్ ‘గాలి’ అయినా, ‘టీఆర్ఎస్’ గాలి అయినా నిలదొక్కుకొని, అన్ని జిల్లాలకు భిన్నంగా ఎన్నికల్లో తీర్పు ఇచ్చే ఏకైక జిల్లా, రాజకీయంగా చైతన్యవంతమైన ఖమ్మం జిల్లా మాత్రమే!!! ఉదాహరణకు 1978 శాసనసభ ఎన్నికలలో ఇందిరాగాంధీ కాంగ్రెస్ (ఐ) రాష్ట్రాన్ని ‘క్లీన్ స్వీప్’ చేసినప్పుడు ఖమ్మం జిల్లాలో 9 స్థానాలకుగాను 5 స్థానాలలో ఆమె అభ్యర్థులు ఓడిపోయారు. 1983 ఎన్నికలలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని ‘స్వీప్’ చేసినప్పుడు, ఖమ్మం జిల్లాలో ఒకేఒక్క స్థానం టీడీపీకి దక్కింది. టీఆర్ఎస్ పార్టీకి మూడు ఎన్నికల్లోనూ ఈ జిల్లాలో వ్యతిరేకమైన తీర్పే వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన ఏకైక జిల్లా కూడా ఇదే.}- సంపాదకుడి వ్యాఖ్య    

ఖమ్మంజిల్లాకు చెందిన రాష్ట్రస్థాయి, దేశస్థాయి రాజకీయనాయకులలో, సర్దార్ జమలాపురం కేశవరావు, మాడపాటి రామచంద్రరావు, బొమ్మకంటి సత్యనారాయణ రావు, జలగం వెంగళరావు లాంటి ప్రముఖులున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు జమలాపురం ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి తొలి అధ్యక్షుడు. స్వామీ రామానంద తీర్థ అనుచరుడిగా స్టేటు కాంగ్రెసు ఉద్యమాన్ని నిర్వహించిన మాడపాటి, గాంధీభవన్‌ నిర్మాణానికి పూనుకున్న పెద్దలలో ఒకరు. తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడుగా బొమ్మకంటి, మధిర ప్రాంతంలో పోరాటానికి నాయకత్వం వహించిన థీశాలి. మధిర ఎమ్మెల్యేగా (1957-1962), దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, రాష్ట్ర రాజకీయాలను శాసించిన ‘కింగ్ మేకర్’. హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయనకు కుడిభుజంగా, ఆయన సూచనమేరకు నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా కావడానికి తోడ్పడిన వ్యక్తిగా, అదే నీలంను వ్యతిరేకించిన వ్యక్తిగా బొమ్మకంటికి అసాధారణమైన గుర్తింపు వుంది. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా కీలకపాత్ర పోషించారు.

అలాగే రాష్ట్ర-దేశస్థాయికి ఎదిగిన వారిలో టీబీ విట్టల్ రావు, లక్ష్మీకాంతమ్మ, శీలం సిద్దారెడ్డి, బోడేపూడి వెంకటేశ్వరరావు, మల్లు అనంతరాములు, చేకూరి కాశయ్య, హీరాలాల్ మోరియా, మల్లు రవి, కోట పున్నయ్య, తుమ్మల నాగేశ్వరరావు, రేణుకా చౌదరి, పీవీ రంగయ్యనాయుడు, యలమంచిలి రాధాకృష్ణమూర్తి, వనమా వెంకటేశ్వరరావు, కోనేరు నాగేశ్వరరావు, జలగం ప్రసాద్, రాంరెడ్డి వెంకటరెడ్డి, సంభాని చంద్రశేఖర్, మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి మరెందరో తదితరులున్నారు. మల్లు అనంతరాములు 14 రాష్ట్రాలకు అఖిలభారత కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ గా, ఏపీసీసీ అధ్యక్షుడిగా, నాగర్ కర్నూల్ లోక్ సభ సభ్యుడిగా వుండేవారు. అకాల మరణం పొందకపోతే బహుశా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేవాడేమో?

రాష్ట్రంలో ఎప్పుడు, సాధారణ ఎన్నికలు ప్రకటించినా, అభ్యర్థుల ఎంపిక విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యే స్థానాలలో, ఖమ్మం లోక్ సభ, శాసనసభ స్థానాలు వుంటాయి. అలాగే, ఇందిరాగాంధీ ‘గాలి’ అయినా, ఎన్టీఆర్ ‘గాలి’ అయినా, ‘టీఆర్ఎస్’ గాలి అయినా నిలదొక్కుకొని, అన్ని జిల్లాలకు భిన్నంగా ఎన్నికల్లో తీర్పు ఇచ్చే ఏకైక జిల్లా, రాజకీయంగా చైతన్యవంతమైన ఖమ్మం జిల్లా మాత్రమే!!! ఉదాహరణకు 1978 శాసనసభ ఎన్నికలలో ఇందిరాగాంధీ కాంగ్రెస్ (ఐ) రాష్ట్రాన్ని ‘క్లీన్ స్వీప్’ చేసినప్పుడు ఖమ్మం జిల్లాలో 9 స్థానాలకుగాను 5 స్థానాలలో ఆమె అభ్యర్థులు ఓడిపోయారు. 1983 ఎన్నికలలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని ‘స్వీప్’ చేసినప్పుడు, ఖమ్మం జిల్లాలో ఒకేఒక్క స్థానం టీడీపీకి దక్కింది. టీఆర్ఎస్ పార్టీకి మూడు ఎన్నికల్లోనూ ఈ జిల్లాలో వ్యతిరేకమైన తీర్పే వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన ఏకైక జిల్లా కూడా ఇదే.   

 1952లో ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుండి, ఖమ్మం లోక్ సభ స్థానం కాంగ్రెస్‌కు బలమైన పట్టుగా వుంటూ వచ్చింది. ఇక్కడ అది 12 సార్లు గెలవగా, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ సార్వత్రిక ఎన్నికలలో గెలిచింది. పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (హైదరాబాద్), కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా టీబీ విట్టల్ రావు 2 సార్లు (1952, 1957), కాంగ్రెస్ అభ్యర్థులుగా టి లక్ష్మీకాంతమ్మ 3 సార్లు (1962, 1967, 1971), జలగం కొండలరావు 2 సార్లు (1977, 1980), జలగం వెంగళరావు 2 సార్లు (1984, 1989), పివి రంగయ్య నాయుడు ఒక సారి (1991), నాదెండ్ల భాస్కరరావు ఒకసారి (1998), రేణుకా చౌదరి 2 సార్లు (1999, 2004); కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) అభ్యర్థిగా తమ్మినేని వీరభద్రం ఒకసారి (1996); నామా నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఒకసారి, తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా ఒకసారి (2009, 2019); వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (2014) ఒకసారి గెలిచారు. గెలిచినవారిలో జిల్లాకు చెందని స్థానికేతరులే ఎక్కువ!!!

గడచిన మూడు దశాబ్దాల ఖమ్మం లోక్ సభ ఎన్నికల ఫలితాలు విశ్లేచించి చూస్తే ఈ నియోజకవర్గం గురించి అవగాహన కలుగుతుంది. ముఖ్యంగా, ఈ నియోజకవర్గంనుండి పోటీ చేయడానికి స్థానికులకన్నా, స్థానికేతరులే అధిక సంఖ్యలో ఆసక్తి కనపరిచారు కాబట్టి అసలు అవగాహన కలగాల్సింది కూడా మొదట బయటివారికే. ఒకానొక సందర్భంలో సాక్షాత్తు సోనియాగాంధీ మేడంనే ఇక్కడ పోటీకి దింపాలని ఆలోచన జరిగింది. 1952 సాధారణ ఎన్నికల నుండి 2019 భారత సాధారణ ఎన్నికల దాకా ఇక్కడ జరిగిన ఆసక్తికరమైన పోటీలో బహుశా ఒకటి రెండు పర్యాయాలు మాత్రమే వంద శాతం స్థానికులు అని చెప్పగలవారు గెలిచారు. కేంద్రమంత్రులైనవారు కూడా వున్నారు. నియోజకవర్గానికి వీరు చేసింది ఏమిటనేది కోటిరూకల ప్రశ్న!

1991 సాధారణ ఎన్నికలలో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అప్పుడే ఉన్నత పోలీసు అధికారిగా పదవీ విరమణ చేసిన ఫక్తు స్థానికేతరుడు, పీవీ రంగయ్య నాయుడు సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థి, యువకుడు, కమ్యూనిస్ట్ కుటుంబ నేపద్య్హం వున్న వ్యక్తి, (ప్రస్తుతం రాష్ట్ర స్థాయి నాయకుడు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి) తమ్మినేని వీరభద్రం మీద కేవలం 6000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. పోటీలో వున్న ఒక స్వతంత్ర అభ్యర్థి సుమారు 50000 ఓట్లను చీల్చడం వల్లే రంగయ్య నాయుడు ఎన్నిక సులభమైంది. కాకుంటే, ఫలితం ఎలా వుండేదో? ఆ తరువాత పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆయన కేంద్రమంత్రిగా పనిచేశారు.

రంగయ్య నాయుడు కన్నా ముందర ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు జలగం వెంగళరావు, జలగం కొండలరావు, లక్ష్మీకాంతమ్మ తదితరులు దాదాపు స్పష్టమైన మెజారిటీతోనే గెలిచారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల చీలికలు, ఇరుపార్టీలు అభ్యర్థులను నిలబెట్టిన సందర్భాలూ వున్నాయి. అవన్నీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి లాభం చేకూర్చాయి. 1996 ఎన్నికలలో విజయం సాధించిన సీపీఐ(ఎం) అభ్యర్థి తమ్మినేని వీరభద్రం కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ రంగయ్య నాయుడుమీద గెలవడానికి ఒకవిధంగా ఎన్టీఆర్ టీడీపీ అభ్యర్థి పోటీలో వుండడం కూడా కావచ్చు అని గణాంకాలు చెప్తున్నాయి. తమ్మినేని పదవీ కాలం చాలా తక్కువ.

1998 సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా స్థానికేతరుడు, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు సిట్టింగ్ సీపీఐ(ఎం) అభ్యర్థి తమ్మినేని వీరభద్రం మీద కేవలం 11000 ఓట్ల మెజారిటీ మాత్రమే సాధించి గెలిచాడు. పోటీలో వున్న బీజెపీ అభ్యర్థి సుమారు లక్షకు పైగా ఓట్లను పొందడం వల్లే భాస్కరరావు గెలుపు సాధ్యమైంది. ఇక ఆ తదుపరి సాధారణ ఎన్నికల నుండి రేణుకా చౌదరి, నామా నాగేశ్వరరావుల పర్వం ఆరంభమైందనాలి. 1999 ఎన్నికలలో మరో స్థానికేతర వ్యక్తి రేణుకా చౌదరి (మాజీ కేంద్రమంత్రి) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేవలం 8000 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో సమీప టీడీపీ అభ్యర్థిపై గెలిచారు. సీపీఐ(ఎం), టీడీపీ పార్టీల అభ్యర్థుల ఉమ్మడి ఓట్లు చాలా అధికం. వారు కలిసి పోటీ చేసినట్లయితే కాంగ్రెస్ గెలుపు సాధ్యమయ్యేది కాదేమో!

2004 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై స్పష్టమైన ఆధిక్యతతో గెలిచారు. 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం అభ్యర్థి పోటీలో వున్నందున కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి మీద టీడీపీ అభ్య్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు సాధ్యమైందని చెప్పాలి. 2014 ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వచ్చిన ఓట్లు కేవలం 35% అయినా, పోటీలో టీడీపీ, సిపిఐ, టీఆర్ఎస్ వున్నందున ఆయన గెలుపు సాధ్యపడింది. ఇక గత 2019 భారత సాధారణ ఎన్నికలలో టీడీపీ నుండి బీఆర్ఎస్ పార్టీకి మారిన నామా నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేణుకా చౌదరి మీద సుస్పష్టమైన ఆధిక్యతతో గెలిచారు.

ఖమ్మం జిల్లాలోని శాసనసభ స్థానాల తీర్పు కూడా భిన్నంగా వుంటూ వస్తున్నది. ఉదాహరణకు, ఖమ్మం నియోజకవర్గం తీసుకుంటే, పీడీఎఫ్ అభ్యర్థిగా నామవరపు పెద్దన్న మొదటిసారి గెలవగా, ఆ తరువాత వరుసగా, సీపీఐ నుండి నల్లమల్ల గిరి ప్రసాద్, రజబ్ అలీ (2), కాంగ్రెస్ నుండి కీసర అనంతరెడ్డి, సీపీఐ (ఎం) నుండి మంచికంటి రాంకిషన్ రావు (2), సీపీఐ నుండి పువ్వాడ నాగేశ్వరరావు (2), కాంగ్రెస్ నుండి యునిస్ సుల్తాన్, సీపీఐ (ఎం) నుండి తమ్మినేని వీరభద్రం, టీడీపీ నుండి ఒకసారి, కాంగ్రెస్ నుండి ఒకసారి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నుండి ఒకసారి, తెలంగాణ రాష్ట్రసమితి నుండి ఒకసారి పువ్వాడ అజయ్‌ కుమార్‌ గెలిచారు. ‘అపర గాంధీ’గా పిలువబడ్డ పానుగంటి పిచ్చయ్య, పాల్వంచ నియోజకవర్గం నుంచి గెలిచాడు. ఖమ్మం మునిసిపాలిటీ విషయానికొస్తే చిర్రావూరి లక్ష్మీనరసయ్య జీవించినంత కాలం కమ్యూనిస్ట్ అభ్యర్థిగా ఆయనే ఎల్లప్పుడూ చైర్మన్.

ఇదిలా వుండగా, ‘కమ్యూనిస్టుల కంచుకోట’ అన్న పేరున్న ఖమ్మం జిల్లాకు, రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన చిర్రావూరి లక్ష్మీనరసయ్య, సర్వదేవభట్ల రామనాధం, మంచికంటి రామ కిషన్‌రావు, రావెళ్ళ సత్యనారాయణ, కెఎల్ నరసింహారావు, పర్సా, బోడేపూడి వెంకటేశ్వర రావు వంటి యోధులు పాల్గొనడం జరిగింది. పార్టీ చీలిపోయిన దరిమిలా, కమ్యూనిస్టు (సేపేఐఎం) పార్టీకి పట్టున్న జిల్లాగా ఖమ్మానికి పేరు వచ్చింది. దేశచరిత్రలోనే పౌరహక్కుల ఉద్యమానికి నాంది పలికింది డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి, అడ్వకేట్లు రాధాకృష్ణ, సుబ్బారావుల ‘మేథావి త్రయం’ సారధ్యంలో ఖమ్మం జిల్లాలోనే అనేది జగద్విదితం. ప్రజా ఉద్యమాల నేపధ్యంలో నిర్మించబడిన అదే కమ్యూనిస్ట్ పార్టీ, క్రమేపీ, అంతర్గత కుమ్ములాటలతో, బలహీనపడిపోయి, దాని ఉనికే ప్రశ్నార్థకం అయింది.  

 ఇలాంటి నేపధ్యం, రాజకీయ చైతన్యం వున్న ఉద్యమాల గుమ్మం ఖమ్మం జిల్లా. ఖమ్మం లోక్ సభ స్థానాన్ని ఈ సారి గెలవబోయే అభ్యర్థి ఎవరో, గెలిచి చేయబోయేది ఏమిటో వేచి చూడాలి.