Tuesday, February 7, 2017

108 సేవల ఆద్యుడు రామలింగరాజే! .....వనం జ్వాలా నరసింహారావు

108 సేవల ఆద్యుడు రామలింగరాజే!
వనం జ్వాలా నరసింహారావు
ఇ ఎం ఆర్ ఐ 108 మాజీ కన్సల్టెంట్ (80081 37012)

108 ఆద్యుడు పద్మశ్రీ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం గౌరవించిన గుజరాత్ వాసి డాక్టర్ సుబ్రతోదాస్ అని, కొన్ని పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలు అవాస్తవం. ఆపదలో వుంటే ఫోన్ చేయగానే క్షణాల్లో చేరుకుని ప్రాణాలు కాపాడే 108 అంబులెన్స్ సేవల వెనుక వున్న కథకు ఆయన ఆద్యుడు కాదు. అహ్మెదాబాద్ కు చెందిన డాక్టర్ సుబ్రతోదాస్ స్థాపించిన లైఫ్ లైన్ ఫౌండేషన్ అనే స్వఛ్చంద సంస్థ సేవలు గొప్పవే. ఆయన ఈ రంగంలేసిన కృషి కూడా గొప్పదే. కాకపోతే అభ్యంతరమల్లా, ఆ సంస్థ కారణంగానే గుజరాత్ ప్రభుత్వం తొలిసారి అత్యవసర వైద్యసేవల చట్టం-2007 తీసుకొచ్చిందనీ, ఆ క్రమంలో ఆవిర్భవించిందే 108 అనీ, తరువాత ఇతర రాష్ట్రాలతోనూ ఆయన మాట్లాడారనీ, అందువల్లే 26 రాష్ట్రాల్లో 108 పనిచేస్తుందనీ, పేర్కొనడమే. నిజానిజాలు పదిమందికి తెలియాలనీ, 108  సేవల కారకుడు బైర్రాజు రామలింగ రాజు అనే ఒక తెలుగువాడనీ, ఆ విషయం పదిమందికి తెలిసేలా చరిత్ర పుటల్లో ఇప్పటికైనా నమోదు కావాలనీ ఈ వ్యాసం రాస్తున్నాను.

108 సేవలు ఎలా అప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా మొదలైందీ, ఎలా ఇతర రాష్ట్రాలకు వ్యాప్తి చెందిందీ అనే వివరాలలో భాగంగానే గుజరాత్ రాష్ట్రంలో ఆ సేవలు ఎలా ప్రారంభమైనాయో అనే విషయం స్పష్టంగా వుంది. ఆగస్ట్ 15, 2005 న అప్పటి కేంద్ర మంత్రి దయానిధి మారన్, అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డిల సమక్షంలో ప్రారంభమై విజయవంతంగా కొనసాగుతున్న ఈ సేవల విషయం తెలుసుకున్న మోడీ గుజరాత్ ప్రభుత్వం, అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారిణి శ్రీమతి మోనా ఖాందార్ ను, హైదరాబాద్ పంపింది. 108 సేవల కేంద్రమైన ఇఎంఆర్ఐ కార్యాలయాన్ని 2007 మే నెలలో సందర్శించిదామె. దరిమిలా ఇఎంఆర్ఐ అధికారులు (నేను కూడా వున్నాను) అహ్మెదాబాద్ వెళ్లి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, ఆరోగ్య శాఖ మంత్రిని కలవడం, ఆ తరువాత ఐదారు పర్యాయాలు ఉత్తర ప్రత్యుత్తరాలు జరగడం, అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవడం, ఆగస్ట్ 29, 2007 న అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా లాంఛనంగా ఆ రాష్ట్రంలో 108 సేవలు మొదలవడం జరిగింది. ఉత్తర ప్రత్యుత్తరాలలో ఇఎంఆర్ఐ పక్షాన రాసిన లేఖలన్నీ నా సంతకంతో పోయినవే! ఈ పూర్వరంగంలోనే గుజరాత్ అత్యవసర వైద్యసేవల చట్టం-2007 ను ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కాని డాక్టర్ సుబ్రతోదాస్ కారణంగా కానే కాదు. అహ్మెదాబాద్ లో 108 సేవలు ప్రారంభమైనప్పుడు వేదికపైన మోడీతో పాటు మాజీ రాష్ట్రపతి ఏపీజె అబ్దుల్ కలాం, ఇఎంఆర్ఐ సంస్థ అధ్యక్షుడు రామలింగరాజు, సంస్థ సీఈఓ వెంకట్ చంగవల్లి కూడా వున్నారు. ఆ రాత్రి మోడీ ఇచ్చిన ప్రత్యేక డిన్నర్ లో రామలింగరాజు పాల్గొన్నారు.

108 అంబులెన్స్ సేవలతో మూడున్నర సంవత్సరాలు అనుబంధం వున్న వ్యక్తిగా, "ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియ" ఆవిర్భావం నుంచి ఆరోహణ వరకు, ఉన్నత శిఖరాలకు చేరుకోవడం దాకా, నా వంతు (ప్రధాన?) భూమిక నిర్వహించిన వ్యక్తిగా, ఎవరు 108 ఆద్యులో...ఎవరు కాదో...పూర్తిగా తెలిసినవాడిగా వాస్తవాలు తెలియచేసే ప్రయత్నమే ఇది. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ "కరుణామయి-కారుణ్య దేవత"  గా వర్ణించిన 108 అంబులెన్స్ అత్యవసర సహాయ సేవల తో సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు రామలింగ రాజు అనుబంధం, ఆయన కారణంగానే 108 సేవలు మొదలై, అంచలంచలుగా వ్యాప్తి చెందాయనే సత్యం ఇప్పట్లో కొందరికి తెలియకపోయినా ఓ దశాబ్దం క్రితం ఇప్పటి ప్రధాన మంత్రి, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో సహా పలువురికి తెలిసిన విషయమే. "108 అంబులెన్స్" ఆవిర్భావం, పరిణామక్రమం వెనుక దాగి వున్న వాస్తవాలు ఆసక్తికరమైన వే కాకుండా పరిశోధకులకు అధ్యయనపరమైనవి కూడా.

తాను నడుపుతున్న సత్యం కంప్యూటర్స్ సంస్థ భారతదేశంలోనూ-అంతర్జాతీయం గానూ పేరు-ప్రతిష్ఠలతో పాటు కోట్లాది రూపాయల లాభాలను ఆర్జించడంతో, సంస్థ చైర్మన్ రామలింగ రాజులో అంతర్లీనంగా వున్న దాతృత్వ ధోరణి బహిర్గతం కాసాగింది. తనను ఉన్నతస్థితికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతగా ముందుగా తన ప్రాంత ప్రజలకు, దరిమిలా రాష్ట్ర ప్రజలకు, క్రమేపీ దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడికి ఏదైనా లాభం కలిగే పని చేపట్టాలన్న భావన కలిగింది రాజుగారిలో. తనకీ ఆలోచన కలగడానికి కొంత నేపధ్యం కూడా వుంది. జూన్ 27, 2001 న రామలింగ రాజు తండ్రి బైర్రాజు సత్యనారాయణ రాజు  మరణించడంతో, ఆయన జ్ఞాపకార్థం, గ్రామీణ ప్రజల్లో వికాసం కలిగించేందుకు ఉద్దేశించిన "బైర్రాజు ఫౌండేషన్" ను రామలింగరాజు సోదరులు ఆగస్ట్ 15, 2001 న స్థాపించారు. ఇందులో భాగంగా సంస్థ అందించిన సేవల్లో ప్రధానమైనవి మూడు అంబులెన్సుల ద్వారా అందించిన ఆరోగ్య రక్షణా సేవలు. క్రమేపీ, ఆ గ్రామీణ వికాస సేవలను 200 గ్రామాలకు విస్తరించి, నేరుగానో, పరోక్షంగానో, సుమారు పది లక్షల మంది జనాభాకు లాభం చేకూరేలా సుమారు 25 రకాల సేవలను అందించసాగింది బైర్రాజు సంస్థ. ఆ సేవల్లో ప్రధానమైనవి: ఆరోగ్య సంరక్షణ, విద్య-అక్షరాశ్యత, జీవనోపాధి, పర్యావరణం, పారిశుధ్యం, మంచి నీరు, వ్యవసాయం, క్రీడలు, గ్రామీణ సాంకేతిక అభివృద్ధి, అత్యవసర సహాయ సేవలు. ఆ క్రమంలోనే జులై 16, 2003 న "సహాయ" పేరుతో ప్రయోగాత్మకంగా వైద్య పరమైన అత్యవసర సహాయ సేవలను (+91 98494 54321 కాల్ నంబర్) పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలలోని 19 గ్రామాలకు పనికొచ్చేలా బైర్రాజు ఫౌండేషన్ ప్రారంభించింది. అవి విజయవంతంగా నడవడంతో వాటిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలన్న ఆలోచన కలిగింది రామలింగరాజు గారికి. ఆ ఆలోచనే భవిష్యత్ లో 108-అత్యవసర సహాయ సేవల ఏర్పాటుకు దారితీసింది.


రామలింగరాజు ఆలోచనలను కార్యరూపంలో పెట్టడానికి సత్యం కంప్యూటర్స్ సంస్థలో పని చేస్తున్న డాక్టర్ బాలాజి రంగంలోకి దిగారు. డాక్టర్ బాలాజికి తోడ్పడిన వారిలో ముందు వరుసలో డాక్టర్ ఎ. పి. రంగారావు, వారణాసి సుధాకర్, శ్రీకాంత్, కృష్ణ కోనేరు, శ్రీనివాస రాంబాబు, పొలిమల్లు శివ వున్నారు. వీరి లాంటి ఎందరో కలిసి రూపొందించిన ప్రణాళికా బద్ధమైన కార్యాచరణ పథకమే 108-అత్యవసర సహాయ సేవలు. వీరందరి కంటే, సంస్థ సీఈఓ గా ఐదేళ్ల పాటు పని చేసిన వెంకట్ చంగవల్లి వివిధ రాష్ట్రాలకు ఆ సేవలను విస్తరించడానికి కృషి చేశారు.

మొదట్లో, హైదరాబాద్ నగరంలో ఒకటి-రెండు అంబులెన్సులను నడిపి ఫలితాలెలా వుంటాయో చూద్దామనుకున్నారు. కేవలం ఒక్కో పౌరుడి మీద సంవత్సరానికి పది రూపాయలు (అప్పటి లెక్కల ప్రకారం) మాత్రమే ఖర్చు చేయగలిగితే దేశమంతా సంపూర్ణ వైద్య సౌకర్యాలున్న అంబులెన్సులను నడపొచ్చొని నిర్ణయానికొచ్చారు. సత్యం సంస్థలోనే పనిచేస్తున్న మరో సీనియర్ అధికారి వారణాసి సుధాకర్ సాంకేతిక సహాయం, డాక్టర్ రంగారావు వైద్య పరమైన సలహా-సంప్రదింపులు రాజుగారి ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాయి. సత్యం మేనేజ్ మెంట్ విభాగంలో పనిచేస్తున్న మరో అధికారి కృష్ణ కోనేరు కూడా వీరికి తోడయ్యారు. ఆయన సూచించిన "సెన్స్-రీచ్-కేర్" నమూనా రాజుగారికి నచ్చింది. డాక్టర్ రంగారావు ఎంపికచేసిన (అప్పటికి) సుమారు 132 రకాల "ఎమర్జెన్సీలను" క్రోడీకరించారు. అత్యవసర సహాయ సేవలు లభ్యమవడానికి అవసరమైన "మెడికల్ ప్రక్రియల” ను, "ప్రోటోకాల్స్" ను రూపొందించసాగారు. టోల్ ఫ్రీ టెలిఫోన్ గురించి, దాని నంబర్ గురించి, అంబులెన్స్ డిజైన్ గురించి, లోగో గురించి, వైద్య పరమైన ప్రోటోకాల్స్ గురించి, సాంకేతిక సదుపాయాల గురించి, ప్రభుత్వ భాగస్వామ్యం గురించి స్పష్టత రాసాగింది.

          లాభాపేక్ష లేని "సొసైటీ" తరహాలో, "ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్" అన్న పేరుతో రిజిస్టర్ చేశారు. దీనికి స్ఫూర్తి అమెరికాలోని 911 అత్యవసర సహాయ సేవలు. ఇలా మౌలిక సదుపాయాలకు-సహాయ సేవల రూపకల్పనకు సంబంధించిన పనులను చేసుకుంటూనే, ప్రభుత్వంతో ఏప్రియల్ 2, 2005 న మొట్టమొదటి "అవగాహనా ఒప్పందం" పై సంతకాలు చేశారు. జులై 14, 2005 కల్లా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన మౌలిక సదుపాయాలు తయారయ్యాయి. కేంద్ర ప్రభుత్వ టెలీకమ్యూనికేషన్ కార్యదర్శిగా అప్పట్లో పనిచేస్తున్న తెలుగు అధికారి జె శ్రీధర్ శర్మతో రామలింగరాజు గారికున్న వ్యక్తిగత సాన్నిహిత్యంతో, టోల్ ఫ్రీ నంబర్ 108 ని శాశ్వతంగా, ఏ రాష్ట్రంలో వాడుకోవడానికైనా వీలుగా, కేటాయిస్తూ, కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ విధంగా 108 నంబర్ ను సాధించిన ఘనత రామలింగరాజు దైతే, అది కేటాయించిన ఘనత శ్రీధర్ శర్మదవితుంది. ఇద్దరూ తెలుగు వారు కావడం మనకు గర్వకారణం. ఆగస్ట్ 15, 2005 న లాంఛనప్రాయంగా అంబులెన్సులను హైదరాబాద్ లో ప్రారంభించడానికి ఏర్పాట్లు జరిగాయి.

ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి దయానిధి మారన్, గౌరవ అతిథిగా (దివంగత) ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి, కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు అప్పటి ఆరోగ్య-ఆర్థిక శాఖల మంత్రి (ఆ తర్వాత ముఖ్యమంత్రి) రోశయ్య వచ్చారు. ప్రధాన కార్యదర్శి మోహన్ కందా కూడా వచ్చారు. హైదరాబాద్ గ్రాండ్ కాకతీయ హోటల్ లో భారీ సంఖ్యలో హాజరయిన ఆహుతుల సమక్షంలో, ఆగస్ట్ 15, 2005 న, ఆద్యతన భవిష్యత్ లో, లక్షలాది ప్రాణాలను కాపాడనున్న అత్యవసర ఆరోగ్య, వైద్య-పోలీసు-అగ్నిమాపక దళ సహాయ సేవలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. కేవలం 75 అంబులెన్సులతో ఆరంభమయిన ఆ సేవలు, అచిర కాలంలోనే, "ఇంతై-ఇంతితై-వటుడింతై" అన్న చందాన దేశంలోని 14 రాష్ట్రాలలో 10, 500 అంబులెన్సులను ప్రవేశ పెట్టడానికి దారితీసింది. రామలింగరాజు గారు సంస్థ అధ్యక్షుడుగా బాధ్యతల నుండి వైదొలగేనాటికి 108 సేవలు 10 రాష్ట్రాలలో 45 కోట్ల మంది ప్రజలకు అందుబాటులో వుండేవి. ఆ తరువాత ఇఎంఆర్‍ఐ బాధ్యతలను జీవీకే సంస్థ చేపట్టింది. మరో 35 కోట్ల జనాభాకు ఈ సేవలను విస్తరించి 80 కోట్ల ప్రజలకు లబ్ది కలిగేలా జీవీకే సంస్థ కృషి చేసింది. ఈ అరుదైన తరహా సేవల ప్రక్రియను అధ్యయనం చేసేందుకు, ఇంకా పొరుగు రాష్ట్రాల నుంచి-విదేశాల నుంచి అధికార-అనధికార ప్రతినిధులు, బృందాలు రావడం జరుగుతూనే వుంది.

ఉమ్మడి ఆంధ్రపదేశ్ తరువాత ఈ సేవలను మొట్టమొదట ప్రారంభించిన రాష్ట్రం గుజరాత్ కాగా, ఆ తరువాత మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, రాజస్థాన్, గోవా, అస్సాం, కర్నాటక, మేఘాలయ, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్ లతో కలిపి మొత్తం 14 రాష్ట్రాలలో 80 కోట్ల ప్రజలకు 108 సేవలు లభ్యమవుతున్నాయిప్పుడు.  సుమారు  5 కోట్ల ఎమర్జెన్సీలలో సహాయం అందించి, సుమారు 2 కోట్ల మంది ప్రాణాలను కాపాడగలిగిందీ 108 నంబర్. అదనంగా జీవీకే కృషి వల్ల పొరుగు దేశమైన శ్రీలంకకు కూడా ఈ సేవలు విస్తరించాయి.


వాస్తవాలు వాస్తవాలుగా రాయాలి కాని, ఒకరు చేసిన మంచి పనిని మరొకరు చేసినట్లుగా చిత్రీకరించడం భావ్యం కాదు. కోట్లాది మంది ప్రాణాలను కాపాడడానికి కారణమైన, అవుతున్న, "108 ఆద్యుడు" నూటికి నూరు పాళ్లు సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత, ఇఎంఆర్ఐ వ్యవస్థాపక అధ్యక్షుడు బైర్రాజు రామలింగ రాజు గారే! ఆ గౌరవం ఆయనకే దక్కాలి...దక్కి తీరాలి! End 

Monday, February 6, 2017

Telangana Brahmin Samkshema Parishad : Vanam Jwala Narasimha Rao

Telangana Brahmin Samkshema Parishad
Vanam Jwala Narasimha Rao
(Vice-Chairman Samkshema Parishad)

            Government of Telangana constituted “Telangana Brahmin Samkshema Parishad” as a registered society with 17 members in January 2017. Earlier the Government has issued orders in December 2016 allotting six acres and ten guntas of land at Gopanpally in Serilingampally mandal of RR District for construction of “Brahman Sadan” on a nominal payment of one rupee per acre in accordance with the promise made by Chief Minister K Chandrasekhar Rao in the meeting held on Brahmin welfare. Now the stage is all set for Bhoomipuja of the Sadan in the third week of February 2017.   

The first ever Brahman Welfare meeting anywhere in the country chaired by the Chief Minister of the state was held on 23rd of October at Dr MCR HRD Institute Campus in Hyderabad. Chief Minister K Chandrasekhar Rao spoke eloquently on various hardships, issues and problems faced by Brahman Community. The 80 and odd participants from a cross section of the community also shared their views and agreed on many things brought out by CM. The Chief Minister had given emphasis to the role of Brahmans since ages and highlighted how they have been in the service to society and humanity. He also brought to the notice of the gathering held, on the hardships faced by the Brahman community. CM said that the things have come to such a stage to the Brahmans that at several places Archakas are solely dependent on the offering made by the devotees in temples at the time of Harati.  He also said that the young marriageable age Brahman boys are not getting brides for them to marry as young girls are not in favor of marrying boys in Archaka profession.

The CM said that the community should overcome these difficulties and obstacles. In this context, KCR suggested that a well conceived strategy and comprehensive plan of action should be evolved together by persons both in and outside the government for the overall well being of Brahmins in Telangana State. To begin with, CM suggested that a building complex to be known as Brahman Sadan with all the facilities would be made available for the Brahmin community in Hyderabad from the government side. A Board of Trustees will oversee the administration and management of the complex. All the traditional ceremonies, celebrations and other community activities of the Brahmans should be held under one roof, the CM suggested.


Several participants at the meeting spoke on the occasion. The general consensus was that Brahmans primarily engaged in the service to humanity, from helping the individuals to get over their day-to-day obstacles through offering Vedic remedies. Brahmans are there to help people to perform rituals and ceremonies from birth to death. They have been also rendering help to spread the ancient wisdom, spiritual teachings and imparting Vedic knowledge. All these services are provided by Brahmans without anticipating any personal benefit.

During the discussion, several interesting points emerged about the origin of the brahmanical traditions from the beginning of the civilization. It was pointed out that there is an underlying relationship between Srushti-the Creation of universe and Brahmans. Telangana State Vigilance Commissioner K R Nandan who also participated in the meeting, made several interesting observations giving a clue about the genesis, origins, need, evolution and ever-changing role and status of Brahman community.

During the invasions that took place thousands of years ago all over the world, Invaders not only looted the natives but also replaced the existing native culture, religion, traditions and customs with that of the Invaders’. For instance, Persia (now Iran), Turkey, Egypt which were non-Islamic countries have become Islamic after the invasions. Historically, it took them very little time for the Invaders to change the culture, religion and customs of these countries. Persia (Iran) where people used to worship the Fire God (Zoroastrians) was turned into an Islamic country within two decades. The Persian and Egypt civilizations were in existence for over 5000 years but it took the invaders just couple of decades to change them.

But, as far as India was concerned, despite the rule by Moghuls for over 800 years and the British Colonial rule of about 200 years, none could dare change the religion, culture, traditions, Santhana Dharma till date. The entire credit for protecting, preserving and defending the Santhana Hindu Dharma, its traditions and customs goes entirely to the Brahman community who could withstand the might of the invaders! More over our Santhana Hindu Dharma is all-encompassing inclusive in its nature and that of the invaders was restricted exclusive one!

Thus, the Brahmans were able to defend, protect and preserve the Indic culture and also at the same time passed on it to the generations after generation to come. Our ancient tradition, culture, wisdom and value system are all aimed at universal welfare. Ancient Great Rishis enabled the Brahmans in acquiring the knowledge of the ancient wisdom and to keep it under their protection. The Rishis were created by the Brahma even before the Devatas. The Rishis were asked to teach the human beings about the Atma, Jeevatma, and Paramatma, the importance of the human form, Creation, the essence of life and the cycle of existence. The Rishis living in heaven took birth on earth, married human beings, gave birth to children and completed their tasks and then left to their original abode of them.

The Rishis left behind a rich wisdom through the literary wealth preserved in several scriptures, traditions and customs. They passed on their knowledge, wisdom to Brahmans to protect, preserve, defend and propagate to generations after generations to come by. Thus the descents of these great Rishis are the Brahmans in this land. The Brahmans as teachers, Gurus, Purohits are acting as the guardians of the ancient wisdom and transmitting it through the ages till date. The life of a Brahman is full of sacrifices and selfless in all aspects. It is known as “Voluntary Poverty”. This is what Brahmans of all the ages have been doing till date.

Leading a life with voluntary poverty, a Brahman would never sell his knowledge. He would lead an austere life often end up in begging. Saint-Composer Tyaga Raja did the same two hundred years ago while rejecting riches from the King. The Brahmans are expected to lead the society in a selfless manner without expecting anything. They are destined to do so and they are doing it till date. Hence welfare of Brahman is welfare of the Parameswara.

The imitative taken by CM KCR had brought to light the true essence of Brahmans existence and the need of the society to preserve and protect them for the larger interest of the society in general, country in particular. The meeting chaired by him paved way for their welfare and for drawing a strategy for it. It also leads to encouragement to Vedic studies, financial assistance to spiritual thinkers, provision for education, health, skill development, encouragement to entrepreneurs etc. The Brahman Sadan Complex that is being planned in Hyderabad on the land allotted by Government of Telangana will be a platform for development of Brahman community and provides for a traditional accommodation to Peetaadhipathis and scholars coming from outside. This is in way an all-round development plan of the Brahman community. This will also be the first of its kind in the country.


Brahmans Welfare of this nature is bliss to the Supreme Being. 

Sunday, February 5, 2017

నే నెవ్వరిని? అని అడిగిన శ్రీరాముడు ..... ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు 30 వ భాగం - సుందర కాండ : వనం జ్వాలా నరసింహా రావు

నే నెవ్వరిని? అని అడిగిన శ్రీరాముడు
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు
30 వ భాగం - సుందర కాండ
వనం జ్వాలా నరసింహా రావు
సూర్య దినపత్రిక (06-02-2017)

స్రగ్విణి:                   ఓ మహాబాహు! నీ యొద్దికం గానఁ గా
                నే మహానిష్ఠలన్ నిచ్చ వర్తింపఁ గా
                రామ! భూమిం బరీ రంభసందాతవై
                ప్రేముడిం గూరితే వీడితే న న్నిటన్ - 130

తాత్పర్యం:     దీర్ఘమైన బాహువులు కలవాడా! నేతోనే వుండాలనుకుని, నేను, నిత్యం గొప్ప నిష్టతో వుంటే, నువ్వేమో నన్ను వదిలి భూదేవిని ప్రేమతో కౌగలించుకుంటున్నావు కదా! నువ్వు ఏకపత్నీ నియమం కల          నాయకుడివి కదా. నీకి ఇలాంటి దక్షిణ నాయకత్వం తగునా?

ఛందస్సు:      స్రగ్విణికి నాలుగు "ర" గణాలు. ఏడింట యతి.

మత్తకోకిలము:                 
బాలికం గద బాల్యమందున ప్రాప్తనైతిని వల్లభా!
                శీలినిన్ సహచారిణిన్ శుభ శీల! భార్యను బత్నినిన్
                బాళి న న్గన వేల? మాటయుఁ బల్క వేటికి? నేమి కాం
                తాళ మా హృదయేశ! మత్కృత దారుణాఘమ చెప్పుమా-131

తాత్పర్యం:     ప్రాణేశ్వరా! నీవు నన్ను అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్నప్పుడు, మనిద్దరం బాల్యంలోనే వున్నాం కదా! నాటి నుంచి, నేను, నువ్వు చేసే అన్ని ధర్మ కార్యాలలో-సుఖ దుఃఖాలలో నీతోనే తిరుగుతున్నాను కదా? వల్లభా! సదాచార సంపత్తి కలదాననే కదా? నువ్వే కదా నన్ను భరించవలసిన వాడివి. నేనుంటేనే కదా నీవు యజ్ఞాలు చేయాలి? ఇలాంటి నన్ను ప్రేమతో చూడవెందుకు? ఒక్క మాటైన మాట్లాడవెందుకు? నా మీద నీకు కోపమా? హృదయేశ్వరా? లేకి నేను చేసిన ఘోర పాపమా?

ఛందస్సు:      మత్తకోకిలము వృత్తానికి "ర, స, జ, జ, భ, ర" గణాలు. పదకొండవ స్థానంలో యతి.
రాక్షసులు రావణాసురుడితో వానరులు లంకను ముట్టడించారని తెలియచేస్తారు. ఆ విషయాన్ని విన్న రావణుడు కోపానికి వచ్చి కాపలాను పటిష్టం చేశాడు. ఆ సందర్భంలో కవి "తరువోజ" వృత్తంలో ఒక పద్యం, ""తోదకము" లో మరో పద్యం రాశారు.

తరువోజ:
          అంతట రాక్షసు లసురేంద్రునిలయ మరిగి యాతనితోడ నగచరు ల్లంక
        నంతయు రోధించి నట్టివిధంబు నఖిలంబుఁ దెల్పిన నాతండు కనలి
        వింతగాఁ గా పెల్ల ద్విగుణంబుఁ జేసి వెస సౌధ మెక్కిత ద్విధమునుగాంచెఁ
        గాంతార శైలముల్ గణియింపరాని కదనలంపటు లైన కపులాక్రమింప-132

తాత్పర్యం:     ఇలా వానరులు లంకను నలువైపుల నుంచి ముట్టడించిన తరువాత, రాక్షసులు రావణుడింటికి పోయి, వానరులు ఎలా లంకను ముట్టడించారో తెలిపారు. అది విన్న రావణుడు కోపంతో, లోగడ వుంచిన కాపలాకు అదనంగా, మరింత పెంచి, తన మేడ ఎక్కి, అడవులను-కొండలను యుద్ధాసక్తులైన లెక్కలేని కపులు ఎలా ఆక్రమించారో చూశాడు.

ఛందస్సు:      ప్రాసము లేని ద్విపద తరువోజలో ఒక పాదమగును. యతులు నాలుగుంటాయి. ఇది జాతి వృత్తము. ఇంద్రగణాలు మూడు, ఒక సూర్య గణం వుంటాయి. మూడో గణం మొదటి అక్షరం యతిస్థానం. ఇలాంటివి రెండు కలిపిన, తరువోజకు ఒక పాదం అవుతుంది. ప్రతి మూడవ గణం మొదటి అక్షరం యతి స్థానం-ఇది ఒక పాదం. ప్రాసముతో ఇలా నాలుగు పాదాలు చెప్పితే "తరువోజ" అవుతుంది.

తోదకము:     ధరణిని మ్రింగఁ గ దార్కొను వీరిన్
                దురమున నేగతి ద్రుంతు నటంచు
                న్గరమును జింత నొ నర్చుచు నాత్మన్
                దిరుఁ డయి వారలఁ దేకువఁ గాంచెన్ - 133

తాత్పర్యం:     భూమినే మింగేటట్లు వచ్చి వున్న వీరిని యుద్ధంలో ఎలా చంపాల్నా? అని బాగా ఆలోచించిన రావణుడు, స్థయిర్యం తో ధైర్యంగా రాక్షసులను చూశాడు.

ఛందస్సు:     తోదకమునకు "న, జ, జ, య" గణాలు. ఎనిమింట యతి. దీనికి "తామరసము" అని కూడా పేరుంది.


రామ-రావణ ప్రధమ యుద్ధం ముగిసిన తరువాత, ఓడిపోయిన రావణుడు లంకకు పోతాడు. తన పరాభవానికి దుఃఖపడి, ఆ సమయంలో శత్రువులను ఎదిరించి పోరాడగల సమర్థుడు తమ్ముడు కుంభకర్ణుడొక్కడే అని నిశ్చయించుకుంటాడు. కుంభకర్ణుడిని నిద్ర లేపమని మంత్రులను ఆదేశించాడు. అతడిని నిద్రలేపే విధానాన్ని "స్రగ్ధర" వృత్తంలో వర్ణించారు కవి.

స్రగ్ధర:
పూరింతుర్ చంద్రతుల్యం బులు బహుళదరం బుల్ దిశల్ వ్రీలిపోవన్
ఘోరధ్వానంబు లోలిన్ గుమికొని యసురుల్ గొల్పి రవ్వార లేకా
కారంబై కుత్తుకల్ వ్ర క్కలుగ జన నిరా ఘాట బాహావిరావం
బారూఢం బయ్యె క్ష్వేళా యతరవములు పెన్ హావడిం గూర్చె లంకన్-134

తాత్పర్యం:     దిక్కులు పగిలిపోయే ట్లు చంద్రుడిలాగా తెల్లగా వుండే అనేక శంఖాలను పూరించారు. గుంపులుగా గూడి రాక్షసులందరు, భయంకరంగా, ఒకే విధంగా గొంతులు పగిలిపోయే విధంగా ధ్వనులు చేశారు. ఆగకుండా చేతులతో చప్పట్లు కొట్టారు. సింహనాదాలు చేశారు. ఈ ధ్వనులు లంకా వాసులకు ఉపద్రవం కలిగించాయి.

ఛందస్సు:      స్రగ్ధరకు "మ, ర, భ, న, య, య, య" గణాలు. ఎనిమిదింట ఎనిమిదింట యతి.
          ఒంటరిగా యుద్ధానికి పోవద్దని కుంభకర్ణుడిని హెచ్చరించాడు రావణాసురుడు. ఆ నేపధ్యంలో అతడు యుద్ధానికి సిద్ధమవుతున్న సందర్భంలో కుంభకర్ణుడిని వర్ణిస్తూ "మానిని" వృత్తంలో ఒక పద్యం రాశారు కవి.

మానిని:        కాంచన భారసహంబు నివాత మ కాండ విదార్యము వైద్యుత తే
                జోంచిత మౌ కవచంబు ధరించి మ హాత్ముఁ డు వీరుఁ డు సాంధ్యకభృ
                త్సంచయ సవృత పర్వత రాజము చందమునన్ రహిమించె మరిన్
                జందన సూనవిభూషణ భూషిత సర్వతనుం డయి శూలియునై-135

తాత్పర్యం:     బంగారంతో చేయబడిన, మిక్కిలి బరువైన, బరువును సహించగలిగిన, గాలిదూర సందులేనిదైన, బాణాలతో చీల్చరానిదైన, మెరుపుతీగలాంటి కాంతిగలదైన వస్తువులాగా, పెద్ద దేహం కలవాడు, వీరుడైన కుంభకర్ణుడు సంధ్యా కాల మేఘ సమూహాలతో కట్టబడిన పెద్ద పర్వతం లాగా ప్రకాశించాడు. గంధం పూలు, సొమ్ములు దేహమంతా అలంకరించబడినవాడై శూలం ధరించాడు.
ఛందస్సు:      మానినికి ఏడూ "భ" గణాలు, ఒక గురువు. పదమూడో ఇంట యతి.

రామ రావణ యుద్ధం ముగిసి, రావణ వధ జరిగిన తదుపరి, అశోక వనంలో వున్న సీతాదేవిని తీసుకురమ్మని విభీషణుడికి చెప్తాడు శ్రీరాముడు. అలానే చేసిన విభీషణుడు ఆమె రాకను శ్రీరాముడికి తెలియ చేస్తాడు. తనను సమీపిస్తున్న సీతాదేవితో, తన విజయం గురించి చెప్పాడు శ్రీరాముడు. సీతను లోకులు సందేహించడానికి అవకాశం వున్నందున తానా మెను స్వీకరించనంటాడు. సీతాదేవి అగ్నిప్రవేశం చేస్తుంది. దేవతలు ప్రత్యక్షమై సీతాదేవి నిర్దోషురాలని శ్రీరాముడితో అంటారు. అలా వచ్చిన దేవతలతో, "దేవతలారా! నన్ను నేను మనుష్యుడనని, రాముడంటే దశరథ కుమారుడని మాత్రమే అనుకుంటున్నాను. నే నెవ్వరిని? ఎవ్వరివాడను? ఏల పుట్టాను?" అని తెలుపమంటాడు. అలా అడిగిన రామచంద్రమూర్తిని చూసి బ్రహ్మ వేత్తలలో మొట్టమొదటివాడైన బ్రహ్మదేవుడు "రామా! సత్య విక్రమా! యథార్థం చెప్తా వినుము" అంటాడు. శ్రీరాముడిని నుతిస్తూ బ్రహ్మ చెప్పిన యథార్థం వాసు దాస కవి ఒక "దండకం" గా రాశారు.

దండకం:       శ్రీరామరామా! మహాభావ! నారాయణా! దేవ! లక్ష్మీసనాథా! యనాథాధినాథా! విభూ! శంఖచక్రాయుధా! నీవ మున్నొంటి శృంగంబు భూదారమై భూమి కాధారమైనిల్చు పెన్వేల్పవుం, జన్న రానున్న యాసూడులం గీడులంగూర్చి వేదించి సాధించి బాధించు బల్ప్రోడవున్, నీవ బ్రహ్మంబు, సత్యంబు నీ, వక్షరంబెల్లకాద్యుండు మధ్యాంతసంస్థుండును న్నీవ లోకాళికిన్ సిద్ధ ధర్మంబు కర్మంబు మర్మంబునున్ నీవ, నీవే చతుర్బాహువున్ స్వామియున్ శార్జి‍విన్ శంఖివిన్ ఖడ్గివిం గృష్ణుఁ డున్ విష్ణుఁ డున్ బుద్ధియున్ సిద్ధియున్ సత్త్వముం దత్త్వమున్ శాంతియుం దాంతియుం బూరుషాఖ్యుండవుం బూరుషోత్కృష్టరూపంబున న్నీవ, నేవే హృషీకేశ విఖ్యాతమూర్తీ! యజయ్యుండవున్ సర్వసేనానివిన్ గ్రామణీరత్మమున్ స్రష్టవుం ద్రష్టవున్ నీవ, నీ యంద డిందున్ సమస్తం బుపేంద్రా! హరీ! మధ్వరీ! యింద్రకర్మా! మహేంద్రా! నరేంద్రా! మునీంద్రాదివంద్యా! పరా! పద్మనాభా! విరోధ్యంతకారీ! శరణ్యుండవున్ నీవ, నిన్నే సుమీ సర్వ రక్షైక సామర్థ్యదక్షుండవున్ లోకచక్షుండవుం చెల్ల దివ్యర్షు లుత్కర్ష భావించి సేవించి స్తోత్రంబుఁ గావింత్రు శాఖాసహ స్రాత్మకామ్నాయరూపా! మహర్షి ప్రవేకా! యనేకోరు జిహ్వా! జగత్పాళి కీ  వాద్యుఁ డౌ కర్తవున్ ధర్తవున్ హర్తవున్ నీవ, నీవే స్వయంభర్తవున్, సిద్ధసాధ్యాశ్రయుం డీవ, నీవే సుమీ సృష్టికిన్ముందు భాసిల్లు రూపంబు, యజ్ఞంబును న్నీవ, నీవే వషట్కార మోకారమున్నీవ, నీవే సముత్కృష్టయోగైకగమ్యుండవున్, భక్తరమ్యుండవున్ నీవ, నీ పుట్టువుం బుట్టునున్ గిట్టుటన్ వెండి నీవిట్టివాఁ డంచు నెవ్వాఁ డెఱుంగన్, రమాధీశ! గోజాతభూనిర్జరాక్రాంతభూతావళీ శైలదిగ్జాలకాంతారదేశంబులన్ నిండి రాణింతు వో దేవదేవేశ! నీవే కదా వేయిపాదంబులన్ వేయి శీర్షంబులన్ వేయినేత్రంబులం బూని భూతంబులన్ గోత్రసంఘాతసంస్ఫీతమౌ భూత ధాత్రిన్ వహింపన్ సహింపంగ దక్షుండ, వీ క్షోణి కల్పాంతవేళన్ మహామహీంద్రతల్పుండవై దేవ! గంధర్వ దైతేయ సంఘంబులం దాల్చి ప్రత్యక్షమై యందు, వోరామ! నీ చిత్తమే నేను, నీ జిహ్వయే వాణి, రోమాళి దేవాళి, యోగీశహృద్ధామ! శ్రీ ధామ కన్ రెప్పలన్ మూయగా రేయి, విప్పం బగల్, నీదు విశ్శ్వాసముల్ వేదముల్ రామ! నీకాని దావంతయున్ లేదు, సర్వలోకంబు నీకున్ శరీరంబు స్థైర్యంబు భూగోళ, మగ్నుల్ ప్రకోపంబు, శ్రీవత్సచిహ్నా! ప్రసాదంబు సోముండు, నీవేకదా మున్ను వైరోచనిం జేరి దానంబునం గోరి పాదత్రయీన్యాసరూపంబునన్ సర్వలోకంబులున్ నిండి దండించి తా దైత్యు, దైత్యారికిం బట్టముం గట్టి రక్షించితో దివ్యమూర్తీ! లసత్కీర్తి! శ్రీలక్ష్మియే సీత, విష్ణుండవే నీవు, కృష్ణుండునున్ నీవ, నీవే ప్రజానాథవాచ్యుండ వా పంక్తికంఠున్ వధింపంగ నై మానుషీదేహమున జొచ్చి రక్షోధిపుం ద్రుంచి మా కార్యముం దీర్చి లోకంబులం దేర్చి తీ వింక హృష్టుండవై ధాత్రిఁ బాలించి యాపై దివిం జేరుమా, యో రమానాథ! నీ వీర్యసారం బమోఘంబు, నీ ఘోరశౌర్యం బమోఘంబు నీ దర్శనమే నమోఘంబు, నీ స్తోత్రమున్ మోఘ మే వేళ నీవారికింగాదు, నిన్ భక్తిచేఁ గొల్చి చిత్తంబునం దాల్చు నీభక్తులౌ వారి కే లోపముల్ లేవు, నిన్నుం బురాణున్ సదాపూరుషోత్తంసు నిశ్చంచలం బైన సద్భక్తి సేవించు భక్తుల్ జగద్రక్షకా! యైహికాత్యంత సౌఖ్యంబు లెల్లప్పుడుం గందు రీశా నమస్తే నమస్తే నమః.


తాత్పర్యం: శ్రీరాముడిని సేవించు భక్తులు ఇహపర సౌక్యములనెల్ల పొందుదురని చెప్పబడెను. ఈ స్తోత్రమును ప్రతిదినం పఠించి రేని జన్మాంతర ప్రాప్తిని కాని, కామక్రోధాదుల వలన కాని, బాహ్య శత్రువుల వలన కాని, తిరస్కారం వుండదని చెప్పబడెను. ఇది పాపహరం. పురాణం. ఇతిహాసం. వేద సంబంధమైనది. అందుకే దీనిలో ఇలాంటి మహాత్మ్యం వుంది.

Saturday, February 4, 2017

Telugu Ramalinga Raju pioneered 108 : Vanam Jwala Narasimha Rao

Telugu Ramalinga Raju pioneered 108
Vanam Jwala Narasimha Rao
(Former Consultant 108 Emergency Services)

The news and views that appeared in a section of traditional print media as well as social media that the Ahmadabad based Lifeline foundation founder, Dr Subroto Das, is the pioneer and benefactor of the 108 (Emergency Response) Services in the country and hence he was honored with Padmasree award is not true! The services being rendered by Dr Das’ Lifeline Foundation may be of great significance and may be doing wonderful service. However, it is seriously objectionable to say that, it was because of efforts of his Lifeline Foundation the Gujarat Government passed the Emergency Medical Services Act-2007 and in the process 108 services were introduced in Gujarat and were expanded to 26 states through his initiative and contacts. To put the records straight and to bring facts for the benefit of the present and future generations, the pioneer and brain behind 108 Emergency Response Services is a Telugu man!

The then Gujarat CM and present PM Narendra Modi heard about the successful running of the 108 services in AP since August 15, 2005 and deputed Joint Secretary (Medical and health) in Gujarat government Ms Mona Khandar to Hyderabad to study the services. She visited 108 Services head quarters EMRI (Emergency management and Research Institute) during May 2007. Later, a team of EMRI officials that included me visited Ahmadabad and met its Chief Secretary and the Health Minister. It was followed by a series of correspondence. All the correspondence done between the EMRI and Gujarat was with my signature. Later a MoU between Gujarat Government and EMRI was signed and on Aug 29, 2007, CM Narendra Modi himself launched the 108 services in the State. Against this backdrop the Gujarat government came out with Gujarat Emergency Medical services Act 2007. Dr Subroto Das had nothing to do with this! When 108 services launched in Ahmedabad, along with the then CM Narendra Modi, former President of India Dr APJ Abdul Kalam, EMRI Chairman B Ramalinga Raju, EMRI CEO Venkat Changavalli were present on the dais. Ramalinga Raju was also present at the special dinner hosted by Modiji.


Many may not be aware these days the kind of relationship Ramalinga Raju had with the 108 services, described as the “Angel of Mercy” by the National Rural Health Mission way back in 2008. Need concept and evolution as well as the expansion of 108 services are not only interesting but precious material for those pursuing research.

When Satyam Computers, founded by Ramalinga Raju attained reputation nationally and internationally and earned him crores of rupees as profits, the philanthropic urge in Ramalinga Raju came to the fore. In the backdrop of this, on June 27, 2001 when Ramalinga Raju lost his father Byrraju Satyanarayana Raju, he along with his brothers established Byrraju Foundation on August 15, 2001. It started providing rural transformation services in 5 districts of AP that included extensive healthcare services that included three ambulances also. Subsequently these services were extended to 200 villages, directly or indirectly covering a population of a million. 25 different services were being provided in each village in areas such as healthcare, education, literacy, livelihood development, environment, Sanitation, drinking water, agriculture, sports, village BPOs known as Gram IT and emergency services. On July 16, 2003 Emergency Care Service called “Sahaya” backed by a call number +91 98494 54321 was started on an experimental basis. This covered 19 villages in Undi Mandal of West Godavari district which proved to an unmitigated service. This led to the formation of 108 services later.

Prominent among the first to help Ramalinga Raju were Dr Balaji, Dr AP Ranga Rao, Varanasi Sudhakar, Srikanth, Krishna Koneru, Srinivasa Rambabu and Polimallu Siva. These members and several others worked together to plan and execute the 108 services successfully. CEO of the EMRI for over five years, Venkat Changavalli was responsible for expanding the services to other States. It was worked out, that, by spending a meager Rs 10 on each citizen per year, the 108 Ambulance services can be made available all over the country.

Emergency Management and Research Institute (EMRI) was registered as a non-profit Society. It was modeled along the lines of 911 services offered in the USA. While providing the initial investment and infrastructural facilities, Raju signed a MoU with the then State Government on April 2, 2005. By July 14, 2005 infrastructure related to the Information technology was put in place. Due to the personal rapport Ramalinga Raju had with the then Union Telecom Secretary also happened to be a Telugu Person an IAS cadre from AP, J Sridhar Sarma, 108 number was allotted by Government of India a toll free number that can be used all over the country for ever and orders were issued accordingly. This was how the entire credit of getting 108 services goes to Ramalinga Raju. Sridhar Sarma gets the credit of making 108 toll free all over the country. Arrangements were made to launch the 108 services formally in Hyderabad.

Services were rolled out in Hyderabad and several cities and towns in the then AP. Chief Guest of the launching function in Hyderabad Grand Kakatiya Hotel was the then Union Communications Minister Dayanidhi Maran, while the Guests of Honor were the then CM Dr YS Rajasekhara Reddy, the then Finance and Health Minister (Later CM of AP and Governor of Tamil Nadu) K Rosaiah, and the then Chief Secretary Mohan Kanda. For the first time in the country the three-digit 108 number was operational.

Initially the services that were started with 75 Ambulances later expanded to 14 States with 10,500 Ambulances. In quick time EMRI was providing services in 10 different states in the country covering a population of 450 million people including Gujarat as supported by the then CM Narendra Modi. State Governments were providing most of the funding while EMRI part funded and managed the services in PPP mode. This was the time when Ramalinga Raju had to resign from the Chairman’s post following some unfortunate events in Satyam. Later GVK Group took the responsibility of running the EMRI. GVK Group made efforts to reach the services to another 35 Crore people benefitting on the whole 80 Crore people as on date. EMRI now covers a population of more than 2.5 times in the USA. It has cumulatively attended 48 million emergencies and saved 1.85 million lives so far.

After the then United AP, Gujarat was the first state to implement these services. It was followed by Madhya Pradesh, Uttarakhand, Tamil Nadu, Rajasthan, Goa, Assam, Karnataka, Meghalaya, Punjab, UP, West Bengal, Himachal Pradesh, Jammu and Kashmir. In 14 states 108 Ambulance services are provided to benefit 80 Crore people. Thanks to the efforts put in by the GVK Group, these services are available in Sri Lanka.

Facts should be stated as facts. They should not be distorted. A good work done by one should not be credited to someone else. The pioneer to launch the 108 service, which is saving lives of crores of people, in undoubtedly B Ramalinga Raju, former Satyam Computers Founder and Founder Chairman of the EMRI! This credit should have to go to him and him alone!


(Based on an interview with former founder Chairman Satyam Computers and founder Chairman EMRI 108 Ambulance Services)

Friday, February 3, 2017

"అయ్యదేవర" చలవతో అద్భుత పదకోశం : వనం జ్వాలా నరసింహారావు

"అయ్యదేవర" చలవతో అద్భుత పదకోశం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (04-02-2017)

ఐదు దశాబ్దాల క్రితం, అప్పటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యాలయం- నాటి అసెంబ్లీ స్పీకర్ ఆయ్యదేవర కాళేశ్వరరావు ఆదేశాల మేరకు (1963 లో) ప్రచురించిన 820 పేజీల శాసన, న్యాయ, పరిపాలనా సంబందమైన (తెలుగులో) పారిభాషిక పదకోశం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. బహుశా అప్పటికీ, ఇప్పటికీ, తత్సంబంధమైన మొట్టమొదటి, చిట్ట చివరి పుస్తకం ఇదే కావచ్చునేమో! ఆ తరువాత తెలుగులో అలాంటి పుస్తకాలు ప్రభుత్వ పరంగా కాని, ప్రయివేట్ పరంగా కాని, ప్రచురించిన దాఖలాలు లేవు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం రాజకీయ శాస్త్రం విభాగంలో రిజిస్ట్రార్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఎనబై ఏళ్ల ఆచార్య మారంరాజు సత్యనారాయణరావుకు ఈ పుస్తకం కాపీ ఒకటి, హైదరాబాద్ ఆబిడ్స్ సెకండ్ హాండ్ బుక్ స్టాల్ లో దొరికింది ఓ మూడేళ్ల క్రితం. అప్పటినుంచి ఆయన దాన్ని జాగ్రత్తగా భద్రపరిచి, ఎవరైనా పునర్ముద్రణ చేయిస్తారేమోనని చాలా మంది దగ్గర ప్రస్తావించినా ఫలితం లేకపోయింది. ఆయన దగ్గర ఆ పుస్తకాన్ని తెచ్చుకుని చూసి, కొంత చదివిన తరువాత పుస్తకానికి సంబంధించిన అంశాలను పదిమందితో పంచుకోవాలనిపించింది.

పుస్తక ప్రచురణ పూర్వ రంగంలో చాలా కృషి జరిగింది. శాసన, న్యాయ, పరిపాలనా సంబంధమైన పారిభాషిక పదాలకు తెలుగులో "సమానార్థకాలు" రూపొందించేందుకు తొలుత తెలుగు పారిభాషిక పదకోశ సంఘం ఏర్పాటైంది. మొదట, 24 మంది సభ్యులుగా, 6 మంది సహ సభ్యులుగా, ఈ సంఘాన్ని, శాసనసభ అధ్యక్షుడిగా వున్న స్వర్గీయ ఆయ్యదేవర కాళేశ్వరరావు అక్టోబర్ 30, 1957 న నియమించారు.  దానికి అధ్యక్షుడుగా శాసన సభ స్పీకర్ గా వున్న కాళేశ్వరరావు వ్యవహరించారు. సంఘానికి నిర్దేశించిన అంశాలలో ప్రధానమైంది శాసనసభ ఆధ్వర్యం కింద ప్రచురించేందుకు తెలుగులో పదకోశం తయారు చేయడమే కాగా, మరోటి సాధారణంగా సమావేశాలు హైదరాబాద్ లోనే జరగాలనేది. శాసనసభ కార్యదర్శిగా పనిచేస్తున్న జీవీ చౌదరిని సంఘానికి కార్యదర్శిగా నియమించారు.

సంఘంలో సభ్యులుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, చాలామంది ప్రముఖులుండడం విశేషం. వారిలో....డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి (నాటి ఆర్థిక మంత్రే కాకుండా సాహిత్య అకాడమీ అధ్యక్షుడు కూడా), జెవి నరసింగరావు (మంత్రి), డి సంజీవయ్య (మంత్రి), ఎమ్మెల్యేలు పీవీ నరసింహారావు (తరువాతి కాలంలో ప్రధాన మంత్రి), రావి నారాయణరెడ్డి, సాహిత్య అకాడమీ కార్యదర్శి దేవులపల్లి రామానుజరావు, పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు, బోయి బీమన్న (అప్పట్లో ప్రభుత్వ అనువాదకుడు), డాక్టర్ గిడుగు సీతాపతి, మామిడిపూడి వెంకటరంగయ్య, దేవులపల్లి కృష్ణశాస్త్రి, కాళోజీ నారాయణరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ, ఖండవల్లి లక్ష్మీ రంజనం, మాడపాటి హనుమంతరావులు వున్నారు. ఒక ఏడాది తరువాత, నిర్దేశించిన కార్యక్రమం పురోగతిలో వుండగానే, పని మరింత వేగవంతంగా కొనసాగేందుకు, మొదట నియమించిన కమిటీని రద్దు చేసి 14 మంది సభ్యులుతో కొత్త సంఘాన్ని డిసెంబర్ 12, 1958 న ఏర్పాటు చేశారు సభాపతి కాళేశ్వరరావు. మొదటి కమిటీ సభ్యుల్లో కొందరు, కొత్తవారు కొందరు అందులో వున్నారు. భీమన్న, రావి, దేవులపల్లి, కాళోజీ, పీవీ లాంటి వారు ఈ కమిటీలోనూ కొనసాగారు. మొదట ఏర్పాటు చేసిన సంఘంలోని సభ్యుడు బెజవాడ గోపాలరెడ్డి రాజీనామా చేయడం వల్ల ఆయన స్థానంలో వేమరాజు భానుమూర్తిని నియమించారు స్పీకర్.

పుస్తకానికి తొలిపలుకు నాటి శాసనసభ కార్యదర్శి జీవీ చౌదరి రాయగా, తెలుగు పారిభాషిక పదకోశ సంఘం నివేదిక పేరుతో మలిపలుకు సభాపతి అయ్యదేవర రాశారు. ఆలోచన నుంచి కార్యాచరణవరకు, చివరకు పుస్తకంగా వెలువడేందుకు దోహదపడ్ద అనేక అంశాలను ఆయన అందులో ప్రస్తావించారు. "ఏ" నుంచి "జడ్" వరకున్న దాదాపు 26, 000 ఆంగ్ల పదాలకు హిందీ సమానార్థకాలతో పార్లమెంటరీ సంఘం పదకోశం తయారు చేసిందనీ, దీనిని లోక సభ సచివాలయం ప్రచురించిందనీ, ఆ ఆంగ్లపదాలే తెలుగులో ప్రచురించిన పదకోశానికి ప్రామాణికమని, ప్రాతిపదిక అనీ కాళేశ్వరరావు పేర్కొన్నారు.

మొదట ఏర్పాటు చేసిన సంఘం డిసెంబర్ 2, 1957 న పని ప్రారంభించి, మొత్తం 18 సమావేశాలు జరిపింది. కడపటి సమావేశం జులై 25, 1958 న జరిగింది. ఆంగ్ల పదాలతో సమగ్రమైన ఒక జాబితాను రూపొందించి, వాటికి సరైన తెలుగు పదాలను తయారు చేసేందుకు, సంఘం తన మొదటి సమావేశంలో ఆరుగురు సభ్యులుతో ఒక ఉపసంఘాన్ని నియమించింది. పద్మభూషణ మాడపాటి హనుమంతరావు అధ్యక్షుడుగా, భోయి భీమన్నసమావేశకర్తగా ఏర్పాటైన ఉపసంఘంలో హేమాహేమీలైన ఖండవల్లి లక్ష్మీరంజనం, దేవులపల్లి రామానుజరావు, కాళోజీ నారయాణరావు, పీవీ నరసింహారావు సభ్యులు. డిసెంబర్ 16, 1957 నుంచి డిసెంబర్ 28, 1957 వరకు ఉపసంఘం ఆరు సమావేశాలు జరిపి తెలుగు సమానార్థకాలతో వంద ఆంగ్ల పదాల పట్టికను రూపొందించింది. లోక్ సభ సచివాలయం ప్రచురించిన పదకోశంలోని కొన్ని పదాలకు కూడ ఈ ఉపసంఘం తెలుగు సమానార్థకాలను రూపొందించింది. జనవరి 4, 1958 న జరిగిన సమావేశంలో పదకోశాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి అవలంభించవలసిన పద్ధతులను గురించి చర్చ జరిగిన అనంతరం, ఉపసంఘం రద్దు చేయడం జరిగింది. దాని స్థానంలో నాలుగు వేరే ఉపసంఘాలు ఏర్పాటయ్యాయి. వీటిలో రెండు హైదరాబాద్ లోను, మరో రెండు విజయవాడలోను ఏర్పాటయ్యాయి. అదనంగా కొద్ది రోజుల తరువాత ఒక సంపాదకీయ ఉపసంఘం కూడా ఏర్పాటైంది. ఒక ఉపసంఘానికి విశ్వనాథ సత్యనారాయణ, రెండో దానికి జీవీ సీతాపతి, మూడో దానికి-సంపాదకీయ ఉపసంఘానికి మాడపాటి హనుమంతరావు, నాలుగో దానికి ఖండవల్లి లక్ష్మీ రంజనం అధ్యక్షులుగా నియామకం జరిగింది.

విజయవాడ ఉపసంఘాలు రెండు కలిసి 60 సమావేశాలు, హైదరాబాద్ ఉపసంఘాలు 62 సమావేశాలు నిర్వహించింది. ఆంగ్ల వర్ణమాల లోని "ఏ" కింద వున్న అన్ని పదాలకు, "సీ" కింద వున్న 603 పదాలకు హైదరాబాద్ ఒకటవ ఉపసంఘం తెలుగు సమానార్థకాలను రూపొందించగా, రెండవ ఉపసంఘం "బీ", "డీ" ల కింద గల పదాలన్నింటికీ సమానార్థకాలను రూపొందించింది. ఇక విజయవాడ మొదటి ఉపసంఘం "సీ" కింద గల చాలా పదాలకు, రెండవ ఉపసంఘం "సీ" కింద గల 700 పదాలకు సమానార్థకాలను రూపొందించింది. సంపాదకీయ సంఘం 19 సమావేశాలు జరిపి "ఏ" నుంచి "డీ" వరకు గల ఆంగ్ల పదాలకు మూడు ఉపసంఘాలు రూపొందించిన సమానార్థకాలను సంకలనం చేసి తుది రూపమిచ్చింది. "ఏ" నుంచి "డీ" వరకు ఒక సంపుటిగా ప్రచురించాలని మొదట అనుకున్నప్పటికీ, పునఃపరిశీలన తరువాత, "ఇ" నుంచి "జడ్" వరకు గల పదాలకు కూడా సమానార్థకాలను రూపొందించిన తరువాతే అంతా కలిపి ఒకే సంపుటిగా వేయాలని నిర్ణయం తీసుకున్నారు స్పీకర్. అందుకొరకే మొదట నియమించిన కమిటీని రద్దు చేసి 14 మంది సభ్యులుతో కొత్త సంఘాన్ని డిసెంబర్ 12, 1958 న ఏర్పాటు చేశారు సభాపతి.


రెండవ సారి ఏర్పాటైన తెలుగు పారిభాషిక పదకోశ సంఘం ఫిబ్రవరి 9, 1959 న పని ప్రారంభించి, జూన్ 4, 1960 వరకు మొత్తం 14 సార్లు సమావేశమైంది. తొలి సమావేశంలో హైదరాబాద్ లో రెండు, విజయవాడలో ఒకటి, మొత్తం మూడు ఉపసంఘాలను ఏర్పాటు చేసింది. అలాగే నవంబర్ 28, 1959 న జరిగిన తొమ్మిదో సమావేశంలో మరొక ఉపసంఘం ఏర్పాటు చేసింది. ఖండవల్లి లక్ష్మీ రంజనం అధ్యక్షుడుగా వున్న హైదరాబాద్ ఉపసంఘం 94 సమావేశాలు జరిపి. "ఇ, ఎఫ్, ఆర్, ఎస్" కింద గల పదాలకు, అలానే సాధారణ పరిపాలన శాఖ సూచించిన అనుబంధ జాబితాలోని "ఏ" నుంచి "ఓ" వరకు గల పదాలకు తెలుగు సమానార్థకాలను రూపొందించింది. కాళోజీ నారాయణరావు అధ్యక్షతన ఏర్పాటైన హైదరాబాద్ ఉపసంఘం 85 సమావేశాలు జరిపి "జీ, హెచ్, ఐ, పీ" కింద గల పదాలకు, జీఏడి సూచించిన అనుబంధ జాబితాలోని "పీ" నుంచి "జడ్" వరకు గల అన్ని పదాలకు సమానార్థకాలను తయారుచేసింది. డీ శివరావు అధ్యక్షతన గల విజయవాడ ఉపసంఘం 133 సమావేశాలు జరిపి "జె, కె, ఎల్, ఎమ్, ఎన్, ఓ, క్యు, టి, యు, వీ, డబ్ల్యు, ఎక్స్, వై, జడ్" ల కింద గల ఆంగ్ల పదాలకు సమానార్థకాలను రూపొందించింది.

బోయి భీమన్న అధ్యక్షతన ఏర్పాటైన ప్రత్యేక ఉపసంఘం 107 సమావేశాలు జరిపి, మిగతా ఉపసంఘాలు రూపొందించిన, రెండు ప్రధాన సంఘాలు పరిశీలించిన అన్ని తెలుగు సమానార్థకాలను సంకలనం చేసి, వాటికి తుది రూపమిచ్చింది. పదాలన్నింటినీ క్షుణ్ణంగా చదివి, ముద్రణకు వీలుగా చేసి, రాత తప్పులను సవరించి, వచ్చిన పదమే తిరిగి రాకుండా చేసి, అవసరమైన చోట్ల ఆయా పదాలను సవరించి, చివరలో ఈ ఉపసంఘం కీలకమైన పని చేసింది. పదకోశ ముద్రణా కార్యక్రమాన్ని పర్యవేక్షించే బాధ్యత, పదకోశం తొలి కూర్పును తగిన రూపంలో వెలువరించే బాధ్యత కూడా ఈ ఉపసంఘమే తీసుకుంది. ఈ ఉపసంఘంలోని ఇతర సభ్యులలో కాళోజీ, పీవీ, దేవులపల్లి రామానుజరావులు కూడా వున్నారు. జులై 20, 1960 కల్లా అప్పగించిన పనిని పూర్తి చేసిందీ ఉపసంఘం.

ప్రధాన పదకోశ సంఘాలు, ఉపసంఘాలు, తమ కృషిలో భాగంగా అనేకానేక నిఘంటువులు, చారిత్రక, న్యాయ శాస్త్ర గ్రంథాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు, ఇతర రకమైన అనేక ప్రచురణల లోని పలు అంశాలను సందర్భానుసారంగా ఉపయోగించుకున్నారు. వాటిలో కొన్ని పేర్కొనాలంటే: ఆంధ్ర వాచస్పత్యము, సివిల్ ప్రొసీజర్ కోడ్, వార్డన్స్ లా లెక్సికన్, శబ్దార్థ చంద్రిక, కౌటిల్య అర్థశాస్త్రం, డిక్షనరీ ఆఫ్ లీగల్ టర్మ్స్, సంస్కృత-ఇంగ్లీష్ డిక్షనరీ, దస్తావేజోంకె నమూనే వున్నాయి. సంఘం సాధారణంగా తెలుగులో వాడుకలో వున్న పదాలనే సమానార్థకాలుగా నిర్ణయించడానికి ప్రయత్నించిందని, కొన్ని ఆంగ్ల పదాలను అలానే వుంచడం జరిగిందని, కొన్ని సందర్భాలలో దేశీయ ప్రత్యామ్నాయ పదాలు ఇవ్వబడ్డాయని, అయ్యదేవర కాళేశ్వరరావు తన మలిపలుకు లో రాశారు.

ఫిబ్రవరి 9, 1961 న స్పీకర్ ఆదేశాల మేరకు ఈ తెలుగు పదకోశం 5000 కాపీలు ముద్రించడానికి అంగీకరించి, రు.35, 200 మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో 2000 కాపీలు శాసన మండలి సచివాలయానికి, 3000 కాపీలు సాధారణ పరిపాలన శాఖకు పంపకం చేయాలని స్పీకర్ ఆదేశాలిచ్చారు. పుస్తకం ధర కేవలం 12 రూపాయలే! ఆయన ఆదేశాల మేరకే పుస్తకం ముద్రణ జరిగింది. ఇప్పుడేమైనా కాపీలు మిగిలున్నాయో? లేదో?


అయ్యదేవర కాళేశ్వరరావు స్వాతంత్ర్య సమర యోధుడు. 1926, 1937, 1946, 1955 సంవత్సరాలలో జరిగిన శాసనసభ ఎన్నికలలో విజయవాడకు ప్రాతినిధ్యం వహించాడు. విజయవాడ పురపాలక సంఘ అధ్యక్షుడిగానూ, మద్రాసు శాసనసభకు చీఫ్ విప్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు. 1939లో మద్రాసు శాసనసభకు విజయవాడ- బందరులకు ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్నికై, మద్రాస్ ప్రధానమంత్రి రాజగోపాలాచారికి కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. 1955లో విజయవాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొలి శాసనసభకు స్పీకర్‌గా ఎన్నికయ్యాడు. 1956 నుండి 1962 వరకు రాష్ట్ర శాసనసభ స్పీకరుగా బాధ్యతలు నిర్వర్తించాడు. 1962లో శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు, కానీ ఫలితాలు వెలువడడానికి ముందురోజే తుదిశ్వాస వదిలాడు. ఆ మహనీయుడి కృషి ఫలితంగా, రూపుదిద్దుకున్న శాసన, న్యాయ, పరిపాలన పారిభాషిక పదకోశాన్ని అవసరమైన మార్పులు చేర్పులతో పునర్ముద్రిస్తే చట్ట సభల సభ్యులకు చాలా ఉపయోగంగా వుంటుంది. ఆ దిశగా గౌరవ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ స్పీకర్లు చొరవ తీసుకుంటే మంచిదేమో!