Monday, November 28, 2011

ఎవరు హంతకులు? విప్లవకారులెవరు? కమ్యూనిస్టులంటే మావోయిస్టులేనా?: వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (4-12-2011)
ఎవరు హంతకులు? విప్లవకారులెవరు?

కమ్యూనిస్టులంటే మావోయిస్టులేనా?

వనం జ్వాలా నరసింహారావు

మరో విప్లవ తార రాలిపోయింది. మల్లోజుల కోటేశ్వరరావుకు సొంత వూరు "పెద్దపల్లి” తో సహా యావత్ విప్లవ భారతావని లాల్‌ సలాం పలికింది. కిషన్‌ జీ అంతిమ యాత్ర శోక సముద్రాన్ని తలపించింది. సద్భ్రాహ్మణ వంశంలో జన్మించిన ఆయనకు విప్లవ సంప్రదాయంలో అంత్యక్రియలు జరిగాయి. పలువురు కామ్రేడ్సు‍తో సహా, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కిషన్‌జీకి నివాళి అర్పించింది. మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీని చిత్రహింసలు పెట్టి చంపివేశారా? లేక అవి కేవలం ఆరోపణలేనా? అధికారికంగా ఆయనది బూటకపు ఎన్‌కౌంటర్ కాదనేందుకు నిదర్శనంగా ఆయన పోస్టుమార్టం నివేదికలోని ముఖ్యమైన అంశాలను బహిర్గతం చేసింది ప్రభుత్వం. భద్రతా బలగాలను ఎదుర్కొనే క్రమంలో జరిగిన కాల్పుల్లోనే కిషన్‌ జీ మరణించినట్టు ఆ నివేదిక సారాంశమట.

కిషన్‌ జీ మృతిపై, ప్రజా సంఘాల ఆరోపణలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తనదైన శైలిలో దీటుగా సమాధానమిచ్చారు. ఎన్‌కౌంటర్‌ను తప్పించడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయనీ, లొంగిపోయేందుకు ఆయనకిచ్చిన అవకాశం ఉపయోగించుకోలేదని, మావోయిస్టు నేతలు తుపాకిలు దించలేదని, మూడురోజులు ఎదురుచూసినా స్పందన లేదనీ, పోలీసు బలగాలపై ఎదురు దాడికి దిగడంతో గత్యంతరం లేక ఎన్‌కౌంటర్ చేయక తప్పలేదనీ వివరణ ఇచ్చింది. పైగా బలగాల పైకి ఆ మూడు రోజుల్లో వెయ్యి రౌండ్లకు పైగా కాల్పులు జరిపారని కూడా మమత పేర్కొంది. మరో అడుగు మందుకు పోయి. కిషన్‌ జీ ఎన్‌కౌంటర్‌తో "వందలాది మంది అమాయక ఆదివాసీల ప్రాణాలు" పోకుండా రక్షించడం జరిగిందని కూడా ఆమె అన్నారు. కిషన్‌ జీ నేతృత్వంలో సమావేశమైన మావోయిస్టులు రాష్ట్రంలో భారీ ఎత్తున విధ్వంసకాండ సృష్టించేందుకు సిద్ధపడ్డారని ఆమె ఆరోపించింది. మావోయిస్టు ఉద్యమాన్ని సమూలంగా నిర్మూలించాలని చూస్తున్నవారి కలలు నెరవేరవని, విప్లవోద్యమ నాయకత్వాన్ని దేశ భవిష్యత్తు కోసం భావి తరాలు కాపాడుకోవాలని, మావోయిస్టు నాయకులు ఎన్‌కౌంటర్‌కు ప్రతిగా స్పందించారు.

ఈ నేపధ్యంలో ఒక్క సారి గతంలోకి తొంగి చూసి ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగవచ్చనే అంశాలపై దృష్టి సారిస్తే మంచిదేమో!

కిషన్‌ జీ

పశ్చిమబెంగాల్ లో మొదటి కాంగ్రెస్ వ్యతిరేక ఐక్య సంఘటన ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర మాసాలకే, ప్రజా విముక్తి యుద్ధం అనే పేరిట ఒక నినాదాన్ని పశ్చిమబెంగాల్, డార్జిలింగ్ జిల్లా నగ్జల్బరీ ప్రాంతంలోని గిరిజన రైతాంగంలో పనిచేసే కిసాన్ కార్యకర్తల (“కమ్యూనిస్టు విప్లవకారులు”) గ్రూపొకటి లేవదీసింది. వారు మావో-సే-టుంగ్ ఆలోచనా ధోరణిని అనుసరిస్తున్నామని చెప్పుకుంటూ, భారత కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీపైన, కాంగ్రెస్ వ్యతిరేక ఐక్య సంఘటన ప్రభుత్వంలో పనిచేయాలన్న దాని రాజకీయ విధానంపైన తిరుగుబాటు చేశారు. పార్టీ విప్లవానికి ద్రోహం చేసిందని వారు ఖండించారు. గ్రామీణ విముక్తి ప్రాంతాలను ఏర్పరచి, ప్రజా విముక్తి సైన్యాన్ని నిర్మించేందుకు తాము రైతాంగ గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించినట్లు వారు ప్రకటించారు. రైతాంగ విముక్తి యుద్ధాన్ని ప్రారంభించి, దాన్ని నడపడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నామని వారు స్పష్టంగా చెప్పారు. సాయుధ గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించాలనే తమ ఎత్తుగడలను సమర్ధించుకొనే రాజకీయ థీసిస్‌ ప్రతిపాదించారు. భారతదేశం అమెరికా వలస దేశంగా మారిపోయిందని, ప్రభుత్వం అమెరికా తొత్తని, పరిస్థితులు సాయుధ విప్లవానికి పరిపక్వమై వున్నాయని, భూస్వాముల పైన- ప్రజా పీడకులపైన సాయుధ దాడులు చేస్తే జనసామాన్యం ఉత్తేజం పొందుతుందని, "మావో ఆలోచనా విధానం" అనుసరించాలని చెప్పింది నాయకత్వం. విప్లవంలోకి అనేకమంది సమరశీల విద్యార్ధులను, యువకులను, పెట్టి బూర్జువా మేధావులను ఆకర్షించగలిగారు.

నక్సల్‍బరీ ఉద్యమ నేపధ్యంలో, 1967లో, సీపీఎం నుంచి చాలా మంది బయటకు పోయి ఆ సిద్ధాంతానికి ఆకర్షితులయ్యారు. రాష్ట్రస్థాయిలో పార్టీని వీడి నక్సల్ ఉద్యమంవైపు వెళ్లిన ప్రముఖులలో తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, కొల్లా వెంకయ్య, మాదాల నారాయణస్వామి, వజ్రవేలుశెట్టి ముఖ్యులు. రాష్ట్రంలో ఎక్కువగానే నక్సల్ ఉద్యమ ప్రభావం పడింది ఆ రోజుల్లో. పలువురు విద్యార్థి నాయకులు, గ్రామ-పట్టణ నాయకులు, ఆ ఉద్యమంలోకి వెళ్లకుండా వుండలేకపోయారు.

నక్సలైట్ మాతృ సంస్థ కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆదిలోనే చెప్పినట్లు, నక్సలైట్ ధోరణి అతివాద దుందుడుకు విధానంగా మారలేదా? పెట్టి బూర్జువా విప్లవ తత్వంగా పరిగణించకూడదా? నక్సలైట్లలో చిత్తశుద్ధి, విప్లవ సాధన పట్ల సదుద్దేశాలున్న వారు అనేకమంది వుండవచ్చు. అంతమాత్రాన, నక్సలైట్ ఉద్యమం అరాచకమైనదని, వ్యక్తిగత హింసావాదమని అనడంలో తప్పేమైనా వుందా? ఏమో! నక్సలైట్ల కార్యకలాపాలను నిశితంగా పరిశీలించిన ప్రతి ఒక్కరికి రైతాంగ గెరిల్లా యుద్ధమని, వ్యవసాయ విప్లవమని, ప్రజా యుద్ధమని మాట్లాడిన మాటలు ఆచరణలో పూర్తిగా కాకపోయినా కొంతైనా బూటకమని బహుశా తోచక మానదు. పలువురు సంచరించే ప్రదేశాలలో బాంబులను వేయడం, మందుపాతరలను పట్టడం, కనీసం అడపాదడపానన్నా అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమవడం, ఇతర రాజకీయ పార్టీలకు చెందిన విద్యార్ధి, యువజన, కిసాన్, ట్రేడ్ యూనియన్ కార్యకర్తలను హత్య చేయడం, పోలీస్ వారిని, సివిలియన్ ఆఫీసర్లను చంపడం, ఏదో కారణాన ఎవరినైనా చంపడానికి సిద్ధపడటం, కారణాలు ఏమైనా, చాలా సార్లు జరగడం వాస్తవమే కదా! ఎంతమంది కార్మికులను, కర్షకులను వారు ఉత్తేజపరచగలిగారు?

నక్సలైట్ల తత్వాన్ని, రాజకీయాలను, వారి ఆచరణను గుడ్డిగా సమర్థించేవారు, తీవ్రంగా వ్యతిరేకించేవారు వున్నారు. కాకపోతే, వారు అవలంబిస్తున్న హింసా మార్గానికి మద్దతు ఇచ్చేవారు అతికొద్ది మంది మాత్రమే! అయితే, ఈ ఉగ్రవాద, అతివాద, తీవ్రవాద ఆలోచనా విధానం కేవలం భారతదేశానికే పరిమితమైన వ్యవహారం కాదు. సీమాంతర ఉగ్రవాదం, అంతర్జాతీయ తీవ్రవాదం విభిన్న ధోరణులలో తలెత్తడం తెలిసిన విషయమే. అతివాద ధోరణికి ప్రజల నిరాశ, నిస్పృహలే కారణమైనప్పటికీ, ఈ ధోరణికి మధ్యతరగతికి చెందిన కొన్ని వర్గాల ప్రజల్లో సానుభూతి ఉన్నప్పటికీ, ఆ ధోరణి పొరపాటు కావచ్చనీ, అశాస్త్రీయం కూడా కావచ్చనీ, విస్మరించరాదు. విప్లవ కార్మికోద్యమానికి కూడా అంతో-ఇంతో హానికరం కూడా కావచ్చు. తీవ్రవాదుల్లో (నక్సలైట్లలో, మావోయిస్టులలో) అనేకమంది సదుద్దేశ్యాలున్న వారు, త్యాగ ధనులు, నిస్వార్ధపరులైన వ్యక్తులు వుండవచ్చు. విప్లవం పేరిట వారు సాగించే సాహస చర్యలకు మధ్యతరగతి ప్రజల్లోని కొన్ని వర్గాల హర్షామోదాలుండవచ్చు. అంతమాత్రాన వారు చేస్తున్న ప్రతి పనీ (హింస) సరైందని అనడం తగదు. వ్యక్తులుగా-దళాలుగా ఏర్పడి, హింసాత్మక సంఘటనలకు పాల్పడడం వలన జనసామాన్యాన్ని పీడన, దోపిడీ, సాంఘిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఎదురు తిరిగేందుకు ఉత్తేజ పరచడానికి బదులు, సామాన్య ప్రజల, ప్రజాతంత్ర ప్రజల ఏవగింపులకూ, తీవ్రమైన నిరసన భావానికి గురౌతున్నాఏమో అనిపిస్తోంది.

ఈ నేపధ్యంలో, భారత దేశంలో పరిస్థితులు విప్లవానికి అనుకూలంగా లేవని, గొరిల్లా పోరాటానికి భారత దేశంలో అవకాశాలు లేవని, చైనాను భారత దేశంతో పోల్చడం సరైందికాదని అరవై ఏళ్ల క్రితం, ఫిబ్రవరి 1951 లో సోవియట్ యూనియన్‌ను సందర్శించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులకు స్టాలిన్ స్పష్టం చేసిన విషయం గమనించదగ్గది. భారత (నెహ్రూ) ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా యుద్ధం జరపడం సరైన వ్యూహం కాదని కూడా స్పష్టం చేశాడు స్టాలిన్. మహోన్నత చరిత్రకు గుర్తుగా నిరంతర పోరాటం కొనసాగిస్తున్న భారత కమ్యూనిస్ట్ ఉద్యమం గురించి, పార్టీ ఆవిర్భావం-ఎదుగుదల గురించి, చీలికల గురించి, అభిప్రాయ భేదాల గురించి చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.

భారత-సోవియట్ ప్రతినిధి వర్గాల మధ్య జరిగిన చర్చల వివరాలు యధాతధంగా, రష్యన్ భాషలో వున్న డాక్యుమెంట్ల ఆధారంగా ఇంగ్లీషులో అనువదించి, గుంటూరు జిల్లాకు చెందిన ఒక ప్రముఖ వైద్యుడు (డాక్టర్ సీహెచ్ కె వి ప్రసాద్) బహిర్గతం చేశారిటీవల. అందులోని విషయాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ(లు) అనుసరిస్తూ వస్తున్న-భవిష్యత్ లో అనుసరించాల్సిన పంథాకు సంబంధించినవి కూడా. కమ్యూనిస్ట్ పార్టీ అతివాద, మితవాద వర్గాలుగా, తర్వాత నక్సలైట్లుగా, మావోఇస్టులుగా, మధ్యలో మితవాద వర్గం వారు డాంగే యులుగా, మొహిత్ సేన్ పక్షం వారిగా, చీలిపోవడానికి కారణాలు కూడా అంతర్లీనంగా ఆ డాక్యుమెంట్లలో వున్నాయి.

డాక్యుమెంటులో అనేక విధానపరమైన ప్రశ్నలు కూడా వున్నాయి. భారత దేశంలోని రాజకీయ స్థితిగతులను అంచనా వేయడం ఎలా? ఆ స్థితిగతులు విప్లవం వైపు పయనించే దిశగా వున్నాయా? అలా రాబోయే విప్లవాన్ని విశ్లేషించడం ఎలా? సాయుధ పోరాటాలు దేశమంతా సాధ్యమేనా? సాయుధ పోరాట దిశగా ప్రజలను సిద్ధపర్చడానికి బూర్జువా తరహా ప్రజాస్వామిక విప్లవాలను, సామ్యవాద తరహా విప్లవాలను కలుపుకొని పోవాలా? విప్లవంలో కార్మిక వర్గ పాత్ర ఎలా వుంటుంది? పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారికి "మరణ దండన" విధించడం తగునా? లాంటి ప్రశ్నలను సోవియట్ పార్టీకి సంధించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. భారత దేశంలోని పరిస్థితులు సోషలిస్ట్ విప్లవానికి అనుకూలంగా లేవని స్పష్టం చేశాడు స్టాలిన్.

స్టాలిన్ దృష్టిలో విప్లవమంటే, వ్యావసాయిక ప్రాధాన్యమయిందని, జమీందారీ వ్యవస్థను తొలగించి, రైతులకు భూమిని పంపిణీ చేయడం ఆ విప్లవం లక్షణమని, ఇది విప్లవంలో ప్రాధమిక దశని అంటాడు స్టాలిన్. దాన్నే ఆయన "పీపుల్స్ డెమోక్రాటిక్ రెవెల్యూషన్" అని వర్ణిస్తూ, అదే చైనాలో జరిగిందని చెప్పాడు. రెండో దశ, పారిశ్రామిక విప్లవం. భారత దేశం ఇంకా ఆ దశలకు చేరుకోలేదని ఆయన అభిప్రాయం. సామ్రాజ్యవాదమంటే ఇతర దేశాలను ఆక్రమించుకోవడమేనని, “జాతీయ బూర్జువాలకుఅది చేత కాదని, చిన్న-పెద్ద-మధ్య కారు బూర్జువాలందరు (ధనికులు) జాతీయ సంపదను-వనరులను మాత్రమే దోపిడీ చేయగలరని, వారికి వ్యతిరేకంగా మూకుమ్మడిగా పోరాటం చేయ తగదని వివరణ ఇచ్చాడు స్టాలిన్. జాతీయ బూర్జువాలలో చాలా మంది, కమ్యూనిస్ట్ ఆలోచనా విధానంతో అంగీకరించే అవకాశం వుందని, వారిని కలుపుకుని పోవడం మంచిదని అంటాడు. భూస్వాములకు, జమీందారులకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనను, వ్యవసాయ కూలీల సమ్మెను, కౌలు దార్ల హక్కుల పోరాటాన్ని, మిగులు భూముల ఆక్రమణను కమ్యూనిస్టుల ఉద్యమంలో భాగం చేయాలని చెప్పాడు. కార్మికుల హక్కుల కొరకు కూడా పోరాడాలని అంటాడు. అలా కార్మిక-కర్షక వర్గాలను సమీకరించి పోరాటాలు సలపాలిగాని, "అంతర్యుద్ధం" చేయవద్దని హెచ్చరించాడు. పోరాట ఫలితాలను కార్మిక-కర్షక వర్గాలు అనుభవించేందుకు నిరంతర పోరాటం సలపాలని సలహా ఇచ్చాడు. వ్యక్తిగత హింసను కూడా ఆయన వ్యతిరేకించాడు.

సాక్షాత్తు కమ్యూనిస్ట్ అగ్రనేత స్టాలిన్ స్థాయి నాయకుడే అలా అభిప్రాయపడ్డాడే. అలాంటప్పుడు, ఇంకెంత కాలం, ఇలా మావోయిస్టులు తమ విప్లవ పంథాను విడనాడకుండా ఇతరుల ప్రాణాలను తీస్తూ, తమ ప్రాణాలను కోల్పోతారు? దీనికి అంతం లేదా? పరిపూర్ణ నిబద్ధతతో పాటు, మనసా వాచా కర్మణా, మావోయిస్టు సిద్ధాంతాలను అనుసరించి అసువులు కోల్పోయిన వారే కాకుండా, ఆ మార్గమే సరైందని గుడ్డిగా నమ్మి ప్రాణాలను కోల్పోయిన అమాయక కామ్రేడ్సులు కూడా చాలామంది వున్నారు. ప్రపంచంలో సిద్ధాంత ధోరణులు మారుతున్నాయి. సమసమాజం ఏర్పడడానికి విప్లవ మార్గమొక్కటే ఏకైక మార్గమనే రోజులు పోతున్నాయి. ప్రధమ కమ్యూనిస్టు దేశమే మరో దిశగా పయనిస్తోంది. విప్లవమార్గం మినహా మరో దారిలో సమానత్వం సాధించలేమను కోవడం మూర్ఖత్వం కాదా? ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.

మూడు-నాలుగు దశాబ్దాల క్రితం పశ్చిమ బెంగాల్ నక్సల్‍బరీ ఆరంభమైన వామపక్ష తీవ్రవాద ఉద్యమం, ఆంధ్ర ప్రదేశ్ కు పాకింది. అల నాడు సైద్ధాంతికంగా ఉద్యమంపట్ల ఆకర్షితులైన వారు కొందరైతే, తరువాత కాలంలో మరికొందరు మరెన్నో కారణాలవల్ల ఉద్యమంలో చేరారని ఆరోపణలున్నాయి. వీరిలో ఉద్యమంలో ఇమడలేనివారు జనజీవన స్రవంతిలో కలిశారు. వారిలో కొందరు ప్రభుత్వంద్వారా లబ్ది పొందారు. మరికొందరు ప్రాణాలను కోల్పోయారు. కారణాలేవైనా ఉద్యమం అప్పుడు-ఇప్పుడూ ఒకరకంగా ప్రస్థానం సాగించడంలేదనేది వాస్తవం. ప్రజా ఉద్యమాలు, విప్లవాలు, తిరుగుబాటులు, ప్రపంచ చరిత్రలో వలస వాద-సామ్రాజ్యవాద-నిరంకుశ ప్రభుత్వాలను కూల్చివేసిన-మార్చివేసిన సందర్భాలు అనేకం వున్నాయి. ఐతే, వాటి స్థానంలో అధికారంలో కొచ్చిన ప్రభుత్వాలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలా? నిరంకుశ ప్రభుత్వాలా? అని ప్రశ్నించుకుంటే, సమాధానం ఇదమిద్ధంగా ఇదేనని రాదు. ప్రజాస్వామ్యంలో కూడా "పీపుల్స్ డెమొక్రసీ" అని, "పార్లమెంటరీ డెమొక్రసీ" అని, "ప్రెసిడెన్షియల్ డెమొక్రసీ" అని వివిధ రకాలున్నాయి. ఇంకా అనేక పేర్లతో పిలిచే ప్రజాస్వామ్యాలూ వున్నాయి. ఏదేమైనా ప్రజాస్వామ్యం అంటే "ప్రశ్నించే హక్కు" గల పరిపాలన అనడంలో తప్పులేదు. ఐతే ఆ ప్రశ్నించే హక్కును సద్వినియోగం చేసుకోవాలా? దుర్వినియోగం చేసుకోవాలా? అని ఆలోచించాలి.

విప్లవాల పేరిట, ఉద్యమాల పేరిట, తిరుగుబాటు నెపంతో, అభివృద్ధికి ఆటంకం కలిగించవచ్చా? అస్థిరత కలిగించవచ్చా? హింసలకు, ప్రతి హింసలకు వారో-వీరో పాల్పడితే నష్టపోయేది సామాన్య ప్రజలే!

Sunday, November 27, 2011

డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి “పరిచయాలు – ఆప్యాయతలు”: వనం జ్వాలా నరసింహారావు

తీపి గుర్తులు - చేదు అనుభవాలు: అధ్యాయం – 6

డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి

పరిచయాలు ఆప్యాయతలు"

వనం జ్వాలా నరసింహారావు

(మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చేసే అవకాశం కలిగింది నాకు. 36 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో ఆరవ అధ్యాయం ఇది).

అప్పటికే స్థానికంగా మంచి పేరున్న అడ్వకేట్ కేవి సుబ్బారావు, మరో అడ్వకేట్ బోడేపూడి రాధాకృష్ణలతో సంబంధాలు-స్నేహం కుదిరి బలపడ సాగింది. వారిరువురు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకు చెందిన పోలీసు కేసులను చూస్తుండేవారు. వాళ్లతో పాటు గోకినేపల్లి గ్రామానికి చెందిన కమ్యూనిస్ట్ నాయకుడు రావెళ్ల సత్యంగారితో, పార్టీ కార్యదర్శి నల్లమల గిరిప్రసాద్, చిర్రావూరి, మంచికంటి, బొంబే ప్రసాద్, రజబ్ అలీ, రాయల వీరయ్య, బోడేపూడి వెంకటేశ్వరరావు, బోజెడ్ల వెంకట నారాయణ, పర్సా సత్యనారాయణ, టీవీఆర్ చంద్రంగార్లతో కూడా పరిచయం కలిగింది. పార్టీ వ్యక్తిగా డాక్టర్ రాధాకృష్ణమూర్తిగారిని గుర్తించడం వల్ల, పరిచయాలు పెరిగాయి. తల్దారుపల్లి తమ్మినేని సుబ్బయ్య గారితో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది.

తమ్మినేని సుబ్బయ్య (తెల్దారుపల్లి) గారిని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన ఆ ప్రాంత గ్రామాలలో ఒక "పెద్ద మనిషి" గా, తెల్దారుపల్లి జాగీర్దారుకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రక పోరాటానికి నాయకత్వం వహించినవాడు గా పేరున్నది. తను వచ్చిన కొత్తలోనే, డాక్టర్‍గారికి వారితో పరిచయం కలిగింది. ఆయనకు ఎందుచేతనో డాక్టర్‍గారిపై ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. సోదరులు నలుగురికి ఉద్యోగాలు దొరకడంలో వారి సహాయం, వారు చూపించిన ఆప్యాయత, మరిచిపోలేనిదని కృతజ్ఞతాపూర్వకంగా అన్నారు డాక్టర్ వై.ఆర్.కె.

ఆ నాటికి పట్టణంలో చిర్రావూరి లక్ష్మీనరసయ్యగారు మునిసిపల్ ఛైర్మన్‍గా వున్నారు. పట్టణ పార్టీ వారి నాయకత్వంలోనే నడిచేది. ఆనాడు పట్టణ పార్టీ ప్రముఖులుగా వున్న మిగతా వారినీ గుర్తుచేసుకున్నారు డాక్టర్‍గారు. వారు: మాణిక్యాల నర్సయ్య, పిల్లుట్ల వెంకన్న, గాజెల రాఘవయ్య, వడ్డెల్లి రామయ్య, బెందారపు యాకయ్య, కమ్మాకుల జోగయ్య, ఐతరాజు వెంకన్న, అంకిత నర్సింహం, ఎర్రా వెంకన్న, పిల్లి చెన్న కృష్ణ, చిల్లంచర్ల రాములు, "ఆఫీసు" రాఘవయ్య, వెంపటి సూర్యనారాయణ, పిట్టల రామచంద్రం, కస్తూరి గోపాలం, కుక్కల నారాయణ, గుడ్ల కాశయ్య, గుడ్ల చంద్రయ్య, కూతురు వెంకన్న, మేకల నారాయణ, వంకాయలపాటి దాసయ్య తదితరులు. వీరిలో ఎవ్వరూ "హోల్ టైమర్స్" కారు. అందరూ తమ వృత్తులు చేసుకుంటూ, పూర్తిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. వారికి వ్యక్తిగతమైన స్వల్ప బలహీనతలుండవచ్చు. అది వారి సమాజం పట్టించుకోనివే. వారు "మాస్ లీడర్స్". జనాన్ని కదిలించగల శక్తిమంతులు. చిర్రావూరి మాట వారికి వేదవాక్కు.

అలాగే పాటిబండ్ల రఘుపతి రావు(జానకీపురం), రావెళ్ల జానకి రామయ్య, చుండూరి నర్సింహారావు, తమ్మారపు గోవిందు, కొండబోలు వెంకయ్య, చింతనిప్పు వీరవెంకయ్య (వేలాద్రి), తుళ్లూరి సత్యం, దొండపాటి వెంకయ్య, నల్లమోతు పిచ్చయ్య, రావి వీరయ్య, రేగళ్ల చెన్నారెడ్డి, బోడేపూడి రామకోటేశ్వరరావు, కర్నాటి కృష్ణయ్య, వెంపటి రామకోటయ్య, వాసిరెడ్డి వెంకటపతి(మధిర), బి.ఎస్. రాములు, వై. సీతారామయ్య, బండారు చంద్ర రావు, వట్టికొండ నాగేశ్వర రావు(అల్లీనగరం), తట్టికొండ లక్ష్మీకాంతయ్య, కోటయ్య గార్లు, అడపా గోపాల కృష్ణమూర్తి, మోరంపూడి రంగారావు(వేంసూరు), కమ్మకోటి రంగయ్య, దొండేటి ఆనంద రావు, మల్లెల వెంకటేశ్వర రావు, తుమ్మా శేషయ్య (వరంగల్ జిల్లా), ఐతం మంగపతి రావు (గార్ల), తొండేటి కొమరయ్య (గార్ల), కొణిదిన సీతారామయ్య (గొల్లెనపాడు), జొన్నలగడ్డ రామయ్య, పారుపల్లి పుల్లయ్య, పయ్యావుల లక్ష్మయ్య, ఎర్రంనేని వెంకట నర్సయ్య (గోకినేపల్లి), గంగాధర రావు (నేలకొండపల్లి) తదితరులను డాక్టర్ వై.ఆర్.కె గుర్తుచేసుకున్నారు.

పట్టణంలోని ప్రముఖ వ్యాపార కుటుంబాల వారు వై.ఆర్.కెను ఫామిలీ డాక్టర్‍గా చూసుకునేవారు. ఫీజులకు మించిన ఆప్యాయత, గౌరవం, అభిమానం లభించేది. అలాంటి కొన్ని కుటుంబాలను గుర్తుచేసుకున్నారు. అర్వపల్లి వారి నలుగురు సోదరుల(పెద్ద వ్యాపార) కుటుంబాలు, శిరం కృష్ణమూర్తి, పెనుగొండ భాస్కరరావు, సుందర్ టాకీస్ మద్ది పిచ్చయ్య, వీరభద్రం సోదరులు, వెంపటి కోటేశ్వరరావు, పిల్లి చెన్న కృష్ణ, చిల్లంచర్ల రాములు, సర్వదేవభట్ల రాజయ్య, సుగ్గల అక్షయ లింగం వారి సోదరుల కుటుంబాలు, గెల్లా లక్ష్మీనారాయణ సోదరులు, నోముల రాజయ్య గార్ల కుటుంబాల ఆప్యాయతలను గుర్తుచేసుకున్నారు. వ్యాపార కుటుంబాలు గాని, గ్రామాల నుండి వచ్చే రైతాంగ కుటుంబాలు గాని, పార్టీల వారి కుటుంబాలు గాని, వారి-వారి స్త్రీలు, పిల్లలను తీసుకుని వచ్చినప్పుడు తమ పుట్టింటికి వచ్చినంత చనువుగా - సంతోషంగా తన ఆసుపత్రికి వచ్చేవారని, ఇప్పటికీ తనకిదే గొప్ప తృప్తి అనీ చెబుతారు డాక్టర్‍గారు.

ఈ నేపధ్యంలో విజయవంతంగా ఆయన ప్రాక్టీస్ కొనసాగిస్తున్న రోజుల్లో, కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోవడంతో సీపీఐ-సీపీఎం మధ్య చోటుచేసుకున్న రాజకీయ పోరు ప్రభావం డాక్టర్ గారిపై కొంత పడింది. వారి నాయకుల మధ్య జరుగుతున్న పోరుతో సంబంధం లేని అమాయక ప్రజలను ఇబ్బందులకు గురి చేసే దిశగా అప్పటి సీపీఐ నాయకత్వం అడుగు వేసింది. రజబలీ చెప్పు చేతల్లో వున్న చుట్టు పక్కల గ్రామాల కమ్యూనిస్ట్ సానుభూతి పరులను, వైద్యం నిమిత్తం రాధాకృష్ణమూర్తిగారి దగ్గరకు పోకుండా కట్టడి చేసింది. నష్టపోయింది అమాయక రోగులే కాని, నాయకులు కాదని గ్రహించడానికి చాలా కాలం పట్టింది. ఆ తర్వాత కొంతకాలానికి, సీపీఐ కి చెందిన కొందరు స్థానిక నాయకులు, తామలా చేసినందుకు, డాక్టర్‍గారిని బాయ్‍కాట్ చేయమని సలహా ఇచ్చినందుకు పశ్చాత్తాప పడుతున్నామని ఆయనతో అన్నారు. ఆ పేర్లు వెల్లడించడం వారికి ఇబ్బందికరం కావచ్చునన్నారు.

క్రమేపీ వ్యాపారులు, పార్టీకి చెందినవారే కాకుండా, కాంగ్రెస్ పార్టీ ప్రముఖుల పరిచయాలు - స్నేహాలు లభించాయి డాక్టర్‍గారికి. పెరవల్లి వెంకట రమణయ్య(ఈయన తొలుత కమ్యూనిస్టే. తరువాత కాంగ్రెస్ లో చేరారు), కొమరిగిరి నారాయణరావు, గెల్లా కేశవరావు, కోనా పట్టాభి రామయ్య, హీరాలాల్ మోరియా, కోట పున్నయ్య, గురుమూర్తి, కత్తుల శాంతయ్య, రావెళ్ళ శంకరయ్య, మానికొండ బుచ్చయ్య(బాలపేట), చౌదరిగార్లతో స్నేహం కుదిరింది. వీరంతా కాంగ్రెస్ నాయకులు - లేదా - గాంధేయ వాదులు ఐనప్పటికీ, వ్యక్తిగతంగా తనను తమ వాడిగానే చూసుకునేవారని డాక్టర్ వై.ఆర్.కె అన్నారు.

"నా సహచరులూ, నా కింద పనిచేసేవారూ, నా ప్రవర్తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకున్న తరువాత నేను దిగ్భ్రాంతి చెందాను. నేను అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకునేవాడిని’ అనుకుంటూ వుండేవాడిని. కాని, నా కింద పనిచేసేవారు, ’నేను ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాలతో వ్యవహరిస్తానని’ అనుకునేవారు. నేను అందరినీ స్వేచ్ఛగా మాట్లాడనిస్తానని అనుకునేవాడిని. కాని, నా బాడీ లాంగ్వేజ్ ద్వారా మాట్లాడేవారిని అడ్డుకుంటానని నా సహచరులు అనుకునేవారు. ఇలా నేను నా బలాలుగా ఏ ఏ అంశాలుగా భావించానో, అవన్నీ నా బలహీనతలుగా తరువాత బయట పడ్డాయి" - ఆర్. గోపాలకృష్ణన్ "టాటా రిఫ్లెక్షన్స్" - ఏ మేనేజర్ గివ్స్ హిజ్ ఎక్స్ పీరియెన్సెస్: బుక్ - "వెన్ ద పెన్నీ డ్రాప్స్" లో…..

Saturday, November 26, 2011

STATES REORGANIZATION HAS NO RELEVANCE NOW: VANAM JWALA NARASIMHA RAO

NOT RELEVANT NOW

(The Hans India: 30-11-2011)

VANAM JWALA NARASIMHA RAO

The proposal to constitute Second States Re-organization Commission (SRC) is irrelevant, ridicules and absurd. It is a political blunder. It cannot resolve the separate Telangana problem. While the Seemandhra Congress leaders welcomed it, almost all the Telangana supporters opposed tooth and nail. Meanwhile Uttar Pradesh CM Mayavathi conveyed to Center the UP Cabinet Resolution recommending split of the state in to four parts. Even before she did this, and probably sensing the mood of her, Congress party spokesperson Rashid Alvi disclosed party’s stand to constitute Second States Reorganization Commission. Surprisingly, Bharatiya Janata Party (BJP) which favors Telangana without an SRC demanded for SRC from the Congress led UPA government for restructuring and splitting big states into smaller ones obviously referring to Mayavathi decision. Telangana Rashtra Samiti and political joint action committee came out openly against SRC.

State Reorganization Commission when it was formed first time had a historical background and an absolute necessity contrary to the present situation. Pre-Independence era of British Raj (1858–1947), Indian independence movement (1857–1947), Partition of India (1947) and the Post-Independence period that required Political integration of India (1947–49) preceded the first SRC. That was how the first States Reorganization Act (1956) came in to existence which was a major reform of the boundaries and governance of India's states and territories. The act reorganized the boundaries of India's states along linguistic lines, and amended the Indian Constitution to replace the three types of states, known as Parts A, B, and C states, with a single type of state. Although additional changes to India's state boundaries have been made since 1956, the States Reorganization Act of 1956 remains the single most extensive change in state boundaries since the independence of India in 1947. Formation of Haryana, Chhattisgarh, Jharkhand and Uttaranchal was done without any reference to any SRC.

Prior to independence, there were two sets of territories in British India. One set were under the direct control of the India Office in London and the Governor-General of India. The other set known as "Princely states" over which the Crown had suzerainty were under the control of hereditary rulers. There were several colonial enclaves also, controlled by France and Portugal. Political integration of all these was a declared objective of the Indian National Congress. Thanks to the efforts of Vallabhbhai Patel and V. P. Menon, almost all of the princely states agreed to accede to India. Having secured their accession, Central Government's authority over these states was extended. Simultaneously, the Government of India, through a combination of diplomatic and military means, acquired de facto and de jure control over the remaining colonial enclaves, which too were integrated into India. However, the former princely state of Kashmir, the accession of which to India was disputed by Pakistan, the state of Hyderabad, whose ruler was determined to remain independent, and the states of Tripura and Manipur, where active secessionist movements existed were not in favor of accession initially but at a later stage had no option.

The early history of British expansion in India was characterized either by a policy of annexation or by a policy of indirect rule. In the former, the British sought to forcibly absorb the Indian princely states into the provinces and through the later, the British assumed suzerainty and paramountacy over princely states, but conceded some degree of sovereignty to them. Neither paramountacy nor these arrangements could continue after Indian independence.

A few British leaders, particularly Lord Mountbatten, the last British viceroy in India, were also uncomfortable with breaking links between independent India and the princely states. Mountbatten was also persuaded by the argument of Indian leaders such as V. P. Menon that the integration of the princely states into independent India would to some extent alleviate the wounds of partition. The result was that Mountbatten personally favored and worked towards the accession of princely states to India following the transfer of power, as proposed by the Congress. The rulers of the princely states, however, were not uniformly enthusiastic about integrating their domains into independent India. In July 1946, Nehru pointedly observed that no princely state could prevail militarily against the army of independent India. In January 1947, he said that independent India would not accept the Divine Right of Kings, and in May 1947, he declared that any princely state which refused to join the Constituent Assembly would be treated as an enemy state. Between May 1947 and the transfer of power on 15 August 1947, the vast majority of states signed Instruments of Accession. A number of factors contributed to the collapse of their initial resistance and almost all princely states had to agree to accede to India.

On 15 August 1947, British India was granted independence as the separate dominions of India and Pakistan.

The Instruments of Accession were limited, transferring control of only three matters to India, and would by themselves have produced a rather loose federation, with significant differences in administration and governance across the various states. Full political integration, in contrast, would require a process whereby the political actors in the various states were "persuaded to shift their loyalties, expectations, and political activities towards a new center", namely, the Republic of India. Having secured the accession of the princely states, the Government of India between 1948 and 1950 turned to the task of welding the states and the former British provinces into one polity under a single republican constitution.

The new Constitution of India, which came into force on 26 January 1950, made India a sovereign, socialist, secular, democratic Republic, and a Union of states (replacing provinces) and territories. The states would have extensive autonomy and complete democracy in the Union, while the Union territories would be administered by the Government of India. The constitution of 1950 distinguished between three types of states.

The nine Part A states, which were the former governors' provinces of British India, were ruled by an elected governor and state legislature. The eight Part B states were former princely states or groups of princely states, governed by a Rajpramukh, who was often a former prince, and an elected legislature. The Rajpramukh was appointed by the President of India. The ten Part C states included both the former Chief Commissioners' Provinces and some princely states, and each was governed by a Chief Commissioner appointed by the President of India. Jammu and Kashmir had a special status until 1957. The Andaman and Nicobar Islands were established as a Union territory ruled by a lieutenant governor appointed by the central government.

Political movements for the creation of new, linguistic-based states developed around India in the years after independence. The movement to create a Telugu-speaking state out of the northern portion of Madras State gathered strength in the years after independence, and in 1953, the sixteen northern, Telugu-speaking districts of Madras State became the new State of Andhra.

Other small changes were made to state boundaries during the 1950-1956 period. The small state of Bilaspur was merged with Himachal Pradesh on 1 July 1954, and Chandernagore, a former enclave of French India, was incorporated into West Bengal in 1955.

The States Reorganization Commission was constituted by the Central Government of India under the States Reorganization Act and consisted of Honorable Fazal Ali, Kavalam Madhava Panikkar, and H.N. Kunzru. The Report submitted by the Committee in 1955 known as SRC Report went in to the problems of Telangana and Andhra regions, and the arguments for and against the merger of two regions.

Para 369 to 389 of SRC deals with the merger of "Telangana region of Hyderabad State" and Andhra State to establish Andhra Pradesh state. The States Reorganization Act of 1956, which went into effect on 1 November, eliminated the distinction between parts A, B, and C states. It also reorganized the state boundaries and created or dissolved states and union territories.

None of the reasons that required constituting the first States Reorganization Commission hold good today except political convenience. Why then the talk of second SRC?

Wednesday, November 23, 2011

ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి : వనం జ్వాలా నరసింహారావు



ఏడాది పాలన పూర్తిచేసిన సందర్భంలో

ఆత్మవిశ్వాసంతో ముందడుగు

(వేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి)

(ఆంధ్ర జ్యోతి: 25-11-2011)
వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ ముఖ్యమంత్రిగా ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయింది. ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్తున్న సమయంలోనూ, చేపట్టిన మరుక్షణం నుంచీ కిరణ్‌ కుమార్‌ రెడ్డి చుట్టూ సమస్యల తోరణాలు స్వాగతం పలికాయి. వాస్తవానికి ఆయన ధరించింది ముఖ్యమంత్రి పీఠం అనే కంటే, ముళ్ల కిరీటం అనాలి. ఆయన బాధ్యతలు స్వీకరించేనాటికే, రాష్ట్రం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రదర్శించబోయే పాలనా దక్షతకు, సమర్థతకు అవన్నీ అగ్నిపరీక్షల లాంటివే. అన్నింటికన్నా అతి ప్రధానమైన సమస్య ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు, స్వపక్షీయుల-విపక్షీయుల ఆందోళనలు-ఉద్యమాలు. అలానే హైదరాబాద్ ఫ్రీ జోన్ అంశం మరో కీలకమైన సమస్య. కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి, రాజకీయంగా ఆయన ఎదుగుదలకు కారణమై, దరిమిలా ఆయన ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడానికి పరోక్షంగా తోడ్పడిన దివంగత ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖరరెడ్డి తనయుడు, కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎన్నికైన ఎంపీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ధిక్కార ధోరణి మరో ప్రధాన సమస్య అప్పట్లో. వీటికి తోడుగా, ఉద్యోగ సంఘాల-విద్యార్థుల-రాజకీయ, ఇతర ఐక్య కార్యాచరణ కమిటీల ఆందోళనల లాంటి అనేక సమస్యలు ఆయనను తక్షణమే చుట్టు ముట్టాయి. వీటన్నింటి కంటే ప్రధానంగా దివంగత నేత వైఎస్ కు అత్యంత అభిమాన పాత్రమైన-నత్తనడకన సాగుతున్న, జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తిచేయాల్సిన గురుతర బాధ్యత కూడా అయన ముందుందప్పట్లో.

ఈ నేపధ్యంలో కాంగ్రెస్ శాసన సభా పక్షం సభ్యులంతా సమావేశమై, హై డ్రామా నడుమ, సభా నాయకుడుగా కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేశారు. ఆయన ఎంపిక మార్గాన్ని సుగమం చేయడానికి, అతిరథ-మహారథ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ హైదరాబాద్‌లోను, అక్కడ ఢిల్లీలోను, తమ వంతు పాత్రను అవధుల మేరకు పోషించారు. తన మార్పుకు అనుకూలంగా నాటి ముఖ్యమంత్రి రోశయ్య, ఢిల్లీకి వెళ్లి, అధిష్టానానికి-అధినేత్రికి తన (అధిష్టానం) మనసులో మాటను బయట పెట్టి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి బాటలు వేశారు.

మొత్తం మీద ఒక్కొక్క సమస్యను అధిగమించే క్రమంలో, ఆయన తొలుత శ్రీకారం చుట్టింది, నిజాం ఆసుపత్రికి వెళ్లి "ఆరోగ్య శ్రీ" పథకం అమలును పరికించి, తనకు రాజశేఖరరెడ్డి పథకాలంటే అత్యంత ప్రీతిపాత్రమైన వని సందేశమివ్వడమే! ఆ తరువాత తన మంత్రివర్గం ఏర్పాటు చేసుకోవడంలో తనదైన శైలిని అనుసరించడం. ఆ తరువాత శాసన సభాపతి ఎంపిక, డిప్యూటీ స్పీకర్ ఎంపిక లాంటి వాటిలో తన మాట చెల్లించుకోవడంతో పాటు, అధిష్టానం ఆలోచనా ధోరణికి అనుగుణంగా నడుచుకోవడం. అలానే, కొన్నాళ్లకు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అధిష్టానం బొత్స సత్యనారాయణను ఎంపిక చేసినప్పుడు, ఎదురు చెప్పకపోవడం కూడా కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ చతురతకు నిదర్శనం అనాలి. ఎంతమంది ఎమ్మెల్యేలు (అటు తెలంగాణ విషయంలోను, ఇటు వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి విషయంలోను) ఆయనను ఏదో ఒక నెపంతో విమర్శించినా, సంయమనం కోల్పోకుండా, తగు రీతిలో, ఎవరినీ నొప్పించకుండా-అందరినీ మెప్పించుకుంటూనే, స్పందించారే కాని, తన స్థాయి మరిచిపోయి ఎదురుదాడికి దిగలేదని అనాలి. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించని పక్షంలో వారు నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు హెచ్చరించిన నాడు కూడా నిశ్శబ్దంతోనే ఆయన వ్యవహరించారు. రాష్ట్ర విభజనకు జరుగుతున్న ఉధృత పోరుతో పాటు, ప్రాంతాల మధ్య రోజురోజుకు పెరుగుతున్న అంతరాన్ని దృష్టిలో పెట్టుకొని పాలన కొనసాగించాల్సిన బాధ్యతను ఎంత మేరకు నిర్వర్తించారన్నది ప్రశ్నార్థకమైనప్పటికీ, అధిష్టానం మెప్పు పొందడంలో మాత్రం సఫలమైనారనే చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే, కర్ర విరగకుండా-పాము చావకుండా, అసలు-సిసలైన కాంగ్రెస్ సంస్కృతికి అద్దం పట్టేలా ఆయన పాలన సాగుతుందనొచ్చునేమో!

ఏదేమైనా, ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన ఎదుర్కొన్న అనేక సమస్యలకు అందరూ భావించిన రీతిలో కాకపోయినా, కొందరి మెప్పైనా పొందే తరహాలో, పరిష్కారం కనుగొన్నారనే అనక తప్పదు. ఉదాహరణకు 14 ఎఫ్ తీసుకుందాం. ఎస్సై రాత పరీక్షల సందర్భంగా ఎంత గొడవైందో అందరికీ తెలిసిన విషయమే. ఐనా రాత పరీక్షలను జరిపించిన ఘనత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానిదే. ఆ తరువాత ఉద్యోగుల అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోగలిగారంటే అది కూడా కిరణ్ కుమార్ రెడ్డి చొరవే అనాలి. అలాగే, సకలజనుల సమ్మె ప్రభావం ఏ మాత్రం లేదని సమ్మె ఆరంభమైన మొదటి రోజుల్లో పేర్కొన్న కిరణ్ కుమార్ రెడ్డి, దరిమిలా, దాని ప్రభావాన్ని గుర్తించి సమ్మె విరమింపచేయడానికి తీసుకున్న చర్యలను కూడా ఆయన చొరవకు-పాలనా దక్షతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆయనకూ తెలుసు...ఉద్యోగ సంఘాల నాయకులకూ తెలుసు...యావత్ తెలంగాణ ప్రజలకూ తెలుసు...రాజకీయ ఐకాసకూ తెలుసు...తెరాసకూ, ఇతర రాజకీయ పార్టీలకూ తెలుసు... ముఖ్యమంత్రి ప్రేరణతో జరిగింది సకల జనుల సమ్మె విరమణ కాదని, కేవలం తాత్కాలిక విరామమేనని! ఐనా ఆ తాత్కాలిక విరమణకు కిరణ్ కుమార్ రెడ్డిని అభినందించాల్సిందే. రాజకీయంగా కిరణ్ కుమార్ రెడ్డి తన పావులను, అంబులపొదిలో అస్త్రాలను-శస్త్రాలను, అత్యంత చాకచక్యంగా ఉపయోగించడంలో అందె వేసిన చేయి అనక తప్పదు. అందుకు మొదటి ఉదాహరణగా జగన్ వర్గంగా పిలువబడుతున్న ఎమ్మెల్యేలను తన వర్గంలోకి తెచ్చుకోవడం పేర్కొనాలి!

వై. ఎస్. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా, చివరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన పదిమంది ఎమ్మెల్యే లైనా మిగులు తారా అన్నది సందేహంగా మారడానికి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ చాకచక్యమే కారణమనాలి. జగన్మోహన్ రెడ్డిపైన సి. బి. ఐ. విచారణకు కోర్టు ఆదేశాలు వెలువడినంతనే, కాంగ్రెస్, పీ.ఆర్.పి. టిడిపి. లకు చెందిన సుమారు ముప్పైమంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు పదవులకు (స్పీకర్ ఫార్మాట్‌లోనే!) రాజీనామాలు చేసారు. చేయడమే కాకుండా తమ వీరాభిమానాన్ని ఒకరిని మించి మరొకరు ప్రకటించుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఏం మాయ చేశారో ఏమో కాని, ఇప్పుడు అలా రాజీనామా చేసిన వారంతా "రాజీనామా" లోని "నామా" తీసేసి "రాజీ" బాట పట్టారు. నల్లపురెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదించడంతో గుబులుపుట్టి అలా చేస్తున్నారో, లేక, ఆయారాం-గయారాంల సంస్కృతి గుర్తుకు వచ్చి అలా జరుగుతుందో భగవంతుడికే తెలియాలి. కారణాలేవైనా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిది పైచేయనక తప్పదు.

అలానే తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలు. మూకుమ్మడిగా, ఆ ప్రాంతానికి చెందిన నాలుగింట మూడొంతులమంది, మంత్రులతో సహా, తమ ఎమ్మెల్యేల పదవులకు రాజీనామాలు చేశారు. ఆ రాజీనామాలను మూకుమ్మడిగా "భావోద్వేగం" పేరిట స్పీకర్ ఆలశ్యంగానైనా తిరస్కరించారు. మళ్లీ రాజీనామాలు చేసిన వారే తక్కువైతే, చేయని వారు-చేసినవారు, ఒక్కొక్కర్నే ముఖ్యమంత్రి తన దారికి తెచ్చుకున్న చాకచక్యం అసలు సిసలైన రాజకీయ చతురతే. తన పార్టీకి చెందిన ఎంపీలు ఎంతగా తనను విమర్శిస్తున్నా, లెక్క చేయకుండా, తన దారేంటో తాను చూసుకుంటూ, తనకు కావాల్సింది ఎమ్మెల్యేలే కదా అన్న ధోరణిలో, ఈ పాటికే చాలామందిని తనవైపు తిప్పుకున్నారు. ఆ విషయంలోనూ కిరణ్ కుమార్ రెడ్డి అభినందనీయుడే! అలానే, అధిష్టానం ఆలోచనైనా-తన ఆలోచనైనా, పీ.ఆర్.పి. అధినేతను ఆయన బలగంతో సహా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుని, జగన్మోహన్ రెడ్డికి ఆదిలోనే చెక్ పెట్ట గలగడం "రియల్లీ గ్రేట్!". ఇంతెందుకు...కొందరు కాంగ్రేసేతర నాయకులు ఆరోపించినట్లు (వాస్తవమా కాదో భగవంతుడికే తెలియాలి!) సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు, తన జిల్లాకే చెందిన తన చిరకాల ప్రత్యర్థి, నారా చంద్రబాబునాయుడుని సహితం తన దారిలోకి తెచ్చుకోగలిగి, అవసరమనుకుంటే శాసనసభలో ఆయన మద్దతు కూడా తనకే సుమా అని ప్రచారం చేయించుకోగలిగిన థీశాలి కిరణ్ కుమార్ రెడ్డి.

ఎవరెన్ని చెప్పినా, ఎవరేమనుకుంటున్నా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలో తిరుగులేని ఆత్మవిశ్వాసం మాత్రం దినదినాభివృద్ధి చెందుతుందనడంలో సందేహం లేశ మాత్రమైనా లేదు. పాత్రికేయులతోను, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర నాయకులతోను ఆయన మాట్లాడుతున్న తీరులో అది ప్రతిబింబిస్తోందని ఆయనను కలిసిన పలువురు ఘంటాపథంగా చెబుతున్నారు. అనేక రకాల పధకాలను తన సొంత బాణీలో రూపొందించే ఆలోచనలో-కార్యరూపం దాల్చే ట్లు చేయడంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి వున్న విషయం ఇటీవల కాలంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రూపాయికి కిలో బియ్యం పధకాన్ని ప్రకటించిన కిరణ్ రాజీవ్ యువ కిరణాల పేరుతో డిసెంబరు నాటికి లక్ష ఉద్యోగాలు, మూడేళ్లలో పదిహేను లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్న సంగతి తెలిసిందే. జనాన్ని ఆకట్టుకునే రీతిలో కొత్త స్కీములు ఉంటాయనీ ఆయన అంటున్నారు. మార్చి 31వ తేదీ కల్లా "మీ సేవ" ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు. ఎటువంటి లంచగొండితనం లేకుండా "మీ సేవ" కేంద్రాల్లో కేవలం పావు గంటలో ధృవీకరణ పత్రాలు దొరుకుతాయని, అలా ఇవ్వకపోతే అక్కడే అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నంబరు 1100 నుంచి ఫిర్యాదు చేయవచ్చని ఆయన భరోసా ఇస్తున్నారు. 86 లక్షల మంది రైతులు, మహిళలకు 1800 కోట్ల రూపాయల మేరకు లబ్ది కలిగించే కార్యక్రమాలు చేపట్టింది ప్రభుత్వం. 50 లక్షల మంది మహిళలకు 600 కోట్ల రూపాయలతో లబ్ది చేకూర్చే కార్యక్రమాలతోపాటు 100 కోట్ల రూపాయలతో స్త్రీ నిధి కార్యక్రమం నిర్వహించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. పావలా వడ్డీ కింద రూ.300 కోట్లు, స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి రూ.300 కోట్లు వెచ్చించాలని కూడా ఒకానొక మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది.

కిరణ్ కుమార్ రెడ్డి పథకాలు మంచివే...ఆలోచనలూ మంచివే. అవి అమలైతే ప్రజలకు మేలు కలిగే మాటా నిజమే. ఇంత మంచి ఆలోచన చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ విషయంలో కూడా కించిత్తు చొరవ తీసుకుంటే మంచిదేమో! తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావాలని నాలుగున్నర కోట్ల మంది ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. అందుకు ఆందోళనలూ చేశారు. ఉద్యమాలూ చేశారు. తమదైన శైలిలో ఎన్నో రకాల నిరశనలు కూడా తెలియచేశారు. తాను ఒక ప్రాంతానికే చెందిన నాయకుడులా వ్యవహరించకుండా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి తరహాలో, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా, రాష్ట్ర ప్రజల భవిష్యత్ దృష్ట్యా, సకల జనుల అభీష్టం మేరకు రాష్ట్ర విభజన జరగాలని శాసనసభలో ఒక తీర్మానం చేయించి, చరిత్రలో తన పేరును చిర స్థాయిగా వుండేట్లు చేసుకుంటే మంచిదేమో ఆలోచించమని ఆయన ఏడాది పాలన పూర్తయిన సందర్భంలో ప్రజలంతా కోరుకుంటున్నారు. హైదరాబాద్‌లో పుట్టి-పెరిగి-విద్యా బుద్ధులు గడిపిన ఆయన అసలైన తెలంగాణ వాది అని నిరూపించుకుంటే మంచిదేమో!

Sunday, November 20, 2011

"వృత్తిలో" డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి: వనం జ్వాలా నరసింహారావు

తీపి గుర్తులు - చేదు అనుభవాలు: అధ్యాయం – 5

"వృత్తిలో" డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి

వనం జ్వాలా నరసింహారావు

(మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చేసే అవకాశం కలిగింది నాకు. 36 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో ఐదవ అధ్యాయం ఇది).

ఖమ్మం పట్టణానికి రాధాకృష్ణమూర్తి వచ్చి, డాక్టర్‍గా ప్రాక్టీస్ ప్రారంభించిన రోజుల్లో, వృత్తి పరంగా ఆయనకు పోటీ అంతగా లేదు. అప్పట్లో పేరున్న డాక్టర్లు ఇద్దరు-ముగ్గురు కంటే ఎక్కువ లేరు. డాక్టర్ మజీద్, డాక్టర్ అశ్వత్థామ, డాక్టర్ సీతారామరావులతో పాటు మరో ఇద్దరు-ముగ్గురు ఎంబిబిఎస్ పట్టాలేని డాక్టర్లుండే వారు. యలమంచిలి గారి పరిచయస్తులు, దగ్గర బంధువులు, స్నేహితులు, చుట్టు పక్కల గ్రామాలకు చెందిన వారు ఆయన దగ్గరకు రావడంతో, త్వరగానే ప్రాక్టీస్ పెరగసాగింది. దీనికి తోడు, ఆయనకు కమ్యూనిస్ట్ పార్టీ అభిమానిగా పేరుండడంతో, అది కూడా ప్రాక్టీస్ పెరగడానికి దోహద పడింది. వచ్చిన మొదట్లో పార్టీతో నేరుగా సంబంధాలు పెట్టుకోక పోయినప్పటికీ, ఆయన క్లినిక్ నడుపుతున్న గాంధీ చౌక్లో వున్న బంగళా పై భాగంలో పార్టీ కార్యాలయం వుండడంతో ఆయన పరిచయాలు పెరగడానికి తోడ్పడింది. ఆయన ఖమ్మం రావడానికి కారణం కూడా వుంది. సమీపంలోని నేలకొండపల్లి, బోదులబండ గ్రామాల్లో ఆయన పిన తండ్రి, మరికొందరు బంధువులు అంతకు పది సంవత్సరాల క్రితం వచ్చి, చౌకగా దొరికితే భూములు కొనడం, స్థిరపడడం జరిగింది. ఖమ్మంలో డాక్టర్లు ఎక్కువగా లేరని, వస్తే ప్రాక్టీసు బాగా సాగుతుందని వాళ్లు ప్రోత్సహించడం వల్ల రావాలన్న కోరిక బలపడింది.

వైద్య వృత్తిలో నైతిక విలువలకు, మానవత్వానికి కట్టుబడి వున్న ప్రతి డాక్టర్‍కు ప్రజల అభిమానం లభిస్తుందని నమ్మిన యలమంచిలి, తన వైద్య శాల ద్వారా ఆ మార్గంలోనే ప్రాక్టీస్ చేయడంతో, అచిర కాలంలోనే ఆయన వద్దకు చికిత్సకొరకు వచ్చే వారి సంఖ్య పెరగ సాగింది. అదనంగా ఆయనకున్న వృత్తిపరమైన నైపుణ్యం వై.ఆర్.కెకు వైద్యుడుగా మంచి పేరు తెచ్చి పెట్టింది. అరవై సంవత్సరాల పూర్వం ఆయన ప్రాక్టీసు చేస్తున్న రోజుల్లో, "స్పెషలిస్టు" డాక్టర్లంటూ ఎక్కువ మంది లేరు. ఎంబిబిఎస్ ఉత్తీర్ణులైన వారే, తాము చదువుకున్న రోజుల్లో నేర్చుకొనేటప్పుడే, వైద్యం చేయడానికి అవసరమైన ప్రతి విషయంలోను అంతో-ఇంతో నైపుణ్యం అలవరచుకునే వారు. అలానే సాధ్యమైనంత వరకు, అప్పటి మెడికల్ ప్రొఫెసర్లు, వీరికి జనరల్ ప్రాక్టీషనర్లకు కావాల్సిన నైపుణ్యం, కష్టపడడం, ఎప్పటికప్పుడు అవసరాలకు అనుగుణంగా విజ్ఞానాన్ని పెంపొందించి కోవడం లాంటివి బోధించేవారు. రాధాకృష్ణమూర్తి స్వతహాగా తెలివైన విద్యార్థి కావడంతో ను, తోటి విద్యార్థులు కూడా అలాంటి వారే కావడంతోను, భవిష్యత్‍లో సేవా దృక్ఫదంతో వుండాలన్న కోరిక బలంగా ఆయనలో నాటుకు పోవడంతోను, ప్రతి విషయాన్ని ఆసక్తిగా నేర్చుకునేవారు.

ఆయన సహాధ్యాయులు, రూమ్మేట్లు అయిన డాక్టర్ బాల పరమేశ్వరరావు (భీమవరం), డాక్టర్ సత్యనారాయణ(విజయవాడ), మరొక విద్యార్థి సుబ్బారాయుడు(పాలకొల్లు), జి. సోమరాజు(తణుకు), రాజరత్నం(చిలకలూరిపేట), కృపాదానం(గుంటూరు జిల్లా), జి. రామచంద్రరావు(మైలవరం), మిక్కిలినేని వెంకటేశ్వరరావు(చిల్లపల్లి), .ఏ శర్మ(తరువాత కాలంలో ఎర్రగడ్డ టి.బి ఆసుపత్రి సూపరింటెండెంట్ అయ్యారు), కొడాలి వీరయ్య, రాఘవయ్య(తెనాలి), సజ్జా చంద్రమౌళి(చీరాల)-వీరయ్య, చంద్రమౌళిగార్లు టిడిపి పక్షాన ఎమ్మెల్యేలుగా కూడా పనిచేశారు-, ఉప్పలపాటి వెంకట రత్నం(ఎం.డి చేసి విజయవాడలో ప్రాక్టీస్ చేశారు), కుప్పాబ్బి కృష్ణమూర్తి (మెడిసిన్ ప్రొఫెసర్‍గా పనిచేశారు), సీతారాం(ఆర్మీలో చేరి అకాల మరణం పొందారు), వారి-వారి కులాలు వేరైనా, వాటన్నిటికీ అతీతంగా కలిసిమెలిసి, కొత్త విషయాలను నేర్చుకునేవారు. జీవనయానంలో ఎవరి దారి వారిదైనప్పటికి, వారి మధ్య స్నేహం కొనసాగింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లో రాధాకృష్ణమూర్తిగారు చురుగ్గా పాల్గొనే రోజుల్లో ఆ స్నేహం మరింత బలపడింది. కాలేజీ రోజులు తలచుకుంటూ, రచయిత ఆరుద్రతో పరిచయం జ్ఞాపకం చేసుకున్నారు. రాధాకృష్ణమూర్తిగారు విశాఖపట్నంలో మెడిసిన్ చదువుకునే రోజుల్లో, ఆరుద్ర "లైకోగ్రాఫ్"లో నైపుణ్యం పొందేందుకు, స్థానికంగా ఒక ఫొటో స్టూడియోలో పనిచేసేవారు. స్నేహితుడు తాజుద్దీన్, వై.ఆర్.కెను ఫొటో తీయించుకోవడానికి అక్కడికి తీసుకెళ్లి పరిచయం చేశాడు (తాజుద్దీన్ మెడికల్ కాలేజీ "బ్యూటీ" సుగుణను పెళ్లి చేసుకుని, కొంతకాలం ప్రభుత్వ ఆరోగ్య శాఖలో పని చేసి, అమెరికా వెళ్ళి ఫ్లోరిడాలో స్థిర పడ్డాడు. డాక్టర్‍గారికి ఫోన్ చేస్తుంటాడు). ఆరుద్ర తనదైన శైలిలో ఫొటో తీసినట్లు, ఆ సమయంలో మంచి పోజు ఇవ్వమని సూచించినట్లు జ్ఞాపకం చేసుకున్నారు డాక్టర్ యలమంచిలి. అప్పటికీ-ఇప్పటికీ కొన్ని వృత్తి పరమైన సామాజిక విషయాల్లో చాలా తేడా వుందని ఆయన భావన.

మానవత్వం, మానవ విలువల పట్ల గౌరవం డాక్టర్‍గారికి కలగడానికి ఆయన కుటుంబ నేపధ్యం ప్రధాన కారణం. తోటివారిని మర్యాదగా చూడడం, దయా దాక్షిణ్యాలు వారిపట్ల కలిగివుండడం, చిన్నతనంలో దత్తత తండ్రిగారి నుంచి అలవరచుకున్నారాయన. కళాశాల చదువు, వివిధ రంగాలకు సంబంధించి పెంపొందించుకున్న అభిలాష, స్వయం శిక్షణ, క్రమశిక్షణ లాంటివి ఆయన అభివృద్ధికి దోహదపడ్డాయి. ఆయన ఖమ్మంలో వైద్య వృత్తి ఆరంభించిన నాటి రోజులకు-ఇప్పటికి, చికిత్సా విధానంలోను, రోగ నిర్ధారణలోను, నివారణలోను, శస్త్ర చికిత్సా పద్దతులలోను గణనీయమైన మార్పులు వచ్చినప్పటికీ, అప్పుడు నేర్చుకుని ఆచరించిన పద్దతుల ద్వారా కూడా మెరుగైన చికిత్సను అందించగలిగా మన్న తృప్తి వుండేదని ఆయన భావన-నమ్మకం. కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి స్వర్గీయ నల్లమల గిరిప్రసాద్‍తో సహా, పలువురికి, ఆయన, అప్పటికున్న సదుపాయాల ఆధారంగానే, ట్రాన్సిల్స్ ఆపరేషన్ చేశారు. బహుశా అదే ఖమ్మంలో మొదటి ఆపరేషనేమో! సాధారణ ఆపరేషన్‍కు అప్పట్లో అయ్యే ఖర్చు కేవలం రు. 25 మాత్రమే.

డాక్టర్ వై.ఆర్.కె చేసిన ఆపరేషన్లలో హైడ్రోసిల్, హెర్నియా, అపెండిసైటిస్, ఫ్రాక్చర్స్, ట్యూమర్ లాంటివి కూడా వున్నాయి. ఏ ఆపరేషన్ చేసినా, ఆయనకు ఎప్పుడూ, ఏ విధమైన క్లిష్ట సమస్యలు ఎదురు పడలేదు. కేవలం రొటీన్ ఆపరేషన్లు, ప్రమాదం లేదనుకునే ఆపరేషన్లు మాత్రమే చేసేవారప్పట్లో. మెడికల్ పరమైన చికిత్సలనే ఎక్కువగా చేపట్టేవారు. కంట్లో నలకపడితే తీసే విధానం వుండేదప్పట్లో. సులభమైన మౌలిక సూత్రాలకు అనుగుణంగా చికిత్సా విధానం వుండేది. అనుభవం ప్రాతిపదికగా రోగ నిర్ధారణ నైపుణ్యం అలవరచుకునే వారు వైద్యులు. నిపుణుల ద్వారా చికిత్స చేయించాల్సిన అవసరముంటే, విజయవాడకో-హైదరాబాద్‍కో రోగులను పంపాల్సి వచ్చేది. ఎక్స్-రే కావాలన్నా విజయవాడకు పోవాల్సి వచ్చేది. రోగ నిర్ధారణ కొరకు ఇప్పటి మాదిరిగా రక్త-మల-మూత్ర పరీక్షలు లేవప్పుడు. సీబిపి కాని, మైక్రోస్కోపిక్ పరీక్షలు , ఎక్స్-రే సౌకర్యం ఖమ్మంలో లేవు. డాక్టర్ కోటయ్య గారు వచ్చిన తర్వాతే ఖమ్మంలో ఎక్స్-రే సౌకర్యం వచ్చింది.

ఇప్పటి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా-బాలికల పాఠశాల వున్న ఆవరణలో-16 పడకల జిల్లా ఆసుపత్రి వుండేది. ఇద్దరు డాక్టర్లు (ఒక్కోసారి ఒక్కరే) మాత్రమే వుండేవారు. ఎప్పుడైతే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి స్థాయి పెంచారో అప్పుడే స్పెషలిస్టుల రాక మొదలైంది. ఖమ్మం వచ్చిన మొదటి స్పెషలిస్ట్ సర్జన్ డాక్టర్ సూర్యనారాయణ అని, మొదటి ఎక్స్-రే పెట్టింది డాక్టర్ కోటయ్య అని, మొదటి అనస్థటిస్టు ఎల్ వీ ఎస్ కోటేశ్వర రావు అని, ఆ తర్వాత డాక్టర్ జయచంద్రారెడ్డి, డాక్టర్ జే.ఆర్. ప్రసాద్ లాంటి స్పెషలిస్టులు వచ్చారని గుర్తు చేసుకున్నారు రాధాకృష్ణమూర్తిగారు. 1961లో నర్సింగ్ హోంలు ఆరంభం కావడంతో వారి సంఖ్య లెక్కకు మించి పోయిందిప్పుడు.

రోగ నిర్ధారణ పరీక్షలు చేసే వసతి లేకుండా మెడికల్ ప్రాక్టీస్ చేయడం అంత తేలికైన విషయం కాకపోయినా చేయక తప్పని పరిస్థితులుండేవి అప్పట్లో. ధనుర్వాతంలాంటి జబ్బులొస్తే, ఆ రోగికి చికిత్స చేయడానికి, డాక్టర్లెవరు ముందుకు రాని రోజులవి. అలా చేయడం సాహసంతో కూడుకున్న పని. డాక్టర్ వై ఆర్ కె రిస్క్ తీసుకో తలిచి ధైర్యంగా అలాంటి కేసులను చేపట్టి, విజయవంతంగా నయం చేసిన సందర్భాలెన్నో వున్నాయి. అలానే క్షయ వ్యాధికి సంబంధించిన కేసులను డాక్టర్లు అంత తేలిగ్గా చికిత్స చేయడానికి ఆసక్తి చూపక పోయేవారు. స్ట్రెప్టోమైసిన్ మందులివ్వడమే టీబీ చికిత్సకు అప్పట్లో వున్న ఒకే ఒక చికిత్సా విధానం. ఇప్పుడైతే రకరకాల మందులొచ్చాయి. అలాంటి మల్టీ డ్రగ్స్ చికిత్సా విధానంతో పాటు, అవి వాడినందువల్ల రోగ నిరోధక శక్తికూడా శరీరానికి తగ్గసాగింది. క్షయ వ్యాధి చికిత్సకు ఒక క్రమ పద్ధతి అవలంబించామని రాధాకృష్ణమూర్తి చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా అవలంబించే "ఆర్టిఫిషల్ న్యూమో థొరాక్స్" అనే విధానం ద్వారా, ఊపిరి తిత్తులను "కొలాప్స్" చేసే పద్ధతి పాటించేవారు. ఒక ఊపిరి తిత్తి చుట్టూ వుండే (స్పేస్) ప్రదేశంలోకి గాలిని పంపి, "కొలాప్స్" చేసి, దానికి విశ్రాంతినిచ్చి, మరో దాన్ని నయం చేసేవారు. ఊపిరితిత్తి మచ్చ వుంటే, గాలిని పొట్టలో నింపి, పైకి తన్ని "న్యూమో పెరిటోనియం" చికిత్స చేసేవారు. తన దగ్గర కొచ్చే ఎందరో క్షయ రోగులను ఈ విధానం ద్వారానే నయం చేశానని, అప్పట్లో సరైన ఆ విధానాన్ని ఇప్పుడు ఎవరూ ఉపయోగించడం లేదని కూడా అన్నారాయన.

విరిగిన ఎముకలను బాగు చేయించుకోవడానికి ఆయన దగ్గరకు అనేక మంది వచ్చే వారు. జనరల్ మెడికల్ ప్రాక్టీస్ చేసే డాక్టర్లు ఆ కేసులను సాధారణంగా ఒప్పుకోరు. అలాంటి వారికి ప్లాస్టర్ వేసి బాగు చేయడం డాక్టర్ వై.ఆర్.కె గారు ఒక ప్రత్యేక నైపుణ్యంగా అలవరచుకున్నారు. కాలేజీలో చదువుకునే రోజుల్లో నేర్చుకున్న దానిని, మరింత పదును పెట్టడానికి, నిరంతర అధ్యయనం చేసేవారాయన. విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో నిర్వహించే మెడికల్ ఎడ్యుకేషన్ తరగతులకు హాజరై తన వృత్తి నైపుణ్యాన్ని ఆధునీకరించుకునేవారు. అలా చేస్తూ, ఒంటి చేత్తో ఎన్నో కేసులను నయం చేసేవారు. అదనంగా తన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి వివిధ మెడికల్ జర్నల్స్ లో ప్రచురించబడే వ్యాసాలను అధ్యయనం చేసేవారు.

వృత్తిలో కొన్ని నియమాలను పాటించేవాడినని చెప్పారు. మొదట్లో అసలు కన్సల్టేషన్ ఫీజు వుండేది కాదు. సంఖ్య పెరిగి, తట్టుకోవడం కష్టం కావడంతో, తలకు రు. 2 /- వసూలు చేసేవారు. అనవసరమైన పరీక్షలు చేయించక పోవడం, తన వల్ల కాని జబ్బు అనిపిస్తే, వెంటనే స్పెషలిస్టుల దగ్గరకు పంపడం, విద్యార్థులకు, పార్టీ పూర్తికాలం కార్యకర్తలకు - వారి కుటుంబాలకు ఉచితంగా చేయడం, ఇన్ పేషంట్లకు - సర్జరీలకు బిల్లు వేస్తే ఇచ్చుకోలేమనే వారికి, వారికి చేతనైనంతే ఇవ్వమనడం, ఎన్నాళ్లు సేవలందించినా సరే చనిపోయిన వారికి బిల్లు వేయకపోవడం పాటించేవారు. ఆస్తిపరులు స్వచ్చందంగానే ఏదో ఒక మొత్తం ఇచ్చి వెళ్లేవారు. ఎంత ఇచ్చారనేది చూసుకునేవారు కాదు. కొందరు వార్షికంగా ఇచ్చే వారు. వుండడానికి అవసరమైన అన్ని ప్రమాణాలను, నైతిక విలువలను తప్పక పాటించేవారాయన.

Saturday, November 19, 2011

రెండో ఎస్సార్సీ అవసరమా ?: వనం జ్వాలా నరసింహా రావు

సూర్య దినపత్రిక (19-11-2011)

వనం జ్వాలా నరసింహా రావు

{పొంతన లేని కాంగ్రెస్‌ ప్రతినిధుల ప్రకటనలు; యూపీతో లంకె ఎందుకు?; మాట మారుస్తున్న కాంగ్రెస్‌ నేతలు; తడబడుతున్న భారతీయ జనతా పార్టీ; అన్ని రాష్ట్రాల ఏర్పాటుకు ఎస్సార్సీ వేశారా?; తెలంగాణ’కు మాత్రం ఎస్సార్సీ ఎందుకు? .... ఎడిటర్ సూర్య}

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశంపై తనదైన శైలిలో కాంగ్రెస్‌ నాయకత్వం - యుపిఎ ప్రభుత్వం నాన్చివేత ధోరణి కొనసాగింపుగా, రెండో ఎస్సార్సీ ఏర్పాటును తెర పైకి తెచ్చింది. బోడి గుండుకు మోకాలు ముడిపెట్టే చందాన, ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలను, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి రాష్ట్రాన్ని నాలుగు ముక్కలుగా చేయాలన్న డిమాండును, తెలంగాణ అంశానికి లంకె వేసింది. సూర్య దినపత్రిక పేర్కొన్నట్లు ఉత్తరప్రదేశ్ లో "ఎన్నికలు ముగిసి, ఫలితాలలో పార్టీ అదృష్టం బయట పడిన తర్వాతే తెలంగాణ విషయంలో కసరత్తును పునరుద్ధరించాలని ఏఐసీసీ నాయకత్వం భావిస్తున్నట్టు" స్పష్టమైన సంకేతాలందిస్తోంది కేంద్రం. ఒకవైపు పార్టీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ నేమో రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేసి రాష్ట్రాల పునర్విభజన జరపాలా వద్దా అని నిర్ణయించడమే అఖిలభారత స్థాయిలో కాంగ్రెస్ విధానమని ప్రకటిస్తే, దానికి భిన్నంగా, ఇప్పుడిప్పుడే రెండవ ఎస్సార్సీ లాంటి ప్రతిపాదనలేవీ ఉండబోవని మరో సీనియరు నాయకుడు ప్రణబ్‌ ముఖర్జీ తాజాగా ప్రకటన చేశారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి చేసిన డిమాండ్‌ను దిగ్విజయ్‌ సింగ్‌ సమర్థిస్తే, ప్రణబ్ ముఖర్జీ వ్యతిరేకించారు. కాంగ్రెస్‌ విధానం చిన్న రాష్ట్రాల ఏర్పాటా? కాదా? కాకపోతే అసలు దాని విధానమేంటి అనేది భగవంతుడికే తెలియాలి! అంతలోనే తెలంగాణ విషయంలో త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని మళ్లీ మాట మారుస్తున్నారు అదే ప్రణబ్ ముఖర్జీ. వారికి ఇదొక ఆటలాగా - రాజకీయ క్రీడలాగా ఐపోయిందనాలి.

రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వాస్తవానికి, ఒక అర్థరహిత, అసమంజస, కారణ రహిత, విడ్డూరమైన అసంబద్ధ రాజకీయ తెలివితక్కువ ఆలోచన అనాలి. తెలంగాణ సమస్యకు ఇది పరిష్కారమార్గం కానే కాదు. కాజాలదు కూడా. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులకు ఈ ఆలోచన నచ్చి స్వాగతించారే మో కాని, ఒక్కరంటే ఒక్క తెలంగాణ వాది కూడా పిసరంత మాత్రమైనా అంగీకరించిన దాఖలాలు లేనే లేవు. అంగీకరించే సమస్యే ఉత్పన్నం కాదు. మాయావతి ఆలోచనకు ముందస్తుగా అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నదేమో కాని, పరోక్షంగా తన గోతి తానే తవ్వుకుంటున్నదన్న సంగతి మర్చిపోతోంది. అదేం విచిత్రమో కాని, తెలంగాణ ఏర్పాటుకొరకు రెండో ఎస్సార్సీ అవసరం లేదని వాదిస్తూ వచ్చిన, తెలంగాణ విషయంలో స్పష్టమైన వైఖరితో ముందుకొచ్చిన, పార్లమెంటులో చర్చకు సహితం నోటీసిచ్చిన ఏకైక జాతీయ పార్టీ - భారతీయ జనతా పార్టీ కూడా, ఉత్తర ప్రదేశ్ సంగతి వచ్చేసరికల్లా, రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేయాల్సిందేనని కేంద్రానికి సూచన ఇవ్వడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి, రాజకీయ ఐక్య కార్యాచరణ నాయకులు, తెలంగాణ టిడిపి-కాంగ్రెస్ నాయకులు ఎస్సార్సీ ఏర్పాటు ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించారు.

మొదటి పర్యాయం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమీషన్ ఏర్పాటు చేయడానికి ఒక చారిత్రక నేపధ్యం, పాలనాపరమైన అత్యవసర ఆవశ్యకత వుండేది. అలాంటిదేమీ ఇప్పుడు కించిత్తైన లేదు. ఆంగ్లేయుల పాలనలోని భారతావని (1858–1947), స్వాతంత్ర్యోద్యమం (1857–1947), దేశ విభజన (1947), స్వతంత్ర్యానంతరం రాజకీయ సమగ్రతల పరిరక్షణ (1947–49) నేపధ్యంలో మొదటి ఎస్సార్సీ ఆవశ్యకత కలిగింది. భారత దేశంలోని వివిధ రాష్ట్రాలను, ప్రాంతాలను, భౌగోళికంగా హద్దుల ఏర్పాటు చేసేందుకు, పాలనా సౌలభ్యంగా వాటిని మలిచేందుకు, మొదటి ఎస్సార్సీ చట్టం 1956 లో తీసుకుని రావడం జరిగింది. అదో ప్రాముఖ్యత సంతరించుకున్న రాజకీయ సంస్కరణ. ఆ చట్టం మూలాన, భౌగోళికంగా హద్దులు నిర్ణయించడానికి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును ప్రాతిపదికగా తీసుకున్నారు. స్వతంత్రం రావడానికి పూర్వం ఆచరణలో వున్న మూడు రకాల (ఎ, బి, సి) రాష్ట్రాల స్థానంలో ఒకే తరహా రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి మొదటి ఎస్సార్సీని ఉపయోగించుకుంది ప్రభుత్వం. తరువాత కొన్ని రాష్ట్రాలను మరో మారు విభజించినప్పటికీ, ఇంతవరకూ, ఎన్నడూ ఎస్సార్సీ లను ఏర్పాటు చేసి ఆ పని చేయలేదు. ఇప్పుడలా చేయాల్సిన అవసరమూ లేదు. స్వతంత్ర భారత దేశంలో ఒకే ఒక్క సారి ఇంతవరకు ఎస్సార్సీ ఏర్పాటు చేయడం జరిగింది. మరిప్పుడెందుకు చేయాలి?

భారత దేశానికి స్వతంత్రం రాక పూర్వం, బ్రిటీష్ ఇండియాలో రెండు విధాలైన దేశ భూభాగాలుండేవి. లండన్ లోని ఇండియా కార్యాలయం కింద, భారత గవర్నర్ జనరల్ కింద నేరుగా అధీనంలో వున్న బ్రిటీష్ ఇండియా ప్రదేశాలు కొన్నైతే, వారసత్వ పాలనలో వున్నటువంటి ప్రిన్సిలీ రాష్ట్రాలు మరి కొన్ని వుండేవి. వాటిపై అంతర్జాతీయ సంబంధాల విషయంలో మాత్రమే బ్రిటీష్ ప్రభుత్వ అజమాయిషీ వుండేది. అదనంగా, ఫ్రెంచ్, పోర్చుగల్ అధీనంలో వున్న వలస ప్రాంతాలు కూడా వుండేవి. వీటన్నిటినీ ఒకే గొడుగు కింద తెచ్చే రాజకీయ సమాకలనం - రాజకీయ ఏకీకరణ, అలనాటి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏకైక లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో సర్దార వల్లభాయ్ పటేల్, బ్రిటీష్ ఇండియాలో అత్యున్నత స్థానానికి ఎదిగిన భారతీయ సివిల్ సర్వెంట్ వి. పి. మీనన్ చేసిన అవిరళ కృషి ఫలితంగా, దాదాపు చాలా ప్రిన్సిలీ రాష్ట్రాలతో సహా అన్నీ భారత దేశంలో విలీనం కావడానికి అంగీకరించాయి. ఫ్రెంచ్, పోర్చుగల్ అధీనంలో వున్న వలస ప్రాంతాలు కూడా విలీనం దిశగా నడిచాయి. కాశ్మీర్, హైదరాబాద్, మణిపూర్, త్రిపురలాంటి కొన్ని రాష్ట్రాలు స్వతంత్రంగా వుండేందుకు ప్రయత్నాలు చేసినా చివరకు ఫలించలేదు. చిట్ట చివరి బ్రిటీష్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బేటన్ లాంటి వారు కూడా భారత జాతీయ కాంగ్రెస్ ప్రయత్నాలలో సహాయ పడ్డారు. ఆగస్ట్ 15, 1947 న బ్రిటీష్ ఇండియా, భారత పాకిస్తాన్ దేశాలుగా విడిపోయి, భారత దేశానికి స్వాతంత్ర్యం లభించింది.

జనవరి 26, 1950 న భారత దేశానికి కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చింది. సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా భారత దేశం అవతరించింది. అలా అవతరించిన దేశంలోని వివిధ ప్రాంతాలను కొన్నింటిని రాష్ట్రాలుగా, మరి కొన్నింటిని కేంద్ర పాలిత ప్రాంతాలుగా పిలవడం ప్రారంభించారు. రాష్ట్రాలకు స్వతంత్రంగా పాలన చేసుకునే అధికారాన్ని, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వుండే విధంగాను పాలనాపరమైన వీలు కలిగించింది రాజ్యాంగం. కాకపోతే వీటన్నిటినీ, మూడు రకాల రాష్ట్రాలుగా పాలనా సౌలభ్యంకొరకు విభజించడం జరిగింది. "ఎ" విభాగం కింద బ్రిటీష్ ఇండియాలో సరాసరి గవర్నర్ జనరల్ అజమాయిషీ కింద వుండే రాష్ట్రాలకు ఎన్నికైన గవర్నర్, ఎన్నికైన ప్రజా ప్రతినిధుల శాసన సభలుండేవి. అలాంటి తొమ్మిది రాష్ట్రాలలో అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్, బాంబే, మధ్య ప్రదేశ్ (గతంలోని కేంద్ర ప్రావిన్సులు, బీరార్ ప్రాంతం), మద్రాస్, ఒరిస్సా, తూర్పు పంజాబ్, ఉత్తర ప్రదేశ్ (యునైటెడ్ ప్రావిన్సెస్) వున్నాయి. "బి" విభాగంలో గతంలోని ప్రిన్సిలీ రాష్ట్రాలుండేవి. రాష్ట్రపతి నియామకం చేసిన రాజప్రముఖ్, ఎన్నికైన శాసన సభల ఆధ్వర్యంలో పాలన సాగే దక్కడ. అవి హైదరాబాద్, సౌరాష్ట్ర, మైసూర్, ట్రావన్‍కోర్-కొచ్చిన్, మధ్య భారత్, వింధ్యా ప్రదేశ్, పాటియాలా, పెప్సు, రాజస్థాన్ రాష్ట్రాలు. ఢిల్లీ, కచ్, హిమాచల్ ప్రదేశ్, బిలాస్ పూర్, కూర్గ్, భోపాల్, మణిపూర్, అజ్మీర్-మేర్వార్, త్రిపుర రాష్ట్రాలు "సి" విభాగం కింద వుండేవి. జమ్ము-కాశ్మీర్ కు కొంతకాలం ప్రత్యేక ప్రతిపత్తి కొనసాగింది. అండమాన్-నికోబార్ దీవులను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. ఈ నేపధ్యంలో ఏర్పాటైంది ఎస్సార్సీ.

భారత దేశానికి స్వతంత్రం వచ్చిన వెంటనే, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అక్కడక్కడా ఉద్యమాలు మొదలయ్యాయి. మద్రాస్ రాష్ట్రం నుంచి తమను విడదీయాలని తెలుగు మాట్లాడే వారు ఉద్యమించడంతో, 1953 లో, తెలుగు మాట్లాడే పదహారు జిల్లాలను మద్రాస్ రాష్ట్రం నుండి విడదీసి, "ఆంధ్ర రాష్ట్రం" గా ఏర్పాటు చేయడం జరిగింది. 1950-1956 మధ్య కాలంలో కొన్ని చిన్న చిన్న భౌగోళిక మార్పులు చేసి కొన్ని రాష్ట్రాల సరిహద్దులను మార్చడం జరిగింది. జులై నెల 1954 లో హిమాచల ప్రదేశ్ లో బిలాస్ పూర్ ను విలీనం చేశారు. 1955 లో ఒకనాటి ఫ్రెంచ్ కాలనీ చందర్ నగర్ ను పశ్చిమ బెంగాల్ లో కలిపారు. ఫజల్ అలీ, కవలం మాధవ ఫణిక్కర్, హెచ్. ఎన్. కుంజ్రు సభ్యులుగా మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమీషన్ ఏర్పాటైంది. 1955 లో "ఎస్సార్సీ నివేదిక" సమర్పించడం, అందులో మిగతా వాటితో పాటు తెలంగాణ ఏర్పాటు గురించి చర్చించడం జరిగింది. నివేదికలోని 369 నుండి 389 పేరాలలో హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం, మద్రాస్ నుండి విడదీసిన ఆంధ్ర రాష్ట్రం కలిపి "ఆంధ్ర ప్రదేశ్" రాష్ట్రం గా ఏర్పాటు కావడానికి సంబంధించిన అంశాలున్నాయి.

స్సార్సీ నివేదిక ఆధారంగా నవంబర్ 1, 1956 న అమలులోకి వచ్చిన కొత్త రాష్ట్రాల ఏర్పాటులో "ఎ, బి, సి" విభాగాలు లేకుండా అన్ని రాష్ట్రాలకూ ఒకే రకమైన పాలనా పరమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అనే రెండు రకాలు మాత్రం కొనసాగాయి.

ఇక ఆ తరువాత పంజాబ్ నుంచి హర్యానాను విడదీసినప్పుడైనా, మధ్య ప్రదేశ్ నుంచి ఛత్తీస్‌ఘడ్ ను ఏర్పాటు చేసినప్పుడైనా, లేదా జార్ఖండ్, ఉత్తరాంచల్ విషయంలోనైనా ప్రస్తావనకు రాని ఎస్సార్సీ ఇప్పుడెందుకు రావాలి? ఏ ప్రయోజనం కొరకు ఆ అంశాన్ని ఎవరు లేవనెత్తుతున్నారు? ఉత్తర ప్రదేశ్ ను విడదీసినా, విదర్భ ఏర్పాటు చేసినా, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా ఎస్సార్సీ వేయనక్కర లేనే లేదు. End