డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి
“పరిచయాలు – ఆప్యాయతలు"
వనం జ్వాలా నరసింహారావు
(మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చేసే అవకాశం కలిగింది నాకు. 36 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో ఆరవ అధ్యాయం ఇది).
అప్పటికే స్థానికంగా మంచి పేరున్న అడ్వకేట్ కేవి సుబ్బారావు, మరో అడ్వకేట్ బోడేపూడి రాధాకృష్ణలతో సంబంధాలు-స్నేహం కుదిరి బలపడ సాగింది. వారిరువురు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకు చెందిన పోలీసు కేసులను చూస్తుండేవారు. వాళ్లతో పాటు గోకినేపల్లి గ్రామానికి చెందిన కమ్యూనిస్ట్ నాయకుడు రావెళ్ల సత్యంగారితో, పార్టీ కార్యదర్శి నల్లమల గిరిప్రసాద్, చిర్రావూరి, మంచికంటి, బొంబే ప్రసాద్, రజబ్ అలీ, రాయల వీరయ్య, బోడేపూడి వెంకటేశ్వరరావు, బోజెడ్ల వెంకట నారాయణ, పర్సా సత్యనారాయణ, టీవీఆర్ చంద్రంగార్లతో కూడా పరిచయం కలిగింది. పార్టీ వ్యక్తిగా డాక్టర్ రాధాకృష్ణమూర్తిగారిని గుర్తించడం వల్ల, పరిచయాలు పెరిగాయి. తల్దారుపల్లి తమ్మినేని సుబ్బయ్య గారితో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది.
తమ్మినేని సుబ్బయ్య (తెల్దారుపల్లి) గారిని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన ఆ ప్రాంత గ్రామాలలో ఒక "పెద్ద మనిషి" గా, తెల్దారుపల్లి జాగీర్దారుకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రక పోరాటానికి నాయకత్వం వహించినవాడు గా పేరున్నది. తను వచ్చిన కొత్తలోనే, డాక్టర్‍గారికి వారితో పరిచయం కలిగింది. ఆయనకు ఎందుచేతనో డాక్టర్‍గారిపై ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. సోదరులు నలుగురికి ఉద్యోగాలు దొరకడంలో వారి సహాయం, వారు చూపించిన ఆప్యాయత, మరిచిపోలేనిదని కృతజ్ఞతాపూర్వకంగా అన్నారు డాక్టర్ వై.ఆర్.కె.
ఆ నాటికి పట్టణంలో చిర్రావూరి లక్ష్మీనరసయ్యగారు మునిసిపల్ ఛైర్మన్‍గా వున్నారు. పట్టణ పార్టీ వారి నాయకత్వంలోనే నడిచేది. ఆనాడు పట్టణ పార్టీ ప్రముఖులుగా వున్న మిగతా వారినీ గుర్తుచేసుకున్నారు డాక్టర్‍గారు. వారు: మాణిక్యాల నర్సయ్య, పిల్లుట్ల వెంకన్న, గాజెల రాఘవయ్య, వడ్డెల్లి రామయ్య, బెందారపు యాకయ్య, కమ్మాకుల జోగయ్య, ఐతరాజు వెంకన్న, అంకిత నర్సింహం, ఎర్రా వెంకన్న, పిల్లి చెన్న కృష్ణ, చిల్లంచర్ల రాములు, "ఆఫీసు" రాఘవయ్య, వెంపటి సూర్యనారాయణ, పిట్టల రామచంద్రం, కస్తూరి గోపాలం, కుక్కల నారాయణ, గుడ్ల కాశయ్య, గుడ్ల చంద్రయ్య, కూతురు వెంకన్న, మేకల నారాయణ, వంకాయలపాటి దాసయ్య తదితరులు. వీరిలో ఎవ్వరూ "హోల్ టైమర్స్" కారు. అందరూ తమ వృత్తులు చేసుకుంటూ, పూర్తిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. వారికి వ్యక్తిగతమైన స్వల్ప బలహీనతలుండవచ్చు. అది వారి సమాజం పట్టించుకోనివే. వారు "మాస్ లీడర్స్". జనాన్ని కదిలించగల శక్తిమంతులు. చిర్రావూరి మాట వారికి వేదవాక్కు.
అలాగే పాటిబండ్ల రఘుపతి రావు(జానకీపురం), రావెళ్ల జానకి రామయ్య, చుండూరి నర్సింహారావు, తమ్మారపు గోవిందు, కొండబోలు వెంకయ్య, చింతనిప్పు వీరవెంకయ్య (వేలాద్రి), తుళ్లూరి సత్యం, దొండపాటి వెంకయ్య, నల్లమోతు పిచ్చయ్య, రావి వీరయ్య, రేగళ్ల చెన్నారెడ్డి, బోడేపూడి రామకోటేశ్వరరావు, కర్నాటి కృష్ణయ్య, వెంపటి రామకోటయ్య, వాసిరెడ్డి వెంకటపతి(మధిర), బి.ఎస్. రాములు, వై. సీతారామయ్య, బండారు చంద్ర రావు, వట్టికొండ నాగేశ్వర రావు(అల్లీనగరం), తట్టికొండ లక్ష్మీకాంతయ్య, కోటయ్య గార్లు, అడపా గోపాల కృష్ణమూర్తి, మోరంపూడి రంగారావు(వేంసూరు), కమ్మకోటి రంగయ్య, దొండేటి ఆనంద రావు, మల్లెల వెంకటేశ్వర రావు, తుమ్మా శేషయ్య (వరంగల్ జిల్లా), ఐతం మంగపతి రావు (గార్ల), తొండేటి కొమరయ్య (గార్ల), కొణిదిన సీతారామయ్య (గొల్లెనపాడు), జొన్నలగడ్డ రామయ్య, పారుపల్లి పుల్లయ్య, పయ్యావుల లక్ష్మయ్య, ఎర్రంనేని వెంకట నర్సయ్య (గోకినేపల్లి), గంగాధర రావు (నేలకొండపల్లి) తదితరులను డాక్టర్ వై.ఆర్.కె గుర్తుచేసుకున్నారు.
పట్టణంలోని ప్రముఖ వ్యాపార కుటుంబాల వారు వై.ఆర్.కెను ఫామిలీ డాక్టర్‍గా చూసుకునేవారు. ఫీజులకు మించిన ఆప్యాయత, గౌరవం, అభిమానం లభించేది. అలాంటి కొన్ని కుటుంబాలను గుర్తుచేసుకున్నారు. అర్వపల్లి వారి నలుగురు సోదరుల(పెద్ద వ్యాపార) కుటుంబాలు, శిరం కృష్ణమూర్తి, పెనుగొండ భాస్కరరావు, సుందర్ టాకీస్ మద్ది పిచ్చయ్య, వీరభద్రం సోదరులు, వెంపటి కోటేశ్వరరావు, పిల్లి చెన్న కృష్ణ, చిల్లంచర్ల రాములు, సర్వదేవభట్ల రాజయ్య, సుగ్గల అక్షయ లింగం వారి సోదరుల కుటుంబాలు, గెల్లా లక్ష్మీనారాయణ సోదరులు, నోముల రాజయ్య గార్ల కుటుంబాల ఆప్యాయతలను గుర్తుచేసుకున్నారు. వ్యాపార కుటుంబాలు గాని, గ్రామాల నుండి వచ్చే రైతాంగ కుటుంబాలు గాని, పార్టీల వారి కుటుంబాలు గాని, వారి-వారి స్త్రీలు, పిల్లలను తీసుకుని వచ్చినప్పుడు తమ పుట్టింటికి వచ్చినంత చనువుగా - సంతోషంగా తన ఆసుపత్రికి వచ్చేవారని, ఇప్పటికీ తనకిదే గొప్ప తృప్తి అనీ చెబుతారు డాక్టర్‍గారు.
ఈ నేపధ్యంలో విజయవంతంగా ఆయన ప్రాక్టీస్ కొనసాగిస్తున్న రోజుల్లో, కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోవడంతో సీపీఐ-సీపీఎం మధ్య చోటుచేసుకున్న రాజకీయ పోరు ప్రభావం డాక్టర్ గారిపై కొంత పడింది. వారి నాయకుల మధ్య జరుగుతున్న పోరుతో సంబంధం లేని అమాయక ప్రజలను ఇబ్బందులకు గురి చేసే దిశగా అప్పటి సీపీఐ నాయకత్వం అడుగు వేసింది. రజబలీ చెప్పు చేతల్లో వున్న చుట్టు పక్కల గ్రామాల కమ్యూనిస్ట్ సానుభూతి పరులను, వైద్యం నిమిత్తం రాధాకృష్ణమూర్తిగారి దగ్గరకు పోకుండా కట్టడి చేసింది. నష్టపోయింది అమాయక రోగులే కాని, నాయకులు కాదని గ్రహించడానికి చాలా కాలం పట్టింది. ఆ తర్వాత కొంతకాలానికి, సీపీఐ కి చెందిన కొందరు స్థానిక నాయకులు, తామలా చేసినందుకు, డాక్టర్‍గారిని బాయ్‍కాట్ చేయమని సలహా ఇచ్చినందుకు పశ్చాత్తాప పడుతున్నామని ఆయనతో అన్నారు. ఆ పేర్లు వెల్లడించడం వారికి ఇబ్బందికరం కావచ్చునన్నారు.
క్రమేపీ వ్యాపారులు, పార్టీకి చెందినవారే కాకుండా, కాంగ్రెస్ పార్టీ ప్రముఖుల పరిచయాలు - స్నేహాలు లభించాయి డాక్టర్‍గారికి. పెరవల్లి వెంకట రమణయ్య(ఈయన తొలుత కమ్యూనిస్టే. తరువాత కాంగ్రెస్ లో చేరారు), కొమరిగిరి నారాయణరావు, గెల్లా కేశవరావు, కోనా పట్టాభి రామయ్య, హీరాలాల్ మోరియా, కోట పున్నయ్య, గురుమూర్తి, కత్తుల శాంతయ్య, రావెళ్ళ శంకరయ్య, మానికొండ బుచ్చయ్య(బాలపేట), చౌదరిగార్లతో స్నేహం కుదిరింది. వీరంతా కాంగ్రెస్ నాయకులు - లేదా - గాంధేయ వాదులు ఐనప్పటికీ, వ్యక్తిగతంగా తనను తమ వాడిగానే చూసుకునేవారని డాక్టర్ వై.ఆర్.కె అన్నారు.
"నా సహచరులూ, నా కింద పనిచేసేవారూ, నా ప్రవర్తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకున్న తరువాత నేను దిగ్భ్రాంతి చెందాను. “నేను అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకునేవాడిని’ అనుకుంటూ వుండేవాడిని. కాని, నా కింద పనిచేసేవారు, ’నేను ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాలతో వ్యవహరిస్తానని’ అనుకునేవారు. నేను అందరినీ స్వేచ్ఛగా మాట్లాడనిస్తానని అనుకునేవాడిని. కాని, నా బాడీ లాంగ్వేజ్ ద్వారా మాట్లాడేవారిని అడ్డుకుంటానని నా సహచరులు అనుకునేవారు. ఇలా నేను నా బలాలుగా ఏ ఏ అంశాలుగా భావించానో, అవన్నీ నా బలహీనతలుగా తరువాత బయట పడ్డాయి" - ఆర్. గోపాలకృష్ణన్ "టాటా రిఫ్లెక్షన్స్" - ఏ మేనేజర్ గివ్స్ హిజ్ ఎక్స్ పీరియెన్సెస్: బుక్ - "వెన్ ద పెన్నీ డ్రాప్స్" లో…..
Hi Sir,
ReplyDeleteEla vunnaru? DR YRK memories gurinchi chaduvuthu maa chinna thatha gari peru Dr garu gurthu pettukovadam chala santhosham ga anipinchindhi. Maa chinna thatha garu 1985 lo paramapadincharu. Maa thatha gaaru Morampudi Venkaiah garu 1967 Jalagam Vengal Rao gari meedha Vemsoor Niyojakavargam nundi poti chesaru.
Dr. YRK gaarini adigani cheppagalara alagey contact number ivvagalara veelayithe.
. Thank You Mr. Narendra. 9848161216 is the contact number of Doctor YRK. More details about you please.
ReplyDeleteJwala
Nenu oka MNC(IT Sector, Mumbai) lo work chesthunnanu. Communist party ante abhimanam. Nenu party activities lo participate cheyyaledhu kaani CPI party Andhrapradesh Praja Natya Mandali Anna "Nalluri Venkateswarly garitho daggari parichayam vundhi, alaney vaaru nirvahinchina konni programs ki attend ayyanu. Hyderabad lo vunnappudu Mukdhum bhavan ki velthu vunde vaadini TV Chowdary garitho parichyam vundhi. Paatha tharam communist leaders ante enaleni abhimanam vaari gurinchi chaduvuthu vuntanu.
ReplyDeleteMeeku gamil lo add request pampinchanu.
Thanks,
Narendra