Tuesday, January 29, 2013

IAS & Ministers Open War With Political Leaders: Vanam Jwala narasimha Rao

Saturday, January 26, 2013

Wednesday, January 23, 2013

Rajnath Rajneeti: DD Saptagiri: Vanam Jwala Narasimha Rao

Please click here to see a video on "Rajnathsingh of BJP and his rajaneeti" telecast over DD Saptagiri today: Jwala Narasimha Rao

http://www.youtube.com/watch?feature=player_embedded&v=60lsI88iq5A

Jwala

Tuesday, January 22, 2013

Political Debate on Tv 5: Jwala Narasimha Rao

Please click here to see a video on political debate telecast on Tv 5: Jwala Narasimha Rao

https://www.youtube.com/watch?feature=player_detailpage&v=lHAiCOQvalc


Thursday, January 17, 2013

Chintan Baitak a Doordarshan Video

This is a program on Doordarshan Saptagiri this morning (18th January) on Chintan Baitak to be held in Jaipur from today.

Please click here

http://www.youtube.com/watch?feature=player_embedded&v=ntOv5mr9jHU


Jwala

Wednesday, January 9, 2013

దేశంలోని హిందువులను అక్బర్ అంతం చేస్తారా ?


దేశంలోని హిందువులను అక్బర్ అంతం చేస్తారా ?

జస్టిస్ ఎల్ నర్సింహడ్డి , ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి

నమస్తే తెలంగాణ వార్త (10-01-2013)
సేకరణ:వనం జ్వాలా నరసింహారావు

ముస్లింలందరూ ఇదే కోరుతున్నారని అనుకుంటున్నారా?; ఆయన కుటుంబానికి దేశం ఎంతో చేస్తే.. దేశంపై ఆయన విద్వేషం చూపుతారా?; ఎంఐఎం ఎమ్మెల్యేకు హైకోర్టు ఘాటు ప్రశ్నలు; దాడి జరిగితే అక్బర్‌ను కాపాడింది పోలీసులే; వారిని పక్కనపెడితే ప్రతాపం చూపిస్తారా?; మీకు రక్షణ ఇస్తున్నది వారేనని మరిచారా?; చర్యకు ప్రతి చర్య అన్నదాంట్లోనే సమాధానాన్ని గుర్తించలేదా?; అక్బర్ తరపు లాయర్‌ను నిలదీసిన న్యాయస్థానం; దేశంలో నమోదయ్యే కేసులపై హైకోర్టుకు ఎందుకు వచ్చారు?; ఇతర రాష్ట్రాల కేసుల్లో హైకోర్టు ఎలా జోక్యం చేసుకుంటుంది?; ఎఫ్‌ఐఆర్‌ల నమోదులు ఆపాలన్న పిటిషన్ స్వీకరిస్తూ వ్యాఖ్యలు; ప్రతివాదులకు నోటీసులు.. విచారణ వాయిదా.

దేశాన్ని, ఒక మతాన్ని కించపరిచే విధంగా ప్రసంగాలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రసంగాలపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన శాసనసభ్యుడి హోదాలో ఉండి విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలను చేయడం ఏ మేరకు సబబని ప్రశ్నించింది. గంటో అరగంటో పోలీసులు రోడ్లపైకి రాకుండా ఉంటే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో తెలుసా? అని కోర్టు నిలదీసింది. పదిహేను నిమిషాలు సమయం ఇస్తే హిందువులను అంతం చేయాలని అక్బరుద్దీన్ అనుకుంటున్నారా? దేశంలోని ప్రతి ముస్లిం వ్యక్తి ఇదే అభివూపాయంతో ఉన్నారని ఆయన అనుకుంటున్నారా? అని ఘాటుగా ప్రశ్నించింది. నిజామాబాద్, నిర్మల్‌లో అక్బరుద్దీన్ చేసిన ప్రసంగాలపై దేశవ్యాప్తంగా పలు పోలీస్‌స్టేషన్లు, కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలవుతుండటంపై అక్బరుద్దీన్ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు.

ఇదే అంశంపై ఇప్పటికే పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదైనందున, మరిన్ని పోలీస్‌స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయకుండా పోలీసులకు ఆదేశాలు జారీచేయాలంటూ తన పిటిషన్‌లో కోరారు. దీనిపై బుధవారం జస్టిస్ ఎల్ నర్సింహడ్డి ఆధ్వర్యంలోని ఏకసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అక్బరుద్దీన్ తరపున మాజీ అడ్వకేట్ జనరల్ డీవీ సీతారామమూర్తి వాదనలు చేపట్టారు. ఇప్పటికే నిజామాబాద్, నిర్మల్ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని తెలిపారు. మున్ముందు ఇదే ప్రసంగాలపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని అభ్యర్థించారు. దీనిపై న్యాయస్థానం జోక్యం చేసుకుంటూ దేశవ్యాప్తంగా నమోదు అయ్యే కేసులపై హైకోర్టును ఆశ్రయించడం ఏమిటని వ్యాఖ్యానించింది. ఇతర రాష్ట్రాల్లో కేసుల నమోదు విషయంలో రాష్ట్ర హైకోర్టు ఎలా జోక్యం చేసుకుంటుందని వివరణ అడిగారు. రాష్ట్ర హోంశాఖ తరఫు న్యాయవాది వాదనలు చేస్తూ ఢిల్లీలో సైతం అక్బరుద్దీన్‌పై కేసులు నమోదయ్యాయని తెలిపారు.


విచారణ సమయంలో అక్బరుద్దీన్ తరపు న్యాయవాదిని ఉద్దేశించి జస్టిస్ ఎల్ నర్సింహడ్డి ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. అక్బరుద్దీన్ ప్రసంగాలను యూ ట్యూబ్‌లో వీక్షించామని న్యాయమూర్తి అన్నారు. ప్రసంగంలో అక్బరుద్దీన్ దిగజారి మాట్లాడారని కోర్టు వ్యాఖ్యానించింది. దేశాన్ని ‘అరే హిందుస్థాన్..’ అంటూ ప్రసంగించడం ఏ విలువలకు నిదర్శనమని కోర్టు ప్రశ్నించింది. ‘ఆయన తండ్రి సలావుద్దీన్ ఒవైసీని, సోదరుడు అసదుద్దీన్‌ను పలుమార్లు ఎంపీగా ఎన్నుకున్నారు. అక్బర్‌ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. అలాంటి బాధ్యతాయుతమైన హోదాలో ఉండి దేశాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యానించడమేమిటి? ఇదేనా దేశానికి ఇస్తున్న గౌరవం?’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు.

‘అక్బరుద్దీన్ తండ్రి సలావుద్దీన్ ఎంఐఎం తరఫున హైదరాబాద్‌కు మొదటి మేయర్‌గా ఆలంపల్లి పోచయ్య, రెండవ మేయర్‌గా సత్యనారాయణను చేశారు కదా? అలాంటి కుటుంబంలోని వ్యక్తి ఒక వర్గంపై విద్వేష వ్యాఖ్యలు చేయడమేమిటి?’ అని నిలదీశారు. రాముని తల్లి కౌసల్యను ఉద్దేశించి అక్బర్ తప్పుడు వ్యాఖ్యలు చేశారని అన్నారు. కౌసల్య ఎక్కడెక్కడ తిరిగి రామునికి జన్మనిచ్చావు? (కౌసల్య.. కహా కహా ఫిర్‌కే రామ్‌కో జన్మ్ దియా?) అని చేసిన ప్రసంగాలు ఏమిటన్నారు? ఒక రాముని తల్లిని ఉద్దేశించి వ్యాఖ్యలను చేసిన వ్యక్తి తరపున మరో సీతారాముడు కేసు వాదనలు చేయడం ఆల్‌మైటీకి నిదర్శనమన్నారు. (అక్బరుద్దీన్ తరపున పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది రామచంద్ర రాజు కాగా, వాదనలు వినిపించేందుకు వచ్చిన న్యాయవాది పేరు సీతారామమూర్తి. సీతారామమూర్తిని ఉద్దేశించి న్యాయస్థానం ఈ మేరకు వ్యాఖ్యానించింది) ప్రసంగంలో ఒక చోట దేశంలో చార్మినార్, కుతుబ్ మీనార్, తాజ్‌మహల్‌ను తీసుకెళ్లితే హిందుస్థాన్‌లో ఇంకేం మిగులుతుంది? కూలిపోయిన (టూటే పూటే రామ్‌కీ మందిర్) రాముని ఆలయాలు తప్పితే అనడం దేనికి ఔచిత్యమని కోర్టు ప్రశ్నించింది.

‘పోలీసులను 15 నిమిషాలపాటు పక్కనపెడితే మరో వర్గాన్ని అంతం చేస్తామని అన్నారు కదా? మరి అక్బరుద్దీన్ సైతం పోలీసులు రక్షణలో ఉన్నారని మరిచారా? గతంలో ఆయనపై దాడులు జరిగిన సమయంలో పోలీసులే ఆయనను రక్షించారనే విషయాన్ని మరిచారా? గతంలో ఆయనపై దాడులు జరిగి ఆస్పత్రి పాలైన సమయంలో పార్టీలకు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఆయన కోలుకోవాలని ప్రార్థనలు చేశారు కదా?’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ‘అక్బరుద్దీన్ ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని విన్నాను. అలాంటి వ్యక్తి ప్రతి ఒక్కరినీ అంతమొందించాలని అనుకుంటున్నారా?’ అని ప్రశ్నించారు. మతసామరస్యానికి ప్రతీకలుగా తన అనుభవంలోకి వచ్చిన కొన్ని ఉదాహరణలు చెబుతూ ‘గతంలో గుంటూరులో జరిగిన ఒక సాంస్కృతిక కార్యక్షికమానికి ముఖ్య అతిథిగా వెళ్లిన సమయంలో దాశరథి శతకం వ్యాఖ్య పోటీల్లో ఒక ముస్లిం అమ్మాయి మొదటి బహుమతిని గెలిచింది. అయితే మొదటి బహుమతిగా నిర్వాహకులు రాముని ఫోటోను తెచ్చారు. 

ముస్లిం యువతి కావడంతో బహుమతిగా వేరే వస్తువును తీసుకోవాలని నిర్వాహకులు చెప్పారు. కానీ అమ్మాయి, అమ్మాయి తల్లి ఇద్దరు సైతం ముస్లింలు అయినప్పటికీ, రాముని ఫోటోనే బహుమతిగా కావాలని చెప్పారు’ అని తెలిపారు. అలాంటి మతసామరస్యం గల ఈ దేశంలో అక్బరుద్దీన్ వ్యాఖ్యలు చేయడమేమిటన్నారు. ఇంకో కార్యకమంలో సాగర సంగమం సినిమాలోని ఓం నమశ్శివాయః పాటకు వాహెద్ అనే కుర్రాడు అద్భుతమైన సంగీతాన్ని లైవ్‌గా ఇస్తూంటే తనకే ఆశ్చర్యం వేసిందని జస్టిస్ ఎల్ నర్సింహడ్డి అన్నారు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్‌లాంటి మహనుభావులు ఉన్న దేశంలో, దేశంపై, ఒక వర్గంపై విద్వేష వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అక్బరుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించి, ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

(నమస్తే తెలంగాణ దిన పత్రికలో వచ్చిన వార్త యధాతధంగా బ్లాగ్ రీడర్స్ సౌకర్యం కొరకు పొందుపరుస్తున్నానిక్కడ-వనం జ్వాలా నరసింహారావు)

Saturday, January 5, 2013

ధరమ్ తల్లా కామేలా: వనం జ్వాలా నరసింహారావు


ధరమ్ తల్లా కామేలా
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్ర జ్యోతి ఆదివారం సంచిక (17-02-1991)

          కార్య నిర్వాహక కమిటీ అనేదేమీ లేకుండా, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వారి అనుమతి కోరాల్సిన అవసరం కలగకుండా, ఎన్నో సంవత్సరాలుగా సాగుతున్నది, ఓ అప్నా ఉత్సవ్ కార్యక్రమం, కలకత్తా నగరంలో. "ధరమ్ తల్లా కామేలా" గా పిలువబడే ఈ కార్యక్రమంపై కొన్నేళ్ల క్రితం తీసిన డాక్యుమెంటరీని, బెర్లిన్‌లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు కూడా.

          కలకత్తాలోని ప్రసిద్ధి పొందిన షాహీద్ మీనార్ పక్కనున్న విశాలమైన మైదానంలో, అశేష జనాన్ని ప్రతి ఆదివారం ఆకట్టుకుంటున్న ఈ మేళాలో జాతకాలు చెప్పటంతో పాటు, మాజిక్ షోలు, సర్కస్ ఫీట్లు కూడా వుంటాయి. చౌరంగీ రోడ్డులో వున్న ఫైవ్ స్టార్ హోటల్ ఒబెరాయ్ గ్రాండ్ కు కూత వేటు దూరంలో వున్న ఈ మైదానంలో జరుగుతుండే ఈ కార్యక్రమాన్ని తిలకించే వారిలో ఎక్కువమంది చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే మధ్య తరగతి వారు, బీద వారు, వారితో పాటు విదేశీ యాత్రికులూ.

          ఈ ప్రదర్శనలో ముఖ్యమైనవి: "ముఖ్తార్, ఎఖ్తార్" అనే బాలురు తమ తలలను భూమిలో గొంతు వరకు పూడ్చుకుని వూపిరాడకపోయినా జీవించి వుండడం; మరో బాలుడు "శిభు" బాలెన్సింగ్ కడ్డీతో జరిపే అద్భుత విన్యాసాలు; ధనీరామ్ పూల్ మతీ అనే జంట కలిగించే వినోదం; వీరి పిల్లలు "మున్నీ, శారద" లు రష్యన్ నాట్య కారిణుల మోస్తరులో చేసే డాన్సులు; "మోతీ" అనే కుక్క ఒక్కో డబ్బా ఎక్కుతూ, నాలుగు కాళ్లపై, ఆఖరు డబ్బాపై కూర్చోడం వున్నాయి.

          ఇక్కడే మరో పక్క, రాజస్థాన్‌లోని ఓ కుగ్రామానికి చెందిన దేవే సింగ్ అనే వ్యక్తి, మొసలి మాంసంతో తయారు చేసిన, పచ్చ రంగు ద్రావకాన్ని, సర్వరోగ నివారిణిగా, కావాల్సిన వారికి కేవలం ఐదు రూపాయలకే అమ్ముతాడు. అయితే జబ్బు నయం అయిన తరువాతే డబ్బులివ్వవచ్చు.

          ఇంకో పక్క జాతకాలు చెప్పేవారు, వారి మధ్యన అండమాన్ నుంచి తెచ్చిన గవ్వలు అమ్మే బి. సి. రాయ్, మరి కొంచెం దూరంలో రామ్ ధన్ కుక్క మోతీ చేసే ఫీట్లు దర్శనమిస్తాయి.

          సంపాదన విషయానికొస్తే, రామ్ ధన్‌కు గిరాకీ రోజుల్లో వంద రూపాయల దాకా వస్తే, మిగతా వారికి అందులో సగం కాని, కొంచెం తక్కువ కాని లభిస్తాయి. చూడడానికి వచ్చే వారందరూ డబ్బులిచ్చే వేళకు మెల్లగా జారుకుంటారు. పోలీసోళ్ల మామూలు సరేసరి!

          (21 సంవత్సరాల క్రితం ఆంధ్ర జ్యోతి ఆదివారం సంచికలో రాసిన వ్యాసం ఇది)

Thursday, January 3, 2013

క్యాబరే డాన్సర్: వనం జ్వాలా నరసింహారావు


క్యాబరే డాన్సర్
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్ర జ్యోతి ఆదివారం సంచిక (28-04-1991)

          "బాబ్ ఫాసీ తాను నిర్మించిన ’క్యాబరే’ సినిమాలో ఒక పాటను, హాస్యంతో కూడిన వెకిలి చేష్టగా చిత్రీకరించాడు. హిందీ సినిమాలనో, లేక, సెక్స్ ప్రధానమైన ఇతర చిత్రాలనో, ఆదర్శంగా తీసుకొని, సంగీతానికి అనుగుణంగా, వికారంగా నృత్యం చేస్తూ, ఒకటి వెంబడి ఇంకొకటి దుస్తులను శరీరంపై నుంచి తొలగిస్తూ, అవయవ ప్రదర్శన చేస్తున్నారు ఈ నాటి క్యాబరే డాన్సర్లు"-ఎడిటర్

          బొంబాయి నగరంలో సాగుతున్న క్యాబరే డాన్సులు, కోర్టుల తీర్పులకు లోబడే జరుగుతున్నాయి. "సాధన" అనే ఒక క్యాబరే డాన్సర్‌ను, న్యూఢిల్లీలోని ఒక రెస్టారెంటులో నృత్యం చేస్తున్నప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్సును, డాన్స్ ద్వారా ప్రదర్శించే తన హక్కుకు భంగం కలగకుండా చూడాలని, ఆమె హైకోర్టులో దావా వేసింది. మానసిక వత్తిడులకు గురవుతున్న పురుషులు వ్యభిచారానికి దాసులు కాకుండా, ఉత్తేజ పరిచేది, ఈ క్యాబరే వినోదమని క్లబ్ యజమాని సాధనను సమర్థించాడు. వినోదం కొరకు, అసభ్య ప్రదర్శన అని తెలిసి కూడా వ్యక్తులు ఇష్ట పూర్వకంగా క్లబ్‍లకు వెళ్తున్నారు కాబట్టి, ఇది న్యాయ సమ్మతమేనని కోర్టు తీర్పిచ్చింది.

          అందుకే నెలకు నాలుగు నుంచి ఎనిమిది వేల దాకా సంపాదిస్తున్న బొంబాయి క్యాబరే డాన్సర్లు సాధనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. కోర్టు ఉత్తర్వులను అడ్డుబెట్టుకొని, బొంబాయి నగరంలో క్యాబరే క్లబ్బులు డబ్బు చేసుకోవడం మొదలు పెట్టాయి. ఆస్కార్ హోటెల్ యజమాని దిలీప్ చాందీరామ్ దత్వాని, తన హోటల్‌పై పోలీసులు దాడి జరిపితే కోర్టును ఆశ్రయించాడు. ఐపిసి 294 సెక్షన్ క్రిందకు ఇది రాదనీ, క్యాబరే డాన్స్ అసభ్యంగా వున్నప్పటికీ అది చూసేవారికి ఇబ్బంది, చీకాకు కలిగించనంతవరకు న్యాయ సమ్మతమేనని, న్యాయ మూర్తి శరద్ మనోహర్ తీర్పు ఇచ్చారు.

          ఇంకేముంది.....సాలీ, రీటా, అనితా...ఇలా ఎంతో మంది హొయలొలుకుతూ రంగ ప్రవేశం చేశారు. నైట్ క్లబ్బులపై పోలీసు దాడులు ఆగిపోయాయి. వీరి డాన్సులు ప్రేక్షకులకు ఇబ్బంది, చీకాకు కలిగించినా, అది వారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.

          కర్నాటక, మద్రాస్, హైదరాబాద్ నగరాల నుంచి బొంబాయికి చేరుకుని క్యాబరే డాన్సులు చేస్తున్న అమ్మాయిలు ఈ వృత్తికి చెడ్డ పేరు తెస్తున్నారని పాతకాలం నాటి వారంటున్నారు. నెలకో ఆరు వేలు ఇస్తే సంతోషంతో దుస్తులు ఇప్పి డాన్సులైతే చేస్తున్నారు కాని, ఆ డాన్సును సరిగ్గా వారు అభ్యసించడం లేదని వీరి అభిప్రాయం.

          తమకు లభిస్తున్న జీతంలో మిగిలేదెంత? అని క్యాబరే డాన్సర్లు వాపోతుంటారు. మేకప్‌కు, తాగుడుకు, దుస్తులకు ఖర్చు చేయడంతో పాటు, నెల నెలా ఉద్యోగాన్వేషణలో వుండాల్సిందే వీరు. వంట్లో నలతగా వున్నా శెలవు దొరకదు. భద్రత అసలే లేదు. యజమానులు, క్లబ్‌లు మారినా, అక్కడకు వీరిని చేర్చే మధ్య దళారులు-పింపులు మాత్రం మారరు. వారిని వదుల్చు కోవడం కూడా చాలా కష్టం. నియమనిబంధనలు, ప్రవర్తనావళి సరేసరి.

           అంధేరీలోని నైట్ క్వీన్, కొలాబాలోని బ్లూనైల్, ఘట్ కోపర్ లోని మేఘరాజ్, బాంద్రాలోని నంది, బొంబాయిలోని పేరొందిన నైట్ క్లబ్బులు. మేఘరాజ్ తప్ప మిగిలినవన్నీ వికారం పుట్టించే ప్రదేశాలే. కేవలం 150 చదరపు అడుగుల హాలులో, 35 నుంచి 40 మంది వరకూ వుంటారు.

          ఇటీవల కాలంలో క్యాబరే డాన్సర్లు కూడా కొంత పుంతలు తొక్కుతున్నారు. దుస్తులు విప్పి వేస్తూ, భారత దేశపు సాంప్రదాయ నృత్యాలు చేస్తున్నారు నేటి క్యాబరే డాన్సర్లు.

          బొంబాయిలో లైసెన్సులున్న వి 60, లేనివి 30 వరకు నైట్ క్లబ్‌లు నడుస్తున్నాయి.

          "ఏంజిల్, డాన్స్, వైన్" అనే కార్యక్రమంతో, నారి మన్ పాయింట్ లోని సోనియా మహల్ లో తెల్లవార్లూ ఆటా-పాటా కొనసాగుతుంది. రాత్రి ఎనిమిదయిందంటే అటుగా వచ్చే టాక్సీలకు అంతుండదు. వినోదంతో పాటు, చైనా-భారత దేశపు వంటకాలు ఇక్కడ రుచి చూపిస్తారు. రు. 80 లు ఖర్చు పెడితే, మెత్తటి కుర్చీతో పాటు, చెవులు మారు మ్రోగే హిందీ పాటలు వినవచ్చు. షఫాన్, సాటిన్ దుస్తుల్లో అక్కడ కూర్చున్న వారి చుట్టూ క్యాబరే డాన్సర్లు తిరుగుతుంటారు. ఆ హోటల్ యజమాని గగన్ దాస్ వధ్వానీ దృష్టిలో ఈ కార్యక్రమం "ముజ్రా" లాంటిది. డాన్సర్లు నవాబీ కుటుంబాలకు చెందినవారని ఆయన చెప్తుంటారు. అక్కడ కొచ్చి, పీకల దాకా తాగి, వళ్లు మర్చిపోయి, డాన్సర్ల మెడలో కరెన్సీ నోట్ల దండలు వేస్తుంటారు "కస్టమర్స్". ప్రతిఫలంగా వారి నుంచి ఓ ముద్దో, వారి చేత్తో తమ జుట్టును సవరింపచేసుకోవడమో వీరు పొందుతారు.

          క్యాబరే డాన్సర్లను ప్రతివారూ చిన్న చూపే చూస్తారు. తాము సాంప్రదాయ కుటుంబాలకు చెందిన వారమని వీరు చెప్తుంటారు. తమ తాత ముత్తాతలు ఏ నవాబ్ లనో, లేక, లక్నో రాజనో కూడా వీరంటారు. నిజానికి వీరిలో చాలామంది ఫోరాస్ రోడ్డులోని నూటికి పైగా వున్న కోఠాల కుటుంబానికి చెందినవారే.

          క్యాబరే డాన్సులుగా భారతీయ సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శించబడుతున్నప్పటికీ దుస్తులను తొలగించే ప్రక్రియ మాత్రం ఆగిపోయే సూచనలేవీ కనబడడం లేదు. క్యాబరే డాన్సులు ఆపు చేసే అవకాశం కూడా లేదు. అనాదిగా వస్తున్న ఓ కామ క్రీడ ఇది. పురుషులకు ఓ సెక్సువల్‌ థ్రిల్ కావాలి.

          క్యాబరే డాన్సులు ఎందుకు చూడాలి? అని అడిగితే, ఓ పెద్ద మనిషిచ్చిన సమాధానం: "చూసినంత సేపు ఉల్లాసంగా వుంటుంది. అయిపోయింతర్వాత కూడా ఆ డాన్సర్ గురించే ఆలోచన చేస్తాం. చివరకు ఆ క్యాబరే ఓ జ్ఞాపకంలాగా మనస్సులో మిగిలి పోతుంది".  

క్యాబరే డాన్సర్లకు, ప్రదర్శనకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రవర్తనా నియమావళి

·       అర్ధనగ్నంగా వున్న స్త్రీల ఫొటోలను క్లబ్ బయట ప్రదర్శించరాదు
·       అలాంటి ఫొటోలను పత్రికల్లో ప్రచురించరాదు
·       అసభ్య పదజాలంతో పత్రికల్లో క్యాబరే డాన్సుకు సంబంధించిన ప్రకటనలు ఇవ్వకూడదు
·       కార్యక్రమానికి నిర్దేశించిన ప్రత్యేక స్థలంలోనే డాన్సర్లు ప్రదర్శనలివ్వాలి
·       క్లబ్‌కు వచ్చే వ్యక్తులతో డాన్సర్లు కలిసి మెలిసి వుండరాదు
·       డాన్సర్లు, కస్టమర్ల తొడలపై కూచోడం నిషేధం
·       తమ శరీరాన్ని డాన్సర్లు తాకనీయకూడదు
·       చూపుల ద్వారా క్లబ్‌కు వచ్చిన వ్యక్తులను ఆకర్షించుకునే సూచనలివ్వరాదు
·       డాన్సర్లు ప్రదర్శనలోనూ, ప్రవర్తనలోనూ అసభ్యంగా వ్యవహరించకూడదు

యజమానికి - డాన్సర్‌కు మధ్య ఒప్పందం వివరాలు

·       దుస్తులు, మేకప్, ఇతర ఖర్చులు డాన్సరే భరించాలి
·       క్రమశిక్షణతో మెలిగి యజమానికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడాలి
·       రోజుకు మూడు, శని-ఆది వారాలలో నాలుగు ప్రదర్శనలివ్వాలి
·       పల్చటి దుస్తులు ధరించడం కాని, దుస్తులు విప్పి వేసే ప్రదర్శన చేయడం కాని జరుగ రాదు. పరిమితులకు లోబడి దుస్తులు తీసివేయడం ఆమె చేయాలి. డాన్సుకు నిర్దేశించిన స్థలానికే ఆమె పరిమితం కావాలి. జిల్లా మెజిస్ట్రేట్ వుత్తర్వులకు లోబడి మాత్రమే ఆమె డాన్స్ చేయాలి. హద్దు మీరితే కలిగే నష్టాన్ని ఆమే భరించాలి
·       ఇతర వుద్యోగులతో కలిసి మెలిసి వుండరాదు. అర్థరాత్రి దాటాక ఆమె నివాసంలో ఆతిథ్యం ఇవ్వడం కాని, లేక, బయటకు వెళ్లి రావడం కాని వీల్లేదు. తాగిన మైకంలో వచ్చినా, వేరే చోట అనుమతి లేకుండా ప్రదర్శన ఇచ్చినా రు. 500 లు అపరాధ రుసుం చెల్లించాలి
·       అనుకోని పరిస్థితుల్లో క్యాబరే డాన్సులు నిర్వహించకపోతే, ఒప్పందం రద్దవుతుంది. యజమాని ఎటువంటి నష్ట పరిహారం చెల్లించనవసరం లేదు.

చీకట్లో నృత్యం

          "మీరా నాయర్" నిర్మించిన డాక్యుమెంటరీ "ఇండియా క్యాబరే" లో నటించి, పేరు ప్రఖ్యాతులు గడించిన "రేఖ" కు ఆ ఆనందం ఎంతో కాలం వుండలేదు. తిరిగి తన "చీకట్లో నాట్యం" చేసే వృత్తికే చేరుకుందామె.


          మరింత సంపాదించాలని హైదరాబాద్ నుంచి బొంబాయికి చేరుకున్న "రేఖ" కు ఉద్యోగంతో పాటు "సలాం బాంబే" ఫేమ్, "మీరా నాయర్" తో పరిచయం కూడా కలిగింది. సంప్రదాయంగా, గౌరవంగా బ్రతికే స్త్రీలకు-క్యాబరే డాన్సర్లకు గల తేడాను విశదీకరించే చిత్రం ఇది. క్యాబరే డాన్సర్ల ఫ్లాష్ బ్యాక్ జీవితం, వారెందుకు ఈ వృత్తి చేపట్టిందీ, వారెవరివల్ల మోసపోయిందీ చెప్పడంతో ప్రారంభమవుతుందీ చిత్రం.

          హఠాత్తుగా భర్త వదిలి పెట్టడంతో, బెంగుళూరులో క్యాబరే డాన్సర్‌గా చేరి, ఆ తరువాత బొంబాయికి చేరుకుంది రేఖ. "సార్ మంచి జీతం ఇచ్చి, వుండడానికి ఇల్లు కూడా ఏర్పాటు చేశారు" అని మేఘరాజ్ హోటల్ యజమానిని గురించి చెప్తుంది రేఖ. తమని వ్యభిచారిణులుగా ముద్ర వేయడం తప్పని, తనను ఏ కస్టమర్ అయినా అలా కోరితే, "రాంగ్ నంబర్" అని సమాధానం ఇచ్చే దాన్ననీ రేఖ తెలియచేసింది.

          రేఖ బీచ్‍లో పడుకున్న సీన్‌తో ముగుస్తుంది చిత్రం. సినిమాల్లో నటించడం ద్వారా తనకేం తృప్తి కలిగిందో రేఖకే తెలియదు. మరికొన్ని చిత్రాలలో నటించమని ఆమెకు అవకాశాలు కూడా వచ్చాయట. మొత్తానికి పాపులర్ అయితే అయింది. మూడేళ్ల సినిమా జీవితం తరువాత తిరిగి తన ప్రపంచంలోకి వచ్చి చేరింది. మేఘరాజ్‍లో డాన్స్ చేయసాగింది. "సముద్రంలో ఈత కొట్టడం ద్వారా నా జీవన విధానంలో మార్పేమీ రాలేదు. నాకు సంబంధించినంత వరకు, ప్రేక్షకుల కొరకు దుస్తులు విప్పేసిన నాడే, నాలో జ్ఞానోదయం కలగడం ప్రారంభమైంది" అని అంటూ రేఖ, సంఘం గీచిన హద్దులకు ఆవలి పక్కన వున్న మనుషులు, జన జీవన స్రవంతిలో చేరడం జరగని పని అని తేల్చి చెప్పింది.

          ఇదేం పట్టనట్లు, మీరా నాయర్ మాత్రం తన తదుపరి చిత్రం "మిస్సిసిప్పి మసాలా" నిర్మాణంలో నిమగ్నమయ్యారు.

          (21 సంవత్సరాల క్రితం ఆంధ్ర జ్యోతి ఆదివారం సంచికలో వచ్చిన వ్యాసం ఇది)


Wednesday, January 2, 2013

పెళ్లికాని తల్లి: వనం జ్వాలా నరసింహారావు



పెళ్లికాని తల్లి
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్ర జ్యోతి ఆదివారం సంచిక (21-4-1991)

          అత్యంత గౌరవ ప్రదమైన, అతి విలువైన మాతృత్వం, చట్టం ఆమోదం లేకపోతే, స్త్రీ జీవితం ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. ఇక అప్పటి నుంచి మొదలవుతాయి, ఆ అవివాహిత తల్లికి ఎన్నో చిక్కులు.

          మన దేశంలో ఎక్కువ శాతం పురుషులు వివాహానికి పూర్వమే సెక్స్ అనుభవం పొందుతున్నారని, మహిళలలో ఈ సంఖ్య తక్కువేనని ఓ అధ్యయనంలో వెల్లడైంది. క్యూరియాసిటీతో, సమ వయస్కులతో, తోటి వారితో ఇలాంటి అనుభవాలను చవి చూస్తున్నారు నేటి యువత.

          చట్ట వ్యతిరేకంగా పుట్టిన పిల్లలే పలు రకాలుగా "దత్తత" కు గురవుతున్నారు. మామూలుకంటే, వీరిలో చనిపోయేవారి సంఖ్య కూడా ఎక్కువే! బ్రతికిన వారిలో పలువురు బాల నేరస్తులుగా చలామణి అవుతుంటారు. వివిధ కారణాల వల్ల, పెళ్లి కాని తల్లులు, తమకు తెలియకుండానే, పిల్లల ఆరోగ్య సంక్షేమ పథకాల అమలుకు ఒక సవాలుగా తయారవుతున్నారు.

          సమాజం అంటే వున్న భయం వల్ల, పెళ్లికాని స్త్రీ తాను గర్భం ధరించిన విషయాన్ని గోప్యంగా వుంచే ప్రయత్నం చేస్తుంది. ఇంత జరిగాక, తాము ఇంక అదనంగా పోగొట్టుకునేదేంటిలే అనే భావన వారిలో కలుగుతుంది. చెడిపోయిన తమకు, ఈ సమాజం ఆశ్రయం ఇవ్వదని వారు భయపడుతారు. మనముంటున్న ఈ సమాజంలోని పలువురు వ్యక్తులు కూడా, పెళ్లి కాకుండా తల్లి ఐన స్త్రీని, ఘోరాతి ఘోరమైన పాపం చేసినట్లు, అది క్షమార్హం కాని నేరమైనట్లు, వేలెత్తి చూపుతారు. దీనికి పురుషుడి బాధ్యత కూడా సమానంగా వున్నదనే విషయాన్ని మర్చిపోతారు వీళ్లు.


          పెళ్లికాని తల్లుల సంఖ్య ఇద మిద్ధంగా చెప్పడం కష్టం. కారణం అతి రహస్యంగా వుంచడమే. కనీసం ఆసుపత్రుల నుంచి కూడా సరైన సమాచారం లభ్యం కాదు. అందుకే, శాస్త్రీయ పద్ధతులలో సమస్యను అధ్యయనం చేయడం తేలికైన విషయం కాదు.

          వివాహానికి పూర్వమే గర్భిణీ కావడానికి ఎన్నో కారణాలుండవచ్చు.

          తల్లిదండ్రులకు-పిల్లలకు, మధ్య చీకాకు కలిగించే పరిస్థితులు నెలకొన్నప్పుడు, తల్లిదండ్రుల వైవాహిక జీవితం ఒడిదుడుకుల్లో వున్నప్పుడు, తల్లిదండ్రుల ప్రేమాభిమానాలకు దూరమైనప్పుడు. సెక్సులో పాల్గొనడం ఒక ఉపశమనంగా భావించి, సంతోషం పొందవచ్చు. ఇక ఆ తర్వాత జరిగేది మామూలే! మాన మర్యాదలు పోయాయన్న దిగులుతోను, పెళ్లి కాదన్న భయం తోనూ, చదువు మానేయాలని, ఉద్యోగం దొరకదన్న దిగులుతోనూ, అమ్మాయిలు కృశించి పోతారు.

          పెళ్లికాని స్త్రీ గర్భిణీ అయితే, పర్యవసానాలు వివిధ దృక్కోణాల నుంచి చూడాల్సి వస్తుంది. తల్లి అయింతర్వాత, తాను కోరుకొనని బిడ్డకు పోషణ బాధ్యత వహించాలి. భద్రత కరువై, సంఘానికి బెదురుతూ బ్రతకాలి. గర్భిణీగా పలువురికి తెలియకూడదని మొదట్లో రహస్యంగా వుంచడం మూలాన్నే గర్భస్రావం చేయించుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది. చివరకు గర్భ విచ్ఛిత్తికి సలిపే ప్రయత్నాలు ఫలించకపోగా, పుట్టిన బిడ్డ అంగవైకల్యంతో వుండవచ్చు. ఇవన్నీ స్త్రీని మానసికంగా, శారీరకంగా కృంగ తీస్తాయి. యుక్త వయస్సులో ఈ బాధలకు గురైన స్త్రీలు, ఆర్థిక స్వాతంత్ర్యం పూర్తిగా కోల్పోయి, చివరకు తల్లిదండ్రులకు కూడా బరువై పోయి బ్రతుకునీడుస్తుంటారు. మానసికంగా, శారీరకంగా, తల్లిదండ్రుల హింసకు గురయ్యేవారు కూడా వుంటారు. ఇక పుట్టిన బిడ్డల సంగతి కూడా బాధాకరంగానే వుంటుంది. పౌష్టికాహార లోపం కలుగ వచ్చు. వ్యాధి నివారణ చర్యలకు వారి నోచుకోరు. కుటుంబంలోని వారంతా వ్యతిరేక భావంతో చూసే ఈ పిల్లలు సంఘానికి ఒక సమస్యగా తయారవుతారు.

          ఈ "అజ్ఞాత తండ్రులు" సాధారణంగా బంధువర్గం లోని వారో, సహాధ్యాయులో, దగ్గరి వారో అయి వుంటారు. "రేప్" హీరోలు సరేసరి. పెళ్లయిన మగవారు కూడా ఈ అవకాశాలను విడిచి పెట్టరు. అదో సరదా! వీరి కోర్కెలు తీర్చుకోవడానికి స్థలాలు పుష్కలం!

          సమాజంలో విప్లవాత్మక మార్పులు రానంత కాలం ఈ దురవస్థలు తప్పవేమో!

          (21 సంవత్స్రరాల క్రితం ఆంధ్ర జ్యోతి ఆదివారం సంచికలో రాసిన వ్యాసం)