ధరమ్
తల్లా కామేలా
వనం
జ్వాలా నరసింహారావు
ఆంధ్ర జ్యోతి ఆదివారం సంచిక
(17-02-1991)
కార్య నిర్వాహక
కమిటీ అనేదేమీ లేకుండా, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వారి అనుమతి కోరాల్సిన అవసరం
కలగకుండా, ఎన్నో సంవత్సరాలుగా సాగుతున్నది, ఓ అప్నా ఉత్సవ్ కార్యక్రమం, కలకత్తా నగరంలో.
"ధరమ్ తల్లా కామేలా" గా పిలువబడే ఈ కార్యక్రమంపై కొన్నేళ్ల
క్రితం తీసిన డాక్యుమెంటరీని, బెర్లిన్‌లో జరిగిన అంతర్జాతీయ
చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు కూడా.
కలకత్తాలోని
ప్రసిద్ధి పొందిన షాహీద్ మీనార్ పక్కనున్న విశాలమైన మైదానంలో, అశేష జనాన్ని ప్రతి ఆదివారం ఆకట్టుకుంటున్న ఈ మేళాలో జాతకాలు చెప్పటంతో పాటు,
మాజిక్ షోలు, సర్కస్ ఫీట్లు కూడా వుంటాయి. చౌరంగీ
రోడ్డులో వున్న ఫైవ్ స్టార్ హోటల్ ఒబెరాయ్ గ్రాండ్ కు కూత వేటు దూరంలో వున్న ఈ మైదానంలో
జరుగుతుండే ఈ కార్యక్రమాన్ని తిలకించే వారిలో ఎక్కువమంది చుట్టుపక్కల గ్రామాల నుంచి
వచ్చే మధ్య తరగతి వారు, బీద వారు, వారితో
పాటు విదేశీ యాత్రికులూ.
ఈ ప్రదర్శనలో
ముఖ్యమైనవి: "ముఖ్తార్, ఎఖ్తార్" అనే బాలురు తమ తలలను భూమిలో గొంతు
వరకు పూడ్చుకుని వూపిరాడకపోయినా జీవించి వుండడం; మరో బాలుడు
"శిభు" బాలెన్సింగ్ కడ్డీతో జరిపే అద్భుత విన్యాసాలు; ధనీరామ్ పూల్ మతీ అనే జంట కలిగించే వినోదం; వీరి పిల్లలు
"మున్నీ, శారద" లు రష్యన్ నాట్య కారిణుల మోస్తరులో
చేసే డాన్సులు; "మోతీ" అనే కుక్క ఒక్కో డబ్బా ఎక్కుతూ,
నాలుగు కాళ్లపై, ఆఖరు డబ్బాపై కూర్చోడం వున్నాయి.
ఇక్కడే
మరో పక్క, రాజస్థాన్‌లోని ఓ కుగ్రామానికి చెందిన దేవే సింగ్ అనే
వ్యక్తి, మొసలి మాంసంతో తయారు చేసిన, పచ్చ
రంగు ద్రావకాన్ని, సర్వరోగ నివారిణిగా, కావాల్సిన వారికి కేవలం ఐదు రూపాయలకే అమ్ముతాడు. అయితే జబ్బు నయం అయిన తరువాతే
డబ్బులివ్వవచ్చు.
ఇంకో పక్క జాతకాలు
చెప్పేవారు,
వారి మధ్యన అండమాన్ నుంచి తెచ్చిన గవ్వలు అమ్మే బి. సి. రాయ్,
మరి కొంచెం దూరంలో రామ్ ధన్ కుక్క మోతీ చేసే ఫీట్లు దర్శనమిస్తాయి.
సంపాదన విషయానికొస్తే, రామ్ ధన్‌కు
గిరాకీ రోజుల్లో వంద రూపాయల దాకా వస్తే, మిగతా వారికి అందులో
సగం కాని, కొంచెం తక్కువ కాని లభిస్తాయి. చూడడానికి వచ్చే వారందరూ
డబ్బులిచ్చే వేళకు మెల్లగా జారుకుంటారు. పోలీసోళ్ల మామూలు సరేసరి!
(21 సంవత్సరాల క్రితం ఆంధ్ర
జ్యోతి ఆదివారం సంచికలో రాసిన వ్యాసం ఇది)
No comments:
Post a Comment