అనుపమ దర్శక నిర్మాత కె. బి. తిలక్
అనుభవాలు-జ్ఞాపకాలు
వనం జ్వాలా
నరసింహారావు
ఖద్దరు
దుస్తులేసుకుంటున్న ఆయన్ను కాంగ్రెసువాదన్నారు, స్వాతంత్ర్యోద్యమం రోజుల్లో ఆయన
పాల్గొన్న విధానాన్ని తెలిసినవారు ఆయన్ను మార్క్సిస్టు అన్నారు. కాదు.. కాదు... ఆయనో సినిమా మనిషన్నారు
మరి కొందరు. నిజానికి ఆయనకు అవన్నీ వర్తిస్తాయి. సీదా-సాదాగా తిరుగుతూ, అందర్నీ
పలకరిస్తూ, చిన్నల్లో చిన్నగా, పెద్దల్లో పెద్దగా మెసిలే ఆ వ్యక్తే
శ్రీ కె.బి.తిలక్.
ఆయనో
మానవతావాది. ఎక్కడ సాంఘిక దురాచారాలున్నాయో... అక్కడ
వాటికి వ్యతిరేకంగా పోరాడేవారిలో ఆయన కనిపిస్తాడు. సినీ
కార్మికుల బాధామయగాధలు విని వారి మంచికోసం రంగంలోకి దిగాడాయన.
ఎక్కడో.. పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరులో 1926లో
జన్మించిన శ్రీ తిలక్ పిన్న వయసులోనే.. చదువుకు స్వస్తి
చెప్పి.. 1939లో స్వాతంత్ర్య సంగ్రామంలో చురుగ్గా పాల్గొన్నారు. జైలు కెళ్లారు.
ఆయన.. ఆ తర్వాత కాలంలో స్వతంత్ర భారతావనిలో సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా,
అలాంటి ఇతివృత్తాలే కథావస్తువుగా పలు చిత్రాలను నిర్మించారు...
దర్శకత్వం వహించారు. ఆదుర్తి సుబ్బారావు లాంటి
ఉద్దండ సినీ దర్శకులతో అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన సినిమాల నిర్మాణ దర్శకత్వంలో కీలక
పాత్ర పోషించారు. ముద్దుబిడ్డ, ఎం.ఎల్.ఎ,
ఉయ్యాల జంపాల, భూమికోసం, కొల్లేటి
కాపురం, చోటీబహు, కంగన్ లాంటి చిత్రాల రూపకర్త ఆయన.
తిలక్ గారు జీవించి వున్న రోజుల్లో ఓ దశాబ్దంన్నర క్రితం
ఆయన జ్ఞాపకాలను గ్రంధస్థం చేసే అవకాశం నాకు కలిగింది. అలా...ఆయన్ను
గురించి ఆయన మాటల్లోనే పాఠకులకు తెలియచేసే
ప్రయత్నమే ఇది. (ఇంకా వుంది)
No comments:
Post a Comment