Sunday, September 6, 2015

వాల్మీకి రామాయణంలో ఏముంది ? By వనం జ్వాలా నరసింహారావు

వాల్మీకి రామాయణంలో ఏముంది ?
వనం జ్వాలా నరసింహారావు
నవ తెలంగాణ దినపత్రిక : (7-9-2015)

వాల్మీకి బోయవాడేనా ? అన్నశీర్షికన డాక్టర్‌ కదిరి కృష్ణ నవ తెలంగాణలో రాసిన వ్యాసం ఆసక్తికరంగా వున్నదనడంలో సందేహం ఏమాత్రం లేదు. ఐతే ఆయన లేవనెత్తిన కొన్ని అంశాలకు వాస్తవానికి లోతుగా అధ్యయనం చేసిన వారికి అదే వాల్మీకి రామాయణంలో సమాధానాలు లభ్యమవుతాయి. వాల్మీకి బోయవాడా? కాదా? ఆయన బ్రాహ్మణుడా? అని ఆలోచించే కన్నా, ఆయన రచించిన రామాయణంలో ఏముంది, అది ఎందుకు అవశ్య పఠనీయం అనే అంశాలపై కొంత దృష్టి సారిస్తే, అనుమానాలన్నీ నివృత్తి అవుతాయి. అలానే,   'మానిషాద ప్రతిష్టాం త్వ...' శ్లోకం నుంచి ప్రారంభించి, ఆద్యంతం గూఢార్థాలను వెతుకుతే కాని అసలు విషయం బోధ పడదు.

వాల్మీకి రామాయణం యథా వాల్మీకంగా పూర్వ కాండలతో ఉత్తర కాండను కూడా కలిపి రచించిన ఏకైక వ్యక్తి, కడప జిల్లా ఒంటిమిట్ట వాస్తవ్యులు, వాసు దాసుగా ప్రసిద్ధికెక్కిన కీర్తి శేషులు వావివిలికొలను సుబ్బారావు గారు. రామాయణం అంటే ఏమిటివాల్మీకి రామాయణం ఎందుకు చదవాలి, అనే అంశాలను ఆయన పీఠికలో సవివరంగా వుంది. రామాయణాన్ని చక్కగా తెలిసినవారు, అర్థం చేసుకోగలిగిన వారు మాత్రమే లోకానికి అందలి విషయాలను వివరించగల సమర్థులుఅందరికీ అది సాధ్యమయ్యేది కాదు. తత్త్వమెరిగిన మహాత్ముడు వాల్మీకి మహర్షి, తను రచించిన ఆది కావ్యానికి శ్రీ రామాయణం అని పేరు పెట్టాడు. శ్రీరాముడు భగవంతుడన్న అర్థం, హారంలోని సూత్రంలాగారామాయణంలోని ఏడు కాండల్లోనూ వ్యాపించి వుంది. ఆసక్తిగా శోధించిన వారికి, పరీక్షించిన వారికి మాత్రమేవాల్మీకి రామాయణానికి, ఇతర రామాయణాలకు గల తారతమ్యంవాల్మీకి రామాయణంలోని గొప్పదనం తెలుస్తుంది.

 వాల్మీకి చరిత్ర గురించి కూడా రామాయణంలోనే ఇమిడి వుంది. సీతా రామ లక్ష్మణులు చిత్రకూటంలో వాల్మీకిని కలిసినప్పుడు ఆయనే తనగురించి ఇలా చెప్పుకున్నాడు...."రామా, నేను పూర్వం పరమ కిరాతకులతో పెంచబడ్డాను. పుట్టుకతో బ్రాహ్మణుడనైనా, ఆచార రీత్యా శూద్రుడనయ్యాను. శూద్ర స్త్రీని పెళ్లి చేసుకుని కొడుకులను పొందాను. దొంగల్లో చేరి దొంగనయ్యాను. జంతువుల పాలిటి యముడనయ్యాను. నేనున్న భయంకర అడవిలో ఓ రోజు సప్తఋషులు కనిపిస్తే, వాళ్లను దోచుకుందామని, వారివెంట పరిగెత్తాను. ’నీచ బ్రాహ్మణుడా, ఎందుకొచ్చావు?అని వారడిగారు. నాపుత్రులు ఆకలితో వున్నారు, వాళ్ల సంరక్షణ కై ఈ కొండల్లో అడవుల్లో తిరుగుతున్నాను. వాళ్ల ఆకలి తీర్చేందుకు మీదగ్గరున్నవి దోచుకుందామని వచ్చానని జవాబిచ్చాను. నన్ను ఇంటికి పోయి, నా పాపంలో కుటుంబ సభ్యులు భాగం పంచుకుంటారేమో కనుక్కుని రమ్మన్నారు మునులు. నేనొచ్చేవరకుంటామనికూడా చెప్పారు. వాళ్ల మాటలు నమ్మి ఇంటికి పోయి వారు చెప్పినట్లే నా భార్యా పిల్లలను ప్రశ్నించాను. నేను తెచ్చింది తింటామన్నారే కాని నా పాపంతో సంబంధం లేదన్నారు. వెంటనే మునుల వద్దకు పరుగెత్తుకుని పోయి, వాళ్ల పాదాలపై పడి నన్ను రక్షించమని కోరాను. ఈ బ్రాహ్మణాధముడికి మోక్ష మార్గం ఉపదేశిద్దామని తలచిన వారు రామనామాన్ని తలకిందులు చేసి, వాళ్లు మరల వచ్చే వరకు, ’మరా మరాఅని ఎల్లవేళలా జపించమని ఆదేశించి పోయారు. ఆ విధంగానే సర్వ సంగ విహీనుడనై, నిశ్చలుడనై దీర్ఘకాలం జపించాను. నాపైన పుట్ట పెరిగింది. నా తపోబలంతో, నేనక్కడ నాటిన దండమే వృక్షమయింది. ఇలా వేయి యుగాలు గడిచిపోయాయి. ఋషులు మళ్లా వచ్చి లెమ్మని పిల్చారు. పుట్టనుండి బయట కొచ్చిన నన్ను చూసిన మునులు నన్ను మునీశ్వర వాల్మీకీ అని పిలిచారు. నాకది రెండవ జన్మన్నారు". అని చెప్పాడు వాల్మీకి. కదిరి గారు రాసినట్లు రామాయణంలో వాల్మీకి బోయవాడని ఎక్కడా చెప్పబడలేదు. దాంట్లో తప్పేం లేదు కూడా. ఇక రామాయణం విషయానికొస్తే....

వాల్మీకి, రామాయణం రాయడానికి ముందర ఒక నాడు తమసా నదిలో స్నానం చేస్తున్న సందర్భంలోఆయన కంటికి సమీపంలోమనోహరంగా కూస్తూవియోగం సహించలేని క్రౌంచ పక్షుల జంట కనిపించిందిఆ సమయంలోతాను చూస్తున్నానన్న లక్ష్యం కూడా లేకుండాసహజంగా జంతువులను హింసించే స్వభావమున్న బోయవాడొకడురెండు పక్షులలో మగదాన్ని బాణంతో చంపి నేల కూల్చాడుక్రూరుడైన బోయవాడిపై దయ వీడి శపించాడు వాల్మీకి.సంస్కృత రామాయణంలో ఆ శ్లోకం ఇలా వచ్చింది వాల్మీకి నోట:

"మానిషాద ప్రతిష్ఠాం త్వమగ మ శ్శాశ్వతీ స్సమాః
యత్క్రౌంచ మిథునాదేకమవధీః కామమోహితం"

ఆంధ్ర వాల్మీకి రామాయణంలో వాసు దాసుగారిలా తెనిగించారు ఆ శ్లోకాన్ని:

"తెలియు మా నిషాదుండ ప్రతిష్ఠ నీక
ప్రాప్తమయ్యెడు శాశ్వతహాయనముల
గ్రౌంచ మిథునంబునందు నొక్కండు నీవు
కామమోహిత ముం జంపు కారణమున"

శ్రీ రామాయణం మహాకావ్యంపుట్టుకతోనే కాకుండా గుణంలో కూడ అదే మొదటిదిదానిలోని గుణాలురహస్యాలు తెలుసుకోవాలంటే వాల్మీకికి గాని,  సర్వజ్ఞుడికి గాని మాత్రమే సాధ్యమవుతుందితన వర్ణనా చాతుర్యంతో వాల్మీకిపాఠకులనుతన చేతిలో బొమ్మలా చేసి,ఇష్టమొచ్చినట్లు ఆడుకుంటాడువాల్మీకి మరో ప్రత్యేకత "ఉత్ప్రేక్ష". అలానే ఆయన వాడిన శ్లేషాలంకారాలుశ్లేషాలంకారానికి చక్కటి ఉదాహరణ వాల్మీకి నోట వెలువడిన ప్రథమ శ్లోకం.

ఒక బోయవాడు క్రౌంచ మిథునంలో వున్న మగ పక్షిని చంపడంఆడ పక్షి అది చూసి దుఃఖించడంపరమ దయామయుడైన వాల్మీకి అది చూసిబోయవాడు చేసిన అధర్మ కార్యానికి కోపగించి అతడిని శపించడం జరిగిందిఆ శాపమే రామాయణ ఉత్పత్తికి కారణమైంది. దీనికి భగవత్ పరంగా ఒక అర్థం వుందిరామాయణంలోని ఏడు కాండల అర్థం-కథ ఇందులో సూక్ష్మంగా సమర్థించబడిందిశ్రీరాముడు భగవంతుడన్న అభిప్రాయం వాల్మీకి పదే పదే చెప్పుకుంటూ పోయాడు రామాయణంలో.

వాల్మీకి రామాయణమనే "కలశార్ణవంలో రత్నాలను వెదికేవారు, మొట్టమొదటగా తెలుసుకోవాల్సింది వాల్మీకి శైలి-విధానంఅది తెలుసుకోలేక వెతకడం మొదలుపెట్టితేచీకట్లో తారాడినట్లేవాల్మీకి రామాయణం "ధ్వని కావ్యం". కావ్యమంతా ధ్వన్యర్థం వుండడమే కాకుండాపలు శ్లోకాలకు విడిగా ధ్వన్యర్థం వుందిరుతు వర్ణనలలో ధ్వని స్ఫురిస్తుందిశ్రీ రామాయణంలోని కవితా చమత్కృతిని విశదీకరించాలంటే, ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.  అందువల్లేవాల్మీకి రామాయణం పారాయణం చేసేవారు, "అంగన్యాస కరన్యాసాదులతోయథావిధిగా చదివివారి వారి కోరికలు నెరవేర్చుకుంటారు. సద్భావంతో సుందర కాండ పారాయణం చేసి కార్య సిద్ధిని పొందనివారు ఇంతవరకు లేరు. గాయత్రిలోని 24అక్షరాలనుప్రతి వేయి శ్లోకాలకు ఒక అక్షరం చొప్పున శ్లోకం ఆరంభంలో చెప్పబడిందిఏడు కాండలలో ఏడు వ్యాహృతులు వివరించడం జరిగిందిఈ గాయత్రీ విధానాన్ని నారదుడే స్వయంగా వాల్మీకి మహర్షికిరామాయణంతో పాటే ఉపదేశించాడు. “తప స్స్వాధ్యాయ నిరతంతపస్వీ వాగ్విదాంవరమ్నారదం పరిపప్రఛ్చవాల్మీకిర్మునిపుంగవమ్అని గాయత్రిలోని మొదటి అక్షరంతో శ్లోకాన్ని ప్రారంభించి, "జనశ్చ శూద్రోపి మహత్త్వ మీయాత్"అని గాయత్రి కడపటి అక్షరంతో సర్గను ముగించాడు. అది భగవత్ కథ కావడానికి అదనంగా సర్వజ్ఞుడైన వాల్మీకి కూర్చిన బీజాక్షరాల మహాత్మ్యమే. శ్రీమద్రామాయణం వేదంతో సమానమైందే కాకుండా వేదమే అనాలి

గీర్వాణ భాషా గ్రంథాలలో ఆద్యమైంది శ్రీ రామాయణ కావ్యంకావ్యాలలోకెల్లా ప్రధమంగా ఉత్పన్నమైంది కావడంతో అది ఆదికావ్యమైందిమన పూర్వీకులకు తెలియని నాగరికతలు లేవువారు ఏ కారణం వల్ల ఆర్యులయ్యారుఎటువంటి గుణాలు కలిగి,ఎటువంటి మహోన్నత స్థితిలో వుండే వారువారి నాగరికత విధానం ఎటువంటిదివారి కులా చార ప్రవర్తనలెలావుండేవిరాజుకు-ప్రజలకు మధ్య ఐకమత్యం ఎలా వుండేది?భార్యా-భర్తలుసోదరులుతల్లి తండ్రులుపుత్రులు పరస్పరం ఎలా ప్రవర్తించేవారుసుఖ-దుఃఖాల విషయంలో స్త్రీ-పురుషులు ఏ విధమైన నడవడి గలవారువారికి దేవుడంటే ఎలాంటి ఆలోచన వుండేదిదైవాన్ని వారెలా ఆరాధిస్తుండే వారుఇలాంటి లౌకిక విషయాలను తెలుసుకోవాలనుకునే వారికి శ్రీ రామాయణాన్ని మించి తెలిపే గ్రంథం ఎక్కడా లేదుకాలక్షేపానికి చదవడానికైనా శ్రీ రామాయణం లాంటి పుస్తకం ఇంకోటి లేదుశ్రద్ధా భక్తులతో చదివినవారికి కల్పవృక్షంలా కోరిన కోరికలు తీర్చేదీ రామాయణమేఇహ-పర లోకాల్లో సుఖపడాలనుకునేవారికిశ్రీ రామాయణ పఠనం అవశ్య కర్తవ్యంశ్రీరామచంద్రుడు మనుష్యుడివలె నటిస్తుంటేవాల్మీకే మో వాస్థవార్థం చెప్తూఆయన సాక్షాత్తు భగవంతుడే అంటాడు.

వాల్మీకి రామాయణంలోని పాత్రలు-పాత్రధారుల వాక్కులుఆయా పాత్రల చిత్త వృత్తి గుణాలను తెలియచేసేవిగాసందర్భోచితంగావారున్న అప్పటి స్థితికి అర్హమైనవిగా వుంటాయిశ్రీమద్రామాయణం గొప్ప ధర్మ శాస్త్రంఇందులో సర్వ విధాలైనఅన్ని రకాల ధర్మాల గురించి వివరంగా చెప్పబడింది.రాజ ధర్మంప్రజా ధర్మంపతి ధర్మంసతీ ధర్మంభాతృ ధర్మంపుత్ర ధర్మంభృత్యు ధర్మంమిత్ర ధర్మం లాంటి అన్ని ధర్మాలను గురించి చక్కగా తెలుపబడి వుందిలాభ-లోభ-పక్షపాత బుద్ధి లేకుండాన్యాయం మీదే దృష్టి నిలిపి వాదించే న్యాయవాది ధర్మం కూడా చెప్పబడిందిశ్రీమద్వాల్మీకి రామాయణం మంత్రనిధానంఇందులో అనేకానేక మంత్రాలు ఉద్ధరించబడి వున్నాయి.


భగవద్గీత, శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం, శ్రీ రామాయణం భారతీయ సంస్కృతీ రూపాలు. సనాతన ధర్మ ప్రతిపాదకాలు. వీటి మౌలిక తత్వాలు ధర్మ-జ్ఞానాలు. ఈ రెండింటినీ వాచ్య-వ్యంగార్థాలతో శ్రీ మద్రామాయణం ఆవిష్కరిస్తోంది. వాల్మీకి ఆదికవి. రామాయణం ఆదికావ్యం. ఇది ధ్వని-అర్థ ప్రతిపాదిత మహా మంత్రపూతం. గాయత్రీ బీజసంయుతం. ఔపనిషతత్వసారం. స్మరణ-పారాయణ మాత్రంగా అంతఃకరణ శుద్ధి అవుతుంది. రామాయణం రసరమ్యం... ... ... రామనామం సదాస్మరణీయం... ... ... రామాయణం రసరమ్య కావ్యం. అష్టాక్షరీ మంత్రంలోని -రా- శబ్దం, పంచాక్షరీ మంత్రంలోని -- శబ్దం కలిపి వశిష్ఠ మహర్షి ఏ పుణ్య ముహూర్తంలో దశరథ తనయుడికి -రామ- నామాన్ని ఖరారు చేశారో కాని, యుగయుగాలకు, రామ నామం తారక మంత్రమైంది-అజరామరమైంది. రామాయణాన్ని ఎన్నిసార్లు చదివినా-విన్నా తనివి తీరదు.End

3 comments: