Friday, January 31, 2025

 పథకాల కొనసాగింపులో ఏదీ హేతుబద్ధత? 

పథకాల సమీక్ష, సవరణ, స్వస్తిలో మృగ్యమవుతున్న హేతుబద్ధత 

వనం జ్వాలా నరసింహారావు

మనతెలంగాణ దినపత్రిక (01-02-2025)

రెండు పర్యాయాల తన పదవీకాలంలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూపకల్పన చేసి, అమలుపరచిన కొన్ని విధానపరమైన (అసంబద్ధ) నిర్ణయాలు, స్వస్తి పలికిన ఆయనకు ముందున్న యూపీఏ ప్రభుత్వం అమలుచేసిన కొన్ని పథకాలు, కార్యక్రమాలు, ఆచరణలో సారూప్యతలు, అభద్రతా భావాన్ని కలిగించిన కేంద్రప్రభుత్వ వ్యవస్థల తీరుతెన్నులు, పాలనాపరమైన అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన మరికొన్ని అంశాలు, ఎనిమిది నెలల క్రితం జరిగిన 18వ లోక్ సభ ఎన్నికలలో, బహుశా బీజేపీకి, ఎన్డీఏకి సంఖ్యాపరంగా సభ్యులు తగ్గడానికి కారణమని కొందరు రాజకీయ, సామాజిక విశ్లేషకుల భావన.

ఉదాహరణకు, ‘పెద్దనోట్ల రద్దు’ నిర్ణయం, ‘జీఎస్టీ’ గందరగోళం, ‘అగ్నిపథ్’ పథకం, జమిలి ఎన్నికల నినాదం (‘వన్ నేషన్ వన్ పోల్స్’), ఇవన్నీ దీర్ఘకాలిక లాభాలను కలిగిస్తాయని మభ్యపెట్టే ప్రయత్నం జరిగింది. ప్రజా సంక్షేమానికి, దేశీయ సమస్యలకు’ ప్రాధాన్యత తగ్గించి, అంతర్జాతీయ వ్యవహారాల మీద అమితమైన దృష్టి పెట్టడం, సాంప్రదాయేతర హిందూత్వ రాజకీయ భావజాలం’ లాంటివి కూడా ప్రతికూలతాంశాలుగా విశ్లేషకులు భావించారు. సాక్షాత్తూ అయోధ్యలో ఓటమి, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో సగానికి సగం స్థానాలు ఓడిపోవడం, మోదీకి వారణాసి నియోజక వర్గంలోనే మెజారిటీ బాగా తగ్గడం, హిందుత్వ సిద్దాంతం పూర్తిగా పనిచేయలేదని స్పష్టంగా చెప్పడానికి కారణాలు. మొత్తం మీద 2024 ఎన్నికల్లో బీజేపీ తప్పక గెలవాల్సిన స్థానాలమీద ప్రతికూల ప్రభావం చూపింది. 

సంఖ్యాపరంగా ప్రధాని మోదీకి, బీజేపీకి, ఎన్డీఏకి ఓటర్లు ‘విద్యుత్ షాక్’ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ స్థానాలు ఇండియా (యూపీఏ) కూటమి స్థానాలు పెరిగాయి. మోదీ మూడవ పర్యాయం పదవీకాలంలో తీసుకునే విధాన నిర్ణయాలు, పథకాల, కార్యక్రమాల రూపకల్పనలో సరిదిద్దు చర్యలు ప్రారంభించమని ఓటర్లు సున్నితంగా హెచ్చరించారు. నరేంద్ర మోదీజీ అజేయుడు అనడానికి అంగీకరించకుండా, ఆయన నాయకత్వం మరికొంత కాలం తప్పనిసరిగా అవసరమే’ అని ఓటర్లు తెలివిగా, స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికైన తరువాత వినయ విధేయతలతో ప్రసంగించిన మోదీ, ఓటర్ల నిర్ణయాన్ని స్వీకరిస్తున్నాని, శిరసా వహిస్తున్నానని, స్వీయ-ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం తమ పార్టీకి వుందని చెప్పిన మాటలలో, ఓటర్ల పరోక్ష, నిర్మాణాత్మక, సున్నితమైన హెచ్చరిక సారాంశసారం స్పష్టంగా ప్రతిబింబించింది. కాకపోతే అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది నెలల కాలంలో మార్పు ఏమేరకు వచ్చిందో అనే విషయంలో స్పష్టత ఇంకా రాలేదు. 

ఇదిలా వుంటే, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పది సంవత్సరాల పరిపాలనలో అమలుపరచిన విధానాలను, పథకాలను, కార్యక్రమాలను, పాక్షికంగానో, పూర్తిగానో రద్దు చేసే దిశగానో, లేదా పేర్లను మార్చే దిశగానో, ఏడాదికి పైగా అధికారంలో వున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన ప్రభుత్వం ఆలోచనలో వున్నదని బీఆర్‌ఎస్ నేతల అనుమానం, ఆందోళన. ‘కాంగ్రెస్ పార్టీ మార్క్’ను, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పేర్లను, పార్టీ చిహ్నాన్ని ప్రతిబింబించేలా, పథకాల పేర్లలో మార్పులు జరుగున్నాయని వారి ప్రధానమైన ఆరోపణ. అలాగే అటు అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో అమలైన పథకాలను చంద్రబాబునాయుడు మారుస్తున్నట్లు కనిపిస్తున్నది. ప్రజాస్వామ్యంలో, నిత్యం మారుతున్న ప్రజల అవసరాలకు అనుగుణంగా, రాజకీయ పార్టీలు, ఎన్నికల సమయంలో, అప్పటికే అమల్లో వున్న విధానాలను, పథకాలను, కార్యక్రమాలను మారుస్తామనో, పునర్వ్యవస్థీకరణ చేస్తామనో, అదనపు ఆర్ధిక ప్రయోజనాలను చేకూర్చే విధంగా సరికొత్త (ఉచిత) పథకాలకు శ్రీకారం చుట్తామనో వాగ్దానాలు చేయడం సర్వ సాధారణం. అందులో తప్పేమీ లేదు. తప్పల్లా గత ప్రభుత్వం చేసిన ప్రతిదాన్నీ హేతుబద్ధత లేకుండా విమర్శించడమే!

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ, వ్యూహాత్మకంగా, తెలివిగా, బహుళ ప్రచారం చేసి, తమ పథకాలకు ఓటర్ల విశ్వశనీయత పొందింది. మెజారిటీ అత్యంత స్వల్పమే అయినప్పటికీ, పదేళ్లపాటు సుపరిపాలన చేసిన బీఆర్ఎస్ ను ఓడించి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారి అధికారంలోకి వచ్చింది  కాంగ్రెస్ పార్టీ. అలాగే చంద్రబాబునాయుడు సారధ్యంలోని తెలుగుదేశం పార్టీ పథకాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి, ఓటర్ల విశ్వసనీయత పొంది, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో ఓడించి, రాష్ట్రం విడిపోయిన తరువాత రెండవ పర్యాయం అధికారంలోకి రావడం జరిగింది.   

ప్రపంచవ్యాప్తంగా, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, అధికారంలోకి రాగానే, తమకు పూర్వం అధికారంలో వున్న ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను, అభివృద్ధి-సంక్షేమ పథకాలను, ఇతర కార్యక్రమాలను, కొనసాగించే, లేదా, తాత్కాలికంగానో, శాస్వతంగానో స్వస్తి పలికే పద్ధతులు విభిన్నంగా ఉంటాయి. ఇవన్నీ, అధికారంలోకి వచ్చిన పార్టీ, దాని నాయకుడి  వ్యక్తిగత ప్రాధాన్యతల వల్ల స్పష్టంగా ప్రభావితమవుతాయి. ప్రజాస్వామ్య సంప్రదాయం ప్రకారం, పథకాల అమల్లో స్థిరత్వం, సంక్షేమ ఫలాలు అందుతాయన్న ప్రజల విశ్వాసం కొరకు, విధానాల, పథకాల కొనసాగింపు అభిలషణీయం. దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల, సామాజిక సాంఘిక సంక్షేమ కార్యక్రమాల విషయంలో, చౌకబారు రాజకీయ ప్రాధాన్యతలకన్నా, శాస్త్రీయ పద్ధతిలో ‘విధాన సమీక్ష’ జరిపిన అనంతరం నిర్ణయం తీసుకోవడం సముచితం. ప్రజాస్వామ్యాల్లో ప్రభుత్వం మారినప్పుడు, ఎన్నికల హామీలకు, మారుతున్న అవసరాలకు అనుగుణంగా స్పందించాల్సిన అవసరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి, దాని నాయకుడికి తప్పనిసరి. ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల నుండి వీటికి సంబంధించిన ఉదాహరణలు మార్గదర్శకంగా వుంటాయి. 

‘ఉక్కు మహిళ’ గా పిలువబడ్డ కన్సర్వేటివ్ పార్టీ మార్గరెట్ థాచర్, బ్రిటన్ ప్రధానిగా తన 11 సంవత్సరాల పదవీకాలంలో, అమలుపరచిన (థాచరిజం) పిలువబడిన ఆర్థికసంస్కరణలను, ప్రపంచవ్యాప్తంగా ఆమోద యోగ్యమైన ప్రభుత్వరంగ సంస్కరణలను, ఆమె వారసుడు, లేబర్ పార్టీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్, స్వల్ప మార్పులతో (థర్డ్ వే అప్రోచ్) కొనసాగించారు. కన్సర్వేటివ్ పార్టీకి చెందిన మరో ప్రధాని డేవిడ్ కామెరాన్ శ్రీకారం చుట్టిన, యూరోపియన్ యూనియన్ నుండి యునైటెడ్ కింగ్‌డమ్ ఉపసంహరణకు సంబంధించిన ‘బ్రెగ్జిట్ రెఫరెండం,’ నాయకత్వాలు మారినప్పటికీ, ప్రధానులు థెరిసా మే, బోరిస్ జాన్సన్ లు కొనసాగించారు. 

అమెరికాలో, ఎనిమిదిన్నర దశాబ్దాల క్రితం, ఫ్రాంక్లిన్ డి రూజ్‌వెల్ట్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రారంభించబడి, బహుళ ప్రాచుర్యం పొందిన ‘ఫుడ్ కూపన్ కార్యక్రమం’ (ఇప్పటి ‘సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ కార్యక్రమం’) అనేకానేక విమర్శలను అధిగమించి, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, మారుతున్న ఆర్థిక పరిస్థితుల, విధాన ప్రాధాన్యతలకు అనుగుణంగా కొనసాగుతూ, అమెరికన్ సామాజిక భద్రతా వ్యవస్థలో ఒక మూలస్తంభంగా నిలిచి పోయింది. ‘ఒబామా సరసమైన ఆరోగ్య సంరక్షణ విధానం‘తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కున్నప్పటికీ, ట్రంప్ పరిపాలనలో తగు సవరణలతో కొనసాగించడం జరిగింది. 

ఒకనాటి కమ్యూనిస్ట్ సోవియట్ యూనియన్‌లో, బోల్షవిక్ విప్లవ నాయకుడు, సోవియట్ యూనియన్‌ ఆవిర్భావానికి కారకుడు, లెనిన్‌ మహాశయుడిని, స్టాలిన్ విమర్శించడమే కాకుండా, సోవియట్ ఆర్థిక వ్యూహంలో గణనీయమైన సంస్కరణగా, భావజాలంగా చరిత్రలో ప్రసిద్ధికెక్కిన, ఆయన ‘నూతన ఆర్ధిక విధానాన్ని’ వ్యతిరేకించాడు. కేంద్రికృత, ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ, శీఘ్ర పారిశ్రామికీకరణ, సమూహీకరణ పాలనకు స్టాలిన్ ప్రాధాన్యమిచ్చాడు. ‘డీస్టాలినైజేషన్’ లో భాగంగా, స్టాలిన్ అనుసరించిన వ్యక్తి పూజను ఖండించి, సోవియట్ విధానాలలో సరళీకృతకు ప్రాధాన్యం ఇచ్చాడు స్టాలిన వారసుడు కృశ్చేవ్.

భారతదేశం ప్రథమ ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, పంచవర్ష ప్రణాళికలు, పారిశ్రామికీకరణ, ప్రభుత్వ రంగసంస్థల ఆవిర్భావం, అలీనోద్యమాలకు ప్రాధాన్యం ఇచ్చాడు. లాల్ బహదూర్ శాస్త్రి వాటిని కొనసాగిస్తూ, ‘హరిత విప్లవం’ నినాదంతో ఆహార ఉత్పత్తి పెరుగుదలకు బాటలు వేశారు. అవి కొనసాగిస్తూ, ఇందిరా గాంధీ, బాంకులను జాతీయం చేసింది. జనతాపార్టీ ప్రధాన మంత్రి మోరార్జీ దేశాయి, ఇందిరాగాంధీ ‘ప్రాథమిక ఆర్థిక వ్యవస్థను’ కొనసాగించారు. ఐటి, టెలికాం విప్లవ విధానాలకు ఆద్యుడు రాజీవ్ గాంధీ, విపి సింగ్ మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేశారు. పీవీ నరసింహారావు తన నవీన ‘ఆర్థిక సంస్కరణల’ ద్వారా, ‘సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ’ దిశగా దేశాన్ని అభ్యుదయంలో నడపడం, నూతన పారిశ్రామిక విధానం ద్వారా ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించడం భారీ విధాన మార్పు అనాలి.  అటల్ బిహారీ వాజ్ పేయి సరళీకృత ఆర్ధిక విధానాలను కొనసాగించి, మౌలిక సదుపాయాలు, టెలికాం, బీమారంగాల్లో సంస్కరణలు తీసుకువచ్చారు. మన్మోహన్ సింగ్ సరళీకృత ఆర్ధిక విధానాలను కొనసాగిస్తూ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం తెచ్చారు. నరేంద్ర మోదీ సరళీకృత ఆర్ధిక విధానాలను, నరేగా పథకాన్ని కొనసాగించి, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, జన్ ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ లను తీసుకు వచ్చారు.

విడిపోక ముందు, ఆ తరువాత కూడా, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో, ఎన్ని మౌలిక విభేదాలున్నా, అత్యంత ప్రజాదరణ పొందిన 108 అంబులెన్స్ సేవలు, ఆరోగ్యశ్రీ పథకం లాంటివి కొనసాగాయి. ‘వ్యూహాత్మక రాజకీయ నాయకులుగా, టీం వర్క్ కు ప్రాధాన్యం ఇస్తున్నవారిగా’ భావించే, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, ఏపి సిఎం చంద్రబాబునాయుడు కూడా, ఇటు కేంద్రంలోనూ, అటు బ్రిటన్, అమెరికా లాంటి ప్రజాస్వామ్య దేశాలలోనూ, పాటిస్తూ వస్తున్న ‘సత్సంప్రదాయాలకు’ అనుగుణంగా, ప్రజా ప్రయోజనాలను ప్రతిబింబించే గత ప్రభుత్వాల ‘పథకాల, విధానాల సమీక్ష, సవరణ, స్వస్తి’ అంశాలలో హేతుబద్ధత మృగ్యమవ్వడం సమంజసమా?! 

Wednesday, January 29, 2025

భాగవతంలో శివుడు : వనం జ్వాలా నరసింహారావు

 భాగవతంలో శివుడు 

వనం జ్వాలా నరసింహారావు

భక్తిపత్రిక (ఫిబ్రవరి, 2025) 

పోతన భాగవతంలో వివిధ సందర్భాలలో శివుడి ప్రస్తావన సందర్భోచితంగా, కనిపిస్తుంది. దక్షయజ్ఞాన్ని శివుడు ధ్వంసం చేయడం; త్రిపురాసుర సంహారం; క్షీరసాగర మథనంలో పాల సముద్ర్తం నుండి పుట్టిన హాలాహలాన్ని శివుడు మింగడం; వృకాసురుడి శివద్రోహం; శివకేశవుల జీవాయుధ పోరాటం మొదలైనవి ముఖ్యమైనవి.  

బాణాసురుడి కథ అత్యంత కమనీయంగా ఉంటుంది భాగవతంలో. బలి చక్రవర్తి కుమారుడైన గొప్ప శివ భక్తుడు. అతడు కోరిన వరం ప్రకారం శివుడు అతడి కోట వాకిటి ముందు కావలిగా ఉన్నాడు. పరివారంతో సహా బాణుడి శోణపురానికి రక్షకుడయ్యాడు.  

బాణుడి కూతురు పేరు ఉష. ఒకరాత్రి నిద్రలో రుక్మిణీ, శ్రీకృష్ణుల మనుమడు, ప్రద్యుమ్నుడి కుమారుడైన అనిరుద్ధుడిని ఆమె కలిసి సుఖించినట్లు కలకన్నది. అప్పటి నుంచి అతడి కోసం తపించ సాగింది. ఆమె బాధ చూడలేని స్నేహితురాలు చిత్రరేఖ అనిరుద్ధుడి చిత్రాన్ని వేసి చూపించగా గుర్తుపట్టింది ఉషాకన్య. చిత్రరేఖ తనకు తెలిసిన విద్యతో అతడి గురించిన వివరాలన్నీ సేకరించి, స్నేహితురాలికి చెప్పింది. అనిరుద్ధుడుని యోగమహిమతో ఎత్తుకుని వచ్చి, ఉషాకన్యతో కలిపింది. వారి ప్రేమకు చిహ్నంగా ఉషాకన్య గర్భం దాల్చింది. 

బాణాసురుడికి ఈ విషయం తెలిసింది. అనిరుద్ధుడిని నాగపాశంతో బంధించాడు. కారాగారంలో పెట్టాడు. సరిగ్గా అదే సమయంలో పెద్ద సుడిగాలి వీచి బాణుడి విశాలమైన ధ్వజం కూలి నేలమీద పడింది. శివుడు తనకు చెప్పినట్లు తనకు సరైన జోడీతో యుద్ధం జరగ బోతున్నదని బాణుడు సంతోషించాడు. నారదుడి ద్వారా విషయం తెలుసుకున్న కృష్ణుడు బాణాసురుడి మీదికి దండయాత్రకు బయల్దేరాడు. యాదవ సైన్యం బాణుడి నగరాన్ని ధ్వంసం చేశారు. యుద్ధం మొదలైంది. నగరానికి రక్షకుడుగా వున్న పరమ శివుడు బాణుడికి సహాయంగా రణరంగానికి వెళ్లాడు. 

శివకేశవుల యుద్ధం 

శివుడు, కృష్ణుడు ఒకరితో మరొకరు తలపడ్డారు. కృష్ణుడి శౌర్యప్రతాపాలను శివుడు సహించలేకపోయాడు. బ్రహ్మాస్త్రాన్ని శ్రీకృష్ణుడి మీద ప్రయోగించాడు శివుడు. దాన్ని శ్రీకృష్ణుడు అద్భుతంగా ఉపశమింప చేశాడు. శివుడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. దాన్ని పర్వతాస్త్రంతో తుంచి వేశాడు కృష్ణుడు. ఆగ్నేయాస్త్రాన్ని ఐంద్ర బాణంతో రూపుమాపాడు. మహేశ్వరుడు శ్రీకృష్ణుడి మీద పాశుపతాస్త్రాన్ని కూడా ప్రయోగించాడు. నారాయణాస్త్రాన్ని వేసి దాన్ని వెనుకకు మరలించాడు శ్రీకృష్ణుడు. ఉత్సాహాన్ని కోల్పోయిన శివుడి మీద సమ్మోహనాస్త్రాన్ని వదలడంతో ఆయన సోలిపోయాడు. 

తక్షణమే శ్రీకృష్ణుడు వీరవిహారం చేస్తూ బాణాసురుడి సమస్త సైన్యాన్ని పరిమార్చాడు. కృష్ణుడి అఖండ పరాక్రమానికి బాణాసురుడు భయపడి రాచనగరులోకి పారిపోయాడు. సరిగ్గా ఆ సమయంలోనే శివ-కేశవుల మధ్య ‘జీవాయుథ యుద్ధం’ చోటు చేసుకుంది. మూడు తలలు, మూడు పాదాలు, భయంకరాకారం కలిగి, కోపావేశంతో ‘శివజ్వరం’ (శివుడి జీవాయుథం) కృష్ణుడి దగ్గరకు వచ్చింది. అలా వచ్చిన దాన్ని చూసిన కృష్ణుడు ఒక నవ్వు నవ్వాడు. వెంటనే (తన జీవాయుథమైన) ‘వైష్ణవజ్వరాన్ని’ ‘శివజ్వరం’ మీదికి ప్రయోగించాడు. ‘శివవైష్ణవ జ్వరాలు’ రెండూ తమ బలాన్ని, శక్తిని, శౌర్యాన్ని, ప్రతాపాన్నీ ప్రదర్శిస్తూ ఘోరంగా యుద్ధం చేశాయి. చివరకు వైష్ణవజ్వరం ముందు శైవజ్వరం ఓడిపోయింది. ప్రాణభీతి పట్టుకుని, శివజ్వరం, కృష్ణుడి పాదాలమీద పడి, అనేక విధాల స్తుతించి ‘నీవే శరణు నాకు’ అని వేడుకుంది. వైష్ణవజ్వరం దాన్ని బాధించదని శ్రీకృష్ణుడు చెప్పగానే శివజ్వరం పరమానందంతో పరమాత్ముడికి సాష్టాంగ నమస్కారం చేసి  వెళ్లిపోయింది.  

యజుర్వేదం ‘శివాయ విష్ణురూపాయ’ అనే మాట శివకేశవుల అభేదాన్ని తెలియచేస్తుంది. ‘శివ’ శబ్దానికి త్రిగుణాతీతుడు, శుభస్వరూపుడు అనే అర్థాలున్నాయి. ‘విష్ణు’ అంటే వ్యాపించినవాడు. త్రిగుణాతీతమైన, మంగళకరమైన ఈశ్వర చైతన్యం ‘శివుడు’ కాగా, విశ్వమంతా వ్యాపించితే ‘విష్ణువు’ అవుతుంది. అదే ‘శివాయ విష్ణురూపాయ’. శివకేశవులకు, ‘శివపురాణం, విష్ణుపురాణం’ అనే ప్రత్యేక పురాణాలు ఉన్నప్పటికీ వాటి అర్థం తెలుసుకుంటే భేదభావం కనిపించదు. భగవంతుడు కలహించడు. కలహం మతవాదుల మధ్యనే. ‘చేతులారంగ శివుని పూజించడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని’ అని అంటారు. చేతులారా శివుని పూజించి, నోటితో హరికీర్తన చేయమంటూ పోతన పద్యకవితలోని అంతరార్థం ఇదే. శివుడు శ్రీరామనామరసికుడు, విష్ణు వల్లభుడు. ఒకరినొకరు గౌరవించుకున్నారంటే అర్థం, ఒకరికంటే ఇంకొకరు తక్కువనీ, ఎక్కువనీ కాదు. ఇద్దరూ సమానమేననీ, లోక నిర్వహణ కోసం రెండుగా వ్యక్తమైన ఒకే తత్త్వమని అర్థం.     

పారిపోయిన బాణాసురుడు మళ్లీ కదన రంగానికి వచ్చాడు రెండో సారి. కృష్ణుడు సుదర్శన చక్రాన్ని బాణాసురుడి మీద ప్రయోగించాడు. అది బాణుడు వేయి చేతులలో నాలుగు మాత్రం మిగిల్చి మిగిలిన వాటన్నింటినీ నరికి వేసింది. అతడి మీద వాత్సల్యం వున్న పరమేశ్వరుడు కృష్ణుడి దగ్గరకు వచ్చి, ఆయన్ను స్తోత్రం చేశాడు. శివుడి ప్రియ భక్తుడైన బాణుడిని చంపడం లేదన్నాడు శ్రీకృష్ణుడు. బాణాసురుడు శోణపురానికి పోయి తన కుమార్తె ఉషాకన్యకు, అనిరుద్ధుడికి బంగారు ఆభరణాలు ఇచ్చి, తీసుకువచ్చి శ్రీకృష్ణుడికి అప్పగించాడు.  ఇదే ‘ఉషాపరిణయం’ నేపధ్యం. 

దక్షయజ్ఞ గాథ 

దక్ష ప్రజాపతి ఒక పర్యాయం, పెద్దలు నిర్వహిస్తున్న ఒక సత్రయాగం చూడడానికి దక్షుడు రాగా బ్రహ్మ, మహేశ్వరులు మినహా, సభాసదులందరూ మర్యాద పూర్వకంగా లేచి నిల్చున్నారు. దక్షుడు తనకు తండ్రైన బ్రహ్మకు నమస్కరించి, ఉచితాసనం మీద కూర్చున్నాడు. తనను చూసి ఆసనం మీద నుండి దిగని శివుడి వైపు కోపంగా చూస్తూ, అక్కడున్న దేవతలను, ఇతరులను ఉద్దేశించి శివుడిని పరిపరి విధాల దూషించాడు. శివుడికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, అతడిని శపిస్తానని జలాన్ని స్వీకరించాడు. 

కోపంతో దక్షుడు తన నివాసానికి వెళ్ళిపోయాడు. దక్షుడికి, ఈశ్వరుడికి మధ్య పరస్పర విరోధం కొనసాగింది. ఈ నేపధ్యంలో రుద్రహీనమైన ‘వాజపేయం’ అనే యజ్ఞాన్ని చేసిన దక్షుడు, ‘బృహస్పతి సవనం’ అనే యజ్ఞం చేయడానికి ఉపక్రమించాడు. ఇది తెలుసుకున్న ఈశ్వరుడి భార్య సతీదేవి తామిద్దరం కూడా వెళ్దామని భర్తతో అన్నది. సత్రయాగంలో జరిగిన విషయాన్ని గుర్తుచేస్తూ శివుడు, వద్దని వారించాడు. ఒకవేళ ఆమె వెళ్లితే, పరాభవం కలుగుతుందని హెచ్చరించాడు. తండ్రిని చూడాలన్న కోరికతో సతీదేవి పుట్టింటికి వెళ్లింది. యజ్ఞశాల దగ్గర తల్లి, తోబుట్టువులు తప్ప మిగిలిన వారెవ్వరూ పలకరించలేదు. 

తండ్రి పలకరించనందుకు మౌనంగా వుండిపోయిందామె. తండ్రి అనాదరణకు గురైన ఆమె బాధను చూసి, కోపంతో, భూత గణాలు ఆవేశపడ్డాయి. దక్షుడిని హతమారుస్తామంటూ లేచిన గణాలను సతీదేవి వారించింది. తన రోషాన్ని వ్యక్తం చేస్తూ, దుష్టబుద్ధితో ఈశ్వరుడిని నిందించిన దక్షుడి వల్ల సంప్రాప్తించిన తన శరీరాన్ని విడిచి పరిశుద్ధురాలినవుతానని అన్నది. యజ్ఞసభా మధ్యలో నిలబడి, శరీర త్యాగం చెయ్యాలని భావించింది. యోగాగ్నిని రగుల్కొలిపి, అగ్నిలో ఆ క్షణమే దగ్ధమైపోయింది సతీదేవి. 

శివుడికి పట్టరాని కోపం వచ్చి, జటాజూటం నుండి ఒక జడను పెరికి భూమ్మీద విసిరికొట్టాడు. అందులోనుండి వీరభద్రుడు రుద్రుడి ప్రతిబింబంలాగా ఉద్భవించాడు. దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి, దక్షుడిని సంహరించమని చెప్పాడు శివుడు. ఆయన యజ్ఞవాటికకు చేరుతుంటే, భయంకరమైన కారుచీకటి కమ్మింది. ధూళి పుట్టింది. ప్రభంజనం వీచింది. వీరభద్రుడు సాటిలేని మహాదర్పంతో చెలరేగి దక్షుడిని పడతోసి, కంఠాన్ని నులిమి, శిరస్సును తుంచి, మహాకోపంతో దక్షిణాగ్నిలో హోమం చేశాడు. ఇలా వీరభద్రుడు శివుడి ఆజ్ఞానుసారం దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి కైలాసానికి వెళ్లిపోయాడు.

ఇదంతా దేవతలు బ్రహ్మదేవుడికి చెప్పి ఆయనకు మొరపెట్టుకున్నారు. వారంతా కలిసి కైలాసాన్ని దర్శించారు. ధర్భాసనం మీద కూర్చున్న ఈశ్వరుడిని చూశారు. ‘యజ్ఞభాగాన్ని పొందే అర్హతగల నీకు యజ్ఞభాగాన్ని సమర్పించక పోవడం వల్ల, నీవల్ల ధ్వంసం చేయబడి, అసంపూర్ణంగా మిగిలిపోయిన ఈ దక్షుడి యాగాన్ని మళ్లీ ఉద్ధరించి, దక్షుడిని పునఃజీవితుడిని చెయ్యాలని ప్రార్థన. మిగిలిన యజ్ఞాన్ని పరిపూర్తి చేసి ఈ యాగాన్ని నీ యజ్ఞ భాగంగా స్వీకరించు’ అని వేడుకున్నారు. 

ఇంద్రాది దేవతలు, ఋషులు వెంటరాగా బ్రహ్మ దేవుడు రుద్రుడిని తీసుకుని దక్షయజ్ఞ వాటికకు వచ్చాడు. దక్షుడిని గొర్రెతల వాడిగా చేయడంతో, అతడు నిద్ర నుండి లేచినవాడిలాగా లేచి సంతోషించాడు. రుద్రుడిని ద్వేషించడం వల్ల కలిగిన పాపాల నుండి విముక్తి పొందాడు. శివుడిని స్తుతించాడు. తనను క్షమించమని వేడుకున్నాడు. యజ్ఞకార్యాన్ని నిర్వహించడానికి సిద్ధమయ్యాడు. యజ్ఞపరిసమాప్తి అవుతుంటే, శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడయ్యాడు. రుద్రుడు ఆటంకపరచిన దక్షుడి యజ్ఞాన్ని శ్రీహరి పూర్తి చేశాడు. దక్షుడిని చూసి తాను తృప్తి చెందానని అన్నాడు. దక్షుడు శ్రీహరిని పూజించాడు. సతీదేవి పూర్వదేహాన్ని వదిలి, హిమవంతుడి పుత్రికగా మేనకకు జన్మించి, ఈశ్వరుడిని వరించింది. 

Monday, January 27, 2025

LA Fires Akin to ‘Khandava Dahana’ : Vanam Jwala Narasimha Rao

 LA Fires Akin to ‘Khandava Dahana’ 

FOR NOW, THE ANSWER TO WHAT CAUSED 

LOS ANGELES WILDFIRES IS ELUSIVE

Vanam Jwala Narasimha Rao

The Hans India (28-01-2025)

{According to Mahabharata, the Vast Forest ‘Khandava’ inhabited by many creatures as well as ‘Maya, the Architect of the Demons’ was set on fire deliberately through ‘Fire God Agni’ who was ‘Hungry for the Forest’ due to a curse, by Arjuna and Krishna, with the divine purpose and mission of clearing forest land. It was part of a cosmic plan that led to the destruction of the forest, but simultaneously cleared the land for creation of ‘Maya City.’}-Editor Note

The ‘Los Angeles wildfires’ raging from January 7, 2025 or named as ‘Hughes Fire’ later, resulted in 28 fatalities, destruction of structures, and displacement of about ‘Two Lakhs People’ directly or indirectly, may be symbolically, with significant differences compared to the ‘Mythological Story Khandava (Fire) Dahana.’ The massive catastrophic fire affecting large portion of Khandava Forest represented ‘End of one Era and Beginning of Another’ as part of Destruction and Creation Cycle as mentioned in ‘Great Literature Mahabharata.’ The process involved divine powers. Likewise, ‘Modern Wildfires’ lead to ecological recovery, and tend to be more destructive without the accompanying divine or purposeful creation. Both events highlight the ‘Power of Fire’ as a force. 

In the ‘Los Angeles wildfires’ several famous Hollywood Celebrities lost their priceless homes in the ‘Pacific Palisades Area’ which is their favored location. The Palisades and Eaton fires burned more than 23,700 acres and 14,100 acres respectively. Los Angeles Home, where ‘The Doors Guitarist Robby Krieger’ penned the Band’s Hit Song, intoxicating rock single ‘Light My Fire’ was destroyed. Significant landmarks, including the J Paul Getty Museum and University of California were damaged. 

Wildfires are driven by a combination of natural and human-induced factors. Global Warming causing Rising Temperatures; Prolonged Droughts turning it into highly flammable fuel; Heatwaves and Reduced Rainfall susceptible to ignition; Strong Hot and Dry Winds that spread wildfires; Windborne Sparks causing new fires in unburned areas; Overgrown Forests increasing fire intensity; Flammable Plant Species: Wildland-Urban Interface; Untold Human and Natural Causes; Lightning as an ignition source; Constructions in high-risk fire zones; Terrain causing spread of Fires faster; Narrow Canyons and Valleys etc. are among them.

Satellites, drones, and fire tracking technologies allow for better monitoring and predicting of wildfire risks. However, meteorologists may not be able to predict the precise timing of the break of wildfires, and path of a fire, which is an annual occurrence in California, especially during the dry summer and fall months. This is partly due to the complexity of weather and terrain factors. This time, the scale and intensity of the fires were exacerbated beyond prediction. Strong, unpredictable winds caused fires to spread much faster than anticipated. 

The ‘Crisis Management’ during the Los Angeles wildfire required a comprehensive approach, involving ‘State and Federal Government Agencies’ which jumped in to action through ‘Immediate Firefighting Efforts.’ Thousands of firefighters comprising specialized teams were deployed, to take situation under control. State of emergency was declared. National Guard was deployed and ‘Evacuation Shelters’ were established. Hundreds of Federal Personnel and Aircraft pressed in to service to support firefighting efforts, which however, were significantly hampered by water shortages due to century old pipelines. Fire hydrants ran dry, forcing firefighters to rely heavily on aerial water drops. Relief centers provided every temporary support.  

‘Mandatory Evacuation Orders’ were issued promptly to protect residents. Wireless Emergency Alert system, Social Media, and Local Broadcasts to issue real-time updates were pressed in to action. ‘Preventive Power Shutoffs’ to reduce risk of electrical equipment sparking new fires was done. ‘Major Disaster Declaration’ was made enabling ‘Federal Emergency Management Agency (FEMA)’ assistance. ‘National Interagency Fire Center (NIFC)’ coordinated firefighting efforts across state. ‘Environmental Protection Agency (EPA)’ monitored Hazardous Air Quality that was causing respiratory and cardiovascular problems. Severe air pollution, smoke and ash blanketed large areas of Los Angeles. 

Social and Non-Governmental Organizations (NGOs) played a crucial role in wildfire response, relief, and recovery. Their involvement ranged from immediate relief efforts (shelters, food, and water) to mental health support, animal rescue, advocacy, and rebuilding efforts. Limited resources, communication gaps, and uneven recovery highlighted the need for better coordination between NGOs, government agencies, and local communities. American Red Cross and other local (California) Volunteers provided critical disaster relief services during the wildfires. 

According to Mahabharata, the Vast Forest ‘Khandava’ inhabited by many creatures as well as ‘Maya, the Architect of the Demons’ was set on fire deliberately through ‘Fire God Agni’ who was ‘Hungry for the Forest’ due to a curse, by Arjuna and Krishna, with the divine purpose and mission of clearing forest land. It was part of a cosmic plan that led to the destruction of the forest, but simultaneously cleared the land for creation of ‘Maya City.’ This symbolized transformation of the environment, where destruction eventually paved way to construction. 

Modern wildfires, like those in California, do not have the divine or purposeful elements of Khandava Dahana, though there are symbolic parallels. Much like the destruction of Khandava, modern wildfires can devastate forests, wildlife, and human settlements. In both cases, life is lost, and the landscape is dramatically altered. Just as the burning of Khandava led to the creation of new city, Post-fire recovery of modern wildfires can lead to new development and an eventual return of wildlife, and sometimes may result in ecological transformation, and eventually coming up of a new city. However, the land can also face long-term challenges like soil erosion or loss of biodiversity. 

In the ultimate analysis, in the Mahabharata’s Khandava Dahana, the fire was part of a larger moral and ethical battle, with the heroes (Krishna and Arjuna) being part of a divine plan. Modern Wildfires invariably lead to human suffering, loss of property, and environmental damage. They are typically seen in the context of disaster management rather than cosmic or divine action. Praying to Hindu Gods for total normalcy or recovery from wildfires, which is deeply spiritual and cultural, and which many people in ‘Hindu Traditions’ find meaningful, could be an answer for early salvage. 

In Hinduism, there are specific prayers and rituals that may be offered to seek divine intervention for protection, recovery, and restoration of normalcy. These include Prayers to Lord Agni, Maha Mrityunjay Mantras, and Prayers to Protectors like Goddess Durga or Lord Shiva etc. While spiritual prayers and rituals offer important emotional and cultural support, bringing about long-term restoration may also require ‘Pragmatic Disaster Management.’ Combination of ‘Spiritual Resilience and Scientific Action’ ensures not only the recovery of affected communities but also the prevention of future wildfires. Ultimately, addressing the wildfire crisis requires multi-faceted and multipronged approach, balancing ‘Spiritual Support, Governmental Action, Community Efforts, and Environmental Sustainability’ to rebuild and prepare for a future where such wildfires are less devastating.

Authorities investigating the cause of the fire revealed that, the Palisades wildfire had inadvertent ‘Human Origins’ as a ‘Likely Cause’ which was started by someone. According to New York Times, Palisades fire ignited near a ‘Hiking Trail’ and an area that had burned six days earlier. A ‘Red Flame Retardant’ was dropped from overhead to battle the blaze and smoke billowing from all sides of the scar. The area known as ‘Skull Rock on the Temescal Ridge Trail’ is popular with hikers as a hangout by local teens. Officials are investigating whether that fire could have had any connection. For now, the answer to what caused Los Angeles Wildfire is elusive. 

At least two law suits have been filed against Southern California Edison Power Company, on the speculation that faulty power lines may have sparked the Eaton Fire. Meanwhile, 31000 flee as new blaze threatened Los Angeles County, and thus the Fire-weary southern California is in crisis again in the face of another fast-moving wildfire and the threat of mudslides. A new wildfire, the ‘Hughes Fire’ named so, erupted on January 22 morning in the rugged mountains north of Los Angeles, rapidly spreading through dry vegetation and sending thick plumes of smoke into the sky, as per a Reuters report. Firefighters have halted the spread of this ‘Hughes Fire’ which rapidly burned over 10000 acres and led to 31000 evacuations. Containment has increased to 24%. Relief Package worth 2.5 Billion Dollars is being used to handle the crisis.

(Sources: USA Media Reports and Mahabharata)

Sunday, January 26, 2025

యోగీశ్వరుడైన భరతుడి తత్త్వజ్ఞానోపదేశం ..... శ్రీ మహాభాగవత కథ-20 : వనం జ్వాలా నరసింహారావు

 యోగీశ్వరుడైన భరతుడి తత్త్వజ్ఞానోపదేశం 

శ్రీ మహాభాగవత కథ-20

వనం జ్వాలా నరసింహారావు 

సూర్యదినపత్రిక (27-01-2025)

కంII చదివెడిది భాగవతమిది, 

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

చదివినను ముక్తి కలుగును, 

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై 

ఋషభుడి అనంతరం ఆయన పెద్ద కుమారుడైన భరతుడు ఈ భూమండలానికి రాజయ్యాడు. విశ్వరూపుడి కుమార్తె పంచజని అనే కన్యను వివాహమాడాడు. వారికి సుమతి, రాష్ట్రభృత్తు, సుదర్శనుడు, ఆచరణుడు, ధూమ్రకేతువు అనే ఐదుగురు, అహంకారం నుండి పంచతన్మాత్రలు జన్మించిన విధంగా పుట్టారు. గతంలో అజనాభం అని పిలవబడే ఈ భూభాగం భరతుడు పాలించడం మొదలైన తరువాత ’భరత వర్షం’ అన్న పేరు సార్థకమైంది. భరతుడి పాలనను దేవతలు సహితం మెచ్చుకున్నారు. ఆయన ఎన్నో యజ్ఞాలను, పూజలను ఆచరించాడు. యజ్ఞకర్మలను ఆచరిస్తూనే రాజ్యపాలనలో గొప్ప ఖ్యాతి గడించాడు భరతుడు. పవిత్రమైన అంతఃకరణతో, పవిత్ర చిత్తంతో, ఆ రాకుమారుడు ధర్మనిష్టతో ఈ భూమిని పరిపాలించాడు. ఇలా ఏభైలక్షల వేల సంవత్సరాలపాటు భరతుడు రాజ్యాన్ని పాలించాడు. తండ్రి-తాతల ఆస్తైన రాజ్యాన్ని అర్హతకు తగ్గ విధంగా కొడుకులకు పంచాడు. తరువాత పులహాశ్రమ సమీపంలో గందకీ నది దగ్గర, ఇంద్రియ నిగ్రహంతో, భరతుడు విష్ణువును సేవించేవాడు. పూర్తిగా భక్తిలో మునిగి పరమేశ్వరుడిని హిరణ్మయమూర్తిగా తలుస్తూ స్తుతించేవాడు అనేక విధాలుగా.   

ఒకనాడు భరతుడు ఆ మహానదీతీర్థంలో స్నానం చేస్తున్నప్పుడు, గర్భిణైన ఒక లేడి నీరుతాగుతుండగా ఒక సింహం దాన్ని చూసి గర్జించింది. భయంతో లేడి గర్భం విచ్చిన్నమై, కడుపులో వున్న పిల్ల జారి నీళ్లలో పడిపోయింది. తల్లి చనిపోయింది. నీళ్లలో జారి, ప్రవాహంలో తేలుతున్న లేడిపిల్లను భరతుడు చూశాడు. దాన్ని తన ఆశ్రమానికి తీసుకుపోయాడు. దాన్ని పెంచుతూ, దానిమీద మమకారాన్ని కూడా పెంచుకున్నాడు. చివరకు పరమేశ్వరుడిని కూడా మర్చిపోయాడు. ఆత్మలో యోగనిష్టకు బదులు లేడిపిల్లమీద ప్రేమ స్థిరపడిపోయింది. దానితో ఆటపాటలతోనే జీవితం గడిచిపోయేది. ఒకనాడు ఆ లేడిపిల్ల ఎటో పారిపోయింది. రాజర్షయిన భరతుడు మనస్సులో దానికోసం ఆరాటపడ్డాడు. దాని కారణంగా బహువిధాల కోరికలతో సతమతమయ్యాడు. భగవత్ ధ్యాస మానేశాడు. అతడికి దానిమీద మోహం మరింత తీవ్రమైంది. 

ఇలా వుండగా, భరతుడికి అవసానదశ వచ్చింది. లేడిపిల్లనే ఆత్మలో నిలుపుకుని దేహాన్ని విడిచి పెట్టాడు. ఆ కారణాన, గతస్మృతితో, ఒక లేడి గర్భంలో పడి లేడిపిల్లగా జన్మించాడు. తానెందుకు లేడిపిల్లగా పుట్టాల్సి వచ్చిందో అర్థం చేసుకున్నాడు. శ్రీహరినే అనునిత్యం ధ్యానం చేస్తూ, పులహాశ్రమానికి వచ్చి, చక్రనదీ తీర్థంలో స్నానం చేస్తూ, అవసాన సమయం కోసం ఎదురు చూస్తూ, చివరకు లేడి శరీరాన్ని విడిచి పెట్టాడు. ఆ తరువాత అంగిరసుడి వంశంలోని  ఒక బ్రాహ్మణుడికి పుత్రుడిగా జన్మించాడు. ఎల్లప్పుడూ శ్రీహరి పాదాలనే ధ్యానం చేసుకునేవాడు. 

అంగిరసుడికి ఇద్దరు భార్యలు. ఆయనది పరిశుద్ధ స్వభావమే. స్వాధ్యాయ అధ్యయనపరుడు. మొదటి భార్యకు తొమ్మిదిమంది కొడుకులున్నారు. చిన్నభార్యకు ఇతడు కాక ఇంకొక ఆడపిల్ల పుట్టారు. భరతుడికి పూర్వజన్మ జ్ఞాపకం వుండేది. భరతుడు తండ్రి చెప్పడం వల్ల గాయత్రీ మంత్రోపదేశం పొందాడు. వేదాలను అధ్యయనం చేశాడు. అంగిరసుడు చనిపోయిన తరువాత తల్లి ఆయనతో సహగమనం చెసింది. సవతి తల్లి కొడుకులు ఇతడిని వేదాద్యయనం చెయ్యనీయకుండా ఇంటి పనులకు నియమించారు. వారు చెప్పిన పనులు చేస్తూ, వాళ్ల బరువులు మోస్తూ, కూలిపని చేస్తూ, బిచ్చమెత్తుకునేవాడు. మాసిన గుడ్దలు కట్టుకునేవాడు. అతడి యజ్ఞోపవీతాన్ని చూసి ఇతడెవరో పిచ్చివాడనుకునే వారు. అలా కాలం గడిపేవాడు.     

ఒకనాడు ఒక శూద్రజాతి నాయకుడు తనకు సంతానం కలగడానికి కాళికాదేవికి బలి ఇవ్వడానికి ఒకడిని పట్టుకుని తీసుకుపోతున్నారు. వాడు వీళ్లనుండి తప్పించుకుని పారిపోగా, అతడిని వెతుకుతుంటే, భరతుడు దొరికాడు. పారిపోయినవాడి స్థానంలో ఇతడిని బలి ఇవ్వడానికి నిశ్చయించుకుని దానికి అవసరమైన సంస్కారాలు చేసారు భరతుడికి. కాళికాదేవి ఎదుటికి తెచ్చి కూచోబెట్టారు. ఆ సమయంలో ఈ బ్రాహ్మణ బాలుడి తేజస్సు సాక్షాత్తు కాళికాదేవినే ఆశ్చరపరిచింది, భయం కొలిపింది. హుంకారం చేసి బలివ్వాలనుకున్న శూద్రనాయకుడిని బలి తీసుకుంది. భరతుడు ఇదేమీ పట్టనట్లు వాసుదేవుడిని హృదయంలో స్మరిస్తూ నిర్వికారంగా వున్నాడు. తరువాత భరతుడు ఆలయం నుండి బయటకొచ్చి ఎప్పటిలాగే చేనుకు కాపలా కాయసాగాడు.   

ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఇదిలా వుండగా, సింధు దేశాన్ని పాలిస్తున్న రహుగణుడనే రాజు కపిల మహర్షి దగ్గర నుండి తత్త్వ జ్ఞానాన్ని తెలుసుకోవాలన్న కోరికతో ఒకనాడు రాచఠీవితో పల్లకి ఎక్కి బయల్దేరాడు. పల్లకి బోయీలలో ఒకడు సరిగ్గా నడవలేకపోవడంతో వాడి స్థానంలో దారిలో కనిపించిన భరతుడికి ఆపని ఆప్పగించారు. ఏమాత్రం చింతపడకుండా పల్లకిని మోయసాగాడు భరతుడు. అలవాటు లేనందున అతడు మోస్తుంటే పల్లకి కుదుపులకు లోనైంది. రహుగణుడికి భరతుడి మీద కోపం వచ్చింది. నిష్టూరంగా అతడిని మందలిస్తూ వేళాకోళంగా మాట్లాడాడు. భరతుడు మాత్రం జవాబివ్వకుందా పల్లకి మోయసాగాడు. అతడికి అహంకార మమకారాలు లేవు తన శరీరం మీద. సాక్షాత్తు పరబ్రహ్మం మీదే చూపు కలిగి అప్పగించిన పని చేస్తున్నాడు. రాజుకు మరింత కోపం వచ్చింది. తన ఆజ్ఞ పాటించకుండా తప్పుగా నడుస్తున్న వాడిని సరిగ్గా నడిపిస్తానని రాజు గర్వంతో, హద్దూ-అదుపూ లేకుండా మాట్లాడ సాగాడు. 

బ్రాహ్మణుడీ (భరతుడు) మాటలను విన్నాడు. జవాబుగా: "రాజా! బరువు ఈ శరీరానికి కాని నాకు కలగదు. ఆకలిదప్పులు, మనోవ్యాధులు, మమకారం, అహంకారం, రోగాలు, రోషం....ఇత్యాదులు శరీరంతో పుట్టేవేకాని నాకు ఏర్పడేవి కావు. అందరూ జీవన్మృతులే. బంధాలన్నీ శరీరానికి వుంటాయి కానీ జీవుడికి వుండవు. జడునిలా వుంటూ బ్రహ్మాత్మస్వభావంతో వున్న నామీద నువ్వు విధించే శిక్షవల్ల ఏం లాభం చేకూరుతుంది? నేను శరీరభావం లేని స్తబ్దుడిని, మత్తుడిని. అలాంటి నాకు నువ్వు విధించే శిక్ష వ్యర్థం", అని, ఇలా ఏవేవో ప్రాపంచిక విషయాలు చెప్పసాగాడు. రహుగణుడు ఈ మాటలను విన్నాడు. కపిలముని దగ్గరికి తత్త్వ జ్ఞానం కోసం పోతున్న అతడికి భరతుడి మాటలు హృదయగ్రంథిని విడదీశాయి. వెంటనే రాజు పల్లకి లోనుండి దిగాడు. భరతుడికి సాష్టాంగదండ ప్రమాణం చేశాడు. గర్వాన్ని విడిచి, చేతులు జోడించి ఆయనెవరని అడిగాడు. ఆయనే కపిల మునీంద్రుడా అని ప్రశ్నించాడు. జవాబుగా భరతుడనే ఆ బ్రాహ్మణుడు, ఈ సంసారం ఒక ఘటం లాంటిదనీ, దానికి శిక్షణను, రక్షణను కలిగించేవాడు రాజనీ, అతడు చెడు కర్మలను మాని వాసుదేవుడిని సేవిస్తే మళ్లీ జన్మ ఎత్తకుండా, సంసారంలో చిక్కకుండా వుంటాడనీ అన్నాడు. 

భరతుడి మాటలు విన్నాక రహుగణుడిలో మార్పు వచ్చింది. అతడిని వినయంతో ప్రస్తుతించాడు. తను రాజుననే దురభిమానంతో గుడ్డిగా ప్రవర్తించాననీ క్షమించమనీ అన్నాడు. తనకు తెలిస్న తత్త్వాన్ని మరికొంత బోధించాడు భరతుడు. అతడు కారణజన్ముడని, నిత్యమూ పరమాత్మానుభవంలోనే వున్నవాడని,  అనుభవ విహారి అని, సాటిలేని పరమ శాంతిని పొంది వున్నాడని, మహాజ్ఞానియైన ఆయనకు మళ్లీ-మళ్లీ నమస్కరిస్తున్నానని అన్నాడు రాజు రహుగణుడు. తన సంశయాలన్నింటినీ భరతుడిని అడిగి నివృత్తి చేసుకోవలనుకుంటున్నానని, ఆధ్యాత్మయోగాన్ని తనకు యోగ్యమైన పద్ధతిలో చెప్పమని అడిగాడు. జవాబుగా పరమార్థమై జ్ఞానరూపమైనట్టి పరబ్రహ్మమొక్కటే సత్యమైనదని, జగత్తు అసత్యమైనదని, పరమ భాగవతుల పాదసేవ చేయడం వల్ల బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుందని, మహాభాగవతులను సేవిస్తే మోక్షసాధనకు పద్మాక్షుడైన శ్రీహరి మీదే మనస్సు నిలిచి వుంటుందని చెప్పాడు భరతుడు. తన పూర్వజన్మల గురించి, అలా ఎత్తడానికి కారణం గురించీ చెప్పాడు. రాజుకు సంసారమనే అడవి తీరు ఎలా వుంటుందో వివరించాడు. రాజు అనే భావాన్ని విడిచి, సకల చరాచర ప్రపంచంతో స్నేహితుడిగా వుండమనీ, ఇంద్రియాలను జయించమనీ, జ్ఞానం అనే ఖడ్గంతో మాయా పాశాన్ని తెగనరికి జీవిత గమ్యస్థానాన్ని చేరుకోమనీ బోధించాడు. అలా యోగీశ్వరుడైన భరతుడు రాజుమీద కరుణతో తత్త్వజ్ఞానాన్ని ఉపదేశించాడు. ఆయన బోధనలు విన్న రాజు ఆయనకు తనివితీరా నమస్కరించాడు. రాజు నమస్కారాన్ని అందుకుని భరతుడు దయ కలిగిన మనస్సుతో భూమ్మీద సంచరించాడు.          

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా) 

Thursday, January 23, 2025

లాస్ ఏంజెల్స్ దావాగ్నికాండ : వనం జ్వాలా నరసింహారావు

 లాస్ ఏంజెల్స్ దావాగ్నికాండ

వనం జ్వాలా నరసింహారావు

మనతెలంగాణ దినపత్రిక (24-01-2025)

2025 జనవరి 7 నుండి ప్రారంభమైన ‘లాస్ ఏంజెల్స్ దావాగ్నికాండ’ 24 మంది ప్రాణాలు కోల్పోవడానికి, అనేక భవనాలు ధ్వంసమవ్వడానికి, సుమారు రెండు లక్షల మంది వారి నివాసాల నుండి ఖాళీ చేయడం లేదా ఖాళీ చేయించమని హెచ్చరికలు అందుకోవడానికి కారణమైంది. బహుశా ఈ దావాగ్నిని మహాభారత ఇతిహాసంలోని ఖాండవ దహన కథతో సమీపంగా పోల్చవచ్చునేమో! ఖాండవ దహనం కథలో చోటుచేసుకున్న ‘విధ్వంసం’ సృష్టి ఆదిమధ్యాంతాలను ప్రతిబింబిస్తుంది. ద్వాపర యుగాంత ఆరంభానికి, కలియుగ మొదలుకాబోవడానికి సంకేతమని భావించవచ్చు. మహాకావ్యం మహాభారతంలో, ఖాండవ అరణ్యం భగవత్సరూపులుగా ప్రసిద్ధికెక్కిన శ్రీకృష్ణార్జున శక్తి-యుక్తులతో అగ్నికి ఆహుతైనట్లు వివరించడం జరిగింది. మానవుల అలక్ష్యం కారణానో, మెరుపుల దాటికో, లేదా అగ్ని పర్వతాల ప్రభావం వల్లో, అడవులలో సంభవించి, అతి త్వరగా వ్యాపించే ఆధునిక దావాగ్నుల ప్రమాదాలలో ఒకటైన ‘లాస్ ఏంజెల్స్ దావాగ్నికాండ’ కూడా ఖాండవ దహన విధ్వంసంలాంటి ప్రభావాన్ని చూపించాయి. రెండింటిలోనూ ‘అగ్ని (దేవత) శక్తి’ మార్పుకు సంకేతం. 

లాస్ ఏంజెల్స్ అగ్నికాండలో హాలీవుడ్ ప్రముఖులు అంతోనీ హాప్కిన్స్, బిల్లీ క్రిస్టల్, పారిస్ హిల్టన్, జెఫ్ బ్రిడ్జెస్, మండీ మూర్, మిలో వెంటిమిగ్లియా, టీనా నోల్స్ తదితరుల విలువకట్టలేని గృహాలు అగ్నికి ఆహుతయ్యాయి. చిత్ర పరిశ్రమకు ప్రీతిపాత్రమైన ‘పసిఫిక్ ప్యాలిసేడ్’ ప్రాంతంలో దావాగ్ని ఉధృతంగా కొనసాగింది. ప్యాలిసేడ్ ప్రాంతంలో 23,700 ఎకరాలు, ఈటన్ ప్రాంతంలో 14,100 ఎకరాల పైగా భూభాగం దగ్ధమైంది. ‘ది డోర్స్’ బ్యాండ్‌కు చెందిన ప్రముఖ గిటారిస్ట్ రాబీ క్రీగర్ తన బృందానికి హిట్ సాంగ్ ‘లైట్ మై ఫైర్’ను రాసిన లాస్ ఏంజెల్స్ నివాసం కూడా అగ్నికి బలైంది. జెపాల్ గెట్టి మ్యూజియం, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం వంటి ప్రముఖ ప్రదేశాలు ఈ అగ్నిప్రమాదంలో నష్టపోయాయి.

అడవి అగ్నిప్రమాదాలు సాధారణంగా ప్రకృతి లేదా మానవ తప్పిదాల వల్ల సంభవిస్తాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉష్ణోగ్రతలు పెరగడం, దీర్ఘకాలిక వర్షాభావం వల్ల అడవులు అగ్ని ప్రమాదానికి గురయ్యేలా మారడం, ఎండల వల్ల తేమ తగ్గడం, వేడి-పొడిబారిన గాలులు అగ్నిని వేగంగా వ్యాపింపజేయడం, మళ్లీ మళ్లీ చెలరేగే అగ్ని చినుకులతో కొత్త ప్రాంతాల్లో మంటలు రావడం, దట్టమైన అడవులు అగ్ని తీవ్రతను పెంచడం, ప్రాణాంతకమైన కొన్ని అటవీ మొక్కలు, పర్వత ప్రాంతాలు మంట వ్యాప్తికి కారణమవుతాయి.

దురదృష్టవశాత్తూ, కాలిఫోర్నియాలో ప్రతీఏటా వేసవి, శరదృతువులలో అగ్నిప్రమాదాలు సాధారణంగా సంభవించినప్పటికీ, వాతావరణ శాస్త్రవేత్తలు వాటిని ముందుగా అంచనా వేయడం సాధ్యపడడం లేదు. ఉపగ్రహాలు, డ్రోన్లు, అగ్ని ట్రాకింగ్ సాంకేతికతలు ఉన్నప్పటికీ, దావాగ్నిప్రమాదం ఏ సమయంలో, ఎక్కడ విస్తరిస్తుందో, ఎలా ముంచుకొస్తున్నదో ఖచ్చితంగా చెప్పడం కష్టమే. ఈసారి ప్రబల గాలులు అగ్ని వేగాన్ని ఊహించలేనంతగా పెంచాయి. లాస్ ఏంజెల్స్ అగ్నిప్రమాదాన్ని నివారించేందుకు సమగ్ర చర్యలు అవసరం. అలాగే ఇప్పుడు సంభవించిన లాస్ ఏంజెల్స్ అగ్నిప్రమాదంలో ‘సంక్షోభ నిర్వహణ’ అత్యంత అవశ్యం. 

ఇదే జరుగుతున్నది ఇప్పుడక్కడ. లాస్ ఏంజెల్స్ అగ్నిప్రమాద నేపధ్యంలో ‘రాష్ట్ర, ఫెడరల్ ప్రభుత్వ సంస్థలు’ త్వరితగతిన స్పందించి ‘తక్షణ అగ్నిమాపక చర్యలు’ చేపట్టాయి. వేలాది మంది అగ్నిమాపక సిబ్బంది, ప్రత్యేక బృందాలతో కలిసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగారు. అత్యవసర పరిస్థితిని ప్రకటించడంతో పాటు, నేషనల్ గార్డ్‌ను మోహరించి, ‘సరయిన సురక్షిత స్థలాలను’ ఏర్పాటు చేశారు. సహాయక చర్యల్లో భాగంగా నిబద్ధతగల ఫెడరల్ అగ్నిమాపక సిబ్బంది విమానాలను కూడా రక్షణ చర్యలకు వినియోగించారు. అయితే, శతాబ్దం నాటి పాత పైపులైన్‌ల వల్ల నీటి కొరత తలెత్తింది. ఫైర్ హైడ్రెంట్లు నీటికొరతవల్ల వృధా కాగా, అగ్నిమాపక దళాలు ప్రధానంగా గగనతల నీటి వర్షంపై ఆధారపడాల్సి వచ్చింది. సహాయ కేంద్రాలు అవసరమైన అన్ని తాత్కాలిక సదుపాయాలను కల్పించాయి. 

ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం ‘తక్షణ ఖాళీ చేయించాల్సిన ఉత్తర్వులు’ (Mandatory Evacuation Orders) జారీ చేసింది. వైర్‌లెస్ ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్, సామాజిక మాధ్యమాలు, స్థానిక ప్రసార సంస్థలు సరైన  సమయంలో క్షణ-క్షణం చోటుచేసుకున్న సమాచారాన్ని అందించేందుకు వినియోగించబడ్డాయి. కొత్త అగ్నిప్రమాదాలను నివారించేందుకు ‘ముందస్తు విద్యుత్ సరఫరా నిలిపివేతలు’ చేపట్టారు. కాలిఫోర్నియాను ‘ప్రధాన విపత్తు ప్రాంతంగా ప్రకటించాలి’ అనే అభ్యర్థనను ఫెడరల్ ప్రభుత్వం ఆమోదించింది. తద్వారా ‘ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (FEMA)’ సహాయం అందుబాటులోకి వచ్చింది. ‘నేషనల్ ఇంటర్ ఏజెన్సీ ఫైర్ సెంటర్ (NIFC)’ వివిధ రాష్ట్రాలలో అగ్నిమాపక చర్యలను సమన్వయం చేసింది. ‘పర్యావరణ పరిరక్షణ సంస్థ (EPA)’ వాయు నాణ్యతను పర్యవేక్షించింది. అయితే, అధిక కాలుష్యం, పొగ, బూడిద, లాస్ ఏంజెల్స్ అంతటా వ్యాపించి, ప్రజల్లో శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలకు దారి తీసింది. 

లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియాలో అగ్నిప్రమాద నివారణ, సహాయ కార్యక్రమాలు, పునరావాసంలో సామాజిక, స్వచ్ఛంద సంస్థలు (NGOs) కీలక భూమిక పోషించాయి. తక్షణ సాయంగా తిండి, నీరు, ఆశ్రయం కల్పించడం, మానసిక ఆరోగ్య సహాయాన్ని అందించడం, జంతు రక్షణ, పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాయి. అయితే, పరిమిత వనరులు, సమాచార లోపాలు, సమగ్ర సమన్వయం లోపించడం వంటి సవాళ్లు ముందుకొచ్చాయి. ‘అమెరికన్ రెడ్ క్రాస్, కాలిఫోర్నియా వాలంటీర్స్’ వంటి స్వచ్ఛంద సంస్థలు అత్యవసర సహాయ సేవలను అందించాయి.

ఈ నేపధ్యంలో మరొక్కమారు ఖాండవ దహనం, దాని విధ్వంసం ద్వారా సృష్టి ఆరంభ, అంతాలు చోటుచేసుకున్న వివరాలు ఆసక్తికరంగా వుంటాయి. అధిక సంఖ్యలో లక్షలాది జీవుల నివాసంగా ఉన్న ఖాండవ అరణ్యాన్ని, ‘దానవుల శిల్పి మాయ’ నివాసంగా ఉన్న దాన్ని, అర్జునుడు, శ్రీకృష్ణుడు ‘అగ్ని దేవుడి’ సహాయంతో సదుద్దేశంతో తగలబెట్టారు. అగ్ని దేవుడి ఆకలిని తీర్చేందుకు, ఆయన కోరికను నెరవేర్చేందుకు చేపట్టిన ఈ కార్యం యాదృచ్ఛిక ఘటన కాదు, దైవకల్పిత ఆదేశం. అరణ్యం నాశనమైనప్పటికీ, ఆ ప్రదేశంలో ‘మయ నగరం’ నిర్మితమైంది. దీనిని ఆధునిక విధ్వంస, పునర్నిర్మాణ సైకిల్ తోపోల్చవచ్చు. అంటే ఒక వినాశనం ఎప్పటికైనా మరొక నూతన సృష్టికి మార్గం సుగమం చేస్తుంది.

ఆధునిక అగ్ని ప్రమాదాలకు, ఖాండవ దహనానికి సారూప్యతలున్నాయి. కాలిఫోర్నియాలోని ఆధునిక అగ్ని ప్రమాదాలు సహజంగా లేదా మానవ అనాలోచన తప్పిదాలవల్ల సంభవించి విస్తృత స్థాయిలో నాశనానికి కారణమౌతాయి. ఖాండవ దహనంలో లాగా దేవతాప్రేరిత లేదా ప్రత్యేక ఉద్దేశాలు వీటికి నేపధ్యంలో లేకపోయినా, ఒకవేళ వున్నా తెలియక పోయినా, కొంతవరకు సామీప్య-సారూప్యతలు కనిపిస్తాయి. ఖాండవ దహనం లాగే, ఆధునిక అగ్ని ప్రమాదాలు అడవులను, వన్యప్రాణులను, మానవ నివాసాలను నాశనం చేయగల శక్తి కలవి. ఇరు సందర్భాల్లోనూ ప్రాణ నష్టం జరుగుతుంది. భౌగోళిక స్వరూపం పూర్తిగా మారిపోతుంది. ఖాండవ దహనం తర్వాత ‘మయనగరం’ నిర్మాణం జరిగినట్లే, ఆధునిక అగ్ని ప్రమాదాల తర్వాత పునరుద్ధరణ క్రమంలో కొత్త అభివృద్ధి, వన్యప్రాణుల పునరాగమనానికి అవకాశం ఉంటుంది. అయితే, దీర్ఘకాలంలో విలువైన మట్టిని కోల్పోవడం, జీవ వైవిధ్యం తగ్గిపోవడం వంటి సవాళ్లు ఏర్పడతాయి.

దావాగ్ని ప్రమాదాలపై ఆధ్యాత్మికత, యథార్థవాదం తెలుసుకోవడం అవశ్యం. మహాభారతంలోని ఖాండవ దహనం ఒక నైతిక, ధార్మిక యుద్ధంలో భాగంగా జరిగిందని చెబుతారు. కృష్ణుడు, అర్జునుడు దైవ సంకల్పాన్ని నెరవేర్చడంలో పాత్ర వహించారు. అయితే, ఆధునిక అగ్ని ప్రమాదాలు ప్రధానంగా మానవ తప్పిదాలు, సహజ కారణాల వల్ల ఏర్పడి, విపత్తు నిర్వహణ కోణంలో చూడబడతాయి. అగ్ని ప్రమాదాల తర్వాత పూర్తి పునరుద్ధరణ కోసం హిందూమత సంప్రదాయరీతిలో సంబంధిత దేవుళ్లను ప్రార్థించడం, పూజలు చేయడం సాంస్కృతిక, ఆధ్యాత్మిక పరంగా ప్రజలకు మేలు కలిగించవచ్చు. హిందూమత గ్రంథాలలో సూచించిన విధంగా అగ్ని దేవునికి ప్రార్థనలు, మహా మృత్యుంజయ మంత్రం, దుర్గాదేవి, శివుని పూజలు జరిపించడం వల్ల రక్షణ, పునరుద్ధరణ సులభతరం కావచ్చని ఒక నమ్మకం. అది నమ్మేవారిమీద ఆధారపడి వుంటుంది. 

కానీ, దీర్ఘకాల పునరుద్ధరణకు ఆధ్యాత్మికతతో పాటు యథార్థవాద దృక్పథంతో విపత్తు నిర్వహణ చర్యలు సహితం అత్యంతమౌలికమైన అవసరం. ‘ఆధ్యాత్మిక స్థైర్యం, శాస్త్రీయ చర్యల’ సహజ సాంకేతిక, మానసిక కలయిక ద్వారా మాత్రమే బాధిత సమాజం పూర్తిగా కోలుకోవడమే కాక, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించగలాడం సాధ్యం. దావాగ్నులపై దీర్ఘకాలిక సమగ్ర పోరాటం చేయడం అంటే ఆధ్యాత్మిక మద్దతు, ప్రభుత్వ చర్యలు, సామాజిక భాగస్వామ్యం, పర్యావరణ స్థిరత్వాన్ని సమతుల్యంగా ప్రణాళికాబద్ధంగా అమలు చేయడమే!

లాస్ ఏంజెల్స్‌లోని పాలిసేడ్స్ అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. ప్రధాన కారణం మానవ ప్రమేయం కావచ్చని అధికారులు చెపుతున్నారు. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, యువతీ యువకులకు ఆహ్లాదం కలిగించే ‘స్కల్ రాక్’ అనే ప్రదేశం దగ్గరిలో మొదలైంది. ఈటన్ అగ్ని ప్రమాదానికి పవర్ లైన్లలోని లోపాలని మరో కథనం. ఖాండవ దహనం ఒక దివ్య సంకల్పంగా పరిణమిస్తే, ఆధునిక అగ్ని ప్రమాదాలు మానవ తప్పిదాలు, సహజ విపత్తుల రూపంలో సమాజాన్ని పరీక్షిస్తున్నాయి. ధైర్యం, సామూహిక ప్రేరణ, ఆధ్యాత్మిక విశ్వాసాలతో ఇలాంటి విపత్తుల ను అధిగమించవచ్చు. అగ్ని నిర్ఘాతం భవిష్యత్తును మార్చినా, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగడం మన చేతిలో ఉంది.

(యూఎస్ఏ మీడియా నివేదికలు, మహాభారతం ఆధారంగా)

Wednesday, January 22, 2025

కలిసి నిర్ణయం తీసుకున్నాక కప్పదాట్లు తగవు! ...... వనం జ్వాలా నరసింహారావు

 కలిసి నిర్ణయం తీసుకున్నాక కప్పదాట్లు తగవు!

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (23-01-2025)

{మంత్రిని మెప్పించడానికి సివిల్ సర్వెంట్లు చట్టపరమైన, విధివిధానాలకు భిన్నంగా అత్యుత్సాహం ప్రదర్శించి, మంత్రితో కలిసి నిర్ణయం తీసుకుని, ఆ తర్వాత ఆ నిర్ణయం విషయంలో పదవి కోల్పోయిన మంత్రిని తప్పుబట్టడం సరైంది కాదు. ఒకసారి మంత్రితో కలిసి సివిల్ సర్వెంట్ నిర్ణయం తీసుకున్న తరువాత వారిద్దరూ తత్సంబంధమైన విషయంలో తప్పొప్పులకు పూర్తి బాధ్యత వహించాలి. తమ పాత్రను అంగీకరించాలి. అధికారి పూర్తిగా మంత్రిని తప్పు పట్టడం లేదా మంత్రి అధికారిని తప్పు పట్టడం సరైనది కాదు} – సంపాదకుడి వ్యాఖ్య  

‘ఫార్ములా-ఈ రేస్ కేసు’కు సంబంధించిన ఆర్ధిక లావాదేవీల విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణ చేసిన  తెలంగాణ ప్రభుత్వ అవినీతి నిరోధక శాఖ, ఈ అంశంలో మాజీ మంత్రి కేటీ రామారావు, సివిల్ సర్వెంట్ అర్వింద్ కుమార్‌ ల పై కేసు నమోదు చేసింది. సరైన విధివిధానాలను పాటించకుండా, రేసింగ్ కంపెనీకి నిధుల బదిలీ జరిగిందనీ, ఆ వివరాలను ఏసీబీ దర్యాప్తులో అర్వింద్ కుమార్ బైటపెట్టారనీ, మీడియా వెల్లడించింది. అంతే కాకుండా, ‘మాజీ మంత్రి కేటీ రామారావు’ ప్రభుత్వ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా హెచ్‌ఎండీఏ నుంచి నిధులను విడుదల చేయమని తనను ఆదేశించినట్లు కూడా అర్వింద్ కుమార్ తెలిపారట. ప్రజాస్వామ్య వ్యవస్థలో, ఒక మంత్రి-సివిల్ సర్వెంట్ ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకున్న తరువాత, ఆ నిర్ణయానికి తనవంతు బాధ్యతను సివిల్ సర్వెంట్ పూర్తిగా విస్మరించి, తనకు ఏమీ సంబంధం లేదని చెప్పడం అంటే  సివిల్ సర్వెంట్ తన ‘భుజాలపై వేసుకోవాల్సిన గురుతర బాధ్యతను’ విస్మరించాడనే అనుకోవాలి. ఇది సబబా, కాదా, అనే అంశం మీద కూలంకశంగా చర్చ జరగాల్సిన అవసరం వున్నది.

 ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన నిజానిజాల, వాస్తవాల, మంచి-చెడుల విషయానికి పోకుండా, ఇలాంటి సందర్భాలలో, సంబంధిత మంత్రి, ఉన్నత స్థాయి ప్రభుత్వ పదవిలో ఉన్న సివిల్ సర్వెంట్ (ఐఏస్ అధికారి) కలిసి ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయాల నేపధ్యంలో, ఆ మంత్రులు కానీ, అఖిలభారత సర్వీసులకు చెందిన ఉన్నతాధికారులు (బ్యూరోక్రాట్స్, సివిల్ సర్వెంట్లు) కానీ, లేదా ఇద్దరు ఉమ్మడిగాకానీ తీసుకునే పాలనాపరమైన ప్రతి ప్రభుత్వ నిర్ణయం, ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో సాక్ష్యాధారాలతో సహా ఇద్దరూ సమర్థించాలి, లేదా చేసిన తప్పు ఒప్పుకోవాలే కాని, ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా తమకు దాంతో సంబంధం లేదన్నట్లు బాధ్యాతారాహిత్యంగా మాట్లాడడం సరైనదికాదు. మంత్రి అధికారి మీదకానీ, అధికారి మంత్రి మీదకానీ బాధ్యత నెట్టివేయడం అనైతికం.  ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆరోగ్యకరమైనది కాదు. 

మంత్రులతో మాట్లాడే సందర్భంలో, ప్రతి చిన్న విషయంలో ‘అవును సార్’ అనే అలవాటు కొందరు ఐఏఎస్ అధికారులకు వుంటుంది. మంత్రితో అవసరం తీరిన తరువాత ఇలాంటివారు ‘బ్లేమ్ గేమ్’ ఆడడం మొదలుపెడతారు. తప్పంతా మంత్రిదేనని, తాము పరిశుభ్రంగా వున్నామని వాపోతారు. పాలనాపరమైన సద్బావనకు, బాధ్యత లేని దృక్పథానికి ఇది ఒక దుష్టసంకేతం. ఈ ప్రవర్తన సివిల్ సర్వీస్‌కు చెందిన ప్రాధమిక నీతిసూత్రాలకు దూరంకావడం, బాధ్యత విస్మరించడం, అవకాశవాదం అనే వాటిని ప్రతిబింబిస్తుంది. మంత్రి ఏదైనా నిర్ణయం తీసుకున్న సమయంలో, తామిస్తున్న సలహా చేదుమాత్రలాగా వున్నప్పటికీ, సరైన సలహా ఇవ్వడంలో సివిల్ సర్వెంట్ విఫలమై, ఆ తర్వాత మంత్రి తప్పు చేశారని నిందించడం తగనేతగదు. సమయ, సందర్భాలకు అనుగుణంగా ఉత్తమమైన, ఆచరణాత్మకమైన సలహాలు ఇవ్వడం కొందరు సివిల్ సర్వెంట్లకు చేతకాకపోవచ్చు. అయితే, అలా ఇవ్వడానికి ఏమాత్రం భయపడని పలువురు సివిల్ సర్వెంట్లు గతంలోనూ, ఇప్పటికీ ఉన్నారు. ఇక ముందూ వుంటారు. 

ఉదాహరణకు, పీవీ నరసింహారావు ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం సమయంలో, అప్పుడు రాళ్లదాడులు జరుగుతున్న విజయవాడకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే, అక్కడ చోటుచేసుకున్న పరిస్థితుల దృష్ట్యా ఆపర్యటనను విరమించుకోవాలని నాటి కలెక్టర్, ఎస్పీ సలహా ఇచ్చారు. కానీ, రాజకీయ పరిణామాల దృష్ట్యా పీవీ వెళ్లేందుకే నిర్ణయించుకున్నారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐసీఎస్ అధికారి, వల్లూరి కామేశ్వర (వీకే) రావు కూడా కలెక్టర్, ఎస్పీ సలహా వినడమే మంచిదని సూచించారు. కానీ పీవీ ‘మీరు నా క్రింద పనిచేసే ఉద్యోగి. దయచేసి నా ఆదేశాలను అమలుచేయండి. నేను వెళ్లడానికి ఏర్పాట్లు చేయండి’ అన్నారు. 

అలా అంటూనే ప్రయాణానికి సిద్ధమై వాహనం తయారుగా వుంచమని ఆదేశించారు. ఆశ్చర్యకరంగా, ప్రధాన కార్యదర్శి వీకే రావు డ్రైవర్ను కారు తీసుకురావద్దని ఆదేశించినట్లు పీవీకి తెలిసింది. అదేమని అడిగితే- ‘అవును సార్, నేను మీ కింద పనిచేసే ఉద్యోగినే. అలాగే,  డ్రైవర్ నా కింద పనిచేసే ఉద్యోగి. అతను నా ఆదేశాలను పాటిస్తాడు. అందుకే రాలేదు’ అని ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రికి సవినయంగా, నిశ్చయంగా తెలియచేశారు. పీవీ ఆ ప్రయాణాన్ని మానుకున్నారు. మరుసటి రోజు పీవీ వల్లూరిని ప్రశంసిస్తూ, ‘నేను నిన్న వెళ్ళి ఉంటే, ఉద్రిక్తతలు మరింత పెరిగేవి. మీరు నన్ను ఆపడం ద్వారా మంచి పని చేసారు’ అన్నారు. ఆదర్శప్రాయమైన సివిల్ సర్వెంట్ల నిబద్ధతకు, ముఖ్యమంత్రుల వినయానికి ఇది ప్రతీక అని ఈ విషయం నాతో చెప్పిన భండారు శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. వీకే రావు 104 సంవత్సరాల వయసులో మరణించారు. 

అలాగే, నీలం సంజీవ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, చిత్తూరు పర్యటనలో భాగంగా, అక్కడి ప్రభుత్వ అతిథి గృహంలో ఉండాలనుకున్న గదిని, ఇంచుమించు అదే సమయంలో రావాల్సిన మాజీ గవర్నర్ జనరల్ సీ రాజగోపాలాచారికి కేటాయించడంతో, సంజీవరెడ్డిని వేరే గదిలో వుండమని  కలెక్టర్ బీకే రావు చెప్పారు. ఒకవేళ ఆ గదిలో వున్నప్పటికీ, రాజాజీ రాగానే, ప్రోటోకాల్ ప్రకారం, సీఎం ఖాళీ చేయాల్సి ఉంటుందని మర్యాదపూర్వకంగా చెప్పారు. ఆరోజు రాజాజీకి స్వాగతం చెప్పేందుకు కొంచెం ముందుగానే బీకే రావు ఎస్పీ గురునాథ రావుతో కలిసి అతిథి గృహానికి చేరుకున్నారు. పాత్రికేయుడు జీ కృష్ణ కథనం ప్రకారం - బీకే రావుతో ముఖ్యమంత్రి సంజీవరెడ్డి సరదాగా, ‘ఓహ్! నన్ను ఖాళీ చేయించడానికి మీరు పోలీసు అధికారితో వచ్చారా!’ అని అన్నారట. అందరూ నవ్వుకున్నారు. ముఖ్యమంత్రి తనకు కేటాయించిన గదికే మారిపోయారు. ఇది కలెక్టర్ సలహా ఇచ్చే విధానం, అది ముఖ్యమంత్రి దాన్ని స్వీకరించిన విధానం. బీకే రావు ఇటీవల 93 ఏళ్ల వయస్సులో మరణించారు.

ఎస్ఆర్ శంకరన్, భూ సంస్కరణలు, గిరిజన హక్కుల రక్షణను బలంగా సమర్థించడానికి, ఉద్దండ రాజకీయ నేతలతో, ప్రజాప్రతినిధులతో ఢీకొనాల్సి వచ్చింది. చివరకు ఆయన ఆలోచనలు విజయం సాధించి, రాష్ట్రంలోని గ్రామీణ అభివృద్ధికి పునాదిగా నిలిచాయి. టీఎన్ శేషన్, భారత ఎన్నికల ప్రక్రియను సంస్కరించడానికి రాజకీయ నాయకులను ధీటుగా ఎదుర్కొన్నారు. ఎన్నికల సమయంలో నిధుల దుర్వినియోగాలను తగ్గించడం, బల ప్రదర్శన, నల్లధన వినియోగాన్ని నిరోధించడం వంటి చర్యలతో ఆయన ఎన్నికల సంఘాన్ని బలపరిచారు, అయితే ఈ నిర్ణయాలు రాజకీయ నాయకుల వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి. హర్యానాలో రాబర్ట్ వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ మధ్య భూమి ఒప్పందాన్ని అశోక్ కేమ్కా ధైర్యంగా రద్దు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో యమునా, హిండాన్ నదీ పరీవాహక ప్రాంతాల్లో అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టడానికి దుర్గ శక్తి నాగపాల్, ధైర్యంగా, నిబద్ధతతో పనిచేశారు. ఆమె చర్యలు శక్తివంతమైన రాజకీయ సంబంధాలున్న తవ్వకాల మాఫియాను ప్రభావితం చేశాయి. కర్ణాటకలో భూముల కేటాయింపుల్లో, ఆక్రమణలలో అక్రమాలను రోహిణి సింధూరి బహిర్గతం చేశారు. ఆమె పట్టుదల ప్రజా భూముల పునరుద్ధరణకు, ప్రాజెక్ట్ సంస్కరణలకు దారి తీసింది. ఆమె పారదర్శకత ఆర్థిక బాధ్యతాత్మకతకు చిహ్నంగా నిలిచింది.

ఈ కొద్ది ఉదాహరణలు, కొందరు ఐఏస్ అధికారుల ధైర్యానికి, నిబద్ధతకు, పారదర్శకతకు, దూరదృష్టికి, నైతిక ప్రమాణాలను నిలబెట్టడానికి, ఆర్ధిక క్రమశిక్షణకు నిదర్శనం. ‘దేశానికి ఉక్కు చట్రం’ అని వల్లభభాయ్ పటేల్ పేర్కొన్నట్లు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏస్), స్వతంత్ర్యానంతరం ఇండియన్ సివిల్ సర్వీస్ (ఐసీఎస్) స్థానంలోకి వచ్చింది. ఐఏస్ కి ఎంపిక కాబడ్డవారు వివిధ రంగాలలో, అద్భుతమైన ప్రతిభాశాలులుగా, సమాజంలోని ఇతరులకంటే అత్యంత విజ్ఞానవంతులుగా ఉంటారు. వీరి ఎంపిక కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, వివిధ రకాల వడపోతల అనంతరం జరుగుతుంది. ఈ అధికారులకు రాజ్యాంగం రక్షణ కల్పిస్తుంది. సర్దార్ పటేల్ చెప్పినట్లు, ఐఏస్ అధికారులు తమ బాధ్యతలను నిర్వహించడంలో, కర్తవ్య నిర్వహణలో, అనుభవపూర్వకంగా సలహాలు, సూచనలు ఇవ్వడంలో, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. దేశ భవిష్యత్తు వీరిపైనే ఆధారపడి ఉంటుంది. 

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాల్సిన బాధ్యత సివిల్ సర్వెంట్లపై వున్నది. ముఖ్యమంత్రి లేదా మంత్రి ఏపార్టీకి చెందిన వారైనప్పటికీ, వారి పట్ల వీరి పాలనాపరమైన దృక్పథం ఒకేరీతిలో వుండాలి. వారు తమ అనుభవానికి అనుగుణంగా, సాంప్రదాయ-చట్టబద్ధంగా ఏర్పాటైన విధి విధానాలకు కట్టుబడి సంబంధిత మంత్రికి, ముఖ్యమంత్రికి, లేదా ప్రధాన పంత్రికి, తగుసమయంలో విలువైన సూచనలు అందించాలి. సివిల్ సర్వెంట్ సరైన సందర్భంలో, సరైన సమాచారం అందించడంలో విఫలమైనా, లేదా తప్పు సలహా ఇచ్చినా, నిర్ణయ విధాన ప్రక్రియ తెలిసినా ఆ విషయం వివరించకపోయినా, మంత్రి నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం కలిగించినా, అది వారి బాధ్యతారాహిత్యాన్ని, పనితీరులో వైఫల్యాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే, సివిల్ సర్వెంట్ ఇచ్చిన సలహా ఆధారంగా (రాతపూర్వకంగా ఇవ్వడం తప్పనిసరి) మంత్రి తనదైన పద్ధతిలో తుది నిర్ణయం తీసుకున్న తర్వాత, సివిల్ సర్వెంట్ దాన్ని అమలు చేయాలి. బాధ్యతను ఇరువురు సరిసమానంగా పంచుకోవాలి.  

మంత్రిని మెప్పించడానికి సివిల్ సర్వెంట్లు చట్టపరమైన, అనాదిగా వస్తున్న ఆచారాలకు, స్థాపిత విధివిధానాలకు భిన్నంగా, అత్యుత్సాహం ప్రదర్శించి, మంత్రితో కలిసి నిర్ణయం తీసుకుని, ఆ తర్వాత ఆ నిర్ణయం విషయంలో పదవి కోల్పోయిన మంత్రిని తప్పుబట్టడం సరైంది కాదు. అలా చేస్తే, సివిల్ సర్వెంట్‌గా ఉండటం అర్ధరహితమవుతుంది. పాలనాపరమైన ప్రభుత్వ నిర్ణయాల విషయంలో, ముఖ్యంగా ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించిన విషయాలలో, ఒకసారి మంత్రితో కలిసి సివిల్ సర్వెంట్ నిర్ణయం తీసుకున్న తరువాత వారిద్దరూ తత్సంబంధమైన విషయంలో తప్పొప్పులకు పూర్తి బాధ్యత వహించాలి. తమ పాత్రను అంగీకరించాలి. అధికారి పూర్తిగా మంత్రిని తప్పు పట్టడం లేదా మంత్రి అధికారిని తప్పు పట్టడం సరైనది కాదు. తమతమ పదవీకాలంలో తీసుకున్న నిర్ణయాలను నిబద్ధతతో అంగీకరించి, వాటిని తీసుకున్న నేపధ్యాన్ని సాక్ష్యాధారంగా సమర్థించే ధైర్యం అవసరం. ఆర్థిక లావాదేవీ చట్టబద్ధంగా జరిగినట్లయితే ఆ విధానాన్ని ఆత్మవిశ్వాసంతో తెలియజేయాలి. ఉమ్మడి బాధ్యత, పవిత్రమైనదిగా భావించాలి. సివిల్ సర్వెంట్లు బాధ్యతనుండి తప్పించుకోవడం నైతికతను దెబ్బతీస్తుంది. ‘ఉక్కు చట్రాన్ని’ బలహీనపరుస్తుంది.’

సివిల్ సర్వెంట్లు దేశ పాలనా వ్యవస్థకు మౌలిక స్థంభాలు. వారు నైతికత, నిబద్ధత, ప్రజా సేవకు అంకితమవుతేనే పాలనకు మంచి రూపం వస్తుంది. సివిల్ సర్వెంట్ల లక్ష్యం ప్రజల మేలు కోసం పనిచేయడం మాత్రమే కాక, పరిపాలనా వ్యవస్థలో పారదర్శకతను, విశ్వసనీయతను, సమర్థతను ప్రోత్సహించడంగా ఉండాలి. ప్రజాస్వామ్యానికి వీరి ఉక్కు చట్రం ఎంత బలంగా ఉంటే, ప్రజల విశ్వాసం అంత దృఢంగా నిలుస్తుంది. వీరి ప్రతి నిర్ణయం, ప్రతి చర్య, ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి, వీరు తమ శక్తితో, నిబద్ధతతో, సత్యనిష్టతో పని చేస్తూ, సమాజాన్ని ముందుకు నడిపించే మార్గదర్శకులు కావాలి. నిజాయితీతో వీరు వేసే ప్రతి అడుగు ప్రజాస్వామ్యానికి శాశ్వతమైన బలం చేకూరుస్తుంది.

మంత్రిది తుది నిర్ణయం కావచ్చు, కానీ సివిల్ సర్వెంట్ మంత్రికి ఇచ్చిన తన సలహాను, మంత్రి స్పందనను, దరిమిలా ఇచ్చిన ఆదేశాలను, ఆ నిర్ణయం అమలుకు ముందు రికార్డు చేయాలి. ఇది సివిల్ సర్వెంట్ ప్రత్యేక బాధ్యత. సివిల్ సర్వెంట్లు తమ విధుల పరిధిలో నిజాయితీగా, వృత్తిపరంగా అభిప్రాయాలను వ్యక్తపరచాలి. సివిల్ సర్వెంట్లు ‘ఉమ్మడి బాధ్యతల విషయంలో నిర్భయంగా, నిష్పక్షపాతంగా సలహా’’ ఇచ్చి, తప్పును తప్పని, ఒప్పును ఒప్పని స్పష్టంగా సంబంధిత మంత్రికి తెలియచెప్పి, భారత ప్రజాస్వామ్యంలోని ఐఏస్ అనే ‘స్టీల్ ఫ్రేమ్‌’ (ఉక్కు చట్రం) సమర్ధవంతంగా పనిచేయడానికి తోడ్పడాలి. వారు విఫలమైతే, ప్రజలకు ‘ప్రభుత్వ పాలనపై నమ్మకం’ సన్నగిల్లుతుంది.

Sunday, January 19, 2025

సాక్షాత్ భగవత్ స్వరూపుడైన ఋషభుడు ..... శ్రీ మహాభాగవత కథ-19 : వనం జ్వాలా నరసింహారావు

 సాక్షాత్ భగవత్ స్వరూపుడైన ఋషభుడు

శ్రీ మహాభాగవత కథ-19

వనం జ్వాలా నరసింహారావు 

సూర్యదినపత్రిక (20-01-2025)

కంII చదివెడిది భాగవతమిది, 

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

చదివినను ముక్తి కలుగును, 

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై 

రాకుమారుడైన ప్రియవ్రతుడు నారద మహర్షికి ప్రియశిష్యుడు. ఒకసారి అపూర్వమైన సత్రయాగం చెయ్యాలనే ఉద్దేశంతో దీక్షవహించాడు. తండ్రి స్వాయంభువ మనువు రాజ్యపాలన చెయ్యమని కొడుకును ఆజ్ఞాపించాడు. కాని దానివల్ల రాగద్వేషాలు పెరిగి భగవత్ జ్ఞానం పోతుందనే భయంతో ప్రియవ్రతుడు ఒప్పుకోలేదు. ఈ సంగతి బ్రహ్మదేవుడికి తెలిసింది. ఆయనకు రాజ్యపాలన మీద మనస్సు పుట్టించాలని నిర్ణయించుకుని, బయల్దేరి, గంధమాదన పర్వత లోయల్లో వున్న ప్రియవ్రతుడు, నారదుడు, స్వాయంభవ మనువుల దగ్గరికి వచ్చాడు. వచ్చి, ప్రియవ్రతుడితో, విష్ణుమూర్తి మాటలుగా, ఆయన శాసనంగా కొన్ని విషయాలు చెప్పాడు. "మనమంతా సర్వేశ్వరుడు నడిపించినట్లు నడుస్తున్నాం. శరీరాన్ని ధరించడం, ప్రారబ్దాన్ని అనుభవించడం, ఎవరూ తప్పించుకోలేరు. ఇంద్రియ నిగ్రహం లేకుండా అడవికి పోయినా సంసార బంధం వున్నట్లే. ఇంద్రియ నిగ్రహం కలిగి, ఆత్మస్వరూపం తెలిసి, బ్రహ్మనిష్ట కలిగినవారికి గృహస్తు అయినా మోక్షం లభిస్తుంది. నువ్వు కూడా భగవంతుడు నీకు కలిగించిన భోగాలను అనుభవించు. వీటి పట్ల సంగం లేకుండా ప్రవర్తిస్తూ ముక్తిని పొందు" అన్నాడు బ్రహ్మదేవుడు. ప్రియవ్రతుడు బ్రహ్మ సలహాను గౌరవంతో అంగీకరించాడు. ఇలా చెప్పి బ్రహ్మ వెల్లిపోయాడు. 

స్వాయంభవ మనువు తన కొడుకు ప్రియవ్రతుడికి పట్టాభిషేకం చేసి అరణ్యానికి వెళ్లాడు. బ్రహ్మ చెప్పిన ప్రకారం ప్రియవ్రతుడు రాజ్యపాలన చేస్తున్నాడు. విశ్వకర్మ ప్రజాపతి కుమార్తె బర్హిష్మతిని వివాహం చేసుకున్నాడు. ఆమె వల్ల పదిమంది కొడుకులను, ఒక కూతురును పొందాడు. కొడుకుల పేర్లు: అగ్నీధ్రుడు, ఇధ్మజిహ్వుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, హిరణ్యరేతుడు, ఘృతపృష్ణుడు, సవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవి. కూతురు పేరు ఊర్జస్వతి. కొడుకుల్లో కవి, మహావీర, సవనులు బాల్యం నుండే పరమహంసలయ్యారు. మనస్సులో భగవత్ సాక్షాత్కారం పొందారు. ప్రియవ్రతుడికి ఇంకో భార్యవల్ల ఉత్తముడు, తామసుడు, రైవతుడు అనే ముగ్గురు కొడుకులను కన్నాడు. వారు చాలా గొప్పవారై, మన్వంతరాలకు అధిపతులయ్యారు. ఈ ముగ్గురూ పరమహంసలైన కవి, మహావీర, సవనుల స్థానాన్ని పొందారు. ఇలా ప్రియవ్రతుడు పదకొండు కోట్ల సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు.    

  ఇలా రాజ్యాన్ని చక్కగా పాలిస్తున్నప్పుడు, ఒకనాడు ఒక అతిమానుషమైన పని చేశాడు. సూర్యుడు మేరుపర్వతానికి ఒకవైపున చీకటి కలిపించే సందర్భంలో, ఆ చీకటిని పోగొట్టడానికి, సూర్యుడి రథంతో సమానమైన వేగం, తేజస్సు కలిగిన రథాన్ని ఎక్కి, రాత్రులను పగలుగా చేస్తానని ఏడురోజులపాటు రెండో సూర్యుడిలాగా రథాన్ని పోనిచ్చాడు. రథ చక్రం తాకిడికి భూమ్మీద గోతులు ఏర్పడ్డాయి. అవే సప్త సముద్రాలయ్యాయి. ఆ సముద్రాల మధ్య భాగం ఏడు దీపాలయ్యాయి. మేరుపర్వతం చుట్టూ ప్రియవ్రతుడు తన రథంతో ఏడుసార్లు ప్రదక్షిణం చేశాడు కాబట్టి సముద్రాలు, ద్వీపాలు సప్త సంఖ్యలో వచ్చాయి. 

ఆ సప్త ద్వీపాలు: జంబూ ద్వీపం, ప్లక్ష ద్వీపం, శాల్మలి ద్వీపం, కుశ ద్వీపం, క్రౌంచ ద్వీపం, శాక ద్వీపం, పుష్కర ద్వీపం. వీటిలో జంబూ ద్వీపం లక్ష యోజనాల పరిమితి కలది. అక్కడి నుండి ఒక్కొక్క ద్వీపం ముందుదాని కంటే తరువాతది రెండు రెట్లు పెద్దగా ఉంటుంది. ఇక సప్త సముద్రాలు ఇవి: లవణ సముద్రం, ఇక్షు సముద్రం, సురా సముద్రం, ఘృత (నేతి) సముద్రం, పాల సముద్రం, దధి (పెరుగు) సముద్రం, జల సముద్రం. సముద్రాలు ద్వీపాలకు అగడ్తల లాగా ఉన్నాయి. సముద్రాలు, ద్వీపాలు ఒకదానితో ఇంకొకటి కలిసి పోకుండా, సరిహద్దులు పెట్టినట్లు వరుస తప్పకుండా ఏర్పడడం చూసి, సకల జీవులూ విస్తుపోయాయి.

ప్రియవ్రతుడు తన ఏడుగురు కుమారులైన అగ్నీధ్రుడు, ఇధ్మజిహ్వుడు, యజ్ఞబాహువు, హిరణ్యరేతుడు, ఘృతపృష్ణుడు, మేధాతిథి, వీతిహోత్రుడులను ద్వీపాలకు పరిపాలకులుగా నియమించాడు. కుమార్తె ఊర్జస్వతిని శుక్రాచార్యుడికిచ్చి పెళ్లి చేశాడు. వారి కూతురే దేవయాని. క్రమేపీ ప్రియవ్రతుడికి సంసారం మీద విరక్తి కలిగింది. విరాగయ్యాడు. కొడుకులకు రాజ్యాన్ని ఇచ్చాడు. భార్యను విడనాడాడు. సూర్యుడికి రెండవ సూర్యుడిలాగా వెలుగొందిన ప్రియవ్రతుడు చివరకు, శ్రీహరిని ధ్యానించడానికి గంధమాదన పర్వతానికి వెళ్లాడు. 

ఆ తరువాత అగ్నీధ్రుడు జంబూద్వీపాన్ని పరిపాలించి ప్రఖ్యాతికెక్కాడు. సంతానం కోసం బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు. బ్రహ్మ సంతోషించి పూర్వచిత్తి అనే అప్సరసను అగ్నీధ్రుడి దగ్గరికి పంపాడు. ఆమెను చూసి అగ్నీధ్రుడు కామ పరవశుడయ్యాడు. తనతో కలిసి తపస్సు చెయ్యమనీ, సంసారం చెయ్యమనీ కోరాడామెను. పూర్వచిత్తి అంగీకరించింది. లక్ష సంవత్స్రరాలు అతడితో కలిసుండి స్వర్గభోగాలను అనుభవించింది. వారికి నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృతుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురుడు, భద్రాశ్వుడు, కేతుమాలుడు అనే తొమ్మిదిమంది కొమారులు పుట్టారు. ఆ తరువాత పూర్వచిత్తి పిల్లల్ని, అగ్నీధ్రుడిని వదిలి బ్రహ్మలోకానికి వెళ్లిపోయింది. ఆమెనే తలపోస్తూ అగ్నీధ్రుడు కూడా పిల్లలకు రాజ్యాన్ని అప్పచెప్పి బ్రహ్మలోకానికి వెళ్లాడు. ఆయన తొమ్మిది మంది కొడుకులు మేరువు కుమార్తెలను వివాహం చేసుకున్నారు. 

అగ్నీధ్రుడి కొడుకైన నాభి, తన భార్య మేరుదేవితో కలిసి వాసుదేవుడిని కొలిచాడు. ఆయన నాబీమేరుదేవులకు ప్రత్యక్షమయ్యాడు. వారాయనను పరిపరి విధాలుగా స్తుతించారు. ఆయన లాంటి కొడుకు కావాలని నాభి, అతడి పక్షాన ఋత్విక్కులు భగవంతుడికి కోరారు. నాభి భార్య మేరుదేవికి తాను జన్మిస్తానని చెప్పి అంతర్థానమయ్యాడు. అన్నట్లే, మేరుదేవి గర్భంలో ప్రవేశించాడు నాభిమీద దయతో. ఋషభుడు అనే పేరుతో ఆమె ద్వారా అవతరించాడు శ్రీమన్నారాయణుడు. చాలా గొప్పవాడయ్యాడు. ఇంద్రుడు ఋషభుడి మహిమలను విని అసూయతో ఆయన రాజ్యంలో తీవ్రమైన అనావృష్టిని కల్పించాడు. ఇది తెలుసుకున్న ఋషభుడు తన మాయతో రాజ్యం అంతటా సమృద్ధిగా వర్షం కురిపించాడు. నాభి కొన్నాళ్లకు కొడుకుకు రాజ్యాన్ని పూర్తిగా అప్పగించి బదరికాశ్రమానికి వెళ్లి, శ్రీహరిలో లీనమయ్యాడు. ముక్తిపొందాడు నాభి. 

ఋషభుడు జయంతి అనే కన్యను వివాహమాడాడు. ఆమెవల్ల భరతుడు మొదలైన వందమంది కొడుకులను పొందాడు. ఎన్నో పురాలు, ఆశ్రమాలు, కొండలు, చెట్లు మొదలైన వాటితో నిండిన ఈ వర్షానికి అతడి (భరతుడి) పేరుమీదే ’భారత వర్షం’ అనే పేరొచ్చింది. ఆ మహాభారత వర్షంలో ఋషభుడు తన కొడుకులలో తొమ్మిదిమందిని భూభాగాలకు వారి-వారి పేర్లతో ప్రధానులుగా చేశాడు. మరో తొమ్మిది మంది భాగవత ధర్మాన్ని లోకంలో ప్రచారం చేయడానికి భాగవత ధర్మనిష్టులయ్యారు. మిగిలిన 81 మంది తండ్రి ఆజ్ఞానుసారం యజ్ఞాలు చేస్తూ బ్రాహ్మణోత్తములయ్యారు.  

కొడుకులకు సమస్త రాజ్యాన్ని ఇచ్చివేసి ఋషభుడు బ్రహ్మావర్త దేశానికి వచ్చాడు. ఒకనాడు కొడుకులను దగ్గరికి తీసుకుని, వారితో, కోరికలమీద బుద్ధి పెట్టవద్దనీ, వృద్ధులను, దీనులను ఆదుకోవాలనీ, పాపాలకు మూలమైన కామాన్ని కోరవద్దనీ, మోక్షసాధనకు కావాల్సిన ఉపాయాలను అన్వేషించమనీ, సమస్త జీవులపట్ల సానుభూతి చూపాలనీ, భగవంతుడి కథలను వినాలనీ, ఆధ్యాత్మయోగం కలిగి ఉండాలనీ, భగవద్ విషయాలనే మాట్లాడాలనీ, సాత్త్విక స్థితిలో వుండాలనీ, వీటన్నిటి ద్వారా లింగ శరీరాన్ని జయించి నిత్య శాశ్వత సుఖాన్ని పొందాలనీ బోధించాడు. అందరిలోకి పెద్దవాడైన భరతుడిని తండ్రిలాగా చూడమని చెప్పాడు. 

ఇంకాఇలా అన్నాడు: విష్ణువు బ్రహ్మజ్ఞాన సంపన్నులైన బ్రాహ్మణులను ఆదరిస్తాడనీ, అందువల్ల మానవుడికి బ్రాహ్మణుడు దైవమనీ, బ్రాహ్మణుడితో సమానమైన దైవం లేడనీ, అగ్నిలో హోమం చేయడం కంటే బ్రాహ్మణులకు సమర్పించిన దానినే భగవంతుడు సంతోషంగా తీసుకుంటాడనీ అన్నాడు. బ్రాహ్మణులలో తాత్త్విక చింతన, మనోనిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం, సత్యసంధత, తపస్సు, ఓరిమి వుంటాయనీ, ఇవన్నీ వున్న బ్రాహ్మణుడు తనకు సద్గురువనీ, అలాంటి బ్రాహ్మణుల శరీరంలో అందుబాటులో వుంటాననీ, బ్రాహ్మణులను భక్తితో పూజించడమే భగవంతుడిని ఆరాధించదం అనీ అన్నాడు సాక్షాత్ భగవత్ స్వరూపుడైన ఋషభుడు. బ్రాహ్మణ జాతిని పూజించేవాడు ఈ భూమ్మీద మోక్షమార్గాన్ని తెలుసుకుంటాడని, ఇది సత్యమని స్పష్టం చేశాడు.   

ఆ తరువాత ఋషభుడు లింగ శరీరం నుండి విముక్తుడై, మనస్సులో దేహాభిమానాన్ని విసర్జించాడు. ఇలా వుండగా ఆయనున్న అడవిలో దావాగ్ని రగిలి, అడవి తగులబడి, అందులో ఋషభుడి శరీరం కూదా దగ్దమైంది. ఋషభుడు సకల వేదాలకు, లోకాలకు, దేవతలకు, బ్రాహ్మణులకు, గోవులకు పరమగురుడు. సాక్షాత్తు భగవానుడు. అలాంటి ఋషభదేవుడి చరిత్రే హరిభక్తికి తాత్పర్యం. సాక్షాత్తు విష్ణువైన ఋషభుడు తన శరీరాన్ని వదిలి లయమయ్యాడు. అలా ముగిసింది ఋషభదేవుడి అవతారం. 

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా) 


Saturday, January 18, 2025

Civil Servants, Shoulder Shared Responsibilities : Vanam Jwala Narasimha Rao

 Civil Servants, Shoulder Shared Responsibilities 

Vanam Jwala Narasimha Rao

The Hans India (19-01-2025)

    {Civil servants should offer valuable suggestions based on experience, and strictly in accordance with the established procedures to the minister concerned, irrespective of his likes and dislikes. If the civil servant fails to provide accurate and proper information or gives wrong advice, or causes delay in the minister’s decision-making process, it shows their irresponsible behavior and inefficiency. However, once a final decision is taken by the minister, ‘Based on the Advice of Civil Servant’ strictly in writing, the civil servant may implement it. Instead of this established process, if civil servants exhibit overenthusiasm to please the minister and blame him later as if they had no say, then there is no meaning in his or her being a civil servant. In a democratic polity, the shared responsibility of minister and civil servant forms a basis for decision-making process; nothing prevents civil servants from boldly expressing their dissent}-Editor’s Synoptic Note

    Anti-Corruption Bureau registered a case against Former Minister KT Rama Rao and Civil Servant Arvind Kumar, accusing them of irregularities in the ‘Formula-E Race Case.’ Merits and Demerits of the Case apart, this is an instance to objectively analyze on ‘Shirking of Shared Responsibilities’ by Civil Servant. Every ‘Conscious Decision’ taken either by Ministers or by Bureaucrats or together, the propriety demands ‘Defend but not Deny.’ Whether, the Civil Servant or Minister singularly be absolved for any nonconformity is to be pondered over.   

    Going by Media Reports, Arvind Kumar during investigation, provided details on payments made to the UK-Based Racing Company ‘Without following Proper Procedures’ and admitted that ‘Former Minister KT Rama Rao Instructed’ him to release funds from HMDA without concurrence from Finance Department. If he confessed this, then it amounts to Civil Servant ‘Shifting Responsibility’ instead of ‘Shouldering.’ In a Democratic Polity ‘Shared Responsibility of Minister and Civil Servant’ forms basis for decision-making process, in which nothing prevents the Civil Servant to boldly express his dissent.  

    Indulging in ‘Blame Game’ by few ‘YES SIR’ attitude IAS Officers, especially those who prefer to ‘Crawl when asked to Bend’ amounts to lack of integrity and accountability. This behavior reflects ‘Shirking Responsibility, opportunism, departure from the core values of Civil Service.’ Having failed to advice appropriately during decision making, which is the ‘Responsibility of Civil Servant’ even if it is a ‘Bitter Pill’ blaming the Minister later as if they had no role is improper.  

    There have been significant number of Civil Servants who seldom hesitated to advise the (Chief) Minister when it required. For instance, when Chief Minister PV Narasimha Rao wanted to visit Vijayawada, during Separate Andhra Movement amidst incessant riots, he was advised against his visit by Collector and SP. Considering political implications, PV decided to proceed. Chief Secretary Valluri Kameswara (VK) Rao, a distinguished ICS officer, intervened and told CM not to go. Disallowing his advice, PV said, ‘You are my subordinate. Please follow my instructions.’ 

    Unexpectedly, CM was informed that Chief Secretary instructed driver not to bring the car. ‘Yes Sir, I am your subordinate, but the driver is my subordinate. He will follow my orders and will not come’ was the message politely but firmly conveyed by CS to CM. PV’s visit was deferred. Next day, PV praised Valluri saying, ‘had I gone yesterday, tensions would have escalated. You did a good job by stopping me.’ That was the courage of Role Model Civil Servants and Humbleness of CM those days, observed Journalist Bhandaru Srinivasa Rao. VK Rao lived for 104 years. 

    When Chief Minister Sanjiva Reddy preferred to stay in the Government Guest House in Chittor, in the Block allotted to C Rajagopalachari, who was expected to come around the same time, Collector BK Rao politely informed him that, he may have to vacate in favor of Rajaji, when he comes, as per protocol. Just before arrival of Rajaji, BK Rao accompanied by SP Gurunatha Rao reached Guest House to receive him. According to Journalist, G Krishna, Sanjiva Reddy joked with BK Rao, ‘Oh, you have come with Police Officer to vacate me!’ All were in laughter, and CM moved to his room. That was how CM accepted Collector’s advice. BK Rao died recently at 93 years age.  

    When SR Sankaran, strongly advocated for land reforms and protection of tribal rights, he had to clash with political leaders, but eventually prevailed, and were recognized as a cornerstone of rural development in the state. TN Seshan, took on political leaders to reform the electoral process in India, like curbing malpractices during elections, including the use of muscle power and black. His decisions though opposed by political leaders, strengthened Election Body. 

    In recent days, Ashok Khemka, annulled a land deal between Skylight Hospitality, owned by Robert Vadra, and real estate giant DLF in Haryana, citing irregularities and undervaluation that could lead to significant financial loss to the state exchequer. Durga Shakti Nagpal in UP, led a crackdown on illegal sand mining in the Yamuna and Hindon riverbeds, and her actions affected powerful mining syndicate with strong political connections. Rohini Sindhuri in Karnataka, exposed irregularities in land allocations and encroachments. She questioned the use of public funds in developmental projects. Her persistence led to the recovery of public lands and reforms in project implementation. She became symbol of transparency and financial accountability.

    These instances illustrate the courage and foresight of IAS officers, who stood firm on principles, even in the face of political opposition, and ultimately contributed to positive systemic changes. They exemplify the challenges faced by Civil Servants in upholding ethical standards and financial prudence, even when it involved opposing decisions by higher authorities. They underscore the challenges faced by IAS officers who act against vested interests to safeguard public resources. Their actions had a lasting impact on governance and financial accountability.

    Regarding the kind of relationship that should exist between Civil Servant and Minister that includes ‘Shared Responsibility’ in a Parliamentary Democracy, the British Practices and Conventions are the Best by aptly applying to our situations. Described as ‘Steel Frame of the Country’ by Vallabh Bhai Patel, the Indian Administrative Service (IAS), replaced Indian Civil Service (ICS) after independence. 

    All those selected for IAS are brilliant and cream of the society. Their selection is systematically done by UPSC with lot of filtration without fear or favor. They are protected under the Constitution. According to Sardar Patel, these officers need not fear in discharging their duties and future of the country depends on them. 

    Civil Servants have responsibility to offer quality services to people, no matter who the Chief Minister or Minister is. They should offer valuable suggestions based on experience, and strictly in accordance with established procedures to the concerned Minister, irrespective of his liking and disliking. If the Civil Servant fails to provide accurate and proper information or gives wrong advice, or causes delay in the Minister’s decision-making process, it shows their irresponsible behavior and inefficiency. However, once final decision is taken by Minister, ‘Based on the Advice of Civil Servant’ strictly in writing, the Civil Servant may implement it. Instead of this established process, if Civil Servants ‘Exhibit Overenthusiasm to please the Minister’ and blame him later as if he had no say, then there is no meaning in his being a Civil Servant.  

    When financial transaction undertaken by an IAS officer, either at the behest of a Minister or otherwise, both the IAS Officer and the Minister should accept their respective roles in the transaction, avoiding blame-shifting totally on Minister or vice versa. Acknowledging decisions taken during their tenure and defending them as appropriate, and in accordance with established procedure requires courage. If the ‘(Financial) Transaction’ was lawful and executed with due diligence, they should confidently state the rationale behind their decision. 

    Going by Media Reports, KT Rama Rao after ACB and ED questioning agreed that, funds were transferred with ‘His Approval’ and the ‘Formula-E Operations Limited’ confirmed the receipt. The ‘Spirit and Courage’ with which KTR ‘Defended’ his action but not ‘Denied’ and not ‘Shifted the Responsibility’ speaks volumes. ‘Shared Responsibility is sacrosanct, but Blame-Shifting by Civil Servants erodes Integrity, and weakens Steel Frame.’

    Civil servants should express their views honestly and professionally within the framework of their duties. Minister may have the final say, but it is the singular responsibility of Civil Servant to record his advice and Minister’s instructions, before implementation. In the final analysis, Civil Servants must ‘Embody Integrity, Uphold Shared Responsibility, Fearlessly Advise, Ensuring Accountability and Strengthening Democracy’s STEEL FRAME’ failing which ‘The Trust and Faith in Governance’ erodes. 

    I experienced this, having closely worked with ‘Three Distinguished Civil Servants, Dr V Chandramouli, KR Paramahamsa, and S Narsing Rao’ and observed their Extraordinary Commitment. 

Friday, January 17, 2025

వైద్యంలో మనమే బెస్ట్ : వనం జ్వాలా నరసింహారావు

 వైద్యంలో మనమే బెస్ట్ 

వనం జ్వాలా నరసింహారావు

మన తెలంగాణ దినపత్రిక (18-01-2025) 

    {ఆరేడు దశాబ్దాల క్రితం, నా బాల్యంలో, గ్రామాల్లో నివసించేవారు ‘స్థానిక స్వీయప్రతిపత్తి వైద్యుడు’ లేదా 'క్వాక్' వద్ద అన్నిరకాల చికిత్సలు పొందేవారు. వీరిని సాధారణంగా ఆర్ఎంపీ (రెజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్) లేదా ఎల్ఎంపీ (లైసెన్స్డ్ మెడికల్ ప్రాక్టీషనర్) అని పిలిచేవారు. ఈ 'క్వాక్' లను గౌరవంతో ‘డాక్టర్ సాబ్’ అని కూడా గ్రామస్తులు సంబోధించేవారు. వీరిలో కొందరు మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సు పూర్తిచేసేవారు కూడా వున్నారు. చాలామంది ప్రాక్టీస్ ప్రారంభించి, అనుభవం గడించి మంచి నైపుణ్యాన్ని పొందేవారు కూడా. ఆ దశనుంచి, వైద్యరంగం దినదినాభివృద్ధి చెందుతూ, ఎంబీబీఎస్ పట్టా (బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ) ఉన్న వైద్యుడు, లేదా ఎండీ (జనరల్ మెడిసిన్), ఎంఎస్ (జనరల్ సర్జరీ) పూర్తి చేసిన తరువాత (జనరల్) వైద్య ప్రాక్టీస్ చేయడం సాధారణమైపోయింది. ఆ కాలంలో, రోగికి చికిత్స ప్రారంభించడానికి ముందుగా వైద్యుడు స్వయంగా రోగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం అత్యంత ముఖ్యమైన భాగంగా ఉండేది. రోగి తన ఆరోగ్య సమస్యను స్వయంగా వివరించే అవకాశం ఉండేది. ఆ తరువాత వైద్యుడు రుగ్మతకు సంబందించిన మరికొన్ని ప్రశ్నలు అడిగి మరింత సమాచారం పొందేవారు.}- సంపాదకుడి క్లుప్తీకరణ 

    భారతదేశ వైద్యవ్యవస్థ కొన్ని మానవీయ ఇబ్బందులతో కూడిన సాధారణమైనది అయినా, దాన్ని మహోన్నతమైనదిగా, అన్నివర్గాలవారికి అంతో-ఇంతో అందుబాటులో (Availability), చేరువలో (Accessibility), ఆర్థిక-వ్యయపరంగా సౌలభ్యంగా (Affordability), ఆమోదయోగ్యమైనదిగా (Acceptability) ఉండేలా రూపుదిద్దుకున్న ఒక అరుదైన వ్యవస్థ అనడం మాత్రం అతిశయోక్తి కానే కాదేమో. వైద్యపరమైన ఎలాంటి క్లిష్టమైన పొరపాట్లు చోటుచేసుకున్నా, వాటిని సమర్ధవంతంగా సరిచేయడం విషయంలో, భారతదేశం ఇతర దేశాలతో పోలిస్తే చెప్పలేనన్ని రెట్లు మేరుగనాలి. అందుకే, అమెరికా నుండి మాత్రమే కాకుండా, ఇతర దేశాల నుండి కూడా వైద్య-ఆరోగ్య సమస్యల విషయంలో సలహాలకు, చికిత్సకు, తరచూ భారతదేశానికి వచ్చేవారి సంఖ్య పెరుగుతూ వస్తున్నది. భారతదేశం నుండి ఇతర దేశాలకు వెళ్ళేవారి సంఖ్య తగ్గుతూ వస్తున్నది. దీనర్థం, భారత దేశంలో లభ్యమవుతున్న వైద్య సౌకర్యం ఎంతో విశ్వాసాన్ని కల్పిస్తున్నదనే విషయమే.  

        ఇటీవలి కాలంలో, అమెరికాకు తరచూ ప్రయాణించే వారికి, అక్కడ శాశ్వతంగానో, తాత్కాలిక శాశ్వతంగానో నివాసముంటున్న వారికి, లభ్యమయ్యే వైద్య సదుపాయాల ('మెడికేర్') విషయంలోను, 'వైద్యపరమైన పొరపాట్ల' విషయంలోను, అసాధారణ, భయంకరమైన అనుభవాలు, అనుమానాలు కలుగుతున్న ప్రస్తావన పదేపదే వింటున్నాం. వృత్తి రీత్యా ‘మెడికల్ సైకాలజిస్ట్,’ అమెరికా గ్రీన్ కార్డ్ హోల్డర్ కూడా అయిన ఒక పరిచయస్తుడు, తనకు  ఆదేశంలో ఎదురైన అస్తవ్యస్త వైద్య సదుపాయాల ('జిగ్‌జాగ్ మెడికేర్'’) గురించి తన అనుభవాన్ని వివరించాడు. తరచూ ప్రయాణించే వారికీ, ‘మల్టిపుల్ ఎంట్రీ వీసా’ కలిగిన వారికి, శాశ్వత నివాసితులకు, ఆమాటకొస్తే ఎవరికీ కూడా తృప్తిగా లేదని అతను పేర్కొన్నాడు.

     అమెరికాలో వైద్యపరమైన సమస్యలు అనేకమని అతడూ, చాలామంది అక్కడికి వస్తూపోతున్న, అక్కడే వుంటున్న ఇతరులు కూడా పేర్కొంటున్నారు. వీటిలో ప్రధానమైనవి, ‘వైద్య పొరపాట్లు’ కాగా, అధిక ఖర్చుతో కూడిన వైద్యం, భీమా సంస్థల ఆధిపత్యం, కృత్రిమ మేధస్సుపై అవసరానికి మించి ఆధారపడటం, శస్త్ర చికిత్స-వైద్య చికిత్సల అనంతర జాగ్రత్తల విషయంలో నిపుణుల నిర్లక్ష్యం-నిరాసక్తత, అత్యవసర వైద్యసహాయం అవసరమైనప్పుడు కూడా నిపుణులైన వైద్యుల స్థానంలో నర్సులకే బాధ్యతలు అప్పచెప్పడం, ఆరంభం నుండి చివరదాకా వైద్య ప్రక్రియల్లో విపరీతమైన అనవసర జాప్యం వున్నాయి. వైద్యఖర్చులు ఏమాత్రం అందుబాటులో లేకపోగా, చికిత్స ఆలస్యమవుతున్నది. రోగనిర్ధారణ పరీక్షలు అత్యంత క్లిష్టతరంగా వున్నాయని పలువురు ఆవేదన వ్యక్త పరిచారు, వ్యక్త పరుస్తున్నారు. 

    లోగడ ప్రతి చిన్న చికిత్సాపరమైన, రోగనిర్ధారణ పరీక్షల పరమైన అంశాలలో భీమా ఆధిపత్యం ఉండగా, ప్రస్తుతం ప్రవేశం నుంచి చికిత్స దశ చివరివరకు ‘కృత్రిమ మేధస్సు’ పై ఆధారపడటం విచిత్రంగా వున్నది. ‘అమెరికాలో వాక్స్వాతంత్ర్యం  తప్ప, ఏదీ ఉచితం కాదు’ అనేది పలువురి అభిప్రాయం. ఇదిలావుండగా, ‘వైద్యపరమైన పొరపాటు’ విషయానికొస్తే, అవి, పూర్తిగా వైద్యం చేయకుండా వదిలేయడమో, చేసిన చికిత్సలో తప్పులు దొర్లడమో కావచ్చు. అత్యవసర, అత్యవసరంకాని, వైద్యసదుపాయం కలిగించడంలో ఆశాజనకమైన ఫలితాలు సాధించలేకపోవడం కూడా కావచ్చు. వైద్య నైపుణ్యం లేని సిబ్బంది, తప్పుగా రోగ నిర్ధారణ, కంప్యూటర్ లోపాలు, తరచూ బ్రేక్‌డౌన్‌లు, అవసరానికి సరిపడా మందులకు బదులు అనవసరమైన ప్రిస్క్రిప్షన్లు, గమనించలేని శస్త్ర చికిత్సా సమస్యలు లాంటి అంశాలు కూడా ‘వైద్యపరమైన పొరపాట్లే.’  ఈ విషయంలో వ్యక్తుల కంటే వ్యవస్థదే ఎక్కువ బాధ్యత. 

    ‘జాన్స్ హాప్‌కిన్స్’ (విశ్వవిద్యాలయం) అధ్యయనంలో పేర్కొన్న ‘రె సిఫర్డ్’ పరిశోధన ప్రకారం, అమెరికాలోలో సంభవిస్తున్న మరణాలకు, మూడవ అతిపెద్ద కారణం ‘వైద్య పొరపాట్లు’ అని స్పష్టం చేయడం జరిగింది. విచిత్రమేమిటంటే, రోగులకు కాని, వారి సంరక్షకులకు కాని, వైద్య పొరపాట్లు ఎక్కడ, ఎలా, ఎందుకు జరిగాయనే విషయాన్ని తెలియకుండా సంభందిత వైద్యులు గోప్యంగా వుంచుతున్నారట. ‘నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్’కి చెందిన జేమ్స్ జి ఆండర్సన్, కాతలీన్ అబ్రహామ్సన్ సంయుక్తంగా రాసిన ‘యువర్ హెల్త్ కేర్ మే కిల్ యూ: మెడికల్ ఎర్రర్స్’ వ్యాసంలో కూడా అమెరికాలో వైద్య పొరపాట్ల సంఖ్య కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, ఇంగ్లాండ్ దేశాలతో  పోలిస్తే గణనీయంగా ఎక్కువని అభిప్రాయపడ్డారు.

    అమెరికాలో మెడికల్ వ్యవస్థ వ్యయపరంగానే కాకుండా, సరైన చికిత్స, వసతుల లభ్యత విషయంలో కూడా పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఈ పరిణామాలు స్పష్టంగా సూచిస్తున్నాయి. సమగ్ర వ్యవస్థా సంస్కరణల ద్వారానే వైద్యపరమైన జాగ్రత్తల సమస్యలను అధిగమించవచ్చు. అమెరికాలో ఉన్న మెడికేర్ విధానం ద్వారా లభ్యమవుతున్న చికిత్స నిర్లక్ష్యం, గ్రీన్ కార్డ్ హోల్డర్లకైనా, సాధారణ సందర్శకులకైనా, ఒకే రకంగా ఉంటున్నది. విశ్వసనీయమైన భారతీయ బీమా కంపెనీ వారి ఆరోగ్య భీమా పాలసీ, అమెరికాలో లభ్యమవుతున్న అనేకరకాల ఇతర విధానాలతో పోలిస్తే వేల రెట్లు మెరుగని చెప్పాలి. 

    యావత్భారతదేశంలోని ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితుల్లో, ఆమాటకొస్తే 24 గంటలూ, ‘క్వాలిఫైడ్ వైద్యుడు’ (కనీసం ఎంబీబీఎస్ డాక్టర్) ఎవరో ఒకరు అందుబాటులో తప్పనిసరిగా ఉంటాడు. అదే అమెరికాలోనైతే, అత్యవసర చికిత్స ఎంత పెద్ద స్థాయిదైనప్పటికీ, ప్రారంభంలో నర్సు ద్వారానే మొదలవుతున్నది. చికిత్సకోసం వచ్చిన వ్యక్తి మొదట ఆ నర్సుకు తన వైద్యపరమైన వ్యక్తిగత ప్రాథమిక సమాచారం అందించాలి. వాటిలో ‘ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, బీమా వివరాలు’ సేకరించే విధానం జుగుప్సాకరంగా వుంటాయి. ఈ ప్రక్రియకు సాధారణంగా గంట-రెండు గంటల సమయం పట్టినా పట్టవచ్చు. ఆ సమాచారాన్ని కృత్రిమ మేధస్సుకు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అనుసంధానం చేసిన తరువాతనే, అది సూచించిన విధంగా రోగిని అందుబాటులోని ఒక ‘డ్యూటీ డాక్టర్’ వద్దకు పంపిస్తారు. ఆ డాక్టర్, ప్రాధమిక పరీక్షల అనంతరం, కృత్రిమ మేధస్సు తోడ్పాటుతో, అవసరాన్ని బట్టి, సంబంధిత నిపుణుడి వద్దకు రోగిని పంపిస్తారు.   

    ఈ రోజుల్లో, చాలా మంది యువ వైద్యులు (అమెరికన్లయినా, విదేశీయులైనా) ఎనిమిది గంటల సులభమైన ‘డ్యూటీ డాక్టర్’ విధులు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారట. ఇక్కడ వేతనం ఎక్కువగా వుండడమే కాకుండా, బాధ్యత కూడా కొంచెం తక్కువే. రోగిని ‘ఇన్ పేషంటుగా’ ఆసుపత్రిలో చేర్చుకున్న తరువాత, సంబంధిత వైద్య నిపుణుడు అవసరమైన (శస్త్ర లేదా వైద్య) చికిత్స చేస్తాడు. కానీ, భారతదేశంలో మాదిరిగా శస్త్రచికిత్స లేదా మెడికల్ ట్రీట్మెంట్ అనంతరం అదే డాక్టర్ తరచుగా పేషంట్ బాగోగులు కనుక్కోవడం లాంటిది, అమెరికాలో అరుదుగా జరుగుతుంది. దానికి వేరే ఏర్పాటు వుంటుంది. 

    ఆసక్తికరమైన ఒక సంఘటనను నా ‘మెడికల్ సైకాలజిస్ట్’ స్నేహితుడు నాకు వివరించాడు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఒక సీనియర్ గైనకాలజిస్టు తన కుమారుడి భుజంమీద గాయమైనప్పుడు, ప్రాథమిక నొప్పి నివారణకు తక్షణమే కావాల్సిన మాత్రలను కూడా ఫార్మసీలో కొనలేకపోయింది. అలా కొనడానికి తప్పనిసరైన ప్రిస్క్రిప్షన్ రాసే అధికారం ఆమెకు లేదు. ఎందుకంటే అది ఇతర వైద్యుని బాధ్యత. చివరికి, శస్త్రచికిత్స నిపుణుడైన మరో డాక్టర్ స్నేహితుడు సహాయం తీసుకుంది ఆమె. ఈ  నేపధ్యంలో, సమగ్రత, వేగం, బాధ్యతా నిబద్ధత విషయంలో, ఆరోగ్య-వైద్య విధా సంపూర్ణ సరళీకరణ విషయాలలో భారత వైద్య వ్యవస్థ అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల కంటే మెరుగ్గా ఉందని చెప్పడంలో సందేహం లేదు.

    ఈ సందర్భంలో భారతదేశంలోని పూర్వ దశ వైద్య సదుపాయాలు గుర్తుకొస్తున్నాయి. ఆరేడు దశాబ్దాల క్రితం, నా బాల్యంలో, గ్రామాల్లో నివసించేవారు ‘స్థానిక స్వీయప్రతిపత్తి వైద్యుడు’ లేదా 'క్వాక్' వద్ద అన్నిరకాల చికిత్సలు పొందేవారు. వీరిని సాధారణంగా ఆర్ఎంపీ (రెజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్) లేదా ఎల్ఎంపీ (లైసెన్స్డ్ మెడికల్ ప్రాక్టీషనర్) అని పిలిచేవారు. ఈ 'క్వాక్' లను గౌరవంతో ‘డాక్టర్ సాబ్’ అని కూడా గ్రామస్తులు సంబోధించేవారు. వీరిలో కొందరు మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సు పూర్తిచేసేవారు కూడా వున్నారు. చాలామంది ప్రాక్టీస్ ప్రారంభించి, అనుభవం గడించి మంచి నైపుణ్యాన్ని పొందేవారు కూడా.

    ఆ దశనుంచి, వైద్యరంగం దినదినాభివృద్ధి చెందుతూ, ఎంబీబీఎస్ పట్టా (బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ) ఉన్న వైద్యుడు, లేదా ఎండీ (జనరల్ మెడిసిన్), ఎంఎస్ (జనరల్ సర్జరీ) పూర్తి చేసిన తరువాత (జనరల్) వైద్య ప్రాక్టీస్ చేయడం సాధారణమైపోయింది. ఆ కాలంలో, రోగికి చికిత్స ప్రారంభించడానికి ముందుగా వైద్యుడు స్వయంగా రోగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం అత్యంత ముఖ్యమైన భాగంగా ఉండేది. రోగి తన ఆరోగ్య సమస్యను స్వయంగా వివరించే అవకాశం ఉండేది. ఆ తరువాత వైద్యుడు రుగ్మతకు సంబందించిన మరికొన్ని ప్రశ్నలు అడిగి మరింత సమాచారం పొందేవారు.

    ఈ రకమైన వైద్యుల 'క్లినికల్, శారీరక పరీక్ష' ప్రధానంగా నాలుగు విధాలుగా ఉండేది. అవి వరుసగా: ఇన్‌స్పెక్షన్ (శరీరాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం), పాల్‌పేషన్ (వేలు లేదా చేతులతో శరీరాన్ని పరిశోధించడం), ఆస్కల్టేషన్ (స్టెతోస్కోప్ ఉపయోగించి శరీర ప్రధాన భాగాల శబ్దాలను వినడం), పర్క్యూషన్ (శరీరంలోని ద్రవం లేదా గాలి సేకరణను గుర్తించడానికి శరీరంపై విద్యాపరంగా తట్టడం ద్వారా శబ్దాన్ని గుర్తించడం) వుండేవి. వీటన్నిటిలో పర్క్యూషన్ పాత్ర ముఖ్యమైనది. రోగి శరీరంపై ఒక చేతి వేళ్లను ఉంచి, మరొక చేతి వేళ్లతో తట్టి, తద్వారా వచ్చే గంభీర శబ్దం ద్వారా రుగ్మతను ప్రాధమికంగా గుర్తించేవారు వైద్యులు. వైద్యుడు దీని ఆధారంగా చికిత్స చేసేవాడు. ఇది పూర్తిగా వైద్యుడి ప్రత్యక్ష సంరక్షణ, పర్యవేక్షణలోనే జరిగేది. చికిత్సలో భాగంగా డాక్టర్ స్వయంగా రక్తపోటు చూడడం, అవసరమైన ఇంజక్షన్ ఇవ్వడం లాంటి ప్రతి చిన్న వివరాన్ని చూసేవారు. ఈ వ్యక్తిగత స్పర్శతో రోగులు తృప్తి చెందేవారు. రుగ్మత పోయిన భావన కలిగేది. 

    ఈ నైజం ఇప్పుడు కాలక్రమేణా తగ్గిపోయినట్లు కనిపిస్తున్నప్పటికీ, ఆ రోజుల్లో డాక్టర్ల వ్యక్తిగత నిబద్ధత, ఆసక్తి, రోగుల పట్ల చూపించిన ఆత్మీయత నిజంగా స్ఫూర్తిదాయకమైనవి. పాశ్చాత్యీకరణ పెరుగుతున్న కొద్దీ, క్రమేపీ స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టు, మల్టీ-స్పెషలిస్టు, మల్టీ-సూపర్-స్పెషలిస్టు వైద్యుల ఆవిర్భావంతో, తరచుగా తలెత్తే చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకూ ప్రత్యేక నిపుణులను సంప్రదించాల్సిన ఆగత్యం  ఏర్పడింది. దురదృష్టవశాత్తూ ‘క్లినికల్, శారీరక పరీక్ష' ఇప్పుడు అరుదైన చికిత్సా ప్రక్రియగా మారిపోయింది. 

    భారతదేశంలో, వివిధ వర్గాల ఆర్థిక సమర్థత-స్తోమతలకు (Affordability) అనుగుణంగా, త్వరితగతిన వైద్యసేవలు వివిధ రకాల మెరుగుదలల కారణంగా అందుబాటులోకి (Accessibility) తెచ్చిన పర్యవసానంగా, అలాగే మరికొన్ని 'విలక్షణమైన మార్పుల' ఫలితంగా, వైద్య-ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ 'ఆమోదయోగ్యమైనదిగా’ (Acceptable)' రూపాంతరం చెందింది. అమెరికాలో ఉన్నతమైన వైద్యం అందించబడినా, పోనీ, అందించడం జరుగుతున్నదని ప్రచారం జరిగినా-జరుగుతున్నా, యావత్ ప్రక్రియ ప్రతిస్పర్థించలేని, భరించలేని వ్యయప్రయాసలతో కూడినదిగా భావన పెరిగిపోతున్నది. ఆ దేశంలో ‘భీమా ఆధారిత వైద్యం’ అమల్లో వున్నప్పటికీ, అది అతి కొద్దిమందికే ప్రయోజనకరమని నిస్సందేహంగా చెప్పవచ్చు. రోగికి తనకు నచ్చిన పద్ధతిలో, అంగీకారమైన విధానంలో వైద్యం అందించగలగడం ప్రతిదేశానికీ అవశ్యం.

    ఆరోగ్య సంరక్షణలో, డాక్టర్-రోగి సంబంధాల, సాంస్కృతిక, విశ్వసనీయత, అవగాహనలో శతాబ్దాలనుండి వస్తూవున్న వ్యక్తిగత సంరక్షణకు, శ్రద్ధకు, భారతీయ ప్రత్యేకత ఒక మహత్తర మార్గదర్శనం, నిదర్శనం. ఇది భారతదేశ వైద్య రంగానికి ప్రత్యేకమైన విశిష్టతను ప్రపంచవ్యాప్తంగా కలిగిస్తిన్నది. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ మనదేశ ఆరోగ్య వ్యవస్థను మించిన వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేనేలేదు.