Monday, February 13, 2023

శ్రీకృష్ణుడి మహాత్మ్యాన్ని, దైవధ్యాన పద్ధతిని, మోక్షమార్గాన్ని వివరించిన భీష్ముడు .... ఆస్వాదన-107 : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీకృష్ణుడి మహాత్మ్యాన్ని, దైవధ్యాన పద్ధతిని, మోక్షమార్గాన్ని వివరించిన భీష్ముడు

ఆస్వాదన-107

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (13-02-2023)

జ్ఞానయోగాన్ని భీష్ముడు, బృహస్పతి మాటలుగా ధర్మరాజుకు చెప్పిన తరువాత, మహనీయుడైన శ్రీకృష్ణుడి మహాత్మ్యాన్ని తనకు వినిపించమని వేడుకున్నాడు ధర్మరాజు. జవాబుగా భీష్ముడు, తాను గతంలో నారద, జామదగ్న్య, మార్కండేయ, వ్యాస, వాల్మీకి మొదలైన మహర్షుల ద్వారా విన్న విశేషాలను ధర్మరాజుకు చెప్తానంటూ ఇలా అన్నాడు.

‘శ్రీకృష్ణుడు ప్రభావశీలైన విష్ణువే. అతడే తన దివ్య శక్తితో, తానూ కర్మనిర్వహణ నైపుణ్యంతో వినోదించాలానే సంకల్పంతో, ఈ సృష్టికి మూల పదార్థాలైన పంచభూతాలను కల్పించాడు. పంచభూత సృష్టి చేసిన తరువాత నీటిపైన భద్రమైన శయ్యమీద లేదా శేషతల్పంమీద పరుండి వుండగా ఆయన నాభి నుండి ఒక పద్మం పుట్టింది. దాని నుండి బ్రహ్మ పుట్టాడు. అతడికి ఏడుగురు (బ్రహ్మ) మానస పుత్రులు కలిగారు. వారే వరుసగా మరీచి, అత్రి, అంగిరసుడు, పుల్సత్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు అనేవారు. వారిలో మరీచికి కశ్యప ప్రజాపతి జన్మించాడు. ఆ కశ్యపుడి వల్ల దేవతలు, రాక్షసులు, గరుడులు, నాగులు మొదలైన జాతులు జన్మించాయి. ఆ కశ్యపుడికే సూర్యుడు జన్మించగా, అత్రికి చంద్రుడు కలిగాడు. సూర్యచంద్రులు ఇద్దరూ క్షత్రియ వంశాలకు మూల పురుషులయ్యారు. ఆ వంశాలకు చెందిన రాజులు పెక్కు దేశాలను పాలించారు’.

‘అలా ఏర్పడ్డ క్షత్రియ వంశాలు భిన్న-భిన్న కాలాలలో, భిన్న-భిన్న దేశాలలో అనేక శాఖోపశాఖలుగా వర్ధిల్లాయి. శ్రీకృష్ణ పరమాత్మ తనకు అవసరమైనప్పుడు, కావాలనుకున్న సమయంలో, వారిలో వారికి సంభవించే యుద్ధాలను నిమిత్త మాత్రంగా గ్రహించి, వివిధ క్షత్రియ వంశాలను నశింపచేస్తూ వుంటాడు. ఆ దేవుడే శ్రీకృష్ణ రూపంతో పాటుగా బలరామ, మన్మథ, అనిరుద్ధ రూపాలను కూడా ధరించి ఈ జగత్తును భరిస్తూ వినోదం కొరకు జన్మలెత్తి ఆటలాడుకొంటాడు. శ్రీకృష్ణుడి లాంటి జగత్పతిని సామాన్య మానవుడుగా చూడడం అజ్ఞానం. శ్రీకృష్ణుడు భక్తపరాధీనుడు కాబట్టి ఉత్తములకు ఆరాధనాభాజనమయ్యాడు. నరులకు కావాల్సిన భోగభాగ్యాలను కానీ, ముక్తిని కానీ, కేవలం తన కరుణా కటాక్ష మాత్రాన ఇవ్వగల సమర్థుడు.

ఆ తరువాత ధర్మరాజు ఎవరిని స్మరిస్తే మానవుడు పరమాత్మను పొందుతాడని, ఏమార్గాన దైవధ్యానం కలుగుతుందని ప్రశ్నించాడు భీష్ముడిని. నారద మహర్షి ద్వారా తానిదివరకే ఇదే అంశం మీద విన్న విశేషాలను తెలియపరుస్తానంటూ భీష్ముడు ఆ వివరాలను ధర్మరాజుకు చెప్పాడు. విష్ణువును ధ్యానించేవారు ముందుగా గొప్ప భక్తిని, నిష్కల్మషమైన శ్రద్ధను, ఆపైన ఇంద్రియ నిగ్రహాన్ని అలవరచుకోవాలని, ఈ మూడు లక్షణాలు విష్ణు ధ్యానానికి సమకారాలని, పాప రహితుడికి ఈ మూడు గుణాలు అలవడుతాయని, పాపనాశనానికి విష్ణువు మెచ్చిన పధ్ధతి నియమపూర్వకంగా నిరంతర విష్ణుస్మరణం అనే అనుస్మృతి అని అన్నాడు. ఇంకా ఇలా అన్నాడు.

‘ఓం నమో వాసుదేవాయ లాంటి మంత్రాలను నిశ్చల మనస్సుతో జపించాలి. ఆ తరువాత అనుస్మృతిని (విష్ణునామ సహస్రం) పఠించాలి. దానివల్ల ధర్మార్థ కామమోక్షాలను సాధించే సామర్థ్యం కలుగుతుంది. విష్ణుదేవుడు అనుస్మృతిని నారదుడికి బోధించాడు. (విష్ణు సహస్ర నామమని ప్రసిద్ధి చెందిన అనుస్మృతిని భీష్ముడు ధర్మరాజుకు వినిపించాడు). అనుస్మృతిని చదివినవారికి, విన్నవారికి, నమస్కరించినవారికి పుణ్యగతి, ముక్తి కలుగుతుంది. వేలకొద్ది అశ్వమేధయాగాలు చేసికూడా పొందలేని పరమపదాన్ని అనుస్మృతిని భక్తితో సేవించడం వల్ల సులభంగా పొందవచ్చు. అనుస్మృతి గొప్ప స్తోత్రమంత్రం. వరాలను ఇవ్వగల సామర్థ్యం కలది. ఆరాధనకు అర్హమైన రీతిలో జపించడానికి వీలైన ఆకారంతో వున్నది. దీనిని జపిస్తే నరుడి బుద్ధి పెరుగుతుంది. దుఃఖాలు తొలగిపోతాయి. సంసారబందాలు తెగిపోతాయి. నిరంతరం శుభం కలుగుతుంది’.

ఇది విన్న ధర్మరాజు మోక్షమార్గాన్ని ఉపదేశించమని పితామహుడిని కోరాడు. వార్ష్ణేయాధ్యాత్మం అనే ఇదిహాసం ఆధారంగా వార్ష్ణేయుడు తన శిష్యుడికి ఉపదేశించిన మోక్షమార్గాన్ని వివరించాడు భీష్ముడు. దాని సారాంశం ఇలా సాగుతుంది.

‘కాలచక్రం అవధి లేకుండా తిరుగుతూ వుంటుంది. దాని భ్రమణంలో సృష్టులు, ప్రళయాలు ఏర్పడుతుంటాయి. ప్రళయాంతంలో పరమాత్మ మాత్రం నిత్యుడై నిలిచి మళ్లీ లోకాలను, భూతాలను సృష్టిస్తాడు. ఆ సృష్టిలో పునరుద్భవించిన ఋషులు, మునులు వేదాలను, శాస్త్రాలను తిరిగి పొందుతారు. వారే మేథావులై లోకాలు ఆచరించాల్సిన నియమ నిబంధనలను రూపొందించారు. మహర్షులు నిర్మించిన న్యాయాది శాస్త్ర సముదాయాన్ని వింటే, ఆచరిస్తే లేదా తెలుసుకుంటే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. ఆ శాస్త్ర జ్ఞానమంతా ఒక్క విష్ణువులో నిలిచి వుంటుంది. మునీంద్రులు ఆ జ్ఞానాన్ని వారి శిష్యపరంపరకు బోధించి లోకంలో వ్యాప్తి చేశారు’.

‘పురుషుడితో కూడి వుండడం వల్ల ప్రకృతి చైతన్య శక్తిని వహిస్తుంది. చైతన్యం నుండి బుద్ధి, దాని నుండి అహంకారం పుట్తాయి. అహంకారం ఆత్మను చేరుతుంది. అహంకారం వల్ల ఆకారం, ఆకారం వల్ల వాయువు, వాయువు వల్ల తేజస్సు, తేజస్సు వల్ల నీరు, నీటివల్ల భూమి పుట్టి పంచభూతాలు ఏర్పడ్డాయి. అహంకారమే భూతపంచకానికి మూలం. బుద్ధిని మహత్తు అని కూడా అంటారు. శరీరం తొమ్మిది ద్వారాలున్న పుణ్యపురం. ఆ పురంలో పరమాత్మ ఊహాతీతమైన వ్యాప్తశక్తితో నిండి, అన్ని భావాలను, స్వభావాలను, గుణాలను పొంది శయనించి వున్నాడు. అందువల్లే ఆ పరమాత్మను పురుషుడు అని అంటారు. ఆ పురుషుడు అమరుడు, అవ్యయుడు, అజరుడు, అమేయుడు, అమలస్వభావుడు. దేహంలో పురుషుడు వుంటాడు. యోగ విద్యాభ్యాసం వల్ల పురుషుడు తేజోరూపుడుగా బోధపడుతాడు. ఆ తేజస్సు జ్ఞానంతో నిండి వుంటుంది. ఆ జ్ఞానమయ తేజస్సు సర్వభూతాలను ఆశ్రయించి వుంటుంది. కాబట్టి శ్రవణ, దర్శన, భాషణాదులను అది నిర్వహిస్తుంది. ఆ తేజోరూప పరమాత్మనుండే సృష్టి, స్థితి, లయాలు జరుగుతుంటాయి. దేహస్థుడైన పురుషుడు అన్నిటికీ సాక్షీభూతుడుగా వుంటాడు’.

‘కాలచక్రానికి బుద్ధి మొదలైన వికృతులు ఏడు అంచులు. అవ్యక్తం దాని కేంద్రస్థానం. జ్ఞానేంద్రియాలు ఐదు, కర్మేంద్రియాలు ఐదు, మొత్తం ఇంద్రియాలు పది. జ్ఞానేంద్రియాలకు, గోచరించే పదార్థాలు ఐదు. ఈ పదిహేనుకు తోడుగా మనస్సును కలిపి లెక్కిస్తే మొత్తం ఈ పదహారూ వికారాలు అనబడుతాయి. జ్ఞాన కర్మేంద్రియాలు, పదహారు వికారాలు వలయాలు. ఆత్మ దానిని అధిష్టించి వుంటాడు. అది నిరంతర భ్రమణం కలిగింది. దానిని తత్త్వశోధన దృష్టితో దర్శించాలి. సంసారం ఒక అరణ్యంలాంటిది. సంసారంలో పడి జీవించడం అంటే, అడవిబాటలో నడవడమే. సంసార పరిభ్రమణంలో సుఖశాంతులు వుండవు. లౌకికమైన తెలివితేటలు విజ్ఞానమని, ఆధ్యాత్మికమైన తెలివితేటలు జ్ఞానమని విజ్ఞులంటారు. అహంకారం జీవుల సకల కార్యాలకు మూలం. ఆయా కార్యాలవల్ల పాపపుణ్యాలు కలుగుతాయి. వాటి అనుభవం కొరకు ప్రాణి దేహం ధరించి, జనన మరణ చక్రాన పడి కిందికి-మీదకు తిరుగుతుంటాడు. ఈ జనన మరణ చక్రానికి మూలం ఆశాలత. దానికి ప్రాకుడు కొయ్యస్త్రీ. ఈ సత్యం తెలుసుకొని ఆశను తుంచివేయాలి’.

‘సృష్టిలోని ప్రాణికోటిలో మానవులు శ్రేష్ఠులు. వారిలో బ్రాహ్మణులు, వారిలో మంత్రవేత్తలు, వారికంటే జ్ఞానులు ఉత్తములు. మానవుడికి నిజమైన నేత్రం జ్ఞానం. అజ్ఞాని గుడ్డివాడితో సమానుడు. జ్ఞానార్జనకు ముందు నరుడు ధర్మాన్ని ఆచరించాలి. సంకల్ప, వికల్పాలకు మనసులో తావీయకుండా సాధన చేయాలి. ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహానికి ప్రాతిపదిక. అలాంటి ఇంద్రియ నిగ్రహం జ్ఞానార్జనకు, తద్ద్వారా మోక్షప్రాప్తికి హేతువవుతుంది. నరుడు మాటలో, మనసులో, పనిలో శౌచాన్ని పాటిస్తూ, అహంకారాన్ని విడనాడి, శాంతస్వభావుడిగా వున్నప్పుడు అతడిలో కోరికలు సన్నగిల్లి అంతరించి పోతాయి. ఆ స్థితిలో లోకంలోని ప్రాణి సమూహాన్నంతటినీ అతడు కరుణతో ఆదరించగలుగుతాడు. పవిత్ర జీవనం, అహంకారరహిత శీలం, కోరికలకు దూరమైన మనస్సు, అదనంగా భూతదయ కలిగి వున్నవాడికి జ్ఞానం కలిగి తీరుతుంది’.

‘మానవుడు తనలోని జ్ఞానాన్ని వంట చెరుకులాగా ఉపయోగించుకుంటూ, విజ్ఞానాన్ని రగుల్కొనేట్లు చేసి ప్రజ్వలింపచేయ హలిగితే అతడికి జరామరణాలకు, ఇతర లౌకిక దుఃఖపరంపరలకు దూరమైనా అమృతత్వస్థితి కలుగుతుంది. అతడు ధ్రువమైన మోక్షస్థితిని చేరుకుంటాడు’.

‘లోకంలో వ్యక్తం, అవ్యక్తం అనే రెండు విధాలున్నాయి. వ్యక్తమంటే మృత్యువని, అవ్యక్తమంటే అమృతం అని విష్ణువు చెప్పాడు. అది తెలిస్తేనే ముక్తికి దారి కనబడేది. అవ్యక్త మనబడే మూలప్రకృతి ముల్లోకాలకు ఆలంబమైనది. దానిలోనే లోకాలు జన్మించి, పెరిగి, లయమౌతాయి. ఆ అవ్యక్తం నివృత్తి లక్షణం కలది. నివృత్తి మార్గం సాటిలేని మేటి ధర్మమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి’.

‘నివృత్తి అంటే సంసారంనుండి మరలడం. దీనికి విరుద్ధమైనది ప్రవృత్తి-అంటే సంసారంలో పాల్గొనడం. దేహస్తుడైన ఆత్మ ప్రాకృతికాలైన త్రిగుణాలతో చుట్టబడి వుంటాడు. ఇవి నిండుగా కమ్ముకుంటాయి. త్రిగుణాలు చుట్టుకొని వుండడంవల్ల ఆత్మ నిజస్వరూపం కానరాకుండా వుంటుంది. త్రిగుణాతీతమైన మరొక గుణమే పరబ్రహ్మతత్త్వం’.

‘బ్రహ్మచర్యం, అహింస అనేవి రెండు గొప్ప ధర్మాలు. వాటిని ఆచరించడమే ఉత్తమ ధర్మం. తపస్సు చేసేవారికి నిర్మల జ్ఞానం  కలుగుతుంది. ఆ జ్ఞాన నేత్రంలో అతడు ఈ లోకపు అంతర్బహిస్వరూపాలను సరిగ్గా, చక్కగా చూడగలడు. తపస్సు సంసారం నుండి మనస్సును మరల్చడానికి ఔషధంలాగా ఉపయోగపడుతుంది. తృష్ణాలతను తెంచడానికి పనిచేస్తుంది’.

ఇలా చెప్పిన భీష్ముడు ధర్మరాజును వార్ష్ణేయుడి శిష్యుడిలాగానే జ్ఞానివై ఆయన జన్మను చరితార్థం చేసుకొమ్మని సలహా ఇచ్చాడు.                 

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, చతుర్థాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

          

   

Saturday, February 11, 2023

BRS unveils actionable agenda for change : Vanam Jwala Narasimha Rao

 BRS unveils actionable agenda for change

Here is a Glimpse of BRS National Agenda, KCR in Nanded

Vanam Jwala Narasimha Rao

The Hans India (12-02-2023)


(In his clarion call to the nation, KCR rooted for structural changes such as Economic Reforms, Constitutional Reforms, Electoral Reforms, Judicial Reforms, Administrative Reforms and Governance Reforms. KCR said that time has come for reinventing India by setting a development-centric National Agenda and move away from centralization. National Agenda among rest of the things highlights about ‘Next Practices’ and not ‘Best Practices’ to move towards a new direction to come out of struggle by large sections of people for basic minimum needs. It speaks about leveraging the wealth and inner strength of our country and its economy which is not an insurmountable problem but one of a mindset issue-Editor synoptical note).  


As a first and significant step in the direction of spreading the message of ‘qualitative change in politics’ and present an alternate ‘National Development Agenda’ across the country, Bharat Rashtra Samithi (BRS) President and Chief Minister Telangana K Chandrashekhar Rao addressed an impressive and packed gathering at Nanded in Maharashtra on February 5, 2023, the first meeting organized by the BRS outside Telangana, followed by a well-attended Media Conference.


The remarkable feature of Nanded meeting was, large number of political leaders, at least more than 100, who have held and still holding important positions and who included among others various associations’ leaders, chairpersons, sarpanches, advocates etc. joined BRS signaling a challenging presence of BRS in Maharashtra.


KCR on landing in Nanded commenced his whirlwind but quality time spent visit to the ‘Karma Bhoomi’, by going first to the Takht Sachkhand Sri Hazur Abchalnagar Sahib Gurdwara which was built on the site where Guru Gobind Singh the tenth Sikh Guru held his final congregation before the 'Mahabhinishkraman' and offered prayers. KCR was accorded a warm welcome in a traditional manner by the members of Gurdwara Board and was also offered a traditional Sikh ‘Pagadi’ and shawl by the head priest of the Gurudwara.  Later he was presented with religious cloths and flowers at the sanctorum. During his 20-minute stay in the Gurudwara, KCR apart from offering prayer at the main shrine, went around the premises and interacted with board members and people. Later, on arriving at the venue of public meeting, KCR paid rich tributes and garlanded to the statues of Chhatrapati Shivaji Maharaj, Dr Baba Saheb Ambedkar, Mahatma Jyotiba Phule, Mahatma Basweshwar Maharaj, Anna Bhau Sathe and Ahilya Bai Holkar.


There was a subtle message BRS President sent across the nation in doing so, both at the Gurudwara and at the venue of the meeting. KCR in a way was reminding the audience and those who watched them Live on TV sets, that Guru Gobind Singh was a spiritual master, warrior, poet and philosopher; Shivaji Maharaj was a great Maratha warrior and strategist of India; Ambedkar  was the Architect of Indian Constitution, a social reformer and political leader; Jyotiba Phule was an Indian social activist, thinker, and anti-caste social reformer; Basweshwar Maharaj was a social reformer, pragmatist, a saint and an epoch-maker; Sathe was a social reformer, folk poet, and writer and Ahilya Bai Holkar was the hereditary noble queen of the Maratha Empire, in early-modern India. Thus, the message was clear, that their ‘Life and Times’ are to be a model to be followed by one and all.  


Both at the public meeting and media meeting KCR in his inimitable style touched various aspects with which the country is put in a dilemma and need to be handled strategically. They included among others: water and energy policies; interstate river water disputes; leveraging India’s economy; women’s representation lawmaking bodies; Probing Adani fraud; crony capitalism and treason; LIC privatization; delimitation process or procuring imported coal despite huge reserves or socializing losses and privatizing profits; government investing in public sector enterprises; political parties and leaders winning but people losing in elections; farmer suicides due to lack of support from governments; farmers realizing their strength; faulty policies, divisive tactics and politics of hate; implementation of Telangana Model Schemes like Rythu Bandhu, Rythu Bhima and Dalit Bandhu etc.


In a clarion call to the nation’s farming community, KCR said that the time is ripe now for farmers to unite, exhibit their strength, fight for their rights and take over the reins of the country. KCR reminded that BRS slogan is ‘Ab Ki Baar, Kisan Sarkar’, but mere sloganeering is not enough and farmers should enter the poll arena. KCR said farmers constitute more than 42 per cent and if the number of farm labourers is also added, they account for more than 50 per cent, which is sufficient to form a government. Let us all take a vow at Shivneri, the birthplace of Chhatrapati Shivaji, to form a ‘Kisan Sarkar’ at the Centre said KCR. 


Regarding the ‘Make in India’ initiative, KCR said that it has become a ‘Joke in India’.  He argued that instead of the Central government establishing local marketplaces and industrial facilities, markets everywhere were swamped with Chinese products. It is here KCR called upon farmers to take the pen (kalam) and run for office as elected representatives rather than only pulling ploughs. He said we have China Bazaars in almost all the States in the country and people depend upon them even for kites, manza, National Flags etc.



In the well-attended media meeting, KCR for the first time explicitly revealed BRS National Agenda, drawing broad contours of Party’s National Blueprint, for what he put it as qualitative change in national politics and to develop the country into an economic superpower of the world. He gave a call to the people to get rid of poverty of thought and plan ‘Big’ instead of ‘Incremental Thinking’. He said that ‘Out of the Box Thinking’ is the need of the Hour. In a press note titled ‘Reinvent India, Reorient India’ circulated during the media conference, KCR narrated a glimpse of the BRS National Reform Agenda that speaks about structural changes to leverage the country’s strength.


These structural changes are broadly: Economic Reforms, Constitutional Reforms, Electoral Reforms, Judicial Reforms, Administrative Reforms and Governance Reforms. KCR said that time has come for reinventing India by setting a development-centric National Agenda and move away from centralization. National Agenda among rest of the things highlights about ‘Next Practices’ and not ‘Best Practices’ to move towards a new direction to come out of struggle by large sections of people for basic minimum needs. It speaks about leveraging the wealth and inner strength of our country and its economy which is not an insurmountable problem but one of a mindset issue.


Higher FDI inflows including developing SEZ, stable tax regime, improving Ease of Doing Business, removing restrictions on foreign investments, resolving issues that hinder growth etc. are part of economic reforms. The agenda says that every Indian should be a proud tax payer and partner in nation building. Income from allied agriculture activities should be exempt from tax like agriculture. Existing FRBM limit to be re-examined to suit to the present-day requirements.


As part of Constitutional Reforms, the agenda supports for more devolution of funds to states, a permanent Finance Commission for assessing and leveraging the Finance of Centre and of states. As part of Electoral Reforms, BRS agenda says that term of elected Government to be discussed and all state and central election shall be held simultaneously and within a period of 6 months. In case a government falls due to some reason, next election shall be held for balance period only. In addition, necessary Judicial Reforms need to be brought to improve the delivery of justice.


As part of Administrative and Governance Reforms, Agenda suggested that, to make reform in DOPT Policies to suit the need for leveraging India. Officers shall be in position to work on other states on need basis, should be allowed to give preference to work in home state, salaries or remuneration of lower-level employees shall be increased to dignified level. Planning Commission should guide the states in setting their priorities and states should be free to take up their own programs.


The Actionable Agenda for Change underscores the importance of increasing the profitability and productivity in agriculture which is low now. The current huge gap between farmers’ and consumers’ price shall done away and farmers should get enough income to take care of their families. Investment Support for agriculture of Rs10, 000 per acre shall be given across the country to farmers. Increase in MSP by linking to price index, area-wise crop colonies, connecting NREGA with agriculture sector etc. are other points in the agenda. Allocating water for irrigation to every state for their requirement,   access to clean and safe drinking water supply to every village, improving the dignity and health of pregnant women and reduce the MMR and IMR, Improving infrastructure in Primary, Community Health Centers, District Hospitals, Area Hospitals to handle deliveries, increasing number of medical seats in the country, increasing green cover in the country, reorienting Research and Development to leverage the assets of the country for economic development etc. form part of Actionable Agenda.


Concluding his address at the public meeting KCR said: ‘Dharmasya Vijayosthu, Adharmasya Nashosthu, Pranishu Sadbavanasthu, Visvasya Kalyanamasthu’, meaning ‘Let Righteousness flourish, Let injustice perish, Let the beings be right spirited and Let the Universe thrive in bliss’,


(The writer is Chief Public Relations Officer to Chief Minister, Telangana)

Monday, February 6, 2023

కూలీలంతా ఒక్కటిగా .....! ...... గండ్లూరి నాయకత్వంలోని వ్యవసాయ కూలీ పోరాటాలు (గుర్తుకొస్తున్నాయి) : వనం జ్వాలా నరసింహారావు

 కూలీలంతా ఒక్కటిగా .....!

గండ్లూరి నాయకత్వంలోని వ్యవసాయ కూలీ పోరాటాలు

(గుర్తుకొస్తున్నాయి)

వనం జ్వాలా నరసింహారావు

          1966 లో డిగ్రీ పరీక్షలు రాసిన తరువాత, నా మకాం, హైదరాబాద్ నుంచి మా గ్రామం వనం వారి కృష్ణా పురానికి మార్చాను. అలా, 1966-1969 మధ్య కాలంలో మా గ్రామంలో వున్న రోజుల్లో, ఆ తరువాత 1969-1971 మధ్య కాలంలో నాగపూర్లో ఎం.ఏ చదువుతూ అడపదడప లేదా శెలవుల్లో మా గ్రామానికి వచ్చిన సందర్భంలో, అదే విధంగా 1971-1973 మద్య కాలంలో ఖమ్మంలో ఉద్యోగ రీత్యా వుంటున్న సమయంలో, మా పరిసర గ్రామ రాజకీయాలతో ఒక కమ్యూనిస్ట్ అభిమానిగా సంబంధాలు పెట్టుకున్నాను. కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవాడిని కూడా. సభలు సమావేశాలకు హాజరయ్యేవాడిని.

అప్పట్లో ఖమ్మం సమితిలో, పాలేరు నియోజక వర్గంలో, ఇప్పటి ముదిగొండ మండలంలో భాగంగా వున్న కమలాపురం, బాణాపురం, పెద మండవ, వల్లభి, నాచేపల్లి, గంధసిరి, పమ్మి, చిరు మర్రి, అనా సాగరం గ్రామాలతో పాటు మా గ్రామంలో జరిగిన వ్యవసాయ కూలీ పోరాటాలను స్వయంగా చూసే అవకాశం కలిగింది. ఆ పోరాటాలలో, అంతో-ఇంతో, మా వూళ్లో నాకు కూడా కొంత మేరకు పాత్ర వుంది. అదే విధంగా అలనాటి కాంగ్రెస్ రాజకీయాలు, నాటి సమితి అధ్యక్షుడు ఉపేంద్రయ్య రాష్ట్ర హోం మంత్రి జలగం వెంగళరావు అండతో నెరపిన హత్యా రాజకీయాలను కూడా కళ్లారా చూశాను. బహుశా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మా పరిసర గ్రామాలలో ఆ పోరాటాలు ఇతర ప్రాంతాల వారు ఆదర్శంగా తీసుకోవాల్సిన తరహాలో జరిగాయంటే అతిశయోక్తి కాదేమో!

         పరిసర గ్రామాలలో వ్యవసాయ కూలీ పోరాటాల కార్యాచరణ పథకం రూపకల్పనకు, అమలుకు కేంద్రం బాణాపురం గ్రామం. అప్పటి సర్పంచ్, మాజీ సమీ తాత్కాలిక అధ్యక్షుడు, గండ్లూరి కిషన్ రావు నాయకత్వంలో, అదే గ్రామానికి చెందిన హరిజన నాయకుడు బాజి హనుమంతు (ఆ తరువాత పాలేరు ఎమ్మెల్యే), కమలాపురం గ్రామ సర్పంచ్ వనం నర్సింగ రావు, గంధ సిరి గ్రామ సర్పంచ్ గండ్ర వీర భద్రా రెడ్డి, పెద మండవ సర్పంచ్ తాళ్లూరి వైకుంఠం, పమ్మి గ్రామ సర్పంచ్ బుగ్గ వీటి రంగయ్య ప్రభృతులు చుట్టు పక్కలున్న పది-పదిహేను గ్రామాల వ్యవసాయ కార్మిక, కర్షక వర్గాన్ని సమీకరించి వారి హక్కుల సాధనకై పోరాటం మొదలెట్టారు. వ్యవసాయ కూలీలకు కనీస కూలి రేట్లు అందేటట్టు చేయడమే వారి లక్ష్యం. కిషన్ రావు నాయకత్వంలో వారంతా పోరాట పద్ధతులను ఒక పక్కా ప్రణాళికా బద్ధంగా రూపొందించుకున్నారు.

          చుట్టుపక్కల గ్రామాలలో వేరు శనగ ముఖ్యమైన పంట. వేరు శనగ కాపుకొచ్చాక కూలీలతో  పీకించి కొట్టిస్తారు. తయారైన కాయను ‘డబ్బాల’ తో కొలిచి కూలీ నిర్ణయించేవారు. ‘డబ్బా’ కు 16 ‘మానికలు. మానికంటే రెండు శేర్లు. డబ్బా కాయ కొట్టినవారికి మూడు ‘సోల’ ల నుండి ఒక ‘మానిక’ వరకు జొన్నలు కొలిచి కూలీగా ఇచ్చేవారు. సోల అంటే అర్థ శేరు. అయితే వేరు శనగ కొలిచే డబ్బాలు, జొన్నలు కొలిచి కూలి ఇచ్చే మానికలు అన్నీ తప్పుడివే. 16 ‘మానికలు’ వుండాల్సిన డబ్బాలు వాస్తవానికి 20, 22 మానికలు పట్టేవరకుండేవి. మానికకు నాలుగు సోలలుండాలి కాని మూడున్నర వుండేవి. అలా రెండు వైపులా తప్పుడు కొలతలతో కూలీలకు ముట్టచెప్పేవారు భూస్వాములు. ఒకవైపు కూలీ తక్కువ, మరో వైపు తప్పుడు కొలతలు. ఇలా రెండు విధాలుగా మోసం జరిగేది. అదో రకం దోపిడీ అనాలి. సరిగ్గా ఆ పిచ్చి కొలతలకు, తక్కువ కూలీకి వ్యతిరేకంగా మహత్తరమైన ఉద్యమం ప్రారంభమైంది. ‘వ్యవసాయంలో కష్టం చేసేది కూలోడు, కష్టానికి తగ్గ ప్రతిఫలం కోరే హక్కు అతడికి వుంది, న్యాయమైన కూలీ కోసం, ఖచ్చితమైన కొలతల కోసం మీరంతా పోరాడండి’ అని పిలుపిచ్చారు కిషన్ రావు నాయకత్వంలో మిగిలిన గ్రామ సర్పంచులు. తొలుత పోరాటం బాణా పురం గ్రామంలో మొదలైంది.

         కిషన్ రావు ఇచ్చిన పిలుపుకు, ఆ నినాదానికి కూలీలలో మంచి స్పందన వచ్చింది. అంతా కలిసి కట్టుగా, ఐక్యంగా నిలబడ్డారు. తప్పుడు కొలతల డబ్బాలు, మానికలు కనుమరుగయ్యే సమయం ఆసన్నమైంది. కూలీలు, వారి ముఠాలు, డబ్బులు పోగు చేసుకుని ఖచ్చితమైన కొలత డబ్బాలు, మానికలు కొనుక్కున్నారు. వాటి ప్రకారం ఇస్తేనే పుచ్చుకుంటామన్నారు. సమ్మె చేశారు. కూలీల ఐక్యత ముందు భూస్వాములు తలవంచక తప్పలేదు. బాణాపురం కూలీలు విజయం సాధించారు. తరతరాలుగా శ్రమ జీవుల కష్టాన్ని దోచుకు తింటున్న భూస్వాముల తప్పుడు కొలతలకు స్వస్తివాచకం పలికారు బాణాపురం గ్రామంలో. ఈ ఉద్యమం పరిసర గ్రామాలకు కూడా పాకింది. ఆయా గ్రామాల కమ్యూనిస్ట్ నాయకులు బాణాపురం తరహాలోనే పోరాటానికి కూలీలను సిద్ధం చేశారు. గ్రామ, గ్రామాన సభలు సమావేశాలు జరిగాయి. వందల, వేల సంఖ్యలో, చిరకాలం నుండి భూస్వాముల ఎత్తుగడల కింద చీల్చ బడి, ఛిన్నా భిన్నమైన కులాలన్నీ ఒక్క చోట చేరాయి. తప్పుడు కొలతలు, తక్కువ కూలీకి వ్యతిరేకంగా మహోద్యమం సాగింది. పిచ్చి మానికలు, డబ్బాల స్థానంలో కొత్తవి వచ్చాయి. నేటికీ మా పరిసర గ్రామాలలో అవే కొలతలుగా పనిచేస్తున్నాయి.

         మా పరిసర గ్రామాల భూస్వాములు మరొక రకమైన వింత దోపిడీ చేసేవారు. కూలీలు పోగు చేసుకునే ‘పెంట కుప్పలను’ వారు కారు చౌకగా కాజేయడం చేసేవారు. అదంతా ఒక ప్రణాళికా బద్ధంగా చేసేవారు దోపిడీ దారులు. కరవు కాలంలో కూలీలకు ఐదు, పది మానికలు ధాన్యం అప్పుగా ఇచ్చేవారు. అప్పిచ్చేటప్పుడు ఒక షరతు విధించేవారు. అప్పు పుచ్చుకున్న కూలీలు తమ పెంట కుప్పలను అప్పిచ్చినవారికే అమ్మాలని షరతు. పెంట కుప్పలను వారికిష్టమైన రేటుకే కొనేవాడు భూస్వామి. అప్పిచ్చిన ధాన్యానికి ‘నాగులు’, ‘పెచ్చులు’ (వడ్డీ లాంటిది) కట్టేవాడు. నిలువు దోపిడీకి కూలీని గురిచేసేవాడు. ఇక పెంట కుప్పలను తోలే ‘బండి జల్ల’ కు ఒక నికరమైన కొలతలుండక పోయేది. బలిష్టమైన ఎద్దుల బండిని కట్టి, పెద్ద జల్ల నిండా పెంట పోయించి, జీత గాళ్లతో కరువు తీరా తొక్కించి, పెంటను కుక్కించేవాడు.

పది బండ్లు అవుతుందనుకున్న పెంట నాలుగు బండ్లే అయ్యేది. అప్పు అలానే మిగిలేది. పెంట ఖాళీ అయ్యేది. దానికి వ్యతిరేకంగా కూలీలను సమీకరించారు కమ్యూనిస్ట్ నాయకులు. అప్పిచ్చిన ధాన్యానికి అడ్డగోలు నాగులు, పెచ్చులు కట్టడానికి వీల్లేదన్నారు కూలీలు. పెంట జల్లలు కొలత ప్రకారం వుండాలన్నారు. అడుగుకు ఫలానా రేటు వుండాలన్నారు. పెంట పోశాక తొక్కడానికి కుదరదన్నారు. భూస్వాములు కూడా బిగదీసుకున్నారు. అప్పులు ఇవ్వమన్నారు. జల్లలు మార్చమన్నారు. జల్లలు అల్లే ఎరుకలను, ఎరువులు నింపే పాలేర్లను తమకండగా కూలీలు సమ్మె చేయించారు. పెద్ద జల్లలు అల్లమని ఎరుకలు, పెంట బండ్లలో తొక్కమని పాలేర్లు భూస్వాములను బెదిరించారు. కూలీలంతా ఐక్యమయ్యారు. భూస్వాములు దిగి రాక తప్పలేదు. నాటి నుంచి నేటి వరకు మా పరిసర గ్రామాలలో కొల జల్లలు, కొల పెంటలు అమల్లో వున్నాయి.

భూస్వాముల మరో రకమైన దోపిడీ భూమి విస్తీర్ణాన్ని తక్కువ చేసి చెప్పడం. తద్వారా తక్కువ కూలీ చెల్లించడం. వేరు శనగ కూలీ, పెంట కుప్పల దోపిడీ విషయంలో విజయం సాధించిన వ్యవసాయ కూలీలు వరి నాట్లు, కోతలు, కలుపు తీయడం వంటి రోజువారీ పనులకు, కూలి రేట్లను పెంచాలని, పాలేర్ల జీతాలు పెంచాలని పోరాటాలు ప్రారంభించారు. ఆ పోరాటానికి కూడా గండ్లూరి కిషన్ రావు నాయకత్వంలో తొలుత బాణా పురం గ్రామం ముందంజ వేసింది. మా పరిసర చుట్టుపక్కల అన్ని గ్రామాలలోను నాట్లకు, కోతలకు, కలుపు తీయడానికి ఎకరానికి ఇంత అని కూలి ఇచ్చేవారు భూస్వాములు. సాధారణంగా అవంతా ముఠా కూలీలే కలిమిడిగా చేసేవారు. విడి కూలి వుండదు. ఇందులో కూడా భూస్వామి భూమి విస్తీర్ణానికి సంబంధించి దొంగ లెక్క చెప్పి కూలీలను మోసం చేసే వారు. ఇలాంటి దొంగ లెక్కలకు వ్యతిరేకంగా వ్యవసాయ కూలీలు పోరాటం చేసి విజయం సాధించారు. బాణా పురంలో కూలీలు సాధించిన విజయాన్ని ఆసరా చేసుకుని, పరిసర గ్రామాలలోని ఇతర కూలీలు ఆ గ్రామం నడిచిన దారిలోనే తమ గ్రామాలలో కూడా విజయం సాధించారు.

ఇదిలా వుండగా చుట్టుపక్కల గ్రామాలలోని కూలీలు, బాణా పురం నుండి కూలి సంఘం తయారు చేసిన సరైన కొలత మానికలను తెచ్చుకున్నారు. ఆ మానికలతోనే తమ గ్రామాలలో కూడా కూలి ఇవ్వాలని భూస్వాములను నిలదీశారు. భూస్వాములలో గందరగోళం బయల్దేరింది. ఇలా మా ప్రాంతమంతా అన్ని గ్రామాలలోను కూలీలంతా ఒక్కటై నిల్చి కూలి పెంపుదల సాధించడమే కాకుండా వివిధ రకాల దోపిళ్లకు వ్యతిరేకంగా పోరాడారు. భూస్వాములు ఆక్రమించిన ప్రభుత్వ బంచరాయి భూములను కూడా కూలీలు స్వాధీన పరచుకున్న ఘటనలు అనేకం వున్నాయి. ఆ మొత్తం పోరాటానికి గండ్లూరి కిషన్ రావు ముందుంటే, వనం నర్సింగరావు లాంటి సహచర కమ్యూనిస్ట్ నాయకులు ఆయనకు అందగా నిలిచారు. 

ఆధ్యాత్మ-యోగ విద్యలను, జప విధానాన్ని- ఫలితాన్నీ, జ్ఞానయోగాన్ని వివరించిన భీష్ముడు ..... ఆస్వాదన-106 : వనం జ్వాలా నరసింహారావు

ఆధ్యాత్మ-యోగ విద్యలను, జప విధానాన్ని- ఫలితాన్నీ,

జ్ఞానయోగాన్ని వివరించిన భీష్ముడు

 ఆస్వాదన-106

వనం జ్వాలా నరసింహారావు

సూసూర్యదినపత్రిక (06-02-2023)

ఆచార విధులను గురించి భీష్ముడు చెప్పగా విన్న ధర్మరాజు అ ఆతరువాత ఆధ్యాత్మ విద్య గురించి తెలపమని అడిగాడు పితామహుడిని.

జీవాత్మ కడలి కెరటాల లాగా పుట్టుతూ-గిట్టుతూ వుంటుందని, భూమి, నీరు, కాంతి, గాలి, ఆకాశం, అనేవి పంచ భూతాలని, వీటి స్వభావాలైన వాసన, ద్రవం, తేజస్సు, చలనం, శబ్దం అనేవి ఇంద్రియాల ద్వారా గ్రహింపునకు వస్తాయని చెప్పాడు భీష్ముడు. చెవి, ముక్కు, నోరు, తోలు, కన్ను అనే ఇంద్రియాలు వాసనను కలిగించే పంచభూతాల గుణాలు అనుభవానికి రావడానికి ఉపకరణాలుగా పనిచేస్తాయని, అయితే ఈ ఉపకరణాల ద్వారా అనుభవం కలగడానికి ఆధారభూమి మనస్సని, ఆ మనస్సు ద్వారానే విషయజ్ఞానం లభిస్తుందని అన్నాడు. ఈ విధంగా ప్రాపంచిక విషయజ్ఞానం మానవుడిలో ప్రవృత్తిని రేకెత్తించి జనన మరణ చక్రంలో పడేసి తిప్పుతుందని, ఆ చక్ర భ్రమణం నుండి బయట పడాలంటే ఇంద్రియాలను మళ్లించి మనస్సుతో వాటిని చేర్చితే బుద్ధిని అణచి వేయవచ్చని, ఆవిధంగా పురుషుడు అంతర్ముఖుడైనప్పుడు అతడిలో బుద్ధి గోచరించని స్థితి కలుగుతుందని వివరించాడు భీష్ముడు.

ఇంకా ఇలా చెప్పాడు భీష్ముడు: ‘ఆత్మ జీవంతో చేరి భూతాత్ముడని, శరీర తత్త్వం తెలిసిన క్షేత్రజ్ఞుడని, శరీరం తాను కానని తెలిసి పురుషుడని, పరమేశ్వరుడని, బుద్ధికి ఎడంగా నిలిచి బుద్ధి సాక్షి అని, తత్త్వదర్శనంతో జనరహితుడని పిలువబడుతూ వుంటాడు. ఆత్మ పరమేశ్వరుడైనప్పుడు అతడు విశ్వమయుడు. సృష్టి అంతా అతడిలో గోచరించేదే. అదే సృష్టి తిరిగి ఆత్ముడికి ఇంద్రియానుభవం ద్వారా గోచరిస్తున్నదంటే అర్థం అదంతా మాయ వల్ల స్వప్న సదృశమైన అయదార్థం మిథ్య తప్ప అన్యం కాదు. మాయ కారణాన ఆత్మ తనను తాను కాంచలేక, మోసానికి గురై, పరమాత్మకు వెలియై అలమటిస్తున్నది. మిథ్యాజ్ఞానమే మాయ. ఆ మాయకు నరుడిలోని గుణత్రయమైన సత్త్వరజస్తమములు శరీరం. కాబట్టి మాయతత్త్వం గ్రహించి తమస్సును, రజస్సును మొదలు వదిలేయాలి. ఆ తరువాత రజస్సును వదలివేయాలి. అప్పుడు ఆత్మ శుద్ధసత్త్వరూపంతో వెలుగుతూ వుంటుంది. ఆ తరువాత ఆ సత్త్వాన్ని కూడా తొలగించుకోవాలి. అప్పుడు కేవలం జ్ఞానం-విమల బోధ కలిగి ఆత్మ పరమాత్మగా పరిణమిస్తుంది’.

భీష్ముడు చెప్పడాన్ని కొనసాగిస్తూ ఇలా అన్నాడు: ‘గుణత్రయ రాహిత్యమే కైవల్యం. గుణత్రయ రాహిత్యమే మాయా నాశనం. సత్త్వగుణం సుఖమయం. రజస్సు నితంతర దుఃఖనిలయం. తమస్సు జ్ఞానమాంద్యంగా దర్శనం ఇస్తుంది. సమతా దృష్టితో ఆయా గుణాలను, స్వభావాలను దూరం చేయాలి’.

ఆధ్యాత్మ విద్యను వివరించిన భీష్ముడు అనంతరం ఆధ్యాత్మ విద్యకు ఉపకరించే యోగవిద్యను వివరించాడు ధర్మరాజుకు. మనస్సు చలించకుండా ఏకాగ్రమై నిలిచి వుండాలని, అంటే గట్టి నిశ్చయం అవసరమని, మనస్సులో ఆలోచన సహజంగా వుంటుందని, గాలి కారణాన మనస్సు చలిస్తుందని, కాబట్టి మనో నిగ్రహం కొరకు వాయువును నిరోధించాలని అన్నాడు. వాయువును నిగ్రహించడం సులభంకాదని, అది క్రమక్రమంగా సాగాలని, ఆయాసపడడం, విసుగుచెందడం కుదరదని, స్థిరమైన సంకల్పంతో యమ నియమాదులైన ఎనిమిది సాధనాలతో వాయు నిరోధానికై ప్రయత్నించాలని, ఆ ప్రయత్నంలో ముందుగా ఆలోచనలు కరిగిపోతాయని, తరువాత సందేహం కలుగుతుందని, ఆ తరువాత వాయువును క్రమబద్ధం చేయగలగడం జరుగుతుందని భీష్ముడు చెప్పాడు. క్రమబద్ధమైన వాయువు శరీరాంతర్గత నాడుల ద్వారా ప్రయాణం చేస్తూ, శరీరంలోని బ్రహ్మస్థానాన్ని చేరుకొంటుందని, అప్పుడు మనస్సు నిశ్చలమై, శాంతి పూర్ణమై, బ్రహ్మానందాన్ని అందుకుంటుందని, ఆ తరువాత ఆ ఆనందంలో లీనమైపోతుందని అన్నాడు.

తన తరువాత సందేహాన్ని వినిపించాడు ధర్మరాజు భీష్ముడికి. జపం చేసే విధానాన్ని, జపం చేసేవారు పొందే ఫలితాన్నీ తెలియచేయమని కోరాడు. జపించాల్సిన అంశం గురించి యమధర్మరాజుకు, కాలపురుషుడికి, మృత్యుదేవతకు, బ్రాహ్మణుడికి, ఇక్ష్వాకువంశరాజుకు మధ్య జరిగిన సంవాదం ఆధారంగా, అ ఇతిహాసాన్ని వినిపిస్తూ ధర్మరాజు సందేహానికి వివరణ ఇచ్చాడు భీష్ముడు. ఇస్తూ ఇలా అన్నాడు: ‘జప విధిని వేదాంతవేత్తలు ఆమోదిస్తారు. ఒక సమతలం మీద దర్భలను ధరించి ఆసీనుడై జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను నిగ్రహించి ఏకాగ్రచిత్తంతో జపం చేయడానికి పురుషుడు ఉద్యుక్తం కావాలి. ఆ విధంగా జపవిధిని నిర్వహిస్తే, అలాంటి నిష్ఠాభరితమైన జపం సుఖదుఃఖాలకు, రాగద్వేషాలకు అతీతమైన శాశ్వత స్థానాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అంటే, జప విధానాన్ని సరిగ్గా పాటిస్తేనే మోక్షం కలుగుతుంది. అదే జపంలో శౌచాది లక్షణాలు లోపిస్తే, నైచ్యానికి పాల్పడితే నరకం కూడా ప్రాప్తించవచ్చు. జపశీలురు, యోగులు పుణ్యగతులు పొందుతారు’.       

జ్ఞానయోగాన్ని గురించి చెప్పమని కోరాడు ధర్మరాజు తాత భీష్ముడిని అ ఆతరువాత. మను-బృహస్పతి అనే పేరుతో వున్న ఇతిహాసాన్ని ఉటంకిస్తూ ధర్మరాజు సందేహాన్ని తీర్చాడు భీష్ముడు. జ్ఞానయోగానికి మూలం మంచి కర్మయోగమే అని, అనిష్టాన్ని తొలగించుకొనడానికి, ఇష్టాన్ని అందుకొనదానికి, మానవుడు కర్మ చేస్తాడని, ఏవైతే సుఖాలుగా అందుతాయో అవే అనంతర కాలంలో దుఃఖాలుగా పరిణమిస్తాయని, ఏనరుడైతే తాను చేసే కర్మను ఫలం ఆశించకుండా తన విధిగా మాత్రమే చేస్తాడో అతడు గొప్ప జ్ఞానం ద్వారా గొప్ప సిద్ధిని, ముక్తిని పొందుతాడని భీష్ముడు బృహస్పతి మాటలుగా చెప్పాడు.

జ్ఞానయోగం మానసిక ప్రక్రియ అని, ఆత్మజ్ఞత, అనాత్మజ్ఞత మానసిక చర్యలని, మనస్సు కలతదేరి, కల్మశానికి దూరమై, నిర్మలంగా వున్నప్పుడు పురుషుడు ఆత్మజ్ఞుడు కాగలడని, తనను తాను గ్రహించగలడని, అయితే ఆ మనస్సు కలతతో క్షుబితమై వున్నప్పుడు అతడు ఆత్మజ్ఞానాన్ని పొందలేడని, అనాత్మజ్ఞుడుగా, అజ్ఞానిగా మిగిలిపోతాడని భీష్ముడు అన్నాడు. ఇంద్రియాలు అదుపు-ఆజ్ఞలలో వుండకుండా తమతమ పనులు తాము చేసుకుంటూ పోతే కష్టాలు తప్పవని, వాటిని అదుపు చేస్తే సుఖసంతోషాలు, శాంతి-సౌభాగ్యాలు కలుగుతాయని, అందువల్ల ఆత్మను ఇంద్రియాల బారిన పడకుండా రక్షించుకోవాలని భీష్ముడు చెప్పాడు.

భీష్ముడు ఇంకా ఇలా వివరించాడు: ‘పాపాలు నశిస్తే జ్ఞానం కలిగి ప్రకాశిస్తుంది. అప్పుడు శరీరంలోని ఆత్మ తనను తాను అద్దంలో లాగా చూసుకోగలుగుతుంది. జ్ఞానం ఆత్మలో ఐక్యమౌతుంది. సృష్టిలో మూల ద్రవ్యాలు ఐదున్నాయని తాత్త్వికులు పలుకుతారు. అవి నేల, నీరు, కాంతి, గాలి, ఆకాశాలు. ఈ ఐదూ సృష్టిలో మిగిలినవాటన్నిటికన్నా పెద్దవే అయినా వాటిలో తారతమ్యాలున్నాయి. హెచ్చుతగ్గులున్నాయి. ఇవి ఒకదానికంటే మరొకటి పెద్దవి. కాకపొతే పెద్దవైన పంచభూతాలకంటే కూడా పెద్దది నరుడి మనస్సు. ఆ మనస్సుకంటే పెద్దది నరుడిలోని భాగమైన బుద్ధి. వీటన్నిటి కంటే మించిన పెద్దరికం కాలానిది. దానికంటే కూడా మించినవాడు దేవుడు. అతడు సర్వోన్నతుడు. అతడే ఈ లోకాలన్నిటికీ ప్రభువు’.

‘ఆ దేవదేవుడు ఆది మధ్య అంతరహితుడు. కాబట్టి నాశనంలేనివాడు అతడు. అతడే లోకంలోని జ్ఞానవిజ్ఞానఖనులని భావించబడే నాలుగు వేదాలకు, ఆత్మ-అనాత్మ, ఆస్తిక-నాస్తిక మతాలకు ఆధారభూతమై వెలుగొందేవాడు, సంసారాన్ని అధిగమించే శక్తిని ఇచ్చేవాడూ అతడే. ఆ పరతత్త్వం ప్రపంచంలో మనం జ్ఞానం అనుకొనే సర్వాన్ని లోగొంటుంది. తరువాత శాంతిని పొందుతుంది. ఆ శాంతి భేదంలేని మంచి గొప్ప వెలుగు. నిజానికి ఆ శాంతిని వర్ణించి చెప్పడం అసాధ్యం. అది ఆలోచనకు, భాషకు అందనిది. ఇతర కర్మల ద్వారా కూడా దానిని పొందలేం’.

‘మనస్సు, బుద్ధి, లోకజ్ఞానం, నరుడినుండి తొలగిపోతే తప్ప అతడికి శాశ్వత సర్వవ్యాపి జ్ఞానమయ తత్త్వం, పరమేశ్వర స్వరూపం గోచరించదు. అయితే ఆ మూడూ తొలగే మార్గం ఏది? తత్త్వజ్ఞులకు ఇది సులభమే. మనస్సుతోనే మనస్సును లోబర్చుకోవాలి. తరువాత తొలగించుకోవాలి. బుద్ధితోనే బుద్ధిని లోగొని అనంతరం లీనం చేయాలి. ఆ తరువాత జ్ఞానాన్ని పరతత్త్వేతరమైన తెలివితేటలన్నిటినీ జ్ఞానంతోనే వశపరచుకొని పిమ్మట తొలగించుకోవాలి. ఈ విధంగా పరతత్త్వాన్ని అందుకోవాలి. ఆ పరతత్త్వం గొప్ప వెలుగు. ఆ వెలుగు మృతిలేనిది, చ్యుతిలేనిది, మలినం లేనిది, కొలత లేనిది, నాశం లేనిది, చివర లేనిది. దానిని యమనియమాది సాధన సంపత్తితో ప్రశాంతమై నిలిచిన చిత్తం ద్వారా గ్రహించవచ్చు. అప్పుడే ఆ పరతత్త్వం అనుభవానికి అందుతుంది’.

బృహస్పతి మనువుకు ఉపదేశించిన జ్ఞానయోగాన్ని భీష్ముడు, బృహస్పతి మాటలుగా ధర్మరాజుకు చెప్పి ఆ మాటల అర్థాన్ని శ్రద్ధతో గ్రహించి, మనస్సులో మననం చేసి, పరతత్త్వ ప్రాప్తికొరకు మనస్సును అభ్యాసమార్గాన పెట్టమని బోధించాడు.  

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, చతుర్థాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

Sunday, February 5, 2023

The Great National Outreach of Bharat Rashtra Samithi : Vanam Jwala Narasimha Rao

 The Great National Outreach of Bharat Rashtra Samithi

BRS is holding its first meeting outside Telangana in Nanded today

Vanam Jwala Narasimha Rao

The Hans India (05-02-2023)

With the joining of 79-year-old Giridhar Gamang, a veteran and seasoned Congress Party Leader, a onetime Chief Minister of Odisha and nine times Lok Sabha Member (until he joined BJP in 2015), along with his wife Hema Gamang, also a onetime Lok Sabha Member in Bharat Rashtra Samithi, BRS president and Chief Minister K Chandrashekhar Rao’s National Outreach received a boost. KCR also formally welcomed more than fifty prominent former MPs, MLAs, union leaders, kisan leaders, intellectuals, political and social activists from Odisha, including Giridhar Gamang’s two sons, on January 27, 2023 at the BRS Hyderabad Headquarters, heralding more such surprises in Indian politics shortly.

This important political development will certainly have an effect not only on Odisha politics but also on National politics. Speaking on this occasion KCR once again reminded, reiterated and reinforced that the BRS party was formed with the main objective of transforming the future of India by bringing a qualitative change in the thought process and ideology of the people. BRS supporters enthusiastically felt that there is a great chance of expanding BRS party in Odisha where BJP is struggling to gain a foothold.

Stimulating the memory of those who present at the BRS Headquarters, who came en masse in large numbers all the way from Bhubaneshwar, as well as lakhs of others, who watched him live on TV, KCR declared that if the party wins the 2024 Lok Sabha elections, the BRS will ensure uninterrupted 24 hours quality electricity supply across the country within two years including free supply to farmers, ensure implementation of Kisan Bandhu across the country on the lines of Rythu Bandhu, extend financial support under Dalit Bandhu to 25 lakh families every year across the country, provide irrigation water to 83 crore acres of cultivable land etc. He also promised to launch projects such as Mission Bhagiratha to deliver treated water to every household in the country in five years.

KCR was extremely critical of governments at the centre for their failure and inability to progress the country and to meet the aspirations of its people, denying basic needs such as water for drinking and irrigation, power and healthcare among others even after 75 years of Independence, despite the country is blessed with abundant resources.

Citing the example of a younger State like Telangana that has recorded tremendous development due to sheer commitment of BRS government, KCR questioned when it was possible in Telangana, why not in other states. It’s not wealth but commitment that is required for development said KCR. ‘It does not require Dhan (Money) but Mann (big thought) is enough’ to address problems pending in the country quipped KCR.

Quoting the instance of doling out the country’s wealth to business tycoons like Adani and Ambani and promoting them indiscriminately, KCR criticised that catering to the basic needs of vulnerable sections is given up by the BJP government. He took objection for the centre’s policy of nationalisation of losses and privatisation of profits. KCR further emphasised the need for farmers coming together across the country to realise his desire of ‘Ab ki Baar, Kisan Sarkar’ to dictate the terms to the ruling parties. KCR said that many governments and many leaders ruled the country but the condition of the farmers and the poor remained the same. He assured that BRS party would create a platform for farmers to elect MLAs and MPs and go to the Legislative bodies to have a say in decision making process.

Ridiculing the state of affairs prevailing in India, KCR said that, people in India still want their children to go abroad for jobs and make a good earning and living. This brain drain is hindering the progress. He said, it is disgusting that, Indians are celebrating if any of their family members gets a USA green card. Why are we celebrating like this despite India is credited with abundant resources more than America, China and any other country in the world, questioned KCR.

Strongly accusing the governments hitherto in power and particularly in the centre, and holding them responsible for the unpleasant plight of the people, BRS Chief KCR said that, political parties and leaders are bothered only about winning elections by any means. He said that it's the parties which are winning instead of people. To bring electoral revolution in the country, to combat this state affairs and make people win elections, BRS has been launched, divulged KCR. In the name of caste and religion, some political parties are creating disharmony between people and are being divided, criticised KCR. He stressed the need for a drastic change in the approach of Indian politics.   

The drive for justice gained impetus with considerable pace in the following days. A day after expressing deep concern over the deteriorating conditions in the country arising out of Centre’s faulty policies, KCR presiding over BRS Parliament Members at Pragathi Bhavan on the eve of Union Budget Session, directed the party’s MPs to expose its anti-people and faulty economic policies in both Houses of Parliament enlisting the support of likeminded parties.

KCR strongly felt that the methods adopted by Modi’s BJP government as well as the ‘inefficient rule’ and ‘perilous policies,’ have become obstacles and threat to national integrity and development. The meeting expressed serious concern over the situation in the country that is deteriorating day by day due to the wrong policies adopted by the NDA government. He was referring to the attempts of Centre to handover people’s hard-earned savings to its friendly corporates.

Citing the examples of several problems, KCR referred to, increase in prices of petrol, diesel, cooking gas and other essentials; insensitive towards the poor and burdening them with fresh taxes and inflation; increase in unemployment; privatization of public sector units etc. CM advised the MPs to utilize all possible democratic means to stop the Centre’s undemocratic decisions. Accordingly, the Members followed the advice.

One of the most important issues CM KCR wanted the MPs to raise their voice was, Centre’s attitude of undermining the spirit of Cooperative Federalism and specifically abusing the Governor’s office to weaken States. Instead of acting as pious bridge between Centre and States adhering to constitutional duties and obligations conferred, Governors are being used for politically motivated actions against States told KCR to MPs.

He was critical of Governors not honoring decisions taken by the Cabinet, Legislative Assembly and Council, and are keeping even the bills passed by Legislature pending inordinately for no specific reason. He directed MPs to force the Centre to tell the nation the reason behind creating financial and other obstacles to Telangana, which is running on the path of progress and to make the Centre table the matter in Parliament.

Thus, the Bharat Rashtra Samithi (BRS) Parliamentary Party Meeting has expressed serious concern over the degrading situation in the country due to the anti-people policies being followed by the Bharatiya Janata Party (BJP) government at the Centre and has decided to strongly oppose the Centre’s policies and its attempts to trouble non-BJP State governments and to fight together with likeminded parties for justice.

In tune with the essence and directive in the BRS Parliamentary Party Meeting, Party MPs abstained from attending the address of Rashtrapathi Droupadi Murmu to the joint sitting of both Houses of Parliament on Tuesday, the January 31. AAP also did the same. As expected, the Union Budget presented turned out to be highly disappointing and BRS was critical of it. BRS MPs also demanded a JPC or inquiry by Supreme Court Chief Justice on the Hindenburg Report on Adani.

Meanwhile, in a significant development, Governor of Telangana addressed Joint Session of State Assembly and Council, highlighting the Government’s inclusive and comprehensive growth of the state and how it is progressing in a phenomenal manner on every front, making it a Role Model for the entire Country. Governor said that the extraordinary success of the state is due to blessings of the people, skilful administration by CM KCR, hard work of peoples’ representatives and dedication shown by the Government Employees. Governor also referred to discussion on Telangana Model across the Country.   

Against this background, and after its highly successful, mammoth and maiden public meeting in Khammam on January 18, 2023, BRS is scheduled to hold its second meeting in Nanded in Maharashtra. This is the first meeting organised by the BRS outside Telangana for a further National Outreach. Nanded city, known to be a Karma Bhoomi, was the birthplace of three Maratha poet-saints, Vishnu Pant Shesa, Raghunath Shesa, and Vaman Pandit.

They are familiar for their message of Friendship, Equality and Harmony. The city is also known as a centre of Sanskrit Learning. Guru Gobind Singh the Tenth and Last Sikh Guru, a spiritual master, warrior, poet and philosopher spent his last days in Nanded and passed his Guru Ship to the Sacred Text Guru Granth Sahib before his death there in 1708. A Sikh Gurdwara (Temple and Kitchen) is built on the site where Guru Gobind Singh was assassinated. Nanded is home to Swami Ramanand Teertha Marathwada University.

(The writer is CPRO to Chief Minister, Telangana)