Sunday, December 24, 2023

ప్రాచీన సంస్కృతి, మహోన్నత నాగరికత, విలక్షణ సాంప్రదాయాల భారతజాతి ..... ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-4 : వనం జ్వాలా నరసింహారావు

 ప్రాచీన సంస్కృతి, మహోన్నత నాగరికత, విలక్షణ సాంప్రదాయాల భారతజాతి

ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-4

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (25-12-2023)

‘భారత జాతికి ప్రాచీన సంస్కృతి, మహోన్నత నాగరికత, విలక్షణ సాంప్రదాయం, కాలానికి అందని చరిత్ర, అపార సాహిత్యం, అనంత కళలు వున్నాయి. అందువల్ల భారత జాతి హిమదున్నతమై గర్వించాలి. భారత దేశాన్ని పాలించిన ఆంగ్లేయ ప్రభువులు (ఆంగ్లేయ ప్రజలు కాదు) భారత సంప్రదాయ సంస్కృతులకు ఎనలేని ద్రోహం చేసినారు. ఉదాహరణకు అనంత చరిత్రగల మన భారతజాతిని చరిత్రహీనులైన ఆంగ్లేయులు మనకు నీటిని గురించి, నీటి వాడకము గురించి తెలియదని హాస్యాస్పదంగా అన్నారు. దానికి స్పందనగా, అవును మహాప్రభూ, తెలియదు. మీరు ఆదేశించండి మేము ఆచరిస్తామని అన్నామే కాని, కాలం యొక్క సుదీర్ఘ హస్తాలకు వేదాలందే నీటిని గురించి వివరించబడి వున్నదని మనం అనలేదు. జీవనానికి నీరే ఆధారం అన్న ఋగ్వేదం “ఆపత్సు సర్వేభేషజేః” అన్నది. నీటిలోనే సర్వ వైద్యాలున్నవి అని దీనర్థం. మన ఆరోగ్యం నీటివాడకం మీద ఆధారపడి ఉన్నదన్న పాశ్చాత్య వైద్య విధానం దీనిని కొత్తగా కనుగొన్నదా? అంటే, మన మాటలే మనకు చెప్పి మనల్ని వంచించడం కాదా! మనం వంచకులకు స్వచ్చందంగా బానిసలం అయినామనడం నిత్యసత్యంకాదా!’

‘వేదం మానవ జీవితామృతం. వేదమే నరపశువును మానవుడిగా మార్చినది. అతనికి బందాలు, అను బందాలు, సంబందాలు నేర్పినది. వేదంలో “దంతావ్ ధావయేత్ ప్రాతః పలాశవట పిప్పలైః” అని ఉంది. దీనర్థం: ఉదయమే దంత ధావము చేయవలెనని. దానికొరకు మోదుగు, మర్రి, రావిని వాడవలెనని అని దాని అర్థం. వేదమే మానవుడికి సకలం నేర్పినదని దీని భావం. ఇది వాస్తవం. వేదాన్ని సంహితం చేసే సమయంలో స్థిరపడిన ఆచార సంబంధ మంత్రాలను తొలగించి ఉండవచ్చు. మానవ జీవితానికి సంఘం తప్పనిసరి’.

‘మానవ సంబంధాలు అన్నిటికీ ప్రధానమైనవి. మానవ సంబంధాలలో లైంగిక సంబంధం ప్రధాన పాత్ర వహిస్తుంది. ఈ సంబంధం వల్లే సంతానం, కుటుంబం, రక్తసంబందాలు ఏర్పడుతున్నాయి. సమాజపు సౌదానికి కుటుంబం పునాది లాంటిది. కుటుంబం ఎంత పటిష్టమైతే సమాజం అంతే బలవత్తరమవుతుంది. కుటుంబానికి మూలం స్త్రీ, పురుషుల లైంగిక సంబంధం. ఇదే ప్రేమలకు, అభిమానాలకు, అనుబంధాలకు కారణమైతున్నది. మానవ జీవితం ఈ అనుబంధాలతోనే మధురమై వుంటుంది.’

‘నేటి మన మానవ సంబందాలు అనాదిగా జరుగుతున్ననిరంతర సాంఘిక, అధ్యయన, ఆచరణ ఫలితాలు. ఇంతటి మహాత్తరమైన మానవ చరిత్రలో మానవ లైంగిక సంబంధాలు నియంత్రించడంలో మేధావులు చాలా వరకు కృతకృత్యులైనారని అనాలి. ఎంతటి రాక్షసుడైనా తల్లిని, చెల్లెను, అక్కను ఆశించడు. ఇది రాజకీయ బలప్రయోగం అవసరంలేని స్వచ్చంద చెలియలికట్ట! మానవ పరిశ్రమ ఈ చెలియలికట్టను, ఆర్ధిక, రాజకీయ రంగాలలో నిర్మించలేకపోయింది! అదే సాధ్యమైతే మానవజాతి ఒక నిర్మల మానవతా సామ్రాజ్యాన్ని నిర్మించుకోవచ్చు. ఇప్పటికి అది మృగ తృష్ణయే అనాలి!’.

‘స్త్రీ పురుష లైంగిక సంబంధాలు సంతానానికి కారణమవుతున్నాయి. సంతానమే సమాజపు కొనసాగింపు. శారీరక, మానసిక, ఆరోగ్య సంతానమే సమాజానికి ఆధారం. అందువల్లనే స్త్రీ, పురుష సంబంధాలను కఠినంగా నియంత్రించాల్సి ఉన్నది. ఒకే రక్తానికి కలిగిన సంతానానికి బుద్ధికుశలత లోపించుననే విషయం నిర్దిష్టమైనప్పుడు ఏక గర్భజాతుల లైంగిక సంబంధం నిషేధించ బడినది’.

‘ఆత్మజ్ఞానాన్ని కేవలం భారతీయులు మాత్రమే సాధించినారు. పాశ్చాత్యులు దీనిని అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి, పూర్తిగా అవగాహన చేసుకోవడానికి యుగాలు పడుతుంది. ఎందుకంటే, వారికి ఈ విషయంలో ఇంకా కనీసం అక్షరాభ్యాసం కూడా కాలేదు. ఆత్మకు దేహం వస్త్రం లాంటిది. మనిషి పాతబట్టలను వదిలేస్తాడు. కొత్తవాటిని ధరిస్తాడు. ఆత్మకూడా అంతే. పాత శరీరాన్ని విడిచేస్తుంది. కొత్తదానిని ధరిస్తుంది. ఇది ఉహాజనితం కాదు. జీవితాన్ని కాచి వడబోసి కనుగొన్న నిత్య సత్యాలు! ప్రకృతికి పరిణామమే కాని నాశనం లేనే లేదు. గింజ చెట్టుగా మారుతుంది. చెట్టు కర్రగా మారుతుంది. కర్రకు నిప్పంటుకుని బూడిద అవుతుంది. బూడిద మట్టిగా పరిణమిస్తుంది. ప్రకృతి సాంతం ఇంతే! ఇది ప్రకృతి ధర్మం! ఈ ప్రకృతి ధర్మాన్ని అనుసరించే ఆత్మ పరిణామం. అది నశించదు’.

‘జీవితానికి మృత్యువు కేవలం మార్పు మాత్రమే. అంతం కాదు. భౌతికంగా ఆలోచించినా మనిషి చనిపోయిన విధంగా అతడి ఆస్తిపాస్తులు చావడంలేదు. మరణించినవారి మరణశాసనాన్ని అమలుపరచాల్సిన అవసరం ఉన్నది. వారి సంతానం, వారసులు వారి అభీష్టాలను తీర్చవలసి ఉన్నది! శాసనపరంగా మరణించిన వారికే హక్కులు ఎక్కువ!! కొడుకు తండ్రి రూపంలో పుట్టుతున్నాడు. తలితండ్రులనుంచి వారి సంతానం వట్టి జీవితాన్నే అందుకొనదు. వారి కోపం, గుణగణాలు, బుద్ధి, ఆరోగ్యం, అనారోగ్యం అన్నింటిని అందుకుంటున్నారు. ఇవన్నీ ఏడు తరాలలనుండి సంక్రమిస్తాయని శాస్త్రం చెప్తున్నది. అన్నింటివలెనె ఆస్తి కూడా సంతానానికి చెందుతున్నది. తలిదండ్రులు విగత జీవులైనప్పుడు సంతానంవారి విషయంలో కృతజ్ఞత, ప్రేమాభిమానాలు ప్రదర్శించాల్సి ఉన్నది. అందుకు సంబంధించినవే శ్రాద్ధాది కర్మలు’.

‘మనిషి ఎంతో విచిత్రమైనవాడు. తన అంతరంగాన్ని మార్చలేడు. బహిరంగాన్ని బ్రహ్మాండంగా మార్చగలడు!! మనిషి గ్రహాంతరాల మీద అడుగులు వేస్తున్నాడు! సంతోషమేకాని తన ఈర్ష్యాద్వేషాలను, అభిమాన దురభిమానాలను సంస్కరించుకొనలేక పోతున్నాడు. వదలుకోవడం అసాధ్యం. అసంభవం. సంస్కారమే జరుగలేదా అని దిగమ్రింగుతున్నాడు. బయట పడలేక పోతున్నాడు. ఇది వదలడం కాదు. మరింత వేగంచేయడం! వేదం మనిషిని అధ్యయనం చేసింది. మనిషి స్వభావాన్ని చదివింది. మనిషి మనసును చూసింది. మానవ స్వభావపు నిత్యసత్యాలను చాటింది! నాటి నుంచి నేటివరకు ఏనాటికైనా మారేది మనిషి స్వభావం కాదు, వేషం మాత్రమే! పయనానికి నాడు రథం వాడితే, నేడు విమానాన్ని ఉపయోగిస్తున్నాం. చక్ర భ్రమణం మూలసూత్రంలో మార్పు లేదు. మార్పు ఆకారంలో మాత్రమే! ఈ సూత్రం అన్వయించుకుంటే అన్నిటికి చెల్లుతుంది.

         ‘వ్యసనాన్ని మనిషి ఏర్పరుచుకున్నాడు. భగవద్దత్తం కాదు. భగవంతుడు ప్రసాదించినవన్నీ మానవుడి శ్రేయస్సునకే అవుతాయి. మానవుడు ఒక విచిత్రప్రాణి. తనను తాను ధ్వంసం చేసుకోవడంలో నిపుణుడు! ఈ నైపుణ్యం ఇతర ప్రాణులకు లేదు!! మనిషి ఇతరులను సహితం ధ్వంసం చేయగల దిట్ట!!! జూదాన్ని ఒక వ్యసనంగా మనిషి ఏర్పరుచుకున్నాడు. ఎంతో నాగరికులమని చెప్పుకునే జాతులు సహితం నేటికీ ఈ వ్యసనం నుండి బయట పడలేకున్నాయి! సత్యమేమిటంటే ఈ నాగరికత మనిషికి మత్తునిచ్చి జూదపు సంకెళ్ళలో బంధించింది! నేటి నాగరికత ప్రధాన లక్షణమేమిటంటే ఇది బంధాలను తెలియనీయదు!! కట్లలో కృంగేవాడు సహితం తానూ స్వతంత్రుడిని అని అనుకొనునుకుంటాడు!!!’.

         ‘వేదసూక్తం జూదాన్ని గురించి సుందరంగా వివరించింది. బహుశా ఇంత కొద్దిలో వేదాన్ని గురించిన ఇంత వివరణ సాహిత్యంలో కనిపించలేదు. ఇంత వివరించినప్పటికీ ధర్మరాజు, నలుడు జూదమాడేకదా నలిగినారు! మనిషి వేదం చెప్పింది వినకపోతే చెడిపోతున్నాడు!! అందుకు వీరి వృత్తాంతమే సరైన నిదర్శనం. ఒక వ్యసనాన్ని కలిగించుట, నేర్చుకునుట సులభం. మాన్పించుట, మానడం దాదాపు అసాధ్యం. వ్యసనం వ్యక్తి అధిగమించాల్సి ఉన్నది! అందుకే వేదం వ్యసనపరులనే సంబోధించింది. “అక్షౌర్మాదీవ్యః కృషిమిత్కృష”, అంటే, జూదమాడవద్దు, కృషి చేయాలి, కృషి చేయాలి అని! కుటుంబాన్ని గురించి వేదానికి ఎంత ఆవేదన! కుటుంబమే కదా లోకానికి మూలం!’.

         ‘ప్రకృతి విచిత్రాతి విచిత్రం, నిగూఢాతి నిగూఢం. విశాలాతి విశాలం. ఇంకేమని అనగలం? ఇంతే. అయితే, ప్రకృతి ఇంతేనా? కాదు. భాష ఇంతే! భాష పరిమితం. ప్రకృతి అపరిమితం. అపరిమితమైనదాన్ని పరిమితమైనదానితో చెప్పకూడదు. అందుకే ఆకాశం ఆకాశం లాంటిదని, సముద్రానికి సముద్రమే ఉపమానమని అన్నారు వాల్మీకి మహర్షి. సృష్టి మొదలై ఇప్పటికి 195,58,85,170 పైగా సంవత్సరాలు. పాశ్చాత్యులు పేర్కొంటున్న చరిత్ర అనే పదానికి కనీసం వెయ్యేళ్లు కూడా లేవు. ఈ పరిజ్ఞానంతో అనంతమైన కాలాన్ని కొలవడానికి ప్రయత్నించడం కాళిదాసు అన్నట్లు “గమిష్యామ్యపహాస్యతామ్” మాత్రమే. నాగరికతలు ఎన్ని వచ్చినాయో, ఎన్ని భూస్థాపితాలైనావో రాతియుగం లాంటి కాలమానానికి అందనటువంటిది. ఇందులోని తాత్వికత ఏమిటంటే, ఏదీ  ఎప్పటికీ ఎదుతూనే వుం డదు. పెరుగుట, తరుగుట  ప్రకృతి నియమం. ఈ చిన్న విషయం తెలియని వాళ్లు చెప్పే చరిత్ర అనే దానిని అనంత చరిత్రగల భారతీయులం మనసా, వాచా, కర్మణా నమ్ముతున్నాం! ఇది పతనానినికి పరాకాష్ట కాదా!’.

         ‘ఈ అనంతమైన కాలక్రమంలో భూమిమీదనుండి అగ్ని అదృశ్యమైన కాలం ఉండవచ్చును. అగ్ని ఆకాశాన, భూమిమీద, జలాలో వున్నాడు. భూమిమీది అగ్ని అదృశ్యమైనప్పుడు జలాలోని అగ్నిని ఆవిష్కరించడానికి జరిగిన బృహత్ ప్రయత్నపు సంకేతమే వేదం. అది అలా సూక్త సంకేతంగా కనిపిస్తున్నది. అదృశ్యమైన అగ్నిని పునః ప్రతిష్టించడం సామాన్య విషయం కాదు. ఇది వేదకాలంలోనే జరిగి వుండాల్సిన అవసరం లేదు. అంతకు ముందు ఎన్నడో జరిగినదానిని వేదం ఉల్లేఖించి ఉండవచ్చును. రెండు వేల ఏండ్ల క్రితంనాటి బైబిలులో  సృష్టి ఆదిని గురించి చెప్పబడింది!

         ‘ప్రాణి దేనివలన జీవిస్తున్నది? ఏది పోవడంతోనే జీవితం చాలిస్తున్నది? ఆ ఉన్నదేది? ఈ పోయిందేది? ఇది ప్రశ్నే! దీనికి జవాబు లభించడం లేదు, దొరకడం లేదు! దొరకదు, లభించదు కూడా!! ఎందుకంటే ఇది సత్యం. ఇది ఋతం. దీనిని ఎవరూ చూడలేరు! ప్రాప్రాణం, ఆత్మ, ఉన్నంత కాలం జీవితం వుంటుంది. ఇవి లేనప్పుడు కళేబరమే మిగులుతుంది. ప్రాణం, ఆత్మ, నామ వాచకాలు మాత్రమే! వాటి స్వరూప స్వభావాలు తెలియవు! వేద సూక్తంలో మనసు ప్రాణమైంది. మనసే ప్రాణమని అప్పటి అవగాహన. మనసుకు, ప్రాణానికి రూపం లేదు. కాబట్టి పర్యాయమైన తప్పు కాదు. మనసే మనిషిని కదిలిస్తున్నది. మనసులేకుంటే ఏ అవయవం కూడా తన విధి నిర్వర్తించలేదు. మనసులేనప్పుడు కళ్లుచూసినా కంచలేడు. ఈ న్యాయం అవయవాలన్నిటికీ వర్తిస్తుంది. అందువల్లనే మనసున్న ప్రాణం అని అన్నారు పెద్దలు. ఈ మనసు మనిషిని వదిలి ఎక్కడికి వెళ్తుంది? అదే ప్రశ్న వేదం, సూక్తంలో ఉన్నది. అన్వేషణ ఎంతో అందంగా చెప్పడం జరిగింది. ఇదొక అంతంలేని అన్వేషణ!’.

‘అన్వేషణే జీవితం. చివరకు మనం ఆలోచించినవి, అనుకున్నవి లభించడం అరుదు. అలాంటప్పుడు సృష్టి మూలాన్ని గురించి చేసే ఆలోచనకు అంతమెక్కడిది? విశ్వాన్ని నిర్మించినవాడు, నిర్మించేవాడు విశ్వకర్మ. కర్మను బట్టే నామం. ఆ పదార్థమెలాంటిది? ఆ అన్వేషణలోనే పేర్లు. ఇవి మనం పెట్టినవే. అసలు ఆ పదార్థమెలాంటిది? ఇది ప్రశ్నే! వేదం, సూక్తములలో సృష్టిని గురించి తెలిసికొనే జిజ్ఞాస ఉన్నది. ఒక మహత్తరమైన ప్రశ్న ఉన్నది. లోకాలను సృష్టించిన వాడు దేనిమీద నిలిచినాడు? విద్వాంసులైనవారు ఈ విషయాన్ని అడగాల్సింది మనసునే. విశ్వాన్ని సృష్టించిన వాడు సృష్టికి పూర్వం ఎక్కడ నుండి సృష్టించాడన్నది మేధావులు ప్రశ్నించుకోవాలి! ఇది ఇంతవరకు ప్రశ్నగానే మిగిలి పోయింది! అసలు ఈ భూమి దేనిమీద నిలిచి ఉన్నది? ఇది కూడా ఈనాటివరకూ మనిషి మేధస్సుకందని, అంతుచిక్కని కోట్ల కోట్లాది రూకల ప్రశ్న. జవాబిచ్చే సామర్థ్యం ఎవరికైనా వున్నదా?’.

(డాక్టర్ దాశరథి రంగాచార్య వేద సంహితల ఆధారంగా)

 

 

Governor’s Speech Ignores Growth During KCR Regime : Vanam Jwala Narasimha Rao

 Governor’s Speech Ignores Growth During KCR Regime

(Inclusion of ‘A Little Growth’ of KCR Government

In Governor’s Address may well be ‘Value Addition’)

Vanam Jwala Narasimha Rao

The Hans India (24-12-2023)

(The Editor Hans India observed that: Had the contents been ‘Little More Graceful,’ acknowledging, ‘A Little Growth,’ in few areas of KCR Government, sitting now in opposition, it may well be a ‘Value Addition’ and ‘Statesmanlike Approach’ by the Government that prepared it as a prerogative. Grace was displayed by KCR on another occasion. Describing Modi Government’s ‘Ayushman’ as inferior to ‘Arogyasri,’ KCR in the Assembly credited ‘Arogyasri’ and ‘108 Ambulance Services’ to YS Rajashekhar Reddy and Congress Government. KCR also made it clear that, whatever good schemes were implemented by his previous Governments, his Government, without any false prestige, continue them. ‘Assignment of Lands’ policy of Congress Party initiated during Indira Gandhi’s time as part of 20-point Economic Program was welcomed by KCR. It is hoped that, in future, succeeding Governments could avoid contents that are absolutely false about preceding Governments and thus establish ‘New Healthy Convention’).    

Telangana Governor Dr Tamilisai Soundararajan’s Address to both Houses of Legislature on December 15, 2023, was a neatly prepared ‘Vision Document’ by the New Congress Party Government. Nonetheless, had the contents been ‘Little More Graceful,’ acknowledging, ‘A Little Growth,’ in few areas of KCR Government, sitting now in opposition, it may well be a ‘Value Addition’ and ‘Statesmanlike Approach’ by the Government that prepared it as a prerogative.

Customarily, Governor Addresses the First Session of Legislature each year, or a new Legislature after General Election, under Articles 175 and 176 of Constitution, without deviating from Cabinet approved speech. However, negligible deviations once in a while, cannot be construed as violation of Constitutional Law, though it may amount to ‘Little Aberration’ of a Convention. Governor’s Address as approved by Cabinet, shall contain a review of ‘Government’s Progress Card and Future Plans.’ Formally, the draft maybe forwarded to Governor, beforehand, seeking suggestions. The Law and convention is, Governor reads the final speech in toto.

Governor Dr Tamilisai Soundararajan in Her address, commended the Cabinet led by Chief Minister A Revanth Reddy and assured that the ‘Fruits of Change’ will reach the people in full measure. Governor described previous Government, as ‘Ten Years of Repression, Autocratic Rule, and Dictatorial Tendencies,’ whereas the new Government is ‘People’s Government, and People’s Governance.’ Governor thanked former Prime Minister, Dr Manmohan Singh, and UPA Chairperson Sonia Gandhi for creating Telangana State in 2014. Assurance of ‘Definite and Time-Bound Action Plan’ to implement guarantees promised in poll manifesto is highlight of Her Address.

In spite-12-2023) of the fact, that the document, ‘Telangana Economy,’ released by Government a day before, factually placing on record the ‘Exceptional Financial Growth’ in ten years (of KCR Government), the Governor’s Address mentioned that the, ‘Entire Financial Discipline’ in the state is destroyed, and there is ‘No Fiscal Discipline’ or ‘Financial Prudency.’

According to Telangana Economy, the Gross State Domestic Product (GSDP) which is a comprehensive scorecard of a ‘State’s Economic Health, Size of the Economy, and its Growth Rate,’ at current prices in 2022-23 is Rs 13,13,391 crore, with a growth of 16.3%. Per Capita Income (PCI) which is the metric for determining a ‘State’s Economic Output or Average Income for Each Person’ and ‘Measure of Standard of Living in a State,’ is Rs 3,12,398, and ranked 3rd in the country.

Reminiscing the past, on March 6, 2020, Governor Tamilisai Soundararajan in Her Maiden Address to the Joint Session of Telangana Legislature, showered praises on the then Chief Minister K Chandrashekhar Rao and even mentioned that, ‘The Greatest Advantage for Telangana State is that the person who led Separate Statehood Movement himself became the Chief Minister of the newly formed State and leading it from the front and getting marched towards the path of progress and development.’ Governor further mentioned that, ‘if we make a comparison of the situation that existed when the Telangana State was formed and now, the delightful achievements and success, in such a short span of time, is being observed with admiration by the entire country.’ Well, this is the normal way of Governor’s Address, irrespective of who is CM and whichever party is in power. Governor ‘Seldom has Any Other Option or say,’ except to read the Cabinet Approved Speech, irrespective of authenticity. This is Democracy and Politics!!!

Once speaking on Motion of Thanks to Governor’s Address, the then CM KCR categorically said that, the Governor had to read the prepared script of Government and cannot even change one word from the cabinet approved speech. Refuting criticism by (Congress) opposition parties that, the speech resembled like ‘TRS Manifesto,’ KCR said that, poll promises of the party in power necessarily reflect in Governor’s Address. The same way Chief Minister A Revanth Reddy responded, when a similar criticism was made by (BRS) opposition, that, Governor Tamilisai Soundararajan’s address resembled Congress Manifesto. Unhesitatingly CM brushed aside BRS criticism, and declared that ‘Yes, it is Our Manifesto.’

Politics are often Unpleasant in India. Taking one stand while in ‘Position’ and diametrically the other stand while in ‘Opposition’ is typical. Gracefully accepting suggestions from opposition is seldom done, with few exclusions. For instance, when Congress Leader K Jana Reddy pointed out that the Governor’s Address immediately after formation of Telangana, should have included ‘Thanks to Sonia Gandhi’ for her role in formation of Telangana, the then CM KCR positively responded. KCR Thanked Sonia Gandhi profusely, saying that, it was because of her initiative, the dream of Telangana people came true and placed it on record in the House.  KCR also thanked BJP, CPI, BSP and 33 parties, who supported the Telangana Bill, while replying on motion of thanks.

A Similar Grace was displayed by KCR on another occasion. Describing Modi Government’s ‘Ayushman’ as inferior to ‘Arogyasri,’ KCR in the Assembly credited ‘Arogyasri’ and ‘108 Ambulance Services’ to YS Rajashekhar Reddy and Congress Government. KCR also made it clear that, whatever good schemes were implemented by his previous Governments, his Government, without any false prestige, continue them. ‘Assignment of Lands’ policy of Congress Party initiated during Indira Gandhi’s time as part of 20-point Economic Program was welcomed by KCR.    

In the ‘British Model of Parliamentary Democracy,’ delivering the Speech in each ‘New Session of Parliament’ is an important prerogative of Monarch. Right from receiving the King at the Sovereign’s Entrance of the Palace of Westminster among others by Lord Chancellor, with the ‘Purse containing the King’s Speech,’ proceeding to the Robing Room where the King robes and puts on the ‘Crown and Regalia,’ and then ceremonially proceeding to the Chamber of the House of Lords, where the King is seated on the Throne, with the Lord Speaker and Lord Chancellor stand on His Right, and finally after few more ceremonial formalities, the King delivering His Speech from the Throne, ‘Prepared by the Government of the Day,’ it is all strictly ‘Conforming to both Law and Convention.’ The President of India’s Address too is the ‘Statement of Policy’ of the Government and drafted by it, containing a review of various activities and achievements.

In couple of instances, Governors did deviate from ‘Cabinet Approved Speech.’ Tamil Nadu Governor RN Ravi, on this year January 9, skipped some portions from prepared speech. In 2020, Kerala Governor Arif Mohammed Khan, before reading out one paragraph, with which he disagreed, read it to honor CM Pinarayi Vijayan. In 2018 Kerala Governor P Sathasivam, skipped few parts critical of Modi Government. Governor Tripura Tathagata Roy in 2017, skipped parts of speech drafted by Left Front Government. West Bengal Governor Dharma Vira In 1969, skipped the words, ‘Unconstitutional Dismissal of first UF Government by the Congress Ruled Center.’   

In a Democratic Polity, systems and practices are guided either by ‘Laws or Conventions or Both.’ The former is a rule and binding as its compliance is ensured by state machinery. The latter, though universally observed, is an unwritten understanding and more optional except fear of moral or social alienation but not legally enforceable. A blatant breach of convention is likely to be criticized by the press and bring the violator into disrepute. Conventions are obeyed in Britain, the ‘Mother of Democracies’ by letter and spirit. British Model is adopted in India to some extent.

Including opposition’s choice of contents, in the Governor’s Address, however much True they may be, other than the one, prepared by Government of its choice, with the approval of Cabinet, which is binding on Governor is absolutely right, for the time being. It is both Convention and Law. However, it is for consideration, whether in future, succeeding Governments could avoid contents that are absolutely false about preceding Governments and thus establish ‘New Healthy Convention!!!

Sunday, December 17, 2023

మానవుడి సృష్టి ఆదిగా ఎదుగుతున్న ఒక మహా దివ్యవరం ..... ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-3 : వనం జ్వాలా నరసింహారావు

 మానవుడి సృష్టి ఆదిగా ఎదుగుతున్న ఒక మహా దివ్యవరం

ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-3

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (18-12-2023)

         ‘ఆలోచనకు అవధులు లేవు. ఆకాశాన్ని, సముద్రాన్ని వర్ణించడానికి ఉపమానాలు లేవు. అందువల్ల ఆకాశం ఆకాశంలాగా, సముద్రం సముద్రంలాగా వున్నాయని అన్నారు. అలాగే ఆలోచననకు ఆద్యంతాలు, ఎల్లలు, పరిథులు, అస్తి-నాస్తి లేవు. ఆలోచన ఉన్నదానిని గురించి మాత్రమే కాకుండా లేనిదానిని గురించి కూడా రావచ్చు. భూతం, అభూతం ఆలోచన సంతానాలే! ఆలోచనే మానవుడిని నాగరికుడిని, సభ్యతకలవాడిని, విజ్ఞానవంతుడిని, ఉన్నతుడిని చేసింది.  “అహం బ్రహ్మాస్మి” అంటే, నేనే బ్రహ్మను అనుకునేట్లు చేసింది. ఆలోచనే మానవుడిని దానవుడిని, క్రూరుడిని, నరహంతకుడిని, మానవనాశకుడిని చేసింది. కాబట్టి సదాలోచన మాత్రమే మానవుడిని దైవాంశకు చేర్చగలదు’.

         ‘నిర్వచనం లేనిదే సదాలోచన? చాలావాటికి నిర్వచనాలు లేవు. ఎందుకంటే, జీవితం ప్రవాహం లాంటిది కాని స్థిరమైంది కాదు కాబట్టే. నిలకడలేనిదానికి నిర్వచనం అసాధ్యం. “ఏకం సద్విప్రాబహుధావదన్తి” అనేది వేదవాక్కు. ఒకే సత్యాన్ని మేధావులు బహువిధాలుగా చెప్పుతారు అని దీనర్థం. అసత్యం ఏది? మానవజాతి పుట్టినప్పతి నుండీ సత్యాన్వేషణే జరుగుతున్నది. సత్యం ఏదో తెలిసినప్పుడే కదా బహుధా చెప్పేనది? నిర్దిష్టత ప్రకృతికి లేదు. కాబట్టి ప్రాకృతములైన ఏ పదార్థానికీ లేదు. భగవానుడికి తన సృష్టిలో పరిపూర్ణత దేనికిని లేవు. సర్వం సాపేక్షమే!’.

         ‘లోచనానికి అందనిది ఆలోచన. మానవుడి సర్వావయాలను శాసించేది మనసు. మనసు ఆదేశించనిది ఏ అవయవం పనిచేయదు. కన్ను చూసినట్లున్నా, మనసు లేకపోతే చూడలేం. మనిషి అక్కడే వుంటాడు. మనసులేకున్న గ్రహించలేడు. అలాగని ప్రాణం లేదనలేం. చలనం ఉన్నది. ప్రాణం జీవించడానికి మాత్రమే పనికివస్తుంది. జీవితానికి మనసు అవశ్యం. యాత్ర ప్రాణులకు లేనిది, మనిషికి ఉన్నది, విశిష్టమైనది మనసు మాత్రమే! మనువు సంతతి అయినందువల్ల కాకుండా, మనసు ఉన్నందు వల్ల మానవుడు అయినాడు. అయినా మనసు చెప్పినదంతా సత్యం కాదు. మానవుడు ఇంకా సత్యాన్ని తెలుసుకోవాల్సి ఉన్నది’.  

         ‘ప్రకృతికి జలం, జలానికి వర్షం ఆధారం. ఇది వేదం వెల్లడించిన పరమ సత్యం. పరమ సత్యమే శాశ్వత సత్యం అవుతుంది. “ఏకం సద్విప్రా బహుధా వదంతి” అన్నట్లు వర్షం రావడానికి, వచ్చేట్లు చేయడానికి కారణాల విషయంలో అనేక వాదనలు, మతాలు వున్నాయి. అందువల్ల వర్షాన్ని గురించి వేదంలోని వాదనలను, మతాలను, రీతులను ఆధునిక విజ్ఞానవేత్తలు నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే, ఆధునికమనబడే రాక్షస ఉత్పత్తి విధానం భూగోళాన్ని జలరహితం చేయడానికి ఉరుకులు పెట్తున్నది! మానవ ప్రగతిలో ఆహారపు అలవాట్లు ప్రదాన భూమిక నిర్వహిస్తాయి. మాంసాహారం పాశవికమని, శాకాహారం సాత్వికమని, మానవీయమని శాస్త్రాలు నిశ్చయించినప్పటికీ, వేదకాలంలో మాసం నిషేధం కాదు. మాంస భక్షణ ఒకనాటి ఆచారమనే సత్యాన్ని కాదనలేం’.

         ‘అగస్త్యుడు రతిని దేవతను చేసి మానవ జీవితానికి రతి ఆవశ్యకతను గురించి చెప్పినాడు. రతికి చాటు అవసరమైనా రతి రహస్యంకాదు. రతి భార్యా భర్తల మధ్యనే జరగాలనేది ఒక విధి. ఆరోగ్యవంతమైన సమాజానికి రతి విషయంలో కట్టుబాట్లు తప్పనిసరి. ఎవరైనా జీవించినంతకాలం మంచిగా జీవించాలి. మానవుడి సృష్టి ఆదిగా ఎదుగుతున్న ఒక మహా దివ్యవరం, ఆలోచన. బాహ్యాలోచనకు అందనిది ఆలోచన. ఆలోచన భగవత్ సృష్టివలె ఆద్యంతరహితం, అనంతం, సర్వవ్యాపకం. ఆలోచనకు అందనిది సత్యం, భగవత్ స్వరూపం. దీనిని తెలుసుకోవడానికే మానవుడు నిరంతరం అన్వేషిస్తున్నాడు. సత్యస్వరూపం, భగవత్ స్వరూపం తెలిసినప్పుడే పండితులు దానిని అనేక రీతులు చెప్పగలరు. ఈ అన్వేషణలో మానవుడికి అర్థమైంది చాలా తక్కువ. సత్యస్వరూపం తెలుసుకోవడం, తెలియపరచడం, వేదం పరమావధి. ఈ ప్రయత్నంలోనే ఇంద్రాగ్నులు, మరుత్తులు, అశ్వినులు, ఆదిత్యులు, సకల దేవతలు దర్శనం ఇస్తున్నారు’.

         ‘స్త్రీకి ఏకాలంలోనూ పురుషుడితో అన్ని విషయాలలో సమాన ప్రతిపత్తి కలిగించలేదు. కొందరు మహిళలు తమ ప్రతిభాపాటవములతో పురుషులను మించిన ఉదాహరణలు వున్నాయి. అవి వ్యక్తిగతమైనవి. సమాజంలో స్త్రీకి గౌరవం, ఆదరణ ఉన్న కాలాలు, లేని కాలాలు వున్నాయి. కాలం పాదరసం లాంటిది. ఒకచోట నిలువదు. అది పరిణామ శీలం. అలాగే స్త్రీల విషయంలో హెచ్చుతగ్గులు కావడం సాధారణం. వేద కాలం మొత్తంలో స్త్రీకి ఏ స్థాయి ఉన్నది నిర్దిష్టంగా చెప్పడం సాధ్యపడదు. కాని స్త్రీకి పురుషుడి నుండి ఆదరాభిమానాలు లభించినవని మాత్రం చెప్పవచ్చును. స్త్రీకి నీచ దశ లేకుండెను’.

         ‘ధనం, కీర్తికన్న అన్నానికి, ఆహారానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు మానవుడు. ఆహారం లేని ప్రాణం నిలువదు. ప్రాణమున్నకదా ధనం, యశం! అందుకే “అన్నం బ్రహ్మేతి వ్యజనాత్” అని వేదం ఘోశించింది. అన్నమే బ్రహ్మమని తెలిసికొమ్మని వేదం చెప్పింది. అన్నం, ఆహార పదార్థాలు, ధనాన్ని సృష్టిస్తాయి. కేవలం ధనమే దేనిని సృష్టించలేదు. కనీసం తనను సృష్టించుకేలేదు. డబ్బు మాత్రం ధనం ఎన్నటికి కాజాలదు. అన్నపానాదులు, యశస్సు ధన ఉత్పత్తికి కారణాలవుతాయి. కావున ప్రాణికి అన్నమే ప్రదానమవుతుంది’.

         ‘అవ్యయములైన ధనాలను పర్వతాలు పోషించాలని అని వేదం చెప్తున్నది. సమస్త జలాలు ఆ ధనాన్ని పోషించాలి. దాన పరాయణులైన దేవపత్నులు దానిని పోషించాలి. ఓషధులు ద్యులోకం సహితం పాలన పోషణ చేయాలి. వనస్పతులు సహితమై అంతరిక్షాన్ని సహితం పాలించాలి. అవ్యయ ధనాలు ప్రకృతి సంపదలు. వాటికి స్వయంగా పునరుత్పత్తి ఉన్నందున అవ్యయములైనాయి. ఆధునిక రాక్షస నాగరికతలో పునరుత్పత్తిగల ప్రకృతి సంపదల ఉత్పత్తిని నాశనము చేయు ప్రయత్నం నిరంతరం జరుగుతున్నది. భరించ కలిగినంత ధనంమాత్రమే వుండాలి. అది ప్రకృతి శక్తుల అనుమతి గలది కావాలి. ఈ యంత్ర నాగరికతకు పట్టిన రోగం ప్రకృతి అనుమతిలేని భరించలేని ధనం! ఆశ్చర్యమేమిటి అంటే ఆనాటి ఋషులు నేటి మానవుడిని ఇలా హెచ్చరించినారు’.

         ‘శాంతి అనేది మానవాళికి ఈ నాటికి అందలేదు. ముందు అందగలదని నమ్మకం లేదు. ఎందుకంటే మనిషి, మనసు, ప్రకృతి అలజడిగలవి. వాటికి నిలకడలేదు. అందుకే శాంతికి నిలకడలేదు. శాంతి అందదు. అందుకని అందమైనది కాదు. అందని ప్రతిది అందం కాదు. శాంతికొరకని సాగిన యుద్దాలెన్ని? శాంతి కొరకని చెలరేగిన అశాంతి ఎంత? ఒకనికి అశాంతి, మరొకరికి శాంతి. మానవ జీవితం మరీచిక. దానికి అన్నీ కనిపిస్తాయి. వాటివెంట పరుగే జీవితం. మనిషికి నిశ్చయంగా అందేది మృత్యువు మాత్రమే. జీవితం అనిశ్చితం. మృత్యువు నిశ్చితం. మానవుడి జీవితం వాస్తవం, సత్యం, ఋతం మీద ఆధారపడినది కాదు. అది ఆదర్శం, లక్ష్యం, గమ్యం మీద ఆధారపడినది. మానవుడు ఏనాటికయినా ఆదర్శాన్ని అందుకొనగలడా? అదొక ప్రశ్న. మానవ జీవితం ప్రశ్నల తోరణం. అన్నింటికి సమాధానం ఉండదు’.

         ‘పాపం మానవ దోషం కాదని వేదం చెప్తున్నది. అది అతని అధీనంలో లేదు. ఉదాహరణగా స్వప్నం తీసుకోవాలి. స్వప్నం మానవుడి అధీనంలో లేదు కదా! అది పాపమెందుకు కావాలి? సుర, భ్రమ, క్రోధం, జాదం, అజ్ఞానం, పాపానికి కారణాలు. ఇది నిత్య సత్యం. నిశ్చితం. ఈ దుర్గుణం, దైవకృతాలా? మనిషికి స్వాధీనంలో లేనిదానిని దైవ కృతం అంటాం. కామక్రోధాది అరిషడ్వర్గాలను మానవుడు తన ఆధీనంలో ఉంచుకోవాలని అంటారు. అది ఆదర్శం. అసాధ్యంకాడు. కాని దుస్సాధ్యం. అందరికీ సాధ్యమయ్యేదికాదు. కాబట్టి తాము చేసిన పనికి దైవాన్ని బాధ్యుడిని చేయడం సమంజసమా? కాకపోవచ్చును. కాని ఒక్కొక్కసారి తన పరిధిని దాటిపోయినపుడు దైవ కృతాలు కావచ్చును’.

         ‘ఈ నేలమీద మానవుడు పుట్టి లక్షల సంవత్సరాలు దాటాయి. అయినా మనిషి స్వభావం, మనిషి గుణం, ఏ మాత్రం మారినట్లు కనిపించదు. మానవునిలో కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు, సుఖ దుఃఖాలు, రాగ ద్వేషాలు మొదలైన లక్షనాలు మనిషిని అన్నికాలాలలో పట్టుకుని వున్నాయి. రాగాద్వేషాదులు మృత్యువుకన్న బలవత్తమైనవి. అవి మహాత్ములను తప్ప మానవులను విడవవు. అవి ప్రాణముతో వచ్చును కాని, ప్రాణంతో పోవు. మనకు పూర్వ, పర జన్మలమీద విశ్వాసం ఉన్నది. విశ్వాసం మాత్రమేకాదు. అది సత్యం. వాస్తవం. తధ్యం. ఎందుకనగా ప్రకృతిలో పదార్ధాలన్నిటికి పరిణామం, మార్పు మాత్రమున్నది. నాశనం లేదు. ప్రకృతి వలయం లాంటిది. పదార్ధాలన్నీ ఒక బిందువు వద్ద ఆరోహణ క్రమంలో పెరుగును. మరొక బిందువు వద్ద అవరోహణ క్రమంలో దిగును. దీనికి అంతం మనకు తెలియదు. నిరంతర పరిణామమే ప్రకృతి ధర్మం’.

‘జీవితం అన్వేషణ మాత్రమే! వ్యక్తి జీవితం, వ్యష్టి జీవితం, సమిష్టి జీ జీవితం, సమాజ జీవితం, రాష్ట్ర జీవితం, లోక జీవితం సమస్తం అన్వేషణమే! అన్వేషణమే జీవితం. అందు లభించేది కొంత, అందనిది మరింత, మరింత, మరింత. ఎంతో తెలియదు. అందువల్ల మరింత. పార్థివ ప్రయాణానికి ఒక గమ్యం, ఒక లక్ష్యం ఉండవచ్చును. పార్థివ ప్రయాణమంటే నేల మీది నడక కావచ్చును. గమ్యం పార్థివమైనప్పుడు చేరుకొనె అవకాశమున్నది. తప్పక చేరగలమని మాత్రం చెప్పలేము. జీవితం పార్థివం, పదార్ధం, అర్థం. ఆర్థికం మాత్రం కాదు. ఆర్ధిక లక్ష్యాలను సహితం సాధించిన నిదర్శనాలు మానవజాతి చరిత్రలో అరుదాతి అరుదు. లేవని చెప్పినా అతిశయోక్తి మాత్రం కాదు. మానవుడు, సకల ప్రాణిజాలం పంచభూతాత్మకమైన ప్రకృతి, వట్టి ప్రాణంతోనూ, పిడికెడు అన్నంతో మాత్రం జీవించడం లేదనడానికి ఉదాహరణలు, ఉపమానాలు చెప్పపనిలేదు’.

         ‘మనసుకు అవయవ నిర్మాణంలో చోటులేదు. అది కనిపించనిది. కనిపించక పోవడం వాస్తవం కావచ్చును. కాని మనసే జీవితాన్ని నడిపిస్తున్నది అనడం అనుభవైక సత్యం! మనసు నడపకపోతే వాల్మీకి ముందు నిషాదుడి బాణపు దెబ్బకు కూలిన మగ క్రౌంచాన్ని చూసి ఆడక్రౌంచం ఏడ్వవలసిన పనిలేదు. దీరోదాత్తుడగు రాముడు సీతనుబాసి చెట్టుకు, పుట్టకు చెప్పుకొని ఏడ్వవలసిన  పనిలేదు. ఏడ్చినంత మాత్రాన సీత రాదనే విషయం ధర్మానికి విగ్రహరూపుడైన రాముడికి తెలియదని అనుకోవడం తప్పు. ఏడ్చినది రాముడు కాడు! ఏడ్పించినది మనసు!! మనసు రాముడి కన్న మిన్నా? కావచ్చును! కాకున్నా అదెట్లు ఏడిపిస్తుంది?’

         ‘పార్థివమునకన్నా, అర్థానికన్నా, వినిపించి, కనిపించే ప్రకృతి కన్నా, కనిపించని మనసే మనను నడిపిస్తున్నదనడం కొంతవరకు మాత్రమే వాస్తవం. సత్యం మాత్రం కాదు. అట్లయితే ఈ మనిషిని, సమస్త సృష్టిని నడిపిస్తున్నది ఏది? ఎవడు? తెలియని నిరంత అన్వేషణము మాత్రమే! ఈ అన్వేషణలోని భాగం, లేక, ఈ అన్వేషణకు ఆది, లేక ఈ అన్వేషణకు మార్గదర్శి మహత్తరమైన వేదమే. ఈ జీవితం సాగడానికి కేవలం మానవ ప్రయత్నం మాత్రమే చాలదనే మూల సత్యాన్ని వేదం ఎలుగెత్తి చాటింది. అయితే మానవ ప్రయత్నానికి అతీతమైన శక్తి ఏది మనిషిని నడిపిస్తున్నది? ఇది ఒక మహాప్రశ్న! దీనికి సత్యమైన సమాధానం మానవుడికి లభించడం అసాధ్యం, అసంభవం. అలాగని అన్వేషణ ఆగదు. అది ఎందుకు? ఎందుకంటే జీవితమే అన్వేషణ! అన్వేషణ ఆగితే జీవితం నిలుస్తుంది, జీవితం నిలువదు. అన్వేషణ ఆగదు. అన్వేషణకు అంతం లేదు!!’.

‘వేదం సకల ప్రాణులను సమానంగా పరిగణించింది. మానవులు, పశువులు, పక్షులు, వృక్షాలు, పర్వతాలు సమానమని దర్శించినది. వీటిలోలో కొన్నిటిని దేవతలలో చేర్చినది. దేవతలలో చేర్చుడం అంటే, అవి మానవజాతి జీవనానికి అత్యవసరమని గుర్తించడమే. అంతేకాదు, వాటికి హాని కలిగించరాదని పూజించాలని నిర్ణయించడమే. మానవుడు పంచభూతాలను, తన పిశాచ దాహానికి, విషపూరితం చేస్తున్న అత్యంత ఆధునికమని భావిస్తున్న ఈ రాక్షస యుగానికి, వేదం ఇచ్చిన సందేశం అమృతప్రాయం. కాని ఆశ రక్కసి. అది అమృతాన్ని హరిస్తుంది. మనిషిని యంత్రంగా మార్చినది, మనిషికి విషమిచ్చి ఆత్మహత్యకు పురికొల్పేది పురోగతి అనిపించుకోదు!! కృతజ్ఞత, దయ, కరుణ, ప్రేమ, అభిమానం, ఆత్మీయత, అనురాగం, అనుబంధం మానవత లక్షణాలు. ఇవి మచ్చుకైనా కనిపించని యంత్ర నాగరికతను పురోగతి అనడం రాక్షస లక్షణం!’. (డాక్టర్ దాశరథి రంగాచార్య వేద సంహితల ఆధారంగా)

 

Saturday, December 16, 2023

For a Good Life Beyond ‘Welfare, Development’ ...... Citizens Plead ‘Treat us with Courtesy, Give us Choice and Voice’ : Vanam Jwala Narasimha Rao

 For a Good Life Beyond ‘Welfare, Development’

Citizens Plead ‘Treat us with Courtesy, Give us Choice and Voice’

Vanam Jwala Narasimha Rao

The Hans India (17-12-2023)

{The overall negative perception about public services as apathetic, insensitive, dilatory, dishonest, and biased needs to be addressed. Public expect that the citizen is placed at the center of administration instead of being treated as a passive recipient of services. The ‘Praja Vani’ (Citizen’s Voice) Experiment initiated by Telangana Chief Minister A Revanth Reddy, will be a ‘Trendsetter and Trailblazer’ for other states, if continued seriously. It is a platform with a mix of ‘Public Grievances Redressal’ and ‘Public Facilitation Center.’ Instead of organizing ‘Praja Vaani,’ only for two days in a week, in the long run, it could be on all days, and on each day, two or three concerned Ministers listen to public grievances, with a day exclusively by CM himself - Synoptic Note by Editor The Hans India}.

It is generally construed that, Government or Governance means, ‘Welfare and Development’ and nothing else. If it is true, then, despite best of welfare and development, why are governments voted out?

Therefore, there is something else, that, citizens of their choice need. The good old concept of Government that, it means ‘Ruling and Controlling the State and Citizen’ is obsolete now. Difference between ‘Government and Governance,’ is that former refers to ‘Institutional Structure’ and latter to ‘Collective Action and Networking of Citizens.’ Government or Governance is not like parents’ intruding. ‘Father's Excessive Concern for and Interference in his Son’s Life,’ as in a Telugu Movie ‘Bommarillu,’ leads to son’s ‘Bitterness to his Overbearing Father.’ 

As a student of Public Administration and Political Science, I accept as true, with Henry David Thoreau, an American Philosopher of yester years, that, ‘The Best Government is that which Governs Least,’ which phrase is also credited to Thomas Jefferson or John Locke. Being in Active Public and Private Service for over 53 years, beginning career as Librarian, I reached to a level as Chief Public Relations Officer to First Chief Minister of Telangana. 53 years’ service included 15 years stint put together with Governor Kumud Ben Joshi and two extraordinarily intellectual, incredible, and influential Chief Ministers Dr M Channa Reddy and K Chandrashekhar Rao. Working with them, and with high profile IAS Officers, I had an opportunity to closely witness the decision-making process in administration, though seldom formed part of it.

Organizing Training Programs in Dr MCR HRD Institute, for 9 years, including that of ‘Under Training IAS Officers’ and to entire AP State Cabinet once, was an experience of ‘Joint Learning’ on Governance. Similarly, while organizing ‘Governing for Results,’ and ‘Orientation to Management of Training (OMOT)’ Programs, along with my senior colleagues, R Seeta Rama Rao, and MP Sethy, on directions of the then Chief Minister Chandrababu Naidu, in which participants were HoDs and senior IAS Officers, gave me improved insight on ‘Government, Governance, Welfare and Development.’ Citizens’ Charter, Public Grievances Redressal, Public Facilitation Centers, Right to Information, Reform Initiatives etc. Programs provided extra information on this subject.

Leading ‘Public Private Partnership’ theme in Emergency Management and Research Institute provided me an opportunity to interact with Bureaucrats and Ministers, who included Chief Ministers, of some states, during my visits for expansion of 108 Ambulance Services to more than ten states. Among them were undivided AP and Gujarat CMs, Dr YS Rajshekhar Reddy, and Narendra Modi respectively, enabling further exposure to Governance.

Of late, it has become a fashion for successive governments, to announce scheme after scheme, whether beneficiary accepts or not, as an ‘Excessive Concern.’ Despite ‘Per Capita Income and GSDP’ growth, which perceptibly means poverty is on the decline, Direct Benefit Transfer (DBT) Schemes are being announced. Likewise, ‘Development’ is certainly acceptable, but, ‘Erratic Development,’ without going in to the other side of undesirable aspects, is arguable. For instance, construction of many Irrigation Projects maybe required, but by that it may not be desirable to do away with production of multiple crops as in the past, and limit to huge paddy production?

From ‘Kingdoms and Empires,’ ‘Monarchies and Dictatorships,’ and ‘Feudalism and Capitalism,’ Governments altered to ‘Sovereign, Socialistic, Secular, Democracies,’ as in the case of India. Abraham Lincoln’s Ideology of ‘Democracy is a Government of the People, by the People and for the People' though welcomed, remained on paper by and large. ‘Governance’ transformed to ‘Good Governance,’ and ‘Governance with Difference.’ Development and Welfare Schemes are prioritized. But, people, in the ever-changing economic status scenario, social and political awareness, broadening of occupations, and being conscious of empowerment, expect to listen to them, before decisions are taken. Instead of ‘Unilateral and Arbitrary’ decisions Citizen’s preference is ‘Nothing More and Nothing Less, but to be Precise.’       

 In the changing and emerging context, it is time for Governments, to fundamentally change their perceptions of Governance and ‘Justify the Trust of Faith of the People’ in Administration, by taking Citizens in to confidence, in the decision-making process, which for all practical purposes is absent now. Designing, Developing, and Delivering Schemes, however much liberal, generous, and beneficial maybe, will be a total futile exercise, or maximum may cause temporary success. Governments must annul, forever, the ‘Growing Doubts about the Accountability, Effectiveness, and Moral Standards’ of their Administration in Citizens.

In politics of ‘Cut Throat Competition’ and urge to come to power, retain power and continue in power, it is a challenging task to accomplish the above, and demands unstinted commitment of not only Politicians, but also their Civil Servants. Therefore, this requires a ‘Paradigm Shift’ transforming ‘Regulator Governance’ to ‘Facilitator Governance.’ Rather, a Government from ‘Regulator and Controller’ to ‘Enabler of Citizen Needs.’ This is possible, if only, ‘Interface with Citizens with Determination’ is enhanced, propelling the service providers, ‘Responsive and Accountable to People.’ The lead shall come from CMs in states and PM at center.

This paradigm shift in Governance shall be, from ‘Fat, Complacent Administration’ to ‘Slender, Alert Administration’; from ‘Bureaucracy’ to ‘Honesty’; from ‘Extremely Tight Culture’ to ‘Ability to Change, and Familiarize’; from ‘Public Hostility’ to ‘Public Empathy’; from ‘We know Best and Everything Arrogance’ to ‘Concept of Joint Learning’; from ‘Mistrust and Fear of Government’ to ‘Trust and Faith in Leader and Governance’; from ‘Administration Controlled by Hierarchies’ to ‘Decision Making based on Team Work’; from ‘Concentration in Power’ to ‘Co-ordination in Work Culture’; from ‘Citizen Unfriendly’ to ‘Citizen Friendly’; from Pure ‘Local Standards’ to a mix of ‘Local and World Standards’; and finally from ‘Conservative and Inflexible’ to ‘Creative and Innovative.’

Shared concern of citizen is to have an efficient, open, responsive, accountable, clean, and dynamically adjusting administration. The overall negative perception about public services as apathetic, insensitive, dilatory, dishonest, and biased needs to be addressed. ‘Citizens' Charters’ once successfully tried all over country including AP, 25 years ago, and now either abandoned or in namesake operation should be revived beginning with those departments which have a large public interface, specifying standards of service and time limits that the public can reasonably expect so that the citizen is placed at the center of administration instead of a passive recipient of services.

Therefore, for a ‘Good Life,’ ‘Beyond Welfare and Development,’ what Citizens are saying is ‘Treat us with Courtesy and Respect, Make Things Easy for us, Provide Reliable and Timely Help, Give us Choice and Voice.’ Good Life implies, ‘Self-Satisfaction, Self-Mastery and Personal Fulfilment.’ Perhaps, the ‘Praja Vani’ (Citizen’s Voice) Experiment initiated by Telangana Chief Minister A Revanth Reddy, will be a ‘Trendsetter and Trailblazer’ for other states, if continued seriously. It is a platform with a mix of ‘Public Grievances Redressal’ and ‘Public Facilitation Center.’

Governor Dr Tamilisai Soundararajan, in Her address to both Houses of Legislature on December 15, describing Her Government and Governance as the one, taking steps to give Freedom, Liberty and Equal Opportunities to people within the reach of Citizen, said that, the 'Praja Vaani' is first step in this direction.  However, instead of organizing ‘Praja Vaani,’ only for two days in a week, in the long run, it could be on all days, and on each day, two or three concerned Ministers listen to public grievances, with a day exclusively by CM himself.  

Further, CM Revanth Reddy’s recent visit to Dr MCR HRD Institute, and giving importance to ‘Training Public Servants’ will go a long way, in realizing by ‘Letter and Spirit,’ in providing ‘Learning Opportunities Systematically’ to Public Servants, both Official and Non-Official, which is essential to improve the mandatory ‘Knowledge, Skill and Attitudinal Change,’ on the implications of above-mentioned Paradigm Shift.

(Writer is Former CPRO to Former Chief Minister, Telangana).

Thursday, December 14, 2023

విజయానికి తిరుగులేదు, ఓటమి శాశ్వతం కాదు! ..... వనం జ్వాలా నరసింహారావు

 విజయానికి తిరుగులేదు, ఓటమి శాశ్వతం కాదు!

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (15-12-2023)

          ‘నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్’ అంటాడు ‘ద కౌంట్ ఆఫ్ మాంటే క్రిస్టే’, ‘ద త్రీ మస్కేటీర్స్’ గ్రంథ రచయిత అలెగ్జాండర్ డ్యూమాస్. విజయాన్ని మించిన విజయం లేదు, విజయం మరింత విజయాన్ని అందిస్తుంది అని దీని అర్థం. కాకపోతే, ఎల్లప్పుడూ సంఘటితమైన కృషి అవశ్యం. అలాగే, ‘ఫెయిల్యూర్స్ ఆర్ ది పిల్లర్స్ టు సక్సెస్’ అని మరో ఆసక్తికరమైన సామెత ఉంది. అపజయాలే విజయానికి మూలస్తంభాలని, ‘వైఫల్యం జీవితానికి గొప్ప గురువు’ అనీ అర్థం. అంటే ఓడిపోయిన వ్యక్తి తన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, విజయం దిశగా మార్గం సుగమం చేసుకోవడానికి ఆ ఓటమిని ఒక అవకాశంగా వాడుకోవచ్చు. విజయపథంలో సాగుతున్న వ్యక్తికి ఓటమి అనేది నిజానికి ‘తాత్కాలికంగా అచేతనావస్థలో ఉన్న విజయం’ మాత్రమే అనుకోవచ్చు.

విజయం మున్ముందు తప్పక చేయాల్సిందేమిటో స్పష్టంగా తెలియపరుస్తుంది. అపజయానికి దారితీసిన కారణాలను, దానికి ముందు తీసుకున్న నిర్ణయాలను, నిష్పాక్షికమైన మనస్సుతో, అంతరాత్మ సాక్షిగా, విమర్శనాత్మకంగా విశ్లేషించి పాఠాలు నేర్చుకుంటే, విజయావకాశాలు మెరుగుపడే వీలుంది. అలాగే, ‘వైఫల్యం పురోగతిలో విజయం’ అనీ, అయితే ఆ సాధన దిశగా లక్ష్యాన్ని వదలకుండా నిరంతరం పోరాడుతూనే వుండాలనీ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ మరో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. అలెగ్జాండర్ డ్యూమాస్ అయినా, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అయినా, డేల్ కార్నెగీ అయినా, మరెవరైనా చెప్పేదాని సారాంశం ఒక్కటే. జయాపజయాలు రెంటిలోనూ విజయం ఉన్నదన్న వాస్తవాన్ని.

         ఇటీవల వెల్లడైన రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలలో ఎనుముల రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ భారీ విజయం, కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్‌ఎస్ అపజయం, ఈ రెండింటికీ కూడా ‘నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్’, ‘ఫెయిల్యూర్స్ ఆర్ ది పిల్లర్స్ టు సక్సెస్’  పై రెండు సామెతలనూ వర్తింప చేయవచ్చు. లక్ష్యాన్ని, ధ్యేయాన్ని వదలకుండా నిరంతరం పోరాడుతూ, కృతనిశ్చయంతో కోరుకున్న విజయాన్ని సాధించారు రేవంత్ రెడ్డి. ఇక కేసీఆర్ విషయానికొస్తే ఎన్నికల్లో సంభవించిన ఈ ఓటమి, ‘తాత్కాలికంగా అచేతనావస్థలో ఉన్న విజయం’ మాత్రమే. ఒక స్థిరమైన వ్యూహాత్మక ఆలోచన ద్వారా, గతంలోలాగా శ్రమిస్తూ, సరైన సమయం కొరకు ఎదురు చూస్తూ, పునరాగమనానికి మార్గం సుగమం చేసుకోమనే సూచనే. సమతుల్యమైన జయాపజయాలు నాయకులిద్దరికీ ఒక అనుభవమనేది వాస్తవం.

         విజయం దిశగా రాజకీయ ప్రస్థానాన్ని జడ్పీటీసీ సభ్యుడిగా, ఆ వెంటనే స్వతంత్ర అభ్యర్థిత్వంతో ఎమ్మెల్సీగా ప్రారంభించిన రేవంత్ రెడ్డి కోడంగల్ నియోజకవర్గం శాసనసభ స్థానానికి 2009, 2014 ఎన్నికలలో వరుస విజయాలు సాధించారు. అదే కొడంగల్ నియోజకవర్గం నుంచి తన మొదటి ఓటమిని 2018 శాసనసభ ఎన్నికల్లో రుచి చూశారు. ‘ఫెయిల్యూర్స్ ఆర్ ది పిల్లర్స్ టు సక్సెస్’ అన్నట్టుగా ఆ తరువాత ఆరు నెలలకే జరిగిన లోక్‍సభ ఎన్నికలలో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి గెలిచి, విజయం వైపు గొప్ప పునరాగమనం చేశారు.

         క్రమేపీ రేవంత్ రెడ్డి ‘విజయం మరింత విజయాన్ని అందిస్తుంది’ అన్న నానుడిని నిజం చేస్తూ రెండున్నరేళ్ళ క్రితం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడుగా నియమితులైనప్పటి నుంచి ఒక స్థిరమైన, ఆచరణాత్మకమైన రాజకీయ వ్యూహంతో ముందుకు సాగుతూ కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించారు. ఏ కొడంగల్ శాసనసభ స్థానంలో 2018లో ఓటమిపాలయ్యారో అక్కడి నుంచే అఖండ విజయం సాధించారు. ఎన్టీఆర్ టీడీపీని 1989 ఎన్నికలలో ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, చంద్రబాబు నాయుడు టీడీపీని 2004 ఎన్నికలలో ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిలకు దీటుగా, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని 2023 ఎన్నికలలో ఓడించి తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు రేవంత్ రెడ్డి.        

తెలంగాణ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా, రెండు పర్యాయాలు ఎన్నికై అత్యంత విజయవంతమైన ముఖ్యమంత్రిగా పాలన అందించిన కేసీఆర్ రాజకీయ ప్రస్థానం 1983 శాసనసభ ఎన్నికలలో సిద్దిపేట నియోజకవర్గం నుంచి పరాజయంతో మొదలైంది. అయితే ఆ తరువాత కేసీఆర్ విజయ పరంపర నిరాటంకంగా ఇటీవలి 2023 ఎన్నికల వరకూ కొనసాగింది. ఏ ఎన్నికల్లోనూ, ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. తన మొదటి ఓటమి నుంచే తర్వాతి విజయాలకు మార్గం నిర్దేశించుకున్నారు. మొదటి ఎన్నికల విజయాన్ని 1985 శాసనసభ మధ్యంతర ఎన్నికలలో సిద్దిపేట నియోజకవర్గం నుంచే నమోదు చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఆయన ప్రస్థానం ‘నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్’ అన్న రీతినే సాగింది.

         ఆ తరువాత కేసీఆర్ వరుసగా నాలుగు పర్యాయాలు 1985 నుంచి 1999 వరకు జరిగిన ఎన్నికలలో సిద్ధిపేట ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాలలో పనిచేశారు. కొంతకాలం ఉపసభాపతిగానూ పని చేశారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం తరువాత కేసీఆర్ విజయగాథ కొనసాగి స్థిరపడ్డది. 2004 ఎన్నికలలో ఐదవసారి సిద్దిపేట ఎమ్మెల్యేగా, మొదటిసారి కరీంనగర్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఎంపీ స్థానాన్ని ఉంచుకుని, కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. కాంగ్రెస్ పార్టీ విసిరిన సవాలుకు దీటుగా రాజీనామా చేసి 2006 ఉపఎన్నికలో గెలిచారు. 2009 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ స్థానం నుండి లోక్‍సభకు ఎన్నికయ్యారు.

         తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన అనంతరం 2014 ఎన్నికలలో గజ్వేల్ శాసనసభ స్థానానికి, మెదక్ పార్లమెంట్ స్థానానికి పోటీచేసి రెండు చోట్లా విజయం సాధించారు. ఆయన నేతృత్వంలోని టీఆర్ఎస్ తెలంగాణలోని 119 స్థానాలకు గాను 63 (మెజారిటీ), 17 లోక్‍సభ స్థానాలకు గాను 11 గెలిచింది. జూన్ 2, 2014న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, నాలుగున్నర సంవత్సరాల తరువాత శాసనసభను రద్దుచేసి నవంబర్ 2018లో జరిగిన ఎన్నికలలో 88 స్థానాలను గెలిచి అఖండ విజయం సాధించారు. మరోమారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

         తొమ్మిదిన్నరేళ్ళలో కేసీఆర్ సారథ్యంలోని ‘ఎనేబ్లింగ్ గవర్నెన్స్’ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు అపూర్వమైన సంపద, శ్రేయస్సు చేకూరినప్పటికీ, అన్ని ప్రామాణికాలలో అసాధారణమైన వృద్ధి నమోదు అయినప్పటికీ, ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత ఇచ్చి విజయాన్ని చేకూర్చారు. కేసీఆర్ స్వయంగా నలభై ఏళ్ళ తర్వాత ఎమ్మెల్యేగా రెండో ఓటమిని చవి చూశారు. కామారెడ్డిలో ఓడి, గజ్వేల్‌లో గెలిచారు. బహుశా ప్రజలు కోరుకున్న దానికంటే, అవసరాలను మించి కేసీఆర్ వారికి ఇచ్చారేమో! ప్రభుత్వాలు పథకాల రూపకల్పనకు ముందు, అమలుకు ముందు, అవి ప్రజలకు ఏ మేరకు అవసరమో అనే విషయంలో శాస్త్రీయ విశ్లేషణ చేయాలేమో!

ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చేసిన ఆరు గ్యారంటీల అమలుకు ముఖ్యమంత్రి చేసిన మొదటి సంతకం ద్వారా, కేబినెట్ తీర్మానం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేసీఆర్ బాటలోనే (బహుశా) సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకోకుండా, వర్తమాన ఆర్థిక పరిస్థితిని పూర్తిగా అధ్యయనం చేయకుండా, అవసరాల అంచనా లేకుండా, ఎన్నికల వాగ్దానానికి అనుగుణంగా ఆరు గ్యారంటీల అమలుకు ముందుకు పోవడం కొంచెం విశ్లేషించాల్సిన అంశమే. కాకపోతే, కొంచెం జాగ్రత్తగా, ఆరు గ్యారంటీలలో రెండు మాత్రమే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యపరిమితి రూ.10 లక్షలకు పెంపు మాత్రమే, ప్రస్తుతానికి అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించడం హర్షించదగ్గ విషయం.  ప్రజాస్వామ్యంలో నిరంతర మార్పు సర్వసాధారణం. మకుటంలేని మహారాణిగా మన్ననలు అందుకున్న ఇందిరాగాంధీ ‘గరీబీ హటావో’, ‘బ్యాంకుల జాతీయీకరణ’ వంటి ప్రజాకర్షక నినాదాలు ఇచ్చినప్పటికీ, ఎమర్జెన్సీ అనంతరం 1977లో జరిగిన ఎన్నికలలో తాను పోటీ చేసిన స్థానంలో పరాజయం పాలవడమేగాక, కాంగ్రెస్ పార్టీని పరాజయం దిశగా నడిపించింది. అయితే ఆమెను, ఆమె పార్టీని ఓడించిన జనతా అంతర్గత కుమ్ములాటలో బలహీనపడి, ప్రభుత్వం కూలిపోవడంతో, ఇందిరాగాంధీ దిగ్విజయంగా తిరిగి అధికారంలోకి రాగలిగింది. 1983 ఎన్నికల్లో ఎన్టీరామారావు అఖండ విజయం సాధించినప్పటికీ, 1989 ఎన్నికల్లో ఆయన స్వయంగా ఒక నియోజకవర్గంలో ఓటమి పాలై, కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పచెప్పారు.

         ‘ఆంగ్లంలో భగవద్గీత  సందేశ సారం’ గా కుష్వంత్ సింగ్ వర్ణించిన, రడ్యార్డ్ కిప్లింగ్ అనే ప్రఖ్యాత ఆంగ్ల రచయిత రాసిన ‘ఇఫ్’ ఆనే సందేశాత్మక గేయ కవితలోని ప్రతిపదం ఏ రంగంలోనైనా గెలుపు ఓటములను చవిచూసే ప్రతివ్యక్తీ చదవాల్సినంత గొప్పది. ముఖ్యంగా, ‘జయాపజయాలను సమతుల్యంగా పరిగణించి, ఓటమి ఎదుర్కొన్నా తిరిగి ఆదినుండి ఆరంభిస్తూ విజయానికి బాటలు త్రొక్కు’ అనే మాటలు. ఇలా ఎవరికైనా జయాపజయాలు మాములే. కాకపోతే ఎందుకు ఒకరు గెలుస్తారు, మరెందుకు ఇంకొకరు ఓడుతారు అనేది జవాబులేని ప్రశ్న. ఎవరైనా చేయగలిగింది జయాపజయాలను సమతుల్యంగా పరిగణించి ముందుకు సాగిపోవటమే! ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలే.