Wednesday, December 12, 2012

దిక్కుతోచని స్థితిలో బ్రాహ్మణులు: వనం జ్వాలా నరసింహారావు


దిక్కుతోచని స్థితిలో బ్రాహ్మణులు


ఒక నాడు సమాజాన్ని ఐక్యంగా వుంచడానికి తమ శాయశక్తులా కృషిచేసిన బ్రాహ్మణుల పరిస్థితి గతులు రోజు-రోజుకూ క్షీణించి పోతున్నాయి. క్రిస్టియన్ మిషనరీల రాకతో, అంతకు ముందు ముస్లింల పాలనలో, ప్రారంభమైన బ్రాహ్మణ వ్యతిరేకత, బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో బలపడి, స్వతంత్ర భారత దేశంలో పతాక దశకు చేరుకుంది. దశాబ్దం క్రితం మండల కమీషన్ నివేదికతో ఆ వ్యతిరేకత వేళ్లూనుకుని పోయింది. బ్రిటీష్ పాలనలో బ్రాహ్మణులను ఇబ్బందులకు గురిచేయడం యాధృఛ్చికంగా జరిగిందేమీకాదు. భారత దేశ సామాజిక వ్యవస్థలో బ్రాహ్మణుల పాత్ర ఎంత ప్రాముఖ్యమైందో బ్రిటీష్ వారికి మొదట్లోనే అవగతమైంది. పవిత్రమైన సాంస్కృతిక-సాంప్రదాయక బవబంధాల నేపధ్యంలో దేశ ప్రజలను ఐక్యంగా-సమైక్యంగా మలచడంలో కీలక పాత్ర పోషిస్తున్న బ్రాహ్మణులను కట్టడి చేయాలన్న ఆలోచన ఆంగ్లేయులకు కలగడం సహజం. విభజించి పాలించు అనే సంస్కృతిని అనుసరించే బ్రిటీష్ ప్రభుత్వం, భారత సమాజాన్ని విడదీయాలంటే, మొదలు బ్రాహ్మణులను దెబ్బ తీయాలని భావించింది. అలనాడు ఆ ప్రభుత్వం అనుసరించిన విధానాన్నే స్వతంత్ర భారత దేశంలో మండల్ కమీషన్ అనుసరించింది. చదువుకున్న బ్రాహ్మణుల మూలాన, భారతదేశంలో తమ గుత్తాధిపత్యానికి ప్రమాదం వుందని భావించింది బ్రిటీష్ ప్రభుత్వం. జాతీయోద్యమంలో పెద్ద ఎత్తున బ్రాహ్మణులు పాల్గొనడమే కాకుండా నాయకత్వం వహించడం వారి అనుమానాన్ని మరింత ధృఢ పరిచింది.

అనాదిగా వస్తున్న సాంప్రదాయాలకు అనుగుణంగా, పౌరాణిక-ఐతిహాసిక కథనాల ప్రకారం, చాతుర్వర్ణ వ్యవస్థలో అత్యున్నతమైంది బ్రాహ్మణ్యం. బ్రాహ్మణులంటే బ్రహ్మ జ్ఞానం కలవారని. అదొక సామాజిక వర్గం. హైందవ మతంలో, ఆచారంలో, ఒక భాగం. అగ్ర కులంగా, అగ్ర వర్ణంగా బ్రాహ్మణులకు వైదిక కాలం నుంచి కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుంటూ వస్తోంది. భారతీయ మనుస్మృతి ప్రకారం క్షత్రియులు (యోధులు, చట్టం అమలు, పరిపాలకులు), బ్రాహ్మణులు (పండితులు, ఉపాధ్యాయులు, అగ్ని పూజారులు), వైశ్యులు (వ్యవసాయదారులు, వ్యాపారులు, బ్యాంకర్లు), శూద్రులు (సేవకులు) అనే నాలుగు "వర్ణాలు" లేదా తరగతులు ఉన్నాయి. నాలుగు వర్ణాలుగా అనాది నుంచీ విభజన జరిగిన వాటిలో మొదటిది బ్రాహ్మణులు కాగా, మిగిలిన మూడింటిని, క్షత్రియులని, వైశ్యులని, శూద్రులనీ పిలవడం మొదలెట్టారు. అగ్ర కులంగా, అగ్ర వర్ణంగా బ్రాహ్మణులకు దక్కిన ప్రత్యేక హోదా నాటి నుంచీ నేటి దాకా ఒక విధంగా కొనసాగుతూనే వుంది. వాళ్ల గొప్పతనానికి, ఆధిపత్యానికి, ఇప్పటికీ గౌరవం లభిస్తున్నప్పటికీ, అనాదిగా వారికి దక్కిన హక్కుల విషయంలో మాత్రం అడుగడుగునా కోతలు ఎప్పటి నుంచో మొదలైంది. ఇతర కులాల వారు, వర్ణాల వారూ చేయలేని అనేక పనులను, వైదిక కర్మ కాండలను చేయగల సామర్థ్యం కేవలం ఒక్క బ్రాహ్మణులకే నేటికీ వుందనడంలో అతిశయోక్తి లేదు. ఒక విధంగా చెప్పుకోవాలంటే జ్ఞాన సముపార్జన వాళ్లకే చాలా కాలం వరకూ పరిమితమై పోయింది. కాలానుగుణంగా వస్తున్న మార్పులలో ఇతర వర్ణాల వారు, కులాల వారు, జ్ఞాన సముపార్జన విషయంలో వీరితో పోటీ పడి నెగ్గుకొస్తున్నప్పటికీ, సాంప్రదాయిక వైదిక విద్యా సముపార్జన మాత్రం ఇంకా వీరి అధీనంలోనే చాలా వరకు వుందనాలి. వాళ్లకు సంఘంలో వున్న గౌరవం వల్లనైతేనేమి, సాంప్రదాయకంగా వారికి లభిస్తున్న విద్య వల్ల నైతేనేమి, బ్రాహ్మణులు మత పరమైన వ్యవహారాలనే కాకుండా లౌకిక వ్యవహారాలను కూడా చక్కదిద్దే స్థాయికి ఎదిగారు. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం బ్రాహ్మణుల ప్రధాన కర్తవ్యం సమాజోన్నతికి పాటు పడటం. నిరంతరం జ్ఞానార్జన చేస్తూ, వేదాలలో ప్రావీణ్యం కల వారై, సత్యనిరతిని, ధర్మ వర్తనను సమాజానికి బోధిస్తూ సమాజ అభ్యున్నతికి పాటుపడాలి. దైవ విశ్వాసాన్ని, భక్తిని పెంపొందించి సమాజాన్ని ఉత్తమ మార్గంలో నడపడం వలన వారికి సమాజంలో సముచిత గౌరవం లభిస్తోంది. వారు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి వేద-పౌరాణిక ఆధ్యాత్మిక సంబంధ విషయాలపై చక్కటి అవగాహన కలిగి ఉంటారు.

బ్రాహ్మణులను "విప్ర" ("ప్రేరణ"), లేదా ""ద్విజ"" ("రెండుసార్లు జన్మించిన") అని కూడా పిలుస్తారు. ఆధునిక వాడుక భాషలో అందరూ "బ్రాహ్మణులు" అయినప్పటికీ, ప్రాంతీయ మత ఆచార సాంప్రదాయ వ్యవహారాలు-వేద పాఠశాలల (శాఖలు) వలన వారు వివిధ ఉప కులాల వారీగా విభజించబడ్డారు. బ్రాహ్మణులు సంప్రదాయబద్ధంగా ఆలయం పూజారులు అయినప్పటికీ, అందరు బ్రాహ్మణులు అగ్ని (హోత్ర) పూజారులు కారు. ఇటీవలి కాలంలో కొద్ది మంది బ్రాహ్మణులు మాత్రమే వేద విద్య నేర్చుకోవడం చేస్తున్నారు. మరి కొందరు పౌరోహిత్య విధులు నిర్వర్తిస్తున్నారు. పురాతన భారత సామాజిక నిర్మాణం పతనం కారణంగా, వివిధ వృత్తుల్లో, ఉద్యోగాలలో బ్రాహ్మణులు కూడా తమ అవకాశాలు వెతుక్కుంటున్నారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు బ్రాహ్మణుల వలసలు కూడా సాగుతున్నాయి.

రామాయణ కాలం నాటి బ్రాహ్మణులు బాహ్యేంద్రియాలను, అంతరేంద్రియాలను, జయించారు. పరులను వంచించాలనే దురాచారానికి దూరంగా వుండేవారు. ఎటువంటి అనాచారానికి లోనుకాకుండా, సత్యాన్నే పలుకుతూ, భగవత్ కథలనే వల్లించి కాలయాపన చేస్తూ, యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ, నిర్మల బుద్ధితో వుండేవారు. వేదాల్లో చెప్పిన కర్మ కార్యాలను నెరవేరుస్తూ, అడిగిన వారికి లేదనకుండా శక్తికొలది దాన ధర్మాలు చేస్తుండేవారు. ఆరంగాల (శిక్ష-వ్యాకరణం-ఛందస్సు-నిరుక్తం-జ్యోతిష్యం-కల్పం) వేదాధ్యయనం చేయడం వారికి నిత్య కృత్యం. పెద్ద మనసుతో పుణ్య కార్యాలను చేస్తూ, దేవర్షులతో-మహర్షులతో సమానంగా, సూర్య చంద్రుల తేజస్సుతో-వర్ఛస్సుతో భగవధ్యానం చేస్తూ, సదాచార సంపన్నులై మెలగుతుండేవారు. అలాంటి వారు ఇప్పటికీ పలువురు వున్నారు. కాకపోతే ఆధునిక రాజకీయ, సామాజిక మార్పులకు, ఆర్థిక ఇబ్బందులకు అనుగుణంగా ఆ సంఖ్య తగ్గుతూ వచ్చింది. బ్రాహ్మణులను ద్విజాతులని, వేదషడంగ పారగోత్తములని, అహితాగ్నులని, సహస్రదులని, మహామతులని, సత్యవచస్కులని, హిమకర మిత్ర తేజులనిఋషులని ఆంధ్ర వాల్మీకి రామాయణ గ్రంధ కర్త శ్రీమాన్ వావిలికొలను సుబ్బారావు పోల్చారు. వారినే, హృష్ఠ మానసులని, శాస్త్ర చింతన పరాయణులని, స్వస్వతుష్టులని, త్యాగశీలురని, భూరి సంచయులని వర్ణించారు తన రామాయణంలో. తమ వర్ణానికి, ఆశ్రమానికి శాస్త్రోక్తమైన విహిత కర్మ ఏదో, దానినే బ్రాహ్మణులు శ్రద్ధతో ఆచరిస్తూ, విద్యా దానంలో, అధ్యయనంలో ఉత్తములై , వశ్యేంద్రులై, జితమనస్కులై, దానానికి పాత్రులై వుండేవారు.

రాజకీయంగా అధికారం మరో అగ్ర వర్ణం వారైన క్షత్రియుల చేతుల్లో వున్నప్పటికీ, అమాత్యులుగా రాజులకు సలహాలనిచ్చే బాధ్యతను-హక్కును వారే కలిగి వుండడం కూడా అనాదిగా వస్తోంది. ఆంగ్లేయుల పాలనలో, బ్రాహ్మణులు, మేధ పరమైన తమ ఆధిపత్య నాయకత్వాన్ని పదిలంగా కాపాడుకున్నారు. వారి ఆ ఆధిపత్యం, తొలినాళ్లలో, ఆంగ్లేయుల ప్రభుత్వంలో ప్రాముఖ్యత సంతరించుకున్న ఉద్యోగాలలో పనిచేయడంతో ప్రారంభమై, జాతీయోద్యమంలో కీలక నాయకత్వం చేపట్టడం దాకా పోయింది. భారత దేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాత కూడా వారి ఆధిపత్యం కొనసాగింది చాలా రోజుల వరకు. అధికారంలో వున్న భారత జాతీయ కాంగ్రెస్  పార్టీలో కీలక పదవులు పొందడంలోను, కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన భూమిక పోషించడంలోను బ్రాహ్మణులే ముందుండే వారు. వీరి ఈ ఎదుగుదలను సహించలేని కొన్ని రాష్ట్రాలలో-ముఖ్యంగా దక్షిణాదిలో, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు మొదలయ్యాయి. కాకపోతే, ఆ ఉద్యమాల ప్రభావం వారి హక్కులను హరించడం వరకే పరిమితమైనాయి తప్ప, పూజారులుగా, అర్చకులుగా, వేద పండితులుగా, కర్మకాండలు నిర్వహించే వారిగా, సంబంధిత కార్యక్రమాల నిర్వాహకులుగా కొనసాగే విషయంలో పెద్ద నష్టం జరగలేదు. వివాహాలలో, అంత్యక్రియలలో, ఇతర పూజా పునస్కారాలలో వారు లేకుండా వ్యవహారం నడవడం కష్టమే ఇప్పటికీ. క్రమేపీ, వీటికే పరిమితమై పోవడంతో, గతంలో మాదిరి రాజకీయంగా కాని, సామాజికంగా కాని, ఆర్థికంగా కాని ఎదుగుదలకు నోచుకోలేక, బీదరికంలోకి అడుగు పెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది చాలామందికి. దీనికి తోడు, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా అనుదినం చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా వారిని కడు ఇబ్బందులకు గురి చేయసాగింది.

బ్రిటీష్ ప్రభుత్వ పాలనలో, జాతీయోద్యమంలో కీలక పాత్ర వహించిన బ్రాహ్మణుల నుంచి ఎదురైన సవాళ్లను అధిగమించడానికి, ఒక వైపున సైద్ధాంతికంగా వారిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ, మరో వైపున బ్రాహ్మణేతర అగ్ర కులాల వారిని, బ్రాహ్మణులతో సమానంగా పరిగణించబడాలన్న డిమాండుతో తెర పైకి తేవడం జరిగింది. ఆ తరువాత కాలంలో అదే పద్ధతిని ముస్లింల విషయంలో కూడా అవలంబించింది బ్రిటీష్ ప్రభుత్వం. భారత దేశ చరిత్రను తిరగ రాసే ప్రయత్నంలో, బ్రాహ్మణులను, ఇతర వర్ణాల వారికి వ్యతిరేకులుగా, పీడించే వారిగా, దుర్మార్గులుగా చిత్రించే ప్రయత్నం కూడా చేసింది. భారత సమాజాన్ని అభివృద్ది పరచడంలో బ్రాహ్మణులు వహించిన పాత్రను తక్కువ చేసి చూపడం జరిగింది. ఇదంతా కావాలనే చేసింది నాటి ప్రభుత్వం. ఆ ప్రయత్నాలే ఆ తరువాత స్వతంత్ర భారత దేశంలో కూడా మరో రూపంలో కొనసాగాయనవచ్చు.

సమాజాన్ని ఐక్యంగా, సమైక్యంగా వుంచడానికి బ్రాహ్మణులు అనాదిగా చేసుకుంటూ వస్తున్న అవిరళ కృషిని, మరుగుపర్చి, బ్రాహ్మణ వ్యతిరేకతను ప్రోత్సహించింది నాటి బ్రిటీష్ ప్రభుత్వం. ఆ వ్యతిరేకతే దరిమిలా కొనసాగి, అరవై ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో మరింత బలపడి, చరిత్రలో కనీ-వినీ ఎరుగని రీతిలో, బ్రాహ్మణులను అణగ దొక్కే స్థాయికి తీసుకుపోయింది. వాస్తవానికి శతాబ్దాల కాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణే తరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన సామాజిక, రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకునే స్థితికి చేరుకుందిప్పుడు. ఈ మార్పుల వల్ల వర్ణాశ్రమ ధర్మాలకు బదులుగా కులాల ప్రాధాన్యత వచ్చింది. రాజకీయ, సామాజిక, మతపర, సాంస్కృతిక వ్యవహారాలలో కులాల ప్రస్తావన లేకుండా ఏదీ జరగలేని స్థితికి చేరుకున్నాం. బ్రాహ్మణ వ్యతిరేకత చివరకు కులాల వ్యతిరేకతకు దారితీసింది. ఒక కులం వారు, మరో కులాన్ని దూషించే పరిస్థితులొచ్చాయి. అగ్ర కులాలని, వెనుకబడిన కులాలని, దళితులని బేధాలొచ్చాయి. బ్రాహ్మణ ద్వేషం బాగా ప్రబలిపోయింది.

చివరకు జరిగిందేంటి? ఆర్థికంగా బ్రాహ్మణులు బాగా చితికి పోయారు. వ్యవసాయం మీద, భూమి మీద ఆధారపడిన బ్రాహ్మణులు, చట్టాల పుణ్యమా అని ఆ రకమైన ఉపాధిని కోల్పోయారు. వున్న భూమి వ్యవసాయ భూపరిమితి చట్టం కింద ప్రభుత్వానికి పోయింది. రోజు గడవడం కష్టమైంది. ఒక నాటి పౌరోహిత్యం, పూజారి జీవితం, ఆయుర్వేద వైద్యం బ్రాహ్మణుల బ్రతుకు తెరువుగా కొనసాగడం కష్టమై పోయింది. వీటికి ఒకనాడు లభించిన గౌరవ మర్యాదలు కూడా కరవై పోయాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని బ్రాహ్మణుల స్థితిగతులపై అధ్యయనం చేసిన ఒక సంస్థ, పలు ఆసక్తికరమైన నిజాలను వెలుగులోకి తెచ్చింది. రాష్ట్రంలోని దాదాపు పురోహితులందరూ దారిద్ర్యరేఖకు దిగువన వున్నవారేనట. సుమారు 55 శాతం మది బ్రాహ్మణులు జాతీయ సగటు వ్యక్తిగత ఆదాయం కంటే తక్కువగా, దారిద్ర్యరేఖకు దిగువగా జీవనం సాగిస్తున్నారు. అనాదిగా ఆచారంగా వస్తున్న వారి దుస్తుల విషయం కాని, పిలక జుట్టు కాని, ఆచార వ్యవహారాలు కాని, బ్రాహ్మణులను హేళనకు గురి చేస్తున్నాయని అధ్యయనంలో తేలింది. రిజర్వేషన్లు, దిగజారుతున్న ఆర్థిక స్తోమత, వారిని లౌకిక ఉద్యోగాలకు దూరం చేసింది. పాఠశాలలో, కళాశాలలో చదువుకునే బ్రాహ్మణుల సంఖ్య దిన-దినం తగ్గిపోసాగింది. 5-18 సంవత్సరాల వయసున్న బ్రాహ్మణ బాల-బాలికలలో సుమారు 44 శాతం మంది ప్రాధమిక స్థాయిలో, మరో 36 శాతం మంది హయ్యర్ సెకండరీ స్థాయిలో పాఠశాల విద్యకు స్వస్తి చెపుతున్నారు. బ్రాహ్మణే తరుల ఆదాయంతో పోల్చి చూస్తే, నూటికి తొంబై శాతం మంది ఆదాయం చాలా తక్కువ. అనాథ బ్రాహ్మణుల శాతం అఖిల భారత సాధారణ కేటగిరీ సగటు కంటే చాలా ఎక్కువ. ఇంటర్మీడియట్ స్థాయి దాటి చదువు కొనసాగించేవారు దాదాపు లేనట్లే!

కడు బీదరికంతో అల్లల్లాడి పోతున్న పలువురు బ్రాహ్మణులు, పల్లెల నుంచి పట్టణాలకు ఉపాధి కొరకు వలసపోయే పరిస్థితులొచ్చాయి. చేతికందిన పని వెతుక్కుంటున్నారు. మొదట్లో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడిపోవచ్చని భావించారు. న్యాయవాద వృత్తిలోనో, వైద్య వృత్తిలోనో చేరుదామని కలలు కన్నారు. అదీ అందని ద్రాక్ష పండే ఐంది. రిజర్వేషన్ల మూలాన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు దొరక కుండా పోయాయి. ప్రయివేట్ గా ఏదన్నా చేసుకుందామంటే ఆర్థిక స్థోమత అడ్డొచ్చింది. చివరకు గృహ సంబంధమైన చాకిరీ చేసే వివిధ వృత్తులలో స్థిరపడి పోవాల్సి వచ్చింది. బ్రాహ్మణులలో నిరుద్యోగ శాతం దాదాపు 75 మేరకు చేరుకుంది. ఆ మధ్యన అమెరికా దేశానికి చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్, బ్రాహ్మణులకు సంబంధించి ఒక ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. ఒకనాడు ప్రత్యేక హక్కులు కల వర్గంగా భావించబడిన బ్రాహ్మణులు, రారాజుల కనుసన్నలలో జీవనం సాగించిన బ్రాహ్మణులు, గత కొన్ని దశాబ్దాలుగా, భారత ప్రభుత్వ రిజర్వేషన్ చట్టాల మూలంగా, కనీ వినీ ఎరుగని కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆ జర్నల్ పేర్కొంది. జాతీయ ఆర్థిక జీవన స్రవంతిలో బ్రాహ్మణుల భాగస్వామ్యం లేకుండా పోతోందని కూడా రాసింది. ఒక నాడు ఇండియన్ సివిల్ సర్వీసులలోను, ఆ తరువాత ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులలోన, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అధికార స్వామ్యంలోను కీలకమైన స్థానాలలో వున్న బ్రాహ్మణులను, రిజర్వేషన్లు, వాటికి దూరం చేశాయని కూడా జర్నల్ రాసింది. చివరకు రైల్వే కూలీలుగా, రిక్షా కార్మికులుగా, సులభ శౌచాలయ నిర్వాహకులుగా కూడా పని చేస్తున్నారు పలువురు బ్రాహ్మణులు.

ఎప్పుడో, వేల ఏళ్ల క్రితం, అప్పటి బ్రాహ్మణులు ఏదో చేశారన్న నెపంతో, ఈ తరం బ్రాహ్మణులను ఇలా ఇబ్బందులకు గురి చేయడం భావ్యమా? దోపిడీ చేసిన వారు, దోపిడీకి గురైన వారు అంతరించి పోయారు. ఇప్పుడున్నది సమ సమాజం. అందరూ భారత రాజ్యాంగ కింద సమాన హక్కులు కలవారే అంటున్నాం. అలాంటప్పుడు, సమాజంలోని ఒక వర్గం వారిని బ్రాహ్మణులన్న కారణాన చిన్న చూపు చూడడం సమంజసమా? ప్రత్యేక హక్కులు కావాలని వారనడం లేదు. అడగడమూ లేదు. తమను అందరితో సమానంగా చూడమనే అడుగుతున్నారు. ఆర్థికంగా చితికి పోయిన తాము కూడా వెనుకబడిన వర్గాల వారిమే అంటున్నారు. అందరితో పాటు వారినీ సమానంగా చూడడం సమాజం కర్తవ్యం!

21 comments:

  1. ఒక్కప్పుడు "ఆశ్రమ దర్మాన్ని" గూర్చి ప్రబోదించినది "పండితులు". అదే నిజమయిన హిందూ జీవన విదానం . కాని రాను రాను దానికి" వర్ణ దర్మాన్ని" జోడించింది" పండిత పుత్రులు". దీని వలననే హిందూ మతం బ్రష్టు పట్టి, ప్రపంచంలో ఎక్కడా లేని "కుల విదానాన్ని" తెర మీదకు తీసుకు వచ్చింది. చివరకు దళితులు గా ముద్ర పడిన ప్రజలు అన్య మతాలను ఆశ్రయించేలా చేసింది. ఇప్పుడు అదే" పండిత పుత్రులు" అన్య మతాలలో చేరి గంతులేస్తున్నారు.

    మీరెన్ని చెప్పినా హిందూ మతం నాశనం అవడానికి కారకులు "బ్రహ్మ జ్ణానం" తెలియని "పండిత పుత్రులే". మీరు చెప్పిన కులంలో ఇప్పుడు ఎక్కువ మంది వారే. భగవంతుడే శూద్రుడయితే(గీతాకారుడు) ఆయనకు సేవ చేసే వారు "అగ్ర వర్ణాలు" అవుతారా? అందుకే భగవంతుడికి కోపం వచ్చింది. ఎవరు చేసుకున్న కర్మ వారనుభవించక తప్పదన్నా!

    ReplyDelete
    Replies
    1. భగవంతున్ని శూద్రుడంటారా? ఎంత మాట? వర్ణాలను సృష్టించిన వాడికే వర్ణన్ని అంటగడతారా. ఐనా మీరు చెప్పిన కృష్ణ పరమాత్మ క్షత్రియుడు. యదువు వంశంలో జన్మించాడు. యాదవులకు యయాతి శాపం మూలంగా రాజ్యాధికారం లేదు. భగవత్ భాగవతులను గూర్చి మాటాడెప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం (మనకే) మంచిది. భగవంతుడు ఒక వర్ణాన్ని మొత్తం శిక్షించాడా? మీరు చెప్పినదాన్ని మీరే ఒక సారి చదవండి ఎంత హాస్యాస్పదమో తెలుస్తుంది. గీత చదవండి ఒక సారి భగవత్ తత్వం అంతా అందులో ఉంది. వర్ణాశ్రమ ధర్మాలు కూడా అందులో ఉన్నాయి. ఆయనే అన్నాడు నాకు అన్నీ సమానం అని. భాగవతం వర్ణాలగురించి చెప్పి, ఏ వర్ణం వారైనా వారాచరించే పనులబట్టి (శూద్రుడిగా పుట్టినా బ్రాహ్మణ ధర్మాలు, అంటే అహింస సత్యం పెద్దలని గౌరవించడం శాంతి దమం ధర్మం, తిత్తిక్ష మొదలైన గుణాలతో ఉంటే) వారు బ్రాహ్మణులే అవుతారు.

      Delete
  2. ధర్మాన్ని రూపుమాపటానికి జరిగే ప్రయత్నాలలో చెట్టు మూలాన్నికూల్చాలనేది మిషనరీల వ్యూహం. ఆప్రభుత్వాల ప్రోత్సాహంతో మొదలైన విధ్వంసం ఇప్పుడు ఈరూపానికొచ్చినది. ఇంకొంతకాలం తరువాత ఇంకెంత వికృతరూపం దాల్చబోతున్నదో ?

    ReplyDelete
  3. బ్రాహ్మణులలో ఆర్థికంగా వెనుకబడ్డవారికి ప్రభుత్వం సహాయం అందించటం అభిలషణీయం. అవసరం కూడా.

    ReplyDelete
  4. Brahmins are acted as slaves in the ruling of muslims and Britishers,Got their lively hood by licking their feet.Your greatness will workout at ignorant hindus only.

    ReplyDelete
    Replies
    1. I am wondering whose feet others licked for survival.

      Delete
  5. జ్వాలా గారు మీ విశ్లేషణ చాలా బాగుంది. ఆర్ధికంగా, సామాజికంగా ఎంతో ఇబ్బంది పడుతున్న బ్రాహ్మణులను ఈ సమాజం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. సమాజం బాగుండాలని కోరుకునే బ్రాహ్మణులను సమాజం ఇప్పటి నుంచి ఐనా గౌరవంగా చూడాల్సిన అవసరం ఉంది

    ReplyDelete
  6. అందుకే భగవంతుడికి కోపం వచ్చింది. ఎవరు చేసుకున్న కర్మ వారనుభవించక తప్పదన్నా!
    ----------------------
    చేసుకుంటున్న కర్మ కూడా దానికి వర్తిస్తుంది. అందుకనే దేశంలో రిజర్వేషన్స్ పెట్టి, స్కాములు చేస్తూ, FDI లాంటివి కుదుర్చుకుంటూ, ఇతరదేశాల కి ఊడిగలు చెయ్యబోతున్నాము. దీనికి మెక్సికో ఉదాహరణ.

    ReplyDelete
    Replies
    1. రిజర్వేషన్లు అనేవి ప్రజల చేత కాని తనానికి నిదర్శనం కాదు. మూడు వేల సంవత్సరాలుగా అణగారిన వర్గాలకు "అహంబావ" వర్గాల నుండి కొంత వెసులుబాటు కల్పించి వారు కూడ "సమాజ జీవన స్రవంతి"లో కలపటానికి ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు. ఎవరు అదికారంలో ఉంటే వారిని పొగిడి పబ్బం గడుపుకుని,ప్రజలను హీనస్తితికి కారణమయిన వారు,రాబోయే తరాలలో తమ పిల్లలే తమ బావాజాలం వల్ల బ్రష్టు పట్టి పోతారని ఊహించకపోవడం స్వయంక్రుతాపరాదం.ఒక్కప్పుడు హిందూ చక్రవర్తులను, ముస్లింరాజులను,ఇంగ్లిష్ దొరలను, ఇప్పుడు అన్యమతాలలో చేరి, నల్ల దొరలను పూజిస్తూ ఏ ఎండకు ఆ గొడుగు పట్టి ఈ సమాజాన్ని నాశనం చేసిందెవరో చరిత్ర చదివితే తెలుస్తుంది."నిజమయిన బ్రాహ్మణులు" అన్ని కులాలో ఉన్నారు. వారి వల్లనే "హిందూ" జీవన విదానం ఇంకా కొనసాగుతుంది.అంతే కాని "పుట్టుక బ్రాహ్మణత్వం" వల్ల మిగిలింది ఏమి లేదు "తడి,మడి,దడి" తప్ప

      Delete
    2. ఐతే చరిత్రలో జరిగిన తప్పిదానికి శాస్తిగా ప్రస్తుతం మరియూ భవిష్యత్తులో భారతదేశంలో ప్రతిభ ఉన్నవారిని కిందకు నెట్టివేయడమే దానికి పరిష్కారమా? అసహనం చేత యువత వీలైతే వేరే దేశాలు వలస వెళ్ళడం, లేదా పెడమార్గాలను తొక్కడం వంటివి చేస్తే ఆ కారణంగా దేశానికి జరిగే నష్టమే దేశానికి మేలని భావిస్తారా. లేదు ఏది ఏమైన 100ఏళ్ళ క్రితం చేసిన దానికి ఇప్పుడున్నవారు అనుభవించి తీరాలి, దేశం ఏమైన పర్వాలేదు అంటే రాజ్యక్షేమం కన్నా కుల అహంకారమే ముఖ్యమన్నమాట.

      Delete
  7. అలా అని ఎందుకు అనుకొంటున్నారు,యుగాల నుండి అన్ని కులా వారిని విద్య కు దూరం చేసి వారి లో వున్నా మూఢ నమ్మకాల్ని ప్రొఛహిస్తూ,సంమాజంలో అగ్రభాగాన్న వుంటూ క్రింది కులాలను సంమజానికి బానిసలుగా చేసిన బ్రాహ్మణ
    కులాలు వారి సిధాంతమే వారిన్ వెనకు నేట్టబడినది.

    ReplyDelete
    Replies
    1. ఇప్పుడు కూడా ప్రపంచంలో ప్రతీవాళ్ళూ చెప్పేది అదే. ఎందుకు పైకి రాలేదు అంటే మిగతా వాళ్ళు తొక్కి పట్టేసారని. మీకు నమ్మకం లేక పోతే ఉద్యోగాలు రాని వాళ్ళ నడగండి, పరీక్షల్లో తప్పిన వాళ్ళ నడగండి, రోజూ మందు కొట్టే వాళ్ళ నడగండి. ఇంతెందుకు ఉద్యోగం చేసే వాళ్ళని అడగండి వాళ్ళ బాస్స్ ఎంత క్రూరుడో తనకి అడిగినప్పుడు శలవ ఎందు కివ్వలేదో ప్రమోషన్ ఎందుకు రికమేండ్ చెయ్యలేదో. 50 సంవత్సరాలు రిజర్వేషన్స్ తో గడిపి ఇంకా మాకు కావాలి అనే వాళ్ళు ఇంకా వందేళ్ళు ఇచ్చినా పైకి రావటం కష్టం. విద్య కావాలి అనుకున్న వాళ్ళు అందరూ పైకి వచ్చారు మన సమాజంలో. తన పరిస్థితికి ఇంకోళ్ళు కారణం అని చెప్పుకుని కూర్చునేవాళ్ళు ఎప్పుడూ పైకి రాలేరు.

      Delete
    2. "అందరికి ఉపాది గ్యారంటి" అనేది ప్రాదమిక హక్కు అయితే ఈ రిజర్వ్షన్లు అఫ్ట్రాల్. లేకుంటే వారి కాళ్లు వీరి కాళ్లు పట్టె విద్య తెలియని సామాన్య ప్రజలు, ఇంకా అణగారి పోతారు. అందాక రిజర్వేషన్లు ఉంటాయి.

      Delete
    3. బ్రాహ్మణ సిద్ధాంతం అంటూ మీరు చెప్పినదీ ఏదీ లేదు. అంతా వేదం చెప్పిన వేద విహితమైన సిద్ధాంతమే. దాని ఆధారంగానే నాలుగు వర్ణాలు ఉండేవి. మీరు మూలం మరచిపోతున్నారు. మీరు చెప్పినట్లుగా కొంతమంది వారి ఆధిపత్యం చెలాయించడానికి మిగతా వర్ణాలని అణగదొక్కి ఉండవచ్చు, నిజమైన బ్రాహ్మణుడు ఎలా ఉండాలో తెలియని వారు అలా చేసి ఉండవచ్చు. కాల క్రమేణ 'ఇదే బ్రాహ్మణత్వం' అనే ప్రచారం కూడా జరిగి ఉండవచ్చు. ఎప్పుడైతే ప్రజలు ధర్మాన్ని తప్పుతారో అప్పుడు వారి అధర్మాచరణను నిరసించి ధర్మాన్ని నెలకొల్పడం రాజుల (ప్రభుత్వ) ధర్మం. తరాల క్రిందట జరిగిన విషయానికొరకు రాబోయే తరాల వారందరికీ అవకాశాలు రాకుండ చేయడం, తద్వారా వారిలో ఉన్న ప్రతిభను దేశానికి ఉపయోగకరం కాకుండా చేయడం దేశానికి లాభమా నష్టమా? 10 సంవత్సరాలకొరకే అని ఉద్దేశ్యింపబడిన రిసర్వేషన్లను అపరిమితంగా పొడిగించి, ఆదాయం ఎక్కువగా ఉన్న వారికి కూడా అది వర్తించేట్లు చేయడం ఎంతవర్కూ సబబు.
      అణచి వేశారు, అణచి వేశారు అంటున్నారు - ఇప్పుడు ఉన్న రిసర్వేషన్ల వలన దారిద్ర్యరేఖకు దిగువ ఉన్నవాళ్ళు ఎంత మంది లాభపడుతున్నారు. ఎస్ సీ అయిన కలక్టర్ కొడుకుకి కూడా రిసర్వేషన్ ఉంటొంది ఇపుడు. అలాంటివారికి రిసర్వేషన్ తీసేసి, దానిచోటులో దారిద్ర్యరేఖకు దిగువుగా ఉన్న మరో ఎస్ సీ లేదా ఎస్ టీ ఉపయోగించుకుంటాడు గా? అలా వీలు కాదు. ఎన్ని తరాలైనా వారికే ఉండాలి. అంటే ఒక ఎస్ సీ కి ఇంకో ఎస్ సీ పోటి. వాడికి సీటు రాకుండా వీడే చేస్తున్నాడు

      ఇపుదు చెప్పండి ఎవరు ఎవరిని అణగదొక్కుతున్నారు. అర్హులైన బ్రాహ్మణ విద్యార్థులకు సీట్లు లేదా ఉద్యోగాలు ఇవ్వకపోతే దీర్ఘకాలంలో నష్టపోయేది ఎవరు? దేశం కాదా? వారంతా వేరే దేశాలకు వలస వెళ్ళిపోతే (ఇప్పటికే చాలా మంది వెళ్ళిపోయారు) మన దేశంలో ఆ మటుకు ప్రతిభ పోయినట్లే కదా? ఇంక మనకెక్కడ తయారవుతారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి ఇంజినీర్లు. తయారయినా ఇక్కడ ఉండరు.

      రిసర్వేషన్లు ఉండాలి - అది దేశ ప్రగతికి ఉపయోగపడాలి. చదువుకోలేని విద్యార్దులకు ఇవాండి. అందరికీ విద్య ఉచితం చేయండి. కష్టాల్లో ఉన్న వారికి చేయూతగా ఉండాలి రిసర్వేషన్లు. అంతేగానీ ఏ కష్టమూ లేకుండా మీరు డాక్టర్లూ ఇంజినీర్లు అవ్వండి మేము సీట్లిస్తాము మీరు ఓట్లేయ్యండి అంటే? దానివల్ల రాజకీయనాయకులు తప్ప లబ్ది పొందేవారు ఎవరు?
      కుల అహంకారాన్ని పక్కన పెట్టి ఆలోచించండి. ఇప్పటికి కూడా మా ముత్తాతల తరంలో మీరు మమ్మల్ని అణగదొక్కారు కాబట్టి మీకు శాస్తి జరగాలి అనుకుంటే చెప్పేదేమీ లేదు

      Delete
  8. Vijayaraghava Chilakapati
    12:26 PM

    brahmanaanaam anekatwam
    sarpaanaam ati nidratah
    gajaanaam manda buddhincha
    tribhir lokopakaarakam............peeveeaarke garu annatlu, kali vidambana prabhaavam idi anta....mee bhaavana
    bhavyam...anubhavaika vedyam.
    subhamastu.
    cvraghava

    ReplyDelete
  9. బ్రాహ్మణులు వారి వారి ధర్మాలనుండి తప్పకుండా ఆచరిస్తూ పోతే మిగతా వర్ణాల వారు కూడా వారి ధర్మాలను ఆచరిస్తారు. బ్రాహ్మణుడు ఇంతకు పూర్వం పరమ ఆచరపరంగా ఉండేవాడు. ధనాన్ని తృణీకరించే వాడు, బిక్షతో జీవించే వాడు, వేదాలను నిరంతరం అధ్యాయనం చేసేవాడు, యజ్ఞ్య యాగాదులు చేస్తూ నిరంతరం ధర్మపరాయణుడై ఉండేవాడు. దేవతలనతా మంత్ర అధీనులు. మంత్రాలంతా బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేవి. రాజులతో సహా అందరూ వారి కాళ్ళ మీద పడేవారు. గడ్డిపోచని కూడా పర్వతంగా మార్చగల శక్తి అప్పటి 'బ్రాహ్మణులకూ ఉండేది. అయినా వారు శాంతితో సహనంతో దయతో ఉండేవారు. బ్రాహ్మణుడి శరీరం భోగాలకు కాదు అని వేద వాక్యం. అలా ఉండేవారు అప్పట్లో. ఈనాడు మనం చూస్తున్న (కొంతమంది) బ్రాహ్మణులు ఆచారన్ని అనుష్ఠానాన్ని వదిలివేసారు. సంధ్యాదులు చేయడం మనేసారు. వేదం తపసు యజ్ఞ్యం యాగం లాంటి మాటలే వినపడవు. కొంతమంది ఇంకొంచెం ముందుకు పోయి నిషిద్ద కర్మలు (మద్యం మాంసం ) చేస్తున్నారు.
    అప్పట్లో బ్రాహ్మణులు వారి ధర్మాన్ని గట్టిగా పట్టుకోవడం వలన అన్ని వర్ణాల వారు చాలా గౌరవంగా చూసేవారు. ఇప్పుడు బ్రాహ్మణులు వారి ధర్మం నుండి జారడం వలన మిగిలిన వర్ణాల వారు ప్రశ్నిస్తున్నారు 'మీరేం చేసారని మీరు గొప్పవారిగా అంగీకరించాలీ? అని దానికి సమాధానం దొరకదు నేటి బ్రాహ్మణుల దగ్గర. ఎందుకంటే (మాంసం తినడం లాంటి కొన్ని పనులు తప్ప) మిగతా వర్ణాల వారు చేసే ప్రతీ పనీ బ్రాహ్మణులూ చేస్తున్నారు.

    ఎవరో మనకేదో అన్యాయం చేసారని బాధపడటం ఎందుకు మన పురాణాలు శాస్త్రాలు చెప్పలేదా -ధర్మాన్ని రక్షించినవాడిని ధర్మం రక్షిస్తుందని. రామచంద్రుని వంటి వారు ఆచరించి చూపలేదా ఆ విషయాన్ని. ఎవరో అణగదొక్కారు అని బాధపడటం ఎందుకు? స్వధర్మానుష్ఠనాన్ని వదిలిపెట్టని బ్రాహ్మణులు ఇప్పటికీ లేరా? వారిలో తేజస్సు తరగలేదే? మన పని మనం సరిగా చేయక వేరే మతాల వారిని ఎందుకు నిందించడం.

    ముందుగా బ్రాహ్మణులు గుర్తించాల్సింది ఏమిటంటే - వచ్చిన బ్రాహ్మణ శరీరం భోగాల గురించి కాదు. ' వాడు పార్టీలకు రెస్టారెంట్లకూ వెళ్తున్నాడు, వాళ్ళెవరో సినిమాలు చూస్తున్నారు. బ్రాహ్మణులదేమి తక్కువ మేము కూడా అలాగే చేస్తాం' అనుకునేకన్నా. బ్రాహ్మణ శరీరం వచ్చింది తపసుకి వేదాధ్యాయనానికి శాస్త్రాధ్యయనానికి అని గుర్తించి శ్రుతులలో చెప్పబడిన బ్రాహ్మణ ధర్మాన్ని పాటిస్తూ ఉంటే అడగకుండానే పూర్వ వైభవం వస్తుంది. దీనికి ఎంతో విశ్వాసం ఓరిమీ అవసరం. అది మీకు ఉందా? ఉంటే ఆడంబరాలనూ భోగాలను తగ్గించుకోవాలి. పుట్టకుతో రాదు బ్రాహ్మణత్వం - జన్మనా జాయతే శూద్ర: కర్మణా ద్విజ ఉచ్యతే అంటుంది భారతం. బ్రహ్మజ్ఞ్యానం ఉన్న వాడిని బ్రాహ్మణులు అంటారు. ఆ జ్ఞ్యానం వచ్చాక మేము అధికులమని పక్కవారు అధములనే తేడాలు ఉండవు. అందరు భగవంతుని సృష్టి. జీవులంతా వారి వారి కర్మానుసారం పొంది శరీరాలు ఇవి. ఉన్నదంతా ఒక్కటే అని అర్థమయి, అవమానలను , పొగడ్తలనూ ఒక్క తీరుగా తీసుకునే స్థితి వస్తుంది. అప్పుడు ఎటువంటి భేధమూ ఉండదు. అలాంటి స్థితి వచ్చాక అడగకుండానే అందరూ మీ పాదక్రాంతులవుతారు. అలాంటి వారు చెప్పిందే సత్యమవుతుంది. దీనికంతటికీ ఎంతో సాధన అవసరం. ఇవి ఏమి కలగకనే బ్రాహ్మణులుగా జన్మించామని - మాది అగ్రవర్ణమని అనుకుంటే దాని వల్ల వచ్చే ప్రయోజనమేముంది. భగవంతుని దయతో వచ్చిన ఉత్తమ జన్మని ఇలా ఒకరు మనల్ని అణగదొక్కుతున్నారనో గౌరవించలేదనో అనుకుంటూ సమయం గడిపే బదులు భగవదర్పితంగా యజ్ఞ్యా దాన తప: కర్మలు చేసి అంతటా ఆయనే ఉన్నాడన్న భావాన్ని గనుక అలవరుచుకుంటే మళ్ళీ ఇక జన్మే ఉండదు కదా?
    చెప్పిన దాంట్లో తప్పులుంటే పెద్దలు సహృదయంతో మన్నించాలి

    ReplyDelete
  10. అందరికి నమస్కారం! మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి!! చాలు!!!
    సార్వభౌమగారు మీ మాటల్లో ద్వేషమే ధ్వనిస్తోంది,ఆలోచించుకోండి.

    ReplyDelete
  11. ఒబామా ప్రభుత్వంలో దాదాపు అన్ని శాఖలలో ముఖ్య పదవుల్లో ఇండియాన్స్ ఉన్నా రని చదివాను. ఎక్కడనుండి వచ్చారు? జీవితంలో క్రిందపడితే దుమ్ము దులుపుకుని లేచి ముందుకు పోయే వాళ్ళే గెలిచేది. నల్లవాడు ఒబామా ఎల్లా ప్రెసిడెంట్ అయ్యాడు. మా పూర్వికులు బానిసలుగా ఊడిగం చేశారని ఊర్కేనే కూర్చోలేదు. జీవితంలో బాగు పడటానికి ఏమి కావాలో తెలుసుకున్నాడు. ఆచరించాడు. వెయ్యేళ్ళు రిజర్వేషన్లు ఉంచినా జరిగేది ఒకటే. తెలివి ఉన్నవాళ్ళు దేశం ఒదిలి పోతారు. విదేశాలకు వెళ్ళిన వారు దాదాపు అందరూ జేబులో నయా పైసా లేకుండా వెళ్ళిన వారే. తెలివి ఉన్నవారు ఏమిచెయ్యాలో తెలుసుకుంటారు ఆచరించటానికి ప్రయత్నిస్తారు.

    ReplyDelete
  12. జ్వాలా గారు , మీరు రాసిన ఈ కథనము నన్ను చాలా అలొపింపచెసింది. నెను చదువుకునె రొజులనుంచి ఇప్పటిదాకా మన స్వతంత్ర భారత రాజ్యాంగ వ్యవస్థ లొ జరిగె చాలా పతకాలని వాటి విలువలని గమనిస్తునె ఉన్నాను. ఓక సహయం లెక సమజిక స్థైర్యాన్ని ఇచ్చె రెసెర్వషన్ వ్యవస్థ చాలమటుకు సమాజం లొ విపరీతమయన మర్పులని తీసుకువచ్చింది.


    ఓక చిన్న ఉదాహరణ : నెను కళషాల లొ ఎం బీ ఏ కొర్సు చెసెటప్పుడు ,పది మంది సహవిధ్యార్థులు రెసెర్వషన్ ద్వరా వచ్చినవరున్నారు ; అందులొ కొంత మంది అసలు కొర్సులు ఆసక్తి లెని వాల్లు ,ఫీస్ రె-ఇంబుర్సెమెంట్ పథకాన్ని చెర్తిఫిచతె సంపదించుకొవడనికి వాడుకుని కలాసాల కి వచ్చె వారె కాదు ; అదెకాక ఆ ఉచిత సమయం లొ ప్రభుత్వం వరి ఉద్యొగెతర రెసెర్వెషన్లకు సంబంధించి ఇతర కొర్సులు లెక పరిక్షల కు ప్రధన్యం ఇచ్చె వారు. ఈ ఉదహరణ లొ గమనార్హమయ్న విషయమెమిటంటె పుస్తకలాయం లొ పుస్తకాలు కుడ రెసెర్వెషన్ ప్రకారము ఎక్కువ ఇచ్హెవరు .

    పొని ఈ వ్యవస్థ వల్ల రెసెర్వెషన్ వాడుకున్న వాళ్ళకి వొచ్చె ఉప్యొగమెమయన ఉందా : నా ఉద్ద్యెస్యములొ ఇది ఒక వ్యర్థ ప్రయాసమె ఎందుకంటె ఇద్దరికి అందవలసిన సహాయము ఒక్కరె వాడుకుంటున్నరు కాబట్టి.

    ఇల రెసెర్వెషన్ వ్యవస్థలొ ఉన్న చాలా లొపలె ఈరొజు మన దెషాన్ని కుదిపెస్తున్నాయి (There could be lot of mistakes in my telugu because of an online tool i used ; pls ignore)

    ReplyDelete
  13. వనం గారు, మీరు ఒక ప్రశ్న వేసారు -

    "ఎప్పుడో, వేల ఏళ్ల క్రితం అప్పటి బ్రాహ్మణులు ఏదో చేశారన్న నెపంతో ఈ తరం బ్రాహ్మణులను ఇలా ఇబ్బందులకు గురి చేయడం భావ్యమా?"

    నిజ్జం గా వేల ఏండ్ల క్రితం బ్రాహ్మణులు అత్యాచారాలు చేసారని చారిత్రాత్కమైన రుజువు మీకు ఏ పుస్తకంలోనైన దొరికిందా. నేను చాల research చేస్తున్నాను కాని చతుర్వర్ణాల గురించి వున్నాయి గాని ఎక్కడ కుల ప్రాతిపదికపై అత్యాచారం గురించి నాకు దొరకలేదు. శంబుకుడి వృత్తాంతం తప్ప నాకు మరియొకటి కనుపడలేదు. అది శంకర వృత్తాంతం అత్యాచారం క్రింద రాదు కదా.

    నా ఉద్దేశ్యంలో బ్రాహ్మణ అత్యాచారాలు బ్రిటిష్ హయం నుంచి మొదలయ్యాయని నేను అనుకుంటున్నాను

    సుధేష్

    ReplyDelete