"ఇంటర్వ్యూ"
కి చిట్కాలున్నాయి!:
వనం
జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి ఆదివారం సంచిక
(03-03-1991)
అడిగేవాడికి చెప్పేవాడు లోకువని అంటారు. అందుకే, ఇంటర్వ్యూకి
వెళ్లడం ఓ భయంకరమైన అనుభవం అనాలి. మొట్టమొదటి సారిగా వెళ్లేవారికి, తయారు కాకుండా ఇంటర్వ్యూకి పొయ్యే వారికీ మరీ ఇబ్బందీ నూ. అలాంటి వారికి కొన్ని
చిట్కాలు:
ఉద్యోగం కావాలంటే వ్రాత పరీక్షలు, మౌఖిక పరీక్షలు తప్పనిసరి. ఉద్యోగం
కోరుకునే వారి వ్యక్తిత్వం, అభిరుచులు, అర్హతలు, తెలుసుకునేటందుకే ఇంటర్వ్యూలు జరుపుతారు. అందుకే
వ్రాత పరీక్ష ఎంత ముఖ్యమైందో, మౌఖిక పరీక్ష కూడా అంతే ముఖ్యమైంది.
·
ఇంటర్వ్యూకి వెళ్లే ముందు, కావాలనుకుంటున్న
ఉద్యోగం లాంటిదే చేస్తున్న వారిని కలిసి మాట్లాడి విషయాలు తెలుసుకోవాలి. కల్సిన వ్యక్తి
నుంచి పూర్తి సమాచారం దొరకక పోవచ్చునేమోకాని, ఆ ఉద్యోగంలో ఏం
చేయాలి, చేయడానికి అర్హతలున్నాయా? లేవా?
అనే విషయాలు తెలుసుకోవచ్చు. ఇవెంతో ఉపయోగపడతాయి.
·
వార్తా పత్రికలతో పాటు, విజ్ఞానాన్నందించే
మాగజైన్లు, పుస్తకాలు చదివే అలవాటు చేసుకోవాలి.
·
పుట్టు పూర్వోత్తరాలు, అభిరుచులు,
అనుభవం గురించి తయారు చేసిన బయోడేటాలోని విషయాల గురించి ఏమడిగినా సమాధానం
చెప్పగలగాలి.
·
చేరదల్చుకున్న సంస్థ గురించి క్షుణ్ణంగా తెల్సుకుని
వెళ్లాలి.
·
ఎందుకీ ఉద్యోగంలో చేరదల్చు కుంటున్నదీ చెప్పగలగాలి.
·
ఇంటర్వ్యూ గదిలోకి ఎలా వెళ్లాలి, ఏం చేయాలి
అనే విషయంలో కూడా జాగ్రత్త వహించాలి.
·
తలుపుపై మెల్లగా శబ్దం చేయాలి. తలుపు తెరిచి, లోనికి
ప్రవేశించడానికి అనుమతి కోరాలి. అనుమతి రాగానే, మెల్లగా,
అటు కదులుతూ, ఇంటర్వ్యూ పానెల్ లో వున్న వారికి
వినబడేట్లు వారిని విష చేయాలి. అలా చేస్తూ సభ్యులందరి వైపూ, ఒక్క
సారి త్వరగా చూపు మరల్చాలి. కూర్చోమన్న దాకా వేచి వుండి, ఆ తరువాతే
ఉద్దేశించిన కుర్చీలో కూర్చోవాలి. ఇవన్నీ చాలా ముఖ్యం.
·
భయం, సిగ్గు ప్రదర్శించరాదు. ఈ ఉద్యోగం
దొరక్కపోతే, ఇలాంటివి ఇంకెన్నో వున్నాయి అనుకొని ధైర్యంగా వుండాలి.
·
సమాధానాలు ఇస్తున్నప్పుడు, ప్రశ్న
వేసిన సభ్యుడి వైపే చూడకుండా, అందరి వైపూ చూస్తుండాలి. చెప్పేది
వారికి వినపడాలి. అర్థ మవ్వాలి. మధ్య, మధ్య చిరునవ్వు మొహంతో,
అసభ్యమైన పదజాలం వాడకుండా జాగ్రత్త పడాలి.
·
కాలిమీద కాలు వేసుకుని కూర్చోవడం, తలను గోక్కొనడం
చేయరాదు. ప్రశ్నలడగని వ్యక్తే ఇంటర్వ్యూలో ముఖ్యమైన వ్యక్తి కావచ్చునేమో నని గమనించాలి.
సమాధానం తెలియకపోతే అబద్ధాలు చెప్పి బుకాయించ వద్దు. బాగా తెలిస్తే, వచ్చిందంతా క్లుప్తంగా చెప్పాలి. కొద్దిగా తెలిస్తే, అంతవరకే చెప్పాలి. అనవసరంగా వాగ్వివాదానికి దిగ వద్దు.
(ఆంధ్ర జ్యోతి ఆదివారం సంచికలో 21 సంవత్సరాల క్రితం నేను
రాసిన వ్యాసం)
No comments:
Post a Comment