Friday, January 3, 2014

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) రామాయణంలో ఛందః ప్రయోగాలు-అయోధ్యా కాండ -7: వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి
రామాయణంలో ఛందః ప్రయోగాలు
అయోధ్యా కాండ -7
వనం జ్వాలా నరసింహారావు

ఎట్టకేలకు శ్రీరాముడు అడవులకు పోవడానికి సమ్మతించాడు దశరథుడు. కొడుకుకు మేలుకలగాలని, శీఘ్రంగా తిరిగిరావాలని ఆశీర్వదించాడు. అయితే ఒక్క రాత్రి తనతో గడిపి అడవికి పొమ్మని కోరాడు. ఒక్కపూటైనా శ్రీరాముడితో హాయిగా గడపాలని వుందంటాడు. శ్రీరాముడు మరోసారి తన మనో నిశ్చయాన్ని తెలియచేశాడు తండ్రికి. ఆయన ప్రమాణం వ్యర్థం కాకుండా సార్థకమయ్యేవిధంగా తనను అడవికి పోనిమ్మని వేడుకుంటాడు. భరతుడికి రాజ్యభారం అప్పగించమని కోరాడు. అయోధ్యలో ఇంకేమాత్రం వుండి జాగుచేయ దల్చుకోలేదంటాడు. తనకొరకు తండ్రి క్రూరమైన నిట్టూర్పులు విడవొద్దంటాడు. ఇక్కడొక పద్యాన్ని "ఇంద్రవంశము" వృత్తంలో రాసారు కవి.



ఇంద్రవంశము:             ధీమజ్జనుల్  మెచ్చెడి దేవరానతిన్
                                నేమంబుమైఁ దీర్పఁ గ  నేనుగోరిన
                                ట్లీ మేలిభోగంబుల నిచ్చగింపఁ జూ
                                భూమీశ  నాకై  యిటు పొక్క  నేటికిన్ - 26

ఛందస్సు:      ఇంద్రవంశ వృత్తానికి ద-త-జ-ర గణాలు తొమ్మిదో అక్షరం యతి.


తాత్పర్యం:     బుద్ధిమంతులు మెచ్చే నీ (దశరథుడి) ఆజ్ఞను నియమంతో, వ్రతంగా బూని నెరవేర్చే నేను, ఈ శ్రేష్ఠమైన భోగాలను కోరను సుమా ! రాజా, ఎందుకు నాకోసం వ్యసనపడతావు ?

No comments:

Post a Comment