Sunday, October 29, 2017

పరిణామవాదానికి లేదు ప్రాణ భయం! .....వనం జ్వాలా నరసింహా రావు

పరిణామవాదానికి లేదు ప్రాణ భయం!
వనం జ్వాలా నరసింహా రావు
ఆంధ్రభూమి దినపత్రిక (30-10-2017)

          ఆంధ్రవాల్మీకి, కవిసార్వభౌమ వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు) శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం మందరం, అయోధ్యాకండ చివర్లో శ్రీరాముడి దినచర్య గురించి వివరించారు. సాధువులను రక్షించడానికి, పాపాత్ములను నాశనం చేయడానికి, ధర్మ స్థాపన కొరకు, ప్రతియుగంలో శ్రీమన్నారాయణుడు భూమ్మీద అవతరిస్తుంటాడు. ఈ అవతారాలే మళ్లీ-మళ్లీ పునరావృతమవడం వల్ల, ఇప్పటికి ఎన్ని మత్స్యావతారాలు, నృసింహావతారాలు, శ్రీరామావతారాలు, కృష్ణావతారాలు అయ్యాయో చెప్పడం కష్టం. మళ్లీ-మళ్లీ అవతారాలు వచ్చినప్పుడు, వారితో పాటే మళ్లీ-మళ్లీ హిరణ్యాక్ష-హిరణ్యకశిపులు, బలిచక్రవర్తి, రావణ-కుంభకర్ణులు,  కంస-శిశుపాలులు లాంటి వారు కూడా రావాలికదా? వారు వచ్చినప్పుడు వారి సహాయకులు, సహచరులు, తల్లిదండ్రులు, అవతార పురుషుడికి కావాల్సినవారు రావాలి కదా? అలాంటప్పుడు పరిణామవాదం తప్పవుతుంది కదా? అలాగే ముక్తి, జన్మరాహిత్యం అనే పదాలు వ్యర్తమైనవే కదా?

         అవతారాలు రావడం నిజమే. వారికి కావాల్సినవారు, విరోధులు రావడం కూడా నిజమే. బ్రహ్మేంద్రాదులు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, సప్తర్షులు....అందరూ పుట్టడం యదార్థమే. అయినా పరిణామ వాదం తప్పుకాదు. ముక్తి అనేది వ్యర్థపదం కానేకాదు. బ్రహ్మ, రుద్ర, అగ్ని, వరుణుడు...లాంటి పదాలన్నీ ఆయా పదవుల పేర్లే కాని ఆ ఉపాధిలో వుండే జీవాత్మల పేర్లు కావు. కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ అనే పదవుల్లో వుండేవారు మళ్లీ-మళ్లీ వచ్చారంటే, అదే మనిషి వచ్చాడని అర్థం కాదు. అలాగే బ్రహ్మ, రుద్ర, అగ్ని, వరుణుడు అనే పదవుల్లో వున్నవారు పోగానే, ఆ స్థానం ఖాళీ కాగానే, మరో అర్హుడు ఆ స్థానంలో నియమించబడుతాడు. వాడి ఉద్యోగం వాడు చేస్తాడు. ఇలా వచ్చేవాడు భిన్న జీవుడే కాని ఇంతకు ముందు వున్నవాడు కాదు. కాబట్టి పరిణామ వాదానికి ప్రాణ భయం లేదు.....ముక్తుడికి పునర్జన్మ భయం లేదు. ఒక స్థానంలో రెండు జీవులుండవు. జీవయాత్రా విషయంలో పరిణామమే సరైన మార్గం.

         బ్రహ్మాండకోటులు అనంతం. జీవకోటులూ అనంతమే. ప్రపంచం నిత్యం. సంసారం నిత్యం. కాలం నిత్యం. నది ఒడ్డున నిలుచుని చూస్తుంటే నీళ్లు, నీటి బిందువులు దాటిపోతూనే వుంటాయి. వాటి స్థానంలో మరికొన్ని వస్తాయి. ఒక నీటి బిందువు సముద్రంలో ప్రవేశించగానే ఆద్యంతాలలో శూన్య స్థానం లేనట్లే, జీవుడు ముక్తుడు కాగానే ఆ స్థానంలో కాని, ఆదిలో కాని, శూన్యం వుండదు.

         శ్రీరామవతారం వైవస్వత మన్వంతరంలో ఐదవ మహాయుగమైన త్రేతాయుగంలో సంభవించింది. కృతయుగానికి 1728000 సంవత్సరాలు, త్రేతాయుగానికి 1296000 సంవత్సరాలు, ద్వాపరయుగానికి 864000 సంవత్సరాలు, కలియుగానికి 387000 సంవత్సరాలు కలిపి మొత్తం ఒక మహాయుగానికి 4275000 సంవత్సరాలు వుంటాయి. ఇలాంటి వేయి మహాయుగాలు బ్రహ్మకు ఒక పగలు, మరో వేయి మహాయుగాలు ఒక రాత్రి అవుతుంది. ఇవి రెండూ కలిస్తే ఒక రోజవుతుంది. దాన్నే కల్పం అంటారు. 360 కల్పాలు బ్రహ్మకు ఒక సంవత్సరం. 36000 కల్పాలు బ్రహ్మాయువు.

         త్రిమూర్తులలో అవతారాలు ఒక్క విష్ణువుకే కాని మిగతా ఇద్దరికీ లేవు. విష్ణువు రాజసుడైన బ్రహ్మను సృష్టికార్యానికి, తామసుడైన శివుడిని సంహారకార్యానికి, నియమించి, రక్షాభారాన్ని తనమీద వేసుకుని, దానికి అవసరమైన విధంగా ప్రవర్తించాడు. ఆ క్రమంలోనే మనిషి రూపంలో త్రేతాయుగంలో, రామావతారంగా జన్మించాడు.

         శ్రీరాముడి జనన కాలంలో గురువు, చంద్రుడు, కర్కాటక లగ్నంలో వున్నారు. అంటే జన్మ లగ్నం కర్కాటకం కాగా, మేషంలో రవి-బుధులు, తులలో శని, మకరంలో కుజుడు, మీనంలో శుక్రుడు వున్నారు. ఆయన పుట్టిన సంవత్సరం విలంబి. నక్షత్రం పునర్వసువు. ఇది నిర్ధారించడానికి శ్రీమద్రామాయణంలో ఆధారాలు లేవు. శ్రీరంగమహాత్మ్యం అనే గ్రంథంలో భగవంతుడు బ్రహ్మకు చెప్పిన మాటల ఆధారంగా కొంత తెలుస్తున్నది. తాను రఘువంశం వారు పాలించే అయోధ్యకు పోవాలని అనుకుంటున్నాననీ, అక్కడ నాలుగు మహాయుగాలుంటాననీ, ఆ తరువాత కావేరీ తీరానికి పోయి చంద్ర పుష్కరిణీ తీరంలో శయనిస్తాననీ చెప్పాడు బ్రహ్మతో. విష్ణువు ఆజ్ఞానుసారం బ్రహ్మ తాను అర్చిస్తున్న శ్రీరంగధామాన్ని ఇక్ష్వాకు మహారాజుకు ఇచ్చాడు.

         తదనంతరం జరిగిన పరిణామంలో, ఐదవ త్రేతాయుగంలో కొడుకులకై దశరథుడు అశ్వమేధ యాగాన్ని చేశాడు. ఆ యుగంలోనే శ్రీరామ జననం అయింది. జన్మించింది విలంబినామ సంవత్సరం కాబట్టి హేవిలంబిలో అశ్వమేధయాగం, పుత్రకామేష్టి చేశాడు. దుర్ముఖి చైత్రమాసంలో అశ్వం విడిచారు. పునర్వసువు నక్షత్రంలో బుధవారం నాడు శ్రీరామజననం. భరతుడు గురువారం పుష్యా నక్షత్రంలోను, లక్ష్మణ-శత్రుఘ్నులు శుక్రవారం ఆశ్లేషా నక్షత్రంలోనూ జన్మించారు. చైత్ర బహుళ పంచమి నాడు నామకరణం జరిగింది. పరాభవ సంవత్సరంలో తొమ్మిదో ఏట ఉపనయనం జరిగింది. అరణ్యవాసానికి పోయేటప్పుడు శ్రీరాముడికి 25 సంవత్సరాలు కాగా, సీతాదేవికి 18 సంవత్సరాలు. శ్రీరాముడికి 12 ఏళ్ల వయసున్నప్పుడు, సౌమ్యనామ సంవత్సరంలో యాగరక్షణ కొరకు విశ్వామిత్రుడి వెంట అరణ్యాలకు పోయాడు. ఈ విషయం మారీచుడు రావణాసురుడితో సీతాపహరణం ముందర చెప్పినట్లు రామాయణంలో వుంది. దశరథుడు విశ్వామిత్రుడికి చెప్పిన మాటలనే మారీచుడు రావణుడికి చెప్పాడు.

శ్రీరాముడికి 12 సంవత్సరాల వయసున్నప్పుడు, సీతకు ఆరేళ్ళ వయసులో వారి వివాహం జరిగింది. దీనికి దృష్టాంతరంగా విశ్వామిత్రుడి యాగం కాపాడడానికి రామలక్ష్మణులు వెళ్లిన రోజు నుంచి మిథిలా నగరం వెళ్లడం వరకు తీసుకోవచ్చు. సౌమ్యనామ సంవత్సరం మాఖ బహుళంలో శ్రీరామలక్ష్మణులు విశ్వామిత్రుడి వెంట పోయారు. 15 వ నాటి ఉదయం మిథిలా ప్రవేశం చేసి, శివ ధనుర్భంగం చేశాడు. 27 వ రోజున శుక్ల త్రయోదశి శుభ దినం కాబట్టి, ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో సీతారాముల కల్యాణం జరిగింది. ఉత్తర ఫల్గుణీ నక్షత్రం శ్రీరాముడి జన్మ నక్షత్రానికి ఆరవది.


అంటే, 27 వ రోజు ఫాల్గున శుద్ధ త్రయోదశి అయితే, అయోధ్య నుండి బయల్దేరిన రోజు మాఘబహుళ విదియ కావాలి. విదియ-హస్తా రోజు ప్రయాణానికి మంచి రోజే. అది శ్రీరాముడికి ధృవతార కూడా అవుతుంది. కాబట్టి ఆ రోజున హస్త పోయిన తరువాత అభిజిల్లగ్నంలో ప్రయాణమై వుండాలి. సీతారాముల కళ్యాణమైన తరువాత, అంటే, బహుళ విదియతో ముగిసి, తదియనాడు జనకుడు బిడ్డలకు అరణాలిచ్సిన తరువాత, చవితినాడు అప్పగింతలై, ఫాల్గుణ బహుళ పంచమి నాడు అయోధ్యకు ప్రయాణమయ్యారు. షష్టి-సప్తముల్లో పరశురాముడి గర్వభంగం అయింది. దశమినాడు అయోధ్య ప్రవేశం జరిగింది. ఆ తరువాత 12 సంవత్సరాలు సుఖసంతోషాలతో గడిచింది. ఆ విధంగా బాల కాండ మొత్తం 24 సంవత్సరాల వృత్తాంతం.

దుందుభి నామ సంవత్సర చైత్ర శుద్ధ చవితినాడు దశరథుడు, శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలని పౌరులతో-మంత్రులతో ఆలోచన చేసి, పంచమి నాటి ఉదయం పుష్యా నక్షత్రంలో యౌవరాజ్య పట్టాభిషేకం జరిపించాలని నిర్ణయించాడు. మరో రకంగా చెప్పాలంటే, చైత్ర శుద్ధ పంచమే వనవాసారంభమైన రోజు. మర్నాడు గంగాతీర వాసం, ఆ మర్నాడు గుహుడి దర్శనం. అయోధ్య విడిచిన మూడో రోజు సప్తమినాడు జడలుజడలు ధరించడం, నాలుగోనాడు అష్టమి రోజున భరద్వాజాశ్రమం వెళ్లడం జరిగింది. ఐదవనాడు నవమిన యమున దాటారు. ఆరవనాడు దశమీ రోజున చిత్రకూటమి వెళ్లి వాల్మీకి దర్శనం చేసుకుని, పర్ణశాల నిర్మించుకున్నారు. అదే రోజున అక్కడ అయోధ్యలో దశరథుడు మరణించాడు.

శ్రీరాముడు అయోధ్య విడిచిన 17 వ రోజున భరతుడు అక్కడికి చేరుకున్నాడు. మర్నాడు తండ్రికి కర్మలు ప్రారంభించాడు. 29 వ రోజున కర్మకాండలన్నీ పూర్తయ్యాయి. మర్నాడు 30 వ రోజున వైశాఖ శుద్ధ చవితినాడు రాజకర్తలు భరతుడిని రాజ్యభారం వహించమని కోరారు. 31 వ రోజున పంచమీ నాడు సభకు వచ్చిన భరతుడిని వసిష్ఠుడు పట్టాభిషేకం చేసుకొమ్మని అడిగాడు....భరతుడు తిరస్కరించాడు. మర్నాడు వైశాఖ శుద్ధ షష్టి రోజున భరతుడు చిత్రకూటానికి బయల్దేరాడు. అదే రోజున గుహుడిని కలిశాడు. మర్నాడు సప్తమినాడు జడలు ధరించాడు....భరద్వాజుడి విందు స్వీకరించాడు. 34 వ రోజున, వైశాఖ శుద్ధ అష్టమి నాడు, చిత్రకూటానికి బయల్దేరి శ్రీరామదర్శనం చేసుకున్నాడు. అదే రోజున రాముడు తండ్రికి నీళ్లు విడిచాడు. 35 వ రోజున రామ-భరత సంభాషణ అనంతరం మర్నాడు భరతుడికి తన పాదుకలను ఇచ్చాడు శ్రీరాముడు. అదే రోజు, అంటే, వైశాఖ శుద్ధ దశమిన భరతుడు అయోధ్యకు చేరాడు. 37 వ రోజున వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు భరతుడు నందిగ్రామం చేరాడు.


భరతుడు వెళ్ళిపోయిన తరువాత పౌర్ణమి వరకు చిత్రకూటం లోనే వుండి సీతారామలక్ష్మణులు, వైశాఖ బహుళ పాడ్యమినాడు అత్రి ఆశ్రమానికి చేరారు. సీత అనసూయతో సంభాషణ చేసింది కూడా ఆ రోజో లేదా మరునాడో అయ్యుండాలి.....ఎందుకంటే అనసూయ చంద్రవర్ణన చేసింది కాబట్టి....ఏదేమైనా ప్రాణ భయం లేనిదే పరిణామవాదం! END

సీతాదేవిని చూసి తర్కించుకుంటున్న హనుమంతుడు ...... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు

సీతాదేవిని చూసి తర్కించుకుంటున్న హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (30-10-2017)

మాసిన చీరతో, ధైర్యం చెడిన మనస్సుతో, ఆహారం తీసుకోనందున శుష్కించిన దేహంతో,  నిట్టూర్పులతో, ఈమె సీతేనని గుర్తించలేని దేహకాంతితో, బాధిస్తున్న రాక్షస స్త్రీలమధ్యన కనిపించిందొక సుందరి హనుమంతుడికి. చంద్రుడి లాంటి కోమలమైన దేహంకల ఆ స్త్రీ, హోమధూమంతో కప్పబడి, అగ్నిశిఖలా అందంచెడి, మిక్కిలి బాధపడ్తూ కనిపించింది. పదినెలలుగా స్నానం లేక దుమ్ముతో మునిగిన దేహంతో, తామరపూలులేని కొలనులా, ఒంటి చీరెతో, దుఃఖంతో, శుష్కించిపోయి, అంగారకుడు పట్టుకున్న కాంతి విహీనమైన రోహిణిలాగుంది. కన్నీళ్లు కాలువలు కారుతూ ముఖమంతా ఆవరించి, దుఃఖంతో శోషించి, వెక్కి, వెక్కి ఏడుస్తూ, రాక్షస స్త్రీసమూహాలనే చూస్తూ, ఒంటరిగా, వేటకుక్కలకు చిక్కిన ఆడజింకలా అల్లాడుతూ, నడుంవరకు వ్రేలాడుతున్న నల్లటి త్రాచుపాములాంటి ఒంటి జడతో, శరత్కాలోదయాన కారడువుల్లోని భూమిని పోలి, స్నానంలేనందువల్ల సంపూర్ణంగా మాసిన దేహంతో వున్న స్త్రీని చూసాడు హనుమంతుడు. ఆమెను చూస్తున్టే: ఇంతవరకు దిగులంటే ఏంటో తెలియనిదానిలా, ఇప్పుడు తీవ్రమైన దిగులుతో మాడిపోతున్నదానిలా, మిక్కిలి సుఖానికి యోగ్యమైన దానిలా, మిక్కిలి దుఃఖంపడే స్త్రీలా అనిపించింది హనుమంతుడికి.

ఆహారంలేకుండా శుష్కించి, పదినెలలుగా స్నానం చేసినదానిలాలేని, మాసిన దేహంతోవున్న ఆ స్త్రీ, సీతేనా అని తర్కించుకుంటాడు హనుమంతుడు. ఆమె సీతాదేవేనని నిశ్చయించుకోవటానికి కారణాలు వెతుకుతాడు. ఆనాడు ఋశ్యమూకపర్వతం పైనుండి రావణుడు అపహరించుకుని పోతున్నప్పుడు చూసిన సుందరరూపాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటాడు మొదలు. ఆ రూపమే ఈమెలో కనిపిస్తున్నదికదా అని మరల-మరల చూస్తాడు నిర్ధారణగా (ఈవిధంగా పోల్చి చూడటాన్నే "ప్రత్యభిజ్ఞ" అంటారు). ఆనాటి ఆస్త్రీరూపాన్ని గుర్తుతెచ్చుకుంటూ, ఇప్పుడు తనుచూస్తున్న స్త్రీని ఆ రూపంతో పోల్చుకుంటూ, ఆమెను వర్ణించుకుంటాడిలా: "పూర్ణచంద్రుడిలాంటి ముఖం, అందమైన కనుబొమ్మలు, వట్రువలగు స్తనాలు, పొడవైన నల్లటి వెంట్రుకలు, చీకటిని హరించే దేహకాంతి, దొండపండులాంటి పెదవులు, సింహం నడుములాంటి సన్నని నడుము, తీర్చిదిద్దిన పాదాలు, తామర రేకుల్లాంటి కళ్లు, రతీదేవిని పోలిన సౌందర్యం, సర్వజనులకు అభీష్టమైన చంద్రుడిలాంటి ముఖం, తపస్సు చేసుకునేదాని పోలికలు, తివాచీలు, చాపలు లేకపోవడంతో నిలబడేవున్న ఆకారం, పొగనిండిన అగ్నిలా తాపంతో సోంపు తగ్గిన వన్నె, అసత్యంలాంటి అపకీర్తి కారణాన ఆశచెడినదాని రూపంతో, బుసకొట్తున్న ఆడపాములా నిట్టూర్పులు విడుస్తూ" వున్నదామె.


ఆమెలో "స్థిరపడని, కుదుటపడని శ్రధ్ధ; సందేహం కలిగించే స్మృతి వాక్యమ్; క్షయించిన సంపద; కల్మషంతో కూడిన బుధ్ధి; విఘ్నమైనకార్యఫలంలో వుండే లక్షణాలను" చూస్తాడు హనుమంతుడు. శ్రీరామచంద్రుడి జాడ తెలియక పరితపిస్తూ, రావణుడి చేజిక్కి దిగులుపడుతూ, భర్త రాకపోతాడా అని నాలుగు దిక్కులు పరికించి చూస్తూ, ఒంటరిగా చిక్కి బెదురు చూపులు చూసే ఆడలేడి కళ్లలాంటి కళ్లతో, కన్నీరు కాల్వలై పారగా కనురెప్పలు తెరుస్తూ, మూస్తూ, వాడిపోయిన ముఖంతో దుఃఖిస్తూ, వేడి నిట్టూర్పులు వెంట-వెంట విడుస్తూ, దుమ్ములో మునిగిన దేహంతో, శోకంతో మలమల మాడుతూ కనిపించిందామె. శ్రేష్టమైన అలంకారాలకు అర్హురాలైనప్పటికీ, ఆభరణాలేవీ ఒంటిమీద లేనేలేవు. మేఘాల చాటునున్న చంద్రుడిలా ప్రభమాసి వుంది. అలవాటు తప్పి మతిమరుపుతో చదువుతున్నదానిలా వుంది. మాట్లాడే మాటలు వ్యాకరణ శుద్ధంకాకుండా వేరే అర్థం వచ్చేరీతిలో వున్నాయి. ఇలాంటి ఆమెను చూసిన హనుమంతుడు, ఈమె సీత కాదేమో, అవునేమో, లేక, రావణుడు బలాత్కారంగా తెచ్చిన స్త్రీలలో ఒకతేమో అనుకుంటాడు. సందేహం మాని, ఈమె సీతేనని నిర్ధారించుకుంటాడు. తన నిర్ణయానికి తానే కారణాలు వెతుక్కుని తృప్తి పడతాడు. తన నిర్ణయం సబబేనని తీర్మానించుకుంటాడు. 

(సీతాదేవి అని నిశ్చయించుకోవడానికి తగిన కారణాలను వెతుకుతున్న  హనుమంతుడికి తాను చూస్తున్న స్త్రీ ఎలావుందో వర్ణించుకుంటాడు. ఆమె తపస్సు చేసుకుంటున్న స్త్రీ లాగా వుందనీ, కుదుటపడని శ్రధ్ధ ఆమెలో కనిపించిందనీ, సందేహం కలిగించే స్మృతి కలదనీ భావిస్తాడు. తపస్సు చేసుకుంటున్న స్త్రీ లాగా వుందంటే, అది ఆమె జితేంద్రియత్వాన్నీ, భోగవిరాగాన్నీ, తెలియ చెప్పడమే. బుసకొడ్తున్న ఆడపామని అనడమంటే, పామును చేరదీసిన వాడు జీవించ లేనట్లే ఆమెను తెచ్చినవాడూ జీవించడని అర్థం. పొగక్రమ్మటంతో తెలియని అగ్నిలా వుందనడమంటే, పైన కాంతి కనబడకున్నా మనస్సు అగ్నిలా పరిశుధ్ధమైనదని అర్థం. అసత్యమైన అపకీర్తితో చెడినదంటే, ఈమెమీద నింద ఆరోపించిన వారు అసత్యవాదులని అర్థం.

కుదుటపడని శ్రధ్ధ: శాస్త్రాలలో చెప్పిన విధంగా ఫలానా పని చేస్తే ఫలానా ఫలితం కలుగుతుందన్న నమ్మకానికే "శ్రధ్ధ" అంటారు. ఆ శ్రధ్ధ ధృడంగా కుదరకపోతే, శాస్త్ర ప్రకారం చేయాలా-వద్దా? ఫలితం వస్తుందో-రాదో? అన్న మీమాంసలో పడిపోవడం జరుగుతుంది. సందేహం కలిగించు స్మృతి: ఇది హనుమంతుడి సందేహాన్నే తెలుపుతుంది. సీతాదేవి స్థితి ఇలావున్నని తెలుసుకోవాలి. ఐశ్వర్యవంతుడు దరిద్రుడైపోతే, వేషం-భాష మారిపోతుం. లోగడ చూసినప్పుడులాగా ఇప్పుడు వుండకపోవచ్చు. వేషం-భాష మారడంతో వాడు వీడేనా అన్న సందేహం కలుగుతుంది. బుధ్ధి నిష్కల్మశమై వుంటేనే నిశ్చయ జ్ఞానం కలుగుతుంది. కల్మశంతో కూడినప్పుడు యదార్ధ జ్ఞానం కలగదు. సందేహమే తోస్తుంది. విఘ్నం చేసిన కార్యఫలమంటే: ఏదైనా కార్యం చక్కగా చేస్తే ఫలహానిలేదు. అదే విఘ్నమైపోతే ఆపని చేసినవాడికి ఫలితం ప్రాప్తించదు. అదేవిధంగా సీత.  సీతాత్వానికి ఏ విధమైన హాని లేదు. అయినా ఆమె సీతే అని తెలుసుకోలేని లోపం ఆ మూడుఢిదె. ఆత్మావలోకమవడానికి ముందర, ఆత్మ జ్యోతి లాగా కనిపించిన వెలుతురుని చూసి భ్రమ పడ కూడదు. మండోదరిని చూసి హనుమంతుడు సీతని భ్రమ పడినట్లు పడకూడదు. అదే ఆత్మని సంతోషిస్తే, భ్రష్టుడవుతాడు. ఆచార్యలక్షణం....శాస్త్రాలు చెప్పిన పధ్ధతిలో ఆలోచించి, స్వబుధ్ధితో తర్కించి, వూహించి, నిశ్చయించుకోవాలి. అదే చేస్తున్నాడు హనుమంతుడు.)

Saturday, October 28, 2017

New Pension Scheme Debate to benefit TRS : Vanam Jwala Narasimha Rao

New Pension Scheme Debate to benefit TRS
Vanam Jwala Narasimha Rao
The Hans India (29-10-2017)
A debate on the Contributory Pension Scheme (CPS) in the State Assembly would turn out to be an opportunity for the ruling TRS party rather than the Congress, which included this as one of the 18 and odd subjects to be taken up for discussion in the House. If one browses over the need, concept and evolution of CPS, it would be noticed that, this was first implemented by the erstwhile Congress regime. The CPS is being implemented covering about 1.25 lakh employees who joined service after 2004 and the State government is making its part of contribution. There is adequate budgetary allocation too. There is no reason why Congress should resort to demanding a discussion on this against this background.
The then Prime Minister Atal Bihari Vajpayee announced the scheme as part of his budget speech for 2001-2002. He envisaged a new pension scheme based on defined contributions for new recruits entering Government Service after October 1, 2001. The reasons given were that the Central Government Pension liability reached unsustainable proportions. The Centre constituted a committee under senior a IAS officer Bhattacharya, to study the issue and the new pension scheme came into effect on December 22, 2003 basing on the recommendations of the Central panel. The states also accepted the scheme facilitating its implementation all over the country, barring perhaps West Bengal and Tripura.
In sequel to this, the then Government of Andhra Pradesh, sought a report on “pension scheme valuation, funding and rationalization of pension system” from a private agency which submitted its report to the Government. The same was referred to the Cabinet Sub-Committee in 2003 November. The report observed that the expenditure on pension has been increased multi dimensionally which would be unsustainable. The liability projections made then proved to be correct. For Telangana alone after bifurcation of the State it amounted to over Rs. 10, 000 Crores in the year 2016-17.
Since the then Government of Andhra Pradesh had already accumulated large pension liability it was suggested that there was an urgent need for shifting from the existing “Defined Benefit System” to “Defined Contributory System”.
Government of India introduced Contributory Pension Scheme in January 1, 2004. The then, Congress Government adopted the same to its employees of AP with effect from first September 2004 on the lines of Government of India and issued guidelines for implementation of the Scheme. It was made mandatory for each employee who is recruited on or after first September 2004 to become members of the Scheme. Each employee shall pay a monthly contribution of 10% of Basic Pay and Dearness Allowance from his salary to the Contributory Pension Scheme and a matching contribution will be made by the State Government.

Subsequently Parliament enacted Pension Fund Regulatory and Development Authority (PFRDA) Act in 2013.  The Central Government has also constituted the PFRDA to act as a regulator for the pension sector and to protect the interests of subscribers to schemes of pension funds and for matters connected therewith or incidental thereto. As such, as a regulator of New Pension Scheme, the PFRDA envisaged CPS architecture which consists of all the Nodal offices and intermediaries.
The contribution recovered from the salary of the employee every month, along with Government contribution will be adjusted and transferred to Pension Fund Regulatory Development Authority on monthly basis. In the new pension scheme the total employees including State Autonomous bodies are 1,25,190 and they are being covered in the State of Telangana.
The features of CPS are very interesting to note.
The contributions and investment returns would be deposited in a “non-withdrawable pension tier-I account”. At the time of retirement, the employee would be required to invest 40% of his accumulated Pension wealth to purchase an annuity which will provide Pension for life time to the employee and in the event of his death to his dependent Parents/Spouse. The remaining 60% pension wealth would be paid to the employee at the time of his retirement to utilize in any manner. This 40% investment would be paid to the legal heirs once the Family ceases.
In addition to the above pension account, everyone may also have a “voluntary tier-II withdrawable account” at his option. This option is given as there is no GPF account for CPS employees. Government will make no contribution into this account. These assets would be managed exactly through the above procedures. However, he would be free to withdraw part or all the ‘second tier’ of his money anytime.

There is not much of a difference in terms of benefit to the employee regarding old Pension Scheme and New Pension Scheme as far as the terminal benefits in monetary terms are concerned like commutation and gratuity or wealth accumulated. 

KCR as a true statesman par excellence! .....Vanam Jwala Narasimha Rao

KCR as a true statesman par excellence!
Vanam Jwala Narasimha Rao

Chief Minister and Leader of the House K Chandrashekhar Rao has once again exhibited his statesmanship qualities at the Business Advisory Committee (BAC) meeting that was held on October 26 and on the first day of the Legislative Assembly session held the next day. This is, indeed, a rare quality among the contemporary political leadership in the country. He had virtually turned the tables on the Opposition on when he proposed for an unprecedented 50-day winter session of the Telangana State Legislature at the BAC when the Opposition wanted only 20 days of the session.
The brilliant move by the Chief Minister put the baffled Opposition on the back foot. However, the Opposition seems to have squandered this opportunity when they have resorted to the same old tactics to stall the proceedings on the first day of the Session. They tried to disrupt the proceedings, but the CM did not allow their plans and went ahead with the session.
At the BAC meeting, the CM had opted to take the democratic route rather than confronting the Opposition. He told the BAC that the Opposition members should utilize the floor of the House to air their views on various issues for which they need to be given adequate time. To all those who witnessed the CM speaking at the BAC, it was like KCR displaying another facet of his astuteness and political acumen and true democratic spirit both in letter and spirit.
The Telangana Pradesh Congress Committee President N Uttam Kumar Reddy had recently demanded a minimum of 20-day session to facilitate debates on important issues concerning the people of the State. The Chief Minister went beyond the main Opposition’s demand and readily agreed to a 50-day session to discuss any and every issue. This is a move that the Opposition especially the Congress never expected even in their wildest dreams!
When the Opposition had come up with some 20 issues to be discussed on the floor of the House, the Chief Minister responding positively to their plea, made it clear that they were free to make any more additions to the list of issues as the very purpose of the session was to find a way forward on key issues involving the development of the State. The CM further said that the Government also wants to tell people at large through the House on various developmental and welfare activities that the government has been implementing.
The Chief Minister has asked the main Opposition if there was any meaning in holding Chalo Assembly programme when the government was more than willing to speak on any issue of their choice. He found fault with the Congress leaders’ assertion that they would go ahead with the programme even if it costs their lives, stating that such statements were uncalled for given the government’s open and democratic approach. But, the Opposition parties having scant respect for the parliamentary democracy have went ahead with their protests and resorted to interruption in the House on the very first day.

Except for the budget session, no government in the past had ever ventured to have a regular session extending beyond 40 days. The Parliament on rare occasions like when the then Union Minorities Minister AR Antulay made some controversial comments about the killing of Mumbai ATS Chief Hemant Karkare during the Mumbai Terror attacks and on the economic meltdown had held the longest sessions.
Back home, Telangana Chief Minister always believes in setting trends and fixing new benchmarks. For instance, at the same BAC meeting, the CM proposed, without the Opposition ever asking for it, to give more chance to the Opposition members and leaders to vent their views.
The Chief Minister scored yet another point against the Opposition when he favored taking up at least ten questions during the ‘Question Hour’ from 10 am to 11.30 am. The House will devote nine minutes for each question, he suggested. Any member will be allowed to raise supplementary instead of restricting the choice to the signatory members alone, and the discussion on the issue raised during the question hour should be closed after nine minutes allotted for it, Chandrashekhar Rao has suggested at the meeting.
“After the Question Hour, members should be given a chance to raise the local issues during the Zero Hour. After that let us have a new method of members submitting petitions. If the government is not able to give answers to the queries raised during the Question Hour, Zero Hour or any other occasion, it should provide with written answers to the members later. There should be elaborate discussions on the Bills. We are ready to incorporate changes in the Bills based on the good suggestions given by the members. And we have no qualms about it,” the CM said. The BAC also considered the Opposition plea for allowing discussion on issues of urgency that are moved by an adjournment motion. However, the issue of Adjournment Motions would be taken-up by the Speaker only after the Question hour and not before.
The CM wanted that the proceedings of the legislature should be held with dignity and the entire country should get this message. He said earlier the sessions used to be held for namesake and the ruling party used to conduct it like a mere formality. He said his government is ready to discuss any issue for any number of days.
The government is ready to discuss any matter in the House, at the same time if someone wants to create trouble it will act with sternness. Unfortunately, the Opposition has not been able to grab the opportunity provided by the CM and help conduct the Legislature sessions in a dignified manner with lot of decorum which would become a role model for others in the country to emulate.

The first day of the session began on a noisy note with Congress Party making desperate attempts to disrupt proceedings in both Houses. The attempts went in vain as both the Houses took up question Hour successfully and with CM participating in Assembly.  The disruptive methods adopted by Congress Members has been described by MIM Floor Leader Akbar Uddin Owaisi as” “it is not fair that a few members are trying to hold the House to ransom. The government should take action and facilitate other members to participate in the question hour”. 

Friday, October 27, 2017

It would be Rahul’s Indian National Congress : Vanam Jwala Narasimha Rao

It would be Rahul’s Indian National Congress
Vanam Jwala Narasimha Rao
The Hans India (28-10-2017)

Now it’s official that the All India Congress Committee probably will be headed by the sixth generation Nehru-Gandhi fraternity successor Rahul Gandhi. With blessings from his mother Sonia Gandhi and amidst cheers from sycophants Rahul would be elected as the Congress President succeeding his mother and of course unanimously. 

If it was Alan Octavian Hume, a civil servant in British India and a political reformer, who with the blessings of the then Viceroy Lord Dufferin, to be credited with the birth of Indian National Congress, then it is Sonia Gandhi an Italian born Indian politician to be credited with reviving the present-day congress and returning it back to power first in 2004 and then later in 2009. PV Narasimha Rao, who succeeded Rajiv Gandhi after his assassination as Congress President and later became Prime Minister, could not get victory for Congress in the 1996 elections and as a result had to resign as party president first and later as it’s parliamentary party leader in favor of veteran Sitaram Kesri.

Several senior party stalwarts were in open revolt against Sitaram Kesri after the party’s dismal performance in the general election in 1998 and several congress stalwarts demanded that Sonia Gandhi be persuaded to take over from him as President. At that critical juncture on “popular party functionaries” demand Sonia Gandhi joined Congress as “Primary Member” and within two months she “accepted when offered” the party President Post despite her nationality was questioned. She remained the unquestionable and undisputed leader for a record period of nearly two decades as President and revived the Nehru-Gandhi dynasty. Her “decision” and “consensus in the party” are synonyms!

History of 132 years old Indian National Congress is the history for supremacy between “Loyalists” and “Opponents” of Nehru-Gandhi family. Rocking its own ship has been the culture of the Congress people, right from its inception. It was but natural that the clashes of interests within the Congress were primarily confined and rotated round pro and anti-Nehru-Gandhi clan! Beginning with Motilal Nehru, successive members of the family time and again regained and retained strong hold and command over the party to become more powerful and indispensable.

Motilal Nehru, the founder patriarch of powerful political Nehru-Gandhi family, after serving twice as President of Indian National Congress, in the process of laying foundation for the future Prime Ministerial berth, transferred the presidency to his London educated son Jawaharlal Nehru who entered politics just a decade ago. Gaining supremacy within Congress had a typical Nehru-Gandhi style. The family which produced three Prime Ministers and the fourth one-if all is well-in the waiting controlled Congress Presidency for over five and half decades and as many as twenty-six times. 

Disagreements in the Congress party led to split twice during Indira Gandhi regime. Conspiracies were hatched either to challenge the Nehru-Gandhi legacy time and again or orchestrated by the family members themselves when they smelt that they are being challenged. Whenever challenged the “iron lady” Indira Gandhi, emerged triumphant and party was split. History may even put it the other way, that, it was Indira who forced the split to do away with her opponents.

After her demise, her son Rajiv Gandhi, who took over the reins amidst turbulent times, too, was a victim of similar conspiracies. Unlike his mother, who was known for her political maneuverings, Rajiv just managed to survive. When Rajiv was killed during an election campaign, Sonia Gandhi was not willing to take over the mantle, perhaps due to her inability to overcome that ghastly incident in which her husband was killed. She was also equally reluctant to oblige those Nehru-Gandhi family loyalists request to allow her son, Rahul to take over the mantle at that point of time.


Following Rajiv assassination, When Sonia denied, leading Congressmen reluctantly accepted P V Narasimha Rao to head the party. As AICC President, he was a rebel from within, and silently challenged the supremacy of Nehru-Gandhi family then represented by Sonia Gandhi. PV always stayed on the side of Indira Gandhi and remained loyal to her even during Emergency. He was also equally loyal and advisor to Rajiv Gandhi. However, he did not remain a trusted follower of Sonia Gandhi. He also broke convention by appointing a non-political economist (who later became prime minister twice) Manmohan Singh as his finance minister. Incidentally Manmohan was the one and only choice of Sonia Gandhi as Congress parliamentary leader when she had to “sacrifice” Prime Ministerial post left with no alternate. PV’s five-year tenure as Congress President witnessed many political upheavals within the party, with frequent clashes between pro and anti-Gandhi-Nehru family’s dynastic rule.

After 1996 elections PV paid for his “doubted loyalty” to Sonia. Sitaram Kesri first was made AICC President and later forced PV to resign as Congress Parliamentary Party Leader. Sharad Pawar and Rajesh Pilot unsuccessfully challenged Sonia nominee Sitaram Kesri. In the long history of Congress Party there were very few serious contests for the top position. Once it was between Subhash Chandra Bose and Pattabhi Sitaramayya in 1939 and later between Kripalani and Purushottam Das Tandon in 1950. On those two occasions much to the disliking of Gandhiji and Nehru first time Bose and second time Kripalani were elected and both had to resign subsequently.

Meanwhile pressure on Sonia increased from “Fundamental Loyalists” to take over party leadership and save from collapse. Kesri was unceremoniously pushed out and in 1998 Sonia sat on the Congress throne. Since then Sonia headed the party and even entered into record books of the party for holding the Chief’s post for more nearly two decades uninterruptedly.

Congress leaders at all levels now continue chanting Rahul Mantra. No stone is left unturned to keep safe the Nehru-Gandhi dynasty to lead the Congress. Political power moves from one generation to another. The hereditary politics are ruining the country’s future. In Dynastic politics known to Indians from time immemorial, kings and emperors groom their sons and daughters to ascend the throne. Innocent Indian citizen who may not understand the basic concept of democracy think that such hereditary succession to the chair is nothing unusual or unethical and hence what has been happening in politics is right.

Distressingly, the original promoter of this ancestry culture is none other than the Congress. Jawaharlal Nehru stepping in to the shoes of his father Motilal and set the ball rolling and calculatedly laid the foundation of dynastic rule. He groomed daughter Indira, who in turn promoted Sanjay and later Rajiv. Democratic politics in India have become hereditary. Democracy itself has become hereditary. The lead given by Nehru-Gandhi family in National Politics has been very well taken by many in several states.


The degeneration of democracy into 'hereditary democracy' is certainly a retrograde step in the evolution of democracy. Rahul Gandhi when assumes the position of AICC President will be the best living example of all this evil in politics. Can this be stopped?

Tuesday, October 24, 2017

Onus on sarpanches to perform with responsibility....Sarpanches…perform or perish:Vanam Jwala Narasimha Rao

Sarpanches…perform or perish
Onus on sarpanches to perform with responsibility
Telangana Today (25-10-2017)
Vanam Jwala Narasimha Rao

The State Cabinet decided to bring in a new legislation to strengthen Panchayat Raj Institutions as well as conduct elections well before the expiry of the tenure. The state cabinet also decided to upgrade tribal hamlets, Gondugudems and Chenchupalles into gram panchayats besides carving out additional panchayats on population cum geographical criteria. This might increase the number of gram panchayat by a maximum of 5000 from the existing 8684.

Under the united Andhra Pradesh State elections to Panchayats were held in July 2013 in Telangana. The term of the Sarpanches commenced on August 2, 2013 and will come to an end on August 1, 2018. According to the Panchayat Raj Act, elections can be conducted three months prior to the end of the tenure. Governments in the past totally neglected the development through local bodies. It is very unfortunate that the Panchayat Raj system, which is supposed to mirror the development of the villages, had lurched into political filth and became fiefdom of the elected local representatives neglecting their very basic duties. The weakening of the local bodies resulted in the underdevelopment of the state and the country. The desired development of state and country is possible only when the local bodies function well and that was the reason why SK Dey who pioneered and steered community development in independent India envisioned it as a movement rather as a simple institution. Now gone are those days.

Former Prime Minister Late PV Narasimha Rao in 1992 brought in the key 73rd Constitutional Amendment paving way for devolution of 29 subjects of funds, functions and functionaries to the Panchayats. Unfortunately, all these have been reduced to paper texts only. Several state governments either have not transferred the subjects or in many instances most of the Sarpanches were not been able to discharge their duties. There are only a handful of villages, which lived up to the spirit of 73rd amendment. The Panchayat Raj system has been weakened and rendered helpless. The development and welfare programmes to be implemented by the Sarpanches have become a distant dream. There is no accountability, transparency and responsiveness on the part of Sarpanches with regards to their obligatory development and welfare village level responsibilities like the road network, drainage facility, drinking water supply, sanitation, hygiene of schools in the village, garbage and so on. The Sarpanch transformed into resorting to threaten the MLA concerned in shifting his responsibility and demanding the MLA to perform instead. This needs a revolutionary change.

The local bodies and panchayats raj Institutions which are supposed to play a pivotal role in a decentralized democratic set up have become replicas of irresponsibility. Recommendations of Balwant Rai Mehta, Ashok Mehta, GVK Rao, LM Singhvi and other committees have not been implemented in letter and spirit. Answer to the question as to “why Panchayat set up” is very simple…to distribute the local resources equally, ensuring the locals participation in the government works, to attend to the day to day needs of the people, to create more local employment, to implement poverty eradication programs at local level and things like that. None of these are happening. In our democracy local self-governance has a crucial role to play in bringing the benefits of democracy closer to the people.

To realize this and to ensure comprehensive village development, Chief Minister KCR conceived a scheme called Gram Jyothi and implemented. In the initial phase, under the programme, people in the villages came together to make the village clean, green and hygienic. Officials from all levels and elected representatives with the participation of the local people drafted plan for the village development. However, the Sarpanches have miserably failed to take this initiative forward and as result the desired results could not be realized. Hence the people should show their strength and teach how to take the village forward in development with proper planning. People should take the lead role in strengthening the Panchayat Raj institutions.

Unfortunately, the Sarpanches who are expected to play decisive role have forgotten even to live in their village! The Mandal Praja Parishath President who is supposed to tour the entire Mandal and monitor the development activity seldom visits even the Mandal headquarters! The ZPTC members who are supposed to act as bridge between the Zilla Parishath and Mandal have given-up their basic duties. The government programmes, which are to be implemented at the ground level with people’s participation, have not been done. The Gram sarpanch has no intention of working for the village and has no desire to develop his village. He has no proper check about discharging his responsibilities as of now.


Why not we develop our own villages? Why can’t we create permanent assets in the villages? Visit any village the atmosphere is that of neglect. Imagine if a sarpanch decides; will there be sale of the illicit liquor? Playing cards? Will not long-term development works like planting of saplings and protecting trees be successful? Against this backdrop, there is an urgent need to bring in changes in the existing Panchayat Raj Act and that is what the Government thinks. Towards this the Government thinking is to consult experts in the field and draft the best of the Act.

The Act should think of remedial measures on non-performing people’s representatives. Either perform or perish shall be the guiding principle. The entire responsibility and a major portion of it should rest with the sarpanch and the rest on the other elected ward members. The sarpanch who fails to perform should be declared ineligible. The sarpanch should have at least one meeting per week in the Dalit Bastis, Rajak Wada and other such areas to interact with people and solve their problems. The Sarpanch shall not live outside the village come what may. He or she should have permanent residence in the village where he or she got elected.

Sarpanch shall be entrusted with the responsibilities of ear marking Dumping yard, identifying place for cremation and burial, ensuring cleanliness in the educational instructions, developing nursery, protecting the trees along the main roads leading to the village, cleansing water tanks, ensuring timely payment of the house tax etc. People in the village should be educated on the state and central government development and welfare schemes by the Sarpanch.

Telangana state should become platform for a wonderful Panchayat Raj system and should become role model for a working Panchayat and functioning sarpanch. Unless each village becomes a Panchayat itself, no amount of funds granted will bring in development. The Sarpanches should get a realization that if they do not perform they will be disqualified. And hence, a candidate while planning to contest as sarpanch will think twice before taking the plunge. They should realize that they should perform or perish. If we produce a performing panchayat it will be a great service to society.


And hence a Revolutionary Telangana Panchayat Raj Act is in the offing. END

Monday, October 23, 2017

ఐక్య రాజ్య సమితి ఆవిర్భావం-పురోగతి :వనం జ్వాలా నరసింహారావు

ఐక్య రాజ్య సమితి ఆవిర్భావం-పురోగతి
వనం జ్వాలా నరసింహారావు
మనతెలంగాణ దినపత్రిక (24-10-2017)

          ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత దేశానికి శాశ్వత సభ్యదేశ హోదా దక్కాలంటే వీటో హక్కు కావాలని కోరరాదని అమెరికా సూచించిందని వార్తలొచ్చాయి. ప్రస్తుతం అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా దేశాలకు మాత్రమె వీటో హక్కుంది. ఒకవైపు ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు రావాలని చెప్తున్న అమెరికా తన దేశానికి మాత్రం వీటో హక్కుండాలి కాని ఇతరులకు వుండరాదని అనడం హాస్యాస్పదం. ఈ నేపధ్యంలో ఐక్యరాజ్య సమితి ఆవిర్భావం, పురోగతి, ఒడిదుడుకుల గురించి తెలుసుకుంటే ఆసక్తికరమైన విషయాలు అవగతమౌతాయి.
అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక-సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై సమిష్టి కృషి లాంటి కార్యక్రమాలను చేపట్టి అమలు చేసేందుకు, ప్రపంచవ్యాప్తంగా వున్న పలు దేశాలు, సమష్టిగా ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్యసమితి. ప్రధమ ప్రపంచ సంగ్రామం ముగిసిన తర్వాత, ఏర్పాటు చేసుకున్న నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించడంలో విఫలం కావడంతో, దానికి ప్రత్యామ్నాయంగా, 1945లో ఐక్య రాజ్య సమితి స్థాపన జరిగింది. ప్రస్తుతం ఐక్య రాజ్య సమితిలో 193 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. సర్వ ప్రతినిధి సభ, భద్రతా మండలి, సచివాలయం, ధర్మ కర్తృత్వ మండలి, ఆర్థిక-సాంఘిక మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం ఐక్య రాజ్య సమితిలోని 6 ప్రధాన అంగాలు. సర్వప్రతినిధి సభలో ఐక్య రాజ్య సమితిలో చేరిన అన్ని దేశాలకు సమాన సభ్యత్వం ఉండగా, భద్రతామండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. అందులో 10 దేశాలు రెండేళ్లకోసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందగా, మరో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. దీని ప్రస్తుత ప్రధాన కార్యదర్శి యాంటోనియా గ్యూతెరాస్.
          రెండవ ప్రపంచ యుద్ధం ఇంకా జరుగుతున్న సమయంలోనే, 1941 ఆగష్టులో అమెరికా అధ్యక్షుడు థియోడోర్ రూజ్‌వెల్ట్, బ్రిటిష్ ప్రధాని విన్‌ స్టన్ చర్చిల్ అట్లాంటిక్ సముద్రంలో ఒక ఓడలో సమావేశమై అట్లాంటిక్ ఛార్టర్ అనే ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ప్రాదేశిక సమగ్రత కాపాడడం, యుద్ధ భయాన్ని తొలగించడం, శాంతిని నెలకొల్పడం, నిరాయుధీకరణ వంటి ఎనిమిది అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఈ ఒప్పందమే తరువాత ఐక్య రాజ్య సమితి సిద్ధాంతాలకు మౌలిక సూత్రాలుగా గుర్తింపు పొందింది. తరువాత 1944లో వాషింగ్టన్ లోని డంబార్టన్ ఓక్స్ వద్ద జరిగిన సమావేశంలో అమెరికా, బ్రిటన్, రష్యా ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి ప్రకటన పత్రం ముసాయిదాను రూపొందించారు. దరిమిలా, 1945 ఫిబ్రవరిలో యాల్టా సమావేశంలో అమెరికా, బ్రిటన్, రష్యా నేతలు ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం ఒక అంతర్జాతీయ సంస్థను స్థాపించాలని తీర్మానం చేశారు. ఆ తర్వాత చైనా, అలనాటి సోవియట్ యూనియన్-నేటి రష్యా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, అమెరికా దేశాలు ఈ సమావేశం ఆధారంగా తయారుచేసిన ఛార్టర్‌కు ఆమోదముద్ర వేశాయి. నేటి వరకూ ఆ ఐదు దేశాలు భద్రతామండలిలో శాశ్వత  సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో 1945 ఏప్రిల్ 25నుండి జూన్ 26 వరకు జరిగిన అంతర్జాతీయ సమావేశంలో 50 దేశాల ప్రతినిధులు పాల్గొని ఐక్య రాజ్య సమితి ఛార్టర్‌పై సంతకాలు చేశారు. 1945 అక్టోబర్ 24న న్యూయార్క్ నగరంలో ఐక్య రాజ్య సమితి లాంఛనంగా ప్రారంభమైంది.
          ఐక్య రాజ్య సమితికి వున్న ఆరు ప్రధానాంగాలలో సర్వప్రతినిధి సభకు అత్యంత ప్రాముఖ్యముంది. సమావేశాలకు ప్రతి సభ్యదేశం గరిష్టంగా ఐదుగురు సభ్యులను ప్రతినిధులుగా పంపవచ్చు. ఈ సభ సంవత్సరానికి ఒక పర్యాయం, సాధారణంగా సెప్టెంబరు మాసంలో, సమావేశమౌతుంది. సభ్యదేశాలు ఎన్నుకున్న వ్యక్తి సమావేశానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. అన్ని రంగాలలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం దీని కర్తవ్యం. సర్వప్రతినిధి సభతో సమానంగా, ఆ మాటకొస్తే ఒకవిధంగా అధికంగా సమితిలో ప్రాధాన్యత వున్న మరో అంగం భద్రతా మండలి. సమితి ప్రారంభమయ్యేనాటికి ఇందులో సభ్యదేశాల సంఖ్య 11. ప్రస్తుతం 15 సభ్యదేశాలున్నాయి. అందులోని శాశ్వత సభ్యదేశాలకు వీటో అధికారం వుంటుంది. సమితి ప్రారంభమైనప్పటి నుంచి ఇందులో ప్రధానమైన రెండు మార్పులు చేశారు. ప్రారంభంలో ఆరు తాత్కాలిక సభ్యదేశాలుండగా దాని సంఖ్యను దరిమిలా పదికి పెంచారు. నేషనలిస్ట్ చైనా స్థానంలో కమ్యూనిస్ట్ చైనాకు శాశ్వత సభ్యత్వం కల్పించారు. తాత్కాలిక సభ్యదేశాలను సాధారణ సభ ఎన్నిక చేస్తుంది. ఏ దేశం కూడా వరుసగా రెండు పర్యాయాలు ఎన్నిక కాకూడదు. భద్రతా మండలి ఆదేశాలను పాటించని సభ్య దేశాలపై అది ఆంక్షలు విధిస్తుంది. సైనిక చర్య కూడా చేపట్టే అధికారముంది.
          మూడో అంగం సచివాలయం. ఐక్యరాజ్యసమితి సచివాలయ కార్యాలయం సమితి వ్యవహారాలు నిర్వహించే కార్యనిర్వాహక విభాగం. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. సచివాలయ ప్రధానాధికారిని సెక్రటరీ జనరల్ అంటారు. సమితికీ-దాని వివిధ విభాగాలకు, అనుబంధ సంస్థలకు కావాల్సిన సమాచారం, అధ్యయనం, సదుపాయాలు వంటి విషయాలు సచివాలయం అధ్వర్యంలోనే నిర్వహించబడతాయి. నాలుగో అంగం ధర్మ కర్తృత్వ మండలి. కొన్ని పాశ్చాత్య దేశాల వలస పాలన క్రింద కొనసాగిన భూభాగాల ప్రయోజనాలను కాపాడడం ఈ మండలి లక్ష్యం. ఇక్కడి ప్రజలను స్వీయ ప్రతిపత్తికి లేదా స్వయం పాలనకు లేదా స్వాతంత్ర్యానికి సిద్ధం చేయడం ఈ మండలి బాధ్యత. ఇది సంవత్సరానికి రెండు సార్లు సమావేశమవుతుంది. ఐదోది ఆర్థిక, సాంఘిక మండలి. ఇది సాధారణ సభ అధ్వర్యంలో పని చేస్తుంది. ఇందులో 54 మంది సభ్యులుంటారు. ఈ మండలి ఏటా రెండుసార్లు సమావేశమవుతుంది. ప్రజల జీవన స్థాయిని మెరుగు పరచడం, విద్య, సాంస్కృతిక, ఆరోగ్య రంగాలలో అంతర్జాతీయ సహకారానికి కృషి చేయడం, మానవ హక్కులను సమర్థించడం వంటివి ఈ మండలి ఆశయాలు. ఇక చివరిది-ఆరోది అంతర్జాతీయ న్యాయస్థానం. దీనిని సాధారణంగా "ప్రపంచ న్యాయస్థానం" అని అంటారు. ఐక్యరాజ్యసమితి యొక్క ప్రాధమిక తీర్పులను ప్రకటించే అంగం ఇది.
          ప్రత్యేక ఒప్పందాల ద్వారా ఏర్పడిన ఐక్య రాజ్య సమితి అనుబంధ సంస్థలు అంతర్జాతీయ ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక, విద్యా, వైద్య రంగాలలో పని చేస్తుంటాయి. ఐక్య రాజ్య సమితి అంగాలలో ఒకటైన "ఆర్ధిక, సామాజిక మండలి" ఈ అనుబంధ సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తుంది. ఇందులో యునెస్కో-ఐక్య రాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ ప్రధానమైంది. విద్య, విజ్ఞానం, సంస్కృతి రంగాలలో అంతర్జాతీయ సహకారానికి, ప్రగతికి, శాంతియుత సంబంధాలకు ఈ సంస్థ కృషి చేస్తుంది. ప్రపంచ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి కావలసిన శాస్త్ర, సాంకేతిక రంగాలలో అభివృద్ధిని యునెస్కో ప్రధానంగా ప్రోత్సహిస్తుంది. ఇందుకోసం న్యూఢిల్లీ, కైరో, జకార్తా, మాంటివిడియో, వెనిస్ లలో కార్యాలయాలున్నాయి. ప్రస్తుతం యునెస్కో లో 193 దేశాలకు సభ్యత్వం ఉంది.


          ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి లేదా ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి-యునిసెఫ్, లేదా, ఐక్య రాజ్య సమితి బాలల నిధి అభివృద్ధి చెందుతున్న దేశాలలో పిల్లలు, వారి తల్లుల జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికి కృషి చేస్తుంది. ఐక్య రాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం-యుఎన్డిపి అనే మరో సంస్థ అభివృద్ధి చెందుతున్న దేశాలు వాటి సంపదను వృద్ధి చేసుకొనేందుకు అవసరమైన శిక్షణ, వైజ్ఞానిక సహాయ కార్యక్రమాలకు నిధులు సమకూరుస్తుంది. ఐక్య రాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం-యుఎన్ఇపి, స్వీడన్ రాజధాని స్టాక్‌ హోమ్ లో, ఆహార, వ్యవసాయ సంస్థ-ఎఫ్‍ఏ‍ఓ ప్రధాన కార్యాలయం రోమ్ నగరంలో వున్నాయి. పౌష్టికాహారం అందించడం, జీవన ప్రమాణాలు మెరుగు పరచడం, గ్రామీణ ప్రజల స్థితిగతులను అభివృద్ధి చేయడం, ఆహార, వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడిని, పంపిణీని మెరుగు పరచడం ఆహార, వ్యవసాయ సంస్థ లక్ష్యాలు. అంతర్జాతీయ కార్మిక సంస్థ-ఐఎల్ఓ కేంద్ర కార్యాలయం స్విట్జర్లాండు దేశం జెనీవాలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మికుల జీవన ప్రమాణాలు స్థాయిని పెంపొందించడానికి ఈ సంస్థ కృషి చేస్తోంది. 1969లో ఈ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.
          జెనీవాలో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ-డబ్ల్యు‍హెచ్‍ఓ, కేంద్ర కార్యాలయం స్విట్జర్లాండు దేశం జెనీవాలో దీని ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరికీ అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందించడం, అంటు వ్యాధుల నివారణ ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు. అందుకోసం వైద్య పరిశోధనలను ప్రోత్సహిస్తుంది. మలేరియా, క్షయ, మశూచి వంటి వ్యాధులను నిర్మూలించడానికి ఈ సంస్థ కృషి చేసింది. ఐక్య రాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ-యునిడో, అభివృద్ధి చెందుతున్న, బాగా వెనుకబడిన దేశాల పారిశ్రామికీకరణకు, సంబంధిత పాలసీలకు ఈ సంస్థ సహకరిస్తుంది. ఇలాంటివే మరికొన్ని అంతర్జాతీయ సంస్థలున్నాయి.
          అఫ్గానిస్తాన్‍ నుంచి 1989 లో సోవియట్ సేనల ఉపసంహరణ విషయంలోను, 1992 లో కాంబోడియాలో యుద్ధ విరమణ పర్యవేక్షణ సందర్భంలోను, 1989 లో నికార్‍గుహలో ఎన్నికల పర్యవేక్షణ వ్యవహారంలోను, కాంగో విషయంలోను, సైప్రస్ వ్యవహారంలోను, ఇరాక్-ఇరాన్ యుద్ధంలో మిలిటరీ అబ్జర్వర్‌గా వ్యవహరించే విషయంలోను, ఇలాంటి మరి కొన్ని సందర్భాలలోను ఐక్య రాజ్య సమితి పాత్ర చెప్పుకో దగ్గది.  అదే విధంగా డిసెంబర్ 10, 1948 న సమితి ఆమోదించిన విశ్వవ్యాప్త మానవ హక్కుల పరిరక్షణ తీర్మానం, ఐక్య రాజ్య సమితి తీసుకున్న నిర్ణయాలలో అత్యంత ప్రాముఖ్యమైంది గా చెప్పుకోవాలి. ప్రతి ఏడాది ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల దినంగా జరుపుకుంటున్నాం.

          ఉత్తర కొరియా, అమెరికా దేశాధినేతలు ఒకరిపై మరొకరు కారాలు-మిరియాలు చల్లుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఒక వేల మరో ప్రపంచ యుద్ధానికి వారి కయ్యం దారితీస్తే ఐక్యరాజ్య సమితి పాత్ర ఎలా వుండబోతుండో ఉహించడం అంత సులభం కాదు. అవునన్నా-కాదన్నా ఐక్యరాజ్య సమితి అమెరికా కీలుబోమ్మే ఒక విధంగా.