Tuesday, March 27, 2018

వాల్మీకి రచించిన శ్రీమద్రామాయణానిదే కావ్యాలలో అగ్రస్థానం:వనం జ్వాలా నరసింహారావు


వాల్మీకి రచించిన శ్రీమద్రామాయణానిదే కావ్యాలలో అగ్రస్థానం 
వనం జ్వాలా నరసింహారావు
అంధ్రప్రభ దినపత్రిక (26-03-2018)

శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల చరిత్రను, వీరు ఆచరించిన ధర్మాలను అన్ని లోకాలకూ శాశ్వతంగా చెప్పేందుకు, శత కోటి గ్రంథాత్మకమైన ప్రబంధంగా, ఓ బృహత్ గ్రంథాన్ని రచించి నారదుడికి, ఇతర మహర్షులకు ఉపదేశించాడు బ్రహ్మదేవుడు. అంతటితో ఆగకుండా భూలోక వాసుల కొరకై శ్రీరామ భక్తుడైన వాల్మీకికి ఉపదేశించమని నారదుడిని ఆదేశించాడు. వాల్మీకి రచించిన రామాయణం బ్రహ్మ ప్రేరేపించినదే.

వాల్మీకి సంస్కృతంలో రచించిన శ్రీమద్రామాయణం కావ్యాలలో అగ్రస్థానంలో నిలిచింది,. శ్రీమద్రామాయణంలో నాయిక సాక్షాత్తు శ్రీదేవైన సీతా దేవి. నాయకుడు మహావిష్ణువైన శ్రీరామచంద్రమూర్తి. వీరిరువురు త్రేతాయుగంలో దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ చేసి, ధర్మ సంస్థాపన చేసేందుకు అవతరించారు. ఇహ-పర సాధకంబులైన "స్వధర్మాలలో, స్త్రీ ధర్మం సీతని, పురుష ధర్మం శ్రీరామచంద్రమూర్తని లోకానికుపదేశించాడు వాల్మీకి.

         శ్రీరామచంద్రుడు బాలుడుగా వున్నప్పుడు జరిగిన సంగతులు తెలిపేది "బాల కాండ". ఇందులోనే సీతాకల్యాణ ఘట్టం అత్యంత మనోహరంగా రాసారు వాల్మీకి కవి. "కాండం"అంటే జలం...అంటే నీరు. శ్రీ రామాయణం మహార్ణవంగా చెప్పడంవల్ల, అందులోని జలం కాండమన్నారు. శ్రీ రామాయణంలోని బాల కాండలో శ్రీరామచంద్రమూర్తైన విష్ణువే "జగజ్జనన కారణభూతుడు" అని బోధపడుతుంది. జననం మొదలు ఇరవై అయిదు ఏళ్లు వచ్చేవరకూ రాముడు చేసిన చర్యలు ఈ కాండలో వున్నాయి. పన్నెండో ఏట పెళ్లైనప్పటినుండి పట్టాభిషేకం ప్రయత్నం జరిగే వరకు చెప్పుకోదగ్గ విశేషం ఏమీలేదు. బాల కాండ వృత్తాంతమంతా 12 సంవత్సరాల కాలంలో జరిగింది.

         రామాయణ రచనకు పూనుకున్న వాల్మీకి మహర్షి, భగవద్విషయాన్ని బోధించే యోగ్యతలున్న గురువు దొరకలేదనే నిర్వేదంతో శుష్కించి, తన ఆశ్రమానికి వచ్చిన నారదుడికి సాష్టాంగ నమస్కారం చేసి: "గుణవంతుడు, అతివీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యశీలుడు, సమర్థుడు, నిశ్చలసంకల్పుడు, సదాచారం మీరనివాడు, సమస్త ప్రాణులకు మేలు చేయాలన్న కోరికున్నవాడు, విద్వాంసుడు, ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, కోపాన్ని స్వాధీనంలో వుంచుకున్నవాడు, ఆశ్చర్యకరమైన కాంతిగల వాడు, అసూయ లేనివాడు, రణరంగంలో దేవదానవులను గడ-గడలాడించ గలవాడు ఎవరైనా వున్నారా ఈ భూలోకంలో?" అని పదహారు ప్రశ్నలు వేస్తాడు. వాస్తవానికి ఈ గుణాలన్నీ వున్నవాడు శ్రీరామచంద్రుడే! అందుకే ఆయన చరిత్రను మనకందించాడు వాల్మీకి మహర్షి.

బాల కాండలో శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించాల్సిన కారణం, అయోధ్య కాండలో స్థితి కారణం, అరణ్య కాండలో మోక్షమిచ్చే అధికారం, కిష్కింధ కాండలో గుణ సంపత్తి, సుందర కాండలో సర్వ సంహార శక్తి, యుద్ధ కాండలో వేదాంత వేద్యత్వం, ఉత్తర కాండలో సృష్టికి హేతువు లాంటి విషయాలను చెఫ్ఫడం జరిగింది. రామాయణంలో చెప్పబడిన పరతత్వం శ్రీరామచంద్రమూర్తిగా అవతరించిన విష్ణువేనని స్పష్టమవుతుంది. ఇటువంటి పరతత్వాన్ని స్థాపించి, పరమాత్మ అనుభవించే ఉపాయం శరణాగతని అర్థం చేసుకోవాలి. శరణా గతికి ముఖ్య ఫలం, భగవత్ సన్నిధానంలో చేరి, భగవంతుడికి సేవ చేయడమే. శరణాగతికి పురుష కారం అవశ్యం. పురుష కారానికి కావాల్సిన ముఖ్య గుణం శరణాగతుడి పట్ల దయ. రామాయణంలో పురుష కారం ప్రధానమైంది. శరణాగతుని అనుష్టించు అధికారికి శేషత్వం పారతంత్ర్యం స్వరూపం. భరతుడి చర్య వలన పారతంత్ర్యం స్పష్టంగా కనిపిస్తుంది. శత్రుఘ్నుడి చర్యలు భాగవత పారతంత్ర్యాన్ని తెలియచేస్తుంది. మనం సదా జపం చేయాల్సింది రామాయణమే.

రామావతారం పూర్ణావతారమే. అంటే ప్రకృతి సంసర్గం లేదు. శరీరం అప్రాకృతం. ప్రకృతి గుణాలు ఆయన్ను బాధించవు. రామచంద్రమూర్తి శోకించాడని వాల్మీకి రాసిందీ అసత్యం కాదు. నిజంగానే శోకం కలిగిందాయనకు. అయితే శోకం కలిగింది తన కొచ్చిన కష్టానికి కాదు. తమకు దుఃఖాలొచ్చాయని మనుష్యులు దుఃఖిస్తారు. తనకై, తన ఆప్తులకు దుఃఖం కలిగిందికదానని, తన మూలాన వీరికింత దుఃఖం ప్రాప్తించిందికదానని, వారి దుఃఖాన్ని ఆపాల్సిన తానే వారి దుఃఖానికి కారణమయ్యానని మాత్రమే రాముడు శోకించాడు. అలానే, సీతాదేవి విషయంలోనూ దుఃఖించాడు శ్రీరాముడు. తనను నమ్మి అడవులకు వచ్చిన సీతను, రాక్షసుడు ఎత్తుకుపోతే, తనను వదిలిన బాధతో, అమెకెంత దుఃఖం కలిగిందని రామచంద్రమూర్తి దుఃఖించాడు. వియోగంవల్ల తమకు కలిగిన నష్టానికి దుఃఖించే వాళ్లు మనుష్యులు. జీవులకు కలిగిన నష్టానికి దుఃఖించేవాడు భగవంతుడు. శ్రీరామ చరిత్ర అంటే మహాపురుష చరిత్రే. అందుకే దీనివలన ఎన్నో లాభాలున్నాయన్న భావన బాల కాండ మొదటి పద్యం లోనే వివరించబడింది.



శ్రీ రామాయణం, భారతం, భాగవతం అద్వితీయమైన గీర్వాణ భాషా గ్రంథాలు. ఈ మూడింటి లో ఆద్యమైంది శ్రీ రామాయణ కావ్యం. కావ్యాలలోకెల్లా ప్రధమంగా ఉత్పన్నమైంది కావడంతో ఆదికావ్యమైంది. రామాయణాన్ని చక్కగా తెలిసినవారు-అర్థం చేసుకోగలిగిన వారు మాత్రమే లోకానికి అందలి విషయాలను వివరించ సమర్థులు. అందరికీ అది సాధ్యమయ్యేది కాదు. "శ్రీరామాయణం" అంటే, లక్ష్మీరమణుడైన శ్రీమన్నారాయణుడి మాయా మానుషావతారమైన శ్రీరామ చరిత్రనీ, శ్రీ లక్ష్మీదేవి అవతారమైన సీతాదేవి చరిత్రనీ అర్థం. సీతాదేవి మహాత్మ్యాన్ని విశేషించి చెప్పడంవల్ల వాల్మీకి మహర్షే, శ్రీ రామాయణాన్ని "సీతాయాశ్చరితం మహత్తు" అని వెల్లడిచేశాడు. శ్రీరామచంద్రుడు మనుష్యుడివలె నటిస్తుంటే, వాల్మీకేమో వాస్థవార్థం చెప్తూ, ఆయన సాక్షాత్తు భగవంతుడే అంటాడు. రాముడి చర్యల ద్వారా, రాముడి వాక్కుల ద్వారా తాను చెప్పదల్చుకున్న దాన్ని సిద్ధాంతీకరించాడు వాల్మీకి. శ్రీరాముడు భగవంతుడేనన్న అర్థం, హారంలోని సూత్రంలాగా, రామాయణంలోని ఏడు కాండల్లోనూ వ్యాపించి వుంది. రామాయణాన్ని చదివేవారందరు, ఈ అర్థాన్ని మనస్సులో పెట్టుకొని, ఇందులోని ప్రతి అంశాన్ని-ప్రతి వాక్యాన్ని హెచ్చరికతో శోధించాలి. ఇలా ఆసక్తిగా శోధించిన వారికి-పరీక్షించిన వారికి మాత్రమే, వాల్మీకి రామాయణంలోని గొప్పదనం తెలుస్తుంది.

వాల్మీకి రామాయణంలోని పాత్రలు-పాత్రధారుల వాక్కులు, ఆయా పాత్రల చిత్త వృత్తి గుణాలను తెలియచేసేవిగా, సందర్భోచితంగా, వారున్న అప్పటి స్థితికి అర్హమైనవిగా వుంటాయి. పాత్ర గుణ మహాత్మ్యానికి అసంగతమైన వాక్యాలు ఆయా పాత్రల నోటినుంచి వెలువడవు. శ్రీరాముడు భగవంతుడన్న అభిప్రాయం వాల్మీకి పదే పదే చెప్పుకుంటూ పోయాడు రామాయణంలో. వాల్మీకి రామాయణమనే "కలశార్ణవం" లో రత్నాలను వెదికేవారు, మొట్టమొదటగా తెలుసుకోవాల్సింది వాల్మీకి శైలి-విధానం. అది తెలుసుకోలేక వెతకడం మొదలుపెట్టితే, చీకట్లో తారాడినట్లే. ఒక విషయం గురించి చెప్పాల్సిందంతా ఒకచోట చెప్పడు. కొన్ని సందర్భాలలో ఆ విషయానికి సంబంధించిన ప్రస్తావనే వుండదు. అదే విషయం మరెక్కడో సూచన ప్రాయంగా వుండొచ్చు. ఒక్కోసారి విపులంగా విశదీకరించబడి వుండొచ్చు. ఆయన చేసిన వర్ణనలను బట్టి, ప్రయోగించిన పదజాలాన్ని బట్టి, పాఠకులు ఊహించుకోవచ్చు.

వాల్మీకి (ఆంధ్ర వాల్మీకి) రామాయణం "ధ్వని కావ్యం". కావ్యానికి ప్రధానమైంది ధ్వని. కావ్యానికి ప్రాణం ధ్వని. ధ్వని లేని కావ్యం శవంతో సమానం. రామాయణంలో ధ్వని విశేషంగా వుంది. కావ్యమంతా ధ్వన్యర్థం వుండడమే కాకుండా, పలు శ్లోకాలకు విడిగా ధ్వన్యర్థం వుంది. శ్రీమద్రామాయణం గొప్ప ధర్మ శాస్త్రం. ఇందులో సర్వ విధాలైన, అన్ని రకాల ధర్మాల గురించి వివరంగా చెప్పబడింది. రాజ ధర్మం, ప్రజా ధర్మం, పతి ధర్మం, సతీ ధర్మం, భాతృ ధర్మం, పుత్ర ధర్మం, భృత్యు ధర్మం, మిత్ర ధర్మం లాంటి అన్ని ధర్మాలను గురించి చక్కగా తెలుపబడి వుంది. లాభ-లోభ-పక్షపాత బుద్ధి లేకుండా, న్యాయం మీదే దృష్టి నిలిపి వాదించే న్యాయవాది ధర్మం కూడా చెప్పబడింది. వీటితో పాటు కథా సందర్భానుసారంగా, అంతరాంతరాలలో ఎన్నో నీతులు చెప్పబడ్డాయి. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల చర్యల వలన భాతృ ధర్మం, సుగ్రీవుడి చర్యల వలన మిత్ర ధర్మం, హనుమంతుడి చర్యల వలన భృత్యు ధర్మం తెలియ చేయబడ్డాయి రామాయణంలో. రామాయణంలో సకల ధర్మాలున్నాయి. ఇందులో వున్న ధర్మాలే మిగిలిన అన్ని గ్రంథాలలోనూ కనబడతాయి. ఇందులో లేని ధర్మాలు మరింకేదాంట్లోను కనిపించవు.

ఇలా వాల్మీకి రామాయణంలో ఒకటి కాదు...వందల...వేల రకాల వ్యావహారిక, ప్రాపంచిక, ధర్మ, అర్థ, కామ, మోక్ష సంబంధమైన అనేకానేక విషయాలు వుండడం వల్ల దానిని మించిన గ్రంథం మరోటి లేదని అంటారు. (ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావు రచించిన ఆంధ్రవాల్మీకి రామాయణం ఆధారంగా)

హనుమాన్ ను చూసి భయపడినా, సంభాషించిన సీతాదేవి ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


హనుమాన్ ను చూసి భయపడినా, సంభాషించిన సీతాదేవి
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (26-03-2018)

రామనామస్మరణ చేస్తూ, చూస్తున్న సీతాదేవికి, చెట్టుకొమ్మల్లో కనిపించింది ఒక కోతి. ఆమె కంటికి ఆ కోటి, తూరుపు కొండపై అప్పుడే ఉదయించీ, ఉదయించకున్న సూర్యుడిలా, తెల్లటి వస్త్రాలు ధరించి ప్రియవాక్కులు పలుకుతున్న వాడిలా, మెరుగైన పింగళ వర్ణం కలవాడిలా, అశోక పుష్పాలరాశినిబోలిన ఎర్రటిముఖం కలవాడిలా, అద్భుత పరాక్రమవంతుడిలా, పచ్చనికళ్లు కలవాడిలా కనిపించింది. (సూర్యబింబం కనిపించీ, కనిపించని సమయమయిందన్న సూచన, రామచంద్రమూర్తనే సూర్యదర్శనం త్వరలో జరగబోతున్నదన్న సూచనా ఇందులో ధ్వనిస్తాయి)

కోతిని చూడగానే వళ్లుజలదరించింది సీతకు. భయంకరమైన కోతిరూపాన్ని చూసిన తనకేం కీడు జరగబోతున్నదో అని భయపడింది సీత. శోకంతో, రామలక్ష్మణులను స్మరించి మెల్లగా ఏడ్చింది సీత. అయితే తాను చూసింది, సుగ్రీవుడి మంత్రుల్లో శ్రేష్టుడూ, ఆయన బంటుగా వచ్చినవాడూ, బుధ్ధిమంతుడూ, వాయుకుమారుడూ, భయంకర భీమరూపం కలిగిన హనుమంతుడనే విషయం ఆమెకు తెలియదు. మనోవేదనతో దుఃఖిస్తున్న సీత, వినయవంతుడుగా వున్న హనుమంతుడిని చూసి, ఇదికలేమో అనుకుని, స్మృతి తప్పి, శవంలా అయిపోయి, తిరిగి తెలివి తెచ్చుకుని, తనలో తనే అనుకుంటుందీ విధంగా:

"కలలో కోతిని చూస్తే కీడంటారు. నేను కోతినికలగన్నాను. కీడుకలగనున్నదేమో! రామలక్ష్మణులకు మేలుకలుగుగాక! మాతండ్రి జనకమహారాజు కుశలంగా వుండుగాక! అయినా ఇదికలగాదే! నిద్రరాని నాకు కలలెలా వస్తాయి? అసలు దుఃఖంతో బాధపట్తున్న నాకు నిద్ర ఎలా వస్తుంది? సుఖమెక్కడనుండి వస్తుంది? నిద్రలేనందున కలకాదిది. రామదూత ఇంత సముద్రాన్ని దాటి రావణుడి అంతఃపురానికి రావటమనేది నమ్మరాని విషయం. అంటే, ఇది నిజంకాదు. బహుశా నేనెప్పుడూ రామనామ స్మరణే చేస్తున్నందువల్ల, ఆయన్ను గురించిన మాటలే వినవస్తుండవచ్చు. ఇదే వాస్తవం. రామచంద్రమూర్తిపైనే మనస్సు నిలిపి, దుఃఖంతో పరితపిస్తున్న నాకు, వేరే ఆలోచన లేకపోవడంతో, నేనేదిచూసినా, ఎందు చూసినా, రాముడి స్వరూపమే కనబడుతుండవచ్చు. ఆయన కధలే వినపడుతుండవచ్చు. నా మోహమే ఒక కోతిరూపంలో పలుకుతున్నదేమో! ఈ ఆలోచనా సరైందికాదేమో! మనస్సుకు రూపం వుండదుకదా! ఈకోతి స్పష్టంగా రూపంతో కనిపిస్తున్నదే! ప్రత్యక్షంగా కనపడుతూ, నన్ను చూసి మాట్లాడుతుంటే, ఇదిమాయ ఎట్లా అవుతుంది? ఇది వాస్తవమయ్యుండాలి".

ఇలా అనుకుని, తాను  చూసింది వాస్తవంగా కోతేనని నిశ్చయించుకుంటుంది. రెండు చేతులు జోడించి, బ్రహ్మకు, అగ్నికి, బృహస్పతికి, నమస్కరించుతుంది. కోతిచెప్పిన మాటలన్నీ నిజం కావాలని, భిన్నంగా జరుగవద్దని కోరుకుంటుంది. సీతాదేవి మనస్సుకు తాను నిజమైన కోతేనన్న నమ్మకం కుదిరిందనీ, పూర్తిగా నమ్మకం ఇంకా కుదరలేదని భావిస్తాడు హనుమంతుడు.

తనమీద సీతకు కొంత విశ్వాసం కలిగిందన్న నమ్మకంతో, హనుమంతుడు పైకొమ్మనుండి కింది కొమ్మకు దిగుతాడు. వినయవంతుడి వేషంలోనే వుండి, రెండు చేతులు జోడించి, శిరస్సు వంచుకుని, వినయంతో, తియ్యనిమాటలతో ఇలా అంటాడు సీతతో: "అమ్మా పతివ్రతారత్నమా! నా ప్రార్ధన విని  నన్ననుగ్రహించి  నువ్వెవరివో, ఎందుకిట్లా మాసిన పట్టువస్త్రం కట్టుకుని, కొమ్మను పట్టుకుని, నిలబడి వున్నావో చెప్పు తల్లీ? తామర రేకులనుండి నీళ్లు పడుతున్నట్లే, నీకళ్ల నుండి నీరెందుకు కారుతున్నది? నీవు కిన్నెర స్త్రీవా? వసువుల, రుద్రుల భార్యవా? పన్నగ స్త్రీవా? దేవతాస్త్రీవా? యక్ష కాంతవా? చంద్రుడుని విడిచి నేలరాలిన రోహిణివా? నీ శుభ లక్షణాలు చూస్తుంటే, నీవు మనుష్య స్త్రీవి కావనీ, దేవతాస్త్రీవనీ అనుకుంటాను. పోనీ, కోపంతోనో, మోహంతోనో, భూమి మీద తిరగటానికి వశిష్టుడిని విడిచివచ్చిన అరుంధతివి కావుకదా?"

"అమ్మా! ఎక్కడనుండి నీవిక్కడకు వచ్చావు? ఎందుకు దుఃఖిస్తున్నావు? నీతండ్రి ఎవరు? తోడబుట్టిన వాళ్లెవరు? భర్త ఎవరు? కొడుకెవరు? నీరూప, గుణాలను బట్టి నీవు దేవతా స్త్రీవనుకున్నాను కాని, రాచరికపు స్త్రీలకు వుండాల్సిన లక్షణాలు, చిహ్నాలు, నీకుండడంతో, నీవు దేవతాస్త్రీవి కాదని అనిపిస్తున్నది".



(చక్రం, స్వస్తికం, వజ్రం, ధ్వజం, మత్స్యం, గొడుగు ఆకారంలాం రేఖలు పాదంలో వుంటే, రాజపత్ని అవుతుందట. కాలివేళ్ల నడిమిభాగం భూమిని తాకి వుంటే, అఖండ భోగాలు కలుగుతాయి. బొటనవేలు ఎత్తుగా, గుండ్రంగా వుంటే, అమిత సుఖాలు కలుగుతాయి. మీగాలు ఎత్తుగా, చెమటలేకుండా, నరాలు కనిపించకుండా, నున్నగా, మెత్తగా, బలిసినవిగా వుంటే రాజు భార్యవుతుంది. పిక్కలు, రోమాలు లేకుండా, నున్నగా, గుండ్రంగా, నరాలు కనిపించకుండా వుంటే రాజపత్ని అవుతుంది. తొడలు దృడంగా  ఏనుగు తొండాల్లా, నున్నగా,  లావుగా, గుండ్రంగా, వెంట్రుకలు లేకుండా వుంటే రాజపత్ని అవుతుంది. ఇలా ఆమెకున్న అనేక చిహ్నాల వల్ల సీత రాజపత్ని కావచ్చునని హనుమంతుడి నిశ్చయం)

"తల్లీ! నీవు క్షత్రియస్త్రీవని కూడా నీ శుభచిహ్నాలు చూసి భావిస్తున్నాను. భూమండలాన్నంతా పరిపాలించే రాజశ్రేష్టుడి పట్టపురాణివని కూడా నేను ఊహిస్తున్నాను. ఒకవేళ దండకారణ్యంలో తిరుగుతున్నప్పుడు, రావణాసురుడు బలాత్కారంగా ఎత్తుకొచ్చిన సీతవు కావుకదా! నిజం చెప్పు. మనుష్య స్త్రీలకుండని నీ అందం, దీక్షతో వున్న నీ వేషం, నీ కాంతిహీనత, ఇవన్నీ చూస్తుంటే నీవు రామచంద్రమూర్తి భార్యవన్న సందేహం కలుగుతున్నది. నా అభిప్రాయం నిజమేకద! చెప్పాలి" అని అడుగుతాడు హనుమంతుడు సీతాదేవిని. త్రిజట మాటలకు భయపడ్డ రాక్షస స్త్రీలు సీతను వదిలి ఎక్కడి వారక్కడే దూరంగా పోయారు కొంతసేపు. అందువల్లనే సీతతో మాట్లాడటానికి కొన్త సమయం దొరికిన్ది హనుమంతుడికి.

(సీతావిలాపం, ముముక్షువైన ప్రపన్నుడి విలాపం, ఒకటేనని ముందే చెప్పడం జరిగింది. సంసారం తరించే మార్గం తెలీక, నిర్వేదంతో తనను ఆశ్రయించిన జీవులను రక్షించటానికి, భగవంతుడు "ఆచార్యు" లను పంపుతాడని కూడా చెప్పుకున్నాం. ఇట్టి భగవత్సహాయం, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దేహాభిమానాన్ని పూర్తిగా వదిలిపెట్టి, తన కొరకే [భగవంతుడి] మాన, ప్రాణాలను పోగొట్టుకోటానికి సిధ్ధపడే పరతంత్రులకు మాత్రమే లభిస్తుంది. స్వప్రయత్నంతో, దేహంపై ఏమాత్రం అభిమానమున్నా, ఆ సహాయం రాదు.  సీతాదేవి తనను, రాక్షసులు ఏం చేసినా, చేసుకోమని చెప్పి, దేహాభిమానాన్ని విడిచి, నిద్రాహారాలు మాని, ఏకాగ్రతతో, బుధ్ధి పూర్వకంగా, తన దేహాన్నీ, ప్రాణాన్నీ, రామచంద్రమూర్తికే సమర్పించాలనుకొని, నిరాశతో మరణించాలనుకొని సిద్ధపడిందో, అప్పుడే హనుమంతుడి ద్వారా "ఆచార్య" లాభ ప్రాప్తి కలిగింది).

Saturday, March 24, 2018

శ్రీ రామాయణం ఒక క్షీర ధార...శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-1: వనం జ్వాలా నరసింహారావు


శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-1
శ్రీ రామాయణం ఒక క్షీర ధార
వనం జ్వాలా నరసింహారావు

శ్రీ రామాయణం క్షీరధార. వాసుదాసుగారి శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం, మందరాలన్నీ, మందార మకరంద మాధుర్యాలే. కవికులగురువు కాళిదాసు అన్నట్లు."చరిత్ర మా రాముడిది. రచన సాక్షాత్తు వాల్మీకులవారిది. గానం చేసినవారు కిన్నెర గాత్రులైన కుశ లవులు. ఇంతటి మహనీయమైన రామాయణ కావ్యంలో, శ్రోతలను పరవశింప చేయని అంశం అనేదేదీ లేదు.

         భగవద్గీత, శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం, శ్రీ రామాయణం భారతీయ సంస్కృతీ రూపాలు. సనాతన ధర్మ ప్రతిపాదకాలు. వీటి మౌలిక తత్వాలు ధర్మ-జ్ఞానాలు. ఈ రెండింటినీ వాచ్య-వ్యంగార్థాలతో శ్రీ మద్రామాయణం ఆవిష్కరిస్తోంది. వాల్మీకి ఆదికవి. రామాయణం ఆదికావ్యం. ఇది ధ్వని-అర్థ ప్రతిపాదిత మహా మంత్రపూతం. గాయత్రీ బీజసంయుతం. ఔపనిషతత్వసారం. స్మరణ-పారాయణ మాత్రంగా అంతఃకరణ శుద్ధి అవుతుంది.

         వాల్మీకి రామాయణాన్ని యథావాల్మీకంగా, పూర్వ కాండలతో సహా ఉత్తర కాండను కూడా కలిపి తెనిగించిన ఏకైక మహాకవి కీర్తి శేషులు వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు) గారు. ఆ మహానుభావుడి ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరాలన్నీ, తెలుగునేల నాలుగు చెరగులా విశేష ప్రాచుర్యాన్ని ఏనాడో సంతరించుకున్నాయి. కానీ, కాలక్రమంలో అవన్నీ మరుగున పడిపోతున్నాయి. రామాయణానికి రచయిత ఒక్కడే. వాల్మీకి మహర్షి తప్ప ఇతరులెవరికీ రామాయణం రచయిత అని చెప్పుకునే హక్కులేదనే అనాలి. వాసుదాసుగారు కూడా వ్యాఖ్యాతననే అంటారు తన ఆంధ్ర వాల్మీకి రామాయణానికి.

         వాల్మీకి రామాయణ క్షీరసాగర మధనాన్ని చేసి "మందర" మకరందాలనూ, రమా రామ పారమ్య పీయూషాలనూ, నాలుగు చెరగులా పంచి, ఆ మథనంలో ఆవిర్భవించిన శ్రీ సీతారాముల తత్వాన్ని, వేద వేదాంగేతిహాస స్మృతి శ్రుతి శుభంగా అన్వయించి, ఆంధ్రుల హృదయ కేదారాలను ప్రపుల్లంచేసిన పరమ భాగవతోత్తములు "ఆంధ్ర వాల్మీకి" వాసుదాస స్వామి. "రామ భక్తి సామ్రాజ్యం యే మానవుల కబ్బెనో మనసా! ఆ మానవుల సందర్శనం అత్యంత బ్రహ్మానందమే" అన్న త్యాగరాజ స్వామి వారి కీర్తనకు సాకార దివ్య స్వరూపులు వాసుదాస స్వామి. ఆంధ్ర వాల్మీకి వాసుదాస స్వామి అవతరించి వున్న కాలంలో, వారి దర్శన-అనుగ్రహ భాషణా సౌభాగ్యమబ్బిన వారు, "శ్రీ మద్రామాయణం-మందరం" పారాయణ పరులై, తమ పరంపరకు శ్రీ వాసుదాస స్వామి గారి దివ్య స్మృతులను అందించి తరించారు. వాల్మీకి సంస్కృత రామాయణాన్ని అందరికంటే మొట్ట మొదలు ఆంధ్రీకరించి, పదే-పదే రామాయణ పఠన పాఠన శ్రవణాదుల పట్ల ఆంధ్రులకు అత్యుత్సాహాన్ని కలిగించి, "రామ భక్తి సామ్రాజ్యం" అంటే, ఆంధ్ర దేశమే సుమా, అనిపించిన నిరుపమ రామ భక్తులు వాసుదాస స్వామివారు.


         ఇరవైనాలుగు గాయత్రీ మంత్రాక్షరాలలో నిబంధించబడిన మంత్ర మంజూష వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణం. మహా మహానుభావులూ, మహా విద్వాంసులూ కీర్తి శేషులు శ్రీమాన్ వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు) గారు, వాల్మీకి రామాయణాన్ని యధాతథంగా మంత్రమయం చేస్తూ, ఛందో యతులను ఆయా స్థానాలలో నిలిపి, వాల్మీకాన్ని తెనిగించారు. వాల్మీకి రామాయణానికి తుల్యమైన స్థాయినీ-పారమ్యాన్నీ, తొలుత నిర్వచనంగా ఆంధ్ర వాల్మీకి రామాయణానికి అందించి, తదనంతరం, "మందరం" అని దానికి విశేష ప్రాచుర్యాన్ని కలిగించారు. ఆంధ్ర పాఠక లోకం మందరాన్ని అపారంగా అభిమానించింది-ఆదరించింది.

         వాసుదాసుగారి కీర్తికి ఆలవాలమైంది ఆంధ్ర వాల్మీకి రామాయణం. ఆంధ్ర భాషలో అంతకుముందు రామాయణానికి యధా మూలాలు లేవని, అర్థ పూర్తి కలిగి, కావ్య-ఇతిహాస గౌరవ పాత్రమై, సర్వజన పఠనీయమై, ప్రామాణికమై, మూలానుసరమైన రామాయణం తెలుగులో వుండడం లోకోపకారంగా భావించి, రచించించారీ గ్రంథాన్ని వాసుదాసుగారు. ఎనిమిదేళ్లలో రామాయణాన్ని తొలుత నిర్వచనంగా ఆంధ్రీకరించి, అలనాటి కడప మండలంలోని ఒంటిమిట్ట కోదండ రామస్వామికి అంకితం చేసారు . ఆయన రచించిన నిర్వచన రామాయణం, ఆయన జీవిత కాలంలోనే, నాలుగైదు సార్లు ముద్రించబడింది. ఆంధ్ర వాల్మీకి రామాయణం బాల కాండలో, తన స్వవిషయం గురించి ప్రస్తావిస్తూ వాసుదాసుగారు, సంస్కృత రామాయణాన్ని శ్రీరామచంద్రుడి కుమారులైన కుశ-లవులు లోకానికి ప్రకటించినట్లే, తనకూ ఆయన కుమారుడిగా, అలాంటి అధికారం వుందని, అయితే సంకల్పించడం మాత్రమే తన వంతని-నిర్వహించడం శ్రీరాముడి వంతని, పూర్తిచేయించే భారం ఆయన భుజాలపైనే వేస్తున్నానని, ఆయన వలదన్నా వదలనని చెప్పుకుంటారు.

         వాసుదాసుగారు రచించిన ఆంధ్ర వాల్మీకి రామాయణానికి తెలుగులో సరైన వ్యాఖ్యానముంటే, సంస్కృతం రానివారికి చక్కగా అర్థమవుతుందని మిత్రులంటారాయనతో. మూల గ్రంథం రాయడంకంటే వ్యాఖ్యానం రాయడం కష్టమనుకుంటారాయన మొదట్లో. బాగా ఆలోచించిన తర్వాత, (శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం) "మందరం" పేరుతో గొప్ప వ్యాఖ్యానం రాసారు వాసుదాసుగారు. వాస్తవానికి అదొక గొప్ప ఉద్గ్రంథం. సరికొత్త విజ్ఞాన సర్వస్వం."మందరం"అంటే, క్షీరసాగరాన్ని మథించడంలో కవ్వంగా ఉపయోగించిన మందర పర్వతమే గుర్తుకొస్తుంది సాధారణంగా ఎవరికైనా. కాని, వాసుదాసుగారి శ్రీపాద సంబంధులకు మాత్రం, "మందరం" అంటే, మొదట గుర్తుకొచ్చేది, ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరమే. వాల్మీకి విరచితమైన రామాయణాన్ని శ్రీవారు, "క్షీరవారాసి" గా సంభావించి, దానిని మధించిన తమ "మేథ" అందించిన మకరందాలను-మధురిమలను, ముచ్చటగా "మందరం" అని పేర్కొన్నారు. సహృదయ నైవేద్యంగా-అనుభవైక వేద్యంగా వచ్చిన రచనలకు అసాధ్యంగా-నిగమ గోచరంగా భావించబడిన రామాయణానికి "మందరం" అని నామకరణం చేయడంలో తను కొంతవరకే న్యాయం చేయగలిగానని అంటారాయన. ఇందులోంచి చిలికిన కొద్దీ ఎన్నో దివ్య రసాయనాలు ఉద్భవిస్తాయని, భావితరాలవారు ఇందుకు పూనుకోవాలని కూడా సూచించారు వాసుదాసుగారు.

Wednesday, March 21, 2018

KCR Meets Mamata .... A Good Beginning towards national alternative : Vanam Jwala Narasimha Rao


KCR Meets Mamata
A Good Beginning towards national alternative
Vanam Jwala Narasimha Rao
On more than one occasion, Telangana State Chief Minister K Chandrashekhar Rao has proved himself that he is one who can make a difference in politics in India and who can think out of the box to achieve goals that seldom any leader ever attempted.
Having proved his mettle as a people’s leader and an able administrator par excellence, KCR, in the recent past has been airing his thoughts on the national level issues especially the federal spirit and cooperative federalism of our country as well as the Centre-State relations. KCR also has been quite logically talking about the status quo power politics at the Centre. As he rightly observed, people in the country for the past 71 years have no option as far as electing the government at the Centre is concerned. It had been for decades, Congress or non-Congress and in the recent past it is either Congress or BJP. The people in the country have no option, no other choice but to chose between the bi-polar parties like the BJP and the Congress. Why not think of an alternative narrative at the Centre, the non-BJP, non-Congress one? This is a valid question KCR has been raising for the past couple of months and a few weeks ago, he even declared that he is not averse to leading such an alternate in the national politics.
As a first major step towards this and seeking to give a concrete shape to the idea of launching an alternative in the national political scenario, KCR met West Bengal Chief Minister Mamata Banerjee on 19th March 2018 in Kolkata enlisting her support to the non-BJP, non-Congress national alternative.
After the historic meeting, both KCR and Mamata interacting with the media gathered there, described their meeting as “a good beginning” towards the formation of an alternative to take on the ruling BJP in the 2019 general elections. KCR visualized that “alternative federal front” as a strictly non-Congress, non-BJP platform.  
KCR also said, “There is a specialty for our meeting today. Some people are mis-understanding our attempt as Third Front and treating it as a front for the elections and a political front that is going to be formed during the elections”.

Elaborating further on the issue, KCR said, “You know what is happening in this country for the last 71 years and you still want that same routine model to continue? What new will happen if BJP comes or Congress comes to power? Will there be a chamatkar (magic)? This country needs a chamatkar,” said KCR. Emphasizing the need for an “alternative agenda, an alternative development and an alternative political force” in the country, KCR said the “routine kind of administration” as performed by both the Congress and the BJP had not worked well for the country.
On the leadership of the new Federal Front, KCR said, “Do not worry. It will be a collective leadership. Leaders emerge from situations and sequence of events.” Mamata chose not to add to that statement. “We have to take our country like East Asian tigers, like China, and this country has a great opportunity,” said KCR, adding, “We have a lot of natural and mineral resources.”
KCR further said that the two leaders agreed to bring in a “real federal front” and called the alliance as people’s agenda. “Today is just a beginning. We have to talk to all of the others,” he said while telling the reporters not to read this as any other alliance of political parties. There are labels of a third or fourth front, of just another front before the elections. Our front will be a federal front. Ours will be a collective, federal leadership.”
The West Bengal CM said politics could throw up circumstances when all kinds of individuals get the opportunity to work together. “In a democracy, we must develop the culture of working together. We have good relations with other parties and we will maintain that. If we can work together, nothing can be better for this country,” she said, clearly indicating her intentions to keep reaching out to other regional opposition parties for finding a common minimum ground on which a workable alliance could be forged ahead of the 2019 polls.
“We have only just started this dialogue. Others would automatically gather around us. We want a strong federal front. If the states are strong, the Centre too would be strong. It’s like a collective family. Let us approach the other parties and discuss this matter. We are in no hurry,” she clarified.
Answering a spate of questions, KCR requested the media persons to think differently out of routine. He reiterated that the proposed Federal Front would choose a unique agenda, which will be different from the existing time old agendas. He urged the media persons not to treat this proposed Front as a routine run of the mill political group. “A new beginning is made from the historic and ancient city of Kolkata. We must redefine out country and society. We will further discuss the matter,” he said.
Mamata Banerjee, too, called the meeting a good beginning. She said that the two parties are not in a hurry to form a federal front and will be talking to other parties gradually. “We want the federal front to be strong. If the states are strong the front will be strong. We are not in a hurry,” she said.
The two Chief Ministers said both agreed that the country needed growth-driven politics at this juncture. Both leaders are also in agreement that their meeting had initiated the process of forming a ‘federal front’ for the 2019 Lok Sabha polls.

Monday, March 19, 2018

శ్రీరాముడి వృత్తాంతం సీతకు చెప్పదలచుకున్న హనుమ ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


శ్రీరాముడి వృత్తాంతం సీతకు చెప్పదలచుకున్న హనుమ
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (19-03-2018)

"శ్రీరాముడి వృత్తాంతం ఈమెకు చెప్పడం ఆవశ్యకమే అయినా, ఎలా చెప్పాలి? నేనుచెప్తున్న మాటలు రాక్షసులు వినకూడదు. వింటే ఇప్పుడే పోయి రావణుడికి చెప్పుతారు. వాడు బయలుదేరి వస్తాడు వెంటనే. కార్యభంగమవుతుంది. వీళ్లకు తెలియకుండా సీతాదేవితో మాట్లాడాలి. ఉదయం అయ్యేలోపల మాట్లాడకపోతే, ఆమె ప్రాణాలు విడుస్తుందేమో!  అంతేకాదు, రాముడి దగ్గరకు పోగానే: సీతను చూసావా హనుమంతా? ఉంగరమిచ్చావా? చూసి ఏమంది? అని ఆయన అడగక మానడు. అడిగితే ఏమని చెప్పాలి? చూసి రమ్మన్నావు కాబట్టి చూసి వచ్చాను, మాట్లాడలేదని చెప్పాలా? ఉంగరం ఏంచేసావంటే పెట్టుకున్నానని చెప్పడం నాకు తగిందేనా? అట్లా చెప్పొచ్చా? సీతాదేవి ఏం చెప్పిందో తెలుసుకోకుండా, రాముడిని చూడబోతే, ఆయన కోపజ్వాలలో నన్ను భస్మం చేయడా? పోయి, చూసి, మాట్లాడకుండా వచ్చావని, కోప్పడడా? సీతాదేవిని చూసి రమ్మన్నావు కనుక చూసివచ్చానంటే, కోతికింతకంటే ఎక్కువ తెలివితేటలెందుకుంటాయని నన్నేమనడనుకుందాం. నామాటలు నమ్మి, వానరులందరు ఇక్కడకు వచ్చేసరికి, సీతాదేవి మరణించి వుంటే, వారి రాక వ్యర్థం కాదా! కాబట్టి అవకాశం చూసి, సీతాదేవిని ఓదార్చిపోవడమే మంచిది. ఎట్లాజరగాలది? నేను చిన్న ఆకారంలో వున్నాను. దాన్నిప్పుడు పెంచొద్దు. కోతినైన నేను మనుష్యులలా సంస్కృతం మాట్లాడవచ్చా? బ్రాహ్మణుడిలాగా సంస్కృతం మాట్లాడితే, నన్ను రావణుడిగా అనుమానించి అసలే మాట్లాడదేమో!"

"మాట్లాడకున్డా వూరుకుంటే, ఓదార్చాల్సిన ఆమెను ఎలా ఓదార్చాలి? మాట్లాడాలంటే, ఎలా, ఏమి మాట్లాడాలి? వేరేమార్గం లేదు. ఈమెకు తెలిసిన ప్రాకృతభాషలోనే మాట్లాడుతా. ఈ భాష రాక్షసులకు తెలియదు. వారికర్ధం కాదు. ప్రాకృతం మాట్లాడాలంటే కోతి ఆకారంలో ఎట్లావీలవుతుంది? సీత ఇదిరాక్షసుల పనేననుకుని, మరెక్కువ భయపడుతుందేమో! భయపడి రావణుడే వచ్చాడనుకుని అరుస్తుందేమో! ఆ అరుపువిన్న రాక్షస స్త్రీలు, నన్ను చూసి చంపడమో, కట్టిపడేసి రావణుడి వద్దకు తీసుకుపోవడమో జరుగుతుంది. పోనీ, కొమ్మో-రెమ్మో పట్టుకుని పారిపోతే, నా భయంకర రూపాన్ని చూసి, రావణుడింటివద్ద కాపలా వున్న రాక్షసులను పిలుచుకొస్తారు. వాళ్లు కత్తులు-కటార్లు-శూలాలతో వచ్చి, గుంపుగా నామీద పడ్తే, నాకూ కోపం వస్తుంది. ఇలావచ్చిన రాక్షసులను అందరినీ చంపుకుంటూ పోతే, సముద్రం దాటి తిరిగిపోవడమెట్లా? వాళ్లే గెలిచి నన్ను పట్టుకుంటే, సీతకు, శ్రీరాముడి వార్త చెప్పేవారుండరు. నేనుచిక్కిపోతా. సీతను రాక్షసులు చంపుతారు."

"ఇలా జరిగితే రామసుగ్రీవులు అనుకున్న పని చెడిపోతుంది. సీతను చంపకపోయినా, జాడ తెలియకుండా ఏ రహస్య ప్రదేశంలోనో దాచిపెట్తారు. ఆ బాధలు పడలేక ఆమె చనిపోవచ్చు. యుద్ధంలో రాక్షసులు నన్ను చంపినా, కోపంతో కట్టిపడేసినా, రామకార్యం చేయగలవాడెవరూ లేరు. నూరు యోజనాల సముద్రాన్ని దాటగల వానరుడెవడూ లేడు. ఎంతమంది రాక్షసులనైనా, భుజబలంతో యుద్ధంలో గెలుస్తానుకాని, బడలికవల్ల సముద్రాన్ని మళ్లీ దాటలేను. యుద్ధంలో జయాపజయాలు నిర్ధారించలేం కూడా! కాబట్టి సందేహానికి తావిచ్చే పనులేవీ చేయరాదు. మేలైన పనిని, బుధ్ధిమంతుడైనవాడు ఆలోచించకుండా చేస్తే, అది మేలుచేస్తుందా, కీడు చేస్తుందా, అనేది సందేహమే! అలాంటి సాహసం చేస్తే, నీతిమాలిన వాడని లోకులు నిందిస్తారు. రాక్షసులకు భయపడి పలకరించకుండా పోతే, అదే రాక్షసులకు భయపడి సీత మరణించడం ఖాయం. పలుకరిస్తే కీడు కలుగుతుందేమో? ఎట్లాచేస్తే కార్యం చెడదు, ఎట్లా ప్రవర్తిస్తే సముద్రం దాటడం వ్యర్థం కాదు, ఎలా చెప్పితే సీత నామాటలు చక్కగా వింటుంది, నన్ను చూడగానే సీత భయపడకుండా ఎట్లా వుంటుంది?"

ఇలా పరిపరి విధాల ఆలోచించిన హనుమంతుడు, బుధ్ధిమంతుడు కనుక, సరైన నిర్ణయానికొస్తాడు. తన్ను చూస్తేనే కదా సీత భయపడేది అనుకుంటాడు. కనిపించకుండా, కొమ్మల్లో దాక్కుని, సీత భయపడకుండా, రామచంద్రమూర్తిని, ధర్మంతోకూడిన, శుభాన్నిచ్చే, తియ్యటి మాటల్తో పొగిడి, ఆమె నమ్మేటట్లు చేస్తే మంచిదని భావిస్తాడు. తనమాటలను ఆమె ఎంతవరకు నమ్ముతుందో చూసిన తర్వాతనే, ముందు-ముందు ఏమిచేయాల్నో నిర్ణయించుకోవచ్చు అనుకుంటాడు. దీనివల్ల నష్టమేమీలేదని నిశ్చయించుకుని, హనుమంతుడు, ఆమెను చూస్తూ, ఆమె మాత్రమే వినేటట్లు, చెట్టుచాటునుండి, తియ్యగా మాట్లాడసాగాడు.

దశరథుడి పేరు స్మరించేవారెవ్వరూ లంకలో వుండరు కాబట్టీ, ఆ ప్రస్తావన వచ్చినా కీర్తించే వారెవరూ లేరుకాబట్టీ, దశరథుడితో మొదలెట్టి ఆయన ఉదారకీర్తిని గురించిన మాటలు సీతచెవిలో పడేటట్లు చేసి, ఆమెమనస్సును ఆకర్షిస్తాడు హనుమంతుడు. ఈవిధంగా సీతాదేవి మనస్సును తనవైపు లాక్కొని, ఆతర్వాత ఇంకేమి చెప్తాడో విందామన్న ఆసక్తి ఆమెలో కలిగిస్తాడు హనుమంతుడు. పరేంగిత జ్ఞాగా హనుమంతుడు సాక్షాత్కరిస్తాడు. ఇలా కొనసాగితుందిఆయన ప్రశంస:

"దశరధుడనే మహారాజు, మహాదాతనే కీర్తి తెచ్చుకున్నాడు. ఆయనకు చతురంగ బలసైన్యం, ధర్మస్వభావం వున్నాయి. సుగుణసంపత్తి కలిగిన లోకపూజ్యుడు. రాజర్షులందరిలోనూ శ్రేష్టుడు. చక్రవర్తుల వంశంలో పుట్టాడు. తపస్సులో ఋషులకు, బలంలో ఇంద్రుడికి సమానుడు. దయాశీలి. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వాళ్లందరిలో శ్రేష్టుడు. సత్యపరాక్రముడు. అహింసా ప్రియుడు.  గొప్పరాజులకుండే శుభ లక్షణాలున్నవాడు. చక్కని నడవడికలిగి, నాలుగు సముద్రాల నడుమనున్న భూమిని ఏలినవాడు. ఒకరిని సుఖపెట్టి తానూ సుఖపడే వాడు. ప్రభువులందరికీ ప్రభువైనవాడు.”

(ఇలా ఎవరో తనమామగారిని పొగడ్తున్న మాటలు విన్న సీతాదేవి ఇంకేమి వినపడ్తుందో అని ఆలకించింది ఆసక్తిగా)



"గొప్ప మనసున్న ఆ దశరథ మహారాజు పెద్దకొడుకే శ్రీరామచంద్రుడు. చంద్రుడిలాంటి ముఖమున్న కారణాన అందరికీ ప్రియుడైనాడు. తన్ను ఆశ్రయించిన వారిని, వారినాశ్రయించిన వారినీ, రక్షించే సమర్ధుడు. స్వధర్మ రక్షణ అంటే ఇష్టపడేవాడు. విల్లుపట్టే వారిలో మేటి. అన్నివిషయాలలో పరిపూర్ణ వ్యక్తిత్వమున్నవాడు. సర్వజ్ఞత్వ, సర్వశక్తిమత్వ, సర్వసంహారకత్వ  సర్వరక్షకత్వాది గుణాల్లో ఏ లోపమూ లేనివాడు. చెడ్డవారికి, పగవారికి భయం కలిగిస్తాడు. నిర్మలమైన తనవంశాచార ధర్మాన్ని రక్షించేవాడు".

(ఎవరో తన మగడిపేరు చెప్పుతున్నారే అని, ఇంకా ఏంచెప్తారో విందామని, మరింత ఆసక్తిగా మనస్సు పెట్టి వినసాగింది సీత)

"పాపరహితుడైన ఆ శ్రీరాముడు సత్యసంధుడు. ముసలివాడైన తండ్రి ఆజ్ఞప్రకారం, తమ్ముడు, భార్య తోడురాగా అడవులకెళ్లాడు. ఆయన కామరూపులైన దుష్ట రాక్షసులను, ఖరదూషణాదులను, ఇంకా అనేకమందిని చంపాడు. జనస్థానంలో వున్నవారిలా చావడం భరించలేని రావణుడు, మాయలేడి నెపంతో, మోసంచేసి, శ్రీరాముడి భార్యను అపహరించాడు. ఆమెను వెతుకుతూ వచ్చిన రామలక్ష్మణులు వానర రాజైన సుగ్రీవుడితో స్నేహం చేసారు. తన స్నేహితుడైన సుగ్రీవుడి కోరికపై, వాలిని చంపి, రాజ్యాన్ని ఆయనకప్పగించాడు రాముడు. సీతాదేవిని వెతికేటందుకు, సుగ్రీవుడు పంపిన, పరాక్రమమవంతులు, కామరూపులైన వానరులనేకమంది అన్నిదిక్కుల్లో గాలిస్తున్నారామెకొరకు. అలాంటివారిలో ఒకడినైన నేను, జటాయువు సోదరుడు సంపాతి సలహామేరకు, ఆయన మాటలు నమ్మి, నూరామడల పొడవున్న సముద్రాన్ని దాటి లంకకొచ్చాను. సీతాదేవిని ఇక్కడ వెతుకుతున్న నాకు, నా పూర్వ పుణ్యఫలంవల్ల, శ్రీరాముడు చెప్పిన ఆకారం, వర్ణన, కాంతి, గుణం, సౌందర్యం వున్న పతివ్రత కనిపించింది.

ఇలా హనుమంతుడు అంటున్న మాటలను విన్న సీతాదేవి, ఆశ్చర్యపడి, కుటిలాలకాలను సవరించుకుంటూ తలపైకెత్తి, ఎవరీ మాటలు చెప్పుతున్నారా అని చెట్టువైపు చూసింది. ఇదేమన్నా రావణుడి మాయేమో అనుకుని, భయం, భయంగా, రాముడిని స్మరించుకుంటూ, చెట్టు కింద, మీద, ప్రక్కన, సందుల్లో చూడసాగింది సీత. (మృతసంజీవనం రామచరితం అని ఆర్యోక్తి. అంటే, చనిపోయేవారిని బ్రతికించేది రామమంత్రమట. ఆత్మహత్యకు సిద్ధపడిన సీతమ్మకు హనుమంతుడు చేసిన రామగుణగానం జీవివితంపైన ఆశలు చిగురింప చేసింది. సీతమ్మకు ఊపిరులూదింది. మరొక చమత్కారం కూడా వుంది. రామ కథని వివరించే సందర్భంలో కైక మాటను ప్రస్తావించకుండా, తండ్రి ఆజ్ఞ పైనే రాముడు అడవికి వచ్చాడని హనుమంతుడు పలకడం అతని వాగ్విదాంవరత్వానికి శుభ ప్రతీక కద!).

Thursday, March 15, 2018

Budgets reflect public aspirations : Vanam Jwala Narasimha Rao


Budgets reflect public aspirations
Vanam Jwala Narasimha Rao
Telangana Today (16-03-2018)

The Budget that has been presented to the state Legislative Assembly for the year 2018-2019, in all probabilities is the full-fledged budget before the 2019 elections to the Assembly. For the next financial year, it would be, most likely, a vote on account budget and the Government that comes to power will present the full-fledged budget later. Against this background, if we look back and review the various facets of budget presentations since 2014-2015, as well as various welfare and development programs initiated and implemented in the state, since formation, interesting aspects surface.   

The biggest challenge before KCR and his government immediately after coming to power was how to go about reinventing and reorienting Telangana. Towards Leveraging on transition for transformation KCR adopted a multi-pronged and multi-layered effort for reinventing and reorienting Telangana. Within a short time of the formation of the State, Telangana had undergone major transition from shackled to a growth-oriented economy, poor governance to strong and people-centric governance, from mere launching projects to effectively implementing them in a time bound manner and from promises to delivery.

KCR approach to the development of the State is not growth versus equity but growth and equality being addressed in tandem. CM firmly believed that mere growth has no meaning and even legitimacy, if the deprived sections of the society are left behind. Inclusive growth should not only ensure a broad flow of benefits and economic opportunities, but also encompass empowerment and participation. The initiatives taken by the State since its formation have been entirely guided by these compelling imperatives.

KCR and his Government had no clue in the beginning with regards the formulation of budget for the year 2014-2015, the first year the Government came to power. It was a big challenge. State was not aware of the actual resource position of the state. CM made it very clear to the senior officers that Budget was not a mere financial statement of accounts but a document that would unveil the Government’s policies which are in tune with the aspirations and needs of the people. Recognizing this imperative, the government has affected a paradigm shift by adopting the decentralized model of development, “Mana Vooru – Mana Pranalika”, through which suggestions were sought from people at village and ward levels to assess their felt needs. The State government also constituted 14 task forces and based on their reports, the first Budget of the Telangana State was presented to the State Legislature on November 5, 2015. The Budget for 2014-15 was in continuation of the Vote-on-Account Budget presented by the then Government of the undivided State.

The first full-year Budget for 2015-16 was prepared without the benefit of having estimates for the full 12 months of the previous year as the State was formed in June 2014. Though the tax devolution to the States was increased from 32 to 42 per cent of the divisible pool of the Central taxes for the five-year period of 2015-20 following the recommendations of the 14th Finance Commission, the benefit has bypassed the State of Telangana just because its per capita income is higher than the national average.

By the time, the preparation of the State budget for 2016-17 was underway, the government was able to get a comprehensive idea about the trends in the State finances.  It is only after the income and expenditure under Plan and Non-Plan schemes from 31st March 2015 to 31stMarch 2016 was known clearly, the real basis for Telangana State budget calculation was arrived at. The first-year budget after formation of Telangana was on ad-hoc calculation based on earlier budgets and the second-year full-fledged budget is based on some exercise. Subsequently there was a total understanding and deep study department wise, scheme wise and priorities wise.


Though the Budget for 2016-17 was the third Budget of the State, it was in a way, the first Budget to be prepared after a comprehensive review of all items of expenditure and a realistic assessment of resources based on the facts and figures available. It is a matter of great satisfaction that the State government was able to maintain a sustainable fiscal position despite mounting commitments because of number of developmental and welfare schemes taken up after the formation of the State. This has been achieved through improvement in the efficiency of revenue collections without any increase in tax rates. Telangana State stood first among all the states by clocking a growth rate of 21.1% in its own-tax revenue in 2016-17 over 2015-16.

In the process, the fourth consecutive Budget, for the year 2017-2018, was both inspirational and message oriented. The Budget reflected the Government’s objective of reaching out to all sections of people, all those in the hereditary professions, all religions, people working in various fields, all government departments that are entrusted with the implementation of development and welfare schemes, lower income as well as middle income groups and with no exception.

It’s no surprise that the Telangana State has emerged as the best economy state which speaks about the buoyant economy of the state. There has been a distinct upward shift in the growth path of the economy of Telangana since its formation in June 2014. The average annual growth of State Domestic Product (GSDP) increased from 4.2% in the two years preceding the formation of the state (2012-14) to an impressive growth of 9.5% during the three years following the formation of the State (2014-17). This apart, Telangana State stood first among all the States by clocking a growth of 21.10% in its own tax revenue in 2016-17 over 2015-16. In its report, CAG for the financial year 2017-18 stated that Telangana state stood first in the revenue growth rate in the country registering 17.82 per cent growth.

Against this background, the budget that has now been presented for the year 2018-2019 to the Assembly, mentions without any ambiguity as to how the schemes and programs that have been conceived and being implemented in the state during the last 45 months, could be standardized, stabilized and consolidated. The budget also makes it clear as to how state GSDP is improved and bettered. The financial stability and progress despite GST and demonetization has also been highlighted. In addition, there is a mention about the schemes that were conceived during 2017-2018 and the way they are going to be implemented in future. These among others include: Rs 8000 Investment Support Scheme for Agriculture, formation of Rythu Samanvaya Samithis, farmers’ insurance scheme, sheep distribution, employees welfare, 24-hour power supply to all including agriculture, more and more welfare measures, SC, ST, BC, Minority, Brahmin welfare, handloom industry development, KCR Kits etc. Keeping in view the current and future needs of people and recognizing the priority sectors like agriculture for reaching the results to all, the way the budget has been formulated speaks volumes. Yes…. It says and shows that this is the Role Model Budget and reflects the aspirations of public at large as the case of earlier four budgets. END