Monday, July 31, 2023

మోక్షకారకమైన విష్ణుమంత్రోపదేశాన్ని, విష్ణు సహస్రనామాలను, శివనామాలను ధర్మరాజుకు తెలియచేసిన భీష్ముడు ...... ఆస్వాదన-131 : వనం జ్వాలా నరసింహారావు

 మోక్షకారకమైన విష్ణుమంత్రోపదేశాన్ని, విష్ణు సహస్రనామాలను,

శివనామాలను ధర్మరాజుకు తెలియచేసిన భీష్ముడు

ఆస్వాదన-131

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (31-07-2023)

మోక్షం ఎట్లా కలుగుతుందని తెలుసుకోగోరిన ధర్మరాజు పరమపదం ఏవిధంగా లభిస్తుందో సెలవియ్యమని పితామహుడైన భీష్ముడిని ప్రశ్నించాడు. సమాధానంగా భీష్ముడు, శ్రీమన్నారాయణుడిని ధ్యానించడం, పూజించడం, స్తుతించడం, మనస్సులో మననం చేయడం, పుష్పాదులతో అర్చించడం, కీర్తనం చేయడం, అతడి పుణ్యకథలు వినడంవలన మోక్షం కలుగుతుందని అన్నాడు. అంతేకాక పండితులను, విద్వాంసులను కాపాడడం వల్ల కూడా పుణ్యం లభిస్తుందని చెప్పాడు.

పేదరికం తొలగడానికి, రోగాలు మానడానికి, దుఃఖాలు తీరడానికి తగిన జపమేదో చెప్పమని తాతగారిని కోరాడు ధర్మరాజు. సమాధానంగా భీష్ముడు ఇలా చెప్పాడు. ‘బ్రహ్మవిష్ణుమహేశ్వరులను, గణపతిని, కుమారస్వామిని, అగ్ని వాయుదేవుళ్లను, చంద్రసూర్యులను, ఇంద్ర, వరుణ, యమ, కుబేరులను, కామదేనువును, సప్తసముద్రాలను, పవిత్ర తీర్థాలను, సప్తమరుత్తులను, ఆశ్వినీదేవతలను, అష్ట వసువులను, ఏకాదశ రుద్రులను, పితృదేవతలను, మహర్షులను, వ్యాసవాల్మీకి మొదలైన మౌనీంద్రులను, ధర్మాలను, రాత్రిపగళ్లను, తారలను, నవగ్రహాలను, ఇరవైఏడు నక్షత్రాలను, కాలాన్నీ, గరుత్మంతుడు మొదలైన పక్షీంద్రాలను, సర్పరాజులను, పవిత్ర స్థలాలను, వనభూములను, కొండలను, దిక్కులను, ఆకాశాన్ని, భూమిని, వనస్పతులను, బ్రాహ్మణులను, చక్రవర్తులను, రాజులను అమితమైన భక్తితో స్మరించి, స్తుతించి, నమస్కరించి, కాపాడమని, దీర్ఘాయుష్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం ఇవ్వమని మదిలో ఆకాంక్షించాలి’.

‘ఆతరువాత, ఓం నమో భగవతే వాసుదేవాయ, నమః పురుషోత్తమాయ, నమ స్సర్వలోక గురవే, నమ స్సర్వలోకపితామహాయ,  నమ సర్వలోక ప్రపితామహాయ, నమ స్సర్వలోక గురవే, నమ స్సర్వలోక పిత్రే, నమ స్సర్వలోక పితామహాయ, నమ స్సర్వలోక ప్రపితామహాయ, నమ స్సర్వలోక ప్రధానాయ, నమ స్పర్వలోకేశ్వరాయ, నమ సర్వలోక విశిష్టాయ, నమ స్సర్వలోక సుఖప్రదాయ, నమ స్సర్వలోక కర్త్రే, నమ సర్వలోక భర్త్రే, నమ సర్వలోక హర్త్రే, నమ స్సర్వలోక నిధయే, నమ స్సర్వలోక నిధానాయ, నమ స్సర్వలోక హితాయ, నమ సర్వలోకహితకరాయ, నమ సర్వలోకోద్భవాయ, నమ స్సర్వలోకోద్భవకరాయ, నమో విష్ణవే, ప్రభవిష్ణవే అని విష్ణు సహస్రనామాలు జపించటమే మహాజపం’.

(ఈ సందర్భాన్ని విశ్లేషిస్తూ డాక్టర్ ఎమ్ కులశేఖరరావు, శ్రీ ముదివర్తి కొండమాచార్యులు ఇలా రాశారు. “సర్వ దారిద్ర్యాలను, సర్వ దుఃఖాలను పోగొట్టి మోక్షం ప్రసాదించే మంత్రం చెప్పమని ధర్మరాజు అడిగినప్పుడు భీష్ముడు విష్ణుమంత్రోపదేశం చేశాడు. భగవన్మంత్రాలు అనేకం. వాటిల్లో వ్యాపకా మంత్రాలు శ్రేష్టం. సకల వేదాలలో నారాయణుడిని మించిన వేల్పులేనట్లే అన్ని మంత్రాలలో అష్టాక్షరిని మించిన మంత్రం లేదు. ‘ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మహామంత్రం పరమోత్తమం”). ఈ విష్ణుమంత్ర జపం చేయడం వల్ల పాతకాలు, భయాలు, కష్టాలు తీరుతాయని, శుభాలు ఇహపర సౌఖ్యాలు లభిస్తాయని, ధర్మం మీద ఆసక్తి కలుగుతుందని భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించాడు. 

లోకాలన్నింటికీ మహానీయమై ఆశ్రయించి అనుభవించదగిన దైవం ఎవరని, అర్చనతో, స్తుతితో ఎవరిని కొలిస్తే  జనులు శుభాన్ని పొందుతారని, అనేక ధర్మాలలో ఉత్తమమైన అభిమతాన్ని చూరగొనేది ఏదని, జపాలన్నిటిలో ఉత్తమజపం ఏదని, తనను జపించేవారికి జన్మనూ, సంసార బంధాలను పోగొట్టేది ఏదని ప్రశ్నించాడు ధర్మరాజు భీష్ముడిని. సమాధానంగా ఇలా చెప్పాడు భీష్మపితామహుడు.

‘సమస్త జగత్తులకు ప్రభువు, దేవదేవుడు, అనంతుడు, పురుషోత్తముడనే పేరుగలవాడి సహస్రనామాలను నిరంతరం స్తుతిస్తూ, జాగృతమనస్కుడై యజ్ఞకర్తను, అవ్యయుడైన అతడిని అర్చనం చేస్తూ, ధ్యానంతో నమస్కరిస్తూ, ఆద్యంతాలు లేని ఆ విష్ణుదేవుడిని, సర్వలోకాధ్యక్షుడిని, బ్రహ్మణ్యుడిని, త్రిలోకకీర్తివర్ధనుడిని, సర్వధర్మాలు తెలిసినవాడిని, దయామయుడిని, లోకనాథుడిని, పంచభూతాల ఉత్పతికి కారకుడైన వాడిని నమ్మి భక్తితో సేవిస్తే అతడు దుఃఖాలనన్నింటిని దూరంగా గెంటి వేయగలడు. పుండరీకాక్షుడిని పరమభక్తితో పూజించటమే ధర్మాలన్నింటికంటే ఉత్తమ ధర్మం.  పరబ్రహ్మమైన ఆ విష్ణుదేవుడి సహస్రనామ సంకీర్తనం, పాపాలను, భయాలను పోగొట్టుతుంది. సకల సంపదలను సమకూరుస్తుంది’.

‘విశ్వము, విష్ణుడు, వషట్కారుడు, భూత భవ్యభవత్ప్రభువు మొదలైన నామాలతో మొదలుపెట్టి రథాంగపాణి, అక్షోభ్యుడు, సర్వప్రహరణాయుధుడు' అనే నామాలు తుదిగాగల విష్ణు సహస్రనామాలను భీష్ముడు ఉపదేశించాడు. తరతరాలుగా ఆ సహస్రనామాలు ప్రసిద్ధికెక్కాయని తెలిపాడు. విష్ణు సహస్ర నామాలను నిత్యం పఠించిన మనుష్యుడు ఇహపర శుభాలను పొందుతాడని, చతుర్వర్ణాల వారికి బహువిధ లాభాలు కలుగుతాయని, చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధి కలుగుతుందని, సర్వవిధ అరిష్టాలకూ దుఃఖాలకూ దూరమై పరమపదం పొందుతారని, విష్ణు వొక్కడే మహాభూతమని, భూతములెన్ని ఉన్నా త్రిలోకవ్యాప్తుడుగా ఆయన విస్తరించి ఈ విశ్వాన్ని అనుభవిస్తాడని చెప్పిన భీష్ముడు, వ్యాసవిరచితమైన విష్ణు సహస్రనామాలను పఠించి శుభాలు సుఖాలు అనుభవించుమని ధర్మరాజుతో అన్నాడు. విష్ణుదేవుడి వెయ్యి నామాలను ఎల్లప్పుడూ పఠిస్తే ధర్మరాజుకు దీర్ఘాయుష్యం, ఐశ్వర్యం, వైభవం, ఆరోగ్యం, ఉత్తమ జ్ఞానం కలుగుతాయని చెప్పాడు భీష్ముడు.

ధర్మరాజు అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా భీష్ముడు పూజా నమస్కారాలకు బ్రాహ్మణులు తగినవారని, వారికి అశుభం కలిగితే ఇంద్రుడికి కూడా కీడు కలుగుతుందని, వారికి సంతోషం కలిగితే అన్ని శుభాలు కలుగుతాయని చెప్పగా, బ్రాహ్మణులలో మెచ్చుకొనదగిన ప్రవర్తన ఏమున్నదని ప్రశ్నించాడు ధర్మరాజు. ఆయన ప్రశ్నకు సమాధానం పవన-కార్తవీర్యార్జున సంవాదం అనే ఇతిహాసంలో లభిస్తుందని అంటూ దాని సారాంశాన్ని ఇలా వివరించాడు భీష్ముడు.

‘వేయి భుజాలుగల కార్తవీర్యార్జునుడు సప్తద్వీపాలకు అధిపతి అయి తనంత వారెవ్వరూ లేరని గర్వించాడు. ఒక భూతం బ్రాహ్మణుల ఆధిక్యాన్ని గురించి అతడికి చెప్పింది. బ్రాహ్మణులు రాజులను ఆశ్రయించి జీవిస్తారని అతడు ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు. ఆ సమయంలో వాయువు చొరవతీసుకొని బ్రాహ్మణశక్తి వలననే రాజులు ప్రజలను రక్షిస్తున్నారని, బ్రాహ్మణులను మించినవారు లేరనీ పేర్కొన్నాడు. గౌతముడు, భృగుమహర్షి, ఉచథ్యుడు, అగస్త్యుడు, వసిష్టుడు, అత్రి, భార్గవచ్యవనుడు, దత్తాత్రేయుడు మొదలైనవారి మహిమలు చెప్పి బ్రాహ్మణులను దైవస్వరూపులుగా భావించి వారి నీడలో ప్రకాశించడం శుభమని వాయువు హితవు చెప్పాడు. కార్తవీర్యార్జునుడు వాయువు మాటలలోని సత్యాన్ని గ్రహించి బ్రాహ్మణులను గౌరవించాడు’.

భీష్ముడు చెప్పినదంతా విన్న ధర్మరాజు బ్రాహ్మణ ప్రభావాన్ని ఇంకా ఇంకా వినాలని వుందని, మరింత వివరించుమని ప్రార్థించాడు పితామహుడిని. దానికి భీష్ముడు, బ్రాహ్మణ మహిమను తనకంటే శ్రీకృష్ణ భగవానుడు చాలా చక్కగా విశదపరుస్తాడని అంటూ ఆయన గురించి చెప్పాడిలా. ‘నేను శ్రీకృష్ణుడిని బాగా ఎరుగుదును. ఆదివరాహ రూపంలో భూమిని ఉద్దరించిన విష్ణువు అతడే. అతడి లీలలవలననే పంచభూతాలు ఉద్భవించాయి. అతడి నాభికమలం నుండి పుట్టిన బ్రహ్మ ఈ లోకాలను సృష్టించాడు. శ్రీకృష్ణుడి లీలలు సామాన్యమైనవి కావు.  ధర్మాలకు రాక్షసులవలన గ్లాని కలిగితే తాను అవతరించి అసురులను సంహరించి ధర్మాన్ని, ధర్మాత్ములను కాపాడుతాడు. శ్రీకృష్ణుడు శుచి, సర్వవ్యాపి, శివుడు. అతడే దిక్పాలకుడు, విశ్వనాథుడు, కాలస్వరూపుడు. దిక్కులు మొదలైన సమస్తం అతడే, అతడు యజ్ఞపురుషుడు, సర్వమంత్ర తంత్రగమ్యుడు. ఋగ్వేదం శ్రీకృష్ణుడి మహాత్మ్యాన్ని కీర్తించింది. సర్వవేదాలూ అతడి తత్త్వాన్నే ప్రతిపాదిస్తాయి. యజ్ఞంలో అగ్నీ, యజమానుడూ, ఆహుతులూ, యాగఫలం కూడా కృష్ణుడే. సూర్యచంద్ర నక్షత్రాలలోని వెలుగు అతడే. అతడే పరంజ్యోతి. స్వర్గం, అమృతం, వేదాంత వేద్యుడు అతడే’.  

భీష్ముడు చెప్పిన విధంగానే ధర్మరాజు, ‘బ్రాహ్మణ మహాత్మ్యాన్ని వివరించ కోరుతున్నా’నని, శ్రీకృష్ణుడితో అన్నాడు. దానికి సమాధానంగా ఆయన ఇలా చెప్పాడు. ‘నే నిదివరలో ప్రద్యుమ్నుడికి చెప్పినట్లు నీకు వివరిస్తాను. ధర్మార్థకామమోక్షాలను సంపాదించాలన్నా, వేదత్రయ విజ్ఞానాన్ని సంపాదించాలన్నా, మోక్షాన్ని సాధించాలన్నా, పితృదేవతల దయ పొందాలన్నా, ఐహిక సుఖాలు గడించాలన్నా బ్రాహ్మణులను ఆశ్రయించాలి. ఆయురారోగ్య యశస్సంపదలు వారివలన లభిస్తాయి. కోరితే వారు వరాలు ఇవ్వగలరు. కోపిస్తే భస్మం చేయగలరు. వారికి ఉన్నదానిలో దానం చేసి వారిని తృప్తి పరిస్తే ఇహపరసుఖాలు కలుగుతాయి’. ఇలా చెప్పి శ్రీకృష్ణుడు, ఏవిధంగా దుర్వాస మహర్షి తన మనశ్శుద్ధిని పరీక్షించి అనుగ్రహించాడో వివరించాడు. అదిలా సాగింది.

‘స్వతంత్రవర్తనుడైన దుర్వాసుడు ఒకసారి మా ఇంటికి వచ్చాడు. చిత్రవిచిత్రంగా వ్యవహరించాడు. ఒకసారి ఒంటినిండా పాయసాన్ని పూయించుకొన్నాడు. రథానికి రుక్మిణిని కట్టి లాగించి బాధించాడు. ఆమె మూర్ఛపోగా రథాన్ని వదలి వెడలిపోయాడు. నేను అతడివెంట వెళ్లి అనునయించి ప్రార్థించాను. అతడు ప్రసన్నుడై “అందరూ తమను తాము ఎంత ప్రేమించుకొంటారో అంతగా నిన్నుకూడా ప్రేమించి పూజిస్తా” రని నాకు వరం ఇచ్చాడు. పాయసం అరికాలికి పూయలేదని చెప్పి దానివలన నాకు ప్రమాదముంటుందని సూచించాడు. అయితే, కలగనున్న ఆ ఆపద వల్ల నాకు వైకుంఠప్రాప్తి కలుగుతుందని అన్నాడు. రుక్మిణికి అపూర్వ సౌందర్యాన్ని, భర్తృవాల్లభ్యాన్ని ప్రసాదించాడు. కాబట్టి బ్రాహ్మణులపట్ల భక్తి కలిగి ఉండడంవలన శుభాలు చేకూరుతాయి’.

ఆ తరువాత ధర్మరాజు కోరగా శ్రీకృష్ణుడు శివుడి మహిమను, దుర్వాసుడు శివాంససంభూతుడు అనడానికి కారణాన్ని వివరించాడు ఇలా. ‘ఎవరు శివుడిని మనస్సులో నిలుపుకొని శతరుద్రీయ (నమకాన్ని) మంత్రాన్ని జపిస్తారో వారు ఇహపరసుఖాలు పొందుతారు. శివుడు మహాదేవుడు. దానికి మించిన పేరు మరొకటి లేదు. అతడి మూడవ కంటిమంట ధర్మవిరోథులను కాల్చివేస్తుంది. దక్షుడి యజ్ఞం ధ్వంసం కాలేదా? త్రిపురాసుర సంహారం ఆ దేవుని ప్రతాపానికి చిహ్నం. త్రిపురాసురులను సంహరించిన అస్త్రాన్ని, ఆ దేవుడు ఒడిలో పెట్టుకొనగా, అది బాలుడుగా మారింది. ఆ బాలుడే దుర్వాసుడు’.

‘శివ నామాలన్నీ చెప్పి వివరించటానికి బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. శివుడు సార్థకనాముడైన మహేశ్వరుడు. ఉగ్రత్వము, ఉన్నత ప్రతాపం ఉండటంచేత రుద్రుడయ్యాడు. దేవతలలో కెల్ల గొప్పవాడు కావున మహాదేవు డయ్యాడు. సత్కర్మఫలాలైన శుభాలు కలిగినవాడు కావటం చేత శివుడయ్యాడు. సుస్థిర తేజస్సుతో వెలుగొందడం వల్ల స్థాణువు అయ్యాడు. జంగమాత్మక రూపాలనన్నింటిని పొందటంచేత బహురూప నామధారి అయ్యాడు. పొగరంగు లాంటి జటలు కలిగినవాడు కావడం వల్ల ధూర్జటి అయ్యాడు. విశ్వులనే దేవతలు అతడియందు పుట్టారు కాబట్టి విశ్వరూప నామధేయు డయ్యాడు. తన శరీరంలో బహునేత్రా లుండటంవలన సర్వతశ్చక్షువనే  నామంతో ఒప్పుతున్నాడు. భూతములన్నీ పశువులై తాను వాటికి పతి కావటంచేత పశుపతి అయ్యాడు. నందివాహనుడు కావటంచేత వృషవాహను డయ్యాడు. ప్రాణులను సమభావంతో పాలిస్తాడు కాబట్టి మృత్యువయ్యాడు. ఇవన్నీ వేదాలలో చెప్పిన శివనామాలు. ఇంకా ఎన్నో పేర్లు శివుడికి ఉన్నాయి. వేదవేత్తలు వాటిని తెలిసి శివానందులై విహరిస్తారు. శివనామావళిని భక్తితో చదివినా, విన్నా ఇహపరలోకంలో సౌఖ్యానందాలు జనులు పొందుతారు’.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఆనుశాసనిక పర్వం, పంచమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

Thursday, July 27, 2023

‘(Skanda Purana) Encyclopedic in Character’ : Vanam Jwala Narasimha Rao

 ‘(Skanda Purana) Encyclopedic in Character’

Vanam Jwala Narasimha Rao

Millennium Post (28-07-2023)

Performing ‘Satyanarayana Vratam and (worship) Pooja’ and interestingly listening to the five-chapter story (Katha), for health, wealth, prosperity, and wellbeing in all aspects, is an established, acknowledged, and sanctified tradition in every Hindu Family in many parts of India, particularly in Telugu States, as well as in many parts of globe by Non-Resident Indians with equal interest. Narrating the five stories, the Priest (Pujari), quotes chapters from ‘Skanda Purana’ and ‘Reva Khanda.’ Importance of Pooja and its process is believed to be retold by ‘Great Sage Suta’ to ‘Shounaka Sages’ in Naimisha Forest. Skanda Purana with Reva Khanda is one of the 18 (Astha Dasha) famous Puranas originally authored by Great Sage ‘Veda Vyasa.’

Puranas were written according to Indian Tradition form important branch of sacred literature depicting true purpose of ethics, philosophy, Indian culture, tradition, and religion of Vedas. They are the frameworks of Dharma shastra. They describe Evolution of the Mankind and ‘Eternal Cycle of Creation, Destruction and Recreation of world.’ Puranas also reflect in detail the contemporary ‘Life and Thought of the Society.’ The trinity of gods Brahma, Vishnu and Maheshwara is one divinity associated with the three cosmic functions of Creation, Preservation and Destruction of the Universe.

18 Puranas are, Markandeya, Matsya, Bhagavata, Bhavishya, Brahmanda, Brahma Purana, Brahma Vivarta, Vishnu, Varaha, Vamana, Vaayu, Agni, Narada, Padma, Linga, Garuda, Kurma, and Skanda. The oldest and the largest publishing house in India Motilal Banarsidass, among others published the Skanda Purana in 23 Parts in English. These volumes contain legends of Shiva, especially his battles with Daityas and Danavas. There are sections of Yoga, Dhyana (Meditation), and Jnana (Knowledge). It describes Shiva temples around Varanasi.

Skanda Purana is ‘Encyclopedic in Character’ and throws light on different topics of general interest. Skanda Purana is huge one and supposed to be the biggest Purana in size, consisting of 81000 verses narrated by Skandha. Some differ and say that it consisted of a hundred thousand verses. Motilal Banarsidass in the introduction and publisher’s note a brief account of Skanda Purana is given and mentioned that it is a mine of social, cultural, political, historical, geographical, religious, and philosophical information. It further said that, Mahabharata regards pilgrimage to Tirthas more meritorious than sacrifices, and the Skanda Purana is not one book but a library of such Sthal (Place) Puranas or Tirtha (Holy waters) Mahatmyas (Greatness).

Skanda Purana with reference to Tirthas, according to Motilal Banarsidass Publishers, is especially important as it covers practically the major parts of India. It describes the topography, cultural traditions etc. of the Himalayan region of Uttara Pradesh, Orissa, Malwa Rajasthan and a part of Gujarat western India along with Gujarat and South India. Though Veda Vyasa was the original author of all Puranas, it is however believed that, the greatness of these Tirthas were written at different times by different authors and hence the criticism or evaluation of a particular Khanda as comparatively inferior, should not be regarded as applicable to the whole of Skanda Purana.

Skanda Purana contributing to longevity and pleasing to the people of four Varnas was certainly created by the great souled Skanda. It is found in two versions or forms namely Khandas and Samhitas. Samhitas are six in number namely, Sanat kumara, Suta, Shankari, Vaishnavi, Brahmi and Saura. The Seven 'Khandas' or Branches are Maheswara Khanda, Vishnu Khanda, Brahma Khanda, Kasi Khanda, Avanthya Khanda, Nagara Khanda and Prabhasa Khanda. In the list Reva Khanda does not figure. Skanda Purana strongly asserts equality between man and man, and the theme is also voiced in other Puranas. For instance, Varnas are born with respect to duties of an individual as Brahmanas, Kshatriyas, Vaishyas and Sudras.

Satyanarayana Vratam forming part of Reva khanda, is unacceptable to few historians, on the assumption that, Skanda Purana as we have it now has considerable insertions in the original Text. In spite of this, nowhere the story is heard, without reference to Skanda Purana and Reva Khanda. The stories are quite interesting and it generates added interest depending on the talent and skill of Priest (Pujari), which these days is bit scarce. Chapter One is about genesis of Satyanarayana Vrata as retold by ‘Great Sage Suta’ in Naimisha Forest to ‘Shounaka Sages,’ quoting Sage Narada and briefed to him by Lord Vishnu.

In Chapter Two, the story of a very poor Brahmin living in the city of Kashi was told by ‘Sage Suta’ to ‘Shounaka Sages.’ In the story on completion of his Satyanarayana worship, how he gained wealth, children, happiness, and prosperity and attained salvation on death is mentioned. Chapters Three and Four deal with the story of king Ulkhamukha, merchant Sadhu, his family and King Chandraketu is described. In Chapter Five, the story of King Thungadhvaja performing pooja and benefiting is mentioned. The essence of these stories is, whoever performs Satyanarayana worship and listens to stories will obtain riches and wealth and will live happily before attaining salvation after death. 

Motilal Banarsidass having established a book shop in 1903 at Lahore (Pakistan), after an unforeseen experience as a result of partition of India in 1947, built everything from ground up in India post partition. Focusing on publication of books of lasting value that delve deep in cultural heritage of India and Indian Philosophy, which was being greatly appreciated by the west. Having understood the importance of Puranas in which, precious information is available, and which with the passage of time becomes obsolete, the publishers therefore planned to help the interested to acquire knowledge by an easier course and started the series of Ancient Indian Tradition and Mythology in English translation, the international medium of expression. This included Skanda in English supposed to be of their authentic version.

The oldest and the largest publishing house in India, Motilal Banarsidass Publishers as a modest start in 1903, by Lala Motilal, a descendent from the family of Court Jewelers to Maharaja Ranjit Singh, set up a family business by opening a Religious Bookshop at Lahore managed by his son Lala Banarsidass who died at a young age in 1912.  His younger brother Lala Sunder Lal, a man of vision took over the responsibility of managing the Bookshop. He started publication of ancient Sanskrit works in the manifold branches of this extensive literature seeking cooperation from many scholars. Skanda Purana in 23 Parts in English is among them.

Soon, a printing unit was set up and the publishing house was established. In 1937, a branch was started in Patna at the suggestion of former President Dr Rajendra Prasad. Post independence, the family moved to India and initially stayed at Bikaner and Patna, before moving to Varanasi in 1950, where it set up shop in 1951, and finally shifted base to Delhi in 1958. Their publications include a variety of subjects that included for instance, Social Sciences, Philosophy, History And Culture, Psychology, Epigraphy, Language and Literature, Health, Religion and Ethics etc. Either for buying books or for getting any book published by Motilal Banarsidass, It is easy to contact them at their Headquarter at Bungalow Road, Near McDonald's, Block UA, Jawahar Nagar, Kamla Nagar, Delhi (www.motilalbanarsidass.com).  Branches in Varanasi and Patna. (The writer is Chief Public Relations Officer to Chief Minister Telangana).

Wednesday, July 26, 2023

విద్యుత్ విజయాలపై కుటిల విమర్శలు : వనం జ్వాలా నరసింహారావు

 విద్యుత్ విజయాలపై కుటిల విమర్శలు

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (27-07-2023)

(తెలంగాణ రాష్ట్రంలో నేడు 15,497 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వున్నా, ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా సరఫరా చేయగలగడం రాష్ట్ర పురోగతికి చిహ్నం. భారీ పరిశ్రమలకు, చిన్న పరిశ్రమలలకు పవర్ హాలీడేలు పోయి ప్రతిరోజూ, ప్రతి నిమిషం విద్యుత్ అందుబాటులో వుంటున్నది. పారిశ్రామిక ప్రగతికి, వ్యవసాయ వృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాల పెంపుకు విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతి చోదకశక్తిగా మారింది-సంపాదకుడి వ్యాఖ్య)

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత, గత తొమ్మది సంవత్సరాలలో, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అత్యంత ప్రాదాన్యతనిచ్చి, యావత్ దేశంలో అగ్రగామిగా మలచిన రంగం విద్యుత్. కానీ జరిగిన మంచిని ప్రస్తావించే కనీస మర్యాద లేని కొందరు రాజకీయప్రముఖులు, కేసీఆర్ కు ఏమాత్రం సంబంధంలేని, పదమూడేళ్ల క్రితం జరిగిన కాల్పుల సంఘటనను పేర్కొంటూ, అసబ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్లో చులకన అవుతున్నారు. అంతే కాకుండా తెలంగాణాలోని 95% రైతులు మూడెకరాల లోపు వారేననీ, వారికి రోజుకు 8 గంటల పాటు విద్యుత్ ఇస్తే సరిపోతుందనే అభిప్రాయాన్ని కూడా వెల్లడి చేశారు.

13 సంవత్సరాల క్రితం జరిగింది ఏమిటి, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి ప్రమేయంతో జరిగింది, ఆ తదనంతర పరిణామాలే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎలా నాంది-ప్రస్తావన అయ్యాయి, అనే వాస్తవాన్ని అవగాహన చేసుకోకపోవడమూ దురదృష్టకరమే. చంద్రబాబునాయుడు రెండోపర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ విద్యుత్ చార్జీలను వున్నఫలంగా పెంచేసింది ఆయన ప్రభుత్వం. ఎన్టీరామారావు కాలంనుంచి సబ్సిడీపై కరెంటు పొందుతున్న రైతులు చంద్రబాబు నిర్ణయంతో అవాక్కయ్యారు పెంచిన వ్యవసాయ విద్యుత్ చార్జీలను తగ్గించాలని రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేశారు. చివరికి 2000 ఆగస్టులో ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ఆ నిరసనపై చంద్రబాబు ప్రభుత్వం కాల్పులు జరపడంతో ముగ్గురు రైతులు హైదరాబాద్ నగర నడిబొడ్డున బషీర్ బాగ్ లో ప్రాణాలు వదిలారు.

నాటి బషీర్ బాగ్ కాల్పుల ఘటన తెలుగుదేశం పార్టీలో అప్పుడు కీలక నేతగా, శాసనసభ ఉపసభాపతిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హృదయాన్ని తీవ్రంగా గాయపరిచింది. రైతుల గోస తనపార్టీ ప్రభుత్వానికే పట్టకపోవడం, వారిపట్ల అత్యంత రాక్షసంగా వ్యవహరించడం కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారు. తక్షణమే తన అసంతృప్తిని తెలియచేస్తూ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో, యావత్తు తెలంగాణ వ్యవసాయమే మోటార్లపై ఆధారపడి ఉంటుందనీ, ఆ మోటార్లకు కరెంటే ప్రాణాధారమనీ, అసలే అరకొరగా, నష్టాలతో సాగే వ్యవసాయానికి పెంచిన కరెంటు చార్జీలు మరణ శాసనంగా మారాయనీ, వెంటనే పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించమనీ, తెలంగాణ రైతుల సహనాన్ని పరీక్షించవద్దనీ పేర్కొన్నారు.

అప్పటికే నిధుల విషయంలో, సాగునీటికి కావాల్సిన ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో, నియామకాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కేసీఆర్, బషీర్ బాగ్ కాల్పుల ఘటన తర్వాత తెలుగుదేశంలో కొనసాగడం సరైనదికాదనే నిర్ణయానికొచ్చారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప రైతుల కష్టాలకు ముగింపు ఉండదని భావించి, దాని సాధనకొరకు తానే ముందుండి పోరాడాలని నిర్ణయించుకున్నారు. అలా కేసీఆర్ ఉద్యమ రంగంలోకి దిగడానికి విద్యుత్ చార్జీల పెంపుదల, బషీర్ బాగ్ కాల్పుల సంఘటన ప్రత్యక్ష-పరోక్ష కారణాలయ్యాయి. వ్యవసాయ విద్యుత్ విషయంలో సమైక్య పాలకులు అవలంభించిన అతి నీతి బాహ్యమైన వైఖరే మలిదశ తెలంగాణ ఉద్యమానికి బలీయమైన కారణమైంది. చివరకు తెలంగాణ ఏర్పాటు సాధ్యమైంది.   

వ్యవసాయ ఆధారిత తెలంగాణ రైతులకు మాత్రం విద్యుత్ ఓ ప్రాణాధారం. సమైక్య అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్తు పంపిణీ, చార్జీలు, నాణ్యత, అశాస్త్రీయంగా వుండడమే కాకుండా, వివక్షతతో కూడుకునేవి కావడంతో తెలంగాణ వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. రైతన్నలు వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకునేవారు. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న నేటి పరిస్థితికీ, 2014కు ముందు విద్యుత్ కోసం అర్రులు చాచిన పరిస్థితికి పోల్చి చూస్తే తెలంగాణ ప్రస్థానంలో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ఇవేవీ కువిమర్శలు చేస్తున్నవారికి కనిపించక పోవడం బాధాకరం.

ఈ సమస్యను లోతుగా విశ్లేషించి, గతంలోకి తొంగిచూస్తే మరికొన్ని విషయాలు మననం చేసుకోవచ్చు. సమైక్య పాలకుల నిర్లక్ష్యంవల్ల తెలంగాణలో నిర్మించాలని ప్రతిపాదించిన సాగునీటి ప్రాజెక్టులన్నీ కాగితాలకే పరిమితం అయ్యాయి. ప్రాజెక్టుల కింద కాలువలు నిర్మించడం జరగలేదు. కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులు ధ్వంసమవుతున్నప్పటికీ పాలకులు నిర్లక్ష్యం వహించారు. తెలంగాణ రైతులకు సాగునీరు పెద్ద సమస్యగా మారి, విధిలేని పరిస్థితుల్లో లక్షలాది రూపాయల వ్యయంతో సొంతంగా బోర్లువేసి, మోటార్లు పెట్టుకున్నారు. తెలంగాణ వచ్చే నాటికే 24 లక్షలకు పైగా పంపుసెట్లు వేసుకున్నారు. ఇంత చేసినప్పటికీ రైతులకు కావాల్సినంత విద్యుత్ వచ్చేది కాదు.

వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ సరఫరా చేయడానికి అవసరమైన హైటెన్షన్ లైన్లు, సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లు సరిగ్గా ఉండకపోవడంతో లోఓల్టేజీ సమస్య ఎదురయి, మోటార్లు తరచూ కాలిపోయేవి. అదనపు ట్రాన్స్ ఫార్మర్లు లేకపోవడంతో అధిక లోడ్ పడి అవి కూడా పేలిపోయేవి. కాలిపోయిన మోటార్లను రైతులే తమ స్వంత ఖర్చులతో మరమ్మతులు చేయించుకోవాల్సిన దుస్థితి. ఇది ఆర్థిక భారమే కాకుండా, కొత్త ట్రాన్స్ ఫార్మర్ వచ్చేవరకు చాలాజాప్యం జరిగేది. ఈలోగా పంటలు ఎండిపోయేది. నాటి దుస్థితి నేపధ్యంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నినాదంతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని (టీఆర్ఎస్) స్థాపించడం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత రైతులకు ఉచిత, నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందని హామీ ఇవ్వడం సమకాలీన చరిత్ర .

2004 ఉమ్మడి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఉచిత విద్యుత్ హామీ ఇవ్వడం, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో టిఆర్ఎస్ పొత్తు పెట్టుకుని ఉండడం, ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఉచిత విద్యుత్ హామీని నామమాత్రంగా అమలు చేయడం జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినప్పటికీ, పారిశ్రామిక, వాణిజ్య, గృహ తదితర అవసరాలు తీరిన తర్వాత మాత్రమే, చివరి ప్రాధాన్యతగా, అదీ రాత్రి వేళల్లోనే, మూడు నాలుగు గంటలకు మించకుండా వ్యవసాయానికి ఇచ్చింది. రాత్రి పూట వచ్చే కొద్దిపాటి కరెంటుతో మోటార్లు నడిపించడానికి వెళ్లిన రైతులు కరెంటు షాకులతో, పాము కాట్లతో మరణించిన సంఘటనలు తెలంగాణలో కోకొల్లలు. వీటికి తోడు లో ఓల్టేజీ సమస్య. ఈ నిర్లక్ష్య వైఖరివల్ల ఆచరణలో అది విజయవంతం కానేకాలేదు. ఈ పరిస్థితిని ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రముఖంగా ప్రస్తావించేవారు. తెలంగాణ వస్తే తప్ప రైతుల విద్యుత్ కష్టాలు తీరవని స్పష్టం చేసేవారు. రైతుల్లో కేసీఆర్ పట్ల విశ్వసనీయత కలిగింది.

జూన్ 2, 2014 న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత తెలంగాణను మొట్ట మొదట చుట్టు ముట్టిన సమస్య విద్యుత్ సంక్షోభమే. 2,500 మోగావాట్ల లోటుతో తెలంగాణ రాష్ట్రం తన ప్రస్తానాన్ని ప్రారంభించింది. విద్యుత్ సమస్యను సత్వరం పరిష్కరించి, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, స్వల్ప, మధ్యకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలను రచించారు. స్వల్పకాలిక వ్యూహంలో భాగంగా తక్షణావసరాల నిమిత్తం ఎక్కడ ఎంత విద్యుత్ లభ్యమవుతే అంత కొనుగోలు చేసి తెలంగాణను దేశంలోనే ప్రప్రథమ విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా మార్చారు. ఫలితంగా తెలంగాణ ఏర్పడిన ఆరు నెలల్లోనే వ్యవసాయానికి 9 గంటలు, మిగతా రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా జరిగింది.

కేసీఆర్ అంతటితో సంతృప్తి చెందలేదు. మిగతా వారికిచ్చినట్లే వ్యవసాయానికి కూడా 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయగలిగినప్పుడే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఫలితం రైతులకు దక్కినట్టు భావించేవారు. రైతులకు 24 గంటలకు కరెంటు ఇవ్వడం వల్ల పెరిగే ఆర్థిక భారం, గ్రిడ్ సమస్యలు, ఇతరత్రా ఇబ్బందులను లక్ష్యపెట్టకుండా అది అమలు చేయాలని  విద్యుత్ శాఖను ఆదేశించారు. విద్యుత్ రంగ నిపుణుడు, ఆ రంగంలో అపార అనుభవం కలవాడు, ఆ శాఖ చైర్మన్-మానేజింగ్ డైరెక్టర్ దేవులపల్లి ప్రభాకర రావు కేసీఆర్ ఆదేశాలను యధాతథంగా అమలుచేయడానికి, పటిష్ట కార్యాచరణ పథకం రూపొందించి, రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వడానికి కావాల్సిన సాంకేతిక, ఇతర ఏర్పాట్లు చేశారు. వేలకోట్ల రూపాయల వ్యయంతో కొత్త సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లు, లైన్లు ఏర్పాటయ్యాయి. అంతా సవ్యంగా జరిగి 2018 జనవరి 1 నుంచి రాష్ట్రంలో 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతున్నది. ఇలా ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ దేశ చరిత్రలోనే నూతనాధ్యాయం లిఖించుకున్నది.

గతంలో మాదిరిగా ఇప్పుడు విద్యుత్ కోతలు లేవు. లో ఓల్టేజీ సమస్యలు లేవు. మోటార్లు నడవక పంటలు ఎండిపోయే పరిస్థితి లేదు. సబ్ స్టేషన్ల ముందు రైతుల ధర్నాలు లేవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉండే విద్యుత్ వల్ల, మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల వల్ల, పెరిగిన భూగర్భ జలాల అండతో, రైతులు సమృద్ధిగా పంటలు పండిస్తూ, తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా అవతరించింది. మహా స్వాప్నికుడు కేసీఆర్ కన్న కల వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, గత ఐదేళ్లకు పైగా అమలవుతూ అద్భుతాలు సృష్టిస్తున్నది. కేసీఆర్ పాలనా దక్షతకు ఇది మచ్చు తునక.

తెలంగాణ రాష్ట్రంలో నేడు 15,497 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వున్నా, ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా సరఫరా చేయగలగడం రాష్ట్ర పురోగతికి చిహ్నం. భారీ పరిశ్రమలకు, చిన్న పరిశ్రమలలకు పవర్ హాలీడేలు పోయి ప్రతిరోజూ, ప్రతి నిమిషం విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. పారిశ్రామిక ప్రగతికి, వ్యవసాయ వృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాల పెంపుకు విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతి చోదకశక్తిగా మారింది. స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం వందశాతం పెరిగింది. పెరిగే విద్యుత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని 28వేలకు పైగా మెగావాట్లకు తీసుకుపోవడమే కాకుండా మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.

యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంటు, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణం చురుగ్గా సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రికార్డు సమయంలో కెటిపిఎస్ 7వ యూనిట్ పూర్తయింది. ఉత్పత్తితో పాటు సరఫరాలో మెరుగుదల గణనీయంగా పెరిగింది. ప్రగతి సూచికైన తలసరి విద్యుత్ వినియోగం వృద్దిలో దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ, గరిష్ట డిమాండ్ లో గణనీయమైన వృద్ధి, వ్యవసాయ కనెక్షన్ల మంజూరులో గణనీయమైన వృద్ధి, పేదలకు విద్యుత్ సబ్సీడీలు, సెలూన్లకు గృహ కేటగిరీ విద్యుత్ సరఫరా, ఎత్తిపోతల పథకాల నిర్వహణ కోసం రికార్డుస్థాయి విద్యుత్, తెలంగాణ చొరవతో ఉత్తర, దక్షిణ గ్రిడ్ ల మధ్య కొత్త లైన్ల ఏర్పాటు లాంటివి కేసీఆర్ సారధ్యంలోని బంగారు తెలంగాణ నిర్మాణంలో కీలకాంశమైన విద్యుత్ విజయంలో భాగాలు. ఒక అంశంపై విమర్శ చేసే ముందర వాస్తవాలను అధ్యయనం చేసి, సద్విమర్శ చేయడం మంచిది. లేకపోతె, అది అనుభవరాహిత్యమవుతుంది.

Sunday, July 23, 2023

ఉమామహేశ్వర సంవాదాన్ని, దాని మహిమను వివరించిన భీష్ముడు ..... ఆస్వాదన-130 : వనం జ్వాలా నరసింహారావు

 ఉమామహేశ్వర సంవాదాన్ని, దాని మహిమను వివరించిన భీష్ముడు

ఆస్వాదన-130

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (24-07-2023)

శ్రీకృష్ణుడు కొడుకు కావాలన్న కోరికతో రుక్మిణీ సమేతంగా హిమవత్పర్వతానికి వెళ్ళి పన్నేండేళ్ళు వ్రతం చేశాడు. అప్పుడు నారదాది మహర్షులు శిష్యసమూహంతో వచ్చి శ్రీకృష్ణుడి చుట్టూ కూచుని పుణ్యగోష్ఠి చేస్తున్న సమయంలో, అతడి ముఖం నుండి ఒక మహాగ్ని వెలువడి ఆ పర్వత వనాలను కాల్చివేస్తుంటే, శ్రీకృష్ణుడు ఆ మంటను చల్లార్చి అడవిని మునుపటిలాగానే సవ్యంగా చేశాడు. మహర్షుల ప్రార్థన మేరకు ఆ అగ్నిని గురించి శ్రీకృష్ణుడు వివరించి చెప్పాడు ఇలా.

‘ఒక రాక్షసుడు నా వరంవల్ల అస్త్ర విద్యతో అద్భుత శక్తి పొంది, అహంకరించి లోకకంటకుడయ్యాడు.  అతడిని సంహరించగల కొడుకును పొందటానికి ఈ మహావ్రతాన్ని చేపట్టాను. నా ఆత్మ అగ్నిగా మారి, నా ముఖం నుండి వెలువడి బ్రహ్మ దగ్గరకు వెళ్ళింది. ఆ మహానుభావుడు మన్మథుడిని నా కుమారుడిగా పంపి, ఆ అగ్నిని మరలించాడు. అది తిరిగిపోతూ ఈ అడవిని కాల్చింది. నేను కరుణించి మరల దానికి మొదటిరూపు కల్పించాను' అని అగ్ని కథ చెప్పి ఋషులను తనకొక ఉత్తమ ఇతిహాసాన్ని చెప్పి తన కోరిక తీర్చండని కోరాడు. ఋషులు ఆ పనికి సమర్థుడు నారదుడే అని పేర్కొని, అతడిని కథ చెప్పమని ప్రార్థించారు. నారదుడు “ఉమామహేశ్వర సంవాదం” అనే ఇతిహాసాన్ని శ్రీకృష్ణుడికి వినిపించాడు. అదిలా సాగుతుంది.

నారదుడు తాను లోక సంచారం చేస్తూ హిమవత్పర్వతం మీద ఒక సుందర దివ్యోద్యాన వనాన్ని చూశానని, ఆ ఉద్యానవనంలో మహాదేవుడు ఉండగా ఆ సభలో తాను కూడా చేరి స్వామిని సేవిస్తూ ఉన్నానని, అంతలో సపరివారంగా పార్వతీదేవి వచ్చి పరమేశ్వరుడిని విలాసంగా చూసిందని, దానితో లోకంలో సూర్యచంద్రుల కాంతి లోపించి కారుచీకటి వ్యాపించిందని, లోకాలు భీతిల్లగా పరమేశ్వరుడు మూడవ కంటిమంటతో వెలుగులు ప్రసాదించాడని, పార్వతి భీతిల్లి పరమేశ్వరుడి పాదాలకు ప్రణమిల్లిందని, స్వామి కరుణతో చూడగా మంటలు చల్లారి కొండ చల్లబడిందని చెప్పి, అప్పుడు పార్వతి పరమేశ్వరుడిని అడిగిన ప్రశ్నలు, ఆయన ఇచ్చిన సమాధానాలు వివరించాడు.

శివుడు తన నొసటికన్ను తెరవటానికి గల కారణం ఇలా చెప్పాడు: ‘ఈ లోకాలన్నీ నా స్వరూపాలే. నా కేది కలిగితే లోకాలకు కూడా అది కలుగుతుంది. నీవు నా కన్నులు మూశావు. లోకాలలో చీకటి వ్యాపించింది. భూతాలు భయపడ్డాయి. నీ చేతులు తొలగించకుండా చీకటి పొగొట్టటానికి నా ఫాలనేత్రం తెరవవలసి వచ్చింది’. శివుడికి నాలుగు ముఖాలెందుకు ఉన్నాయన్న దానికి జవాబు: ‘సుందోపసుందులనే మహాబలవంతులైన రాక్షసులను చంపటానికి విశ్వకర్మ తిలోత్తమను సృష్టించి నా వద్దకు పంపాడు. ఆమె దేవకార్య నిమిత్తమై నా చుట్టూ ప్రదక్షిణాలు చేసింది. నేనే ఆమెను రక్షించటానికై నాలుగు దిక్కులా చూచాను. అప్పుడు నాలుగు మొగాలు మొలిచాయి’.

శివుడికంఠంలో నలు పెందుకు కలిగిందన్న దానికి సమాధానం: ‘క్షీరసాగర మథన సమయంలో వెలువడిన కాలకూటాన్ని లోక సంరక్షణార్థమై నా కంఠంలో ధరించాను. బ్రహ్మాదులందుకే నన్ను నీలకంఠుడని పిలుస్తారు’. శివుడికి పినాక మనే ఆయుధం మీద ఎక్కువ మక్కువ ఎందుకని పార్వతి అడగ్గా చెప్పిన సమాధానం. ‘కృతయుగంలో కణ్వుడు అనే మహర్షి మహాతపస్సు చేశాడు. అతడిమీద పెద్ద పుట్ట, దానిమీద మిక్కిలి పొడవు వెడల్పూ గల వెదురు మొలిచింది. బ్రహ్మ ఆ మహర్షికి ప్రత్యక్షమై వరమిచ్చి ఆ వెదురును తీసికొని, లోక శ్రేయస్సును కాంక్షించి దానిని మూడు ముక్కలు చేసి మూడవ ముక్కతో పినాకాన్ని నిర్మించి నా కిచ్చాడు. రెండవ ముక్కతో శార్ జ్గమును నిర్మించి విష్ణువుకు ఇచ్చాడు. మొదటి తునుకతో గాండీవాన్ని కల్పించి తాను తీసికొనిపోయాడు. అందువలన నేను పినాకాన్ని అభిమానిస్తాను’.

శివుడు నంది వాహనాన్ని ఎందుకు ఆదరిస్తాడని అడిగింది పార్వతి. జవాబుగా శివుడు: ‘నేను హిమవత్పర్వతంమీద తపస్సు చేసికొంటున్నప్పుడు ఆవులు నా చుట్టూ నిర్భయంగా తిరుగుతూ కష్టపెట్టాయి. నేను కోపించి చూడగా అవి బాధపడ్డాయి. బ్రహ్మ, దేవతలు నా వద్దకు వచ్చి ప్రార్థించి నా కొక ఎద్దును కానుకగా ఇచ్చి “గోపతి” అని పేరు పెట్టి గోవుల బాధ తీర్చారు. అది మొదలు నేను ఆ ఎద్దును వాహనంగా, ధ్వజంగా చేసికొని సంచరిస్తున్నాను’ అని చెప్పాడు.

మనోహరమైన నెలవులను వదలి అశుచి అయి, కేశాస్థికపాల దుర్గంధ దుర్దర్శన మైన శ్మశానంలో శివుడు వుండడానికి కారణమేమిటని పార్వతి ప్రశ్నించింది. ‘క్రూరభూతాలు జనులను ఘోరంగా వధ చేయటం గమనించి బ్రహ్మ నన్ను ఆ విపత్తును తొలగించుమని ప్రార్థించాడు. మోక్షమందు ఆసక్తి కలవారు నిర్జనమైన శ్మశానాన్ని పవిత్రస్థానంగా భావిస్తారు. కాబట్టి నేను వల్లకాటిలో ఉండటానికి ఇష్టపడతాను. అక్కడే ఉండి లోకరక్షాకార్యాన్ని నిర్వహిస్తాను’ అని జవాబిచ్చాడు శివుడు. బూదిపూత, ఎముకలు, పాములు ధరించడానికి కారణం చెప్పాడు ఇలా. ‘జగత్తంతా సౌమ్యం, ఆగ్నేయం అనే రెంటి కలయికతో కూడి ఉన్నది. సౌమ్యమైన దానిని విష్ణువూ, ఆగ్నేయమైన దానిని నేనూ భరిస్తూ ఉంటాము. ఈ రెంటిని కలిపి ఈ విశ్వాన్ని నేను వహిస్తున్నాను. అందువలన అగ్నిసంబంధ భావంతో కూడుకొనిన ఆకారాన్ని లోకహితం కొరకు తాల్చాను’.

శివుడు చంద్రుడిని ప్రేమతో తలపై ధరించటానికి కారణం ఏమిటని ప్రశ్నించింది పార్వతి. ‘దక్షయజ్ఞంలో నేను ఆగ్రహించినప్పుడు దేవతలందరినీ హింసించాను. ఆ సందర్భంలో చంద్రుడి దేహాన్ని అడ్డదిడ్డంగా త్రొక్కివేశాను. అతడు నన్ను శరణు కోరాడు. జాలిపడి చేసిన కీడు తొలగటానికి అతడిని తలపై ధరించాను’ అని సమాధానం ఇచ్చాడు శివుడు.  

పార్వతి కోరిక మేరకు శివుడు వర్ణాశ్రమ ధర్మాలను తెలియచేశాడు ఆమెకు. ‘లోకహితం కొరకు బ్రహ్మ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే వారిని సృష్టిచేశాడు. ఆయా వర్ణాలవారికి విధులను, ధర్మాలను నిర్దేశించాడు. బ్రహ్మచర్యాశ్రమంలో బ్రహ్మచర్యం, గురుసేవ, విద్యాభ్యాసం, నిత్యాగ్నిహోత్రం అవశ్యకర్తవ్యాలు. గృహస్థాశ్రమం అన్నింటిలో ముఖ్యమైనది. పంచయజ్ఞాలు ఆచరించటం, స్వీయభార్యను పాలించటం, దానాలు చేయటం, బంధువులను గౌరవించటం గృహస్థాశ్రమ ధర్మాలు. అడవిలో నివసించటం, కందమూలాలు భుజించటం, స్త్రీ సంగమం వర్ణించటం, జడలు ధరించి జింకచర్మాన్ని కట్టుకొనటం, వానప్రస్థాశ్రమ ధర్మాలు. కోపగించుకోకుండా ఉండటం, బ్రహ్మచర్యాన్ని పాటించటం, ఓర్పు వహించటం, బ్రాహ్మణులతో కలిసి జీవించటం, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా, శుచిగా, శుభ్రంగా ఉండటం, సద్ర్వతనిష్ఠ, భిక్షాభోజనం, నేలపై మాత్రమే శయనించటం, దయాస్వభావం కలిగి ఉండటం, సదా తత్వచింతనతో, యతి ధర్మాలతో జీవించటం సన్న్యాసాశ్రమ విధులు. ఇవి వేదాలు సమ్మతించిన విధులు’ అని అన్నాడు. 

ముని జనులు చేసే తపస్సు యొక్క విధానం తెలియజెప్పమని అడిగింది పార్వతి. ‘తపమంటే సామాన్యంగా వానప్రస్థులు చేసే ధర్మాలు. ఇంద్రియ నిగ్రహం, యోగాభ్యాసం, ఫలాభిరహిత కర్మాచరణం, పంచాగ్ని మధ్య తపస్సు మొదలైనవి చేసి స్వర్గం పొంది సుఖించేవారు తపస్వులు. భార్యాయుతులై తపస్సు చేసేవారు అహింస, దయ మొదలైన గుణాలు కలిగి, సర్వభూత సమభావంతో వర్తిస్తారు. ఉపవాసం, మౌనం, భూతలశయనం మొదలైన వానప్రస్థాశ్రమ నియమాలు తపస్వులు పాటిస్తారు’ అని అన్నాడు శివుడు. దేశ ద్రిమ్మరులైన విరాగులు యాయావరులని, పుణ్యతీర్థాలను సేవిస్తూ నిరాహారవ్రతాలను పాటిస్తుంటారని, బక్కచిక్కిన శరీరాలతో నియమనిష్ఠలతో జీవించి స్వర్గం చేరతారని, వైఖానసులు కఠిన వ్రతాలు పాటిస్తారని, రాళ్లతో, వరిధాన్యాలను దంచుకొని వానిని మాత్రమే నమలుతారని,  కొందరు గాలి, నీరు మాత్రమే స్వీకరిస్తారని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు శివుడు.

గృహస్థాశ్రమ ధర్మాలను తెలపమని అడగ్గా ఇలా జవాబిచ్చాడు శివుడు. ‘గృహస్థాశ్రమంలో కామం ధర్మప్రధానమై ఉండాలి. ఆత్మనిగ్రహం, భూతదయ, శాంత స్వభావం, అతిథి సత్కారం, మిగిలిన ఆశ్రమవాసులను గౌరవించటం గృహస్థాశ్రమ ధర్మంలో ముఖ్యం. స్త్రీకి పతిని సేవించటం ప్రధాన విధి. గృహస్థుడు నిజభార్యయందే రమించాలి. ఆహార నియమం పాటిస్తే ముక్తి మార్గం సులభం. రాజార్హత తపస్సువలన లభిస్తుంది. అందువలననే ఇతరులకు నమస్కార యోగ్యుడౌతాడు. నిగ్రహానుగ్రహ సమర్థు డౌతాడు. తాను నీతిపరుడై ఇతరులను నీతిపరులుగా చేస్తాడు. అవసరం వస్తే శిక్షిస్తాడు. కామాది అంతశ్శత్రువులను జయించి సప్తాంగాలను శాసిస్తాడు. చారచక్షువై లోకాన్ని గమనిస్తాడు. ధర్మాన్ని రక్షిస్తాడు. అధర్మాన్ని శిక్షిస్తాడు. అకారణంగా యుద్ధం చేయడు. న్యాయబద్ధంగా యుద్ధానికి పూనుకొంటాడు. యజ్ఞాలు, దానాలు చేస్తాడు. ఈ నీతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే రాజుకు పాపం కలుగుతుంది. ప్రజలను బిడ్డలవలె కాపాడి సంపదను, పేరు ప్రఖ్యాతులను గడిస్తాడు. చివరకు స్వర్గసుఖాలను పొందుతాడు’ అని అన్నాడు శివుడు.  

ధర్మరహస్యం వినగోరుతానని అడిగినప్పుడు ఇలా చెప్పాడు శివుడు. ‘ధర్మాలన్నింటిలో అహింస సూక్ష్మమైన ధర్మం. శాంతగుణంతో తపస్సు చేసికొనేవారు అహింసావ్రతం పాటించేవారు. లోకులు తమ కర్తవ్యాలు చేస్తూ ఉండగా  కొన్ని ప్రాణులు చనిపోతాయి. అప్పుడు వారికి చంపే బుద్ది ఉండదు. పాపపుణ్యాలకు బుద్ధి ప్రధానం. యుద్ధాలలో మరణించటం, యుద్ధాలలో సంహరించటం హింస కాదు. స్వర్గప్రాప్తికి హేతువులు కూడా. వేటాడటం హింస కాదు. వేదమంత్రయుతంగా యజ్ఞంలో పశువిశసనం హింస కాదు. శిక్షకు తగినవాడిని శిక్షించటం కూడా హింస కాదు’.

జనులు జీవించే విధానాన్ని గురించి చెప్పమని ప్రశ్నించింది పార్వతి. ‘మనుష్యజన్మం కర్మభూమి. సుఖదుఃఖాలకు మూలం ధనం. అందువలన ధనసంపాదన మార్గాలు మానవుడు యోచిస్తాడు. అయితే అవి ధర్మపథంలో సాగాలి. కర్మలలో మోసం ఉండకూడదు. ఉపాయంతో పనులు చేయాలి. ఇతరుల ధనాన్నీ, వనితలనూ దొంగిలించరాదు. తల్లిదండ్రులను, అతిథులను, దేవతలను గౌరవించి పూజించాలి. ఇవి అందరూ ఆచరించదగిన జీవన విధానం’ అని సమాధానమిచ్చాడు.

పసివారు మరణించటానికి, ముసలివారు చాలాకాలం జీవించటానికి కారణ మేమిటని అడిగింది పార్వతి. జవాబుగా శివుడు: ‘శరీరం శిథిలమౌతున్నది కాని వృద్ధులకు చావు త్వరగా రావటం లేదన్నావు. మృత్యువు నరుడిని చేరినప్పుడు చావు కలుగుతుంది. పూర్వజన్మలో చేసిన కర్మలు మానవుడికి ఆయుస్సును వృద్ధి చేస్తాయి. తగ్గస్తాయి కూడా. దానివలన బ్రతుకు చావులు సంభవిస్తూ ఉంటాయి. క్షమ, సత్యం, కృప, శౌచం, గురుభక్తి, ఆయుస్సును వృద్ధి చేస్తాయి. అసత్యభాషణం, క్రౌర్యం, అశుభ్రత, గురువిరోధం ఆయుస్సును తగ్గిస్తాయి. బ్రహ్మచర్యవ్రతం, హితమితాశనం, జరావ్యాధులు పోగొట్టే ఔషధాలను సేవించటంచేతను ఆయుస్సు పెరుగుతుంది. శక్తికి మించిన పనులు చేయటం, తగనటువంటి, అనుసరణీయం కానటువంటి పదార్థాలు తినటం చేతను ఆయుస్సు తగ్గిపోతుంది. ఇవన్నీ పూర్వజన్మలో చేసిన కర్మలవలననే సంభవిస్తాయి’.

స్త్రీ పురుష భేదంతో ఉన్న మానవులలో జీవుడు వర్తించే విధం వివరించుమని పార్వతి కోరగా శివుడు ఇలా చెప్పాడు. ‘తాత్వికంగా జీవుడికి పురుష స్త్రీత్వాలు లేవు. అహంకారం కారణంగా కర్మానుభవం కలిగి భావించిన విధంగా జరుగుతుంది. ఆత్మ శరీరానికి అతీతమైనది. కర్మలకు ఆత్మ కర్త కాదు. అతడి త్రిగుణాత్మక చైతన్యం శరీరాన్ని పొంది కర్తృత్వం వహిస్తుంది. మనుష్యులు చేసే కర్మలను బట్టి ఫలితాలు కూడా కలుగుతాయి. జంతువులలో మానవుడు శ్రేష్ఠుడు. అతడికి గొప్పతనం కలిగించేది విద్య. విద్యవలన అజ్ఞానంవలన, సంసారంవలన కలిగే కష్టనష్టాలు తొలగిపోతాయి. వేదాలవలన జ్ఞానం కలుగుతుంది. వేదవిజ్ఞానంవలన మానవుడిలోని అంతశ్శత్రువులు తొలగిపోతాయి. విద్యావంతులు దేవతలవలె ప్రకాశిస్తారు’.

ఇంక ఇలా చెప్పాడు శివుడు. ‘మరణం ఆసన్నమైనపుడు శరీరాన్ని విడిపించి, మనుష్యులను అదృశ్య శరీరం వహించే విధంగా చేసి యమదూతలు తీసికొని వెళ్ళతారు. వారిలో ధార్మికులను సువాసన భరితంగానూ, సుకుమారంగా ఉండే మార్గంలో కొనిపోతారు.   ధర్మాధర్మాలను మిశ్రమంగా చేసినవారిని బాధలు లేనిదారిలో తీసికొనిపోతారు. అధర్మపరులను కఠినం, మలినం అయిన దారిలో నడిపిస్తారు. యమధర్మరాజు వారికి తగిన శిక్షలను విధిస్తాడు. రౌరవం, మహారౌరవం, కంటకావనం, అగ్నికుండం, పంచకష్టం అని నరకాలు అయిదు. జీవులు చేసిన పాపాలను బట్టి ఆయా నరకాలకు యముడు పంపుతాడు. యమభటులు వారికి కాల్చటం, కత్తిరించటం, కట్టివేయటం, కొట్టటంవంటి శిక్షలు విధిస్తారు. ఆ పాపాత్ములను కుక్కలు కరుస్తాయి. కీటకాలు తొలుస్తాయి. గ్రద్దలు ముక్కుతో పొడుస్తాయి. ఇటువంటి అనేక దుఃఖాలు అనుభవించి పురుగులుగానూ, పక్షులుగానూ, జంతువులుగానూ, మనుష్యులుగానూ జన్మిస్తారు. యమ శిక్షలతో పాపాలు తొలగిపోతాయి’.

‘మానసములనీ, వాచికములనీ, కాయికములనీ పాపాలు మూడు రకాలు. అన్యుల ద్రవ్యాన్ని ఆశించటం, పాపకృత్యాలకు పాల్పడటం, ధర్మాన్ని ద్వేషించటం మొదలైనవి మానసాలు. అసత్యమాడటం, కఠిన సంభాషణం మొదలైనవి వాచికాలు. హత్యచేయటం, ఇతరులను బంధించటం, మద్యపానం అనేవి కాయికాలు. అన్నిటిలో మద్యపానం మహాపాపం. దానిని వదలి యశస్సు, సంపద, సౌఖ్యం, పుణ్యగతి పొందవచ్చును. పుణ్యకర్మలు లోకంలో మూడురకాలు. అవి, ఔపమికం, నిరుపకరణం, సోపకరణం. ఔపమికమంటే పాపాన్ని తొలగించేది. నరకభయంతో పాపాలు చేయకుండా ఉండటం. దీనివలన స్వర్గం లభిస్తుంది. నిరుపకరణం అంటే శుచిగా ఉండటం, నిజం మాట్లాడటం, అహింసను పాటించటం, వ్రతదీక్ష, ఉపవాసం, స్త్రీ సంగమ వర్జనం, పుణ్యతీర్థ సేవనంవంటి నియమాలు పాటించటం. దానాదులు చేయటం సోపకరణం.

         భక్తులు ఏ పరిచర్యలవలన శివ సాయుజ్యాన్ని పొందుతారని పార్వతి అడిగింది. సమాధానంగా శివుడు ఇలా అన్నాడు. ‘నేను దేవతలకూ, మనుషులకూ అచింత్యుడను. యోగసాంఖ్యాలు నేను చేసినవే. నేను ఈశ్వరుడను, సనాతనుడను, అవ్యయుడను, సత్యాత్ముడను. పంచాక్షరీత్యాది మంత్రాలతో, స్మరణంచేత, నమస్కారంచేత, వివిధ సేవలచేత నియమంతో నన్ను సేవించాలి. చతురాశ్రమాలను పాటించే వారికి పాశుపతవ్రతాన్ని బోధించాను. శివలింగారాధనం, భస్మరుద్రాక్షధారణంవలన పరిశుద్ధులై అభిషేకాదులతో నన్ను ఆరాధిస్తే నా సాయుజ్యాన్ని పొందుతారు.

ఆ తరువాత శివుడు కోరడం వల్ల పార్వతి గంగాది నదులతో సంప్రదించి పతివ్రతాధర్మాలను చెప్పటం ప్రారంభించింది. ‘కన్యాదానం జరిగిన తరువాత స్త్రీకి భర్త అధికారి. ఆమె భర్తను దైవంగా భావించాలి. అతడి అభిప్రాయాన్ని అనుసరించి దైవపితృకార్యాలు చేయాలి. భర్తకు మేలే చేయాలి. ఆమెను పతివ్రత అంటారు. ఆమెకు ఇహపరలోక సుఖాలు లభిస్తాయి. స్త్రీ గృహనీతి విద్యకు ఆచార్యకం. వంటచేయటం, కాపురం చేయటం ఆమె కర్తవ్యం. భర్త ఎటువంటివాడైనా, ఎట్టి స్థితిలో ఉన్నా అతడిని ఆమె గౌరవించాలి. జంతువులకు బలి, బీదవారికి భిక్షం తప్పక ఇయ్యాలి. భార్యకు భర్తయే గతి. అక్రమంగా ప్రవర్తించే స్త్రీలు మూడురకాలు. వారిని ఆసురి, పైశాచి, రాక్షసి అని అంటారు. ఆసురి చంచల మనస్సుతో ధనవ్యయం చేస్తుంది. పైశాచికి కోపం అధికం. రాక్షసి కలహప్రియ. వీరు భర్త వంశంవారిని పాడుచేసి తాము పాపలోకానికి పోతారు. ఈ ముగ్గురూ పశ్చాత్తాపంతో ధర్మమార్గంలో నడిస్తే పాపాలు పోగొట్టుకొని భర్తతో కలిసి స్వర్గానికి పోతారు. సతికి పతితో సహగమనం స్వర్గాన్ని కలిగిస్తుంది. సంతానవతికి సహగమనం ధర్మం కాదు.

శివపార్వతుల సంవాదం విన్నవారికి సర్వశుభాలు కలుగుతాయని పరమేశ్వరుడు ప్రకటించాడు. నారదుడు చెప్పిన ఈ అద్భుత వృత్తాంతాన్ని భీష్ముడు ధర్మరాజుకు వినిపించాడు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఆనుశాసనిక పర్వం, చతుర్థ-పంచమాశ్వాసాలు

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

Saturday, July 22, 2023

POWERING TELANGANA AHEAD FOR PAST 9 YEARS : Vanam Jwala Narsimha Rao

 POWERING TELANGANA AHEAD FOR PAST 9 YEARS

KCR’s Administrative Brilliance leads to turnaround in Power Sector

Vanam Jwala Narsimha Rao

The Hans India (23-07-2023)

(After formation of Telangana, there has been a qualitative change and ‘Amazing Evolution in Nine Years in Telangana Power Front,’ which the unhealthy and novice critics are unable to comprehend astonishingly. Within 9 months of its formation, Telangana became the first ever state in the country supplying 24 hours without power cuts to all sectors and 9 hours uninterrupted quality power for agriculture. Power Plants with generating capacity of 8085 Megawatts are under construction. The target of KCR is to make available 28000 plus Megawatts of power production and convert Telangana as power surplus state shortly-Editor Hans India observation).

Chief Minister K Chandrashekhar Rao, during the past nine plus years, accorded topmost priority to Electricity Sector and as a result, Telangana now stands as Role Model for the entire country. It is the only State in the country that provides uninterrupted 24-hour quality power to all sectors and 24-hour quality, free power to agriculture sector. Unaware of this exceptional progress, some ‘Self-styled Political Pundits,’ discourteously, in the recent past, raised an issue of police firing that took place 13 years ago, in a bid to connect it to CM KCR by indulging in unfair and offensive remarks.

Yet another criticism that they strangely and unfairly made was that, 95 percent of farmers in Telangana whose holdings are below three acres do not require 24 hours power for agriculture. The corollary is that, leaders, and cadre of Bharat Rashtra Samithi (BRS) are up in arms, and posed a pertinent question to the detractors, that they should clarify, whether farmers need three hours power supply or power to raise three crops! Critics are also unable to comprehend as to what precisely happened 13 years ago, how it happened, why it happened, with whose involvement did it happen and how the consequential developments led to a massive and historical Separate Telangana Movement spearheaded by KCR culminating in formation of Telangana State.

When Chandrababu Naidu was CM of United AP, all of a sudden, he steeply enhanced ‘Power Tariff’ denying the benefit of subsidy enjoyed by farmers, since NT Rama Rao’s time. Taken a back, farmers launched statewide agitation demanding reduction in tariff and finally in August 2000 gave ‘March to Assembly’ call. Government of the day, resorted to police firing on the protesters at Bashir Bagh, Hyderabad killing three innocent farmers.

Heartbroken KCR, then Deputy Speaker of State Legislative Assembly and a prominent leader in TDP, following firing episode, Government’s indifference, and outrageous behaviour towards Telangana farmers, addressed a letter to CM Chandrababu expressing his unequivocal dissent. He pointed out that, entire Telangana agriculture depended on electric motors for which power was vital and at a time farming was in crisis and running in losses, enhancement of tariff was death blow on them. Despite KCR’s caution not to test patience of farmers, Chandrababu’s apathy to Telangana farmers continued.

KCR at that stage decided not to continue further in Chandrababu Government and TDP. He also decided that, until and unless separate Telangana state was formed, there would be no end to the miseries of farmers, and instantaneously made up his mind to launch movement by himself, being in the forefront. Indifference to Telangana farmers, indiscriminate power tariff enhancement by united AP rulers, and Bashir Bagh firing on agitators, were in a way, reasons that propelled second phase of massive Separate Telangana Movement unabetted.  

Unlike in all other states, where Electricity has always been just one among many subjects, for agrarian dependent Telangana farmer, it is most vital constituent. In united AP, power distribution, power tariff, quality of power, dependability on power were not only unscientific, but also discriminative in nature pushing agriculture into deep crisis. Farmers’ suicides in large numbers were order of the day. After formation of Telangana, there has been a qualitative change and ‘Amazing Evolution in Nine Years in Telangana Power Front,’ which the unhealthy and novice critics are unable to comprehend astonishingly.

Prior to formation of Telangana, irrigation projects meant for Telangana were confined to paper designs, canals were left uncompleted, and Kakatiya period Chain of Tanks were grossly neglected. Hence Telangana farmer was left with no option except to dig bore wells, numbering over 24 lakhs with huge burdensome investments incurring debts and fitted with electric motors. In spite of this, adequate power supply was nightmare. High-tension lines, sub-stations, transformers were dysfunctional, resulting in frequent low voltage and burning of motors as well as crops dried up.  

Against this background and context of untold misery, KCR formed TRS (Now BRS) with the slogan of Separate Telangana State and promised to provide 24-hour quality free power to farmer. This is contemporary history, better to be known to these novice critics.

In 2004 Assembly Elections TRS contested in alliance with Congress Party that promised free power supply to farmers. After Government formation, the (Namesake) free power supply said to have been given to agriculture was only for a meagre three-four hours during nights, that too, after industrial, commercial, and domestic requirements were totally met. Hardships like low voltage, farmers’ deaths due to electric shocks and snake bites remained unchanged. KCR during agitation frequently mentioned about these hardships and gave a call to people to stand by TRS for getting free, quality 24-hour power supply, as and when Telangana was formed and TRS comes to power, and in the process established incredible credibility among farmers.

On June 2, 2014 Telangana State was formed and KCR became Chief Minister. His topmost priority was to overcome power crisis and shortage, effectively, efficiently, by drawing short, mid, and long-term strategies, that included, buying required quantum of deficit power from available states to bridge demand-supply gap. Initially, Telangana entered into Power Purchase Agreement with Chhattisgarh to buy 1000 Megawatts in November 2014 and later in September 2015 for additional 1000 Megawatts. Within 9 months of its formation, Telangana became the first ever state in the country supplying 24 hours without power cuts to all sectors and 9 hours uninterrupted quality power for agriculture.  

KCR, always a peasant supporter, in his pursuit to provide 24 hour free, quality power to agriculture, as promised, gave roadmap to officials concerned, no matter the financial burden, grid issues and any other connected problem. Telangana TRANSCO and GENCO Chairman and Managing Director, Devulapalli Prabhakar Rao an experienced expert in the field of power for over five-six decades, implemented directions and thought process of CM KCR by making necessary technical, technological, and other arrangements. New sub-stations, transformers, and lines were established. Since January 1, 2018 Telangana became one and the only state in the country, to provide 24-hour free quality power to agriculture and scripting an exceptional contemporary history, for which CM KCR complemented Prabhakar Rao on different platforms.     

 At the time of formation of Telangana, the installed power capacity was only 7778 Megawatts and today it reached 18453 Megawatts. Construction of Yadadri Ultra Mega Thermal Power Plant of 4000 Megawatts is in final stages. Four units of Bhadradri Power Plant of 1,080 Megawatts, Kothagudem Power Plant of 800 Megawatts, and Jaipur Power Plant with 1200 Megawatts commenced power generation. Power Plants with generating capacity of 8085 Megawatts are under construction. The target of KCR is to make available 28000 plus Megawatts of power production and convert Telangana as power surplus state shortly. This shows ‘KCR’s Administrative Brilliance and Statesman Approach.’ What an ‘Astonishing Transformation! 

In peak demand of 15497 Megawatts and in sanctioning agriculture pump sets Telangana stands number one in the country. Per Capita Consumption of Electricity which is an indicator of economic progress has increased from 1356 units in 2014-15 to 2126 units in 2021-22, which is 69% higher than National Average. In Telangana, now no power cuts, no voltage problems, no burning of electric motors, no agitations by farmers, and no power holidays to industries. Novice Critics should understand this reality and should study facts before indulging in unfair criticism, failing which, Newton’s Third Law of Motion may be applicable!

(The writer is Chief Public Relations Officer to Chief Minister Telangana).

Monday, July 17, 2023

అహింస తీరుతెన్నులను, ‘నమో నారాయణాయ’ మంత్ర మహిమను వివరించిన భీష్ముడు ..... ఆస్వాదన-129 : వనం జ్వాలా నరసింహారావు

 అహింస తీరుతెన్నులను,

‘నమో నారాయణాయ’ మంత్ర మహిమను వివరించిన భీష్ముడు

ఆస్వాదన-129

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (16-07-2023)

దేవతలూ, బ్రాహ్మణులు, మునిశ్రేష్ఠులు ప్రశంసించే అహింస తీరుతెన్నులను తెలియజెప్పమని ప్రార్థించాడు ధర్మరాజు. జవాబుగా భీష్ముడు, అహింస అనే ధర్మంలో సర్వధర్మాలూ ఇమిడి ఉంటాయనేది సత్యమని, అహింస నాలుగు తీరులలో వుంటుందని, అందులో ఏ ఒక్కటి లోపించినా శ్రేష్టమైన ధర్మపు సాగుదల కుంటుపడుతుందని, మనసుచేత, మాటచేత, దేహంచేత హింస చేయటం, మాంసం తినటం అనేదానితో కలిపి ఆ పద్ధతులు నాలుగైనాయని, హింసను కలిగిస్తుంది కాబట్టి మాంసభోజనం దోషమని, నాలుగు విధాలైన హింసలను మానడమే అహింసలోని నాలుగు గొప్ప పద్ధతులని అన్నాడు. ఈ కారణాన మాంసం మీద ప్రీతిని వదలుకోవడమే అహింసగా ఒప్పుతుందని చెప్పాడు.  

మాంసం పితృదేవతలకు చాలా ఇష్టమైనదని, శ్రాద్ధాన్ని మాంసం ప్రధాన ద్రవ్యంగా సాగించాలని అంటారని, చంపకపోతే మాంసం దొరకడం ఎట్లాగని ధర్మరాజు సందేహం వెలిబుచ్చాడు. మాంసభోజనం వదలటం అశ్వమేధయాగంకంటే కూడా పూజనీయం అని, చంపటం, చంపించటం పాపాలన్నింటికంటె గొప్పపాపమని, శ్రాద్ధాలలో, యజ్ఞాలలో వేదం తెలిపిన హింసవలన దోషం కలుగబోదని, మాంసపు రుచి మరగి తినడానికై ప్రాణులను చంపటంవలన పాపం కలుగుతుందని స్పష్టం చేశాడు భీష్ముడు. మాంసం తనను నమిలినవాడిని నమలుతుందని ఆగమాలు అంటున్నాయని, వేదార్థం చక్కగా తెలిసిన జ్ఞానసంపన్నులు దానం, ధర్మం, తపస్సు, యజ్ఞనిష్ట అనే ఉత్తమ క్రియలన్నీ అహింసకు తక్కువ కాని కార్యాలే అని, నూరేళ్లు చేయనలవి కాని తపస్సు చేయడం, మాంసం మానేయడం వల్ల కలిగే పుణ్యం సమానమని వేదవేత్తలు చెప్పారని అన్నాడు. మాంసాహారం మానటం తపస్సుతో సమానమని మహర్షులు కూడా చెప్పారని, దానం, ధర్మం, తపస్సు, యజ్ఞం, పరిశుద్ధత, మంత్రం, అనుష్ఠానం, సత్యం, ఇవన్నీ అహింసారూపాలే కాబట్టి అహింస ఉంటే సంపదలన్నీఉన్నట్లే అని అన్నాడు భీష్ముడు. 

యుద్ధంలో చచ్చినవారు ఎక్కడికి పోతారో తెలుపమని కోరాడు ధర్మరాజు. కురుక్షేత్రంలో అద్భుతభయంకర యుద్ధంలో దేహాలు వదలిన రాజులకు అనంత సుఖాలు గల గతులు కలగటంలో అనుమానం లేదని, వారందరూ ఉత్తమలోకాలను పొందినవారే అని అంటూ, కీటకానికి వేదవ్యాసుడికీ జరిగిన సంవాదాన్ని వినిపించాడు భీష్ముడు.

‘భయంతో పరుగెత్తుతున్న ఒక కీటకాన్ని అలా ఎందుకు చేస్తున్నావని వేదవ్యాసుడు ప్రశ్నించగా బతుకు ఎంతో సుఖమైనదని, చావు మిక్కిలి దుఃఖాన్ని కలిగిస్తుందని, తనకు అలాంటి భయం వేసి, గుండెల్లో గుబులు పుట్టి పరుగెత్తుతున్నానని జవాబిచ్చింది కీటకం. ప్రాణభీతి ప్రాణికి తక్కువది కాదుకదా అంటుంది. పురుగులకు ఇంద్రియ సుఖాలు పొందే వీలు అంతగాలేదని, దుఃఖాలకు తావైన ఈ దేహం దానికెందుకని, దానికి చావే సుఖం కలిగిస్తుందని, ఆ పద్ధతి ఆలోచించమని వ్యాసుడు సలహా ఇచ్చాడు. పురుగులు కూడా తమ-తమ దారులలో సుఖాలను అనుభవిస్తాయని, అలాగే చావు భయానికి కారణం అవుతుందని, తన గత జన్మ గురించి చెప్పిందా కీటకం. కీటకంతో మరికొంత సేపు సంభాషించి దానిమీద దయ పూని వ్యాసుడు అమృతధారలాంటి చూపును ఆ పురుగు దేహం మీద సారించాడు. అంతా ఆ మహర్షిని పొగిడారు. ఆ పురుగు భక్తితో వ్యాసుడు పాదాల మీద పడి ప్రాణాలు వదిలింది. చనిపోయిన ఆ పురుగు వ్యాసుడి కృపవల్ల అనేక జన్మలు ఎత్తి, ఒక జన్మలో రాజుగా పుట్టింది. దేవేంద్ర వైభవంతో వ్యాసుడి ఆశ్రమానికి పోయింది. వచ్చిన రాజుకు తగిన మర్యాదలు చేసి, ఆవుల కొరకు కాని, బ్రాహ్మణుల కొరకు కాని గొప్ప యుద్ధ నైపుణ్యం వెలువడ చేసి ప్రాణాలు వదలమని చెప్పాడు వ్యాసుడు. అలానే చేసిన రాజు ఆ తరువాత బ్రాహ్మణ జన్మ ఎత్తాడు. ఆ జన్మలో ఎన్నో పుణ్యకార్యాలు చేసి పరలోక సుఖం పొందాడు’.   

ఈ కథ చెప్పిన భీష్ముడు, కురుక్షేత్ర యుద్ధంలో దేహాలు వదిలిన రాజులకు అనంత సుఖాలుగల గతులు కలగడంలో అనుమానం లేదని, ధర్మరాజు బంధువులంతా ఉత్తమ లోకాలను పొందినవారేనని, అందులో అనుమానం లేదని స్పష్టంగా చెప్పాడు. 

విద్య, తపస్సు, దానం అనే వాటిలో ఏది గొప్పదని పితామహుడిని ప్రశ్నించాడు ధర్మరాజు. వ్యాసమైత్రేయ సంవాదం వింటే ధర్మరాజు ప్రశ్నకు సరైన సమాధానం దొరుకుతుందని, దానిని వినమని అన్నాడు భీష్ముడు. ‘ఒకనాడు వ్యాసుడు కాశీ నగరానికి వెళ్లాడు. అక్కడ అంతకు ముందే వున్న మైత్రేయ మహర్షి వ్యాసుడిని గుర్తుపట్టి భోజనం పెట్టి సంతుష్టిపరచాడు. వ్యాసుడు పరమానందంతో “తపస్సు, విద్య మొదలైన ధర్మాలన్నింటిలో దానం గొప్పది. దానాలలో అన్నదానం గొప్పది. ప్రాణాలూ, దేహమూ, దాని బలమూ అన్నం స్వరూపాలే. తపస్సు మనస్సులోని మాలిన్యాల నన్నింటిని తొలగించి వేస్తుంది. విద్యకు అవకాశం కలిగిస్తుంది.  ఆ తపసి చేసిన గొప్పదానం వలన విద్య పెంపొందుతుంది. ఆ విద్య తపస్సును వృద్ధి చేస్తుంది. కాబట్టి తపస్సూ, విద్యాదానం మహిమచేత పెంపొందుతాయి. విద్య వ్రతనిష్టాపరుడికి పరమాత్మను చూపించే దీపం వంటిది.  కాబట్టి అన్నదానం చేత పరమానందం కలుగుతుంది” అని అన్నాడు’.

స్త్రీల సమాచారం వినగోరుతున్నానని ధర్మరాజు అనగా, భీష్ముడు కైకేయీ శాండిలీ సంవాదం గురించి చెప్పాడు. ‘కేకయరాజపుత్రి సుమన అమరావతిలో శాండిలిని చూచి ఇంత శ్రేష్ఠమైన దేవలోక నివాసం ఆమెకు ఏ నడవడివలన కలిగిందని అడిగింది. జవాబుగా శాండిలి తాను అత్తమామలకు ఎదురు చెప్పనని, దేవపూజలు శ్రాద్ధాలు, అతిథి సపర్యలు చేయటంలో ఎడమొగం పెట్టనని, మంచి నడవడితో ఉంటానని, వీథి వాకిలి దాటనని, పకపకా నవ్వనని, విద్య గలవారికి నిర్మలబుద్దితో భిక్ష పెట్టుతూ తక్కిన పనులు చూసుకుంటూ వుంటానని, భర్త ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళకు నీళ్ళు ఇవ్వటం మొదలైన సపర్యలు అనుకూలభావంతో చేస్తానని, బిడ్డలను అలసట లేకుండా తీర్చిదిద్దుతానని, భర్త ఇష్టపడే వంటలు చేస్తానని, ధాన్యాన్నీ, అన్నాన్నీ వ్యర్థపరచనని, బంధువులను తగిన విధంగా గౌరవిస్తానని, ఆవులు మొదలైన పాడిపశువుల సుఖజీవనాన్ని పరీక్షించి సాగిస్తానని, భర్తహృదయం కలతపడకుండా జాగ్రత్త పడుతానని, భర్త నిత్యాగ్నిహోత్రాన్ని ఓపికతో కాపాడుతానని, గర్భిణిగా వున్నప్పుడు బిడ్డకేవి మేలు చేస్తాయో వాటినే భుజిస్తానని చెప్పింది. ఈ విధంగా ప్రవర్తించిన ఉత్తమ వనిత ఇహపరలోకాలు రెండింటిలో శాశ్వతసుఖం పొందుతుంది. ఆ ఇల్లాలు అరుంధతివలె ప్రశంస కెక్కుతుంది’ అని అన్నాడు భీష్ముడు.  

‘సర్వశాస్త్రసారం, సర్వశ్రేష్ఠం అయిన ఆచరణ’ ఏదని తాతగారిని ప్రశ్నించాడు ధర్మరాజు. సమాధానంగా ‘నారద పుండరీక సంవాదం' చెప్పాడు భీష్ముడు. పుండరీకుడు అనే మహర్షి నారదుడుని ఇదే ప్రశ్న అడిగాడని, జవాబుగా నారదుడు ఇట్లా చెప్పాడని అన్నాడు.

‘బ్రహ్మ చెప్పిన పరమ ధర్మం ఒకటి ఉన్నది. ప్రకృతి అనే 24 వ తత్త్వం తరువాత తత్త్వ జీవాత్మ. అతడు సర్వభూతాల స్వరూపం అయినవాడు. అతడి వ్యవహార నామం “నరుడు”. అతడివలన ఏర్పడిన తక్కిన తత్త్వాలన్నీ నారములు. అతడు నారములు స్థానంగా కలవాడు కాబట్టి నారాయణుడు అన్నారు. ఆ ప్రభువు విశ్వాన్ని సృష్టిస్తూ మరల తనలోనే లీనం చేసికొంటూ “విభుడు” అవుతున్నాడు. ఆ నారాయణుడే పరబ్రహ్మం, పరతత్వం, పరమపదం, ఈశ్వరుడు, విష్ణువు అనే పేర్లతో పిలువబడుతూ ఉంటాడు. అతడే వాసుదేవుడు. ఆత్మ అనే పేర్లతో ఉపనిషత్తులు పిలుస్తాయి. ఈ పేర్లు నరుడికి కూడా వర్తిస్తాయి. సర్వశాస్త్రాల వాక్యాలను పరిశీలించి నిర్ణయించిన తాత్పర్యమిది. కాబట్టి ఎల్లవేళలా నారాయణుడిని స్మరించాలి. మరణకాలంలో “నమో నారాయణాయ” అనే మంత్రాన్ని పలికితే నరులు ప్రణవానికి అర్థమైన పరమపదాన్ని పొందుతారు’.

దానం, ప్రియభాషణం అనే రెండింటిలో ఏది ఎక్కువ ప్రీతి కలిగిస్తుందని అడిగాడు ధర్మరాజు పితామహుడిని. రెండూ ప్రీతి కలిగించేవేనని, దానం ప్రీతికరమైనదని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదని,  ప్రియభాషణం కూడా ప్రీతికరమైనదనటానికి ఒక పురాతన కథ ఉన్నదని అంటూ దాన్ని వివరించాడు భీష్ముడు.

మాటకారి, బుద్ధిశాలి అయిన ఒక బ్రాహ్మణుడు జనసంచారంలేని అడవికి పోయాడు. ఒక రాక్షసుడు అతడి మాంసం తినగోరి అతడిని పట్టుకొన్నాడు. అతడు కలతపడకుండా ఆ రక్కసుడి మొగంవైపు చూస్తూ ఉండిపోయాడు. ఆ రక్కసుడు ఆశ్చర్యపోయి తన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పితే బ్రాహ్మణుడిని వదలుతానని ఇలా ప్రశ్నించాడు. “నా శరీరం కృశించిపోవటానికి, పాలిపోవటానికి కారణం ఏమిటి?” అని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు తొందరపడక నిబ్బరంగా, అనుకూలభావంతో ఇట్లా చెప్పాడు.

'చుట్టాలు నీ దుష్టస్వభావంతో విసిగి వదలి తరువాత బాధపడటం, దారిద్ర్యం కలిగినప్పుడు అపూర్వ గౌరవాలు కోరటం, ఇతరులు పెట్టిన బాధలను నీవు మొగమాటంవలన అనుభవించగా వారు జయించామని పొంగిపోవటం, జాలి తలచి నీవు మేలు చేయగా ఆ మేలు పొందినవాడు అది తన పరాక్రమమే అని చెప్పటం, బుద్ధి కలవారు నిన్ను పొగడుతూ ఉంటే సిగ్గుపడుతూ పండితుల మెప్పుకొరకు చూస్తూ ఉండటం, నీవు న్యాయంగా పలికిన దానిని జనసభ అంగీకరించకపోవటం, నీ తప్పు నీ భార్యకు తెలిసి ఆమె కుమిలిపోతూ ఉంటే ఆమెను నీవు సముదాయించ లేకపోవటం, నీ సొమ్మును కొట్టివేయాలని ఇతరులు కనిపెట్టుకొని ఉంటే దానికి ఏది దిక్కు అని నీవు ఆలోచిస్తూ ఉండటం, దుర్మార్గుడు చాటున నిన్ను గూర్చి చేసిన నిందలను నీ బంధువులు వినాలని భావించటం, నీవు గొప్ప పనులు చేస్తూ ఉంటే నీ స్నేహితులు నిన్ను మాయలవాడిగా భావించటం, నీ మనసులో ఉన్న వగపును బయట పెట్టుకోలేకపోవటం, భార్య, కొడుకు, అల్లుడు మంచి నడవడిలేనివారై తిప్పలు పెట్టటం, తండ్రి, తల్లి, అన్నదమ్ములు రోగాదులచేత కృశించటం, పూర్వజన్మలో బ్రాహ్మణుడి ఆవును చంపడం, పనికిమాలినవాడిని పనిలో పెట్టుకొని పేరు పాడుచేసికొనటం, ఎంతోకాలం ఎన్నో ప్రయత్నాలు చేసి ఒక కొలికికి తెచ్చిన పనిని నీచుడైన పగవాడు పాడుచేయటం, వీటిలో ఒకదానిచేత మానవుడు కృశిస్తాడు. పాలిపోతాడు’.

ఈ విధంగా ఆ బ్రాహ్మణుడు స్పష్టంగా చెప్పాడని, అది విని ఆరాక్షసుడు  మెచ్చుకొని అతడిని విడిచి పెట్టాడని, మంచి మాటల తీరు ఇలా వుంటుందని భీష్ముడు చెప్పాడు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఆనుశాసనిక పర్వం, చతుర్థాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)