Thursday, December 14, 2023

విజయానికి తిరుగులేదు, ఓటమి శాశ్వతం కాదు! ..... వనం జ్వాలా నరసింహారావు

 విజయానికి తిరుగులేదు, ఓటమి శాశ్వతం కాదు!

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (15-12-2023)

          నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్’ అంటాడు ‘ద కౌంట్ ఆఫ్ మాంటే క్రిస్టే’, ‘ద త్రీ మస్కేటీర్స్’ గ్రంథ రచయిత అలెగ్జాండర్ డ్యూమాస్. విజయాన్ని మించిన విజయం లేదు, విజయం మరింత విజయాన్ని అందిస్తుంది అని దీని అర్థం. కాకపోతే, ఎల్లప్పుడూ సంఘటితమైన కృషి అవశ్యం. అలాగే, ‘ఫెయిల్యూర్స్ ఆర్ ది పిల్లర్స్ టు సక్సెస్’ అని మరో ఆసక్తికరమైన సామెత ఉంది. అపజయాలే విజయానికి మూలస్తంభాలని, ‘వైఫల్యం జీవితానికి గొప్ప గురువు అనీ అర్థం. అంటే ఓడిపోయిన వ్యక్తి తన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, విజయం దిశగా మార్గం సుగమం చేసుకోవడానికి ఆ ఓటమిని ఒక అవకాశంగా వాడుకోవచ్చు. విజయపథంలో సాగుతున్న వ్యక్తికి ఓటమి అనేది నిజానికి ‘తాత్కాలికంగా అచేతనావస్థలో ఉన్న విజయం’ మాత్రమే అనుకోవచ్చు.

విజయం మున్ముందు తప్పక చేయాల్సిందేమిటో స్పష్టంగా తెలియపరుస్తుంది. అపజయానికి దారితీసిన కారణాలను, దానికి ముందు తీసుకున్న నిర్ణయాలను, నిష్పాక్షికమైన మనస్సుతో, అంతరాత్మ సాక్షిగా, విమర్శనాత్మకంగా విశ్లేషించి పాఠాలు నేర్చుకుంటే, విజయావకాశాలు మెరుగుపడే వీలుంది. అలాగే, ‘వైఫల్యం పురోగతిలో విజయం’ అనీ, అయితే ఆ సాధన దిశగా లక్ష్యాన్ని వదలకుండా నిరంతరం పోరాడుతూనే వుండాలనీ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ మరో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. అలెగ్జాండర్ డ్యూమాస్ అయినా, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అయినా, డేల్ కార్నెగీ అయినా, మరెవరైనా చెప్పేదాని సారాంశం ఒక్కటే. జయాపజయాలు రెంటిలోనూ విజయం ఉన్నదన్న వాస్తవాన్ని.

         ఇటీవల వెల్లడైన రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలలో ఎనుముల రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ భారీ విజయం, కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్‌ఎస్ అపజయం, ఈ రెండింటికీ కూడా ‘నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్, ‘ఫెయిల్యూర్స్ ఆర్ ది పిల్లర్స్ టు సక్సెస్  పై రెండు సామెతలనూ వర్తింప చేయవచ్చు. లక్ష్యాన్ని, ధ్యేయాన్ని వదలకుండా నిరంతరం పోరాడుతూ, కృతనిశ్చయంతో కోరుకున్న విజయాన్ని సాధించారు రేవంత్ రెడ్డి. ఇక కేసీఆర్ విషయానికొస్తే ఎన్నికల్లో సంభవించిన ఈ ఓటమి, ‘తాత్కాలికంగా అచేతనావస్థలో ఉన్న విజయం’ మాత్రమే. ఒక స్థిరమైన వ్యూహాత్మక ఆలోచన ద్వారా, గతంలోలాగా శ్రమిస్తూ, సరైన సమయం కొరకు ఎదురు చూస్తూ, పునరాగమనానికి మార్గం సుగమం చేసుకోమనే సూచనే. సమతుల్యమైన జయాపజయాలు నాయకులిద్దరికీ ఒక అనుభవమనేది వాస్తవం.

         విజయం దిశగా రాజకీయ ప్రస్థానాన్ని జడ్పీటీసీ సభ్యుడిగా, ఆ వెంటనే స్వతంత్ర అభ్యర్థిత్వంతో ఎమ్మెల్సీగా ప్రారంభించిన రేవంత్ రెడ్డి కోడంగల్ నియోజకవర్గం శాసనసభ స్థానానికి 2009, 2014 ఎన్నికలలో వరుస విజయాలు సాధించారు. అదే కొడంగల్ నియోజకవర్గం నుంచి తన మొదటి ఓటమిని 2018 శాసనసభ ఎన్నికల్లో రుచి చూశారు. ‘ఫెయిల్యూర్స్ ఆర్ ది పిల్లర్స్ టు సక్సెస్’ అన్నట్టుగా ఆ తరువాత ఆరు నెలలకే జరిగిన లోక్‍సభ ఎన్నికలలో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి గెలిచి, విజయం వైపు గొప్ప పునరాగమనం చేశారు.

         క్రమేపీ రేవంత్ రెడ్డి ‘విజయం మరింత విజయాన్ని అందిస్తుంది’ అన్న నానుడిని నిజం చేస్తూ రెండున్నరేళ్ళ క్రితం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడుగా నియమితులైనప్పటి నుంచి ఒక స్థిరమైన, ఆచరణాత్మకమైన రాజకీయ వ్యూహంతో ముందుకు సాగుతూ కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించారు. ఏ కొడంగల్ శాసనసభ స్థానంలో 2018లో ఓటమిపాలయ్యారో అక్కడి నుంచే అఖండ విజయం సాధించారు. ఎన్టీఆర్ టీడీపీని 1989 ఎన్నికలలో ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, చంద్రబాబు నాయుడు టీడీపీని 2004 ఎన్నికలలో ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిలకు దీటుగా, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని 2023 ఎన్నికలలో ఓడించి తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు రేవంత్ రెడ్డి.        

తెలంగాణ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా, రెండు పర్యాయాలు ఎన్నికై అత్యంత విజయవంతమైన ముఖ్యమంత్రిగా పాలన అందించిన కేసీఆర్ రాజకీయ ప్రస్థానం 1983 శాసనసభ ఎన్నికలలో సిద్దిపేట నియోజకవర్గం నుంచి పరాజయంతో మొదలైంది. అయితే ఆ తరువాత కేసీఆర్ విజయ పరంపర నిరాటంకంగా ఇటీవలి 2023 ఎన్నికల వరకూ కొనసాగింది. ఏ ఎన్నికల్లోనూ, ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. తన మొదటి ఓటమి నుంచే తర్వాతి విజయాలకు మార్గం నిర్దేశించుకున్నారు. మొదటి ఎన్నికల విజయాన్ని 1985 శాసనసభ మధ్యంతర ఎన్నికలలో సిద్దిపేట నియోజకవర్గం నుంచే నమోదు చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఆయన ప్రస్థానం ‘నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్’ అన్న రీతినే సాగింది.

         ఆ తరువాత కేసీఆర్ వరుసగా నాలుగు పర్యాయాలు 1985 నుంచి 1999 వరకు జరిగిన ఎన్నికలలో సిద్ధిపేట ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాలలో పనిచేశారు. కొంతకాలం ఉపసభాపతిగానూ పని చేశారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం తరువాత కేసీఆర్ విజయగాథ కొనసాగి స్థిరపడ్డది. 2004 ఎన్నికలలో ఐదవసారి సిద్దిపేట ఎమ్మెల్యేగా, మొదటిసారి కరీంనగర్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఎంపీ స్థానాన్ని ఉంచుకుని, కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. కాంగ్రెస్ పార్టీ విసిరిన సవాలుకు దీటుగా రాజీనామా చేసి 2006 ఉపఎన్నికలో గెలిచారు. 2009 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ స్థానం నుండి లోక్‍సభకు ఎన్నికయ్యారు.

         తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన అనంతరం 2014 ఎన్నికలలో గజ్వేల్ శాసనసభ స్థానానికి, మెదక్ పార్లమెంట్ స్థానానికి పోటీచేసి రెండు చోట్లా విజయం సాధించారు. ఆయన నేతృత్వంలోని టీఆర్ఎస్ తెలంగాణలోని 119 స్థానాలకు గాను 63 (మెజారిటీ), 17 లోక్‍సభ స్థానాలకు గాను 11 గెలిచింది. జూన్ 2, 2014న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, నాలుగున్నర సంవత్సరాల తరువాత శాసనసభను రద్దుచేసి నవంబర్ 2018లో జరిగిన ఎన్నికలలో 88 స్థానాలను గెలిచి అఖండ విజయం సాధించారు. మరోమారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

         తొమ్మిదిన్నరేళ్ళలో కేసీఆర్ సారథ్యంలోని ‘ఎనేబ్లింగ్ గవర్నెన్స్’ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు అపూర్వమైన సంపద, శ్రేయస్సు చేకూరినప్పటికీ, అన్ని ప్రామాణికాలలో అసాధారణమైన వృద్ధి నమోదు అయినప్పటికీ, ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత ఇచ్చి విజయాన్ని చేకూర్చారు. కేసీఆర్ స్వయంగా నలభై ఏళ్ళ తర్వాత ఎమ్మెల్యేగా రెండో ఓటమిని చవి చూశారు. కామారెడ్డిలో ఓడి, గజ్వేల్‌లో గెలిచారు. బహుశా ప్రజలు కోరుకున్న దానికంటే, అవసరాలను మించి కేసీఆర్ వారికి ఇచ్చారేమో! ప్రభుత్వాలు పథకాల రూపకల్పనకు ముందు, అమలుకు ముందు, అవి ప్రజలకు ఏ మేరకు అవసరమో అనే విషయంలో శాస్త్రీయ విశ్లేషణ చేయాలేమో!

ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చేసిన ఆరు గ్యారంటీల అమలుకు ముఖ్యమంత్రి చేసిన మొదటి సంతకం ద్వారా, కేబినెట్ తీర్మానం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేసీఆర్ బాటలోనే (బహుశా) సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకోకుండా, వర్తమాన ఆర్థిక పరిస్థితిని పూర్తిగా అధ్యయనం చేయకుండా, అవసరాల అంచనా లేకుండా, ఎన్నికల వాగ్దానానికి అనుగుణంగా ఆరు గ్యారంటీల అమలుకు ముందుకు పోవడం కొంచెం విశ్లేషించాల్సిన అంశమే. కాకపోతే, కొంచెం జాగ్రత్తగా, ఆరు గ్యారంటీలలో రెండు మాత్రమే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యపరిమితి రూ.10 లక్షలకు పెంపు మాత్రమే, ప్రస్తుతానికి అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించడం హర్షించదగ్గ విషయం.  ప్రజాస్వామ్యంలో నిరంతర మార్పు సర్వసాధారణం. మకుటంలేని మహారాణిగా మన్ననలు అందుకున్న ఇందిరాగాంధీ ‘గరీబీ హటావో’, ‘బ్యాంకుల జాతీయీకరణ’ వంటి ప్రజాకర్షక నినాదాలు ఇచ్చినప్పటికీ, ఎమర్జెన్సీ అనంతరం 1977లో జరిగిన ఎన్నికలలో తాను పోటీ చేసిన స్థానంలో పరాజయం పాలవడమేగాక, కాంగ్రెస్ పార్టీని పరాజయం దిశగా నడిపించింది. అయితే ఆమెను, ఆమె పార్టీని ఓడించిన జనతా అంతర్గత కుమ్ములాటలో బలహీనపడి, ప్రభుత్వం కూలిపోవడంతో, ఇందిరాగాంధీ దిగ్విజయంగా తిరిగి అధికారంలోకి రాగలిగింది. 1983 ఎన్నికల్లో ఎన్టీరామారావు అఖండ విజయం సాధించినప్పటికీ, 1989 ఎన్నికల్లో ఆయన స్వయంగా ఒక నియోజకవర్గంలో ఓటమి పాలై, కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పచెప్పారు.

         ‘ఆంగ్లంలో భగవద్గీత  సందేశ సారం’ గా కుష్వంత్ సింగ్ వర్ణించిన, రడ్యార్డ్ కిప్లింగ్ అనే ప్రఖ్యాత ఆంగ్ల రచయిత రాసిన ‘ఇఫ్’ ఆనే సందేశాత్మక గేయ కవితలోని ప్రతిపదం ఏ రంగంలోనైనా గెలుపు ఓటములను చవిచూసే ప్రతివ్యక్తీ చదవాల్సినంత గొప్పది. ముఖ్యంగా, ‘జయాపజయాలను సమతుల్యంగా పరిగణించి, ఓటమి ఎదుర్కొన్నా తిరిగి ఆదినుండి ఆరంభిస్తూ విజయానికి బాటలు త్రొక్కు’ అనే మాటలు. ఇలా ఎవరికైనా జయాపజయాలు మాములే. కాకపోతే ఎందుకు ఒకరు గెలుస్తారు, మరెందుకు ఇంకొకరు ఓడుతారు అనేది జవాబులేని ప్రశ్న. ఎవరైనా చేయగలిగింది జయాపజయాలను సమతుల్యంగా పరిగణించి ముందుకు సాగిపోవటమే! ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలే.

 

Sunday, December 10, 2023

మానవ సమాజానికి ఆదర్శ ప్రాయం ఋగ్వేద సమాజం ...... ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-2 : వనం జ్వాలా నరసింహారావు

 మానవ సమాజానికి ఆదర్శ ప్రాయం ఋగ్వేద సమాజం

ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-2

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (11-12-2023)

‘ఋగ్వేదం ఒక పరిపూర్ణ, శాంతియుత, స్వయం సమృద్ధ సమాజాన్ని సృష్టించింది. అయోమయంలో వుండి, అడుగంటనున్న నేటి ప్రపంచ మానవ సమాజానికి ఆదర్శప్రాయం ఋగ్వేద సమాజం. ఈ సమాజంలో ఒక స్థిరమైన రాజకీయ వ్యవస్థ వుంది. మానవ సంబంధాలు స్థిరపడ్డాయి. ఉమ్మడి కుటుంబాలు, ప్రేమాభిమానాలు, అనుబంధాలు అమృతప్రాయములైనాయి. గ్రామాల్లో శాంతి, సహకారం, సద్భావం అవతరించాయి. స్త్రీలకు ఆస్తి హక్కు, కుటుంబ యాజమాన్యం కలిగించారు. ఋగ్వేద జీవన విధానమే ప్రపంచమంతటా కొనసాగింది. ఇన్ని వేల సంవత్సరాలు నిరంతరాయంగా కొనసాగిన జీవన విధానాన్ని మానవజాతికి అందించిన ఋగ్వేదాన్ని నమోవేదమాత అనడం కన్నా మనం ఏం చేయగలం?’.

          ఋగ్వేదం ప్రధానంగా పరమాత్మ, ఆత్మ, ప్రకృతి యొక్కగుణాలు, లక్షణాలను వివరిస్తుంది. అదీకాక దృశ్యాదృశ్య (కంటికి కనిపించే, గోచరమైన జగత్తు గురించి, కంటికి కనిపించని అగోచరమైన జగత్తు విశేషాల గురించి) జగత్తు వివిధ లక్షణాల గురించి వివరిస్తుంది. రసాయన, భౌతిక, గణిత, ఖగోళ, విశ్వోద్భవ శాస్త్రాల యొక్క ప్రాధమిక అంశాలను వివరిస్తుంది. మానవుడి పూర్తి జీవితంలో అనుసరించవలసిన ధర్మాల గురించి, అనుసరించవలసిన ఆదర్శాల గురించి చెప్తుంది. ఆధ్యాత్మిక విషయాల యొక్క లక్షణాలు, ప్రకృతి, పనితీరు వివరిస్తుంది.’ మరిన్ని వివరాల్లోకి పోతే.....

‘వేదం అపౌరుషేయం, దైవదత్తం, దైవప్రసాదం, అమృతమయం. ‘వేదం అపౌరుషేయమంటే అది మానవ నిర్మితమైనది కాదని అర్థం. అలాగే వేదం దైవదత్తం, దైవప్రసాదం. ఆ మాటకొస్తే, సమస్త ప్రకృతి దైవదత్తమే, దైవ ప్రసాదమే! మానవుడు సృష్టించగల సామర్థ్యం వున్నవాడు కాదు. ప్రకృతిని దర్శించి వినియోగించగలవాడు మాత్రమే. ప్రకృతి సహాయం లేకుండా లోకాలు నిలువజాలవు. దైవప్రసాదమైన ప్రకృతి శక్తులను శాస్త్రజ్ఞులు, ఆవిష్కర్తలు, మేధావులు, ఋషులు మాత్రమే దర్శిస్తారు. దర్శించడం అంటే కంటికి కనిపించేది చూడడమని కానేకాదు. కంటికి కానరానిదానిని కనుగొనడం. ఋషి అతీంద్రియ దర్శి. వేదం శ్రుతి. విన్నది మాత్రమే. వేదంలోని మంత్రాలను, సూక్తాలను ఋషులు కనుగొన్నారు. మనం వేదంలో చూసే ఋషులు వేదకర్తలుకారు. ద్రష్టలు మాత్రమే. స్మర్తలు గుర్తుంచుకున్నవారు అవుతారు’.

‘వేదం కర్మ ప్రతిపాదకం. కర్మ అంటే కార్యం. కృషి. ఇంద్రాది దేవతలు కర్మలవల్ల గొప్పవారయినారు. జన్మమాత్రాన కాదు. ఉదాహరణకు నూరు సత్కార్యాలైన యజ్ఞాలు చేసినవాడు ఇంద్రుడు అవుతాడు. వేదం అపారం. వేదార్థము బహువిధము. ఇందు అనేక శాస్త్రాలు, శాస్త్రార్థాలు, విజ్ఞానాలు, వికాసాలు, నానాశాఖలు వున్నాయి. ఏ ఒకరో, ఇద్దరో దీనిని అర్థం చేసుకోవడం అసాధ్యం, అసంభవం. సత్యాన్ని దర్శించడానికి ఒకే ఈశ్వరుని ప్రతిపాదించడానికి వేదంలో నిరంతర ప్రయత్నం సాగుతున్నది. లోకం గతానుగతం. నలిగిన మార్గంలో నడిచేది. కొత్తదాన్ని ఆమోదింపచేయడం ఎంత కష్టమైనను పాతది నిలబడడం లేదు. అయినా సామాజిక శాస్త్రంలో, తాత్విక శాస్తంలో విజయవంతమైన ప్రయోగాలు అరుదు.

‘మానవ చరిత్రకు ఆద్యంతాలు లేవు. ఇది కాలం సహితంగా నిరంతరం సాగుతూనే వుంటుంది. ఆ చరిత్ర గమనంలో మానవుడు ఒకప్పుడు పురోగతుడవుతాడు. మరొకప్పుడు తిరోగతుడవుతాడు. మానవ గమనానికి నిర్దిష్ట బిందువులేదు. కాబట్టి, పురోగమన తిరోగమనాలను స్పష్టంగా చెప్పలేం. అప్పుడు గమనం సాపేక్షమవుతుంది. అప్పటి స్థితిని బట్టి వెనుకకా? ముందుకా? అనేకాని అదికూడ నిర్దిష్టం కాదు. మానవ జీవితం ఏకముఖం కాదు. ఇది బహుముఖీనము. ఆర్థికం, సామాజికం, పారమార్థికం, ఇలా  లెక్కలేనన్ని? వాటిలో ఎక్కడా సాపేక్షముగా ముందడుగు, లేదా, వెనుకడుగు నిర్ణయించడం మానవుడికి అసాధ్యం. మానవుడికి విశ్వాసం కలిగించడం అతి కష్ట కార్యం. మానవుడు ఆత్మవిశ్వాసంలో దేవతకావచ్చునని వేదం వచిస్తున్నది.

‘అర్థం అంటే ధనం. మానవుడిలో అర్థం అంటే సగం అని మాత్రమే! అర్థం, బాహిరము. భౌతికము. శ్వాసలేక మనిషి జీవించలేనట్లే అర్థం లేక మనిషి జీవించలేడు. అర్థం జీవికకు తప్పనిసరి. జీవితం శ్వాసమాత్రము కాదు. మానవుడికి మనసున్నది. మనసు అర్థపరము కాదు. ధర్మపరము. కేవలం అర్థపరులు కానివారు మహాత్ములవుతున్నారు. అయినప్పటికీ మానవ జీవితంలో ధర్మాన్ని సాధించడానికి తొలుత కావలసింది శరీరమేకదా? మానవజీవితపు మొట్టమొదటి దుర్దశ భయం. భయంలేనిదైన జ్యోతిని దర్శించడం ఎంతో మహోన్నతం, మానవీయం, దైవికం, మహోత్తమైన, ఆలోచన!’

‘ధనమున్నవానికి శాంతి, శాంతి ఉన్నవానికి ధనం వుండవు. పరిపూర్ణత ప్రకృతికి లేదు కాబట్టి జీవితానికీ లేదు. సృష్టిలోనైనా, అతీతంగానైనా పరమేశ్వరుడు ఒక్కడే పరిపూర్ణుడు. అయినా మానవుడి గమనం నిలువదు. దానికి నిర్దిష్ట లక్ష్యాలు ఉండవు. అది ఉన్నది అనుకోవడం భ్రమ! జీవితమే ఒక భ్రమ కదా! పూజ్యం, అనింద్యం, అద్వేష్యం అయిన ధనమే శాంతిని, సుఖాన్ని కలిగిస్తుంది. అలా కానిది అశాంతి కారకం అవుతుంది. ఉన్నవారి ధనాన్ని లేనివారికి ఇవ్వమన్నది వేదం’.

‘మానవుడికి ప్రధానమైంది కర్మ, పని. పనిలేనిది మానవుడు మనజాలడు. పని తరువాత అవసరమయినది యజ్ఞము, ప్రయత్నం. కర్మకాండ అని పేరొందిన ఒక విధి విధాన యజ్ఞం మానవులకు సౌఖ్యాలను సమకూర్చడానికి ఏర్పడినది. ఇది భగావధారాధనము. యజ్ఞానికి సాధనసంపద సమకూర్చువాడొకడు. అతడు యజమాని. యజ్ఞం జరిపించువాడొకడు. అతడు ఋత్విక్కు. యజమానికి కర్మకాండతోగాని, ఋత్విక్కునకు సాధన సామాగ్రితోకాని సంబంధములేదు. తపస్సు అటువంటిదికాడు. సంపూర్ణ స్వప్రయత్నం. దీనికి చేయువాడు, చేయించువాడు ఉండరు. స్వసంకల్పము స్వ ప్యత్నం. ఇచట దేహమే యజ్ఞభూమి. సంకల్పమే ఋత్విక్కు. ఇది జ్ఞానానికి మార్గము’.

‘మానవుని జీవితయాత్ర అనంతం, అద్భుతం, ఆశ్చర్యకరమైనది. భగవంతుని సృష్టి సమస్తంలో మానవుడికి మాత్రమే ఆలోచన ప్రసాదించినాడు భగవంతుడు. ఆలోచన మానవుని ప్రగతికి, వినాశనానికి కారణభూతం అవుతున్నది. సత్యం అంటే నిజం చెప్పడం మాత్రమే కాదు. “సత్” అంటే ఉన్నది, “అసత్” అంటే లేనిది. ఉన్నది, లేనిది వీటిని గురించిన జ్ఞానం. సకల చరాచర ప్రపంచం “అసత్”. ఉండునదికాదు. వచ్చిపోవునది. దీనికి స్థిరత్వము, శాశ్వతము లేదు. “సత్” ఉన్నది, శాస్వతమయినది. పరమాత్మ స్వరూపం. అర్థం జీవితాన్ని తెలుసుకోవడం. పరమార్థం పరాత్పరుడిని తెలుసుకోవడం. పరాత్పరుడు ఎవడు? అదియే మానవుడికి ఎన్నటికీ తెలియనిది. ప్రస్తుతం మనం విశ్వసించినవాడే ఈశ్వరుడు. ఇది విశ్వాసం మాత్రమే! మానవుడి ఆలోచనకు గోచరించని ఒక మహా పదార్ధం పరమాత్మ. పరమేశ్వరుడు. పరంథాముడు. అతడే “ఋత్”. కావున ఋతమే సర్వానికి కారణం. ఋతము భౌతికము కాదు. పరమాత్మ నుండే సమస్త దేవతలు పుట్టినారు.   

‘నిరంతర అన్వేషణయే జీవితం. వ్యక్తి, కుటుంబ, సమాజ, దేశ, లోక జీవితములందు అన్వేషణమే గోచరించుచున్నది. అన్వేషణము లేనిదాని కొరకు కాదు, ఉన్నదానికొరకే. ప్రకృతి తనలో అనంతములైన రహస్యాలను దాచుకున్నది. వాటికొరకు అన్వేషణ సాగినది, సాగుతున్నది, సాగనున్నది. అన్వేషణమే వేదం. ఈ సమస్త చరాచర ప్రకృతికి మూలం ఏమిటి? ఏది దీనిని కాపాడుతున్నది? ఏది దీనిని అంతమొందిస్తున్నది? వీటిని కనుగొనే అన్వేషణమే వేదం. సత్యాన్ని కనుగొనేవరకు అన్వేషణ ఆగదు. సత్యం దృగ్గోచరమవడం మానవుడికి సాధ్యం కాదు. అయినా అన్వేషణ ఆగదు. అన్వేషణ అనంతం, నిరంతరం. నవీనాలను తెలుసుకోవడమే అన్వేషణం.

         ‘సమస్త సృష్టి, స్థితి, లయాలకు పంచభూతాలు (భూమి, నీరు, వెలుగు, వాయువు, ఆకాశం) ఆధారాలు. ప్రస్తుత కాలంలో మానవుడు పంచ భూతాలకు దుఃఖం కలిగిస్తున్నాడు. దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. నరుడిగల మానవతా లక్షణాలలో కృతజ్ఞత ప్రధానమైంది. మనకు ఉపకారము చేసినవారిని తలచుకోవడం, ప్రత్యుపకారం చేయడం కృతజ్ఞత అవుతుంది. ఉపకారిని తలచకుండడం, ప్రత్యుపకారం చేయకుండడం కృతఘ్నత. దీనికి నిష్కృతి లేదు. పంచ భూతాలు మనకు అనంతములైన ఉపకారం చేస్తున్నాయి. పంచ భూతాలకు కృతజ్ఞత తెలియచేయడం మానవుడి కనీస కర్తవ్యం’.

         ‘పురోహితుడు అనగా పూర్వము ఉండినవాడు. సృష్టికి పూర్వము ఉన్నవాడు. పరాత్పరుడు, ఈశ్వరుడు. పురోహితుడు యజ్ఞానికి అవసరమైన పదార్ధాలను సేకరించేవాడు. పురోహితుడు సామాజిక శాస్త్రజ్ఞుడు. ఒక వ్యక్తి, ఒక సంఘపు సుఖ, దుఃఖాలను వినేవాడు. సుఖ జీవనానికి అవసరమైన సలహాలు ఇచ్చేవాడు. అతడు ఆచార్యుడిలాగా, వైద్యుడిలాగా, మిత్రుడిలాగా ఉపకరించేవాడు.

         ‘వేదంలో వైద్యాన్ని, విద్యను స్తుతించడం జరిగింది. ఇది క్రమ పరిణామం. సక్రమ ప్రగతి. అభ్యుదయం. అశ్వినులు కవలలు, సూర్యుడి పుత్రులు, ఆరోగ్యదేవతలు, వైద్యులు, వీరు జంట దేవతలు. ఒంటరిగా వుండరు. వైద్యం శారీరకం, మానసికం కలిసి జరుగవలసి ఉన్నది. ఈ సత్యాన్ని వేదం వెల్లడించింది. ఆధునిక వైద్యం ఇంకా ఎదగాల్సి ఉన్నది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయాలను మన వైద్యం గుర్తించాల్సి ఉన్నది. అస్తి పంజరం కాదు, మనసున్న మనిషిని అధ్యయనం చేయాల్సి ఉన్నది. గుండె జబ్బులకు, కామెర్లకు, పండు రోగానికి వేదంలో సూర్యరశ్మిచికిత్స చెప్పడం జరిగింది. విద్య నదిలాగా వుండాలని వేదం వచిస్తున్నది. అది ఎంతో సత్యం! విద్య ఒకచోట ఉండరాదు. ప్రవహించాలి. విద్య నదిలాగా సమస్త జనులకు ఉపయోగపడాలి. నది సాగరంలో కలుస్తుందనే జ్ఞానం ప్రసాదించేదే విద్య అవుతుంది. లోకంలో వున్న సమస్త ప్రజ్ఞలను ప్రకాశింప చేసేది విద్య. సరస్వతి.

‘ఇంద్రుడు మేఘాలను కొట్టినవాడిగా, జలాలను చీల్చినవాడిగా, కొండల నుండి నదులను బహిర్గతం చేసినవాడిగా చెప్పడం జరిగింది. ఇంద్రుడు కొట్టిన మబ్బులు కురిశాయి. నదులయ్యావి. నదులు సముద్రాలకు సాగాయి. అది అద్భుతం. ఆశ్చర్యకరమైన జలముక్తి మహాత్కార్యాన్ని వివరించేది. కొండలందు దాగిన నదుల అడ్డంకులను తొలగించి ప్రవహింపచేయు మహాత్కార్యాన్ని వర్ణిస్తున్నది. ఇది ఆధునిక యుగంలో నదులకు ఆనకట్టలు కట్టే యంత్రాల అట్టహాస కార్యాన్ని తలపిస్తున్నది. ఆధునిక కాలంలో కట్టడం అయితే, ఆ నాటి కాలంలో అది విప్పడమనే గొప్ప ఇంజనీరింగ్ ప్రక్రియ. ఇంజనీర్లే దీనిని వివరించగలరు’.

         ‘స్వరాజ్యాన్నిగురించిన ఆలోచన ఆనాడే వచ్చింది. వేదాలది అంతటి ప్రగతిశీల ఆలోచనా విధానం. ఇంద్రుడు స్వరాజ్యంలో ప్రభుత్వం ఎలా వుండాలో వివరించినాడు. ప్రభుత్వం తనను, దేశాన్ని రక్షించే సామర్థ్యం కలిగి వుండాలి. ప్రజలకు శాంతి సౌభాగ్యం కలిగించే ఉపాయాలు కలిగి, వాటిని అమలు పరచాలి. ప్రజలకు సంతృప్తికరమైన జీవితాన్ని సాధ్యమయ్యే ప్రయత్నాలు చేయాలి. ఈ లక్షణాలు కలదే స్వరాజ్యమవుతుంది. భూమి, నీరు, వాయువు, శిలలు అన్నింటిలోను ఔషధాలు వున్నాయని వేదం చెప్తున్నది. మనువు ఔషధాలు నరులకు ఇచ్చినాడు. రుద్రుడు నీతిబోధచేయు వరకు అవి ఫలించలేదు.   భూమియే స్వర్గం. భూమియే అంతరిక్షం. భూమియే తల్లి. భూమియే తండ్రి. భూమియే పుత్రుడు. భూమియే సర్వ దేవతలు. భూమియే అయిదు విధాల జనులు. భూమియే పుట్టుక. భూమియే పుట్టిన వస్తువు. భూమియే సర్వం. భూమిని మించినది లేదు.

         ‘ఒక పని నిర్విఘ్నంగా జరగడానికి అనేకుల అండదండలు, ఆశీస్సులు అవసరమవుతాయి. ప్రకృతి శక్తులు, దేవతలు, మానవులు, పరిసరాలు ఇన్ని సహకరించాల్సి ఉన్నది. అందరిని ప్రార్థించవలసి ఉన్నది. మానవుని మనుగడకు సమాజపు నిలకడకు సదాశయాలే ఆధారాలు. వేదంలో ఉన్నతమైన సదాశయాలున్నాయి. ‘దేవతలది ప్రత్యేక వర్గము, వర్ణము, జన్మము కావు. అగ్ని, వాయువు, ఇంద్రుడు, లాంటివారు మానవజాతికి చేసిన ఉపకారము వల్లే వారు దేవతలయ్యారు. ఋషులు జన్మవలనే కాకుండా సాధన ద్వారా ఋషులు అయినారు. ద్రష్టలు అయినారు. స్మర్తలు అయినారు. పటు పరిశ్రమ, మేధాసంపత్తి, నిరంతర పరిశ్రమతో దేవతలలో చేరవచ్చునని ఋషులు నిరూపించినారు. పాండిత్యానికి, శాస్త్ర పరిజ్ఞానానికి, జన్మతో నిమిత్తం లేదని నిరూపించినారు. ప్రతిభకు ఏనాడు కూడా ఆటంకం కలగలేదు. కలగదు కూడా.  

(డాక్టర్ దాశరథి రంగాచార్య వేద సంహితల ఆధారంగా)

Saturday, December 9, 2023

Triumph and Disaster: Treat the Two Impostors just the same ...... Vanam Jwala Narasimha Rao

 Triumph and Disaster: Treat the Two Impostors just the same

Vanam Jwala Narasimha Rao

The Hans India (10-12-2023)

               (The recently concluded Telangana State Assembly Elections and the results favoring the Congress Party led by Anumula Revanth Reddy and defeat to Bharat Rashtra Samithi led by Kalvakuntla Chandrashekhar Rao, aptly fit in to these adages of ‘Nothing Succeeds Like Success’ and ‘Failures are the Pillars of Success.’ Revanth Reddy fought incessantly and never gave up in pursuit of victory, and achieved it. On the other hand, KCR’s failure is only a ‘Suspended Success’ and he may have to wait for the right moment to stage a comeback with an appropriate strategy. Perhaps he gave people ‘More than what they Needed’ without a scientific ‘Need Analysis.’-Observation by Editor, Hans India)  

Alexandre Dumas, author of ‘The Count of Monte Cristo’ and ‘The Three Musketeers,’ coined the proverb ‘Nothing Succeeds Like Success,’ which implicitly means that, ‘Success Breeds Further Success.’ If someone is successful once, chances of their success in the future are better. Further, if a person was successful in one thing, then that person is more likely to be successful in many things. Notwithstanding anything aforementioned, concerted effort is essential.

Similarly, another proverb, ‘Failures are the Pillars of Success,’ hints at, ‘Failure is Life's Greatest Teacher,’ and an opportunity to build an unsuccessful person’s strength. Failure in fact is only a ‘Suspended Success’ for any person, until the right moment comes, if in the meantime, they work hard with consistent and appropriate strategy. While failure shows what one should not do, success tells what one needs to do. If decisions that caused failure are critically analyzed with an unbiased mind, possibilities of success are higher.

Albert Einstein, an influential scientist, observed that, ‘Failure is success in progress,’ provided, one does not give up and keeps fighting incessantly. Only when a person pursues victory determinedly, he stands to win at some point. Dale Carnegie, Teacher in self-improvement, and interpersonal skills, professed that, ‘Develop success from failures. Discouragement and failure are two stepping stones to success.’

The recently concluded Telangana State Assembly Elections and the results favoring the Congress Party led by Anumula Revanth Reddy and defeat to Bharat Rashtra Samithi led by Kalvakuntla Chandrashekhar Rao, aptly fit in to these adages of ‘Nothing Succeeds Like Success’ and ‘Failures are the Pillars of Success.’ Revanth Reddy fought incessantly and never gave up in pursuit of victory, and achieved it. On the other hand, KCR’s failure is only a ‘Suspended Success’ and he may have to wait for the right moment to stage a comeback with an appropriate strategy. The two imposters, ‘Triumph and Disaster’ are a good experience to them respectively.   

The new Chief Minister of Telangana, Revanth Reddy started his successful political career as ZPTC Member and soon got elected as MLC as an independent. Like ‘Nothing succeeds like success’ he was elected as MLA from Kodangal constituency in 2009 and in 2014. Having tasted his first defeat in the 2018 Telangana Assembly Elections from Kodangal, and in accordance with the adage, ‘Failures are the Pillars of Success,’ he made a marvelous and great comeback, by winning Lok Sabha Seat from Malkajgiri Constituency.

Revanth Reddy slowly proved that ‘Success Breeds Further Success.’ Consequent to his appointment as President of Telangana Pradesh Congress Committee, two and half years ago, Revanth Reddy with a consistent and appropriate strategy, led, with determination, the Congress' successful campaign in the 2023 Telangana Legislative Assembly elections. He won Kodangal seat, which he lost in 2018. He however lost from Kamareddy. Thus, moving from Success to Failure to Grand Success. Revanth Reddy repeated the achievements of Dr M Chenna Reddy who defeated NTR TDP in 1989, and Dr YS Rajshekhar Reddy who defeated Chandrababu Naidu TDP in 2004, to bring back the Congress party to power.

Kalvakuntla Chandrashekhar Rao, perhaps, the ‘Most Successful Chief Minister of Telangana’ for two terms, made his unsuccessful debut into electoral politics in 1983 from Siddipet Assembly Constituency. But he continued his spree of success after success and never looked back till the other day. Treating that first failure as a sheer ‘Suspended Success’ KCR waited for the right opportunity, which came in just a year, when he successfully contested from the same Siddipet in 1985 and became a first time MLA. And from then onwards, for him, it was ‘Nothing Succeeds Like Success.’ 

KCR won four times consecutively from Siddipet, from 1985 to 1999 and served in NTR and Chandrababu Naidu Cabinets and also was Deputy Speaker. After formation of Telangana Rashtra Samithi (TRS) in 2001, KCR’s Success story sustained. He won in 2004 Elections, from Siddipet Assembly Constituency for the fifth time and also from Karimnagar Lok Sabha Constituency. He retained the MP seat and become a Union Cabinet Minister in the UPA Government at the Centre. KCR resigned as MP in 2006 as a challenge to the Congress and won and then repeated the feat. In 2009, KCR won from Mahbubnagar Lok Sabha Constituency.

In 2014 elections, KCR was elected as MLA from Gajwel Assembly Constituency and as an MP from Medak. TRS, led by KCR emerged victorious by winning 11 of the 17 Lok Sabha seats and 63 of the 119 Assembly seats. He was sworn in as the first Chief Minister of Telangana State on 2 June 2014. In September 2018, CM KCR dissolved the Telangana Legislative Assembly, and then, after winning 88 seats in the Elections held in November 2018, KCR was re-elected as Chief Minister for a second term in December 2018.   

In spite of incredible and unprecedented wealth and prosperity creation for all sections of people and ‘Enabling Governance’ during the past nine-and-a-half years, registering an exceptional growth, voters preferred Congress Party. He also tasted his second electoral defeat after 40 years, by losing one (Kamareddy) of the two seats he contested but winning the other (Gajwel). Perhaps KCR gave people ‘More than what they Needed’ without a scientific ‘Need Analysis.’ In a similar manner, and probably unmindful of pros and cons, the Congress Party and CM Revanth Reddy, soon after the swearing-in, signed on the concerned file related to the ‘Six Guarantees.’ Later, the Cabinet gave its approval and decided to implement two of them from December 9.

‘Winners focus on winning and Losers focus on winners.’  Why do leaders sometimes win (Success) and sometimes lose (Failure)? ‘Win or Lose,’ the best quality of a leader shall be to set a good example to their team. It is better if losers reconcile to, ‘Yesterday is not ours to recover, but tomorrow is certainly ours to win.’ Losing elections, sometimes even badly, and later resurrecting, is a common feature in an evolving democracy like India, where it has come to stay despite some hiccups. In any democracy the absolutely permanent entity is ‘Changing’ and even ‘Ever Changing.’ No leader or party is permanent in power.

‘Crownless Queen,’ Indira Gandhi, despite her populist slogans like Garibi Hatao and Bank Nationalization, tasted miserable defeat in the 1977 Elections, following the Emergency Excesses. For the first time, the Congress Party lost power at center, and Indira lost her MP seat. However, she returned to power triumphantly, thanks to Internal feud between Janata Party Leaders and political instability, that worked in favor of Indira Gandhi and her Congress Party. Voters preferred a stable Government. NT Rama Rao’s TDP that came to power with a big bang in 1983, was defeated in 1989 by Congress Party led by Dr Chenna Reddy in united AP. NTR was defeated in Kalvakurthy. Apart from these two examples, losing badly in elections and returning to power triumphantly with passage of time is a general feature.

Rudyard Kipling, a British Indian author, in his Poem 'IF', writes that, 'If you can keep your head when all about you are losing theirs and blaming it on you; If you can trust yourself when all men doubt you, but make allowance for their doubting too: If you can meet with Triumph and Disaster, and treat those two impostors just the same; If you can fill the unforgiving minute with sixty seconds' worth of distance run, yours is the Earth and everything that is in it, And, which is more, you will be a Man, my son!

Therefore, the two Impostors, ‘Triumph and Disaster’ shall be treated just the same. If one is carried away with Triumph, it may lead to downfall (Disaster). Working hard after disaster would lead to success (Triumph). Wish both the leaders Success always.

(Writer is formerly Chief Public Relations Officer to the former Chief Minister, Telangana)

Monday, December 4, 2023

వేదాలను, పురాణాలను లోకానికి అందించిన వేదవ్యాసుడు .... (ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-1) : వనం జ్వాలా నరసింహారావు

 వేదాలను, పురాణాలను లోకానికి అందించిన వేదవ్యాసుడు

ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-1

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (04-12-2023)

వేదాలను, పురాణాలను లోకానికి అందించిన పరాశర మహర్షి పుత్రుడైన వేదవ్యాసుడికి పైలుడు, సుమంతుడు, జైమిని, వైశంపాయనుడు అనే నలుగురు శిష్యులుండేవారు. వీరు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అనే నాలుగు వేదాలను వ్యాసమహర్షి ఉపదేశించిన క్రమంలో అన్ని లోకాలలో ఆవిష్కరించారు. బ్రహ్మ హృదయాకాశంలో ఉదయించిన ఒక నాదం, ఆయన ఆత్మయోగంతో చిత్తవృత్తులను నిరోధించి వున్నప్పుడు ఆయన శ్రవణ పుటాలలో వ్యక్త రూపాన్ని పొందింది. ఆ నాదమే బృహతీ వాక్కుగా,ఓమ్’ అన్న ధ్వనిగా వినిపించి, అక్షరాకృతిని ధరించింది. ఆ ఓంకారమే బ్రహ్మవిద్యాసర్వస్వములైన అన్ని మంత్రాలకు, అన్ని ఉపనిషత్తులకు, పుట్టినిల్లైన వేదమాత.

త్రిగుణాత్మకమైన ఆ ఓంకారంలో. సత్త్వరజస్తమస్సులనే మూడు గుణాలు, ఋగ్యజుస్సామములనే మూడు నామాలు, భూర్భువస్సువస్సులనే మూడులోకాలు, జాగ్రత్స్వప్నసుషుప్తులనే మూడు వృత్తులున్నాయి. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ ఓంకారం నుండి స్వరాలు, స్పర్శలు, అంతస్థములు, ఊష్మములు (హ్రస్వములు, దీర్ఘములు) మొదలైన లక్షణాలతో కూడిన అక్షర సమామ్నాయాన్ని రూపొందించాడు. ఆ అక్షరాల సహాయంతో ఆయన తన నాలుగు ముఖాల నుండి నాలుగు వేదాలను ఉద్భవింపచేశాడు. ఆయన మానస పుత్రులైన మరీచి మొదలైన వారు ఆయన ఉపదేశానుసారం ఆ వేదాలను నేర్చుకుని, తమ శిష్యగణానికి బోధించారు. ఆ విధంగా ఒక్కొక్క యుగంలో మహర్షులు గురుముఖతః వేదాలను అభ్యసిస్తున్నారు.

కాలమహిమ వల్ల వేదాలను సమగ్రంగా అధ్యయనం చేసే శక్తి లేనివారికి దారి చూపడానికి ద్వాపర యుగారంభంలో దాశరాజు కూతురు సత్యవతీదేవి కడుపున భగవంతుడు స్వయంగా పరాశర మహర్షికి పుత్రుడై అవతరించాడు. అనంతమైన వేదరాశిని ప్రకరణానుసారం, ఛందస్సుల ప్రకారం, ఋగ్యజుస్సామాధర్వములని నాలుగు సంహితలుగా చేసి, వాటిని పైల, వైశంపాయన, జైమిని, సుమంతులనే నలుగురు శిష్యులను పిలిచి, ఒక్కొక్కటి వారికి ఉపదేశించారు.

పైలమహర్షి అధ్యయనం చేసిన ఋక్సంహిత పరిమాణం, ఋక్కుల సంఖ్య చాలా ఎక్కువ కాబట్టి దాన్ని బహ్వ్ఋచ సంహిత అన్నారు. పైలుడు దాన్ని రెండుగా విభజించి ఇంద్రప్రమితికి, భాష్కలుడికి బోధించాడు. భాష్కలుడు తన భాగాన్ని నాలుగు శాఖలుగా పునర్విభాగం చేసి, శిష్యులైన బాద్య, యాజ్ఞవల్క్య, పరాశర, అగ్నిమిత్రులకు నేర్పాడు. ఇంద్రప్రమితి తన సంహితభాగాన్ని కొడుకు మాండూకేయ ఋషికి ఉపదేశించాడు. మాండూకేయుడు తన శిష్యుడు దేవమిత్రుడికి బోధించిన విద్యను సౌభరి మొదలైన ఋషులు నేర్చుకున్నారు. సౌభరి కొడుకు శాకల్యుడు తాను నేర్చుకున్న శాఖను ఐదుగా విభజించి శిష్యులైన వాత్స్య, మౌద్గల్య, శాలీయ, గోముఖ, శిశిరులకు ఉపదేశించాడు. వారు జాతుకర్ణికి, ఆయన బలాకుడు, పైంగుడు, వైతాలుడు, విరజుడు అనే ఋషులకు నేర్పాడు. భాష్కలుడి కొడుకు భాష్కలి వాలఖిల్య సంహితను సంకలనం చేసి శిష్యులు బాలాయని, గర్గ్యుడు, కాసారుడులకు చెప్పాడు. అలా బహ్వ్ఋచ సంహితను సత్సంప్రదాయానుగుణంగా బ్రహ్మర్షులంతా అధ్యయనం చేశారు.

వైశంపాయనుడు క్షుణ్ణంగా నేర్చుకున్న యజుర్వేదాన్ని అతడి శిష్యులు చరకుడు, అధ్వర్యువు. గురువుగారి దగ్గర అన్ని క్రతువులు సలక్షణంగా చేయించడం నేర్చుకున్నారు. ఒకసారి ఆ శిష్యులు చేపట్టిన కర్మకాండను వైశంపాయనుడి మరో శిష్యుడు యాజ్ఞవల్క్యుడు అధిక్షేపించాడు. దానికి కోపించిన వైశంపాయనుడు యాజ్ఞవల్క్యుడిని ఆయన నేర్చుకున్న వేదాన్ని మొత్తం అక్కడ వదిలి తక్షణమే వెళ్లిపొమ్మన్నాడు. యాజ్ఞవల్క్యుడు మొత్తం కక్కేసి వెళ్లిపోయాడు. ఆ కక్కును ఆయాశాఖాధి దేవతలు తిత్తిరి పక్షుల రూపంలో భుజించారు. అప్పటి నుండి ఆ భాగానికి తైత్తిరీయ శాఖ అన్న పేరొచ్చింది. ఆ తరువాత యాజ్ఞవల్క్యుడు సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకుని, ఇతరులకు తెలియని యజుర్వేద సూత్రాలను నేర్చుకున్నాడు. ఆ నవీన శుక్లయజుర్వేద భాగం వాజసనేయ సంహితగా ప్రసిద్ధికెక్కింది.

సామవేదాన్ని నేర్చుకున్న జైమిని మహర్షి తన కొడుకైన సుమంతుడికి ఉపదేశించాడు. సుమంతుడు ఆయన కొడుకైన సుకర్ముడికి నేర్పాడు. అతడు సామవేద తరువును వేయి శాఖలుగా విభజించి శిష్యులకు నేర్పాడు. అధర్వవేద పండితుడైన సుమంతుడు కబంధుడనే శిష్యుడికి, అతడు పధ్యుడికి, వేదదర్శుడికి, వారు వారి శిష్యులకు, అలా అలా శాఖోపశాఖలతో అధర్వవేదం వృద్ధి చెందింది.

మానవ ధర్మాలకు అపారమయిన నిధి లాంటివి వేదాలు. వాటికి విలువ కట్టడం ఎవరికీ సాధ్యం కాదు. వేదం ఈశ్వర జ్ఞానం. భారతీయులకు వేదాలు పవిత్ర గ్రంథాలు. తెలిసినా, తెలియకపోయినా వేదాలంటే భక్తీ-శ్రద్ధలు కనపరచని భారతీయులు అరుదుగా వుంటారు. ఆ మాటకొస్తే అనేకమంది విదేశీయులు వాటిల్లో ఏముంటాయో తెలుసుకోవడానికి ఆత్రుత పడ్డారు. పరిశోధనలు చేశారు. ఇంకా చేస్తూనే వున్నారు. వ్యాఖ్యానించారు. అంతరార్థాలు, అర్థాలు వెతికారు. వారికి తోచింది, నిజమని నమ్మింది చెప్పారు. నమ్మిన వాళ్లు నమ్మారు. అవే నిజమని భ్రమించిన వారూ లేకపోలేదు.

   సృష్టి రహస్యం తెలుసుకోవడం అంత సులభమయిన విషయం కాదు. మహాప్రళయం సంభవించినప్పుడు మనం అనుకుంటున్న, ఊహిస్తున్న ప్రపంచం వుండదు. ప్రకృతి ఎలా వుంటుందో ఊహించడం కూడా కష్టమే! అలా జరిగినప్పుడు ప్రాణికోటి ఏమవుతుందో ఎవరికీ అంతుపట్టని పరిస్థితి. అంతా అగమ్యగోచరం. ఈ విధంగా కొంత కాలం కొనసాగి మళ్లీ నూతన సృష్టి జరుగుతుంది. అలా సంభవించిన సృష్టి మాతా-పితరుల సంయోగం వల్ల కాని, లేకుండా కాని జరగవచ్చు. అలా జరిగిన సృష్టిలో సమస్త ప్రాణులు నాలుగు రకాలుగా పుట్టవచ్చు. మొదటిది: జరాయజములు, అంటే, మనుష్యులు, పశువులు. రెండవది: అండజములు, అంటే, గుడ్ల నుండి పుట్టే పక్షులు, చేపలు, పాములు లాంటివి. మూడోది: స్వేదజములు, అంటే, చెమటతో పుట్టే పేలు లాంటివి. నాలుగోది: ఉద్భిదములు, అంటే భూమిని చీల్చుకుని పుట్టే చెట్లు. పంచ భూతాలు ఏర్పడిన తరువాత భూమి నుండి ఓషధులు, ఓషధుల నుండి అన్నము, అన్నము నుండి వీర్యము, వీర్యము వల్ల పురుషుడు రావడం జరిగింది.

ఇక వేదం, వేదవిషయాలకు వస్తే, వేదాలు సృష్టి నియమ శాస్త్రాలని గ్రహించాలి. వేదాలు భగవంతుడి నిశ్వాశలలాంటివనీ, వాటికి కర్త ఫలానా అని ఎవరు లేరనీ, అందుకే వాటిని అపౌరుషేయాలని పెద్దలంటారు. వేదాలు వర్ణాశ్రమ ధర్మాల గురించి చెప్పినాయి. వేదాలను శ్రుతులు అంటే ధ్యానావస్థలో ఋషులకు వినబడినవనీ అంటారు. వీటిని స్మరించి చెప్పబడినవే స్మృతులు. అందులో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే నాలుగు వర్ణాల వారున్నారని వారికి వేరు వేరు కర్మలు వున్నాయని చెప్పారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు మాత్రం వేదాలను చదవడం, చదివించడం అర్హతగా అందులో పేర్కొనడం జరిగింది. (అది ఒకప్పటి మాట. ఇప్పుడు కాకపోవచ్చు).  

‘భగవదనుగ్రహం లేక ఏ కార్యమూ ప్రారంభమూకాదు, పూర్తికాదు. ఎందుచేతననగా సర్వకర్మలు, కార్యాలు భగవదధీనములు. ఈ సమస్త భూమండలం నిరాధారంగా నిలిచి ఉన్నదంటే అందుకు భగవదాజ్ఞయే కారణం. భూమి, సూర్యచంద్రాదులు సమస్త చరాచర ప్రకృతి భగవదాజ్ఞవల్లనే ప్రవర్తిల్లుతున్నాయి. భగవంతుడు నియమించినరీతిగా తమ విధులను నిర్వర్తిస్తున్నాయి. వేదము హిమవదున్నతం. ఆకాశమంతటి విశాలం. సముద్రమంతటి గంభీరం. వాయువువలె సర్వవ్యాప్తం. నేనేమిటి, అంతటి వేదాన్ని గురించి ఆలోచించడం ఏమిటి? వేదం పఠించడం ఏమిటి? వేదం వ్రాయడం ఏమిటి? ఇది కేవలం భగవదనుగ్రహం కాకుంటే ఏమిటి’  అని వ్రాసుకున్నారు అక్షర వాచస్పతి డాక్టర్ దాశరథి రంగాచార్య.   భారత జాతికి అమృత ప్రాయాలైన రామాయణ, భారత, భాగవతాలను, వేదాలను రచించిన ఏకైక వ్యక్తి బహుశా దాశరథి రంగాచార్య గారేనేమో! ఆయన వ్రాసిన ఋగ్వేద సంహిత ఉపోద్ఘాతంలో చాలా ఆసక్తికరమైన విషయాలను పేర్కొన్నారు. అందులో మచ్చుకు కొన్ని:

         ‘వేదము పవిత్రమైనది. అన్యమత గ్రంథాలలాగా పేరుకు ముందు వెనుక “పవిత్ర” పదం లేదు. మంత్రానికి మాన్యత వుంది. అయినా అది మాన్యత గలది అని వాచ్యంగా చెప్పడం జరగలేదు. వేదాలన్నీ సంకల్పము, రహస్యము, బ్రాహ్మణములు, ఉపనిషత్తులు, ఇతి హాసములు, వ్యాఖ్యానములు, పురాణములు, స్వరములు, సంస్కారములు, నిరుక్తములు, అనుశాసనములు, అనుమార్జనములు, వాక్కు యొక్క వాక్యముల సహితముగా నిర్మించబడినవి. వేదం ఏనాటిదో తెలియదు. ఎన్నడు మొదలయిందో తెలియదు. అది అనాగరిక మానవుని నుంచి నిర్మలంగా నిష్కల్మషంగా ప్రవహించింది. మనిషి మనసు మలినాన్ని దూరం చేసింది. మానవుని దైవత్వపు అంచులకు కొనిపోయింది.’

         ‘వ్యాసభగవానుడు ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు, ఎన్ని మాసాలు, ఎన్ని సంవత్సరాలు, నిరంతరం కృషి చేసి వేదాలను నాలుగుగా నిర్ణయించినాడో! దాన్ని గురించి కనీసం అంచనావేయగల శక్తి స్తోమతలు మనకు లేవు. మనది అల్పబుద్ది. మనం అల్పాయుష్కులం. వేదాలను వేదవ్యాసుడు సంకలనం చేశాడు. అందుకే అవి వేద సంహితలు. అవే...ఋగ్వేద సంహిత, యజుర్వేద సంహిత, సామవేద సంహిత, అథర్వవేదం సంహిత. ఇలా నాలుగు విధాలుగా వేదాన్ని విభజించడాన్ని “వేదచతుష్టయం” అంటారు.’

         వేదం అపౌరుషేయం. అంటే, మానవ ప్రోక్తం కాదు. ఋషులు వేదద్రష్టలు. స్మర్తలు. వారు అపౌరుషేయమైన వేదాన్ని దర్శించి మనకు అందించారు. వేదం ఒకనాడు పుట్టి ఒకనాటికి పూర్తి అయిన కావ్యం లాంటిది కాదు. ఇది ఒక స్రవంతి. ఒక నిర్ఘరి. ఒక నది. ఒక ప్రవాహం. దర్శించిన ఋషి చెపుతూ పోయాడు. దానిని అక్షరబద్ధం చేస్తూ పోయారు. ఈ ప్రవాహం వ్యాసుడు సంహితలు చేసేవరకు సాగింది. తదుపరి సకల నదులు కూడిన తటాకంలా మానవాళికి ఉపకరిస్తున్నది. వేదం శృతి. వినదగింది. వినసొంపుగా ఉండడానికి వేదానికి స్వరం ఉంది. స్వరయుక్తంగా చదివిన వేదం శ్రావ్యంగా ఉంటుంది. అది శక్తిమంతం సాధించగలదు. బ్రాహ్మణులు ఒక జాతిగా వేదాన్ని, భారత సంస్కృతిని రక్షించడానికి ఎన్నో త్యాగాలు చేశారు.’ 

         ‘మానవులకు, మానవ సమాజానికి హితవు చేకూర్చిన వారు దేవతలు అనవచ్చు. ప్రకృతి శక్తులైన సూర్య, చంద్ర, అగ్ని, వాయువులు వలనే మానవుడు జీవిస్తున్నాడు. కావున పృధివి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశము స్థూలంగా దేవతలు. అవికాక వృక్ష, లతా, గుల్మాదులు, పర్వతాదులు దేవతలే. ఈ దేవతలు వేరువేరుగా కానీ, అందరు కలిసిగాని పరాత్పరుడు, ఈశ్వరుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరులు కారు. సృష్టికర్త అయిన ఆ పరమేశ్వరుడు అగమ్యగోచరుడు. అనిర్వచనీయుడు. అందడు. పరమాత్మ సాకారమా? నిరాకారమా? దీనిని గురించి చర్చలు, సిద్ధాంతాలు, తాత్విక చింతనలు జరుగుతున్నాయి. కాని నిర్ణయం జరగలేదు. అతడు మనిషికి అందని మహోన్నతుడు. మానవుని జ్ఞానం పరాత్పరుని తెలుసుకునే శక్తి లేదు. అ పరాత్పరుడే ఈ సమస్తాన్ని సృష్టించినాడు. భగవానుడు కల్పించిన ఈ ప్రకృతినే మానవుడు ఇంతవరకు తెలిసికొనలేక పోయినాడు. గెలవడం చేతకాని పని. ప్రకృతిని, తన ప్రకృతిని, ఎరుగలేని దర్బలాటి దుర్బలుడు మానవుడు. అయినా తనకు అన్నీ తెలుసునని బీరాలు పలుకుతాడు. వేదం చదివి అర్థం తెలిసికొనని వాడు బరువు మోయు స్థాణువు వంటివాడు. వేదం చదివి అర్థం తెలుసుకొన్నవాడు జ్ఞానియై, పాపరహితుడై స్వర్గానికి చేరుకుంటాడు.’

(మహాకవి బమ్మెర పోతనామాత్య శ్రీ మద్భాగవతం

డాక్టర్ దాశరథి రంగాచార్య వేద సంహితల ఆధారంగా)

 

Saturday, December 2, 2023

MEGA KALESHWARAM PROJECT: CONCEPTION TO CONSTRUCTION (ALLAYING APPREHENSIONS AND MISGIVINGS) : Vanam Jwala Narasimha Rao

 MEGA KALESHWARAM PROJECT: CONCEPTION TO CONSTRUCTION

(ALLAYING APPREHENSIONS AND MISGIVINGS)

Vanam Jwala Narasimha Rao

The Hans India (03-12-2023)

(As per the DPR (2 TMC per day), the approved project cost on 6th June, 2018 by CWC was Rs 80,190 crores. As per the revised DPR which is under appraisal with CWC, cost of project including additional TMC per day (3 TMC per day) is Rs 1,21,764 crores. Reason for increase in the cost is for ‘Additional One TMC of Water Per Day.’ Kaleshwaram Project was completed within timeframe, faster than many major irrigation projects. Had mobilization of funds not been through off-budget borrowings, from National Banks and Government Financial Institutions at an interest rate of 8-9 %, no wonder, if the cost of project would have been more than Rs 3 lakh crore, which is reduced by a tune of more than Rs 2 lakh crore-Editor Hans India).

In an unforeseen development, when a small portion of Lakshmi (Medigadda) Barrage bridge of the ‘World’s Largest Multistage Multi-Purpose Kaleshwaram Lift Irrigation Project (KLIP)’ in Telangana’s Jayashankar Bhupalapally District caved in, during the last week of October 2023, severe allegations of ‘Poor Quality of Works’ and ‘Design Flaws’ by some political leaders were flashed, for reasons best known to them. The instant conclusion of the National Dam Safety Authority (NDSA), on the partial collapse was that, the sinking of piers was caused by a combination of factors including planning, design, quality control, operation, and maintenance failures!!!

There were also repeated accusations during the recently concluded State Assembly Elections of indulging in high level corruption in the project works. Some of them even demanded a CBI probe into the project. They castigated that, KCR’s objective of redesigning ‘Kaleshwaram Project’ was not to give water to the people, but to steel One Lakh Crore Rupees Public Money and in the process using it as ATM, by increasing its budget!! According to them, initially the project was worth Rs 38,000 crore, but was increased to 1.2 lakh crore!

Against the backdrop of these allegations, couple of things may clear the doubts of those who made them.

On March 20, 2015, in a significant review meeting chaired by Chief Minister K Chandrashekhar Rao, where I was present, KCR consciously revealed his mind in favor of redesigning and renaming the erstwhile ‘Pranahita-Chevella Project as ‘Kaleshwaram Lift Irrigation Project’ for optimum utilization of River Godavari Waters. In the same review meeting KCR suggested the place ‘Kaleshwaram’ where River Pranahita confluences with River Godavari, to the project and constructing barrage there, instead of Tummuidihatti with an intention to avoid any inter-State dispute with Maharashtra. 'Kaleshwara Mukteshwara Swamy Temple' is a revered temple dedicated to the worship of Lord Shiva.

In fact, CM KCR’s decision followed his meeting with his Maharashtra Counterpart in Mumbai couple of days earlier to that, where it was in principle mutually agreed on changing the plan of the project. That was the Genesis and conception of this Project, which is on record. The earlier designed ‘Pranahita-Chevella Sujala Sravanthi Project’ was an Interstate Project involving Maharashtra State which objected for construction of barrage at Tummuidihatti at FRL +152 m on the ground that, large extent of their territory will be submerged, repeatedly requested to lower the barrage FRL to +148.00 m, resulting in delaying project commencement.

CWC assessed availability of 165.38 TMC of water at 75% dependability at Tummuidihatti which include 63 TMC of water unused by upper riparian states, which may not be available in future. The remaining quantum of water for all practical reasons would be insufficient for the project requirements. Later CWC suggested to relook into the demand and supply aspects of the project with specific requirement of artificial reservoirs within and around the project area either by increasing the capacity of existing reservoirs or creating additional new reservoirs. Accordingly, the project was re-engineered.


‘Kaleshwaram Lift Irrigation Project’ which now is familiar to the entire universe is a multiple entity, comprised of construction of ‘Three Barrages’ across River Godavari and constituent pump houses. Barrages are: Lakshmi (Medigadda), Saraswathi (Annaaram) and Parvathi (Sundilla) along with allied pumphouses for lifting water. Objective of this gigantic Project, is to bring new ayacut of 18,25,700 acres under irrigation covering 13 districts in the state, besides stabilizing 18,82,970 acres of existing ayacut under Sri Ram Sagar Project (SRSP) two stages, Flood Flow Canal (FFC), Singur and Nizam Sagar Projects. CM KCR inaugurated Lakshmi (Medigadda) Barrage four years ago in September, 2019. Telangana Governor, Maharashtra, and AP CMs were present. I and my PRO colleagues were also present then.

The Project also contemplated to provide 10 TMC of drinking water to enroute villages, 30 TMC of drinking water to twin cities and 16 TMC of water to industries. Land acquisition of about 98700 Acres and construction of reservoirs with capacity of 147.71 TMC was done. This huge project comprised of 7 links and 28 packages. Utmost care was taken at every stage of construction. Based on the ‘Detailed Project Report’ (DPR) submitted to CWC, Government of India accorded requisite clearances in a record time of 18 months.

As per the DPR (2 TMC per day), the approved project cost on 6th June, 2018 by CWC was Rs 80,190 crores. As per the revised DPR which is under appraisal with CWC, cost of project including additional TMC per day (3 TMC per day) is Rs 1,21,764 crores. Reason for increase in the cost is for ‘Additional One TMC of Water Per Day. 

The project is capital intensive, requiring huge investments on various components. They included, Construction of Barrages, Canals, Tunnels, Pump Houses, Reservoirs, Electro-Mechanical and Hydro-Mechanical Equipment, Land Acquisition, Forest Land Permissions, Resettlement and Rehabilitation etc. Figures disclosed by irrigation department, reveal that, the total expenditure incurred on Works, Substations, Land Acquisition, Resettlement and Rehabilitation, Forest Land Acquisition, Establishment and Miscellaneous costs amounted to Rs 91,237 crores.

 In order to meet the huge cost involved and expedite completion of the project to avoid cost escalations, in addition to meeting expenditure from the state budgetary provision alone, State Government in October 2015 formed ‘Kaleshwaram Irrigation Project Corporation Limited’ (KIPCL), as a Special Purpose Vehicle (SPV) to mobilize funds. KIPCL facilitated completion of Head Works and Main Trunk Works of the Project. They are, 7 links of the project namely, three Major Barrages and three main Pump Houses in Link-I, works from Sripada Yellampally Project to Mid Manair Dam in Link-II and works from MMR to Kondapochamma Sagar in Link-IV. These were completed in a record time of 3 years. Works like distributary network system are in brisk progress.

To be more explicit, the completed works included, 3 barrages, 10 pump houses with connected sub-stations and transmission lines, gravity canals, tunnels, 5 reservoirs such as Sri Komaravelli Mallanna Sagar (50 TMC) and Kondapochamma Sagar (15 TMC) etc. Works from Laxmi barrage (Medigadda) to Kondapochamma Sagar reservoir were completed. The water is impounded in Lakshmi Barrage, Saraswathi Barrage and Parvathi Barrage, Annapurna Reservoir, Sri Ranganayaka Sagar, Sri Komaravelli Mallanna Sagar and Kondapochamma Sagar etc. As a result, water was provided for irrigation during last three years to new ayacut and stabilization of existing ayacut. This resulted in increase of Paddy Crop yield from ONE lakh MT at the time of State Formation to THREE lakh MT. Fish Production also increased. Tremendous rise in Ground Water levels is another benefit.

Many Irrigation Projects in the country took more time for completion of them since laying foundation, when compared to Kaleshwaram, reengineered, redesigned, and renamed by CM KCR. Bhakra Nangal took 15 years (1948-1963), Sardar Patel 56 years (1961-2017), Indira Sagar 21 years (1984-2005), Heera Kud 10 years (1947-1957), Jaya Kwadi or Paithan 11 (1976-1987), Nagarjuna Sagar 12 years (1955-1967) and Sri Ramsagar 14 years (1964-1978). Whereas, Kaleshwaram took just 3 years (2016-2019), Bhakta Ramadas 11 months (2016-2017), and Thummilla 10 months (2017-2018).

Compared with the original estimate and sanctioned rates, the costs of cement, reinforcement steel, Steel plates, diesel rate, cost of land rate, labor wages, sand, earth excavation etc. were on the increase by about 192% on an average. As the Kaleshwaram Project was completed within timeframe, this increase in costs had negligible effect on the overall cost. In addition, had mobilization of funds not been through off-budget borrowings, from National Banks and Government Financial Institutions at an interest rate of 8-9 %, no wonder, if the cost of project would have been more than Rs 3 lakh crores, which is reduced by a tune of more than Rs 2 lakh crores!!! ‘Doubting Thomases’ need to appreciate this, instead of hurling false allegations.  

(Writer is Chief Public Relations Officer to Chief Minister, Telangana)