Monday, January 14, 2019

రావణుడికి శ్రీరాముడిని, సీతను వర్ణించి చెప్పిన శూర్పనఖ .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-43 : వనం జ్వాలా నరసింహారావు


రావణుడికి శ్రీరాముడిని, సీతను వర్ణించి చెప్పిన శూర్పనఖ
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-43
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (13-01-2018)
         ఈ విధంగా సిగ్గు, బిడియం, భయం లేకుండా శూర్పనఖ చెప్పిన తన దోషాల గురించి ధనగర్వం, సేనాబలగర్వం కలవాడైనందున, ఎంతమాత్రం విచారపడక, తనను ఎవ్వడు ఏంచేయగలడన్న మదాంధుడై, తన చెల్లెలు చెప్పిన విషయం గురించి ఆలోచన చేశాడు. కోపంతో కళ్లెర్ర చేసి, తనను నిష్టూరాలు ఆడే చుప్పనాతితో, “చెల్లెలా! అక్కడి వృత్తాంతమంతా వివరంగా చెప్పు. రాముడనే వాడేవాడు ఎవడు? వాడెట్టి పరాక్రమవంతుడు? దేవతా రూపమా? మనుష్య రూపమా? ఎలాంటి స్వరూపం కలవాడు? ఎందుకు దండకారణ్యానికి వచ్చాడు? ఖరాది రాక్షసులను ఏ ఆయుధాలతో చంపాడు? విల్లు, బాణాలతోనా? లేక ఏదైనా నూతన ఆయుదాలతోనా?” అని అడగ్గా శూర్పనఖ రామచరిత్ర చెప్పడం మొదలుపెట్టింది ఇలా.

         (రాముడు ఎలాంటి పరాక్రమం కలవాడు, ఏ ఆయుధం కలవాడు, మనుష్యుడా? దేవతా? అని రావణుడు తనకు కావాల్సిన విషయాల గురించి ప్రశ్నిస్తే, శూర్పనఖ కామంతో వున్న వ్యక్తీ కాబట్టి, రాముడి ఆకారం మరిచిపోదామన్నా మరువలేక, కళ్ళకు కట్టినట్లు వుండడం వల్ల, ఆయన ఆకార సౌందర్య వర్ణనతో జవాబిచ్చింది.)

         “దీర్ఘమైన భుజాలతో, విశాలమైన కళ్ళతో, నారచీరెలు, జింక చర్మం వస్త్రాలుగా ధరించి, మన్మథుడిలాగా సుందరంగా వుండే దశరథకుమారుడు ఆయన. పేరు రాముడు. భయంకరమైన శౌర్యం కలవాడాయన. భయంకరమైన విల్లు వుంది ఆయన దగ్గర. దాంతో పుట్టలోనుండి పాములు బయటికి వచ్చే విధంగా బాణాలను చిమ్ముతాడు. ఖరుడు, దూషణుడు, పద్నాలుగువేల మంది రాక్షసులను సరిగ్గా మూడు గడియల్లో కాళ్లమీద నిలిచి, ఒంటరిగా బాణాలతో నాశనం చేసాడు. దండకారణ్యంలో వున్న మునులకు ఇక నుండి వాళ్లు రాక్షసులకు భయపడాల్సిన పనిలేదని అభయ హస్తం ఇచ్చాడు. అంతా చస్తే నేనెలా బతికి బయటకు వచ్చానంటావేమో? నేనక్కడ లేకుండా విని చెప్తున్నానేమో అని అనుమానం వద్దు. నేనా గుంపులోనే వున్నాను. కాని, నేను ఆడదాన్నైనందున స్త్రీహత్యా దోషం కలగవచ్చని గొప్ప మనస్సుతో నన్ను చంపకుండా వదిలాడు. ఇంకొకడైతే పద్నాలుగు వేలమందిని తెచ్చింది ఇదే అని నన్ను కూడా చంపేవాడే. ఎంతమంది వచ్చినా తననేమీ చేయలేరని ఆయన ధైర్యం. ఆ విధంగా ఆయన చేతికి చిక్కినా పోపొమ్మని విడవడం వల్ల బతికాను. ఆ రాముడికి లక్ష్మణుడు అనే తమ్ముడున్నాడు. అన్నకు అన్నిటా సమానుడు. అన్నను భక్తితో సేవిస్తాడు. కోపిష్టి. యుద్ధంలో అజేయుడు. సాధువర్తనం కలవాడు. రాముడికి కుడిభుజం, బహిప్రాణం లక్ష్మణుడు”.


         “రాముడికి ఇష్టమైన భార్య సీతాదేవి. ఆమె అందమైన గమనం కలది. సమస్త సద్గుణాలతో గొప్ప కీర్తిని సంపాదించింది. ఆమె తోడలు అరటి స్తంబాల్లా వుంటాయి. ఆమె ముక్కు సంపెంగ పువ్వులాగా వుంటుంది. సౌందర్యానికి వునికిపట్టైన ఆమె వెన్నెల్లాంటి చిరునవ్వు కలది. షోడశ కళాపూర్ణుడైన చంద్రుడి లాంటి ముఖం కలదామెకు. పతికి హితం చేయాలనే కోరిక వుందామెకు. మంచి బంగారు వన్నె కలది. తలనిండా నల్లటి వెంట్రుకలున్నాయామెకు. నీతిలోని స్థిరాంశమేదో అదే ఆమె. సింహం నడుం లాంటి సన్నటి నడుం వుందామెకు. రెండో లక్ష్మి లాగా వనదేవతగా వెలుగుతున్నది. దేవతా స్త్రీలను, కిన్నర స్త్రీలను, గంధర్వ స్త్రీలను చూసా కాని ఇలాంటి స్త్రీని చూడలేదు. యక్ష స్త్రీలను, కింపురుష స్త్రీలను, దైత్య స్త్రీలను, చూసాను కాని రామచంద్రుడి భార్యలాంటి, కళ్లకు ఆనందం కలిగించే కలువపూల లాంటి కళ్లున్న దాన్ని ముల్లోకాలలో ఎక్కడా చూడలేదు. ఇలాంటి ఆమె మరొకరున్నారని కూడా వినలేదు. ఇంతకంటే ఎక్కువగా ఏమి చెప్పాలి?

         “సీత ఎవరికి భార్యో, ఎవరిని ఆమె సంతోషంగా కౌగలించుకుంటుందో, ఆ పురుషుడు మూడులోకాలలో ఇంద్రుడి కంటే గొప్పవాడై పేరుతెచ్చుకుంటాడు. చక్కటి సౌందర్యం, నడవడి కలిగి స్త్రీలలో శ్రేష్టురాలైన ఈ సీత నీకు తగిన భార్య. ఆమెకు నువ్వు తగిన భర్తవి. ఇద్దరినీ పోల్చి చూసి ఆ సీతను తెచ్చి నీకివ్వాలని భావించి నేనక్కడికి పోయాను. ముక్కును పోగొట్టుకున్నాను. మగవారికి తెలియకుండా సీతాదేవిని ఎత్తుకొచ్చి నీకిద్దామనుకున్నాను. దానికోసం చుట్టుపక్కల తిరుగుతూ సీతదగ్గరికి పోయాను. నా ఆలోచన తెలుసుకున్న లక్ష్మణుడు నేను మొత్తుకుంటున్నా వినకుండా, నన్ను పట్టుకొని నా ముక్కు, చెవులు మొదలంటా కోశాడు. నువ్వే స్వయంగా పోయి ఆ సొగసుగత్తెను కళ్లారా చూస్తే, మన్మథుడికి దాసుడవై ఆ క్షణంలోనే ఆమె కావాలని పట్టుబట్టుతావు.”

         “ప్రేమతో నువ్వు జానకిని భార్యగా చేసుకోవాలంటే అది సాధించడానికి కుడికాలు ముందు పెట్టి తక్షణం బయల్దేరు. ఇప్పుడే దండకారణ్యంలో సీత వున్న చోటుకు పో. రామలక్ష్మణులను యుద్ధంలో చంపు. మగడు చచ్చి దిక్కులేక వున్న సీతను తీసుకొచ్చి నీ ఇష్ట ప్రకారం సుఖపడు. రాముడి చేతిలో 
చనిపోయిన ఖరుడు మొదలైన రాక్షస సమూహంలో ఒక్కడిమీదైనా నీకు కొంచెం ప్రేమున్నా రాముడిని, వాడికి సహాయం చేసినవాడిని చంపిరా. ఇది నీకు అంగీకారమైతేనే ధైర్యంతో వెళ్లు. నా మాటలు నీకు మంచిగా అనిపిస్తే, శీఘ్రంగా ఆలశ్యం చేయకుండా సందేహం వదిలి మల్లెపూవులాంటి సీతను తీసుకొని రా. రావణా! నేను చెప్పానని నా మీద నింద వేయవద్దు. నాకు తోచింది నేను చెప్పాను. ఎదుటివారి బలం గురించి కూడా చెప్పాను. నీబలం ఎంతో ఆలోచించి, అంతకంటే ఎక్కువ బలం వుందనుకుంటే బలవంతంగా సీతను తీసుకురా. నీ కొరకై దండకలో దిక్కులేని వారిలాగా చచ్చిపోయిన ఖరాది రాక్షసుల మీద కృతజ్ఞతతో వాళ్లకు కలిగిన అకాల మరణం ఆలోచించి దానికి ఎలా బదులివ్వాలో అదే చేయి”.

ప్రతిష్టాత్మకం తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం : వనం జ్వాలా నరసింహారావు


ప్రతిష్టాత్మకం తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (11-01-2018)
ఉమ్మడి అంధ్రప్రదేశ్ ప్రభుత్వ పుణ్యమా అని, రాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభాన్ని, కరువుని, వలసలను నివారించడానికి రాష్ట్రవ్యాప్తంగా ఒక కోటి ఎకరాలకు పైగా సాగునీటి సౌకర్యం కల్పించాలని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగా  పెండింగ్ లో వున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం, వాటిలో కొన్నింటిని  తెలంగాణ అవసరాలకనుగుణంగా రీ-ఇంజనీరింగ్ చేసుకొని పూర్తి చేసుకోవడం, అప్పటి ప్రభుత్వాలు ఆమోదించి అసంపూర్తిగా మిగిల్చిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేసి నిర్దేశిత ఆయకట్టుకు సాగునీతితో పాటు అవసరాలకనుగుణంగా తాగునీరు అందించడం, గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో శిథిలమైపోయిన పాత సాగునీటి ప్రాజెక్టులను ఆధునీకీకరించి పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించడం, తెలంగాణాకు అనాదిగా జీవనాధారంగా ఉన్న గొలుసుకట్టు చెరువులను పునరుద్దరించి తెలంగాణా గ్రామీణ ఆర్ధిక , సామాజిక , సాంస్కృతిక వికాసానికి దోహదం చేయడం జరుగుతున్నది. ఈ లక్ష్యాల సాధనలో భాగంగా తెలంగాణలో ప్రారంభించి వదిలేసిన 23 భారీ ప్రాజెక్టులని, 13 మధ్యతరహా ప్రాజెక్టులని పూర్తిచేయడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. ప్రతిష్టాత్మకంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతున్నది.

కోటి ఎకరాల సాగు లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన జల సంకల్పం రాష్ట్రంలోని అనేక సాగునీటి ప్రాజెక్టులకు ప్రాణం పోసింది. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు ఈరోజు దేశానికే మార్గ నిర్ధేశనం చేస్తున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణానికి, మిషన్ కాకతీయ పనుల కోసం ప్రభుత్వం  ఏటా 25 వేల కోట్ల రూపాయల చొప్పున కేటాయించి వ్యయం చేయడం జరుగుతున్నది. దేశ చరిత్రలో నభూతో అనే విధంగా ఇంత పెద్ద మొత్తంలో సాగునీటి కోసం ఖర్చు చేస్తున్న రాష్ట్రం మరోటి లేదు. బడ్జెట్లో నిధులు కేటాయించడంతో పాటు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి కూడా రుణాలు పొంది, త్వరితగతిన ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేస్తున్నది.

నదుల్లో మన వాటా మన ప్రజలకు పూర్తిగా ఉపయోగపడేలా సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా రూపకల్పన చేశారు. రాష్ట్ర విభజనకు ముందు నదీ జలాల్లో మన వాటా ప్రకారం మనం నీళ్లు వాడుకోలేకపోయాం. గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణ వాటా 1,250 టిఎంసీలు. మరో 150 టిఎంసీలకు పైగా మిగులు జలాల్లో తెలంగాణ వాటా ఉంది. కానీ, ఈ నీటిని వాడుకోవడానికి కావాల్సిన ప్రాజెక్టుల నిర్మాణం కాలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ ని చేపట్టింది. కోటి ఎకరాలను సాగునీరు అందించడానికి సరైన ప్రణాళికలు రూపొందించింది. నీరు పుష్కలంగా లభ్యమయ్యే ప్రాణహిత, ఇంద్రావతి నదుల నీళ్లను ఒడిసిపట్టుకుని పంట పొలాలకు అందివ్వాలన్నదే ప్రాజెక్టుల రీ-డిజైన్ లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన వ్యాప్కోస్ ద్వారా ప్రభుత్వం కూలంకశంగా  సర్వే చేయించింది. లైడార్ సర్వేలు చేయించి, సరైన ప్రణాళికలతో ప్రాజెక్టులు కట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. దక్షిణ తెలంగాణకు పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాల ద్వారా, ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లివ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటు ప్రాణహిత ప్రాజెక్టు, చనాకా కోరాట ప్రాజెక్టుల  ద్వారా ఆదిలాబాద్ జిల్లాకు, సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాకు సాగునీరు అందిస్తారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తున్నారు.

గోదావరి, ప్రాణహిత, పెన్ గంగ నదులపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తున్నది. 2016 మార్చి 8న మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రక అవగాహన కుదుర్చుకుని వచ్చారు. రెండు రాష్ట్రాల్లోని ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై వచ్చే సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకునేందుకు అంగీకారం కుదిరింది. ఫలితంగా ఉమ్మడి అంతర్ రాష్ట్రీయ బోర్డు ఏర్పాటయింది. గోదావరిపై మేడిగడ్డ, ప్రాణహితపై తమ్మిడిహట్టి, పెన్ గంగపై రాజాపేట, చనఖా- కొరాటా, పింపరాడ్ బ్యారేజీల నిర్మిణానికి మార్గం సుగమం అయింది.  గోదావరి నదిపై మూడు బ్యారేజీల నిర్మాణానికి తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య జరిగిన తాజా  ఒప్పందాలతో గోదావరిలో హక్కుగా ఉన్న 954 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం లభించింది.


తెలంగాణ రైతులకు జీవధారగా మారే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 235 టీఎంసీల నీళ్లు అందుబాటులోకి వస్తాయి. గోదావరి నది నుంచి 90 రోజులపాటు రోజూ రెండు టీఎంసీల నీరు చొప్పున 195 టీఎంసీల నీటిని మళ్లించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు నీటితో రాష్ట్రంలో 40 లక్షల ఎకరాలకు పైగా సాగునీరందనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు రాత్రింబవళ్లూ యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. బ్యారేజీ, రిజర్వాయర్ నిర్మాణానికంటే ముందే పంపుహౌజ్‌లు నిర్మించి, గోదావరి జలాలను ఎత్తిపోయడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఒకవైపు పంపుహౌజ్‌లు, బ్యారేజీల స్థలాల పరిశీలనపై కసరత్తు చేయడంతో పాటు మరో వైపు పంపులు, మోటర్ల తయారీ నిర్ణీత సమయంలోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి 80 వేల ఎకరాల భూమిని సేకరించగా, ఇందులో 7,828 ఎకరాల అటవీభూమి ఉంది.  కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం 141 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 3 బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు, 20 లిఫ్టులను నిర్మిస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన 12 బ్లాకుల్లో 1531 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వలు, 203 కిలోమీటర్ల మేర సొరంగాల పనులు రాత్రింబవళ్లూ సాగుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు 4 వేల మందికి పైగా కార్మికులు నిరంతరం షిఫ్టుల వారీగా పనిచేస్తున్నారు.

ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలం రోళ్లపాడు గ్రామం వద్ద శ్రీ సీతారామ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, పాల్వంచ, కొత్తగూడెం డివిజన్లు, ఖమ్మం జిల్లా సత్తుపల్లి, ఖమ్మం డివిజన్లలోని అటవీప్రాంతాలలో సీతారామ ప్రాజెక్టులో భాగంగా కాల్వలు, సొరంగ మార్గాలు, విద్యుత్ లైన్ల ఏర్పాటుకు అటవీ సంరక్షణ చట్టం కింద అనుమతులనిచ్చింది.

తెలంగాణ ప్రభుత్వం 11 నెలల రికార్డు సమయంలో  పూర్తి చేసిన సాగునీటి పథకం, భక్త రామదాసు పథకం. ఖమ్మం జిల్లా పాలేరులో భక్త రామదాసు ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. భూసేకరణలో జాప్యం జరగకుండా చర్యలు చేపట్టారు. పైపులైన్లు, పంప్‌హౌజ్, అప్రోచ్ ఛానల్, సబ్‌స్టేషన్ల నిర్మాణాన్ని సమాంతరంగా చేపట్టారు. సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని కేవలం 100 రోజుల్లోనే పూర్తి చేశారు. మంత్రులు, అధికారులు, ఇంజినీర్లు, వర్కింగ్ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేసి కేవలం 11 నెలల కాలంలోనే పథకాన్ని పూర్తి చేసి దేశ చరిత్రలో రికార్డు సృష్టించారు. నిర్దేశించుకున్న లక్ష్యాని కంటే 2 నెలల ముందుగానే ప్రాజెక్టు పూర్తి చేశారు. 2017 జనవరి 23వ తేదీన ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. భక్త రామదాసు పేరిట నిర్మించిన ఈ ప్రాజెక్టును 2017 జనవరి 31న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ పథకం ద్వారా తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, ఖమ్మం రూరల్‌, మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలాలకు సాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 60 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.

ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు వరప్రదాయని పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  రూ. 35 వేల కోట్ల వ్యయంతో నిర్మించనున్నఈ పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయి. పాలమూరు ప్రాజెక్ట్ పూర్తయితే మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 12.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 1100 గ్రామాలకు, హైదరాబాద్ కు తాగునీరు అందుతుంది. ఐదు దశల్లో నీటిని ఎత్తిపోసి సాగు, తాగు అవసరాలు తీర్చేలా ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. మొదటి దశ ఎత్తిపోతలతో నార్లాపూర్ జలాశయానికి , అక్కడి నుంచి రెండో దశలో ఏదుల రిజర్వాయర్ కు ఆరున్నర టీఎంసీల నీటిని మళ్లిస్తారు. మూడోదశలో వట్టెం ప్రాజెక్టుకు, అక్కడి నుంచి గ్రావిటీతో కరివెన జలాశయానికి  నీటిని పంపేలా ఇంజనీర్లు డిజైన్ చేశారు. నాలుగో దశలో 5 లక్షల 42 వేల ఎకరాలకు సాగునీటితోపాటు హైదరాబాద్ కు తాగునీరు అందించనున్నారు. ఐదో దశలో ఉదండాపూర్ జలాశయం  నుంచి నీటిని మళ్లించి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ నింపుతారు. దీంతో 4 లక్షల 13వేల ఎకరాలకు సాగునీరందుతుంది.

ఎన్నో ఏళ్లుగా ఫ్లోరైడ్ తో బాధపడుతున్న నల్లగొండ జిల్లా ప్రజల కోసం డిండి ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు ద్వారా 3.41 లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో 2 జిల్లాలకు ప్రయోజనం చేకూరనుంది. ఉమ్మడి రాష్ట్రంలో మూడు దశాబ్దాలుగా  పెండింగ్‌లో ఉన్న నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, స్వరాష్ట్రంలో మూడేండ్లలోనే కార్యరూపం దాల్చింది. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. మన రాష్ట్రానికున్న నీటి కేటాయింపులకు అనుగుణంగా కాళేశ్వరం, పాలమూరు, డిండి, శ్రీ సీతారామ ఎత్తిపోతల పథకాలను త్వరితగతిన నిర్మించడానికి ప్రభుత్వం అహర్నిశలూ కృషి చేస్తున్నది. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉండి నత్తనడకన నడుస్తున్న ప్రాజెక్టుల పనులను ప్రభుత్వం వేగవంతం చేసి, నిధులు కేటాయించింది.

రాష్ట్రంలో నిర్మిస్తున్న నీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తక్షణమే కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం, ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవన పథకంలో భాగంగా చేపట్టిన నిర్మాణాలపై కూలంకశంగా చర్చించారు. అధికారులకు తగు సూచనలు చేశారు. కాళేశ్వరం పనుల్లో జాప్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని ఆయన హెచ్చరించారు. పనులను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజిలు, పంపుహౌజుల నిర్మాణ ప్రాంతాలను సందర్శించారు సీఎం.  

రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ రిటైర్డు ఇంజనీర్ల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు, పంపుహౌజుల నిర్మాణ పనులను పరిశీలించింది. ముఖ్యమంత్రి సందర్సన అనంతరం, కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజిలు, పంపుహౌజుల నిర్మాణాలన్నీ మార్చి చివరి నాటికే పూర్తి చేయాలని ఆయన ఇరిగేషన్ అధికారులను, వర్క్ ఏజెన్సీలను ఆదేశించారు. గోదావరిలో కాపర్ డ్యామ్ ఏర్పాటు చేసుకుని ఏప్రిల్ నెలలో ట్రయల్ రన్ నిర్వహించాలని చెప్పారు. ఈ వర్షాకాంలోనే గోదావరి నీటిని  మిడ్ మానేరు వరకు ఎత్తిపోసేలా ప్రణాళిక వేసుకుని, అమలు చేయాలని సూచించారు.  రైతులు సాగునీటి కోసం ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలని అధికారులకు సూచించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారెజ్ ల నిర్మాణంతో పాటు పంపుహౌస్ ల నిర్మాణం పనులు, మోటార్ల ఏర్పాటు పనులన్ని సమాంతరంగా పూర్తి కావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మార్చి 31 వరకు ప్రధానమైన పనులన్ని పూర్తిచేసి ఏప్రిల్, మే నేలల్లో ఇతర సమస్యలన్నింటిని పరిష్కరించుకుని ఎట్టి పరిస్థితుల్లోను జూన్ లో సాగునీరు అందించడానికి సిద్ధం కావాలని సీఎం సూచించారు.

Monday, January 7, 2019

రావణుడిని నిందించిన శూర్పనఖ .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-42 : వనం జ్వాలా నరసింహారావు


రావణుడిని నిందించిన శూర్పనఖ
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-42
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (06-01-2019)
         రావణుడిని నిందిస్తూ శూర్పనఖ ఇంకా ఇలా అంది. “ఇంత వయసు వచ్చినా అవివేకం పోలేదు నీకు. వివేకం రాలేదు. ఏమేమి తెలుసుకోవాలో అది నీకు తెలియదు. ఇలాంటివాడివి రాజై ఎలా బాగుపడుతావు? తనకు స్వంత వేగులవాళ్ళు లేకుండా, ఇతరులు ఏర్పాటుచేసిన వేగులవాళ్ళ మాటలు నమ్మి ప్రవర్తించేవాడు, కోశాగారానికి ఇతరులకు పెత్తనమిచ్చేవాడు, ఇతరులు చెప్పిన నీతులు అనుసరించేవాడు, వాడెంత గొప్పవాడైనా పామరుడితో సమానమే. దూరదేశాల్లో జరిగే సంగతులు వేగులవాళ్ళ ద్వారా తెలుసుకుంటే, అది తన సమక్షంలోనే చూసినట్లు వుంటుంది. కాబట్టే రాజుకు దీర్ఘ చక్షువు అని పేరు. నీకు వేగులు లేరు కాబట్టి నీకా పేరులేదు...నీకా చూపూ లేదు. ఇలా నువ్వుండంవల్లే, నీ మంత్రుల గుంపు సేవిస్తుంటే వారి మాటలు వింటూ వుండడం వల్లే, అలా సుఖానికి అలవాటు పడడం వల్లే, నీ జనస్థానంలో నీ బంధువులందరూ చచ్చిన వార్త నీకెలా తెలుస్తుంది? ఖరదూషణాది బంధువులతో సహా పద్నాలుగువేల మంది రాక్షసులను రామచంద్రమూర్తి ఒక్కడే తన విల్లు బలంతో యుద్ధభూమిలో నాశనం చేశాడు. నీ తమ్ములను, బంధువులను, అందరినీ ఒక్కడు కూడా లేకుండా చంపాడు. నీకు విరోధులై, నీ కీడు కోరే రాక్షసులకు ఇక రావణుడి భయం లేదు. తాను రక్షిస్తానని చెప్పాడు. దండకారణ్యంలో నీ వాళ్ల భయం లేకుండా చేశాడు. ఇవన్నీ అతిబలవంతుడైన రామచంద్రుడు ఒక్కడే చేశాడు”.

         “నువ్వు లోభివి కాబట్టి వేగులవాళ్ళకు జీతాలు ఇవ్వవు కనుక వారంతా జరిగే విషయాలు నీకు తక్షణమే చెప్పారు. నువ్వేమో ఇతరులకు స్వాధీనపడి స్వతంత్రశక్తిలేక, ఆ మంత్రి, ఈ మంత్రి చెప్పినట్లు వింటున్నావు. రాగల కీడు తెలుసుకోలేక పోతున్నావు. నీ దేశంలోనే భయం కలగడం నీకింతవరకూ తెలియదు కదా? రావణా నిన్నేమనాలి? కష్టానికి తగ్గట్లు సేవకులకు జీతాలివ్వవు. ఇలాంటి క్రూరుడికి, మదం పట్టినవాడికి, పొగరుబోతుకు, ద్రోహికి ఆపదలు కలిగినప్పుడు సేవకుల్లో ఒక్కడైనా సహాయం చేయడానికి ముందుకు రాడు. కారణం లేకుండా కోప్పడే రాజును, ఇతరులు భయపడేట్లు ప్రవర్తించే రాజును, గర్వంతో తనను తానే పొగడుకునే రాజును, వాడి బంధువులు, వాడి సేవకులే చంపుతారు. తన తప్పులు తెలుసుకుంటూ చక్కటి ఆలోచనతో పనులు చక్కదిద్దకుండా వుండే రాజుకు ఐశ్వర్యమంతా నాశనమై పోయి, వాడు సన్నగడ్డితో సమానమై దుఃఖపడుతుంటే, వాడిని అందరూ అలక్ష్యంగా చూస్తారు కాని, అయ్యో పాపం! వాడికి ఇలాంటి గతి పట్టిందే అని ఒక్కరైనా బాధపడరు.


“లోకంలో దేనికీ పనికిరానివైనా ఏదో ఒక సమయంలో పనికొస్తాయేమో కాని, రాజుగా వుండి రాజ్యాన్ని పోగొట్టుకున్నవాడు గవ్వకైనా కొరగాడు. రాజుగా వుండి భ్రష్టుడైన వాడు ఎంత గొప్పగా బతికినా, కొరకాని వాడే. ఇవన్నీ తెలుసుకొని పరులు తనకు చేసిన మేలు మరవకుండా, ధర్మస్వభావుడైన రాజు దీర్ఘకాలం సంపదతో సుఖపడతాడు. దుర్మార్గులు తామెంత అధర్మంగా వున్నా, పరులకు హితోపదేశం చేసేటప్పుడు ధర్మాన్నే చెప్తారు. దోషుల మీద కోపం, సాదువులమీద దయ కనబరుస్తూ నీతిమార్గంలో నడిచే రాజును సర్వసేవకులు భయభక్తులతో కొలుస్తారు. అవివేకీ నీలో ఎంత వెతికి చూసినా రాజులకుండాల్సిన గుణాలు ఒక్కటైనా లేవు. ఆకాలంలో పడ్డ పిడుగులాగా దండకారణ్యంలో నువ్వు కాపుగా వుంచిన వారంతా యుద్ధంలో చావడం వేగులు లేనందున నీకు తెలియదు. సుఖంలో మునిగి నిన్ను చంపనున్న శత్రువులను ఉపేక్షిస్తున్నావు. అన్నీ మనకనుకూలమైన దేశాలే అనుకుంటున్నావు. అన్ని కాలాలు మనకు అనుకూలమైనవే అనుకుంటున్నావు. కానీ, భిన్న దేశాలలో, భిన్న కాలాలో జరిగే విషయాలు కామలోలుడవైన నువ్వు తెలుసుకోలేక పోతున్నావు. ఎవరిలో ఎక్కడ ఏ మంచి కలదో, ఏ చెడ్డకలదో తెలుసుకునే శక్తి నీకు లేదు. కాబట్టి, ఓ రాక్షసరాజా! శీఘ్రకాలంలోనే నీ సంపదను పోగొట్టుకుంటావు.

(తన వికార స్వరూపంతో, నిండు కొలువులో రాజు మంత్రులతో వున్న సమయంలో, ఒక ఆడది, రాజు చెల్లెలు, అంతఃపురంలో వుండాల్సింది, బజారు మనిషిలాగా ఇంతమంది లోకి వచ్చి, ఎవరికేమి కోపం వస్తుందో అని ఏమాత్రం ఆలోచించకుండా, మాట్లాడినపుదే శూర్పనఖ సిగ్గు, బిడియం విడిచిందని స్పష్టమైంది. ఇంతవరకు శూర్పనఖ తన పరాభవ కారణం కానీ, పరాభవించిన వాడి పేరుకానీ చెప్పలేదు. ఎందుకు? ఆ విషయం ముందే చెప్తే, ఆమెను అవమానించిన కారణాన తనను దూషిస్తున్నదని అభిప్రాయ పడతాడేమో! అలాంటి అభిప్రాయం కలిగితే, తాను చెప్పినట్లు చేయకపోవచ్చేమో అన్న అనుమానం. చేయకపోతే రాముడిని పరాభావించాలన్న తన కోరిక తీరదు కదా! దశరథుడి విషయంలో కైక ఎలాంటి ఉపాయం చేసిందో అలాగే శూర్పనఖ కూడా ఇక్కడ చేసింది. అక్కడ కామం...ఇక్కడ కోపం).

Friday, January 4, 2019

గుణాత్మక మార్పునకు సర్వం సన్నద్ధం : వనం జ్వాలా నరసింహారావు


గుణాత్మక మార్పునకు సర్వం సన్నద్ధం
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (04-01-2018)
          సుమారు పది నెలల క్రితం భారత దేశంలో గుణాత్మక మార్పుకు పిలుపిచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆ దిశగా సర్వం సన్నద్ధం చేయడానికి తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎన్నికల వాగ్దానాల అమలుకు శ్రీకారం చుట్టిన కేసీఆర్, ఆ తరువాతి ప్రాధాన్యతా క్రమంలో దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పు కొరకు అడుగులు వేశారు. అందులో భాగంగా ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని వారి-వారి రాజధానుల్లో కలిశారు. బీజేపీ, కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకుమార్గం సుగమం చేయడానికి వారిద్దరితో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా వారి మద్దతు పొందిన కేసీఆర్ తమ సమావేశాలు ఫలప్రదమైనట్లు సంకేతాలిచ్చారు. కేవలం రాజకీయరంగ ప్రముఖులనే కాకుండా ఆర్ధిక, సామాజిక రంగ నిపుణులను కూడా కేసీఆర్ కలుస్తున్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి కాని-దాని సారధ్యంలోని ఎన్డీఏకు కాని, కాంగ్రెస్ పార్టీకి కాని-దాని సారధ్యంలోని యూపీఏకి కాని పార్లమెంటులో మెజారిటీ స్థానాలు లభించే అవకాశాలు మృగ్యమవుతున్న పరిస్థితుల్లో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఉందనాలి. కాకపోతే, ఇంత జరుగుతున్నా కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ గురించి తనకేం తెలియదని ఒక వార్తా సంస్థకు అమాయకంగా చెప్పిన మోడీ ఆంతర్యం ఆయనకే అర్థం కావాలి.  

         కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, భవిష్యత్ లో ఒకవైపు దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పు తేవడంతో పాటు మరోవైపు కేంద్ర-రాష్ట్ర సంబంధాలలో ఒక నూతనాధ్యాయానికి నాందిపలకడానికి కూడా దోహదపడుతుందనాలి. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో పలుసందర్భాలలో వెలిబుచ్చిన అభిప్రాయాలు యావద్భారత దేశం దృష్టిని ఆకర్షించడంతో పాటు, జాతీయ స్థాయిలో  విస్తృత స్థాయి చర్చకు దారితీసే అవకాశాలులేకపోలేదు. కేంద్రప్రభుత్వం సమస్త అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకోకుండా, రాష్ట్రాలకు వికేంద్రీకరించి, సుపరిపాలనకు మార్గం సుగమం చేయాల్సిన తరుణం కూడా ఆసన్నమైంది.

         ఇదిలా వుండగా, ఆద్యతన భవిష్యత్ లో, రెండు-మూడు నెలల్లో, లోక్ సభకు, ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో ఏం జరగబోతుందో ఇప్పుడిప్పుడే ఊహించడం కొంత సాహసమే అయినప్పటికీ, ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నవనేది తధ్యమే అనాలి. పరిస్థితి తప్పకుండా మారుతుంది. మోడీ మళ్లీ అధికారంలోకి రావడం అంత తేలికైన విషయం కాకపోవచ్చుకూడా! అందులో సందేహం లేదు. ఒకవైపు ఇటీవల మూడు రాష్ట్రాలలో బీజేపీ ఓటమి, మరోవైపు సంగ్ పరివార్ చూపు మోడీ నుండి గడ్కరీవైపు మారిందన్న వార్తలు బీజేపీ ఓటమికి దారితీయవచ్చు.

రాబోయే ఎన్నికల అనంతరం, ప్రాంతీయ పార్టీల సారధ్యంలో-అండదండలతోఎన్డీయేతర-యూపీయేతర సంకీర్ణ ప్రభుత్వం రావడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వున్న ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కాని, యూపీఏ భాగస్వామ్య పక్షాలు కాని ఎన్నికలయ్యేంతవరకు బీజేపీతో, కాంగ్రెస్ తో కలిసి వున్నా, ఆ తరువాత స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. ఎప్పటికీ అటు కాంగ్రెస్ వారినో, లేదా బీజేపీ వారినో ఎందుకు ప్రధాని చేయాలి? తమలోనే ఒకరు కాకూడదా అనే అభిప్రాయానికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాకపోతే ఇప్పటి నుంచే కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ, బిజెపి సారధ్యంలోని ఎన్డీయేమూడోనాలుగో ఫ్రంటులు రాబోయే ఎన్నికల కోసం ఎవరి వ్యూహంలో వారున్నారుకాంగ్రెస్ పార్టీని-యుపిఎని వీడిన అలనాటి మిత్ర పక్షాలు కానిఇంకా కలిసి వున్న ఇతర చిన్న-చితకా పార్టీలు కాని రాబోయే లోక్ సభ ఎన్నికలలో ఉమ్మడిగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధంగా వున్నట్లు కనిపించడం లేదుఅదే పరిస్థితి బీజేపీది కూడా. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా అవి తమతో కలిసి ఎన్నికల ముందు అవగాహన కుదుర్చుకుని పోటీ చేసే కంటేఅవి వేరుగా పోటీ చేసివీలై నన్ని స్థానాలు గెల్చుకునిఎన్నికల అనంతరం సంకీర్ణంగా ఏర్పడితే మంచిదన్న ఆలోచనలో వుంది

ఈ నేపధ్యంలో, జాతీయ రాజకీయాలకు తన అవసరం కావాల్సి వస్తే దాన్ని గొప్ప గౌరవంగా భావిస్తానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కొన్నాళ్ళ క్రితం ప్రకటించడం విశేషంగా పరిగణించాలి. దేశానికి ఒక కొత్త దిశానిర్దేశం అవసరమనీ, దేశ ప్రజలు ప్రబలమైన మార్పు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఏడు దశాబ్దాల కాంగ్రెస్-బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని చెప్పారు. ఒకానొక సందర్భంలో కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ జాతీయ రాజకీయాలపై తన స్పందనను వ్యక్తపరిచారు. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని దుయ్యబట్టారు. రెండుపార్టీలు మార్చిమార్చి దేశాన్ని పరిపాలిస్తున్నా పథకాల పేర్ల మార్పిడి తప్ప ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఒరిగిందేమీలేదని ఆగ్రహం తెలియపర్చారు. ప్రత్యామ్నాయ రాజకీయ సంఘటన గురించి ప్రస్తావిస్తూ, దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పు రావాల్సిన ఆవశ్యకత గురించి జాతీయ స్థాయిలో సంప్రదింపులు జరుపుతున్నానని చెప్పారు. ఆవిర్భవించిన అనతికాలంలోనే అధికారం అందుకున్న రాజకీయ శక్తుల చరిత్ర గురించి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇప్పటికే ఈ దిశగా ఆలోచనలు కొనసాగుతున్నాయని తానూ జాతీయస్థాయికి వెళ్లాల్సి వస్తే బాజాప్తా పోతామని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేసారు.

“దేశంకోసం పనిచేసే హక్కు మాకు లేదా?” అని సీఎం ప్రశ్నించారు. మీడియాతో జరిపిన సుదీర్ఘ సంభాషణలో ఆయన దేశంలో గుణాత్మక మార్పు రావాల్సి ఆవశ్యకత గురించి పదేపదే నొక్కిచెప్పారు. ప్రబలమైన ఆవశ్యకత ఉన్నప్పుడు ఎలాంటి మార్పులు వచ్చాయో చరిత్ర చెప్తున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. జనతా పార్టీ పుట్టడం…ఎన్నికల్లో స్వీప్ చేయడం రోజుల్లో జరిగింది. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ కొద్ది నెలల్లోనే స్వీప్ చేసింది. ఇక టీఆర్‌ఎస్ పుట్టిన కొద్ది రోజుల్లోనే పంచాయతీ ఎన్నికల్లో స్వీప్ చేసింది. ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎలా ప్రారంభమవుతుందో చెప్పలేం. కానీ సమయం నిర్ణయిస్తుంది. పనిమాత్రం ఆగదు అని పేర్కొన్నారు.


దేశంలో రాజకీయ పరివర్తన తీసుకురావడానికి తనవంతు కృషిచేస్తానని, మార్పు విషయంలో నాయకత్వం వహించాల్సి వస్తే తప్పక ఆలోచిస్తానని స్పష్టంచేశారు. “బీజేపీ, కాంగ్రెస్ రెండూ దొందూదొందే. దేశంలో గుణాత్మకమైన మార్పు రావడం లేదు. రావాల్సిన అక్కర ఉన్నది. చాలా సీరియస్‌గా దేశంలో ఏదో ఒకటి జరుగాల్సి ఉంది. 70 ఏండ్ల నుంచి దేశం ఇదే మూసలో పోవాల్సిన అవసరం లేదు. దేశ రాజకీయాల్లో అనేక విషయాల్లో ప్రబలమైన మార్పు రావాలి. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరముంది. ప్రజలు దానికోసం ఎదురుచూస్తున్నరు. విసిగిపోయారు. 70 సంవత్సరాలు గడిచిపోయినయి. తక్కువ సమయం కాదు. చాలా సుదీర్ఘ సమయం. అందుకే మార్పుకు శ్రీకారం చుట్టబడుతుంది. ఒక ఆరు సంవత్సరాల తక్కువ సమయాన్ని మినహాయిస్తే, మిగిలిన 64 సంవత్సరాలు పూర్తిగా కాంగ్రెస్ లేదా బీజేపీ పాలించాయి. జాతికి వాళ్లు ఏం సమాధానం చెప్తారని నేను సీరియస్‌గా డిమాండ్ చేస్తున్న. 70 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో తాగేందుకు నీళ్లు లేవు. ఇది నిజం కాదా? అబద్ధమా? ఎన్ని రోజులు ఈ స్టోరీలు వింటం? దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు రావాల్సి ఉంది. వందశాతం దేశంలో గుణాత్మక మార్పు రావాలనే దానికి నేను కట్టుబడి ఉన్న. దేశంలో ఓ ప్రశ్న వినిపిస్తున్నది. కాంగ్రెస్ పోయింది...బీజేపీ వచ్చింది. కానీ ఏం మార్పు తెచ్చింది? ఏం జరిగింది? పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నరు”.

“అధికారంలోకి ఎవరొచ్చినా, పథకాల పేరు మార్పు మాత్రమే జరుగుతది. జాతీయ రాజకీయాలకు కేసీఆర్ అవసరమైతే.. దేశం కోసం పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తాను. దేశానికి ఒక కొత్త దిశానిర్దేశం అవసరం. దేశ ప్రజలు పరివర్తన కోరుకుంటున్నారు. అందుకు వారిని సిద్ధంచేయాలి. గుణాత్మకమైన మార్పురావాలి. అన్ని రంగాల ప్రజలను ఆదుకోవాలి. దేశ రాజకీయాల్లో మార్పురావాలి. అది గుణాత్మకంగా ఉండాలి. ఇవి అందరి మనసులో ఉంది. ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలా ప్రారంభమవుతుందో చెప్పలేం. కానీ సమయం నిర్ణయిస్తుంది. పని మాత్రం ఆగదు. జాతీయ రాజకీయాల గురించి ఇప్పటికే ఆలోచనలు కూడా ప్రారంభమయ్యాయి. మాట్లాడేవారు మాట్లాడుతున్నారు”.

“ప్రస్తుత రాజకీయ వ్యవస్థ దారుణంగా విఫలమైంది. దేశ రాజకీయాల్లో ప్రబలమైన మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇందుకు ప్రజల ఆలోచనల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో గుణాత్మక మార్పుల కోసం ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడుతున్నా. భారత రాజకీయ పరివర్తనలో మార్పు తీసుకరావడానికి నా వంతు ప్రయత్నం చేస్తా. మార్పు విషయంలో నాయకత్వం వహించాల్సి వస్తే తప్పక ఆలోచిస్తా. జాతీయ రాజకీయాలకు నాయకత్వం వహించే అవకాశం వస్తే తెలంగాణవాదులంతా గర్వపడాలి. భగవంతుడి ఆశీస్సులు ఉంటే దేశ రాజకీయాల్లో ప్రబలమైన మార్పు తీసుకొచ్చేందుకు కృషిచేస్తా. త్వరలోనే ప్రక్రియ ప్రారంభమవుతుంది”.

ఆ కృషిలో భాగం రానున్న లోక్ సభ ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలదే పైచేయి కానుందిఎన్నికల అనంతరం యుపిఎఎన్డీఏలు తమదైన శైలిలో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తాయి. అవి ఫలించే అవకాశాలు ఏ మాత్రం లేవు. ప్రాంతీయ పార్టీలలో ప్రస్తుతం చాలా వరకుయుపిఎఎన్డీఏ లలో ఏదో ఒక దాంట్లో భాగస్వాములుగా వున్న పార్టీలే. ఇవన్నీ ఫెడరల్ ఫ్రంట్లో భాగాస్వాములయ్యే అవకాశాలున్నాయి. అన్నీ కలిసి సుమారు 250 కి పైగా స్థానాలు గెల్చుకునే అవకాశం కూడా వుందిఇదే జరుగుతే జాతీయ పార్టీల పరిస్థితి డోలాయమానంలో పడినట్లేఅందుకే రాబోయే ది ప్రాంతీయ పార్టీల సంకీర్ణ కేంద్ర ప్రభుత్వంఅందులో టీఅరేస్ పాత్ర కీలకం కానుంది. ఆ దిశగా కేసీఆర్ తన మాటలకు అనుగుణంగా దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తేవడానికి సర్వం సన్నద్ధం చేస్తున్నారు. మార్పు తధ్యం.

Monday, December 31, 2018

KCR’s impeccable governance : Vanam Jwala Narasimha Rao


KCR’s impeccable governance
and
Governance that touches all
Vanam Jwala Narasimha Rao
Millennium Post, New Delhi (01-01-2019)
and
Telangana Today

            In a recent Press Conference Chief Minister Telangana K Chandrashekhar Rao described the neighboring state CM Chandrababu Naidu as a most opportunistic political manager running the show with the help of two media houses and in no way, he can be called as a leader. According to KCR N Chandrababu Naidu is a politician of no consequence, a liar, incompetent administrator lacking even basic knowledge of economics or agriculture.

            In this context it may be relevant to differentiate between a Leader and Manager and contextualize with reference to governance. KCR who provided the real leadership with statesman like qualities and comparing the progress achieved in Telangana and the neighboring AP has probably every right to describe Babu as a mere manager and not a leader. The development in Telangana is to be credited to KCR for providing the leadership. KCR even predicted the defeat of Babu in the next election in his state as he did not to do anything worthwhile for the welfare and development of people there.

            On the other side, the Telangana state government during the last four and half years initiated and implemented a variety of programs. The basic reason and the driving force for achieving this success are the statesmanship, vision, leadership qualities and commitment, decision making process through consensus, consultation and quality review methodology of Chief Minister K Chandrashekhar Rao. All these resulted in conceptualization and implementation of people oriented, welfare oriented and development-oriented schemes in the state. Above all it is the Statesman like Leadership that is causing development.

In this context we may probably refer to Jim Collins who authored a book on leadership titled “Good to Great” where he deals extensively with the qualities and success of level five leadership and differentiates leader and manager.

According to Jim Collins Good-to-Great leaders embody a paradoxical mix of personal humility and professional will. Good” is The Enemy of “Great”. Level Five Leadership does not happen overnight. It refers to the highest level in a hierarchy of executive capabilities. Leaders of this type are those who combine extreme personal humility with intense professional will; shun the attention of celebrity, channeling their ambition toward the goal of building a great system. They provide new vision, strategy and direction, around which institution gains people’s commitment. The transformation from Good to Great has a process that includes building first level five leadership, deciding on first who and then what, confronting the brutal facts, transcending the curse of competence, inculcating culture of discipline for breakthrough results and technology accelerators. Collins also differentiates between the levels of leadership and elaborates the other four levels in support of level five leaders.


Level five leaders like KCR rise to that level against a background of his rich experience in various fields of activity, individual discipline, ups and downs in the life, colleagues support and many more most of which are success stories. Level one in the hierarchy is a highly capable individual who makes productive contributions through talent, knowledge, skills and good work habits. Level two is a member who contributes individual capabilities to the achievement of group objectives and works effectively with others in a group setting. Level three is a competent manager and capable of organizing people and resources towards the effective and efficient pursuit of predetermined objectives. Level four is an effective leader who catalyzes commitment to and vigorous pursuit of stimulating higher performance standards. Level five the highest in the Hierarchy builds enduring greatness through paradoxical blend of personal humility and professional will. The greatness of level five leaders lies in choosing the other four levels for successful accomplishment.

            Professional will of level five leadership creates superb results, demonstrates resolve to produce the best long-term results, no matter how difficult, sets standard of building institution and will settle for nothing less. He looks in the mirror, not out the window, to apportion responsibility for poor results, never blaming other people, external factors or bad luck. He is never boastful, acts with quiet calm relying on inspired standards, channels ambition into the institution and looks out the window, not in the mirror to apportion credit for the success. He chooses the right people for right work and lets them into his vehicle of performance and achieving results and only with them forms a superior executive team. The wrong people are off the vehicle and when and why is the tactical choice of level five leaders. For him Great vision without Great people is irrelevant.

            When we talk of governance and politics the level five leaders is basically a Statesman like qualities person. We heard of Governance and later Good Governance. But today people want Great Governance and Governance with a difference. It is just not enough to attend to mere current needs of people and call it as a development. Long term planning along with short term and medium term are essential. This is what has been happening in the state during the last four and half years and with this same leadership would happen in the coming days and months. The schemes conceived in the state are all keeping the long terms needs of people in mind. All these are examples of statesmanship of Chief Minister Chandrashekhar Rao.

            In the recent elections the landslide victory of TRS under the leadership of statesman KCR did not happen just like that. Ever since the state was formed, by initiating and implementing number of welfare and development schemes during the 51 months of his first phase of governance, which did not happen during the erstwhile Congress and TDP rule for over 50 years, CM KCR who is also the TRS Party President successfully appealed for votes. In support of his appeal he demonstrated the process of successful completion of schemes with statistical data. The progress card was presented to the people in detail. As a leader, as a statesman, as a politician, as a designer of development-welfare schemes, as a visionary, as a pragmatist and an intellectual KCR won the hearts of people at large. This is how the landslide victory was made possible.

         It is not just “Governance” or “Good Governance” that is seen and felt now……it is a “Great Governance” with a “Huge Difference” headed by a Statesman Leader Chief Minister K Chandrashekhar Rao.