గయ
నుంచి శర్మ రాసిన ఉత్తరం
వనం జ్వాలా నరసింహారావు
శర్మ గురించి
కిందటి అధ్యాయంలో ఉపోద్ఘాతం ఇచ్చాను. వాడు (గయ) కత్రి సరాయ్ లోని నాథ్
ఆయుర్వేదాశ్రమంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక నాడు అనుకోకుండా "అన్వేషణ"
అనే వారపత్రిక చూడడం జరిగింది. అందులో మిత్రుడు భండారు శ్రీనివాసరావు (హెచ్.ఎస్.సీ
వరకు మా క్లాస్ మేట్) రాసిన ఒక వ్యాసం చదివాడు. వెంటనే స్పందిస్తూ, 22-01-1996 తేదీన ఒక ఉత్తరం
రాశాడు. అందులోని విషయాలు చాలావరకు మా ముగ్గురికీ...ఆ మాటకొస్తే...మా
సమకాలీనులందరికీ వర్తించేవిగా వున్నాయి. ఆ విషయాలను పదిమందితో పంచుకోవాలన్న
ఉద్దేశంతో యధాతథంగా రాస్తున్నాను.
Dear Friend Jwala,
నేను కొన్నాళ్లుగా ఇక్కడ గయ దగ్గర ఒక
ఆయుర్వేద కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సంగతి నీవెరిగినదే కదా. నీవు నన్ను గుర్తు
చేసుకుంటూ ఉంటావో లేదో గాని, నేను నిన్ను, మన
స్నేహితులందర్నీ ఏదో ఒక సందర్భంలో తలుస్తూనే ఉంటాను. 10 రోజుల క్రితం 9-01-96 అన్వేషణ అనే వారపత్రిక
తిరగవేస్తుండగా, పేజీ 45 లో, శ్రీ భండారు శ్రీనివాసరావు వ్రాసిన ఒక వ్యాసం
ప్రచురితమయింది నా కంట పడింది. క్రింద రచయిత పేరు చూసి వ్యాసం పూర్తిగా చదివాను.
అలా మన చిన్ననాటి జ్ఞాపకాలు... పాత రిక్కా బజారు హైస్కూల్, మామిళ్లగూడెం
మన ఇల్లు, పక్క మురికి కాలువ, మనం
భోజనం చేసే మైసూర్ కేఫ్, "భోజనం తయార్" బోర్డు,
"చలిగా ఉన్నది..చలి చలి వేస్తున్నది" అని కవిత రాసిన మీ
స్నేహితుడు, మన నర్సింగరావు గారు, భండారు
శ్రీనివాసరావు గారు, బాల మౌళి, నోముల
వారు, గుర్రం వారు, బూర్లె వారు,
దోసపాటి వారు, మొదలైన స్నేహితులు
గుర్తుకొచ్చాయి. Pulse
Polio కార్యక్రమం నిర్వహించబడుతున్నది కాబట్టి, మీ
ఇంటి ఎదురుగా ఉండే Polio
Friend మన క్లాసే కాని History Student పేరు గుర్తు లేదు, Syed Rehman, Abdul Rehman,
Shukur, వారి SC
Hostel Friends, "గొట్టం పాపయ్య-పానుగంటి పిచ్చయ్య" అంటూ వుండే శ్రీ
కొండలరావు సారు, మనకి మాత్రమే విడమర్చి చెప్పి మిగతా వాళ్లను
కసురుకునే Venkat
Ram Reddy
సారు, "వనజ భవుండు నిన్నొసట..."
అంటూ చెప్పే తెలుగు సారు అయ్యదేవర రామచంద్రరావు, బాగా కొట్టి
చెప్పే సర్వ శ్రీ చిన్ని రామారావు, వీరభద్రం (Science), అవధాని,
రసూల్ మొదలైన వారు, డ్రామాలు వేయించే సత్యం,
Sitaramaiah మాస్టార్లు, కాలేజీకి
వెళ్లేటప్పుడు నీవు సైకిలు తొక్కడం-నేను కూర్చోవడం, గుట్టల
బజారు చడావ్ దగ్గర దిగడం-సైకిల్ తోయడం, లిటరేచర్ అనే పేకాట
ఆడడం, Self
Service Day, మన స్కూల్ ఒంటికన్ను చప్రాసి, పక్కనే జిలేబి అమ్మే హిందీ తాత,
J H Prasad, Late M V K H Prasad,...ఇట్లా
అందరూ జ్ఞాపకం వస్తూ ఎన్నో విషయాలు మదిలో మెలిగాయి. గయోపాఖ్యానం, దేవుని లాలూచీ, అనే స్కూల్ డ్రామాలు గుర్తుకొచ్చాయి.
చిక్కడపల్లిలో నీ రూమ్మేట్స్ అయిన Late రంగారావు గారు (M A Public Administration), రమణ
(రెబ్బారం), A
Muslim Friend,
Tajmahal Hotel Tracer ఉద్యోగం, "Buy
and Cry"
Pant, నా పురోహితుడి Duty, ఖమ్మంలోని
సుందర్, ప్రభాత్, నవాబ్ మొదలైన సినిమా
హాళ్లు, Janveera, Navab, Cheena, Dharma లాంటి పెద్ద age గల మన Friends, ఖమ్మం
నుండి హైదరాబాద్ వెళ్లేటప్పుడు బస్సులో నీకు వినిపించిన హరికధా కాలక్షేపం...మొదలైనవి
మనసులో మెదిలాయి. ఇలా వ్రాస్తూ పోతూ ఉంటే అంతం ఉండదు. ఈ సారి హైదరాబాద్
వచ్చినప్పుడు మన చిన్ననాటి సంగతులు అన్నీ ఏకరవు పెట్టి ముచ్చటించాలని ఉన్నది. మా
అమ్మాయి వాళ్లు కూడా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మొన్న ఈ మధ్య ఒకసారి మా అమ్మాయిని
గురించి హైదరాబాద్ వచ్చాను. కాని నీ Phone నెంబరుకి Phone చేసినా ఫోన్ మారిందా ఏమో నెంబరు పలక లేదు. సమయం
లేనందున కలవలేకపోయాను.
ఇలా ఈ పత్రిక
తిరగేస్తూ శ్రీ భండారు శ్రీనివాసరావు గారి వ్యాసం చదువుతూంటే, వారిని
గురించిన జ్ఞాపకాలు కూడా వచ్చాయి. AIR లో వింతలు-విశేషాలు అనే వారి వార్తలు లోగడ ప్రసారమవుతూ
ఉండేవి. తర్వాత ఆయన రష్యా వెళ్లినట్లుగా నీవు చెప్పావు. ఇలాంటివే మరెన్నో వ్యాసాలు, ప్రజలకి,
ఈనాటి యువతకి పనికి వచ్చే ట్లుగా వ్రాయాలని శ్రీ భండారు వారిని మరీ మరీ
కోరుతున్నాను. ఈ విషయాలలో వారితో Personal గా ఒకసారి Discuss చేయాలని అనుకుంటున్నాను. మన భారత దేశం ఒక పుణ్యభూమి.
ఎంతో మంది మేధావులకు, మహానుభావులకు జన్మనిచ్చిన మాతృ భూమి. మన వేదాలు,
పురాణాలు, మన సాంఘిక ఆచార వ్యవహారాలు, మొదలైనవన్నీ మన ఉనికి, మనుగడలకై ఎంతో ఉపయోగపడేవిగా నిర్ణయించబడి,
ఆచరించబడుతున్నవి. ఈ ఆచారాలన్నీ మన శీతోష్ణ స్థితి, Environment పై ఆధారపడి ఉన్నాయి.
వాటిని వదిలేసి, పాశ్చాత్య నాగరికతలో ఈనాటి భారతీయుడు కొట్టుమిట్టాడుతున్నాడు.
ఆరోగ్య దృష్ట్యా, తోలు చెప్పులు, నూలు దుస్తులు,
తాజా ఆహారం, సాత్విక మితాహారం తీసుకోవాల్సి వుండగా Plastic చెప్పులు, బూట్లు,
Synthetic దుస్తులు, ఫ్రిజ్
లో నిలవ వుంచిన Tinned
Foods తీసుకుంటున్నారు.
Christianity లో లాగా మన మతానికి ఒక క్రమశిక్షణ లేదు. మన తాత-ముత్తాతలు శివుడు, విష్ణువులను,
మనం వెంకటేశ్వరుడు మొదలైన వారిని దేవుడిలాగా పూజించాం. ఈ నాటివారు బాబాలను,
జిల్లెడమూడి అమ్మలను, తాంత్రిక స్వాములను,
ఇలా వెలిసిన వూరికొక దేవ దూతలను పూజిస్తున్నారు. వేలు ఖర్చు చేసి దేవుడికి
కళ్యాణం చేయిస్తాం కాని మన పొరుగువాడు ఆకలితో అలమటిస్తూ ఉంటే చూస్తూ ఉంటాం. మన చరిత్రలోని
మంచిని తీసుకోం. ధర్మరాజు అబద్ధం చెప్పలేదా?, కృష్ణుడు మాయ చేసి
యుద్ధంలో పాండవులను గెలిపించలేదా? అని విమర్శిస్తూ ఉంటాం. ఉన్న
గుళ్లు చాలన్నట్లు ప్రతి రోజూ, ప్రతి వూళ్లో గుడి కట్టడానికి
చందాలు వసూలు చేస్తుంటారు. ప్రజలు నడిచే రోడ్లను ఆక్రమించి చిన్న-చిన్న గుళ్లను కట్టారు.
అంతేగాని, మదర్ థెరిస్సాలాగా బీదవారికంటూ మన వాళ్లు నడిపే Poor Homes ఏమీ లేవు. ఒకడు
నిజాయితీగా వ్యాపారం చేస్తూ తృప్తిగా జీవిస్తుంటే, పక్కవాడు ఏదో మతలబులు చేసి,
బాగా సంపాదిస్తూ మేడలు-కార్లు కొంటుంటే, మొదటి
వాడిని శుంఠ-చేతకానివాడి కింద లెక్క కడతారు. రెండవ వాడిని తెలివి తేటలు కలవాడంటారు.
అందరూ వాడినే గౌరవిస్తారు. మన ప్రభుత్వం కూడా Reservations కల్పించి ప్రజలకు
మంచే చేస్తున్నప్పటికీ, కనీసం విద్య-వైద్య-సాంకేతిక-ఇంజనీరింగ్ రంగాల్లోనైనా
Merit ఉన్నవాళ్లకు(Irrespective of the Caste) అవకాశాలు ఇవ్వకుండా, మార్కుల
రాయితీలు ప్రకటించి నందువల్ల, ఈనాటి స్కూలు మాస్టార్లు
"శ్రీ రఘురామ చారు తులసీ దళ ధామ" అంటే, "శ్రీరాములవారు
తులసి ఆకులతో చారు కాచి" అని చెప్పే వారిగా మారిపోతున్నారు. అదే మన రోజుల్లో...మన
చదువు తీసుకుంటే....మన చిన్నతనంలో మనం చదువుకున్న మన పాఠం, మను
చరిత్రలోని పద్యం ఇంకా నాకు గుర్తున్నది. ఆ పద్యాన్ని నేను ఏమాత్రం చదవలేదు. కంఠస్థం
అంతకన్నా చేయలేదు. లెక్చర్ విని, మాస్టారు విడమర్చి చదవగా విని
గుర్తు పెట్టుకున్నాను. వాటిలో కొన్ని...."అచటి విప్రులు మెచ్చరఖిల విద్యా ప్రౌఢి,
ముదిమది తప్పిన మొదటి వేల్పు.....అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ";
ధర్మరాజు రాజసూయ యాగం సందర్భంలో నన్నయగారి భారతంలోది..."చనపేడికి
తారక్రియయును......కృష్ణు పూజించుటిలన్"; ఏనుగు లక్ష్మణ
కవి సుభాషితం, "ఆకాశంబున నుండి, శంభుని
శిరంబందుండి.....వివేక భ్రష్ట సంపాతముల్"; "జలమున నగ్ని,
చాత్రమున జండ మయూఖుని.....మూర్ఖుని మూర్ఖత మాన్పవచ్చునే";
"అవనీనాధులనేకులుండగ విశిష్టారాధ్యుల్. ఆర్యుల్ పూజ్యులు పల్వురుండగ....దాశార్హుండు
పూజార్హుండే"; "ఈతనికి ధనమిత్తురేని అభీష్టములైన కార్యముల్....అనర్హుడర్హుడని
అత్యుతునచ్యుత చేయపాడియేధర్మవు ధర్మ నందనా"; 8th Class English లో "Her arms across her breast
she laid she was more fair than words can say"; Waste Not Want Not Proverb లో శ్రీ గెంటాల
రంగారావు గారు చెప్పిన మాటలు "Economy
does not mean stringency. One must enjoy life according to his status and
earnings. If he goes beyond it he may be called Spend Thrift".
పై విషయాలన్నీ నీకు Bore కలిగించవచ్చునేమో కాని, ఇక్కడ ఖాళీగా
ఉన్న నాకు (ఈ రోజు ఆదివారం...ఒంటరిగా ఆఫీసులో ఉన్నాను) ఏదో రాయాలనిపించి, నీవు కూడా పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుని ఆనందించుతావని వ్రాస్తున్నాను.
ఇంకో విషయం. మనకు ముఖం తెలియని వాడెవడో బాబా
గురించి ఉత్తరం వ్రాస్తూ, ఇలాంటి ఉత్తరం 100 ప్రింట్ చేయించి Mr. Ex లక్ష రూపాయలు లాటరీ కొట్టాడు, Mr. Y నిర్లక్ష్యం
చేసి తలపగిలి లేదా పాము కాటుకు గురై చచ్చాడని అంటూ, ఇలాంటివే
100 ప్రింట్
చేసి బట్వాడా చేయాలని వ్రాస్తూ వుంటారు. హిందూ మతం దిగజారడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం
కావాలి? మన రోజుల్లో మనకు తెలిసింది, తెలియని
వాళ్లకి విడమర్చి చెప్పే వాళ్లం. ఈ రోజుల్లో చెప్పడం చేత కాదు కొందరికి. చెప్పితే ఎక్కడ
నేర్చుకుంటాడో అని ఈర్ష్య కూడా. ఆ రోజుల్లో Cricket గురించి, Sixer, Four, Wide, Wicket అంటూ చెప్పింది నీవే. ఈ
రోజుల్లో ప్రతి పిల్లాడికి తెల్సుననుకో. ఇంత భారతం వ్రాయడానికి, ఇన్ని విషయాలు
మననం చేసుకోవడానికి ధనస్సు రాశిలో వ్రాసిన వార ఫలాలు కూడా కాకతాళీయంగా ఏకీభవిస్తున్నాయి!
(ఒక పేపర్ క్లిప్పింగ్‌ను వాడి వుత్తరానికి జత పర్చాడు. అందులో వార ఫలాలలో ధనస్సు రాశివారికి
" చిన్ననాటి జ్ఞాపకాలు రాగలవు" అని వుంది. బహుశా వాడి జన్మ రాశి ధనస్సు కావచ్చు).
More details in my next letter. I request you to please
reply for this letter at least because this is my second letter to you from
Gaya. My kind enquiries to one and all of your family members and also to Mr.
B. Srinivasa Rao and his family members. Please show this letter to Mr. B. S.
Rao also.
Yours Loving Friend,
L. V. R. S. Sharma
kolipaka rahul:
ReplyDeleteWonderful letter mavayya...Thanks for sharing such knowledge with us... One small clarity... have you replied him?
Ravindranath Muthevi:
ReplyDeleteమీ మిత్రుడు శర్మగారి భావాలు, ఆదర్శాలు గొప్పగా ఉన్నాయి. మతం మీద కేవలం అంధ విశ్వాసాలున్న చాలా మంది వలె కాక శర్మగారు ప్రగతిశీలమైన, అధునాతనమైన భావాలు కలిగివుండడం విశేషం. ఈ ఉత్తరం నిజంగా కలకాలం దాచి ఉంచుకోదగ్గదే.మిత్రుల జ్ఞాపకాలను మించిన విలువైన ఆస్తి ఎవరికైనా ఏముంటుంది జీవితంలో ? చక్కటి మెయిల్ కు ధన్యవాదాలు.
మీ..... రవీంద్రనాథ్.
సమాచారయుతంగా ఉంది అయితే ఈ ఉత్తమ లేఖకు మీరు ప్రత్యుత్తరమిచ్చినదీ లేనిదీ తెలియరాలేదు నాకూ రాహుల్ కు లాగే!
ReplyDeleteI replied to Sarma
ReplyDeletegud BLOG sir -
ReplyDelete