ఆత్మీయతతో
డాక్టర్ రంగారావు
రాసిన పెళ్లినాటి ఉత్తరం
రాసిన పెళ్లినాటి ఉత్తరం
వనం
జ్వాలా నరసింహారావు
మాంచెస్టర్ (ఏప్రిల్
1969),
బావగారూ,
ఇంతకన్నా తీయగా, అనురాగంగా
మిమ్మల్ని సంభోధించలేకపోతున్నా. ఈ పిలుపుతో మన బంధం ఒక మలుపు తిరుగుతుంది. వలపుతో మా
చెల్లి మెడన మీరేసిన మూడు ముళ్లతో మీరు మా మూడవ ముద్దుల బావయ్యారు.
మా ఇంట్లో అందం, అదృష్టం,
అమ్మాయిలది-ఆకతాయితనం, అలుక అబ్బాయిల వంతు. అందరిలో
మాత్రం అనురాగం కొల్ల-మా అమ్మాయిలు అందంతో, ఆనందంతో, అదృష్టంతో అత్తవారింటికొస్తారు-అన్యోన్యమైన సంసారంతో, ఆదర్శవంతమయిన దాంపత్యంతో మాకానందం ఇస్తారు.
మా చెల్లి విజయలక్ష్మి మీ
ఇల్లాలు-అమ్మా నాన్నల కనురెప్ప ఈ చిన పాప-అక్కా అన్నల చెలి ఈ సుబాల. ఈ నాటి నుండి మీది.
ఆదర్శంతో స్వీకరించారు. అనురాగంతో నింపుకొండి. అనునయంతో చూసుకొండి. అనువుగా మలుచుకొండి.
ఈ శుభ సమయంలో బాధాకరమైన క్షణం అప్పగింతలు-అందరి
మనసులు కెలికివేసేది, అందరి హృదయాలు నలిపివేసేది. నే దగ్గర లేకపోయి నాను. దగ్గర
వున్నా పారిపోవాలని పించే క్షణం. దగ్గర వుండి చూడలేకపోయినందున దూరంగా వుండి చెప్పగలుగుతున్నా......చంద్రుని
సరసనే చుక్కలు మెలుగుతాయి. మందారం పక్కనే మధుపాలు మసలుతాయి.....కలికితురాయి కంసాలి
ఇంట రాణించదు.....కలవారి ఇంట కలకంఠి నొసటనే శోభిస్తుంది. అందుకే బావగారూ! అమ్మాయిని
మీకిస్తున్నాం.
పెద్దవారు మా నాన్న గారు. చిన్నవాడు తమ్ముడు.
మధ్యముడ్ని నేను. పెళ్లి ఏర్పాట్లలో పెత్తనం చేయాల్సిన వాడ్ని. దగ్గర లేకపోయాను. పెళ్లి
ఏర్పాట్లలో,
సదుపాయాలలో, మర్యాదలలో పొరపాట్లు జరిగితే క్షమించమని
అర్థిస్తున్నా.
మీ ఇద్దరూ కలకాలం, కనులకింపుగా,
అన్యోన్యంగా, ఆనందంగా, ఆరోగ్యంగా,
పిల్లలతో, పాపలతో.....
వేయేళ్లు కాపురం చేయాలని.....
వేల మనసులతో కోరుతూ......
వేనోళ్ల దేముళ్లను ప్రార్థిస్తూ.....
వేల మైళ్ల దూరంలో......
బావ
ఇంగ్లీష్ పుట్టిల్లు ఇంగ్లాండ్ నుంచి అచ్చ తెలుగులో, స్వచ్చమైన మనసుతో రాసిన తెలుగు ఉత్తరం. ముఖ్యంగా జాబు చివర్లో రాసిన – వేనోళ్ళ దేవుళ్ళను ప్రార్ధిస్తూ వేల మైళ్ళ దూరంలో ....బావ – ఉత్తరానికే హై లైట్ – చక్కని జ్ఞాపకం.
ReplyDeleteమీ బ్లాగుని "పూదండ" తో అనుసంధానించండి.
ReplyDeletewww.poodanda.blogspot.com