Sunday, December 29, 2019

రామలక్ష్మణులను సుగ్రీవుడి దగ్గరికి తీసుకుపోయిన హనుమంతుడు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-10 : వనం జ్వాలా నరసింహారావు

రామలక్ష్మణులను సుగ్రీవుడి దగ్గరికి తీసుకుపోయిన హనుమంతుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-10
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (29-12-2019) 
సుగ్రీవుడు తిరుగుతున్న ప్రాంతంలో ఒక ప్రదేశంలో రామలక్ష్మణులను దింపి, హనుమంతుడు, సుగ్రీవుడి దగ్గరకు పోయాడు. పోయి, “సుగ్రీవా! ఈ రాముడు ఏ పాపం ఎరుగడు సుమా! నువ్వు సందేహించిన దోషం ఇతడిలో లేదు. మిక్కిలి ఆలోచనాపరుడితడు. సూర్యతేజస్సు కల తమ్ముడు లక్ష్మణుడితో యితడు నీదగ్గరకు వచ్చాడు. యితడు సామాన్యుడని భావించవద్దు. విస్తారమైన సత్యం, శౌర్యం, సత్యమైన శౌర్యం, సత్యమే శౌర్యంగా కల వాడితడు. ఈయన సాక్షాత్తూ పరమాత్మ అనుకోవాలి. సూర్యవంశంలో జన్మించాడు. రామచంద్రమూర్తి ఇంద్రుడిని జయించిన తేజస్సు వున్నవాడు. దశరథమహారాజు కొడుకు. ధర్మబుద్ధిలో తరుగులేనివాడు. పితృవాక్యపాలనలో దక్షుడు. ఇలాంటివాడు అడవుల్లో తిరుగుతుంటే, రావణాసురుడి వల్ల తన భార్యను కోల్పోయాడు. ఈయన తండ్రి దశరథుడు రాజసూయాది యాగాలను చేసి వేలకొద్దీ ఆవులను దక్షిణలతో దానం చేశాడు. వీరు పూజ్యులలో ఉత్తములు. ఇంతకు మించినవారు లేరు. అందమైన కీర్తికలవారు. నీ స్నేహం కోరి ఇక్కడికి వచ్చారు. కాబట్టి నువ్వు పోయి వారిని పూజించు”.

రామలక్ష్మణులతోసంభాషించిన సుగ్రీవుడు
         ఆంజనేయుడి మాటలు విన్న సుగ్రీవుడు తనకు రామచంద్రుడి వల్ల కలిగిన భయాన్ని వదిలి సంతోషంగా మనుష్య రూపాన్ని ధరించి త్వరత్వరగా వారి దగ్గరికి వచ్చాడు. నిర్మలమనస్కుడైన గురువు చెప్పిన మాటలు విని, ఆ మాటల్లో శ్రద్ధగలవాడైన శిష్యుడిలాగా సుగ్రీవుడు ప్రవర్తించాడు. ఇలా సుగ్రీవుడు రామలక్ష్మణులను సమీపించి, అనురాగంగా పూజించి, రామచంద్రమూర్తిని చూసి ఇలా అన్నాడు.

         “మీరు వీరులనీ, గొప్ప ధర్మ గుణం కలవారనీ, సమస్త జీవకోటుల మీద వాత్సల్యం కలవారనీ, ఇలా మీ లెక్కించనలవికాని గుణాలను హనుమంతుడు చెప్పాడు. ఓ రాజకుమారులారా! మహాత్ములారా! ఈ కోతితో మీరు స్నేహం చేయాలని అనుకుంటే అంతకంటే నాకు గౌరవం, ఉత్తమమైన లాభం ఇంకోటి వుంటుందా? నేనే కృతకృత్యుడిని. అయినా ఒకటి చెప్తా వినండి. రామా! నువ్వు నాతో స్నేహం చేస్తే, రాముడి స్నేహితుడు సుగ్రీవుడు అని గౌరవ లాభం నాకే కాని, నావల్ల నీకు గౌరవలాభాలు కలగవు. ఆ కారణాన నేనే ధన్యుడిని. నా జన్మే సార్థకం”.

సుగ్రీవుడితో స్నేహం చేసిన రాముడు
         సుగ్రీవుడు ఇంకా ఇలా అన్నాడు. “రామచంద్రా! నాతో స్నేహం చేయడానికి నీకు పరిపూర్ణంగా అంగీకారమైతే, నా చేతిలో నీ చేయి వెయ్యి. ఇదిగో, నా చేతిని స్నేహధర్మ మర్యాద ప్రకారం చాచాను. ఇది అభయహస్త ప్రధానప్రార్థన”. ఆ మాట విన్న రామచంద్రమూర్తి వీడు నిర్మలమనస్కుడని మనసులో సంతోషించి, తన అరచేతిని, సుగ్రీవుడి అరచేతిలో వుంచి, గౌరవించి నిండు మనస్సుకల స్నేహంతో కౌగలించుకున్నాడు. ఆంజనేయుడు అప్పుడు తిరిగి తన సన్న్యాసి రూపాన్ని వదిలి కోతిరూపాన్ని ధరించి, చండ్రపుల్లల్ని తెచ్చి మంట చేశాడు. గనగన మండే ఆ అగ్నిహోత్రాన్ని వారిద్దరిమధ్య హనుమంతుడు పెట్టాడు. రామసుగ్రీవులు అడవి పూలతో పూజించి, ఒకరిచేయి మరొకరు పట్టుకుని,  ఆసక్తిగా అగ్నికి ప్రదక్షిణ చేశారు. ఇలా రామసుగ్రీవులు స్నేహం చేసి వారి-వారి హృదయాల్లో వున్న ఆరాటాన్ని విడిచి ఇద్దరూ తమ పని జరిగినట్లే సంతోషించారు. ఒకరినొకరు ప్రేమపూరితమైన చూపులతో మరీ-మరీ చూసుకుంటూ తృప్తి పడ్డారు.


రామసుగ్రీవులు అలా తన్మయంగా ఒకరినొకరు చూసుకుంటూ వుండగా, ఆ సమయంలో సుగ్రీవుడు రామచంద్రమూర్తితో ఇలా అన్నాడు. “రామచంద్రా! నీ స్నేహాన్ని సంపాదిం చాను. మన సుఖదుఃఖాలు సమానమయ్యాయి”. ఇలా చెప్పి, సుగ్రీవుడు, నిండారా పూసిన ఒక కొమ్మను ఒకదానిని విరిచి నేలమీద వేసి, దానిమీద రామచంద్రమూర్తితో కలిసి కూర్చున్నాడు. అప్పుడు వాళ్లలా కూర్చోగా హనుమంతుడు చందనశాఖను ఒకదానిని విరిచి తెచ్చివేయగా లక్ష్మణుడు దానిమీద కూర్చున్నాడు. అప్పుడు సవినయంగా సుగ్రీవుడు రాముడితో ఇలా అన్నాడు.

తనకు వాలి చేసిన అపకారాన్ని రాముడికి చెప్పిన సుగ్రీవుడు
         సుగ్రీవుడు తనకు అన్న వాలి చేసిన అపకారాన్ని గురించి ఇలా చెప్పసాగాడు. “రామచంద్రా! నా అన్న వాలి భయంకరమైన పరాక్రమం కలవాడు. వాడు నామీద కోపంతో నన్ను రాజ్యం నుండి పంపించి, నా భార్యను హరించి, నిర్దయుడై వెళ్లగొట్టితే, ప్రాణభయంతో కొండాకోనలలో అల్లల్లాడుతున్నాను. నన్ను కరుణార్ద్ర దృష్టులతో చూసి వాలి భయం నాకు లేకుండా చేసి నన్ను రక్షించు”.

సుగ్రీవుడిలా చెప్పగా స్నేహధర్మం తెల్సినవాడు, శరణాగత రక్షణ అంటే ప్రేమకలవాడు, దేవతలను రక్షించే కకుథ్సుడి వంశంలో పుట్టినవాడు, శ్రీరామచంద్రుడు తాను చేయాల్సింది ఇంత అల్ప కార్యమా? అని చిరునవ్వుతో ప్రీతిగా సుగ్రీవుడితో ఇలా అన్నాడు.

వాలిని చంపడానికి ప్రతిజ్ఞ చేస్తున్నట్లు సుగ్రీవుడికి చెప్పిన శ్రీరాముడు
         సుగ్రీవుడితో వాలిని చంపడానికి ప్రతిజ్ఞ చేస్తూ రాముడు ఇలా అన్నాడు. “స్నేహితుడంటే ఉపకారం చేసేవాడని అర్థం. ఇది నేను చక్కగా ఎరుగుదును. కాబట్టి నీ భార్యను అపహరించిన ధర్మవిరుద్ధచరిత్రుడైన వాలిని చంపుతాను. భయపడవద్దు. వాలినెలా చంపుతానంటావా? ఇదిగో చూడు. నా బాణాలు గురిభేదించకుండా వ్యర్థంగా పోవు. మిక్కిలి వాడికల మొనలున్నాయి. వంకరలేకుండా చక్కటి కణుపులున్నాయి. నీచపు నడవడికల వాలిని, కోపించిన పాముల గుంపుల్లాగా చంపుతాయి”.

రాముడిలా చెప్పగా, సంతోషించిన సుగ్రీవుడు, “రామచంద్రా! నీ అనుగ్రహంవల్ల నా భార్య, రాజ్యలక్ష్మి లభిస్తే సంతోషిస్తాను. నీ బాణాలతో వాలిని త్వరగా చంపి నా తీవ్ర దుఃఖాన్ని తొలగించి రక్షించు” అని అంటాడు.

Wednesday, December 25, 2019

The Valmiki Ramayana-5 .... Bala Kanda ..... The spirited heavenly being Prajapatya Purusha offering divine desert to Dasharatha: Vanam Jwala Narasimha Rao


The Valmiki Ramayana-5
Bala Kanda
The spirited heavenly being Prajapatya Purusha
offering divine desert to Dasharatha
Vanam Jwala Narasimha Rao

(My 10-year-old granddaughter Kanak Vanam who lives in Redwood City, San Francisco, USA is a voracious reader even at this tender age. On seeing me writing Ramayana in Telugu whenever I come to USA, she asked me can’t it be in simple English so that she too can have the benefit of reading Ramayana. Once the same question was raised by my other granddaughters Mihira and Medha. Then I decided to do my best to write in English, as simple as possible. I made Kanak to read first couple of paragraphs and confirmed that she understands. Hence this weekly serial for her and for children of her age group).
    
            On taking such a decision Lord Vishnu having agreed to the suggestion of Devatas vanished from there. From the other side the Putra Kameshti Yagam was going on uninterrupted. Then from the fire of Altar there emerged a heavenly being called Prajapatya Purusha. He was dressed in black and red garments with red face and drumbeating voice besides decorating himself with divine ornaments. He brought with him a big golden vessel which is full with divine dessert. King Dasharatha greeted him and offered prayers. Then the divinity told Dasharatha that, “I am sent by Prajapati. I brought this dessert in golden vessel for you. Take this which develops pregnancy in your wives. Let this be consumed by your wives. Your desire to beget sons will be fulfilled through this”. 

            The King Dasharatha thanking him whole heartedly took the vessel full with dessert and keeping it on his head once again greeted Prajapatya Purusha who disappeared later.

Dasharatha giving in parts the
dessert to his three wives
            Dasharatha with the vessel on entering the palace chambers of him told his elder wife Kausalya about the dessert and said, “This is equivalent to divine drink Amruta. Worship this and if you consume you will beget son”. The king then gave half of the dessert to queen Kausalya, and he gave half of the half, one fourth to queen Sumitra. And to Kaikeyi he gave half of the remaining half, means, one eighth of the dessert, with a desire to beget sons. Then thinking for a while gave the remaining, one-eighth portion again to queen Sumitra. Thus, the king distributed the dessert to his wives in a different way. The three wives of King felt very happy to have the dessert and they deemed it as a reward. They became pregnant after some time. Then on seeing his queens with confirmed pregnancies Dasharatha regained his lost heart for sons. 

Lord Brahma nominates Devatas to procreate monkey race
            When Lord Vishnu consented to be the son of Dasharatha and take the form of human being on the earth, Lord Brahma dictated the Devatas and all gods to become creators of monkey heroes to help Vishnu incarnation in annihilating Ravana. When Brahma ordered like that the Devatas agreed to do so and accordingly started parenting sons in the form of monkeys. The Siddhas, the Sadhyas, the Kinnaras, the Kim purushas, the sages, the Charanas etc. crated valiant sons who started wandering in the forests. Among them were, Vali, Sugriva, Dara, Hanuman, Gandhamadana, Nala, Neela, Mainda, Dvivida and so on. Thus, the Gods and Devatas reproduced many thousands and lakhs of heroic monkeys and chiefs of warriors who were supposed to be of help to Lord Vishnu incarnation in eliminating Ravana, the monster king.     
              

Birth of Rama, Lakshmana, Bharata and Shatrughna
            After the completion of Vedic horse ritual, the Ashvamedha Yaga and Putra Kameshti Yaga, all the kings and Sage Rushyasrung took leave of Dasharatha, who was immensely happy, and went away to their respective places. King Dasharatha entered Ayodhya with his three wives. Dasharatha with gratified heart dwelled upon the birth of his sons. Six seasons later in the twelfth month after the Putra Kameshti Ritual, in the first month of Lunar new year, on the ninth day, in the constellation of Punarvasu, and when the Sun, Mars, Jupitar, Venus as well as Saturn were in ascension in their respective houses and when Aries, Capricornus, Cancer, Pisces, Libra, Jupitar and the Moon were in conjunction Queen Kousalya gave birth to the incarnation the Administrator of Universe, The Lord Maha Vishnu, the Sri Rama. Queen Kaikeyi gave birth to Bharata who was born under Pisces where Pushyami was the star. Queen Sumitra then gave birth to two sons Lakshmana and Shatrughna who were born under Cancer where Aslesha was the star. Rama was born on the ninth day of Lunar Chaitra Month, Bharata was born the next day earlier part the tenth of Chaitra, Lakshmana and Shatrughna were born the later part of the tenth day. When Dasharatha announced their birth everyone in Ayodhya celebrated with melodic singing, dancing, drum beating, decorating the streets and so on. On the thirteenth day naming ceremony was performed. Vasishta the Chief Priest named elder son born to Kousalya as Sri Rama, Kaikeyi’s son as Bharata, Sumitra’s sons as Lakshmana and Shatrughna. King Dasharatha honored Brahmins with munificent of gifts. Later all the rituals of birth and ceremonies consequent to it like naming ceremony, first-food-feeding ceremony, first-hair-removal ceremony, and sacred thread ceremony were performed in respect of the princes.

            Among the four children, the elder son Sri Rama was the delight of his father Dasharatha besides being acceptable to all. He was a champion of all the valor activities like archery. Lakshmana always dedicated himself to Rama and behaved like his shadow. Rama never slept without Lakshmana on his bedside and would also not take food without Lakshmana. Similarly, Lakshman’s younger twin brother Shatrughna was dearer to Bharata. For Bharata also Shatrughna was dearer equally. Thus, all the four were grown-up under the able guidance and fellowship of efficient professors of all education and study including theology and bravery. All four princes were enthralled in the study of Vedas and became experts in archery. Against this background king Dasharatha contemplated along with his ministers and priests as well as relatives about the matrimonial alliances of his four sons.   

Saturday, December 21, 2019

హనుమంతుడితో తమ వృత్తాంతాన్ని చెప్పిన లక్ష్మణుడు ... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-9 : వనం జ్వాలా నరసింహారావు


హనుమంతుడితో తమ వృత్తాంతాన్ని చెప్పిన లక్ష్మణుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-9
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (22-12-2019) 
         రామలక్ష్మణులు కార్యార్థమై సుగ్రీవుడిని చూడడానికి, కలవడానికి, స్నేహం చేయడానికి వచ్చారని సంతోషపడ్డ హనుమంతుడు, సుగ్రీవుడిని తలచుకుని, ఇక అతడి పని చక్కబడినట్లే అనీ, ఆయనకు రాజ్యం లభించడం సత్యమే అని అనుకుంటాడు. ఇలాంటి వారు పూనుకుంటే పని జరక్కుండా ఆగుతుందా? అని కూడా అనుకుంటాడు. ఆంజనేయుడు ఈ విధంగా ఆలోచించి, సుగ్రీవుడితో వీళ్లకేం పనుందో? అది అతడివల్ల సాధ్యమవుతుందా? కాదా? తెలుసుకుందామనుకుంటాడు. రామచంద్రుడిని చూసి, “అయ్యా! నువ్వు తమ్ముడితో ఈ భయంకర అరణ్యాలలో తిరగడానికి కారణం ఏంటి?” అని అడిగాడు. వెంటనే, రామచంద్రుడి ఆజ్ఞానుసారం లక్ష్మణుడు శ్రీరామచంద్రుడి చరిత్ర ఆదినుండి ఇలా చెప్పాడు.

         “తేజోవంతుడు, గొప్ప మతిమంతుడు అయిన దశరథమహారాజు ధర్మం అంటే ప్రేమతో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగు వర్ణాలవారిని వారి-వారి స్వధర్మం చెడకుండా సర్వదా రక్షించేవాడు. ఆయన ఎవరికీ విరోదికాకుండా, ఎవరిమీద ఆయనకు విరోదిభావం లేకుండా, రెండవ బ్రహ్మలాగా రక్షించేవాడు. నియమం చెడకుండా అగ్నిష్టోమమ్ లాంటి యజ్ఞాలను దక్షిణలతో సహా నెరవేర్చేవాడు. ఆయన కొడుకుల్లో పెద్దవాడు శ్రీరాముడనే పేరుకలవాడు. పరాక్రమంలో ప్రసిద్ధికెక్కినవాడు. సర్వభూతాలను రక్షించే యోగ్యతకలవాడు. తండ్రిమాటను పాటించేవాడు. రాజచిహ్నాలతో కూడినవాడు. ఆయనే ఈ రామచంద్రుడు. ఈయన రాజ్యాన్ని పోగొట్టుకుని అడవులకు పోవడానికి సిద్ధపడగా నేను కూడా ఆయనకు తోడుగా వచ్చాను. నేను ఒక్కడినే కాకుండా, ఆయన భార్య భూపుత్రి సీతాదేవి కూడా ఆయన వెంట అడవులకు వచ్చింది. ఆమె భార్య కాబట్టి రావడం న్యాయమే. నేనెందుకు వచ్చానంటావా? ఈ మతిమంతుడికి నేను జన్మతః తమ్ముడిని. ఆయన గొప్ప ధర్మబుద్ధికి, సద్గుణ సంపదకు వశపడి దాస్యం చేస్తున్నాను”.

         “నా పేరు లక్ష్మణుడు. నా యోగ్యతకు అది తగ్గపేరు. చేసిన మేలు మరవనివాడు, సుఖపడడానికి అర్హుడు, గొప్ప యోగ్యతకలవాడు, ప్రాణికోటులను రక్షించడంలో ఆసక్తికలవాడు, రాజ్యం లేనివాడు అయిన ఈ రాముడి ప్రియురాలిని, సీతాదేవిని, కామరూపైన రాక్షసుడు ఎవడో అడవుల్లో భయం లేకుండా దొంగిలించాడు. మేం ఆమెను వెతుక్కుంటూ అడవుల్లో తిరుగుతుంటే, ఒకచోట, శాపంవల్ల రాక్షసుడైన ఒకడు, సీతాదేవి జాడ తెలుసుకోవడానికి సుగ్రీవుడనే వానర రాజు సమర్థుడని, అతడి సహాయం తీసుకోమనీ చెప్పాడు. ఇలా చెప్పి అతడు స్వర్గానికి పోయాడు. ఇది వాస్తవంగా జరిగిన విషయం. ఈ కారణాన నాకు, రామచంద్రమూర్తికి, సుగ్రీవుడే ఇక దిక్కు వానరేంద్రా!. సర్వలోక రక్షకుడై, పూర్వం అనేక దానాలు చేసి, దాత అని పేరెన్నికగన్న రామచంద్రమూర్తి ఇప్పుడు తనకు సూర్యుడి కొడుకు దిక్కని అనుకుంటున్నాడు”.

         “దీనరక్షకుడు, అనేక ధర్మాలను రక్షించిన వాడు దశరథుడు. అలాంటివాడి కుమారుడు రక్షకుడైన వాడు కీసరాజు శరణుజొచ్చాడు హనుమంతా! లోకాలన్నిటికీ రక్షకుడు, శరణు చోర యోగ్యుడు, నా గురువు అయిన ఈ రామచంద్రమూర్తి సూర్యపుత్రుడి శరణు కోరగా వచ్చాడు. ఎవరి అనుగ్రహం వల్ల ఈ భూలోకంలోని జనులందరకీ సుఖం కలుగుతుందో, అలాంటి ప్రభువు శ్రీరామచంద్రమూర్తి వినయంగా కోతిరాజు అనుగ్రహం కోరుతున్నాడు. సమస్త సద్గుణ సంపత్తితో పూజ్యులైన రాజులు ఎవరితో గౌరవించబడుతున్నారో అలాంటి ఉత్తమదాత దశరథనందనుడు, రాముడు అని లోకంలో కీర్తికాంచినవాడు, క్రోతిరేడు శరణు కోరుతున్నాడు. మంచి కీర్తి సంపాదించిన యితడు శోకవశుడైసుగ్రీవుడి శరణుజొచ్చాడు”.


         లక్ష్మణుడు ఇలా చెప్పగానే, రెండు కళ్లల్లో నీళ్లు కాలవల్లాగా కారుతున్న అతడిని చూసి, హనుమంతుడు, “ఈ పరాక్రమం, ఈ ఇంద్రియ జయం, ఈ బుద్ధి సంపద, ఇలాంటి సదాచార సంపత్తికల మిమ్మల్ని తన అదృష్టం కొద్దీ సుగ్రీవుడు చూశాడు. సజ్జన స్తోత్ర పాత్రమైన నడవడి కలవారా! ఇక సుగ్రీవుడి చరిత్ర చెప్తాను వినండి” అంటూ చెప్పసాగాడు. “తన అన్న అయిన వాలి పగపట్టి, బాధపెట్టి, ఊరు వెడలగొట్టి అతడి భార్యను అధర్మ పద్ధతిలో హరించడం వల్ల అడవుల్లో కీడు దశ అనుభవిస్తున్నాడు సుగ్రీవుడు. సీతాదేవిని వెతికే పనిలో మాలాంటి కోతులను రంగంలోకి దింపి మీకు తప్పక సహాయం చేస్తాడు”.

         ఇలా చెప్పి సుగ్రీవుడిని చూడడానికి పోదాం రమ్మని రామలక్ష్మణులను అడిగాడు. అప్పుడు లక్ష్మణుడు సంతోషంగా హనుమంతుడిని పొగిడి, రామచంద్రమూర్తితో “అన్నా! హనుమంతుడు యదార్థం చెప్తున్నాడు. సుగ్రీవుడికి నీతో పని వుంది. కాబట్టి సంతోషించు. నీ కార్యం కూడా నెరవేరిందని భావించు. ఇతడు చెప్పింది ఎంతవరకు నిజమని, నమ్మడం ఎలాగని అంటావేమో? మోసగాళ్లలో వుండాల్సిన గుణం ఒక్కటి కూడా ఇతడిలో లేవు. మోసపు మాటలు చెప్తే, ఇంగితంతో వాస్తవ విషయం తెలుసుకోవచ్చు. ముఖంలో వికారం కనిపించలేదు. ఒకవేళ యితడు చెప్పింది అబద్ధమైతే దానివల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. పనైతే అయింది...లేకపోతె లేదు”.

         “ఇప్పుడు మనం వున్న స్థితికంటే తక్కువ స్థితికి పోము. ఆయన మాట్లాడేటప్పుడు ముఖం ఒక విధంగా ప్రసన్నంగా వుంది. మాటలేమో సంతోషంగా కార్యసాధకుడిలాగా వున్నాయి. సందేహించడానికి తావులేకుండా స్పష్టంగా సాదుభావంతో ప్రసంగిస్తున్నాడు. ఈ ఇంగితాల ఆధారంగా యితడు మోసగాడు కాదని నా అభిప్రాయం. కాబట్టి హనుమంతుడు కోరినట్లు మనం సుగ్రీవుడి దగ్గరికి పోదాం”. అని లక్ష్మణుడు చెప్పగా రామచంద్రమూర్తి అలాగే చేద్దామన్నాడు. అప్పుడు ఆంజనేయుడు తన సన్న్యాసి రూపాన్ని వెంటనే వదిలాడు. తన కోతిరూపాన్ని ధరించి రామలక్ష్మణులను ఇద్దరినీ భుజాలమీద ఎక్కించుకుని, తాను వచ్చిన సుగ్రీవుడి కార్యం నెరవేరిందికదా అనుకుని, సంతోషంగా, నిర్మలమైన మనస్సుతో మహావేగంగా తీసుకునిపోయి, సుగ్రీవుడు తిరుగుతున్న చోట దించాడు. 

Wednesday, December 18, 2019

The Valmiki Ramayana-4 .... Bala Kanda Dasharatha getting prepared to perform Ashvamedha Yagam : Vanam Jwala Narasimha Rao


The Valmiki Ramayana-4
Bala Kanda
Dasharatha getting prepared to
perform Ashvamedha Yagam
Vanam Jwala Narasimha Rao

(My 10-year-old granddaughter Kanak Vanam who lives in Redwood City, San Francisco, USA is a voracious reader even at this tender age. On seeing me writing Ramayana in Telugu whenever I come to USA, she asked me can’t it be in simple English so that she too can have the benefit of reading Ramayana. Once the same question was raised by my other granddaughters Mihira and Medha. Then I decided to do my best to write in English, as simple as possible. I made Kanak to read first couple of paragraphs and confirmed that she understands. Hence this weekly serial for her and for children of her age group)    

            Dasharatha decided to perform the Vedic Ritual, Ashvamedha Yagam. Along with this Dasharatha wanted to perform “Putra Kameshti” ritual also to beget children. As a prelude to Putra Kameshti he wanted to perform Ashvamedha first. King Dasharatha requested sage Rushyasrung to conduct the Vedic ritual on his behalf as he wished to beget offspring for preserving his family lineage. Rushyasrung replied that the paraphernalia for ritual could be gathered and the ritual horse could be released as a right. Brahman scholars and sage Vasishta applauded king Dasharatha for keeping Rushyasrung at the helm of affairs. They also blessed him that his intention to beget sons through Vedic Ritual will be fulfilled and he will get four sons with great qualities.

Vasishta commencing works related to Ritual
            On completion of one full year and on arrival of another spring season King Dasharatha came to Vasishta and informed him that the horse returned successfully. The performer of such Rituals is expected to perform the preliminary ritual for a period of one year which is now completed. Dasharatha requested Vasishta that the ritual be performed systematically and conducted in such a way that no obstacle of what so ever it might be, occurred. Vasishta assured all his support and confirmed that whatever that is requested or decided by the king would be materialized.

Vasishta nominates Sumantra for inviting kings
            Vasishta told Sumantra about the activities that he needs to attend on his own for the ritual. Vasishta told that all those kings on the earth were to be invited. He also told to extend invitation to Brahmins, Kshatriyas, Vaisyas and Sudras in large numbers. On hearing that word of Vasishta, Sumantra expeditiously ordered sincere emissaries to invite all those kings to their kingdomKings from different parts of the earth arrived to Ayodhya responding to the invitation from Dasharatha. They came with rich gifts in tune with their ability and on knowing this Dasharatha felt very happy. 

Ashvamedha Yagam commences
            Then after completion of one year and on retrieval of the ritual horse, Dasharatha commenced the Vedic Ritual Ashvamedha Yagam on the northern banks of River Sarayu. Knowledgeable performers of Vedic rituals called Ritwiks started works relating to ritual as per standards, and conducted them traditionally and customarily. Brahmans have traditionally performed all of those other rituals connected to the main one methodically. All these were performed under the leadership of Rushyasrung and joined by other Ritwiks. The king Dasharatha smelt the smell of smoke as per time and procedure to cleanse his own sin. On completing the ritual Dasharatha justifiably donated those lands to the Ritwiks.

Dasharatha commences Putra Kameshti
            Rushyasrung agreed to the request of King Dasharatha to conduct the Putra Kameshti ritual that bestows sons. Then Rushyasrung commenced the Putra Kameshti offering necessary oblations into sacred fire. When this was done, the heavenly divinities along with celestial beings like Gandharvas, Siddhas, Devatas, esteemed sages etc. came along with Lord Brahma and assembled there to receive their part of oblations from the ritual of Dasharatha.     
  


Gods and Goddesses pleading
Brahma to save them from Ravana
            The heavenly divinities, he Gods and Goddesses who assembled there in the congregation pleaded Brahma like this: “Oh! Lord Brahma! With your benedictions and blessings, the monster king Ravana is torturing all of us ostensibly with the courage he got that none can do anything to him. We are incapable to control him. You gave him a boon that he has no death in the hands of heavenly bodies like Devatas and with due respect to your boons we are tolerating all his acts and not killing him. He is torturing not only us, the celestial beings, but also all the three worlds. His desire is to dethrone Lord Indra from heaven. Under the guise of your boons he is indiscriminately harassing the Yakshas, Gandharvas, Asuras, Brahmins and so on”.

            In reply to them Brahma said, Ravana got boon and approval from him that he shall not be killed by Yakshas, Gandharvas, Asuras, Gods or by other demons but did not care humans and monkeys out of disrespect to them. And that is why he shall be killed by human only. Then all the Devatas and Gods and Goddesses pleased with the assurance of Brahma.

Arrival of Lord Vishnu in front of Devatas
         Meanwhile, Lord Vishnu arrived there on his Eagle chariot Garatmanth, in front of Devatas obviously to assure them that he will take care of them. On his arrival and on his standing by the side of Lord Brahma, all the Gods and Goddesses offered prayers to him. Later they briefed Vishnu about their panics.  

Devatas mention Vishnu about the plights faced by them
            They told Lord Vishnu about their plights like this. “Oh! Vishnu, the Leader of entire universe! Please take birth as human being through the wives of King Dasharatha and eliminate Ravana in war failing which he will eliminate all of us. Ravana has been torturing all of us along with sages and saints, Gandharvas, Siddhas etc. He knocks down the chariots of Gandharvas and Asuras as well as other Gods while they were on their journey from place to place. We are all here to request you to annihilate enemies of divinity like Ravana, the monster king, and hence you make-up your mind to born as a human being”.

Vishnu’s assurance to Devatas
            When Lord Vishnu was eulogized this way by the Gods and Devatas, he told them to get rid of their fear first. Vishnu assured that he will kill the cruel and evil-minded Demon King Ravana along with all his near and dear. Subsequently Vishnu started giving a thought about founding a base for his birth as human being and also about the person who deserves to have him as his son. Vishnu finally decided on King Dasharatha and manifest himself in four forms. Having understood the thought process of Lord Vishnu, all the celestial bodies including Lord Shiva and Brahma praised Vishnu and offered prayers with a request to eliminate Ravana.

Devatas praying Lord Vishnu to incarnate as human
            Vishnu elicited the view and idea of Devatas as to how he should incarnate himself and how he should adopt the strategy so that he will be able to kill Ravana. They all suggest him that it should be in form of human being and he should assume the same. They told him that, “Ravana performed ascesis, severe penance, for several years with which Lord Brahma became very glad. Having fully satisfied with Ravana’s penance, he gave a boon to him that he shall not have fear of death from anyone except human beings, since Ravana did not care them dubbing them as inferiors. Having got this unequivocal boon from Brahma Ravana became extremely arrogant and started torturing the three worlds which included abducting women. Hence his annihilation lies in the hands of humans alone”. On hearing this from Gods, Lord Vishnu decided to choose Dasharatha as his father in the human world. 

Saturday, December 14, 2019

హనుమంతుడిని ప్రశంసిస్తూ లక్ష్మణుడికి చెప్పిన రాముడు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-8 : వనం జ్వాలా నరసింహారావు


హనుమంతుడిని ప్రశంసిస్తూ లక్ష్మణుడికి చెప్పిన రాముడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-8
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (15-12-2019) 
         శ్రీరాముడు హనుమంతుడిని ప్రశంసిస్తూ లక్ష్మణుడితో ఇలా అంటాడు. “లక్ష్మణా! ఇతడిని సామాన్యుడిగా భావించవద్దు. గొప్ప మనసున్న సుగ్రీవుడికి ప్రీతిపాత్రుడైన మంత్రి. ఇతడి మీద ఎంతో నమ్మకముంటేనే కదా, మనదగ్గరికి ఇలాంటి పనిమీద పంపాడు? మనం ఏ సుగ్రీవుడిని చూడాలని పోతున్నామో, అతడి మంత్రే ఈ రూపంలో మనదగ్గరికి వచ్చాడు. అంటే, సుగ్రీవుడితో ఏ పనైతే అవుతుందని అనుకుంటున్నామో, అది ఇతడిద్వారానే జరుగుతుంది. ఆయన్ను మనం ఎలా నమ్మవచ్చో ఇతడిని కూడా అలాగే నమ్మవచ్చు. ఆయనకూ, ఇతడికీ భేదం లేదు”.

         (హనుమంతుడు ఆచార్యపదవికి తగినవాడని శ్రీరామచంద్రమూర్తి ఆయన యోగ్యతను గురించి చెప్పాడు. ఆచార్యుడు వేదం తెల్సినవాడిగానూ, విష్ణుభక్తుడుగానూ, మాత్సర్యం లేనివాడుగానూ, విష్ణుమంత్రం తెలిసినవాడుగానూ, ఆ మంత్రం మీద భక్తికలవాడుగానూ, మంత్రార్థం ఇతరులకు చెప్పగలిగినవాడుగానూ, బాహ్యాభ్యంతరాలలో నిర్మలమైనవాడుగానూ, గురుభక్తికలవాడుగానూ, పురాణాల జ్ఞానంకలవాడుగానూ వుండాలి. ఇలాంటివాడినే ఆచార్యడు అంటారు. ఈ గుణాలు హనుమంతుడిలో వున్నాయని శ్రీరాముడు చెప్తున్నాడు లక్ష్మణుడితో).

         “లక్ష్మణా! యితడు అడిగిన ప్రశ్నలకు నువ్వు జవాబు ఇవ్వు. యితడు మాటల పొందిక శాస్త్రసరణి తెలిసినవాడు. ఆయన యోగ్యతకు తగ్గట్లు మనం మాట్లాడకపోతే మనం మూఢులమని ఆతడు భావిస్తాడు. కాబట్టి నువ్వు మాట్లాడే మాటలు స్నేహం కలవడానికి, వింటానికి ప్రియంగా వుండాలి. ఏ విషయం ఎలా చెప్పాలో అలాగే చెప్పు. ఎందుకింత హెచ్చరికగా చెప్తున్నానంటావా? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం చక్కగా వల్లించి ధృఢంగా మనస్సులో నిలిపినవాడే ఇతడిలాగా మాట్లాడగలడు. అలా అని ఇతడిని చాంధసుడు అని భావించవద్దు. శిక్షావ్యాకరణాలు చక్కగా పఠించినవాడు. వ్యాకరణాన్ని ఎన్నోమార్లు వల్లించి కంఠస్థం చేశాడో కాని, నేనెంత పరీక్షించి చూసినా, ఇతడి మాటల్లో వ్యాకరణ విరుద్ధమైన ప్రయోగం ఒక్కటైనా కనబడలేదు. అంతేకాదు....మాట్లాడే తీరు చూస్తే, శిక్షను కూడా పఠించినవాడుగా వున్నాడు. ఎంతసేపు మాట్లాడినా, కళ్లల్లోకానీ, ముఖంలో కానీ, నొసటకానీ, కనుబొమలలోకానీ ఒక్క దోషమైనా కనిపించలేదు”.


         “ఇతడి మాటల్లో గొతుకులు లేవు. వ్యర్థపదాలు లేవు. ఈ అర్థమా? ఆ అర్థమా? ఇది ఈ పదమా? ఆ పదమా? అన్న సందేహం రాదు. గబగబా పరుగెత్తడం లేదు. మెల్లగా నీళ్లు నమలుకుంటూ మాట్లాడిందీ లేదు. తొస్సులు లేవు. ఉరం, కంఠ౦ నుండి మాట వచ్చింది కాని, బిగ్గరగా అరిచింది లేదు. వినవచ్చీ, వినపడకుండా గొణగడం, పెదవులతో మాట్లాడడం లేదు. ప్రతిపదం వ్యాకరణ శుద్ధక్రమాన్ని అనుసరించి వుంది. శుభంగా, మనోహరంగా వుంది. ఉదాత్తానుదాత్త స్వరితాలతో కూడిన ఇతడి చిత్రమైన మాటలు, ఇతడిమీద కోపంతో కత్తిపైకెత్తిన వాడినికూడా సంతోషపెట్తుంది. ఇక అనుకూలమైన వారి వేరే విషయం చెప్పాలా? రాజైనవాడు ఇలాంటి దూతను సంపాదించకపోతే ప్రారంభించిన పని ఎలా పూర్తవుతుంది? అతడు కార్యసాధకుడన్న కీర్తిని ఎలా సంపాదించగలడు? ఇలాంటి గుణసమూహాలు కల దూత ఏ రాజుదగ్గర వుంటాడో, అతడి పనులన్నీ దూతవల్లే సఫలం అవుతాయి”.

         (దీనర్థం: తాను సుగ్రీవుడితో స్నేహం చేస్తే తన పని హనుమంతుడి వల్లే సఫలం అవుతుందని రామచంద్రమూర్తి నిశ్చయించుకున్నాడు. వాక్యజ్ఞుడు లక్ష్మణుడు, వాక్యజ్ఞుడు హనుమంతుడు అని శ్రీరామచంద్రమూర్తి చెప్పడం అంటే, ఈ గుణాలన్నీ లక్ష్మణుడిలో, హనుమంతుడిలో-ఇద్దరిలో- కలవనీ, ఇద్దరూ సమానులే అనీ భావం).

         శ్రీరామచంద్రమూర్తి ఈ విధంగా చెప్పడంతో, వాక్యజ్ఞుడైన లక్ష్మణుడు వాక్యజ్ఞుడైన హనుమంతుడితో ఇలా అన్నాడు. “అయ్యా! పండితుడా! సుగ్రీవుడి గురించి, అతడి ప్రభావం గురించీ, అతడి గొప్ప గుణాలను గురించీ, మేం ఇదివరకే విన్నాం. కాబట్టే ఆయన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం. నువ్వు చెప్పిన సుగ్రీవుడి పనిని మేం సంతోషంతో నువ్వు చెప్పినట్లే చేయగలం”.

ఇలా లక్ష్మణుడు చెప్పగానే హనుమంతుడు సుగ్రీవుడి జయం కోరుతూ రామసుగ్రీవులకు స్నేహం కుదర్చాలని అనుకున్నాడు.

Wednesday, December 11, 2019

The Valmiki Ramayana-3 .... Bala Kanda...Initiating the story of Sri Ramayana : Vanam Jwala Narasimha Rao


The Valmiki Ramayana-3
Bala Kanda
Initiating the story of Sri Ramayana
Vanam Jwala Narasimha Rao

(My 10-year-old granddaughter Kanak Vanam who lives in Redwood City, San Francisco, USA is a voracious reader even at this tender age. On seeing me writing Ramayana in Telugu whenever I come to USA, she asked me can’t it be in simple English so that she too can have the benefit of reading Ramayana. Once the same question was raised by my other granddaughters Mihira and Medha. Then I decided to do my best to write in English, as simple as possible. I made Kanak to read first couple of paragraphs and confirmed that she understands. Hence this weekly serial for her and for children of her age group)   
 
Valmiki composed twenty-four thousand stanzas and taught them to Lava and Kusha, the sons of Rama and Sita. They both sing the ballad among the groupings of sages and saints, and win laurels. Rama on hearing that the boys are singing on the streets of Ayodhya, brings them to his palace, and summons all his brothers and ministers to listen to the ballad. Rama himself was astonished as the ballad sung by these youngsters narrates the legend of Sita. But he paid his attention to listen the 'Legend of Sita.

The story of Raghu Rama who incarnated in human form on the earth itself is Ramayana. Spread over the entire universe, the Sri Ramayana is an accomplished one to make everyone holy and pious. Reading Ramayana is nothing but serving the Sri Rama himself. Reading Ramayana ensures wiping out of all sins, provides virtue to those who desire to be virtuous, provides funds to those who have ambition to accumulate wealth, provides lust to those who have desire for lust. Valmiki starts telling the Rama story right from his birth till his holy demise being empowered to do so by Lord Brahma.

Ayodhya
            In the Kosala country adjoining River Sarayu where all the people lived happily, there was a glorious city with well-devised royal highways called Ayodhya. The city was surrounded with gateways and archways. This greater Ayodhya with its natural beauty in all aspects overtakes the famous Lakhimpur. The city can be compared with heavenly capital Amaravati. As the God manifested in the form a human being there the city came to be known as Ayodhya. Wherever there is God Mahavishnu that itself is the paradise and, in his service, there is Nirvana. The Ayodhya was ruled by king Dasharatha who belongs to the Ikshvakas dynasty and was supposed to be greatest of all his ancestry.   

            Ayodhya is encompassed with Vedic scholars who always worship the ritual fire. The Brahmins of Ayodhya were known for charity and they used to donate all their wealth as and when anybody asks for. None of them had any necessity to beg or borrow from anyone. Reciting of sacred theology, the Vedas was their everlasting routine.

            The Kshatriyas, evincing keen interest in the teachings of Brahmins were leading their lives and turned towards the Brahmans, the scholarly class, for intellectual and religious support. The trading class Vaisyas were supportive of king and helped in improving state’s economy. The Sudras the working class, while performing its own duties, was always working for the other castes. Totally distancing themselves to cheating, theft etc. they were serving the Brahmins, Kshatriyas and Vaisyas and were concentrating on their hereditary professions.  

The city Ayodhya was well protected by the king from Ikshvakas dynasty namely Dasharatha. The ministers of king Dasharatha were intelligent, religious, virtuous, believers in justice, capable, fighters, valorous, noble, courageous and so on. They made the rulership meaningful with their virtuous, skillful and efficient administration. Accompanied with such of those effectual and good-natured ministers the illustrious king Dasharatha ruled the earth.


In fact, without any distinction everyone who lived in Ayodhya were good in every aspect. In the glorious city of Ayodhya all are exuberant and virtuous ones, and scholars are learned ones, people are satisfied with their own riches, they have no greed, and they advocate truthfulness alone.

Dasharatha plans to perform
Ashvamedha Yagam in pursuit of children
            King Dasharatha had three wives namely Kousalya, Sumitra and Kaikeyi. They were daughters of king of Kosala, king of Magadha and king of Kekaya respectively. Despite having enormous wealth and everything at their doorstep, Dasharatha and his three wives were not begotten with children. Any many rituals appeasing gods that they performed did not help in this regard. One day he tells his ministers that he intends to perform an elaborate Vedic ritual, Ashvamedha Yagam, the horse sacrifice, as enshrined in the scriptures to beget children. He also elicits their opinion with a request to show him a way out to get children. His proposal to perform Ashvamedha Yagam gets support from all including Sage Vasishta, Royal Priest.

Brahman scholars along with Sage Vasishta and all other important personalities in their turn have blessed and honored king Dasharatha. Saying that any activity undertaken by great, honest and candid persons like him would be successful, the ministers assured king Dasharatha that they would stand by him.

At this point of time minister Sumantra told king Dasharatha that he would give an idea to him to have children. He advised Dasharatha to invite sage Rushyasrung to fulfill his desire of having children. Sumantra, detailed the importance of Sage Rushyasrung and beseeched the king to invite that sage to preside over the planned Vedic ritual, for that Sage's entry into any kingdom is auspicious for that land and people.

Dasharatha invites Rushyasrung
            Dasharatha on hearing the advice given by his minister Sumantra in turn briefed his Royal Teacher and Chief Priest Vasishta about it. Vasishta said that what all told by Sumantra is true and suggested Dasharatha to heed to his advice. Dasharatha went to Rushyasrung and requested him to come to Ayodhya and after his acceptance to come along with his wife Shanta, Dasharatha made all arrangements.

Dasharatha entered Ayodhya along with Rushyasrung
            Citizens of Ayodhya on knowing the arrival of their king Dasharatha along with sage Rushyasrung, became jubilant and in accordance with the commands of king decorated the city gorgeously. On reaching his inner palace chambers king Dasharatha worshipped Rushyasrung and made him comfortable. He was also very happy as his devotions are now becoming a reality and he would soon have children. For the excellent treatment he had sage Rushyasrung also felt immensely pleased.