Monday, December 9, 2019

ఆంధ్రవాల్మీకి రామాయణం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ కాండ: ‘మందర మకరందం’ పుస్తకాలు ఉచితం : వనం జ్వాలా నరసింహారావు


ఆంధ్రవాల్మీకి రామాయణం
బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ కాండ
‘మందర మకరందం’ పుస్తకాలు ఉచితం
వనం జ్వాలా నరసింహారావు
అనువక్త-వాచవిగా నేను రాసిన ఆంధ్రవాల్మీకి రామాయణం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర కాండ ‘మందర మకరందం’ పుస్తకాలను దర్శనమ్ ఆధ్యాత్మిక మాసపత్రిక, ఆ పత్రిక సంపాదకుడు మరుమామిళ్ళ వెంకటరమణ శర్మగారి సౌజన్యంతో, కోరమాండల్ సీతారామయ్యగారి ఆర్ధిక సహాయంతో ప్రచురించడం జరిగింది. వీటితో పాటే ధర్మధ్వజం అనే ఆధ్యాత్మిక పరమైన వ్యాసాల సంకలనాన్ని కూడా వారు ప్రచురించారు. ఇప్పుడు యుద్ధకాండ మందర మకరందం ప్రచురణకు సిద్ధంగా వుంది. దాన్ని కూడా దర్శనమ్ ఆధ్యాత్మిక మాసపత్రిక, ఆ పత్రిక సంపాదకుడు మరుమామిళ్ళ వెంకటరమణ శర్మగారి సౌజన్యంతో, కోరమాండల్ సీతారామయ్యగారి ఆర్ధిక సహాయంతో ప్రచురణ కాబోతున్నది.ఈ అన్ని పుస్తకాల మూలం ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు) గారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరాలు మూలం.


ఆ విధంగా పదహారు సంవత్సరాల నా సుదీర్ఘ యజ్ఞం పూర్తయింది. 2003 లో మా రెండో అమ్మాయి కిన్నెర సిన్సినాటి (అమెరికా) లో వున్నప్పుడు దాని కూతురు ప్రసవ సమయంలో సహాయంగా వుండడానికి  దంపతీ సమేతంగా వెళ్లిన నేను హైదరాబాద్ లో మొదలుపెట్టిన సుందరకాండ మందర మకరందం పుస్తకాన్ని పూర్తిచేసాను. దరిమిలా మిత్రుల, సన్నిహితుల ప్రోత్సాహంతో నేటికి అన్ని కాండలు పూర్తిచేయగలిగాను.

ఈ పుస్తకాలు ఏవీ అమ్మకానికి లేవు. అన్నీ ఉచితంగా ఇవ్వడానికే వున్నాయి. ఓపిక చేసుకుని నన్నుకానీ, (80081 37012) లేదా దర్శనమ్ సంపాదకుడు మరుమామిళ్ళ వెంకటరమణ శర్మగారిని కానీ (94410 15469 లేదా 70130 93123) ఫోన్లో సంప్రదించి, ఓపిక చేసుకుని మా ఇంటికి (ఫ్లాట్ నంబర్ 502, వాసవీ భువన అపార్ట్మెంట్స్, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్-500073) వస్తే (జనవరి నెలనుండి) వాటిని తీసుకుపోవచ్చు. దర్శనమ్ శర్మగారి ఇంటికి పోయి కూడా తీసుకోవచ్చు. చదవండి, చదివించండి....నచ్చితే ప్రోత్సహించండి.       

No comments:

Post a Comment