Sunday, January 28, 2024

భారతీయ నాగరికత, సంస్కృతి, సంప్రదాయం హిమవదున్నతం, నిత్యనూతనం ..... ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-9 : వనం జ్వాలా నరసింహారావు

 భారతీయ నాగరికత, సంస్కృతి, సంప్రదాయం హిమవదున్నతం, నిత్యనూతనం

ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-9

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (29-01-2024)

         ‘యుగయుగాలుగా ఋషులు దర్శించిన వేదాన్ని వేదవ్యాస మహానుభావుడు సంహితలుగా చేశాడు. వాటిని నాలుగు భాగాలుగా ఏర్పాటుచేసి విభజించాడు. వ్యాసుడు అలా కూర్చిన తరువాత మంత్రద్రష్టలు లేరు. వ్యాసభగవానుడు వేదానికి ఒక పాదం ఏర్పరచాడు. అలా ఏర్పాటు చేసినది మాత్రమే వేదం. ఇందులో చేరనిది వేదం కానే కాదు. మనకు వేదం అని తెలిసింది ‘వేదం సంహిత.’ వీటి కూర్పరి వేదవ్యాస మహర్షి. ఆ విధంగా వేదాన్ని నాలుగు విధాలుగా విభజించడాన్ని వేదచతుష్టయి అంటారు. వేదచతుష్టయి వేదాల విషయ నిర్ణయం చేస్తుంది. వాటిలో, “ఋగ్వేద సంహిత” దేవతల గుణగణాలను స్తుతిస్తుంది. “యజుర్వేద సంహిత” వివిధ యజ్ఞాలను నిర్దేశిస్తుంది. “సామవేద సంహిత” దేవతలను ప్రసన్నులను చేయడానికి గానవిధిని నిర్ణయిస్తుంది. “అథర్వవేదం సంహిత” బ్రహ్మజ్ఞానం సహితంగా అనేకానేక లౌకిక విషయాలను వివరిస్తుంది. వేదత్రయి అని మరొక విభజన కూడా ఉన్నది. ఇది పద్య, గద్య, గేయ విభజన. వేదాలు పద్యంలో దర్శించినవీ, గద్యంలో దర్శించినవీ, గేయంలో దర్శించినవీ, ఉన్నాయి. ఇది ఛందో విభజన.’

         ‘వేదాన్ని దర్శించడానికి వేద దృష్టి కావాలికాని, హ్రస్వదృష్టి, అన్య దృష్టి చాలవు. పరిమిత దృష్టితో అపరిమిత వేదాన్ని దర్శించడం కువ్యాఖ్యానం అవుతుంది. భారత వేదాన్ని భారత కొలమానంలో కొలవాలి. పాశ్చాత్య కొలమానాలు అందుకు పనికికావు. దురదృష్టవశాత్తు వేదత్రయి అంటే, వేదాలు మూడేనని మనను నమ్మించారు పాశ్చాత్యులు. భాగవతంలో “వేదమేకంచతుర్విధం” అని చెప్పబడింది. కాబట్టి మన ప్రమాణాలే ఆధారం. వేద సంహితలు నిర్ద్వందంగా నాలుగేన్నాయి. అవే, “ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద” సంహితలు. యజుర్వేద సంహితలు తిరిగి రెండు భాగాలు. “శుక్ల యజుర్వేద సంహిత, కృష్ణ యజుర్వేద సంహిత.” వేదం “బ్రహ్మ, ఆత్మ, బ్రహ్మ ఆత్మల ఏకత్వం” అనే మూడు విషయాలను ప్రతిపాదిస్తుంది.’

         ‘వేదాన్ని అర్థం చేసుకోవడానికి మహర్షులు ఒక నిర్దిష్ట పధ్ధతి ఏర్పరిచారు. అవి “శిక్ష, వ్యాకరణం, నిఘంటు, ఛందస్సు, జ్యోతిషం, శిల్పం” అనే ఆరు వేదాంగాలు; “గాంధర్వవేదం, ఆయుర్వేదం, ధనుర్వేదం, అర్థవేదం” అనే నాలుగు ఉపవేదాలు. వేదార్థాన్ని గ్రహించడానికి ఉపనిషత్తులు, కణాదుని వైశేషికం, గౌతముని న్యాయం, కపిలుని సాంఖ్యం, పతంజలి యోగం, జైమిని పూర్వ మీమాంస, బాదనారాయణుని ఉత్తర మీమాంస ఉపకరిస్తాయి. వేదవాక్కును అర్థం చేసుకోవడానికి ఐదు దిశలు ఉన్నాయి. ఆన్నమయం (ఇది భౌతికం), ప్రాణమయం (ఇది దృష్టి గోచరం), మనోమయం (ఇది మనసును గ్రహించడం), జ్ఞానమయం (ఇది బుద్ధిని గ్రహించడం), ఆనందమయం (ఇది వేదంలో లీనం కావడం). జీవిత పరమావధి ఆనందమే. ఆనందోబ్రహ్మ’.

         ‘వేదానికి శ్రుతి అని పేరు కూడా ఉన్నది. శ్రుతి అంటే చెవిన పడింది, విన్నది అని అర్థం. వేదం అపౌరుషేయం. అలా అంటే అది మానవుడు చెప్పింది కాదని అర్థం. వేదం మానవుడి కన్నా అతీతమైంది. వాస్తవంగా వేదం మానవ శక్తిని మించినది. అందుకోసం అపౌరుషేయం అనే వాస్తవ సత్యాన్ని వచించారు మహర్షులు. అపౌరుషేయం అనే స్ఫూర్తితోనే అన్య మతాల వారు తమ గ్రంథాలను భగవంతుడే వచించాడు అని చెప్పారు. భగవంతుడు పరాత్పరుడు. జగత్పిత. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ప్రవక్త కావచ్చు. కాని వేరువేరు మతాలకు వేరువేరు భగవంతులు లేరు. ఉండరు. ఉండకూడదు. మానవాళిది ఒకే అదితి భూమి. ఒకే ఆకాశం. ఒకే భగవంతుడు. పరాత్పరుడు, ఈశ్వరుడు, మానవ జాతి సహితంగా సమస్త ప్రాణిజాలానికి అతడే సృష్టికర్త. తల్లి, తండ్రి అన్నీ ఆయనే. అలాంటి పరాత్పరుడు ఒక మతాన్ని నమ్మిన వారి పాపాలు మాత్రమే దూరం చేయడు. వారికి మాత్రమే మోక్షం ఇస్తానని అనడు. అది సత్యానికి దూరం. అసత్యం అవుతుంది.’

         ‘భగవంతుడు సత్య స్వరూపుడు. పరాత్పరునికి అసత్యం అనంత దూరపుది. అంటే ప్రవక్తలు చెప్పి భగవంతుడు చెప్పాడు అన్నారు!! వేదం చెప్పిన అపౌరుషేయం మాత్రమే సత్యం. భగవంతుడు ఒక విశ్వాసపు వారిని మాత్రమే ఉద్ధరిస్తాడనడం బూటకం. అపౌరుషేయం సహేతుకం. మిగతావి నిర్హేతుకాలు! వేదంలో ప్రతిసూక్తి ద్రష్ట పేరు ఋషిగా చెప్పబడింది. అతడు వేదసూక్తపు కర్త కాదు. ద్రష్ట స్మర్త మాత్రమే! అతడు సూక్తాన్ని విన్నాడు. విన్నది కాబట్టి శ్రుతి అయింది. విని దాన్ని అక్షరబద్ధం చేశాడు. వేదం పుట్టిన్నాడే అక్షరం ఉంది. అంతేకాదు శాస్త్రీయమూ, పరిపుష్టమూ, అయిన సంస్కృత భాష ఉంది. ఛందస్సు ఉంది. ఎంతటి నాగరిక జాతి అవుతే సంస్కృతం వంటి భాష ఆవిర్భవించాలి? ఎంతటి సంస్కారం గల జాతి అవుతే సకల ప్రాణులూ సుఖించాలి (సర్వేపిసుఖినస్సంతు) అని నినదించాలి? అన్ని పురాతన నాగరికతలు నశించి పోయాయి. కాని భారత నాగరికత, సంస్కృతి, సంప్రదాయం ఇంకా నిత్యనూతనంగా వెలుగొందుతున్నది. అదీ 1200 సంవత్సరాల పరాయి పాలన తరువాత! ఎంత మహాత్తమమైనదండీ మన దేశం, మన జాతి, మన సభ్యత, మన సంస్కారం, మన సాహిత్యం, మన సంగీతం, మన కళలు?.’

         ‘భారత శాస్త్రం ప్రకారం కాలం అనంతం. కాలం ఎప్పుడు ప్రారంభం అయింది? కాలం ఎప్పుడు అంతం అవుతుంది? ఇది తెలిసినవాడు లేడు. ప్రభువులు, ప్రభుత్వాలు, ఋషులు, ప్రవక్తలూ అందరినీ కాలం మింగేస్తుంది. యుగాలు, అంతం అవుతాయి. ప్రళయం వస్తుంది. మళ్లీ సృష్టి ప్రారంభం అవుతుంది. కాలం నిరంతరం సాగుతూనే ఉంటుంది. కాలమే సృష్టిస్తుంది. కాలమే రక్షిస్తుంది. కాలమే కష్టాలు కలిగిస్తుంది. కాలమే సర్వాన్నీ అంతం చేస్తుంది. కాలం మాత్రం సాగుతూనే ఉంటుంది. కాలానికి నిలకడ లేదు. కాలానికి కళ్ళూ, నోరూ ఉంటే ఎన్ని వాస్తవాలు వెల్లడించగలదో? కాలాన్ని జయించినవాడు లేడు. కాలం అజేయం. అందుకే “కాలోయం బ్రహ్మ” అన్నారు. ఈ కాలానికి నరుడు కొన్ని కొలతలు ఏర్పరచుకున్నాడు. అందుకు భూమి సూర్యుని చుట్టూ తిరిగి వచ్చిన కాలాన్ని సంవత్సరం అన్నాం. అది అంత నిర్దిష్టం కాదు. సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి 365 రోజుల 6 గంటలు పడుతుంది. ఆ ఆరు గంటలు సరిచేయడానికే నెల రోజుల వ్యత్యాసం, అధిక మాసాలు, లీప్ సంవత్సరం మొదలైనవి. అవి ఎప్పుడో కలుపుతాయి. ప్రతి ఏడాదీ జరగదు! మరి దీని నిర్దిష్టత ఏంటి?.’

         ‘నాలుగు యుగాల మొత్తం కాలం 43,20,000 (కృత: 17,28,000, త్రేతా: 12,96,000, ద్వాపరం: 8,64,000, కలియుగం: 4,32,000) సంవత్సరాలు. సృష్టి కాలం 4 కోట్ల 32 లక్షల సంవత్సరాలు. 4000 యుగాల తరువాత ప్రళయం. 4000 యుగాల కాలం సృష్టి ఉండదు. తరువాత సృష్టి మొదలు. సృష్టి ఆది నుండి ఇప్పటి వరకు 195,58,85,120 పైగా సంవత్సరాలు గడిచాయి. కేవలం వందల, వేల సంవత్సరాల చరిత్ర మాత్రమే కలిగిన పాశ్చాత్యుల కొలతలతో వేదకాలాన్ని కొలవడం గజం బద్దతో ఆకాశాన్నీ, బకెట్ తో సముద్రాన్ని కొలవడం లాంటిది. వేదం ఒకసారి పుట్టి ఒకనాటికి ముగిసిన కావ్యం లాంటిది కాదు. అదొక నది, ఒక స్రవంతి, ఒక ప్రవాహం. ఋషులు దర్శించిందాన్నల్లా అక్షరబద్ధం చేస్తూ పోయారు. అందుకే వేదం అనంతం అన్నారు. ఈ అనంత స్రవంతులను వేదవ్యాసుడు సంహితలు చేశాడు. అప్పుడు అది సకల నదులు కలిసిన సముద్రం అయింది. వేదం సముద్రమై సమస్త ప్రాణులకూ సాయపడుతున్నది.’

‘కలియుగం ప్రారంభమై ఇప్పటికి 5100 సంవత్సరాలు. భారతం ద్వాపరాంతం, కలియుగారంభంలో రచించబడింది. ఆ తరువాత వ్యాస రచన భాగవతం. భాగవతంలో వేదసంహితల గురించి చెప్పబడింది. వేదం సంహితలుగా ఏర్పడి 5000 సంవత్సరాలైంది. వేదం ఎప్పుడు ప్రారంభం అయిందీ చెప్పడం సాధ్యంకాదు. ఇంతకాలంగా ఒక నాగరికత, ఒక సభ్యత, ఒక సంస్కృతీ నిలిచి ఉండడం ప్రపంచంలో కనీవినీ ఎరుగని వింత!!.’

‘వేదం సంస్కృత భాషలో ఉంది. సంస్కృతానికి సంబంధించినంతవరకు తొలుత వ్యాకరణం ఆవిర్భవించింది. వ్యాకరణాన్ని అనుసరించి భాష ఏర్పడింది. అందుకే అది సంస్కృతం అయింది. సంస్కృతానికి స్వంత లిపి లేదు. అందుకోసం దేవనాగరి లిపిని ఆవిష్కరించారు మహర్షులు. లిపిని వేరుగా ఆవిష్కరించడానికి కారణం అది అన్ని భాషలకు ఉపయోగపడాలని. దేవనాగరి లిపి పరిపూర్ణమూ, నిర్దిష్టమూ. దీని అక్షరమాలనే, లిపులు వేరైనా, భారతీయ భాషలన్నీ అనుసరిస్తున్నాయి. అక్షరమాలలన్నీ “” తోనే మొదలైతాయి. జీవితం, భాష “అమ్మ”తో మొదలవుతుంది. దేవనాగరి లిపితో ఏ ఉచ్ఛారణనైనా వ్రాయవచ్చు. అంతటి సుసంపన్నమైన లిపిని మన మహర్షులు మనకు అందించారు. వేల సంవత్సరాలుగా ఆ లిపి నిరంతరాయంగా మానవజాతికి అక్షరామృతం ప్రసాదిస్తున్నది.’

‘ఇన్ని వేల సంవత్సరాలుగా సంస్కృతం హిమవదున్నతమై, నిశ్చలంగా సూర్యకాంతి వలె, సజీవంగా నిలిచి ఉంది. ఇందుకు సాక్ష్యం అనంతమూ, అమరమూ అయిన సంస్కృత సాహిత్యం! వేదం, ఉపనిషత్తు, రామాయణం, భారత, భాగవతాలు కాలపు జరా జీర్ణాలను ఎదిరించి నిత్యనూతనంగా విరాజిల్లుతున్నాయి. వేదం తొలినుంచే అక్షరబద్ధం అయింది. దీనికి భాష ఉంది. లిపి ఉంది. ప్రాణం ఉంది. వేదం భూమి, ఆకాశం, వాయువు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల వంటిది. ఇది శాశ్వతం. ఏ ఒక్క సమాజపు సొత్తు కాదు. ఇది సమస్త మానవాళికి చెందింది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సమస్త ప్రాణి జాలానికి వెలుగు ప్రసాదిస్తాడు. వేదం సూర్యుడిలాంటిది. తూర్పున ఆవిర్భవించింది. సకల ప్రాణిజాలానికి కాంతి ప్రసాదిస్తున్నది.

         ‘వేదాన్ని అర్థం చేసుకోవడానికి స్వర జ్ఞానం అవసరం. మన మహర్షులు వేదాన్ని భద్రపరచడానికి మహాయజ్ఞం సాగించారు. వారు వేదపు అక్షరాలకు స్వరం కూర్చారు. స్వరానికి నిర్దిష్టత, శ్రావ్యత, మహిమ కలిగించారు. వేదానికి “ఉదాత్త, అనుదాత్త, స్వరిత, ఏకశ్రుతి” అనే నాలుగు స్వరాలున్నాయి. అర్థాన్ని పరిరక్షించడానికి స్వరం ఉపకరిస్తుంది. స్వరాన్ని బట్టి అర్థం మారుతుంది. వేదం శ్రుతి, అంటే విన్నది. వినసొంపైనది. స్వరయుక్తంగా చదివిన వేదం శ్రావ్యం. మహిమాన్వితం. అక్షరాన్నీ, స్వరాన్నీ ఇంతకాలంగా భద్రపరచిన ఉదాహరణ సృష్టిలో మరొకటి లేదు. తాళపత్ర, భూర్జర పత్రాల మీద వ్రాసుకుని, వాటిని వల్లించి, ఇన్ని వేల సంవత్సరాలు భద్ర పరచడం ప్రపంచ వింతల్లో సర్వ ప్రథమం కావాలి. అక్షరం, నాదయ్తుక్తమైన వేదం జరాజీర్ణాలకు అతీతంగా నిత్య యవ్వనిలా నిలిచి ఉండడం వింత మాత్రమే కాదు, మహత్తు కూడా.’

         ‘ఋషి సూక్తానికి కర్త మాత్రం కాదు. వేదం అపౌరుషేయం. ఋషి ఆ సూక్తానికి ద్రష్ట. స్మర్త మాత్రమే. అతడు ఆ సూక్తాన్ని అతీంద్రియంగా దర్శించి, దాన్ని గుర్తు పెట్టుకున్నాడు. వాస్తవానికి ఎవడూ దేనికీ కర్తకాదు. అన్నింటి కర్త పరాత్పరుడే. అతడు చేయిస్తున్నాడు. మనం చేస్తున్నాం. పరమపిత పరమేశ్వరుడు ఈ జగన్నాటక కర్త, దర్శకుడు. మనమంతా అతడు ఆడించినట్లు ఆడేవాళ్ళమే! మనం కర్తలమే అనుకుంటే మనం అనుకున్నవి అన్నీ కావాలి కదా! అలా కావడం లేదు! ఇది సర్వే సర్వత్ర అనుభవమే!! కాని కొందరు చెప్పడానికి ఇష్టపడరు!! వారు సత్యానికి తొడుగు వేస్తున్నారు. ఋషికి వేషం, వయస్సు ప్రధానం కావు. అతని జ్ఞానమే ప్రధానం. యువకుడైనా జ్ఞాని అయినవాడిని దేవతలు పెద్దగా భావిస్తున్నారు. వేదం ఋషులు అందరూ కూడా అపౌరుషేయానికి ద్రష్టలు, స్మర్తలు కారు.’

‘వేదాల్లో దేవతలను అనేక విధాలుగా చెప్పడం జరిగింది. ప్రాచీనులుగా పుట్టినవారు దేవతలు, ప్రాచీనంగా పుట్టిన వారు మనుష్యులు. సత్యమే దేవతలు. అసత్యం మనుష్యులు. దేవతలందరి స్థానం పృథ్వియే అవుతున్నది. వేదం దేవతలను, మనుష్యులను సమానంగా భావిస్తున్నది. ఋషులు లాంటి నరులు స్వయం కృషితో దేవతలైనారు. వాస్తవంగా వేదం మానవుడిని, అతడి కృషిని, విశ్వాసాన్ని, మహాత్తునూ ఎక్కువగా విశ్వసిస్తున్నది. శుక్ల యజుర్వేద తొలిమంత్రంలో చెప్పిన విధంగా, దైవ సహాయం, ఈశ్వర సంకల్పం అవసరం. ఈ అనంత విశ్వ సత్యాన్ని వేదం ఆవిష్కరించింది. మానవ జీవితానికి కేవలం ఆధ్యాత్మికం కాని, కేవలం హేతువాదం కాని సరిపడవు. మానవ జీవితం ఏకాకి కాదు. అది అనేక విధాల  సమాహారం. వేదం ఈ పరమ సత్యాన్ని గుర్తించింది. దీన్నిం కాదనడం కేవలం వాదన మాత్రమే!’.

(డాక్టర్ దాశరథి రంగాచార్య వేద సంహితల ఆధారంగా)

Saturday, January 27, 2024

A VISION FOR BETTER GOVERNANCE IN TS : Vanam Jwala Narasimha Rao

 A VISION FOR BETTER GOVERNANCE IN TS

Facilitators needed for last-mile connectivity

to ensure every beneficiary avails of schemes

Vanam Jwala Narasimha Rao

The Hans India (28-01-2024)

{For the past 50 days, Revanth Reddy’s ‘People-Centric Governance,’ and the aims, objectives, and policy procedures of schemes were experienced positively by people. People should believe that the ‘Six Guarantees’ are not mere ‘Populistic Schemes,’ but, are ‘Game Changers’ to transform society and uplift the poor. Nonstop continuance of ‘Praja Palana’ or ‘Governance by People’ by CM Revanth Reddy, in ‘Letter and Spirit’ is desirable. They need ‘Field Level PROs’ to ensure every scheme reaches all the right beneficiaries. Many may not know all the intricate details involved in availing a benefit. Hence, the need for PROs at field level, who should be fully equipped to take care of requirements of prospective beneficiaries in all aspects right from creating awareness to availing benefit of any scheme-Editor Comments}

In a democracy, with several hopes, aspirations, ambitions, desires, requirements, passions, problems, and issues, people’s expectations are high. Political Parties make several promises during polls to meet these and to impress on voters. After coming to power their sincere execution is anybody’s guess. People may also have innumerable other daily and occasional needs pertaining to education, health, emergency, obtaining various certificates etc. In addition to these, they may like to seek benefit from some ‘Ad hoc Schemes’ of Government announced from time to time. People appreciate, admire, laud, reward, and award that party, which in their view, fulfilled its promises, not necessarily overnight, but at least phase wise.  

Orthodox way of implementing schemes, devoid of identifying ‘Right Beneficiary,’ and absence of frequent feedback and feedforward mechanism is totally unacceptable to people. A ‘Structural Administrative Machinery’ to elicit ‘Public Opinion’ for midterm evaluation of schemes is not only mere desirable, but also may be indispensable. Supreme Court, six years ago, in a judgment referred to the malaise of duplicate beneficiaries reaping the fruits of welfare schemes meant for genuine deprived classes. It also quoted former PM Rajiv Gandhi who said that, every rupee spent by government, only 15 paise reach the intended beneficiary. Apex Court felt that, a major hurdle is identifying genuine beneficiary. It said that, in spite of significant economic growth since Independence, benefits thereof have not percolated down to the poor and the poorest!!!

Some of us like-minded persons recently met and had a discussion to understand the mind of people or voter in a typical democratic functioning like Indian. On critically analyzing, unique, first of its kind welfare and development measures, of First Telangana Chief Minister K Chandrashekhar Rao, in his two terms in office, which did not help him win election for third term, we got some random clues. However well envisioned scheme that might be, in the process of implementation, possibilities of technical, transparent, and unintentional hitches adversely effected in optimum utilization by eligible beneficiary. It may also be, subject to verification, that, multiple benefits were enjoyed by few, whereas others were unable to enjoy benefit of even one.

In Telangana, people with millions of aspirations gave comfortable mandate to A Revanth Reddy led Congress Party. It established better credibility through ‘More Beneficial Schemes’ like the ‘Six Guarantees.’ Revanth Reddy sworn in as Second Chief Minister of Telangana and formed his cabinet with experienced persons and revamped top level administration machinery, for effective and ‘As Speedy as Possible’ implementation of electoral promises. CM and his team is on the move in right direction for total fulfilment of promises it made.

Governor in Her R-Day address said that the newly elected people’s Government started functioning with full consciousness and is striving with the objective of delivering equal opportunities rendering social justice, and granting freedom to all sections of people. Governor also mentioned that, in the past, people did not know, where to raise their grievances. Hence, for a ‘Better Governance’ it requires establishing a transparent, easy, convenient, and citizen friendly mechanism, that perhaps (only perhaps) hitherto missed, to enable every scheme reaches the right beneficiary followed by proper evaluation. ‘Field Level Public Relations Officers (PROs)’ as Mentors and Facilitators may better suit for this.

People should believe that the ‘Six Guarantees’ are not mere ‘Populistic Schemes,’ but, are ‘Game Changers’ to transform Society and lives of poor as well as invaluable investments for future, to infuse self-assurance in every ‘Telangana Citizen.’ Despite the ‘Per Capita Income’ and ‘GSDP’ is on increase, as claimed, there has not been significant change in the life-style of poor below the poverty line. ‘Six Guarantees’ may perhaps bring up the ‘Below Poverty Line’ people in to ‘Above Poverty Line.’ Nonstop continuance of ‘Praja Palana’ or Governance by people by CM Revanth Reddy, in ‘Letter and Spirit’ is desirable. They may just require ‘Field Level PROs.’

Democratic Governance presupposes teamwork for taking decisions on schemes, and the ways and means to reach them to the really needy beneficiary. The intricacies of the scheme and procedural difficulties in obtaining benefit are seldom addressed. Quite often, leave alone an ordinary citizen, even some Al India Service Officers at different levels were unaware, and rarely there was an attempt to clear doubts in them. To overcome this, in future, a well oriented and trained Field Level PRO who will be a Mentor or Facilitator may be entrusted with the job.      

For the past 50 days Revanth Reddy’s ‘People Centric Governance,’ and the aims, objectives, and policy procedures of schemes were experienced positively by people. In the well-designed ten-day ‘Praja Palana’ details of prospective beneficiaries were systematically enumerated by Government, in a duly filled format. Relevant family details like, Address, Aadhar, Ration Card Numbers etc. were also obtained. Prospective beneficiaries data for ‘Mahalakshmi, Rythu Bharosa, Indiramma Houses, Gruha Jyothi, and Cheyutha’ schemes was documented. Added to these, it is likely that, Government from time to time may announce more welfare schemes benefiting all sections of people of the society. Effective Enabling Mechanism for these schemes reaching prospective beneficiary without gaps should be the job of ‘Field Level PROs.’  

            In Telangana more than 20 million (2 Crores) people live in rural areas and the remaining 15 million (1.5 Crores) live in urban areas according to the 2011 census. Among these one third are illiterates and many more may be computer illiterates. Despite various publicity modes to educate people on various schemes as is being done now and even earlier, many may not be able to know all the intricate details involved in availing a benefit. Hence the need to think of appointing Public Relations Officers at field level, who will be trained systematically and fully equipped to take care of requirements of prospective beneficiaries in all aspects right from creating awareness to availing benefit of any scheme.

            Field Level PRO, a Government Functionary, may be recruited on a temporary basis to begin with, helps from end-to-end prospective beneficiary about various aspects of a scheme, procedure involved in applying, persons whom he or she may have to meet, documents that are required etc. Field PRO plays the role of Mentor, Facilitator, Counsellor, Teacher, Researcher, Mediator, Advocate or in brief as ‘Friend, Philosopher and Guide’ on behalf of the government. With extraordinary versatility at times, they perform a specialized role to meet the specific need of individual like a health or education or an emergency issue.

Logistics are simple. At the rate of one ‘Field Level PRO’ for every 2000 persons to begin with, in rural areas and at the rate of one for every 3000 persons in urban areas, total requirement (rural 10,000 and urban 5000 for a population of 2 Crores and 1.5 Crores respectively) 15,000 PROs. However, population increase may also be taken into consideration and accordingly may change numbers. At the rate of say some Rs 35,000-50,000 per month per PRO, it may cost about Rs 52.5-75 crores per month and Rs 600-900 Crores per annuum on them. Percentage of this small amount in the anticipated expenditure of about Rs 2.15 Lakh Crores for implementing six guarantees is negligible and may perhaps be worthwhile spending.

These PROs may be recruited directly from Colleges, Universities, Professional Colleges from among those who freshly completed Graduation, PG, MBA, Journalism, Law, Public Relations etc. on the ‘Campus Recruiting Basis.’ An independent Autonomous Body may be considered for this purpose. Systematic Training may be imparted in Dr MCR HRD Institute on the basis of ‘Cascading and Multiplication’ training technique, before putting them on the Job. At field level they handle the public image of government. Why not give a thought to this please?

Monday, January 22, 2024

What actually is Prana Pratishtha? : Vanam Jwala Narasimha Rao

 What actually is Prana Pratishtha?

Vanam Jwala Narasimha Rao

Free Press Journal (22-1-2024)

People in general and Ram Bhaktas in particular are going gag an over the historic Prana Pratista of Lord Ram Lulla Mandir in Ayodhya today at 12.20 PM. There are many debates took place for the last several weeks both in the main stream media and on social media and these debates are centred around the Prana Pratista matter. But what actually is a temple’s Prana Pratista as per the Agama Sastra?

Agama Sastra Vidwan, Vedic Scholar and the one who conducted Prana Pratista of many a temple, Borra Vasudeva Charyulu shared his knowledge on the subject. He is now working as the Chief Priest at the Apara Bhadrachala Temple in Mutharam village in Mudigonda Mandal in Khammam district.

Prana Prathishta is not done by any individual, it is done by a selected priest assisted by a team of vedic scholars. As per Adi Sankaracharya, a temple is regarded as a human body. The temple’s main dome is the head, Sanctum Sanctorum is throat, the main Idol is heart, inner light is lamp, compound is stomach, steps are thighs, Gali Gopuram is feet and the temples is Dwaja Sthamba.

Incidentally, in one of his keerthana, Nitya pujalivivo nerichina noho
pratyakshamainatti paramathmuniki ||
Saint Annamacharya also makes a similar comparision. (Here is my regular worship to my lord in front of me.

Body itself is a temple and head is its tower. His graceful glances are like temple lamps to one’s conscience.

Speech itself is Mantra. The buzz of world is like ringing sound of bells. All good tastes are offerings to the God in one’s inner self.

All movements and actions are expressions of conscience. This life is for His service. Deep sighs are like fans to Lord Venkataraya)

The process of actual Prana Pratista will begin with invoking all the five elements, earth, water, air, fire and the light through conducting Brahma Nyasa. The main priest and the team of priests invite Jeeva Kalash into the Kumbham. Curd, Milk, ghee, cow urine are used in the Abhishekha that follows. This ritual will be followed by many Homams such as Vaastu, Akalmasha Prayachitham homam and Raksha Bandanam.

Special Yagnas will be performed to put prana into the main Idol and it will be done by putting the Yantra in place. Each and Every Limb of the Idol is given Prana by chanting of Vedic Mantras and Hymns. The priests then do the Digbandhana so that the prana is there in the Idol forever. This will be followed by special archanas. After Prana Pratista, the priests and Vedic scholars will chant Vedic mantras for the well being of all those present there, the country and the universe. The entire rituals will end with the blessings of priest and Vedic scholar, who pray for the well being of the universe, Sarve Jana Sukhino Bavanthu, Loka Samastha Sukhino Bavanthu!

 

 

సంస్కృతి, నాగరికత, సభ్యతలను యుగయుగాలుగా నిలిపింది వేదం ..... ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-8 : వనం జ్వాలా నరసింహారావు

 సంస్కృతి, నాగరికత, సభ్యతలను యుగయుగాలుగా నిలిపింది వేదం

ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-8

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (22-1-2024)

‘ఆలోచన మాత్రమే ప్రాణులలో మానవుడి విలక్షణత, విశిష్టత, మహాత్తత. మానవుడు తాను గెలిచాను అని అనుకున్నది, ఓటములకు ఒప్పుకున్నది, సాధించినది, సాధించనున్నది, సాధించలేనిది, వీటన్నింటికి యోని, మూలం ఆలోచనే. ఆలోచన అర్థం, అనర్థం అవుతున్నది. న్యాయం, అన్యాయం, సత్యం, అసత్యం, క్రమం, అక్రమం అవుతున్నది. జగత్తులకు కళ్యాణకరం, వినాశకరం అవుతున్నది. అన్నింటికీ మూలం ఆలోచనే కదా! ఆలోచనే శాస్త్రం, విజ్ఞానం, సైన్స్, దృష్టి. చివరకు ఆలోచనే ఆలోచన. వేదం ఆలోచన మాత్రం కాదు. వేదం శాస్త్రాలకు తల్లి లాంటిది. తల్లి ఎంతమంది పిల్లలనైనా ఇవ్వగలదు. కాని, ఎందరు పిల్లలయినా ఒక తల్లిని ఇవ్వలేరు! మానవుడు వాస్తవాలపై జీవించడం లేదు. సృష్టి ప్రారంభమై కోట్ల సంవత్సరాలు దాటిపోయినది. ఇంత సుదీర్ఘ కాలంలో శాస్త్రం, సైన్స్, ఏదేదో కనుగొన్నానని మానవుడు విర్రవీగుతున్నాడు. కాని నాటి నుండి నేటివరకు మనిషికి ‘జీవితం’ అనే పదం కూడా  అర్థం కాలేదు. అర్థం చేసుకొవడానికి ఎంతో కాలం పరుగులు సాగినవి. నేడు అవి ఆగినవి.

‘యాంత్రిక నాగరికత మనకు వర్తకం, వాణిజ్యం, వ్యాపారం లాంటి వాటిని ఎన్నింటినో నేర్పినప్పటికీ జీవించడం మాత్రం నేర్పలేదు. పోనీ నేర్పడం నిలిపి వేసినది అందాం. జీవితం అనేది గొప్ప విషయం. అది విలక్షణం, విశుద్ధం, విశ్వాత్మకం. బ్రతుకును గురించి తెలిసినవాడు లేడు. మనం గాలి వల్ల బ్రతుకుతున్నామా? నీటి వల్ల బ్రతుకుతున్నామా? కుటుంబం వల్ల బ్రతుకుతున్నామా? సమాజం వల్ల బ్రతుకుతున్నామా? ఏమో? ఏమిటో? ఏదో? అన్నింటి కలయిక, కూడిక, సమాహారం వల్ల  బ్రతుకుతున్నామా? అట్లయితే మనం పోయినా అవి పోవడం లేదే? ఆధునిక సైన్స్ సామాన్యుడి ఆలోచనలను అంతమొందించింది. తాను చెప్పిందే నమ్మమన్నది. సామాన్యుడిలో సైన్స్ మూఢనమ్మకాలను కలిగించింది. ఎలా అంటే, నేటి సైన్స్ సైన్సుగా లేదు. సైన్స్ వ్యాపారమైంది. వాణిజ్యానికి ప్రచార సాధనమైంది. అది సామాన్యుడిని ముంచింది. ఆస్పత్రులే జీవితం అని భ్రమింప చేసింది. మనం ఆ భ్రమలోనే బతుకుతున్నాం.

‘మనిషి గాలి, నీరు, ఆహారం మీద మాత్రమే జీవించడం లేదు. అతడు ‘విశ్వాసం’ మీద జీవిస్తున్నాడు. విశ్వాసానికి హేతువు ఉండదని కాదు. కాని దాన్ని వెతకడానికి ఈ ముష్టి బతుకు చాలదు. వేదం విశ్వాసం. వేదం అపౌరుషేయం. భగవంతుడు ప్రసాదించినది. ఆ విశ్వాసమే ఈ జాతి సంస్కృతిని, నాగరికతను, సభ్యతను ఇన్ని లక్షల సంవత్సరాలు నిలిపి ఉంచినవి. అంత మాత్రాన అర్థం తెలిసికొనరాదను నియమం లేదు. జ్ఞానం సూర్య తేజం లాంటిది. దానిని మూసి వుంచే శక్తి ఎంతటి వారికీ లేదు’.

‘వేద మంత్రంలో సంపద కొరకు వాయువును ఆరాధించమన్నాడు. వాస్తవానికి వాయువే కదా సకల సంపదలకు కారణం. వాయువు మాత్రమే కాకపోవచ్చును. వాయువు కూడా కావచ్చును. వాయువే అని ఒక పరిశీలన. మరో మంత్రంలో అపానములాను గురించి చెప్పాడు. పిండోత్పత్తికి అవి కారణం అంటున్నాడు. అదే సత్యమా? మరో మంత్రంలో దీర్ఘ రోగాలకు,  చికిత్సకు వాయువే కారణం అంటున్నాడు. యోగవైద్యంలో చాలావరకు శ్వాసను నియంత్రించే ప్రక్రియ వల్ల రోగం నివారించబడుచుతున్నది. జల చికిత్స లాంటివి ఆధునిక వైద్యంలో వున్నాయి. ఇది వాయు చికిత్స కావచ్చు. ఇది మాత్రమే చికిత్స అంటే అది వేరే విషయం. ఇంకో మంత్రంలో బలి గురించి చెప్పబడింది. బలి మానవుడి విశ్వాసం. అరిషడ్వర్గముల బలి జ్ఞాన మార్గం. మానవుడు తొలిగా నరబలితో ప్రారంభమైనాడు. బలి త్యాగానికి సంకేతమా? నరబలి నుండి నారికేళ బలి వరకు మనం ఎంత దూరం పయనించాం!!!’.

         ‘వేదం ఏకవచనం. వేదం పవిత్ర విద్య అని అథర్వ వేదం, శతపథ బ్రాహ్మణం, తైత్తరీయ బ్రాహ్మణం చెపుతున్నాయి. అందువల్ల వేదం పవిత్ర విద్య అవుతున్నది. ఇక పోతే, వేదాః అంటే వేదములు. ఇది బహువచనం. వేదాలు నాలుగు. అవి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, బ్రహ్మవేదములు. బ్రహ్మవేదానికే అథర్వణ వేదం అని పేరు. వేదాలు: సంకల్పం, రహస్యం, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, వ్యాఖ్యానాలు, పురాణాలు, స్వరాలు, సంస్కారాలు, నిరుక్తాలు, అనుశాసనాలు, అనుమార్జునాలు, వాక్కు, వాక్యం సహితంగా నిర్మించబడినాయి. వేదాలు ప్రజాపతి సంబంధాలు. ప్రజలను సృష్టించి పోషిస్తున్నాడు కాబట్టి ప్రజాపతి అయినాడు. ప్రజాపతి సృష్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు. ప్రజాపతి ఏ ఒక్కడూ కాదు. 39 రకాల సృష్టి, స్థితులకు కారణభూతుడు. ఇది సత్యం. దీనికి తిరుగులేదు. సమస్తం ప్రజాపతి. సమస్తం సృష్టిస్థితి కారణం. అందుకే ప్రజాపతి అపరిమితుడు అవుతున్నాడు. ప్రకృతికి, పరమాత్మకు పరిమితి లేదు. వారు అపరిమితులు. ప్రజాపతి సమస్తం. వేదం సమస్తం. అనంతం. అపరిమితం’.    

  

‘మానవుడికి తెలియపరచింది వేదం. తెలియటమే జ్ఞానం. జ్ఞానం సాపేక్షం. ఒకసారి తెలిసిందాన్ని తిరిగి చెప్పడం జ్ఞానం కాదు. అది పునరుక్తి. పునరుక్తులు జీవితంలో తప్పవు. అంతమాత్రం చేత పునరుక్తి జ్ఞానం కాబోదు. ఒకనాడు నరుడికి అన్నం అంటే ఏమిటో తెలియదు. అన్నాన్ని వేదం తెలియపరిచింది. అప్పుడు అది జ్ఞానం అవుతుంది. అన్నం తెలిసిన తరువాత చెప్పడం జ్ఞానం కాదు. అలాగే వస్త్రం, కుటుంబం, బంధుత్వం, గ్రామం, రాజ్యం. వీటిని అన్నింటినీ వేదమే తెలిపింది. తెలియక ముందు అది జ్ఞానం అవుతుంది. వేదం అవుతుంది. సత్యస్వరూపుడైన పరమాత్మ మానవుడికి ఏనాటికీ అందడు. కాబట్టి భగవంతుడి గురించిందంతా జ్ఞానం అవుతుంది. సత్య స్వరూపాన్ని దర్శించడానికి నిత్యం జరిగే అన్వేషణ జ్ఞానం అవుతుంది. పరమాత్మ అనంతం. అంతంగల నరుడు అనంత బ్రహ్మను దర్శించజాలడు. అందుకే అన్వేషణ, అన్వేషణ. అన్వేషణే జ్ఞానం! అదే వేదం!!! మానవుని లౌకిక, పారలౌకిక, ఆధ్యాత్మిక విషయాలన్నింటినీ వేదమే ప్రవచించింది’.

         ‘పరమాత్ముడు పరిపూర్ణంగా ఎవరికీ అవగతం కాడు, దర్శనం ఇవ్వడు. నిత్యాన్వేషణ వల్ల భగవంతుడు అంశామాత్రం గోచరిస్తాడు. ఆ విధంగా అంశామాత్ర లబ్దులు వారి వారి దశలను బట్టి సాధువులు, యతులు, తపస్వులు, మహాత్ములు, అవతారాలు అవుతున్నారు. వీరే మునులు, ఋషులు, మహర్షులు అవుతున్నారు. అజ్ఞానులు వారినే పరమాత్మగా భావిస్తున్నారు. ఆరాధిస్తున్నారు. అలాంటివారు అంశామాత్ర పరమాత్మను ఆరాధిస్తున్నారు! మహర్షులు, మహాత్ములు నిస్వార్ధులు, నిష్కల్మషులు. తేజోమూర్తులు. వారు వేద మంత్రాలను దర్శించారు. మానవ జీవితాన్ని సమున్నతం చేయడానికి కృషి చేశారు. వారు అనేక సంస్థలను, ఆచారాలను, సంప్రదాయాలను ఏర్పరిచారు. వారి దివ్వెలవలె తమను తాము కాల్చుకున్నారు. లోకాలకు నిత్యకాంతులను ప్రసాదించారు. వారు సూర్య చంద్రుల లాంటివారు. పర్వతముల లాంటివారు. నదుల లాంటివారు. వృక్షముల లాంటివారు!’.

‘ప్రకృతి ప్రాణులకు సర్వస్వం అందిస్తుంది. వారి నుంచి ఏదీ ఆశించదు. అది అందుకున్న దానికి వెల ఇంతలు తిరిగి ఇస్తుంది. అందుకే మనం జీవిస్తున్నాం. అయితే, మహాత్ములు, మహర్షులు, మహా పురుషులు ఉన్న సమాజంలోనే నీచులు, నికృష్టులు, స్వప్రయోజనపరులూ ఉంటారు. ఈ స్వప్రయోజనపరులు సమాజం సంతాన్ని తమకోసం వాడుకుంటారు. జనం వారినే నమ్ముతారు. ఈ నీచులు మహర్షులు, మహాత్ములు ఏర్పరచిన సంస్థలను, ఆచారాలను, సంప్రదాయాలను దిగమ్రింగుతారు. వాటి స్థానంలో ఆత్మ కోల్పోయిన గాజు బొమ్మల్లాంటి ఆచార సంప్రదాయాలను కల్పిస్తారు. తమవే నిజమైనవని నమ్మిస్తారు. జనం ప్రాణం ఉన్న రూపాలను విడుస్తారు. ఈ స్వప్రయోజనపరులు, నీచులు అనాదిగా సమాజాన్ని మోసగిస్తున్నారు’.

‘వేదం ఏనాటిది? ఎన్నడు మొదలైంది? వేదం అనాగరిక మానవుని కాలం నుంచి నిర్మలంగా, నిష్కల్మషంగా ప్రవహించింది. మనిషి మనసు మలినాన్ని దూరం చేసింది. మానవుని దైవత్వపు అంచులకు కొనిపోయింది. స్వప్రయోజనపరులకు వేదం లెక్కలోనిది కాదు. వారు వేదాన్ని వేలం వేయగలరు. తాము చెప్పిందే వేదం అని నమ్మించగలరు. నమ్మించారు కూడా. దొంగ వేదాలు సృష్టించారు. అందుకే “విస్సన్న చెప్పిందే వేదం” అన్న సామెత వచ్చింది. వేదం అలాంటి గందరగోళంలో ఉన్నప్పుడు వ్యాసభగవానుడు అవతరించాడు. వేదానికి కలిగిన ఈ దుస్థితిని చూచాడు. దుఃఖించాడు. అంతటితో చాలించలేదు. వేదాన్ని పరిష్కరించడానికి ఉపక్రమించాడు. అంతటి దుస్థితి నుంచి నిజమైన వేదాన్ని వెలికి తీయడం సామాన్యం కాదు. రాళ్లలో వజ్రాన్ని వెతకడం లాంటిది!’

‘వ్యాసభగవానుడు ఒక మహత్తర కార్యానికి పూనుకున్నాడు. మానవ కల్యాణం కోసం మహా యజ్ఞాన్ని ప్రారంభించాడు. అప్పుడు ఆ మహర్షికి ఎన్ని సమస్యలు ఎదురైనాయో! ఎందరు వైరులు ఎదురైనారో! ఎందరిని ఎదిరించాల్సి వచ్చిందో? ఇదంతా ఎందుకు? వ్యాస భగవానుడికి స్వార్థం లేదు. స్వప్రయోజనం లేదు. కేవలం మానవ కళ్యాణానికే వేదాలను పరిష్కరించ పూనుకున్నాడు. వ్యాసమహర్షికి ఎన్ని వందల వేల విద్వత్ శిష్యులో! ఒక మహావటం కాదు, పంచవటి. ఆ నీడన వ్యాసభగవానుడు ఆసీనుడు. అతడు చంద్రుడు. అతని శిష్యులు వేనవేల నక్షత్రాలు! ఒక్కొక్కరి ముందు తాళపత్ర రాశి! శిష్యుల వేదాధ్యయనం. తొలుతగా వారు పరిష్కరిస్తున్నారు. వారు వ్యాసుడికు అందిస్తున్నారు. వ్యాసమహర్షి నిశితంగా పరిశీలిస్తున్నారు. వేదం కానిదాన్ని ఒకవైపు విసురుతున్నారు. వేదాన్ని తనదగ్గర భద్ర పరుస్తున్నారు. వ్యాసుని పక్కన ముని శిష్యులు వేదపు ప్రతులను సిద్ధం చేస్తున్నారు! ఎంతటి నిమగ్నత! ఎంతటి ధ్యానం! ఎంతటి మౌనం! ఎంత నిశ్శబ్దం! (ఇది రచయిత దాశరథి రంగాచార్య ఉహా చిత్రం)’.

‘వ్యాసమహర్షి నిర్వహించిన మహత్కార్యాన్ని తలుచుకుంటే వళ్లు జలదరిస్తుంది. అందరు ఋషులు, అందరు మునులు, అందరు కవులు, అందరు యోగులు తమ జీవితాలను దివ్వెలను చేసినారు. తాము తిమిర బాధలను అనుభవించారు. లోకాలకు వెలుగు ప్రసాదించారు! మనిషి జీవితాన్ని ఆదర్శం వైపు నడిపారు. మానవుడిలో దైవత్వాన్ని వెలికి తీశారు! వారి నిరంతర యజ్ఞం, యత్నం, ప్రయత్నం వల్లనే మనం ఇంకా మనుషులుగా ఉన్నాం. నదీనదాలు, పర్వతాలు, వృక్షాలూ, మనకు ఎంతో ఉపకారం చేస్తున్నాయి. వాటివల్లనే మనం జీవిస్తున్నాం.

‘ఈ నాటి యంత్రయుగపు నరరాక్షసుల ప్రయత్నాలు నాటి వేదవ్యాసుడి వేద పరిష్కార మహాత్కార్యంలో ఎదురై ఉండవచ్చు. వేదం మానవుడికి సమస్తం నేర్పింది. మానవుడు కొన్నింటినే నేర్చాడు. వాటిని అలవాటుగా, ఆచారంగా చేసుకున్నాడు. వ్యాసభగవానుడు అందరినీ ఎదిరించాడు. కలుపు వేదాన్ని, చీడ వేదాన్ని, నకిలీ వేదాన్ని, దొంగ వేదాన్ని సాహసోపేతంగా తొలగించాడు. అందుకే అతడు వ్యాసభగవానుడు అయ్యాడు. వ్యాసుడిది అవతారం. అతడు భగవానుడు. అతడు నారాయణుడు. అతడు మనకు అక్షయ సంపద ప్రసాదించాడు. వ్యాసుడు వశిష్టుడి మునిమనుమడు. శక్తికి పౌత్రుడు. నిష్కల్మషుడు. పరాశరుడి పుత్రుడు. శ్రీశుకుడి తండ్రి. తపోధనుడు’.

‘మనకు ప్రస్తుతం లభిస్తున్నవి నాలుగు వేద సంహితలు. అవి, ఋగ్వేద, కృష్ణ యజుర్వేద తైత్తిరీయ, సామవేద, అథర్వవేద సంహితలు. వ్యాసభగవానుడు కృపావాత్సల్యములు గలవాడు. తీరికలేని అజ్ఞాన సంతతి రానున్నదని గ్రహించినాడు. ఏకవేదాన్ని నాలుగుగా నిర్మించాడు. తరగని సంపదను కలిగించేది సంహిత. సంహిత వర్గ సంయోగం. వేదం లోని కొంత భాగమే శాస్త్రం. సంధించబడినది. దీన్నే మనం ఇప్పుడు సంకలనం అంటున్నాం. వేదం రామాయణం, భారత, భాగవతాదుల లాంటిది కాదు. అది ఒక కవి రచించనది కాదు. కావ్య, ఇతిహాస, పురాణాల లాగా నిరంతర కథాగమనం ఉండదు. వేదం సంహిత మంత్రాల, సూక్తాల కూర్పు మాత్రమే. వేదం అపౌరుషేయం. అంటే నరుడు చెప్పింది కాదు. ఋషులు మంత్రాలను, సూక్తులను దర్శించారు. వారు కర్తలు కారు, ద్రష్టలు. స్మర్తలు మాత్రమే. కనుగొని గుర్తుంచుకున్నవారు. ఎన్ని యుగాలుగా ఎందరు ఋషులు వేదాలను దర్శిస్తున్నారో? చెప్పడం అసాధ్యం. భారతీయులకు కాలం అనంతం, బ్రహ్మ, పరమేశ్వరుడు. ఇవేవి మానవ కొలతలకు అందవు’.

(డాక్టర్ దాశరథి రంగాచార్య వేద సంహితల ఆధారంగా)

 

Sunday, January 21, 2024

How KCR Elevated TS, India at Global Meet : Vanam Jwala Narasimha Rao

 How KCR Elevated TS, India at Global Meet

(Reminiscing Trailblazing contribution by KCR in WEF

On ‘Emerging Markets at Cross Roads’)

Vanam Jwala Narasimha Rao

The Hans India (21-01-2024)

The way K Chandrashekhar Rao as First Chief Minister of Telangana, defended Indian Economy and its policies, the way KCR endorsed China’s Development by confirming its potential in coming out of its financial setback, the way KCR projected Telangana etc. at the ‘World Economic Forum (WEF)’ Annual Meeting of New Champions, 2015 hinted at that, KCR was a global person with vision and foresight.


His observations signaled to India and to the world that, KCR was not only a regional party leader achieving formation of Telangana, but also a progressive visionary and statesman of inclusive growth. In the context of Chief Minister, A Revanth Reddy receiving nod for a record investments worth over Rs 40,000 crores, during his successful visit to Davos to attend WEF meeting, where he spoke in support of small and marginal farmers strongly, and need to transform farming into a profitable activity, reminiscing KCR’s ‘Trailblazing Contribution’ eight years ago in WEF meeting is of interesting.


Switzerland based ‘World Economic Forum (WEF)’ Managing Director Phillip Rosler in July 2015 extended invitation to KCR to its Annual Meeting of New Champions, to be held in China’s Dalian, on 9-11 September in collaboration with Chinese Government. In his invitation he mentioned that, given the unique challenging task of administering inclusive growth in India’s newly formed state (Telangana), Chief Minister’s views will add great value to the conversations on infrastructure development, urbanization and innovation led development.


KCR accepted the invite and a 16-member delegation left for China and Hong Kong on a 10-day tour with a tight schedule besides participating in the WEF meet. These were planned in Dalian, Shanghai, Beijing, Shenzhen, and Hong Kong. To begin with KCR met, Leo Wang, Chairman of Leo group, CEOs of top 40 companies located in Liaoning State and Indian Ambassador to China Ashok K Kantha who briefed KCR on potential of Chinese investments in Telangana.


KCR in his meeting with Professor Klaus Schwab, the Founder and Executive Chairman of WEF, explained the Single Window Industrial Policy of Telangana, the best and first of its kind in the world. Schwab praised Telangana as a state renowned for social and economic innovations. KCR also met Ms Hilde Schwab, Chairperson of the Schwab Foundation for Social Entrepreneurship. During the session on urban development challenges, KCR lucidly explained his vision on Hyderabad development. He shared his ideas and experiences with Mayors and Vice Mayors of important Chinese cities like Guangzhou, Yuwi etc.


Participating in a discussion on ‘Emerging Markets at Cross Roads’ the key part of WEF Meeting, KCR concisely, precisely, but comprehensively said: ‘In India states have a major role to play. Realizing this aspect, the Government of India devolved more powers and funds to the states. In place of the earlier Planning Commission an organization called NITI Ayog consisting of all the Chief Ministers of all the states with Prime Minister as its Chairman has come into existence. We call this as Team India. With Prime Minister as Chairman and CMs as members, we all together plan the development of country as a whole and also the states’ development as well. In a federal structure like the one India follows, states have a major role to play.’



‘For instance, our state Telangana the newest and youngest 29th state of India has laid down an excellent industrial Policy. We made it a law in the state legislature. We have made it as a right to the investor to get the clearances within the stipulated time of two weeks. We have already given clearances to 56 companies in the recent past to the tune of close to 2 billion US dollars investment. This speaks the mind set of India today to the whole world. I can certainly say that the market of India is a huge consuming market and exporting market as well. So, we are stable and definitely we will continue to grow. We have a Prime Minister who is on the path of reform. He is very firm. He was quite successful as Chief Minister of Gujarat state.’


‘Ups and downs are normally seen and normally observed. What I believe is that the way China pursued is to be seen as a best example. 30 years ago, it was a different China. Today the world sees a highly grown-up developed China. One should learn from China. What not to be learnt from China? We can learn everything from China. We strongly believe that we will grow and the trend is in our favor. We are the biggest oil importer and oil prices have come down now. We are happy for that and we will certainly make use of the situation and continue to grow further. This is our advantage.’


            ‘May be economies of other countries are at the cross roads. I can certainly say that definitely India is not at cross roads. The Government is on the path of reforms. We are moving with greater speed. India is saving lot of money on oil import. With that we have a lot of scope to create more infrastructures for the poor people and India is marching towards inclusive growth. We give utmost priority for the inclusive growth of the society and country and we believe in that. Structural changes will take place when poor remain poor and rich become richer. That will be a cursing point which is undesirable. We should maintain equilibrium taking care of the poor and maintaining the dignity of poor.’


‘In my state, though it is a new state, I have started a two-bedroom house scheme for the vulnerable and disadvantaged community. We are spending lot of money on providing drinking water and creating infrastructure in the city of Hyderabad and laid down very good industrial policy. I appeal to the world business community that India is a fairly good place for investment. I welcome all business worlds to come to India in general and particularly to Hyderabad and Telangana where we have a huge land bank to allot for industries.’


‘The industrial policy like ours is nowhere in the world. There are single window policies in the world, but the single window of Telangana, I can certainly say, is without grills. The officers who delay in delivering the required permissions and allocations will be penalised. We made it a right to the investor to get the required permissions, required allocations and required clearances within the stipulated time otherwise it can be deemed to have been given and the business house can go ahead. I welcome the business world to come to India, invest in India and invest in Telangana and let us go together.’


What all KCR said in his invaluable few words, was all in just five-six minutes and extempore, but not without a very well-planned preparation spanning over lot of quality time, discussing with CMO officers, since it was an international forum, and he as Chief Minister, was also a ‘Brand Ambassador’ of his state and country. Winston Churchill, British statesman, soldier, and writer who twice served as Prime Minister England, once said that, 'If you want me to speak for two minutes, it will take me three weeks of preparation. If you want me to speak for thirty minutes, it will take me a week to prepare. If you want me to speak for an hour, I am ready now.' KCR did the same.


Later, like Revanth Reddy, KCR had fruitful meetings with many others including KV Kamath, Xian Zhu of New Development Bank; Chinese entrepreneurs; Yogesh Wagh, of Anju Infrastructure; prospective investors; Inspur Group representatives; China Fortune Land Development Company representatives and also participated in a seminar on ‘Business Opportunities’ among others, before returning to Hyderabad.

Saturday, January 20, 2024

ప్రాణ ప్రతిష్ట ప్రక్రియ ఎలా? ..... (అయోధ్య ‘రామ్ లల్లా’ విగ్రహ ‘ప్రాణ ప్రతిష్ట వేడుక’ అంటే ఏమిటి?) : వనం జ్వాలా నరసింహారావు

 ప్రాణ ప్రతిష్ట ప్రక్రియ ఎలా?

(అయోధ్య ‘రామ్ లల్లా’ విగ్రహ ‘ప్రాణ ప్రతిష్ట వేడుక’ అంటే ఏమిటి?)

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ దినపత్రిక (20-1-2024) 

అయోధ్యలో నూతనంగా నిర్మించిన చారిత్రాత్మక రామ మందిరంలో, జనవరి 22, 2024 మధ్యాహ్నం 12.20 గంటల శుభముహూర్తాన చారిత్రాత్మక ‘ప్రాణ ప్రతిష్ట వేడుక’ కార్యక్రమానికి ముఖ్య అతిథి సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే. అదే రోజున, యావత్ భారత దేశ ప్రజలు, వారివారి ఇళ్లల్లో ‘రామజ్యోతి’ వెలిగించి, దీపావళి పండుగలాగా ఆ వేడుకను శోభాయమానంగా జరుపుకుంటున్నారు. ‘శ్రీరామజన్మ భూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్’ సభ్యులు, పారదర్శకంగా ఎంపికచేసిన, ఐదేళ్ల వయసు పోలిన 51 అంగుళాల ‘రామ్ లల్లా విగ్రహానికి’ ప్రాణశక్తిని ఆవాహన చేసే ‘ప్రాణప్రతిష్ట వేడుక’ను, ఆలయ ఆచారానికి, సాంప్రదాయానికి అనుగుణంగా జరుపుతున్నారు నిర్వాహకులు. ఈ నేపధ్యంలో జనవరి 16 న ప్రారంభమై, ఏడు రోజులపాటు నిర్విరామంగా సాంప్రదాయ, ఆచార బద్ధమైన పలు  కార్యక్రమాలు నిర్వహించారు. వీటికి పూర్వరంగంలో, ట్రస్ట్ కార్యదర్శి చంపట్ రాయ్ పవిత్ర అక్షతల పంపిణీ కార్యక్రమానికి ఆంగ్ల నూతన సంవత్సరంనాడు లాంఛనంగా శ్రీకారం చుట్టారు.

అసలు ఈ ‘ప్రాణ ప్రతిష్ట వేడుక’ అంటే ఏమిటి? అందులో భాగంగా ఏమేమి జరుపుతారు? ఇతర దేవాలయాలలో ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమానికి అయోధ్యలో ‘ప్రాణ ప్రతిష్ట వేడుక’ కార్యక్రమానికి విధానపరంగా తేడా లేదేమో కానీ, జరిగేది రామజన్మభూమిలో కాబట్టి, యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నదికాబట్టి, విశేషమైతే స్పష్టంగా ఉందనే అనాలి. ఏమిటా విశేషమంటే, విశేషమయినటువంటి భారతీయ హైందవ సాంప్రదాయ పండగలన్నింటిలోకెల్లా ‘అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట వేడుక’ చాలా, చాలా పెద్ద పండుగ అనాలి. మర్యాద పురుషోత్తముడు, సాక్షాత్తు విష్ణుమూర్తి అంశావతారం, శ్రీరామచంద్రమూర్తి దివ్యమైనటువంటి జన్మభూమిలో, కొన్నివందల సంవత్సరాల క్రితం శిధిలమైపోయిన రామాలయం, మరల అధ్బుతమైన కాంతులీనుతూ,  భరతఖండంలో, నవీకరించిన అయోధ్యలో  పునర్నిర్మితమై,  రామ్ లల్లా విగ్రహ ‘ప్రాణ ప్రతిష్ట’ జరుగుతున్నది.

ప్రతిష్టాపన  కార్యక్రమం వేడుకలో, హైందవ సాంప్రదాయ ప్రకారంగా నిర్వహించేటువంటి శుభ సమయంలో, భిన్నాభిప్రాయాలు వ్యక్రమవుతున్నాయి. ప్రాణ ప్రతిష్ఠాపన అనేటువంటిది ఒక వ్యక్తి చేతుల మీదుగా చేయవచ్చా అనే యక్షప్రశ్నలు చాలామంది సోషల్ మీడియాలో లేవనెత్తుతున్నారు. పీఠాదిపతులకు అనుకూలంగా, ప్రతికూలంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సంప్రదాయాలన్నీ మాకే  తెలుసు, మేమే చాలా గొప్పవాళ్లం, ఎదో ఒకటి మాట్లాడటం ఇలా ఎప్పుడూ జరిగే విషయమే. అలాంటివారిని ఆక్షేపించి లాభంలేదు. ఎవరి మనోభాలు వారివే కాబట్టి విమర్శల జోలికి పోకుండా, ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలం, మా స్వగ్రామం ముత్తారంలో మా పూర్వీకులు నిర్మించిన అపర భద్రాచల రామాలయంలో అర్చకుడుగా పనిచేస్తున్న ఆగమశాస్త్ర పండితుడు, వేదాధ్యయనం చేసి, ఎన్నో దేవాలయాలలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను జరిపించి మంచి పేరు గడించిన బొర్రా వాసుదేవాచార్యులు గారితో సంభాషించిన తరువాత ఆ కార్యక్రమం ప్రత్యేకత, తంతు గురించి కొంత అవగాహన కలిగింది.  

          ప్రాణప్రతిష్ట అనేటువంటిది ఏ ఒక్క వ్యక్తి చేయడు. ప్రాణప్రతిష్టాపన చేయడం కోసం, మొదలు ‘బ్రహ్మ’ అనే  ఋత్విజుడిని ఎంచుకొంటారు. ఆది శంకరాచార్యుల వారు ఏమన్నారంటే, ‘దేహో దేవాలయో ప్రోక్తః జీవోద్దేవో సనాతనః’ అని. అంటే, దేహమే దేవాలయం. జీవుడే సనాతనమైన దైవం అని అర్థం. దేహం కాని దేవాలయం లేదు, జీవుడు కాని దేవుడు లేడు. దేహం లోనే ధ్యానం చేయాలి, దేహం ఉన్నదే ధ్యానం చేయడం కోసం, దేహం లేకపోతే ఎక్కడి ధ్యానం ? ఒక దేవాలయాన్ని నిర్మాణం చేసేటప్పుడు ఆ దేవాలయం శిఖరాన్ని శిరస్సుగాను. గర్భాలయాన్ని గళంగాను, లోపల ఉండేటటువంటి మూర్తిని హృదయంగాను, అక్కడుండేటువంటి అంతరాత్మను జ్యోతిని దేవుడిగాను, ఈ ప్రాకార మండపాన్ని ఉదరంగాను, అక్కడ వున్నటువంటి మెట్లను తొడలుగాను, దేవాలయానికి ఆలయత్వం కలిగించేదాన్ని ధ్వజ స్తంభంగాను, ముందు ఉండే గాలిగోపురాన్ని పాదంగాను భావిస్తారు. 

ఇలాంటి ఆలయాన్ని మానవుడి రూపంలో  మానవుడి ఆకృతిలో వుంచుతారని నమ్మకం. మానవుడి ఆకృతిలో వుంచి లోపల వుండే జీవాత్మను, 'అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః' అని నారాయణ సూక్తంలో చెప్పినట్లు ధ్యానిస్తారు. మానవుడికి ఎవరికైనా సరే ఒక వెలుగు వుంటుంది. ఆ స్పార్క్ నే జీవాత్మ అంటారు.  ఈ జీవాత్మే పరమాత్మలో  లయబద్దంగా అనుగుణంగా, అనుబద్దంగా వుంటుంది.  ఆ జీవాత్మ అనే జ్యోతిని  కొన్నివేల కణాలతో, అద్బుతమైనటువంటి మంత్ర రూపకంగా,  నిర్మాణం చేసేటటువంటి ప్రక్రియ  హైందవ, వైదిక ధర్మశాస్త్రాలలో వుంది. 

ఇప్పటికి కూడా కొందరు చెప్పుకునే విషయం ఒకటి వుంది. భగవత్ రామనుజ స్వామి వారు ఆగమ శాస్త్రంలో  జీవకళ, ప్రాణప్రతిష్ట, కళాన్యాసం అనేవి వున్నాయా? లేవా అని ప్రశ్నిస్తే వున్నాయన్నారు మునులు. అయితే తాను చనిపోతానని, మళ్లీ తన ప్రాణాలు తెచ్చిస్తారా? అని సవాలు విసిరారు. తెచ్చిస్తాం, ఇది ప్రధాన్యాసం అని చెప్పి  వైఖానస ఆగమ పండితులు వచ్చారు శ్రీరంగంలో. స్వామివారిని నిదురింప చేశారు.  ఆ జీవకళను ఒక్కోక్కటీ సహస్రారం (చిట్టచివరి స్థితి) దగ్గరి నుంచి పాదాల దగ్గరి వరకు ఒక్కోక్క అంగానికి  రూపకల్పన చేస్తూ  ఆ జీవాన్నీ అవకర్షణ చేస్తూ  ఆ జీవాన్నంతా కూడా ఒక కుంబంలో పెట్టేసేసి, ఆ ప్రాణాన్ని ఆ శరీరాన్ని సిద్దం చేసారు. జీవం వెళ్లిపోయింది. కేవళం కళేబరం మాత్రం మిగిలి వుంది. తరువాత మళ్లీ బ్రహ్మన్యాసము, అంతర్బహిర్మాత్రుకాన్యాసాలు సృష్టించి  రామానుజుల శరీరానికి  పాదం దగ్గరి నుంచి శిరస్సు వరకు  మళ్లీ కళ ఆవాహన చేశారు.  కళావాహన చేసి  సహస్రారం నాడిపై ఆవాహన చేసిన వెంటనే రామానుజ స్వామి లేచి కూచున్నారు.  ఇది ప్రాణాన్ని తీయటం,  ప్రాణాన్ని పోయటం అనే ప్రక్రియ  వేదశాస్త్రానికి వుందని చెప్పబడతూంది. ఇది శ్రీరంగంలో జరిగింది. 

ప్రాణ ప్రతిష్ట గురించి వేదాలలో చెప్పిన ఓ అద్బుతమైన ప్రక్రియ. ఎమిటా ప్రాణప్రతిష్ట  అంటే, బ్రహ్మాన్యాసం అనే  న్యాసాన్ని చేసి  పృథ్వీ తత్వం,  అగ్ని తత్వం,  వాయుతత్వం, జలతత్వం,  తేజోతత్వం అనే  అయిదు తత్వాలను రూపొందింప చేస్తారు. అది ఏమిటయ్యా అంటే, మానవుడు పుట్టంచేది కాదు. ఎంతో మంది సైంటిస్టులు చెబుతున్నారు భూమికి  గురుత్వాకర్షణ శక్తి వుంది లాగేస్తోందని. ఇది న్యూటన్ చెబితేనే  తెలిసిందా? కానేకాదు. అది బద్ధమైనటువంటి శక్తి. పృథ్వీ శక్తి అద్బుతమైనది. దానినే బంధనమంటారు. అటువంటి పృథ్వీశక్తి.  మండింపచేసే అగ్నిశక్తి, తడిచేసే జలశక్తి, గట్టి పడేసే వాయుశక్తి, లాంటి పంచభుతాత్మక శక్తులను, పంచభూత శక్తులుగా, పంచ అగ్నులుగా ఆవిర్భవింపజేసి సభ్యము, పౌండరీకం, అన్నాహార్యము,  ఆహనీయము, అవశక్యం అనే అయిదు అగ్నులనుండి  గార్హపత్య తృష్టి చంద్రజీవకళ, సభ్యాగు చంద్రజీవకళ, ఆహవనీయ మానవ చంద్రజీవకళ అనే జీవకళలను  కుంభంలో ఆవాహన చేస్తారు.

ఆవాహన చేసి, ఒక బ్రహ్మ, కొంతమంది ఋత్విజులను ఉంచి, దేవతలకు హవిస్సును ఇచ్చి, జీవకళను పటిష్టత పరిచి, దేవాలయాన్ని ప్రతిష్ట చేసే బింబానికి పంచగవ్యాధివాసం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పంచగవ్యాలైన పాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రంతో అభిషేకం చేస్తారు. అనంతరం పంచగవ్యప్రాసన, వాస్తు హోమం, అకల్మష ప్రాయశ్చిత్త హోమం, రక్షాబంధనం నిర్వహిస్తారు. విగ్రహంలో జీవ కళలను నింపే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆగమశాస్త్రంలో నిష్ణాతులైన తత్సంబంధమైన ఆగమ పండితులను ఎంచుకొని, బ్రహ్మస్థానములో ఆచార్యుడు ఆధ్వర్యుడిగా, తనతోపాటు మరి కొంతమంది ఋత్వికులుగా వుండి, వైదిక కార్యక్రమాలను జరిపి, పంచగవ్యాధివాసంతో అదివసింప చేసి, దాన్ని పరిగ్రీకరణ చేసి, జలాధివాసం, క్షీరాధివాసం, పుష్పాధివాసం, ధాన్యాదివాసం,  పంచకషాయాధివాసం, రత్నాధివాసం అనే పంచతల్పాధి వాసాలను నిర్వహించి, విగ్రహాన్ని సంస్కరించి, అగ్ని మధనం చేసి, ఆ యజ్ఞాగ్నిలో అంగహోమం జరుపుతారు.

ఆ తరువాత  ఆ బింబంలోకి ఒక్కోక్క జీవకళను ప్రవేశింపబెడతారు. ఒక్కొక్క అంగానికి సుఖం చరం తిష్ఠంతు స్వాహా అని రూపకల్పన చేస్తూ, గ్రహించబడిన కలశంలో పవిత్ర ఓషధీ వస్తువులను, సుగంధ పరిమళ ద్రవ్యాలను, బ్రహ్మముడితో కూడిన దర్భపవిత్రమును వుంచి, తాను సౌమనస్కచిత్తుడై, ‘బ్రహ్మన్యాసాన్ని, అంతర్, బహిర్మాతృక, న్యాసాలను’ నిర్వహించి, ఆ కుంభంలో ‘సభ్యామృత చంద్రజీవ కళ, ఆహవనీయ మానద చంద్ర జీవకళ, అన్వాహార్య పూషా చంద్ర జీవకళ, గార్హపత్యా తుష్టి చంద్ర జీవకళ, అవసక్థ్య పుష్టి చంద్ర జీవకళ, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన జీవకళలను, చతుష్షష్టి జీవకళలను, అవాహన చేస్తారు.

ఆ తరువాత ఆత్మసూక్తంతో అభిమంత్రించి, ప్రాణప్రతిష్ట చేస్తున్న (భగవంతుడు) స్వామివారి మూల మంత్రాలను జపించి, ఆ స్వామివారి రూప లావణ్యాలను సంస్మరించుకుంటూ, ఆవాహన చేస్తారు. వేదమూర్తులు నిర్ణయించిన సుముహూర్త సమయంలో యంత్ర, విగ్రహ ప్రతిష్టాపన కాగానే, ‘ప్రధాన బ్రహ్మ’ ఆ శిలా విగ్రహంలో వేదమంత్రాలతో ‘కళావాహన, కళాన్యాసం’ ఆచరిస్తారు. ముందు పాదం,  తరువాత గుల్పం,  తరువాత జాను అంటె మోకాళ్లు, ఆ తరువాత ‘బృ’ అంటే తొడలు,  ‘కటి’ అంటే నడుము,  ఉదరం,  ఉదర పార్ష్య భాగము,  అదే విధంగా హృదయం,  వక్షస్థలం,  చక్షహు కన్నులు,  శ్రోత్రము, జిహ్వ, ‘ఆర్ద్ర’ అంటే వాసన చూసేవి, ఇవన్నీ కూడా ఒక్కోక్క శక్తిని ప్రవేశింపబెడతారు.

సాధారణంగా జరిగే సీతారామకళ్యాణ కార్యక్రమాలలో కూడా ఉత్సవ విగ్రహాలకు స్వామి వారిని ఆవాహన చేస్తారు. ఏదైతే స్వామికి చెప్పుతారో, అంటే: ‘సీతారామచంద్ర దేవతా  జివహః యహ జీవహః’ అని. ఈ ప్రకృతిలో వుండే జీవం ఏదైతే వుందో, ఆ జీవం ఇక్కడికి రావాలి. ప్రాణం ఇక్కడికి రావాలి. వాక్కు, పాణి అంటే చేతులు,  ఆ తరువాత పాదాలు, పాయహ, ఉపస్థ, వచన-మాట్లే శక్తి, ఆధారం,  జీర్ణక్రియ జరిగే శక్తి, వినగలి శక్తి,  చూడగలిగే శక్తి,  జిహ్వఆగ్ర, ఆదిత్య, ఇవన్నీ వచ్చేసేసి ఆ బింబంలో  సుఖం చరిత్వంష్టు స్వాహా, సుఖం చరిత్వంష్టు స్వాహా, సుఖం చరిత్వంష్టు స్వాహా,  అని చెపుతూ స్వామి వారిని  ఆవాహన  చేయటం జరుగుతోంది. విగ్రహంలో సకల ప్రాణ శక్తితో చిరకాలము ఉండు గాక అని దిగ్బంధన చేసి అర్చనాదికాలు నిర్వహిస్తారు. ఇదే, ఇదే ప్రాణప్రతిష్ట.

ఈ ప్రాణ ప్రతిష్ట జరుగగానే, ‘మంత్రాధీనంతు దైవతం, దైవాధీనం జగత్సర్వం, తన్మంత్రం బ్రాహ్మణాదీనం బ్రాహ్మణో మమ దేవతా అని చదువుతారు (ఈ జగమంతా దైవము యొక్క అధీనమై వున్నది. ఆ దైవం మంత్రానికి అధీనమై ఉంటాడు. ఆ మంత్రం బ్రాహ్మణాధీనమై ఉంటుంది. బ్రాహ్మణులే నాకు దేవతలు). అలా అంటూ, ఆ మంత్రాధీన శక్తిని  ఆ బింభంలోకి ప్రవేశింప చేస్తూ, జనవరి 22, 2024 మధ్యాహ్నం 12.20 గంటల శుభముహూర్తాన అయోధ్య రామాలయంలో జరిగే చారిత్రాత్మక ‘ప్రాణ ప్రతిష్ట వేడుక’ కార్యక్రమంలో  రామ్ లల్లా భగవాన్ ను  యావత్ భారతీయులు ఆహ్వానిస్తున్నారు. యావత్ భారతీయుల హృదయ శక్తి, యావత్ భారతీయుల ప్రేరణా శక్తి,  యావత్ భారతీయుల దృశ్య శక్తి, యావత్ భారతీయుల శ్రవణ శక్తి, యావత్ భారతీయుల కీర్తణా శక్తి అయిన ‘జై శ్రీరాం, జై శ్రీరాం, శ్రీరాం’ అన్న నినాదం, ఆ ఒక్క పదమే వళ్లంతా పులకరించేలా చేస్తుంది. నూటనలబై కోట్ల మంది భారతీయుల  ‘జై శ్రీరాం, జై శ్రీరాం, శ్రీరాం’ అనే నినాదంతో జరుగుతున్న అమోఘమైన ప్రాణ ప్రతిష్ట వేడుక ఇది.  

{‘రామ్ మందిర్ దేవాలయం నిర్మాణానికి, ఈ ప్రాణ ప్రతిష్ట వేడుక ప్రిలా అసాధారణ రీతిలో జరగడానికి, ద్విగ్విజయంగా పరిపూర్ణ కృషి చేసిన వ్యక్తిగా ప్రధాని నరేంద్ర మోడీని, నిర్ద్వందంగా, యావత్తు హిందు సమాజానికి చెందిన ఆబాలగోపాలం, ఆసేతు హిమాచలం, యావత్ భారతీయులు, ఎప్పటికీ విధేయతతో జ్ఞాపకం వుంచుకుంటారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాగే, ఆలయాన్ని కట్టాలని గుండె లోతుల్లోంచి భావించినా, కట్టలేకపోయిన మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావుకు, అయోధ్య వివాదాస్పద కేసును విజయవంతంగా వాదించిన సీనియర్ అడ్వకేట్, 96ఏళ్ల పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కె పరాశరన్ కు, 1949 లోనే నెహ్రూ ఆదేశాలనుకాదని రామజన్మభూమిలో పూజలు చేసుకోవడానికి హిందువులకు హక్కు కల్పించిన, నాటి ఫైజాబాద్ కలక్టర్, ఐసీఎస్ అధికారి, స్వర్గీయ కేకే నాయర్ కు కూడా ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియచేయడం కనీస ధర్మం.}

(ఆగమశాస్త్ర పండితుడు, వేదాధ్యయనం చేసి, ఎన్నో దేవాలయాలలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను జరిపించిన ముత్తారం సీతారామచంద్ర దేవాలయ ప్రధాన అర్చకుడు బొర్రా వాసుదేవాచార్యులు గారికి ధన్యవాదాలతో)