Thursday, June 6, 2019

ప్రజాప్రభుత్వాలకు ముప్పు : వనం జ్వాలా నరసింహారావు


ప్రజాప్రభుత్వాలకు ముప్పు
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (07-06-2019)
ఇటీవల నిర్వహించిన సాధారణ ఎన్నికలకుసంబంధించి 2019 ఎన్నికలు, ఓటింగ్‌ ఖర్చు"పేరుతో న్యూఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న మీడియాఅధ్యయనాల సంస్థ(సిఎంఎస్‌) పరిశోధన సరికొత్త అధ్యాయాన్ని ముందుకు తెచ్చింది. దీనిలోని అంశాలు ప్రజారజాప్రాతినిధ్య ప్రభుత్వాలకు మువ్పుతెచ్చే సూచనలు వెల్లడిస్తున్నాయని భారతఎన్నికల కమిషన్‌ మాజీ (ప్రధాన కమిషనర్‌ ఎన్టీ ఖురేషీ సిఎంఎస్‌ పరిశోధన ముందుమాటలోవ్యాఖ్యానించారు. మౌలిక సేవలు పొందే క్రమంలో పౌరులు వచ్చే ఐదు సంవత్సరాలలో భరించాల్సినఅపరిమిత అవినీతికి, ఎన్నికల ఖర్చుకు ఉన్ లంకెలు ఏమిటో ఈ పరిశోధన వెల్లడించిందని' ఖురేషీ పేర్కొన్నారు. ఏక విషయ రచన రూపంలో తీసుకువచ్చిన ఈ పరిశోధననుకొద్ధి రోజుల క్రితం ఢిల్లీలో అనేక మంది ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించారు.ఒక స్వతంత్ర సంస్థగా పరిశోధన మేథోకేంద్రంగా, డాక్టర్‌ ఎన్‌ భాస్మరరావుఅధ్యక్షుడిగా వున్న సిఎంఎస్‌ నంస్థ గత మూడు దశాబ్దాలుగా చురుకుగా, నిరంతరఅనునరణతో పని చేస్తోంది. గత రెండు దశాబ్దాలుగా ఎన్నికల ఖర్చులు మరియు (ప్రచారాలను అధ్యయనం చేస్తున్నది. ఎన్నికల ఖర్చే దేశంలో అన్ని రకాల అవినీతికి' మూలమని సిఎంఎస్‌ అనేక సందర్భాలలో వెల్లడించింది. తాజా నివేదికలోనివివరాలు ఎంతో అనక్తి కలిగిస్తున్నాయి.

డెబ్బయ్‌ అయిదు రోజులకు పైగా సాగిన 2019 ఎన్నికల ప్రక్రియ ఎన్నడూఎరగని, ఎక్కడా లేని అత్యంత ఖర్చుతో కూడినదిగా తయారైందని ఈ నివేదికపేర్కొన్నది. ఈ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 902 మిలియన్లు దాటింది, పోలింగ్‌ కేంద్రాలసంఖ్య మిలియన్‌ పైమాటే. వాటికి తగిన విధంగా మొత్తంగా ఓటర్లు పొల్గొనలేదు.అభ్యర్థులు,నేతలు, పార్టీలు చివరికి వార్తా మీడియా కూడా ఎన్నడూ లేని విధంగాభారత ఎన్నికల సంఘం(ఇసిఐ) ప్రవర్తనా నియమావళిని ఇంతగా ఉల్లంఘించలేదు.మొత్తం ఎన్నికల ప్రచార సమయంలో పట్టుకున్న నగదు, బంగారం, వెండి, మద్యంతదితరాల గురించి తరచుగా, తీవ్రంగా వార్తా ఛానల్స్‌ వీక్షకులకు చూపాయి.

కోటీశ్వరులు, అదే విధంగా నేరచరిత పూర్వరంగం ఉన్న వారు అభ్యర్థులుగాపోటీ చేయటం ప్రముఖమైనదిగా కొనసాగింది. ఓటు వేసేందుకు తాము స్వయంగాడబ్బుతీసుకున్నట్లు లేదా డబ్బు ప్రమేయం ఉన్నట్లు పెద్ద శాతంలో ఓటర్లుతొలిసారిగా ప్రత్యక్షంగా అంగీకరించారు. పధకాల పేరుతో ఎన్నికల సమయంలోఓటర్లను ఆకర్షించేందుకు నేరుగా బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం నగదు బదిలీచేయటం నూతన మార్గంగా నిర్ధారణ అయింది. ఎంతమంది ఓటర్లకు, ఎంతచెల్లించారో, తమ న్వంత పార్టీ ఖర్చు ఎంతో అన్ని పార్టీలు కలసి ఖర్చు చేసినసొమ్ము గురించి పార్టీల్లోని కీలకమైన నేతలు చెప్పిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.గుర్తుతెలియని విధంగా ఎన్నికల ఖర్చుల కోసం కార్పొరేట్లు నిధులు చెల్లించేందుకుఎన్నికల బాండ్లను ప్రవేశ పెట్టటం, వారి చెల్లింవులపై పరిమితులను ఎత్తివేయటం,ఎనికల (ప్రచారం కోసం విదేశీ కార్పొరేట్లు సైతం విరాళాలు ఇచ్చేందుకుఅనుమతించటం వంటి చర్యలన్నీ ఎన్నికల ఖర్చు పెరిగేందుకు దోహదం చేయటంనూతన పరిణామం. జిల్లా, స్థానిక, ఇతర స్థాయిల్లో నిఘా, జాడలనుకనుగొనేందుకు ఎన్నికల సంఘం విసృతమైన ఏర్పాట్లు చేసింది. సమాచారాన్నివినియోగించుకొని గతంలో గానీ ఈ ఎన్నికల్లో గానీ ఉల్లంఘనలు, మితిమీరివ్యవహరించటం వంటి వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియదు.వాస్తవానికి ఈ ఎన్నికల్లో తన యంత్రాంగాన్ని మరింత పటిష్టపరచింది, దానిలోభాగంగా ఖర్చులను పరిశీలించేందుకు ఆదాయ పన్ను, రెవెన్యూ శాఖల నుంచిమరింత మంది పరిశీలకులను నియమించింది. 20 14తో పోల్చితే రెట్టింపు నగదు, బంగారం, మద్యం వంటి వాటిని పట్టుకున్నారు. ఈ చొరవ ఎన్నికల ప్రచార ఖర్చుమీద పెద్ద తేడా చూపినట్లు కనిపించదు. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీచేసిన 2019 మార్చి పదో తేదీకి కొన్ని వారాల ముందే ఊపిరి సలపని ప్రచారాన్నిఈ ఎన్నికలు చూశాయి. ఆ ఖర్చును కూడా దీనిలో కలపటం సబబు. ప్రత్యేకించిఎన్నికలను గమనంలో ఉంచుకొని మీడియాలో ప్రకటనలకు చేసిన ఖర్చును కూడాదీనిలో కలపాలి. కొన్ని ఛానల్స్‌ కేంద్రంలోను, కొన్ని రాష్ట్రాలలో ఎన్నికల సంఘంనోటిఫికేషన్‌ జారీ చేసిన తరువాత కూడా ప్రచార సంస్థలుగా పనిచేశాయనుకోండి.తరువాత వివిధ దశల ఎన్నికల మధ్యలో అనేక జాతీయ ఛానల్స్‌ ఎన్నికలసంబంధితమైన ఇంటర్వ్యూలను గంట చొప్పున ప్రసారం చేశాయి. దీనికి అయినమొత్తాన్ని కూడా ఎన్నికల ఖర్చులో చేర్చారా లేదా అనేది సందేహం.


ప్రత్యక్ష జ్ఞానం, అనుభవాలు, అంచనాలపై విచారణ పద్దతి(పిఇఇ-పర్సెష్షన్స్‌ఎక్సిపీరియన్స్‌, ఎస్టిమేషన్‌) ప్రాతిపదికగా సిఎంఎస్‌ ఈ పరిశోధన చేసింది.భిన్నమైన నియోజకవర్గాలు లేదా కొన్ని తరగతుల ప్రాంతాలలో భిన్నమైన కేంద్రాలలో ప్రచారం, భిన్న కార్యకలాపాలలో ఏమి జరిగిందీ, వేటి ప్రమేయంఏమిటి అనే అంశాల గురించి సామంజన్యంగా నిర్ధారణలకు వచ్చారు. పారులుపొందుతున్న మౌలిక సేవలకు నంబంధించి అవినీతి గురించి వాస్తవమైన అంచనాలకు రావటానికి ఈ పద్దతి తోడ్పడింది. ప్రాధమిక, ద్వితీయ సమాచారం,ప్రత్యక్ష జ్ఞానం ప్రాతిపదికన ఎంతశాతం ఓటర్లకు డబ్బు పంపిణీ జరిగింది, ఒకఓటరుకు ఎంత మొత్తం ఇచ్చారనే అంశాన్ని నివేదికలో పొందుపరచారు.

గణనీయమైన నియోజక వర్గాలు, పరిమిత ప్రాంతాలలో పదిహేను నుంచి నలభై.శాతం మంది ఓటర్లకు డబ్బు పంపిణీ అయ్యింది. ప్రాంతాన్ని బట్టి, పోటీ తీవ్రత,పోటీలో ఉన్న అభ్యర్థుల ఆధారంగా పంపిణీ జరిగింది. ఒకే నియోజకవర్గంలో సైతంభిన్న స్థాయిలో పంపిణీ వుంది. ఒక్కో స్థానంలో పోటీ చేసిన అభ్యర్థులు ముగ్గురు,కంటే ఎక్కువ వున్నప్పటికీ ఎక్కువ చోట్ల కేవలం ఇద్దరు మాత్రమే ఖర్చు చేశారు.ఇతరులు నామినేషన్‌, ప్రచారానికి మాత్రమే ఖర్చు చేశారు. అంతా నగదు పంపిణీ,జరిగింది. కొందరికి పదవులు లేదా ఇతరంగా వాగ్దానాలు చేశారు. పది నుంచిపన్నెండు శాతం మంది ఓటర్లు తాము నేరుగా డబ్బు తీసుకున్నట్లు అంగీకరించారు.మూడింట రెండువంతుల మంది తమ ఇరుగుపొరుగు ఓటర్లు నగదు తీసుకున్నట్లుచెప్పారు. సగటున ఒక లోక్‌సభ నియోజకవర్గంలో దాదాపు వంద కోట్లరూపాయలు ఖర్చు చేశారు. మొత్తంగా చూసినవుడు ఒక ఓటరుకు రూ.700లుఖర్చయినట్లు అంచనా. ఈ ఎన్నికల్లో అనేక మంది అభ్యర్థులు కోటీశ్వరులు, వాణిజ్య:ప్రయోజనాలు కలిగిన వారు పెరిగారు, ఖర్చులో ఎక్కువ భాగం అభ్యర్థులే,స్వయంగా భరించారు. అనేక సందర్భాలలో అభ్యర్థులు పార్టీకి నిధులు ఇవ్వటంతోపాటు ఇతర అభ్యర్థుల ప్రచార ఖర్చులను కూడా కొంత మేరకు భరించారు.కొందరు అభ్యర్థులకు పార్టీయే నిధులిచ్చింది. మూడోవంతుకు మించి ఎన్నికల,ఖర్చులు లెక్కల్లోకి రాని వనరుల నుంచే ఖర్చుచేసినట్లు చెప్పవచ్చు. ఈ నివేదికప్రకారం రెండు దశాబ్దాలలో 1998-2019 మధ్య ఆరుసార్లు లోక్‌నభ ఎన్నికలు.జరిగాయి. ఎన్నికల ఖర్చు తొమ్మిదివేల కోట్ల రూపాయల నుంచి 55 వేల కోట్లకు, ఆరు రెట్లు పెరిగింది. ఈ మొత్తంలో అధికారంలో ఉన్న పార్టీ ఇతర పార్టీల కంటేచాలా ఎక్కువగా ఎలా ఖ ర్చు చేసింది అన్నది ఆసక్తి కలిగిస్తోంది. 1998లో బిజెపిమొత్తం ఖర్చులో 20శాతం ఖర్చు చేస్తే అది 2019 నాటికి 45 శాతానికి పెరిగింది.2009లో కాంగ్రెస్‌ పార్టీ ఖర్చు 40శాతం అయితే, 2019 నాటికి 15 నుంచి 20 శాతానికి తగ్గిపోయింది.

ఆంధ్రప్రదేశ్‌లోని మెజారిటీ జిల్లాల్లో లోక్‌నభ, అసెంబ్లీ ఎన్నికలకు కలిపి.ఓటర్లకు డబ్బు చెల్లించారు. అక్కడి 13 జిల్లాలకు గాను నాలుగు జిల్లాలు ఉభయగోదావరులు, కృష్ణ గుంటూరు జిల్లాల్లో సగానికిపైగా ఓటర్లకు సగటున వెయ్యి నుంచి రెండువేల రూపాయల వరకు చెల్లించారు. డిసెంబరులో జరిగిన తెలంగాణఅసెంబ్లీ ఎన్నికలలో ఐదువేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సిఎంఎస్‌ అంచనా.వేసింది. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే పంచిన నగదు లోక్‌సభ ఎన్నికలలో ఖర్చు.శాతం తక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాలలో నామ మాత్రంగా అక్రమంగా పంపిణీ.చేస్తున్న వాటిని స్వాధీనం చేసుకోవటం తప్ప ఎన్నికల సంఘం వైవు నుంచి ఎలాంటికఠిన చర్యలు లేవు. అది తన అధికారాలను ప్రదర్శించనట్లయితే పెద్ద తేడాను.ఆశించలేము. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అభ్యర్థులు పాటించనవుడు అది,కేవలం ప్రేక్షకపాత్ర వహిస్తే వాటికి మాన్యత ఏముంటుంది? ఎన్నికల ప్రచారానికి ఖర్చు, ఎన్నికల నిధుల గురించి దేశవ్యాపితంగా చర్చల తరువాత పార్లమెంట్‌.సమాలోచనలు చేయటానికి ఇది తగిన సమయం. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చివరికి ప్రభుత్వం కూడా ఎన్నికల ఖర్చుకు కోత పెట్టేందుకు ఉత్సాహాన్నిచూపటం లేదు. ఈ సమస్యను పౌరసమాజం, పౌరులే చేపట్టాలని సిఎంఎస్‌ తనముగింపులో పేర్కొంది. సిఎంఎస్‌ నివేదికలో పేర్కొన్న ఎన్నికల ఖర్చు మొత్తంగురించి, ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బును ఎలా వినియోగిస్తారో తమకు,తెలుసునని మాజీ కేంద్ర మంత్రి సురేష్‌ పి ప్రభు చెప్పారు. స్వేచ్చ మరియు,న్యాయమైన మన ఎన్నికల స్వభావానికి అది ముప్పు కాదని అన్నారు. ఏ స్థాయిలో.డబ్బు ప్రభావం ఉందో ఈ నివేదికలో వెల్లడించిన తీరు ఈ దేశంలో నరైన పద్దతిలోఅలోచిస్తున్న ప్ర‌తి పౌరుడినీ అందోళ‌న‌కు గురి చేయ‌క‌త‌ప్ప‌దు.

1 comment:

  1. వనం గారూ, "ప్రజాప్రభుత్వాలకు ముప్పు" ఉన్నా, కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఏమీ ఇబ్బంది ఉండదు. అంతా ఆయన ఇష్టం కదా?

    ReplyDelete