ఆంధ్ర
వాల్మీకి (వాసుదాస స్వామి)
రామాయణంలో ఛందః
ప్రయోగాలు
అయోధ్యా కాండ -4
వనం
జ్వాలా నరసింహారావు
కైక కోరిన విధంగా శ్రీరాముడు తండ్రి
ఇచ్చిన మాట నెరవేర్చడానికి అడవులకు పోయేందుకు నిశ్చయించుకుంటాడు. తాను అడవులకు
వెళ్తున్న సంగతిని తల్లి కౌసల్యకు తెలియచేస్తాడు. పట్టాభిషేకం గురించి చెప్పడానికి
వచ్చాడని భావించిన కొసల్య ప్రియంగా-హితంగా ఇచ్చిన దీవెనలను అందుకున్నాడు రాముడు.
మెల్లగా భయంకరమైన వార్తను తెలిపాడామెకు. భరతుడికి యౌవరాజ్యమిచ్చే విషయాన్నీ
చెప్పాడు. ఆ విషయాన్ని విన్న కౌసల్య దుఃఖిస్తుంది. ఆ సమయంలో, లక్ష్మణుడు
కౌసల్యతో, శ్రీరాముడు అరణ్యానికి పోరాదని చెప్పే క్రమంలో,
ఆయన గుణగణాలను వర్ణించడానికి-లక్ష్మణుడితో చెప్పించడానికి
"మత్తకోకిలము" వృత్తాన్ని ఎంచుకున్నారు వాసు దాసుగారీవిధంగా:
మత్తకోకిలము: దేవకల్పు ఋజున్
సుదాంతుని దేవి ! శత్రుల నైన స
ద్భావుఁ డై
దయఁ జూచు వాని నితాంతపుణ్యునిఁ
బూజ్యునిన్
భూవరుం
డొకతప్పు లేక యుఁ బుత్రు
నెట్టిస్వధర్మ సం
భావనం
బురిఁ బాసి పొ మ్మనె ? బ్రాజ్ఞు లియ్యది
మెత్తురే ? – 21
ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం
యతి.
తాత్పర్యం: పరదైవంతో సమానుడై, చక్కటి నడవడిగలవాడై,
ఇంద్రియ నిగ్రహం గలవాడై, శత్రువులనైన మంచి
అభిప్రాయంతో దయతో చూసేవాడిని, మిక్కిలి పుణ్యవంతుడిని,
ఎల్లవారికి పూజించేందుకు యోగ్యుడైనవాడిని, జ్యేష్ఠ
పుత్రుడిని, ఒక్క తప్పైన చేయనివాడిని, మనుష్య
మాత్రుడు-వక్రవర్తనుడు-ఇంద్రియ లోలుడు-నిష్కారణంగా భార్య కొరకై దండించేందుకు
సిద్ధపడినవాడైన వాడు ఏ రాజధర్మాన్ని అనుసరించి నగరాన్ని విడిచి అడవులకు
పొమ్మన్నాడు ? వివేకంగలవారు దీన్ని మెచ్చుకుంటారా ?
No comments:
Post a Comment