ఆంధ్ర
వాల్మీకి (వాసుదాస స్వామి)
రామాయణంలో ఛందః
ప్రయోగాలు
అయోధ్యా కాండ -6
వనం
జ్వాలా నరసింహారావు
అడవులకు పోవాలనుకున్న కొడుకు నిశ్చయాన్ని, తండ్రి
ఆజ్ఞ శ్రీరాముడు జవదాటడనే విషయాన్ని గ్రహించిన కౌసల్య కొడుకును ఆదరించి, దయతో దీవించాలనుకుని ఆశీర్వదించే ఘట్టంలో, శ్రీరాముడితో
అన్న మాటలను ఒకచోట "మత్తకోకిలము" వృత్తంలో పద్యంగా మలుస్తారు కవి ఇలా:
మత్తకోకిలము: దేవతాయతనంబులన్
రుచి దేఋ చైత్యములందు నీ
చే వరం బగు మ్రొక్కు లందుచుఁ జెన్ను మీరినయామహా
దేవతల్ ఋషియుక్తులై వనిఁ ద్రిమ్మరం జనుచుండు ని
న్వేవిధంబులఁ గాచుచుందురు నిర్మలం
బగుసత్కృపన్ - 25
ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం
యతి.
తాత్పర్యం: దేవాలయాల్లో, నాలుగు బాటలు కలిసేచోట, నీచే (రాముడు) మొక్కులుగొంటున్న ఆ మహాదేవతలు, ఋషులతో
సహా, అడవిలో తిరుగుతుండే నిన్ను వేయివిధాలుగా
రక్షించుదురుగాక.
No comments:
Post a Comment