సముద్రిడిపై
కన్నెర్ర చేసిన శ్రీరాముడు
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు
28 వ భాగం - సుందర కాండ
వనం
జ్వాలా నరసింహా రావు
సూర్య
దినపత్రిక (23-1-2017)
తాత్పర్యం: యుద్ధంలో పగవారికి శోకం కలిగించేదిగా, నిడివైనదిగా,
మంచి మనసున్న మిత్రుల సంతోషానికి స్థానమైనదిగా, భూమండలానికి ఆశ్రయమైనదానిగా, సవ్యాపసవ్యములుగా
బాణాలు ప్రయోగించేందుకు సామర్ధ్యం కలదిగా, అల్లెతాటి రాపిడి
వల్ల కాయకాచిన చర్మం లాగా, వేలాది ఆవులను దానం చేసినదానిగా,
పాప పడగవంటిదిగా భయంకరమైన గడియ మ్రాకులా, శ్రీరాముడి
కుడి భుజం వుంది. దానిని దిండుగా చేసుకుని సముద్రతీరంలో శ్రీరాముడు పడుకుంటాడు.
ఛందస్సు: తరలముకు "న, భ, ర, స, గజం" లు గణాలు. పన్నెండో అక్షరం యతి. మత్తకోకిలము వృత్తానికి "ర, స, జ, జ, భ, ర" గణాలు. పదకొండవ స్థానంలో యతి. తరలము
లోని మొదటి రెండు లఘువులను గురువుగా మారుస్తే మత్తకోకిలము అవుతుంది. అలానే మత్తకోకిలము లోని గురువును లఘువులుగా మారుస్తే తరలము అవుతుంది.
శ్రీరాముడు అలా తూరుపు ముఖంగా పడుకుని, తాను
సముద్రాన్ని దాటనన్నా దాటాలి, లేదా, సముద్రుడు
చావనైనా చావాలి అని నిశ్చయించుకుంటాడు. అలా మౌన వ్రతము బూని సముద్రాన్ని
ప్రార్ధించుతూ, మూడు రాత్రులు పడుకున్నప్పటికీ, సముద్రుడు కనబడలేదు. సముద్రుడి మీద కన్నెర్ర చేశాడు రాముడు. తన పదునైన
బాణాలతో సాగరాన్ని ఎండిపోయే ట్లు చేస్తానని లక్ష్మణుడితో అంటాడు. సముద్రాన్ని
క్షోభకు గురిచేస్తానని చెప్పాడు. సముద్రం గతి ఎలా వుంటుందో చూడమని అంటూ కళ్లు ఎర్ర
చేసి బాణ సమూహాలను విడిచే విధానాన్ని "స్రగ్ధర" వృత్తంలో వర్ణించాడు
కవి.
స్రగ్ధర: జ్వాలాభీలాశుగంబుల్
చర చర చనుచున్ సాగరం బుత్తలింపన్
వే లోనం జొచ్చినంతన్ విషధరచయముల్
బెగ్గిలెన్ దిగ్గనన్ గ్రా
హాళీకుంభీరయుక్తం బగు సలిలము
వాతాతి నిర్హ్రాదయుక్తిన్
జాలన్ ఘోరత్వమందెన్ సరఁ గ బొగలతో
సంభ్రమద్భంగ పాళిన్-123
తాత్పర్యం: అగ్నిశిఖల లాంటి బాణాలు చరచర బోయి
సముద్రాన్ని అల్లకల్లోలం చేయగానే, హటాత్తుగా వచ్చిన ఆ ఉత్పాతానికి పాములు
భయపడ్డాయి. గ్రాహములతోను, మొసళ్లతోను నిండిన నీరు పెనుగాలికి
కలిగిన ధ్వనివల్ల, మరింత భయంకరమై, పొగలతోను,
అలల తోను కనిపించింది.
ఛందస్సు: స్రగ్ధర వ్య్త్తానికి "మ,
ర, భ, న, య, య, య" గణాలు. ఎనిమిదింట, ఎనిమిదింట యతి.
నలుడు సేతువు నిర్మించే సమయంలో, తనకు
వానరుల సహాయం కావాలని రాముడిని కోరతాడు. ఆయన కోరిన ప్రకారమే, రాముడు, వానరులను చెట్లు-గుట్టలు తెచ్చి సముద్ర
తీరానికి చేర్చమంటాడు. వానరులు వాటిని తెచ్చిన వైనాన్ని కవి "పంచచామరము"
వృత్తంలో వర్ణించారు.
పంచచామరము: గుభీల్
గుభీల్మనంగఁ గొండ లెల్ల దండిగా
దభాలునం బడంగ వైవఁ
దల్లడిల్లి సత్త్వముల్
గభీ ల్మనంగ గుండియల్ ది
గా ల్పడంగ,
బిందువుల్
నభంబునం జివాలునన్ ఘ
నంబుగన్ నటింపఁ గన్-124
ఛందస్సు: పంచచామరానికి "జర, జర, జగ" గణాలు. తొమ్మిదింట యతి.
వానర సేన సేతువు దాటిన తరువాత, ఆహారం
కొరకు ఒక ప్రదేశంలో విడిది చేసినప్పుడు, శ్రీరాముడు చేసిన అసాధ్య
కార్యాన్ని దేవతలు-ఋషులు మనసులోనే పొగుడుకుంటూ రాముడిని పూజిస్తున్న సందర్భాన్ని
"వనమయూరము" వృత్తంలో వర్ణించారు కవి.
వనమయూరము: చేరి
యభిషేకమును జేసి శుభవారిన్
ధీరవర! శత్రుల వధింపుము
సపారా
వారమహి నేలుమ య పారసమ
లంచున్
సారెకు సమర్చల నొ నర్చిరి
సభక్తిన్
- 125
తాత్పర్యం: రామచంద్రమూర్తిని
పవిత్ర జలాలతో అభిషేకించి, శత్రువులను జయింపుమని, అనేక
సంవత్సరాలు భూమండలాన్ని ఏలమని, భక్తితో పూజించిరి.
ఛందస్సు: వనమయూరమునకు "భ,
జ, స, న, గ, గ" లు గణాలు. తొమ్మిదింట
యతి.
సుగ్రీవుడి వద్దకు రాయబారానికి రావణుడు
పంపిన శుకుడు, శ్రీరాముడి దయవల్ల ప్రాణాలను దక్కించుకుని తిరిగి
రావణుడి దగ్గరకు వస్తాడు. సీతను రామచంద్రమూర్తికి అప్పగించమని హితబోధ చేస్తాడు.
తనను ఎంతమంది ఎదిరించిన ఏమీ చేయలేరనీ, సీతను ఇచ్చే ప్రసక్తే
లేదని రావణాసురుడు స్పష్టం చేసిన సందర్భంలో, "మత్తకోకిలము"
వృత్తంలో ఒక పద్యాన్ని రాశారు కవి.
మత్తకోకిలము: వేయిగన్నులు గల్గి వెల్గెడు వేల్పు ఱేఁ
డరుదెంచినన్
దోయధీషుఁ
డు పాశహస్తుడు త్రోచివచ్చిన, దండియై
యా
యముం డిట వచ్చినన్, ద్రవి ణాధినేత యెదిర్చినన్
జేయ
లే రొకయింతయేనియుఁ జెట్ట నా కెటు భీరుకా-126
తాత్పర్యం: శుకుడిని
పిరికివాడా అని సంభోదిస్తూ, వేయి కళ్లున్న ఇంద్రుడు వచ్చి ఎదిరించినా, పాశం చేతుబట్టుకుని వరుణుడు వచ్చినా, యమదండంతో యముడు
వచ్చినా, ధనాధిపతి కుబేరుడు వచ్చినా తనకే కీడు చేయలేరని
అంటాడు రావణాసురుడు.
ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి "ర, స, జ, జ, భ, ర" గణాలు. పదకొండవ స్థానంలో యతి.
శ్రీరాముడి వెంట వచ్చిన వానర సేన బలాన్ని
రావణాసురుడికి పూర్తిగా వివరిస్తూ శుకుడు చెప్పిన మాటలను ఒక సందర్భంలో
"మత్తకోకిలము" వృత్తంలో వర్ణించారు కవి.
మత్తకోకిలము: వారిఁ జూడు
మవార్యవీర్య విభా ప్రభావులు బాలకా
కారు లబ్జజుపంపునన్ మురి గండు మీఱ
సుధారసం
బారఁ గ్రోలిరి మైందుఁ డున్ ద్వివి
దాఖ్యుఁ డున్ నిను నీ పురిం
భూరివిక్రమ సంపదన్ మును ముట్టఁ
గూల్పఁ గ జూచెదన్-127
తాత్పర్యం: మైందుడు, ద్వివిదుడు అనే
వానరవీరులకు వారింపనలవి కాని వీర్యము, మహత్త్వము వుంది.
వయసొచ్చిన బాలురవలె వుంటారు. దానికి కారణం, బ్రహ్మ
ఆజ్ఞానుసారం బలగర్వాలు ఎక్కువకావటానికి అమృతం
తాగడమే. నిన్ను, నీ పట్టణాన్ని కూడా భుజబలాతిశయంతో
మట్టుబెట్టనున్నారు.
ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి "ర, స, జ, జ, భ, ర" గణాలు. పదకొండవ స్థానంలో యతి.
అశోకవనంలో వున్న సీతదేవి దగ్గరకు
రావణాసురుడు వెళ్లి, ఆమెతో, శ్రీరాముడు యుద్ధంలో
మరణించాడని అబద్ధం చెప్తాడు. అది నమ్మిన సీత తన భర్త గురించి, అత్తగారు కౌసల్య గురించి బాధపడిన విషయాన్ని సుగంధి వృత్తంలో రాశారు కవి.
సుగంధి:
కుల్య!
రామభద్ర! యిట్టి క్రూరమైన వార్త హృ
చ్ఛల్య వినంగఁ
గల్గ సాధుశీల యత్త కౌ
సల్య పుత్ర
పుత్ర రామ చంద్ర యంచు దుఃఖధీ
లౌల్య లేఁ గఁ బాయు
గోవు లా గదెంత కుందునో - 128
తాత్పర్యం: గొప్ప వంశంలో పుట్టిన నీకా ఈ నికృష్టపు చావు? రామభద్రా,
నేను చేసిన పాపం నేను అనుభవించవలసిందే. తప్పదు. ఇది నాతో పోదే. ఈ
క్రూరమైన వార్త వినగానే సాధుస్వభావురాలైన నా అత్తగారు కౌసల్య, కొడుకా, కొడుకా రామచంద్రా అని, లేగదూడను పోగొట్టుకున్న ఆవు వలె ఎంత దుఃఖించునో కదా. నేనొక్కతెను చేసిన
పాపం నిరపరాధులను ఎందరినో బాధించుతున్నది కదా.
ఛందస్సు: సుగంధికి "ర, జ,
ర, జ,
ర" గణాలు. తొమ్మిదింట యతి.
తదుపరి భర్త
రాముడిని తలచుకుంటూ, దైవ సంకల్పానికి అడ్డు లేదనుకుంటూ తనలో తానే
అనుకుంటున్న దానిని " ఇంద్రవంశము " వృత్తంలో రాశారు కవి.
ఇంద్రవంశము: నే రేజపత్రేక్షణ! నిర్దయాత్మికన్
గ్రూరన్ మహారౌద్రను ఘోర దుష్కృతా
కారన్ ననున్ వల్లభ! కాళరాత్రినిన్
జేరంగ నీ తీయుటఁ జేటుఁ దెచ్చితిన్ - 129
తాత్పర్యం: తామర
రేకుల లాంటి కళ్లు కలవాడా! దయలేని మనస్సు నాది. అందుకే కఠిన చిత్తను, మహా
భయంకరమైన దానిని నేను. పాపాలు నా ఆకారంలో వున్నాయి. వల్లభ! నేను నీ పాలిటి
కాళరాత్రిని. ఇలాంటి దాన్ని నన్ను నీవు చేరదీయడం వల్లనే, నేనే
నిన్ను చంపాను. తేలును దగ్గరకు తీస్తే కుట్టక మానుతుందా?
ఛందస్సు: ఇంద్రవంశమునకు
"త, త, జ, ర" గణాలు. ఎనిమిదింట
యతి.
సీత తన
మనసులో బాధను తానే పరిపరి విధాలుగా పడుతూ, భర్తను పరోక్షంగా తూలనాడుతుంది.
అ సందర్భంలో "స్రగ్విణి" వృత్తంలో ఒక పద్యాన్ని, "మత్తకోకిలము" వృత్తంలో మరో పద్యాన్ని రాశారు.
No comments:
Post a Comment