Friday, May 31, 2019

Think and course-correct : Vanam Jwala Narasimha Rao


Think and course-correct
Vanam Jwala Narasimha Rao
Telangana Today

            The India envisaged by our great leaders of yester years is in stark contrast with how the nation stands in present times.

The National Pledge which is commonly recited by Indians at public events and during the Independence Day and Republic Day was composed by a little known Telanganite-born in Anneparti, Nalgonda District-Pydimarri Venkata Subba Rao, a noted author in Telugu and a bureaucrat.  While serving as the District Treasury Officer of Vishakhapatnam District in 1962 in the then Andhra Pradesh he composed this and later presented to Late Tenneti Viswanadham a former Minister and Member of Parliament who forwarded it to the then Education Minister PVG Raju.

The Pledge goes like: “India is my country. All Indians are my brothers and sisters. I love my country and I am proud of its rich and varied heritage. I shall always strive to be worthy of it. I shall give my parents, teachers and all elders respect and treat everyone with courtesy. To my country and my people, I pledge my devotion. In their well-being and prosperity alone, lies my happiness”.

Missing National Agenda
The question is, while remembering the struggle for independence spearheaded by our great leaders who are no more now, to what extent the words in the pledge, or to that matter to what extent the fruits envisioned during the freedom moment are relevant today? Is there a brotherhood and sisterhood among us? Are we really proud of our rich and varied heritage still? Are we worthy of our country? Are we politically in a position to steer the country towards progress? Do we have a perfect National Agenda to take the people forward looking? Are we in a position to compete globally with other nations? Where do we stand and where do we place ourselves in many areas? These are questions which have no answers.
 
What had happened in the recent general elections to Parliament? NDA led by BJP under the leadership of Narendra Modi, UPA led by Congress under the leadership of Sonia-Rahul-Priyanka, the regional parties across the country as well as the namesake left parties competed each other with all their might. It was a fight between National Extremism, Secularism, Hereditary politics and regionalism.

Alternative Issues
A Former Chief Minister of Andhra Pradesh strived hard for an alternative to BJP at the center while Telangana Chief Minister K Chandrashekhar Rao advocated a non-BJP and non-Congress government. But, despite all this what happened? Beyond every aspect of region, preference, isms etc., the voter by and large preferred Modi, the national extremism, the Modism resulting in landslide victory to BJP led NDA.

In the North, West, East and Central India the BJP led by Modi-Shaw emerged victorious. In Uttar Pradesh everybody anticipated a great victory for BSP-SP alliance which not happened. In states like MP, Rajasthan, Chhattisgarh where BJP lost in the recently held elections to the State Assembly BJP registered grand victory. In Gujarat where BJP just scraped through in the Assembly elections emerged victorious. Same with Maharashtra and Bihar. In West Bengal, once a strong fort of left-wing Marxist Communist party, the national extreme BJP beaten the middle line Mamata Banerjee’s Trinamool Congress in considerable seats.

In the South too, though BJP’s performance was not comparable to rest of India, nevertheless, it was certainly highly impressive. In Karnataka it was unbeatable victory. Though BJP could not secure seats in Tamil Nadu, Kerala and AP, surprisingly it won four seats in Telangana.

Analysing Gains
How to understand and analyze BJP’s impressive gains in Telangana? It’s not even four months since the great victory of TRS in the Assembly elections held in December 2018. On the other hand, BJP which lost deposits in more than 100 assembly segments then, has not only wrested the Secunderabad Lok Sabha seat in the heart of twin cities but also won in northern Telangana’s Karimnagar, Nizamabad as well as Adilabad the ST seat bordering Maharashtra.

What could be the basis on which a particular party wins and loses has become an element beyond imagination. Vinod Kumar who was an MP earlier and now a sitting MP lost in Karimnagar for no valid reason. Ditto was Nizamabad sitting MP Kavitha where there is no reason for her defeat. In the Adilabad constituency despite the defeat of BJP candidate in the bordering Chandrapur voters there preferred BJP.

If this is credited to Modi’s magic then how come Congress won in three constituencies? How to analyze this phenomenon? Could there have been a possibility of a limited electoral understanding between BJP and Congress in these seven constituencies? Can’t be ruled out. If the defeat of TRS candidate was attributed to NOTA in Malkajgiri, in Bhuvanagiri it could have been due to the presence of Truck symbol.

There is absolutely no connection between the defeat of TRS in seven seats and the enormous welfare and development schemes conceived and implemented in the state during the first 51 months of KCR governance. Would there be any other factor other than welfare and development that influenced the voter in preferring BJP over TRS? If deeply analyzed this clearly shows that it was a fight between secular-federal policy and national extreme communal approach. Where would this lead in future is a big question now.

New Direction   
The country undoubtedly needs a new direction as seventy-one years have passed since independence. Still the country and its people are struggling for basic minimum needs with significant chunk of our people suffering from poverty and are either unemployed or underemployed.

So what suits our country. Can’t we leverage the wealth and inner strength of our country and its economy? What is stopping us? It is not an insurmountable problem and of course it is just a mindset issue. If we have to develop India, it requires out-of-the box thinking and not just the routine way as has been done during the past 71 years. The customary talk of “Best Practices” should be dropped and let us think of “Next Practices”.

A growth centric tactic for issues aiming at reinventing and reorienting India moving away from stereotyped practices is the need of the hour. We have to first get rid of poverty of thought and plan in a big way instead of incremental thinking.

Then who are responsible for all the ills? The Nehru-Gandhi leadership Congress Party era followed by Morarji-VP Singh leadership Janata-National Front era and then the Vajpayee-Modi BJP era with in between PV-Manmohan Congress era are squarely responsible for all that happened in the past 71 years.

Despite all this and against all this background people still preferred again one of the two national parties in the routine manner. The combination of federal, leftist and secular forces should have been the alternative to the existing political system. But it did not happen. Should this National Extremism be allowed in Indian politics unabated? It is for all of us to think.

‘ప్రత్యామ్నాయ ప్రస్థానం’ ఫలించేనా? : వనం జ్వాలా నరసింహారావు


‘ప్రత్యామ్నాయ ప్రస్థానం’ ఫలించేనా?
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (01-06-2019)
            అలనాటి మనజాతీయ మహనీయ నాయకులు ఉహించుకున్న భారతదేశానికీ, ప్రస్తుతం మనం వుంటున్న దానికీ అగాధమంత వ్యత్యాసం వుందని పలువురు భావించడంలో పొరపాటు లేదనే అనాలి. తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లాలోని అన్నెపర్తి గ్రామానికి చెందిన పైడిమర్రి వెంకట సుబ్బారావు అనే ప్రముఖ తెలుగు భాషా రచయిత, ప్రభుత్వోద్యోగి, స్వతంత్ర-గణతంత్ర దినోత్సవాలనాడు భారతీయులు సర్వసాధారణంగా పఠించే భారత జాతీయ ప్రతిజ్ఞను రాసి, స్వరకల్పన చేశారు. 1962 లో విశాఖపట్నంలోజిల్లా ట్రెజరీ అధికారిగా పనిచేస్తున్న రోజుల్లో ఆయన దీన్ని రాసి, స్వర్గీయ తెన్నేటి విశ్వనాథం ద్వారా అప్పటి విద్యాశాఖ మంత్రి స్వర్గీయ పీవీజీ రాజుకు అందచేసారు. అచిరకాలంలోనే అది బహుళ ప్రచారంలోకి వచ్చింది.

         భారత జాతీయ ప్రతిజ్ఞ ఇలా సాగుతుంది: “భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందర్నీ గౌరవిస్తాను. ప్రతివారితోను మర్యాదగా నడచుకొంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం”.

స్వాతత్ర్య సమరంలో పాల్గొని, ప్రస్తుతం వర్తమాన కాలంలో మన మధ్యలేని ఆ సమరయోధులను గుర్తుచేసుకుంటూ, ఒక్కసారి వాళ్ల ఆశయాలు, ఆకాంక్షలు ఎంతమేరకు వాళ్ళు కోరుకున్న స్థాయిలో నేరవేరాయి, అని ప్రశ్నించుకుంటే వచ్చే జవాబు ఆశ్చర్యకరంగా వుంటుందనడంలో సందేహం లేదు. మన మధ్య సోదర-సోదరీమణి అనే భావన అసలు లేశమంతైనా వుందా? మన అపార ప్రాచీన, మహత్తర వారసత్వ సంపద పట్ల మనం గౌరవం చూపుతున్నామా? మన దేశంలో వుండాల్సిన విధంగా మనం వుంటున్నామా? మనం అసలు దేశానికి గర్వకారణమా? దేశాన్ని అభివృద్ధి మార్గంలో పయనించే విధంగా చేయడానికి జాతీయ స్థాయిలో ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ నాయకత్వం సరిపోతుందా? మనకసలు దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా ముందుకు తీసుకుపోగల జాతీయ ఎజెండా ఏమన్నా వుందా? ప్రపంచంలోని మన తోటి దేశాలతో పోటీపడగల సత్తా మనకుందా? మన పయనం ఎటు? మన మార్గం ఏమిటి? ఇవన్నీ జవాబు దొరకని అంతులేని వింత ప్రశ్నలు.

ఏమైందిటీవల జరిగిన సారవత్రిక ఎన్నికల్లో? పోటా-పోటీగా ఒకవైపు మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా సారధ్యంలోవున్న ఎన్డీయే, మరోవైపు రాహుల్ గాంధీ-సోనియా, ప్రియాంకా గాంధీల నాయకత్వంలోని కాంగ్రెస్ సారధ్యంలో వున్న యూపీఏ, ఇంకోవైపు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా ప్రాంతీయ పార్టీలు, అరా-కొరగా వున్న వామపక్ష పార్టీలు కదనరంగంలో దూకారు. జాతీయ అతివాదానికీ, లౌకికవాదానికీ, వారసత్వ రాజకీయ వాదానికీ, ప్రాంతీయ వాదానికీ మధ్య జరిగిన పోరాటం అది. కాంగ్రెస్ పార్టీ, ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు అంధ్రప్రదేశ్ రాష్ట్ర (మాజీ) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్-బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమవంతు ప్రయత్నాలు చేశారు. చివరకు జరిగిందేమిటి? యావద్భారతదేశ ఓటర్లు వారూ-వీరూ అనే భేదం లేకుండా, ప్రాంతాలకు అతీతంగా, ఇజాలకు అతీతంగా, అందరినీ కాదని మోదీకి, జాతీయ అతివాదానికి, మోదీయిజానికి అఖండమైన మెజారిటీ ఇచ్చారు.

ఉత్తర, పశ్చిమ, తూర్పు, మధ్య భారత రాష్ట్రాలలో దాదాపు అన్నిచోట్లా మోడీ (అమిత్ షా) సారధ్యంలోని బీజేపీ విజయ దుందుభి మోగించింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బీఎస్పీ, ఎస్పీ కూటమి తప్పకుండా మెజారిటీ సీట్లు సాధిస్తుందని అందరూ భావించారు. అది జరగలేదు. శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో కూడా బీజేపీది సంపూర్ణ విజయం. శాసనసభ ఎన్నికల్లో అత్తెసరు మార్కులతో బీజేపీ అధికారంలోకొచ్చిన గుజరాత్ లో సహితం బీజేపీదే విజయం. మహారాష్ట్ర, బీహార్ కూడా అంతే. ఒకానొక రోజుల్లో పాతిక సంవత్సరాలు పైగా వామపక్ష అతివాద మార్క్సిస్ట్ కంచుకోటగా వున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో, మధ్యేవాద మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీని కాదని జాతీయ అతివాద బీజేపీకి పలుస్తానాలలో గెలిపించారు వోటర్లు. ఇక మిగిలిన రాష్ట్రాలలో కూడా అదే జోరు. ఒరిస్సాను సహితం మోడీ గాలి వదలలేదు. ఇక దక్షిణాది రాష్ట్రాల విషయానికొస్తే అంత జోరు లేకపోయినా బీజేపీ గణనీయమైన విజయాలను సాధించింది అనాలి. కర్ణాటకలోనూ ఘన విజయమే. తమిళనాడు, కేరళ, అంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఒక్క సీటు రాకపోయినా, తెలంగాణలో అనూహ్యంగా నాలుగు స్థానాలు గెలిచింది బీజేపీ.


తెలంగాణలో బీజేపీ గెలుపు ఎలా అర్థం చేసుకోవాలి? శాసనసభ ఎన్నికలు జరిగి, తెరాస అఖండ విజయం సాధించి పట్టుమని నాలుగు నెలలు కాలేదింకా. ఆ ఎన్నికల్లో వందకు పైగా స్థానాలలో డిపాజిట్లు కోల్పోయిన భారతీయ జనతా పార్టీకి జంటనగరాల నడిబొడ్డున వున్న సికింద్రాబాద్ లోక్ సభ స్థానంతో పాటు ఉత్తర తెలంగాణ ఆయువుపట్లయిన కరీంనగర్, నిజామాబాద్ నియోజక వర్గాలతో సహా మహారాష్ట్ర సరిహద్దులోని గిరిజన నియోజకవర్గమైన ఆదిలాబాద్ లో విజయం లభించింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులనేది ఎవరూ కాదనరు. అంతమాత్రాన ఏ ప్రాతిపదికపైన ఓటర్లు ఫలానా పార్టీని గెలిపించడం, ఓడించడం జరుగుతుందో ఉహకందని విషయంగా మారిపోయింది. గతంలోనూ, ఇటీవలిదాకా సిట్టింగ్ ఎంపీగానూ నియోజకవర్గానికి, తెలంగాణ రాష్ట్రానికి బహువిధ సేవలందించిన కరీంనగర్ తెరాస అభ్యర్థి వినోద్ కుమార్ ఓటమిపాలు కావడానికి కారణం ఏమిటి? అదే విధంగా నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ కవిత ఓటమికి బలమైన కారణాలున్నాయా? ఆదిలాబాద్ విషయం అంతే. ఇక కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాల విషయం కూడా లోతుగా ఆలోచించాల్సిన విషయమే. మోడీ మాజిక్ అందామా అంటే, మూడు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎలా విశ్లేశించాలి? పోనీ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి అనైతిక అవగాహన వుందందామా? కాదనలేం. మల్కాజిగిరి లాంటి కొన్ని చోట్ల నోటా పుణ్యం కూడా వుంటే, భువనగిరి లాంటి కొన్ని స్థానాలలో ట్రక్ గుర్తు తెరాస ఓటమికి కారణమై వుండవచ్చు.      

శాసనసభకు లోకం సభ కంటే నాలుగు నెలల ముందు జరిగిన ఎన్నికల్లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మొదటి విడత 51 నెలల పరిపాలన ఫలాలను అందుకున్న ఓటర్లు బ్రహ్మ రథం పట్టారు. సుమారు 90 స్థానాలలో విజయం అందించారు. మరి నాలుగు నెలల్లోనే ఆయన పాలనను తప్పుపట్టాల్సిన ఆగత్యం ఓటర్లకు ఎందుకు వచ్చింది? అంటే, ఏడు స్థానాలలో ఆయన పార్టీ ఓటమికి, ఆయన చేపట్టి అమలుపరచిన అనేకానేక సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధం లేనేలేదనాలి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయనన్ని అభివృద్ధి-సంక్షేమ పథకాలు తెలంగాణాలో అమలయ్యాయే! భారతావని అంతా తెలంగాణ మోడల్ అని చెప్పుకునే స్థితికి రాష్ట్రం ఎదిగిందే! కోట్లాదిమందికి ఒకటి కంటే ఎక్కువ సంక్షేమ పథకాల ఫలితాలు లభించాయే! ఇవన్నీ వ్యర్థమేనా? ప్రజల ఆలోచనల్లోకి వారి అభివృద్ధి, సంక్షేమం కంటే ప్రభావితం చేసే వేరే అంశాలు కూడా వుంటాయా? బహుశా లోతుగా అధ్యయనం చేస్తే ఇది లౌకిక వాదానికి, జాతీయ అతివాద మతమౌఢ్య వాదానికి జరిగిన పోరాటం అనాలి. ఆ పోరాటంలో జాతీయ అతివాద మతమౌఢ్య వాదం గెలిచింది. ఇది భవిష్యత్ లో దేనికి దారితీస్తుందో ఉహించడం కష్టం ఇప్పుడప్పుడే.   
         
స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు దాటింది. ఇంకా ఇలానే వుంటే నష్టపోతాం. దేశానికి కావాలి ఉత్తేజపూరితమైన నూతన నాయకత్వం...నూతన మార్గదర్శకత్వం. ఇన్నేళ్ళ స్వాతంత్ర్యం తర్వాత కూడా కనీస అవసరాలకు నోచుకోలేని బీద-సాద-పేద వారు కోట్లల్లో వున్నారు. పేదరికం ఇంకా తాండవిస్తోంది. చాలామంది నిరుద్యోగులుగానో, చిరుద్యోగులుగానో మనుగడ సాగిస్తున్నారు. మనతో పాటే స్వాతంత్ర్యం తెచ్చుకున్న అనేక దేశాలు, ఆదిలో బీదరికంలో వున్నా, రోజులు గడుస్తున్నాకొద్దీ బ్రహ్మాండమైన వృద్ధి, అభివృద్ధి సాధించి, ఆర్థికంగా పుంజుకొని, మనకంటే గణనీయంగా పురోగతి సాధించాయి. అలాంటి ఉదాహరణలు కోకొల్లలు.

ఇతర దేశాలతో పోల్చి చూస్తే, అనేక రంగాల్లో, మనదేశం ఎలాంటి నిస్సార ప్రగతిలో వుందో తెలుసుకోవడానికి చాలా ఉదాహరణలున్నాయి. మన దేశానికి కావాల్సింది, మన అవసరాలకు అనుగుణమైన వాతావరణం....దాన్ని సరిగ్గా వాడుకునే నాయకత్వం. మన ఆర్ధిక వ్యవస్థ పరపతినీ, మన సంపదనూ, మన అంతర్గత శక్తి-సామర్థ్యాలనూ, మన అపార వనరుల సంపదనూ సక్రమంగా ఉపయోగించుకొలేమా? అలా జరక్కుండా ఎవరు నిరోదిస్తున్నారు? ఇదేమీ అత్యంత క్లిష్టమైన, అసాధ్యమైన కార్యం కాదు....కావాల్సిందల్లా మనసు పెట్టి మార్గం ఆలోచించడమే!!! గత 71 సంవత్సరాల మాదిరిగా, మూసపద్ధతిలో ఆలోచనలు చేయకుండా, వినూత్నంగా ఆలోచించి, సరైన నిర్ణయాలు తీసుకోగలిగితే భారతదేశాన్ని ప్రగతిపథంలో నడిపించడం అసాధ్యం కానేకాదు. అందరూ అంటుండే “ఉత్తమ విధానాలు” అనే మాటకు స్వస్థిపలికి, “భవిష్యత్ విధానాలు” అనే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలి. అనాదిగా అవలంభిస్తూ వచ్చిన ఆచరణలకు సుదూరంగా కదిలి, భారత దేశాన్ని పునర్నిర్మించడం, పునర్వికాసం పొందేట్లు చేయడం, తద్వారా భారత దేశాన్ని ఒక అభివృద్ధి కేంద్రంగా మలచి ముందుకు సాగడం జరగాలి. అభివృద్ధి కుంటుబడడానికి ఇంతకాలం దారితీస్తున్న ఆలోచనల బీదరికానికి తక్షణం వీడ్కోలు పలికి, ఘనమైన, ఉన్నతమైన, నూతన ఆలోచనా విధానానికి స్వాగతం పలకాలి.

ఇంతకూ ఇదంతా ఇలా జరగడానికి, ఈ దేశం ఇతర దేశాలతో పోల్చి చూస్తే వెనుక పడడానికి ఎవరు బాధ్యులు? సహజంగానే ఈ ప్రశ్న ఉత్పన్నం కాకమానదు. జవాబు కూడా దొరికి తీరాలి. గత 71 సంవత్సరాలుగా అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని నెహ్రూ-గాంధీ నాయకత్వం, జనతా-నేషనల్ ఫ్రంట్ సారధ్యంలోని మొరార్జీ-వీపీ సింగ్ నాయకత్వం, బీజేపీ-ఎన్డీయే సారధ్యంలోని వాజపాయి-మోదీ నాయకత్వం, మధ్య-మధ్యలో కాంగ్రెస్ కు చెందిన పీవీ-మన్మోహన్ నాయకత్వం, తదితరులంతా బాధ్యులే. కేంద్రంలో ఎవరు పాలన సాగించినా, అధికారంలో ఎక్కువ కాలం-దాదాపు పూర్తి కాలం వున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, లేదా, బీజేపీ ప్రభుత్వం. అయినా, మళ్లీ ప్రజలు పాత మూస పద్ధతిలోనే తీర్పిచ్చారు.

ప్రప్రధమ ప్రధానమంత్రి, నవభారత నిర్మాతగా పేరొందిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ విదానాలైన వ్యవసాయ సంస్కరణలు, పారిశ్రామికీకరణ...తద్వారా విదేశీ వస్తువుల స్థానంలో స్వదేశీ వస్తువుల ఉపయోగం, మిశ్రమ ఆర్ధిక విధానం భారతదేశ ఆర్ధిక వ్యవస్థ బలపడడానికి, అభివృద్ధికి, ఆధునీకరణ చెందడానికి ఉపయోగపడ్డాయా? లేదా? ఆలోచించాల్సిందే. ఇందిరాగాంధీ, దేశాన్ని ప్రగతిపథాన తీసుకెళ్లగలిగిందా? లేదా? అనేది కూడా అధ్యయనం చేయాలి. జాతీయం చేయబడ్డ బ్యాంకులు ఏ మేరకు సామాన్య ప్రజా బాహుళ్యానికి ఉపయోగపడ్డాయో అనేది, దేశం ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆ చర్య ఏమన్నా తోడ్పడిందా అనేది లోతుగా ఆలోచించాల్సిన అంశం. రాజీవ్ గాంధీ హయాంలో చోటుచేసుకుందని అనుకుంటున్న సాంకేతిక విప్లవం, పురోగతి, ఆయన వుండగానే స్థిరీకరణకు నోచుకోలేదు. బోఫార్స్ లాంటి కుంభకోణాలలో ఇరుక్కుని అందులోంచి బయటపడే ప్రయత్నంతోనే ఆయన కాలం అంతా గడిచింది. ఆయన హయాంలో అంతా కుంటుబడిన అభివృద్దే! ఒక విధంగా విశ్లేషిస్తే, బహుశా, దేశంలో ఏదైనా అభివృద్ధి జరిగితే, అది పీవీ కాలంలోనే అనాలి.

మన్మోహన్ సింగ్ గ్రామీణ వైద్య మిషన్, ఆధార్ ప్రయోగాలు, సమాచార హక్కు చట్టం ఒక విధంగా ప్రయోజనం చేకూరేవే అయినా, వాటి ద్వారా ప్రత్యక్షంగా దేశాభివృద్ధి జరిగే అవకాశాలు అంతగాలేవనే అనాలి. మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానిగా అయిదేళ్ళ పాటు అధికారంలో వున్న బీజేపీ నాయకుడు అటల్ బిహారీ వాజపాయి బహుశా పోఖ్రాం ప్రయోగం తప్ప దేశాన్ని ఉద్ధరించిన పనులేం చేయలేదు. సర్వ శిక్షా అభియాన్, జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్ట్ లాంటి చెప్పుకోదగ్గ  కార్యక్రమాలున్నా, ఆయన ఇండియా షైనింగ్ ప్రచారం ఒక పెద్ద విఫల ప్రయోగం అని చెప్పాలి. ఇక మోదీ సంగతి చెప్పక్కరలేదు. ఏ వర్గానికీ, ఏ రాష్ట్రానికీ, ఆ మాటకొస్తే పదికాలాల పాటు పదిమంది చెప్పుకునే ఏ అంశానికీ ఆయన ప్రాధాన్యం ఇవ్వలేదు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ మోడీకి పెద్ద ఎత్తున నష్టం చేకూర్చి పెట్టాయి. దేశ ఆర్థికాభివృద్ధికి అవెలా ఉపయోగపడతాయో ఆయనకూ తెలియదు...ఇతరులకూ తెలియదు. ఇక ఇతర ప్రధానుల రోజుల, నెలల పాలనలో చెప్పుకోదగ్గ గోప్పలేమీ లేవనాలి. ఇంత నేపధ్యంలోనూ మళ్లీ రెండు జాతీయ పార్టీలలో ఒకదానికి ప్రజలు మూసపద్ధతిలోనే పట్టం కట్టారు.  

వామపక్ష, ఫెడరల్ వాద, లౌకిక పార్టీల ఐక్యత ప్రస్తుతం దేశాన్ని శాసిస్తున్న జాతీయ అతివాద రాజకీయ వ్యవస్థకు ప్రత్యామ్నాయం అయినట్లయితే బాగుండేది. మరి అది జరగలేదే? కింకర్తవ్యం?  

ఇవిఎంల పరిణామక్రమం : వనం జ్వాలా నరసింహారావు


ఇవిఎంల పరిణామక్రమం
వనం జ్వాలా నరసింహారావు
మనతెలంగాణ దినపత్రిక (31-05-2019)
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు ముగిసి ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడానికి ముందు కొన్ని రాష్ట్రాల్లో స్ట్రాంగ్ రూంలలోని ఇవిఎంలను మారుస్తున్నట్టు కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపణలు చేశా యి. అది సాధ్యమేనా అనేది అసలు ప్రశ్న. భారత దేశంలో ఇవిఎంలను భారీ ఎత్తున రిగ్గింగ్ (మాస్ రిగ్గింగ్) చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఈ యంత్రాలు కంప్యూటర్‌కు గానీ ఇంటర్‌నెట్‌కు గానీ అనుసంధించనివి. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండవు. ఆఫ్‌లైన్‌లో ఉంటాయి. అయితే ఇవిఎంలపై ప్రతిపక్షాలు అనవసర వివాదం చేయడంపట్ల నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవిఎంగా పిలువబడే ఎలెక్ట్రానిక్ ఓటింగ్‌ యంత్రం ఎలెక్ట్రానిక్ పద్ధతిలో ఓటు వేయడానికి సహకరించే లేదా ఓటరు వేసిన ఓట్ల లెక్కింపు బాధ్యతలను తీసుకొనే ఒక యంత్రం.

ఒక ఇవిఎం రెండు యూనిట్లుగా ఒకటి కంట్రోల్ యూనిట్ రెండు ఓటు వేసే యూనిట్‌గా డిజైన్ చేయబడి ఉంటుంది. ఇవిఎంకు చెందిన కంట్రోల్ యూనిట్ ప్రిసైడింగ్ అధికారి లేదా పోలింగ్ అధికారి వద్ద ఉంటే ఓటు వేసే యూనిట్ ఓటర్లు ఓటు వేయడానికి వీలుగా ఓటింగ్ గదిలో ఉంటుంది. పోలింగ్ అధికారి ఓటరు ఐడెంటిటీని వెరిఫై చేయడానికి వీలుగా ఈ ఏర్పాటు చేస్తారు. పోలింగ్ అధికారి బ్యాలట్ పేపరు జారీ చేయడానికి బదులు ఇవిఎంలోని బ్యాలట్ బటన్‌ను నొక్కుతారు. దీనివల్ల ఓటరు ఓటు వేయడానికి వీలవుతుంది. ఓటు వేసే మెషిన్ పైన అభ్యర్థుల పేర్లు, గుర్తులు ఉంటాయి. దాని పక్కనే ఒక నీలం బటన్ కూడా ఉంటుంది. ఓటు వేయడానికి వెళ్లిన ఓటరు తాను ఓటు వేయాలనుకున్న అభ్యర్థి పేరుకు పక్కనున్న బటన్‌ను నొక్కుతాడు.

ఎలెక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను బ్రెజిల్ , భారత్ , ఫిలిప్పీన్స్ లాంటి కొన్ని దేశాలు మాత్రమే ఉపయోగిస్తున్నాయి. భూటాన్, నేపాల్, నమీబియాలాంటి దేశాలు భారత్‌లో తయారైన ఓటింగ్ యంత్రాలను ఉపయోగిస్తున్నాయి. ఇంగ్లండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, అమెరికా సహా ప్రపంచంలో చాలా దేశాలు ఇవిఎంల వినియోగాన్ని నిషేధించాయి. అలాగే బెల్జియం, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, జర్మనీ, పరాగ్వే, జపాన్‌లలో కూడా ఎలెక్ట్రానిక్ ఓటింగ్‌ను మధ్యలోనే నిలిపివేశారు. అయితే ఇవిఎం టెక్నాలజీ వినియోగం అన్ని చోట్లా ఒకే మాదిరిగా లేదు. కొన్ని దేశాలు ఎలెక్ట్రానిక్ ఓటింగ్‌ను పరీక్షించి వినియోగంలోకి తీసుకురాగా, మరి కొన్ని దేశాలు దాన్ని పరీక్షించాయి కాని ఆ తర్వాత వదిలేసుకున్నాయి. మరికొన్ని దేశాలు ఇప్పటికీ పరీక్షలు కొనసాగిస్తూ ఉండడమో, భవిష్యత్తులో మరిన్ని పరీక్షలు జరపాలని అనుకుంటూ ఉండడమో చేస్తున్నాయి. బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, పరాగ్వే, జపాన్‌లలో ఎలెక్ట్రానిక్ ఓటింగ్‌ను అమలు చేసి మధ్యలోనే వదిలేశారు. భూటాన్, బ్రిటన్, ఇటలీ, నార్వే, తజకిస్థాన్, ఆస్ట్రేలియా, నేపాల్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, గ్వాటెమాలా, కోస్టారికా, ఈక్వెడార్, రష్యా, మంగోలియా, నేపాల్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఫిన్లాండ్, సోమాలియా (సోమాలి లాండ్) స్విట్జర్లాండ్ దేశాలలో ఎలెక్ట్రానిక్ ఓటింగ్‌ను పరీక్షించారు గాని దాన్ని వినియోగంలోకి తీసుకురాలేదు.

ఎన్నికల్లో మూడు రకాల ఎలెక్ట్రానిక్ ఓటింగ్ ఆప్టికల్ స్కానింగ్ (ఒఎస్), డైరెక్ట్ రికార్డింగ్ (డిఆర్), ఓట్ ఓవర్ ఇంటర్నెట్ (విఒఐ) లను ఉపయోగిస్తున్నారు. అర్జెంటీనాలో 2004లో ఎలెక్ట్రానిక్ ఓటింగ్‌ను పరిమిత స్థాయిలో అమలు చేశారు. 2016లో అదనపు ఎన్నికల చట్టాన్ని ఆమోదించారు. 2017 లో జరిగిన జాతీయ స్థాయి ఎన్నికల కోసం అర్జెంటినా, దక్షిణ కొరియా నుంచి డిఆర్‌ఇ ఓటింగ్ యంత్రాలను కొనుగోలు చేసింది గాని భద్రతా కారణాల దృష్టా వాటిని ఉపయోగించ లేదు. 1996లో బ్రెజిల్ డిఆర్‌ఇ ఓటింగ్ యంత్రాలను పరిమిత స్థాయిలో అమలు చేసింది. 2000 సంవత్సరంలో డిఆర్‌ఇ ఓటింగ్ యంత్రాల వినియోగాన్ని దేశమంతటికీ విస్తరింపచేసింది. ఇప్పుడ జాతీయ స్థాయిలో అన్ని స్థాయిలలో ఎలెక్ట్రానిక్ ఓటింగ్ వినియోగం జరుగుతోంది.

2018లో పేపర్ బ్యాలట్లు, ఓటర్ వెరిఫబుల్ పేపర్ ట్రయల్ సిస్టమ్ (వివిప్యాట్)లను పూర్తిగా తొలగించడం జరిగింది. కెనడాలో జాతీయ స్థాయి ఎన్నికలు పూర్తిగా పేపర్ బ్యాలట్ ద్వారానే జరుగుతున్నాయి. కొన్ని మునిసిపాలిటీలు ఆప్టికల్ స్కాన్ డిఆర్‌వి ఓటింగ్ యంత్రాలను ఉపయోగిస్తుండగా పరిమిత ప్రాంతాల్లో ఇంటర్నెట్ ఓటింగ్ అందుబాటులో ఉంది. అయితే ఎలెక్ట్ట్రానిక్ ఓటింగ్ కేవలం మునిసిపల్ స్థాయిలోనే ఉపయోగించడం జరుగుతోంది. జాతీయ స్థాయిలో ఎప్పుడూ ఉపయోగించలేదు. 2005లో ఎస్టోనియా తొలిసారిగా స్థానిక స్థాయిలో ఇంటర్నెట్ ఓటింగ్‌ను అమలు చేసింది. ఆ తర్వాత 2007లో జాతీయ స్థాయికి దాన్ని విస్తరింపజేసింది. సంప్రదాయ పోలింగ్ కేంద్రాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి కాని ఏ ఎన్నికలోనైనా మొత్తం ఓట్లలో మూడింట ఒక వంతు ఓట్లు ఇంటర్నెట్ ద్వారా వేస్తారు.


విదేశాలలో నివసిస్తున్న ఎస్టోనియా పౌరులు కూడా ఇంటర్నెట్ ఓటింగ్‌ను ఉపయోగించుకోవచ్చు. పెరూ దేశం 2013లో తొలిసారిగా ఎలెక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను అమలు చేసింది. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలలోనే దేశ వ్యాప్తంగా 14 శాతం ఓటర్లకు దాన్ని విస్తరింపజేసింది. పెరూలో టచ్ స్క్రీన్ డిఆర్‌ఇ ఓటింగ్ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. వెనిజులా 1998లో ఎలెక్ట్రానిక్ ఓటింగ్‌ను అమలు చేసింది. దేశ వ్యాప్తంగా టచ్ స్క్రీన్ ఓటింగ్ యంత్రాలను ఇందుకోసం ఉపయోగిస్తుండగా వాటికి ఓటర్ వెరిఫబుల్ పేపర్ ట్రయల్ (వివిప్యాట్)లను ముద్రించే సామర్థం కూడా ఉంది. ఓటు ఫలితాలను కూడా యంత్రాలను కేంద్ర ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తరలించడానికి బదులు ఎలెక్ట్రానిక్ పద్ధతిలోనే పంపిస్తారు. అమెరికా ప్రతి రాష్ట్రంలోనూ ఆప్టికల్ స్కాన్ యంత్రాలను ఉపయోగిస్తుంది. అయితే కొన్నిసార్లు వీటిని ఆబ్సెంటీ బ్యాలట్ (పరోక్ష ఓటింగ్) కు మాత్రమే ఉపయోగిస్తారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రతి లోకల్ జోన్‌లోనూ డిఆర్‌ఇ ఓటింగ్ యంత్రాలు ఉండగా మరి కొన్ని రాష్ట్రాలు పేపర్ బ్యాలట్లు, ఓటింగ్ యంత్రాలను కలిపి ఉపయోగిస్తారు. ఇంటర్నెట్, ఇ మెయిల్ ఫ్యాక్స్ ద్వారా ఓటు వేయడం చాలా వరకు నిర్దేశిత మిలిటరీ సిబ్బందికి మాత్రమే పరిమితం.

అమెరికాలో ఇప్పటికీ పేపర్ బ్యాలట్ సిస్టమ్ ఎందుకు ఉందనే దానికి ప్రధాన కారణం భద్రతాపరమైన కారణమే. ఎలెక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతో పోలిస్తే పేపర్ బ్యాలట్‌ను ఉపయోగించడం సురక్షితమని అమెరికన్లు ఇప్పటికీ భావిస్తారు. చాలా రాష్ట్రాల్లో పేపర్ బ్యాలట్‌ను ఉపయోగించడానికి ప్రధాన కారణాలు భద్రత, ఓటర్ల ప్రాధాన్యతలే. ఎలెక్ట్రానిక్ ఓటింగ్‌కు ఖర్చు ఎక్కువ కాబట్టి దానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దశాబ్దాల పోలింగ్ విశ్లేషణల తర్వాత ఖచ్చితత్వంతో రూపొందించబడిన పేపర్ బ్యాలట్ విధానానికి బదులు ఎలెక్ట్రానిక్ ఓటింగ్‌కు రాజకీయవేత్తలు కూడా పెద్దగా ఇష్టపడడం లేదు. అమెరికా విప్లవ యుద్ధం తర్వాత చాలా సంవత్సరాల క్రితమే అమెరికాలో ముద్రించబడిన బ్యాలట్ పత్రాలు అమల్లోకి వచ్చాయి. అంతకు ముందు జనం బహిరంగంగా తమ ప్రాధాన్యతలను తెలియజేయడం ద్వారా ఓటు వేసేవారు.

అయితే 20వ శతాబ్దం దాకా కూడా అమెరికాలోని ఏడు రాష్ట్రాల్లో ప్రింటెడ్ బ్యాలట్‌లు అమల్లోకి రాలేదు. అమెరికాలో చాలా సంవత్సరాల క్రితమే ఓటింగ్ హక్కులలో మార్పులు వచ్చాయి గాని ఓటింగ్‌తో ముడిపడిన టెక్నాలజీ విషయంలో మాత్రం ఈ మార్పులు రాలేదు. అందువల్లనే 19వ శతాబ్దమంతా కూడా పేపర్ బ్యాలట్ పద్ధతే అమల్లో ఉండింది. ప్రస్తుతం అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో రహస్య బ్యాలట్ విధానం ఉండగా, కొన్ని రాష్ట్రాల మాత్రం మెయిల్ బ్యాలట్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ పద్ధతిలో బ్యాలట్ పత్రాన్ని ఓటరు ఇంటికి పంపిస్తారు. వాళ్లు తాము ఓటు వేయాలనుకున్న అభ్యర్థిపై గుర్తు వేసి పోస్టు ద్వారా పంపిస్తారు. ఓరేగాన్, వాషింగ్టన్ రాష్ట్రాల్లో అన్ని ఎన్నికలను మెయిల్ చేసే బ్యాలట్ ద్వారానే నిర్వహిస్తారు.

భారత దేశంలో ఎలెక్ట్రానిక్ ఓటింగ్ విధానం మొదటి నుంచి పురోగతిలో ఉన్న విధానంగా ఉంది. 1952లో జరిగిన స్వతంత్ర భారత దేశ తొలి సార్వత్రిక ఎన్నికలలో ప్రతి అభ్యర్థికి విడిగా ఒక బ్యాలట్ బాక్స్‌ను ఉపయోగించేవారు. పదేళ్ల తర్వాత 1962లో ఒక నియోజకవర్గంలోని అభ్యర్థులందరికీ ఒకే ఉమ్మడి పేపర్ బ్యాలట్‌ను ప్రవేశపెట్టగా ఓటర్లు తమకు ఇష్టమైన అభ్యర్థిపై గుర్తు పెట్టేవారు. భారతదేశంలో తొలిసారిగా 1982లో ఎలెక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఉపయోగించడం జరిగింది. అయితే చాలా ఏళ్ల తర్వాత గాని వాటిని విస్తృతంగా అమల్లోకి తీసుకురాలేదు. 1999లో డిఆర్‌ఇ ఓటింగ్ యంత్రాలను పాక్షికంగా అమలు చేయగా, 2002లో జాతీయ స్థాయిలో ఎలెక్ట్రానిక్ ఓటింగ్ విధానాన్ని అమలు చేయడం జరిగింది.

భారత దేశం బ్యాటరీ శక్తితో నడిచే పోర్టబుల్ పుష్ బటన్ డిఆర్‌ఇ ఓటింగ్ యంత్రాలను ఉపయోగిస్తోంది. బ్యాటరీ శక్తితో నడిచే ఓటరు వెరిఫబుల్ పేపర్ ట్రయల్ (వివిప్యాట్) హార్డ్‌వేర్‌ను కూడా ఉపయోగిస్తున్నారు. 1999 నుంచి అన్ని రాష్ట్రాల ఎన్నికలను, 2004 నుంచి పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎలెక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ప్రవేశపెట్టారు. 2013లో దేశంలో వివిప్యాట్ కూడా జత చేశారు. ప్రధానంగా ప్రతి ఓటరు ఏ అభ్యర్థికి ఓటు వేశారో చూపించడానికి వీలుగా ఒక స్లిప్‌ను ముద్రించే ప్రింటర్ ఇది. ఒకవేళ వివాదం తలెత్తితే ఓటింగ్ యంత్రం చూపించే ఫలితాలను క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. ఇటీవల ముగిసిన ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలు అన్ని వివిప్యాట్ స్లిప్‌లను లెక్కించాలని, ఇవిఎం ఓట్లతో సరిపోల్చి చూడాలని డిమాండ్ చేశాయి.

అయితే ఈ డిమాండ్‌ను ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు తోసిపుచ్చి ఎంపిక చేసిన ఐదు వివిప్యాట్‌లను మాత్రమే లెక్కించడానికి మాత్రమే అనుమతించాయి. బిజెపి, భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సి), బిఎస్‌పి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), తెలుగుదేశం పార్టీ (టిడిపి), తదితర రాజకీయ పార్టీలు ప్రధానంగా తాము ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భాల్లో మాత్రమే తమ వాదనను మార్చుకోవడం, ఇవిఎంల విశ్వసనీయతను ప్రశ్నించడం జరుగుతోంది. అయితే చాలావరకు అవి నిరాధారమైనవని రుజువైనాయి. క్రమం గా ఇవిఎంలు మొరాయించడం లాంటి అనేక సమస్యల విషయం లో సమర్థించుకోలేకపోయినప్పటికీ కాలక్రమంలో ఇవిఎంలు తారుమారు చేయడానికి వీలులేనివని నిర్ధారణ అయింది. అయితే వివిప్యాట్‌లను ప్రవేశపెట్టడం సకాలంలో తనిఖీలను నిర్వహించడం సమస్యలున్న వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం లాంటి నిరంతర మెరుగుదలల ద్వారా ఇవిఎంలలో తలెత్తే సమస్యలను భారత ఎన్నికల కమిషన్ పరిష్కరిస్తోంది.

Thursday, May 30, 2019

నాటి నుండి నేటివరకు కేంద్ర మంత్రిమండలి కూర్పు : వనం జ్వాలా నరసింహారావు


నాటి నుండి నేటివరకు కేంద్ర మంత్రిమండలి కూర్పు
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (31-05-2019)
ప్రధానమంత్రిగా మరోమారు నరేంద్ర మోడీ పదవీ ప్రమాణం చేశారు. ఆయనతో సహా మొత్తం 58 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో పాతిమంది కాబినెట్ మంత్రులుగా, మిగతావారు సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో ఆరుగురు మహిళలున్నారు. మంత్రివర్గంలో సహాయ మంత్రిగా తెలంగాణకు చెందిన సికింద్రాబాద్ ఎంపీ జి కిషన్ రెడ్డి, తెలుగు రాష్ట్రాలతో పరోక్ష సంబంధం వున్న నిర్మలా సీతారామన్ కూడా వున్నారు. కాకపోతే సంఖ్యాపరంగా చూస్తే తెలుగు రాష్ట్రాలకు అతికొద్దిమంది కంటే కొద్దిమందే-ఒకే ఒక్కరు వున్నారు. ఇది తెలుగు రాష్ట్రాలకు కొత్తేమీ కాదు. ఆదినుంచీ ఇలా జరుగుతూనే వుంది. దానికి కారణాలు అనేకం వుండవచ్చు. 14 మంది ప్రధాన మంత్రులు తెలుగు రాష్ట్రాలపట్ల ఒక విధంగా చూస్తే ఒకేరకంగా వివక్షతా ధోరణితో వ్యవహరించారనాలి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒకరు ప్రధాన మంత్రిగా పని చేసి వుండవచ్చు. తెలుగువారిలో ఇద్దరు రాష్ట్రపతి హోదాకుముగ్గురు లోక్ సభ స్పీకర్ పదవికి చేరుకుని వుండవచ్చు. అయినా ఢిల్లీ స్థాయిలో కీలక పదవుల పంపకంలో ఆది నుంచీ తెలుగు వారికి అన్యాయం జరుగుతూనే వుంది.

         కేంద్ర మంత్రివర్గం ఏర్పాటులో కాని, విస్తరణలో కాని, పునర్ వ్యవస్తీకరణలో కాని, రాజ్యాంగపరమైన నిబంధనలు, పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతులు, పటిష్ఠమైన సాంప్రదాయాలు ఎన్ని వున్నప్పటికీ, అవన్నీ రాజకీయ అనుకూలతలు-వెసులుబాటుల ముందు దిగదుడుపే. వాటి విస్తృత పరిధులకు లోబడి పాటించాల్సిందే. కేంద్రంలో ఒకనాడు అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సంఖ్యాక పార్లమెంటు సభ్యులను గెలిపించడంలోను, ఢిల్లీ స్థాయిలో పెత్తనం సాగించే కీలకమైన రాజకీయ నాయకులకు "చేదోడు-వాదోడుగా" వుండడంలోను అగ్రభాగాన వుండే అలనాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కేంద్రంలో పలుకుబడి ఉపయోగించడానికి దోహదపడే కీలక స్థాయికి ఎదగడంలో మాత్రం వెనుకబడే వుండేది. కేంద్ర స్థాయిలో పాలనలో సరైన భాగస్వామ్యం లభించకపోవడంతో, అక్కడినుంచి నిధులను పొందడంలో కూడా విఫలమవుతూనే వుండేది. అది ఒకనాటి సంగతి. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తరువాత కూడా మంత్రివర్గంలో అటు అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ, ఇటు తెలంగాణ రాష్ట్రానికి కానీ సరైన ప్రాతినిధ్యం దొరకలేదనే అనాలి. తెలంగాణకు చెందిన ఒకే ఒక్కరికి...అదీ అతికొద్దికాలం మాత్రమే....కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాసం వచ్చింది.   

స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి, ఇంతవరకూ, కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందిన సుమారు 350 మందికి పైగా వున్న కాబినెట్ స్థాయి మంత్రులలో, తెలుగు రాష్ట్రాలకు చెందినవారి సంఖ్య పట్టుమని పాతిక దాటలేదు. అంటే 6-7% మాత్రమే. అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ నుంచి 42 లోక్ సభ స్థానాలు దక్కినప్పుడైనా, ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వాములైన తెలుగు దేశం-బిజెపి పార్టీలకు అత్యధిక స్థానాలు దక్కినప్పుడైనా, ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం నామ మాత్రమే. అదే విధంగా ఇప్పటి వరకు సుమారు 500 మందికి పైగా సహాయ మంత్రుల పదవులు పొందగా, అందులో తెలుగువారి కోటా 30 కు మించలేదు....అంటే కేవలం 5-6% మాత్రమే. 71 సంవత్సరాల స్వతంత్ర భారత వర్తమాన రాజకీయ చరిత్రలో, కనీసం 50 మంది తెలుగు నాయకులు (దొరికినవారిలో కూడా అధిక శాతం అగ్ర కులాలకు చెందిన వారే!) కూడా, జాతీయ స్థాయి నాయకులుగా ఎదిగి కేంద్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించుకోలేక పోయారంటే, సగటున ఏడాదికి ఒక్కరైనా లేరంటే, ఇంతకంటే అన్యాయం ఇంకోటి లేదనే అనాలి.

కాకపోతే, ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా, వాటిని అధిగమించి, ఇదే రాష్ట్రానికి చెందిన పీవీ నరసింహారావు, ప్రప్రధమ తెలుగువాడిగా, తెలంగాణవాడిగా ప్రధాన మంత్రి పదవిని పొందగలిగారు. మొట్టమొదటి సారి, నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందని వాడిగా, అయిదేళ్ల పూర్తి కాలం అధికారంలో వుండగలిగి, దేశ దేశాల మన్ననలను పొందిన ఆర్థిక సంస్కరణలను అమలు పరచగలిగాడు ఆయన. కేంద్ర మంత్రివర్గంలో తెలుగు వారికి ఆది నుంచీ ఇలా అన్యాయం చేయడంలో, కాంగ్రెస్ సారధ్యంలోని ప్రభుత్వమైనా, బిజెపి సారధ్యంలోని ప్రభుత్వమైనా ఒకే పద్ధతిని అవలంబించాయి.

రాజ్యాంగం ప్రకారం భారత ప్రధాన మంత్రిని, ఆయన సలహా మేరకు మంత్రివర్గ సభ్యులందరినీ, నియమించే అధికారం రాష్ట్రపతి కుంది. కాకపోతే, ప్రధాన మంత్రిగా నియమితులు కాబోయే వ్యక్తికి, పార్లమెంటు దిగువ సభకు ఎన్నికైన సభ్యుల్లో మెజారిటీ సభ్యుల మద్దతు తప్పనిసరిగా వుండాలి. అలా వున్న వ్యక్తిని, వుందని రాష్ట్రపతి భావించిన వ్యక్తినే ప్రభుత్వం ఏర్పాటు చేయమని రాష్ట్రపతి కోరుతారు. ఇది మనం అనుసరిస్తున్న బ్రిటీష్ పార్లమెంటరీ సాంప్రదాయం. పాలనా సౌలభ్యం కొరకు మంత్రులకు పోర్టుఫోలియోలు ప్రధాన మంత్రి సూచన మేరకు రాష్ట్రపతి కేటాయించినప్పటికీ, మంత్రులందరూ, వ్యక్తిగతంగా, సామూహికంగా ప్రధానికి, ప్రధాని ద్వారా రాష్ట్రపతికి, పార్లమెంటుకు బాధ్యులవుతారు. దీన్నే "మంత్రివర్గ సమిష్టి బాధ్యత" అంటాం. ఇష్టానుసారంగా మంత్రివర్గం ఏర్పాటు చేసుకునే అధికారం, పోర్టుఫోలియోలను కేటాయించే అధికారం, పూర్తిగా ప్రధానిదేనని రాజ్యాంగం చెప్తున్నప్పటికీ, వాస్తవానికి, ఆ అధికారం కొన్ని హద్దులకు లోబడి వుంటుందని సాంప్రదాయాలు చెపుతున్నాయి. ప్రధాని, అధికార పార్టీ అధినేత వేర్వేరు వ్యక్తులైనప్పుడు, ఆ హద్దు స్పష్టంగా కనిపిస్తుంది. అదే విధంగా సంకీర్ణ ప్రభుత్వాలకు సారధ్యం వహించిన ప్రధాని కూడా ఇష్టానుసారంగా మంత్రివర్గం ఏర్పాటు కాని, విస్తరణ కాని, పునర్ వ్యవస్తీకరణ కాని చేయలేరు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ సర్వ స్వతంత్రుడు (కాకపోతే....మోడీని,  బీజేపీని శాసించేది, ఆదేశించేది ఆరెస్సెస్ కదా?) కాబట్టి ఆయన నిర్ణయమే అందరికీ శిరోధార్యం.


         కేంద్ర మంత్రి మండలిలో జవహర్లాల్ నెహ్రూ కాలం నుండి ఇంతవరకు, 350 మందికి పైగా కాబినెట్ మంత్రి హోదా, సుమారు 70 మంది వరకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సహాయ మంత్రుల హోదా, మరో 500 మంది దాకా సహాయ మంత్రుల హోదా, 70 మందికి డిప్యూటీ మంత్రుల హోదా లభించింది. మొదట్లో మంత్రి మండలి మూడంచెల పద్దతిలో, కాబినెట్-సహాయ-డిప్యూటీ మంత్రులతో, ఏర్పాటు చేసే ఆనవాయితీ వుండేది. అయితే రాజ్యాంగంలో ఇలాంటి నిబంధనలంటూ ఏదీ లేదు. కేవలం బ్రిటీష్ సాంప్రదాయాన్ని అనుకరించే ఇది కూడా జరిగింది. పాలనా సౌలభ్యం కొరకు కూడా ఆ ఏర్పాటు పనికొచ్చింది. వాస్తవానికి, మంత్రులందరూ మంత్రి మండలి సభ్యులే. జీత భత్యాల విషయంలోనే కొంత తేడాలున్నాయి. కాకపోతే, ప్రధాన మంత్రి సమాన స్థాయి మంత్రులందరిలో ప్రథముడుగా పేర్కొంటారు. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా వున్నప్పుడు డిప్యూటీ మంత్రుల స్థాయికి స్వస్తి పలికారు. రాజీవ్ గాంధి మళ్లీ పునరుద్ధరించినప్పటికీ, అనతి కాలంలోనే, వారందరినీ సహాయ మంత్రులుగా పదోన్నతి కలిగించారు. ఇక ఆ తర్వాత అందరూ అదే పద్ధతిని అవలంబిస్తున్నారు. కాకపోతే, సహాయ మంత్రులలో కొందరికి స్వతంత్ర ప్రతిపత్తిని కలిగించే ఆనవాయితీ మొదలైంది.

         సర్దార్ వల్లభాయి పటేల్, అంబేడ్కర్, రాజేంద్ర ప్రసాద్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, సీడి దేశ్ ముఖ్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, రాజగోపాలాచారి, బాబు జగ్జీవన్ రాం, కృష్ణ మీనన్, బహుగుణ, ఎంసీ చాగ్లా, కే ఎం మున్షి, అద్వాని, వీ వీ గిరి, వైబి చవాన్, రఫీ అహ్మద్ కిద్వాయ్, టీ టీ కృష్ణమాచారి, గోబింద్ వల్లభ్ పంత్, మోహన్ కుమార మంగళం, ఉమా శంకర్ దీక్షిత్, శంకర్ దయాళ్ శర్మ, జార్జ్ ఫెర్నాండెజ్, సుబ్రమణ్యం స్వామి, రామ్ జీత్మలాని, కరణ్ సింగ్, జస్టిస్ హెచ్ ఆర్ ఖన్నా, ఆర్ వెంకటరామన్, గ్యానీ జైల్ సింగ్, అశోక మెహతా, ప్రణబ్ ముఖర్జీ, అరుణ జైట్లీ, రాజనాథ్ సింగ్, పీయూష్ గోయెల్, నిర్మలా సీతారామన్, సురేష్ ప్రభు లాంటి ప్రముఖులు కాబినెట్ మంత్రులుగా పనిచేశారు. కేఆర్ నారాయణన్, సంతానం, షీలా దీక్షిత్, ఓం మెహతా, ఎం జీకే మీనన్, నందినీ సత్పతి లాంటి ప్రముఖులకు మంత్రి మండలిలో స్థానం లభించినా, సహాయ మంత్రులుగానే పనిచేయాల్సి వచ్చింది.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన కొత్త రఘురామయ్య, జలగం వెంగళ రావు, బెజవాడ గోపాల రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నీలం సంజీవ రెడ్డి, దామోదరం సంజీవయ్య, శివశంకర్, వెంకట స్వామి, కే చంద్ర శేఖర రావు, ఉపేంద్ర, వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, ఎర్రం నాయుడు, జైపాల్ రెడ్డిలకు కాబినెట్ హాదా లభించింది. టీ అంజయ్య, రేణుకా చౌదరి, మల్లికార్జున్, బంగారు లక్ష్మణ్, ఎస్ బీ పట్టాభి రామారావు, రంగయ్య నాయుడు, జగన్నాథరావు, కె ఎల్ రావు, విద్యాసాగర్ రావు, అంకినీడు ప్రసాద రావు, ఎస్ బీపిబికే సత్యనారాయణ రావు, కేవి రఘునాథ రెడ్డి, వెంకట సుబ్బయ్య, కృష్ణం రాజు, వేణుగోపాలాచారి, పనబాక లక్ష్మి, పళ్లంరాజు, సాయిప్రతాప్, పురంధరేశ్వరి లకు సహాయ మంత్రుల హోదా లభించింది. డిప్యూటీ మంత్రులుగా జేబీ ముత్యాల రావు, ఎం సంజీవ రావు, ఎం తిరుమల రావు, పీ వెంకట రెడ్డి లకు స్థానం లభించింది.

         అత్యధిక కాలం-సుమారు 32 సంవత్సరాల పాటు కాబినెట్ మంత్రి హోదాలో పని చేసిన ఘనత బాబూ జగ్జీవన్ రాంకు దక్కింది. అతి తక్కువ కాలం-కేవలం ఐదు రోజులు మాత్రమే కాబినెట్ మంత్రిగా వుంది జస్టిస్ హెచ్ అర్ ఖన్నా. ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నంతవరకు ప్రధానిగా పని చేసిన పీవీ నరసింహారావు, కొత్త రఘురామయ్యలు సుమారు 15 సంవత్సరాల పాటు కాబినెట్ మంత్రులుగా వున్నారు. రఘురామయ్య అదనంగా మరో ఐదేళ్లు సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. ఉప ప్రధానులుగా సర్దార్ వల్లభాయి పటేల్, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, వై బి చవాన్, జగ్జీవన్ రాం, దేవీ లాల్, అద్వానీలు పని చేశారు. వీరిలో మొరార్జీ, చరణ్ సింగ్ ప్రధానులు కాగలిగారు. మంత్రిగా పనిచేసిన అనుభవం ఏ మాత్రం లేని రాజీవ్ గాంధి, చంద్ర శేఖర్ నేరుగా ప్రధాన మంత్రి స్థాయికి ఎదిగారు.

         ఆగస్ట్ 15, 1947 న స్వతంత్రం వచ్చిన తర్వాత, ఇప్పటి వరకు 14 మంది ప్రధాన మంత్రి పీఠాన్ని అధిష్టించారు. ప్రప్రధమ ప్రధాన మంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ అత్యధిక కాలం-సుమారు 16 సంవత్సరాల 9 నెలలకు పైగా పదవిలో వుండి, 63 పర్యాయాలు మంత్రి మండలి విస్తరణలు-భారీ మార్పులు చేశారు. ఆయన కూతురు ఇందిరా గాంధి కూడా దాదాపు కొంచెం తక్కువగా, రెండు విడతలుగా, సుమారు 16 సంవత్సరాల కాలం ప్రధానిగా పనిచేసి, 67 సార్లు విస్తరణలు-భారీ మార్పులు చేపట్టారు. ఇక ఆ కుటుంబ వారసుడు, ఇందిరా గాంధి అనంతరం ప్రధాని బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధి, కేవలం ఐదేళ్ల కాలంలోనే, 36 సార్లు మంత్రి మండలిలో మార్పులు చేయాల్సి వచ్చింది. అటల్ బీహారీ వాజ్ పాయ్ ఆరేళ్ల పాటు ప్రధానిగా వుండి, 27 పర్యాయాలు విస్తరణలు-భారీ మార్పులు చేశారు. ప్రధాన మంత్రులుగా పని చేసిన మొరార్జీ దేశాయ్ 2 సంవత్సరాల 4 నెలల కాలంలో, లాల్ బహదూర్ శాస్త్రి ఏడాదిన్నర కాలంలో చెరి పది సార్లు; చరణ్ సింగ్ ఆరు నెలల్లో ఆరు సార్లు; దేవె గౌడ పది నెలల పదవీ కాలంలో నాలుగు పర్యాయాలు; గుజ్రాల్ పది నెలల్లో రెండు సార్లు; వీపి సింగ్ 11 నెలల్లో, చంద్రశేఖర్ ఏడు నెలల్లో ఒకే ఒక్క సారి మంత్రి మండలిలో మార్పులు-చేర్పులు చేశారు. పీ వీ నరసింహారావు ఐదేళ్ల కాలం ప్రధానిగా వున్నప్పటికీ, కేవలం తొమ్మిది పర్యాయాలు మాత్రమే విస్తరణ చేపట్టారు. వీరందరితో పాటు, గుల్జారీలాల్ నందా రెండు సార్లు తాత్కాలిక ప్రధానిగా పనిచేశారు. మోడీ తన మొదటి  టర్మ్ ఐదేళ్ళలో రెండు-మూడు పర్యాయాలే విస్తరణ చేపట్టారు.

నరేంద్ర మోడీ టర్మ్ లో, మొదటి కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు కూడా అనుకున్నట్లే అటు ఆంధ్ర ప్రదేశ్ నుంచి కాని, ఇటు తెలంగాణా నుంచి కాని ఎవరినీ మంత్రివర్గంలోకి తీసుకోలేదు. తీసుకోకపోతే వేరే విషయం. తెలంగాణా రాష్ట్రం నుంచి అంతవరకూ ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక్క మంత్రిని కూడా పక్కన పెట్టారుదత్తాత్రేయను తొలగించడంతో తెలంగాణా నుంచి ఎవరూ లేకుండా పోవడం మాత్రం జరిగింది. కాకపోతే ఒకే ఒక్క తృప్తి....తెలంగాణాతో, హైదరాబాద్ తో ఎంతో కొంత అనుబంధం వున్న నిర్మలా సీతారామన్ ను రక్షణ మంత్రిగా కాబినెట్ హోదాలో అప్పట్లో నియమించడం.

మంత్రి మండలి ఏర్పాటు చేసినప్పుడల్లా, మార్పులు చేసినప్పుడల్లా, విస్తరణ చేపట్టినప్పుడల్లా, అది జరిగిన వెంటనే, ప్రధాని మంత్రి సన్నిహిత వర్గాల నుంచి మీడియాకు ఒక సందేశం రావడం ఆనవాయితీ. అతి త్వరలో, మంత్రివర్గ విస్తరణ వుండబోతున్నదని, కొత్త వారికి అవకాశం కలిగిస్తామని, దాని సారాంశం. ఆశావహుల ఆశలు అలా సజీవంగా వుంచడం అనాదిగా జరుగుతున్నదే! అలా ఆద్యతన భవిష్యత్ లో జరిగితే, తెలుగు రాష్ట్రాలకు మరింత న్యాయం జరుగుతుందని ఆశించడం తప్ప చేసేదేమీ లేదు! END

Saturday, May 25, 2019

Evolution of EVMs : Vanam Jwala Narasimha Rao


Evolution of EVMs
Vanam Jwala Narasimha Rao

Millennium Post (27-05-2019)
Evolution of Electronic Voting Machines
Vanam Jwala Narasimha Rao
Hans India (26-05-2019)

Ahead of the counting of votes in India in the recently concluded general elections in which BJP was victorious, allegations were levelled by some political parties that EVMs were being changed in the strong rooms in few states. The big question is whether this would be possible? Mass rigging of India's EVMs is very difficult as these machines are offline that makes them standalone units. Narendra Modi however expressed his concern over the opposition making needless controversy over EVMs.

Electronic Voting Machine popularly known as EVM is voting using electronic means to either aid or take care of the responsibilities of casting and counting votes. An EVM is designed with two units: the control unit and the balloting unit. These units are joined together by a cable. The control unit of the EVM is kept with the presiding officer or the polling officer. The balloting unit is kept within the voting compartment for electors to cast their votes. This is done to ensure that the polling officer verifies voter’s identity. With the EVM, instead of issuing a ballot paper, the polling officer will press the Ballot Button which enables the voter to cast their vote. A list of candidates’ names and or symbols will be available on the machine with a blue button next to it. The voter can press the button next to the candidate’s name they wish to vote for.

Electronic Voting Machines are used only in few countries including Brazil, India and the Philippines. Countries like Bhutan, Nepal and Namibia also use Electronic Voting Machines made in India. Many countries of the world, including England, France, Germany, Netherlands and the United States have banned the use of EVMs. Electronic Voting has been discontinued in Belgium, France, Netherlands, Germany, Paraguay, Japan.

Adoption of EVM technology has been somewhat disorganized. A few countries have tested Electronic Voting and adopted it, others have tried it out and abandoned it, and some continue to test it or have plans for further testing in the future. Only a small handful of countries use Electronic Voting Technology on an ongoing basis, and even fewer use it nationwide as the sole voting method.

In countries like Bhutan, United Kingdom, Italy, Norway, Kazakhstan, Australia, Nepal, Philippines, Australia, Guatemala, Costa Rica, Ecuador, Russia, Mongolia, Nepal, Bangladesh, Indonesia, Finland, Somalia (Somaliland), Switzerland electronic voting has been tested but not put into use.

There are three types of Electronic Voting in elections namely, Optical Scanning (OS), Direct Recording (DR) and Vote Over Internet (VOI).


Electronic voting was implemented in Argentina on a limited basis in 2004. Additional election reform legislation was passed in 2016. Argentina purchased DRE voting machines from South Korea for its 2017 national election, but they were not used due to security concerns. Brazil implemented DRE voting machines on a limited basis in 1996. The use of DRE voting machines was expanded throughout the country in 2000, and electronic voting is used at all levels nationwide. Paper ballots and voter-verifiable paper trail systems were eliminated entirely in 2018.


Federal elections in Canada are all carried out via paper ballots. Some municipalities use optical scan and DRE voting machines, and internet voting has been made available in a limited number of areas. Electronic voting is only used at the municipal level, never at the Federal level. Estonia first implemented internet voting at the local level in 2005. Internet voting was expanded to the national level in 2007. Traditional polling places are still available, but about one third of all votes in any given election are cast via the internet. Estonian citizens living abroad are also able to use internet voting.

Peru implemented Electronic Voting Machines for the first time in 2013, and it was expanded to cover about 14 percent of voters nationwide in the next few years. Touchscreen DRE voting machines are used in Peru. Venezuela implemented Electronic Voting in 1998. Touchscreen DRE Voting Machines are used throughout the country, and they include the ability to print a voter-verifiable paper trail. Vote results are also transmitted electronically, rather than physically transporting the machines to a central location.

The United States uses Optical Scan Machines in every state, although they are sometimes only used for absentee ballots. Some states have DRE voting machines in every local zone, and other states use a mixture of paper ballots and DRE voting machines. Voting over the internet, email, and fax is mostly limited to specific military personnel.

The reasons as to why is the paper ballot system still prevalent in the USA are mainly Security. Americans feel safer in using paper ballots as compared to Electronic Voting Machines. The primary reasons paper ballots are used in most states are security and voter preference. E-voting is not highly preferred because of the cost it comes with. Politicians would not get for e-voting over the dearly-known paper ballot ritual, which is said to have been accurately modelled from decades of polling and analysis.

Printed ballots came into fashion in the USA long after the American Revolutionary War, before which people cast their votes by calling out their preferences in public. Printed ballots did not come into some seven states of America until the 20th century. Over the years, voting rights evolved in the US but so was not quite the case with the technology involved in voting. Hence, through the 1900s, forms of the paper ballot remained in fashion. Presently, though secret ballot is most prevalent across the US, some states use mail ballots. In this case, the ballot is sent to the voter's home, they mark their choice and mail it via post. Oregon and Washington conduct all elections by mailed ballots.

The electoral system in India has been a work in progress from the beginning. During independent India’s first general elections in 1952, separate ballot boxes were used for every candidate. A decade later, in 1962, India introduced the common paper ballot for all candidates in a constituency and voters marked their preference.

Electronic Voting Machines were first used in India in 1982, but they were not adopted into widespread use until much later. Partial adoption of DRE voting machines occurred in 1999 and electronic voting was adopted nationwide in 2002. India uses portable push-button DRE voting machines that run on battery power. They also use battery-powered voter-verifiable paper trail hardware. Electronic voting machines were introduced in all state elections since 1998 and since 2004 in the parliamentary elections. In 2013, India added the Voter Verifiable Paper Audit Trail (VVPAT), which is essentially a printer attached to the electronic voting machines that allows each voter to print out a piece of paper that shows which candidate he or she voted for. It can be used to crosscheck the results shown by the machine if there is a dispute. In the recent past during the recently concluded elections there were demands from opposition to count all VVPAT slips and compare with EVM votes. This was however turned down both by Election Commission and Supreme Court and instead allowed to count randomly five VVPATs.  

Different political parties in India including BJP, INC, BSP, AAP, TDP and others have been changing their stances and question credibility of EVMs mainly during period of their defeat in elections which proved to be baseless by and large. Gradually It establishes the temper-proof nature of EVMs although it doesn't defend EVMs against many issues of malfunctioning etc which is well taken care of by ECI through continuous improvements like introduction of VVPAT, timely checks and replacements etc.