Thursday, May 2, 2019

1968-1969 తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం : వనం జ్వాలా నరసింహారావు


1968-1969 తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (03-05-2019)
అవి నేను నా డిగ్రీ చదువు పూర్తి చేసి మా గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ, మధ్య-మధ్యన హైదరాబాద్ వెళ్లివస్తుందే రోజులు. తోలి విడత ప్రత్యేక తెలంగాణ  అరాష్ట్రం ఉద్యమం ఊపందుకుంటున్న రోజులు. తెలంగాణ వాదులుగా ఒకవైపు, కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులుగా మరోవైపు వున్న మాలాంటి వాళ్లు కొందరు చివరకు తెలంగాణ వైపే మోగ్గుచూపిన రోజులు. ఉద్యమం ఆసాంతం ఆసక్తిగా గమనించడంతో పాటు ఉద్యమస్ఫూర్తికి చేతనైనంత తోడ్పాటు అందించిన రోజులు. ఆ రోజులు ఇప్పటికీ అలా...అలా..ఒక్కొక్కటే గుర్తుకొస్తున్నాయి. 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని కేవలం "భావించడంమాత్రమే కాకుండాదాన్ని సాధించడం కొరకురకరకాల మార్గాలను ఎంచుకోవడం ఆరంభమయింది 1956 నుంచేరాయలసీమకోస్తాంధ్రతెలంగాణ ప్రాంతాలు మూడూఆంధ్ర ప్రదేశ్ లో కలిసున్నప్పటికీకొన్ని ప్రత్యేకమైన రాయితీలను తెలంగాణ ప్రాంతం వారికి మాత్రమే చట్ట రీత్యా కలిగించడం ద్వారాతెలంగాణ వే()ర్పాటు నినాదాన్నిపాలక పక్షం విజయవంతంగా పక్కదారి పట్టించగలిగింది మొదట్లోపెద్దమనుషుల ఒప్పందమనీఫజలాలీ సంఘం నివేదికనీముల్కీ నిబంధనలనీ రకరకాల మార్గాలద్వారా తెలంగాణ కోరుకునే వారిలో కొన్ని ఆశలు రేకెత్తించికొన్నేళ్లు ఉద్యమాన్ని బలహీనపరచగలిగింది (కాంగ్రెస్ప్రభుత్వంతెలంగాణ ప్రాంతానికి వలసవచ్చిన కొందరు తెలంగాణే తరులు , ఎప్పుడైతే తమ "పరోక్ష దోపిడీవిధానాన్ని "ప్రత్యక్ష దోపిడీవిధానంగా మార్చడం మొదలయిందోఅప్పుడే దోపిడీకి గురవుతున్న తెలంగాణ ప్రజలలో "దోపిడీ” కి ఎదురుతిరగాలన్న కాంక్ష బలీయం కావడం మొదలయిందిక్రమేపీ ఉద్యమరూపంగా మార్పుచెంద సాగిందా కాంక్ష

బంగారు భవిష్యత్ పై కొండంత ఆశలు పెట్టుకున్న తెలంగాణ ప్రాంత విద్యార్థులకుతమ ఆశలు అడియాశలవుతాయేమోనన్న భయం పట్టుకుందిఆ భయంలోంచే ఉద్యమం రూపుదిద్దుకోవడం మొదలయిందిఆ ఉద్యమ బీజమేఐదు దశాబ్దాల క్రితం (మాఖమ్మం జిల్లాల్లో, ఖమ్మంకొత్తగూడెం పట్టణాలలోఆరంభమైన "ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన విద్యార్థి ఉద్యమం". ఆ బీజమే "ఇంతై-ఇంతింతై-వటుడింతైఅన్న చందాన ఒక వట వృక్షమైందిబలమైన గాలి వీచినప్పుడు కొమ్మలు విరిగినాతిరిగిబలం పుంజుకొనిఉద్యమాన్ని సజీవంగా వుంచి తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా దూసుకుపోయిందానాటి ఉద్యమంచివరకు మలివిడత ఉద్యమం పుణ్యమా అని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు దారితీసింది.

 1968 లో తెలంగాణ ప్రజా పోరాటానికి "రక్షణల ఉద్యమంపేరుతో ఖమ్మం జిల్లా పాల్వంచ థర్మల్ విద్యుచ్ఛక్తి కేంద్రంలో అంకురార్పణ జరిగిందికొత్తగూడెం సింగరేణి సంస్థలో పనిచేస్తుండే ఒక చిరుద్యోగి సర్వీసుకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశంలో అతడు తెలంగాణ వాడు కావడంవల్ల జరిగిన తీరని అన్యాయంవల్లఆయన సహోద్యోగులందరూ కలిసి తమ న్యాయమైన హక్కులకొరకు పోరాటం సాగించారుఆ పోరాటమే చిలికి చిలికి గాలివానగా మారిజిల్లా అంతటా పాకిఖమ్మం పట్టణం చేరుకుందిఖమ్మం స్థానిక కళాశాలలో చదువుకుంటున్న "రవీంద్రనాథ్" (మా జూనియర్అనే విద్యార్థి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలంటూ "గాంధి చౌక్లోని గాంధి విగ్రహం దగ్గర ఆమరణ నిరాహార దీక్షకు దిగాడునాకు తెలిసినంతవరకు అతడే మొట్టమొదటి సారిగా తెలంగాణకొరకు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొన్నవ్యక్తిఆ నేపధ్యంలో నాకు గుర్తున్నంతవరకుహక్కుల రక్షణ సమితి పక్షాన ఒక ప్రతినిధి వర్గం నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ కాసు బ్రహ్మానంద రెడ్డిని కలుసుకుని విజ్ఞాపన పత్రం సమర్పించారువారి విజ్ఞాపనకు ముఖ్యమంత్రి స్పందించిన తీరు సరైందిగా లేదని భావించిన ప్రతినిధి వర్గంలోని ప్రముఖులు తెలంగాణ విడిపోవడమే సమస్యకు పరిష్కారంగా భావించారు.

కొత్తగూడెం-ఖమ్మంలో ఉద్యమం మొదలవడానికి సుమారు ఆరు నెలల క్రితంఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలోని "హాస్టల్లోనాటి విద్యార్థి నాయకుడు శ్రీధర్ రెడ్డి (నా కంటే ఏడాది సీనియర్రూమ్ లోమాజీ లోక్ సభ సభ్యుడు అప్పట్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి, స్వర్గీయ మల్లికార్జున్ తో సహా పలువురు విద్యార్థి నాయకులు సమావేశమయ్యారు. "విద్యార్థి కార్యాచరణ కమిటీపేరుతో ఒక సంస్థను నెలకొల్పి ప్రత్యేక తెలంగాణ కొరకు ఉద్యమించాలని తీర్మానించారువాస్తవానికి శ్రీధర్ రెడ్డిభవిష్యత్ లో రూపు దిద్దుకోనున్నబ్రహ్మాండమైన వేర్పాటు ఉద్యమానికి తొలి రాష్ట్ర స్థాయి నాయకుడనాలి.

ఆయన నాయకత్వంలోని విద్యార్థులందరూ స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డిని కలిసిఉద్యమానికి నాయకత్వం వహించమని కోరారువందేమాతరం రామచంద్ర రావు వేసిన ఎన్నికల పిటీషన్ లోఉన్నత న్యాయస్థానం తీర్పు చెన్నారెడ్డికి వ్యతిరేకంగా వచ్చిన నేపధ్యంలోఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడైనందునతన రాజకీయ పునరావాసానికి ప్రయత్నం చేస్తున్న రోజులవిచెన్నారెడ్డి ఉద్యమానికి నాయకత్వం చేపట్టడానికి ముందేఉద్యమం వూపందుకోవడం, మధ్యలో ఖమ్మంలో విద్యార్థి వుద్యమం మొదలవడంఒకటి వెంట ఒకటి జరిగాయిచెన్నారెడ్డి నాయకత్వం వహించడానికి పూర్వమే జరిగిన ఉద్యమంలో శ్రీధర్ రెడ్డిబద్రి విశాల పిట్టిమల్లికార్జున్ఆమోస్ లాంటి ప్రముఖులు అరెస్ట్ కావడం, జైలుకెళ్లడం జరిగిందిఆ ఉద్యమం సాగుతున్న రోజుల్లోనే మాజీమంత్రి స్వర్గీయ మదన్ మోహన్ నాయకత్వంలో "తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ " పేరుతో మరో సంస్థ ఆవిర్భవించిందిచివరకు అన్నీ కలిసి ఉమ్మడిగా ఉద్యమించాయిఏకమైన సంస్థలన్నీ కలిసి మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో "తెలంగాణ ప్రజా సమితిపేరుతో బ్రహ్మాండమైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని నడిపాయి.


1968 (నవంబర్-డిసెంబర్ నెలల్లో అనుకుంటాలో జరిగిన "రక్షణల అమలుఉద్యమానికి ప్రత్యక్షంగానోపరోక్షంగానో సహాయం చేసినవారిలో అలనాటి తెలంగాణ ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు జెచొక్కారావురాష్ట్ర పంచాయితీ మండలి అధ్యక్షుడు జలగం వెంగళరావునూకల రామచంద్రారెడ్డిజిసంజీవరెడ్డి వున్నారువారి అనుయాయులు కొందరు అలనాటి ఉద్యమంలో పాల్గొన్నారు కూడాక్రమేపీ టిఅంజయ్యఎంఎంహాషింజివిసుధాకర్ రావుబిరాజారాం, కెఆర్ఆమోస్ట్సదా లక్ష్మిఎస్బిగిరి లాంటి వారు కూడా ప్రజా సమితి సమావేశాలలో చురుగ్గా పాల్గొనడం మొదలెట్టారుకొన్నాళ్లకు కొండా లక్ష్మణ్ బాపూజి తన మంత్రి పదవికి రాజీనామా చేశారుఈ నేపధ్యంలో ఉద్యమం క్రమేపీ మిలిటెంటుగా మార సాగిందిహింసాత్మకంగా మారిన ఉద్యమంలో మూడొందల మంది పైగా యువకులువిద్యార్థులు ప్రాణాలను కోల్పోయారుకోదాడనందిగామలలో జరిగిన కొన్ని దుర్ఘటనలు నల్గొండవరంగల్ విద్యార్థులను రెచ్చగొట్టాయి.మొత్తం మీద అరాచకాలు ప్రబలిపోసాగాయి.

పునాదులు కదిలిన ప్రభుత్వం పోలీసుకు సహాయపడేందుకుసైన్యాన్ని పిలిపించిందిసైనికులు పోలీసుల సహకారంతో పాశవికంగా ప్రవర్తించారని నాటి పత్రికలు పేర్కొన్నాయిఎందరో విద్యార్థులనుఅమాయకులను జైళ్లలో నిర్బంధించారువేలాదిమంది తెలంగాణ ప్రజా సమితి నాయకులువిద్యార్థి నాయకులు జైళ్లలో బంధించబడిన దరిమిలారెచ్చిపోయిన ప్రజలు ఉద్యమాన్ని ఉదృతం చేశారుపరిస్థితిని అదుపులో తేవడానికి వ్యూహాత్మకంగా నాటి ప్రధాని ఇందిరా గాంధి, కొందరు తెలంగాణ ప్రముఖులతో ఢిల్లీలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారుఆహ్వానించబడినవారిలో తెలంగాణ వాదులు డాక్టర్ చెన్నారెడ్డి (అప్పటికింకా ప్రజా సమితి నాయకత్వం స్వీకరించలేదు), కొండా లక్ష్మణ్ బాపూజిరామచంద్రారెడ్డిచొక్కారావులతో పాటు ముఖ్యమంత్రికి మద్దతు ఇచ్చే పలువురున్నారుప్రతిపక్షాల నాయకులను కూడా ఆహ్వానించారుఅసలు సిసలైన పలువురు తెలంగాణ ప్రజా సమితి నాయకులను పిలవలేదుమదన్ మోహన్ జైల్లో వున్నారప్పుడు. మరోవైపు తెలంగాణ ప్రాంతమంతా సత్యాగ్రహ శిబిరాలు వెలిశాయిసామూహిక నిరాహార దీక్షలు మొదలయ్యాయిఢిల్లీ సమావేశంలో ఏ అంగీకారం కుదరలేదు. ప్రధాని ఏకపక్షంగా ఒక అష్ట సూత్ర కార్యక్రమాన్ని ప్రకటించడందాన్ని  డాక్టర్ చెన్నారెడ్డిరామచంద్రారెడ్డిచొక్కా రావులు సంయుక్తంగా వ్యతిరేకించడం జరిగింది

విబిరాజు చొరవతోఉద్యమంతో సంబంధం వున్న నాయకులతో ప్రధాని చర్చలు జరపడానికి రంగం సిద్ధమైందిమదన్ మోహన్వెంకట్రామరెడ్డిఎస్బి.గిరిమల్లిఖార్జున్శ్రీధర్ రెడ్డిపుల్లారెడ్డి ప్రభృతులకు ఆహ్వానాలు అందాయిఅణచివేత విధానాన్నిహింసా కాండను కొనసాగిస్తున్న ప్రభుత్వంతో చర్చలు జరిపి ప్రయోజనం లేదని భావించిన నాయకులు ఆహ్వానాన్ని తిరస్కరించారుఈ దశలో డాక్టర్ చెన్నారెడ్డి రంగప్రవేశం చేశారుతెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించారుఅదే సందర్భంలో విద్యార్థి నాయకుడు శ్రీధర్ రెడ్డి పోటీ ప్రజా సమితిని స్థాపించి తన వ్యతిరేకతను వ్యక్త పరిచాడుచెన్నారెడ్డి అధ్యక్ష పదవిని చేపట్టగానేప్రజా సమితి రాజకీయంగా బలాన్ని పుంజుకుందికొన్ని వనరులు కూడా చేకూర సాగాయిఉద్యమం కూడా తీవ్రమైందిసాయుధ పోలీసుల రక్షణ లేకుండా ముఖ్యమంత్రి బయటకు రాలేని పరిస్థితి నెలకొందికొంతకాలానికి ఎన్జీవోల సంఘం నాయకుడు ఆమోస్‍ను ఉద్యోగం నుండి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందిసత్యాగ్రహాలు చేసి కొన్ని వందల-వేల మంది అరెస్ట్ అయ్యారులాఠీ చార్జీలు నిత్యకృత్యమయ్యాయిపరిస్థితి రోజురోజుకు దిగజారిపోసాగింది.రాజధాని హైదరాబాద్‌లో కర్ఫ్యూ విధించబడిందిఢిల్లీలో వున్న ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు చొక్కా రావును వెంట పెట్టుకుని ప్రధాని ఇందిరాగాంధిహుటాహుటిన ఒకనాడు హైదరాబాద్ వచ్చిందినగరంలో రాత్రికి రాత్రే పర్యటించి తెల్లవారు ఝామున ఢిల్లీ వెళ్లి పోయారు.  

కొద్ది దినాల తరువాతఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిందిదాంతో పాటే మరో విడత చర్చలకు చెన్నారెడ్డికొండా లక్ష్మణ్ ప్రభృతులను ప్రభుత్వం ఆహ్వానించిందిచర్చలవలన ఏ ఫలితం చేకూరలేదుఉద్యమం నిలుపు చేయాలని మొరార్జీ దేశాయ్వైబి.చవాన్ ప్రభుత్వ పక్షాన కోరడంఅది అసంభవమని చెన్నారెడ్డికొండా లక్ష్మణ్ లు స్పష్టం చేయడం జరిగిందిహైదరాబాద్ తిరిగి వచ్చిన నాయకులకు ఘన స్వాగతం లభించిందిఇదిలా వుండగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జివెంకట స్వామిపై హత్యా ప్రయత్నం జరిగిందిఆ హత్యా ప్రయత్నాన్ని నిరసిస్తూ ఆ మర్నాడు తెలంగాణ అంతటా సంపూర్ణ హర్తాళ్ జరిగింది.  డాక్టర్ జి. ఎస్. మెల్కోటేసంగం లక్ష్మీబాయి తమ రాజీనామా లేఖలను ప్రజా సమితి అధ్యక్షుడికి అందచేశారు. అదే రోజు రాత్రి నారాయణ గుడాలోని స్నేహితుడు డాక్టర్ సుదర్శన రెడ్డి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న డాక్టర్ చెన్నారెడ్డిని ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద అరెస్టు చేసి, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించసాగారు పోలీసులు. చెన్నారెడ్డితో పాటేఏడెనిమిది మంది శాసన సభ సభ్యులనుసుమారు పాతిక మంది ఇతర ప్రముఖులను కూడా అరెస్ట్ చేసింది ప్రభుత్వం. మరుసటి రోజునుంచి వందల సంఖ్యలో విద్యార్థి నాయకులను ప్రజా సమితి కార్యకర్తలను అరెస్ట్ చేసింది ప్రభుత్వం. పోలీసులు చెన్నారెడ్డిని తీసుకెళ్తున్న కారును సూర్యాపేటలో ఆందోళనకారులు అడ్డగించారు కొద్ది సేపు. చెన్నారెడ్డి స్థానంలో మదన్ మోహన్ ప్రజా సమితి అధ్యక్షుడయ్యాడు. ఆయనను కూడా అరెస్ట్ చేసిన తరువాత సదా లక్ష్మి ఆ బాధ్యతలు నిర్వహించారు.

ఇది జరిగిన కొన్నాళ్లకుఉద్యమం ఇంకా ఉదృతంగా కొనసాగుతున్న నేపధ్యంలోనేబి. వి. గురుమూర్తి మంత్రి పదవికి రాజీనామా చేశారు. మరి కొందరి మంత్రుల రాజీనామాను ఆపు చేసేందుకు ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి వ్యూహాత్మకంగా తన రాజీనామాను అధిష్టానానికి సమర్పించారు. ఆ రాజీనామాను తమ విజయంగా భావించిన లక్షలాది మంది తెలంగాణ వాదులు రోడ్ల పైకొచ్చి పండుగ చేసుకున్నారు. ఊరేగింపులుసభలుసమావేశాలు జరుపుకున్నారు. పరిస్థితి పోలీసుల అదుపు తప్పే స్థాయికి చేరుకుంది మరో మారు. ముఖ్యమంత్రి తరహాలోనే కొందరు తెలంగాణ మంత్రులు కూడా రాజీనామా చేశారు. రాజీనామా అయితే చేశాడు కానిపదవిలో కొనసాగడానికి కాసు చేయని ప్రయత్నం లేదు. అధిష్టానం దూతలుగా హైదరాబాద్ వచ్చిఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ పేరుతో కాసుకు మద్దతు కూడగట్టారు కామరాజ్ నాడార్నిజలింగప్పలు. బ్రహ్మానంద రెడ్డి కొనసాగాడు. ఆయన మంత్రివర్గంలో జె. వి. నరసింగ రావుకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. సమస్యకు పరిష్కారం మాత్రం దొరకలేదు.

ఆ తరువాత జరిగిన శాసన సభ సమావేశాలలోగవర్నర్ ఖండూభాయ్ దేశాయ్ ప్రసంగంఅర్థాంతరంగా ముగిసింది. జై తెలంగాణ నినాదాలతో సభ మార్మోగింది. సమావేశాలు జరుగుతుండగాకొందరు విద్యార్థులు అసెంబ్లీ ఆవరణలో ప్రవేశించిమంత్రులపై కోడి గుడ్లుటొమాటోలు విసిరారు. మరో సంఘటనలో ఒక యువకుడు పోలీసు కంట్రోల్ రూమ్‌పైన బాంబు విసిరాడు. అక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్న నాయకుల విడుదలకు న్యాయ పరమైన చర్యలు తీసుకున్నారు. చివరకు డిటెన్యూలందరినీ విడుదల చేయాలని హైకోర్టు తీర్పిచ్చింది. దరిమిలా ఉద్యమ ఉదృతి అనేక కారణాల వల్ల తగ్గింది.

1971 సాధారణ ఎన్నికల్లో "టీ పీ ఎస్పేరుతో రాజకీయ పార్టీగా బరిలోకి దిగిన తెలంగాణ ప్రజా సమితితెలంగాణలోని అన్ని స్థానాలకు పోటీచేసి, 11స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించిందిప్రజాభిప్రాయం తెలంగాణ ఏర్పాటేనని స్పష్టంగా ఓటర్లు తెలియచేశారుఅప్పుడే నైతికంగా తెలంగాణ ఏర్పాటు జరిగిపోయుండాల్సిందికాని జరగలేదునాయకత్వం మరో మారు ఉద్యమానికి వెన్ను పోటు పొడిచిందినాటి ఇందిరా గాంధి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చెన్నారెడ్డి తన ప్రజా సమితిని విలీనం చేశారుతెలంగాణ ఏర్పడడానికి బదులు మరికొన్ని రాయితీలను ఉపశమనంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వంఉవ్వెత్తున లేచిన ఉద్యమం మోసంతో అణచబడింది

ఈ నేపధ్యంలో మలివిడత ఉద్యమ సారధి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 14 సంవత్సరాల పాటు సుదీర్ఘ శాంతియుత పోరాటం సలిపి, దేశంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీల మద్దతు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా సంపాదించి, చివరకు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి, జూన్ 2, 2014 న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయించారు. 

1 comment:

  1. ఖమ్మం పట్టణంలో నిరాహార దీక్షకు దిగడం ద్వారా
    1969 తెలంగాణా ఉద్యమానికి ఊపిరి పోసిన విద్యార్థి నాయకుడు అన్నాబత్తుల రవీంద్రనాథ్ గారు తెలంగాణ ఆవిర్భావం చూడకుండానే స్వర్గస్తులు కావడం బాధాకరం.

    ReplyDelete